11, మే 2010, మంగళవారం

జోరుగా హుషారుగా షికారు పోదమా !!!

సింగపూర్లో నా మొదటి సాహసం ఉప్మా చేసి పెట్టడం.అంతకన్నా విచిత్రం మా ఆయన కిక్కురుమనకుండా తినడం..మా ఇంట్లో అందరూ,ఉప్మా అనేపదాన్ని ఏకగ్రీవంగా నిషేదించడమే కాకుండా ఆ పదం వింటేనే ఆమడ దూరం పారిపోతారు మరి ..అంతా బ్రెడ్ ముక్కల మహిమ ..
టిఫిన్ చేసాక మా ఇంటి ఓనర్ ని పరిచయం చేసారు ( ఈవిడ గురించి మరెప్పుడన్నా బోలెడు చాడీలు చెప్పేసుకున్దామే) .ఆ గుమ్మం వరకు వచ్చి' టాటా' చెపుతుంటే ,ఏం క్రిందవరకు రావచ్చుగా అన్నారు. ఇలా నైటీ తోనా?? అన్నాను ..ఏం పర్లేదు, ఇక్కడ ఎవరూ పట్టించుకోరు అన్నారు...ఆహా ..ఎన్నెన్ని విచిత్రాలు జరుగుతున్నాయి ఈ రోజు .. పెళ్లి అయిన క్రొత్తలో ,క్రొత్తలో ఏంటి నా మొహం.. పెళ్ళికి ముందే .. ఎంతో గోముగా ఏమండీ !! నేను పెళ్ళయ్యాకా డ్రెస్ లు వేసుకోవచ్చా ??అంటే మాట మార్చేసేవారు తెలివిగా.. అయినా పట్టువదలని విక్రమార్కిని లా పెళ్ళయ్యాక అడిగితే ..అదికాదు ,మరేమో మా తరం లో నేనే పెద్ద కొడుకుని,నువ్వే పెద్ద కోడలివి.. అందుకే నువ్వు చీరలలోనే కంటిన్యూ అయిపో అని నన్నే ఏమార్చేసిన మా ఆయన.. నైటీ లో బయటకు వచ్చేయమని చెప్పడమా ??ఎంత విచిత్రం అనుకుంటూ క్రిందకు వచ్చేసా..

రాత్రి గమనించలేదు గాని అదంతా ఒక కాలనీ లా ఉంది . చుట్టూ చెట్లతో ఏదో పార్క్ లో ఇల్లు కట్టినట్లే .. ఎటు చూసినా అపార్ట్మెంట్లు.. ప్రతి అపార్ట్మెంట్ క్రింద కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ,టేబుళ్లు..వాటి పై చదరంగపు గడులు.. ముసలి వాళ్ళు ఆడుకోవడానికి అంట ...ఇంకా ఎవరి లెటర్ బాక్స్ లు వాళ్లకు వరుసగా ఉన్నాయి..

ప్రతి బ్లాక్ (అపార్ట్మెంట్) కి ఒక ప్లే గ్రౌండ్ ..పిల్లలకు దెబ్బలు తగలకుండా మెత్తని నేల.. నాలుగైదు బ్లాక్ లకు ఒక జిం .. ఒక పార్క్ .. వాకింగ్ లు ,వ్యాయామాలు గట్రా చేసుకోవడానికి.. మొత్తం దేశం అంతా ఇలాగే ఉంటుందా?? అన్నాను.. ఆ .. సింగపూర్లో ఏ మూలకు వెళ్ళినా ఇలాగే ఉంటుంది .. ప్రతి ఊరు ఒక్కలాగే ఉంటుంది.. ఇక్కడి ప్రభుత్వం ప్రజల హెల్త్ కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంది అన్నారు..ఈ లోపల ఒకటే సౌండ్స్ ..గడ్డి కట్ చేసే వాళ్ళు , రోడ్లు శుబ్రం చేసేవాళ్ళు ,నేలను కడిగేవాళ్ళు .. ఎవరి గోల వాళ్ళది.. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది కాని ఈ శబ్ధ కాలుష్యం ఎక్కువ అని నవ్వారు ... హుమ్ అని నిట్టుర్చాను ...ఎవరో అపార్ట్మెంట్ క్రింద ఉన్న తలుపులు తెరిచి, లోపల ఉన్న బాక్సులను తీసి క్రొత్తవి పెడుతున్నారు .. అవేంటి?? అన్నాను .. అవి చెత్త బాక్స్ లు.. ఎవరి వంటగది లోపల వాళ్లకు ఒక డస్ట్ బిన్ డోర్ ఉంటుంది . దాన్ని తెరిచి తుక్కు పడేస్తాం.. అవి క్రింద ఈ బాక్స్ లలో పడతాయి.. వీళ్లు ప్రొద్దున్న ,మద్యాహ్నం క్లీన్ చేస్తారు అన్నారు..

అబ్బా.. ఎటు వంటి కష్టం లేకుండా భలే అమర్చుకున్నారండి అన్నీ అన్నాను.. ఈ లోపల రోడ్ వచ్చేసింది ... సరే ఇంక నువ్వు వెళ్ళు ,బస్ స్టాప్ కి వెళతా నేను..సాయంత్రం ఒక గంట ముందు వచ్చేస్తాను అలా బయటకు వెళదాం అన్నారు ..' ఊ' అని టాటా చెప్పి వెనక్కి తిరిగి అయోమయం లో పడిపోయాను .. అన్ని అపార్ట్మెంట్లు ఒకలాగే ఉన్నాయి ..అవే లెటర్ బాక్స్ లు ,అవే కుర్చీలు,టేబుళ్లు ..ఇందులో మా ఇల్లు ఏది??అటు ,ఇటు చూసా కంగారుగా .. ఎవ్వరూ లేరు ..నేను ఎవరితోనైనా వెళుతుంటే, కబుర్లు చెప్తూ అనుసరించేస్తుంటా కాని ఎటు వెళుతున్నానో గమనించను .అదే నాతో వచ్చిన పెద్ద చిక్కు ..ఇక్కడ అదేంటో అర్ధం కాదు ఇన్ని కుటుంభాలు ఉన్నా ఒక్కరూ కనబడరు .చిన్నపిల్లల ఏడుపు కాని ,అరుపులు కాని.. ఉహు .. అలా వెతుక్కుంటూ వెళ్ళడం మొదలు పెట్టాను.. మా ఆయన ఆఫీస్ ఫోన్ నెంబర్ కూడా ఇంట్లోనే ఉండిపోయింది ..పైగా చేతిలో పైసా లేదు ఫోన్ చేద్దామన్నా.. రాత్రి మా అపార్ట్మెంట్ నెంబర్ ఎంతో చెప్పారు గుర్తు లేదు.. ఏడుపోచ్చేస్తుంది .. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఆ ముందు రోజు మెట్లదగ్గర పడి ఉన్న సిగరెట్టు ముక్కలు, చెత్త కనబడ్డాయి.. హమ్మయ్యా !!!ఊపిరి పీల్చుకున్నాను ..


సాయంత్రం మావారు రాగానే ఎక్కడికి వెళదాం ??బీచ్ కి వెళదామా అన్నారు.. సరే అన్నాను.. ఆరైనా చీకటి పడకపోయే సరికి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ బస్ స్టాప్ వరకు వచ్చేసాం.. సింగపూర్ లో మరొక మెచ్చుకో తగిన విషయం .. షెల్టర్లు .. ఉన్నట్లు ఉండి వర్షం వచ్చినా తడవకుండా ఇంటికి వెళ్ళిపోవడానికి వీలుగా ఈ షెల్టర్లు ఉంటాయి.. అలాగే ప్రయాణ వాహనాలు కూడా చాలా వీలుగా ఉంటాయి.. ఎక్కడకు వెళ్ళాలన్నా ప్రతి అయిదు ,పది నిమిషాలకు ఒక బస్ కాని ,ట్రైన్ కాని ఉంటుంది .. పైగా ఏ బస్ ఎన్ని నిమిషాలకు ఏ స్టాప్ కి వెళుతుందో,ఎన్ని నిమిషాలకు బస్ వస్తుందో ఇన్ఫర్మేషన్ క్షణాల్లో తెలుసుకోవచ్చు..ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోవడం ఇక్కడి ప్రజలకు ఇష్టం ఉండదనుకుంటా .. ఈలోపల మా వారు బుజ్జీ, ఈ కార్డ్ ఇక నీ దగ్గరే ఉంచుకో అన్నారు ఒక నీలంరంగు కార్డ్ ఇస్తూ ..ఏమిటి ఇది అన్నాను దాన్ని చూస్తూ..ఇదిఫేర్ కార్డ్ ..ఇక్కడ ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా ఇది ఉండాల్సిందే..బస్ లోను,ట్రైన్ లోను ఉపయోగిస్తాం ..మనకులా కండక్టర్ లు ఉండరు అన్నారు ..
ఈ లోపల బస్ వచ్చింది .. ఎక్కిన వాళ్ళందరూ అక్కడ ఒక చిన్న బోర్డ్ పైన ఈ కార్డ్ చూపుతున్నారు..అందులో నుండి 'కీ'అని సౌండ్ వస్తుంది ..ఏమిటండీ అది?? అన్నాను.. దీనిలో డబ్బులుంటాయి ..ఇది ఆ మిషన్ దగ్గర చూపితే అది ఏ స్టాప్ లో ఎక్కావో లెక్క గట్టి, దిగే స్టాప్ లో మళ్లీ చూపినపుడు అన్ని డబ్బులు కట్ చేస్తుంది అన్నారు..నాకు భలే విచిత్రం అనిపించింది ..

ఒకవేళ మనం కార్డ్ తేవడం మర్చిపోతే ??అన్నాను.. అప్పుడు బస్ డ్రైవర్ని అడిగి ఎంత డబ్బులు అవుతాయో అన్నీ అక్కడున్న పెట్టెలో వేయాలి ..అప్పుడు టికెట్ ఇస్తాడు అన్నారు..ఒక వేళ డబ్బులుకుడా మర్చిపోతే?? అన్నాను.. అప్పుడు బయటికి పోమ్మా ..అని మెడ పట్టుకుని తోసేస్తాడు అన్నారు నా తలపై చిన్నగా కొడుతూ..అబ్బా ..ఊరికే అడుగుతున్నాను బాబు ఇంకేం మాయాజాలాలు ఉన్నాయో అని అన్నాను..

బస్ లో చాలామంది చైనా వాళ్ళు ఎక్కుతున్నారు ,దిగుతున్నారు ..ఒక్క రైనా డ్రైవర్ కళ్ళు కప్పి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారేమో అని చూస్తున్నా ..ఒక్కళ్ళు కూడా అలా చేయడం లేదు..ఆఖరికి డబ్బై ఏళ్ళ ముసలాయన కూడా మెల్లిగా కార్డ్ టేప్ చేసి వస్తున్నాడు ..నాకు చాలా ఆక్చర్యం అనిపించింది..

ఏమండి ,ఒక వేళ టికెట్ తీసుకోకుండా డ్రైవర్ కి తెలియకుండా ట్రావెల్ చేసాం అనుకోండి అప్పుడేమవుతుంది?? అన్నాను.. ఏంటే ,ఇందాకడ నుండి చూస్తున్నా, కొంపదీసి అలా చేద్దామని అనుకుంటున్నావా ఏంటి ??కంగారుగా అన్నారు.అబ్బా ,అడిగి తెలుసుకుంటున్నా అండీ అన్నాను.. ఒక్కోసారి టికెట్ కలెక్టర్ వస్తాడు ..అతను మన కార్డ్ చెక్ చేస్తాడు అన్నారు.ఒక వేళ మనం టేప్ చేయకపోతే పోలీసులకు చెప్పేస్తాడా?? అన్నాను.. లేదు.. ఛీ !! నీదీ ఒక బ్రతుకేనా అన్నట్లుగా ఒక లుక్ ఇస్తాడు అంతే అన్నారు..'ఓస్ 'ఈ మాత్రం దానికే వీళ్లు ఇంత భయపడిపోతున్నారా!! హుమ్.. ఎలాగైనా ఈ దేశం ఇంత అభివృద్ది చెందడం లో ప్రజల పాత్ర ఎంతైనా ఉంది అనిపించేసింది ..

మా ఆయన కాసేపటికి నీ ప్రక్కన ఉన్న బటన్ నొక్కు అన్నారు.. ఏంటండి ఇది అన్నాను.. అది నొక్కితే డ్రైవర్ దగ్గర లైట్ వెలుగుతుంది ..అంటే రాబోయే స్టాప్ లో మేము దిగిపోతున్నాం ఆపు అని చెప్పడం.. అదే స్టాప్ లో ఎవరూ దిగడం ,ఎక్కడం చేయలేదనుకో ముందుకి వెళ్లి పోతాడన్నమాట ..టైం వేస్ట్ కాకుండా ప్రతి సీట్ దగ్గర ఈ బటన్స్ ఉంటాయి అన్నారు..భలే ఉంది అనుకునేంతలో స్టాప్ వచ్చింది దిగిపోయాం..అలా నడుచుకుంటూ బీచ్ దగ్గరకు చేరుకున్నాం ..'ఈస్ట్ కోస్ట్ పార్క్ ' ..సైకిలింగ్ చేసేవాళ్ళు ,గుజ్జన గూళ్ళు కట్టే వాళ్ళు, సముద్రం లో విన్యాసాలు చేసేవాళ్ళు , అలలతో ఆడేవాళ్ళు ..చాలా మంది రకరకాల వ్యాపకాలలో ఉన్నారు .. రా ..ఆ రాళ్ళ పై కూర్చుందాం అన్నారు.. నాన్న గుర్తు వచ్చారు.. ఎప్పుడన్నా సముద్ర తీరం వెళితే దూరం నుండి చూపించి అదే సముద్రం,ఇవే అలలు అని చూపించేవారు.. లోపలికి దిగని చ్చేవారు కాదు.. ఈ మాత్రం దానికి ఇంట్లో టివిలో చూడచ్చు కదా ..ఇంత దూరం రావాలేంటి ? నా ఆఖరు చెల్లి విసుక్కునేది..ఎందుకో నవ్వొచ్చింది ..వద్దులే ఇక్కడే కూర్చుందాం అన్నాను ..

నాకెందుకో అంత అందం గా అనిపించలేదు ఇక్కడ .. ఇండియాలో అయితే మనిషంత అలలు ఎగసి పడతాయి..ఇక్కడ నదిలో కెరటాల్లా అలా పాదాలకు తాకుతున్నాయి అంతే.. చాలా మంది చైనీయులు పిల్లలతో చేరారు .. ఏ జంట చూసినా అబ్బాయిలు పిల్లలని ఎత్తుకోవడమే ..అమ్మాయిలు కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు.. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పగలైనా ,రాత్రి అయినా ఆ హుషారు అలా మెయింటైన్ చేస్తారు ..పైగా ప్రొద్దున నుండి రాత్రి వరకు తల పైన ఒక్క వెంట్రుక చెరగకుండా జాగ్రత్త పడతారు.. పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నా ఇక్కడి అమ్మాయిలకు అసహ్యం గా, ఎబ్బెట్టుగా ఉండదు.. వారి శరీర సౌష్టవం అలా ఉంటుంది కాబోలు..

ఆ ప్రక్కన ఏదో ఫుడ్ కోర్ట్ జనాలతో కళ కళ లాడుతుంది .. నాకు ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏమిటంటే .. ప్రజలు ఫుడ్ కోర్ట్ ఉంటే చాలు ఈగల్లా ముసిరిపోతారు.. ఇంక ఎప్పటికి తిండి దొరకని వారిలా ఏ మార్కెట్ లలో చూసినా , షాపింగ్ మాల్స్ చూసినా,హోటల్స్, ఎటు చూసినా జనాలే.. ఇంట్లో ఉదయం పూట ఎవరూ ఉండరు ..అందుకే అంత నిశ్శబ్దం గా ఉంటుంది అపార్ట్మెంట్స్ దగ్గర..కాకపొతే తిండికి,అందానికి,ఆరోగ్యానికి వీరిచ్చే ప్రాధాన్యత ఇంకెవరు ఇవ్వరేమో ...

అలా కాసేపు నడుచుకుంటూ వెళుతుంటే కొందరు నవ్వుతూ పలకరిస్తున్నారు ..ఇంకొందరు మనం తగిలితే మైల పడిపోతాం అన్నట్లు తప్పుకు వెళుతున్నారు.. యువజంటలు మాత్రం ఈ లోకాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు .. ఇదేంటండి !!వీళ్ళకు అమ్మా,నాన్న చూస్తారేమో అని భయం ఉండదా!! అన్నాను.. వాళ్లకు తెలియక పొతే కదా భయపడటానికి.. ఇక్కడ ఒక వయసు వచ్చేసరికి అమ్మాయి ,అబ్బాయిలు ఎవరో ఒకరిని పార్టనర్ గా ఎన్నుకుంటారు..తల్లిదండ్రులు చూడరు.. ఒకవేళ చూసుకోక పొతే వాళ్లకు సరి అయిన పాట్నర్స్ దొరకడం కష్టం అవుతుంది ... అందుకని తల్లిదండ్రులే ఎవరినన్నా ప్రేమించన్డో అని పోరతారు అన్నారు ..

ఇదేమి సంస్కృతీ అండీ బాబు.. మరి చదువులు, చట్టుబండలు ఎలా సాగుతాయి ఇలా చిన్న వయసులోనే ప్రేమించేస్తే ??అన్నాను.. అందుకే గా ఇక్కడ మనలాంటి వాళ్ళు బ్రతకగలుగుతుంది.. ఇంటర్ అవ్వగానే ఇక్కడ తప్పని సరిగా మిలటరీ లో చేరాలి ..రెండు సంవత్సరాలు గవర్నమెంట్ బాగా తర్ఫీదు ఇస్తుంది.. ఈ లోపల వాడికి చదువు మీద ఇంటరెస్ట్ పోతుంది..వీడి మీద బెంగతో ఆ పిల్ల చదువు ఆపేసి ఏ చిన్న ఉద్యోగంలోనో సెటిల్ అయిపోతుంది.. అందుకే ఇక్కడ అతి తక్కువ మంది ఉంటారు పెద్ద లెవల్ లో ఉన్నవాళ్ళు అన్నారు..అక్కడి నుండి ఇద్దరం MRT (రైల్వే స్టేషన్ )కి వెళ్లాం..నాకు బస్ కంటే ట్రైన్ బాగా నచ్చింది.. చల్లగా ,విశాలంగా ,శుభ్రంగా ఉంది.. టికెట్స్ తీసుకోవాలన్నా,కార్డ్స్ లో డబ్బులు ఫిల్ చేయాలన్నా అన్నీ మిషన్ల ద్వారానే.. బస్ లోగాని, ట్రైన్ లో గాని తినడం,తాగడం నిషేధం ..

అన్నిటికంటే నచ్చిన విషయం ముసలివాళ్ళు,చిన్నపిల్లల తల్లులు,ప్రెగ్నెంట్ అయిన వారు వస్తే లేచి సీట్ ఇచ్చేస్తున్నారు.. ఇక్కడ ఎంత దూరం వెళ్ళాలన్నా గంటన్నరలో వెళ్ళిపోతాం..చిన్న దేశం కదా .. సరదాగా అనిపించింది..అలాగే ట్రైన్ కూడా.. అయితే అండర్ గ్రౌండ్ లోనో లేదా బ్రిడ్జ్ పైనా తప్ప రోడ్ మీద ప్రయాణం చేయదు ..ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ..కొన్ని చోట్ల భూగర్భం లో రెండు అంతస్తుల్లో రైల్వే మార్గాలు వేసి
ఉన్నాయి .. చక్కని ప్లానింగ్ ఉన్న దేశం..బస్సు స్టేషన్ ,రైల్వే స్టేషన్ ఎప్పుడూ ప్రక్క ప్రక్కనే ఉంటాయి. ఏ ఊర్లో అయినా సరే ..ఆతరువాత మావారు పని చేసిన ఆఫీస్ చూపించి 'రాఫిల్స్ ప్లేస్' తీసుకు వెళ్ళారు .. ఆకాశాన్ని అంటేంత బిల్డింగులు గట్రా అలా చూస్తూ ఉండి పోయాను..

64 వ్యాఖ్యలు:

Raghav చెప్పారు...

he he this time am first :)

శివరంజని చెప్పారు...

నేనే ఫస్ట్

శ్రీనివాస్ చెప్పారు...

సగం సింగపూరు మీ టపాలోనే చూపించేస్తున్నారు బ్లాగుంది .
@ ఇదేంటండి వీళ్ళకు అమ్మా,నాన్న చూస్తారేమో అని భయం ఉండదా!! అన్నాను

అమ్మానాన్న చూడకపోతే పర్లేదా .. తూచ్ నాకేం తెలీదు

Shiva చెప్పారు...

మీరు చక్కగా రాస్తారు నవ్వించేలా! ఇదేం కొత్త విషయమా అందరికి తెలుసు కదా అన్నట్లు చూస్తున్నారు కదా. కాని నాలాంటి వాళ్లను అలరిస్తున్న మీకు అభినందనలు చెప్పాలి కదా కామెంట్ ద్వారా. బ్లాగ్ చదివి ఎంజాయ్ చేస్తూ కామెంట్ అసలు పెట్టకుండా ఉంటే అది పైరసీ తో సమానం అని నా నమ్మకం.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చాలా ఆసక్తిగా ఉన్నాయి మీ కబుర్లు...ఇంతకూ సింగపూర్ భాషని మీరు నేర్చుకున్నారా లేదా? మీరు రాసినవి చూస్తుంటే 'ఇప్పుడే సింగపూర్ ఆన్ సైట్ చాన్స్ వస్తే ఎంత బాగుంటుందో...సిటీ చూసినట్టుంటుంది...ఎంచక్కా మన నేస్తం గారిని కూడా కలిసి ఆవిడ చేసిన ఉప్మా తినొచ్చు' అని అనిపిస్తుందండి..:-)

Harita చెప్పారు...

ఎప్పుడన్నా సముద్ర తీరం వెళితే దూరం నుండి చూపించి అదే సముద్రం,ఇవే అలలు అని చూపించేవారు.. edi chadivi peddaga :)) nenu mottaniki navvinche rakshasivi... singapor chupinchesunnaru

చైతన్య చెప్పారు...

బాగున్నాయి మీ సింగపూర్ కబుర్లు :)
బస్సు, ట్రైన్ సంగతులు చదువుతుంటే నాకు హోల్లాండ్ గుర్తొచ్చింది... అక్కడ కూడా exactly ఇలాగే ఉంటుంది.

3g చెప్పారు...

మీరు చాలా గ్రేట్టండీ........ అన్నీ ఒకేలా ఉన్నా మీ అపార్టుమెంటు వీజీ గా కనిపెట్టేసారు. నేనైతే ఒకసారి ఇలాగే హోటల్ కెళ్లి డిన్నర్ అయిపోయాకా బయటకెళ్లే కంగారులో కిచెన్లోకి వెళ్లిపోయా.
ఈ రూట్లతో యమా కంఫ్యూజన్ నాకైతే.

పవన్ కుమార్ చెప్పారు...

మా స్నెహితుడు ఒకడు సదవడానికి సింగపొర్ కి అప్లై చేస్తె చా అవతలికి పొ. మా దేశం దగ్గరకి కూడా రావద్దని చెప్పి రిజెక్ట్ చెసారంట. వాడికి ఈ పొస్ట్లు చూపిస్తా. ఇలా ఐనా సింగపొర్ చూసినట్టు సంతొషపడతాడు.
మీరు కామెడి లొ జంద్యాల రేంజ్ రీచ్ అయిపొతున్నారు.

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

Nice post as usual.

Unknown చెప్పారు...

భలే వుందండీ మీ దేశం...అక్కడ వుండటం ఇంతగా అలవాటైపోయాక కూడా మీ మొదటి చూపుల్లో అనుభవాలు నిన్ననే జరిగినట్టు రాస్తున్నారు...మీకు జోహార్లు.

మంచు చెప్పారు...

మీరు ఉప్మా చెయ్యడం సాహసం ఎం అవుతుంది.. తిన్న ఆయనది కదా సాహసం

అయినా ఎంటండి మీరు.. మేము నిద్రపొయినప్పుడు పొస్ట్ చేస్తే మాకు ఫస్ట్ కామెంట్ చాన్స్ ఎలావస్తుంది.. ఇది అన్యాయం.. మేం ఒప్పుకోం

Ram Krish Reddy Kotla చెప్పారు...

సింగపూర్ దర్శించాను మీ వల్ల...అపుడే అయిపోయిందా అనిపించేసింది...పాపా, బాబు బాగున్నారా??

Sravya V చెప్పారు...

బాగా రాసారు !
కాని నాకొక డౌట్ " అందుకే ఇక్కడ అతి తక్కువ మంది ఉంటారు పెద్ద లెవల్ లో ఉన్నవాళ్ళు అన్నారు.." ఇది అంత కరెక్ట్ కాదేమోనండి వీళ్ళ మానేజ్మెంట్ స్కిల్స్ చాల బాగుంటై (నేను ఇక్కడ రేస్ గురించి చెప్పటం లేదు సింగపూరియన్స్ గురించి చెబుతున్నాను ) . అంతే కాకుండా perfection కి చాల విలువిస్తారు .
ఈ దేశం లో నాకు నచ్చిన విషయం politicians ఎంత సింపుల్ గా ఉంటారు నేను ఇక్కడి వచ్చిన 2 నెలలకు "మీట్ యువర్ MP సెషన్ అంటె లైట్ తీసుకున్న కాని ఆదివారం 9 గంటలకు వచ్చి తలుపు తట్టి హలో అని పరిచయం చేసుకుంటుంటే షాక్ :) .

అజ్ఞాత చెప్పారు...

అక్క మీరు కేక ...చిన్నతనం లో దూరదర్శన్ లో మూవీ కొసం ఎదురుచూసునట్టు మీ టపా కోసం ఎదురు చూస్తు ఉంటా....ఒక్కోసారి మీ మాటలు గురుతు వచ్చి నా లో నేనే నవ్వుకుంటున్నా.. మీ సింగపూర్ కబుర్లు ఇంకా వినాలని ఎదురు చూసే .........నీ తమ్ముడు

అజ్ఞాత చెప్పారు...

Good but next time before posting please correct errors. The telugu spelling mistakes (due to typing) are like 'panTi kiMda iMguva mukka.' Rest is all fine. No offense. OK? :-)

అజ్ఞాత చెప్పారు...

i love the place at MRT station

హరే కృష్ణ చెప్పారు...

చాలా చక్కగా వర్ణించారు నేస్తం
ఇండియా అయిదేళ్ళు వెనకబడి ఉంది సింగపూర్ తో పోల్చుకుంటే
చాల dedicated గా వర్క్ చేస్తారు కదా సింగపూర్ దేశస్తులు :(
అందరూ అలా ఉండరేమో మరి
మీ టపా ఎప్పటిలానే సూపర్

నాగప్రసాద్ చెప్పారు...

నేస్తం గారు, బాగున్నాయండి, మీ సింగపూర్ కబుర్లు.

మంచు పల్లకీ గారు, ఈ మొదటి కామెంట్ గోల ఏంటి? వామ్మో! ఆస్తిలో నాకన్నా వాటా ఎక్కువ కొట్టేద్దామని ఈ రూట్లో వస్తున్నారా కొంపదీసి.

@శ్రీనివాస్: అమ్మా నాన్న చూడకపోతే ఫర్లేదు. :-). తూచ్ నాక్కూడా ఇంతకు మించి ఏమీ తెలీదు. :-)).

Padmarpita చెప్పారు...

బాగున్నాయి మీ సింగపూర్ కబుర్లు :)

రాజ్ కుమార్ చెప్పారు...

ఎప్పటి లాగానే బాగుంది. ఫ్రీ గా సింగపూర్ చూపించేస్తున్నారు. (చీ నా బతుకు... మీ టపా కి మొదటి కామెంట్ పెట్టే అద్రుస్టం ఎప్పుడో నాకు! )

Rajkumar

నేస్తం చెప్పారు...

రాఘవ్ :)
శివరంజని కాదుగా :)
శ్రీనివాస్ ఇలాంటి డొక్కు ప్రశ్నలు నాకు నచ్చవు బాబు :) యే రొజుల్లో అయినా ప్రేమికులు కాసింత అదుపులో ఉన్నారంటే అమ్మా,నాన్నల భయం అన్నా ఉండాలి సమాజం భయం అన్నా ఉండాలి..అంత పబ్లిక్ ప్లేస్ లో వేషాలంటే సమాజం భయం లేనట్టే కనీసం అమ్మ,నాన్నలకన్నా భయపడాలిగా అని నా ఉద్దేశ్యం ..
శివ >>>బ్లాగ్ చదివి ఎంజాయ్ చేస్తూ కామెంట్ అసలు పెట్టకుండా ఉంటే అది పైరసీ తో సమానం అని నా నమ్మకం.
భలే చెప్పారండీ.. చప్పట్లు ..చప్పట్లు
శేఖర్ కొన్నాళ్ళు టీ వి లో చుసి నాలుగైదు మాండరిన్ ముక్కలు,మలయ్ ముక్కలు నేర్చుకున్నా ..ఆ తరువాత మన తెలుగే వాళ్ళకు నేర్పేయడం ఈజీ అని డిసైడ్ అయిపోయా.. నిజం చెప్పాలంటే ఇక్కడ చూడటానికి పెద్ద ప్రదేశాలు ఏమి ఉండవు మిగతా దేశాలతో పోలిస్తే..కాని ఇక్కడ జాబ్ చేసేవాళ్ళకు మాత్రం చాలా హాయిగా ప్రశాంతం గా ఉంటుంది అన్ని దేశాల కంటే :)

నేస్తం చెప్పారు...

హరిత :) అప్పట్లో నాన్న అలా అంటే చాదస్తం అనుకునే వాళ్ళం.. ఇప్పుడు మా పిల్లల విషయం వచ్చేసరికి అంతకు రెండింతలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం,,
చైతన్య చిన్న దేశాలు అయితే యుద్దభయం.. అగ్ర రాజ్యాల అండదండల పై ఆదారపడటం వంటి వాటిని మినహాయిస్తే ఇలాంటి చక్కని జీవన విధానం అలవరచుకోవచ్చు..
3g గారు గ్రేటా ,పాడా అదృష్టం అంతే.. నాకసలు ఒక రూట్ అలవాటు చేసుకోవాలంటే మినిమం నెల రోజులు పడుతుంది ..అంతెందుకు కళ్ళు మూసి ఇంటివెనుకాతల నించో పెట్టినా ఎక్కడున్నాను అని కంగారు పడిపోతా :)
పవన్ నిజమే ఇక్కడ ఎందుకు వీసాలు ఇస్తారో ఎందుకు రిజక్ట్ చేస్తారో వారికే తెలియదు .. ఆ విషయం లో చాలా ఇబ్బందులు పడాలి..

నేస్తం చెప్పారు...

గణేష్ ధేంక్యూ
స్పురితా నిజం చెప్పాలంటే హడావుడిగా వ్రాయడం వల్ల నేను చాలా పోయింట్స్ వ్రాయడం మర్చిపోయా..నచ్చినందుకు థేంక్స్ :)
మంచు పల్లకి మరి సాహసం అంటే అదే ..మా అత్తగారు మొదటి సారి ఉప్మా చేసినపుడు గ్లాస్ ల్లో పోసి తాగారంట ..మా మావయ్య గారు ఎప్పుడూ ఏడిపిస్తారు మీ అత్తగారి పోలికలే నీవి అని .. మరి అలా చేయకుండా ప్లేట్లోనే తినేలా చేయడం సాహసం కాదేంటి :)
కిషన్ :)
శ్రావ్యా ... నిజమే మానెజ్మెంట్ స్కిల్స్,పని మీద శ్రద్ద .. అవి చాలా బాగుంటాయి కాని చదువు విషయం లో వీళ్ళు చాలా వరకు JC(జూనియర్ కాలేజ్) తో ఆపు చేసి ఎదో ఒక జాబ్లో కంటిన్యూ అయిపోతారు..దానికి చాలావరకు కారణం నేష్నల్ సర్వీస్ ..ఇంటెర్ కాగనే తప్పని సరిగా యువకులు 2 సంవత్సరాలు పూర్తిగా గవరనమెంట్ ఇచ్చే ఈ శిక్షణలో పాల్గోవలసిందే ..అలాగే సంవత్సరానికి నెలో,రెండు నెలలో మళ్ళీ ట్రైనింగ్ కి వెళ్ళవలసిందే ..ఈ రెండూ కాకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ పెద్ద శిక్ష వీళ్ళకు.. స్టాండర్డ్ వయసుకు మించి ఉంటుంది.. చిన్నపిల్లలకే మన గ్రూప్ ఎక్జాం లెవల్ లో చదువు ఉంటుంది.. టెక్స్ట్ బుక్ ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వరు ..ఇవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళిన వారు ఎలాగూ మంచిపొజిషన్ లో ఉంటారు..దానికి తోడు వర్క్ అంటే చాలా బాధ్యతగా వ్యవహరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య :)

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత తమ్ముడూ బోలెడన్ని థేంక్యూలు
అఙ్ఞాత గారు నిజం చెప్పాలంటే నాకూ అదే బాధ.. పోస్ట్ రాయడానికే టైం ఉండటం లేదు.. నాతో వచ్చిన చిక్కు అప్పటికప్పుడు అలా వ్రాసేసి ఇలా పోస్ట్ చేసేస్తా..దానివల్ల తప్పులు వస్తున్నాయి.. మొన్న అవి సవరిద్దామని కంగారులో పోస్ట్ డిలీట్ చేసేసా.. ఇక మీదట ఒక రెండు నెలలు పోస్ట్లు వ్రాయడం ఆపు చేసి తప్పులన్నీ మెల్లిగా సవరించుకోవాలి అనుకుంటున్నా .. సూచనకు ధన్యవాధాలు :)
మరొక అఙ్ఞాత గారు నాకు కూడా ..ఇక్కడ చూడటానికి ఒకేలా ఉన్నా ఒక MRT కి మరొక MRT కి చాలా తేడా ఉంటుంది :)
హరే కృష్ణ ..ఇది చిన్న దేశం.. గట్టిగా హైదరాబాద్ అంత ఉండదు.. అందువల్ల ఇంత అభివృద్ది చెందింది..అందువల్ల ఉద్యోగ అవకాశాలు వీరికి చాలా ఎక్కువ.. భవిష్యత్ భయం ఉండదు.. ఇళ్ళు ,స్కూల్స్ ,హాస్పిటల్స్ ఎక్కడైనా మెరుగైన సేవ అతి తక్కువ ధరలో లభిస్తుంది.. (సింగపూరియన్స్ కే సుమా..) అందువల్ల వీళ్ళు ప్రభుత్వానికి లోబడి పని చేస్తారు..కాని మనకు అలా కాదుగా ..పెద్ద దేశం.. అతి ఎక్కువ జనాభా ..భవిష్యత్ భయం ,అభద్రతా భావన,మన వారసులు సుఖం గా ఉండాలన్న ఆరాటం .. కనుక చిక్కులు తప్పవు

నేస్తం చెప్పారు...

నాగ ప్రసాద్ ఆస్తి విషయం లో నా నిర్ణయం ఆ మద్య మార్చేసుకున్నా.. కాబట్టి మీరు ఎక్కువ ఆశలు పెట్టేసుకోకండి :)
పద్మ థేంక్యూ :)
రాజ్ కుమార్ :D

Shiva చెప్పారు...

తప్పులు సవరించుకోవడానికి రెండునెలలు పోస్ట్లులు రాయను అంటే మేం ఒప్పుకోముగాక ఒప్పుకోం. మీ బ్లాగ్ లో ధర్నా చేస్తాము.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

సింగపూర్ కబుర్లు బాగున్నాయండీ :-) మొత్తానికి రాత్రి తిట్టుకున్న చెత్తే మిమ్మల్ని రష్చించేసిందనమాట :-)

PBVSN Raju చెప్పారు...

మీలో మంచి రచయిత్రి ఉన్నరు.మీరు రచనను సీరియస్ గా తీసుకొంటే ఆంద్రులు చాలా కాలం గుర్తుంచుకొనే రచయిత్రి కాగలరు. నిజం

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

ఇంతమంది కామెంట్లు రాశాకా నేనేం రాయాలి? మళ్లీ రాయకపోతే పైరసీ దోషం వస్తుందేమో నని భయపడి రాస్తున్నాను. :)

తెలియని ప్రదేశం గురించి చెప్తుంటే ఇంకా ఇంకా వినాలని ఉంటుంది. ఆ సక్తి కరంగా రాస్తున్నారు. థాంకూ... :)

Unknown చెప్పారు...

meeku oka nijam telsa..ii roju poddunne..nenu singapore ki vachanu..meeku kanipinchaleda?? :P....anni na kallatho chusinatlundi...

ainaa meeku opika ekkuva andi..intha pedda pedda post lu..alaaa rasestharu telugu lo...nenu rase 4 line laku 4 varala nundi modalu pedthanu ilaa tenglish lo.. :D

శ్రీనివాస్ చెప్పారు...

నావి డొక్కు ప్రశ్నలు అంటారా ఐ హార్ట్ ఏకలింగం వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను ఇక్కడనుండి కదలను

నేస్తం చెప్పారు...

శివ :) ధర్నా చేసినా సరే ..తప్పదు
వేణూ మరి అంతే కదా
రాజు గారు గట్టిగా అనకండీ బాబు.. మా ఆయన పెళ్ళికి ముందు అనుకునేవారట ఎవరినైనా పెళ్ళి చేసుకోవాలి గాని రచయిత్రిని చేసుకోకూడదని.. పాపం బెంగ పెట్టేసుకుంటారు
ప్రేమికుడు గారు నాకు కూడా ఇలా కబుర్లు చెప్పేయడం మహ ఇష్టం :)
కిరణ్ అదే అనుకుంటున్నా మాఇంటిదగ్గర ఉన్న అమ్మాయి అచ్చం కిరణ్ లా ఉందేంటబ్బా అని :)
శ్రీనివాస్ ఓన్లీ కదలకుండా కూర్చోవడమేనా లేక నిరాహార దీక్షలేమన్నా ఉన్నాయా ?? ఉంటే మొహమాటం లేకుండా కానిచ్చేయండి..మరేం పర్వాలేదు ..

ఏక లింగం చెప్పారు...

వార్నీ...మీరేదో అనుకోవడం ఏమిటి? నేనొచ్చి అపాలజీ చెప్పడం ఏమిటి? హమ్మా... ఈ కథలు ఇక్కడ నడవ్వు.

అపాలజీ చెప్పక పోతే ఏంజేస్తావు? మహా అయితే జాజిపూలు బ్లాగులో కామెంట్స్ రాయవు అంతే కదా? సరే రాయకు? నేను మాత్రం అపాలజీ చెప్పను.

నేస్తం గారు... మంచిటపా. నేను కూడా ఎప్పటినుండో నా విదేశీ ప్రయాన/జీవన అనుభవాలు రాయాలి అనుకుంటున్నాను కానీ ప్చ్...కుదరడం లేదు.

priya చెప్పారు...

nestam garu post bavundi:)singpore
kallakukattinatlu chadivistunnaru.waiting for the nxt

సవ్వడి చెప్పారు...

good post nestam garu! inkaa EM ceppaalO teliyaTlRdu. annee aMdarU ceppEsaaru.

Sasidhar Anne చెప్పారు...

Super oo Super.. mee matallu chestalu anni maa amma ni cousin sister ni gurthuku chesthunnayi.. vallu kuda anthey kaburlu modalupeduthey ika aparu..

Akka.. Mee Post chusthe.. Singapore govt ki vasllu chesthunna mistake telisipoyii. jagartha padutharu..

Sai Praveen చెప్పారు...

నేను ఫ్రీగా సింగపూర్ చూసేసానోచ్!!
ఏంటి అందరూ నా వంక అలా చూస్తున్నారు. అందరూ చూసేసారా? :)
ఏంటీ?? రెండు నెలలు విరామమా?
మీ బ్లాగ్ మొదటి సారి చదివినప్పుడు "పెనం మీద నుంచి పొయ్యి లో పడ్డట్టు" వరకు పోస్ట్లు ఉన్నాయి. ఒక పోస్ట్ నచ్చేసి వరసగా అన్నీ చదివేస్తూ కింద కామెంట్లలో అందరూ నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడు అని అడుగుతుంటే నేను నవ్వుకున్నాను. నేను వెయిట్ చెయ్యక్కర్లేదు ఆల్రెడీ బోలెడన్ని రాసేసారు అని. కానీ ఇప్పుడు నేను కూడా అలాగే అనాల్సి వస్తోంది :(

Raghav చెప్పారు...

I may not comment in ur blog regularly, but i'll read ur posts every day again n again. u r simply superb :-)

మిర్చి చెప్పారు...

నిజం చెప్పండి! మీరు సింగపూర్ టూరిజంలో పని చెయ్యటం లేదూ?

Faustin Donnegal

శిరీష చెప్పారు...

అన్ని బ్లాగ్లు చదివేస్తున్నాను ఏమి కామెంట్ చేయను? మాటలకందని భావం , మనసుని కదిలించే భాష ఎన్నో అద్భుతాలతో సాగి పోయే మీ బ్లాగ్ మా లాంటి వాళ్లకి ఎన్నో విందులు చెయ్యాలని కోరుకుంటున్నాను . ఒక చిన్న సందేహం మీ వారి గురించి రాస్తున్నప్పుడు మీ వారి హహభావాలు చూడాలని ఉంది ఫోటో తీసి బ్లాగ్ లో పెట్టరాదు నేస్తం ......

నేస్తం చెప్పారు...

ఏక లింగం గారు మరి వ్రాసేయండి..ఎందుకాలస్యం :)
ప్రియ :) థేంక్యూ
సవ్వడి గారు మెచ్చుకున్నారుగా అది చాలు థేంక్యూ
శసిధర్ అమ్మా,పిన్ని గుర్తు వచ్చినంది అనగానే నాకే బోలెడు గర్వం గా అనిపించేసింది :)
సాయి ప్రవీణ్ ఎంత పని అయిపోయింది.. మళ్ళి ఒక మారు ఫస్ట్ నుండి చివరి వరకు చదివేయండి :)

నేస్తం చెప్పారు...

రాఘవ్ మళ్ళి మళ్ళి చదువుతున్నందుకు ..బోలెడు థెంక్యూలు
మిర్చి గారు మీరు మరీను
శిరీషా hmm ఏం చెప్పమంటారూ..మా వారు అంత ఇంట్రెస్ట్ గా చదవరండి..ఒక వేళ చదివినా ఒక ప్రక్క టీవి చూస్తూ మరో ప్రక్క వార్తలు వింటూ చదువుతారు.. మద్య మద్య వారి గురించి వచ్చినపుడు సన్నగా నవ్వుతారు ..బహుసా నేను ఎలా మాట్లాడుతానో అదే నా శైలి లో కనబడటం ఇంకా కధలు ,కాకరకాయలంటే అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆయన అంత ఆసక్తి చూపరు ..కాకపోతే వ్యాఖ్యలు మటుకూ చదివి ఏడిపిస్తారు..నేస్తం గారు ,నేస్తం గారు అంటూ :)

అజ్ఞాత చెప్పారు...

ఏం జరుగుతోంది ఇక్కడ
జగన్ రోశయ్య లా ప్రెసిడెంట్ పదవి కోసం కొట్లాటలా..హన్నా
అధిష్టానం హై కమాండ్ నిర్ణయం మీదనే ఈ పదవులు ఆధార పడివున్నాయి
నేస్తం గారు మీరు చెప్పండి ప్రెసిడెంట్ పదవి ఎవరికీ ఇవ్వాలో

గీతాచార్య చెప్పారు...

మీరు ఏ పోస్టుకాపోస్టుకి కౌంటర్ పెడతారా?

టపాలు మటుకు టపటపా భలే వ్రాస్తున్నారు. మీరు ఆన్లైన్ కోచింగు పెడితే చెప్పండి. ముందు నాకే ఎడ్మిషన్

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు కధ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం ,హీరోయిన్,సెకరట్రీ ,ప్రెసిడెంట్ ,సభ్యురాలిని అన్నీ నేనే ..ఎవ్వరికీ ఏ పదవులు ఇవ్వదలుచుకోలేదు :)

నాకు నా కౌంటర్ కి అస్సలు ఏ మాత్రం పడట్లేదు గీతాచార్య గారు :(
పదివేలు దాటగానే మళ్ళి మొదటి కొచ్చేస్తుంది ..ఈ బాధ పడలేక క్రొత్తది పెట్టా.. చూద్దాం ఇదన్నా మాట వింటుందో లేదో

Haritha చెప్పారు...

entamma bujji 2 months rest tesukuntara??? ademi kudaradu... time 2 time ma posts maku blog lo ravalisinde... lekunte singapore vachi me enti mundru memanta darna chestam kabadhar ;-)

AK41 చెప్పారు...

Nestam garu
Nenu 1.5 Yrs nunchi Spore lo vutunna.. Mee varnana chala bagundii.
Monna Ma sister SPORE Ela vuntundi ani adigithe MEE BLOG ADDRESS ICHHA Ila vuntundii ani.
Next Time Please SENTHOSA Kaburlu & PICS Pettandii.
Sister Blog:http://nenu-naa-prapancham.blogspot.com
Regards
Anil Sharma

Sasidhar Anne చెప్పారు...

Akka.. inko post kosam waiting..

నేస్తం చెప్పారు...

హరిత అలాగలాగే ..అప్పుడు ఎంచక్కా ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకోవచ్చు :)
ak41 గారు అవునా ..అయితే మన వూరివాళ్ళు చాలా మంది ఉన్నారు బ్లాగ్లోకం లో.. అన్నట్లు మీ చెల్లెలి బ్లాగ్ చూసా .. టెంప్లెట్ సూపర్ ఉంది ..మరి మీరేం మొదలు పెట్టలేదేం ??
శశీ ..పోస్ట్ వేసి వారం కూడా అవ్వలేదు బాబు..ఇలా వారానికో రెండు పోస్ట్లు వేస్తే నీకు పనా...పాటా బ్లాగులు రాయడమే కదా అని దెప్పేస్తారు మా ఆయన .. అలా దొరక్కూడదన్నమాట మనం

Rajendra Prasad(రాజు) చెప్పారు...

చాలా బాగుంది నేస్తం గారు....అందరు అన్నట్టు ఫ్రీ గా సింగపూర్ చూసేసాము అందరము. మీ పోస్ట్లు చదువుతుంటే మనోహరం సినిమాలో లయ, మావిచిగురు సినిమాలో ఆమని, పెళ్ళి పుస్తకం సినిమాలో దివ్యవాణి అందరు గుర్తుకు వస్తారు .... ఇంతకీ బుజ్జక్కా బావ గారిని ఏమని పిలుస్తారు మీరు ....:)

అజ్ఞాత చెప్పారు...

మీ పోస్టులు అన్నే మిస్ అవ్వకుండా చదువుతానండీ
మీ బ్లాగులో నా మొదటి కామెంట్ మాత్రం ఇదే
నాకు తెలుగు టైపు చేయడం ఎలానో తెలియదు ఈ మధ్యనే తెలుసుకున్నాను
ఇకనుండి ప్రతి పోస్ట్ కి తప్పకుండా కామెంట్ రాస్తాను
- దాక్షాయణి

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారూ మీకొక చిరునవ్వు
మీ పోస్ట్ కి రెండు చిరునవ్వులు
మీ లాంటి అన్యోయమైన మైన స్వభావం గల వ్యక్తి ని పొందడం మీ భర్త గత జన్మ ఫలితం
ఈరోజుల్లో కూడా భర్త ని ఇంతగా ప్రేమించే మనుషులున్నారంటే ధర్మం ఇంకా బతికుంది ఏమో
కొంచెం ఎక్కువ అయ్యింది కదా :) :) :)
అందుకే మీ దాంపత్యానికి మూడు చిరునవ్వులు

బాబోయ్ మీ బ్లాగులో కామెంట్ రాయాలంటేనే భయమేస్తోంది మీ అభిమానులంతా మళ్ళీ నా బ్లాగు మీద రక్తాన్ని పీల్చుకొని మీ పేరు మీద రక్తదానాలు చేస్తారేమో అని

-మహిలాజ్నాత

నేస్తం చెప్పారు...

రాజేంద్ర ప్రసాద్..మనోహరం తెలియదు కానీ ,మావిచిగురు ఆమని ఇంకా పెళ్ళి పుస్తకం దివ్యవాణి నాకు ఇష్టం అయిన కేరక్టర్లు..కాని విచిత్రం ఏమిటంటే మా ఆయన కూడా మావిచిగురు లో పాటలు వింటుంటే నేనే గురువస్తానని అంటారు.. అంటే దగ్గరున్నపుడు కాదులేండి.. ఇంక మావారిని ఏమని పిలుస్తా అంటారా ..అన్నీ చెప్పేస్తాం ఏంటి :) సీక్రెట్
దాక్షాయని గారు ఎంతపని అయ్యింది తెలుగు టైపింగ్ రాలేదని ఇన్నాళ్ళూ కామెంటలేదా ?? పోనీలేండీ ఇప్పుడు నేర్చుకున్నారుగా :) అన్నట్లు మీ పేరు భలే ఉందండి..
మహిళా అఙ్ఞాత గారు తొందర పడి అలా నవ్వులు రువ్వేయకండి ..ప్రొద్దున్నే ఫ్రెష్ గా ఒక గొడవ వేసుకుని పంపా ఆఫీస్ కి..రోజుకో కయ్యం పెట్టుకోక పోతే మా ఇద్దరికీ మనః శాంతి ఉండదు .:) ప్రతి భార్యా భర్తలకు ఒకరి పై ఒకరికి ప్రేమ ఉంటుంది ..నేను బ్లాగ్ లో చెప్తున్నా ..మిగిలిన వాళ్ళు మనసులో దాచుకుంటారు అంతే తేడా :)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారు నేస్తం గారు
నేనేమో ఇంటికి వెళ్తున్నాను ట్రైన్ లో ,మరేమో ఇంట్లో ఫ్లైట్ మీద వెళ్తున్నా అని అబద్ధం చెప్పాను
ఇప్పుడు ఇంట్లో నన్ను అడుగుతారు airport లో ఏం చూసావ్ బాగుందా లాంటి ప్రశ్నలన్నీ baggage చెక్ ఇన్ ఇవన్నీ ఎలా ఏవేవో వుంటాయి అంట కదా,నాకేం తెలీదు ప్లీజ్ చెప్పరా
మీ పేరు చెప్పుకొని మిగిలిన రెండు వేలు తో ఎంజాయ్ చేస్తాను
మీ ఫ్లైట్ అనుభావాలు చదివాను చాలా బావున్నాయి,అయినా మొత్తం రాయలేదు
మీరైతే చాల బాగా explain చేస్తారు అద్భుతమైన రచయతలాగా
ఏమని చెప్పాలి వాళ్ళు అడగక ముందే చెప్పేయాలి అప్పుడు నమ్ముతారు
నేస్తం గారు చెప్పండి ప్లీజ్

మీ బ్లాగు పాఠకురాలు
అపర్ణ

నేస్తం చెప్పారు...

అపర్ణ గారు మీరు మరీ అమాయకంగా ఉన్నారండీ ..ఎదుటివాళ్ళకు తెలియనపుడు మన ఇష్టం ఎన్ని కోతలైనా కోసేయచ్చు :) ఎవరు చూసొచ్చేరు ఇప్పుడు మీరు ఫ్లైట్ లో వచ్చారో లేదో ..వెళ్ళి చెక్ చేయరు కదా... అంతగా తరువాత ఎప్పుడన్నా అడిగితే ఎమో నేనెక్కిన ఫ్లైట్ లో అలాగే ఉంది అని దబాయించేయడమే. సింపులూ :)

Harita చెప్పారు...

Enka enni rojulu e shikarlu maku tarvata enti?

పవన్ కుమార్ చెప్పారు...

ఇలా ఎన్ని రొజులు జోరుగా హుషారుగా షికారు వెలతారు. ఇక వెనకకు వచ్చి మీ ఒనర్ మీద చాడీలు చెప్తానని అన్నారుగా అవి చెప్పొచు కదా.
పొని ఇప్పుడు రాయటం కుదరదు అంటె ఎప్పుడు రాస్తారొ అన్నా చెప్పండి.

నేస్తం చెప్పారు...

హరిత,పవన్ హుం ఈ మద్య అసలు ఖాళి ఉండటం లేదు.. ఇల్లు మారాలి...(వెదుక్కోవాలి).. ఇంకొన్ని ప్రొబ్లెంస్ అన్నీ కలిపి ఇంట్రెస్ట్ ఉండటం లేదు.. త్వరలో వ్రాయడానికి ప్రయత్నిస్తాను :)

Unknown చెప్పారు...

నేస్తం గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

శాంతి చెప్పారు...

బాగుంది.. సింగపూర్ గురించి బాగా రాశారు. జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపిస్తోంది మీ పోస్ట్ చదువుతుంటే. ఒక్కోదేశంలో ఒక్కోవిధమైన సంస్కృతి.

నిజానికి మీరు వచ్చి కొన్నేళ్ళు అయినా మీరు వచ్చినప్పటి జ్ఞాపకాలు గుర్తుంచుకుని, మీరు ఇప్పుడే సింగపూర్ వచ్చి అక్కడి ప్రదేశాల గురించి మీవాళ్ళకి ఉత్తరం రాసినట్టుగా రాశారు. చాలా బాగుంది.

శ్రుతి చెప్పారు...

jaajipoolu.blogspot.com Estimated Worth $1357.8 USD
Title జాజి పూలు
Description
Daily Pageview 285
Daily Ads Revenue $1.86

Good value kadaa nestam. marimkemdukaalasyam, add chesukomdi.

చందు చెప్పారు...

need ur comments at my blogs :
http://prasthanatraya.blogspot.com/
http://sarasalalonavarasaalu.blogspot.com/
http://lalithayamini.blogspot.com/

గీతాచార్య చెప్పారు...

ఒక వేళ డబ్బులుకుడా మర్చిపోతే?? అన్నాను.. అప్పుడు బయటికి పోమ్మా ..అని మెడ పట్టుకుని తోసేస్తాడు.

Entha manchaallO :D