12, మే 2012, శనివారం

సంతూర్ సంతూర్


ఎక్క్యూజ్ మీ..... ఏం కాలేజ్ చదువుతున్నారు ....
కాలేజ్ నేనా ??????
మమ్మీ!!!!!!!! ...
పసుపు చందనా గుణాల కలయికా సంతూర్
చర్మం మిల మిల మెరిసే ఇక సంతూర్ సంతూర్
.....................................

యాడ్ చూడగానే ఘాడంగా నిట్టూర్చాను ఆ రోజు  ప్రొద్దున్న జరిగిన సంఘటన గుర్తొచ్చి .....
అచ్చం ఇలాగే ఆ యాడ్లో అమ్మాయిలా  ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళుతుంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చి నా ఎదురుగా నించుని ఆయాసం తీర్చుకుంటూ "ఎక్స్క్యూజ్ మీ!!! ..ఏం కాలేజ్ చదువుతున్నారు" అంది.....చేతిలో ఏదో అడ్డ్రెస్ పుచ్చుకుని ....
"కాలేజ్ నేనా !!! " రెండో డైలాగ్ ఫర్ఫెక్ట్ గా చెప్పాను ఏడుపు మొహం వేసుకుని...
ఆ అమ్మాయికి డవుట్ వచ్చి మూడో డైలాగ్ చెప్పేవాళ్ల  కోసం చుట్టూ చూసి నా కాళ్ళ వైపు చూసింది అనుమానంగా...
గొప్ప అవమానం అయిపోయింది.."నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా "కోపంగా అనేసి మా స్కూల్లోకి పరిగెత్తాను..
ఆ అమ్మాయి టైడ్ యాడ్లో మురికి  చొక్కా అబ్బాయి తెల్లషర్ట్ అబ్బాయిని చూసి అవాక్కయిపోయినట్లు  అవాక్కయిపోయింది...

రెండో సంఘటన.....

"బుజ్జీ బుజ్జీ బుజ్జీ ...నీ వళ్ళంతా గజ్జి ...."మా పెద్ద తమ్ముడు ఆరువందల అరవయ్యోసారి ఏడిపించడం మొదలెట్టాడు..
నేను చెవులు గట్టిగా మూసుకుని ..."ఆ... ఏంటో ...నాకేం వినిపించడం లేదు ...నువ్వు ఏదో పెదాలు కదుపుతున్నావు అంతే..నా కసలు వినిపించనే లేదు.." పైకి బింకంగా అనేసి మా అమ్మ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి...
రెండుకాళ్ళు నేల కేసి టప, టపా కొడుతూ .."అన్ని ముద్దు పేర్లు ఉండగా ఎందుకమ్మా నాకు బుజ్జీ అని పెట్టావు..పెద్దమ్మ చూడు ఎంచక్కా పెద్దక్కను చిన్నూ అంటుంది.. దీన్నేమో శారు అంటారు ...దాన్ని బేబి అంటారు.. నన్నే ఎందుకమ్మా బుజ్జీ,బజ్జీ అని సుత్తి పేరుతో పిలుస్తారూ.. అని  ఏడుస్తూ అడిగాను..
"ఎహే ఆపు..బుజ్జిగా  ఉండేదానివి కాబట్టి బుజ్జీ అనేవాళ్ళం.. వాళ్ళు నీకులా లేరుకాబట్టి అనలేదు " మా అమ్మ సింపుల్గా కొట్టిపడేసింది..
"అది బుజ్జిగా కాదులే వదినా బండదానిలా ఉండేది ... ఎత్తుకోలేక చచ్చేవాళ్ళం ....కదా పెద్దోదినా..  మా ఆఖరు చిన్నాన్న పెద్దమ్మను రంగంలో దింపాడు..(కావాలనే అన్నాడు నాకు తెలుసు )
"మరే...పుట్టినప్పుడు ఎంచక్కా ౩ కేజీల బరువుతో ఎంత  బొద్దుగా ఉండేదని .... మోయలేక పోయేవాళ్ళం ..పెద్దమ్మ తూకాలు, కొలతలతో సహా ఆధారాలు ఇచ్చేసింది..
"అచ్చే ..మూడు కేజీలు కాదక్కా మూడున్నర అనుకుంటా " .... మా అమ్మను చూసినప్పుడల్లా అమయాకత్వానికి  కేరాఫ్ అడ్రెస్స్ మా ఇల్లే అనుకుంటాను ...

ముచ్చటగా మూడో సంఘటన ......

"నా పెద్ద మనవరాలిని ( మా అక్క అన్నమాట) ఈ ఇంటి కోడలిని చేసుకుంటా అని నా కూతురుకి మాటిచ్చాను.. అది కాదని ఇంకేవరినయినా తీసుకొచ్చి నా కొడుక్కి ( మా చిన్న మావయ్య) చేసారో ....ఖబడ్దార్ ...." మా అమ్మమ్మ హోల్సేల్గా అందరికి కలిపి వార్నింగ్ ఇచ్చింది .....

"మేనరికాలు మంచివి కావంటా ... పిల్లలు అంగ వైకల్యంతో పుడతారంట ... రేపు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏడ్చి లాభం ఉండదు.. వాడికి బయట సంబంధమే చేస్తాను ఎవరు అడ్డం వస్తారో చూస్తాను .."మా తాతయ్య మా అమ్మమ్మకు మాత్రమే వార్నింగ్ ఇచ్చారు..

"అమ్మా ...నేను దాన్ని చిన్నప్పటి నుండి ఎత్తుకుని తిప్పాను..చిన్న పిల్ల ..దానికి నాకు పదేళ్ళు తేడా ఉంది ....పెళ్లయినా మానేస్తాను కాని దాన్ని  చేసుకోనంతే "మా మావయ్య బెదిరించాడు..

"నువ్వు నోరు ముయ్యి, దాన్ని నువ్వు చూసి నాలుగేళ్లయింది .... ఇప్పుడెంత చక్కగా ఉందో తెలుసా ....ఆడపిల్ల ఎంతలో ఎదిగిపోవాలి ... నా మాట కాదని వేరే ఎవరినైనా చేసుకున్నావో నా ఫోటో మాత్రమే చూస్తావు తర్వాతా "  ..

అంతే ఆ తరువాత పే..ద్ద...ఆ  పే..ద్ద ..ఆ  గొడవలు అయిపోయి  మా అమ్మమ్మ ఊరికి ,మాకు దాదాపు ఆరు సంవత్సరాలు రాకపోకలు లేకుండా అయిపోయాయి... చివరాఖరికి మా అమ్మమ్మను బలవంతంగా ఒప్పించేసి మా మావయ్యకు వేరే అమ్మాయితో  పెళ్లి కుదిరాక, పది రోజులు ముందుగా నన్ను పంపించారు పెళ్ళికి  ...
 
అదేంటో అమ్మమ్మ ఇల్లంటే ఆడపిల్లలకు గొప్ప అలుసు కదా.. బస్సు దిగగానే రోడ్ మీదే మొదలు పెట్టాను నా చిట్టా పద్దు కోరికలు.."మావయ్య నాకు విసిఆర్ కావాలి .. ముఖ్యంగా  అమీర్ ఖాన్   ఖయామత్ సే ఖయామతక్   సినిమా  తెప్పించాలి... ఇంకా 1942   ఏ  లవ్ స్టోరి కావాలి  ....ఇంకా  "..

"ఇంక  నోరు మూస్తావా ... ఇది పల్లెటూరు ..ఇక్కడ హిందీ సినిమాలు ఎవరు చూస్తారు ???...ఆడపిల్లన్నాకా సుబ్బరంగా పెద్ద వాళ్లకు హెల్ప్ చెయ్యాలి ..ఇలాంటి పిచ్చి సినిమాలు చూడకూడదు.." మావయ్య క్లాస్ పీకాడు...

"నాకు సినిమాలు చూపించవా!!!! ..నేను మా ఊరు వెళ్ళిపోతాను పో..నా బ్యాగ్ నాకిచ్చేసే..అమ్మమ్మ కి చెప్తాను నీ పని "...అని రోడ్ మీద చిందులు తోక్కేస్తుంటే .... అల్లం మామ్మ చూసింది దూరం నుంచి..(ఆవిడ పేరేమిటో తెలియదు అల్లం మామ్మ అంటారు)..

"ఎవర్రా చిన్నోడా నీతో ఉన్న అమ్మాయి " ఘాట్టిగా పిలిచ్చింది ....

"చూసేసిన్దిరా బాబు "విసుక్కుంటూ ...మా అక్క కూతురు మామ్మా అన్నాడు.. "ఎవరూ మన పెద్దమ్మడు కూతురే... దీన్నేనా చిన్నపిల్ల అని చేసుకోనన్నావు "నన్ను దగ్గరకు తీసుకుని అడిగింది ఆరాగా ..నేను ఎంచక్కా జామకాయ తింటూ పక్కన కూర్చున్నాను..

 మరి ఎక్కడి నుండి వచ్చిందో మా అమ్మమ్మ .... "ఇదికాదు పిన్ని దీనికంటే పెద్దది.. మహా లక్ష్మిలా ఉంటుంది ..వెధవ సచ్చినోడికి చిన్నపిల్లలా కనబడిందట "..మా అమ్మమ్మ మొటికలు విరిచేసింది..

 "ఇది చిన్నపిల్లేంటి ..బంగారు బొమ్మలా ఉంది ..చక్కగా చీరకట్టి రూపయకాసంత బొట్టు పెడితే  ఇద్దరు పిల్లల తల్లిలా ఉంటుంది ... నీకేం పోయేకాలంరా అని కయ్ మంది అల్లం మామ్మ ..

వాళ్ళ పొగడ్తలకు సంతోషించాలో ,లేక వేరే కోణంలో బాధపడాలో తేల్చుకోక మునుపే ఎంచక్కా నాలుగు వీధుల్లో ఆడవాళ్ళు  పోగయిపోయి (పల్లెటూరు కదా...ఒక ఇంటి సమస్య ఊరంతటికి  కావాలి  ) మా మావయ్యని, పనిలో పని మా తాతయ్యని బోలెడు తిట్లు, శాపనార్ధాలు పెట్టేసి మా అమ్మమ్మని ఓదార్చి వెళ్ళిపోయారు..(మా అల్లం మామ్మ మాత్రం  ఆ తరువాత దాదాపు  అయిదేళ్ళు మా మావయ్యను ఏకి, పీకి పందిరేసిందట  ..ఈ ముక్క మా చిన్నత్త వచ్చినప్పుడల్లా చెప్పి నవ్వుతుంది)

ఆ దెబ్బతో మా మావయ్య నన్ను ఇంటికి తీసుకువెళ్ళి .."నిన్నేవడే  పది రోజులు ముందు రమ్మనాడు..నీకు అమీర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్  ,షారుఖ్ ఖాన్  ఏ ఖాన్ కావాలంటే ఆ సిన్మాలు ..మా వూర్లో దొరక్కపోతే పక్కూరు నుండి అయినా  తెచ్చి పడేస్తాను  కాని నువ్వు గుమ్మం దాటి బయటకురాకు తల్లో "అని దీనంగా వేడుకున్నాడు..

అక్కడితో ఊరుకున్నాడా దొంగ మొహం ....ఎంచక్కా పెళ్ళిలో కట్టుకుందామని  నేను ముచ్చట పడి  కొనుక్కున్న పరికిణి ,వోణి వేయనివ్వకుండా "అక్కా దీన్ని చూసి ఇదే పెద్దదనుకుని సంబంధాలు వచ్చేస్తున్నాయి..తర్వాత   నీఇష్టం" అని మా అమ్మ మనసు చెడగోట్టేసాడు... ఆ దెబ్బతో నేను అరిచి గీ పెట్టినా మా అక్క పెళ్లి అయ్యేంత వరకూ మహా తల్లి నన్ను పరికిణి ,వోణి వెయ్యనివ్వలేదు.. ఆ తరువాత నేను కొత్తవి కొనుక్కునేలోపే నా పెళ్లి చేసేసారు ..అలా నా జీవితంలో పరికిణి ,వోణి అనేది ఒక కల క్రింద మిగిలిపోయింది.

ఇలా ఉండగా మరి మా అమ్మకు ఎవరు ఏం చెప్పారో మరి పాపం..ఒక రోజు నా దగ్గరకొచ్చి బుజ్జీ! మరేమో ఈ రోజు నుండి రాత్రిళ్ళు నువ్వు చపాతి తిను అంది ...నేనసలు మూడు పూటలా ఆరు సార్లు అన్నం పెట్టినా తింటాను గానీ ఒక పూట టిఫిన్ తినమంటే ఏడుస్తా .." ఏంటి చపాతీయా..ఛీ ఛీ నావల్లకాదు "అని తేల్చి  చెప్పేసాను  ... అలాకాదుగాని  రాత్రిళ్ళు చపాతి తింటే చాలా మంచిదంట తినాల్సిందే అని ఆర్డరేసి వెళ్ళింది.. సరే అని చపాతి ప్లేట్ ముందు పెట్టుకోగానే మా అక్క ఎదురుగా ఆవకాయ అన్నం నెయ్యి వేసుకుని ఎంచక్కా తింటుంటే ఆగలేక ఆ పళ్ళెం పక్కన పడేసి మామూలుగానే అన్నం తినేసా..అమ్మొచ్చి ప్లేట్ చూసి "అదేంటి చపాతి తినలేదా "అంది ... "ఉహు నాకొద్దు ఆ ఆరోగ్యమేదో నువ్వే తెచ్చుకో ..అయినా వాళ్ళెవరికీ పెట్టకుండా నాకే పెడతావేంటి..వాళ్ళకు అక్కరలేదా ఆరోగ్యం  "విసుగ్గా అన్నా.."ఒసే గాడిదా..నువ్వు ఇలా అన్నం తింటే వళ్ళు తగ్గదు.. ఎవడూ నిన్ను పెళ్లి చేసుకోడు" కోపంగా అనేసి వెళ్ళిపోయింది...

అంతే మేటర్ క్లియర్గా అర్ధం అయిపోయింది.. ఆ షాక్ కి ముందు ఏడుపోచ్చ్సింది, తరువాత కోపం వచ్చింది ,ఆ తరువాత నోట్లోంచి పాట వచ్చింది..దేవుడి రూంలోకి వెళ్లి నాకు తెలిసిన దేవుడి పాటలన్నీ పాడేసుకుని ...హే భగవాన్ ..నేనేం తప్పు చేసాను... తిండి కూడా ఏం తినను కదా మరెందుకు ఇలా నన్ను లావుగా చేసేస్తున్నావు..నాకసలే ఎక్సర్ సైజులు,డైటింగు లు  గట్రాలు పడవు..నువ్వేం చేస్తావో నాకేం తెలియదు పెళ్లి అయ్యేలోపు నేను సన్నంగా మెరుపు తీగలా అయిపోవాలంతే అని కోరేసుకున్నా ...(దేవుడికి నేనంటే చాలా ఇష్టం .... నిజంగా నిజంగా నేను ఏమి చెయ్యకుండానే పెళ్లి టైంకి దాదాపు 12 కేజీలు తగ్గిపోయా ..ఆఖరికి పిల్లలు పుట్టినా సరే యాబై కేజీలు  ఇప్పటివరకు దాటలేదు ...ఇక మీదట విషయం తెలియదనుకోండి ముందు జాగ్రత్తగా చెప్పేస్తున్నా :D)

ఫ్లాష్ బ్యాకులు అయిపోయాయి..అలా నా బండతనం  వల్ల ..ఛీ ఛీ...కాదు కాదు.. నా బొద్దుతనం వల్ల ఎన్ని బాధలు పడ్డానో ఒకటా రెండా ఎన్నని చెప్పను.. ఆ దెబ్బతో పైన చెప్పిన సంతూర్ యాడ్ నా మనసుమీద తీవ్ర ప్రభావం చూపేసింది.. నేను కూడా పెళ్లయినా సరే,పిల్లలు పుట్టినాసరే...స్లిమ్ముగా ,చక్కగా మెరుపు తీగలా ఉంటే,ఆ యాడ్ లోలా నన్ను కూడా ఏం కాలేజ్ అనడిగితే ,నా కూతురు మమ్మీ అని పరిగేట్టుకొస్తే  ఎంత బాగుంటుందో కదా అని తెగ కలలు కనేసేదాన్ని..అసలందుకే నాకు ముందు అమ్మాయే పుట్టాలని కోరుకున్నాను కూడా :P
అలా పెళ్లికాకుండానే ఒక చిన్నపిల్లకి తల్లిగా  మారాకా  ఎలా ఉండాలో  అని తీవ్రంగా ఆలోచిస్తుండగానే పెళ్ళయిపోయింది..నేను సింగపూర్ వెళ్ళిపోయాను...పిల్లలు పుట్టేసారు  ..వాళ్లకు నెస్టంలు  తినిపించాడాలు,డైపర్లు మార్చడంలు ,స్కూళ్ళు,చదువులు, చట్టుబండలు   వరసపెట్టేసాయి ...ఇంకేంటి నేను ఆ గోలలో పడి యాడ్ సంగతి మర్చిపోయాను ..

ఆ తరువాత ఇన్నాళ్ళకు మొన్న టివి పెట్టి చూస్తుంటే మహేష్ బాబు  సంతూర్ యాడ్లో వచ్చి "దేవుడు వరమిచ్చినా  పూజారి పడనివ్వలేదని..నువ్వు సన్నంగా అయినా ,మొదట నీకు కూతురు పుట్టినా  నీ కోరిక తీర్చుకోలేకపోయావు..రాసి పెట్టి ఉండాలి" అని  సోప్ పుచ్చుకు కొట్టినంత పనిచేసేసరికి టక్కున ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది.. ఆ వెంటనే బడేలు కొంగలా నా అంత ఎత్తు ఎదిగిన నా కూతురు ని చూసి ఏడుపొచ్చింది(మా ఆడపడుచు పోలిక,పైగా ఇంతెత్తు హీలొకటి వేస్తుంది గాడిద ) ..ఎంత పనయ్యింది దేవుడా  !!!! .... ఎంచక్కా దానికి 3 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఇండియా వచ్చినప్పుడల్లా   దాన్ని తీసుకుని మా కాలేజ్  వైపు తిరిగితే ఎవరో ఒకరు నా కల తీర్చేవారు కదా (మనిషి ఆశా జీవి) ఇప్పుడు ఎవరంటారు నా మొహం  అని ఘాడంగా నిట్టూర్చి  ఊరుకున్నా ...

చెప్పానుగా దేవుడికి నేనంటే   బోలెడు ఇష్టం అని ...నమ్మట్లేదుగా మీరెవరూ.. సరే వినండి...

అయితే మొన్న మా పక్క పోర్షన్ వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగిందని కొత్తకోడలితో సత్యన్నారాయణ స్వామి  వ్రతం చేస్తున్నారు .... పేరంటానికి రమ్మంటేనూ....     ఆ ....జస్ట్ తాంబూలమే కదా అని డ్రెస్ వేసుకుని  వెళ్లాను.. జనాలందరూ హడావుడిగా తిరుగుతుంటే పెళ్లి కొడుకు చెల్లెలు రెండు మూడుసార్లు నన్ను చూసి నవ్వింది ..నేను కూడా నవ్వాను..

నాకు తెలుసు నాకు తెలుసు .. ఇప్పుడేమనుకుంటున్నారో ... ఆ అమ్మాయి వచ్చ్చి" ఎక్స్క్యూజ్మీ ..మీరేం కాలేజ్ "అని అనిఉంటుంది  అనుకుంటున్నారు కదా... హిహిహి కాదు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఎవరా అమ్మాయి నేను ఇదే చూడటం అన్నాది..ఆయనేమో ఆ హడావుడిలో నన్ను పరిచయం చేస్తూ" నువ్వు చూడలేదు కదూ  ఈ అమ్మాయిని..ఈ మధ్యనే ఇండియా వచ్చింది..మన  పక్కింటిఆవిడ మనవరాలు"..అని మా అత్తగారి వైపు నా వైపు చూపిస్తూ  పరిచయం చేసారు...  నేనేం ఢాం  అని పడిపోలేదు...అంటే పొరపాటున కోడలు అనాబోయి మనవరాలు అనేసారనుకుని ..చిన్నగా నవ్వాను...ఓ పక్కాంటీ  మనవరాలా  అని ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది..""అవును వాళ్ళ తమ్ముడు కూడా ఉండాలి బయట ఆడుకుంటున్నట్లున్నాడు"" అన్నారు ఆయన  ...
అప్పుడు ..అప్పుడు  వెలిగింది లైటు ..అప్పుడు " ఢాం  "అని పడిపోయాను ..( చెప్పానా దేవుడున్నాడని..) మా అత్తగారి ఫేస్ ఎక్ప్రేషన్స్ గట్రాలు నేనేం చూడలేదమ్మా ..అందుకే నో కామెంట్ అన్నమాట .... ఈ లోపల రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన  వాళ్ళ ఆవిడ పరిగెత్తుకొచ్చి " ఏమండోయ్ ఈ అమ్మాయి ఆవిడ  పెద్దకోడలు ....మనవరాలు కాదు  అని అరిచి సారి అండీ మా ఆయన పొరబడ్డారు" అంది...

ఆ తరువాత ఆయన కూడా నాలుగు సార్లు నా దగ్గరకోచ్చ్చి" సారి అమ్మా..పొరబడ్డాను..మీ అమ్మాయి నీ పోలికలే కదా..కాస్త పొడవు కదా.. అయినా మీ అమ్మాయిని దూరం నుండి చూసాను అందుకే సరిగ్గా గుర్తుపట్టలేక నిన్నే తను అనుకున్నా .." అని మొత్తుకున్నా సరే నా మెదడేంటో ఆయన చెప్పిన మొదటి మాటకే ఫిక్స్ అయిపోయింది ..పైగా వాళ్ళమ్మాయి అయితే ఇది మీకు బెస్ట్ కాంప్లిమెంట్ యూ నో అన్నాది కూడా...
అయితే  మిగిలినవాళ్ళు అసూయతో రక రకాల కారణాలు చెప్పి నన్ను చాలా చాలా  డిసప్పొయింట్ చెయ్యాలని చూసారుగాని (అంటే మా ఆయన , ఇతర కుటుంభ సబ్యులు వగైరాలన్నమాట )..ఇష్ష్ ..
తప్పు కదా పెదరాయుడు లాంటి పక్కింటి పెదనాన్న గారు  అబధ్దం చెప్తారా? కళ్ళుపోతాయ్.. లెంపలేసుకోండీ..
 పైగా  పెద్దవాళ్ళ మాటలు మనం తప్పు పట్టకూడదు కూడానూ   అందుకని అవన్ని ఇగ్నోర్ చేసేసాను..మీరు కూడా చేసేయండి..మనసులో అటువంటి వ్యతిరేకపు ఆలోచనలు రానివ్వకండి.. రావులేండి మంచివాళ్ళకు అటువంటి అనుమానాలు రావు......ఆ విషయం మీకు కూడా తెలుసనుకోండి..

ఇదంతా కాదుగాని నాకో గొప్ప డవుటేమిటంటే సంతూర్ సోప్ యాడ్ చూస్తేనే ఇంత చిన్నదానిలా కనబడిపోతుంటే అది వాడితే ఎలా ఉంటుందా అని.. బహుసా ఒక పాతికేళ్ళ తరువాత.. 
ఎక్స్క్యూజ్ మీ
ఏం కాలేజ్ చదువుతున్నారు మీరు
కాలేజ్ నేనా!!!!
అమ్మమ్మా.... ( నా మనవరాలు పరిగెత్తుకొస్తూ )

67 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

chala rojula tharuvatha rasaru...chala bagundi...

padmaja చెప్పారు...

1 st comment, good one

Unknown చెప్పారు...

Ha ha Nestam garu

too good Entry :))))

రాజ్ కుమార్ చెప్పారు...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

welcome back akkaaaaaaaaaaa

రాజ్ కుమార్ చెప్పారు...

..అవును వాళ్ళ తమ్ముడు కూడా ఉండాలి బయట ఆడుకుంటున్నట్లున్నాడు అన్నారు ఆయన ...
>>>>>>>
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేకాఆఆ... మళ్ళీ చదివాను ఈ పేరా...

ఏజ్ యూజువల్....

మేము... జాజిపూలు2.0 కి రంగం సిద్ధం చేసుకుంటాం..

హరేకృష్నా... ఎక్కడాఆఆఆఆఅ???????????

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జాజి పూల పరిమళం విరిసింది మళ్ళి. వెల్కం వెల్కం.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

పునరాహ్వానం నేస్తం సూపర్ టపా... :-)
“నేను తొమ్మిదో తరగతి” అల్టిమేట్ :-) కిం.ప.దొ.న
అవునవును నేను ఆ అంకుల్ మాటే గుర్తుపెట్టుంకుంటాను మిగతావాళ్ళ కరక్షన్స్ కాదు :)
ఇక చివరాఖరి పంచ్ “అమ్మమ్మా...” కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక...

మధురవాణి చెప్పారు...

:)))))))

Good to see you back! :)

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

Welcome back :-)

అజ్ఞాత చెప్పారు...

"
"అమ్మమ్మా.... ( నా మనవరాలు పరిగెత్తుకొస్తూ )"---ఇది మాత్రం బ్రహ్మాండం.....

అజ్ఞాత చెప్పారు...

బాగుంది , చాల రోజుల తరువాత రాసారు . మీరు మీ అమ్మాయిని గాడిద అని తిట్టడం నవ్వొచ్చింది.
ఇలాంటి తిట్లు విని చాల రోజులైంది. పల్లెటూళ్ళలో ఇలాంటివి బాగా విన్విపిస్తాయి. తెలియని వాళ్ళు మొరటు మాటలు అనుకుంటారు కానీ ఆ తిట్లలో సగం అభిమానం ఉంటుంది.
మీ తమ్ముడు అని ఎవరిని ఉద్దేశించి అన్నారు ఆ పక్కింటాయన. కొంపతీసి మీ అబ్బాయిన ?. అలానే అనుకుంటున్నాను.
:venkat

పూర్ణప్రజ్ఞాభారతి చెప్పారు...

//పెదరాయుడు లాంటి పక్కింటి పెదనాన్న గారు అబధ్దం చెప్తారా? కళ్ళుపోతాయ్//

హైకోర్టు, సుప్రీం కోర్టుల మాటల్ని ధిక్కరించవచ్చు. కానీ పెదరాయుడులాంటి పక్కింటి పెదనాన్న గారి మాటను కాదనలేం. మీరు యంగే... ఖాయం.

SHANKAR.S చెప్పారు...

ఇంత చిన్న వయసులో ఇన్నేసి పెద్ద పెద్ద పోస్టులు రాసేస్తున్నారంటే మీరసలు కేక తెలుసా.

(మనలోమనమాట మీ పక్కింటి పెదనాన్నగారి కళ్ళజోడు పవర్ ఏమాత్రం ఉంటుందండీ? :) )

sunita చెప్పారు...

hahaha! As usual in your style! But this is tooooooooo hilarious:)))
అమ్మమ్మా...........

శ్రీనివాస్ చెప్పారు...

కికికిక్కికికికి

MURALI చెప్పారు...

మొత్తానికి మీ కల 3D రేంజ్‌లో నెరవేరింది.
ఇంతకీ ఆ బరువు ఎలా తగ్గారో కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.

చాణక్య చెప్పారు...

సూపర్ నేస్తంగారూ! వెల్‌కమ్ బ్యాక్!! :)))

ఫోటాన్ చెప్పారు...

నైస్.. వెల్కం బ్యాక్ నేస్తం గారు :))

అజ్ఞాత చెప్పారు...

woww........superb nestam garu.
welcome back!! :) :)

-bittu

Ramani Rao చెప్పారు...

సూపరంతే.. :)))))

..nagarjuna.. చెప్పారు...

>>కాలేజ్ నేనా!!!!
>>అమ్మమ్మా.... ( నా మనవరాలు పరిగెత్తుకొస్తూ )


మీ మనవరాలు సూపర్ అక్కా ;)

Unknown చెప్పారు...

పోస్ట్ సూపర్...కెవ్వు..కేక...

>>"ఎక్స్క్యూజ్ మీ!!! ..ఏం కాలేజ్ చదువుతున్నారు"

బహుశా మిమ్మల్ని చూసి Ph.D చేస్తున్నారనుకుందేమో... డౌటుంటే, ఈసారి ఏదైనా రెప్యూటెడ్ కాలేజ్‌కు వెళ్ళండి. అక్కడ మిమ్మల్ని చూసి మీది ఏ బ్రాంచ్, ఏ ఏరియాలో వర్క్ చేస్తుంటారు అని గ్యారెంటీగా అడుగుతారు. :-)

>>"నేను ఏమి చెయ్యకుండానే పెళ్లి టైంకి దాదాపు 12 కేజీలు తగ్గిపోయా"

16 - 18 మధ్య వయస్సులో చాలామంది బాగా పొడవు పెరుగుతారు. లావుగా, లేదా పొట్టిగా బొద్దుగా ఉన్నవారు కూడా ఆ ప్రాసెస్‌లో సన్నగా, బక్కగా అయిపోయి పొడవు పెరుగుతుంటారు. బహుశా మీరు కూడా ఇదే వయస్సులోనే సన్నంగా అయి ఉంటారని అనుకుంటున్నాను.


>>"పెదరాయుడు లాంటి పక్కింటి పెదనాన్న గారు అబధ్దం చెప్తారా"

పాపం ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు ఆయన. ఇలాగే నేనూ ఒకప్పుడు ఒకే పోలికలతో ఉన్న తల్లి కూతళ్లని చూసి, వాళ్ళింట్లో వాళ్ళ కూతురి పెళ్ళి ఫోటోల ఆల్బమ్ చూపిస్తుంటే, ఏదో ఆలోచిస్తూ ఫోటోలూ కొత్తగా ఉన్నా కూడా తల్లి పోలికలతో పెళ్ళి కూతురు ఉండటంతో ఫోటోలు బానే ఉన్నాయి కానీ ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రిందట తీసినవి ఇప్పుడెందుకు చూపిస్తున్నారు అన్నాను. (ఇక్కడ వాళ్ళ ఎక్స్ ప్రెషన్ ఎలా ఉంటదో మీ ఊహకే వదిలేస్తున్నా.) :-)

ఇందు చెప్పారు...

Kevvvvvvvvvv!!!!

Mee korika neravertundi naku telsu :D endukante devudiki meerante istham kadaaa ;)



Super nestam :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

Superb! good come back, నేస్తం గారూ :-)

శశి కళ చెప్పారు...

మీ మావయ్య మొహం ఎలా ఉంటుందో గుర్తుకు వస్తే ..))) మొత్తానికి మల్ల కేక పెట్టించారు...సంతూర్ తో ప్రవేశం చేసి.శుభం మీ మనుమరాలు మీ కోరిక తీరుస్తుంది.అప్పుడు గుర్తుకు రాక పొతే నేను గుర్తు చేస్తా లెండి

హరే కృష్ణ చెప్పారు...

ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు మేము కేకలు వేస్తున్నాం :))

హరే కృష్ణ చెప్పారు...

నన్ను పరిచయం చేస్తూ" నువ్వు చూడలేదు కదూ ఈ అమ్మాయిని..ఈ మధ్యనే ఇండియా వచ్చింది..మన పక్కింటిఆవిడ మనవరాలు"..అని మా అత్తగారి వైపు నా వైపు చూపిస్తూ పరిచయం చేసారు

కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ :)))))))))))


బాక్ గ్రౌండ్ లో పసుపు చందనం గుణాల కలయిక సంతూర్
సంతూర్ సంతూర్ అని ఏదో టీ వీ లో తధాస్తు బాక్ గ్రౌండ్ మోగుతూనే ఉండి ఉంటుంది

నేస్తం చెప్పారు...

Experiences గారు ధాంక్యూ..:)
పద్మజ గారు ధాంక్యూ :)
శేఖర్ గారు ధాంక్యూ:)
రాజ్ :D :D
బులుసుగారు :D ధాంక్యూ
వేణూ జి ధాంక్యూ :)
మధురా :)))

నేస్తం చెప్పారు...

దిలీప్ గారు ధాంక్యూ:)
హరేఫల గారు ధాంక్స్ అండి :)
వెంకట్ గారు పల్లెటూళ్ళలో అని కాదుగాని ఎక్కువగా మా ఇంట్లో గాడిద,దున్నపోతా అనేవి ప్రధాన తిట్లు ..:)
పూర్ణ భారతిగారు మేటర్ సరిగ్గా అర్ధం చేసుకున్నారు ధాంక్యూ :)

>>>>మనసులో అటువంటి వ్యతిరేకపు ఆలోచనలు రానివ్వకండి.. రావులేండి మంచివాళ్ళకు అటువంటి అనుమానాలు రావు......ఆ విషయం మీకు కూడా తెలుసనుకోండి
శంకర్ గారు ఏదీ పై ముక్క ఒక్కసారి చదివి మళ్ళీ అనండి చూద్దాం..:/

నేస్తం చెప్పారు...

సునీత గారు ధాంక్యూ ధాంక్యూ
శ్రీనివాస్ హిహిహిహి ...
మురళిగారు ఎలా అంటే దైవ నిర్ణయం అంతే అది :)... అంటే అది ఎక్జాంస్ అంటే నాకు కొంచెం టెన్షన్ ఉండేది ..ఇంటర్ చదివే టైంలో కొద్ది కొద్దిగా తగ్గాను ..పైగా కాలేజ్ నుండి ఇంటికి రోజుకి రెండు సార్లు వెళ్ళి రావడం (అరగంట నడక)...ఇవన్నీ ఏమో ...
చాణుక్యా ధాంక్యూ :)
ఫోటాన్ :) ధాంక్యూ:)
బిట్టూ ధాంక్యూ ధాంక్యూ:)

నేస్తం చెప్పారు...

రమణిగారు ద్యాంక్స్ అండి :)
నాగర్జునా అది పాతికేళ్ళ తరువాతబాబు ఇప్పుడుడప్పుడే కాదన్నమాట :)
రామలింగా :)
>>>16 - 18 మధ్య వయస్సులో చాలామంది బాగా పొడవు పెరుగుతారు. లావుగా, లేదా పొట్టిగా బొద్దుగా ఉన్నవారు కూడా ఆ ప్రాసెస్‌లో సన్నగా, బక్కగా అయిపోయి పొడవు పెరుగుతుంటారు. బహుశా మీరు కూడా ఇదే వయస్సులోనే సన్నంగా అయి ఉంటారని అనుకుంటున్నాను.

అది నిజమేకాని నేను సడన్ గా చాల భయంకరంగా వెయిట్ తగ్గాను అంటే తాంబూళాలకు పెళ్ళికి మధ్య 3 నెలల్లో దాదాపు 8 కేజీలు తగ్గిపోయా..(అంటే పెళ్ళి కి43 కేజీలు మాత్రమే ఉన్నా :))నాకేమన్నా అయిందేమో అని డాక్టర్స్ చుట్టూ తిప్పారు కూడా..:) ఏమ్మా ఈ పెళ్ళి ఇష్టంలేదా ఎందుకలా అయిపోతున్నావు ..నాకు చెప్పు ఎవరికీ చెప్పను అని దగ్గరవాళ్ళు నస పెట్టేసేవారు..

>>>పాపం ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు ఆయన
హహహ నాకు తెలియదా?నిజానికి పాపం ఆయన మా అమ్మాయిని సరిగ్గా చూడలేదు(మెరుపు తీగ అని దానికి పేరు పెట్టారు మా ఫ్లోర్లో ..బయటకు రాదు వచ్చినా సెకను కంటే ఎక్కువ కనబడదు అని అట)అందులోనూ పెళ్ళి హడావుడిలో ఉండి..నేను డ్రెస్స్ లో వచ్చేసరికి అత్తయ కాస్త పెద్దరికంగా ఉంటారుకాబట్టి మనవరాలు అనేసుకుని అలా అనేసారు ....

నేస్తం చెప్పారు...

ఇందు నువ్వు ఒక్కదానివి కరెక్ట్ గా అర్ధం చేసుకున్నావు...సో స్వీట్

భాస్కర్ గారు ధాంక్స్ అండి :)

హ హ శశిగారు మా మావయ్య మొహమా?? ...ఇవన్నీ తనకు అలవాటేలేండి..ఏం చేస్తాడుపాపం..గట్టిగా అన్లేడు..మా నాన్నగారంటే భయంగా ..బాగా ఏడిపించేదాన్ని :))

>>>>బాక్ గ్రౌండ్ లో పసుపు చందనం గుణాల కలయిక సంతూర్
సంతూర్ సంతూర్ అని ఏదో టీ వీ లో తధాస్తు బాక్ గ్రౌండ్ మోగుతూనే ఉండి ఉంటుంది

ఈ ముక్క రాద్దామని మర్చిపోయాను హరి ..భలే గుర్తు చేసావ్ ...

అజ్ఞాత చెప్పారు...

సంతూర్ వాడికి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారుగా.. :)

శ్రీధర్. దు చెప్పారు...

:))

ఆ.సౌమ్య చెప్పారు...

హహహ మొత్తానికి మీ కోరిక అలా తీరిందన్నమాట :))
అయినా ఇదంతా కట్టుకథ నేను నమ్మను...మీరు బొద్దుగా ఉండేవారంటే అబ్బే...అచ్చే..ఊహూ...నేను నమ్మనుగాక నమ్మను. కథ బాగా రాసారు నేస్తం :D

ఆ.సౌమ్య చెప్పారు...

చిన్నప్పుడు నేను ఆరో క్లాసుకొచ్చేసానని తెగ సంబరపడిపోతూ స్కూలికి వెళ్ళాను..అదేంటో నేను పెద్దదాన్నైపోయానని ఒక ఫీలింగ్. స్కూలు గుమ్మంలో నన్ను చూసి ఒకమ్మాయి "నువ్వు మూడో క్లాసా" అని అడిగింది. నాకు ఉక్రోషం వచ్చేసింది. ఆరుకొచ్చి పెద్దదాన్నైపోతే నన్ను మూడంటుందా అని ఏడుపొచ్చేసింది. అంత పొట్టిగా ఉండేదాన్ని నేను :))

జ్యోతిర్మయి చెప్పారు...

నేస్తం గారూ మీ బ్లాగులో చాలా టపాలు చదివాను ఇవాళ. మీ రచనా శైలి బావుంది. తీరిగ్గా ఆస్వాదించవలసినవి చాలా ఉన్నాయి.

మాలా కుమార్ చెప్పారు...

సంతూర్ ఆడ్ కల అమ్మలందరికీ వుంటుందేమో :)

బాగారాసారు .

sphurita mylavarapu చెప్పారు...

"ఈ మధ్యనే ఇండియా వచ్చింది..మన పక్కింటిఆవిడ మనవరాలు"..అని మా అత్తగారి వైపు నా వైపు చూపిస్తూ పరిచయం చేసారు"
మనలో మన మాట...నిజం చెప్పండి నేస్తం...ఈ ముక్క అనగానే ...మీరు మీ అత్తగారి expressions ని గర్వం తో కూడిన ఆనందం వల్ల వస్తున్న నవ్వుని ఆపుకంటూ చూళ్ళేదూ...:)))

krishna చెప్పారు...

These days, whenever I see married woman, I feel like, "She is very young. Is she already married?"

May be because, I am still unmarried. ;)

పవన్ కుమార్ చెప్పారు...

చాలా రొజులైంది కాని ఆ కామిక్ టైమింగ్ మాత్రం ఏమి తగ్గలేదు. టపా అదిరింది. సూపర్ అక్కా(సారి చెలెమ్మ). :)

రాజ్ కుమార్ చెప్పారు...

@పవన్..
పోస్ట్ పడి ఆరునెలలవుతుంది. పవర్ మాత్రం తగ్గలా..
(గబ్బర్ సింగ్ స్టైల్)

నేస్తం చెప్పారు...

puranapandaphani గారు ... కదా .. అసలు ఈ పోస్ట్ చూసి ఎంతమంది సంతూర్ వాడేస్తున్నారో ఏమో :)తీవ్రంగా ఆలోచించవలసిన విషయమే :)
శ్రీ గారు :)

సౌమ్యా నమ్మాలి మరి ..:P
మా చెల్లిని కూడా అలాగే అనేవారు కాలేజ్ కి వచ్చినా ఏం స్కూల్ అమ్మా అని :)

జ్యోతిర్మయిగారు ధ్యాంక్స్ అండి

మాలా కుమార్ గారు నిజమే ఈ యాడ్ అమ్మలందరికి ఉంటుందేమో..బాగా చెప్పారు

స్పురితా ష్. ష్..ష్ ..............

క్రిష్ణ గారు :)

పవన్ ఏం పర్లేదు అక్కా అనే అనొచ్చు కాని నీ వయసు పదిలోపే ఊహించుకుంటాను మరి :)

రాజ్ :)

CP చెప్పారు...

Superb as always:)) Liked it so much.

A.V.Naga Sandeep Kumar చెప్పారు...

ha ha ha .... chala baga rasaru andi

A.V.Naga Sandeep Kumar చెప్పారు...

ha ha chala bagundi

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

Wow.. after a very long time..
How are you nestam?

అజ్ఞాత చెప్పారు...

అందరికి పెళ్లి అయ్యాక ఇలాంటి కలలొస్తాయి,మీరు మాత్రం చాల అడ్వాన్సుగా ఉన్నారు.ఒక గీత చిన్నదవ్వాలంటే దాని పక్కన పెద్ద గీత గియ్యలంటారు.మీరు కూడా మీ వయసున్నోల్లని అంకుల్ అనో,ఆంటీ అనో పిలవండి సరిపోయిద్ది:)Anudeep

నేస్తం చెప్పారు...

CP గారు ధాంక్స్ అండి
సందీప్ గారు ధాంక్యూ
నరేష్ గారు బాగున్నాను ...రిప్లై కూడా లేట్ గా ఇస్తున్నా :( బోలెడు బిజి :)
అనుదీప్ గారు :)

చెప్పాలంటే...... చెప్పారు...

bhale baavunnayi mi kaburlu flash back lu baagaa rasaru :)

పరిమళం చెప్పారు...

ఇంతకూ నేస్తం!మీరు ఏకాలేజ్!!! :) :)

అజ్ఞాత చెప్పారు...

మా ఆడపడుచు పోలిక,పైగా ఇంతెత్తు హీలొకటి వేస్తుంది గాడిద )

ఏమనుకోకపోతే, మీరు గాడిద అని ఎవరిని సంభోదించారు?

Ram Krish Reddy Kotla చెప్పారు...

కెవ్వు కేక :)
ఇంతకీ నేస్తం జీ మీ బ్యూటీ సీక్రెట్లు, మీ ఫిట్నెస్ సీక్రెట్లు గట్రా త్వరగా చెప్పుసుకోండి నాకు.... ఇక్కడ కాదు ఒక మెయిల్ పంపండి.. సరేనా... నేనెవరికీ చెప్పను.. నేనే ఫాలో అవుతా ... :)

Ennela చెప్పారు...

chivari line...super..

avunandee..blaaglokam lo inko nestam gaarunnaaraa!!!..chaalaa rojula tharvaatha yee roju blaaglokam lo viharistoo yee nijaanni telusukunnaanoch!

thanooj చెప్పారు...

sooooooooooooooooooooooodiiiiiiiii

Unknown చెప్పారు...

Bhargavi garu First me blog chal chal bagundi, chala baga rastunnru. Me telug skript choosi chala santosham ga anipinchindi.
Than you so much for your lovely comment in my blog.
Yes you can do that meru me microwave oven lo convection mode lo murukulu bake cheyyavachu. Me ru yintaka mundu cookies bake chesi vunte just alane murukulu kooda bake cheyyavachu. meku artham ayindi anukutanu. yinka yemanna doubts vunte please let me know.try chesi yela vachinayo cheppandi. one more thing biyyam pindi matrm yekkuva kalapakandi just 1 tab sp chalu lekapote murukulu chala gattiga vastayi tinlemu.
Thanks once again
Padma.

thanooj చెప్పారు...

బ్లాగర్ rekhas kitchen అన్నారు...

Bhargavi garu First me blog chal chal bagundi, chala baga rastunnru. Me telug skript choosi chala santosham ga anipinchindi.
Than you so much for your lovely comment in my blog.
Yes you can do that meru me microwave oven lo convection mode lo murukulu bake cheyyavachu. Me ru yintaka mundu cookies bake chesi vunte just alane murukulu kooda bake cheyyavachu. meku artham ayindi anukutanu. yinka yemanna doubts vunte please let me know.try chesi yela vachinayo cheppandi. one more thing biyyam pindi matrm yekkuva kalapakandi just 1 tab sp chalu lekapote murukulu chala gattiga vastayi tinlemu.
Thanks once again
Padma.


bellam vesthay istham hahahahah hahhahhaha hahahah saradga navvanu serious avvakandi mana blogs unnay naalanti manchi manasunna vyakthini manasaara navvichadanike danyavadamulu ithivaarthaha

Viswanath చెప్పారు...

Super!!!!!!!

Swathi చెప్పారు...

dear nestham garu,

nenu meeku pedda fan ni,AC ni,light ni..anni..mee post lu anni okkati kuda miss avvakunda chadivesanu.entha chadivina bore kottaledu.appude ayipoyayaa anipinchindi.Hatesoff to you.Expecting more and more posts from you nestham.Yours fan-Swathi

నేస్తం చెప్పారు...

ఈ మధ్య బ్లాగ్స్ చూడటంలేదు ..కొద్దిగా బద్దకం అన్ని కలిపి లేట్ రిప్లయ్..ఏమనుకోకండేం..మంచివాళ్ళుకదూ..

చెప్పాలంటే గారు ధన్యవాదాలు
పరిమళం గారు కాలేజ్ నేనా???
అజ్ఞాతగారు :) ముమ్మాటికీ మా అమ్మాయినే అన్నాను..:)
కిషన్ గారు ఎందుకండి ఇంకొకన్ని ఫొటోస్ తీయించుకుని ప్రొఫైల్ లో పెట్టడానికా..
ఎన్నెలగారు..ఉన్నారండి..ఓసారెప్పుడో నేనూ కంఫ్యూజ్ అయ్యాను.. ..నేస్తం పేరుతో బ్లాగ్ కూడా ఉంది
తనూజ్ గారు ఈ భార్గవేమిటో ఈ రేకాస్ కిచన్ ఏమిటో..మీరు మనసారా నవ్వించడం ఏమిటో నాకేం అర్ధం కాలేదు ...

విశ్వనాధ్ గారు ధాంక్స్ అండి
స్వాతిగారు :) ధాంక్యూ

భాస్కర్ కె చెప్పారు...

వినాయకచవితి శుభాకాంక్షలండి,

Kishore చెప్పారు...

Superb naration.

Chinni చెప్పారు...

chaalaa peeddaa post..kaani asaktigaa chadiveelaa vraasaaru..reading all your posts.

........................ చెప్పారు...

సారి అమ్మా..పొరబడ్డాను..మీ అమ్మాయి నీ పోలికలే కదా..కాస్త పొడవు కదా.. . .

pedarayudulanti...
:p

swarna చెప్పారు...

Its a dream of every woman. :)
Nice!!

Pavan Kuamar చెప్పారు...

Eppudu open chesinaa bhoomika photo ne kanipisthundi.
Koncham adi maarchi Samantho, inkevarido photo petti malla oka manchi post veyochu kaddaaa ??
Long time no post :(

అజ్ఞాత చెప్పారు...


Really heart touching. nice I am a great fan of your narration.

Regards
pardhu