13, సెప్టెంబర్ 2011, మంగళవారం

పాడమని నన్నడగవలెనా!!!!

చిన్నప్పటి నుండి నాకు రెండు తీరని కోరికలు ఉండిపోయాయి ..ఒకటి .. " పంచభూతములు ముఖ పంచకమై...చతుర్వేదములు ప్రాకారములై " అంటూ సాగరసంగమం కమల్ హాసన్ లా కదక్, కూచిపూడి మణిపురి , ఒడిస్సీ ,భరతనాట్యం ఇలా అన్ని నృత్యాలు నేర్చేసుకుని స్టేజ్ ఎక్కి మరీ ఆహా ఓహో అనిపించేసుకోవాలని.. రెండోదేమో అదే స్టేజ్ మీద కుడిచేయి ఒక తిరగా, ఒక బోర్లా వేస్తూ ..సరిగమపదనిస సనిదపమగరిస అంటూ బోలెడు కచేరీలు ఇచ్చేయాలని .....

నాకు తెలుసు మీరందరూ దిగులు దిగులుగా,భయం భయంగా చూస్తున్నారని ...ఆ మాత్రం జాలి, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద నాకు లేవనుకున్నారా !! అందుకే మొదటిదాన్ని చెప్పకుండా మీకోసం త్యాగం చేస్తున్నాను..దానికి ప్రతిఫలంగా రెండోవ విషయం వినాలి ...:)


అంటే అసలు ఈ పాటలు పాడాలి అన్న కాన్సెప్ట్ నాలో ఎప్పటినుండి మొదలైంది అంటే ..శంకరాభరణం సినిమాలో సోమయాజులు వరలక్ష్మిని ..తెల్లవారుజామున పీకల్లోతు నీటిలో ముంచేసి
సా రి గ రీ గ పదా పా
స రి గ ప దా ప గ రీ
రి గ ప ద సా నీ దా పా అని .... సంగీతం నేర్పే సీన్ చూసినదగ్గరనుండి .." ఓస్ ఇంతేనా ????ఇంత సింపులా పాడటం అంటే?" అనేసుకున్నాను .. ఆ పళంగా రెండు రోజులు ప్రొద్దున్నే లేచి మా ఇంట్లో నీళ్ళ కుండీలో అమ్మ చూడాకుండా ఒక ఐదు నిమిషాలు "ఖష్ట పడి " సాధన చేసేసాను... ఇంకేముంది నాకు సంగీతం వచ్చేసింది ...

అయితే ఒట్టి సంగీతం వచ్చేస్తే సరిపోతుందేమిటీ!! .. పాటలు కూడా రావాలిగా ..అప్పట్లో అప్పుడప్పుడు రేడియో పాటలు..వారానికోసారి టీవిలో వచ్చే చిత్రలహరి తప్ప పాటలు నేర్చుకోవడానికి వేరే ప్రత్యమ్నాయం ఉండేదికాదు ... అప్పుడెలాగా?? అని ఆలోచిస్తే మా అక్క గుర్తొచ్చింది..దాని నోట్ బుక్స్ నిండా స్కూల్ లో వాళ్ళ మిస్ లు నేర్పే పాటలే.. అంతే ..మా పై మేడ ఎక్కేసి అబ్బో తెగ ప్రాక్టీస్ చేసేసాను....ఇంకేంటి కచేరి చేయడం ఒక్కటే మిగిలింది.... ఇక శ్రోతల్ని సమకూర్చుకోవడమే..

సరిగ్గా అదే టైమ్లో మా పెద్దమ్మ.. మా పెద్దక్క లెక్కల్లో క్లాస్ ఫస్ట్ వస్తుందని వద్దు వద్దని మొత్తుకున్నా బలవంతంగా ఓ ట్యూషన్ లో జాయిన్చేసేసింది.. అది ఏడుస్తుంటే నవ్విన పాపానికి నేరుగా మా అమ్మదగ్గరకు వెళ్లి .."పిన్నీ నేనైతే క్లాస్ ఫస్టే..మన బుజ్జయితే స్కూల్ ఫస్ట్ వస్తుంది "అని చెప్పిన మరుసటి రోజే దానితో పాటు నేనూ అదే ట్యూషన్లో చేరాల్సి వచ్చింది...

అలా లెక్కలేనన్ని తిట్లు తిట్టుకుంటూ లెక్కలు చేసుకుంటూ రోజులు లెక్కపెట్టుకుంటుంటే ..ఒక శుభముహుర్తాన మా సార్ వాళ్ళ పాప పుట్టినరోజు వచ్చింది ..అందరం ఎప్పటిలా పుస్తకాలు ముందేసుకోగానే సార్ వాళ్ళ అమ్మగారు .."అరే ..పండగ పూట పాఠాలేమిటిరా ఈ రోజు పిల్లల చేత నాలుగు పాటలు పాడించరాదూ" అనేసరికి ఎగిరి గెంతులేసేయాలనిపించింది .. అసలే ఆయనకు వాళ్ళ అమ్మగారంటే మహా గౌరవం (భయం?) ఉండేది.. సరే ఎవరన్నా వచ్చి మంచిపాటలు పాడండి అన్నారు..

నాకేమో నేర్చుకున్న పాటలన్నీ పాడేయాలని ఉందికాని... మరీ నాకు నేనుగా అంటే లోకువ అయిపోతానని సార్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా ..అబ్బే ..ఆయన నన్ను పట్టించుకుంటే కదా.. ఎవరెవరినో పిలుస్తున్నారు.. ఇహ లాభం లేదని నా పక్కదానితో గుస గుసగా .."హే నాకు చాలా పాటలు తెలుసు కానీ ఏమో బాబు నాకు భయం "అన్నాను సిగ్గుపడుతూ.. ఆ పిల్ల నావైపు ఓసారి చూసి "ఓహో " అనేసి మళ్లీ తలతిప్పేసుకుంది..ఎవర్తివే నువ్వు గాడిద అని కసిగా తిట్టుకుని ఇటు మా అక్క వైపు తిరిగాను.. నేనింకా విషయం చెప్పకముందే ..నీకెందుకే నోరుమూసుకుని కూర్చో అనేసింది కుళ్ళు మొహంది .... దున్నపోతా అని అనుకుంటుంటే మా గుసగుసలకు సార్ నా వైపు చూసి నువ్వు పాడతావమ్మా అన్నారు ....

ఆట్టే బెట్టు చేస్తే మొదటికే మోసం అని ' ఊ ' అని తల ఊపాను మొహమాటంగా .. ఆలోపలే సార్ వాళ్ళ అమ్మగారు ఇద్దరుముగ్గురు ఫ్రెండ్స్ని కూడా తీసుకు వచ్చేసారు షోకి ... నేను గట్టిగా ఊపిరిపీల్చి శ్రావ్యంగా మొదలుపెట్టాను .."ఏసయ్య ఇంటి ముందు సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టు " మొదటి లైన్ పూర్తవ్వగానే సార్ వాళ్ళ అమ్మగారు ఫ్రెండ్స్ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడటం మొదలు పెట్టారు ...ఏదో తేడా తెలుస్తుందికాని అదేమిటో తెలియడం లేదు ... ఇంకో నాలుగైదు లైన్స్ పాడగానే వాళ్ళందరూ మూకుమ్మడిగా మా సార్ ని చూడటం మొదలు పెట్టారు...

మా సార్ మధ్యలో ఆపేసి పాప ఇంకో మంచి పాట పాడమ్మా అన్నారు.. ఓస్ అంతే కదా అనుకుని గొంతు సవరించుకుని మరొక పాట మొదలు పెట్టాను "దేవుడే నాకాశ్రయంబు " ... పాట మొదలు పెట్టిన అయిదు నిమిషాలకే వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్స్ మూతి మూడు వంకర్లు తిప్పి.. వస్తాను కామాక్షిగారు పొయ్యి మీద ఎసరు మరిగిపోతుంది అని మనిషికో వంక పెట్టి వెళ్ళిపోయారు.. ఆవిడ రుస రుసలాడుతూ కొడుకు వైపు ఒక్క చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది..ఆ తరువాత మా సార్ ఇక పాటలు చాలు పుస్తకాలు తీయండి అనో గసురు గసిరి ఓ గంట ఎక్కువ వాయించేశారు .. "బుద్దుందా అసలు ..రోజంతా మడి చీరతోనే తిరుగుతూ మనం వెళ్ళగానే ఇల్లంతా కడిగేసుకునే చాదస్తం ఆవిడది ..అక్కడ ఆ పాటలు పాడుతావా " అని ఆ రోజంతా మా పెద్దక్క తిట్లతో తెల్లారిపోయింది నాకు .."

ఆ దెబ్బతో కొన్నాళ్ళు పాడుతా తీయగా కార్యక్రమం వాయిదా వేసాను ... కాని మనకి అవకాశాలు తంపానుతంపరలుగా తన్నుకోచ్చేస్తే ఏం చేసేది ??? ఓ రోజు మా స్కూల్లో ఇన్స్పెక్షనో పాడో గుర్తులేదుగాని ఒక అతను వచ్చారు.. మా సార్లు అందరూ కంగారుగా వాళ్ళ వెనుక పరుగులు పెడుతున్నారు .. అతను రావడం రావడం ఖర్మకాలి(ఎవరి ఖర్మ అనేది ముందు ముందు తెలుస్తుంది) మా క్లాస్ కు వచ్చారు.. వచ్చిరాగానే మీలో దేశభక్తి ఎంత మందికి ఉంది అన్నారు.. మొత్తం చేతులు ఎత్తేసాం.. మీలో దేశభక్తి గీతాలు ఎవరికి వచ్చు అన్నారు.. నేను ,మా స్వాతి నిన్చున్నాం.. మరి మేమే రోజు ప్రేయర్లో వందేమాతరం పాడేది.. దేశభక్తి అంటే దేశం లో ఉన్న లోపాలు కప్పేసి సుజలాం సుఫలాం అంటూ లేనివి ఉన్నట్లు పాడేయడం కాదు... లోపాలేమిటో తెలుసుకుని వాటిని పారద్రోలడం ..అసలు మన దేశం లో పేదరికం పై ఉన్న కవితలు, పాటలు ఎవరికైనా తెలుసా అన్నారు ..పాపం ఆయన ఉద్దేశం శ్రీ శ్రీ గురించో మరొకరి గురించి చెప్తామని కాబోలు... మాకు అప్పట్లో అంత నాలెడ్జ్ ఎక్కడిది...మేమందరం తీవ్రంగా ఆలోచిస్తుంటే ఆయన చూపు నా మీద పడింది..

ఏది ఓ మంచి పాట పాడు అన్నారు ఆయన నా వైపు చూస్తూ..(చెప్పానుగా తలరాత) నేనేమిటంటే నాగేశ్వరరావు పాట " పాడవోయి భారతీయుడా" పాట గుర్తుతెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాను ..ఆయన ఉన్నట్లుండి నన్ను అడిగేసరికి ఆ కంగారులో మర్చిపోయాను ..ఎంత గింజుకున్నా గుర్తురాదే ... పోనీ రాదనీ చెప్దామా అంటే రాక రాక వచ్చిన అవకాసం .. ఈ లోపల అనుకోకుండా చిన్నప్పుడు రేడియోలో విన్న ఒక పాట గుర్తు వచ్చింది.. పూర్తిగా గుర్తులేదు ఏదో పల్లవి ... ఏదైతే ఏమిటిలే అని మొదలుపెట్టేసాను ఆలోచించకుండా... ఎవరూ భయపడకండెం.. ఆ పాటేమిటంటే ....

ఇల్లూ వాకిలి లేదు...
వెనకా ముందు లేరు..( ఈ ముక్కను ఎలకల మందు లేదు అని పాడేదాన్ని ...నాకు సరిగా వినిపించకా)
ఎక్కడికని పోనూ....

పాట ఇంకా పల్లవి అవ్వనేలేదు మా సార్లు,మేడం లు గోడకి దభేల్ ధబెల్ మని మూకుమ్మడిగా తల కొట్టేసుకుని నా నోరు మూయించేసారు అంతే... మరి నాకేం తెలుసు అది ఐటం సాంగ్ అని ..పాపం ఒక అమ్మాయి బీదరికంతో ఎలకల మందు మింగిచనిపోదాం అనుకుంటూ అలా పాడేదనుకునేదాన్ని ... ఆ తరువాత మా హెడ్ మాస్టార్ నన్ను ప్రత్యేకంగా పిలిపించి స్పెషల్ గా పొగిడేసరికి మళ్లీ ఇంకోసారి అవుట్ డోర్ కచేరీలు పెట్టలేదు ...అయినా తిరిగే కాలు పాడే నోరు ఊరుకుంటాయా ??? అసలు ఇదంతాకాదు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కాబట్టి ముందు ఇంట్లోవాళ్ళతో శభాష్ అనిపించుకోవాలాని కఠోర సాధన చేసాను ...

ఒక శుభ ముహూర్తాన నాన్న ఆదివారం పూట మధ్యాహ్నం సుబ్బరంగా తిని పడుకుంటే మెల్లగా "నన్ను దోచుకుందువటే వన్నెలదొరసాని " ఆ పాట పాడటం మొదలు పెట్టాను..మరి నాన్న ఎన్ టి రామారావు ఫేన్ కదేంటి ..తేడా రానిస్తానా!! కాసేపటికి మా నాన్న శారదా !! అంటూ ఒక్క అరుపు అరిచారు ..ఏమిటి నాన్న గారు మా అక్క పరుగున వచ్చింది ... నువ్వు పాడుతున్న రాగామేంటి ..ఎంచుకున్న తాళ మేమిటి ..అని పాపం శంకరాభరణం శాస్త్రి గారిలా క్లాస్ పీకబోయారు కాని అది మధ్యలో ఆపేసి" పాడింది నేను కాదు బుజ్జీ" అనేసి చక్కా వెళ్ళిపోయింది..గొప్ప అవమానం అయిపోయింది.. మెల్లగా మా చెల్లి పక్కకు చేరి ..మరీ అంత చండాలంగా పాడానంటావా అనుమానంగా (కొద్దిగా ఆశగా) అడిగాను..అది నావైపు ఒక సారి చూసి నిట్టూర్చీ ... చెప్తే ఏడుస్తావని ఊరుకున్నాం గాని అక్కా వారం రోజులనుండి మాకు చెవుల్లో రక్తాలు కారిపోతున్నాయి... అనేసింది (ఇప్పటికీ ఈ విషయం తలుచుకుని ఏడిపిస్తూనే ఉంటారు మా వాళ్ళు :()

ఇంకేం చేస్తాం అలా ఒక వర్ధమాన గాయినిని తూటాలవంటి మాటలతో తోక్కేసారు.. పెళ్ళయ్యాకా అసలు పాడే ప్రయత్నమే చేయలేదు ...నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో..మా ఆయన వంకలు పెట్టి ఉంటారనేగా ...హి హి హి హి కాదు ...నేను మొదలు పెట్టగానే రెండో లైన్ నుండి ఆయన పాడటం మొదలెట్టేస్తారు :( ఆ బాధకంటే ఇలా బాత్ రూం సింగర్ గా మిగిలిపోవడమే ఉత్తమం అని కేవలం నా పాటకు నేనే శ్రోతనై అలా మిగిలిపోయాను ...

అక్కడితో ఆగిపోతే అసలు ఈ రోజు ఈ పోస్ట్ పుట్టేదేకాదు ... మొన్నో మధ్య ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లో సత్యన్నారాయణ స్వామివారి వ్రతం అని పిలిస్తే వెళ్లాను ... పూజ అయ్యాకా దంపతులను హారతి ఇచ్చి లేపాలి.. ఎవరన్నా పాడండమ్మా అంటే..అమ్మో నాకు రాదంటే నాకు రాదు అని మెలికలు తిరిగిపోతున్నారు జనాలు.. నాకు జరిగిన అనుభవాల దృష్యా నేను లేవలేదు ... ఎందుకు చెప్పండి పిలిచి తిట్టించుకోవడం..కాని అవకాసం తరుముకొస్తే ఏం చేస్తాం..అక్కడ చీరకట్టుకున్న ఏకైక మహిళను నేనే ...అందుకని అందరూ నన్ను లాక్కోచ్చేసారు ...భయం భయం గా "క్షీరాబ్ది కన్యకకు నీరాజనం" అని అన్నమాచర్య కీర్తన కొద్దిగా పాడాను..హమ్మయ్యా ఎవరూ మాట్లాడలేదు ...ఒక పనైపోయిన్దిరా బాబు అని వెళ్లిపోతుంటే పూజ చేసిన పంతులుగారు పిలిచి చాలా బాగా పాడావమ్మా" గాన సరస్వతి" లా అన్నారు...అందరూ అవునవును అన్నారు చప్పట్లు కొట్టి..

ఇంక మీకు నేను విడమరచి చెప్పక్కరలేదనుకుంటా నేను ఇంటికి వెళ్ళేంతవరకూ నేలకు నాలుగు అడుగుల పైన నడిచానని .. మా ఆయనకు చెప్తే ...అంటే బుజ్జీ ముసలాయనకదా సరిగ్గా వినిపించి ఉండదు ... పొరపాటు పడటం మానవ సహజం.. నువ్వు మామూలుగా నడిచేయచ్చు అనేసారు :( అయినా సరే నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను..చిన్నప్పుడే నాలో ఒక చిత్ర ,ఒక శ్రేయగోషల్ ,ఒక గోపికా పూర్ణిమ ఉన్నారు అంతే అంతే అంతే ...అంతే బాబు..ఇక ఎవ్వరి మాటలు నమ్మదలుచుకోలేదు నాకు తెలుసు మీరేమంటున్నారో ..మీ పాట ఒకటి మాకూ వినిపించచ్చుకదా అని కదా.. హమ్మా పొరపాట్లు అన్ని సార్లు జరుగుతాయ్ ఏంటి ....మీరు మరీను

88 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

chala chakka ga chepparu.. kadu(paadaru analemo..)
:)

sunita చెప్పారు...

హహహ!బాగుంది.నేస్తం గారూ, అదేదో సినిమాలో మీనా దేవుడా దేవుడా అని పాడుతుంది.ఒక్క సెకను అది గుర్తు తెచ్చారు.ఏదైతేనేం.నలుగురూ మెచ్చుకునేలా పాడాలన్న కోరిక తీరింది కదా!

విరిబోణి చెప్పారు...

Nijam gaane meelo naaku oka chitra, shreya goshal, enka boledantha mandi kanipinchesaaru post ending ki vachheppatiki :)bavundi mee sangeetha puranam

జేబి - JB చెప్పారు...

మీకు శంకరశాస్ర్తిగారిలాంటి సరైన గురువు దొరకలేదండీ! లేకపోతే మీరు కూడ 'దొరకునా ఇటువంటి సేవ ' అని పాడేవారు, మేము ఐపాడ్‌లో 'నేస్తం హిట్స్' అని ప్లేలిస్టు పెట్టుకునేవారం!

జేబి - JB చెప్పారు...

మర్చిపోయానండి, నాకు సరైన గురువు దొరికారుగానీ, ఆవిడ నా ప్రతిభాపాటవాలని తట్టుకోలేక కన్నీళ్ళు కూడ పెట్టుకున్నారు. ఆ విషయం నా బ్లాగులో చదివే ఉంటారు. :-)

రసజ్ఞ చెప్పారు...

హహహ బాగా రాసారండీ! అయినా ఏ వృక్షం లేని చోట ఆమదం వృక్షమే మహా వృక్షం అంటారు కదా అలా వాళ్లకి మీ పాట నచ్చేసుంటుంది (సరదాకే సుమీ!)

మధురవాణి చెప్పారు...

హహ్హహహా.. భలే బావున్నాయి మీ పాడు జ్ఞాపకాలు.. :)))
అన్నట్టు, శంకరాభరణంలో వరలక్ష్మి ఏంటమ్మా బుజ్జీ.. రాజ్యలక్ష్మి అయితేనూ! ;)
నాదొక చిన్న సందేహం.. నిజ్జంగా "ఇల్లూ వాకిలీ లేదూ, వెనకా ముందూ ఎవరూ లేరు" అనే పాట ఉంది ఉంటె అది పాపం అనాథలు పాడుకునే పాట కాదా? ఐటెం సాంగ్స్ ఇలా కూడా ఉంటాయా? :P
చిన్నప్పుడు మా తమ్ముడు నేను ఒక పాట పాడుకునేవాళ్ళం "ఘల్లుఘల్లున.. గుండె జల్లున.. పిల్ల వేరు పచ్చడి.." అంటే ఏంటి అని అడక్కండి.. మాకూ తెలీదు.. అలా వినిపించింది పాడేసుకున్నాం.. అంతే! ;) :D

ఇందు మూలంగా అభిమాన పాఠకులకు తెలియజేయునది ఏమనగా.. ఈ టపాలో చెప్పినట్టు చిన్నప్పుడు అలా నేస్తం గారి గానకచేరీలు చిన్న చిన్న కారణాల వలన విఫలమైనప్పటికిన్నీ టపా చివరిలో చెప్పినట్టు ఇప్పుడు మాత్రం బహు తియ్యగా పాడతారు.. దీనికి నాదీ హామీ..! అంచేత, ఈ గానసరస్వతికి చప్పట్లు... అబ్బే.. అస్సలు వినిపించట్లేదు.. ఇంకా గట్టిగా కొట్టాలి చప్పట్లు.. సింగపూర్ దాకా వినిపించాలి మరి! :D

Sravya V చెప్పారు...

హ హ మీ పోస్టు బావుంది గానసరస్వతి గారు !

Ennela చెప్పారు...

తరువాత వేదిక మీదకి రాబోతున్నవారు ..మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న నేస్తం గారు...నేస్తం గారిని మీ కరతాళధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన నేస్తం గారు...ఆ చిన్నప్పటి పాటలన్నీ మీరు పాడేసుకున్నారు కాబట్టి సుమధురమైన ఆ చివరి పాట క్షీరాబ్ది కన్యకకు మా శ్రొతలందరికీ వినిపించాల్సిదిగా మనవి...

రఘు చెప్పారు...

మధురమే నేస్తం గానం.

Rao S Lakkaraju చెప్పారు...

క్షీరాబ్ది కన్యకకు మా శ్రొతలందరికీ వినిపించాల్సిదిగా మనవి...
----------
విని చాలా రోజులయ్యింది. నేను దీనిని గట్టిగా బలపరుస్తున్నాను.

జీడిపప్పు చెప్పారు...

"కాసేపటికి మా నాన్న శారదా !! అంటూ ఒక్క అరుపు అరిచారు ..ఏమిటి నాన్న గారు మా అక్క పరుగున వచ్చింది ... నువ్వు పాడుతున్న రాగామేంటి ..ఎంచుకున్న తాళ మేమిటి ..అని పాప శంకరాభరణం శాస్త్రి గారిలా క్లాస్ పీకబోయారు కాని అది మధ్యలో ఆపేసి" పాడింది నేను కాదు బుజ్జీ" అనేసి చక్కా వెళ్ళిపోయింది."

సూపరో సూపరు :)

సుజాత వేల్పూరి చెప్పారు...

చాలా రోజులైంది ఇలా కమ్మని కబుర్లు విని! మొత్తానికి ప్రతి ఇంట్లోనూ పాడు అమ్మాయిలుండాల్సిందే అన్నమాట.

మీ ట్యూషన్ సార్ వాళ్ళింట్లో పాడిన పాటలు చాలా బాగున్నాయి.

బాగా పాడావమ్మా....గాన సరస్వతి!

ఈ సందర్భంగా నా డిమాండ్....మీ పాటోటి బ్లాగులోనో, బజ్జులోనో పెట్టాలని! యమర్జెంటుగా

అజ్ఞాత చెప్పారు...

ne chinnappuDu padukunna tappula paata

ninna kanipinchindi
mannu karipinchindi...

శశి కళ చెప్పారు...

హ...హ...యెమి పాడు టపా..సూపెర్...
మరి మనిద్దరం కలిసి గాన కచెరి యెప్పుడు
మొదలు పెడదాము?తొందర యెమి లెదు మీరు
నేల మీదికి వచ్చినాకె సరెనా...

యశోదకృష్ణ చెప్పారు...

బుజ్జి! మీ పోస్ట్ కోసం ప్రతి రోజు ఎదురుచూస్తున్నాను. మీ నాట్యాప్రావీణ్యం గురించి కూడా పోస్ట్ పెడితే సంతోషిస్తాం.

సిరిసిరిమువ్వ చెప్పారు...

అబ్బ చాలా రోజుల తర్వాత ఓ కమ్మని టపా పాటలా వినిపించారు.

సునీత గారు చెపినట్టు నాకూ సుందరకాండలో మీనానే గుర్తుకొచ్చింది.మీనా స్థానంలో మిమ్ముల్ని ఊహించుకుని తెగ నవ్వేసుకున్నా!

..nagarjuna.. చెప్పారు...

చిన్నపుడు నేను కూడా సాగరసంగమం సినిమా చూసి పేఏఏద్ద డాన్సర్నైపోదా మనుకున్నా. తరువాత ఎందుకో భయమేసి ఊరుకున్నా. మీరు చెప్పారు కదక్కా ఇక చూస్కోంది అవిశ్రాంతంగా శ్రమించి కష్టించి నాట్యం చేస్తా, జనాల మతి పోగొడతా :D

వంశీ కిషోర్ చెప్పారు...

మీరు ఎక్కడా తగ్గద్దు. మీకు ఎప్పుడు ఎక్కడ పాట పాదలనిపిస్తే అక్కడ పాదేయండి :)

tnsatish చెప్పారు...

nestham garu,
పంచభూతములు ముఖ పంచకమై would come in first charanam and చతుర్వేదములు ప్రాకారములై would come in the second charanam.

First charanam
పంచభూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై .... ప్రకృతి పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వరస .... నీ దృక్కులే అటు
అష్ట దిక్కులై ... నీ వాక్కులే
నవ రసమ్ములై తాపస మందార ... నీ మౌనమే
దశోపనిషత్తులై నిల వెలగ

second charanam
త్రికాలమలు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకరములై


If you see the lyrics, all the numbers are in sequence. Just two days back, same song was sung by one participant in Padutha theeyaga, and the guest, lyricist Anantha Sriram said the above and the greatness of Veturi.

@sunita garu,
That was in Sundara kanda movie

మనసు పలికే చెప్పారు...

అక్కయ్యా.. కచ్చేరీ ఎప్పుడు పెడుతున్నారూ??? నాకొక పాస్ ఉచితంగా ఇవ్వాలని బ్లాగ్ముఖంగా కోరుకుంటున్నా :) వీలైతే మీ పక్కనే సీటు ఉంచండి, నేను కూడా గొంతు కలుపుతా..:D:D:D
టపా మాత్రం సూపరు అక్కయ్యా.. ఎన్ని సార్లు నవ్వుకున్నానో చదువుతూ మధ్య మధ్యలో..
జై జాజి పూలు.. జై జై జాజిపూలు..

నైమిష్ చెప్పారు...

wonderful post Nestam ji.."క్షీరాబ్ది కన్యకకు" పాటను మాకు ఎప్పుడు వినిపిస్తున్నారు?

మాలా కుమార్ చెప్పారు...

మిమ్మలినొక్కరినీ పాడమని అడగము కాని , మీరూ , మీ వారూ కలిసి ఓడ్యూయెట్ పాడేయండి .

vasantham చెప్పారు...

నా సంగీతం కూడా ఇంట్లో వారి కోరిక పై, నిరవధికం గా వాయిదా వేయ బడింది.మీకు ఎప్పుడయినా గాత్ర సహకారం కావాలంటే, నా పేరు తలుచు కొండి..వచ్చేస్తాను.అంత వరకూ స..రి..గ..మా..పా ..

వసంతం.

రవికిరణ్ పంచాగ్నుల చెప్పారు...

"నాలో ఒక చిత్ర ,ఒక శ్రేయగోషల్ ,ఒక గోపికా పూర్ణిమ ఉన్నారు అంతే అంతే అంతే ...అంతే బాబు..ఇక ఎవ్వరి మాటలు నమ్మదలుచుకోలేదు "..
.. నమ్మనివాళ్లుంటే చెప్పండి వాళ్ల పని పట్టేద్దాం.. ఆయ్.. అమ్మా! :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>>>చిన్నప్పుడే నాలో ఒక చిత్ర ,ఒక శ్రేయగోషల్ ,ఒక గోపికా పూర్ణిమ ఉన్నారు అంతే అంతే అంతే ...అంతే

కాదన్నవారెవరైనా ఉంటే రమ్మనండి. రెండు పాటలతోటి విరగ కొట్టేద్దాం అంతే అంతే.

>>>భయం భయం గా "క్షీరాబ్ది కన్యకకు నీరాజనం" అని అన్నమాచర్య కీర్తన కొద్దిగా పాడాను..హమ్మయ్యా ఎవరూ మాట్లాడలేదు ...

పెళ్ళైన తరువాత భర్త మీద అరిచి, పిల్లలని కేకలేసి, లాలించి, ముద్దు చేసెటప్పటికి స్వర స్థానాలు, శృతులు, గమకాలు అన్నీ మనకి తెలియకుండానే ప్రాక్టీసు అయిపోయి ... అదన్నమాట సంగతి. ప్రాక్టీసు మానకండి. ముఖ్యం గా మొదటిది.

చెప్పేదేముంది మాములుగానే మీ టపా మధురంగా ఆహ్లాదంగా ఉంది. సూపర్ అంతే.

కృష్ణప్రియ చెప్పారు...

.."హే నాకు చాలా పాటలు తెలుసు కానీ ఏమో బాబు నాకు భయం "అన్నాను సిగ్గుపడుతూ.. ఆ పిల్ల నావైపు ఓసారి చూసి "ఓహో " అనేసి మళ్లీ తలతిప్పేసుకుంది
>>>>>>
LOL

బాగుంది.

kiran చెప్పారు...

నేస్తం గారు - కెవ్వు కేక..!!! :D

>>>>ఇల్లూ వాకిలి లేదు...
వెనకా ముందు లేరు..( ఈ ముక్కను ఎలకల మందు లేదు అని పాడేదాన్ని ...నాకు సరిగా వినిపించకా)
ఎక్కడికని పోనూ...
>>>>కాసేపటికి మా నాన్న శారదా !! - :D :D

>>>>నేను మొదలు పెట్టగానే రెండో లైన్ నుండి ఆయన పాడటం మొదలెట్టేస్తారు :( -- :D :D

మమ్మల్ని ఆఫీసు లో కొట్టిన్చేస్తారా అండి..????నవ్వు ఆపుకోలేక చచ్చాను....!!..
soooper ..!!
ఓ పాట నాకు మాత్రమే వినిపించచ్చు కదా..!! :P

Raja చెప్పారు...

Akkaa, post chaalaa bavundi ....
chivari varaku navvuthune vunna....

లలిత (తెలుగు4కిడ్స్) చెప్పారు...

మీ పోస్ట్లు చదువుతుంటాను. వ్యాఖ్య వ్రాయలేదెప్పుడూ.
సరదాగా సాగిపోయే పోస్ట్లు చివరంటా చదువుకుని సంతృప్తిగా వెళ్ళిపోతుంటాను, ఏమని చెప్పాలో తెలియక.
పాటల్లో పోటీ పడే పోస్టులు(కృష్ణప్రియ, మీరు వ్రాసినవి) ఒక దాని తర్వాత ఒకటి చదివి ఇప్పటికీ చెప్పకపోతే బావుండదని చెప్పేసుకుంటున్నా.
మీ పోస్ట్లు చాలా బావుంటాయి.
ఇలా వ్రాసే వారందరూ నిజంగా బాగా పాడే వాళ్ళే అయ్యుంటారని నా ఊహ, కనీసం మీ ఇద్దర్లో ఒకరు.

అజ్ఞాత చెప్పారు...

నేస్తం : సుందరకాండలో మీనా పాడిన " అమ్మా నాన్నా లేనివాళ్ళం దేవుడా ఓ దేవుడా "
గుర్తొచ్చింది . ట్యూషన్ లో నువ్వు పాడిన పాటలు ప్రతీ ఆదివారం నాకు తెలీకుండా నేనూ పాడేస్తూ వుంటాను . మైకులో వినీ వినీ వాటిలో లీనం అయిపోయి పాడేస్తుంటే ఎవరో ఒకరు కుదిపి కుదిపి నన్ను మేల్కొలుపుతారు .

అజ్ఞాత చెప్పారు...

చాలా బావుంది. చదువుతూ వుంటే నేను అక్కడే వున్నట్టు ఫీల్ అయ్యి తెగ నవ్వేసాను. థాంక్స్ నవ్వించినందుకు. మీ పాట ని త్వరలో వినిపించండి.

Lavanya చెప్పారు...

"laali laali paata" khashtapadi, script raasukuni nidra pucchadaaniki paadithe...."amma nidra vastondi, paata aapeyavaa" ani sajala adigite...naalo kooda oka suseela, bhanumathi, leela ...vunnaranna nammakaanni samaadhi chesesa!! jaajimallli oka kashmora ni nidra leparu...

Lavanya చెప్పారు...

"laali laali, vatapatra saayiki varahaala laali" ani suseela laaga sravyamgaa padaalani, script download chesukuni mari paadite..."amma, nidra vastondi, inka padavaddamma" ani sajala adigite...inkemundi...naalo oka suseela, leela, bhanumathi, jikki..vunnaranna nammakaani samadhi chesi...idigo ippudu jajimalli inspiration to "kashmora" ni nidra lepanu

నేస్తం చెప్పారు...

అజ్ఞాతగారు అంతే అంటారా ... ధేంక్స్ అండి :)

>>>ఏదైతేనేం.నలుగురూ మెచ్చుకునేలా పాడాలన్న కోరిక తీరింది కదా!
సునీత గారు ఆ తీరిపోయిందా అంటే మరి..స్టేజో ..అంత వద్దులే ఇదే ఎక్కువ సర్ధుకుపో అంటారా :)

విరిబోణిగారు నిజంగా అలా అనిపించేసిందా?ఏది మళ్ళీ ఇంకోసారి చెప్పండి :)

జేబి గారు ఒరియా దేశభక్తి గీతమేనా...చదివాను ..నేస్తం హిట్స్.. అయ్యబాబోయ్ ఏంటండి ఆ మాటవింటేనే ఒళ్ళుపులకరించిపోతుంది :)

రసజ్ఞ గారు హర్ట్ అయిపోదామా అనుకున్నాగాని మీరు సరదాగా అన్నారని ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా :)

నేస్తం చెప్పారు...

మధు రాజ్యలక్ష్మి చిన్నప్పటి పాత్ర వరలక్ష్మి (ఆరోజుల్లో హీరోల ముద్దుల చెల్లెలు) వేసింది ..హమ్మా నాకు వంకలు పెట్టేద్దామనే ..ఇక ఆ పాట ఐటేం సాంగ్ కాదనుకుంటా..మావాళ్ళు అలా అనేసుకున్నారు.. నిన్న మళ్ళీ విన్నాను ..హీరోయిన్(?) బాగా తాగి పాడినట్లనిపించింది.. అంత హస్కీ సాంగ్ ఎలా అలా అనుకున్నానబ్బా?... మనం అంతే మధు ఆకలేస్తే అన్నం పెడతా అంటే అందులో ఆద్రత వెతుక్కుంటాం :P నేనైతే మన్నేలా తింటివిరా క్రిష్ణా పాట చూడకముందు భక్తి పారవశ్యంగా వినేదాన్ని :D

శ్రావ్య ధాంక్యూ ధాంక్యూ

ఎన్నెలగారు కామెంట్ అంతా బాగా రాసారుగా పాపం చివర్లో ఎందుకలా తొందరపడ్డారు ..ఏదో ప్రశాంతంగా జీవితం గడపక :)

రఘుగారు ఏంటో మీ అభిమానం ...:)

రావుగారు ఆవిడేదో పొరపాటున అనేసారు..మీరు అలా సపోర్ట్ చేసేయకండి.. పిల్లలు గలవాళ్ళు ,బాధ్యతలున్నవాళ్ళు పాపం చాలా మంది ఉన్నారు

నేస్తం చెప్పారు...

జీడిపప్పుగారు ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ... ధాంక్యూ పోస్ట్ నచ్చినందుకు

సుజాతగారు ధేంక్యూ ధేంక్యూ
>>>>>ఈ సందర్భంగా నా డిమాండ్....మీ పాటోటి బ్లాగులోనో, బజ్జులోనో పెట్టాలని! యమర్జెంటుగా

హమ్మా..హన్నా .. అసలు విషయం బయటపెట్టించేద్దామనే .. నేను చాలా తెలివైనదాన్ని..అందుకే పోస్ట్లో చివర ముందే చెప్పేసాను :)


అజ్ఞాతగారు మేమూ అంతే పాట సరిగ్గా వినకుండా నచ్చినట్లు మార్చేసేవాళ్ళం..నేనైతే మరీను "ఆ అన్నా ఊ అన్నా ఉలికి ఉలికి పడతావెందుకు" అనే పాట అన్నాచెల్లెళ్ళు పాడుతారేమో అనుకునేదాన్ని :)

శశికళ గారు టైము మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే .. ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఏదైనా ఓకే..నేను రెడీ..కాని శ్రోతలను మాత్రం మీరు తీసుకురావాలి.. ఈలోపల నేను మంచి మంచి పాటలు ప్రాక్టీస్ చేసేసుకుంటాను.:)

గీత గారు నా పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారా..టచ్ చేసారండి అంతే.. అసలు మీ పేరు తో నాకు బోలెడు అనుబంధం ఉంది ( మా చెల్లెళ్ళలో ఒకరి పేరు)

తార చెప్పారు...

జే.బి. గారు, నేస్తం హిట్స్ అంటే, నేస్తంగారు పాటలతో కొట్టారు అనా? లేదా నేస్తంగారు పాడితే ... అనా?

vasantham చెప్పారు...

మా చెల్లెలు లావణ్య రాసినది చదువుతుంటే,నాకు గుర్తు వచ్చింది. జో అచ్యుతానందా,జో, జో, ముకుందా,లాలి పరమానందా..లాలి గోవిందా..అని చిన్నప్త్నించి విన్న లాలి పాట,పాడే అవకాసం వచ్చింది కదా అని, మా అబ్బాయి కి పాడుదామని, నిద్ర పుచ్చుదామని, ట్రై చేసాను.అమ్మా నువ్వు పాట పాడకు అమ్మా, నేను పడుకుంటాను, అని చెప్పి,నిమిశుం లో నిద్ర పోయేవాడు, పోనీలే ,ఇలాగ అయిన పనికి వచ్చింది నా పాట.అని తృప్తి..ఇంకా రేడియో లో వస్తూంటే పాట, దానితో కలిపి పాదేస్తూంటే సుశీల లాగే పాడేస్తున్నాను , అని మురిసి పోయేదాన్ని.కరెంట్ పొతే. తెలిసింది, నా అసలు పాట గొప్పదనం..చాలా జ్ఞాపకాలు రిపేరు అందరి లో..మీ బ్లాగ్ పోస్ట్ తో.

M చెప్పారు...

కొంపదీసి ఇప్పుడు మీరు పాడిన ఆడియోలు గట్రా పెడతారండీ ?

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారూ,
నేనూ అందర్లాగే మీ సెన్స్-ఆఫ్-హ్యూమర్ ని ఆస్వాదిస్తాను.
మీర్రాసిన టపాల్లాగే కామెంట్లలో హ్యూమరు కూడా చాల బాగుంది.
but this is supreme!
==>
శశికళ గారు టైము మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే .. ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఏదైనా ఓకే..నేను రెడీ..కాని శ్రోతలను మాత్రం మీరు తీసుకురావాలి.. ఈలోపల నేను మంచి మంచి పాటలు ప్రాక్టీస్ చేసేసుకుంటాను.:)<==

awesome gift of gab.

శారద

నేస్తం చెప్పారు...

వరూధిని గారు మీనా గుర్తొచ్చిందా :)))) ధాంక్యూ ధాంక్యూ

ఎందుకు భయం నాగార్జున ...హీరో అంటే భయపెట్టాలి..భయపడకూడదు.. :P బాగా చెప్పానా

వంశీ గారు ధాంక్యూ :)

సతీష్ గారు అంటే మరి అది.. నేను ఈ పోస్ట్ మొన్న ఓ గంటలో రాసేసేసాను..పాట ఆలోచించే ఓపికలేక పంచభూతములు అని గూగుల్ లో కొడితే వికీలోనో ఎక్కడో ఈ ముక్క దొరికింది కాపీ పేష్ట్ కొట్టేసాను :) ధాంక్యూ

అప్పు..కచేరీ అంటూ చేస్తే వయలిన్ నీకే మేడం..దెబ్బకి ఇద్దరి సరదా తీరిపోతుంది జనాలకు దేవుడే దిక్కు :)

నైమిష్ గారు మీ బాధ్యతలన్ని తీరిపోయాకా ఇక ఏమిటి ఈ జీవితం అని వేదాంతం వచ్చేస్తుంది చూడండి అప్పుడు అడగండి చెప్తాను :)

మాలగారు ఓన్లీ పాటేనా మరి డాన్సో ( కొంచెం సిగ్గుపడుతూ)

నేస్తం చెప్పారు...

వసంతంగారు అయ్యో మీ టాలెంట్నీ కూడా తొక్కేసారా ..అంతేనండిబాబు మంచికి రోజులెక్కడా?

రవికిరణ్ గారు ఇహలాభం లేదు..ఈ ఆనందం తట్టుకోలేను..నేను పే..ద్ద గాయనిని అయిపోయాకా మొదటి ఆటోగ్రాఫ్ మీకే ..:)

>>>ప్రాక్టీసు మానకండి. ముఖ్యం గా మొదటిది
బులుసుగారు..మీరంతగా చెప్పాలా..పెళ్ళైన దగ్గర నుండి చేసినా ఆ సాధనవల్లే ఈ రోజు ఈ మాత్రం పాడగలుగుతున్నాను :) ధాంక్స్ అండి పోస్ట్ నచ్చినందుకు

క్రిష్ణ ప్రియగారు ..అంటే సార్ని పిలిచి ఈ అమ్మాయికి బాగా పాటలొచ్చు అంటుందనుకున్నాను..ఏంటో పాపం దానికి అసలు తెలివిలేదు :)

కిరణ్ అలాగే .... ముందు నాకేమయినా పర్వాలేదు అని హామీ పత్రం పంపించు :)

రాజ నవ్వినందుకు ధాంక్యూ :)

నేస్తం చెప్పారు...

లలిత (తెలుగు కిడ్స్) గారు
>>>> ఇలా వ్రాసే వారందరూ నిజంగా బాగా పాడే వాళ్ళే అయ్యుంటారని నా ఊహ, కనీసం మీ ఇద్దర్లో ఒకరు.
అలా అంటారా ...అలాగే అనేసుకోండి మేము మాత్రం కాదంటామా :)

లలితగారు :) చిన్నప్పుడు మా ఇంట్లో ఆదివారం ఈ పాటల సమ్మేళనాలే నేను తప్పించి అందరూ సెంటాన్స్ హై స్కూల్ చదివారు

తొలకరి గారు అంతగా నవ్విన మిమ్మల్ని ఏడిపించలేను తొలకరిగారు ఏడిపించలేను..ధాంక్యూ పోస్ట్ నచ్చినందుకు

లావణ్యగారు మా అబ్బాయి కూడా అంతే అండి బాబు పాడటం మొదలుపెట్టగానే వద్దు మమ్మీ వద్దు నాకు నిద్రొస్తుంది అనేవాడు.. మరీ పిల్లలు తెలివి మీరిపోయారు అనుకోండి..

తార గారు మీరు అలా మళ్ళీ మళ్ళీ అడిగి డవుట్ తెప్పిస్తే ఎలా..ఆయిన మెచ్చుకున్నారంతే..నేను అలా ఫిక్స్ అయిపోయాను :)

వసంతం గారు చాలా జ్ఞాపకాలు గుర్తొచ్చేసాయా.. చాలా చాలా ద్యాంక్స్ అండి మెచ్చుకున్నందుకు ..

నేస్తం చెప్పారు...

M గారు.. కంగారు పడకండి మీ ఆరోగ్యానికి చేటుచేసేపని నేను చేయను అని మాటిచ్చాగా పైన :))

శారద గారు పోస్టే కాకుండా కామెంట్ కూడా మెచ్చుకున్నందుకు నాకేంటో ఓ మంచిత్యాగరాజ కీర్తన పాడేయాలన్నంత ఆనందం వచ్చేస్తుంది :) thank you

యశోదకృష్ణ చెప్పారు...

థాంక్స్ బుజ్జి, మీ బ్లాగు మొదటిసారి చదివినప్పుడు వదలలేక మూడు రోజులు చదివాను. ఇలా కాలేజిలో చదివితే స్టేట్ ఫస్టు వచ్హేదాన్ని. అసలు తెలుగు చదవడం శ్రద్ద లేని మా అమ్మాయి మీ బ్లాగు చదివించుకొని మరీ సంతొషపడిపోతుంది.

మనసు పలికే చెప్పారు...

పర్లేదక్కా, ఈ జనాలకి దేవుడే దిక్కు కావాలి..;);) లేకపోతే ఇలా మన కళల్ని తొక్కేస్తారా అక్కయ్యా????

రాజ్ కుమార్ చెప్పారు...

చాలా రోజుల తర్వాత నా బ్లాగ్ ఓపెన్ చేశాను. డాష్ బోర్డ్ లో మీ పోస్ట్ కనపడగానే అవాక్కయ్యాను. ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చీ చదివేశాను.

గత వారం రోజులుగా ఉన్న టెన్షన్లు అన్నీ మరిచిపోయీ మనస్పూర్తిగా నవ్వేశానక్కా. మీ పాటల సెలెక్షన్ సూపరో సూపరు(ముఖ్యంగా ట్యూషన్ లో పాడినవీ).
ఈ సారి మీరిచ్చే కచేరీ లో నేనూ ఓ పాట పాడతాను. నాకు "నడిపించచు నా నావా ఆఆఆ " పాటొచ్చు ;)


టపా ఎప్పటిలాగే కేకా, అరుపులు.

"గాన సరస్వతి" మా నేస్తం అక్కకి జేజేలు.

హరే కృష్ణ చెప్పారు...

పని వత్తిడి లో కుమ్మి పడేస్తుండడం తో ఏం జరుగుతుందే తెలుస్కోలేకపోయితినే
బ్లాగాజ్ఞానికి చింతిస్తూ యాభయ్ వ కామెంట్ కి చేరుకోవడం అదో తృప్తి :)))
చాలా బాగా పాడావక్కా :)

హరే కృష్ణ చెప్పారు...

.చిన్నప్పుడే నాలో ఒక చిత్ర ,ఒక శ్రేయగోషల్ ,ఒక గోపికా పూర్ణిమ ఉన్నారు అంతే అంతే అంతే
అంతే అంతే అంతే :)
అవును అంతే అంతే :)

హరే కృష్ణ చెప్పారు...

బుద్దుందా అసలు ..రోజంతా మడి చీరతోనే తిరుగుతూ మనం వెళ్ళగానే ఇల్లంతా కడిగేసుకునే చాదస్తం ఆవిడది ..అక్కడ ఆ పాటలు పాడుతావా
:D :D :D

పవన్ కుమార్ చెప్పారు...

నిజమే అక్కా. ముసలాయనకదా సరిగ్గా వినిపించి ఉండదు. :)

నేస్తం చెప్పారు...

>>>అసలు తెలుగు చదవడం శ్రద్ద లేని మా అమ్మాయి మీ బ్లాగు చదివించుకొని మరీ సంతొషపడిపోతుంది.
అయ్యబాబొయ్..ఇంతకంటే ఇంకేంకావాలండి..సంతోషం... మా అమ్మాయి చదవమంటుంది గాని నువ్వు తెలుగు నేర్చుకుని చదువు నీకోసమే రాస్తున్నా అని అంటూ ఉంటాను :)

కదా అప్పూ అదియే మన తక్షణ కర్తవ్యం

రాజ్ _ హరే ..అదే అనుకున్నా..ఫుల్ బిజీ ఉండి ఉంటారని ..మీ కామెంట్స్ కనబడకపోతే అదో లోటుగా ఉంటుంది

పవన్ ..నీ కామెంట్ ఏమిటో నాకు కనిపించడం లేదు..ఎందుకంటావ్

శశి కళ చెప్పారు...

యెమిటి...టైం నెను చెప్పాలా?శ్రొతలు నెను తెవాలా..
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...యెక్కడ నుండి తెను...
యెలా....యెల....

సి.బి.ఐ చెప్పారు...

నిందితుల చేత నిజాలు చెప్పించడానికి మీ పాటలు కొన్ని
రికార్డు చేసి పంపగలరు...

-సి.బి.ఐ

శ్రీధర్. దు చెప్పారు...

:-)

బంతి చెప్పారు...

'పాడమని నన్నడగవలెనా ' ... మేము అడుగుతున్నాం మీరు పాడండి. పాడేసేయండి అంతే :)

tnsatish చెప్పారు...

c.b.i.,
too much.

నేస్తం చెప్పారు...

సి.బి.ఐ గారు నేనేదో మొహమాటానికి అంటే మీరూ అలా అనేయడమే ...ఇది అన్యాయం అనిపించడంలేదు మీకు
సతీష్ గారు :)
శ్రీ గారు :)
బంతి అంతే అంటావా..ఏం పర్లేదా..ఇంకోసారి ఆలోచించకూడదూ..

కౌటిల్య చెప్పారు...

బాబోయ్! చాలా రోజుల తర్వాత కళ్ళంట నీళ్ళొచ్చేంత పడీ పడీ నవ్వాను...భలే రాశారు...

నన్నూ చిన్నప్పుడు అంతే! అందరూ నామీద వివక్ష చూపించి, నాకు శృతి తక్కువని, లయలేదని చెప్పి ఏడిపించేవాళ్ళు.అందుకని వీణమీద ఓ చెయ్యీ,వయొలిన్ మీద ఓ చెయ్యీ వేసి తృప్తి పడ్డా అప్పటికి...అయినా పట్టు వదలక "అనగననగ రాగమతిశయిల్లుచునుండు" అన్న ప్రిన్సిపుల్ తెగ ఫాలో ఐపోయి, బాత్రూముల్లో తెగ ప్రాక్టీసు చేసి, ఇప్పుడు కాస్త అంకెకి తెచ్చుకున్నా గొంతుని...;)
నిజం చెప్దునా! నేను "జో అచ్యుతానంద" పాడుతుంటే అందరూ జోగేస్తారు...;)

బులుసుగారు చెప్పింది కరష్టు! ఇంట్లోవాళ్ళమీదా, పేషెంట్లమీదా అరిచి అరిచి నా స్వరస్థానాలు కాస్త సెట్ అయినట్టున్నాయి...

ఆ.సౌమ్య చెప్పారు...

వామ్మో అయితే ఇకమీదటినుండి మిమ్మల్ని "పాటల నేస్తం" అని పిలావాలేమో!
అయినా ఇదన్యాయం, మీకింత టేలెంట్ ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను కలిసినప్పుడు పాడించుకునేదాన్ని కదా! :)

ట్యూషన్ లో పాటలు అదుర్స్. ఒకసారి ఇలాగే మా స్కూల్లో ఖాళీ పీరియడ్ లో అందరం కలిసి పాటలు పాడుకుంటున్నాం. నన్ను పాడమంటే "అందాల తార అరుదెంచె నేడు అంబర వీధిలో" అని మొదలెట్టాను. వద్దు తల్లోయ్ నీకో దణ్ణం అని పారిపోయారు నా నేస్తాలు. మరేం చెయ్యను ఆరోజు డిసంబర్ 26 ఆయె. ముందు రోజు విన్న పాటే గుర్తిచ్చింది టక్కున!

Venkat చెప్పారు...

akka...keka...mastu cheppirru....ayna vallu enduku ala annaro naakaite ardam kaaledu.....meeru rayadame inta baga raaste....padadam inka super vuntadi.....nenu ivvalti nunchi mee fan...endukante ac ayte bill baaga vastadi kada

.... చెప్పారు...

http://www.youtube.com/watch?v=VdIrXTPIecw&feature=related kasta me ooha shaktini upayoginchi ilanti katha raya galugutara? kavalante nenu hints ista ..... ai nakevarra hints iche .... ani matram modalu pettoddu :P

.... చెప్పారు...

http://www.youtube.com/watch?v=VdIrXTPIecw&feature=related nakilanti story kavalenu.... in u r style ..... kavalante peradikinda konni hints ista ...... ai nakevaru hints ichedi anoddu... chuddam em reply istaro ani.....

శివరంజని చెప్పారు...

హహహ అక్కా సూపర్ ఉంది మీ పోస్ట్ .......... నిజంగా నీలో శ్రేయగోషల్ ని మొదట గుర్తించింది నేనే అక్క నేనే ..ఇక నేస్తం అక్కని గాన సరస్వతి అక్కా అని పిలుస్తానేం

అజ్ఞాత చెప్పారు...

nestham,

mee blog chaala baagundi. Konnitiki ayithe padi, padi navvanu (your latest post and post on your kids !!) first time choosaka, inka nenu koddi koddiga mee old posts anni chaduvuthunnanu. memu singapore lo ne vuntam, yishun lo. meeru raase posts, behaviours anni baaga ardham avuthai, memu kooda ivanni choosam /anubhavincham kaabatii.

meetho parichayam cheskovalani vundi if you dont mind. mee peru kaani, email id gaani theliyavu.

- Rupa

bittu చెప్పారు...

hi nestam garu...
"paadu" tapaa... chala chala bavundhi.
me blog ninna chusanu... aapakunda anni posts okesari chedivesanu. andulo vintha emundhi anukuntunnaraa... mari naku repati ninchi exams kadandi :P
me posts chusthunte naku na schooldays gurtostunnai...na paatha pustakalu anni tiragesanu... publish ainavi/kanivi na kathalu, kavithala kosam :)
idhe inspiration ga teesukuni telugu lo blog rayadam modalu pettali anukuntunnanu.. saraina nirnayam aithe, peddavariga.. bless me !! :)

నేస్తం చెప్పారు...

సారీ సారీ నేను మరీ బద్దకం చూపించేసాను కదా...
కౌటిల్యా హహహ అనగ అనగ రాగమతిశ ఇల్లింది అంటారు అయితే ..సరే మీరెలా అంటే అలాగే

సౌమ్యా హహహ నీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అయితే :)

వెంకట్ ఇక నుండి నా ఫేనా..అలాగే నాకు కూడా చలి ఎక్కువ పడదు..ఫేన్ తో సరిపెట్టేద్దాం :)

...... గారు అసలు మీరా లింకు ఎందుకిచ్చారండి..నా మట్టి బుర్రకు ఒక్క ముక్క అర్ధం కాలేదు.. కాని మీ పుణ్యమా అని నేను అసలు చూడను అని భీష్మించుకు కూర్చున్న ఆ సినిమా చూడాల్సి వచ్చింది :)

శివరంజని నువ్వెలా అంటే అలాగేరా ....

నేస్తం చెప్పారు...

రూపగారు నా మెయిల్ ఐడి ఇలా పబ్లిక్ లొ ఇవ్వలేను..మీ ఐడి ఇవ్వలేదు మీరు..మీరు యిషున్ లొ ఉంటారా..ఒకప్పుడు మేము అక్కడే ఉన్నాం నార్త్ పాయింట్ దగ్గర ...ధ్యాంక్స్ అండి పొస్ట్లు నచ్చినందుకు

బిట్టు గారు నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు.. మరింకెందుకాలస్యం మొదలు పెట్టేయండి మీరు కూడా

SHANKAR.S చెప్పారు...

"నేను తప్పించి అందరూ సెంటాన్స్ హై స్కూల్ చదివారు "
ఎంద సెంటాన్స్ హై స్కూలో....ఎంద చర్చి స్క్వేరో? ఎంద పరంద కాకినాడో? (నేస్తం గారూ అదేనా?)

SHANKAR.S చెప్పారు...

"చిన్నప్పుడే నాలో ఒక చిత్ర ,ఒక శ్రేయగోషల్ ,ఒక గోపికా పూర్ణిమ ఉన్నారు"

కాకినాడ వాళ్ళు అయి ఉంది ఇలా చీప్ గా చిత్ర, శ్రేయ ఘోషల్, గోపిక పూర్ణిమ లతో పోల్చుకోడం ఏంటండీ. మీరు పుట్టు మంగేష్కర్, పుట్టు సుబ్బలక్ష్మి (కాకినాడ కాబట్టి). అసలు కాకినాడ వాళ్ళ ఏడుపు కూడా స్వరబద్ధంగా ఉంటుంది. మీరు సూపరంతే. ఎన్ని ప్రాణాలు పోయినా పర్లేదు మీ గానం మాత్రం ఆపద్దు. కావాలంటే సూర్య కళామందిర్ నుంచీ రవీంద్ర భారతి దాకా, ఇంకా చెప్పాలంటే పార్లమెంట్ హాల్లో కూడా మీ కచ్చేరీ పెట్టిద్దాం. ఈ దెబ్బతో అటో ఇటో తెలిపోవాలంతే.


(నేస్తం గారూ బాగా పొగిడానా? (చిత్రం భళారే విచిత్రం లో బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ తో శంకర్ :)) )

అజ్ఞాత చెప్పారు...

akka... oka chinna request.. meeru nannu "gaaru" anoddu. meru peddavaaru nakanna... :)

-bittu

చాతకం చెప్పారు...

నాకు కొన్ని మొండి బాకీలు వసూలు కావాల్సివుంది. మీ గానామృతం కాస్త అరువియ్యరూ?

sunita చెప్పారు...

Happy third birthday to jaajipoolu!!

శివరంజని చెప్పారు...

అక్కా సింగపూర్ అంతా చూపించేసావు కదా ...మీరు సింగపూర్ గురించి అనుకున్న కొన్నాల్లకే సింగపూర్ వెళ్ళారు అన్నావు గా అయితే ఉండు నీకులానే నేను కూడా అన్ని దేశాలు గురించి ఆలోచించడం మొదలు పెడతా :ప నీ పోస్ట్ ఎప్పటిలానే సూపర్బ్ .. ఇంకొకసారి చదవాలి అనిపించేంత :))))))))

అక్కా నీ బ్లాగ్ బర్త్డే అంటే నాకు పండగ రోజు అన్నమాట
HAPPY HAPPY BIRTHDAY జాజి పూలు
మా అక్క ఎప్పుడూ ఇలానే పోస్ట్ లు రాస్తూ ఉండాలి .. మాతోనే ఈ బ్లాగ్ ఈ పోస్ట్ లలో నువ్వెప్పుడూ ఇలా మురిపిస్తూ ఉండాలి :)

శివరంజని చెప్పారు...

మొదటిసారి నేను ఎవరి బ్లాగలోనో లింక్ ద్వారా ఈ జాజిపూలు బ్లాగ్ కి వచ్చాను ....
చూడగానే బ్లాగ్ టైటిల్ నచ్చింది ... అబ్బా ఎంత బావుంది ఈ పేరు ఈవిడ పెట్టేసుకుంది ..నాకు అవకాసం ఇవ్వలేదు ..అయినా ఇచ్చిన కాని నాకు అంత అందం గా పెట్టడం వచ్చా అనిపించింది

నేను చదివిన మొదటి పోస్ట్ పెళ్లి చూపులు పోస్ట్ .. ఆ పోస్ట్ చదివేటప్పుడు ఆ పోస్ట్ లో అక్కని ఎంత గా ఊహించుకున్నాను అంటే చెప్పలేను అప్పుడు మొదలు పెట్టాను పోస్ట్లన్ని చదవడం ... మళ్ళీ బ్లాగ్ లింక్ దొరకదేమో అని నోట్ బుక్ లో నోట్ చేసుకున్నా కూడా...... తరువాత నా నోటికి వచ్చేసింది బ్లాగ్ అడ్రస్ '

తన బ్లాగ్ లు చదివేటప్పు నన్ను నేనే అద్దం లో చూసుకున్నాట్టు అనిపించేది ... అమాయకత్వంలో కాని సాంప్రదాయ పద్దతుల్లో కాని నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించేది ... అమ్మయ్య మనలా ఆలోచించి వాళ్ళు చాల మంది ఉంటారనే విషయం బ్లాగ్ ల్లోకి వచ్చాకనే తెలిసింది

మెయిల్ ఐడి అడుగుదాము అనిపించేది కాని భయం వేసేది అడగడానికి

కాని అక్క మెయిల్ ఐడి ఇచ్చిన రోజు ఆ రోజు తనతో మాట్లాడిన రోజు ఎంత ఆనందం గా అనిపించింది అంటే

అక్క అక్క అక్కా అని ఒక వందసార్లు వరసపెట్టి పిలిచేదాన్ని :))))


ఎప్పడికి అక్కని అస్సలు వదిలిపెట్ట బుద్దేయకూడదు అనిపించేంత ప్రేమగా మాట్లాడుతుంది ...

ఎంతో లాలన గా చెబుతుంది ... ..........
తెలియని విషయాలు సున్నితంగా వివరిస్తుంది ...

అస్సలు కోప్పడడం కాని నొప్పించడం కాని అక్కకి అస్సలు తెలియవు ..

ఎన్నో సార్లు ఎన్నో విషయాలో నన్ను ఎంత లాలిస్తుందో .........

అసలు అక్క నాకోసమే పుట్టింది ఏమో :)))))))))) ( బావ గారు ఈ లైన్ చదవ కూడదు )

అమ్మో తిను మనిషేనా లేక దేవత ఎవరైనా ఈ రూపం లో వచ్చిందా అనిపిస్తుంది

ఇప్పడికి అక్క పోస్ట్ లు ప్రింట్ అవుట్ లు నా దగ్గర భద్రంగానే ఉన్నాయి :

హ్యాపీ హ్యాపీ బ్లాగ్ బర్త్ డే .. నువ్వు ఇలాగే మరో వెయ్యి పోస్ట్ లు రాసి మమల్ని ఇంకా మైమరిపించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా :)))))))

లవ్ యు అక్క

శాండిల్య చెప్పారు...

నేస్తం గారు.. నమస్కారం. నేనెవరో మీకు తెలీదు కదూ. మీరు కూడా నాకు తెలీదులెండి. మొన్నే పరిచయమయ్యారు. అస్మత్ నామధేయం శాండిల్య.
'పాడమని నన్నడగవలెనా' అంటూ జనాన్ని బెదిరించిన మీ తీరు సూపరో సూపరు. కానీ... ఆంద్రజ్యోతి వాళ్ళు మీ బెదిరింపులకి లొంగలేదు సరికదా... మీకే సహకరిస్తూ.. మొన్న ఆదివారం జనవరి ఒకటో తారీఖున మీ బెదిరింపులని అందరికీ వినిపించారు. దాంతో ఆంధ్రరాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది..! అంతలోనే సద్దుకున్నాంలెండి మేమంతా... ఎవరో నిజంగానే శ్రావ్యంగా పాడుతున్నారే అని.
మీ ఆ పోస్ట్ లో మీరు నాలుగడుగుల ఎత్తులో నడుస్తున్నప్పుడు మీ వారి స్పందన కత్తిలాగుంది. అలా అనటానికి ఆయనకి అంత ధైర్యం రావటం ఉంది చూశారూ... దాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను.
మీ బ్లాగ్ లోని మిగిలిన ముత్యాలని ఇంకా ఏరుకోలేదు... సమయానుకూలంగా అన్నిటినీ చూస్తా. ఈలోగా మీ 'పాడు బుద్ధి' ఇంకా ఎక్కువవ్వాలని ఆశిస్తూ... మీకు నా అభినందనలు.
మీ నేస్తం.

అజ్ఞాత చెప్పారు...

mee vyasam chaala baavundandi !!!!
idi monnasari andhrajyothy lo vacchindi kada !!!

dorababu gannamani చెప్పారు...

CHALA CHAALAAAA BAVUNDI.....

dorababu gannamani చెప్పారు...

CHALA CHALAAAAAA BAVUNDI....

tnsatish చెప్పారు...

Is this published in Andhra Jyothy? Can anyone share it?

మా ఊరు చెప్పారు...

http://www.andhrajyothyweekly.com/arc_index.asp?date=1/1/2012&page=Page22http://www.andhrajyothyweekly.com/arc_index.asp?date=1/1/2012&page=Page23

raaam చెప్పారు...

'పాడమని నన్నడగవలెనా' అంటూ meeru rasina danni enni sarlu chadivano nake gurthu ledu

బాటసారి చెప్పారు...

same alanti anubhavame naaku okati vundandi...

http://chittella.blogspot.com/2009/11/blog-post.html

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

చాలా బాగా పాడారు ..సారీ రాసారు :)

CP చెప్పారు...

Amazing posts!!! మీ టపా అద్భుతం. టపాలెంత బావుంటాయో, సమాధానాలూ అంతే చమత్కారంగా ఉంటాయి. టపా ని తిరగేస్తే పాటే కదా?? సొ మీరు టపాలతో జనరంజకంగా రాగాలాపన చేస్తున్నట్టే, ఏవంటారూ??

అజ్ఞాత చెప్పారు...

Ennela garu modati sari mee post chadivanu navvutu vunte kallalochi neellu vachay college corridor gurtuku vachinadi. Po.j

Brundavanachandrika చెప్పారు...

😂😂😂😂😂