28, మే 2011, శనివారం

అనగనగా ఒక రోజు...

ఈ మధ్యన నాకు పని ఎక్కువ అయిపోయి గొప్ప గొప్ప ఐడియాలు వచ్చేస్తున్నాయి . మీరు సరిగ్గానే విన్నారు ఖాళీ ఎక్కువ అయి కాదు పని ఎక్కువ అయ్యే....ఖాళీగా ఉంటే మనం ఎక్కడ ఆలోచిస్తాం ...ఎంచక్కా సిస్టం ఆన్ చేసి సినిమాలు,పాటలు ,సీరియళ్ళు,బ్లాగులు,కధలు అబ్బో నన్ను పట్టుకోవడం ఎవ్వరితరంకాదు....ఇంతకూ ఆ గొప్ప ఐడియా ఏమిటయ్యాంటే.... ఎప్పుడో అప్పుడప్పుడూ జరిగిన విషయాలు రాయకుండా ఒకేరోజున జరిగిన విషయాలన్నీ రాస్తే ఎలా ఉంటుందీ అని..... అదే డైరీ లెక్కన అనుకోండీ ...హేమిటో ఒక్కసారిగా మీరందరూ కసాయివాడిని నమ్మిన గోర్రేపిల్లల్లా ఎంత ముద్దుగా కనబడుతున్నారో నాకళ్లకు.....



ఇంతకూ విషయంలోకి వచ్చేస్తే కొన్ని దినాలు ఉంటాయి ..ఛీ ఛీ ఆ దినాలు కాదు రోజులన్నమాట.. కొన్ని రోజులు ఉంటాయి ....ఆ రోజుమనం పట్టుకున్నదల్లా పట్టుచీరై కూర్చుంటుంది.( ఆడపిల్లనికదా ఉపమానాలు అలాగే ఉంటాయి).... ఫర్ ఎక్జాంపుల్ మీరు చిల్లరమార్చడానికని లాటరీ టికెట్ కొన్నారనుకోండి దానికి మొదటి ప్రైజ్ వచ్చి మురిపిస్తుంది. (మా నాన్నగారికి అలాగే జరిగింది ) ఓ రెండొందలు సిల్క్ చీర కొందామని షాపుకి వెళితే లక్కీ డ్రాలో ఐదువేల రూపాయల పట్టు చీర చేతికొచ్చేస్తుంది (మా పిన్నికలా జరిగింది) ఇలా అన్నమాట.అయితే ఇలాంటిరోజులు ఎప్పుడోగాని రావు ..కానీ మరికొన్ని రోజులుంటాయి అచ్చం ఖలేజా సినిమాలో అనుష్కాలా....ఆ రోజు ఏం చేస్తే అది మటాష్ ....ఇవి తరుచూ వస్తుంటాయి ...దీనికి ఎక్జాం పుల్ ఈ పోస్ట్ అన్నమాట..



అసలేమైంది అంటే మొన్న ఆదివారం ప్రొద్దున్నే లేచి మా ఆయన ఎవరి మొహం చూసారోగాని (ఓయ్ ..ఏంటి నావైపు చూస్తున్నారు...నన్ను కాదు చూసింది ... ఆ రోజు నేను దుప్పటి నిండుగా కప్పేసుకుని పడుకున్నాను ...నాకు బాగా గుర్తుంది ) నేను రెండు రోజులకొకసారి మా సింగపూర్లో తలుపులు బార్లా తెరచి వెళ్ళిపోయినా చీపురుపుల్ల కూడా మిస్ అవ్వదు అని ఇండియాలో దొరికిన వారందరికీ దొరికినట్లుగా చెప్పే మాటల పై పెట్రోలు జల్లేసి ఒక దొంగవెధవ మా ఆయన పర్స్ ఎత్తుకుపోయాడు..అదీ పట్టపగలు ... పైగా చుట్టూరా జనాలు ఉండగా.. ఈయన గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే కిట్ ఓపెన్ చేసి మరీ ఎత్తుకుపోయాడు ... ఈ విషయం నాకు ఫోన్లో చెప్పగానే నేను భామాకలపానికి సిద్దమవుతుండగా మా ఆయన పారిజాత పుష్పం లాంటి మరొక మాట చెప్పి చల్లారబెట్టేసారు.....అంటే మా ఆయనకైతే పర్స్ ఒక్కటే పోయిందంట ....వాళ్ళ ఫ్రెండ్స్వి పర్సులు ,ఐ ఫోన్స్ తో సహా ఎత్తుకుపోయాడంట ... పర్స్లో డబ్బులెన్ని ఉన్నాయి అంటే 120 $ అని చెప్పారు ...ఈ ముక్క నేను నమ్మానంటే ఇన్నాళ్ళ మా దాంపత్య జీవితాన్ని అవమానం చేసినట్లు అవుతుంది ..అందుకే అలాంటి పాపం చేయలేదు..


సరే ..... కాసేపు వాడిని మా ఆయన్ని కలిపి ,విడి విడిగా ,హడావుడిగా తిట్టుకున్నాకా మా సార్ ఇంటికొచ్చారు .... మా ఆయన కజిన్ కూడా మా ఇంట్లోనే ఉండటం వల్ల ఎక్కడికన్నా వెళదామా అని ప్రోగ్రాం పెట్టారు.. " ఎక్కడికన్నా వెళదాం "అనే మాట అంటే చాలు నేనూ, నా కూతురు మేమురాము బాబు కాళ్ళు నెప్పులుగా ఉన్నాయి అని మంచమేక్కేసే వాళ్ళం కాస్తా ఏ కళనున్నామో సరే అనేసాం...చెప్పానుగా టైము అని ... "అడ్వెంచర్ పార్క్ వెళదామా " మా ఆయన మాట పూర్తవ్వకమునుపే.. నహీ !!!! ఆర్కిడ్ గార్డెన్ కి వెళదాం అన్నాను ఖరాకండిగా ....నా బాధ నాది ... అక్కడికి వెళ్లి బోలెడు ఫొటోస్ తీసేసి తెల్లారే పాటికల్లా బ్లాగ్లో పెట్టేసి ఆహా ఓహో అనిపించేసుకోవాలని... తన కజిన్ కూడా నన్నే సపోర్ట్ చేయడం వల్ల సరే గంటలో రెడీ అయిపోండి అని మా ఆయన ఆర్డర్ వేసేసారు ...



అయితే మన అమోఘమైన తెలివితేటలను ఉపయోగించి.. చూడండి ..అక్కడికి వెళ్ళడానికి ఎక్కవలసిన బస్సులు , గార్డెన్ టైమింగులు , గట్రాలు లాంటివి సరిగ్గా ఓ సారి ఎవరినన్నా కనుక్కోండి అని ఒక సలహా ఇచ్చాను ...అబ్బే ... "పెళ్ళాం చెప్తే వినాలి "అని టైటిల్ పెట్టి మరీ సినిమాలు తీసినా కొన్ని జీవులకు ఎక్కవు ....ఈ దిక్కుమాలిన మొబైల్స్ వచ్చిన దగ్గరనుండి ప్రక్కింటికి వెళ్ళాలన్నా గూగుల్ మేపులు పెట్టుకుని తడుముకుంటూ వెళ్ళడం ఫ్యాషన్ అయిపొయింది జనాలకు...అతి ముఖ్యంగా మా ఆయనకు ..... మాకు తెలుసులే నువ్వు పని చూసుకో ...ఎప్పుడు చూసినా బస్ అంటావ్ కేబ్ లో వెళ్ళినా అంతే అవుతుంది అని ఓ డైలాగ్ కొట్టి వెళ్ళిపోయారు ...సరే నేను, వాళ్ళ కజిన్ పోటీలు పడి మరీ మొహానికి అరంగుళం మందానా మేకప్పులు కొట్టేసి టిప్పు టాపుగా సూపర్గా తయారయిపోయాం ...



కేబ్ వాడు మమ్మల్ని చూడగానే" అయిదుగురా .. నో... కుదరదు "అన్నాడు.. నేను, ఆ అమ్మాయి ఒక క్లోజప్ ఏడ్ ఇచ్చి" ప్లీజ్ అంకుల్ "అన్నాం.....పాపం జడుసుకున్నట్లున్నాడు ఇంకేం మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు.....ఆర్కిడ్ గార్డెన్ మా ఆయన సీట్బెల్ట్ పెట్టుకుంటూ చెప్పారు .. ... ఓ "జూ" దగ్గర ఉంటుంది అదేనా అన్నాడు... ఎస్ అన్నారు మా సార్.... "జూ " దగ్గరా !!!! కాదు కదండీ ....అది ఇంకో చోటకదా ఆర్చాడ్ ఊరికి దగ్గరలోనే కదా నా మాట ఇంకా పూర్తికాలేదు ఇద్దరూ ఫోన్స్ లో టిక్కు టిక్కున గూగుల్ మేప్ ఓపెన్ చేసి నామొహానపడేసి నా నోరు మూయించేసారు.... సరే మనకెందుకులే అని తరువాత రోజు వేయబోయే పోస్ట్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను..అలా వెళుతున్నాం ...వెళుతున్నాం ..వెళుతూనే ఉన్నాం ... కాసేపటికి గమనించింది ఏమిటయ్యా అంటే "జూ " వచ్చింది ..మళ్ళీ "జూ" వచ్చింది...మళ్ళీ మళ్ళీ "జూ" వస్తూనే ఉంది వాడు దాని చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాడు..బిల్లు చూస్తే బీపి పెరిగిపోతుంది ...... బాబు ఏమిటిదీ మా ఆయన అడిగారు....ఇక్కడే ఉండాలి ఎక్కడో మిస్ అవుతున్నాం అన్నాడు.. మళ్ళీ మావాళ్ళు ఇద్దరూ ఫోన్స్ పట్టుకున్నారు ...రైట్ సైడ్ వెళ్ళాలి అని ఈయన ...కాదు స్ట్రైట్ గా వెళ్ళాలి అని ఆవిడ .. మొత్తానికి కేబ్ వాడు ఏదో కనుక్కొని మీరు చెప్పిన గార్డెన్ క్లోజ్ చేసేసాడటండి ఇక్కడ ఆర్చాడ్ విల్లే అని ఒకటి ఉంది అక్కడికి పొండి అని దింపేసి వెనక్కి చూడకుండా పారిపోయాడు...



క్రిందకు దిగగానే మా ఆయన ముందు జాగ్రత్తగా దండకం మొదలుపెట్టేసారు ..నీవల్లే ...అంతా నీవల్లే ...అడ్వెంచర్ పార్క్ కి వేళదామే అంటే నా మాట విన్నావా అని తిట్లు...."గాడిద గుడ్డేం కాదు నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఇంకెవరి నైనా కనుక్కోండి అని నా మాట విన్నారా? అంత పెద్ద గార్డెన్ అలా ఎలా మూసేస్తాడు " నేనూ తిరగబడిపోయాను....మా ఆయనతో గోడవపెట్టుకునే విషయంలో నేనేమాత్రం మొహమాటపడను .. వెంటనే ఇద్దరూ మళ్ళీ సెల్ ఫోన్స్ తీసారు మెప్స్ ఓపెన్ చేయడానికి ... అక్కర్లేదు ..మీ ఫ్రెండ్స్ ని ఎవరినన్నా కనుక్కోండి అన్నాను కోపంగా... అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఆర్చాడ్ గార్డెన్ అనేది ఒకప్పుడు ఈ చుట్టుప్రక్కల ఉండేది అది ఇప్పుడు క్లోజ్ చేసేసారు... మేము వెళ్ళాలనుకున్న పార్కుని బొటానికల్ గార్డెన్ అనాలి( ఈ విషయం అందరికీ తెలుసుకాని టైంకి హోల్సేల్ గా మర్చిపోయాం :)) ..... అది ఇక్కడ కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ తప్పు మా ఆయనదే అని సెల్లుగుద్ది మరీ చెప్పేరు ....సో .. బాల్ నా కోర్టులో పడేసరికి ఇంటికి వెళ్ళేవరకూ ఆడుకోవలసి వచ్చింది..



ఇంతకు విల్లేకి వెళ్లాం అని చెప్పాను కదా ... ఏమిటా అది అని చూస్తే ఏమీలేదు నలబై కుండీలు ,నాలుగు రకాల మొక్కలు వేసి అమ్ముతున్నాడు వాడు.. వాటిని చూడగానే నీరసం ,దుఃఖం ఒకేసారి పొంగిపొర్లాయి ... కాని ఏం చేస్తాం నాలుగు పువ్వులనే అలా అలా ఫొటోస్ తీసా..హి హి హి హి ఇప్పుడు అర్ధం అయ్యిందా ఈ పోస్ట్ ఎందుకు వేసానో... తప్పు.. మంచిపిల్లలు అలా ఏడుపు మొహాలు వేసుకుని చూడకూడదు..ఫొటోస్ లాస్ట్లో పెడాతానేం..



సరే ఈ ఫొటోస్ అన్నీ తీసాకా అర్ధం అయిన విషయం ఏమిటంటే మేము పెనం మీదనుండి పొయ్యిలో పడ్డామని ... అదో చిన్న సైజు అడవిలా ఉంది..ఎటు చూసినా వానరాలు ...నో బస్సులు, నో కేబ్స్ నతింగ్ అంతే ...మండుటెండలో అలా నడుస్తూ, నడుస్తూ మొత్తానికి ఒక బస్ స్టాప్ కొచ్చాం ... మా ప్లాన్ ఏమిటంటే అక్కడ బస్ ఎక్కేసి కాస్త సిటీలా ఉన్న ప్లేస్లో దిగిపోయి ఏదో ఒక కేబ్ పట్టుకుని ఇంటికోచ్చేద్దాం అని .... ఇంతలో బస్ వచ్చింది బ్రతుకు జీవుడా అని బస్ ఎక్కాం.... ఎక్కిన పావుగంట అయ్యాకా తెలిసొచ్చింది ఆ రోజు అట్టాంటి ఇట్టాంటి మామూలు రోజు కాదని...ఆ బస్ మళ్ళీ జూకి -విల్లేకి, విల్లేకి - జూకి గింగిరాలు కొడుతుంది.ఓర్నాయనో ఇదేక్కడ గొడవరా బాబు అని మధ్యలో వచ్చిన మరో బస్ స్టాప్లో దిగిపోయాము .... మాకు ఇక్కడ ప్రతి స్టాప్ లోనూ బస్లు ఎక్కడికి వెళతాయో మేప్ ఉంటుంది ...చూస్తే అందులో ఒక్క ఊరు తెలిస్తే ఒట్టు.. కాసేపు వెయిట్ చేసి వేరే బస్ ఎక్కి కాస్త కార్లు గీర్లు కనబడుతున్న సిటిలా ఉన్న ప్లేస్ లో దిగి కేబ్ కోసం గంట వెయిట్ చేసాం ....ఒక్క కేబ్ లేదు ఆ దారిలో ...వచ్చినా జనాలు ఉన్నారు ...దెబ్బకు నీరసం వచ్హ్చేసింది ...ఇలాక్కాదని మళ్ళీ మరో బస్ ఎక్కించి మరో ప్లేస్లో దింపారు మా ఆయన ..అక్కడ కేబ్ దొరికి "దేవుడా " అని ఒక దండం పెట్టుకుని ఊపిరి పీల్చుకున్నానో లేదో అనుష్కా మళ్ళీ నవ్వింది ..... " పాపం పిల్లలని ఊరికే తిప్పాం బీచ్ కి వెళదామా గాలిపటాలు ఎగరవేద్దాం "అన్నారు మా ఆయన ....



గాలిపటాలు వద్దు చిత్రపటాలువద్దు నావల్ల కాదు ...మర్యాదగా ఇంటికి తీసుకువెళ్ళండి అనగానే మా అబ్బాయి..." బేడ్ మమ్మీ "అని బిరుదు ప్రదానం చేసాడు..మా అమ్మాయి దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మమ్మీ నువ్వు కైండ్ లెస్ అని నిష్టూరం చేసింది.. మళ్ళీ నేరుగా బీచ్ కి వెళ్లాం.. అక్కడ కాసేపు పిల్లలు ఆడారోలేదో మా వాడు ఎలా తగిలించుకున్నాడో దెబ్బ తెలియదు... కాలి నిండా రక్తం రక్తం ....అసలే మావాడికి జలుబు చేసిందంటే ఇంటిల్లిపాదికీ జ్వరాలు వచ్చేస్తాయి...ఆ రేంజ్లో వేపుకు తినేస్తాడు...మా అమ్మాయి సైకిలింగ్ సైకిలింగ్ అంటుంటే తోలు తీస్తా ఇక పదండి అని మళ్ళా కేబ్స్ పట్టుకుని ఇలా ఇంటికొస్తున్నామో లేదో అర్జెంట్గా ఆఫీస్కి రా అని మెసేజ్ .... పాపం అటు నుండి అటే మా ఆయన ఆఫిస్కి బయలుదేరారు...

అలా ఆ రోజంతా డబ్బులిచ్చి మరీ తన్నిన్చుకున్నట్లు అయిపొయింది.. కాబట్టి టైం బాగోపోతే పండు వెన్నెలలో కూర్చున్నా మండుతెండల్లో మాడిన కాకుల్లా గిల గిలలాడతాం అన్నమాట ...


ఇవన్నీ ఆర్కిడ్ పువ్వుల్లో రకాలన్నమాట



కుళ్ళుతున్నారుకదా..నేచురల్ ..మీకు అలా అనిపించడంలో పెద్దగా వింతేం లేదు ..



ఇవేమో తెల్ల ఆర్కిడ్లు... బాగున్నాయి కదా



చెప్పేనుకదా పువ్వు పుట్టగానే పరిమళించినట్లు కొంతమంది కెమెరా చేతిలోకి రాగానే గుభాళించేస్తారు అంతే....



ఈ ఫొటోస్ చూసి మా ఆయన డొక్కులా ఉంది అన్నారు...ఏం కాదుకదా బాగుందికదా



ఇవో రకం



ఇది సూపర్ వచ్చింది కదా ...అంటే ఇవినా మనసులో మామాటలు కాదు మీ మనసులోవి..నాకు వినబడిపోతున్నాయి ఇక్కడికి


పాపం ఇది పువ్వు బాగానే ఉంది..కెమేరాకే ఏదో అయ్యింది ...కొద్దిగా మసగ్గా వచ్చింది ..ఏం పర్లేదు సర్ధుకుపోండి



ఇవేమో కలర్ భలే బాగుందిలే



అంటే ఇది పర్లేదు అనుకోండి పై ఫొటోస్ కంటే పెద్ద గొప్పగా ఏమీ లేదుకదా...ఒక్కోసారి పువ్వులు బాగున్నా సరే ఫొటో బాగా వస్తుంది .. అంటే నేను తీయలేదన్నమాట ఇది ...



ఇదేమో ఇంటికి ఎలా వెళ్ళాలో మా ఆయన ఎంక్వయిరీ చేస్తున్నపుడు రోడ్ ప్రక్కన కనబడితే తీసేసా..



ఇది బస్ స్టాప్ దగ్గర .... అక్కడెక్కడో ఉంటే జూం చేసి తీసాను



నేను చెప్పానా అది అంతా అడవిలా ఉంది అని ..నేను చెప్తే నమ్మారా? అందుకే ఈ ఎవిడెన్స్


పద పదవే వయ్యారి గాలి పటమా



35 కామెంట్‌లు:

శశి కళ చెప్పారు...

AYYA,MODATI COMMENT NADENNANNA MATA.
ala serious gaa choodavaakandi.naa boni manchide.superrrrrrrrrrrr
memu kooda thittukovaalani anukunna rojulni meere thittesaru.sasi.

హరే కృష్ణ చెప్పారు...

వారాంతం పోస్ట్ :)
మొదటి కామెంట్ కొట్టేసారు sasi

హరే కృష్ణ చెప్పారు...

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది రెండో సారి నుంచి మాత్రం ఎదురు ఉండదు అంతే
చాలా చక్కగా తీసారు ఫొటోస్
ముఖ్యంగా మొదటి మూడు ఆర్కిడ్ ఫోటోలు వజ్రాయుధం లా భలే మెరిసిపోతున్నాయి
violet డి ఎన్ను తీయలేదు అని ఎందుకు చెప్పితిరి ఈ ఈ..అది మీరే తీసారు అంటే అంటీ బ్లాగు బాష ఇది ఒకటికి పది సార్లు నిజం అని చెప్పేస్తాం అది నిజం కేక ఆ ఫోటో
జూమ్ బాగా చేసారు ఆ పసుపు పచ్చ ఫోటో తుమ్మెద లేకపోయినా కూడా అందం గా ఉంది
ఏం కాదుకదా బాగుందికదా..చాలా చాలా బాగుంది :)

హరే కృష్ణ చెప్పారు...

ఇది సూపర్ వచ్చింది కదా ...అంటే ఇవినా మనసులో మామాటలు కాదు మీ మనసులోవి..నాకు వినబడిపోతున్నాయి ఇక్కడికి
:D :D

రాధిక కిరణ్మయి చెప్పారు...

ఫొటొలు బాగున్నాయి :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ బాగుంది నేస్తం.. కొన్ని పంచ్ లు అదిరాయ్.. సరదాగా స్మూత్ గా చదివించేశారు.. ఫోటోలకన్నా వాటికి మీరు పెట్టిన వ్యాఖ్యలు బాగున్నాయ్ :-) (అదుగో అదేమరి నిజం చెప్తే అలా కోపంగా చూడకూడదండీ :-P

Ennela చెప్పారు...

ప్రతి సారీ అన్నీ బాగుండడం -నథింగ్ స్పెషల్..
ఎన్ని జరిగినా మీరు మంచి ఫొటోలతో ..మంచి పోస్టు పెట్టారుగా...అది సంథింగ్ స్పెషల్.

Suma చెప్పారు...

Singapore naga sandarsanam ayindi annamata.

Post modalu ninchi nenu anukuntune unna.. Botanical garden ani cheppakunda Orchid garden ante ela telustundi ani.. Nenu kuda singapore vachina kotallo ilane tappipoyanu.

Boon tiong road ante vaadu Boon keng road ki pattu kelaaadu. naa bhasha vadiki raadu vaadi singlish naku radu :)

తృష్ణ చెప్పారు...

"చిరునవ్వుతో" సిన్మాలో బ్రహ్మానందం గుర్తుకువచ్చాడు...:)))

Nice photos. Thanks for those nice flowers !

నేస్తం చెప్పారు...

శశిగారు అవుననడి మొదటి కామెంట్ మీదే పార్టీ ఇవ్వాలి మీరు :)

>>>.violet డి ఎన్ను తీయలేదు అని ఎందుకు చెప్పితిరి ఈ ఈ
ఎందుకు చెప్పానంటే గబుక్కున ఆ ఫొటొని పొగిడేస్తే అందుకే అన్నమాట..:)

రాధిక గారు ధన్యవాదాలండి :)

వేణుగారు సరే కానివ్వండి..అరచేతితో కెమేరా ప్లాష్ ని అడ్డుకోలేరండి ....

నేస్తం చెప్పారు...

ఎన్నెల గారు అవునడి ముందు తిట్టుకున్నా అదో పోస్ట్ అయి కూర్చుంది :)
సుమగారు నేను అయితే ఇలా ఎన్నిసార్లు వేరే ప్లేస్ కి వెళ్ళిపోయానో ... ఒక్కోసారి పరధ్యానం వల్ల కూడా తెలియని స్టాప్ లో దిగి కేబ్ దొరక్కా నానాపాట్లు పడి ఇంటికి వచ్చేదాన్ని.. :)
తృష్ణ గారు ఎందుకని గుర్తొచ్చాడు నాకు అర్ధం కాలేదు.... ఆ సినిమా వేణు దే కదా..? ఫొటోస్ బాగున్నాయి అన్నారుగా బోలెడు ధన్యవాదాలు

నేను చెప్పారు...

Watch from 3:00
http://www.youtube.com/watch?v=sOMNq4Tjl2I

నేస్తం చెప్పారు...

బద్రి గారు థేంక్యూ థేంక్యూ.. తృష్ణగారు ఏం ఉదాహరణ చెప్పారండి ...:))))

నేను చెప్పారు...

బద్రి "గారు" :((((

నేస్తం చెప్పారు...

:))

vani చెప్పారు...

enti veetini chudataniki enni kastalu paddara??? evi india lo road pakkana unde pichi mokkalu... lol just kidding... sorrry

మనసు పలికే చెప్పారు...

అక్కా.. ఇది దారుణం, అన్యాయం, నేరం, ఘోరాతి ఘోరం..:( వీకెండ్ రోజులు చూసుకుని పోస్ట్ వేస్తారా..? ఇలా యితే ఎలా ఫస్ట్ కామెంట్ కొట్టేది అని కొశ్చెనింగ్ అధ్యక్షా..;);)

అన్ని ఫోటోలు సూ..పర్ అక్కా.. ఇంకా ఆ ఫోటోలకి మీ కామెంట్లు ఉన్నాయి చూడండి అదుర్స్;) నేను మాత్రం ఆ ఒక్క ఫోటో ఉంది చూసారూ, అదే మీరు తియ్యని ఫోటో, దాన్ని అస్సలు పొగడలేదు మనసులో కూడా ;);)

రాజ్ కుమార్ చెప్పారు...

అయ్యో..అయ్యో..అయ్యయ్యో... వీకెండ్ పోస్ట్ వీక్డేస్ లో చదువుతున్నానా.. వాఆఆఅ...వాఆఆ..

పాపం ఆరోజు అలా జరిగింది అన్నమాట. కొన్ని రోజులంతే నండీ దరిద్రం డిస్కో డ్యాన్స్ ఆడుతుందీ.. ;(

>>>సెల్లుగుద్ది మరీ చెప్పేరు
బాల్ నా కోర్టులో పడేసరికి ఇంటికి వెళ్ళేవరకూ ఆడుకోవలసి వచ్చింది (ఆడుకునే అవకాశం వచ్చిందీ????)
అనుష్కా మళ్ళీ నవ్వింది
టైం బాగోపోతే పండు వెన్నెలలో కూర్చున్నా మండుతెండల్లో మాడిన కాకుల్లా గిల గిలలాడతాం>>>

ఇలాంటివి చదివినప్పుడు అనిపిస్తుందీ.. "నేనూ..జాజిపూలు బ్లాగ్ చదివాను..ఓ బ్లాగ్ మొదలెట్టానూ" అని. హిహిహిహి

ఇక కుఠోలు..కేక..కామెంట్లు కేక స్క్వేర్. అర్జెంట్ గా ఫోటో బ్లాగ్ పెట్టాల్సిందిగా (మన రాజేశ్ గారికి పోటీగా ;)) జాజిపూలు అభిమాన సంఘం తరుపున కోరడమైనది.

ఇట్లు
ఒకానొక గొఱెపిల్ల

kiran చెప్పారు...

>>కసాయివాడిని నమ్మిన గోర్రేపిల్లల్లా ఎంత ముద్దుగా కనబడుతున్నారో నాకళ్లకు..... hehe
>>>పర్స్ ఒక్కటే పోయిందంట ....వాళ్ళ ఫ్రెండ్స్వి పర్సులు ,ఐ ఫోన్స్ తో సహా ఎత్తుకుపోయాడంట - hahahahahahahahhaahahah..
>>>కుళ్ళుతున్నారుకదా..నేచురల్ ..మీకు అలా అనిపించడంలో పెద్దగా వింతేం లేదు ..ఎన్ని సార్లు కుల్లుకోం నేస్తం గారు...ఎన్ని సార్లు??..చెప్పండి మీరే..:P
ఫోటోలు అదుర్స్..అన్నీ...మసకగా ఉన్నవి కూడా..మీరు తీయనివి కూడా..:)

శివరంజని చెప్పారు...

అయ్యో అక్కా అనగనగా ఒక రోజు లో ఇన్ని కష్టాలా :(:(:(.......

నువ్వు సూపర్ తీస్తున్నావు అక్కా ఫొటోస్ ...నువ్వు తీసిన ఫొటోస్ చూస్తుంటే నేను కూడా ఒక ఫోటో బ్లాగ్ పెట్టేయాలని ఉంది ..... ఫస్ట్ కామెంట్ పెట్టె చాన్స్ అప్పు కంటే నాకే ముందు ఇవ్వాలి

నేస్తం చెప్పారు...

ఆర్కిడ్లు రోడ్ ప్రక్కన పెరిగే పిచ్చిమొక్కలా?వాణిగారు మీదేం ఊరు :)

>>>>నేను మాత్రం ఆ ఒక్క ఫోటో ఉంది చూసారూ, అదే మీరు తియ్యని ఫోటో, దాన్ని అస్సలు పొగడలేదు మనసులో కూడా ;);)
:)))

>>>మన రాజేశ్ గారికి పోటీగా
రాజేష్ గారికి నా బ్లాగ్ తెలియదుకాబట్టి బ్రతికిపోయారు :)

>>>>>ఫోటోలు అదుర్స్..అన్నీ...మసకగా ఉన్నవి కూడా..మీరు తీయనివి కూడా..:)
కిరణ్ thank you :))
శివరంజని ఫొటో బ్లాగ్ పెట్టేసేయ్ ...నాకు తీయడం వచ్చేంటి కాని వదులుతున్నానా :)

అనుదీప్ చెప్పారు...

అయ్య బాబొయ్ ఎంటండి మీరు ఎండలొ తిరిగారు అని, మమ్మల్ని కూడా ఇలా బ్లొగ్ మొత్తం తిప్పుతార..? :) :)అందుకనె విషయం తెలియకుండా విన్యాసాలకు పొవద్దు అంటారెమొ ...;) ;) మొతానికి నన్ను గొర్రె పిల్లని చెసారు.. ఆఫీస్లొ, అదీ పీక్ హౌర్స్ లొ బ్లొగ్ మొత్తం చదివించారు... మీ బాబు కి దెబ్బ తగలకుండ ఉందాల్సింది... ఎనివె అజ్ యుజువల్ మీ టప అధుర్స్...ఫొటొస్ చాల బాగ వచ్చాయ్ అండి...మీదెనా క్రియెటివిటి?

రాజు గాడు చెప్పారు...

బారులో:
ఒక తెలంగాణా వాడు, ఒక ఆంధ్ర వాడు ఎదురెదురుగా కూర్చొని తాగుతున్నారు. ఆంధ్రా వాడు టేబుల్ పై ఉన్న గ్లాస్ వంక చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. తెలంగాణా వాడు నాల్గు పెగ్గులేసి ఆంధ్రా వాడి వంక చూసి నవ్వాడు. ఆంధ్రా వాడు మొహంలో ఏ భావనా లేదు. గ్లాస్ నే చూస్తున్నాడు. తెలంగాణా వాడు ఆంధ్రావాడి గ్లాస్ గబ్బుక్కున ఎత్తి తాగేసాడు. ఆంధ్రా వాడు జాలిగా మొహం పెట్టాడు. "ఏందయ్యా..ముంగడ నుండి గదే సూత్తున్న..గ్లాసొంక సూడుడు..అలోచిన్చుడు, గ్లాస్ ఎత్తామా తాగామా అన్నట్టుండాలి యవ్వారం " అన్నాడు తెలంగాణా వాడు.

అప్పుడు ఆంధ్రా వాడు "అది కాదండి, ఈ రోజు నాకు దుర్దినం. ..పొద్దునే ఆఫీసు కి వెళితే బాస్ తిట్టాడు. నేను సర్ది చెప్పెంతలో నా చెయ్యి తగిలి అయన కాఫీ అయన లాప్తోప్ మీద పడింది, అది తుడిచే ప్రయత్నంలో నేను వాటర్ని పోసాను. వాటర్ లోనికి పోయి లాప్తోప్ కాలిపోయింది. దీనితో ఆయనకు మండి నన్ను డిస్మిస్ చేసారు. ఉద్యోగం పోయింది అని బాదపడుతూ హోటల్ కి వెళ్ళాను. అక్కడ సర్వర్ నా మీద సాంబార్ వోలకపోసాడు. అది కడుక్కొని అక్కడ ఏమి తినబుద్ది కాక, నా గాళ్ ఫ్రెండ్ కి ఫోన్ చేశాను కొంచం ఓదార్పు ఇస్తుందని. సెల్లు స్విచ్ ఆఫ్ లో వుంది అని సరాసరి తన హాస్టల్ కి వెళ్ళాను. అక్కడ తెలిసింది తన పెళ్లి ఆర్య సమాజ్ లో నా రూమ్మేట్ సోము గాడితో జరుగుతోంది అని...అది తట్టుకోలేక దారిలో పురుగుల మందు కొనుక్కొని, ఇక్కడికొచ్చి ఈ గ్లాస్ మందులో కలుపుకొని, తాగాలా వద్దా అని ఆలోచిస్తూ వుంటే, నా కర్మకు మీరు నాకు అది కూడా దక్కకుండా చేసారు".

నేస్తం చెప్పారు...

>>>>>>>>>అయ్య బాబొయ్ ఎంటండి మీరు ఎండలొ తిరిగారు అని, మమ్మల్ని కూడా ఇలా బ్లొగ్ మొత్తం తిప్పుతార..?
మొతానికి నన్ను గొర్రె పిల్లని చెసారు
>>>>>>>ఎనివె అజ్ యుజువల్ మీ టప అధుర్స్...ఫొటొస్ చాల బాగ వచ్చాయ్ అండి...మీదెనా క్రియెటివిటి?

అనుదీప్ గారు ఇంతకూ మీరు నన్ను తిట్టారా? పొగిడారా? నాకు ఎలాగైనా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ అండి అందుకే పొగిడారని సరిపెట్టుకుంటాను..
:)

అజ్ఞాతగారు ముగాంబే కుష్ హువా...అనగా... అప్పుడెప్పుడో ఎక్కడో బచ్చలి కూర గురించి రాస్తే అది చదివి నాకు కామెంట్ పెట్టారా :) థాంక్యూ థాంక్యూ ...ఇంతకీ విషయం ఏమిటంటే నాకు బచ్చలి కూర ఎలా ఉంటుందో తెలియదు :( పోని ఇలా ఫొటోస్ లో చూసి గుర్తుపట్టేద్దాం అంటే మన వైపు ఆకు కూరలు చూసారా ఎలా ఉంటాయో.. గోంగూరేమో అర చేయంత ఆకు, తోటకూరేమో ఎర్రటి కాడలు ఇలా డిఫ్రెంట్గా ఉంటాయికదా అందుకే అన్నమాట భయం ఏం ఆకు కొనేస్తానో అని...కాకపోతే చిన్న ఇంఫర్మేషన్ ఇవ్వండి మీరు ఎక్కడన్నా టికా దగ్గరకానీ ముస్తఫాలోకాని చుక్క కూర చూసారా?మా ఫ్రెండ్ చెప్పినదగ్గరనుండి ఎప్పటి నుండో తినాలని అది ఎలా ఉంటుందో చూడాలని ఆశ ... :)

సత్యాన్వేషి చెప్పారు...

http://images.google.com/imgres?imgurl=http://99easyrecipes.com/wp-content/uploads/2011/01/wpid-bachalakura.jpg&imgrefurl=http://99easyrecipes.com/bachali-kura-pappu-malabar-spinach-from&usg=__5Rs3rqP0ZIiz8jKsJOH5VtGLx0A=&h=450&w=338&sz=95&hl=en&start=0&sig2=zyrYMCNgFeUVUjmCiv7Orw&zoom=1&tbnid=CdJQVtafPjiwIM:&tbnh=127&tbnw=99&ei=ZMPnTdbYIsedOrXF7cgJ&prev=/search%3Fq%3Dbachali%2Bkura%26hl%3Den%26biw%3D1366%26bih%3D667%26gbv%3D2%26tbm%3Disch&itbs=1&iact=hc&vpx=310&vpy=168&dur=32&hovh=259&hovw=194&tx=102&ty=139&page=1&ndsp=28&ved=1t:429,r:8,s:0&biw=1366&bih=667

for bachali kura

నేస్తం చెప్పారు...

Raaju gaaru joke baagundi kaani andra telangana vaalla Polike vaddu annamaata :). Mee comment spam lo vellindandi anduke prachurinchaledu .ippudechoosaa .....

రాజు గాడు చెప్పారు...

నిజమే నేస్తంగారు..ఆంధ్ర తెలంగాణా అని వుండల్సినది కాదు. నేస్తానికి గారు, పెడితే నేస్తం పదం వేల్యూ పోతుంది అనిపిస్తోంది. మా గోదారి జిల్లాల్లో అయితే మా ఆవిడగారు వూరు వెళ్లారు అని కూడా అంటారు ;-) బై ది బై,
మద్యపానం ఆరోగ్యానికి హానికరం

నేస్తం చెప్పారు...

సత్యాన్వేషి గారు థేంక్స్ అండి... ఈ సారి గుర్తుపట్టగలను ఆ ఆకుల్ని :)
రాజు గారు థెంక్స్ అర్ధం చేసుకున్నందుకు .. మధ్యలో ఈ మద్యపానం గొడవేమిటండి

అనుదీప్ చెప్పారు...

అయ్యో... మిమ్మల్ని విమర్షించేంత పెద్దవాడినా నేను... పొగిడానండి బాబు.. మీ బ్లగ్ బాగుంది కాబట్టే, అఫీస్ పీక్ హౌర్స్ అని తెలిసిన కూడా మొత్తం చదివాను.. అంధుకె బ్లాగ్ అంతా తిప్పించారు అన్నాను. :) :) :)

LAKKI చెప్పారు...

First time me blogchusinappudu nenu chala happy ga feel ayyanu. Daggray kurchoni kabrlu chippinatttu.Holidays lo twodays undimottam kadalakunda chadivanu. So nice andi.

నేస్తం చెప్పారు...

అనుదీప్ గారు సరదాగా అన్నాను అంతే అండి
లక్కీ గారు Thank you Thank you

ఇందు చెప్పారు...

నేస్తంగారూ....ఈ టపా ఎప్పుడో చదివాను! అయినా కామెంటుదామనుకునేసరికి ఏదో ఒకపని! రెండుసార్లు వాయిదా పడి..ఇదిగో ఇప్పుడు వీలయింది! ఏమీ అనుకోకండీ....నేనెప్పుడూ అంతే....ఒక పదిసెకెన్లు లేట్ ;)

నాకు పూలు భలే నచ్చేసాయి! మీ ఫొటోలు చూసాక...ఒక ఆర్కిడ్ మొక్కయినా ఇంటికి తెచ్చి పెంచుకోవాలని డిసైడెడ్! అదీ లేవెండర్ ఆర్కిడ్స్ అని కూడా డిసైడెడ్! అంత నచ్చాయి! :)

ఇక మీ కష్టాలు భలే..భలే! అబ్బో...మేమెన్నిసార్లు తిరిగామనుకున్నారు మీలాగ :)) చందుచేతిలో నాకు పిచ్చపిచ్చగా అక్షింతలు పడుతుంటాయ్! ఎందుకంటే..అలా గూగుల్ మాప్స్ చూసి అడ్రస్ చెప్పే డ్యుటి నాదే కాబట్టి! నేను ఏనాడూ సరిగ్గా చెప్పను కాబట్టి! అదీ సంగతి :) సో...ఈ కష్టాలు నాకు కొత్త కాదు ;) నాలాగే మీరు పడ్డారంటే...ఏదో అదో తుత్తి :)))))

మధురవాణి చెప్పారు...

ఫోటోలు సూపర్ గా ఉన్నాయి.. అనగనగా ఒక రోజు లాంటివి చాలా రోజులు వస్తుంటాయి కదా! అప్పుడు పిచ్చెక్కేసినంత పని అవుతుంది. మీరు మాత్రం ఎంచక్కా నవ్వించారు. చిరాకులోంచి కూడా నవ్వు తెప్పించోచ్చన్నామాట! ;)

Ram Krish Reddy Kotla చెప్పారు...

ఒక్కోసారి ఇలాంటి జరిగినప్పుడు కూడా ఎంజాయ్ చెయ్యాలి .... :)

Gopinath చెప్పారు...

mee katha andhrajyothi weekly lo chadivanu oh.... god..... comedy movie chustunnattanipinchindi mee presentation chala bavundi meeru regular ga kathalu raayavachu.....


itlu
mee.... sreyobhilashi...