27, సెప్టెంబర్ 2010, సోమవారం

యశోదా ఆంటీ

'యశోదా ఆంటీ' మన ఇంటి ఓనరు అని పరిచయం చేయగానే నేను హలో అని పలకరించడానికి బదులు 'ఆ 'అంటూ నోరు వెళ్ళబెట్టాను ...మా ఆయన మాటి మాటికి 'యశోదా ఆంటీ ','యశోదా ఆంటీ' అంటుంటే ఇంత లావున ఒక 45 -50 మధ్యవయసు మహిళను ఊహించుకున్నాను గాని ,ఇలా సన్నగా,తీగలా పాతికేళ్ళ అమ్మాయిలా ఉంటుంది అనుకోలేదు ....వచ్చిన కొత్తల్లో మా ఆయన ఆఫీస్ కి వెళ్ళేటపుడు బస్ స్టాప్ వరకు నేనూ తోడు వెళ్లి టాటా,టాటా బై బై లు చెప్పి వచ్చేదాన్ని..ఇప్పుడు ఆయన గుమ్మం దగ్గర నుండి వెళ్ళొస్తా అంటే నేనూ వంట గదిలో నుంచి 'ఆ ' అని అరుస్తా తప్ప అడుగుముందుకేయను అది వేరే విషయం అనుకోండి ...

సరే దారంతా ఒకటే తిట్లు తిట్టాను తనని.."అంత చక్కని అమ్మాయిని పట్టుకుని ఆంటీ అని పిలవడానికి మీకు నోరు ఎలావచ్చిందండి ?.. పాపం అనిపించలేదు? ఆవిడ కాబట్టి ఊరుకుంది ..అదే ఇంకొకరైతేనా !!!".. అని ఆవేశం గా తిట్టిపడేసాను..."'అమ్మాయా'?ఇంకా నయం పసి పాప అనలేదు ...ఆవిడకు 40 పైనే ఉంటాయి.. అయినా వాళ్ళాయనే ఇంటి రెంట్,వగైరాలు మాట్లాడినపుడు 'ఆంటీ 'ని అడుగు అంటాడు ...సరే అని కంటిన్యూ చేసేసా అన్నారు".. దీన్నే 'అసూయ' అంటారు...వాళ్ళ ఆయనకు కుళ్ళు ... నేను మాత్రం ఆంటీ అననుగాక అనను ....ఒక స్త్రీ హృదయం మరొక స్త్రీ కే తెలుస్తుంది అండీ అనిక్లాస్ పీకి ఇంటికొచ్చాను ...

సరా సరి వంట గదిలోకి వెళ్ళగానే మీ యజమాని వెళ్ళిపోయాడా? అంది ఆమె ... మా యజమానా? అంటే ఇంటి ఒనరా?ఆయనఎక్కడున్నారో నాకెలా తెలుస్తుందబ్బా? అనుకుంటుండగా ..."ప్రియా దోసె నెడుతుకో" అంది.. దోశ ని ఎత్తుకోవడం ఏంటా? అని అయోమయం గా చూస్తుంటే వాళ్ళ పెద్ద అమ్మాయి గభ, గభా ప్లేట్ లో దోశలు వేసుకుని వెళ్ళింది..అదొక్కటే కాదు" గోత్తిల్లె","జిల్లున" ఇలాంటి అనేక కొత్త కొత్త పదాలు వింటూ ఆక్చర్యం గా చూసాను ..నాకు అప్పటికి గోదావరి యాస తప్పా రెండో యాస తెలియదు ...

" మీరు ఆంధ్రాలో ఎక్కడ అండీ "?అన్నాను ఆరాగా... నా మనసు చదివేసినట్లు నా భాష చూసి తికమకపడుతున్నావా? మా నాన్న గారు తెలుగు వారు ,అమ్మ తమిళియన్ కాని నేను పెరిగింది బెంగళూర్ ...అందుకని ఆ మూడు భాషలూ వచ్చు ఇంకా హిందీ,మలయాళం కూడా అనర్గళం గా మాట్లాడుతా తెలుసా అంది... "అమ్మో ఎంత గ్రేటండి మీరు నాకుతెలుగే పూర్తిగా రాదు" ...అన్నాను మెచ్చుకోలు గా చూస్తూ ..."నీకో విషయం తెలుసా నేను ఏదైనా ఇట్టే పట్టేస్తా ... కాని పదవతరగతి తోనే నా చదువు ఆపేసి పెళ్లి చేసేసారు .. అయినాఊరుకోకుండా మిషన్ నేర్చుకుని ఇక్కడ బట్టలు కుడుతున్నా..ఒక్క జాకెట్ కే 50 $ తీసుకుంటా ..ఇంకా మలయ్,చైనావాళ్ళ సాంప్రదాయ దుస్తులు కూడా కుడతా అంది"... అమ్మో!!!" మీరు చాలా చురుకైన వారండీ "అన్నాను... అందుకే నా ఫ్రెండ్స్అందరికీ నేను అంటే కుళ్ళు ...నిన్న ఒకఆమే ఏమందో తెలుసా ...నీ ఇంట్లో ఎవరూ రెండు నెలలకు మించి ఉండరూ,తట్ట,బుట్టా సర్దుకుని పారిపోతారు అంది..నువ్వు చెప్పు నేను పొగరు దానిలా కనబడుతున్నానా? మా ఇల్లు వదిలి వెళ్ళిపోతారామీరు అంది ? ... ఛ ఛ అలా ఎందుకు చేస్తాం ? అయినా అదేం ఫ్రెండ్ అండి అంతలా మొహం మీద అలా ఎలా అంటారు ? అనిబోలెడు హాచ్చర్య పడిపోయి మాట ఇచ్చేసా ..

ఆ సాయంత్రం మా ఆయన రాగానే .. యశోద గారు ఎంత మంచోరో తెలుసా!! ...బోలెడు చురుకైన వారు ...పాపం ఒక అమ్మాయి ఇలా అందంట అని ఇంకో రెండేసి ఆ అమ్మాయి మీద కోపం వచ్చేలా చెప్పాను మా ఆయనకు.. ఏమోలే ,మన కెందుకు వాళ్ళ గొడవలు.. అయినా ఆవిడ కూడా అంత తక్కువదేమి కాదు..నువ్వు మధ్యలోకి వెళ్ళకు అన్నారు..ఛీ ఈయనకు ఇంత కూడా జాలి లేదు ,ఎప్పుడు మనకెందు,మనకెందుకు అని అనడం తప్ప అనేసుకుని పడుకున్నాను...

ప్రొద్దున్నే వంట చేసేసి మా వారికి బాక్స్ పెడుతుండగా ఆమె వచ్చింది ... నేను పలకరింపు గా నవ్వ గానే నీ నైటీ చాలా చెత్తగాఉంది లూజు లూజుగా ..నీకు సెలక్షన్ తెలియదనుకుంట అంది.. ఇదేంటబ్బా ఇంత మాట అనేసింది నిన్నేగా పరిచయంఅయ్యాను అనుకుని ఏమోలే మరీ బాలేదేమో అనుకుని ..ఇక్కడకొచ్చిన హడావుడి లో ఏదో కొనేసా అని వెళ్ళ బోతుంటే,నిన్న వంట చేసినపుడు ఆ ప్రక్కన ఉల్లిపాయ తొక్క వదిలేసావ్ ..ఇల్లు శుభ్రం గా పెట్టకపోతే నాకు చిరాకు ... ఇక మీదట ఏమీతేడా రాకూడదు తెలిసిందా అంది...నాకు కొద్దిగా బాధ కలిగింది అలా కొట్టినట్లు మొహం మీద చెప్పేసరికి.. 'ఊ' అనేసి నా గదిలోకి వచ్చేసాను ...

అక్కడి తో ఊరుకుందా !!! తోమిన పాత్రలు వంట గదిలో షెల్ఫ్ లో పెట్టద్దు నీ బెడ్ రూం లో పెట్టుకో అన్నాది...దణ్ణం పెట్టుకోవడానికి దేవుడిగదిలోకి వెళ్లబోతుంటే ఆ రూం లోకి వెళ్ళకు దాని నిండా వెండి సామాను ఉంది అనేసింది.. ఇక తప్పక దేవుడా తప్పు చేస్తే సారి అని దణ్ణం పెట్టుకుని ...బెడ్ రూం లోనే ఒక మూలాన జాగ్రత్త గా పెట్టుకున్నాను ... మా ఆయనకు చెప్పితే అయ్యోపాపం అలా అందా అని జాలిపడక పోగా ,వెనకేసుకుని వచ్చావుగా నీకలాగే అవ్వాలి అని అంటారేమో అని భయం వేసి నోరుమూసుకునిఉన్నాను..

ఇంక ఆ మరుసటి రోజునుండి ఆంటీ విశ్వ రూపం చూపడం మొదలు పెట్టింది.. ఆమ్లెట్ వేద్దాం అంటే ఈ రోజుసోమవారం నాన్ వెజ్ వండటానికి ఒప్పుకోను అనేది.. ఒక్క సోమవారం కాదు గురు ,శుక్ర ,శని వారాలు కేవలం వెజ్ మాత్రమేవండాలి..పోనీ మిగిలిన రోజుల్లో అయినా వండుకోనిస్తుందా అంటే నాకు సీఫుడ్ నచ్చదు అందుకే ఫిష్,ప్రాన్ వండకూడదు...మటన్ వాసన మా పిల్లలకు పడదు కాబట్టి చికెన్ మాత్రమే వండాలి లాంటి కండీషన్లు సవాలక్షా పెట్టేది ....పోనీ ఆవిడకు నిజంగా ఆ వాసన పడదా అంటే మా మమ్మీకి ప్రాన్ కర్రి చాల ఇష్టం ..హోటల్ కి వెళితే అదే ఆర్డర్ చేస్తుంది అని పిల్లలు ఎప్పుడన్నా కబుర్ల మధ్యలో చెప్పేవారు

బాబోయ్ షేరింగ్ ఇల్లు అంటే ఇన్ని కష్టాలు పడాలా అని ఏడుపోచ్చేసేది కాని ఈ విషయాలు మా ఆయనకు చెప్పగానేపదా,మనకు ఈ ఇల్లు వద్దు అని ఏ చైనా దాని ఇంటికో,మలయ్ వాళ్ళ ఇంటికో తీసుకు వెళ్ళిపోతే నా గతి ఏం కాను?? కనీసం ఈవిడ చెప్పేది అర్ధం అవుతుంది ...వాళ్ళు తిట్టినా అర్ధం కాదు అని గప్,చిప్ గా సర్దుకు పోయేదాన్ని ...

ఇవన్నీ కూడా పర్వాలేదు .. ఆవిడ ఫ్రెండ్స్ వస్తే మటుకు నాకు నరకమే .... మాంచి నిద్రలో ఉండగా దభ ,ధబా అని తలుపులుబాదేసి లేపేసేది..నేను నవ్వుతూ వాళ్ళను విష్ చేయగానే వాళ్ళందరికీ గాజర్ హల్వా నో,రస మలయ్ నో కప్పుల్లో వేసి ఇచ్చివాళ్ళ మధ్యలో నన్ను కూర్చో పెట్టి నాకు ఇచ్చేది కాదు ...వాళ్ళందరూ మీరూ తినండి అనేవారు మొహమాటం గా ..ఏంటితినేది నా మొహం ...నాకు అక్కడ కూర్చోవాలో తెలియదు..వెళ్లి పోవాలో అర్ధంకాదు .. మొహమాటం గా నవ్వి ఊరుకునేదాన్ని...పోనీ అక్కడి తో వదిలేదా!!! మొన్న ఒక ఆమె నీ ఇంట్లో ఎవరూ ఉండలేరు అన్నాది అంటే నువ్వు నాలుగు దులిపేసావ్ కదా ఆవిడే ఈవిడ అని పరిచయం చేసేది.. ఇక మా ఇద్దరి మొహాలు చూడాలి ... ఓర్నాయనో ఈవిడేంటిరా బాబు అనుకుని తేలు కుట్టిన దొంగల్లా ఇద్దరం కిమ్మన కుండా కూర్చునే వాళ్ళం ...
అన్నిటికన్నా కష్టమైన కండీషన్ ఏమిటంటే గట్టిగా మాట్లాడ కూడదు,నవ్వ కూడదు.. ఇది మాత్రం నా వల్ల అయ్యేది కాదు.. కాని ఏం చేస్తాం భరతనాట్య కళాకారిణిలా .. కళ్ళతోనో, సైగల తోనో అనేక హావ భావాలు చూపెట్టి ఆయన గారిని భోజనానికి పిలిచేదాన్ని.. ఆ దెబ్బతో మా ఆయనకు మహా విరక్తి వచ్చేసి మనమేమన్నా ఊరికే ఉంటున్నామా? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అని హుంకరించేసేవారు.. బాబ్బాబు ఎందుకులేద్దు గొడవ అని సర్ది చెప్పేదాన్ని..

అలా ఎన్నాళ్ళని ఊరుకోబెడతాం ..ఒక శుభ ముహుర్తానా తెల్లవారు జామున మా ఆయన మాంచి నిద్రలో ఉండగా చేతిలోఉన్న అన్నం గిన్నె 'డాం' అని ఎత్తేసాను... ఇంకేంటి గిన్నె తో పాటు నా తల కూడా బ్రద్దలై పోయింది మా ఆయన తిట్లతో ..వెళ్లి ఆవిడను ఇంకో అర అడుగుతావా లేక నన్ను అడగమంటావా అని...ఇక తప్పక భయ పడుతూనే వెళ్లాను.. ఇంకో అరకావాలి ..నాకు సామాను పెట్టుకోవడానికి సరిపోవడం లేదు అన్నాను... అలా అడిగేస్తే ఎలా ? నాకు కుదరదు ..అయినా ఇల్లునీకు ఇవ్వలేదు ,మీ ఆయన్ని వచ్చి అడగమను అంది సింపుల్ గా .. నాకు ఏడుపోచ్చేసి మా ఆయనదగ్గరకు వచ్చాను ... నీకసలు బుద్ధి ఉందా !! చిన్న మాట అంటే చాలు నామీద ఇంట ఎత్తున ఎగురుతావ్ ..అలా అంటే ఆవిడకు సమాధానం చెప్పడంచేతకాదా ..దేనికి పనికోస్తావే అని విసుగ్గా యశోద దగ్గరకు వెళ్లి మీకు ఇంకొక అర ఇవ్వడం కుదరనపుడు మాకు ఇక్కడ ఉండడం కుదరదు .. ఈ నెల ఆఖరున ఇల్లు ఖాళీ చేసేస్తాం అని చెప్పేసి ఆఫీస్ కీ వెళ్ళిపోయారు...

ఆ రోజు యశోద ఉండగా బయటకు వస్తే ఒట్టు.. తలుపులేసుకుని ఇంట్లోనే ఉన్నాను.. అసలే కొత్త దేశం అంటే మళ్లీ కొత్త ఇల్లు కొత్త పరిసరాలు..ఎలారా దేవుడా అని భయపడుతుంటే ఆ రాత్రి మావారు ధైర్యం చెప్పారు.. అందరూ ఈమెలానే ఉంటారా ? అసలు మొదటి నుండిఈవిడ పద్దతి నచ్చలేదు ..ముందు ఒక రెంట్ చెప్పింది..తీర ఇంటికొచ్చాకా లేదు లేదు అని ఇంకో యాభై ఎక్కువ ఇవ్వాలని గొడవ ...ముందు ఏ.సి తో కలిపి అంది ..మళ్లీ కాదు అంది ..తెలుగు అమ్మాయి కదా అని నీ కోసం ఊరుకున్నా ...ఏం పర్వాలేదులే.. నువ్వు ఏం ఆలోచించకు అన్నారు ..

రెండు రోజులు పోయాకా వంట చేయడానికి బయటకు వస్తే ఇంకొక అర ఖాళీ చేసి ఉంది ... ఆ అర వాడుకో ..సరిపోతుందాఅంది.. 'ఊ ' అన్నాను ఈవిడ ఏమిటిరా ఇలా ఒప్పేసుకుంది? అని తెగ హాచ్చర్య పడిపోతూ .. ఆ రోజు రాత్రి మావారికి చెప్పాను.. ఏమండీ అర ఇచ్చేసింది ఇక ఎక్కడికీ వెళ్లక్కరలేదు అన్నాను తేలిగ్గా ఊపిరి పీలుస్తూ.. నీ కసలు సిగ్గులేదే ..నాలుగు తన్ని కొబ్బరి నూనె రాస్తే చాలు అంతా మర్చి పోతావ్..వద్దని చెప్పానుగా ..ఖాళీ చేసేద్దాం అన్నారు ... ఇంకేమన్నా తిడతారనిమాట్లాడలేదు..

కాని ఆ తరువాత నుండి యశోద ఆంటీ లో చాలా మార్పు వచ్చింది ...నన్ను చాలా ప్రేమ గా చూసుకోవడం మొదలుపెట్టింది..నాకు ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది ...తరువాత వెంటనే పోతుంది అని తన కోపానికి కారణాలు చెప్పింది.. వాళ్ళ ఇంట్లోవిషయాలు,తన చెల్లెళ్ళ గురించి ...ఇన్నాళ్ళు తను పడ్డ కష్టాలు అన్నీ నాకు చెప్పేది.. నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడం ఇష్టంలేదు..మావారి జాబ్ పోయింది ..ఇక పిల్లల చదువు ,ఇంటి బాధ్యత అన్నీ నా పై పడ్డాయి అని చెప్తుంటే నాకు ఏమో చాలా బాధ అనిపించేది..ఇటు చూస్తే ఈయన ససేమిరా అనేవారు ...

ఒక రోజు ఇల్లు చూడటానికి నన్ను తీసుకు వెళ్ళారు కూడా ... ఆవిడ పేరు కిరణ్..ఆ ఇల్లు ఇద్దరు ఆడవాళ్ళు కలిపి తీసుకున్నారు ..అందులో ఒక ఆమె వెళ్ళిపోవడం తో మాకు రెంట్ కి ఇవ్వడానికి ఒప్పుకుంది ...ఇల్లు చాలా బాగుంది .. కానినాకెందుకో ఆవిడ నచ్చలేదు..తను చాలా ఫాస్ట్ కల్చర్ అమ్మాయి లా ఉంది ..నార్త్ ఇండియన్ అనుకుంటా..నా మనస్తత్వానికి పూర్తీ విరుద్ధమైన ఆవిడ .. పైగా భాష తనది నాకు అస్సలు అర్ధం కావడం లేదు.. మా ఆయన వీపు గోకుతూ ఉహుహు అని గునుస్తున్నా గాని నువ్వు ఆగు అని ఈయన గారు రెంటు వగైరాలు మాట్లాడేస్తున్నారు..

భయటకు వచ్చేసాకా ,ఇది మంచి ఇల్లుబుజ్జీ ..చక్కగా ఆఫీస్ కీ దగ్గర... మధ్యాహ్నం ఎంచక్కా ఇంటి కొచ్చి భోజనం చేసి వెళ్ళచ్చు.. బస్ చార్జీలు గట్రా ఉండవు .. అనిఒప్పించే ప్రయత్నం చేసారు .. కాని యశోదకి మనం గట్టిగా చెప్ప లేదు కదా ఖాళీ చేసేస్తాం అని ...అందులోను తను అర కూడా ఇచ్చేసింది ..పాపం అండి మాట దురుసు గాని మనిషి మంచిది అన్నాను... ఏమోనే నేను తనని నమ్మను .. ఈ రోజు ఊరుకుని మళ్లీ ఎప్పుడో మొదలు పెడుతుంది.. మనకెందుకు వాళ్ళ గోల ...ఆ రోజు చెప్పానుగా ఖాళీ చేసేస్తాం అని ఇక ఊరుకో అన్నారు...

ఆ మరుసటి రోజు వరలక్ష్మి పూజ ఘనం గా చేసింది తను.. నన్ను పిలిచి బొట్టు పెట్టి పళ్ళు,జాకెట్టు ముక్క పెట్టింది..నాకెందుకో తను అంత ఆప్యాయం గా చూస్తుంటే ..ఇంకో రెండు రోజుల్లో అలా వదిలేసి వెళ్ళిపోవడం నచ్చలేదు ...అసలు ఖాళీ చేసేస్తాం అంటే ఆంటీ ఎలా ఫీల్ అవుతుందో? తను కష్టాల్లో ఉండ బట్టే కదా పాపం ఇష్టం లేక పోయినా అర ఇచ్చింది..ఓనర్ అన్నాకా ఇల్లు శుభ్రం గా ఉంచమనే అంటారు.. నేను మరీ ఎక్కువ ఊహించుకున్నాను..అయినా ఆమె తో కోపం గా మీరు అర ఇవ్వక పొతే ఖాళీ చేసేస్తాం అని బెదిరించాం కాని నిజంగా అనేసాం ఏంటీ?తను ప్రిపేర్ కాకుండా ఇలా అన్యాయం గా వెళ్లి పోవచ్చా??మోసం చేస్తున్నామా ?తప్పు కదూ ?? నా అంతరాత్మ నన్ను శుబ్రంగా ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసేసింది ..

ఆ రోజు రాత్రి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాను మా ఆయన దగ్గర ..నేను రాను ..నాకిక్కడే బాగుంది..నాకు ఆ అమ్మాయి నచ్చలేదు..నేను అక్కడ ఉండలేను... ఆంటీతో కోపం లో అన్నాం గాని నిజంగా అనలేదు కదా ..ఎల్లుండి ఖాళీ చేసేస్తాం అంటే వాళ్ళు ఏమనుకుంటారు అని ముక్కు చీది మరీ బ్రతిమాలాను..సరేలే ఏడవకు కిరణ్ కి ఇంకా విషయం చెప్పలేదు కదా ... రేపు తనకు రానని చెప్పెస్తాలేఅని అన్నాక గాని స్థిమిత పడలేదు ....

ప్రొద్దున్నే మావారు ఆఫీస్ కి వెళ్ళడానికి భయటకు రాగానే సాయంత్రం లోగా ఇల్లు ఖాళీ చేసేయాలి అంది దారికి అడ్డం గానించుని.. నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను.. ఆ రోజు ఇల్లు ఖాళీ చేసేస్తాను అన్నారుగా ..మర్చిపోయారా .. ఈ రోజే లాస్ట్ డేట్ ..ఖాళీ చేయండి అంది కోపంగా ... నేను అయితే మాట లేక నించున్నా అంతే... మా ఆయన మాత్రం కూల్ గా మేము మీ ఇంట్లో జాయిన్ అయింది 28 ఈ రోజు 27 రేపు ఖాళీ చేస్తాం అన్నారు..కుదరదు ఇప్పుడే ఖాళీ చెయ్యాలి మొండి కేసింది ...వాళ్ళాయన అగ్రిమెంట్ కాగితాలు తీసుకుని ఆవేశం గా మా ముందు పడేసారు ..చెక్ చేస్తే 28 అని ఉంది ..హమ్మయ్యా అనిఊపిరి పీల్చుకున్నా ... ఆవిడ మాట్లాడకుండా లోపలి వెళ్ళిపోయింది ..

దారిలో మావారు ..నేను చెప్పానా !!! నమ్మకే ఎవరినిపడితే వాళ్ళను అని.. ఇంకా నయం 27 అని పొరపాటు పడింది కాబట్టి బ్రతికి పోయాం లేక పోతేనా!!ఎక్కడికని వెళ్ళే వాళ్ళం..ఈ రోజంతా ఇంపార్టెంట్ మీటింగ్లు కూడాను అని వెళ్ళిపోయారు ... నాకు లోకం తీరు మెల్లిగా అర్ధం అయింది ...ఎంత మోసం..నాకు అనుమానం రాకుండా మంచిగా మాట్లాడి మేము ఇల్లు గురించి మర్చి పొతే సమయానికి భయటకు పంపేద్దామనిపకడ్బందీ ప్లాన్..మొదటి నుండీ ఈయన నమ్మలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతె పరిస్థితి ఏమిటి ? అని రక రకాలుగాఆలోచిస్తూ బట్టలు పేక్ చేయడం మొదలు పెట్టాను ...

సరిగ్గా మధ్యాహ్నం ఫోన్ రింగయ్యింది.. మా ఓనర్ వాళ్ళ పాప ఆంటీ ఫోన్ అని పిలిచింది.. హలో చెప్పండి అన్నాను.. బుజ్జీ ...కిరణ్ ఇల్లు ఇవ్వనంటుందే అన్నారు.. నాకు గుండెల్లో రాయిపడినట్లుఅయ్యింది.. ఏంటి?? అన్నాను కంగారుగా..ఏమైందో తెలియదు..కుదరదు అంది ...ఒప్పుకోవడం లేదు అన్నారు ..మరేం చేద్దాం?అన్నాను నీరసం గా .. ఈ నెల ఉండటానికి వీలు ఉంటుందేమో అంకుల్ ని అడుగుతావా వేరే దారిలేదు అన్నారు.. ఫోన్ పెట్టేసిప్రక్క బెడ్ రూం వైపు నడిచాను ... అంకుల్ గుమ్మం దగ్గర నుండి పిలవ బోయాను కాని తన చేతిలో ఫోన్ రిసీవర్ ...ఆ ఫోన్ కిదీనికి లింక్ ఉన్నదన్న విషయం నాకు తెలియదు..అంటే మా మాటలు అన్నీ విన్నాడన్నమాట... అతని మొహం లో వెటకారం కనబడుతుంది..మేనర్స్ సంగతి దేవుడెరుగు ...ముందు పని ముఖ్యం కదా అని ...అంకుల్ మరి....అదీ ఇంకా ఒక్క నెలఉండచ్చా అన్నాను ...రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయాలి మీరు అని వెళ్ళిపోయాడు ...

చాలా అవమానం గా అనిపించింది ... క్రిందకు పరుగులు పెట్టి ఆయనకు ఫోన్ చేసా ..హుం.. చూసావా .. నీవల్ల ఏంజరిగిందో!!!! సరిగ్గా ఇల్లు కూడా వెదక నివ్వలేదు ... క్రొత్తగా వచ్చాం ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు..ఎక్కడికి వెళతాం అన్నారు..అన్నీ నన్నే అనండి ..ఆ యశోద,కిరణ్ అలా చేస్తే నేనేం చేయను మధ్యలో అని అరిచేసాను ....నాకు టెన్షన్ తో వణుకోచ్చేస్తుంది.. సరేలే భయపడకు .. ఏదో ఒక దారి దొరక్కపోదు ...రాత్రి లేట్ గా వచ్చినా కంగారు పడకేం అని చెప్పి ఫోన్ పెట్టేసారు ... నేను ఏమి జరగనట్టు గదిలోకి వచ్చి సామాను సర్దడం మొదలు పెట్టాను..

సాయంత్రం వంట చేస్తుంటే యశోద వచ్చింది గదిలోకి ... ఇల్లు ఎక్కడ దొరికిందో ? అంది ఏమీ తెలియనట్లుగా.. తన మొహం లో వెలుగే చెప్తుంది తనకు అంతా తెలిసిపోయిందని.. ఆ .. కండోమినియం అన్నాను కచ్చగా .. అబ్బా ..ఇంకేం మీకు జిమ్ము,స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి ..అదృష్టం కదా అంది.. నాకెందుకో కోపం రాలేదు.. ఎన్ని ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతాను..ఇక్కడ అలవాటు పడిపోయా అన్నాను మెల్లగా ... కాసేపు తను ఏమీ మాట్లాడలేదు ...నువ్వే అలవాటు పడిపోతావులే నాలుగు రోజులు అయితే అని వెళ్ళిపోయింది.. ఏం చేయాలో అర్ధం కాలేదు ...దేవుడి పటం దగ్గర వెళ్లి స్వామీ ఏం తప్పుచేసానో తెలియదు.. కాని దేశం కాని దేశం లో ఒంటరిగా నన్ను వదిలేయద్దు... నువ్వు తప్పకుండా కాపాడుతావు అని నమ్మకం ఉంది.. ఆ నమ్మకం నిలబెట్టు అని దణ్ణం పెట్టుకున్నా...

రాత్రి పది అవుతుండగా మా వారు వచ్చారు..ఏమైంది అన్నాను ...ఇప్పటికిప్పుడు అంటే కష్టం బుజ్జి ..కనీసం నాలుగు రోజులు అయినా పడుతుంది ఏజెంట్ కి చెప్తే అన్నారు.. పుట్ పాత్ మీద అయినా ఉందాం ఇంక వీళ్ళను అడగద్దు అన్నాను..ఇదేమన్నా మన దేశమా ఎక్కడ పడితే అక్కడ ఉంటా అనడానికీ అన్నారు ..నాకేం మాట్లాడాలో అర్ధం కావడం లేదు .. కాకపొతే మా ఆయనకు ధైర్యం చెప్పాలనిపించింది అంతే... ఏమీ కాదు నాకు నమ్మకం ఉంది రేపు ఏదన్నా పార్కులో ఉంటాను మీరు ఏజెంట్లకు ఫోన్ చేసి ఇల్లు వెదకండి ..సాయంత్రం లోగా ఇల్లు తప్పక దొరుకుంది అన్నాను ధైర్యంగా ... అప్పుడు నవ్వారు మాఆయన.. ఆహా ..పార్కులో ఉంటావా? అబ్బా ఏం ధైర్యం చెప్తున్నావే పిరికిదానా ... ఇల్లు దొరికింది ఇక భయపడకు అన్నారు..అప్పటివరకు అణుచుకున్న ఏడుపు ఒక్కసారిగా భయటకు వచ్చేసింది ...పదినిమిషాలు ఊరుకోబెడుతూనే ఉన్నా ఏడుస్తూనేఉన్నా.. యశోదను ఏడిపిద్దామా ఇంకా దొరకలేదని అన్నారు..వద్దులే బాబు మనకెందుకు అన్నాను.. ఆ ప్రొద్దున్నే ఇల్లు ఖాళీచేసేసాం

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఆడవాళ్ళకు మాత్రమే

అమ్మాయిలూ ఒక్క నిమిషం ఆగండి అమ్మాbabai !!!!! ... ఓయ్ ,ముందే చెప్పానా అమ్మాయిలకు మాత్రమే అని మీరెందుకు చదువుతున్నారు...ఆయ్ ..వెళ్ళిపొండి మర్యాదగా ..marah. ఆ అమ్మాయిలూ మనం విషయంలోకి వచ్చేద్దాం ..encem నాకొక తమ్ముడు ఉన్నాడు (పెద్దమ్మ క్కొడుకు )... వాడి గురించి మరిన్ని వివరాలకు ఈ క్రికెట్ ఎవరు కనిపెట్టారో గాని అనే పోస్ట్ చదవండి.. వాడికి అమ్మాయిలంటే అస్సలు పడదు..ngantuk వాడికి నచ్చని అమ్మాయిలను క్యూ లో నిన్చోపెడితే అందులో ప్రధమ వరుసలో మొదటి ప్లేసులో నేనే ఉంటాను...అంత ప్రేమ నేనంటే వాడికి.sengihnampakgigi.వాడెంత స్త్రీ ద్వేషి అంటే నీరసం తో కాలు చెయ్యి కదపలేని ఆడవాళ్ళు సైతం వాడి మాటలు వింటే శివాలెత్తి శివతాండవం చేసేస్తారు..మచ్చుక్కి కొన్ని ఆణిముత్యాలు ...

బ్రహ్మ్మదేవుడు అంటా అమ్మాయిని, అబ్బాయిని సృష్టించి ...అబ్బాయిలకు మాత్రమే వినిపించేలా ...ఒరేయ్ ..ఈ ఆడవాళ్లున్నారే ...మహా పొగరుబోతులు .. మీరు సమానత్వం ,సొరకాయ కూర అని ప్రక్కనే ప్లేస్ ఇచ్చారనుకో మీ బ్రతుకు ఇత్తడి పెనంలో వేపిన మెత్తని పకోడియే... కాబట్టి వీళ్ళను కాలి క్రింద మాత్రమే పెట్టండి ... అని ఉపదేశించాడంట... సరే అని చాలానాళ్ళు వంటగది లోపలే పిల్లుల్లా కట్టి పడేసి ప్రశాంతం గా ఉన్నారంట మగవాళ్ళు..కొద్ది రోజులకి మగవాళ్ళకు జాలి కలిగిందంట ..పోనీలే పాపం అని ,దీనంగా చూస్తున్న ఆడవాళ్ళకు ప్రక్కనే ప్లేస్ ఇచ్చారంట కూర్చోమని... అయితే ఆడవాళ్ళు ప్రక్కన తిన్నంగా కూర్చోలేక నెత్తి మీదకు ఎక్కడానికి ట్రై చేయడం మొదలు పెట్టారంట...మాకు గాని మండిదిఅనుకో ఒక్క సారి తల విదిలిస్తాం ...సరిగ్గా సరా సరి నేల మీద పడతారు...ఒక్క అడుగేసాం అనుకో ఏకంగా పాతాళం లోనికే అనేవాడు.. ఎందుకైనా మంచిది ఒక సారి బి.పి చెక్ చేసుకోండమ్మా .... nerd

అదొక్కటేనా... అసలు కట్నం తీసుకుంటే తప్పేంటి ..తేరగా మేము తెచ్చింది తినడం లేదా.. వరకట్నం నిషేదించాలి అని ఎవరన్నా అన్నారనుకో ఫేడెల్,ఫెడేల్ అని నాలుగు పీకాలి మళ్లీ నోరెత్తరు....నాకు గాని పెళ్లి అయ్యిందనుకో దాని బ్రతుకు నా కాలి దగ్గరే .... ప్రొద్దున్న నా షూ తుడుస్తూ మొదలయ్యే దాని జీవితం,రాత్రి నా కాళ్ళు పడుతూ ముగియాలి.. లక్ష్మణుడు వదిన కాళ్ళు తప్ప మొహం చూడనట్లు అది నా కాళ్ళు,వాటి గోళ్ళు తప్ప ఇంకేం చూడకూడదు ....
అబ్బో ఇలాంటివి ఒకటా ,రెండా ...ఇంతకు మించి మీ ఆరోగ్యం పాడు చెయ్యడం నాకిష్టం లేదు అనుకోండి ...takbole

అలా వాడితో రోజుకొక గొడవేసుకుని ,వాధించి,చాలా సార్లు కుళ్ళుకుని ఏడ్చి ...ఒరేయ్ నేనూ చూస్తానురా ..నీకు పెళ్ళయ్యాకా నీ బ్రతుకు వంటగదే .... నిన్ను బాగా చితక్కొట్టే పెళ్ళాం రావాలి ....నీలా కబుర్లు చెప్పి పెళ్ళాం వెనుక తిరిగేవాళ్ళను ఎంతమందిని చూడలేదు దొంగ వెధవ అని బోలెడు తిట్లు తిట్టేసేదాన్ని... nangih

అయితే పైకి అలా తిట్టేదాన్ని కాని నాకు బోలెడు అంత భయం ఉండేది.. ఈ దొంగ మొహం గాడు ఇలాంటి ఎక్కువ, తక్కువ పనులు చేసి ఏం మీదకు తెచ్చుకుంటాడో అని ketukmeje ... దేవుడా దేవుడా వీడి బుద్ది మారేలా చూడవా అని తెగ దణ్ణం పెట్టేసుకునేదాన్ని doa ఈ లోపల నాకు పెళ్లి అయిపోవడం నేను మా ఆయనతో మా వూరికి చెక్కేయడం జరిగి పోయాయి ...

వాడికి నాకు 25 రోజులే తేడా ... అందుకని అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా అమ్మని వాడి పెళ్లి గురించి అడిగేదాన్ని... adacall చూస్తున్నారమ్మా పెద్దమ్మా వాళ్ళు ...వాడికే పిల్లేవరూ నచ్చడం లేదు అనేది... ఆ తరువాత మా ఆఖరు చెల్లి పెళ్ళప్పుడు ఇండియా వెళ్ళినపుడు అడిగాను.. ఒరే మనిద్దరికీ ఒకటే వయసురా..tanduk నాకప్పుడే ఇద్దరు పిల్లలు పుట్టేసారు ...అక్కడికి నేను ఆంటీని ,నువ్వు బాలాకుమారుడివి అవ్వడం నాకు నచ్చలేదు ...ముప్పై దాటాయో ఇక నీకు పిల్లనివ్వడు ఎవ్వరూ అని బెదిరించి వచ్చేసా...banyakckp

ఆ తరువాత ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తే అక్క మాట్లాడింది.. ఏంటే అంత కంగారుగా మాట్లాడుతున్నావ్ అంటే ...బుజ్జి ,మనోడు ఇలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేసాడు అంది మెల్లగా.. దెబ్బకి నాకు నోట మాట రాలేదు..hah మా ఇంట్లో సంగతి నాకు బాగా తెలుసు.. నేను మా ఆయనతో తాంబూలాలు అయ్యాక ఫోన్ లో మాట్లాడితేనే అదేదో నేరం, ఘోరం జరిగిపోయినట్లు చూసేవారు garupaleఅలాంటిది ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేయడమే అనుకుని ...పెద్దమ్మ పెదనాన్న ఎలా ఉన్నారు అన్నాను కంగారుగా ... పర్వాలేదు వారం రోజులు మంచం ఎక్కేసింది పెద్దమ్మ.. ఆ అమ్మాయికి వెనుక ముందు ఎవరూ సరిగ్గాలేరు..కట్టు బట్టలతో తీసుకోచ్చేసాడు..మన కులం కూడా కాదు ... దానితో బెంగ పెట్టేసుకుంది... కాస్త నేమ్మదిన్చాక మాట్లాడుతాలే అంది..

అక్కడి పరిస్తితి కాస్త ఆందోళనగా అనిపించినా మా ఆయన దగ్గర మాత్రం డభాయించేసా ఎక్కడా ఒక్కమాట అననివ్వకుండా ... చూసారా ...మా తమ్ముడు ఎంత మంచిపని చేసాడో.. ఇంట్లో వాళ్ళను బాధ పెట్టినా ఒక అమ్మాయిని మోసం చేయకుండా ,కట్నం ఆశించకుండా ,కులగోత్రాలు పట్టించుకోకుండా ఎంత ధైర్యంగా పెళ్లి చేసుకున్నాడో.. మగాడంటే వాడండి అని,అదని ,ఇదని ..అబ్బో.. మా ఆయనుకు వారం రోజులు పండగే....menari

ఆ తరువాత కాస్త వీలు చూసుకుని వాడికి ఫోన్ చేసాను ...

ఏంట్రా ఏదో ఘన కార్యం చేసావంటా..kenyit

హీరో అన్నాకా ఇలాంటి ఘనకార్యాలు,సాహసాలు మామూలే కదా ...

ఆహా..ఇంతకీ ఎవరు ఎవరిని ప్రేమించారంటా rindu

ముందు తను ప్రేమించింది తరువాత నేను ప్రేమించ వలసి వచ్చింది (బ్రహ్మానందం లా అనుకరిస్తూ)

అబ్బ ఛా.... ఎన్నాళ్ళ నుండి ప్రేమించాబడ్డావేంటి ?jelir

ఒక పదేళ్ళ నుండి.. (నేను కూడికలు,తీసివేతలు,బాగాహారాలు గుర్తు తెచ్చుకుని లెక్కించి )అంటే మనం డిగ్రీ చదువుతున్నప్పటినుండి .hah.. హార్నీ... నాకు చెప్పనే లేదురా merajuk

అసలు ప్రేమించాకా ముందు వేసుకున్న ఒట్టే నీకు ఎంత మాత్రం తెలియకూడదని...

ఏడ్చావులే గాని ...ఇంతకూ ఇన్నాళ్ళు ఎందుకు ఆగవలసి వచ్చిందిరా?ఎంచక్కా జాబ్ లో చేరగానే పెళ్లి చేసుకొంటే సరిపోయేదిగా ... అటు ఆ ఆమ్మాయికి అడ్డుచెప్పేవారు లేరు అంటున్నావుగా ...ఆ చేసే ఘనకార్యం ఏదో అప్పుడే చేస్తే ఈ పాటికి ఎంచక్కా పిల్లలు కూడా పుట్టేసేవారు కదరా (నా బాధ నాది)..kenyit

ఏంటి అప్పుడే చేసుకునేది కొత్తిమీర కట్ట.. చిన్నాన్న మీ ఇద్దరికీ 18 నిండగానే పెళ్లి చేసేసారు..వాళ్ళిద్దరికీ కూడా అలాగే చేసేస్తారు అనుకున్నాను(మా చెల్లెళ్లకి) ...మిగితా చిన్నాన్న పిల్లలకు పెళ్లి చేసేసారు గాని వీళ్ళకు మాత్రం చేయలేదు..మా పెళ్ళిళ్ళతో నీకేంటిరా సంబంధం అని అనచ్చు నువ్వు..ఒకే ఇంట్లో పుట్టాం.. రేపు వాళ్ళ పెళ్లి మాటలప్పుడు వీళ్ళింట్లో అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళు ఎలాంటి వాళ్ళో అని అంటే నాకే కదా బాధ ...పోనీలే మిగితా చిన్నాన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి.. వీళ్ళ పెళ్లిళ్ళు ఎప్పుడవుతాయా ...జంప్ అందామనుకున్నా ... మొన్నటితో కుదిరింది...

(నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. ఈ రోజుల్లో సొంత వాళ్ళ గురించే ఆలోచించడం లేదు మరి..) అరే.. మరి పెళ్లి చేసుకున్నపుడు పెద్దమ్మ ,పెదనాన్న గుర్తు రాలేదా ?

అదేం అడుగుతావ్..నువ్వు నమ్మవు బుజ్జి ..నరకం అనుభవించాను.. వీళ్ళా ఎట్టి పరిస్తితుల్లో పెళ్ళికి ఒప్పుకోరు ...బెదిరించో,బ్రతిమాలో నన్ను కట్టేస్తారు.. చెప్పకుండా చేసుకుంటే బెంగ పెట్టేసుకుంటారు.. అందులోను ఎక్కడ ఎవరు లేచిపోయి పెళ్లి చేసుకున్నా.....ఇంట్లో ముందు ముచ్చట్లు పెట్టేసి, తెగ తిట్టి పడేసేది అమ్మ ...రేపు నేను ఇదే పని చేస్తే వీళ్ళ అందరిదగ్గర చులకన అయిపోతుంది అని మా గొప్ప భయం గా ఉండేది.. నెమ్మదిగా మా ఆవిడకే చెప్పాను ..మనవల్ల వాళ్ళు బాధ పడతారు కాబట్టి పెళ్ళయ్యాకా మా అమ్మ తిట్టినా ,కొట్టినా వాళ్ళ చుట్టే తిరిగి ఎలాగో మంచి చేసుకుందాం.. అని

సరేలే గాని ఫోన్ మీ ఆవిడకు ఇవ్వు మాట్లాడుతా callme...

ఎందుకు ? ఆ అమ్మాయిది ఏం తప్పులేదు బుజ్జి..చాలా మంచిది తెలుసా.. అంత మంచి అమ్మాయి దొరకడం నా అదృష్టం ...

అవునా.. సరేలే ఆ విషయం ఆమెనే అడిగి తెలుసుకుంటా ..నువ్వు ఇవ్వు..

ఇదిగో ఇప్పుడే చెప్తున్నా..తన తప్పేం లేదు.. నేనే తనను ప్రపోజ్ చేశా..బోడి కట్నం ఎవడికి కావాలి బుజ్జి.. అర్ధం చేసుకునే అమ్మాయి దొరకడం ముఖ్యం గాని ..

ఒరేయ్ నాయనా ..నేనేం ఆ పిల్లను అనను గాని కాసేపు మాట్లాడుతాను అంతే.. (పాపం వాడికి నా మీద నమ్మకం ఎక్కువ) అలా బోలెడంత అపనమ్మకంతో అయిదే అయిదు నిమిషాలు మాట్లాడించి పెట్టేసాడు..

ఈ సంఘటన అలా ప్రక్కన పెట్టి మరొకటి చూద్దాం.. నా పెళ్ళయిన క్రొత్తలో మా మరిదిగారు ఇంత కంటే ఎక్కువ అన్నమాట.. పెళ్లి అనే పదం వినగానే సల సలా కాగే సీసం రెండు చెవుల్లో పోసేసినట్లు రెండు చెవులు మూసేసుకుని తెగ బాధతో మెలికలు తిరిగిపోయే వారుbising ... మా అత్త గారు ఎప్పుడన్నా అరేయ్ ..ఫలానా పెళ్ళిళ్ళ పేరయ్య ఫలానా సంబంధం ఉంది అన్నారురా అనగానే ... సాగర సంగమం లో కమలహాసన్ లా వివిధ నృత్య రీతుల్లో వివిధ భంగిమలు పెడుతూ తకధిమి తై..తకధిమి తై ...తళాంగు తకధిమి తై అని ఎగిరి గెంతేసేవాడు...

అక్కడితో ఊరుకోకుండా మా ఇద్దరికీ రోజుకో క్లాసు ... అసలు పెళ్లి అంటే ఏంటి.. ఒక కమిట్మెంట్ ... పెళ్ళాం,పిల్లలు ,బాద్యతలు తొక్కా తోలు అన్నీని...నాకిష్టం ఉండదు వదిన ... అసలు మన దేశం ఇలా వెనకబడిపోవడానికి కారణం ఈ పెళ్ళే.fikir. సంసారాల చట్రాల్లో ఇరుక్కుపోయి లంచాలు తీసుకుని.. తర తరాలకు సరిపడేంత డబ్బును మంచాల క్రింద ,బీరువాల లోపల దాచేసి మన కోసం మనం కాక మనకు తెలియని ముందుతరాల కోసం బ్రతికేలా చేస్తుంది ఈ పెళ్లి.. లేక పోతే పిడికెడంత లేని పాకిస్తాన్ ని కాశ్మీర్ విషయం లో ఎదురించలేని అసహాయత మన భారతదేశం ఎందుకు ఎదురుకుంటుంది..మన ఆర్ధిక వెనుకబాటు తనం కాదా blur ఇలా పెళ్లి పేరు చెప్పి పేపర్ లో న్యూస్ అంతా వినిపించేసి తెగ బాధ పడిపోయేవాడు..

అలా మా మరిది మాటలు వినేసి,నమ్మేసి ఆ ఫళం గా తనని ఒక అబ్దుల్ కలాం ,ఒక అతుల్ బిహారీ వాజ్ పాయ్,మరి ఒక మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళ సరసన నించో పెట్టేసా తను మాత్రం మా తోడి కోడలు సరసన నించున్నాడు ఎంచక్కా hah... పైగా ఎప్పుడు మాట్లాడినా ..చెప్తే వినదు వదినా ...ఎప్పుడు చూడు పని,పని కాసేపు రెస్ట్ తీసుకోదు అని నాకే కంప్లైంట్ చేస్తాడు వాళ్ళావిడ మీద ...అప్పుడు ఒక క్లోజప్ నవ్వు నవ్వేస్తాను..కాని దాని వెనుకాతల గత చరిత్ర తవ్వకాలు అమోఘం గా జరుగుతున్నాయన్న విషయం పాపం తనకి తెలియదు ...jelir కాబట్టి కామ్రేడ్స్ అంటే అమ్మాయిల్లారా... మీరు బ్లాగుల్లోనో ,మరొక చోటో కొంతమంది సోది సుబ్బయ్యలు ఆడవాళ్ళ మీద అనేకానేక పైన చెప్పినటువంటి సోది కబుర్లు చెప్తుంటే ఊరికే ఆవేశం తెచ్చేసుకుని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి ..నాకులా హి హి హి gelakgulingఅని నవ్వుకుని వెళ్ళిపొండి ...అది సంగతి senyum