17, జూన్ 2011, శుక్రవారం

ఆషాడం

అమ్మకు ఫోన్ చేసి ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ" ఆషాడం వస్తుందిగా మరి, ఆ అమ్మాయిని పుట్టింటికి తీసుకు వచ్చేసారా అమ్మా" అన్నాను......"ఈ రోజుల్లో ఇంకా ఆషాడం ,కార్తీకం ఏమిటే నీ మొహం పెళ్ళయిన మూడోరోజే సెలవు లేదని అబ్బాయి ఢిల్లీ కి అమ్మాయి బెంగుళూరికి వెళ్ళిపోయారు" అంది.....అసలు ఈ ఆషాడం ఎందుకు పెడతారో తెలియదుకాని ... ఆషాడం అంటే ఎన్నెన్ని సరదాలు, ఎన్నెన్ని విరహాలు ,ఇంకెన్ని సాహసాలు మొత్తం వెరసి బోలెడు జ్ఞాపకాలు .... అవన్నీ ఈ బిజీ రోజుల్లో చాలామంది మిస్ అయిపోతున్నారే పాపం అనిపించింది...అసలు నా జాజిపూలలో ఎప్పుడో రాసుకోవలసిన పేజీ ఇది ....అమ్మ గుర్తుచేసేవరకూ అలా ఎలా మర్చిపోయానో... నేను వెలుగు వెనుకకు వెళుతున్నాను మీరు జాగ్రత్తగా రండి..:)


పెళ్ళయిన నాలుగు నెలలకు మాకూ ఆషాడం నెల వచ్చేసింది ....అప్పటివరకు తనని విడిచీ ఎక్కడికీ వెళ్ళలేదు.. డిగ్రీ ఎక్జాంస్ కని పది రోజులు మా ఇంట్లో ఉన్నాను కాని అందులో వారం రోజులు తను కూడా మా ఇంట్లో ఉండటం వల్ల అంత ఏమీ తెలియలేదు ..కానీ ఈసారి ఆషాడం ...ముప్పై రోజులు.... దాదాపు నెల ...అమ్మో అని దిగులోచ్చేసింది ...నేను లేకపోతే పాపం తను ఎలా తింటారో ?ఎలా ఉంటారో? అని ఒకటే బెంగ (అక్కడికేదో నేనే చిన్నప్పటినుండి పెంచి పోషించినట్లు అబ్బో తెగ ఫీల్ అయిపోయేదాన్ని) ఇంతకీ ఇదంతా నా సైడే... మా ఆయనగారు మాత్రం ఎంచక్కా అసలేం పట్టనట్లు ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరుగుతున్నారు.. ... నాకు గొప్ప ఆశ్చర్యం వేసేసింది..... లెక్కప్రకారం ....ముప్పై రోజులు నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను.... నువ్వు నా ఊపిరి ..నువ్వే నా జీవతం..నిన్ను విడిచి నిమషం అయినా నేను ఉండలేను బుజ్జీ ఉండలేను ...అక్కడ నీ ఆరోగ్యం జాగ్రత్త ...సరిగ్గా తినకపోతే నా మీద ఒట్టే .... ఇలాంటి మాటలు చెప్పాలికదా... అబ్బే... అసలేం తెలియనట్లు ... ఇది పెద్ద విషయం కానట్లు చాలా మామూలుగా ఉన్నారు .. (ఇప్పటికర్ధం అయ్యిందా నా బాధేంటో)


సరే మొత్తానికి నాన్న నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు ...రైల్వేస్టేషన్ లో నిన్చున్నాం ... ఉహు ..మా ఆయనమాత్రం ఎప్పటిలాగే జోక్స్ ,కబుర్లు నాన్నతో... వొళ్ళు మండిపోతుంది గాని ట్రైన్ వచ్చే టైం అవుతుంది అని నేనే ముందు మొదలుపెట్టేసాను అప్పగింతలు ...." ఏమండీ ,మరీ ...అన్నం వేళకు తినండి "అంటూ .... "అబ్బా అదంతా నేను చూసుకుంటానులేవే ..నువ్వు హేపీగా మీ వాళ్ళతో ఎంజాయ్ చేసిరా "అన్నారు... ఇహ ఆలసించినా ఆశాభంగం అనుకుని "మరి మీకేమి అనిపించడం లేదా నేను వెళుతుంటే "అన్నాను... "అనిపిస్తుంది ..ఎంచక్కా మేడ ఎక్కి నా పెళ్ళాం ఊరెళ్ళి పోయిందోచ్ "అని అరవాలని ఉంది అన్నారు నవ్వుతూ ...నాకు తిక్కరేగిపోయింది అయినా తమాయించుకుని ' నిజంగానా' ఒక కనుబొమ్మ పైకి ఎత్తి మరీ అన్నాను ...." నిజంగానే ..లేకపోతే ఒక్కటే నస అత్తాకోడళ్ళు ఇద్దరు.. అమ్మాయి ఎదురు చూస్తుంది ఎప్పుడు ఇంటికోస్తావు అని ఆవిడా.. స్నానం ఎప్పుడు చేస్తారు ? టిఫిన్ చల్లారిపోతే బాగోదు ఇప్పుడే తినండి ...బ్రెష్ చేయకుండా టీలు కాఫీలేంటి చండాలంగా ... ఈ రోజు ఎందుకు లేటుగా వచ్చారు ...అని నువ్వు ... ఇలాంటి సుత్తి గోల ఉండదు హాయిగా నాకు నచ్చిన టైముకి రావచ్చు , నచ్చినపుడు తినొచ్చు అసలు ఈ ఆషాడం పెట్టేదే పెళ్ళయిన తరువాత కోల్పోయిన స్వేచ్చను మళ్ళీ రుచి చూపించడానికి" అన్నారు... పదండి నాన్నా విసురుగా అనేసి ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాను ....


దారంతా ఏడుపోచ్చేస్తుంది కానీ నాన్న ఎదురుగా బయటపడితే మరీ చండాలంగా ఉంటుంది అని కళ్ళు మూసుకుని పడుకున్నాను ....అసలు నేతి బీరకాయలో నేయి ఎంతో మా ఆయనగారి దగ్గర బావుకత్వం అంత ... ఇంటికి వెళ్ళగానే మా గ్యాంగ్ అందరినీ చూడగానే ఓ నాలుగు రోజులు అసలు నాకు టైమే తెలియలేదు ....పైగా అదే సమయంలో నాఫ్రెండ్స్ చాలా మంది ఆషాడం పేరుతో మా ఊరు వచ్చేయడం వల్ల ఒకటే కబుర్లు ....వారం రోజులకు మా ఆయన నుండి ఫోన్ ..." అక్కడికి వెళ్ళగానే నన్ను మర్చిపోయావా ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు "అన్నారు కోపంగా.... దెబ్బకి మనకో భయంకరమైన సత్యం తెలిసిపోయింది.....


అమ్మాయిలూ దగ్గరకు రండి మీకు మాత్రమే చెప్తాను( ఈ మగవాళ్ళు ఉన్నారే ..వీళ్ళను పట్టించుకోనంత సేపు మన చుట్టూ బొంగరం తిరిగినట్లు తిరుగుతారు ....అబ్బో మనం నవ్వినా ,దగ్గినా ,తుమ్మినా భావుకత్వం భారీ లెవల్లో ఉప్పొంగిపోతుంది వాళ్లకు ..... ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు.... ఒక్క సారి తలవొంచుకుని తాళి కట్టించుకున్నామా అంతే సంగతులు ...మళ్లీ మన మొహం చూడరు.... ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ చుట్టూ తిరుగుతాం కదా అదీ లోకువ... కొన్నాళ్ళకు విసుగొచ్చి ఎహే పో అని వదిలేస్తాం చూడండి అప్పుడు మళ్ళీ నువ్వు అసలు నన్నుపట్టిన్చుకోవడంలేదు అని ఏడుపుమొహం పెడతారు.. అదీ సంగతి)


సరే గ్రహాలూ మనకు అనుకూలంగా ఉండటం వల్ల మనం చెలరేగిపోయాం .... "ఆహా..మీరు మేడలూ, గోడలు ఎక్కడంలో బిజీగా ఉన్నారుకదా డిస్టర్బ్ చేయడం ఎందుకనీ "అన్నాను తాపీగా...." ఏడ్చావులే గాని బట్టలు సర్దుకో మనం హనీమూన్ కి వెళ్ళలేదుగా అందుకే ఎల్లుండి వైజాగ్ వెళుతున్నాం" అన్నారు సంబరంగా .... "ఆషాడంలో హనీ మూన్ ??అదీ వైజాగ్ కి "...అన్నాను వ్యంగ్యంగా .... "అబ్బా అది కాదు బుజ్జీ మా ఇన్స్టిట్యూట్ ఉందికదా ,దాని తరుపున ఏవో మొక్కులున్నాయి అట ...మా ఫ్రెండ్ ,వాళ్ళ భార్యా వైజాగ్ ,అన్నవరం వెళుతున్నారు .. అందుకే నీకు కూడా టిక్కెట్ బుక్ చేసేసా" అన్నారు...."అయ్యా మహాశయా ... ఇలా ఫ్రెండ్స్ తోని పక్కింటి వాళ్లతోని గుళ్ళు, గోపురాలు చూడటానికి వెళితే దాన్ని హనీమూన్ అనరు... తీర్ధ యాత్రలు అంటారు "అన్నాను కోపంగా .... "అబ్బా ఏదో ఒకటిలే... ఈ సమయంలో హనీమూన్ అంటే మీ నాన్నా అదిరి అల్లాడిపోయి ,ఏంటీ అల్లుడూ !!!ఆషాడంలో అమ్మాయిని పంపాలా అని జజ్జనకజ్జనక డాన్స్ వేస్తారు... ఇలా గుళ్ళు గోపురాలు అంటేనే సేఫ్ ... ఎల్లుండి రెడీగా ఉండు "అన్నారు .... "ఏంటి ఉండేది , ఆషాడం లో మీరు మా ఇంటికి, నేను మీ ఇంటికి రాకూడదు తెలుసా ఆ విషయం ... పైగా ఆ ట్రైన్ మా ఊరినుండి వెళ్ళదు ఎలా కుదురుతుంది .." అన్నాను ..." అందుకే ఇంకో ప్లాన్ ఉంది ...నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ...అక్కడ ఈ ట్రైన్ ఆగుతుంది" అన్నారు .... "ఆహా ....ఇలా పిచ్చి ప్లాన్లు గట్రా వేసి మీరు సేఫ్ గా ఉండండి, నేను మా నాన్న దగ్గర పిచ్చి తిట్లన్నీ తింటాను... ఏం అక్కరలేదు ....మీరు ఎంచక్కా మీ మేడ ఎక్కి అరుచుకోండి నేనురాను "అన్నాను విసురుగా..."బుజ్జీ బుజ్జీ బుజ్జీ ......ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఇది నీకు నేను పెడుతున్న ప్రేమ పరీక్ష అనుకో ... మీ నాన్నను ఒప్పించి ఎల్లుండి అమ్మమ్మ ఇంటిదగ్గరకు వస్తే నువ్వు పాస్ అయినట్లు "అన్నారు... "అయితే నేను ఫెయిల్ అయ్యా అనుకోండి ఏం పర్లేదు" అని ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాను ఎలా నాన్నకు ఈ విషయం చెప్పాలా అని...


ఆ రాత్రి భోజనాల దగ్గర మెల్లగా విషయం కదిపాను.."నాన్నా మరీ ఆయన ఫోన్ చేసారు నాన్నా , ఏవో ఇంపార్టెంట్ మొక్కులున్నాయట అన్నవరం వైజాగ్ వెళుతున్నారట" అన్నాను ..." ఓ ...మంచిదే కదమ్మా మొక్కులు తీర్చుకుంటే... వెళ్లి రానీ" అన్నారు ..." అది కాదునాన్న వ్రతానికి ప్రక్కన నేను ఉండాలిగా.. నాకూ కూడా టిక్కెట్ తీసేసారట" అన్నాను మెల్లిగా ..."ఏంటీ !! నిన్నా!! ఈ ఆషాడంలోనా !! నలుగురూ ఏమనుకుంటారు వొద్దొద్దు కావాలంటే వచ్చే నెల వెళ్ళండి ..అయినా ఆషాడంలో అబ్బాయి మన ఇంటికి రాకూడదు "అన్నారు ..." అబ్బే ఆయన రారు నాన్నా ..అమ్మమ్మ ఇంటికి వెళ్ళమన్నారు ..ట్రైన్ అక్కడ ఎక్కమన్నారు "అన్నాను నన్ను ఇలాంటి పరిస్థితిలో పడేసినందుకు మా ఆయన్ని కచ్చగా తిట్టుకుంటూ ....


అప్పటి వరకూ సైలెంట్ గా మా ఇద్దరినీ చూస్తున్న అమ్మ ఒక్కసారిగా కయ్ మంది.."ఏంటీ!!!! మా అమ్మ ఇంటికా !!!నేను ఒప్పుకోను...మా నాన్నకు తెలిసిందంటే ఇంకేమన్నా ఉందా ,అసలు మా పెళ్ళిళ్ళు అయ్యేవరకూ మా నాన్నకు ముగ్గురు కూతుళ్ళు అన్న విషయం ఎవరికీ తెలియదు ..అంత గుట్టుగా పెంచారాయన... మీరిద్దరూ ఆషాడం లో ఇలా తిరుగుతున్నారంటే నాకు చీవాట్లు పడిపోతాయి తల్లీ ....పైగా మీ అత్తలు చాలు ఊరువాడా మోసేస్తారు ఈ విషయాన్ని.... అసలే వాళ్ళది పల్లెటూరు "అంది ..... "అందుకే ఈ సారి మీ ఆయన్ని వెళ్లి వచ్చేయమను ..తర్వాత వెళ్ళుదురుగాని "అనేసి ఆ టాపిక్ మార్చేసారు ఇద్దరూ ..

ఓరి భగవంతుడా ఇదేంగోలరా బాబు అని తలపట్టుకున్నాను ....సరిగ్గా ఆపధ్భాందవి లా మా అక్క ఫోన్ చేసింది .... హమ్మయ్యా అని అక్కకు చెప్పేసాను ఎలాగైనా గట్టేక్కిన్చవే అని.."ఏంటీ వెళ్ళద్దు అన్నారా? మరీ వీళ్ళ చాదస్తం ఎక్కువ అయిపోతుంది..మొగుడూ పెళ్లాలేగా మీ ఇద్దరూ ... నాన్నకు ఇవ్వు ఫోన్" అంది ..హమ్మయ్యా అని నాన్నను పిలిచి నేను నిశ్చింతగా పడుకున్నాను.. పాపం మా అక్క దాదాపు ముప్పావుగంట బుర్ర తినేసి ఒప్పించేసింది .... మొత్తానికి మరుసటి రోజు బట్టలు సర్దుకుని మా నాన్న హమారా బజాజ్ స్కూటర్ ఎక్కి 'జాం జాం ' అంటూ మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను ...కాని అక్కడే మొదలవుతుంది అసలు కధ అని అప్పటికి తెలియదు
(తర్వాత రాస్తానేం )

48 కామెంట్‌లు:

హరే కృష్ణ చెప్పారు...

1st comment?

అజ్ఞాత చెప్పారు...

ఆషాడంలో భార్య భర్తలను కలవొద్దు అనడానికి ఒక కారణం ఉంది, అదేంటో తెలుసా మీకు..?

ఆషాడంలో వాతావరణం లో జరిగే మార్పుల వాళ్ళ మన శరీరాలు కొంచం అనారోగ్యానికి గురవుతాయి.., ఇలాంటి సందర్భం లో భార్య భర్తలు ఎంజాయ్ చేస్తే, బలహీనంగా ఉన్న జన్యు కారణాల వాళ్ళ పుట్టబోయే బిడ్డ అనారోగ్యం గా పుడతారు అని మన పూర్వికుల నమ్మకం. ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళు నమ్మకం సరైనదే కదా...?

(grk)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఈ రోజు ఉదయం నుండీ ఎందుకో కొంచెం తలనొప్పిగా.. చిరాగ్గా ఉంది నేస్తం.. ఇందాకే ఒక బజ్ లో హాయిగా కాసేపు నవ్వేసుకున్నాను. ఇప్పుడు మీ పోస్ట్ చదివాక మొత్తం ఎగిరి పోయింది :-) ఎలాంటి విషయాన్నైనా సరదాగా ప్రజంట్ చేయడంలో మీకు మీరే సాటి :-)

Arun Kumar చెప్పారు...

eagerly waiting for part 2

నేస్తం చెప్పారు...

అజ్ఞాత గారు మరి మొదటి బిడ్డకేనా? రెండో బిడ్డకు ఈ జన్యులోపాలు రావా?(మొదటి ఆషాడమే కదా చేస్తారు ):)
కాకపోతే ఒకటిలేండి పెద్దవాళ్ళేం చేసినా మనమంచికే అని గాఢం గా నమ్ముతాను నేను... :)అందుకే ఈ విషయం వదిలేద్దాం

జ్యోతి చెప్పారు...

ఈ మగవాళ్ళు ఉన్నారే ..వాళ్లను పట్టించుకుని, ఆలోచించి అన్నీ అమరిస్తే మనను లెక్క చేయరు,..కాని ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు.... ఇది మాత్రం కరెస్ట్ .. ఎప్పటికి పనిచేసే సూత్రం.. అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి..:))

మధురవాణి చెప్పారు...

ఆషాడమా.. అంటే ఏంటి? :P
పైన మీరు అమ్మాయిలకి మాత్రమె చెప్పింది.. వందకి వెయ్యి శాతం నిజం.. అదొక్క పాయింటు గుర్తుంచుకుంటే చాలు ఏ అమ్మాయైనా.. ;) నేస్తం గురువుకీ జై జై జై! :)

అది సరే గానీ, ఇప్పుడు మేము గోళ్ళు కొరుక్కుంటూ కూర్చోవాలనేగా మీ కుట్ర! :P

ఇందు చెప్పారు...

1ఆహా!! మీరు,జ్యోతిగారు పొద్దున్నే నా చిన్నిబుర్రలో ఙ్గ్నానజ్యోతులు వెలిగించారు...మీకు బోలెడు థాంకులు!!

మీరు మాత్రం కేక నేస్తం! భలె రాస్తారు!

వెయిటింగ్ ఫర్ సెకెండ్ పార్ట్! :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

>> ఈ మగవాళ్ళు ఉన్నారే ..వాళ్లను పట్టించుకుని, ఆలోచించి అన్నీ అమరిస్తే మనను లెక్క చేయరు,..కాని ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు.... <<
అదేంటో నేస్తం ఈ మధ్య మీరు చెప్పే సూక్తులన్నీ vice-versa అనిపిస్తున్నాయ్ నాకైతే... ఏం ఈ సూత్రం అమ్మాయిలకు మాత్రం వర్తించదేంటి :-) అంటే అబ్బాయిలకి కొంచెం ఎక్కువ వర్తిస్తుంది అంటారా :-)

పద్మవల్లి చెప్పారు...

<>
నేస్తం, నిజంగానే ఎన్ని సత్యాలు చెప్పేరు.
ఇప్పుడు నాకూ ఒక అక్క ఉంటే బావుండని అనిపిస్తోంది :-(

Sasidhar Anne చెప్పారు...

Akka.. second part kosam eagerly waiting waiting...

meeru cheppina nijalu bane vunnayi kani.. adavallaki kooda avi varthisthayi annamata..:)

మాలా కుమార్ చెప్పారు...

ఏమిటి ఇంకా ఉపోద్ఘాతమే ? మిగితాది ఎప్పుడు ?
అమ్మాయిలకు చెప్పిన సూత్రము సూపర్ :)

శశి కళ చెప్పారు...

bale suspence lopettesaare?

కృష్ణప్రియ చెప్పారు...

నేను వెలుగు వెనుకకు వెళుతున్నాను మీరు జాగ్రత్తగా రండి..:)
********************* ::) భలే చెప్పారు..

నాకు ఈ ఆశాడం కాన్సెప్ట్ పుస్తకాల ద్వారా సినిమాల ద్వారా తప్ప ఐడియా లేదు. మీరు నిజంగా మంచి నారేటర్. తెలిసిన వారెవరో పక్కన కూర్చుని చెప్తున్నట్టు ఉంటుంది మీ స్టైల్. I love reading your blog!

రాజ్ కుమార్ చెప్పారు...

ఓహో... మళ్ళీ మరో అద్భుతమయిన సిరీస్ మొదలయ్యిందీ.. అత్యధ్బుతమయిన సెకండ్ పార్ట్ కోసం వెయిటీంగ్ అక్కా...
వేణూగారన్నట్టూ.. మీరు రాసిన పోస్ట్లు చదువుతూ ఉంటే.. 3D కళ్ళద్దాలు వాడకుండా 4D లో సినిమా చూస్తున్నట్టూ, 5.1 లో ఆడియో వింటున్నట్టూ, చదివాక రెక్కల్లేకుండా ర్యాకెట్ స్పీడ్ తో గాల్లో పోతున్నట్టూ ఉంటాది. (పోలికలు కొత్తగా ఉన్నాయ్ కదూ..ఏం చెయ్యమంటారూ? నాకు అలాగే అనిపిస్తుంది మరి.)


>>>,అసలు మా పెళ్ళిళ్ళు అయ్యేవరకూ మా నాన్నకు ముగ్గురు కూతుళ్ళు అన్న విషయం ఎవరికీ తెలియదు .>>

ఆహా.. సీరియస్ గా కామెడీ చేస్తారుగా.. భళ్ళున నవ్వేసా ఈ లైన్ చదివి.

సూపర్ పోస్ట్ అక్కా. తొందరగా రెండవ భాగమ్ రాసెయ్యండీ

రాజ్ కుమార్ చెప్పారు...

పోటో పెట్టలేదేమండీ ఈ పోస్ట్ కీ?? ;) ;)

జేబి - JB చెప్పారు...

మీరు వెలుగు వెనక్కి తీసుకెళ్ళి చెబుతున్న కబుర్లు చదివి ఆనందిస్తూండగా, ఇలా "తర్వాత రాస్తానే" అని మధ్యలోనే ఆపేస్తారా! దారుణమండీ!

కమల్ చెప్పారు...

ఒక్క సారి తలవొంచుకుని తాళి కట్టించుకున్నామా అంతే సంగతులు ...మళ్లీ మన మొహం చూడరు.... ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ చుట్టూ తిరుగుతాం కదా అదీ లోకువ..."

ఈ ఒక్క పేరాగ్రాఫ్ ఎక్కడో తేడాగా వున్నట్లుందండి.. అసలు ఏమిటంటే " పెళ్ళిలో ఒక్క సారి మాత్రం తల వంచి తాళి కట్టించుకుంటారట స్త్రీలు తర్వాత జీవితాంతం మగాడు తలవంచుకొని బ్రతికేలా చేస్తారట ఆడవారు "....... :-)

tnsatish చెప్పారు...

In case of conception in Ashada Masam, the kid would be born in March/April, which is the hottest period. For the first child, the mother would go under tremendous suffering, and it is advisable not to have the child during the hottest period.

From the second child onwards, the suffering would be relatively less when compared to the first child. In olden days, people get kids within 1-1.5 years after marriage. That's why, this rule is generally followed only for the first year.

prabandhchowdary.pudota చెప్పారు...

రెండవ పార్ట్ త్వరగా రాసేయ్యండెం....

రత్న మాల చెప్పారు...

హాయ్ బాగా రాసారు. మిగతాది ఎప్పుడు రాస్తారండి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>>>కాని ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు

అబ్బాయిలూ మేలుకోండి. బోనులో పడకండి.

>>>అసలు మా పెళ్ళిళ్ళు అయ్యేవరకూ మా నాన్నకు ముగ్గురు కూతుళ్ళు అన్న విషయం ఎవరికీ తెలియదు ..అంత గుట్టుగా పెంచారాయన.

ఇంకా నవ్వుతూనే ఉన్నాను.
నైస్ పోస్ట్.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

ఆషాఢం మీద మంచి టపానే వ్రాశారు.ఈ రోజుల్లో వ్యవసాయం చేసే అబ్బాయిలు తక్కువే కాబట్టి ఆషాఢంలో ఆలుమగలు కలసి ఉన్నా నష్టమేమీ లేదు.

priya చెప్పారు...

bavunnai mee kashtaalu...andari vishayamlo adaallu exam pedite,ikkada meeke pareeksha...mottaniki pass ayyara..meeru sooper idae vesi vuntaru...2nd part tondaraga raayandi pl

శ్రీలలిత చెప్పారు...

ఆషాఢమాసంలో మేఘాలన్నీ భార్యాభర్తలమధ్యన సందేశాలు అందించడానికి బిజీగా వుంటాయికదండీ నేస్తం..అందుకే గుంపులు గుంపులుగా అలా తిరుగుతూనేవుంటాయి... భలే గుర్తుచేసారు...
(పైకి చెప్పుకోలేనివీ, రాతల్లో పెట్టుకోలేనివీ భార్యాభర్తలు అలా ఆకాశంవైపు చూస్తూ ఆ మేఘాలతో వారి ఊసులు చెప్పుకుంటారని నా ఉద్దేశ్యం..)

హరే కృష్ణ చెప్పారు...

భావుకత్వం... నేతి బీరకాయ.. టూ మచ్ :)
అయినా మొదటి సగం చూసి సినిమా ఎలా ఉందో ఒక డెసిషన్ కి రావడం జాజి పూల అభిమానుల చరిత్ర లో లేదు
ఇంటర్వల్ బ్రేక్ మాత్రం కరెక్ట్ టైం కి ఆపేశారు :)
eagerly waiting for the next part
వచ్చే వారం రాసేయాలని కోరుకుంటున్నాం :)

హరే కృష్ణ చెప్పారు...

మొదటి కామెంట్ నాదేనోచ్ :)))))))))))))))

తృష్ణ చెప్పారు...

మీకు పెళ్ళైన నాలుగు నెలలకు వచ్చిందా? మాకు ఒక నెలకే వచ్చేసింది. కానీ మిగిలినవన్ని మీరు రాసినట్లే...:) మేమూ వెళ్ళాం ఆషాఢంలో ఒక ఊరు....అప్పుడేమైందంటే...అదో పేధ్ధ కథ...!!

నేస్తం చెప్పారు...

>>>> అదేంటో నేస్తం ఈ మధ్య మీరు చెప్పే సూక్తులన్నీ విచె-వెర్స అనిపిస్తున్నాయ్ నాకైతే... ఏం ఈ సూత్రం అమ్మాయిలకు మాత్రం వర్తించదేంటి :-) అంటే అబ్బాయిలకి కొంచెం ఎక్కువ వర్తిస్తుంది అంటారా :-)

కొంచెం ఎక్కువ కాదు పూర్తిగా వర్తిస్తుంది వేణు ...ఇలా సగం సగం డవుట్స్ ఏ మాత్రం పెట్టుకోకండి ..నన్ను అడగండి క్లియర్ చేస్తాను :)

అరుణ్ కుమార్ గారు :)


>>>>>వాళ్లను పట్టించుకుని, ఆలోచించి అన్నీ అమరిస్తే మనను లెక్క చేయరు,..
జ్యోతిగారు కదా..కరెస్ట్ చెప్పారు ....మా ఇంట్లో అంతే ఇండియావెళుతున్నాను అంటే నెలరోజులు సరిపడే బట్టలు ఐరన్లు చేసి,సాక్సుల జతలు వేటికి వాటికి విడిగా తీసిపెట్టి కర్చీఫులతో సహా సెంట్ కొట్టి అన్నీ కళ్ళముందు పెడితే నెలరోజులు మాట్లాడరు ..ఆ తరువాత నుండి నాకు కాల్స్ మొదలవుతాయి :)

నేస్తం చెప్పారు...

>>>>ఆషాడమా.. అంటే ఏంటి? :P

:-)))) ఇది రాసినపుడు నువ్వు గుర్తొచ్చావ్ మధు :)

indu ...మరంతే కదా ఇందూ నేర్చుకున్న అపారమైన జ్ఞానాన్ని అందరికీ పంచకపోతే ఎలా ?

పద్మవల్లిగారు కదా :) మనకి అక్క ఉన్నా బాగుంటుంది చెల్లికి అక్కమయినా బాగుంటుంది.... మా అక్కేమో నన్ను చిన్నపిల్లలా చూస్తుంది చెల్లెళ్ళేల్లేమో నన్ను మా అక్క అని పెద్దరికం ఇచ్హ్చి ఏ పని అయినా పరుగులు పెట్టి చేసేస్తారు :P

శశి ఆడవాళ్ళకు కూడా వర్తించడం కాదు ...ఇందులో అమ్మాయిలకు అసలు ఎటువంటి పాపం అంటదు ...:)

మాలగారు ఉపొద్ఘాతమే ఊరంత రాసానంటే అసలు కధ అడవంత గజిబిజిగా ఉంటుంది అందుకే బద్దకించేసాను :)

నేస్తం చెప్పారు...

శశి వర్ల్డ్ గారు :)

క్రిష్ణప్రియగారు ధాంక్యూ .. అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడే ఈ ముచ్చటలు తీరుతాయండి...ఉధ్యోగరిత్యా వేరే ఊర్లో ఉంటే మిస్ అయిపోతాం :)

రాజ్ కామెంట్ వెరైటీగా రాయడం నీకే చెల్లుతుంది..ఊ ఫొటో పెట్టలేదు కదా అసలే నా దగ్గర కెమరా సౌలభ్యం కూడా ఉంది ..అలా ఎలా మర్చిపోయానబ్బా :)

జెబీ గారు ఈ పోస్ట్ ఎప్పుడో రాసుకున్నాను అలా వదిలేసాను .... మిగిలిన పార్ట్ రాస్తాను త్వరలో

నేస్తం చెప్పారు...

>>>>ఈ ఒక్క పేరాగ్రాఫ్ ఎక్కడో తేడాగా వున్నట్లుందండి.. అసలు ఏమిటంటే " పెళ్ళిలో ఒక్క సారి మాత్రం తల వంచి తాళి కట్టించుకుంటారట స్త్రీలు తర్వాత జీవితాంతం మగాడు తలవంచుకొని బ్రతికేలా చేస్తారట ఆడవారు "....... :-)

కమల్ గారు ఎవరు చెప్పారండి అలాంటి మాటలు ..తప్పు అలా ఏదిపడితే అది నమ్మేయకూడదు..మిమ్మల్ని అమాయకులను చేసి ఎవో మాయమాటలు చెప్పేస్తున్నారు..ఇలాంటి విషయాల్లో డవుట్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను :)

సతీష్ గారు అయ్యిండొచ్చు..Thank you :)

ప్రభంధ్ గారు అలాగే అండి:)

నేస్తం చెప్పారు...

రత్న మాల గారు త్వరలో రాస్తాను :)

బులుసుగారు ధన్యవాధాలు :)

లోకేష్ గారు :)

ప్రియ కదా..అదే మరి నాకే అలా జరుగుతూ ఉంటుంది :)

నేస్తం చెప్పారు...

>>>>>ఆషాఢమాసంలో మేఘాలన్నీ భార్యాభర్తలమధ్యన సందేశాలు అందించడానికి బిజీగా వుంటాయికదండీ నేస్తం..అందుకే గుంపులు గుంపులుగా అలా తిరుగుతూనేవుంటాయి... భలే గుర్తుచేసారు...
(పైకి చెప్పుకోలేనివీ, రాతల్లో పెట్టుకోలేనివీ భార్యాభర్తలు అలా ఆకాశంవైపు చూస్తూ ఆ మేఘాలతో
శ్రీలలిత గారు మీకామెంట్ నాకు భలే నచ్చేసింది

హరే :) హా నీదే మొదటి కామెంట్ ..కరెక్ట్ టైంకి ఆపేసానా :)

తృష్ణ గారు అవునా ...ఏమా కధ ఏంటా కమానిషు ..కమాన్ చెప్పండి :)

మనసు పలికే చెప్పారు...

అక్కా.. ఎందుకక్కా ఇలా టెన్షన్ పెత్టి వదిలేసారు మధ్యలో.. :( పూర్తి టపా పెట్టే వరకూ నేను కామెంటు రాయనంతే.. రాయను గాక రాయను..;)

మనసు పలికే చెప్పారు...

టపా మాత్రం సూపర్ అక్కయ్యా.. ఇలా పొగిడె పొగిడీ మామూలు అయిపోయింది:( కొత్తగా ఏదైనా కనిపెట్టి వస్తా పొగడాడానికి:)
(అక్కయ్యా..ష్‌ష్.. ఎవ్వరికీ చెప్పను కానీ, నా చెవిలో చెప్పెయ్యండి, ఇంతకీ వెళ్లారా వెళ్లలేదా మొక్కు తీర్చుకోడానికి;))

అజ్ఞాత చెప్పారు...

Its okay, not as good as your other posts, I missed your regular humor and your style of story telling in this post.(like your satires on your innocence are lil. below your regular mark)


Taara

గిరీష్ చెప్పారు...

అయ్యబాబోయ్ ఆ మేడెక్కటం ఏంటి.. ఆషాడం ఏంటి..మొక్కేంటి..ప్రేమ పరీక్షేంటి..సూపరండి.. :)

శ్రీధర్. దు చెప్పారు...

కొచ్చెన్: ఆషాడంలో చీరల దుకాణాల వాళ్ళు తగ్గింపు ధరలని చెప్తారు ఎందుకని?
ఆన్చర్: ఆషాడంలో భర్త పర్సు దొరకదని కాబోలు

kiran చెప్పారు...

>>>>నేతి బీరకాయలో నేయి ఎంతో మా ఆయనగారి దగ్గర బావుకత్వం అంత
>>>ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు
పైన దవిలోగులున్నాయి చూసారు...soooparu ..:)

total ga keka...:))

నేస్తం చెప్పారు...

అప్పూ ఇలారా ....నీ చెవి దగ్గర పెట్టు (@!$%^*^%$$@@)అలా అయ్యింది అన్నమాట తర్వాత.. ఎవ్వరికీ చెప్పకేం :)
తార గారు .. :) ఎమో అండి మామూలుగానే రాస్తున్నాను..రోజు అవే కబుర్లు బోరేకదా ..కాకపోతే నాకంటే బాగా రాసే మంచి బ్లాగర్లు ఇప్పుడు ఎక్కువ ఉండటం వల్ల లోపాలు ఎక్కువ కనబడితున్నాయి :)
గిరీష్ గారు థేంక్యూ :)
శ్రీ గారు ..ఆహా ఏం చెప్పారండి..అన్నిటికీ ఇదో అపవాదు మా పైన వేస్తారు మగవాళ్ళు అస్సలు ఖర్చే పెట్టనట్లు :)
కిరణ్ థేంక్యూ :))
అజ్ఞాత గారు మీ వ్యాఖ్య ప్రచురించలేదు.. ఏమనుకోకండేం ... సరదాకయినా ఇంకొకరిని ఎందుకు బాధపెట్టాలి చెప్పండి :)

నేస్తం చెప్పారు...

నాదీ జయగారి మాటే తెలిసిన విషయమే అయినా బాగా చెప్పారు

అజ్ఞాత చెప్పారు...

Chala bavundi post. mari next post epudu? Ram gopal varma kooda 1 week ki relsese chesesaru Rakta charitra-2, mari merepudu release chestaru? advance booking chesukundam ani :)

రసజ్ఞ చెప్పారు...

interval lo vellaaru kada taravatha paata ayyindi inka continue cheyandi mari.....

SHANKAR.S చెప్పారు...

">>>కాని ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు"

ఇది పచ్చి అబద్ధం. నమ్మకండి బ్రహ్మీస్.

నేస్తం చెప్పారు...

అజ్ఞాతగారు రసజ్ఞ గారు ధన్యవాదాలు
శంకర్ గారు అవుననడి పచ్చి అబద్దమే నాకూ తెలుసూ ....అంత కన్నా ఘోరంగా తిరుగుతారు... కాలు కాలిన పిల్లిలా హచ్చు కుక్క పిల్లలా ఇలా చాలా ఉపమానాలు అనుకున్నాను కాని సరైన పదం తట్టలేదు ..మీరు హెల్ప్ చేయండి అదే రాసేస్తాను :)

........................ చెప్పారు...

అంటే బుజ్జీ ముసలాయనకదా సరిగ్గా వినిపించి ఉండదు ... పొరపాటు పడటం మానవ సహజం.. నువ్వు మామూలుగా నడిచేయచ్చు అనేసారు.... :P

Shivam చెప్పారు...

వ్యాసం చాలా బాగా వ్రాషారు