8, మే 2011, ఆదివారం

సరదాగా స్కై పార్క్ కి

నిన్న స్కై పార్క్ కి వెళ్ళాం.. స్కైపార్క్ అంటే ఏంటంటే.. ఊ..చాలా బాగుంటుంది అన్నమాట..ఎలా చెప్పాలో తెలియడం లేదన్నమాట.. అందుకే చూపిస్తా.. అసలుకి ఒక 500 ఫొటోస్ తీసి ఉంటాం అందులో 450 ఫొటోస్ లో మేమే ఉన్నాం.. మిగిలినవి ఒడబోయగా కొన్ని మీకు చూపిస్తున్నాను.. ముందే ఐడియాలేదు బ్లాగ్లో పెట్టాలని.. నిన్న చూసాకా వచ్చింది అన్నమాట.. చూసి కుళ్ళుకోండి :)లేకపోతే నాకు మనశ్సాంతిగా ఉండదు..

ముందుగా కేబ్లోంచి కొన్ని మా ఊరి ఫొటోస్



ఇదే బాబు స్కై పార్క్ ..దీనిలోపలకే వెళ్ళాం ...

అందులో వెళ్ళాకా కొన్ని ఫొటోస్ ....ఇవేంటనుకుంటున్నారు బుల్లి బుల్లి రెస్టారెంట్లు ..నాకేమో తీయడం రాలేదు ..చాలా చాలా సూపర్ ఉన్నయన్నమాట చూడటానికి..మీరు కూడా చాలా చాలా ఇంకా బాగా ఊహించుకోండి...ఫొటోస్ క్లిక్ చేసి పెద్దవి చేసుకుని చూడండి




ఇవి మెట్లలాగా ఉన్నాయికదా.. ఉహు.. పైన రూఫ్ అన్నమాట

ఇటువంటి శిల్పాలు చాలానే ఉన్నాయి.. ఇది పరుగులు పెడుతూ తీసా.. మరి నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు..


చాలా పెద్ద బిల్డింగ్ లే ..అది అయితే స్కేటింగ్ ..మా అమ్మాయి ఒకటే గొడవ ..అమ్మా వెళదాం అని ...టైమెక్కడా.. పాపం తీసుకొచ్చేసాను..




నవ్వుకోకండేం ఇలాంటివైతే బోలెడు ఉన్నాయి....షోకేస్లో బొమ్మలు చూస్తే పిచ్చ ఇష్టం నాకు ..



లాహిరి లాహిరి లాహిరిలో ..బిల్డింగ్ లోపలే చెరువు దానిలో నౌకావిహారం ..మనిషికి 5 $..దారుణం కదా ..సుత్తిలా 10 నిమిషాలు కూడా తిప్పలేదు.. పిల్లల కోసం తప్పలేదు.. అయినా వాడు నా దగ్గర టిక్కెట్టు తీసుకోవడం మర్చిపోయాడు..ఇంకోసారి పిల్లల్ని పంపనా అంటే ..మా ఆయన.. హుఊం ఎందుకులేండి చెప్పడం..


మనిషన్నాకా కాసింత కళాపోషణ ఉండాలండి.. సూపరుంది కదా..మనమే తీసాం బిల్డింగ్ క్రింద నుండి..


ఇదిగో బాబు స్కై పార్క్ నమూనా.....దీని పైకి ఎక్కినందుకు దొంగమొహంగాడు మనిషికి 20$ బేండ్ వేసాడు..కాని.. పర్లేదులే..బాగానే ఉంది ...


దారంతా కుండీలతో ఇలా సరదా వస్తువులతో డెకరేట్ చేసారు

బిల్డింగ్ పైన అంతా చెట్లే చెట్లు ...భలే బాగుంది కదా ...
ఈ ఫారినర్స్ కి పని పాట ఏడవదు ...ఎక్కడికి వెళ్ళు సరిగంగ స్నానాలే

చేతికి కెమారా ఇస్తే ఇలాంటి పైత్యాలు పుడుతుంటాయినాకు..భరించాలి తప్పదు మీకు ..




ఈ ఫొటోస్ చూసాకా నాకో విషయం అర్ధం అయ్యింది..వేలకు వేలు పోసి కెమెరాలు కొనడం కాదు గొప్ప ..ఫొటోస్ తీయడం నేర్చుకోవాలి.. బుల్లి బుల్లి కెమెరాలతో ఎంచక్కా ఫొటోస్ తీసేస్తున్నారు అక్కడ..ఇంత పెద్ద కెమేరా వేసుకుని మనకు నచ్చినట్లు తీస్తే ఇలాగే వస్తాయన్నమాట..ఈ మాట అనేసి బోలెడు తిట్ట్లు తినేసా అన్నమాట.. కాని సూపర్ ఉంది ఈ ప్లేస్..మొత్తం సింగపూర్ కనబడింది..కాకపోతే పది నిమిషాలు కూడా కూర్చో నివ్వలేదు అక్కడ సుత్తిలా .ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయిగాని ..మరీ ఎక్కువ అయిపోతాయని పెట్టడంలేదు





ఈ place మాత్రం అల్టిమేట్ ...మొత్తం బిల్డింగ్ చూపించినప్పుడు పైనా షిప్ లా ఉందికదా ఆ ఏడ్జ్ లో అన్నమాట ఆ స్విమ్మింగ్ పూల్ ..పడిపోతాం కదా.. ఆ ఫారినర్స్ కి భయమే లేదు..ఎలా కట్టాడో అర్ధం కాలేదు..లోపల్కి వెళ్ళే ఓపికలేక బయట నుండి ఒక క్లిక్కు కిక్కాము ,,


క్రింద రెండు ఫొటోస్ ఉన్నాయికదా ..పై ఫొటో క్రింద ఫొటో తేడా చూడండి...రెండూ ఒక ప్లేస్లో తీసినవే.. మరదేమరి క్షవరం అయ్యాకా వివరం తెలియడం అంటే.... ఇప్పటికి మా ఆయనగారికి తెలుసొచ్చింది అన్నమాట బ్యాక్ గ్రౌండ్ బ్రైట్ గా ఎలా తీయాలో ..అప్పటీకీ చెప్తున్నా గైడ్ మోడ్లో పెట్టి చూడండి మహానుభావా ....అబ్బే అలా వినేస్తే ఇంకేంటి ..ఫోటొస్ అన్ని నాశనం చేసేయద్దూ ..పెద్ద జోకేమిటంటే.. మాకులాంటి కెమేరా తెచ్చుకుని అదెలా పట్టుకోవాలో తెలియకా మా ఆయన్ని సలహా అడిగే శిష్యుడు ఒకడు దొరికాడు అక్కడ ..పాపం వాడు..:P




బ్రిడ్జ్ ప్రక్కనే బోలెడు పూవులు బాగున్నాయి కదా

ఈ బ్రిడ్జ్ చాలా బాగుందికాని ఇక్కడ బాగా రాలేదు

ఇంకా కొబ్బరి చెట్ట్ల దారి


వస్తున్నప్పుడు పువ్వులాంటి బిల్డింగ్

చీకట్లో స్కయ్ పార్క్

ఆఖరికి టాక్సి స్టాండ్ ని కూడా వదల్లేదు.


మరిన్ని వివరాలకు :
http://www.marinabaysands.com/SandsSkypark/Sands_Sky_Park.aspx

38 కామెంట్‌లు:

నేను చెప్పారు...

1st comment naade :)

నేను చెప్పారు...

ఈ పార్క్ అప్పుడెప్పుడో కట్టారు కదండీ.
ఇదేనా మీరు మొదటిసారెళ్ళడం ?

//మనిషన్నాకా కాసింత కళాపోషా ఉండాలండి.. సూపరుంది కదా..మనమే తీసాం బిల్డింగ్ క్రింద నుండి..//
ఆ ఫోటో బాగా వచ్చింది :-)

Raju చెప్పారు...

మంచి పరిచయం. అభినందనలు.
ఫొటొల పైన టైం తప్పు చూపిస్తున్నారా? 5 గంటలకే లైట్లు వెలుగుతున్నాయి. సింగపూర్ లో 7 గంటలవరకు చీకటి పడదు కదా!

Unknown చెప్పారు...

సింగపురా ?శ్రీలంకా ?ఈ సమ్మర్ లో ఎక్కడికి తీసుకెళ్ళాలా పిల్లల్ని
అన్న సందిగ్దావస్త లో వుంటే మీరు పెట్టిన ఫొటోస్ చూసాక సింగపూర్ కే నిర్ణయం తీసుకున్నా .
మీరు ఫొటోస్ తో బాటు టూరిస్ట్ పాయింట్ అఫ్ వ్యూ లో వెళ్ళడానికి యెంత టైం అవుతుంది ,
మొత్తం కిలం యెంత వదిలితే ఫలం దక్కుతుంది ?వొక వేల బోటు దగ్గర టికెట్స్ వాడు తీసుకోలేదని
మళ్లి పిల్లల్ని ఎక్కిస్తే పట్టుబడితే ఎన్నిరోజులు జైలులో పెడతారు వాళ్ళ చట్టాల బట్టి ?
యిత్యాది వివరాలు కూడా పొందు పరిస్తే బావుండేదేమో?

నేస్తం చెప్పారు...

బద్రి గారు మీరలాంటి కష్టమైన ప్రశ్నలు వేయకూడదు అన్నమాట ...మీకో విషయం తెలుసా నేను esplanade కూడా చూడలేదు(బయట నుండి చూసాను లోపలికి వెళ్ళలేదు) .. ఎక్కడికన్నా రమ్మంటే నేను రానంటే రానని మొండికేస్తాను..బద్దకంగా స్కూల్ మానేసే పిల్లల్లా మాదిరి కారణాలు వెదుక్కుంటా..నిన్న కూడా బలవంతంగా తీసుకువెళ్ళారు..వెళ్ళాక బాగానే ఎంజాయ్ చేస్తాను అది వేరే విషయం :)

ఇక ఫొటోస్ అంటారా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది... నన్ను ఒక్క చోట ప్రశాంతంగా కూర్చోనివ్వలేదుగాని లేకపోతేనా ఈపాటికి మీకులా ఒక ఫొటోబ్లాగ్ పెట్టేసేదాన్ని ..:))

నేస్తం చెప్పారు...

రాజు గారు ..మీకు ఒక పేద్ద... ఓఓఓఓఓఓ ...
ఇండియా తీసుకువెళ్ళి మావారు అక్కడి టైం సెట్ చేసి మర్చిపోయారు మార్చడం..నిన్ననే అన్నారు..టైం మార్చలేదు అని..మీరు పట్టేసారు..

రవిగారు ఊ.. నాకూ సరిగ్గా తెలియదు మరి..టూరిస్ట్ పేకేజ్లో ఎలా ఉంటాయో తెలియదుకాని ..మామూలుగా వస్తే .. టైగర్ ఎయిర్లైన్స్ అయితే మీకు టికెట్ చీప్ ఉంటుంది కాని అది చెన్నై బెంగళూర్ నుండి ఉన్నాయి ఫ్లైట్లు ..హైద్రబాద్ నుండి సిల్క్ ఎయిర్లైన్స్ సింగపూర్ ఎయిర్లైన్స్ లు ఫుల్ల్ బాదేస్తాడు..(హాలిడేస్ టైములో బాగానే వదులుతుంది టికెట్ రేట్).. హొటెల్స్ కి ఇక్కడ అన్నీ చూడటానికి ట్రాన్స్ పోర్ట్ కి టిక్కెట్స్కి అన్నీ కలిపి ఒక ఫేమిలీకి ఒక లక్ష అవుతుందనుకుంటున్నా మరి..


>>>>వొక వేల బోటు దగ్గర టికెట్స్ వాడు తీసుకోలేదని
మళ్లి పిల్లల్ని ఎక్కిస్తే పట్టుబడితే ఎన్నిరోజులు జైలులో పెడతారు వాళ్ళ చట్టాల బట్టి
హహహ అలాంటి చిన్నవాటికి ఏమనడుగాని చీ చీ చెత్తమొహాల్లారా అని ఒక చూపు చూసి పంపేస్తాడు మర్యాదగా :))

Sravya V చెప్పారు...

పోలింగ్ డే అని హాలిడే ఇస్తే మీరు ఇలా పార్కులు గట్రా తిరుగుతారా ? అయ్ భయం లేదు :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఫోటోలు బాగున్నాయ్ నేస్తం :)

kiran చెప్పారు...

నేస్తం గారు ..నేను కుళ్ళుకుంటున్నా :P
చాలా బాగున్నాయి ఫొటోస్..:)

KumarN చెప్పారు...

Very Nice..
HOw long this Skypark has been in Singapore?

నేస్తం చెప్పారు...

మరే "లీ" ఎప్పటిలాగే మళ్ళీ ఏకగ్రీవంగా ప్రైమినిస్టర్ గా ఎన్నుకోబడతాడని సంబరాలు జరుపుకున్నాం శ్రావ్యా:P
శ్రీకాంత్ గారు :)
కిరణ్ కుళ్ళుకున్నావా ..నిజమైన అభిమానివి నువ్వే కిరణ్ :)
కుమార్ గారు ఎప్పుడంటే....ఊ.. ఓ రెండేళ్ళు అయ్యి ఉంటుంది ఓపెన్ చేసి .. ఎప్పూడూ అటువైపు వెళ్ళినపుడు బయటనుండి చూడటమే గాని వెళ్ళలేదు :)

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్కా కుఠోలు సూపరు.. మీరు అర్జెంట్ ఒక ఫోటో బ్లాగ్ ఓపెన్ చేసెయ్యండి చెప్తాను ;).
నేను కుళ్ళుకుంటున్నాను.. మీరు మనశ్శాంతి గా ఉండండి.(నా కుళ్ళు అంతా బద్రి మీదనే.. ఫస్ట్ కామెంట్ కొట్టేశారు గా మరి?)

సింగపూర్ వచ్చినపుడు మిస్ అవ్వకూడని ప్రదేశాల్లో ఇదొకటి అన్నమాట. ;)
కళాపోషణ ఫోటో అరుపులు.. నాకు బాగా నచ్చింది. ;)

రాజ్ కుమార్ చెప్పారు...

మరిచిపోయాను ఆ ఎరుపు రంగు చారల చొక్కా అబ్బాయిని అడిగానని చెప్పండి. ;)

నాగప్రసాద్ చెప్పారు...

నేను కూడా కుళ్ళుకుంటున్నాను. :-(

మాకు దగ్గరే కదా, సింగపూర్ బస్సెక్కడానికి ఎలాగోలా ప్లాన్ చేసుకుంటాను అయితే.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాబోయ్ శ్రీకాంత్ గారా ఎవరండీ ఆయన :-)

Unknown చెప్పారు...

నేస్తం గారు .. చాలా బాగుంది .. :) ఈ సారి ఇండియా వెళ్ళేడప్పుడు .. సింగపూర్ లో ఆగుత .. మరి నన్ను అన్ని ప్లేసెస్ కి తీసుకుని వెళ్తారా .. ఇక్కడకి వచ్చేప్పుడు సింగపూర్ ఎయిర్ పోర్ట్ మాత్రమె చూసా ..
మరి మీరు కన్ఫర్మ్ చేస్తే నేను టికెట్స్ బుక్ చేసుకుంటా .. :)

vani చెప్పారు...

neatam garu boat lo vunna photo lo vundi mire kada.

నేస్తం చెప్పారు...

>>>మీరు అర్జెంట్ ఒక ఫోటో బ్లాగ్ ఓపెన్ చేసెయ్యండి చెప్తాను ;)
అప్పటికి గాని బుద్దిరాదునాకు :)
కాని సీరియస్గా నేను చాలా బాగా నేర్చుకోవాలి అనుకుంటున్నారాజ్... మరెలా నేర్చుకుంటానో తెలియదు..:)
అన్నట్లు నీ క్రొత్త బ్లాగ్ చాలా బాగుంది..చాలా బాగారాస్తున్నావ్ ..
నాగ ప్రసాద్..వచ్చేసేయి వచ్చేసేయి ..వచ్చేటప్పుడు శ్రీలంక ఎయిర్లైన్స్ ఎక్కి వచ్చేసేయి ఎంచక్కా రెండు దేశాలు చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది ...అసలు నిన్ను కుళ్ళబెట్టడానికైనా నేను చాలా చాలా విశేషాలు రాసేయాలి :)
వేణు గారు వెరైటీగా ఉంటుంది అని శ్రీకాంత్ అన్నాను అన్నమాట :D
కావ్య ఏం మొహమాట పడకు వచ్చేసేయి..కాని వస్తే ఈ నవెంబర్ లోపల రా :)
వాణి గారు అవునండి :)

E.V.Lakshmi చెప్పారు...

Wow!Nice.

KumarN చెప్పారు...

"కావ్య ఏం మొహమాట పడకు వచ్చేసేయి..కాని వస్తే ఈ నవెంబర్ లోపల రా "

ఎందుకు, నవంబర్ వరకీ ఇండియా లో ఉంటున్నారా? :-)

సరే స్కై పార్క్ గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు. ఏంట్రా నేనొచ్చినప్పుడు ఇది ఎలా మిస్ అయ్యానా అనుకుంటున్నా. ఇప్పుడు తెలిసింది, రెండేళ్ళేననై. మా తమ్ముడు బతికిపోయాడు పొండి, లేకపోతే చచ్చేవాడు నా చేతిలో :-)

హరే కృష్ణ చెప్పారు...

Very Nice and Beautiful view
నాకైతే బాగా నచ్చాయి

ఇక ఫొటోస్ అంటారా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది... నన్ను ఒక్క చోట ప్రశాంతంగా కూర్చోనివ్వలేదుగాని లేకపోతేనా
Kevvvvvvv :D

మనసు పలికే చెప్పారు...

ఫస్ట్ కామెంట్ కొట్టేసిన బద్రి గారూ.. డౌన్ డౌన్..;)

నేనింకేం మాట్లాడను.. నాకు అర్జెంట్‌గా సింగపూర్ రావాలని ఉందీ.....:'( వా వా:'(
అక్కయ్యా.. మీరే నన్ను తీస్కెళ్లాలి ఈ ప్లేస్‌కి. ఇంకా, మీరెక్కడెక్కడ నుంచుని ఫోటోస్ తీసారో నాకు చెప్పాలి లైవ్‌లో..;);)

>>ఇక ఫొటోస్ అంటారా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
హిహ్హిహ్హి.. కెవ్వూ...;);)

నేస్తం చెప్పారు...

లక్ష్మిగారు ధాంక్యూ
కుమార్ గారు పోయింట్ కేచ్ చేసారు అవును ఇండియావెళతాను...పోనీలేండి మీ తమ్ముడి గారిని సమయానికి ప్రాణాపాయం నుండి రక్షించాను ..:)
హరే.. నిజ్జంగా ...ఏదీ మళ్ళీ చెప్పు..నా కళ్ళలోకి చూసి చెప్పు..అక్క దగ్గర మొహమాటపడకూడదు :D
ఓస్ అంతేకదా.... వచ్చేసేయి...మళ్ళోసారి బిల్డింగ్ అంతా రౌండ్ వేసేద్దాం అప్పూ

అనుదీప్ చెప్పారు...

హాయ్ అండి నేస్థం గారు,

ఫొటొలు చాల బాగ తీసారు... అంధుకొండి నా అభినంధనలు ఇగ ( కుళ్ళుకున్నాను కూడ) ... ఇంకొక విషయం చెప్పాలండి మీకు. మీ బ్లొగ్ నాకు మధురవాణి గారి ద్వార తెలిసింది. అప్పటి నుంచి నేను మీకు పెధ్ద ఫాన్ అండి బాబు. మీ లాంటి వారి ఇన్స్పిరేషన్ తొ నేను బ్లొగ్ ఒపెన్ చేసాను. వీలు ఉంటె ఒకసారి చూసి తప్పులు ఉంటె అక్షింథలు వేసి ఆశీర్వదించగలరు అని ప్రార్ధన..

-- అనుదీప్

నేస్తం చెప్పారు...

అనుదీప్ గారు థేంక్స్ అండి..మీ బ్లాగ్ బాగుంది చదివాను ..కధ బాగా రాసారు :)

Venkat చెప్పారు...

Akka Keka .... kaani maree nelaku okka post matrame vastunnaru

మాలా కుమార్ చెప్పారు...

ఫొటోలు , వర్ణన చాలా బాగున్నాయండి . అయ్యో అవన్నీ చూడలేదే అని నిజంగానే కుళ్ళు పుడుతోంది .

నేస్తం చెప్పారు...

>>>>ఎందుకు, నవంబర్ వరకీ ఇండియా లో ఉంటున్నారా? :-)
కుమార్ గారు ఇప్పటికి అర్ధం అయ్యింది మీ కామెంట్లో శ్లేష ..... ఏంటోనండి ఈ మధ్య ఓ పట్టానా ఏదీ అర్ధం అయిచావట్లేదు నాకు :)

వెంకట్ అసలేం రాయకూడదనుకున్నా(ఇంక విషయాలేమి లేవన్నమాట) హూం కాని ఇవన్నీ నా పిల్లలకోసం రాసుకుంటున్నా..ఏదీ మిస్ అవ్వకూడదని.. ఓ అయిదేళ్ళు పోయాకా మా అమ్మాయి పెద్దయ్యాకా అది తెలుగు బాగా చదవడం నేర్చేసుకున్నాకా ఓ రోజు సర్ప్రైజ్ గా ఈ బ్లాగ్ URL ఇచ్చి ...అయ్యబాబోయ్ నేను ఓ రేంజ్లో ఆశలు పెట్టేసుకున్నా..అదేం చేస్తుందో తెలియదుకాని :))

మాలగారు చాలా రోజుల తర్వాత కదా.. ఈ రోజు మిమ్మల్నెందుకో తల్చుకున్నా ఇంకా ఓ ఫ్రెండ్కి మీ గురించే చెప్పాను చాలాసేపు .. కామెంట్ రూపంలో మీరు వచ్చేసారు..:

Ram Krish Reddy Kotla చెప్పారు...

Nestham jee... excellent pics.. chusi chala chala kullukunna.. meeru happy e na.. :))

జయ చెప్పారు...

ఊ..ఊ...నేను కూడా చాలా బాగా కుళ్ళిపోయాను:)

హమ్మయ్యా...ఇంక స్పీడ్ పెంచేయండి బాబూ....

అనుదీప్ చెప్పారు...

థాంక్స్ అండి నేస్తం గారు,
5 మంత్స్ ఎక్స్పీరియన్స్ కదా అండి. అందుకె కొన్ని అచ్చు తప్పులు ఉన్నాయ్.. అప్పటికి ఒకటికి -1 సార్లు చదువుతున్న రాసాక... అయినా వస్తున్నాయ్...ఈ సారి నుంచి ఒకటికి 2 సార్లు చదివి మంచిగా రాస్తానండి. మరొకసారి ధన్యవాధాలు మీకు.

శివరంజని చెప్పారు...

అక్క ఫొటోస్ అన్నీ కేక .......అబ్బో మా మా అక్క రైటింగ్ లోనే కాకుండా ఫోటోగ్రఫీ లో కూడా దిట్ట అన్నమాట . అక్కా మరి అప్పు ని తీసుకేల్లినప్పుడు నన్ను కూడా

నేస్తం చెప్పారు...

కిషన్ హా చాలా హేపీ..చాలారోజుల తర్వాత కనిపించారు..ఏంటి విశేషం :)
జయగారు :) అంతేఅంటారా
శివరంజని నువ్వురాకపోతే ఎలా?
అనుదీప్ గారు :)

Vinay Datta చెప్పారు...

ఫోటోలు, మీరు చెప్పిన విధానం .... రెండూ చాలా బాగున్నాయి.

madhuri.

వాత్సల్య చెప్పారు...

Pool is the ultimate attraction in sands. Stayed there exclusively for that pool :)))

వాత్సల్య చెప్పారు...

Btw, you stay some where in east kadaa? Just a guess

నేస్తం చెప్పారు...

రిషిగారు అవుననడి ఈస్టే :)
వినయ్ దేంక్స్ అండి

అజ్ఞాత చెప్పారు...

enti chala mandi kullukunnattunaru. kani nenu matram assalu kullukoledu :p

ivanni ilanti places chala untayi pichhi nestam intha mathranike kullukuntara enti. jaalestundi akka :)
ilanti places miru baaga chudalani korukuntunna. All the Best akka