10, మార్చి 2010, బుధవారం

పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లు
నేనెప్పుడన్నా పొరపాటున ఫలానా విషయం తెలియదు అనుకున్నాను అనుకోండీ ..వెంటనే ఆ విషయం మీద ప్రాక్టికల్స్ తో సహా నా జీవితం లో జరిగిపోయి రిజల్ట్ చేతికొచ్చేస్తుంది...పైన చెప్పిన సామెత విషయంకూడా అలా అనుకున్నదే ..పలితం ఇలా పోస్ట్ రూపం లో మీ ముందు ఉండటం.. సరే విషయంలో కి వచ్చేద్దాం..

ఓసారి కూడలి లో బ్లాగులను చూస్తూ ,మా ఆయన గారు కొన్న జామకాయ ముక్కల పేకెట్ ని ముందు పెట్టుకుని తినడం మొదలు పెట్టాను.. షాప్ వాడు ముక్కలతో పాటు బ్రౌన్ కలర్ లో ఉన్న ఒక పొడిని కూడాఇచ్చాడు ..అది ముంచుకుని నోట్లో పెట్టుకుంటుంటే ఉప్ప,ఉప్ప గా చప్ప,చప్పగా ఏదోలా ఉంది. వీళ్ళ టేస్ట్ తగలబడ,ఏమిటి ఇలా ఉంది అని తిట్టుకుంటూ తింటున్నా ..అంత బాధ పడి తినేబదులు ఆ పొడిని ప్రక్కన పడేసి తినచ్చుగా లాంటి ప్రశ్నలు అడక్కండి నాక్కోపం వస్తుంది. సరే అలా తిట్టుకుంటూ తింటూ లాస్ట్ ముక్క నోట్లో పెట్టుకునేసరికి ఒక్కసారిగా విపరీతమైన బాధ ..దంతాల దగ్గర నరాలన్నీ లాగేస్తూ ..'దేవుడా' అంటూ చెంపలపై చేతులు పెట్టుకుని ఒక అర్ధ గంట అలాగే కూర్చుండి పోయాను .. అది మొదలు ఆ రోజునుండి తీపి తిన్నా, జామ, యాపిల్ లాంటి పళ్ళు తిన్నా నెప్పి మొదలై పోయింది.అదేంటో అప్పటి వరకు పెద్దగా ఇష్టపడని తీపి మీద ఒకటే మనసులాగేసేది..ఏ పార్టీలోనో ,పంక్షన్ లోనో గులాబ్ జాంనో, రసగుల్లానో తినడం..ఇంటికొచ్చి అరగంట గోలు గొలున ఏడవడం నాకు మామూలైపోయింది ..

ఎప్పుడన్నా .. ఏమండీ! నా జ్ఞానదంతాలు నెప్పి అనగానే ..అందుకేనే జ్ఞానం లేని వాళ్లకు జ్ఞానదంతాలు వస్తే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ యే వస్తాయి ..అలా ప్రకృతి విరుద్దం గా ఏది జరగ కూడదు అని తీసి పడేసేవారు మావారు ..అప్పటి నుండిమార్కెట్ లో ఉన్న సెన్సిటివ్ టూత్ పేస్ట్ లన్ని వాడి పడేసాను ..ఫలితం శూన్యం.. ఇలాకాదని ఇంటర్నెట్ ముందేసుకుని గూగుల్ లో ఫలానా ఫలానా సమస్యకు హోమ్ రెమిడి ఉందా అనగానే ప్రేమగా ఆయుర్వేదం లో 60 రకాలా పరిష్కారాలు చూపించింది.. ఏది చూసినా ఉత్తరేణి ఆకు, గుంటగలగర ఆకు అని తెలియని పదార్ధాలన్నీ ఉన్నాయి కాని సింపుల్ గా ఉన్నవస్తువులు లేవు..సరే దొరకని వాటిని ప్రక్కన పడేసి తెలిసిన లవంగం,కర్పూరం,దాల్చిన చెక్క,సొంఠి వంటి వాటిని పొడి చేసి మరి వాడాను ..ఉహు ..అస్సలేమాత్రం తగ్గలేదు..


నాకు తెలుసు ,నాకు తెలుసు ఇప్పుడు మీ మనసులో ఏమనుకుంటున్నారో...అంత కష్టపడేపదులు ఎంచక్కా డాక్టర్ దగ్గరకు వెళ్ళచ్చుకదా అని కదా ..హమ్మా ..నన్ను అనేద్దామనే !!! ఇలాంటి ప్రశ్నలకు నా దగ్గర ప్లాష్ బ్యాక్ ల రూపంలో సమాధానాలు ఉంటాయి.. కాచుకోండి మరి..చాలా రోజుల క్రితం ఒక రోజు బ్రష్ చేసుకుంటుంటే చిగుళ్ళ నుండి నెప్పి,బ్లడ్ రావడం గమనించాను ..వెంటనే మా ఆయనకు చెప్పేద్దాం అనుకున్నా గాని నువ్వు సరిగ్గా బ్రష్ చేసుకుని ఏడ్చి ఉండవు అంటారు అని, నా కోల్గేట్ పేస్ట్ పై ఎక్సట్రా ఉప్పు జల్లి మరీ తోమాను .. సమస్య తగ్గలేదు కదా ఇంకొంచం ఎక్కువ అయ్యింది ..ఇలా లాభం లేదని ఒక రోజు రాత్రంతా మా ఆయన్ని కూర్చోపెట్టి ఈ వారం రోజులు" నేను పడిన కష్టాలు- వాటి పలితాలు "అనే శీర్షికన మొత్తం స్టోరి అంతా హృదయవికారం గా వర్ణించే సరికి తట్టుకోలేక ఆ మరుసటి రోజే డెంటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళారు ..

వెళ్ళిన తరువాత డాక్టర్ విషయమంతా విని,ఆహ్లాదకరమైన చిరునవ్వు ఒకటి నవ్వి నర్స్ వైపు చూసాడు.. ఆ అమ్మాయి నా భుజం చుట్టూ చేతులు వేసి ,అత్తగారిని చూసి కొత్తకోడలు ఇచ్చే మర్యాదలా ఎంతో ఇదిగా లోపలికి తీసుకు వెళ్ళింది..అదేంటో చిన్నప్పటి నుండి నన్ను ఎవరైనా ఆప్యాయంగా చూస్తే చాలు, ఆస్తి లో సగభాగం రాసిచ్చేయాలన్నంత ఆవేశం వచ్చేస్తుంది నాకు. రూం చూద్దును కదా ఇంద్ర భవనంలా ఎంత బాగుందో .. పైగా ఆ ఎక్విప్మెంట్ అదీ..అబ్బో ..ఏదేమైనా విదేశాలు ,విదేశాలే అనుకున్నా గాని ఒక ప్రక్క భయం గా ఉంది ఆ పరికరాలు అవి చూస్తుంటే.. .ఏదో టేబ్లేట్స్ ఇస్తారనుకుంటే ఆపరేషన్ చేస్తున్నట్లు ఇక్కడకు తీసుకు వచ్చా రేంటి ? అని బోలెడు అనుమానాలు ..నోరు తెరవమని డాక్టరు గారు అనేసరికి భయంతో అంత ఎ.సిలోను చమటలు పట్టేసాయి ...ఆ తరువాత గుయ్..య్...య్ మని శబ్దం చేస్తూన్న పదునైన పరికరం తో పళ్ళను క్లీన్ చేయడం అంతా తెలుస్తూనే ఉంది..విచిత్రం నెప్పే లేదు ..పైగా అయిస్ ముక్క పెట్టినట్లు నోరుచల్లగా ఉంది.. క్లీనింగ్ అయిపోగానే బయటకు వస్తుంటే మా ఆయన బిల్ పే చేస్తూ కనబడ్డారు ..

బయటకు రాగానే ఏమండీ అసలు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో తెలుసా,లోపల బెడ్ ఉంటుందా దానికి స్విచ్ నొక్కగానే అదే పైకి ,క్రిందకు ఎడ్జస్ట్ అయిపోతుంది ..ఇంకా పదునుగా ,సూది లాంటి దానితో మన పంటిని క్లీన్ చేస్తున్నా నెప్పేరాలేదు ..పైగా నోట్లో నీరు బయటకు వెళ్ళడానికి మరొక పైపు తెలుసా ...నేను ఉత్సాహం ఆపుకోలేక జరిగింది చెప్తుంటే మా ఆయన అటు ఇటు చూస్తూ మెల్లిగా , పస్ట్ టైం డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళడం ఇదేనా బుజ్జి ?అన్నారు..అవును ఏం? అన్నాను ...గట్టిగా మాట్లాడకే బాబు విన్నవాళ్ళు నిన్ను చూసి కాదు ,నన్ను చూసి నవ్వుతారు అన్నారు ... ఛీ .. మీతో అస్సలు ఏం చెప్పకూడదు అని తిట్టుకుని అయ్యో టేబ్లేట్స్ ఇవ్వలేదండి డాక్టర్ అన్నాను కంగారుగా.. ఎందుకూ ..క్లీనింగ్ చేసాడుగా ఇంక అవసరం లేదు అన్నారు. ఇంత సులువుగా ప్రాబ్లం పోయిందా ???..ఇట్స్
గాన్ ,గాయబ్,పోయి పోచ్చే అని తెగ ఆనంద పడిపోయాను.. ..

మరుసటి రోజు బ్రష్ చేసుకుంటూ ..న...హీ..!!!యే నహీ హోసక్తా!!! అనే అరుపుకి మా అపార్ట్మెంట్ దద్దరిల్లిపోయింది ..మా ఆయనకు విషయం అర్ధం అయిపోయి అటునుండి అటే ఆఫీస్ కి పారిపోయారు .. ఆ తరువాత వారం రోజులు అయినా సమస్య ఏ మాత్రం తగ్గలేదు సరి కదా పెరిగింది ..ఈ సారి మరో డాక్టర్ దగ్గరకు వెళ్ళాము ..మళ్లీ సీన్ రిపీటెడ్..డాక్టర్ చిరు మందహాసం ,నర్స్ మృదు స్వభావం ... కట్ చేస్తే 200 $ బిల్ కడుతూ మా ఆయన ... ఆ తరువాత విషయం తెలుసుకున్న మావారి ఫ్రెండ్ ..భలే వాడివే ఇక్కడి డెంటిస్ట్ దగ్గరకు తీసుకు వెళ్ళావా ..వీళ్ళకు మన ఇండియన్ డాక్టర్స్ కంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ..పిడుక్కి ,బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లు ( ఈ సామెతకర్ధం అడక్కండి ..నాకు తెలుసుకోవాలని ఏ మాత్రం ఇంటరెస్ట్ లేదు ..ఇపుడే చెబుతున్నా) ఏం చెప్పినా క్లీనింగ్ అంటారు..మీరింకా నయం 400 $ తో బయట పడ్డారు..మా ఫ్రెండ్ అయితే పన్ను నెప్పి వస్తే పన్ను పీకి చేతిలో 9000 $ బిల్ చేతిలో పెట్టారు..అని ఓదార్చాడు..

ఆ తరువాత ఈ సమస్య గురించి నాన్నకు చెప్పితే ..ఈ మద్య కాలం లో బ్రష్ మార్చావా అమ్మా అన్నారు ..అవును నాన్న అన్నాను.. ఏ మాత్రం అది హార్డ్ గా ఉండి ఉంటుంది కొత్తది మార్చు అన్నారు.. అంతే సమస్య మటుమాయం ..ప్లాష్ బ్యాక్ అయిపొయింది ...మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇక్కడి డాక్టర్ల దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదో నేను .. ఇంక చేసేది లేక ఇండియా ట్రిప్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసాను .. కాని అప్పటికి నేను ఇంకా పెనం మీదనే ఉన్నాను అన్న విషయం తెలుసుకోలేకపోయాను ..ఆ విషయాలు తరువాతి పోస్ట్లో ..

54 కామెంట్‌లు:

శ్రీనివాస్ చెప్పారు...

అబ్బ ఏం రాశారో , బ్రహ్మాండంగా రాశారు, మీకు మీరే సాటి, మా ఫ్రెండ్స్ కి చూపించాను , మీ టపాలన్నీ చదివాను, నవ్వుకోలేక చచ్చాను . మె తర్వాతి తపాకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాను

మంచు చెప్పారు...

"చిన్నప్పటి నుండి నన్ను ఎవరైనా ఆప్యాయంగా చూస్తే చాలు ఆస్తి లో సగభాగం రాసిచ్చేయాలన్నంత ఆవేశం వచ్చేస్తుంది నాకు"
ఇన్నాళ్ళు చెప్పలేదేంటండి :-))

నేస్తం చెప్పారు...

హూం,శ్రీనివాస్ దీన్నే కక్ష్య తీర్చుకోవడం అంటారు .. సరే కానివ్వు :)
మంచు పల్లకి గారు ఎందుకబ్బా ఈ పోస్ట్ కూడలి లో రావడం లేదు ..కొంప దీసి బహిష్కరించేసారంటారా ..నాకు శ్రినివాస్ మీద గొప్ప డవుటుంది :)

శ్రీనివాస్ చెప్పారు...

నేను ఏం మాట్లాడినా తప్పేనా ? సరే కానివ్వండి .. మీ టపా కూడలి లోకి రాకపోవడానికి కారణం ... కూడలి ఒక సారి అప్ డేట్ అయిన వెంటనే మీ తప వేసి ఉంటారు ... కాసేపు ఆగితే మళ్లా అప్డేట్ అయినప్పుడు వస్తుంది. అయినా దీనికి కూడా నన్నే బాధ్యుడిని చేస్తే ఎలా

నాగప్రసాద్ చెప్పారు...

హ హ హ మీకు నొప్పి తెలీకుండా పళ్ళను క్లీన్ చేసినప్పుడే తెలుస్తుంది ఆ డాక్టరు గారి పనితనమెంతో. పైగా పంటినొప్పికని వెళితే పళ్ళను క్లీన్ చేసి పంపిస్తాడా హ హ హ. :))).

బ్రష్ మార్చంగానే సమస్య మటుమాయం అయిపోయిందా? హ హ హ. అయితే ఆ బ్రష్షుల కంపెనీ వాడు మీ పేరు చెప్పి ప్రచారం చేసుకోవచ్చు ఎంచక్కా. :))).

మనదేశంలో చిన్న చిన్న డాక్టర్లు ఎంతో బెటరు. బెటరు ఏమిటి బెస్ట్ అని నేనంటాను. పంటి నొప్పికని వెడితే వెంటనే చెప్పేస్తాడు, ఆ పంటికి ఫిల్లింగ్ చేయాలా లేక రూట్ కెనాల్ ఆపరేషన్ చేయాలా అని. ఫిల్లింగ్ 200-400 రూపాయలతో అయిపోతుంది. రూట్‌ కెనాల్ ఆపరేషన్‌కు 1200-2000 రూపాయలతో అయిపోతుంది. :))).


అన్నట్టు అక్కడి డాక్టర్ల మాటలు నమ్మి పన్ను పీకించుకోమాకండి. తొందరపడి పీకించారనుకోండి, అప్పుడు మిగతా పళ్ళు నిరాహార దీక్ష చేస్తాయి మమ్మల్నెప్పుడు పీకిస్తావ్ అని. :)))).

నేస్తం చెప్పారు...

శ్రినివాస్ కరెక్టే అందుకే డిలీట్ చేసేసా,నాకొద్దమ్మా ఈ తలనెప్పులు :D
@ నాగ ప్రసాద్ మరి నెప్పిలేక పోతే టెక్నాలజీ గొప్పతనం అనుకున్నా :)

Unknown చెప్పారు...

excellent :-))

అజ్ఞాత చెప్పారు...

baagundi.

Sankar

నిషిగంధ చెప్పారు...

మీ టపాలలో కనిపించే నవ్వుల జల్లులతో పాటు ఒకలాంటి ఇన్నోసెన్స్ నాకెంతో నచ్చుతుంది..

"మళ్లీ సీన్ రిపీటెడ్..డాక్టర్ చిరు మందహాసం ,నర్స్ మృదు స్వభావం ... కట్ చేస్తే 200 $ బిల్ కడుతూ మా ఆయన ..."

:)))
నా మొదటి డెంటిస్ట్ అనుభవం గుర్తుకు తెచ్చారు.. :-)

మంచు చెప్పారు...

మీకు శ్రీనివాస్ మీద డవుటుందా... నాకు చాలా విషయాల్లొ శ్రీనివాస్, నాగ ల మీద డవుటుంది :-))
మీరు "ఆస్తి లో సగభాగం" ... ఇదే కాన్సెప్ట్ మీద వుండండి.. అవసరమయితే కూడలి , హారం అగ్రిగేటర్ల్లు కొనేసొ , హేక్ చెసొ మీరు పొస్ట్ వేసిన రోజు, ఆ రూజంతా మీ పొస్ట్ ఒక్కటే పైన వుండేలా మార్చేద్దాం.. కాన్సెప్ట్ మాత్రం మర్చి పొవద్దు. :-))

sunita చెప్పారు...

hahaha!baagundi.

Sravya V చెప్పారు...

అయ్యో నేస్తం గారు ఈ ఊళ్ళో డెంటిస్ట్ దగ్గర కెళ్ళరా పాపం :( లాస్ట్ ఇయర్ నాఫ్రెండ్ (సింగపూరియన్) ఇలాగే ప్రాబ్లం ఉంటే నేను ఇండియా కి వెల్లినప్పడు తను నాతో వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది ఫుల్ గా హాపీ, ఇప్పుడెవరన్న పన్ను ప్రొబ్లెం అనగానే ఈసారి శ్రావ్య తో హైదరాబాద్ వెళ్ళండి అని చెబుతుంది !

నాగప్రసాద్ చెప్పారు...

మంచుపల్లకీగారు, ఆస్తిలో సగ భాగం కొట్టెయ్యడానికి నన్నూ, శ్రీనివాస్‌నూ విలన్‌ను చెయ్యాలని చూస్తారా. హన్నా!.

మీరు అవేం పట్టించుకోకండి నేస్తం గారు. కూడలి కాకపోతే, కొత్త అగ్రిగేటర్‌ను తయారు చేస్తాం లేదా వీవెన్‌కు చెప్పి కూడలిని కొంటాం. అస్తిలో సగభాగం మాత్రం మర్చిపోకండి. ;) :))).

మంచు చెప్పారు...

నేస్తం గారు డెంటిస్ట్ లకే వందల డాలర్స్ ఖర్చుపెట్టిస్తుంటే ఇంక సగ బాగం లొ మనకేం వస్తుంది నాగా..
అయినా నాకున్న " గొదావరి జిల్లా రిజర్వెషన్ " తొ నేను మీకన్న ముందుంటాకదా :-))

శరత్ కాలమ్ చెప్పారు...

మొన్ననే నాకు (అనగా నా పన్నుకి) ఓ కిరీటం పెట్టి ఓ వెయ్యి డాలర్లు బిల్లూ పేట్టాడు మా డెంటిస్టు. ఏ రెండొందలో, మూడొందలో అవుతాయేమో అనుకున్న నాకు కళ్ళళ్ళొ నీళ్ళు వచ్చాయి. ఇక జన్మలో క్లీనింగు తప్ప మిగతావన్నీ ఇక్కడ చేయించుకోవద్దని డిసైడ్ చేసాం.

శ్రీలలిత చెప్పారు...

ఏంటండీ...
మీ టైటిల్ చూస్తే నాకేదో అనుమానంగానే ఉంది. ఇండియా వచ్చేక కోతి పుండు బ్రహ్మరాక్షసి అయినట్టు అయిందాయేం

Padmarpita చెప్పారు...

ప్రేమని సీరియల్ గా చెప్పారు, పంటినొప్పిని కూడా సీరియల్ గా చదవాలా?:)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ బాగుంది నేస్తంగారు :-) మరే నేను ఇలా అమెరికాలో ఓ డెంటిస్ట్ భారిన పడబోయి ఎందుకైనా మంచిదని రేటెంత బాబాయ్ అని అడిగితే సింపుల్ గా 3000 డాలర్లు అన్నాడు. నా బాబే అంత డబ్బిస్తే ఇండియా లో డెంటిస్ట్ లు ఇంటికొచ్చి ట్రీట్ చేయడం కాకుండా నెలరోజులు ఫ్రీ చెకప్ & మెయింటెనెన్స్ పేరుతో రోజూ ఇంటికొచ్చి మరీ పళ్ళుతోమెళ్తారు ఫో అని చెప్పి పారిపోయి వచ్చేశా.

గీతాచార్య చెప్పారు...

మీ టపాలు కూ డల్లో రావాల్సిన పనేముంది? ఎంతమంది పుస్తక గుర్తు పెట్టుకున్నారో కదా... :-)

Malakpet Rowdy చెప్పారు...

LOOOOOOOOOOOOOL

నేస్తం చెప్పారు...

మంచు పల్లకి గారు,నాగా గారు ఎంత మంచోళ్ళండీ మీ ఇద్దరూ ..కాకపోతే ఓ విషయం చెప్పడం మర్చి పోయాను ..నా సంగతి తెలిసి మా నాన్న గానీ,మా ఆయన గాని నా పేరు మీద ఏమీ కొనలేదు ..ఇక ఇప్పుడు చెప్పండి.. ఎవరెవరు కూడలి ,హారం అగ్రిగేటర్లు కొంటున్నారు,కొత్తవి పెడుతున్నారు :)
రాజ,శంకర్ థేంక్యూ థేంక్యూ :)
నిషి గంధ గారు మొదటి సారి డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళినపుడు మీకూ చాలా
విచిత్రంగా అనిపించిందా మరి :)

నేస్తం చెప్పారు...

సునీతా :)
శ్రావ్యా అమ్మో ..స్పెషలిష్ట్ లు అంటే చాలు ఇక్కడ అయిపోయామే.. మేగ్జిమం మామూలు డాక్టర్స్ దగ్గరకు వెళతాను.. తప్పని సరి అయితే కె.కె కి..
శరత్ గారు నిజమే ...ఆ..ఎంత అవుతుందిలే అనుకుని వందలు కట్టి కళ్ళంపట నీళ్ళు వచ్చిన సందర్భాలు చాలా సార్లు జరిగాయి నాకూ
శ్రీ లలిత గారు సరిగ్గా పోయింట్ పట్టేసారు
పద్మా నిజమే ఈ మద్య అసలు పెద్ద పోస్ట్లు వ్రాయలేకపోతున్నా :(

నేస్తం చెప్పారు...

వేణు 3000$ లే ..ఎలాగైనా మీరు షార్పూ ..ముందు గానే బిల్లు అడిగారు :)
గీతాచార్య పుస్తక గుర్తు పెట్టినంత మాత్రానా చదువుతారంటారా .. అహ ఏం లేదు మొన్నెవరో అన్నీ పోస్ట్ లు చదివి బోలెడు కామెంట్స్ పెట్టేస్తాం అన్నారు..అయిపు పత్తా లేరు..అందుకే డవుటొచ్చి అడిగా :D
మలక్ గారు :)

గీతాచార్య చెప్పారు...

నచ్చిన వాళ్ళు చదువుతారు అన్నాను కానీ మీలు ఎవులి గులించి మాత్లాదుతున్నాలో వాలి గులించి తాదు తదా... :D

ప్రస్తుతానికిది నాలుగోసారి. మీ లవ్ స్టోరీకన్నా ఇది బాగుంది.

రాధిక చెప్పారు...

నేను నా హోల్ జీవితంలో మొన్నే రెండునెలలక్రితం పంటాసుపత్రిలో అడుగుపెట్టా.నిజమేనండి బాబూ నమ్మండి.చిన్నప్పుడు నాకు పళ్ళు వాటికవే రాలిపోయాయి.ఒకటి ఎంతకీ రాలకుండా[అదే ఊడిపోకుండా] వుంటే మా తమ్ముడు రాలగొట్టేసాడు.కేవిటీలు గట్రా ఎప్పుడూ రాలేదు.మొన్నీ డాట్రేమో రెండు పళ్ళకి రూట్ కెనాల్,ఒక పన్ను పుచ్చే చాన్సులు వున్నాయని చెప్పాడు.జ్ఞానదంతాలకి ఖాళీ బానేవుంది కానీ ఫ్యూచర్లో ఏమన్నా అవుతుందేమో పీకేద్దామని చెప్పి వచ్చేనెల వచేయి లేకపోతే చచ్చిపోతావు అన్నంత బిల్డప్ ఇచ్చాడు.కౌంటర్లో పాప మావారిని చూసి నవ్వుతూ ఎస్టిమేషను ఇచ్చింది.అక్షరాలా నాలుగువేల డాలర్లు.అదీ ఆఫ్టర్ ఇన్స్యూరెన్సు.

అజ్ఞాత చెప్పారు...

( సరదాగా )
నిషిగంధ(గారు) తన డెంటిస్ట్ అనుభవాలు రాస్తే ఇలా వుంటుందేమో - " ఓ పున్నమి రోజు మధ్యాహ్నం పారిజాతాలు పంపిన పిల్ల తెమ్మరలు ను ఆస్వాదిస్తూ .... ఆ రిసెప్టనిస్ట్ టేబు మీద వున్న ప్లాస్టిక్ పూవు ఫాను గాలికి మైమరపుతో తలవూపుతూ చిరునవ్వుతో పలకరించింది.." :) కదండి? :P

ఆశైలి బాగుంటుంది, రాస్తే చూడాలనుంది.

శంకర్ :)

mahipal చెప్పారు...

ఎప్పటి లాగే చాల బాగుంది .....
ఐతే ఈ మధ్యలో ఇండియా వెళ్లి వచ్చారంమాట? హమ్మ చెప్పనేలేదు....నేను జస్ట్ 1 నెల క్రింద QQ లో ఇక్కడే బుకిత్ బోతాక్ లో క్లీన్ చేసుకున్న... ముందు చెబితే $200 మిగిలేవి కదండి....

నేస్తం చెప్పారు...

గీతాచార్య గారు అంతేలేండి,,తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఊరికే అన్నారా..కానివ్వండి..
రాధిక చాలామంది పడ్డారన్నమాట ఈ కష్టాలు..హమ్మయ్యా నాకు మనః శ్శాంతి:P
మహిపాల్ గారు .. నేను పాతపోస్ట్ల్లో చాలా సార్లు చెప్పాను కదా.. పైగా మీవ్యాక్య కే బదులుగా చెప్పాను ఇండియా వెళుతున్నా అని .. ఇక్కడ డెంటిస్ట్ లు అంటే అంతే అండి క్లీనింగ్ వరకూ ఓకె కాని ఇంకా పెద్ద సమస్యలైతె మాత్రం ఇండియాలోనే బెస్ట్ ..కాకపోతే ఇండియాలో మంచి డాక్టర్స్ ని ఎంచుకోవాలి.. :)

మంచు చెప్పారు...

పర్లేదు నేస్తం గారు .. బహుశా మీకు జ్ఞాన దంతాలు వచ్చాక ఆస్తి రాస్తారేమో.. మీము కూసింత అడ్వాన్స్ గా వుండటం మంచిదే కదా.. (కూసింతేనా చాలా అడ్వాన్స్ గా వున్నమా ??) :-))
అయినా అదీ ఒకందుకు మంచిదే .. వాళ్ళు మీకు రాయడం . మీరు మళ్ళి మాకు (సారి నాకు ) రాయడం ఎందుకు.. ఆ సగం వాళ్ళనే డైరెక్ట్ గా రాసేయమండి.. రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గుతాయ్ .. :-))

లైఫ్ లొ నేనెప్పుడు డెంటిస్ట్ దగ్గర కెళ్ళలేదు.. ఇప్పుడు ఈ పొస్ట్ చదివి ఇంకేం వెళతాం :-))

సృజన చెప్పారు...

పంటి నొప్పి తగ్గిందో లేదో???? తెలుసుకోవాలంటే మరో టపాకోసం ఎదురు చూడాలన్నమాట:)

Raghav చెప్పారు...

బాగా రాశారు, నా అనుభవం వేరేలా ఉంది, నాకు చిన్నప్పటి నుంచి పళ్ళ సమస్యతో బాధ పడేవాడిని దవడ పళ్ళు దాదాపు పుచ్చి పోయాయి, బెంగళూరులో చూపిస్తే మొత్తం ట్రీట్మెంటుకు 20,000 ఖర్చవుతుందన్నారు, ఆ డబ్బుతో MCA ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం కట్టొచ్చు అనుకొని లైట్ తీసుకున్నా.

MCA జాయిన్ ఐనతర్వాత మొదటి సంవత్సరం ఒక హాస్టల్ లో ఉండవలసి వచ్చింది,అక్కడ మువిందర్ అని ఒక డెంటల్ స్టుడెంట్ పరిచయం అయ్యాడు,నా బాధ చూసి తన ప్రొఫెసర్ దగ్గరకు పిల్చుకెళ్ళాడు, ఆయన పైసా ఐనా తీసుకోకుండా అన్ని పళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చాడు, తర్వాత నేను హాస్టల్ నుంచి రూం కి మారడం తనూ బిజీ అవ్వడం జరిగిపోయాయి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటొ వాడు.

ఇప్పటికీ ఎవరైనా పంటి నొప్పి అంటే నాకు గుర్తొచ్చేది వాడి పేరే "మువిందర్"

నాగప్రసాద్ చెప్పారు...

నేస్తం గారు, అవునా. మీ ఆయనగారు ఆస్తి మొత్తం మీ పేరున వెంటనే రాయకపోతే గృహహింస, వరకట్న చట్టాలను ప్రయోగిస్తానని చెప్పండి. :)))). ( ఇంత గోప్ప అవిడియా ఇచ్చినందుకు ఫీజు క్రింద సగభాగం రాసిచ్చేయండి చాలు. ;))) )

అలాగే, మీ ఆయణ్ణి మా కాలేజీ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌ను చేస్తామని చెప్పండి. మిగిలిన ఆస్తి వివరాల సంగతి నేనూ, మీ ఆయన డిస్కస్ చేసుకుంటాం. ;)))..

కౌటిల్య చెప్పారు...

నేస్తం గారూ,
అయిపు,పత్తా లేనంటున్నారు నన్నేనా!బాగా బిజీగా ఉన్నానండీ...పరీక్షలు,హాస్పిటల్...టపా మొన్నే చదివా గాని,కామెంటు పెడదామనుకుంటూ ఉన్నా..రెండ్రోజులు గడిచిపోయాయ్...

అయినా జాంకాయ ముక్కల్లో వాడిచ్చిన ఆ పిచ్చిపొడి కాకపోతే చక్కగా ఉప్పు,కారం కలిపి అద్దుకు తినొచ్చుగా...అయ్యో ఇదేంటి!నాకు నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయ్...అర్జెంటుగా వెళ్ళి జాంకాయ కొనుక్కుని కారం అద్దుకు తినాలి....

నేస్తం చెప్పారు...

@ నాగ ప్రసాద్ ,మంచుపల్లకి ..రామచంద్రా! ఆస్తి కోసం మా ఇద్దరి మద్యా గొడవలు పెట్టేస్తారా..ఆయ్..అయినా మా ఆయన అంత వీజీగా భయపడరండీ బాబు..మొన్నోమద్య ఇలాగే బెదిరిస్తే లాయర్లందరూ మనవాళ్ళే హెల్ప్ కావాలంటే చెప్పు అన్నారు :(
మంచు పల్లకి గారు డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళలేదా.. అదృష్టవంతులు

సృజన గారు అవును మరి ఎదురు చూడాలిగా :)
రాఘవ్ నిజమే నాక్కూడా తెలిసిన మంచి డాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు ..అతనెవరో నిజంగా మీకు చాలా హెల్ప్ చేశారు. పంటి బాధ సామాన్యమైనది కాదండి..

ఇక్కడెవరో గుమ్మడికాయల దొంగున్నారు..:) అయ్యబాబోయ్ డాక్టర్ గారు మిమ్మల్ని ఎలా అంటాను చెప్పండి..అసలే ఓ పేద్ద డాక్టర్ గారు నాకు తెలుసని అందరిదగ్గర పోజులు కొట్టేస్తున్నా నేను ఇక్కడ ..:)

శరత్ కాలమ్ చెప్పారు...

ఒక నెల క్రితం మా ఆవిడ తన (అ)జ్ఞాన దంతాలు ఇక్కడే పీకిచ్చుకుందండీ - డెంటల్ సర్జరీ అవసరమయ్యింది. ఇండియాలో పీకిచ్చుకొమ్మంటే విన్నది కాదు - ఇండియాలో పీకిచ్చుకుంటే నొప్పి పెడుతుందంట - పెళ్ళికి ముందు అక్కడి డెంటల్ ట్రీట్మెంట్స్ వల్ల అలాంటి అభిప్రాయం ఏర్పడింది. ఆ దంతాలు పీకిచ్చుకున్నాక జ్ఞానం వచ్చి అర్రెర్రె ఇవే పళ్ళు ఇండియాలో పీకించుకుని వుంటే డబ్బులు మిగిలేవి కదా అంటోంది :( వీళ్ళు మాత్రం ముందే ఎస్టిమేషను ఇచ్చారు లెండి - ఇన్స్యూరెన్సు పోగా 650$.

చిన్నప్పుడు మా ఆవిడని పళ్ళు రాలేలా వాళ్ళ తమ్ముడు తోసేసాడంట. అప్పటినుండీ ఆమెకు డెంటల్ సమస్యలు - నాకేమో డబ్బు సమస్యలు. బిల్లులు మా బామ్మర్దికి పంపిస్తే ఎలా వుంటుందీ అని ఆలోచిస్తున్నా!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హా..హ్హా...నిషిగంధ గారన్నట్టు నాక్కూడా మీ టపాల్లో ఉండే ఒకలాంటి ఇన్నోసెన్స్ బాగా నచ్చుతుంది...
ఎప్పటి లాగే హాయిగా ఉంది మనసుకు, చదవటం పూర్తవ్వగానే....

Unknown చెప్పారు...

hello నేస్తం గారూ,
నేను మీకున్న బోలెడు విసనకర్రల్లో ఒక కొత్త విసనకర్రని అన్నమాట. ఈ blog ప్రపంచానికి కూడా కొత్తే.. మొన్న చూసా మీ blog. రోజూ కొన్ని చప్పున ఇవాల్టికి మొత్తం చదివేసా. office లొ lunch time లో చదువుతున్నప్పుడు చూడాలి నా పాట్లు..చెయ్యి అడ్డు పెట్టుకుని బయటకి వినబడకుండా నవ్వడానికి చచ్చాననుకోండి.

అన్నట్టు మాది కూడా గోదారి జిల్లాయేనండి.

స్ఫురిత

నేస్తం చెప్పారు...

@ శరత్ గారు ...వెనకటికి ఎవరో ..ఇక తిట్టను పోవే తింగరిదానా అన్నాడంట..పంటికి అయిన ఖర్చు చెప్తూ నైస్ గా మా ఆవిడ మొండిది ,అఙ్ఞాని అని అర్ధం వచ్చేలా వ్యాఖ్య వ్రాస్తారా ..పైగా బిల్లు బామ్మర్ధులకు పంపుతారా ..ఓ సారి పంపి చూడండి ఈ లోపల నేను మీ వ్యాక్య ఆమెకు పేస్ట్ చేసి పంపుతా :)

>>>ఎప్పటి లాగే హాయిగా ఉంది మనసుకు

షే..ఖ్ఖ.. ర్ ... ఏమిటిది ..నేను ఇక్కడ పంటి నెప్పితో అష్టకష్టాలు పడుతుంటే ఇంత మాట అంటారా :)

ఈశ్వరి నిజ్జంగా ,ఒట్టుగా ఈ 3 రోజుల్లో అన్ని పోస్ట్ లు చదివేసారా ...థేంక్యూ థేంక్యూ

పవన్ కుమార్ చెప్పారు...

నాకు కూడా పుచ్చిపొయిన పన్ను ఒకటి తెగ ఇబ్బంది పెడుతొంది.
డాక్టర్ దగ్గరకి వెల్తె కచ్చితంగా పన్ను పీకేస్తాడు. మల్లి పన్ను రాదు. ఎమి చెయ్యాలొ....

Unknown చెప్పారు...

అదేంటో చిన్నప్పటి నుండి నన్ను ఎవరైనా ఆప్యాయంగా చూస్తే చాలు ఆస్తి లో సగభాగం రాసిచ్చేయాలన్నంత ఆవేశం వచ్చేస్తుంది నాకు....:D...

okka sari naku kanipincharu..... :P

eppati lage post adurs....
nenu kuda iii madya dentist ki regular visitor ne..dani gurinchi raaddam ante time ee dorakatledu... :(

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు ఎప్పటిలాగే నవ్వించారు. నిషిగంధ గారి అభిప్రాయమే నా అభిప్రాయం కూడా!

మీ టపాలలో ఒకరకమైన ఇన్నోసెన్స్ ఉంటుంది. అది నాకు కూడా చాలా ఇష్టం.

నేస్తం చెప్పారు...

హ హ పవన్ పన్ను పీకుతారని వెళ్ళట్లేదా ..అలా వదిలేస్తే ప్రక్క పన్ను పాడవుతుంది..పోనీ రూట్ కెనాల్ కుదురుతుందేమో అడుగు ...
కిరణ్ అవునా మరి కాళీ చేసుకుని వ్రాయి ..పంటి కష్టాలు సామాన్యమైనవా
సవ్వడి గారు :)

పవన్ కుమార్ చెప్పారు...

పెనం మీద ఉన్నారు సరె. పొయ్యలొ పడేది ఎప్పుడు అక్క.

PBVSN Raju చెప్పారు...

ఎప్పటిలానే మీ టపాతో మమ్మల్ని నవ్వుల సంద్రంలో ముంచారు. మీ టపాకి వచ్చే వ్యాఖ్యలు, వాటికి మీరిచ్చే సమాధానాలు కూడా నాకు ఎంతో నచ్చాయి... నచ్చుతాయి.. ఇలా అందరికీ నవ్వులు పంచితే మీకు తిరుగు టపాలా మరిన్ని నవ్వులు (కావలిసిన్ని నవ్వుల పువ్వులన్న మాట) దొరుకుతాయి. సారీ మీ నొప్పి మాకు నవ్వులాటగా మాత్రం లెదండోయీ...

అజ్ఞాత చెప్పారు...

బహుశా ఈ హోలు మొత్తం ప్రపంచకంలో ఎక్కువమంది ని వేధించే సమస్య ఇదేనేమో.
నిన్న మొన్నటి వరకూ పళ్ళ సమస్యలతో బాధపడేవాళ్ళని చూసి ఎంత జాలి పడేదాన్నో . పళ్ళు సరిగా తోముకోని వాళ్ళకే పళ్ళ సమస్యలొస్తాయి అనుకునే ఎర్రి మాలోకాన్ని. ఏదైనా అనుభవంలోకి వస్తేగాని అర్ధం కాదు. సంవత్సరం క్రితం ఓ దంతం పీకి కట్టుడు దంతం వేసిన డాక్టరు పదిహేనేళ్ళు గేరంటీ అన్నాడు. తీరా చేసి ఆరునెలలకే పోయాడు. (పోయింది పన్ను కాదు డాక్టరు .) ఇప్పుడు నా పన్నుకు ఫీసుకు గేరంటీ ఎవరూ....?????

మంచు చెప్పారు...

నేస్తం గారు
మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు

గీతాచార్య చెప్పారు...

తూచ్ పొయ్యిలో పడలేదని చెప్పెయ్యండి. మీరన్ని కష్టాలు పడటం మేము చూడలేమండీ

నేస్తం చెప్పారు...

పవన్ వ్రాస్తాను త్వరలో ..ఈ మద్య కొంచెం బిజి
రాజు గారు థేంక్స్ అండి :)
లలిత గారు 6 నెలల వరకూ పని చేసిందా మీ క్రొత్త పన్ను..పార్టీ ఎప్పుడూ ???
మంచు పల్లకి గారు మీకునూ ఉగాది శుభాకాంక్షలండి ..
గీతాచార్య తినగ తినగ వేము తియ్యగా ఉండు అన్నట్లు ఈ పోస్ట్ ఇన్ని సార్లు చదివాకా గాని మీకు ఇన్నాళ్ళకు అర్ధం అయ్యి జాలి పడాలన్న ఆలోచన వచ్చిందన్నమాటా ..లాభం లేదు మీకు లలిత గారి బ్లాగులో ఉగాది పోస్ట్ లో నేను వ్రాసిన హైకూ లాంటివి నాలుగు వినిపించాల్సిందే :)

నీహారిక చెప్పారు...

నేస్తం గారు,
ఈ రోజే మీ బ్లాగు చూసాను,మీ ప్రేమకధలన్నీ చదివాను. ఎంత ఆశ్చర్యం వేసిందో చెప్పలేను.మీ love story నా love story కూడా same.
కాకపోతే climax different. మీ వాళ్ళు మిమ్మల్ని నమ్మారు.నన్ను నా వాళ్ళు నమ్మలేదు.
ఆఖరికి మీ పంటి సమస్య తో సహా,మనిద్దరి సమస్యలు కూడా కలవటమేమిటి,నాలుగు రోజులక్రితం పళ్ళు clean చేయించుకున్నాను.
షబ్నం విజయవాడలోనిదా?
మీరు India వచ్చి వెళ్ళారా?
మీరు gap తీసుకుంటే అదే అనుకున్నాను.

మాలా కుమార్ చెప్పారు...

చిన్న విషయం కూడా భలే కామిడీ గా చెబుతారండి . బాగుంది .

సన్నిగాడు చెప్పారు...

నాకు తెలిసి ఇది చాలా చిన్న సమస్య, మీకు "సి" విటమిన్ లోపం వలన చిగుళ్ళు నుంచి రక్తం రావటం జరుగుతుంది, నేను మా ఫ్రెండ్ తో వారానికి కనీసం రెండు నిమ్మకాయలు "raw" తొక్క తీసి నారింజ తిన్నట్టు తినమని చెప్పను, అది B.Tech రోజుల్లో.
మా ఫ్రెండ్ ది ఇంకా తీవ్రమైన స్థితి, ప్రతి రోజు బ్రష్ చేసుకునేటప్పుడు రక్తం రావటం చాలా సాధారణం, వాడు "సి" విటమిన్ తీసుకున్నప్పటినుంచి ఈ రోజు వరకు "నో ప్రాబ్లం". ఇక పొతే brush bristle hardness కే మీ పళ్ళు ఇంట చిత్రవధ ని అనుభవించాయి అంటే నిజంగా మీ పళ్ళు చాలా బలహీనం గా ఉన్నాయి అని అర్ధం. మీకు నావికుల అనుభవాల నుంచి http://en.wikipedia.org/wiki/Scurvy తెలుసుకోవలసింది చాలా ఉంది.

P.S: పోస్ట్ బాగుంది

భావన చెప్పారు...

హ హ హ మీరు అల్టిమేటండి బాబు. పళ్ళ డాక్టర్ దంతావధానాన్ని కూ డా నవ్వుల పువ్వులు పూయిన్చటానికి వుపయోగించారు. :-) :-)

రాజ్ కుమార్ చెప్పారు...

మళ్లీ సీన్ రిపీటెడ్..డాక్టర్ చిరు మందహాసం ,నర్స్ మృదు స్వభావం ... కట్ చేస్తే 200 $ బిల్ కడుతూ మా ఆయన ..."

చిన్నప్పటి నుండి నన్ను ఎవరైనా ఆప్యాయంగా చూస్తే చాలు ఆస్తి లో సగభాగం రాసిచ్చేయాలన్నంత ఆవేశం వచ్చేస్తుంది నాకు"


ha ha.. idigo indukey memu mee abhimanula mayyindi....

nestam gari tapa = keka x keka

నేస్తం చెప్పారు...

nIhaarikaa ayyO mimmalni nammalEdaa..chaalaa baadha anipinchi unTundi kadanDI
maala gaaru :)
sannI mirichchina link chaduvutaa thenks
bhaavanaa :)
vENu raam :D