2, ఆగస్టు 2010, సోమవారం

గురువులను పూజింపుము ..పెళ్లి చేసుకోకుము

నాకు చిన్నప్పటి నుండి "చదువురానివాడివని దిగులు చెందకు" అనే పాటన్నా,"చదువుకున్న వాడికంటే మడేలన్న మిన్న"అనే సామెతలన్నా చాలా ఇష్టం.. ఎందుకంటే చదువు కోకపోయినా పర్లేదని అన్నారు కదా ( వాళ్ళు ఏ ఉద్దేశంతో అలా అన్నా నేను మాత్రం అలాగే అనేసుకుంటా) ... నాకు చదువుకోవడమంటే మహా బద్దకం ..అసలునేను డిగ్రీవరకు ఒక్కసారి కూడా పరీక్ష తప్పకుండా పాస్ అయ్యాను అంటే దానికి కారణం మళ్ళీ ఎక్కడ సెప్టెంబర్ కి కట్టాల్సి వస్తుందో అని.. అలాంటి నేను పెళ్ళి చేసుకుంటే చదువు చెప్పే 'టీచర్ని' తప్ప ఇంకెవరిని చేసుకోకూడదు అని కఠోరమైన నిర్ణయానికి వచ్చేసాను ఓ రోజు ..

అలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడానికి కారణం మా లెక్చరర్ 'శేషగిరి రావు'గారు ... నాకు తెలుసు మీరు మనసులో ఏమనుకుంటున్నారో..ఛీ ఛీ కళ్ళుపోతాయి లెంపలేసుకోండి.. ఆయన నాకు తండ్రి లాంటివారు... ఆ సార్ అంటే నాకే కాదు మా క్లాస్ వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట.. పాఠం ఎలాగూ చక్కగా చెప్పేవారు అనుకోండి అంతకంటే మధ్య మధ్య లో ఆయన చెప్పే కబుర్లు నాకు చాలా నచ్చేసేవి..అలాంటి కబుర్లలో ఒకటి ..

ఒకసారి మా సారు ఎక్కడికో నడుచుకుంటూ వెళుతుంటే దారిలో ఆయన ప్రక్కనే ఒక కారు ఆగిందంట.. మా సార్ ప్రక్కకు తప్పుకుని వెళ్ళేంతలో ఆ కార్లో నుండి ఒక అబ్బాయి క్రిందకు దిగి సార్ , రండి సార్ ఎక్కడకు వెళ్ళాలి నేను తీసుకు వెళతాను అన్నాడంట.. మా సార్ కళ్ళ జోడు సవరించుకుని ,ఎవరు బాబు నువ్వు ?అనగానే ,నేను ఫలానా ,ఫలనా టైములో మీ స్టూడెంట్ని సార్..మీలాంటి వారి దయవల్ల ఇప్పుడు కలెక్టర్ని అయ్యాను..ఇదంతా మీ ఆశ్వీర్వాద ఫలితమే అన్నాడంటా ఎంతో గౌరవంగా ..వెంటనే మా సార్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు.. నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా కాని అంతటి ఉద్వేగ భరితమైన సంఘటనని మా సార్ మా గొప్పగా వర్ణించారు .. పైగా పిల్లలు ప్రయోజకులు అయితే తండ్రి ఎంత ఆనందపడతాడో గురువులు అంతకంటే ఎక్కువ సంతోషిస్తారు ..అని పే..ద్ద డవిలాగు చెప్పేసరికి నేను అలా డ్రీంస్ లోకి వెళ్ళి మా సార్ ప్లేస్లో నన్ను ఊహించుకోడానికి ప్రయత్నించాను కాని ..అబ్బే ..నాకొకటి చదవడం చేతకాదుగాని పక్కోళ్ళకు ఏం చెప్తాంలే ..కాబట్టి ఎంచక్కా ఒక 'సార్ 'ని చేసుకుంటే కనీసం మా ఆయన అయినా ఇలా స్టూడెంట్స్ చేత పొగిడించుకుంటే చూసి ఆనందించేద్దాం అని నిర్ణయించేసుకున్నా....

నా సంగతి తెలిసిందే కదా ..కొన్నాళ్ళు డ్రీంస్ వేసి మర్చిపోయిన ఆ విషయాన్ని.. పెళ్ళయిన కొత్తలో ఒక శుభ ముహూర్తాన మావారు మళ్ళీ గుర్తు చేసారు ..విషయమేమిటంటే మావారు, వారి ఫ్రెండ్ కలసి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు.. అందులో నా పతిదేవులు సాయంత్రాలు క్లాసులు చెప్తారు.. ఆ మాట వినగానే నేను ఒక్కసారిగా ఎగిరి గెంతేసాను ...ఏమండీ మీరు నిజం గా సారా??..పిల్లలకు నిజంగా పాఠాలు చెప్తారా??.. మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారా?అభిమానిస్తారా? లాంటి ప్రశ్నలు చక చకా అడిగేసాను...రేపు తీసుకు వెళతాను కదా ..నువ్వే చూద్దువు..అన్నట్లు మర్చిపోయాను.. 'సార్ 'పెళ్ళాం అంటే 'సార్' పెళ్ళాం లా ఉండాలి.. అక్కడ ఇంటిలోలాగే గంతులు,గారాలు వేయకూడదు..హుందాగా ఉండాలి అర్ధం అయ్యిందా అన్నారు.. మీరు మరీనూ ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి అని ముద్దుగా విసుక్కుని ఆ రాత్రంతా మావారిని బోలెడు అంత ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను..

ప్రొద్దున్నే బకెట్టుడు గెంజి లో నానబెట్టి ఉతికి ఇస్త్రీ చేసిన కాటన్ చీరను కట్టుకుని ,మాములు కంటే కొంచెం పెద్ద బొట్టు పెట్టుకుని నీట్ గా రెడీ అయిపోయా..ఇన్స్టిట్యూట్ రాగానే నలుగురు అబ్బాయిలు బిల బిల మంటూ మావారిని చుట్టుముట్టేసారు.. సరిగ్గా అదే అదే నాకు కావలసింది..వాళ్ళు సార్ ,సార్ అంటూ ఈయన వెనుక వెనుకనే తిరుగుతుంటే నేను గంభీరంగా ఆనంద పడిపోతూ వాళ్ళ వెనుకనే నడిచా ... ఈ లోపల అటు వెళుతున్న ఒక అమ్మాయిని పిలిచి నన్ను మేడ మీదకు తీసుకు వెళ్ళమని చెప్పి,ఇప్పుడే వస్తా లోపల కూర్చో అని వెళ్ళిపోయారు ఆయన..

ఒక రెండు గదులలో వరుసగా బోలెడు కంప్యూటర్స్ ,నాలుగైదు గదుల్లో బోలెడు మంది విధ్యార్ధులు తో కళ,కళ లాడుతుంది ..ఆఫీస్ రూం లో కూర్చో బెట్టి ఆ అమ్మాయి (పేరు శ్రీదేవో ..భూదేవో ఏదో చెప్పిందమ్మా మర్చిపోయా)నన్ను ఎంతో ఆరాధనగా చూస్తూ మేడం..మీరు సార్ వైఫా ... అసలు శుభలేఖ కూడా ఇవ్వలేదు చూసారు సార్ అంది కొంచెం కోపంగా.. నాకు బోలెడు ఆనందం వేసేసింది నన్ను" మేడం "అని పిలిచేసరికి.. నేను హుందాగా చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నా... అంతే మొదలు పెట్టింది.. మేడం మీరేమేమి సబ్జెక్ట్లు నేర్చుకున్నారు? .. ORACLE కి క్రొత్త మేడం వస్తారు అని చెప్పారు..అది మీరేనా? మేడం మేడం నాకు C++ లో చాలా డవుట్స్ ఉన్నాయి .. నాకు చెప్పరూ... అంటూ ఒకటే గారాలు... నాకు గొంతు తడారిపోయింది ..ఓర్నాయనో ఇది నన్ను చాలా పెద్ద లెవెల్ లో ఊహించుకుంటున్నట్లు ఉంది .. ఇప్పుడుగాని నాకేమి తెలియదు అని తెలిసిందో అసహ్యంగా ఉంటుంది అనేసుకుని మంచి నీళ్ళు ఎక్కడుంటాయి అన్నాను చిన్నగా దగ్గి .. రండి మేడం అని నన్ను ఇంకో రూంలో తీసుకు వెళ్ళింది..అక్కడా వదలదే... ఓరి భగవతుడోయ్ ఎలారా దేవుడా అని అనుకునేంతలో మావారు వచ్చారు ..ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.. హమ్మయ్యా.. 'మేడం 'గా పిలిపించుకోవడం కష్టమే సుమా అనుకున్నా ..

మావారు తన అనుచరగణం తో అక్కడున్న ఒక కంప్యూటర్ ఆన్ చేసి ఏంటో, ఏంటో చెప్తున్నారు..మిగిలిన పిల్లలు శ్రద్దగా ఏవో అడుగుతున్నారు.. అప్పటివరకు కంప్యూటర్ గురించి వినడం తప్పా చూడలేదు నేను.. ఈయన ఇక్కడ మౌస్ కదుపుతుంటే అక్కడ పోయింటర్ అలోఒకగా కదులుతుంది.. విండోస్ ని ఓపెన్ చేసి ,క్లోజ్ చేస్తుంటే నాకు అంతా క్రొత్తగా అనిపించింది అప్పట్లో ...పైగా మరొక కంప్యూటర్ లో బ్లాక్ స్క్రీన్ మీద ఏంటో ,ఏంటో లైన్లు పైకి స్క్రోల్ అయిపోతుంటే మా వారు కీ బోర్డ్ టక టకలాడిస్తూ వాళ్ళకు ఏదేదో చెప్పేస్తున్నారు... నాకా సన్నివేశం కన్నుల పండుగగా అనిపించి మురిసిపోతుంటే... వచ్చారు మావారి ఫ్రెండ్ తన క్లాస్ ముగించుకుని ..

వెంటనే మా శ్రీవారు .. ఆ..వచ్చావా ..నీకు చెప్పేను కదా ఈ రోజు తీసుకు వస్తానని ...ఏలా చెప్తావో తెలియదు 3 నెలలలో తను క్లాస్ చెప్పే రేంజ్లో నేర్చేసుకోవాలి అన్నారు నన్ను చూపిస్తూ ...నేనుఅయోమయం గా మావారిని, అతనిని మార్చి మార్చి చూస్తుంటే ..మరీ 3 నెలలలో నేర్చుకోగలదా 6 నెలల కోర్సులో జాయిన్ చేస్తే సరి ఏమంటావ్ అన్నారు ..పాపం ఆయనకు నన్ను చూడగానే అర్ధం అయిపోయి ఉంటుంది మన గురించి..ఏం అక్కరలేదు ఏం క్లాసులుంటే అందులో కూర్చోపెట్టేయి అదే వస్తుంది అని నా చేతికి ఒక పెన్ను ,పుస్తకం ఇచ్చేసి ఒక క్లాస్ లో తోసేసారు.. అయ్యబాబోయ్ 3 నెలల లో ఇవన్నీ నేర్చేసుకోవాలా..కనీసం ఒక్క ముక్క కూడా చెప్పలేదు నాకు ఇంటిదగ్గర..అందులోను డిగ్రీ ఎక్జాంస్ అప్పుడే రాసి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నా.. మళ్ళీ మొదలా !!!అని ఏడుపు మొహం వేసుకుని కూర్చున్నా..

అంతకు ముందే కంప్యూటర్ని చూసానేమో నాకు భయం తో చమటలు పట్టేసాయి..పైగా సార్ పెళ్ళానికి ఏమీ రాదు అని తెలిస్తే ఎంత అవమానం..అసలెందుకు టీచర్ని చేసుకోవాలనుకున్నానా అని తెగ బాధ పడిపోయా.. క్రొత్తగా జాయిన్ అయ్యారా ఇంతకు ముందు చూడలేదు మిమ్మల్ని అంది ప్రక్కన అమ్మాయి.. ఊ అన్నాను..మరి ఇప్పుడు వచ్చారేం ?ఆల్ రెడీ క్లాస్లు మొదలై 10 రోజులైపోయాయి.. చాలా కష్టం గా ఉంది ఏం అర్ధం కావట్లేదు అంది..నువ్వుండవే బాబు అసలే టెన్షన్లో ఉంటే అనుకుని బాగానే చెప్తారా సార్లు ఇక్కడ అన్నాను..పర్లేదు బాగానే చెప్తారు.. అదేంటో ఈ సార్( మావారి ఫ్రెండ్ ) క్లాస్ మొదలు పెడతారా ఒకటే నిద్ర ముంచుకొచ్చేస్తుంది నాకు .. మేడం ( మావారి ఫ్రెండ్ భార్య ) చాలా బాగా చెప్తారు కాని గంట చెప్పల్సిన క్లాస్ గంటన్నర వదలదు..అబ్బా ఒకటే చిరాకు అనుకో అంది..

ఓ.. మరి ఫలానా సారు ఎలా చెప్తారు ?అన్నాను మావారి గురించి అడుగుతూ ...అంత టెన్షన్లో కూడా దిక్కుమాలిన ఆశక్తి వదల్లేదు నన్ను.. ఛీ..ఛీ అతని గురించి అడక్కు..మహ వళ్ళుమంట నాకు... అమ్మాయిలంటే అస్సలు పడదు ..ఆ ..అనకూడదు ..ఊ అనకూడదు ..ప్రక్కకు చూడకూడదు ... ఇక్కడి కేదో మనం అబ్బాయిలకోసమే వచ్చినట్లు తెగ బాధపడిపోతుంటారు.. మహా అనుమానం మనిషి..ఎవర్తి చేసుకుంటుదో కాని అంతే ఇంక అంది... ఓ..ఎందుకలాగా ???అన్నాను .. ఏమో ..అసలు మా అందరికీ డవుటేమిటంటే అంటుండగా మా వారి ఫ్రెండ్ వచ్చేసారు క్లాస్కి ..( ఇప్పటికీ తెలియదు వాళ్ళ డవుటేమిటో.. ప్లిచ్ )

COBOL అని బోర్డ్ పైన రాసి అతను క్లాస్ మొదలుపెట్టారు.. "కోబాల్ అనేది ఒక డైనోసార్ లాంటిది ...మనం కాసింత ఏమరుపాటుగా ఉన్నామో గబుక్కున మింగేస్తుంది...చిన్న తప్పు చేస్తే పేజీలకు పేజీలు రాసిన ప్రోగ్రాం హుళక్కి..." అదొక్కట్టే నాకు అర్ధం అయ్యింది.. ఆ తరువాత ఆయన ఏం చెపుతున్నాడో ,నేను ఏం వింటున్నానో ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు .. దానికి తోడు నా ప్రక్కనున్నది ఏం మూహుర్తానా అన్నాదో కాని నాకు ఒకటే నిద్ర వచ్చేయడం మొదలైంది..భలవంతంగా కళ్ళు తెరిచి చూస్తున్నా కాని కనురెప్పలు వాలిపోతున్నాయి .. ఎదురుగా బ్లాక్ బోర్డ్ కనబడటం మానేసి అక్కడ చక్కగా ఇస్త్రీ చేసిన దుప్పటి, దిండు తో మంచం కనబడటం మొదలైంది.. మొదటి ఆవలింతను ఆపుకున్నా.. రెండో ఆవలింత గుర్తుంది.. ఆ తరువాత నాకు తెలియదు ఏమైందో... పాపం అప్పటికీ సార్ నా ప్రక్కనే నించుని గుర్రం లా 3 సార్లు సకిలించారట ..అబ్బే మనకు తెలిస్తే కదా...

ఆ రోజు రాత్రి మావారు ఈ రోజు ఏం నేర్చుకున్నావ్ అనగానే మాటమారుస్తూ ..ఏమండీ మీ గురించి ఒక అమ్మాయి ఇలా అంది అని చెప్పాను..ఎవరా అన్నాది ??అన్నారు కోపంగా .. అమ్మో! పేరు చెప్పామంటే అయిపోతుంది ఆ పిల్ల అనుకుని నాకు తెలియదు పేరు ..అయినా మరీ అంత ఇది గా తిట్టి ఎందుకు వాళ్ళను బాధ పెడతారు అన్నాను..తిట్టాలా కొట్టాలా.. మొదట్లో నేనూ బాగానే ఉండేవాడిని.. ఒక అమ్మాయి రోజు ఫోన్ చేసి మరీ విసిగించేది ప్రేమిస్తున్నా..పెళ్ళి చేసుకో ..నువ్వు లేక బ్రతక లేను ..నా పేరున 2 లక్షలు బేంక్ బేలెన్స్ ఉంది అంటూ.. అన్నారు..

నాకలాంటి స్టోరీలు మాంచి ఇంట్రెస్ట్ ఏమో ..మరి అంత ప్రేమిస్తే పాపం చేసుకోలేదేం అన్నాను..మనసులో ఎక్కడో ఆశ.. అయ్యబాబోయ్ నిన్ను మిస్ అయిపోయే వాడిని దాన్ని చేసుకుంటే..అదెక్కడ ,నువ్వెక్కడ అంటారేమో అని.. హూం..నా భ్రమ గాని ఈ మనిషి అంటారా ..ఛీ..ఛీ సార్ ని అయి ఉండి స్టూడెంట్ని లవ్ చేయడమా??..ఇంకేమన్నా ఉందా?..ఇంకే ఆడపిల్ల తల్లిదండ్రులైనా మా దగ్గర జాయిన్ చేస్తారా? అన్నారు ... లేకపోతే చేసుకునేవారన్న మాట అన్నాను ...ఏ మాటకామాట చెప్పుకోవాలి ఆ అమ్మాయి బాగుంటుంది అన్నారు ఉడికిస్తూ ..ఇంతకీ ఏం చెప్పి వదిలించుకున్నారు అన్నాను కోపం కనబడనీయకుండా ...

నాదంతా పాము కరవా కూడదు ..కర్ర ఇరగా కూడదు టైపు.. రోజూ క్లాస్ కి రాగానే ఆ అమ్మాయినే లేపి కష్టమైన ప్రశ్నలన్నీ అడిగేవాడిని... అదెలాగో చెప్పలేదని తెలుసు ...చెడామడా తిట్టి పడేసేవాడిని.. అందులో అబ్బాయిల ఎదురుగా తిట్టేవాడినేమో పాపం నాలుగు రోజులకి సెట్ అయిపోయింది ... అప్పటి నుండి ముందు జాగ్రత్తగా అమ్మాయిలు కాసింత మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఇదే పద్దతి.. అన్నారు.. ఇది మరీ బాగుంది ఎవరో ఒకరు అలా చేసారని అందరినీ ఒక గాటన కట్టేస్తారా అని పైకి అనేసుకున్నా గాని హమ్మయ్యా మా ఆయన రాముడు మంచిబాలుడేనన్నమాట అనేసుకుని తెగ ముచ్చటపడిపోయా..(అదిగో అదిగో అలా నవ్వకూడదు కొన్ని చోట్ల నమ్మాలి మనం )

సరే ఆ రోజంటే అలా మాటదాటేసాగాని రోజూ ఆ క్లాసులను ఎలా తప్పించుకోవాలో అర్ధం అయ్యేది కాదు..అందులోనూ ఆ నిద్రను ఆపుకోవడం అసలయ్యేది కాదు...టాం అండ్ జెర్రీలో జెర్రీలా కనురెప్పల మద్యలో అగ్గిపుల్లలు పెట్టేసుకుంటే బాగుంటుంది అనిపించేసేది...అయినా పద్దతి గా అ ఆ ఇ ఈ లతో మొదలు పెట్టి గుణింతాలు నేర్పాలి గాని ఇలా ఏకంగా వ్యాక్యాలు మొదలెట్టేస్తాను అంటే ఎలాగా ? దానికి తోడు వారానికి ఒకమారు పెట్టే టెస్ట్ లు... ఇంకేమన్నా ఉందా అందులో సున్నా వస్తే??? చిన్నపుడు ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టడానికి వేషాలు వెయ్యలేదు కాని మా ఆయన పుణ్యమా అని అవీ మొదలుపెట్టేసాను..

రేపు టెస్ట్ ఉంది అనగానే రాత్రి నుండే నాకు జ్వరం వచ్చేసింది ...కళ్ళు తిరిగిపోతున్నాయి..అమ్మో బాబోయ్ అని ఒకటే హడావుడి చేసేసి, ప్రొద్దున్నే మా ఆయన వెళ్ళేవరకూ ముసుగు తీసేదాన్ని కాదు..అలా కొన్ని సార్లు చేసాకా ఒక శుభ ముహుర్తాన మావారి ఫ్రెండ్ నా ఎదురుగానే రేపు టెస్ట్ ఉంది కదా ఖచ్చితంగా రేపు మీ ఆవిడకు జ్వరం వస్తుంది అని జోకేసి, పనిలో పనిగా నా నిద్ర గురించి కూడా చెప్పేసి చక్కా వెళ్ళిపోయారు ... అక్కడ మావారు పైకి పెద్దగా పట్టించుకోనట్టుకనిపించేసరికి ,హమ్మయ్యా ఈయనకు అర్ధం అయి ఉండదులే అని ఊపిరి పీల్చుకున్నాను ...

ఆ రాత్రి నిద్ర పోయేముందు ఏదీ నీ నోట్స్ తీసుకురా అన్నారు... ఓరి దేవుడోయ్ అనుకుని నాకు నిద్ర వస్తుందండీ రేపు చూపిస్తా అని ఆవళింత తీసాను.. ముందెళ్ళి నోట్స్చూపించూ అన్నారు సీరియస్సుగా ..ఇంక మన పప్పులు ఉడకవని ఈసురోమంటు తీసుకొచ్చాను.. ఆయన బుక్ అటు ఇటు త్రిప్పి ఏంటీ ఏమీ రాయడం లేదా అన్నారు నా వైపు చూస్తూ... అంటే ..అదీ..మరీ అని నానుస్తుంటే ...ఏంటీ క్లాసులో నిద్రపోతున్నావంటా అన్నారు.. ఉహుహు ఒక్కసారే ...అంటే నిద్రపోలేదు ఆవళించేను అన్నాను... ఇలా కాదుగాని అసలు ఏం నేర్చుకున్నావ్ ఈ నెలలో చెప్పు అన్నారు... COBOL ,Dbase ,BASIC , C++ నేను వెళ్ళే క్లాసుల పేర్లు చెప్పేసా .. నాకు వాటి పేర్లు తప్ప ఇంకేం తెలియదు అసలు...

ఆహా..అయితే కోబాల్ గురించి చెప్పు అన్నారు .. అలా అడిగితే ఏం చెప్పేది నా మొహం ...ప్రతిదానికి తెల్ల మొహం వేస్తే తంతారని గుర్తు తెచ్చుకోగా.. కోగా ..ఆయన ఫ్రెండ్ చెప్పిన మొదటి ముక్క గుర్తువచ్చింది ,,కోబాల్ ఒక డైనోసార్లాంటిది ...ఏమరు పాటుగా ఉంటే మింగేస్తుంది అన్నాను... చెప్తున్నపుడు నాకు భయం తో నవ్వు కూడా వస్తుంది కాని మా 68 KGs గోల్డ్ కి అబ్బే ... మొత్తానికి ఇదన్న మాటా నువ్వు నేర్చుకుంటుంది..కోబాల్ అంటే డైనోసారు,డ్రాగను కాదు ఒక లాంగ్వేజ్ అన్నారు ..ఏ దేశపు లాంగ్వేజ్ అండి అన్నాను మళ్ళీ వినడం లేదు అనుకుంటారేమో ,ఎదో ఒకటి అనేస్తే పోలా అనుకుని..మా ఆయన నావైపు ఒక్క చూపు చూసారు ..అంటే నా ఉద్దేశం ఏ రాష్ట్రపు లాంగ్వేజ్ అని వెంటనే సరిచేసుకున్నా భయంగా...

అసలేమన్నా వింటున్నావా క్లాస్ లో .. బుద్ది ఉందా.. ఆ బుక్కు ,పెన్ ఇలా ఇవ్వు అని కూర్చో పెట్టి దీన్ని CPU అంటారు..దాన్ని కీబోర్డ్ అంటారు అని బొమ్మలు గీసేసి RAM అంటే ఇది ..ప్రోగ్రాం అంటే అది ..కాంప్యూటర్లో ఫలానా ఫలానా వాటిని లాంగ్వేజ్ లు అంటారు.. వీటిని ఆపరేటింగ్ సిస్టేం అంటారు అని రెండు గంటలు ఏక బిగిన క్లాస్ చెప్పేసారు .. ఆ క్షణంలో మా చెప్పుల స్టాండ్ దగ్గరకు పరుగు,పరుగున వెళ్ళి బాగా పాత చెప్పు వెతుక్కుని టపా, టపా మని బుద్దొచ్చేలా కొట్టుకోవాలనిపించింది.. టీచర్ ని చేసుకోవాలని కలలు కన్నందుకు..

అలా రాత్రిళ్ళు ఇంట్లో ,పగలు ఇన్స్టిట్యూట్లో పాఠాలు నేర్చుకుని ,నేర్చుకుని నిద్రలో కూడా అవే కలలు వచ్చేవి..ఈ లోపల మావారి క్లాసులు స్టార్ట్ అయ్యాయి.. UNIX,Windows చెప్పేవారు తను ...ముందే వార్నింగ్.. నావైపు చూసి క్లాస్లో నవ్వావో నాకు నవ్వు వస్తుంది..అలాంటి తిక్క వేషాలు వేయకు అని... నాకేంటో వద్దన్న పనే చేయాలనిపిస్తుంది.. పొరపాటున నవ్వానో ఎక్కడ నన్ను లేపి ఏం ప్రశ్న అడిగేస్తారో అని భయం..ఆయన గారి ప్లాష్ బ్యాక్ విన్నాకా ఆ ధైర్యం చేయలేకపోయా .. కాని నవ్వు ఆపుకుందామంటే తెరలు తెరలుగా వచ్చేస్తుందే..ఇక ఇలా కాదని ఆ రాత్రి ఏ వార్తల్లోనో,సీరియల్స్ లోనో జరిగిన నేరాన్నో..ఘోరాన్నో బాగా గుర్తు తెచ్చుకుని బిగుసుకుపోయి కూర్చునేదాన్ని...

దేవుడా పొరపాటున అనుకున్న విషయాన్ని ఇలా నిజం చేసేసి ఆడుకుంటావా జగన్నాటక సూత్రదారి అని ఊరికే అన్నారా నిన్ను..ఎలాగన్నా గట్టెక్కించవా అని కోరుకుంటుండాగానే మళ్ళీ టెస్ట్.. ఈ సారి నిజంగా జ్వరం వచ్చినా వదిలే ప్రశక్తి లేదు అని ముందు గానే తెలుసు కాబట్టి మా ఆయన్ని మెల్లగా కాకా పట్టడం మొదలుపెట్టా ..ఏమండీ.. మరీ.. ఏం ప్రశ్నలు ఇస్తారండి కొంచెం చెప్పరా అని ఎన్ని హొయలు ఒలికించినా నోరు మూసుకుని చదువు..అర్ధం కాకపోతే అడుగు వేషాలు వెయ్యకు అని ముద్దుగా చెప్పేవారేగాని పొరపాటున ప్రశ్నా పత్రం లీక్ చేసేవారు కాదు.. పోనీ చదివేద్దామా అంటే వందల కమాండ్లు .. ఎన్నని గుర్తు పెట్టుకోవాలి..

చివరకు ఎలాగోలా చదివి,నాకు రానివన్నీ లిస్ట్ రాసుకుని ఒక అర్ధరాత్రి మా ఆయన గాఢ నిద్రలో ఉండగా కచ్చ కొద్దీ అప్పుడే నిద్ర లేపి ,రానివి అడగమన్నారుగా చెప్పండి అన్నాను లైటు వేసి బుద్దిగా కూర్చుని..ఇప్పుడా అన్నారు మత్తుగా సగం కళ్ళు తెరిచి.. ఇప్పుడే ..ఇప్పుడంటే ఇప్పుడే ..మళ్ళీ రేపే టెస్ట్ అన్నాను పంతంగా... ప్రొద్దున్న చెప్తా అన్నారు అటు తిరిగి.. ఆహా..నిద్ర మీకేనా వచ్చేది..ఏం పడతాయో చెప్పమంటే పోజు కొట్టారుగా.. నాకు ప్రొద్దున కుదరదు ఇప్పుడే చెప్పాలి అని భీష్మించ్కుని కూర్చున్నా..ఒక రెండు నిమిషాలు పేపర్ చూసి ఊ ..ఇవి చెప్పడం ఇప్పుడు కుదరదు కాని రేపు ఇవి ఇవ్వనులే సరేనా.. ఇంక పడుకో అన్నారు ..అలా రండి దారికి అని అనేసుకుని హమ్మయ్యా సగం చదివే గోల వదిలింది అని హాయిగా పడుకుండిపోయా ..

అక్కడితో ఊరుకోకుండా ఆ మరుసటి సాయంత్రం ఎంచక్కా ప్రక్కన ఉన్నదానికి కూడా ఫలానా, ఫలానా పడవులే అని చెప్పి దాన్ని కూడా చదవనివ్వలేదు.... మా ఆయన సీరియస్సుగా ..పేపర్ ముందుగా తయారు చేయడానికి టైం సరిపోలేదు.. నేను చెప్తాను నోట్ చేసుకోండి అని మొదలు పెట్టారు.. సగం పేపర్ రాసేసరికి నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసేయి..నేను ఏమైయితే నాకు రావు అన్నానో అచ్చం గా అవే చెప్పడం మొదలుపెట్టారు.. నేను మిర్రి మిర్రి మా ఆయన వైపు చూస్తుంటే, చిన్న గా నవ్వుతూ మొహం తిప్పేసుకున్నారు..పేపర్ ,పెన్ నేల కేసి కొట్టి పోవోయ్ ఏం చేసుకుంటావో చేసుకో నేను చదవను అని అరవాలన్నంత కసి వచ్చింది..కాని బిక్క మొహం వేసుకుని ఎలాగో టెస్ట్ రాసి బయటకు వచ్చాను.. ఆఫీస్ రూంలో రాగానే సారీరా ..మరీ ..రాత్రి చూపిన పేపర్లో ప్రశ్నలే గుర్తువచ్చాయి టైముకి ..ఇంతకూ ఎలా రాసావ్ అన్నారు నవ్వుతూ..నాతో మాట్లాడకండి..నేనసలు మాట్లాడను అని అక్కడినుండి లేచి లాబ్ లో కూర్చున్నా ...

అప్పుడొచ్చాడు ఫణి..మావారి ప్రియతమ శిష్యుడు ...ఎందుకోమరి తెగ ఇష్టం ఆయన అంటే..ఒక్కమాట అననివ్వడు నన్ను కూడా.. మా ఇంటికి కూడా తరుచూ రావడం వల్ల కాసింత బాగానే పరిచయం.. ఏంటి మేడం ఇక్కడ కూర్చున్నారు? ఎక్జాం బాగా రాసారా ?అన్నాడు .. అసలు ఆ విషయం అడగకు ఫణి.. మీ సార్ అంతా మోసం..అబద్ధాల కోరు.. అని నాకు జరిగిన అన్యాయం అంతా చెప్పాను..తను హి హి హి అని కాసేపు నవ్వి నిజమేకదండి మరి.. నిద్రలో లేపి మరీ చదివిస్తే అలాగే అవుతుంది అని కాసేపు వెనకేసుకొచ్చి ..పోనీలేండి మీ పేపర్లు నేను ,నవీన్ దిద్దుతాం..నేను మార్కులు వేసేస్తాలే అన్నాడు..

నాకు బోలెడు ఆనందం వేసేసి ..నిజంగానా ఫణి ??అని కసేపు ఆనంద పడిపోయాగాని.. అమ్మో! మా ఆయన ఖచ్చితం గా నా పేపర్ చూస్తారు ..ఆన్సర్లు లేకుండా మార్కులు వేస్తే తెలిసిపోదూ??..ఆయనకు తెలియదేంటి నాకెన్ని మార్కులు వస్తాయో అన్నాను దిగులుగా ..పోనీ నేను రాసేస్తా అన్నాడు.. అప్పటికి గాని బుద్దిరాదు రైటింగ్ తేడా వస్తుంది అన్నాను నిట్టూరుస్తూ..మరైతే ఎలా అన్నాడు.. ఆ పేపర్ ఏదో నాకు తెచ్చి ఇచ్చేస్తే నేనే రాసేస్తా అన్నాను మెల్లిగా..అన్ని నా నోటితోనే చెప్పించాలా అని తిట్టుకుంటూ.. పాపం ఏమనకుండా పేపరు తెచ్చి ఇచ్చేసాడు.. కాకపోతే నా దురదృష్టం ,, అసలా పేపర్లే దిద్దలేదు ఎందుకో..లేకపోతేనా క్లాస్ ఫస్ట్ వచ్చేసేదాన్ని..ప్లిచ్ ..

ఆ తరువాత ఫణి నే నాగోల పడలేక ఒక విషయం చెప్పాడు..అదికాదు మేడం ..మీరు ఇలా తలా ,తోకా లేని క్లాసులు ఎన్ని విన్నా అర్ధం కాదు.. కాబట్టి ముందుగా పైంట్ బ్రష్ నేర్చుకోండి ..అందులో File అంటే ఏంటో save,cut,copy,paste ఇలా అన్నీ తెలుస్తాయి .. అలా మీకే ఒక అవగాహన వస్తుంది ఆ తరువాతా మీరే నేర్చుకోగలరు అని సలహా పడేసాడు.. నీ కడుపు చల్లగా మంచి మాట చెప్పావురా బాబు అని మా వారి మీద యుద్దం చేసి అదే పట్టున చాలా ..చాలా సబ్జెక్ట్లు నేర్చేసుకున్నా..( మర్చిపోయా కూడా ..ఇప్పుడు ఎవరూ డవుట్లు అడక్కండి..ముందు జాగ్రత్తగా చెప్పేస్తున్నా..) ఇప్పటికీ మా ఆయన్ని తిడుతునే ఉంటా మీతో పెట్టుకుంటే ఇప్పటికీ కంప్యూటర్ గురించి ఏమీ తెలిసేది కాదని :)

కాబట్టి పై కధలో తెలుసుకున్న నీతి ఏమి?? 2 వ్యాక్యములకు మించకుండా సమాధానం చెప్పండి (గమనిక: నాకు అనుకూలంగా చెప్పక పోయారో వ్యాఖ్య ప్రచురించబడదు హి..హి హి )

207 వ్యాఖ్యలు:

207లో 1 – 200   కొత్తది»   సరి క్రొత్తది»
Ram Krish Reddy Kotla చెప్పారు...

Excellent...super...Outstanding Narration :) First comment naade kada Nestham Ji... :)

హరే కృష్ణ చెప్పారు...

quick quick
వారినాయనో!!
నాది ఎన్నో కామేంటో ?

అజ్ఞాత చెప్పారు...

mee variki chepadam radani!!

Sirisha చెప్పారు...

నావైపు చూసి క్లాస్లో నవ్వావో నాకు నవ్వు వస్తుంది..అలాంటి తిక్క వేషాలు వేయకు అని... నాకేంటో వద్దన్న పనే చేయాలనిపిస్తుంది.. పొరపాటున నవ్వానో ఎక్కడ నన్ను లేపి ఏం ప్రశ్న అడిగేస్తారో అని భయం..ఆయన గారి ప్లాష్ బ్యాక్ విన్నాకా ఆ ధైర్యం చేయలేకపోయా .. ....idi highlight...chala bagundi..madhya lo mee style konchem marina malli mamulga rasesaru mee style lo....

హరే కృష్ణ చెప్పారు...

నీతి ని రెండు వ్యాఖ్యల్లో మించకుండా రాయాలా?

>>నాకు తెలుసు మీరు మనసులో ఏమనుకుంటున్నారో..ఛీ ఛీ కళ్ళుపోతాయి లెంపలేసుకోండి.. ఆయన నాకు తండ్రి లాంటివారు

నీతి1:మిగతా వాళ్ళకి కాదు అన్నమాట
నీతి1:ఫణి = చతుర్ రామలింగం

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ చెప్పారు...

Good. So funny.

Sirisha చెప్పారు...

hi need some help can u add me or give ur mail id..

పవన్ కుమార్ చెప్పారు...

malli 1st comment miss.
ippudu chadivi commentuthaaa.
naaku telsi naadi ye 10th commento ayipoyiuntundi.

kalhara చెప్పారు...

:) బావుంది.

కవిత చెప్పారు...

నేస్తం గారు,చాల బాగా రాసారు...మా ఇంట్లో ఇదే పరిస్థితి ...కానీ పాత్రలు మాత్రం రివర్స్ ..నేను గురువు ని ,మా అయన న శిష్యుడు అన్నమాట.ఈ పోస్ట్ చూస్తుంటే ,పాపం మా వారు కూడా ఇలాగె ఇబ్బంది పడి ఉంటారా అని ఆలోచిస్తున్న.మీ రైటింగ్ స్టైల్ బాగుంటుంది....పాత్రల్లో జీవం ఉత్తి పడేలా ఉంటాయి....నీతి మాత్రం ఒక్కటే...మీ టైటిల్.కరెక్ట్ ఈ నా????

పవన్ కుమార్ చెప్పారు...

నాకు అర్థం అయిన నీతి.
క్రీం బిస్కట్ లొ క్రీం ఉంటుంది కాని, కుక్క బిస్కట్ లొ కుక్క ఉండదు.
ఇంకొ నీతి
మనకు బుద్ది రావాలంటె మన పాత చెప్పుతొ మనమె కొట్టుకొవాలి.

Unknown చెప్పారు...

నలుగురికీ చెప్పడానికి నీతులు ఉన్నాయి

sunita చెప్పారు...

hahah!intakee naerchukunnaaraa? laedaa?

తార చెప్పారు...

అవును బేసిక్స్ నేర్పకుండా కోబాల్ క్లాస్ లో ఎలా పడేశారు? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

అన్నిటికన్నా మీ శేషగిరి రావు గారి కధ బాగా నచ్చింది నాకు, ఏ జిల్లా వాడ్ని అదే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వరు కదా, మాకూ చిన్నప్పుడు ఇలాంటి కధలు చెప్తుండేవారు.

--మావారిని బోలెడు అంత ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను..
నిద్ర పోకుండానా?

Unknown చెప్పారు...

నీతి ఏంటంటే మాస్టారి కంటే అయన ప్రియ శిష్యుణ్ణి పెళ్ళిచేసుకోవడం ఉత్తమం అని
నిద్ర బాగా పట్టాలంటే క్లాసు రూం లో కూర్చోవాలని
అర్దరాత్రి పూట భర్తని లేపి భాదిన్చకుడదని
శేషగిరి రావు మాటలు నమ్మ కుడదనీను

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హ్హా..హ్హ..పాపం మీకన్నీ సినిమా కష్టాలేనండీ మీ వారితో...మీవారి ఫ్రెండ్ పెయింట్ తో మెదలు పెట్టమని మంచి సలహా ఇచ్చారు మీకు..
నాకు అర్ధమైన నీతి ఏంటంటే అధ్యక్షా! కంప్యూటర్ పాఠాలు చెప్పే గురువులని పెళ్ళిచేసుకోరాదని..ఎందుకంటే వారు వారి భార్యలను పాఠాలు నేర్చేసుకొమ్మని సతాయిస్తారు కనుక..:-)

Lakshmi Sadala చెప్పారు...

Chala baga rasaru nestham eppatilage..:)

..nagarjuna.. చెప్పారు...

ఎవరండి ఎవరండీ మీకు క్లాసు చెప్పడానికి ట్రైనింగ్ అవసరమన్నది...నేనైతే పోస్టు చదివినంతలో అలా అలా c++, java, COBOL నేర్చేసుకోలా :D అస్సలు భయపడకండి వెంటనె వెంటనే ఓ కోచింగ్ సెంటరోపెన్‌ చేయండి చెప్తాను..తరువాత్‌ సంగతి తరువాత

..nagarjuna.. చెప్పారు...

నీతి1: చెప్పుతో మనల్ని మనం కొట్టుకునే ఆలోచన వద్దంటే కంప్యూటర్ వాళ్ళని పెళ్ళిచేసుకోవొద్దనీ

నీతి2: ఎక్జాం బాగా రాయాలంటే ఆ ముందురోజు పేపెర్‍ సెట్‌ చేసేవారికి క్లోరోఫాం ఇచ్చైనా నిద్రపుచ్చాలని..ముఖ్యంగా అర్థరాత్రిపూట

అజ్ఞాత చెప్పారు...

నేస్తం
మీరు చాలా అదృష్టవంతులు
పెళ్ళానికి ద్రోహం చేసి స్టూడెంట్ తో లేచిపోయారు మా ఇన్స్టిట్యూట్ లో మా సారు

- vipul

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేను అందరికన్నా ముందు కామెంట్ రాయాలనే సదుద్దేశంతో టపా చదవకుండా కామెంట్ పెట్టి...తర్వాత తీరిగ్గా టపా చదివి ఇప్పుడు కామెంట్ పెడుతున్నాననమాట ..ఇంతకముందు ఎవరో మీ బ్లాగులో ఇలాగే ట్రై చేసారు, నేను వారిని కాపి కొట్టి అందరికన్నా ముందు కామెంట్ పెట్టేసానోచ్ :)... టపా చదువుతున్నంతసేపు మిమ్మల్ని చూసి ఎంత జాలేసిందో..పాపం కదా మీరు.. అయినా కంప్యుటర్ గురుంచి వినడమే తప్ప చూడటం తెలియని మీకు (మీరు అలాగే రాసారు...కానీ నేను నమ్మను...మీరు ఆల్రడీ చూసారు, దాని మీద ఏదో ఒకటి టైపు చేసారు..మానిటర్ ఏంటో...సి.పి.యు ఏంటో మీకు తెలుసనీ నాకు తెలుసు..డిగ్రీ చదివారుగా మరి :) )...అలాంటి మిమ్మల్ని, డైరెక్ట్ గా వెళ్లి అవుట్-డేటెడ్ కోబాల్ క్లాసులో పడేస్తారా..ఇది అమానుషం...నేను కూడా తీవ్రంగా ఖండ ఖండాలుగా ఖండిస్తున్నా ..మిమ్మల్ని డైరెక్ట్ గా జావాలో వెయ్యాల్సింది...అప్పుడు నేను ఎంతో సంతోషించేవాడిని..జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో అవన్నీ ఆరు నెలల జావా కోర్స్ లో అనుభవించవచ్చు ఎంచక్కా....పెయింట్ బ్రష్ నేర్చుకోమన్నారా ఆయన...హి హి హి హి ...అమ్మో ఇక నేను నవ్వలేను..హమ్ ఇంతకీ ఇప్పటికి మీకు ఎన్ని బాషలు వచ్చు (కంప్యుటర్ బాషలు)...పైన టపాలో నేర్చుకున్న నీటి "గురువుని పూజించకు...అప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపించదు.." :))

నేస్తం చెప్పారు...

కిషన్ నాకు తెలుసు కదా చదవలేదని...ఇలా పోస్ట్ వేయగానే అలా కామెంట్ పడగానే అర్ధం అయింది :) ఇక పోతే ఇది ఇప్పటి విషయం కాదు పదేళ్ళ పైనే అయింది.. అప్పట్లో కంప్యూటర్ అనేదాని గురించి వినడం తప్ప నిజంగా చూడలేదు.. అప్పట్లో కోబాల్,బేసిక్ లు తప్పక నేర్పేవారు యే ఇన్స్టిట్యూట్ లో అయినా ..నా లెగ్ పడగానే అవి అన్నీ పోయి VB ,జావా లు గట్రాలు వచ్చాయి ..
>>>"గురువుని పూజించకు...అప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపించదు.."
హహ ఇదేదో బాగున్నట్లు ఉంది ..
హరే క్రిష్ణ మరో ప్రశ్న
>> ఫణి = చతుర్ రామలింగం
ఇది నాకెందుకని అర్ధం కాలేదు ???
అఙ్ఞాత గారు ఆ మాట అనకండీ బాబు..ఇలాంటి చెత్త పోస్ట్లన్నీ రాసి నన్ను ఇలా అనిపిస్తావా అని మళ్ళీ క్లాస్ పీకుతారు :)
మురళీ మరి అంతే కదా నవ్వద్దు అంటే ఖచ్చితంగా నవ్వాలనిపిస్తుంది.. నాతో ఏం హెల్పండీ బాబు కొంపదీసి యే కోబాల్ లో అన్నా డవుటుందా .. అలాంటి హెల్ప్ లు అడిగి భయపెట్టకండి నన్ను :) ఇక పబ్లిక్ గా నా ID ఇవ్వలేను :)
లక్ష్మీ నారయణగారు థేంక్యూ :)

నేస్తం చెప్పారు...

>>>మనకు బుద్ది రావాలంటె మన పాత చెప్పుతొ మనమె కొట్టుకొవాలి
@$$%్% పవన్ నీకు అలా అర్ధం అయ్యిందా?? ...
kalhara గారు మీ పేరు బాగుంది థేంక్యూ
కవితా నువ్వు కరెక్ట్గా కేచ్ చేసావ్ విషయాన్ని..అవునా నిజమా.. అయితే మీ ఇంట్లో సీన్ రివర్స్ అన్నమాటా..పాపం మావారు బాగానే చెప్తారు కాని నేను మరీ అ అమ్మ ఆ ఆవు నుండి నేర్పమంటా.. నా రేంజ్ అర్ధం చేసుకోకుండా ఆయన చంపకమాల,ఉత్పలమాల నుండి మొదలు పెడతారు అది వచ్చిన చిక్కు
నీతిమంతుడు గారు అంతే అంటారా..

నేస్తం చెప్పారు...

సునీతా అలాంటి దేవరహాస్యాలు అడక్కూడదు :) కాకపోతే ఇక్కడకు వచ్చాకా ఎం ఎస్ ఆఫీస్,జావా ,క్రిస్టల్ రిపోర్ట్స్ ఇలా కొద్ది కొద్దిగా టచ్ చేసా..
తార గారు మరే నేనూ ఆ విషయాన్ని ఇప్పటికీ ఖండిస్తున్నా అండి..
>>>నిద్ర పోకుండానా?
మీకు అంత డవుటొచ్చేసిందేంటండి :) పెళ్ళయిన కొత్తలో మావారు నాకు బిల్ గేట్స్ కంటే గొప్పగా అనిపించేసేవారు..అప్పుడు తరుచూ ఆయన పడుకోగానే అర్ధ్రాత్రి వరకూ అమ్మో మా ఆయన ఎంత గోప్పోరు అని చాలా ఆరాధనగా చూస్తూ ఉండేదాన్ని.. ఆ సినిమా ఏంటబ్బా సర్ధుకుపోదాం రండి లో అనుకుంటా సౌందర్య 8 యేళ్ళ తరువాత భార్యభర్తల మద్య తేడాలొస్తాయి అని చెప్తే దాని మొహం అనుకున్నా..కాని నిజమేనండోయ్ అప్పటి క్షమాగుణం నాలో యేకొసనా లేదిప్పుడు ..ఆయన కయ్ అంటే నేను గై అంటున్నా :)
రవి గారు భలే నవ్వించారండి..

Sasidhar Anne చెప్పారు...

akka.. Cant Stop laughing.. antha ga navva.. aithey mothaniki bava garu.. Software engineer annamata...
ee kathalo nerchunna neethulu next comment lo anna mata..

నేస్తం చెప్పారు...

శేఖర్ అసలు నన్నడిగితే గురువులెవరూ భార్యలకు చదువు చెప్పరాదు అని ఒక రూల్ పెట్టేస్తే బాగుంటుంది :)
లక్ష్మి గారు దేంక్యూ
నాగార్జున గారు అప్పుడు ఆ కోచింగ్ సెంటర్లో నేనే కూర్చుని C++ జావా స్పెల్లింగులు చదువుకుంటూ ఉండాలి.. :)
విపుల్ గారు :) అది మనుష్యుల బట్టి ఉంటుంది లేండి.. మావారితో ఆ భయం లేదు :) ఆయనకెంత సేపు అమ్మాయిలంటే ఆలయానవెలసిన ఆ దేవుని రీతి అని జడ అల్లుకుంటూ మెట్లు దిగే సావిత్రి టైపులో మొత్తం పనులన్నీ చక్కబెట్టి భర్తగారి కనుసన్నల్లో మెలిగే టట్లు పద్దతిగా ఉండాలి..ఈయనగారి వెనుక పొరపాటున ఎవరన్నా పడ్డారో దానిపని అయిపోయిందే... చాన్సు దొరికితే చాలు ఆడపిల్ల ఎలా ఉండాలి అని క్లాస్ పీకుతూ ఉంటారు :)

సవ్వడి చెప్పారు...

నీతి : గురువులను పూజింపుము ..పెళ్లి చేసుకోకుము
నేస్తం గారు! బంపర్ ఆఫర్ మిస్స్ అయ్యారే... first మిస్స్ అయ్యారు. ఆ పేపర్లు ఎందుకు దిద్దలేదో మీవారిని అడిగారా!
మీకు కంప్యూటర్ క్లాసులో మాత్రమే నిద్ర వచ్చింది. నాకైతే Degree తరువాత MBA... ప్రతీ రోజు ఏదో ఒక టైమ్ లో నిద్రొచ్చేది. నా పాట్లు అన్ని, ఇన్నీ కావు.
ఎప్పటిలాగే బాగుంది పోస్ట్.
హహహ...

Ram Krish Reddy Kotla చెప్పారు...

Chatur Ramalingam, is a character in the movie "3 idiots" , who is favorite student to his lecturer in the movie. His characterization is funny.. :)

నేస్తం చెప్పారు...

శశి పాపం నవ్వొచ్చినా రాకపోయినా నవ్వేస్తావ్ గా :)
సవ్వడి గారు ఆ పేపర్లు దిద్దమని చాలా సార్లు బ్రతిమాలా గాని అప్పటికే మావారు ఇక్కడికి రావడానికి సన్నాహాలు చేసుకోవడంలో బిజీగా ఉన్నట్లున్నారు..మరెందుకో ఇంక పట్టించుకోలేదు అంతగా..
కిషన్ అవునా..ఆ సినిమా ఒకటి చూద్దామని పెండింగ్ లో వదిలేసా అందుకే తెలియలేదు..థెంక్స్ :)

Sirisha చెప్పారు...

mari ela nestam meetho matladatam

శ్రీలలిత చెప్పారు...

నేస్తంగారూ,
మీ టపా చదువుతుంటే నాకు "రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకుం" దన్న సామెత గుర్తొచ్చింది. మావారొక పేద్ద టీచర్.(సాఫ్ట్ వేర్ కాదులెండి..). సబ్జెక్ట్ మీదే కాదు ప్రతిదాని మీదా క్లాసు పీకుతారు. చూడుడు.
http://srilalitaa.blogspot.com/2009/08/blog-post_27.html
నా కష్టాల ముందు మీ కష్టాలు నిలబడలేదు..సారీ..
అంటే టైటిల్ బట్టి చూస్తే మీ కాన్సెప్ట్ వేరనుకోండి. కాని నేను జనరల్ గా చెప్పానంతే..

మనసు పలికే చెప్పారు...

బాబోయ్.. ఎంత నవ్వు ఆపుకుందాం అన్నా ఆపుకోలేక పోతున్నానండీ.. మరి మాకు క్లాసులు ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు మీరు నేర్చేసుకున్న బోలెడన్ని సబ్జెక్ట్ల మీద..? నేనైతే eagerly waiting.

Unknown చెప్పారు...

chaduvurani vallu digulu chendakudadani telsindi.. :D....
super!!! :)

రాధిక(నాని ) చెప్పారు...

చాలా చాలా బాగా రాసారు .:):)చదువు తుంటే చాలా హాయిగా ఏదో కద చదువు తున్నట్లుంది .
మొత్తానికి ఇదన్న మాటా నువ్వు నేర్చుకుంటుంది..కోబాల్ అంటే డైనోసారు,డ్రాగను కాదు ఒక లాంగ్వేజ్ అన్నారు ..ఏ దేశపు లాంగ్వేజ్ అండి అన్నాను మళ్ళీ వినడం లేదు అనుకుంటారేమో ,ఎదో ఒకటి అనేస్తే పోలా అనుకుని..మా ఆయన నావైపు ఒక్క చూపు చూసారు ..అంటే నా ఉద్దేశం ఏ రాష్ట్రపు లాంగ్వేజ్ అని వెంటనే సరిచేసుకున్నా భయంగా...
నీతి:భర్తే గురువైతే ఇంతే.

తార చెప్పారు...

>>అప్పుడు తరుచూ ఆయన పడుకోగానే అర్ధ్రాత్రి వరకూ అమ్మో మా ఆయన ఎంత గోప్పోరు అని చాలా ఆరాధనగా చూస్తూ ఉండేదాన్ని..

ఎంతటి అమాయకులండి మీరు....
ఐతే ఎలగోలా కొన్ని నేర్చుకున్నారు కాబట్టి అవి మాకు నేర్పాల్సిందే, లెఖ్ఖలు అంటే బ్లాగులు బాయ్ కాట్ అన్నారు, మరి ఇప్పుడు ఈ కోబాల్, సీ, స్++, విబి, ఇవేమీ మాకు రావు కదా, అందరికీ ట్యుషన్ చెప్పాల్సిందే.

Balu చెప్పారు...

"చదువు రానివాడినని దిగులు ..." నాకు ఇష్టమైన పాటని గుర్తు చేసారు. మీ కష్టాలు బాగా నవ్వు తెప్పించాయి

Sai Praveen చెప్పారు...

నీతి 1: మా వారే కదా నాకు పేపర్ లీక్ చేసేస్తారు అని ఆశ పడకూడదు.
నీతి 2: క్లాసులలో నిద్ర పోకూడదు.
నీతి 3: నేస్తం గారిని సాఫ్ట్వేర్ డౌట్లు అడగకూడదు :)
రెండు వాక్యాలు మించేసాను, మీకు ప్రతికూలంగా కూడా రాసేసాను (అనుకుంటున్నాను). ప్రచురిస్తారో లేదో మరి..
టపా మాత్రం సూపర్. చాలా నవ్వుకున్నాను. (పొగిడినందుకైనా ప్రచురించాల్సిందే. హ హ) ;)

భావన చెప్పారు...

అబ్బ నవ్వి నవ్వి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి నేస్తం. ఇలా ప్రతి పోస్ట్ తో ఏడిపించటం న్యాయమా మీకు మాత్రం.... :-)
నాకు అర్ధమైన నీతి: నేస్తం నిద్దరోకుండా మనతో మాట్లాడాలి అంటే కంప్యూటర్ గురించి అసలే మాట్లాడకూడదు....

అజ్ఞాత చెప్పారు...

Nestam,

nadi oka general question. emi anukokandi adigaanani. meeru enduku mi identity secret ga unchutaaru? Srujana gaari blog lo ivvala chusa mi facebook lo tanu friend ani. Just jagarthaa leka edanna reason unda? Ibbandi pettani question ayite answer cheyyandi.

Aruna.

Naa Aalochanalu చెప్పారు...

Navvi Navvi chacha..ma wife ki call chesi chadavamani cheppa...Mee Fan ayiopoya...inka mee postings anni chadivesta...
!!!!

రాజ్ కుమార్ చెప్పారు...

అయ్యో..అయ్యో.. అయ్యయ్యో.. అప్పుడే ౪౦ కామెంట్లా?..
నేస్తం గారు..టపా అరుపులు....మంటలు... :) :)
నీతి1: గురువులను పూజింపుము ..పెళ్లి చేసుకోకుము"
నేతి౨: పొద్దున్నే ఆఫీస్ కి రాగానే నేస్తం బ్లాగు చెక్ చేయుము.. లేక పొతే మన కామెంట్ల ర్యాంక్ ౪౦ కో 5౦ కో పడి పోవును...

3g చెప్పారు...

హ్హ....హ్హా.......... మేడం గారు...... పోస్టు సూపర్.
మీరు ముందే కండిషన్ పెట్టేసారుగాని లేకపోతే నేను చాలా డౌట్స్ అడిగేద్దామనుకున్నాను మేడం గారు.

నీతి : పగిలిపోవడం తప్పనప్పుడు పగలగొట్టుకోవడమే బెటర్.

నేస్తం చెప్పారు...

మురళీ గారు మీ కామెంట్ బాక్స్ పని చేయదు..మీరేమో విషయం చెప్పరు...నా ID ఇవ్వలేను ఇక్కడ .. మరెలా :)
శ్రీలలిత గారు చదివాను అండి చదివాను ..మీకు నా ప్రఘాడ సానుభూతి ...అయితే లత మీరేనన్నమాట..:)
మనసు పలికేగారు eagerly waiting అనగానే భలే విషయం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నా.. థేంక్యూ :)
కిరణ్ చదువురాని వారు దిగులు చెందకూడదు అనుకుందామన్నా ..అబ్బే లోకం బ్రతకనివ్వదు అమ్మాయ్ ..

నేస్తం చెప్పారు...

>>>భర్తే గురువైతే ఇంతే
మరంతే కదా రాధిక..అయినా చాలా నాళ్ళు కంప్యూటర్ కి ఏదో ఒక లాంగ్వెజ్ నేర్పితే సరిపోతుంది గా అన్ని ఎందుకు అని పేద్ద డవుట్..:)
తార గారు అప్పుడు నేను అకంప్యూటర్ కోర్సులు అని ఇవన్ని నేర్పాలి... అంత రిస్కు మీకందరికీ అవసరం అంటారా :)
బాలు గారు థేంక్యూ :)
సై ప్రవీణ్ నాకు నీతి3 మాత్రమే నచ్చింది కాబట్టి మీకు ఒక మార్కే :)

నేస్తం చెప్పారు...

భావనా కరెష్టు మరంతే కదా...పోస్ట్ నచ్చినందుకు థేంక్యూ :)
అరుణ గారు పెద్దగా కారణం లేదు.. నా వివరాలు చెప్పినంత మాత్రానా నాకు వచ్చే లాభమూ లేదు చెప్పనంత మాత్రానా మిగిలినవారికి కలిగే నష్టమూలేదు కదా ..అంతే ..పైగా నాకు ఇంటెర్నెట్ లో వివరాలు ఇవ్వడం మీద ఎందుకో అంత సదభిప్రాయం లేదు.. పైకి ఎంత నవ్వినా నేను అతి సున్నితమైన మన్స్థత్వం కలదాన్ని.. చిన్న బాధ కలిగినా శోకదేవతలా నేను ప్రశాంతంగా ఉండను వారిని ఉండనివ్వను.. ఎందుకులే అని బ్లాగ్ వరకూ నా పని చూసుకుని ఊరుకుంటాను..ఇంక కొద్దిమంది బ్లాగ్ అమ్మాయిలకు మాత్రమే నా మెయిల్ అయిడీ తెలుసు ...వారు అమావాస్యకోసారి పలకరిస్తే నేను పున్నానికోసారి రిప్లయ్ ఇస్తా అన్నమాట..:) ఈ ఫేస్ బుక్లు గట్రా నాకు పేర్లు తప్ప వివరాలు తెలియదు నిజంగా .. మరి ఎలా తన ఫేస్ బుక్ లో ఏడ్ అయ్యానో.. :)కాని బ్లాగ్ మానేసే సమయానికి మాత్రం ఒక సారి నా ID ఇచ్చే వెళదాం అని అనుకుంటున్నా :) అదీ సంగతి..

నేస్తం చెప్పారు...

నా ఆలోచనలు గారు థేంక్యూ థేంక్యూ
వేణురాం మంటలా భలే పదాలు వాడుతారు కదా :)

3g నాకు తెలుసు కదా అందుకే అట్టాంటి కండీషన్ పెట్టేసా ముందు జాగ్రత్తగా

కృష్ణప్రియ చెప్పారు...

:-) Too good.

ఆ.సౌమ్య చెప్పారు...

హ హ హ బాగా రాసారు...భలే నవ్వొచ్చింది చదువుతున్నంతసేపు.....మీరొక కండీషన్ పెట్తాల్సింది. ఆయనకొచ్చిన పాఠాలు మీరు నేర్చుకోవాలంటే మీకొచ్చిన పాఠాలు వారు నేర్చుకోవాలని. అప్పుడు చచ్చినా మిమ్మల్ని క్లాసుకి రమ్మనేవారు కాదు :)

శ్రీనివాస్ చెప్పారు...

కధలో నీతి
File, save,cut,copy,paste నేర్చేసుకుంటే .. చాలు ఇంకా అన్నే నేర్చేసుకోవచ్చు.

రాజ్ కుమార్ చెప్పారు...

కాని బ్లాగ్ మానేసే సమయానికి మాత్రం ఒక సారి నా ID ఇచ్చే వెళదాం అని అనుకుంటున్నా :)

ఏమిటి?? బ్లాగు మూసేసే సమయానికా?? ఇదేమి ట్విస్ట్ అండి..?? సరదాగా అన్నర? సీరియస్ గ అన్నారా?
ఏది ఏమైనా దీన్ని నేను ఖండ ఖండాలు గా ఖండిస్తున్న... కావలిస్తే ౨ నెలలు సెలవు తీసుకోండి... :) :)

Unknown చెప్పారు...

నమస్కారం.. నేస్తం...గారు.. నేను చాల రోజులనుండి మీ బ్లాగ్ చదువుతున్న.. (కామెంట్ ఎప్పుడూ పెట్ట్లేదనుకోండి.. ). ఎప్పటి లాగానే ఈ పోస్ట్ కూడా చాల బాగుందండి..
నాది ఒకటే విన్నపం. మీరు ఎవ్వరికీ ID ఇవ్వావద్దు... మీ బ్లాగ్ ఎప్పుడూ మూసెయ్యా వద్దు.

ఇట్లు మీ అభిమాని.
అబ్బులు.

Anand Kumar చెప్పారు...

excellent నేరేషన్ andi ... నేను మామూలు గా పెద్ద పెద్ద పోస్ట్ లు చదవను.. కాని మీ బ్లాగ్ లో పోస్ట్లు మాత్రం అసలు చదివినట్టే ఉండదు ఎంత పెద్ద పోస్ట్ అయ్యిన సరే.... చాల బాగా రాస్సారు నేస్తం..
ఒక్క విషయం.. మీ పాత టెంప్లేట్ బాగుండేది ఈ టెంప్లేట్ కన్నా.. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.

శ్రీలలిత చెప్పారు...

నేస్తంగారూ,
హమ్మయ్య.. నాకు కూడా సానుభూతి చూపించేందుకు ఒక మనిషి దొరికారు. (లేకపోతే హేమిటో అందరూ మా వారినే మెచ్చేసుకోవడం..)
"చదువురాని వాడవని దిగులు చెందకూ.." పాటకి మేం చిన్నప్పుడు కొనసాగింపు నిచ్చేవాళ్ళం..
"చదువురాని వాడవని దిగులు చెందకూ...మళ్ళీ మార్చ్ కి కట్టూ..." అంటూ..
మీ టపా చదువుతుంటే ఆ పాట గుర్తొచ్చింది. బలే రాసారు..
అన్నట్టు...సౌమ్య చెప్పిన అవిడియా ఏదో బాగున్నట్టుందే...

నేస్తం చెప్పారు...

క్రిష్ణ ప్రియ గారు థేంక్యూ:)
సౌమ్య కదా.. నాకా అవిడియా ఎందుకు రాలేదు చెప్మా
శ్రీనివాస్ ఏం కాదా!!!! అవి నేర్చుకోబట్టే కదా నోట్ పేడ్ లో ముందుగా స్టోరీ రాసి దాన్ని బ్లాగ్స్ పాట్ లోకి కాపీ చేస్తున్నా.. అవి నేర్చుకో బట్టేగా చక్కటి చక్కటి బొమ్మలు ( కాలేజి ప్రేమలు) పైంట్ బ్రష్ లో వేసి బ్లాగ్ లో పెట్టాను.. ఇప్పుడు చెప్పు అవునా కాదా ...
వేణు రాం ఆ నెలలు ఏమిటో అచ్చ తెలుగులో వేస్తే ఎలాబాబు.. ఎంత సరదా పోస్ట్లు రాస్తే మాత్రం అన్ని సరదాగా అంటా అని ఎలా అనుకున్నారు,,

Sasidhar Anne చెప్పారు...

Kathalo neerchukunna neethulu
1)eppudu padithey appudu pagati kalalu kani koodadhu.. kante devudu correct ga manalani irukanapeeti vateeki thadasthu antadu..

2)Telisina institutes lo manam chera koodadhu.. cheithey ika anthey.. focus antha mana meeda vuntundhi..

Akka, nenu navvu vacche navve.. btwn nee blog nee na freind oka ammayi ki cheppa.. thana mee blog chusi full ga kushi ayyindhi..

meeru naa party sangathi marchipoyaru.. mee 100th follower ki party ivvakapovatam.. bavyama cheppandi...

akka emi anukopothey oka question.. meeku entha mandhi pillalu...

నేస్తం చెప్పారు...

అబ్బులు గారు చూసారా ఎలా మిమ్మల్ని బయటకు రప్పించానో..హన్నా .అఙ్ఞాత క్రింద ఉండిపోదామనే .. ఏమోనండి చెప్పలేను ...చూద్దాం ఎంత వరకు రాయగలనో..:)
మదు బాబు గారు బాబ్బాబు ఈ సారికి ఇలా క్షమించి సర్దుకుపోండి.. ఈ టెంప్లెట్ గాని మార్చానో గిన్నీస్ బుక్ లో తప్పనిసరిగా ఎక్కేస్తాను ...అన్ని మార్చాను.. విరక్తి వచ్చేసింది నాకు :)
లలిత గారు పడ్డవాళ్ళకే తెలుస్తాయి దెబ్బల బాధలు మరి.. అందుకే అర్ధం చేసేసుకున్నా..భలే మార్చేవారే పాట :)

నేస్తం చెప్పారు...

శశి నీతులు సూపర్ ఉన్నాయి ... పార్టీ బదులు నీకు ఒక విషయం చెప్పనా :) నువ్వు చెప్పిన ఫ్రెండ్ పేరు కీర్తి కదా :)

Sasidhar Anne చెప్పారు...

ela how.. keerthy correct eee? meeku ela telusu ?
party ki deeniki sambandam ledu anthey anthey..

నేస్తం చెప్పారు...

అది దేవ రహాస్యం..అక్కకు తముళ్ళ విషయాలు తెలిసిపోతూ ఉంటాయి :) పార్టీ తననే అడిగేసేయి :)

Sasidhar Anne చెప్పారు...

ammo party ante.. kottidhe.. nenu [jump]

Akka, mee pillala gurinchi cheppaledu... [hehe] meeru datavesina.. nenu malla same question repeating..

Sasidhar Anne చెప్పారు...

Wow.. Super akka... Maa bujji gallani.. adiganu ani cheppandi...

అజ్ఞాత చెప్పారు...

శశి మాత్రమే ఫేవరెట్ తమ్ముడు అయ్యాడు
మేమంతా పరాయి వాళ్లము అయ్యాము

మీ తమ్ముడు
ఇంద్రేష్

నేస్తం చెప్పారు...

ఇంద్రేష్ భలేవాళ్ళే అంతలోనే అలిగేస్తే ఎలా :)సరే విషయం చెప్పేస్తా.. అప్పుడెప్పుడో జాజిపూలు అని సరదాగా గూగుల్ లో కొడితే nagfans అనో ఏదో సైట్లో కరెక్ట్గా ఈ శశీ కీర్తి నా బ్లాగ్ గురించి మాట్లాడిన కామెంట్స్ కనబడ్డాయి :) అప్పుడు చూసి నవ్వుకున్నా ..అందుకే అలా అన్నాను కాని అందరూ నాకు ఇష్టమే.. చూసావా నీ కోసం దేవ రహస్యం చెప్పేసా :)

..nagarjuna.. చెప్పారు...

భావన గారి కామెంటు సూపరు....

బ్లాగు మూసేద్దాం అనుకున్నపుడు ID ఇస్తారా...అంటే మీరు జంపు జిలానీగా అవతారం ఎత్తుతారా....!!దీన్ని ఖండxఖండ సార్లు ఖండిస్తున్నాం

మధురవాణి చెప్పారు...

భలే బాగున్నాయండీ.. మీ జ్ఞాపకాలు! మీ పక్కనుండి అంతా చూసినట్టు అనిపించింది. నేను మీలాగా కలలు కనలేదు గానీ ఆ టీచరమ్మేదో నేనే అయిపోతే బాగుండును అని అనుకుంటూ ఉంటాను. అప్పుడెలాంటి కష్టాలు ఉంటాయో మరి! ;-)

మనసు పలికే చెప్పారు...

నేస్తం గారూ!! కాస్త నా బ్లాగునందు తమరి మౌసు పద్మమును మోపి(పాద పద్మాలు మోపడం కుదరదు కదా:) ) నా బ్లాగు జన్మని తరింపచెయ్యండీ.. మీ చిత్ర పటాన్నే పెట్టుకుని పూజించుకుంటూ బ్లాగేస్తాను, అలా.. అలా.. మీ సలహాలని అక్కడ వదిలి వస్తే.. :)

అజ్ఞాత చెప్పారు...

ayyo nestam.. miru blog muyyaddu, mi id ivvaddu. edo adigaanu. inka mi abhimaanulu nannu valla sangham lonchi veli vesi kotteyyagalaru ilanti questions adiginanduku. anta pani cheyyakandi.

Aruna.

Sasidhar Anne చెప్పారు...

Indresh Thanks.. Mothaniki akka tho deva rahasyam cheppinchavu.. He he...

Akka nee blog gurinchi nenu chala sites lo cheppa.. even maa ammatho kooda chadivistha.. ;)

నేస్తం చెప్పారు...

నాగార్జున గారు నిన్ననే చదివా ఆ పోస్ట్ ... బాగా నిద్ర వస్తుంది అని కామెంట్ పెట్టలేదు .. ఎంచక్క మీ పోస్ట్లో పేరు రాయించుకునే అదృష్టం అందరికీ రావద్దూ :)
మధుర మరి అదే ..నేను ఎప్పుడూ చిరాగ్గా చదువూ చదువూ అని తెగ చదివేసే అమ్మాయినేంటి అలా కలలు కనడానికి .. నాలాంటి వాళ్ళం సింపుల్ వేలో గొప్పోళ్ళం అయిపోయే కలలే కంటాం :)
మనసు పలికే మీ బ్లాగ్ చూడకపోవడం ఏంటి..మీ పోటో చూడగానే ఈ అమ్మాయి భలే బాగుందే అని కూడా అనేసుకున్నా :) త్వరలో కామెంట్ పెడతా :)
అరుణ :) మీరన్నారని కాదులే ... ఎన్ని రోజులని రాయగలం ... 24 గంటలు ఇదే సుత్తి కొట్టాం అనుకో ఐడి వద్దు నీ పోస్ట్లు వద్దు తల్లోయ్ అంటారు.. అందుకనే అలా చెప్పాను అన్నమాట..
శశిధర్ సరే కానీయ్ సెంటిమెంట్ కొట్టి రహాస్యాలు తెలుసుకుంటున్నారు :)

మనసు పలికే చెప్పారు...

ధన్యోస్మి నేస్తం.. ధన్యోస్మి.. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కుళ్లు పుట్టేస్తుంది. మీకు ఎంతమంది అభిమాన తమ్ముళ్లు ఉన్నారో కదా!! అందులో నాకు కొందరు అన్నయ్యల్ని ఇచ్చేద్దురూ!! నాకు అన్నయ్యలంటే భలే ఇష్టం.. శివయ్య నాకు ఈ విషయంలో కూడా ద్రోహం చేసేశాడు, ఒక్క అన్నయ్యని కూడా ఇవ్వకుండా..:( :'(

శివరంజని చెప్పారు...

హ.. హ.. హ... గురువులని పూజించాలి పెళ్ళి చేసుకోకూడదు....భలే కనిపెట్టేసారే ... పాపం ఈ విషయం మా నాన్నకి ఇంకా తెలియట్లేదు .... మా అమ్మ టీచర్ కాకపోయినా భలే చెప్పేస్తుంది మా నాన్నకి క్లాస్ ....

పోస్ట్ మాత్రం అదిరిపోయింది... స్వయం కృషి సినిమా లో విజయ శాంతి కూడా ఇలాగే వెలుతుంది చదువు నేర్చుకోవడానికి... ఈ సారి పొస్ట్ లో విజయ శాంతి కనిపిస్తుంది మీ లో .

అజ్ఞాత చెప్పారు...

యవ్వనం పురి విప్పుతున్న తొలి రోజులు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా భలే జ్ఞాపకాలు మిగుల్చుతాయి. సినిమాకి వెళ్తే హీరో హీరోయిన్ని ఏమి చూసి ప్రేమించేస్తాడో అర్థం కాని రోజులు. అసలు తనలాంటి అందగత్తె బయట తిరుగుతుండగా రాధ, రాధిక, విజయ శాంతి లాంటి వాళ్ళు హీరోయిన్లుగా ఎందుకు సినిమాల్లోకి వెళ్ళారో అర్థం కాని రోజులు. గోడ కి వేళ్ళాడే చిన్న అద్దం ముక్క తన అందం మొత్తం చూపించలేకపోతోందే అని నిలువటద్దం కొనలేని ఇంట్లో వాళ్ళ మీద పీకల్లోతు కోపం తెచ్చుకునే రోజులు. మంచి నీళ్ళు తెచ్చే నెపంతో బావి గట్టున కూర్చుని గంటలు గంటలు ఆ నీటిలో ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోయే రోజులు. ఎక్కడికి వెళ్ళినా అందరూ మనల్నే చూసేస్తున్నారేమో అని విపరీతం గా ఇబ్బంది పడిపోయే రోజులు. అందరికన్నా పొడుగ్గా కనిపిస్తున్నానేమో అని కావాలని గూని పెట్టి మరీ నడిచే రోజులు. జారని పైటను మరీ మరీ సర్దుకుంటూ, పుస్తకాలను గట్టిగా హత్తుకుని నడిచే రోజులు. ఇదిగో అలాంటి రోజుల్లోని మా పైత్యమే ఈ ప్రేమ కథ

ఎప్పటిలాగానే ఆ వేసంకాలం కూడా అమ్మమ్మా వాళ్ళ ఊరెళ్ళాను, అందరమూ టీనేజ్లో కి ప్రవేశించాము అప్పటికే. మేము నలుగురము స్నేహితురాళ్ళము, ఎప్పటిలాగనే మా ఊరి టూరింగు టాకీసులో సినిమా చూడ్డానికి వెళ్ళాము. వెంకటేష్ సినిమా, మాంచి ప్రేమ కథ (పేరు సరిగా గుర్తులేదు). సినిమా చూస్తున్నంత సేపు ఊహలు ఎక్కడెక్కడో తేలిపోతున్నాయి.

"అబ్బ వాళ్ళిద్దరు ఎంత చక్కగా ప్రేమించేసుకుంటున్నరో, ఎంచక్కా పాటలు పాడేసుకుంటున్నారో, ప్చ్ నాకేమి తక్కువ ఆ హీరోయిన్ను కంటే నేనెందుకిలా ఉండిపోవాలి", నలుగురిలోనూ ఇవే ఆలోచనలు.

సినిమా అయ్యి బయటకి వచ్చి ఇంటికి నడుస్తుండగా మా పద్దు మొదలు పెట్టింది

"వాళ్ళిద్దరు ఎంచక్కా ప్రేమించేసుకున్నారు కదా"

వల్లి: "అవునే, నాకైతే ఆ హీరోయిన్ని చూస్తే ఎంత కుళ్ళు పుట్టిందో"

నేను: "ఎందుకే"

వల్లి: "ఆ హీరోయిన్ను కంటే నాకేమి తక్కువ, అయినా ఒక్కడు కూడా ఇంత వరకూ ప్రేమించలేదు"

పద్దు: "అవునే, మనల్ని ఎవరూ ప్రేమించట్లేదు, పోనీ మనమే ప్రేమించేస్తే?"

నేను: "ఇంట్లో వాళ్ళు అప్పుడు తప్పితే మనకి తద్దినాలు పెట్టరు"

వల్లి: "ఎహె..నువ్వు నోరుముయ్యి. నీకేమమ్మా, సిటీ లో చదువుకుంటున్నావు, క్లాసు లో కూడా బోల్డు మంది అబ్బాయిలు. మరి మా సంగతేంటి?"

నేను: "అందుకే చెప్పేది, అబ్బాయిలు ఉంటారని మిమ్మల్ని హై స్కూల్ కే పంపించట్లేదు, ఇప్పుడిలాంటి వేషాలు వేస్తే తర్వాత ఏమవుతుందో..."

పద్దు: "దీని మాటలు వినద్దే, మనం ఎలాగైనా ప్రేమించెయ్యాలి"

బొండి పిల్ల (దీని అసలు పేరు నాకు తెలియదు, చిన్నప్పటి నుండి అలానే పిలిచేవాళ్ళము) : "మరి నేనో"

అందరూ ఒక్క సారిగా నవ్వారు...ఎందుకో తర్వాత చెప్తాను

బొండి పిల్ల: "మీరు నన్ను ప్రేమించనివ్వకపోతే నేను మీ ఇళ్ళల్లో చెప్పేస్తాను"

(హమ్మో ఇది చెప్పినా చెప్పేస్తుంది)

పద్దు: "వద్దులే, నువ్వు కూడా మాతోబాటు ప్రేమిద్దువుగాని"

ఇలా నలుగురమూ ప్రేమించెయ్యాలి అని ఊకుమ్మడిగా డిసైడ్ అయిపోయి ఆ రోజు సాయంత్రం రహస్య సమావేశం పెట్టుకున్నాము. ప్రేమించటంలో అస్సలు అనుభవం లేదయ్యె అందుకే అందరమూ కలేక్టివ్ గా ఆలోచించి ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి అని మా తాపత్రయం

వల్లి: "ఎలా మొదలు పెడదామే"

నేను (ముప్ఫై రోజుల్లో ప్రేమించటం ఎలా అన్న పుస్తకాలు ఏమీ లేవు కాబట్టి): "ముందు ఎవరిని ప్రేమించాలో డిసైడ్ అవుదాము"

పద్దు: "ఎవరిని ప్రేమిద్దాము"

బొండి పిల్ల: "అసలు ప్రేమించటం అంటే ఏంటి?"

వల్లి: "ఓస్ నీకు ఇంత కూడా తెలియదా, ఒకబ్బాయిని అలా చూడాలి, తర్వాత ఐ లవ్ యూ అని చెప్పేసి పాటలు పాడేసుకోవాలి"

బొండి పిల్ల: "నలుగురమూ కలిసి ఒక్కరినే ప్రేమిద్దామా?"

నేను: "ఇప్పుడు నలుగురిని వెతకాలి అంటే కష్టం కాబట్టి ఒకరిని ప్రేమించేసి తర్వాత ఆలోచిద్దాము"

పద్దు: "అయితే మరి అబ్బాయి ఎవరు?"

వల్లి: "ఎవరో ఒకరు, రేప్పొద్దున్న మనం మంచి అబ్బాయిని వెతకటానికి వెళ్దాము, ఎవరైనా దొరికితే ప్రేమిద్దాము"

ఇదిగో అలా మా ప్రేమించేద్దాం రా కి ప్లాన్ డిసైడ్ అయ్యింది.

తర్వాత రోజు పొద్దున్నే అక్కడ కనిపించిన సినిమా కి ముందు నాకు మాట పడిపోయిందిం తర్వాత యేడుపు వచ్చింది. ఒక్కొక్కరూ ఎంత కలర్ఫుల్ గా వచ్చరంటే మా పద్దు, మాములుగా ఎంతో అమాయకం గా కనిపించే మా పద్దు, అనుపం ఖేర్ "వత్తైన జుట్టు కి వంద మార్గాలు" అని పుస్తకం రాస్తే కొనేసే పద్దు ఈస్ట్ మన్ కలర్ లో రెడీ అయిపోయి వచ్చేసింది. పచ్చ పరికిణీ, ఎర్ర వోణీ, నీలం గాజులు, ఆకుపచ్చ రిబ్బనులు.

ఇంక మా బొండి పిల్ల, ఎప్పుడూ చీమిడి ముక్కు తుడుచుకుంటూ చొంగ కార్చుకుంటూ ఉండేది అది కూడా చక్కటి లంగా వోణీ వేసుకుని వచ్చేసింది.
ఈ కధ రాసిన laxmi గారిని కబుర్లమ్మ తెలియదని అంటారా :(

నేస్తం చెప్పారు...

మనసుపలికే ..:) నేను రెడీ నే అన్నగార్లను ఇచ్చేయడానికి..వాళ్ళు ఒప్పుకోవద్దూ :)
శివరంజని హహహ ఆ మాటకొస్తే మా అమ్మా అంతే :) ఇంక విజయసాంతి అంటావా ..ఈ మద్య రాజికీయాల్లోకి వచ్చి ఇలా అయిపోయింది కాని చిన్నపుడు టివిలో పడమటి సంద్యా రాగం సినిమా చూసాకా నేను పేద్ద ఫేన్ ని అయిపోయా తనకు ..పర్లేదులే అడ్జస్ట్ అయిపోతా ఈ సారికి :)
అఙ్ఞాత గారు లక్ష్మి గారి గురించా చారిగారు చెప్పింది.. అసలు పోస్ట్ చదువుతున్నపుడే అనుకున్నా లక్ష్మి గారి గురించా అని..నేను బ్లాగులకు వచ్చిన కొత్తల్లో లక్ష్మిగారి పోస్ట్ కోసం చకోరపక్షిలా చూసేదాన్ని ..ప్లిచ్ మిస్ అవుతున్నా తనను :(

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారు బావున్నారా
ఎన్నాలయ్యిందో బ్లాగులు చూసి
ఇప్పటిదాకా మీరు రాసిన పోస్ట్ లన్నీ చదివేసా
మా ఇంజనీరింగ్ కాలేజీ లో మా సార చాలా అందం గా ఉండేవారు మేము థర్డ్ ఇయర్ చదువుతున్నపుడు అతనికి పెళ్ళయిపోయింది
ఎన్ని చెప్పినా క్లాసఅబ్బాయిల ముందు మాస్టర్లు అంత అందంగా అనిపించరు

అపర్ణ

అజ్ఞాత చెప్పారు...

ఇండియా లోనే జరిగిందా ఇది అంతా
సింగపూర్ లో tuitions కి డిమాండ్ ఉంటుందా!

dharma

Sasidhar Anne చెప్పారు...

@Aparna - Neeku Nestam akka lane avuthundhi leee. :) .. mee husband master ayyi. neeke tution cheppu gaka.. he he..

నేస్తం చెప్పారు...

>>>ఎన్ని చెప్పినా క్లాసఅబ్బాయిల ముందు మాస్టర్లు అంత అందంగా అనిపించరు
అపర్ణ అవునా :) .. మరి ఇన్నాళ్ళూ బ్లాగ్ చదవకుండా ఎక్కడకు వెళ్ళారు :)
ధర్మ గారు ఇది ఇండియాలో ఉన్నప్పటి సంగతి ..ఇక్కడ ట్యూషన్లకు విపరీతమైన డిమాండ్ కాకపోతె ఎవరుపడితే వారు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వరు ..
శసిధర్ శాపాలు ఇచ్చేవాళ్ళకే ముందు అవి తగులుతాయి ..చూసుకోమరి :)

రఘురాం చెప్పారు...

నేస్తం గారు!!,
:) :) :)........... సోమవారం అలా బ్లాగ్లోకం లో విహరిస్తుంటే మీ టపా కనపడింది, అంతే ఈ వారం మొత్తం మీ అన్ని టపాలు చదివేసా!!. నాకు ఎంతగా నచ్చేశాయి అంటే మా ఇంటిలో అందరికీ ఆచ్చువేసి (print తీసి) ఇచ్చాను చదవమని!!, ఈరోజూ మామూలు కంటే ముందుగానే (3hrs) office కి వచ్చేసా!! మీ టపాలు అన్ని కనీసం ఈ రోజైనా పూర్తి చేద్దం అని. అనుకున్నట్లుగా నే 3 కిసుక్కులు 36 ఫక్కులు గా పూర్తి చేసా! అసలు మీరు బాలికల బడి లో, కాలేజి లో చదువు కున్నరు కాని లేదంటే నేనూ మీ కాలేజి లో చేరిపోయి మీలా అద్భుతం గా కథ, కథానన్ని నడపడం నేర్చేసుకునే వాడిని, కాని ఏమి చేద్దం, ప్ల్చ్ .... కనీసం మీకు పాఠలు చెప్పిన గురువులు కూడ నాకు దొరకక పోయారు ( అంటే మా గురువులు బాగ చెప్పలేదు అని కాదు, కాని ఎదో మిస్స్ అయిన ఫీలింగ్). మీ కథా, కథనం అద్భుతం, అదుర్స్, కేక, పులి, కత్తి ...ఇలా ఎన్ని చెప్పినా తక్కువే, నా వ్యాఖ్య మీ టపా అంత ఐంది అనుకుంటా!.ఇట్లు
రఘురాం

..nagarjuna.. చెప్పారు...

అమ్మాయిలకు క్లాసబ్బాయిలు నచ్చుతారా..!!? ఛా...ఈ విషయం తెలిక నాలుగేళ్ల ఇంజనీరింజ్ జీవతాన్ని వృథా చేసానా....!! హతవిధీ. ఏమి నా దౌర్బాగ్యమూ.., అపర్ణ గారు మీకు తెలిసిన ఇలాంటి ఇంకొన్ని విషయాలు చెప్పరా ప్లీజ్..నేను నేస్తం గారిలా నిద్రపోను, ఆ...పరీక్షలపుడు ప్రశ్నలేంటని ముందే అడగను....ఆదర్శ విద్యార్థిని మరి.

Unknown చెప్పారు...

రఘురాం గారు
నేస్తం గారి బ్లాగు ని ఇంట్లో అందరితో చదివిస్తున్నారా చాలా సంతోషమండీ
మీ కలీగ్స్, ఫ్రెండ్స్ కి కూడా చదివించడమే కాకుండా కామెంట్స్ రాయించండి అప్పుడే మీరు నిజమైన అభిమాని అవుతారు
ధర్మ మా కలీగ్ నేను కామెంట్ రాయించాను వాడిచేత
శశి మరియు నాలాగా ఉండాలి ఫాన్స్ ఆంటే
శశి అంతే కదా :)

Unknown చెప్పారు...

నాగార్జున గారు
అమ్మాయిలు ఇష్ట పడాలంటే


http://www.youtube.com/watch?v=i6dEI6D_rcI&feature=player_embedded

ఇలా ఉంటే ఓకే

మనసు పలికే చెప్పారు...

నాగార్జున గారికి అవకాశం దొరికితే మళ్లీ నాలుగేళ్ల ఇంజినీరింగ్ జీవితాన్ని మొదలు పెడతారేమో, ఈ సారి వృథాగా పోనివ్వకుండా ఉండడానికి.. ఏమంటారు..?

..nagarjuna.. చెప్పారు...

@అపర్ణగారు: మొదటిరోజు నేర్చుకున్నా మొదటి పాఠము-అమ్మాయిలు చాక్లెట్‌బాయ్‌లను ఇష్టపడెదరు మరియూ దీనికి క్లాసబ్బాయిలూ క్లాసుబయట అబ్బాయిలూ అని తేడాలేదూ!!

cadbury వారిదే ఈ యాడ్‌ను చూసారా...చాలా పాతది లెండి
http://www.youtube.com/watch?v=rBTJhgPDAvw

@ప్రసీదగారు: అబ్బే, దానికి మాళ్ళా నాలుగేళ్లు చదవడమెందుకట...ఇలా అపర్ణగారిలా చిన్న చిన్న hints ఇస్తే చాలు...అసలే సెంటిమీటర్ లాజిక్ చెప్తే కిలోమీటర్ దూసుకుపోయే టైపు మనం ;) :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాగుంది నేస్తం, పాపం మీరు, ఎప్పటిలానే మీ కష్టాలు నాకు బోలెడు కన్నీళ్ళు తెప్పించాయ్(హ హ నవ్వి నవ్వి వచ్చిన కన్నీళ్ళు లెండి :)

కామెంట్ల సెంచరీ రీచ్ అయ్యేట్లున్నారు కదా ఆల్ ది బెస్టాఫ్ లక్కింగ్స్ :-)

Unknown చెప్పారు...

Oh may God ... !!! Can't stop laughing ... !!!

అజ్ఞాత చెప్పారు...

super post నేస్తం

మనసు పలికే చెప్పారు...

అయ్యయ్యో నాగార్జున గారూ!! నేను ప్రసీద గారిని కాను. నా పేరు అపర్ణ :(
'మనసు పలికే' మరియు 'సిరివెన్నెల' నా బ్లాగులు.

అజ్ఞాత చెప్పారు...

Hello nestam Ji
i am kannadiga i dont know much abt telugu
my friend indresh translated this post and i cant stop laughing till the end.

thanks to ur brother indresh
hope we will get more posts from you

you rock!

Vasant
nestam's fan from today

Unknown చెప్పారు...

నేస్తం అక్కా
తను మీ పోస్ట్ విన్నాక ఎంత నవ్వాడో తెలుసా
కర్చీఫ్ గుడ్డలు నోట్లో కుక్కుకున్నాడు
మీరు తనకోసం ఇంగ్లీష్ లో రిప్లై ఇవ్వండి ప్లీజ్జ్
సంతోషిస్తాడు

మీ తమ్ముడు
ఇంద్రేష్

నేస్తం చెప్పారు...

రఘు రాం కాసింత పని ఉండటం వల్ల మీకు లేట్గా రిప్లయ్ ఇస్తున్నా..చాలా సంతోషం వేసిందండి మీ వ్యాఖ్య చూసాకా
>>>నేను నేస్తం గారిలా నిద్రపోను, ఆ...పరీక్షలపుడు ప్రశ్నలేంటని ముందే అడగను
నాగర్జున గారు ఇది మరీ బాగుంది మద్యలో నా పోలిక ఎందుకంటారు
ఇంద్రేష్ మీ ఫ్రెండ్స్ అందరితోను చదివిస్తున్నావా.. మా తమ్ముళ్ళుకూడా ఇలా చేసేవాళ్ళు కాదేమో :) ..కాని బలవంతం పెట్టేయకేం కామెంట్స్ పెట్టమని..ఎవరికి నచ్చితే వారు తప్పక రాస్తారు :) ఇప్పుడు 100 కామెంట్స్ వస్తే ఏం ఉద్దరించాలి చెప్పు :) అభిమానం ఉంటే చాలదూ :)
ఇంతకూ అపర్ణ ,మనసుపలికే ఇద్దరూ ఒకటేనా లేక ఇద్దరి పేర్లు అపర్ణయా ఇక్కడ తెగ తింకింగ్స్ నేను..
అన్నట్లు మర్చి పోయా నేను నాకు నచ్చిన ఒక ఏడ్ చూపిస్తా.. నాకీతే మొదటి సారి అర్ధం కాలా.. రెండుసార్లు చూసాకా అర్ధం అయింది ఈ ఏడ్ చూడండి
http://www.youtube.com/watch?v=jpcqvzaWTg8&feature=related

నేస్తం చెప్పారు...

వేణు గారు చాలానాళ్ళకు.. ఆ సెంచరి దగ్గర అయ్యింది :) నిజంగా కాదులే వీళ్ళంతా అభిమాన హీరో సినిమా ఆడించినట్లు ముందుకు తోస్తున్నారు
;)
రహ్మన్ నాయక్ గారు థేంక్యూ థేంక్యూ
అఙ్ఞాత గారు థేంక్యూ :)
vasant ji
I felt very very happy when i saw your comment
thank you very much :)

మనసు పలికే చెప్పారు...

నేస్తం గారూ!! మనసు పలికే అపర్ణ మరియు మీకు "అపర్ణ" అన్న నామధ్యేయంతో వ్యాఖ్యలు పెడుతున్న అపర్ణగారు వేరు వేరు :)
అనుకోకుండా ఇద్దరి పేర్లు అపర్ణ అయిపోయాయి.
మీకు ఇంత క్లియర్ గా ఉంటే నాకు నచ్చదు నేస్తం గారు! అందుకే మీకు ఇంకో కన్ఫ్యూషన్ ఇస్తున్నాను. ఇంతకు ముందు అపర్ణ అన్న పేరుతో నా బ్లాగు నుండి కూడా నేను వ్యాఖ్యలు పెట్టాను. అవి నా బ్లాగు మొదటి రోజులు. తరువాత చాలా మార్పులలో భాగంగా నా రెండు బ్లాగులకి, 'మనసు పలికే' అని నామకరణం చేసేశా.
అన్నట్లు, మీరు పంపిన యాడ్ బాగుంది చాలా...

నేస్తం చెప్పారు...

ఇంద్రేష్ ఏమి చెప్పమంటావ్ చెప్పు ఒక్కోసారి ఏడుపొస్తుంది ఆనందం తో..నిజం గా నేను ఇంత అభిమానానికి అర్హురాలిని కాను ..నాకు తెలుసు నేనేదో సరదాగా రాస్తాను తప్ప అంత టాలెంట్ నాకు లేదని..కాని ఈ అభిమానం నన్ను ఒక్కోసారి ప్రశించుకునేలా చేస్తుంది ..నీ గురించే కాదు నన్ను ఎంతో అభిమానించే ప్రతి ఒక్కరి గురించి చెప్తున్న మాట ఇది :) ప్రస్తుతానికి మాటలు రావడం లేదు అంతే

మనసు పలికే చెప్పారు...

నేస్తం గారూ!! మీరు ఇంత అభిమానానికి అర్హులు కారు అన్నమాట అబద్ధం. అంజనేయుడి బలం ఆయనకు తెలియదు అన్నట్లుగా మీ గొప్పతనం మీకు తెలియడం లేదు ( ఒకవేళ తెలిసీ అర్హులు కారు అని భావిస్తే అది ఖచ్చితంగా మీ సంస్కారమే..:) )

నేస్తం చెప్పారు...

ఇదిగో అపర్ణ నువ్విలా కన్ ప్యూజ్ చేయకు బంగారం.. నేనసలే రెండు రెళ్ళు ఎంతా అంటే మూడు సార్లు ఆలోచించే రకాన్ని..:)
ఇక నీ రెండో వ్యాక్య మా ఆయనకు అర్జెంట్గా చూపించేయాలి ఈ రోజు తప్పదు .. :) kaakapote నిజం నాకు తెలియదా చెప్పు :)

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా మొత్తానికి మీరు సంస్కార వంతులు అయిపోయారన్నమాట.. అప్పుడెప్పుడో, నా అక్క కాని అక్క నా హాస్టల్ వార్డెన్ (మేమిద్దరం చాలా క్లోజ్) పిలిచేది, బంగారం అని. మళ్లీ ఇన్నాళ్లకి, సారీ ఇన్నేళ్లకి విన్నా ఆ పిలుపు. మళ్లీ ఈరోజు కడుపు నిండింది. :)

నేస్తం చెప్పారు...

హ హ నీకు తెలియదు కదా ఆ అక్క కాని అక్కను నేనే ..ఇలా మారు పేరుతో పోస్ట్లు రాస్తున్నా.. అమ్మో వంట మానేసి కబుర్లు చెప్తున్నా మళ్ళి ప్రచురిస్తా వ్యాఖ్యలు :)

మనసు పలికే చెప్పారు...

అయ్యయ్యో ఇలా సెంచరీ పూర్తవ్వకుండానే వెళ్లిపోతున్నారేంటీ..?? మీకు మీ వంట ముఖ్యమా ఇక్కడ సెంచరీ ముక్యమా అని నిలదీస్తున్నాను యువర్ ఆనర్.. :P
దయచేసి ఈ వ్యాఖ్యని మాత్రం మీ ఆయనకి చూపించకండి :(
నా అడ్రస్ కనుక్కుని మరీ వచ్చి.. (జింతాత్త జింతాత్త).

Sai Praveen చెప్పారు...

@అపర్ణ,
మీ అక్క పేరు , ఊరు etc. వివరాలు చెప్తారా? ఇన్నాళ్ళు నేస్తం గారు చెప్పను అంటున్నారు మీరైనా చెప్పండి :)

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కా.. నన్ను మాత్రం క్షమించెయ్యాలి.. ఇక్కడ మీ అభిమానులు అడుగుతూ ఉంటే మా అక్క (మీ) గురించిన నిజాలు ఇలా దాచడం భావ్యంగా అనిపించట్లేదు..
సాయి ప్రవీణ్ గారూ! మా అక్క మమత, ఊరు పెద్దపల్లి / గోదావరిఖని ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం. ఈ అక్క ఆ అక్కే అయితే ఎంత బాగుండు..!! ఆ అక్కతో కాంటాక్ట్స్ లేక 3 సంవత్సరాలు పైనే అయింది. :(

నేస్తం చెప్పారు...

వంటే ముఖ్యం ..ఎందుకంటే నాక్కుడా ఆకలేస్తుంది కాబట్టి :)ఏంటి జంతాక చేసేది..నా వాళ్ళను ఏమన్నా అంటే నేను సహించను,భరించను అని శివాలెత్తేయనూ :)
సాయి ప్రవీణ్ అది సంగతి ..మొత్తానికి హమ్మాయ్యా నా గురించిన వివరాలు చెప్పేసాను ఇన్నాళ్ళకు .. :)

మనసు పలికే చెప్పారు...

నేస్తం గారూ!! నాకు ఇప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది.. :) మీరు సెంచరీ కొట్టేశారు. అది కూడా నా బాల్ తో సెంచరీ అవ్వడం నాకు మహదానందంగా ఉంది సుమా.. ఇక నాకు ఓ వారం రోజుల వరకూ భోజనం అవసరం లేదు.. :)
మీరు ఇలా సెంచరీల మీద సెంచరీలు కొట్టెయ్యాలనిన్నూ, రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టెయ్యాలనిన్నూ మనస్ఫూర్తిగా కోరేస్కుంటున్నాను ఆ జగన్నాటక సూత్రధారిని. (తథాస్తు అనేశాడు కూడా ఆ భగవంతుడు).

Sai Praveen చెప్పారు...

అపర్ణ,
ఆ అక్క ఈ అక్క కాదని క్లియర్ గా తెలుస్తూనే ఉందిలే. అడగగానే చెప్పినందుకు ధన్యవాదాలు :)

నేస్తం గారు,
తమ్ముళ్ళని మోసం చెయ్యడం అంత వీజీ కాదండి :)

Srujana Ramanujan చెప్పారు...

:) You rock as usual

హరే కృష్ణ చెప్పారు...

మొదటి కామెంట్ ఎలాగో రాయలేదు
వందో కామెంట్ కూడా రాసే భాగ్యం లేకపోయింది
ప్చ్చ్ :( :(

ఈ మనసు పలికే గారు వచ్చి మొత్తం మైల్ స్టోన్ లు అన్నీ వచ్చి ఎత్తుకుపోయారు

హరే కృష్ణ చెప్పారు...

నాగార్జున! వందో కామెంట్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు మెయిల్ కోట్టమన్నాను కదా

మన స్వార్ధం కోసం చూసుకోవడం వల్ల 100th comment అపర్ణ గారు ఎత్తుకుపోయారు

శశిధర్ కి కూడా చివరికి రాలేదు పాపం

తొంభై కామెంట్ల నుండి 102 కామెంట్లు వరకు వరుసగా రాసి మాకు ఛాన్స్ రాకుండా చేసినందుకు ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాం

చివరగా అభినందనలు నేస్తం గారు :)

..nagarjuna.. చెప్పారు...

congrats నేస్తం..మీరు వంద వ్యాఖ్యలు పూర్తి చేసుకున్నందుకు....:) :)

పోతే క్లాసులో నిద్రపోతారన్నదాని గురించి..,ఆ పోన్లెండి దాని వల్ల మాకు కొత్త మిత్ర్లులు దొరికారుగా....మీరూ సంతోషించండి

@హరేకృష్ణ: మన అభీష్టం ప్రకారం నేస్తం బ్లాగులో వంద వ్యాఖ్యల కోరిక తీరిందనుకుంటా...మరి పార్టి ఎప్పుడు చేసుకుందామో చెబుతారా..

..nagarjuna.. చెప్పారు...

@ప్రసీదగారు: హమ్మా..మీరు భోజనం చేయకుండా చేసి మా నేస్తంను క్షంతవ్యురారిలిని చేద్దామనే...!!ఆ పప్పులేం ఊడకవు ఇక్కడ. మా గూఢచారులకు నిఘాగా ఉన్నారులెండి.ఓక్క రోజు తినకపోయనా వారం మొత్త్తం తినిపించే ప్రోగ్రాం పెట్టుకున్నామిక్కడ..అదీ matter

ఇక పోతే నేస్తం..,మీరు ఆ అభిమానానికి అన్నివిధాలా తగినవారు....ఏదో మొహమాటానికి చెప్తున్న మాటకాదిది..నిజ్జెంగా నిజెం :)

హరే కృష్ణ చెప్పారు...

నేస్తం గారు ఇలా పోస్ట్ లు రాయడమే మనకి పెద్ద పార్టీ
Congratulations :)

సరే గాని మన పార్టీ లో ఎంతమంది ఉండొచ్చు?

మనసు పలికే చెప్పారు...

హరే కృష్ణ గారూ!! బ్లాగ్లోకం లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు, కరెక్ట్ గా follow up అయ్యామా లేదా అన్నదే ముఖ్యం (పోకిరి గుర్తు తెచ్చుకోండి) :)
నిజానికి నేనేమీ కావాలని అలా చేయలేదండీ.. ఏదో అలా అదృష్టం కలిసొచ్చింది అంతే.. కానీ చాలా ఆనందంగా ఉంది తెలుసా, ఇలా మీరంతా ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టాన్ని నేను దగ్గరుండి జరిపించడం..

మనసు పలికే చెప్పారు...

నాగార్జున గారూ!!
నేను ప్రసీద గారిని
కాను (పైకి).. కాను (కిందకి).. కాను (ఎడమ పక్కకు).. కాను (కుడి పక్కకు).
నేస్తం గారు, మీరైనా చెప్పండి నాగార్జున గారికి, నా పేరు మార్చేశారు. వ్వా...ఆ.. (మీ బంగారం ఏడుస్తుంది ఇక్కడ)
ఇట్లు,
మీ అపర్ణ.

మనసు పలికే చెప్పారు...

నాగార్జున గారూ!!
పేరు మారిస్తే మార్చారు గానీ, ఆ గూఢచారులెవరో కాస్త చెప్పరూ.. !! అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా..:(

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కా.. మీ చెల్లి + అభిమాని + బంగారాన్ని నా బ్లాగులో మీ 2 years industry అభిమానులు అంతా కలిసి కుట్రలు పన్ని కుతంత్రాలు పన్ని ఏవేవో స్కెచ్ లు గీసేస్తున్నారు. మీరు అదంతా చూసేసి మా అందరికీ న్యాయం చేసెయ్యాలంతే..
http://manasupalikey.blogspot.com/2010/08/blog-post.html

నేస్తం చెప్పారు...

ఏంటిది ...ఏంటిదీ అని అడుగుతున్నా.. వీకెండ్ కదా అని కాసేపు అలా బయటకు వెళ్ళివస్తే ఇలా కొట్టేసుకోవడమే.. ఇంతకు విషయం ఏంటంటే రేపు ఇర్ఫాన్ పఠాన్ వస్తున్నాడు మా వూరికి.. తనతో రేపు నైట్ డిన్నర్ party ఉంది .. హి హి హి కొంచెం కొట్టుకోవడం మానేసి కుళ్ళుకోండి క్రికెట్ ప్రియులు :)

తార చెప్పారు...

కుళ్ళుకోవటమా? పఠాన్ కే?
మరీ జోకు..

అవును బిల్లు ఎవరు కడతారు పార్టిలో??

శ్రీనివాస్ చెప్పారు...

అయితే పఠాన్ కి కాస్త స్పీడ్ తగ్గించి ఎక్కువ స్వింగ్ చెయ్యమని చెప్పండి .... స్టంప్ టు స్టంప్ బాల్ వేయమని చెప్పండి .. బ్యాటింగ్ తగ్గించుకుని బౌలింగ్ లో దృష్టి పెట్టమని చెప్పండి .... ఒంగోలు సేను చెప్పాడని చెప్పండి .

నేస్తం చెప్పారు...

తార గారు రోజులు మారిపోయాయి ఒక్కళ్ళూ కుళ్ళుకోవడం లేదు..:/
శ్రీనూ... బాబు అంతేనా ఇంకేమన్నా చెప్పాలా

..nagarjuna.. చెప్పారు...

నేను అదే చెప్పాను నేస్తంగారు...ఇలా అభిమానులు, అయివారు కొట్టుకొవడం దేనికి అని. అందెకే ఏంతో.....కష్టపడి రాజి కుదిర్చాను. ఇపుడు matter over, matter over, matter over :)

పఠాన్‌ వస్తున్నాడా...ఐతే శ్రీను భాయ్ చెప్పినట్టు బ్యాటింగ్ పక్కనబెట్టి బౌలింగ్‌పై దృష్టి పట్టమనండి కుర్రాడు బాగుపడతాడు

@తారాగారు: పార్టి సంగతి కావాలిగాని( మీరు వస్తారుగా) బిల్లు సంగతి ఎందుకండి. ఐనా అడిగారు కాబట్టి బిల్లు మాకు తెలియదు(పైకి) మాకు తెలియదు(కిందకు) మాకు తెలియదు(కుడి పక్కకు) మాకు తెలియదు(ఎడం పక్కకు)

నేస్తం చెప్పారు...

@ నాగార్జున అదే అదే చూస్తున్నా ఎలా రాజి కుదురుస్తున్నారో అపర్ణ బ్లాగ్లో ..
తార గారు బిల్లు సంగతి నాకూ తెలియదు. మొత్తానికి ఫ్రీ అనుకుంటున్నా.. మా ఆయనగారు ఆడుతున్నారులేండి రేపు సదరు పఠాన్ గారి నేత్రుత్వం లో జరగబోయే మేచ్ కి ... సరేలే డిన్నర్ వండక్కరలేదుగా అని కాసేపు బ్రతిమాలించుకుని ఒప్పుకున్నా.. రేపటి నా మూడ్ ఎలా ఉంటుందో మరి చెప్పలేం ..ముందుగానే అందరిని బోలెడు కుళ్ళబెడదామని ఆశగా వస్తే నీళ్ళు జల్లేసారుగా..హూం

హరే కృష్ణ చెప్పారు...

పఠాన్ కి డొమెస్టిక్ మార్కెట్ కూడా లేకపోవడం తో హయ్యో చివరికి డబ్బులకోసం ఇంతకీ తెగిన్చాడా హతవిధీ ప్చ్చ్ !

హరే కృష్ణ చెప్పారు...

నేస్తం గారు

matter is not over,not over
just baby over :)

మనసు పలికే చెప్పారు...

నేస్తం గారూ!! చూశారా ఎంత బాగా రాజీ కుదిర్చారో మీ అభిమాన తమ్ముళ్లు..!! ఏంటా, కామెంటి ఇన్ని గంటలు అయిపోయాయి, ఇంకా వ్యాఖ్య పెట్టలేదేంటా అని చూస్తున్నా.. బయటకి వెళ్లొచ్చారా.. రాజీ లో పార్టీ బిల్లు నాదే అని చెప్పేశారుగా..ఈ సారికి నా అకౌంట్ నుండే కానిచ్చెయ్యండి మరి.

Unknown చెప్పారు...

Hello Nestam ji
first of all i am very sorry to you writing this in English, actually don't know how you guys are typing in Telugu font :)

I am new to your blog read all your stories and its very good.
keep going :)

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం గారు.. 100 కామెంట్లు కొట్టిన సందర్భం గా శుభాకాంక్షలు.
హరేకృష్ణ గారు.. ఇది మన అభిమానుల విజయం...
ఇక్కడ 100 వ కామెంటు మన తమ్ముళ్ళకి కాకుండా చేసిన అపర్ణ గారి వైఖరిని ఖండిస్తున్న.

ఇట్లు
హార్డ్ కోర్ ఫ్యాన్ రాజ్కుమార్ :) :)

హరే కృష్ణ చెప్పారు...

జాజిపూలు అభిమానులకు సింగపూర్ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కా చూశారా చూశారా..?? నా మీద ఎన్ని ఖండనలో.. వ్వా..
మీ సెంచరీ అయ్యే సమయానికి ఎవ్వరూ లేకపోవడం వాళ్ల తప్పు కాదట. దగ్గర ఉండి మీ సెంచరీ జరిపించిన నా తప్పట.. వ్వా.. వ్వా.. నాకు కూడా ఖండించడం వచ్చు.. నేను కూడా ఖండ X ఖండ X ఖండ ఖండాలుగా ఖండించేస్తున్నా.. హ్హ..

నేస్తం చెప్పారు...

సృజన ,హరి ఇరువురికీ థేంక్యూలు ..
హరే క్రిష్ణ సింగపూర్ పుట్టినరోజుకి ఇండియావాళ్ళకు శుభాకాంక్షలు చెపితే కొట్టేస్తారు జాగ్రత్త :)

నేస్తం చెప్పారు...

మరేం పర్వాలేదు ఒక్క గుణకారించే కాదు భాగించి,హెచ్చించి ,కూడి ,తీసివేసి అన్ని రకాలుగా ..ఖండ ఖండాలుగా... ఖండించేసుకో అపర్ణ :)

రాజ్ కుమార్ చెప్పారు...

nestam gariki సింగపూర్ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు.. :)
ఎవరండి మమ్మల్ని కొట్టేది? మాకు కొండంత అండగా మీరుండగా..!

Sasidhar Anne చెప్పారు...

mothaniki.. 100 cross ayyindhi..

నేస్తం చెప్పారు...

హూం ఇందాక నా వ్యాఖ్య డిలీట్ చేసా శశిధర్ ..నాకే మిమ్మల్ని బాధ పెట్టానేమో అనిపించింది.. అంటే 100 వ్యాఖ్యలు అవ్వడంలో నా గొప్పదనం లేదు అని చెప్పాలనుకుని ఇంకేదో అనేసా ..ఏమనుకోవద్దు :)

Sai Praveen చెప్పారు...

నేస్తం గారు,
ఆ వ్యాఖ్యని ఖండిద్దాం అనుకునేలోపు మీరే డిలీట్ చేసేసారు :)
అయినా ఇంత చర్చ జరిగింది మీ మీద ఇంత మందికి అభిమానం ఉండబట్టే కదా. మరి అంత అభిమానం ఊరికే వస్తుందా?
ఇది ఖచ్చింతంగా మీ గొప్పతనమే.... మీ విజయమే :)

నేస్తం చెప్పారు...

సాయ్ ప్రవీణ్ అంతే అంటారా అయితే ఓకే..:)

Sasidhar Anne చెప్పారు...

emmanav akka.. nenu aa vakya ni chudaledu.. parledu.. nannu - "meeru" ani pilavasina pani ledu.. "nuvvu" ante chalu..

btw.. naa movie blog petti one year ayyindhi.. daniki oka special article rasa.. koncham chadivi pettandi..

http://myreviews4all.blogspot.com/2010/08/first-birthday-to-my-blog-my-one-year.html

pavani చెప్పారు...

నేస్తం గారు చాలా బాగా రాశారు అండి. చదువుతున్నంత సేపు నవ్వు అపుకొలేక పోయా. మిమ్మల్ని ఆ పరిస్థితి లొ వూహిస్తేనే నవ్వు ఆగటం లేదు. మంచి కథ :):):)

మనసు పలికే చెప్పారు...

నేస్తం గారూ!!. మీరలా చీమ పట్టే సందు ఇస్తే చాలు... అందులో వంద ఏనుగుల్నైనా తీస్కెళ్లి పోగలను.:P
ఇక చూస్కోండి, ఖండించడంలో నా తడాఖా.. Ph.D. చేసేసి డాక్టరేట్ పట్టా పుచ్చేస్కోనూ..

పవన్ కుమార్ చెప్పారు...

వామ్మొ..
నెను లేని టైం లొ స్కొరు 133 అయిపొయిందా.
ఎది ఎమైనా, నేస్తం అక్కకి శుభాకాంక్షలు. ఇది 150 కామంట్ అయితె బావున్ను :)

మాలా కుమార్ చెప్పారు...

బాగుందండి . మీ అభిమానుల అల్లరి ముచ్చటగా వుంది .

నేస్తం చెప్పారు...

వేణురాం :)
పావని థేంక్యూ :)
పవన్ మరి లేట్ గా చూస్తే ఎలా:)
మాలా కుమార్ గారు :)ఇది వాళ్ళ అభిమానం అంతే :)
అపర్ణ అయితే డాక్టర్ అపర్ణ అని పిలిచే రోజుకోసం చూస్తుంటాను :)

అజ్ఞాత చెప్పారు...

టపా బాగుందండీ.
ఇందులోని నీతి మీరు టైటిల్లోనే చెప్పేసారు. అంతేనా?

కౌటిల్య చెప్పారు...

హ్మ్..నేస్తం జీ..ఈ టపాకి కామెంటు రాసే తిరుపతెళ్ళిన గుర్తు....కానీ ఇప్పుడొచ్చి చూస్తే నా కామెంటు లేదు,పైగా నూటానలభై కామెంట్లా!!..ఈ అన్యాయాన్ని,పక్షపాతాన్ని(అభిమాన సంఘ) నేను తీవ్రంగా ఖండిస్తున్నాను....ః-)...మీ అభిమానుల అల్లరి భలేబాగుంది...అపర్ణగారు,శశిధర్ వీళ్ళదైతే మరీను..ఎంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళో మీకు....నా

ఇక టపా ఎప్పట్లాగే సూపరు...బ్లాక్ బోర్డ్ చూస్తే ఇస్త్రీ చేసిన దుప్పటి,పరుపు గుర్తొస్తాయా...ఈ మాట చెప్పుకుని మొన్న మా అక్కవాళ్ళందరితో ఎంత సేపు నవ్వుకున్నామో....మా పెద్దక్క మరీ!

సుభగ చెప్పారు...

చాలా చాలా నవ్వించారు. సూపర్ గా రాసారు.

నేస్తం చెప్పారు...

సుభగ ,బోనగిరిగారు థెంక్యూ వేరీ మచ్..
అవునా కౌటిల్యా ..మరి నాకు రాలేదు ఏం కామెంటూ.. అక్కకు చెప్పి నవ్వించినందుకు మీకూ నవ్వినందుకు మీ అక్కయ్యకు ఇద్దరికీ బోలెడు థేంక్యూ లు

అజ్ఞాత చెప్పారు...

ఇన్ని కామెంట్లు గల పోస్ట్ చాలా రోజుల తర్వాత చూస్తున్నా
చాలా బాగా రాసారు నేస్తం

అజ్ఞాత చెప్పారు...

అంతకు ముందే కంప్యూటర్ని చూసానేమో నాకు భయం తో చమటలు పట్టేసాయి
ఇ line చదివి పడి పడి నవ్వాను

వెంకటేష్

అజ్ఞాత చెప్పారు...

సూపర్ గా రాసారు.బాగా నవ్వించారు.

అజ్ఞాత చెప్పారు...

నూట యాభై కామెంట్లు పూర్తిచేసుకున్నందుకు అభినందనలు

అజ్ఞాత చెప్పారు...

నూట నలభైదవ కామెంట్ నాదే
ఇంద్రేష్

Sasidhar Anne చెప్పారు...

next tapa kosam waiting, waiting..

రాజ్ కుమార్ చెప్పారు...

150 naadey.....

హరే కృష్ణ చెప్పారు...

హ్మ్మ్
నాకు ఒక్క milestone కూడా దక్కకుండా చేసితిరి
అభినందనలు

నేస్తం చెప్పారు...

మొత్తానికి 150 అయిపోయింది..ఇప్పుడు చెప్పండి ఆ అఙ్ఞాత క్రింద వచ్చింది ఎవరూ :)
hare krishna :)

మనసు పలికే చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కా.. అభినందనలు.. :)

అజ్ఞాత చెప్పారు...

ధన్యవాదాలు 150 కామెంట్లు పూర్తి చేస్కున్నందుకు..:)
అంటే ఆ అజ్ఞాత కామెంట్లు మీవేనా మనసుపలికే గారు

అభినందనలు చెప్పాలి కానీ ధన్యవాదాలు చెప్పకూడదు కదా
అంటే ఆ కామెంట్లు రాసింది మీరే అపర్ణ

Sasidhar Anne చెప్పారు...

150 comments cross ayayi congrats akka.. ee post lo enno records cross chesam.. :)

..nagarjuna.. చెప్పారు...

నేడే చూడండిబాబు, నేడే చదవండి
నేడే చూడండిబాబు, నేడే చదవండి

మీ అభిమాన బ్లాగరు నేస్తం జీవించి, రచించిన 50, 100,150 వ్యాఖ్యలు దాటుకుంటూ దిగ్విజయంగా 200 కామెంట్లకు పరుగులు తీస్తున్న టపా. అభిమాన తమ్ముళ్ళ ధర్నాలకు, బంగారు చెల్లెమ్మల ఫిర్యాదులకు కారణమౌతున్న ఆల్‌టైం సూపర్ డూపర్ బంపర్ మెగాహిట్టు ’జాజిపులు’ సిరీస్‌లోని ’గురువులను పూజింపుము... టపా

నేడే చూడండిబాబు, నేడే చదవండి
నేడే చూడండిబాబు, నేడే చదవండి

Raja చెప్పారు...

హాయ్ బుజ్జి అక్కా, మీరు చాలా బాగా రాస్తున్నారు అక్కా, ఎందుకో అలా కూడలి లొ చూస్తుంటె జాజిపూలు కనిపించింది, అదె గురువులను పూజింపుము...పెళ్ళి చేసుకోకుము చూశాను, ఎంత బాగా రాశావు అక్కా, చదుతుంటె నా కళ్ళతొ నేనే చుస్తున్నట్లుందనుకో, మీరు మా పక్కింట్లొ వుండేవారిలా అనిపించిందక్కా , ఏదో సరదాగా అప్పుడప్పుడు బ్లాగ్ లు చూస్తుంటాను అక్కా కానీ మీ గురువులను పూజింపుము...పెళ్ళి చేసుకోకుము చదివిన తర్వాత మీ బ్లాగ్ లొ టపాలు అన్నీ రెండు రోజులలొ
పూర్తి చేసేవరకు వుండలేకపొయాననుకో , నేను చాలా బ్లాగులు చూశాను, చాలా టపాలు చదివాను కానీ ఎప్పుడూ ఇలా కామెంట్ పెట్టాలని అనిపించలేదు, మీ బ్లాగ్ చూశాక మీకు ధన్యవాదాలు చెప్పాలని ఇలా కామెంట్ పెడుతున్నాను , మీ బ్లాగ్ చుదువుతుంటే ఎందుకో మీరు అత్యంత ఆప్తురాలుగా అనిపిస్తున్నారు మీరు ఇలాగే మరెన్నో తియ్యటి ఙ్ఞాపకాలను మాతో పంచుకుంటారని ఆశిస్తూ ....

మీ ప్రియమైన తమ్ముడు,
రాజా
సారీ అక్కా కొంచెం పెద్ద కామెంట్ పెట్టాను

kishore చెప్పారు...

chaala baaga narrate chesaaru.

idi chaduthunte okati gurthochindi. nenu cheppe class lo naa friend vachi join ayyindi. thana vaipu chusthey chaalu navvedi. inka tappaka, kochenlu adagavalisi vachedi.

రాజ్ కుమార్ చెప్పారు...

yes..yes... 150 వ కామెంట్ నాదే... పండగ... :) అజ్ఞాత గారికి థాంక్స్.. :)
నేస్తం గారు.. అభినందనలు.. మీరు త్వరగా ఇంకో పోస్ట్ రాయక పొతే ఈ కామెంట్లు 200 అవుతాయి హిహిహి.

రాజ్ కుమార్ చెప్పారు...

నేడే చూడండిబాబు, నేడే చదవండి
నేడే చూడండిబాబు, నేడే చదవండి

మీ అభిమాన బ్లాగరు నేస్తం జీవించి, రచించిన 50, 100,150 వ్యాఖ్యలు దాటుకుంటూ దిగ్విజయంగా 200 కామెంట్లకు పరుగులు తీస్తున్న టపా. అభిమాన తమ్ముళ్ళ ధర్నాలకు, బంగారు చెల్లెమ్మల ఫిర్యాదులకు కారణమౌతున్న ఆల్‌టైం సూపర్ డూపర్ బంపర్ మెగాహిట్టు ’జాజిపులు’ సిరీస్‌లోని ’గురువులను పూజింపుము... టపా

నేడే చూడండిబాబు, నేడే చదవండి
నేడే చూడండిబాబు, నేడే చదవండి

naagarjuna gaaru keka... comment...

Unknown చెప్పారు...

ఎమిటర్రా? ..చిన్న పిల్లల్లాగా ఈ ఆటలు..? హ హ.. నేను ఏ బ్లాగులోనూ చూడలేదిలా.. ! నేస్తం గారు.. అభినందనలు.. ఇంతమంది తమ్ముళ్ళను, చెల్లెళ్ళను సంపాదించుకున్నారు..

నేస్తం చెప్పారు...

రాజ నీ వ్యాఖ్య చదువుతుంటే నాకు మా తమ్ముడిలాగే అనిపిస్తున్నావ్ ..థేంక్యూ వేరీ మచ్ అంత పెద్ద కామెంట్ పెట్టినందుకు :)
కిషోర్ హ హ అవునా.. అలా నవ్వేస్తే ప్రశ్నలు అడిగేయడమే ...తప్పు కదూ :)
వేణురాం ఇక్కడేం చూసావ్ కామెంట్ల పండగా ..అపర్ణ ,నాగార్జున బ్లాగులకు వెళితే రోజుకి 100 కామెంట్స్ .. :)
అబ్బులు గారు :)

అజ్ఞాత చెప్పారు...

కిశోర్ మీరు మాస్టారా
మా బాచెలర్ తమ్ముళ్ళకు ఏమనా సంబంధాలు ఉంటే చూసి పెట్టండి

ఒక తమ్ముడు
Indresh

అజ్ఞాత చెప్పారు...

అక్కయ్య మీరు కూడా రికమెండ్ చెయ్యండి
కిశోర్ కి ఒక ఆజ్న వెయ్యండి
మా కోసం మీ తమ్ముళ్ళ కోసం :-)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారు పదిమంది మీకు కామెంట్లు రాస్తే మీరు ఒక్క రిప్లై ఇస్తే ఎట్లా
200 చేద్దామని చూస్తుంటే మీరు ఇలా suspense లో పెడుతున్నారు

ఒక అభిమాన తమ్ముడు

రాజ్ కుమార్ చెప్పారు...

అదిగో ..నేస్తం..రాజ ఒక్కరేనా మీ tammudu ? నన్ను ఎనాడైన తమ్ముడు అని పిలిచార? దీన్ని నేను కస కస ఖండిస్తున్న... ఇది ముమ్మాటికి పక్షపాత వైఖరే... హరేకృష్ణ గారు.. మనకి అన్యాయం జరుగుతోంది.. నేస్తం గారి ముదురు వీరాభిమానులూ.. రండో..రారండో.

హరే కృష్ణ చెప్పారు...

సచిన్ రికార్డు ని ఛేదించేలా ఉన్నట్టున్నారే
అందుకోండి అభినందనాలు ముందుగానే :)

హరే కృష్ణ చెప్పారు...

ఆభినందనలు*
200th కామెంట్ రాసే సువర్ణ అవకాశం నాకు దక్కాలని కోరుకోండి :)

Sai Praveen చెప్పారు...

నాగార్జున, కామెంట్ సూపర్ :)
నేస్తం గారు, అభినందనలు.

Anand Kumar చెప్పారు...

ఏమిటిది? అసలిక్కడ ఏమి జరుగుతుంది? కొత్త పోస్ట్ పెట్టారేమో అని చూస్తె... పాత పోస్ట్ కి కామెంట్ల వర్షం.... హా హా... అభినందనలు నేస్తం గారు..

అజ్ఞాత చెప్పారు...

ఇంకా ఇదే పోస్ట్ ఉందా,కొత్తది రాయలేదా :(

అజ్ఞాత చెప్పారు...

నూట అరవై కామేట్లు బాబోయ్ నేను ఏ బ్లాగులో చూడలేదు ఇన్ని కామెంట్లు

నేస్తం చెప్పారు...

ఇంద్రేష్ మాస్టార్లు పెళ్ళీసంబందాలు చూస్తారా :)
వేణురాం :)
హరే క్రిష్ణా :) ఎందుకు నవ్వానంటే ..కీబోర్డ్ లో H కీ పనిచేయకా ఎన్ని సార్లు టైప్ చేసినా అరే క్రిష్ణా అని పడుతుంది :)
సాయ్ ప్రవీణ్ ,శశి ,మధు బాబు గారు ఇంకో మూడూ చిరునవ్వులు ...:)))
అఙ్ఞాత మళ్ళీ పోస్ట్ ఆ.... రాయాలి ...బద్దకం అంతే :)
మరొక అఙ్ఞాత గారు 150 కామెంట్లు చూడలేదా :) ఇప్పుడు ఏ బ్లాగ్లో చూసినా మినిమం 100 ఉంటున్నాయి :)

హరే కృష్ణ చెప్పారు...

On the Start menu:


Point to All Programs.


Point to Accessories.


Point to Accessibility.


Select On-Screen Keyboard.

select harekrishna :)

హరే కృష్ణ చెప్పారు...

వద్దు లెండి నేస్తం గారు
యాలా కంటే ఇదే పిలుపు కాస్త బెటర్ కదా :)
h పని చెయ్యలేదా
అరే కిస్ నా అవుతుంది కదా!
మంచి అయిడియా ఇచ్చారు
సూపర్.. థాంక్ యూ,మా colleague కి ఎలా propose చెయ్యాలా అని ఆలోచిస్తున్నా

థాంక్ యూ థాంక్ యూ నేస్తం గారు
మీ అయిడియా దయవల్ల నేనో ఇంటివాడినయితే మీకు మరియు జాజిపూలు అభిమానులకు పార్టీ ఇస్తా :)

అజ్ఞాత చెప్పారు...

నమస్కారము మీ బ్లాగు చాలా సరద సరదాగా ఉంది

అజ్నాతలకే అజ్ఞాత

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. నాగార్జున.. సూ...పర్ కామెంట్:)
నేస్తం అక్కా, ఇదేమన్నా బాగుందా? మీ రెండొందల సంగతి వదిలేసి, మా వంద గురించి చెప్తున్నారేంటక్కా..? కృష్ణ గారికి మాత్రం భలే పేరు పెట్టారు..:) హిహ్హి..

Raja చెప్పారు...

హాయ్ అక్కా , థాంక్యూ వెరీమచ్ , డబుల్ సెంచురీ కొట్టాలి అక్కా

Sasidhar Anne చెప్పారు...

Akka.. MOthaniki bangalore lo last week ee illu dorkinidhi..
bachelor ki room dorakatam entha kastamo.. chivariki maa parents vacchi nathone vuntaru ani cheppi.. illu teesukunna..

Comments jet speed vegam tho velthunnatu vundi..

చంద్రశేఖర్ కాటుబోయిన చెప్పారు...

నేస్తమా..
ఏడాది క్రితం ఏవో మీరు రాసిన బ్లాగ్స్ కొ ఒక రెండు సార్లు కామెంటినట్టు గుర్తు,తరువాత నేనెప్పుడూ కామెంటలేదు కానీ ఎ పొస్త్,kee board not working..properly so writing in english,so for your all posts are excellent..keep it up maam..and pls look in to my blog and let me know ur freed back..thanks.

నేస్తం చెప్పారు...

రామ రామ ...hare krishna ఆ చెప్పిన మరు క్షణం ఆ జరిగే సంఘటనల్కు నేను బాధ్యురాలిని కాదు.. ఆ భగవంతుడు నిన్ని కాపాడుగాక..
అఙ్ఞాతలకే అఙ్ఞాత గారు చాలా చాలా దేంక్స్ :)
అపర్ణ :)
రాజ :)
శశిధర్ హమ్మయ్యా..మొత్తానికి ఒక ఇంటివాడివైనావన్నమాట.. నిజమే బ్రహ్మచారులకు అంత తొందరగా ఇవ్వరు ...వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయిగా :)
చంద్ర శేఖర్ గారు నాకు గుర్తు ఉంది ..కామెంటారు :) తప్పకుండా చూస్తాను మీ బ్లాగ్ ...థేంక్యూ :)

పవన్ కుమార్ చెప్పారు...

ఎంటిది 180 లొకి వచ్చాక రన్ రేట్ మందగించింది.
కమాన్ కామ్రేడ్స్. డబల్ సెంచరి ఇంకెంతొ దూరం లొ లెదు.
అక్కా, మీకు నచ్చిన బ్లాగ్ పొస్ట్ లొ ఇంకొన్ని చెర్చొచ్చు కదా..

మనసు పలికే చెప్పారు...

హ్మ్.. అవునవును.. రన్ రేట్ మందగించింది. నేను కూడా మన కామ్రేడ్స్ కి పిలుపునిస్తున్నానహో..

Sasidhar Anne చెప్పారు...

akka.. kottha post kosam waiting ikkada...

sravana masam kaburlu cheppochhu kada..

........................ చెప్పారు...

"కోబాల్ అనేది ఒక డైనోసార్ లాంటిది ...మనం కాసింత ఏమరుపాటుగా ఉన్నామో గబుక్కున మింగేస్తుంది...

nakidi chadivaka meku malli vetipi home tuition cheppalanipistundi :P

సన్నిగాడు చెప్పారు...

climax బాగుంది.
ఈ మధ్య టైం సరిపోక మీ టపాలు చదవలేకపోతున్నాను
ఇక పోతే conclusion "sorry"
Cheers

హను చెప్పారు...

nice one anDi.... chala baga chepparu...

sailaja చెప్పారు...

నేస్తం గారు మీ బ్లాగ్ చాలా బాగుంది

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కా.. ఇంకా మా కామెంట్లు కనిపించవేంటి అని అడుగుతున్నాను.. అప్పుడెప్పుడో నాగార్జున టపాలో శరత్ గారు నిరా పని దీక్ష చేపట్టినట్లుగా నేను కూడా మీరు ప్రతి వ్యాఖ్య పెట్టేంతవరకూ నిరా పని దీక్ష చేపట్టేస్తున్ననహో.. తోటి అభిమానుల్లారా తమ్ముళ్లారా చెల్లెల్లారా.. ఇందుమూలముగా మీ అందరికీ తెలియ జేయునదేమనగా నేస్తం అక్క మన వ్యాఖ్యలకి సమాధానం ఇచ్చేంత వరకూ మనమంతా నిరసన చేపట్టి నిరా పని దీక్ష మొదలెడదాం..

అజ్ఞాత చెప్పారు...

బావుంది పోస్ట్

అజ్ఞాత చెప్పారు...

సూపెరో సూపర్

అజ్ఞాత చెప్పారు...

పోస్ట్ కేక అంతే

హరే కృష్ణ చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
హరే కృష్ణ చెప్పారు...

ఎవరూ రావడం లేదు ఏంటి

హరే కృష్ణ చెప్పారు...

రెండు వందలు కి దగ్గరకి వచ్చేసాం :-))

హరే కృష్ణ చెప్పారు...

అది సంగతి
అపర్ణ పార్టీ ఇవ్వబోతున్నారు

హరే కృష్ణ చెప్పారు...

హమ్మయ్య రెండు వందల కామెంట్ నాదే

హరే కృష్ణ చెప్పారు...

ఆభినందనలు :)

హరే కృష్ణ చెప్పారు...

దండయాత్ర కి siddham గా ఉండాలి
గుర్రాలు యుద్ధ సామగ్రి అవి కొన్నుక్కోస్తా
అభిమాన ప్లాటినుం తమ్ముళ్ళు బంగారు చెల్లెళ్ళు అందరికీ ద్విశతక వ్యాఖ్యల సంబరాలుకి స్వాగతం సుస్వాగతం :)

«అన్నిటి కంటే పాతది ‹పాతవి   207లో 1 – 200   కొత్తది» సరి క్రొత్తది»