22, అక్టోబర్ 2010, శుక్రవారం

సింగపూర్

నేను ఒక పేద్ద పోస్ట్ రాసి ప్రచురిద్దాం అనుకుని..ఫొటోస్ సరి చేసుంటే ఏమొచ్చి ఏడ్చిందో మొత్తం పోస్ట్ ఎగిరిపోయింది...కనీసం ఆ రాసినదానిని సేవ్ కూడా చేయలేదు ..తార గారు బెండప్పరావుల దిష్ఠే దీనికి కారణమని నేను ప్రఘాడం గా నమ్ముతున్నాను..ఇంక నావల్ల కాదమ్మా ..ఏదో గుర్తున్నవరకూ అలా రాసేసి ప్రచురించేస్తున్నా.. పోస్ట్ నచ్చకపోతే మొత్తం తిట్లన్నీ వాళ్ళకే చెందుతాయి ...


చాలా రోజులు మరి సింగపూర్లో ఉన్నాను కదా..మరి మా ఊరి గురించి గొప్పలు చెప్పుకోవాలి కదా..ఇంకా ఎవరన్నా వస్తే వాళ్ళకు ఏమేమి ఉన్నాయో తెలియాలి కదా అందుకే అన్నమాట ఈ పోస్ట్..

నిజంగా నిజం చెప్పాలంటే మిగిలిన దేశాలతో పోలిస్తే సింగపూర్ లో చూడటానికంటూ ఏం ఉండవు.. అంటే నాలాంటి ఎర్ర బస్సులకు బాగానే ఉంటుంది గాని కొద్దిగా ప్రపంచం చూసిన వాళ్ళకు అంటే కాస్త సిటీల్లో ఉన్నవాళ్ళకు కొద్దిగా మాములుగానే ఉంటుంది..
కాకపోతే ఈ దేశం లో ఒకసారి బ్రతుకు తెరువుకి అడుగుపెట్టిన వాళ్ళకు ఇంకే దేశానికి వెళ్ళబుద్ది వేయదు..ఎందుకో ఇంకెప్పుడన్నా చెప్పు కుందాం..






















ఇక్కడ కు వచ్చిన వాళ్ళు వెళ్ళేవాటిలో ముఖ్య మైనది బర్డ్స్ పార్క్ ...కొన్ని వందల ఎకరాల్లొ నిర్మిత మైన ఈ పార్క్ కు వెళితే తప్పని సరిగా ఒక రోజు పట్టేస్తుంది ..ఎక్కడ పడితే అక్కడ మంచినీటి సదుపాయం..ఏసి షెల్టర్లు ,మేప్లు ,ట్రాంలు తో చూడటానికి బాగుంటుంది.. వీళ్ళకు వాటర్ ఫాల్స్ అంటే ఏమిటో తెలియదు కాబట్టి ఒక కృత్రిమమైన జలపాతం ఒకటి నిర్మించారు ఇక్కడ.. ప్రపంచం లో అతి చిన్న పక్షులైన హమ్మింగ్ బర్డ్స్ ని చూడటం నాకు చాలా ఇష్టం.. ఇంకా ఫ్లెమింగోస్ ,హంసలు అదేలెద్దురూ మొత్తం అన్ని రకాలు ఉంటాయి ..ఇంకా ఒక చోట అయితే మన చేతిలో ఏదో ప్లేట్ తో ద్రవం ఇస్తే(అదేంటో నాకు తెలియదు) బోలేడు చిలుకలు మీద వాలి తాగుతాయి..అది కూడా బాగుంటుంది మిస్ అవ్వకండి ..



















జూ : ఇది పర్వాలేదు బాగానే ఉంటుంది..కాని మా ఆయన ఏడ్చినట్లు ఉంది మన ఇండియాలో ఇంతకన్నా ఎక్కువ రకాలు ఉంటాయి అన్నారు..ఎంతవరకు నిజమో నాకు తెలియదు.. ఇది కూడా సౌకర్యాల విషయం లో చాలా చక్కగా ఉంటుంది..పోలార్ బేర్ ని మొదటి సారి ఇక్కడే చూసాను ..కాకపోతే నైట్ సఫారి అని దీనికి అనుసంధానం గా ఒకటి పెట్టాడు..సుత్తిగాడు ..ఏమి ఉండవు అందులో .. డబ్బులన్నీ వేస్ట్ ..పగలు మనం జూ లో చూసింది..రాత్రి ట్రాం లో తిప్పుతాడు ..కాకపోతే వెన్నెల్లో జంతువులు చూడటం అదో థ్రిల్ ..అంటే సగం జంతువులు ఎంచక్కా బజ్జుంటాయి అనుకోండి అది వేరే విషయం ..
























సైన్స్ సెంటర్: పిల్లలతో వెళ్ళడానికి ఇది బాగుంటుంది..చాలా చాలా సైన్స్ విషయాలు ఉంటాయి..మనకవేమి అర్ధం కావు కాబట్టి అక్కడే ఉన్న రోబోట్ దగ్గర తచ్చాడుతుంటాను అన్నమాట..అది ఎంచక్కా మనతో మాట్లాడుతుంది..పాడమంటే పాడుతుంది ..అబ్బో సూపరు ..నాకు నచ్చింది..దీని లో చిన్న వాటర్ వర్ల్డ్ ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ డ్రెస్స్ లు తీసుకు వెళితే ఇంకా ఎంజాయ్ చేయచ్చు ..దాని ప్రక్కనే స్నో సిటి ఉంటుంది.. పిల్లలతో బాగా ఎంజాయ్ చెయ్యచ్చు..నాకులాంటి వాళ్ళను తీసుకు వెళ్ళకపోవడం మంచిది.. నేను అయిదు నిమిషాలు ఉండి నాకు ఊపిరి ఆడట్లేదు బాబోయ్ అని బయటకు పారిపోయాను :)
























ఆర్చాడ్ గార్డెన్ : ఈ ఆర్చిడ్ పువ్వులు సింగపూర్ నేష్నల్ ఫ్లవర్స్ అన్నమాట..ఈ పూవులంటే నాకు భలే ఇష్టం ఎందుకంటే ఇవి దేవుడికి పెడతామా వారం రోజులవరకూ అసలు వాడవు అలాగే ఉంటాయి..వాజ్ లో పెడితే చాలానాళ్ళు తాజాగా ఉంటాయి ..ఈ గార్డెన్లో దాదాపు 10,000 రకాల ఆర్చిడ్ పూవులు ఉంటాయి అంట .. ఏమో మరి నేను కౌంట్ చేయలేదు గాని అన్ని ఉండవనుకుంటా... నాకు తెలియదమ్మా నేను లెక్కపెట్టలేదు..పాపం పుణ్యం దేవుడికే తెలియాలి.. కాని బాగుంటుంది చూడటానికి..







ఇంకా పాసిరిస్ దగ్గర డౌంటౌన్ ఈస్ట్ లో థీం పార్క్,వైల్డ్ వైల్డ్ వెట్ వాటెర్ పార్క్ సూపర్ ఉంటాయి ...అంటే థీం పార్క్లో బోలెడు రైడ్స్ ఉంటాయి అది మీకు తెలియనిదేముంది.. అయితే వాటెర్ వర్ల్డ్ లో సునామి వేవ్స్,ఫ్లోటింగ్ రివర్ గట్రాలు ఉంటాయి ..బాగుంటుంది..కాని బోలెడ్ డబ్బులు (16$)తీసుకుంటాడు దాని కంటే సేం అలాగే ఉంటుంది చైనీస్ గార్డెన్ దగ్గర స్విమ్మింగ్ పూల్ లో 2$ కే సూపరు.. నా మాటవిని అక్కడకి వెళ్ళండి ..బోలెడు ఆదా..






ఇవి కాకుండా చుట్టు ప్రక్కల దీవులు కొన్ని ఉన్నాయి కుసు ఐలాండ్ ,పులావన్ బీచ్ ,సంతోసా ... కుసు,పులావన్ బీచ్లు ఏదో సరదాకి తప్ప అక్కడ ఏమి ఉండవు..అంటే బోట్ లో వెళ్ళడానికి,సైకిలింగ్ కి ,చిన్న చిన్న పార్టీలకు బాగుంటుంది ...కాని సంతోసా ముఖ్యమైనది దాని గురించి ఇంకో పోస్ట్లో రాస్తాను ...























ఇక సిటీ చూడాలంటే రేఫిల్స్ ప్లేస్,టాంజుంగ్ పాగార్,సిటిహాల్ ఇవన్నమాట..అక్కడికి వెళితే సింగపూర్ అంటే ఏమిటో తెలుస్తుంది :)