అమ్మాయిలూ ఒక్క నిమిషం ఆగండి అమ్మా

!!!!! ... ఓయ్ ,ముందే చెప్పానా అమ్మాయిలకు మాత్రమే అని మీరెందుకు చదువుతున్నారు...ఆయ్ ..వెళ్ళిపొండి మర్యాదగా ..

. ఆ అమ్మాయిలూ మనం విషయంలోకి వచ్చేద్దాం ..

నాకొక తమ్ముడు ఉన్నాడు (పెద్దమ్మ క్కొడుకు )... వాడి గురించి మరిన్ని వివరాలకు
ఈ క్రికెట్ ఎవరు కనిపెట్టారో గాని అనే పోస్ట్ చదవండి.. వాడికి అమ్మాయిలంటే అస్సలు పడదు..

వాడికి నచ్చని అమ్మాయిలను క్యూ లో నిన్చోపెడితే అందులో ప్రధమ వరుసలో మొదటి ప్లేసులో నేనే ఉంటాను...అంత ప్రేమ నేనంటే వాడికి.

.వాడెంత స్త్రీ ద్వేషి అంటే నీరసం తో కాలు చెయ్యి కదపలేని ఆడవాళ్ళు సైతం వాడి మాటలు వింటే శివాలెత్తి శివతాండవం చేసేస్తారు..మచ్చుక్కి కొన్ని ఆణిముత్యాలు ...
బ్రహ్మ్మదేవుడు అంటా అమ్మాయిని, అబ్బాయిని సృష్టించి ...అబ్బాయిలకు మాత్రమే వినిపించేలా ...ఒరేయ్ ..ఈ ఆడవాళ్లున్నారే ...మహా పొగరుబోతులు .. మీరు సమానత్వం ,సొరకాయ కూర అని ప్రక్కనే ప్లేస్ ఇచ్చారనుకో మీ బ్రతుకు ఇత్తడి పెనంలో వేపిన మెత్తని పకోడియే... కాబట్టి వీళ్ళను కాలి క్రింద మాత్రమే పెట్టండి ... అని ఉపదేశించాడంట... సరే అని చాలానాళ్ళు వంటగది లోపలే పిల్లుల్లా కట్టి పడేసి ప్రశాంతం గా ఉన్నారంట మగవాళ్ళు..కొద్ది రోజులకి మగవాళ్ళకు జాలి కలిగిందంట ..పోనీలే పాపం అని ,దీనంగా చూస్తున్న ఆడవాళ్ళకు ప్రక్కనే ప్లేస్ ఇచ్చారంట కూర్చోమని... అయితే ఆడవాళ్ళు ప్రక్కన తిన్నంగా కూర్చోలేక నెత్తి మీదకు ఎక్కడానికి ట్రై చేయడం మొదలు పెట్టారంట...మాకు గాని మండిదిఅనుకో ఒక్క సారి తల విదిలిస్తాం ...సరిగ్గా సరా సరి నేల మీద పడతారు...ఒక్క అడుగేసాం అనుకో ఏకంగా పాతాళం లోనికే అనేవాడు.. ఎందుకైనా మంచిది ఒక సారి బి.పి చెక్ చేసుకోండమ్మా ....

అదొక్కటేనా... అసలు కట్నం తీసుకుంటే తప్పేంటి ..తేరగా మేము తెచ్చింది తినడం లేదా.. వరకట్నం నిషేదించాలి అని ఎవరన్నా అన్నారనుకో ఫేడెల్,ఫెడేల్ అని నాలుగు పీకాలి మళ్లీ నోరెత్తరు....నాకు గాని పెళ్లి అయ్యిందనుకో దాని బ్రతుకు నా కాలి దగ్గరే .... ప్రొద్దున్న నా షూ తుడుస్తూ మొదలయ్యే దాని జీవితం,రాత్రి నా కాళ్ళు పడుతూ ముగియాలి.. లక్ష్మణుడు వదిన కాళ్ళు తప్ప మొహం చూడనట్లు అది నా కాళ్ళు,వాటి గోళ్ళు తప్ప ఇంకేం చూడకూడదు ....
అబ్బో ఇలాంటివి ఒకటా ,రెండా ...ఇంతకు మించి మీ ఆరోగ్యం పాడు చెయ్యడం నాకిష్టం లేదు అనుకోండి ...

అలా వాడితో రోజుకొక గొడవేసుకుని ,వాధించి,చాలా సార్లు కుళ్ళుకుని ఏడ్చి ...ఒరే
య్ నేనూ చూస్తానురా ..నీకు పెళ్ళయ్యాకా నీ బ్రతుకు వంటగదే .... నిన్ను బాగా చితక్కొట్టే పెళ్ళాం రావాలి ....నీలా కబుర్లు చెప్పి పెళ్ళాం వెనుక తిరిగేవాళ్ళను ఎంతమందిని చూడలేదు దొంగ వెధవ అని బోలెడు తిట్లు తిట్టేసేదాన్ని...

అయితే పైకి అలా తిట్టేదాన్ని కాని నాకు బోలెడు అంత భయం ఉండేది.. ఈ దొంగ మొహం గాడు ఇలాంటి ఎక్కువ, తక్కువ పనులు చేసి ఏం మీదకు తెచ్చుకుంటాడో అని

... దేవుడా దేవుడా వీడి బుద్ది మారేలా చూడవా అని తెగ దణ్ణం పెట్టేసుకునేదాన్ని

ఈ లోపల నాకు పెళ్లి అయిపోవడం నేను మా ఆయనతో మా వూరికి చెక్కేయడం జరిగి పోయాయి ...
వాడికి నాకు 25 రోజులే తేడా ... అందుకని అప్పుడప్పు
డు ఇంటి
కి ఫోన్ చేసినప్పుడల్లా అమ్మని వాడి పెళ్లి గురించి అడిగేదాన్ని...

చూస్తున్నారమ్మా పెద్దమ్మా
వాళ్ళు ...వాడికే పిల్లేవరూ నచ్చడం లేదు అనేది... ఆ తరువాత మా ఆఖరు చెల్లి పెళ్ళప్పుడు ఇండియా వెళ్ళినపుడు అడిగాను.. ఒరే మనిద్దరికీ ఒకటే వయసురా..

నాకప్పుడే ఇద్దరు పిల్లలు పుట్టేసారు ...అక్కడికి నేను ఆంటీని ,నువ్వు బాలాకుమారుడివి అవ్వడం నాకు నచ్చలేదు ...ముప్పై దాటాయో ఇక నీకు పిల్లనివ్వడు ఎవ్వరూ అని బెదిరించి వచ్చేసా...

ఆ తరువాత ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తే అక్క మాట్లాడింది.. ఏంటే అంత కంగారుగా మాట్లాడుతున్నావ్ అంటే ...బుజ్జి ,మనోడు ఇలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేసాడు అంది మెల్లగా.. దెబ్బకి నాకు నోట మాట రాలేదు..

మా ఇంట్లో సంగతి నాకు బాగా తెలుసు.. నేను మా ఆయనతో తాంబూలాలు అయ్యాక ఫోన్ లో మాట్లాడితేనే అదేదో నేరం, ఘోరం జరిగిపోయినట్లు చూసేవారు

అలాంటిది ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేయడమే అనుకుని ...పెద్దమ్మ పెదనాన్న ఎలా ఉన్నా
రు అన్నా
ను కంగారుగా ... పర్వాలేదు వారం రోజులు మంచం ఎక్కేసింది పెద్దమ్మ.. ఆ అమ్మాయికి వెనుక
ముందు ఎవరూ సరిగ్గాలేరు..కట్టు బట్టలతో తీసుకోచ్చేసాడు..మన కులం కూడా కాదు ... దానితో బెంగ పెట్టేసుకుంది... కాస్త నేమ్మదిన్చాక మాట్లాడుతాలే అంది..
అక్కడి పరిస్తితి కాస్త ఆందోళనగా అనిపించినా మా ఆయన దగ్గర మాత్రం డభాయించేసా ఎక్కడా ఒక్కమాట అననివ్వకుండా ... చూసారా ...మా తమ్ముడు ఎంత మంచిపని చేసాడో.. ఇంట్లో వాళ్ళను బాధ పెట్టినా ఒక అమ్మాయిని మోసం చేయకుండా ,కట్నం ఆశించకుండా ,కులగోత్రాలు పట్టించుకోకుండా ఎంత ధైర్యంగా పెళ్లి చేసుకున్నాడో.. మగాడంటే వాడండి అని,అదని ,ఇదని ..అబ్బో.. మా ఆయనుకు వారం రోజులు పండగే....

ఆ తరువాత కాస్త వీలు చూసుకుని వాడికి ఫోన్ చేసాను ...
ఏంట్రా ఏదో ఘన కార్యం చేసావంటా..

హీరో అన్నాకా ఇలాంటి ఘనకార్యాలు,సాహసాలు మామూలే కదా ...
ఆహా..ఇంతకీ ఎవరు ఎవరిని ప్రేమించారంటా

ముందు తను ప్రేమించింది తరువాత నేను ప్రేమించ వలసి వచ్చింది (బ్రహ్మా
నందం లా అనుకరిస్తూ)
అబ్బ ఛా.... ఎన్నాళ్ళ నుండి ప్రేమించాబడ్డావేంటి ?

ఒక పదేళ్ళ నుండి.. (నేను కూడికలు,తీసివేతలు,బాగాహారాలు గుర్తు తెచ్చుకుని లెక్కించి )అంటే మనం డిగ్రీ చదువుతున్నప్పటినుండి .

.. హార్నీ... నాకు చెప్పనే లేదురా

అసలు ప్రేమించాకా ముందు వేసుకున్న ఒట్టే నీకు ఎంత మాత్రం తెలియకూడదని...
ఏడ్చావులే గాని ...ఇంతకూ ఇన్నాళ్ళు ఎందుకు ఆగవలసి వచ్చిం
దిరా?ఎంచక్కా జాబ్ లో చేరగానే పెళ్లి చేసుకొంటే సరిపోయేదిగా ... అటు ఆ ఆమ్మాయికి అడ్డుచెప్పేవారు లేరు అంటున్నావుగా ...ఆ చేసే ఘనకార్యం ఏదో అప్పుడే చేస్తే ఈ పాటికి ఎంచక్కా పిల్లలు కూడా పుట్టేసేవారు కదరా (నా బాధ నాది)..

ఏంటి అప్పుడే చేసుకునేది కొత్తిమీర కట్ట.. చిన్నాన్న మీ ఇ
ద్దరికీ 18 నిండగానే పెళ్లి చేసేసారు..వాళ్ళిద్దరికీ కూడా అలాగే చేసేస్తారు అనుకున్నాను(మా చెల్లెళ్లకి) ...మిగితా చిన్నాన్న పిల్లలకు పెళ్లి చేసేసారు గాని వీళ్ళకు మాత్రం చేయలేదు..మా పెళ్ళిళ్ళతో నీకేంటిరా సంబంధం అని అనచ్చు
నువ్వు..ఒకే ఇంట్లో పుట్టాం.. రేపు వాళ్ళ పెళ్లి మాటలప్పుడు వీళ్ళింట్లో అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళు ఎలాంటి వాళ్ళో అని అంటే నాకే కదా బాధ ...పోనీలే మిగితా చిన్నాన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి.. వీళ్ళ పెళ్లిళ్ళు ఎప్పుడవుతాయా ...జంప్ అందామనుకున్నా ... మొన్నటితో కుదిరింది...
(
నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. ఈ రోజుల్లో సొంత వాళ్ళ గురించే ఆలోచించడం లేదు మరి..) అరే.. మరి పెళ్లి చేసు
కున్నపుడు పె
ద్దమ్మ ,పెదనాన్న గుర్తు రాలేదా ?
అదేం అడుగుతావ్..నువ్వు నమ్మవు బుజ్జి ..నరకం అనుభవించాను.. వీళ్ళా ఎట్టి పరిస్తితుల్లో పెళ్ళికి ఒప్పుకోరు ...బెదిరించో,బ్రతిమాలో నన్ను కట్టేస్తారు.. చెప్పకుండా చేసుకుంటే బెంగ పెట్టేసుకుంటారు.. అందులోను ఎక్కడ ఎవరు లేచిపోయి పెళ్లి చేసుకున్నా.....ఇంట్లో ముందు ముచ్చట్లు పెట్టేసి, తెగ తిట్టి పడేసేది అమ్మ ...రేపు నేను ఇదే పని చేస్తే వీళ్ళ అందరిదగ్గర చులకన అయిపోతుంది అని మా గొప్ప భయం గా ఉండేది.. నెమ్మదిగా మా ఆవిడకే చెప్పాను ..మనవల్ల వాళ్ళు బాధ పడతారు కాబట్టి పెళ్ళయ్యా
కా మా అమ్మ తిట్టినా ,కొట్టినా వాళ్ళ చుట్టే తిరిగి ఎలాగో మంచి చేసుకుందాం.. అని
సరేలే గా
ని ఫోన్ మీ ఆవిడకు ఇవ్వు మాట్లాడుతా

...
ఎందుకు ? ఆ అమ్మాయిది ఏం తప్పులేదు బుజ్జి..చాలా మంచిది
తెలుసా..
అంత మంచి అమ్మాయి దొరకడం నా అదృష్టం ...
అవునా.. సరేలే ఆ విషయం ఆమెనే అడిగి తెలుసుకుంటా ..నువ్వు ఇవ్వు..
ఇదిగో ఇప్పుడే చెప్తున్నా..తన తప్పేం లేదు.. నేనే తనను ప్రపోజ్ చేశా..బోడి కట్నం ఎవడికి కావాలి బుజ్జి.. అర్ధం చేసుకునే అమ్మాయి దొరకడం ముఖ్యం గాని ..
ఒరేయ్ నాయనా ..నేనేం ఆ పిల్లను అనను గాని కాసేపు మాట్లాడుతాను అంతే.. (పాపం వాడికి నా మీద నమ్మకం ఎక్కువ) అలా బోలెడంత అపనమ్మకంతో అయిదే అయిదు నిమిషాలు మాట్లాడించి పెట్టేసాడు..
ఈ సంఘటన అలా ప్రక్కన పెట్టి మరొకటి చూద్దాం.. నా పెళ్ళయిన క్రొత్తలో మా మరిదిగారు ఇంత కంటే ఎక్కువ అన్నమాట.. పెళ్లి అనే పదం వినగానే సల సలా కాగే సీసం రెండు చెవుల్లో పోసేసినట్లు రెం
డు చెవులు మూసేసుకుని తెగ బాధతో మెలికలు తిరిగిపోయే వారు

... మా అత్త గారు
ఎప్పుడన్నా అరేయ్ ..ఫలానా పెళ్ళిళ్ళ పేరయ్య ఫలానా సంబంధం ఉంది అన్నారురా అనగానే ... సాగర సంగమం లో కమలహాసన్ లా వివిధ నృత్య రీతుల్లో వివిధ భంగిమలు పెడుతూ తకధిమి తై..తకధిమి తై ...తళాంగు తకధిమి తై అని ఎగిరి గెంతేసేవాడు...
అక్కడితో ఊరుకోకుండా మా ఇద్దరికీ రోజుకో క్లాసు ... అసలు పెళ్లి అంటే ఏంటి.. ఒక కమిట్మెంట్ ... పెళ్ళాం,పిల్లలు ,బాద్యతలు తొక్కా తోలు అన్నీని...నాకిష్టం ఉండదు వదిన ... అసలు మన దేశం ఇలా వెనకబడిపోవడానికి కారణం ఈ పెళ్ళే.

. సంసారాల చట్రాల్లో ఇరుక్కుపోయి లంచాలు తీసుకుని.. తర తరాలకు సరిపడేంత డబ్బును మంచాల క్రింద ,బీరువాల లోపల దాచేసి మన కోసం మనం కాక మనకు తెలియని ముందుతరాల కోసం బ్రతికేలా చేస్తుంది ఈ పెళ్లి.. లేక పోతే పిడికెడంత లేని పాకిస్తాన్ ని కాశ్మీర్ విషయం లో ఎదురించలేని అసహాయత మన భారతదేశం ఎందుకు ఎదురుకుంటుంది..మన ఆర్ధిక వెనుకబాటు తనం కాదా

ఇలా పెళ్లి పేరు చెప్పి పేపర్ లో న్యూస్ అంతా వినిపించేసి తెగ బాధ పడిపోయేవాడు..
అలా మా మరిది మాటలు వినేసి,నమ్మేసి ఆ ఫళం గా తనని ఒక అబ్దుల్ కలాం ,ఒక అతుల్ బిహారీ వాజ్ పాయ్,మరి ఒక మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళ సరసన నించో పెట్టేసా తను మాత్రం మా తోడి కోడలు సరసన నించున్నాడు ఎంచక్కా

... పైగా ఎప్పుడు మాట్లాడినా ..చెప్తే వినదు వదినా ...ఎప్పుడు చూడు పని,పని కాసేపు రెస్ట్ తీసుకోదు అని నాకే కంప్లైంట్ చేస్తాడు వాళ్ళావిడ మీద ...అప్పుడు ఒక క్లోజప్ నవ్వు నవ్వేస్తాను..కాని దాని వెనుకాతల గత చరిత్ర తవ్వకాలు అమోఘం గా జరుగుతున్నాయన్న విషయం పాపం తనకి తెలియదు ...

కాబట్టి కామ్రేడ్స్ అంటే అమ్మాయిల్లారా... మీరు బ్లాగుల్లోనో ,మరొక చోటో కొంతమంది సోది సుబ్బయ్యలు ఆడవాళ్ళ మీద అనేకానేక పైన చెప్పినటువంటి సోది కబుర్లు చెప్తుంటే ఊరికే ఆవేశం తెచ్చేసుకుని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి ..నాకులా హి హి హి

అని నవ్వుకుని వెళ్ళిపొండి ...అది సంగతి