21, ఏప్రిల్ 2010, బుధవారం

నేనూ ప్లైట్ ఎక్కేసానోచ్చి,,,


ఏదో సామెత ఉందిలే ...కొందరిని చూస్తే మొట్ట బుద్ది వేస్తుంది అంట..అలా నా మొహం చూడగానే తిట్టబుద్ది వేస్తుందేమో ??.. ఈ విషయం నాకు ఎయిర్ పోర్ట్ లో ఆ రోజే తెలిసొచ్చింది..అమ్మా వాళ్లకు టాటా చెప్పి మళ్లీ వెనక్కు చూడకుండా మా ఆయన చెప్పిన వాళ్ళిద్దరి వెనుక బయలు దేరాను.. అప్పటి వరకు తాపీ ధర్మారావులా ఉన్నవాడు కాస్తా హడావుడిగా పరుగులు పెట్టడం మొదలు పెట్టాడు మావారి ఫ్రెండ్ ..

నాకేమో నా లగేజ్ తో చాలా కష్టం గా ఉంది.. మరి వంట్లో బాగోక పోవడం వల్ల వచ్చిన నీరసమో లేక నేను మహా బలవంతురాలిని అవ్వడం వల్లనో కాని నాకు పట్టపగలే అరుందతి నక్షత్రం తో సహా బోలెడు చుక్కలు కనిపించ సాగాయి ...దానికి తోడు కొత్త దేశం మోజుతో కళ్ళకు పెట్టుకునే కాటుక నుండి ,కాళ్ళ కు వేసుకున్న చెప్పులవరకు అన్ని క్రొత్తవే కొన్నానేమో ..నా చెప్పులు అలవాటులేక ఊరికే,ఊరికే జారిపోవడం మొదలు పెట్టేసరికి నా సామిరంగా పండగే పండగ ...

ముందు లగేజ్ వెయిట్ వేయించి ,చెకిన్ అయ్యి .. ఆ తరువాత అతని వెనుక క్యూలో నించున్నా..నాకసలు ఏమి తెలియదేమో అతను ఎక్కడ పాస్ పోర్ట్ ,వీసా ,టిక్కెట్స్ చూపుతున్నాడో అక్కడ నేనూ పరుగులు పెట్టి చూపుతున్నా.. ఈ లోపల ఒక ఆవిడ ప్రక్కకు పిలిచి మెటల్ డిటెక్టర్ తో చెక్ చేయడం మొదలు పెట్టింది.. ఒక ప్రక్క చెక్ చేస్తూ ..మేడం ఏదో మీ దయ ..పిల్లా పాపలున్నారు ఒక యాబై ఇవ్వండి అంది .. నాకేం అంటుందో అర్ధం కాక ఆమె వైపు అయోమయం గా చూసాను.. ఆమె మళ్లీ అదే మాట అనేసరికి ,ఎయిర్ పోర్ట్ లో ఇలా కూడా అడుగుతారా అని ఆక్చర్యం తో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే ..ఆ పరికరం నుండి ..కీ .. .కీ మని సౌండ్ వస్తుంది ..

ఒక్కసారిగా భయం వేసింది ..ఇదేంటి!! ఏమన్నా మారణాయుధాలు తీసుకు వెళితే డిటెక్టర్ వల్ల పట్టుపడిపోతారు అని మా ఆయన అన్నట్లు గుర్తు ..కొంపదీసి డబ్బులు ఇవ్వలేదని ఇలా భయ పెడుతుందా అనిపించింది .. ఆమె మళ్లీ ఇంకో పరికరం తీసింది... దానితో చెక్ చేస్తుంటే ..మళ్లీ కీ..కీ మంటుంది.. మేడం పిన్నులేమన్నా పెట్టారా అడిగింది ఆమె ... అప్పుడు గుర్తువచ్చింది నా మంగళ సూత్రానికి ఎప్పుడూ చీర కోసం సేప్టిపిన్నులు పెట్టి ఉంచుతా .. హమ్మయ్య అదా సంగతి ..ఊపిరి పీల్చుకున్నా..మేడం మిగిలిన వాళ్ళను చెక్ చెయ్యాలి తొందరగా ఇవ్వండి ..ఆమె కంగారుగా అంది.. నా దగ్గర యాబై లేవండి అన్నాను మెల్లిగా .. ఏంటి మేడం ..చిల్లర లేక పోతే వంద అన్నా ఇవ్వండి.. మీకు వంద అంటే ఎంత చెప్పండి ..ఆమె వదల లేదు.. ఉహు ఇరవయ్యే ఉంది అని తీసి చూపించా ..అప్పుడు ఆమె చూసిన చూపు ఇప్పటికి గుర్తు వచ్చినా విరక్తి వచ్చేస్తుంది ...

మొత్తానికి ఆ ఇరవై ఆమెకు చదివించుకుని బయట పడ్డాను.. ప్లైట్ లోపలికి వెళ్ళడానికి పిలుపు కోసం అందరం కూర్చుని వెయిట్ చేస్తున్నాం.. ఆ అమ్మాయికి మర్చిపోయిన ఏడుపు మళ్లీ గుర్తు వచ్చినట్లుఉంది .. మళ్లీ మొదలు పెట్టింది.. ఆ అబ్బాయి జాలిగా ఓదారుస్తున్నాడు.. అటే చూస్తే బాగోదని చూపు తిప్పుకున్నా ... అమ్మా ,నాన్న ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు ..ఇంకో నాలుగైదు గంటల్లో వేరే దేశం వెళ్ళిపోతున్నా లాంటి ఆలోచనలు మళ్లీ బెంగ పెట్టేస్తున్నాయి.. దేవుడా ,దేవుడా ప్లీజ్ ధైర్యం ఇవ్వవా అనుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చున్నా ..

ఏదో కలకలం వినబడితే గబుక్కున కళ్ళు తెరిచా..ఎదురుగా ఆ అబ్బాయి లేడు.. అందరూ హడావుడి గా క్యూలో నించుంటున్నారు.. అతని వెనుక అప్పటికే ఒక అయిదుగురు ఉన్నారు .. ఆ బేగ్ పట్టుకుని పడుతూ లేస్తూ వాళ్ళ వెనుక నించున్నా..అందరి టికెట్స్ ,వీసాలు మళ్లీ చెక్ చేస్తూ లోపలి పంపుతున్నాడు ఒక అతను..నేను కూడా చూపిస్తుంటే' సెక్యూరిటి చెకింగ్ కా టేగ్ కహా హై 'అన్నాడు ..ఒక్క ముక్క అర్ధం కాలేదు.. అంటే ??అన్నాను అయోమయం గా ..నన్ను పక్కకు ఉండమని చెప్పి మిగిలిన వాళ్ళను చెక్ చేస్తూ సెక్యూరిటి చెకింగ్ చేయిన్చుకురండి అన్నాడు హిందీ లో .. ఏంటి సార్ అన్నాను భయం గా.. మా ఆయన ఫ్రెండ్ వెళ్ళిపోయాడు లోపలికి ..

ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో ఏం అర్ధం కావడం లేదు ..అతను సమాధానం ఇవ్వడం లేదు.. ఇచ్చినా అర్ధం కావడం లేదు.. ఏడుపొచ్చేస్తుంది ... అసలు పంపుతారా నన్ను లోపలికి ??...అమ్మా ,నాన్న ఉన్నారా బయట ??? వెళ్ళిపోయి ఉంటారు .. కనీసం ఫోన్ చేద్దామన్న పైసాలేదు ..ఏం చెయ్యాలి ??? దానికి తోడు ఈ బేగ్ ఒకటి ఎటు పరిగెట్టుకుని వెళ్ళడానికి వీలులేకుండా.. అందరూ వెళ్ళిపోతున్నారు .. సార్ ఏంటి సార్ మళ్లీ అడిగాను కళ్ళ లో నీళ్ళు తిరుగుతుంటే ..'ఉస్ సే పూచో 'అని అటు వెళుతున్న ఒక ఆమెను చూపించాడు .. ఆమె హడావుడిగా అటు ఇటు తిరుగుతుంది.. ఆవిడ దగ్గరకు పరుగులు తీసా.. ..మేడం సెక్యూరిటి చెకింగ్ అంటున్నారు..టేగ్ అంటున్నారు .. ఎక్కడ మేడం అన్నాను ... ఏంటీ!!!! సెక్యూరిటి చెక్ చేయించకుండా ఎలా వచ్చ్చావ్ ఇక్కడికి అంది విచిత్రం గా చూస్తూ ...నాకసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు ..ఎక్కడో ఏదో మిస్ అయ్యింది ...మా ఆయన ఫ్రెండ్ మీదా బాగా కోపం వచ్చింది ..అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ??

ఫస్ట్ టైం మేడం నాకు ఏమి తెలియదు అన్నాను భయం గా ...అలాంటప్పుడు అన్నీ తెలుసుకుని రావాలి.. ఫ్లైట్ టైం అయిపోతుంది పద పద అంది.. ఆమె వెనుక పరుగు పెట్టాను ..బేగ్ బాగా బరువు ఉండటం వల్ల ఆమెను అందుకోలేక పోతున్నా ...తమ్ముడు ,అమ్మ మాటలు గుర్తొచ్చి బాగా తిట్టుకున్నా..ఏంటి??మళ్లీ ఏమైంది అంది ఆమె విసుగ్గా..బేగ్ వైపు చూసాను ... ఆమె బేగ్ ని మరొక వైపు పట్టుకుని .. ఏంటమ్మా ఏం మోసుకోచ్చేస్తున్నావ్.. అసలు నిన్ను ఎలా పంపారు ఇంత బరువుతో లోపలికి .. 7 కేజిలకంటే ఎక్కువ తీసుకురాకూడదు తెలుసా అంది ... ఉహు అన్నాను .. బాగా తెలివి మీరిపోయారు.. చిన్న బేగ్ అంటే ఎవరికీ అనుమానం రాదనీ ఇలాంటి తెలివి తేటలు ఉపయోగిస్తారు అంటూ తిడుతూనే ఉంది .. ఉక్రోషం,కోపం తో చెంప తడిచిపోతుంది కాని ఏమి చేయలేను..

అందరూ వెళ్లిపోయారని కాబోలు చెక్ చేసేవాళ్లిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు ...ఆవిడ వాళ్ళతో ఏదో చెప్పి వెళ్ళిపోయింది .. వాడికేదో డవుట్ వచ్చినట్లుంది ..ఏంటమ్మా ,ఏది ఆ బేగ్ ఓపెన్ చేయి అన్నాడు అందులో ఒకతను ... అవును ,కీ ఎక్కడుంది ??? నా హేండ్ బేగ్ వెతకడం మొదలు పెట్టా ..కంగారు వల్ల కనిపించడం లేదు ...వాళ్ళేమో చిరాకు పడుతున్నారు ..చివరికి దొరికాక బేగ్ ఓపెన్ చేసి చూసారు ...హుమ్ కారం,పసుపు, పచ్చళ్ళు ఈ ఆడోళ్ళు మారరు ..అంతరిక్షానికి పంపినా అప్పడాల పేకెట్ మోసుకు వెళతారు .. కానియ్ అని ప్రక్కనున్న వాడితో జోకాడు వాడు.. నాకు వళ్ళుమండి పోతుంది కాని బలవంతం గా నవ్వాను .. అక్కడి నుండి బయట పడి వస్తుంటే నా పేరు ఎనౌన్స్ చేస్తున్నారు ..భయం తో ఒకటే కంగారు ,ఏడుపు ...అందరూ నా వైపు చూస్తున్నా సరే ఒక చేత్తో కన్నీళ్ళు తుడుచుకుంటూ మరొక చేత్తో బేగ్ మోసుకుంటూ పరుగులు పెట్టా ... నన్ను చూడగానే ఎయిర్ హోస్టెస్ కమ్,కమ్ అంది హడావుడిగా .. హమ్మయ్యా ప్లైట్ లో కొచ్చేసాను..మరికొన్ని విశేషాలు తరువాత పోస్ట్ లో ..

35 కామెంట్‌లు:

కన్నగాడు చెప్పారు...

చిన్న పోస్టే కానీ నా మొదటిసారి విమాన ప్రయాణ అనుభవాలు గుర్తొచ్చాయి.

Sai Praveen చెప్పారు...

మొదలు పెట్టానో లేదో టపా అప్పుడే పూర్తయిపోయింది :)
నెక్స్ట్ ది ఎప్పుడు ??????

Raj చెప్పారు...

నేస్తం గారూ,
ఎప్పటిలానే మీ పోస్ట్ చాలా బాగుంది...అయితే ఇంత చిన్న పోస్ట్తో బాగ నిరాశ పరిచారు...మీ ప్రయాణ అనుభవాల తర్వాత టపా కోసం నిరీక్షిస్తూ...

మంచు చెప్పారు...

అయ్యో ఇన్ని కస్టాలా .. వుహు హు హు ..వ్హూ హు హు...

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

mmmmmmm........

జయ చెప్పారు...

నాకు మాత్రం మీ వారి ఫ్రెండ్ మీద చాలా కోపం వొచ్చేస్తోందండి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నాక్కూడా మీ వారి ఫ్రెండ్ మీద బాగా కోపం వచ్చింది...అయినా మీరు మీ వారి ఫ్రెండ్ని తర్వాత మీ ఇంటికి పిలిచి, కాఫీలో కారం కలిపి కక్ష తీర్చుకుని ఉండి ఉంటారు...కదా! :-)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

పాపం ఎన్ని కష్టాలో మా నేస్తానికి.. అయినా డబ్బులు అఖ్ఖర్లేదు లాంటి సలహాలు ఇవ్వడం కాకుండా ఇలా ఒంటరిగా ఒదిలేయడమా మీ వారి ఫ్రెండ్ భలేటోరే... కానీ తనని అంటానికి కూడా లేదు లెండి మరి వాళ్ళావిడ కొళాయి విప్పింది అంటున్నారు కదా ఆ హడావిడి లో ఉండుంటారు పాపం.

నేస్తం చెప్పారు...

కన్న గారు మీకూ ఇలానే అయ్యిందా ఏమిటండి :)
ప్రవీణ్ రాజ్ ఇంతకూ నేను పూర్తిగా వ్రాయకుండా సేవ్ చేయ బోయి పోస్ట్ చేసేసా..తరువాత ఎక్కువగా లేదులేండి త్వరలో రాసేస్తా ..
మంచుపల్లకి :(
చక్రవర్తి గారు hmmm
జయ నాక్కూడా మరి అలాగే అనిపిస్తుంది గుర్తువచ్చినపుడు
శేఖర్ మా ఆయన అవకాశం నాకు ఇప్పిస్తారా.. నా చేతే భోజనం పెట్టించారు ఇంటికి పిలిచి
వేనూ అది కూడా నిజమె అందుకే క్షమించేసా మరి :)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
అయ్యో, ఎంత టెన్షన్ పడి ఉంటారో కదా.చదువుతుంటే, నాకూ గాభరాగా అనిపించింది. ఆ ఫ్రెండ్ గారు, వాళ్ళ ఆవిడకి పక్కన ఓదార్చటానికి ఉన్నారు, మీరు చిన్న వయసులో ఒక్కరే వస్తున్నారు గా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి ఒక్క నిమిషం అనిపించలేదా ఆయనకి ? కొందరంతే, వాళ్ళ గోల తప్ప పక్క వాళ్ళని కొంచెం కూడా care చేయరు.

మీదెంత గొప్ప మనసు నేస్తం, క్షమించేయతమే కాకుండా, భోజనం పెట్టారా ? :-O
- పద్మ.

Srujana Ramanujan చెప్పారు...

బాగా రాస్తున్నారు అనేది ఎప్పుడూ చెప్పే మాటే కదా... ఇంకేమి చెప్పాలి? నేను ఇంత కన్ఫ్యూజ్ కానమ్దుకు అసూయ పదుతున్నాను :D

priya చెప్పారు...

mmmmm...mottaniki flight ekkaru...

హరే కృష్ణ చెప్పారు...

ఊపిరి తీసుకోనివ్వరు కదా టెన్షన్ భలే పెట్టేసారు చివరి వరకు
bavumdi

అజ్ఞాత చెప్పారు...

ayyo chala badha vesindi nestam..

కత పవన్ చెప్పారు...

సినిమా కష్టాలు చుసాం ఇవి ప్లైటు కష్టాలా?పాపం:(((

కౌటిల్య చెప్పారు...

హ్మ్..నేస్తం...చాలా రాయాలనుంది..కానీ చాలా బిజీ..మీ తర్వాత టపాలన్నీ చదుతూనే ఉంటా...కామెంట్ పెట్టకపోయినా ఏమీ అనుకోవద్దండీ...మొన్న రాసిన పరీక్షల్లో సీట్ రాలేదు....ఇంట్లో బాగా సీరియస్..నన్ను లాప్ టాప్ ముందు కూర్చోనివ్వట్లా...ఏదో దొంగతనంగా చూడాల్సొస్తోంది...మరి ఉంటాను..మీరు ఇలానే రాస్తూ,అందర్నీ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ....
మీ,
కౌటిల్య...

నేస్తం చెప్పారు...

hmm పద్మ ..నిజమే ..ఎంతో నమ్మకం గా నా భాద్యత అతనికి అప్ప చెప్పినపుడు కొంత కేర్ తీసుకోవాలి.. కాకపోతె టైం అయిపోవడం,ఆ అమ్మాయి ఏడుపు .. పైగా వాళ్ళూ చాలా లగేజ్ తెచ్చారు .. అతనూ మూడు బేగ్ లు మోస్తున్నాడు.వీటన్నిటి కంటే అతను మావారికి పెద్దగా పరిచయం లేదు.. ఈ టెన్షన్ లో అతను నన్ను పట్టించుకోలేదన్నమాట
చూసావా ఎంత మిస్ అయిపోయావో సృజన ..నెను అయితె ఎంచక్క బోలెడు టెన్షన్ పడ్డాను :)
ప్రియ ..ఆ ఎక్కేసాను :)
హ హ స్వప్న నాలో చెంజ్ వస్తుందని ఆశిస్తున్నావా :) స్వప్నా నాకున్న కొద్ది పాటి టైం ఇలా బ్లాగ్ కే పరిమితం చేస్తాను.. మైల్స్ చూసుకునే ఇంట్రెస్ట్,టైం రెడూ నాకు ఉండవు.. అమ్మో ఈ అమ్మాయికి రిప్లయ్ ఇవ్వలేమో ! ..అయ్యో తను చాట్ లో వెయిట్ చేస్తుందే మో!.. ఈ టెన్షన్స్ నా వల్ల కాదు.. ఏదో నాకు నచ్చినపుడు మాత్రమే ఏ పని అన్నా చేస్తా :)

నేస్తం చెప్పారు...

హరే క్రిష్ణ :)
అజ్ఞాత అయ్యో ఎంత బాధ పెట్టెసాను మిమ్మల్ని..పోనీ నెక్స్ట్ టైం నవ్విస్తానులే బాగా ..
పవన్ ఇవి జీవితపు కష్టాలు :(
కౌటిల్యా అవునా !!:( అయ్యో!! భలెవారే కామెంట్స్ ..పోస్ట్ లు గురించి సీరియస్సుగా తీసుకోకండి.. ఈ సారి మంచి వార్త తో వస్తారని ఆశిస్తున్నా ..

Rajendra Prasad(రాజు) చెప్పారు...

నేస్తం,,,నాకు చాలా బాధగా,ఖంగారుగా అనిపించిందండి.మీ వారి ఫ్రెండ్ మీద అందరు కోపడ్డారు ఇంక ప్రత్యెకంగా నేను పడాల్సింది ఏమి లేదు.ఎంచక్కా ఒక సినిమా లో సీన్ లాగా చుసెసాను.ఏదైతే ఎముంది,మీ కచేరి సూపర్...

గీతాచార్య చెప్పారు...

మీ విమాన ప్రయాణ కష్టాలిలా ఉంటే నా కష్టాలు మరోలా ఉన్నాయండీ నేస్తం గారూ. :D

చదువుతుంటే మిక్సెడ్ ఇమోషన్స్. ఒక ప్రక్క మీ శైలికి నవ్వూ, మరో ప్రక్క అయ్యో నిజమే కదా. అంత టెన్షన్ పడటం సహజమే. ఆ పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది పడి ఉంటారో అనే ఫీలింగ్.

http://gitasrujana.blogspot.com/2009/05/blog-post_28.html

ఇవి నా కష్టాలండీ.

http://booksandgalfriends.blogspot.com/2009/05/blog-post_28.html

ఇది ప్రయాణం ముగిశాక

గీతాచార్య చెప్పారు...

టెంప్లేటు బాగుంది. కళ్ళకు భలే హాయిగా

రాజ్ కుమార్ చెప్పారు...

ayyo..papam...enta tension paddaro kada.. :( :(

sarlendi mottaniki flight ekkesaru kada....

waiting for next one...

Rajkumar

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

హాయ్ నేస్తం..
చాలా రోజుల తర్వాత నీ బ్లాగులో కామెంట్ చేస్తున్నాను..
ఎప్పట్లాగే మీ పోస్ట్‌తో చిన్న డాక్యుమెంటరీ చూపించేశారు.
మీ స్టోరీల మీద హక్కులు నాకు ఇచ్చెయ్యండి. మాంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా తీసేస్తాం. ప్రతి సీన్ బాగుంటుంది!!

నేస్తం చెప్పారు...

ప్రసాద్ :)పోనిలేద్దురు ఆ అబ్బాయి నా చేత చక్కని కచేరి ఇప్పించేసాడు ...మనం ఆ కోణం లో సంతోష పడిపోదాం..
గీతాచార్య గారు నిన్న మీ పోస్ట్ లు చదువుతుండగా మా వారు వచ్చేసారు..అందుకే కామెంటలేదు .. భలే రాసారండి ..మీ పోస్ట్ లోనే ఆ విషయం రాస్తాను లెండీ .. ఇంక టెంప్లెట్ నచ్చిందా ..హమ్మయ్యా :) ..ఒకానొక దశలో పాత టెంప్లెట్ ఎందుకు మార్చానురా భగవంతుడా అని బాధ పడిపోయా ..
రాజ్ కుమార్ :) ఆ.. మొత్తనికి ఫ్లైట్ ఎక్కేసా..
నరేష్ ఏమైపోయారు ఇన్నాళ్ళు ..సినిమాయే గా.. ఓ బ్రహ్మాండం గా తీసుకోండి..హీరో మా ఆయన.. హీరోయిన్ మాత్రం నేను.. ఈ విషయం లో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను మరి..

Unknown చెప్పారు...

modati episode ki ..deeniki kalipi commentuthunnaa....


maa nestham ni edipistara..??valla pani chepdamm..
inko sari vellinappudu aa security ammai kanipiste 200 ichi meeru reverse lo oka look veyandi :)

next dani kosam waiting..appudu katha sukantham aindi ani rayandi.. :)

నేస్తం చెప్పారు...

కిరణ్ త్వరలో రాసేస్తాను :)
క్షమించండి కొన్ని కామెంట్స్ డిలీట్ చేసేసాను ..అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను..:)

Ram Krish Reddy Kotla చెప్పారు...

ఏదేమైనా మీ వారి స్నేహితుడు మిమ్మల్ని అలా పట్టించుకోకుండా తనపాటికి తను వెళ్లిపోవడాన్ని నేను తీవరంగా ఖండిస్తున్నాను....అయ్యో పాపం లోకం ఎరుగని పిల్లా వేరే దేశానికీ పయనం అయ్యిందే, కొంచెం ఆ అమ్మాయిని కూడా కనిపెట్టుకొని ఉందాం అనే ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే అతనికి...అదే నేనైతేనా...ఎంత జాగ్రతగా చూసుకొనే వాడినో....మీ పడ్డ టెన్షన్ కన్నా టపా చదువుతూ నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను...ఆ మిగిలిన కొంచెం కూడా రాసెయ్యండి మరి...

సవ్వడి చెప్పారు...

e template super

సవ్వడి చెప్పారు...

paapam nestam... entha kasshtapaddaaro.

3g చెప్పారు...

ఇదెలాజరిగిందండీ......................... మీరెప్పుడో పోస్ట్ రాసేస్తే నేనిప్పుడే చూసానేంటి. ఏదేమైనా మీవన్నీ చాలా ఖష్టమైన కష్టాలండి.

నేస్తం చెప్పారు...

హహ కిషన్ భలే చెప్తారండీ.. మీకు పెళ్ళి అయిన మరుసటి రోజు హడావుడిగా బయలుదేరే సమయం లో ఎవరి భాద్యత అయినా తీసుకోవలసి వస్తే.. అదే సమయం లో మీ భార్య కన్నీళ్ళు పెట్టుకుని బేలగా అమ్మా,నాన్నా అని ఏడుస్తుంటుంటే ఆ హడావుడిలో ఏం చేయగలగుతారు చెప్పండీ.. :) అతను కేర్ తీసుకోవాలి ...అదే సమయం లో మనమూ అర్ధం చేసుకోవాలి :)
సవ్వడి గారు ఇంతకు ముందు పోస్ట్ లో కూడా ఇదే టెంప్లెట్ కదా ..మరి అప్పుడు పొగడలేదేమి :)
3g మరే ఇలాంటి పనిలేని ఖష్ట్టాలన్నీ నాకే వస్తాయి :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

Nenu aa paristhithulalo unna sare...ala nirlakshyam ga matuku assalu undadu..nannu nammukoni okarini venta pampinapudu, anduku tagga badhyatha vahinchavalasinde edamaina...thats it.

సవ్వడి చెప్పారు...

intaku mundu observe ceyyaledu.. mee tapaalu cadiveddaamani tappite inkokati gurtu undadu

నేస్తం చెప్పారు...

అవునా కిషన్ ..:) ..ఎదో మిమ్మల్ని అన్నాను కాని నేను అంతే.. నాకంటే ముందు ప్రక్కవాళ్ళ గురించి తెగ టెన్షన్ పడిపోతుంటా..
సవ్వడి :D

mahender చెప్పారు...

ఈ లైన్ బాగుందండి

" ఈ ఆడోళ్ళు మారరు ..అంతరిక్షానికి పంపినా అప్పడాల పేకెట్ మోసుకు వెళతారు ."