31, మే 2010, సోమవారం

కొంచెం ఇష్టం ...కొంచెం కష్టం

'సిమే 'లో ఉన్నది కొద్ది రోజులే అయినా ,ఆ రోజులని భారతదేశపు చరిత్రలో గుప్తుల యుగంని స్వర్ణ యుగం తో పోల్చినట్లు , నా డైరీలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గరోజులు .. అతి ముఖ్యం గా వ్రాయవలసింది నా నిద్ర గురించి..అప్పట్లో నిద్రా దేవి చాన్స్ దొరికిందంటే చాలు జోల పాడటానికి రెడీగా నా వెనుకేతిరుగుతూ ఉండేది..ప్రొద్దున్న ఆరు గంటలకు నిద్రలేచి వంట చేసి,టిఫిన్ పెట్టి ,లంచ్ బాక్స్ తో మా ఆయన్ని 7 గంటలకల్లా ఆఫీసుకు పంపగానే స్నానపానాదులు ముగించుకుని ,పూజ చేసుకుని ఎనిమిది కల్లా టిఫిన్ తినేసేదాన్నా .. అంతే మంచమెక్కి పడుకున్నానంటే మళ్ళా లేవడం, లేవడం మద్యహ్నం ఒంటిగంటకే... భోజనం చేసి మా బెడ్ రూం లోనే ఉన్న పోర్టబుల్ టివి లో ఆ నాలుగు భాషల్లో వచ్చే (తమిళ్,ఇంగ్లిష్,మలయ్,చైనీస్ ) చానెల్స్ ని ఒక రెండు గంటలు చూస్తూ చూస్తూ మళ్లీ నిద్ర పోయి ,అయిదు కల్లా నిద్రలేచేదాన్ని..ఆ తరువాత కాసింత అన్నం ,కూర వండేసి స్నానం,పూజ అయ్యేసరికి మావారు గుమ్మంలో ఉండేవారు ...

ఇద్దరం అలా MRT (రైల్వే స్టేషన్ ) వరకు కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్లి ,అక్కడే ఉన్న చిన్న మార్కెట్ లో మరుసటి రోజుకు కావలసిన కూరగాయలను కొనేవాళ్ళం.. ఒక్కో వంకాయా మోచేతి వరకు ఇంత పెద్దది ఉంటే ,అమ్మ బాబోయ్ !!!మన ఇద్దరికీ ఒక్క వంకాయ తో రెండు పూటలా కూర వచ్చేస్తుందండి అని తెగ మురిసి పోయేదాన్ని.. ఆ హైబ్రిడ్ కాయలు రుచి, పచి ఉండవని తరువాత తెలిసిందనుకోండీ ... ఆ తరువాత ఇద్దరం మళ్లీ కబుర్లేసుకుని ... మావారు తన కాలేజ్ లో ఆయన గారిని ఆరాధించిన అమ్మాయిల దగ్గరనుండి ,అనేకానేక సాహసాల వరకు .. బోలెడు కోతలు కసా బిసా మని కోసేస్తున్నా( ఏమో ఇప్పుడు తలుచుకుంటే అలాగే అనిపిస్తుంది మరి ) అమాయకం గా నమ్మేస్తూ ఇంటికోచ్చేసేదాన్ని ...

అప్పుడు ఎంచక్కా భోజనం తింటూ 'చెస్ ' ఆడుకునేవాళ్ళం .."ఎవరు గెలిచేవారు?? "లాంటి సుత్తి ప్రశ్నలు అడక్కండి..నాకు కోపం వస్తుంది..అసలు నన్ను అడిగితే ,మనం ఓడిపోతేనే కదా ఎదుటి వాళ్ళు గెలిచేది ...అదే మనం గెలిస్తే వాళ్ళు గెలవగలరేంటీ???అదీ పాయింటు ... అందుకే ఒక యాబై సార్లు ఆడితే ,నలబై తొమ్మిది సార్లు నేనే ఓడిపోయేదాన్నిఅన్నమాట .ఆ తరువాతా మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో పది అయ్యేసరికి గాఢ నిద్రలో తేలియాడాల్సిందే... అమ్మాయిలందరికీ కుళ్ళు వచ్చేస్తుంది కదూ ..మరదే, ఒకానొక సమయం లో అసలు ప్రపంచం లో నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరేమో అని పొరపాటున అనేసుకున్నా కూడా..కాని, మళ్లీ అలాంటి మాటలు అనకుండా విధి చాలా జాగ్రత్తలు తీసుకుంది మరెందుకో ???...

సరే విషయంలో కొచ్చేస్తే అంతా బాగానే ఉంది కాని ...ఎప్పుడూ కధలో హీరో ,హీరోయిన్లే ఉంటే బోరు కొడుతుందని అనుకున్నాడో ఏమో ..నాకో విలన్ తయారయ్యాడు..వాడి పేరు సందీప్ ..గుజరాతి.. మా ఓనర్ వాళ్ళింట్లో మరొక రూం లో పేయింగ్ గెస్ట్ ...మరి అతను స్టూడెన్టో లేక జాబ్ చేసేవాడో తెలియదు కాని ఎక్కువగా ఇంట్లోనే ఉండేవాడు ... అతను ,నేను ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోయినా వాడిని చూసి తెగ భయపడిపోయేదాన్ని ..ఇంతా చేసి వాడు ఏం చేసేవాడయ్యా అంటే నన్ను చూసి 'కిసుక్కున' నవ్వడం.. 'ఓస్' .. ఈ మాత్రందానికే అంత భయపడిపోవడం ఎందుకో అని అనేయకండి మరి... పూర్తిగా వినండి ...

మా ఇంట్లో నాలుగు బర్నర్ల స్టవ్ ఉంది అని చెప్పాకదా ... అదేమో ,బటన్స్ ఎక్కడో ఉండేవి,దాని బర్నర్లు ఎక్కడో ఉండేవి..దేనిది దేనిదో మా చెడ్డ కన్ఫ్యూజ్ అయిపోయేది నాకు...పైగా స్టవ్ వెలిగించడానికి లైటర్ రూపంలో మరొక బటన్ ..అసలే నిద్ర మత్తులో వంటేమో.. సరిఅయిన నాబ్ తిప్పి ,లైటర్ బటన్ ప్రెస్ చేసి స్టవ్ వెలిగించే సరికి, నాకు తాతలు దిగివచ్చేవారు కొద్ది రోజుల పాటు.. సరిగ్గా అదే సమయానికి కిచెన్ దగ్గర బాత్రుం లోకి వెళుతూ నా పాట్లు చూసి, అసలేమాత్రం మర్యాద లేకుండా కిచ, కిచమని నవ్వుతూ వెళ్ళేవాడు ఆ అబ్బాయి .. అదొక్కటేనా ..ఆ వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం మరొక యజ్ఞం ... దాన్ని 'ఆన్ ' చేయడానికి దాని చుట్టూ మినిమం ౩ సార్లు ప్రదిక్షణలు చేయవలసి వచ్చేది ... అన్నిటికన్నా కష్టమైన పని బట్టలు ఆరబెట్టడం ... అంత పొడవు కర్రల పైన బట్టలు ఆరబెట్టి ,దాని చివర్లు పట్టుకుని బయట ఉన్న హోల్స్ లోకి వాటిని గ్రుచ్చేసరికి కర్ర తోపాటు నేనూ .. తుఫాన్ వచ్చినపుడు తాడి చెట్టులా ఆ మూలకు ,ఈ మూలకు ఒరిగిపోయేదాన్ని... అయినా ఏ మాత్రం కరుణించకుండా ప్రతి సన్నివేశానికి ఫక్కున నవ్వుతూనే ఉండేవాడు దొంగమొహం గాడు..

అయ్యో ...వీటన్నిటిని కూడా క్షమించేయగలను ...కాని, మావారి ఫ్రెండ్స్ నుండి ఫోన్ వచ్చినపుడు మాత్రం వాడి మొహం చూస్తే ..'ఎర్రగా' పదికి తగ్గకుండా వాతలు పెట్టేయాలన్నంత కసి వచ్చేసేది ..నాకసలే A for apple .. B for boy అని అరటిపండు వలిచినట్లు ముద్దుగా ,స్పష్టం గా మాట్లాడితేనే ఒక పట్టాన ఇంగ్లీష్ అర్ధం అయ్యి చావదు ... అలాంటిది పీస్ పీస్ పావలా కాస్ టైపులో ఏదో యాసలో మాట్లాడితే అసలు అర్ధం కాదు.. అప్పుడప్పుడే మాయదారి క్రికెట్ క్లబ్బులు అలవాటు పడుతుండటం వల్ల మెల్లి,మెల్లిగా ఫ్రెండ్స్ మొదలయ్యారు మా ఆయనకు..సాయంత్రం అయిదయిందంటే చాలు .. పొలోమని 'కాల్ 'చేసి ఆయన గురించి వాకబు చేసేవారు.. అప్పటికి మొబైల్ లేకపోవడం వల్ల 'లేండ్ ఫోనే' గతి ..తప్పక హాల్లో కొచ్చి మాట్లాడేదాన్ని... అత్త తిట్టినందుకు కాదుగాని తోడికోడలు నవ్వినందుకు అని .. వాళ్ళ ఇంగ్లీష్ అర్ధమవ్వనందుకు కాదుగాని ఎక్కడ వీడు నవ్వుతాడో అని భయమేసిచచ్చేది ...

మా ఆయన ఆఫీస్ కి వెళ్ళాడు అని ఒక్క ముక్క చెప్పడానికి .. వాడు చూస్తున్నాడు అన్న టెన్షన్లో he ..she .. go ..went ..to.. office అంటూ స్త్రీ,పురుష లింగ భేదాలు లేకుండా భూత ,భవిష్య ,వర్త మాన కాలాలన్నిటిలోను సమాధానం చెప్పేదాన్ని వాడి వైపు చూస్తూ... వాడు కూడా యే మాత్రం మేనర్స్ లేకుండా అక్కడే సోఫాలో కూర్చుని నవ్వు భయటకు రాకుండా పెదాలు బిగించి నన్ను ఎంత కుళ్ల బెట్టాలో అంతా పెట్టేవాడు ... పోనీ ఎదుటి వాళ్ళన్నా ..అయ్యో పాపం ,పిల్ల మాట్లాడటానికి కష్టబడుతుంది ..మనం ఎందుకు బాధ పెట్టడం అని కొంచెమన్నా ఇంగితం తో ఆలోచించాలా!! ..అబ్బే ...మీ ఆయన ఆఫీసుకు వెళ్ళాడా ??..ఇంకా రాలేదా ?? ఎప్పుడొస్తాడు? నువ్వెవరు? అంటూ ఒకటే ప్రశ్నల వర్షం.. రోజు వచ్చే ఫోన్లే..ఎప్పుడూ అడిగే ప్రశ్నలే ..అయినా వాడిని చూడగానే నోట్లోంచి మాట వచ్చేది కాదు..


ఈ బాధ పడలేక రోజూ అర చేతిలో ముఖ్య మైన ప్రశ్నలకు సమాధానం రాసుకుని ఫోన్ రాగానే క్రీగంట వీడిని చూస్తూ .. ఒక ప్రక్క చేతిని చూస్తూ సమాధానాలు చెప్పేదాన్ని.. ఈ తెలివి తేటలు ఎక్జామ్లో చూపించి ఉంటే నా సామిరంగా కాలేజ్ ఫస్ట్ వచ్చేసేదాన్ని కదా... హుమ్(భారి నిట్టూర్పు) ... అయితే మా ఆయన ఫ్రెండ్స్ ఏమన్నా తక్కువ తిన్నారా?? ఆన్సర్ షీట్ లో లేని క్రొత్త ప్రశ్నలన్నీ కని పెట్టి మరీ అడిగేవారు .. నాలుగు రోజులయ్యే సరికి చిరాకొచ్చేసి " ఇంకోసారి మీ ఫ్రెండ్స్ నుండి ఇంటికి ఫోన్ వచ్చిందో మర్యాద దక్కదంతే "అని 'ఘాట్టిగా ' వార్నింగ్ ఇచ్చేసా మా ఆయనకు ... వెంటనే యే మాత్రం తడుముకోకుండా" కాళ్ళు విరగ కొడతా అరిచావంటే "అని ముద్దుగా సమాధానం ఇచ్చేసారు మా ఆయన కూడా..అలాంటి కధకు సంభందం లేని విషయాలను మనం పెద్దగా పట్టిన్చుకోకూడదన్నమాట ..

సరే ..ఇదిలా జరుగుతుండగా ఒక రోజు మద్యాహ్నం యధాప్రకారం నేను సుష్టుగా తిని, బెస్టుగా పడుకున్న తరుణం లో ఎవరో తలుపులను టక,టకా మని కొడుతున్న శబ్దం.. టైం చూస్తే నాలుగే అయ్యింది.. ఎవరబ్బా ??అనుకుని తలుపు తీస్తే ఎదురుగా సందీప్ ..."ఫోన్ "అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు ... ఈ టైములో ఎవరూ? సాదారణంగా మా ఆయన ఆ టైమ్లో చేసేవారు కాదు నేను పడుకుంటానని.. రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని 'హలో' అన్నాను ..అంతే "కోరమండల ఎక్స్ ప్రెస్ " ఒకటి ఆడ గొంతు తో ఇటు నుండి అటు ఆగమేఘాల మీద వెళ్ళిన శబ్దం.. నాకు ఇప్పటికీ తెలియని విషయం ఏమిటంటే, ఈ "సింగపూరియన్స్" ఎవరో వెనుక తరుముకొస్తున్నట్లు అంత హడావుడిగా ఎందుకు మాట్లాడుతారో ??? ...చేసేది ఏమి లేకా ...సారి ..కమ్ ఎగైన్ అన్నాను ... మళ్లీ" కోరమండల ఎక్స్ ప్రెస్ " ఈ సారి అటు నుండి ఇటు పరిగెత్తింది కాని ఒక్క ముక్క అర్ధం కాలేదు..

వద్దు ,వద్దు అనుకుంటూనే భయం భయం గా సోఫా వైపు చూసాను ..వాడు మాత్రం తన పాత్రకు ఏ మాత్రం అన్యాయం చేయకుండా తెగ నవ్వేసుకుంటున్నాడు 'టివి' చూస్తూ ...దొంగ సచ్చినోడా నీకేం పనిరా ఇక్కడ ?లోపలి పోయి ఏడచ్చుగా అని తిట్టుకున్నాగాని.. ఏం చేయాలో అర్ధం కాలేదు ... పోనీ ,ఫోన్ పెట్టేస్తే? ఉహు లాభం లేదు ..మళ్లీ కాల్ చేస్తుంది.. ఏం చేయాలి ఇప్పుడు?? ... అనుకుంటుండగానే అయిడియా తళుక్కుమంది ...

ఇందాకా ఆ అమ్మాయి ' బేంక్ ఆఫ్ ఇండియా' నుండి కాల్ చేస్తున్నా అంది..అంటే ' ఇండియన్' అయి ఉండచ్చు... కాబట్టి కొద్దో గొప్పో హిందీ తెలిసి ఉండచ్చు..మనకసలే హిందీ సినిమాలు చూసిన లోక జ్ఞానం సూపరు ఉంది కాబట్టి.. విషయం ఏంటో అర్ధం అయితే చాలు మేనేజ్ చేసేద్దాం అనుకుని చీకట్లో రాయి విసురుతూ .."ఆప్ కో హిందీ మాలుమ్ హై" అన్నాను గుస గుసగా ... నా మాట ఇంకా పూర్తి కానే లేదు ..ఇందాక చెప్పిన స్పీడ్ కి 'డబల్ 'వేసుకుని మరీ మాట్లాడింది ఆపకుండా పదినిమిషాలు ...చివర్లో హై ,హో ,హు లు తప్పించి ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు ... సైన్స్ ఎక్జాం రోజున సోషల్ చదువుకు వెళ్ళిన విధ్యార్దిలా తయారయ్యింది నా పరిస్థితి.. ఓరి దేవుడోయ్ ..నాకెక్కడ దొరికావే బాబు ...అనుకుని ,సోఫా వైపు చూసే ధైర్యం లేక, చివరకు నా ఓటమి అంగీకరిస్తూ... నాకు అర్ధం కావడం లేదు ..మా ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా ఆయనకు చెయ్యండి అని చెప్పి గదిలో కొచ్చి ఒక గంట కుళ్లిపోయి,ఉడికి పోయి ఆ ఫళంగా కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకున్నా ...

సాయంత్రం మా ఆయన రాగానే ఏమండీ ..ఇందాకా ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది.. మీ నెంబర్ ఇచ్చాను ..ఏమిటండి సంగతి అన్నాను .. ఆ ..అవునే మర్చిపోయా..బేంక్ లో NRI ఎకౌంటు ఒకటి ఓపెన్ చేశా ..దానికి సంబంధించి ఏదో లెటర్ పంపిందంట ...అది అడ్రెస్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వెనక్కు వచ్చేసిందంట ...వచ్చి కలెక్ట్ చేసుకోమంది.. రేపు నువ్వు వెళ్లి తీసుకొచ్చేయి అన్నారు సింపుల్ గా ... ఒక్కోసారి మా ఆయనను చూస్తే ..క్షణం క్షణం లోని వెంకటేష్ గుర్తు వస్తాడు ...అందులో హీరో గోడలు,మేడలు,మిద్దెలు ఎక్కేసి ..శ్రీదేవిని ..ఆ వచ్చేయి ,దూకేయ్, ఎక్కేయ్ అని సింపుల్గా చెప్పేస్తుంటాడు....

అలాగా.. దేశం కాని దేశం లో ..వచ్చి పది రోజులు కాక మునుపే ..ఒక్కదాన్నీ బయటకు వెళ్లి రమ్మంటే అసలేమనుకోవాలి ఈ మనిషిని ... పైగా నా అంత ధైర్యవంతురాలితో అనవలసిన మాటలేనా అవి అని అడుగుతున్నా... అంతే.. అదేమాట మాట అడిగేశాను ఆవేశంగా ఆయన్ని ...మా ఆయనేమన్నా తక్కువ తిన్నారేంటి ... ఛీ నోర్ముయ్ ..ఎప్పుడు నాకేం తెలియదు తెలియదు అనుకుంటే ఎప్పటికీ ఏమీ తెలియదు ...ఇంకెప్పుడు నేర్చుకుంటావ్.. మొన్న ఫలానా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ శ్రీలంక ఎయిర్ లైన్స్ లో ఇద్దరు పిల్లలతో రెండు విమానాలు మారి మరీ వచ్చేసింది ఇక్కడకు తెలుసా ..మళ్లీ ఒక్క ఇంగ్లీష్ ముక్కరాదు...వాళ్ళందరూ రావడం లేదూ... ఇక్కడ నాకు తెలియదు ..రాదు అంటే కుదరదు ... రేపు వెళ్లి తీసుకు వచ్చేసేయ్ అని కరాఖండిగా చెప్పేసారు ...(ఆ ఫ్రెండ్ కూడా ప్రతిదానికి నాతో పోల్చి ఆ అమ్మాయితో పనులు చేయిన్చేసు కుంటాడంట..ఒకసారి ఆ అమ్మాయే చెప్పింది )

ఇంకొక అమ్మాయితో పోల్చేసరికి పౌరుషం వచ్చేసింది కాని భయం దాన్ని అదిగమించేస్తుంది .తిరగబడి లాభం లేదని ..అది కాదండి,మరి... నాకు బొత్తిగా దారి తెలియదు ..ఒక్కసారేగా ట్రైన్ ఎక్కించారు..ఎటు వెళ్ళాలో ఏమో అన్నాను బ్రతిమాలే పొజిషన్ కొచ్చేసి ... ఇక్కడ అడ్రెస్స్ కనుక్కోవడం చాలా ఈజీ బుజ్జి.. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్తామా ...అక్కడ ఎక్కడ పడితే అక్కడ మేప్ లు ఉంటాయి .. అప్పుడు 'బూన్ లే 'కు( ఇప్పుడు లాస్ట్ స్టాప్ 'జూ కూన్' వరకు పెంచాడు) వెళ్ళే వైపు వచ్చిన ట్రైన్ ఎక్కావనుకో ' టాన్జుంగ్ పాగర్ ' దగ్గర దిగిపో... అక్కడ 'స్టేషన్ కంట్రోల్ 'దగ్గర కేపిటల్ టవర్ కు వెళ్ళే దారి ఎక్కడో కనుక్కుని ,అటు నుండి తిన్నంగా వెళ్ళిపోతే ' బేంక్ ఆఫ్ ఇండియా 'అని బోర్డ్ కనబడుతుంది.. వెళ్లి తెచ్చేసేయ్ ..సరేనా అన్నారు ...

చెప్పద్దూ... నాకు అరచేయి పిడికిలి బిగించి మా ఆయన్ని వంగో పెట్టి గిబుక్కు ,గిబుక్కుమని కొట్టాలన్నంత కసి వచ్చేసింది కాని ,పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం తో ఈ సారి ఏడుపు మొహం తో ..ఒక వేళ 'తప్పిపొతే' ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించాను... ఎహే ఎందుకు తప్పిపోతావ్ ... అంతగా అయితే దారిలో ఏదో ఒక టాక్సీ పట్టుకుని ఇంటి అడ్రెస్ చెప్పి వచ్చేసేయ్ అన్నారు ముసుగుతన్ని ... కలకంటి కంట కన్నీరు ఒలికినా కనికరం కలగదే ఈ కఠిన మానవుడికి అని అతిలోక సుందరి రేంజ్ లో తిట్టుకుని ఏమ్ చేయాలా అని ఆలోచనలో పడ్డాను ...

83 వ్యాఖ్యలు:

3g చెప్పారు...

రెండు నెలలు గేప్ నిజంగా తీసుకుంటారేమోఅని కంగారుపడ్డానండి. పోస్టు సూపర్. కల కంటి కంట కన్నీరు సీను తో మీకు ట్రాజెడి అయినా మాకు భలే కామెడీగా ఉందండి.

శ్రీనివాస్ చెప్పారు...

చాలా రోజుల తర్వాత ఫుల్ కామెడీ టపా శభాష్ :)

పవన్ కుమార్ చెప్పారు...

"కలకంటి కంట కన్నీరు ఒలికినా కనికరం కలగదే ఈ కఠిన మానవుడికి"
ఎన్ని కష్టాలొ.....
ఈ సారి నాది ఫస్ట్ కామెంటో కాదొ

రాజ్ కుమార్ చెప్పారు...

first comment naadey...

anveshi చెప్పారు...

>>అప్పుడప్పుడే మాయదారి క్రికెట్ క్లబ్బులు అలవాటు పడుతుండటం వల్ల మెల్లి,మెల్లిగా ఫ్రెండ్స్ మొదలయ్యారు మా ఆయనకు..

grr..ఎప్పుడు చూడు క్రికెట్ మీద పడటమేనా ? >:P మొత్తం చదివి comment రాస్తా :D

రాజ్ కుమార్ చెప్పారు...

Pichekincharu...nestam.... Sooper ga undi ee post.. meeru 2months selav prakatincharani mental prepare ipoi boledu badhapadi poya.. chivari atiloka sundari dilog keka... ha.ha...

నీహారిక చెప్పారు...

I am First

నీహారిక చెప్పారు...

ప్చ్...6th place!!!

Unknown చెప్పారు...

మావారు తన కాలేజ్ లో ఆయన గారిని ఆరాధించిన అమ్మాయిల దగ్గరనుండి ,అనేకానేక సాహసాల వరకు .. బోలెడు కోతలు కసా బిసా మని కోసేస్తున్నా( ఏమో ఇప్పుడు తలుచుకుంటే అలాగే అనిపిస్తుంది మరి )

మా మనొభావాలు మీద దెబ్బకొట్టారు సొరి చెప్పాల్సిందె.

కవిత చెప్పారు...

నేస్తం గారు,"కలకంటి కంట కన్నీరు ఒలికినా కనికరం కలగదే ఈ కఠిన మానవుడికి"...సూపర్ సమయస్పూర్తి...మీరు ఆ సింగపూరు ఇంగ్లీష్ తో ఎన్ని బాధలు పడ్డారో,నేను ఈ తమిళనాడు తమిళం తో అలాగే పడ్డాను అండి..మా వారు(మీ శ్రీవారి లాగా) కూడా సింపుల్ అని అన్ని పనులు నాతో నే చేపించే వారు...

Sasidhar Anne చెప్పారు...

Akka.. super.. last week nenu vacation meeda intiki vella.. akkademo nnet ledu okate tension.. nuvvu post peduthavu.. miss avuthanu emo ani..
hascharyam.. ivvalla office ragane nee blog chusthe nee posting ivvale padindhi...

inka nee post lo konni hightlights..

1)Nidra devi veneke vacchi jola paduthundhi..
2)peess peess ani english entha baaga varnicharo..
3)Science exam rojuna social chaduvukunna danila paristhidi.. raccha timing..

inka chala ... meeru swathi lo serials chadivithara.. dantlo "Sahiti" ane oka writer style mee posts lo kanipisthondhi..

3g చెప్పారు...

ఆహ......ఓహొ............... అరుపులు, కేకలు, చిటికెలు, చప్పట్లు, సంబరాలు.......... ఎన్నోయుగాల పోరాటం అనంతరం ఇవాళ "మొదటి కామెంట్" మెడల్ సాధించా. ఈ విజయం నాది కాదు మనందరిది. ఇది సమిష్టి కృషి ఫలితం. నాఈవిజయాన్ని "మాలిక" కి అంకితమిస్తున్నా....... పోస్టుని వేగంగా ముందుగా చూపించినందుకు.

మంచు చెప్పారు...

"" మావారు తన కాలేజ్ లో ఆయన గారిని ఆరాధించిన అమ్మాయిల దగ్గరనుండి ,అనేకానేక సాహసాల వరకు .. బోలెడు కోతలు కసా బిసా మని కోసేస్తున్నా ""
"" మా ఆయనను చూస్తే ..క్షణం క్షణం లోని వెంకటేష్ గుర్తు వస్తాడు ...అందులో హీరో గోడలు,మేడలు,మిద్దెలు ఎక్కేసి ..శ్రీదేవిని ..ఆ వచ్చేయి ,దూకేయ్, ఎక్కేయ్ అని సింపుల్గా చెప్పేస్తుంటాడు ""

"" చెప్పద్దూ... నాకు అరచేయి పిడికిలి బిగించి మా ఆయన్ని వంగో పెట్టి గిబుక్కు ,గిబుక్కుమని కొట్టాలన్నంత కసి వచ్చేసింది ""

"" కలకంటి కంట కన్నీరు ఒలికినా కనికరం కలగదే ఈ కఠిన మానవుడికి ""

ఎంటసలు.. ఈ డైలాగులు ఎంటి అసలు ???? ఎవరూ అడగరనుకున్నరా ??? ఆయ్ ...

Padmarpita చెప్పారు...

సూపర్ కామెడీ...బాగు బాగు:):)

నేస్తం చెప్పారు...

3g గారు అలాగే అనుకున్నా కానీ మావారు అనుకోకుండా ఇండియా వెళ్ళాల్సి వచ్చింది.. నిన్న భయంవల్లనో...మరి దిగులో నిద్ర పట్టక పోయేసరికి ఇలా అన్నమాట
శ్రీనివాస్ అంటే ఇన్నాళ్ళూ చెత్త పోస్ట్లు వేసావ్ ఈ రోజు పర్వాలేదు అనే కదా దాని మీనింగ్ :(
పవన్ కాదు కదా:)
అన్వేషి అన్నా :)నేను కావాలని రాయను అసలా పేరు వింటేనే 100 మిరపకాయలు ఒకేసారి తిన్న ఫీలింగ్ వచ్చేసి అలా రాసేస్తానన్నమాట :)
వేణు రాం ఎంత పని అయిపోయింది అంత బాధ పడిపోయిందానికి న్యాయం చెయ్యకుండా ముందే పోస్ట్ వేసేసానా అయితే :)

నేస్తం చెప్పారు...

నీహారికా ఎన్నాళ్ళకెన్నాళ్ళకి .. ఎక్కడికి వెళ్ళారు ఇన్నాళ్ళూ ...
కోనసీమ కుర్రాడు గారు ఏదీ గుండెలమీద చెయ్యి వేసుకుని మేము చెప్పేవన్నీ నిజాలే ...అని మస్పూర్తిగా అనండి చూద్దాం.. హన్నా సారీ చెప్పాలంట సారీ..:O
కవిత గారు మీవారూ అంతే నా ..ఇహ తప్పదు శ్రీవారి ముచ్చట్లు అనే శీర్షికన మనం చాలా చెప్పేసుకోవాలి అయితే
3g :D
శశి ధర్ మీ ఇంటికి వెళ్ళిన తరువాత కూడా నా పోస్ట్ గురించి ఆలోచించావంటే నాకు మహా ఆనందం గా ఉంది :)

Rajendra Prasad(రాజు) చెప్పారు...

ఆ "బ్యాంక్ ఆఫ్ ఇండియా" వాళ్ళ పరిస్థితి తలచుకుంటేనే జాలేస్తోంది పాపం...!!!!

Rajendra Prasad(రాజు) చెప్పారు...

-->"కలకంటి కంట కన్నీరు ఒలికినా కనికరం కలగదే ఈ కఠిన మానవుడికి" కేక......
-->వెంటనే యే మాత్రం తడుముకోకుండా" కాళ్ళు విరగ కొడతా అరిచావంటే "అని ముద్దుగా సమాధానం ఇచ్చేసారు మా ఆయన కూడా.
ఐతే మా బావ గారు ధైర్యవంతులే అన్న మాట...:)

నేస్తం చెప్పారు...

మంచుపల్లకి గారు ..ఎవరూ అడగరనే ధైర్యమే మరి..మా శ్రీవారు ఇండియాలో ఉన్నారు ..పోస్ట్ చూసే వీలు లేదు ... అదీ సంగతి..మరి గోదావరి నీళ్ళు త్రాగిన తెలివితేటలు ...తక్కువ అంచనా వేస్తే ఎలా :)
పద్మ థేంక్యూ :)
రాజేంద్ర ప్రసాద్ :O హెంత లేసి మాటలు అనేస్తున్నారు ... ఆయనకు ధైర్యమా అంటే సరేలే పోనీలే ఎదో ముచ్చట పడుతున్నారుగా అని నేనే చూసి చూడనట్లుగా ఊరుకుంటా అంతే :)

Mahender చెప్పారు...

సోమవారం ప్రొద్దున్నే ఆఫీస్‌లో మీ పోస్ట్ చదివాను, నా నిద్ర మబ్బు అంతా వదిలింది చాలా హుషారుగా ఉంది....ఇంకా ఇలాంటి పోస్ట్‌లు రావలని ఆశిస్తున్నా :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

నాకెందుకో మీరు ఆ సందీప్ మిమ్మల్ని నవ్వడం చూసి, కర్తవ్యంలో విజయశాంతికి వచ్చినంత పౌరుషం వచ్చి, ఒకే ఒక నైట్ లో ఇంగ్లీష్ ఎడా పెడా నేర్చేసుకొని మరుసటి రోజు కల్లా ...ఎప్పుడు ఫోన్ వస్తుందా అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు...ఎందుకంటే, ఫోన్ రాగానే రాజధాని ఎక్స్ ప్రెస్ లా మీరు గడగదా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే, ఆ సందీప్ నోరెళ్ళబెట్టి మిమ్మల్నే చూస్తుంటే...నోట్లో నుంచి చొంగ కారుతుంది, కాస్త చూసుకో నయినా అన్నట్లు ఒక చూపు వాడికి విసిరి..వాడి మీద పగ తీర్చుకున్నట్లుగా మీరు పకా పకా నవ్వాలని అనిపించింది.....కనీ మీరేమో...ఏంటండీ నన్నిలా డిసప్పాయింట్ చేసారు.... నా కల నిజం చెయ్యరా ప్లీజ్ :-)

శివరంజని చెప్పారు...

కలకంటి కంట కన్నీరు ఒలికినా కనికరం కలగదే ఈ కఠిన మానవుడికి ""
అక్కా (ఒక్కసారి డ్రీం ఏసుకున్నా ) అబ్బా శ్రీదేవిలా ఎంత ముద్దు గా కనిపిస్తున్నవో నా కళ్ళకి

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

chaala baagundi........Excellent.

eppudeppudu pelli chesukundama ani vundi.........

Ramnath చెప్పారు...

Nestham garu, chala baaga rasaru.

హరే కృష్ణ చెప్పారు...

నేస్తం గారు
కేక
కుమ్మేసారు
మా మేనేజెర్ తో గొడవపడి ఈ టపా
చదివాక కాసేపు జీవితానికి ప్రశాంతత దొరికింది

హరే కృష్ణ చెప్పారు...

రెండు నెలలు గ్యాప్ ఇస్తారనుకున్నాం
లేట్ గా రాసినా చాలా బావుంది ఈ పోస్ట్

శ్రీనివాస్ చెప్పారు...

నా వాఖ్యలు వక్రీకరించడం మీరెప్పుడు మానుకుంటారు ??

పవన్ కుమార్ చెప్పారు...

మొత్తం మీద మీ ఆయనగారు ఇండియా వచ్చిన టయం చూసుకొని మీ ఒనర్ మీద చెప్తానని చెప్పిన చాడిలు మీ ఆయన మీద చెప్తున్నారన్నమాట.
ఇంతకి మాటర్ ఎంటంటె ఆ సందీప్ గాడి అడ్రెస్ ఇవ్వండి.
వాడి ముక్కు చింతకాయ్ తొక్కు చెసేద్దాం
నువ్వు ఊ అను అక్కా..
మిగతా సంగతి మెము(JFA, జా.ఆ.సం) చూస్కొంటాం.

సుజాత చెప్పారు...

కొంపదీసి మీ వారిది వెస్ట్ గోదావరా ఏంటి? పోలికలు అలాగే కనపడున్నాయి. ,మీలాంటి కష్టాలే నేనూ పడ్డా!దేశం కాని దేశంలో అక్కడికెళ్ళి ఇది చేసుకురా, ఇక్కడికెళ్ళీ ది తీసుకురమ్మంటుండేవాడు తను కూడా! వెనకాడితే మాత్రం ఎప్పుడు నేర్చుకుంటావు అని రంకెలు!ఆ ఖోపంలో ఇప్పటివరకూ ఏదీ నేర్చుకోలేదు!

అరచేయి పిడికిలి బిగించి మా ఆయన్ని వంగో పెట్టి గిబుక్కు ,గిబుక్కుమని కొట్టాలన్నంత కసి వచ్చేసింది కాని ..ప్చ్ ఈ కోరిక మీకూ తీరలేదన్నమాట!

క్షణం క్షణం లోని వెంకటేష్ గుర్తు వస్తాడు ...అందులో హీరో గోడలు,మేడలు,మిద్దెలు ఎక్కేసి ..శ్రీదేవిని ..ఆ వచ్చేయి ,దూకేయ్, ఎక్కేయ్ అని సింపుల్గా చెప్పేస్తుంటాడు........ఇది సూపరు!.

Haritha చెప్పారు...

హ్హ హ్హ హ్హ ఎంటో కష్టాలన్ని మనలాంటి అమాయకులకే వస్తాయి... ఇంగ్లీష్ గురించి నాకు కూడా ఫిర్యాదులు ఉన్నాయి... ఎంత వేగంగా మాట్లాడితే అంత గొప్ప అన్న బడాయి... ఎదుటివారికి అర్ధమయ్యినా అవ్వకపోయినా అనవసరం... చంపెయ్యాలి...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హా.హ్హా.హ్హ్హ..హ్హ...ఏం రాసారండీ బాబు....

నీహారిక చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
నేస్తం చెప్పారు...

Mavercikగారు థేంక్స్ అండి :)
కిషన్ కాస్త రచయిత స్థాయి నుండి నేస్తం స్థాయికి దిగి ఆలోచించండి మరి .. ఒక్క రోజులో రిక్షా త్రొక్కి చెల్లెల్లి పెళ్ళి చేసేటంత ఘనమైన సీన్లు సినిమాలకే పరిమితం .. కాకపోతే ఒకటి మెల్లి మెల్లిగా బాగానే నేర్చుకున్నా :)
శివరంజని నీకలా కనబడాలనే క్షణం క్షణం ..జగదేక వీరుడు -అతిలోక సుందరి సినిమాలు ఉదాహరణలు గా చూపించాను .... ఇక ముందు నా పోస్ట్లు చదవుతుంటే శ్రీదేవినే ఊహించుకోయేం :)
వినయ్ అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్లో ఇదేమాట అన్నారు ..ఇంకా చేసుకోలేదా పెళ్ళి :)ఇంతకు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు..మా ఆయనలా ఊరికే ఊరికే గదమాయించేద్దాం అనా పాపం ఆ అమ్మాయిని..ఆయ్య్

నేస్తం చెప్పారు...

రామనాథ్ థేంక్యూ..
హరే కృష్ణా అయ్యో పాపం గొడవ పడ్డారా మేనేజర్ తో .. నేనూ అదే అనుకున్నా కానీ రాసేసాను అనుకోకుండా :)
శ్రీనివాస్ మా తమ్ముడి పేరు నీ పేరు ఒకటే అవ్వడం తో అలా వక్రీకరించ బడుతున్నాయి ఆటోమేటిక్ గా..సరదాగానే తీసుకోయేం.. :)
నేను ఊ అన్నా..ఆ అన్నా సందీప్ ని ఇప్పుడు ఏం చెయ్యలేం పవన్ .. ఇది జరిగి ఒకటా రెండా పది యేళ్ళు అయ్యాయి అని చెప్పాగా.. ఎక్కడున్నాడో ఏమో :)
సుజాత గారు అలా మెల్లిగా అంటారేమిటండీ వెస్ట్ గోదావరా అని..అదే,అదే ...అయితే ఈ పశ్చిమ గోదావరి వాళ్ళందరికి కామన్ గా ఇవే పోలికలన్న మాట.. ప్లిచ్ మీకు నా ప్రఘాడ సానుభూతి ప్రకటించడం మినహాయించి ఏం చేయలేకపోతున్నా ...

నేస్తం చెప్పారు...

హరిత కరెస్ట్ గా చెప్పావ్... పొరపాటున తప్పు మాట్లాడామో క్లాస్ పీకుతారు..నేనేమో సుందరాకాండలో మీనాలా ..అదే అదే మీరన్నదే మీరన్నదే అని సర్దుకుంటాను ..మళ్ళీ అదే విధంగా పలికి తిట్లు తినడం ఎందుకని
శేఖర్ భలే నవ్వారండీ బాబు :) థేంక్యూ
నీహారిక గా..రూ .... నాకోసం ఒకరోజంతా వెచ్చించి మరీ అంత పెద్ద టపా రాసారా.. ఈ మాటేనాకు బోలెడంత ఆనందం వచ్చేస్తుంది ...వాళ్ళ ప్రోబ్లెంస్ వాళ్ళకు ఉంటాయిలెండి ..అందుకు మీరు రాసినది నచ్చలేదేమో అని అనుకోవద్దు.. కాకపోతే ఈ వ్యాఖ్య చాలా హాయిగా అనిపించి నాకు ..అది చాలు :)

Anil Dasari చెప్పారు...

అటు తిరిగీ ఇటు తిరిగీ క్రికెట్ మీద పడతారేంటండీ? 'మాయదారి క్రికెట్ క్లబ్బు'లా!!!! మా మతస్థుల మనోభావాలు ప్రతి టపాలోనూ తీవ్రంగా గాయపరుస్తున్నారు.

నేస్తం చెప్పారు...

అబ్రకదబ్ర గారు...రండి సార్ ..ఇంకా రాలేదేంటా ..ఏమీ అనట్లేదేంటా అని ఎదురు చూస్తున్నా..ఇక హేపీగా పడుకుంటా ... మీ మతస్థులు బ్లాగ్స్లో ఎక్కువగా ఉన్నారనే,మీ మనోభావాలు దెబ్బతింటాయనే (మళ్ళా మీనుండి కామెంట్స్ రావని) అలా పై పైన అని వదిలేస్తున్నా ...లేక పోతేనా ...తిట్టాలా ..కొట్టాలా :)

మధురవాణి చెప్పారు...

ఇవ్వాళ పొద్దుపోద్దున్నే మీ టపా పూయించిన నవ్వులపువ్వులతో శుభోదయం అయిందండీ నాకు :-) ఎన్ని చోట్ల బాగా రాశారో, బాగా నవ్వొచ్చిందో చెప్పాలంటే, మళ్ళీ నేనే ఓ టపా రాయాల్సొస్తుంది. అందుకే మీరే అర్ధం చేస్కోండి. ప్రతీ లైను సూపర్ గా నచ్చేసిందని ;-) చాలా బాగా రాశారు ఎప్పట్లాగే! :-)

కత పవన్ చెప్పారు...

నైస్ పోస్ట్ :))))))

మంచు చెప్పారు...

ఎంటండి అటు తిరిగి ఇటు తిరిగి అందరూ పశ్చిమగొదావరి మీద పడ్డారు.. మేం ఎం చేసినా లొకకల్యాణం కొసమే.. మా కొసం ఎమీ చేసుకొలేని అమాయాకులం... మీ హస్బెండ్ తొ పాటు మన బ్లాగు ఫ్రెండ్స్ 3జి, శ్రీనివాసరాజు, బొనగిరి, నన్ను చూడండి.. మేమందరూ నొట్లొ వేలు పెడితే ఇపుడేం చేయ్యాలి అని సైగచేస్తూ అడిగే అమాయకుల్లా కనిపించడం లేదా ?? మా మీదా అభాండాలు.. అన్యాయం కదా :-)

3g చెప్పారు...

"అలా మెల్లిగా అంటారేమిటండీ వెస్ట్ గోదావరా అని..అదే,అదే ...అయితే ఈ పశ్చిమ గోదావరి వాళ్ళందరికి కామన్ గా ఇవే పోలికలన్న మాట.."


హెంతమాట........ ప.గో.వాళ్ళని పట్టుకొని పగవాళ్ళనన్నట్టు హెంతెంతమాటలు. దీన్ని ఖండ ఖండాలుగా ఖండించడానికి ఖండాంతరాల్లో ఉన్న ప.గో.వాసులారా.... ఏకంకండి. అవసరమైతే మిగతా జిల్లాల వాళ్లనికూడా కలుపుకొని జె.ఎ.సి ఏర్పాటు చేసైనాసరే ఈ కుట్రని అడ్డుకోవాలి. రండి..... కదలి రండి.

Sai Praveen చెప్పారు...

ఎప్పటి లాగే మీ కబుర్లు చాలా బావున్నాయి.
ఇంతకి ఆ రోజు ఎం జరిగింది? అదేనండి బ్యాంక్ లో.

"అయితే ఈ పశ్చిమ గోదావరి వాళ్ళందరికి కామన్ గా ఇవే పోలికలన్న మాట"
అలా గట్టిగా అనకండి. ఎవరైనా వింటే మాకు పెళ్ళిళ్ళు అవ్వవు :)

KumarN చెప్పారు...

మీ శైలి మాత్రం awesome అండి.
నిజంగా జీవితం లోని ప్లజంట్ నెస్, ఇలా నెమరు వేసుకొని ప్రజంట్ చేసేప్పుడే కాకుండా, అలా గడిపేప్పుడు కూడా సింపిల్ ప్లజర్స్ ఆఫ్ లైఫ్ ని అంతే సింపిల్ అండ్ ఓపెన్ మైండ్ తో గడపొచ్చు అని నిరూపించేలా ఉంటాయి మీ రాతలు. కాని నాకిప్పటికీ అనుమానమే. క్రెడిట్ అంతా మీ పర్సనాలిటీదే సుమండీ. వెరీ ఫ్యూ పీపుల్ హావ్ ఇట్

ప్రేరణ... చెప్పారు...

భలే బాగారాస్తారండి మీరు.

మంచు చెప్పారు...

3జి..నిజం .. మన ప గొ వాళ్లంతా ఏకం అయ్యి.. ఈ తూ గొ వాళ్ళ పని చెప్పాలి...
ఇప్పటివరకూ వచ్చిన లిస్ట్ : నేస్తం గారి హస్బెండ్ (మన లీడర్) ,3 జి, మంచు (నేను) , సాయ్ ప్రవీణ్, శ్రీనివాస రాజు, బొనగిరి. మనకు సలహాలు ఇవ్వడనికి పెద్దదిక్కుగా సూర్యలక్ష్మిగారు ..

priya చెప్పారు...

channlla tarvata karunincharu.roju mee post kosam chooddame......latega vachina adaragottaru.super

నేస్తం చెప్పారు...

మధురవాణి కామెంట్స్ పెట్టడం నీదగ్గరే నేర్చుకోవాలి అనిపిస్తుంది ఒక్కోసారి..అంతగా బాగుంటాయి నీ కామెంట్స్
కత పవన్ గారు థేంక్యూ
నేనూ అదే అంటున్నా మంచుపల్లకి గారు.. మీరు ఏం చేసినా లోక కళ్యాణానికి తప్పించి ..కళ్యాణం చేసుకున్నా అమ్మాయి గురించి కాదు ..నిజమే నోట్లో వేలుపెడితే వేలునేమీ చేయరు చేయి మొత్తం నమిలి మింగేస్తారు..పైగా ఇలాంటి విషయాల్లో అందరూ ఏకమైపోయి ఎదుటివాళ్ళను దబాయించేస్తారా ..ఆయ్
3g గారు అందరూ కలిసి ఏకమై మాంచి రెస్టారెంట్ కి వెళ్ళి నా పేరు చెప్పుకుని బిర్యాని తిని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోండి.. పిలిచినందుకు బిల్లు మాత్రం మీరే కట్టేసేయండి..:)

నేస్తం చెప్పారు...

సాయ్ ప్రవీణ్ బ్యాంక్ విషయం నెక్స్ట్ ఎపిసోడ్ లో... ప.గో వాళ్ళకు పెళ్ళి కాకపోవడం ఏంటండీ బాబు..ఇటు ప్రక్కన తూర్పు గోదావరి అటు ప్రక్క క్రిష్ణ ,గుంటూరూ మధ్యలో ఉన్నారు .. ఏం పర్లేదు మీరేం బెంగ పెట్టుకోకండి ..బోలెడు సంబంధాలు వస్తాయి :)
కుమార్ :)
ప్రేరణా థేంక్యూ ..
ప్రియ మరే లేటెస్ట్ గా పోస్ట్ వేద్దామని :)

మంచు చెప్పారు...

మేం అలిగాం ...

అజ్ఞాత చెప్పారు...

ఒక్క రోజు లేటుగా చూస్తే ఇన్ని కామెంట్లా?
మధ్యలో మా పశ్చిమ గోదావరి వాళ్ళ గొడవెందుకు?
ఇంకోసారి ఏమైనా అంటే 'ఘరానా మొగుడు' తో చెప్తాం.

కౌటిల్య చెప్పారు...

మా నేస్తం గారి తీపినవ్వుల కబుర్లు ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురు చూస్తుంటే ఇవాల్టికి అవకాశం వచ్చింది...ఇంట్లో నెట్ చూడనివ్వట్లేదుగా..అందుకే ఎవ్వరూ చూడకుండా లాప్ టాప్,నా బ్యాగ్ లో పెట్టుకుని మా రీడింగ్ రూమ్ కి తెచ్చుకున్నా..ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వైర్లెస్ నెట్ పెట్టించుకున్నాంలెండి...మొదట మీ బ్లాగే తెరిచా...గంటపాటు మీ గుజరాతీ విలన్లా కిసుక్కు కిసుక్కుమని బిగపట్టి నవ్వుతూనే ఉన్నా...అందరూ నావంక వింతగా చూసినా ఆగే సమస్యే లేదు...హమ్మయ్యో ఈ టపా మరీ తెగ నవ్వించేశారండీ....వినయ్ గారికి మరీ పెళ్ళి తొందరెక్కువైపోయింది..పిల్లని వెతకండి...

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

Wonderful narration.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

chesukoledu phd vachhindi...2 years aagudam anukunnanu.

mee frequency baaga match ayyindandi anduke naaku nachhindi.to be frank ilanti ekkuvaga maatledevallu baaga nachhutaaru.

Unknown చెప్పారు...

ii post naku thega nachesindi nestham garu.. :)
bale bale undi....
office lo chadivana...gattiga navvadanike kudaraledu..mee sandeep navvinatlu navvalsi vachind.. :P
hahahha :D

నాగప్రసాద్ చెప్పారు...

ప.గో.జి వాళ్ళ మీద నేస్తం గారి వ్యాఖ్యలకు నిరసనగా, ప.గో.జి ని ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాను. :-)). అలాగే ప.గో.జి వాళ్ళు తూ.గో.జి వాళ్ళని పెళ్ళి చేసుకోకూడదని ఫత్వా జారీ చెయ్యడమైనదహో...... :-))).

ప.గో.జీ వాసుల్లారా భయపడకండి. మీ వెనుక నేనున్నాను. నా వెనుక కేసీయారున్నాడు. ఆ వెనక మేడమ్ ఉంది. వచ్చే తన పుట్టిన రోజు నాడు, మేడమ్ మీ రాష్ట్రం మీకిచ్చేస్తుంది.

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ చెప్పారు...

టపా మాత్రం సూపరో సూపరు...

మీరు ప.గో జిల్లా వాసుల మనోభావాలని దెబ్బతీసారు. ప.గో జిల్లా వాసులారా ఏకం కండి. ఈ అన్యాయాన్ని ముక్త కంఠంతో ఖండిద్దాం :)

నేస్తం చెప్పారు...

మంచుపల్లకి గారు తప్పండి మగవాళ్ళు అలగ కూడదు.. ఆడవాళ్ళ రైట్ అది ..చెంపలేసుకోండీ
బోనగిరిగారు ఘరానా మొగుడు కంటే చలాకీ పెళ్ళామే పవర్ ఫుల్..కాబట్టి ఏం కాదు చెప్పుకోండి :)
అయ్యో ఇంట్లో ఇంకా నెట్ చూడనివ్వడంలేదా కౌటిల్యా ..అయినా మీ మంచికేగా ..ఈ సారికి వాళ్ళ మాటవినేసేయండి మరి :)
సాయి కిరణ్ థేంక్యూ అండి

నేస్తం చెప్పారు...

వినయ్ అవునా .. అంతేలేండీ ముందు చదువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి .. :)
కిరణ్ తెగ నచ్చేసిందా :) థేంక్యూ థేంక్యూ
>>>అలాగే ప.గో.జి వాళ్ళు తూ.గో.జి వాళ్ళని పెళ్ళి చేసుకోకూడదని ఫత్వా జారీ చెయ్యడమైనదహో......
బాబ్బాబు ఆ పనేదో చేసి పుణ్యం కట్టుకోమ్మా మా తూర్పు గోదావరి అమ్మాయిలు రుణపడి ఉంటారు నీకు :) .
బ్రహ్మి గారు ఆల్రెడీ ఖండిద్దామని బయలుదేరారు మీరు వెళ్ళీ జాయిన్ అయిపోండి.. ఏదన్నా హెల్ప్ కావలంటే మర్చిపోకండేం ..

Ram Krish Reddy Kotla చెప్పారు...

హమ్మయ్యా...మీ తూ.గో.జీ వర్సెస్ ప.గో.జీ గొడవేదో నాకు లాభించేట్టుగానే ఉందే...ఆ ఫత్వా ఏదో త్వరగా జారిచేయ్యండి..అలా అయినా తూ.గో.జీ అమ్మాయిల్లో నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు...లేకపోతే అమ్మమ్మా హెంత పని, తూ.గో.జీ లో ఉండే అందమైన అమ్మాయిలను అందరినీ ఎగరేసుకుపోతున్నారు కదా మీ ప.గో.జీ వాళ్ళు..సో ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా, ఆ ఫత్వా ఏదో త్వరగా జారీ చేసి, ఆ పిమ్మట తూ.గో.జీ అమ్మాయిలను గుంటూరి అబ్బాయిల కోసం కనీసం యాభై శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందిగా సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను... అసలే అందమైన అమ్మాయిలు కరువైన ఈ రోజుల్లో ఉండే కొద్ది మందిలో చాలా శాతం తూ.గో.జీ లోనే ఉండటం..మా డిమాండ్ పరిష్కరించెంత వరకు గుంటూరు నుంచి తూ.గో.జీ వరకు బంద్ ప్రకటిస్తాము.

మంచు చెప్పారు...

ఇదేదొ మొదటికే మోసం వచ్చేట్టుందే.. గొ.జి. ల గొడవల మద్యలొ అనంతపురం వాళ్ళు, గుంటూరొళ్ళు తన్నుకుపొయేలా వున్నారు..

నాగా , కిషన్ మేం మేం కాంప్రమైజ్ .. మీరు లైట్ తీసుకొండి

నేస్తం : మీ గురించి ఈ నెలలొ రెండొసారి లెంపలేసుకొవడం (మొదటిది 3 జి బ్లాగులొ) .. చూసారా .. ప గో వాళ్ళం ఎంత అమాయకులమో.. మీరు లెంపలేసుకొమనగానే వేసేసుకున్నాం .. పైన వాళ్ళకి అలానే చెప్పాను కానీ కాంప్రమైజ్ ఎమీ లేదు.. ఈ యుద్దం కొనసాగుతుంది..

Unknown చెప్పారు...

నేస్తం గారు,
లేటు గా రాసినా లేటెస్ట్ గా రాసారు.
ఈ టపా మొదటి నుండి చివరి వరకు నవ్వులు పూయించారు.

నాగప్రసాద్ చెప్పారు...

@Kishen Reddy: యాభై శాతం కాకపోతే, డెబ్బై శాతం తీసుకొండి. మాకు సంబంధం లేదు. మేము మా రాయలసీమ బ్యూటీలను వదిలిపెట్టి, నెల్లూరు దాటి వచ్చే ప్రసక్తే లేదు.

@మంచు.పల్లకీ గారు, ఆకులు కాలాక చేతులు ఎలా పట్టుకోలేమో, అలాగే ఫత్వా జారి చేసిన తర్వాత, కాంప్రమైజ్ అవ్వడాలు ఉండవు. :-)))

మరువం ఉష చెప్పారు...

అలా అలా అలవోగ్గా మీరు వర్ణించిన సన్నివేశంలోకి తీసుకుపోతూ చక్కని అనుభవం చెప్పుకొచ్చారు. నైస్.

నేస్తం చెప్పారు...

కిషన్ ప్రొద్దున tv9 చూడలేదా... గూంటూరమ్మాయిలు కత్తులు కొడవళ్ళు నూరుతున్నారంట.... వాళ్ళ వూర్లో పుట్టి పెరిగి ఎప్పుడు చూసినా గోదావరి అమ్మాయిలను ఎవరో తెగ పొగిడేస్తున్నారంట ...విషయం ఏమిటో తేల్చేస్తారట..కాస్త నాగ ప్రసాద్ ని చూసి నేర్చుకోండీ :)
మంచు పల్లకి అలాగలాగే ఆ విధం గానే ముందుకు సాగిపోదాం.. నాగా గారు ఏదో అంటున్నారు చూడండి..
నెచ్చెలి ధేంక్యూ దేంక్యూ
నాగ ప్రసాద్.. ఇక్కడ ఆలి టైప్ లో నాలుక బయటపెట్టి బుర్ర ఊపే సీన్ ఒకటి ఊహించుకోండీ.. ఎలాగైనా తమరు చాలా షార్పూ ...
ఉష గారు చాలానాళ్ళకు వచ్చారు ..నచ్చినందుకు థేంక్స్ :)

Raghav చెప్పారు...

@Nagaprasad

"మా రాయలసీమ బ్యూటీలను"

రాయలసీమ బ్యుటీలా ఆళ్ళెక్కడున్నారు బెదరూ?
మీ అనంతపురం లోనే కొంచెం బెటరు అనుకుంటా, మా హిందూపురంలో ఐతే మరీ దారుణం.తిరుపతి అమ్మయిలు కొంచెం బెటర్, కాని వాళ్లంతా విద్యానికెతన్ లోనే ఉంటారు.
ఇలా ఉండబట్టే కదా కర్ణాటక అమ్మాయిల హవా పెరిగి పోయింది మన జిల్లా లో :(

Ram Krish Reddy Kotla చెప్పారు...

@ మంచు : మీరు కాంప్రమైజ్ అయినా నేను లైట్ తీసుకొనే ప్రసక్తే లేదు.. ఒక్కసారి సంకల్పించుకున్నాక, బాలకృష్ణ ఆర్ట్ సినిమా హీరోగా చేసినా కూడా తగ్గేది లేదు..

@ నాగ : మీరు ఆ మాట మీదే ఉండండి.. సీమ బ్యూటీస్ ఉండగా మీకేంటి..కడప, కర్నూల్, అనంతపూర్, చిత్తూర్.. అక్కడితో ఆగిపోండి... నెల్లూరులో ఉండేది మా కోస్తా బ్యూటీస్. దక్షిణ కోస్తాలో బ్యూటీస్ అంతా నెల్లూరులోనే ఉన్నారు, కనుక నెల్లూరుని మా దక్షిణ కోస్తా తమ్ముళ్ళకి వదిలేయమని ప్రార్ధన.. ఎంతైనా మీ సీమ అంటే నాకెంతో గౌరవం, మీరు నిజంగా త్యాగ హృదయులు... మా కోట్ల వంశస్తులు కర్నూల్ ప్రాంతీయులు.. కనుక మా పూర్వీకులు సీమ వాళ్ళేమో అని నా డౌట్... కనుక....ఆదనమాట

@ నేస్తం : కత్తులు కొడవళ్ళు నూరుతున్నారు అని టీ.వీ తొమ్మిది ని అడ్డుపెట్టుకొని మీరు చేసిన వ్యాక్య మా గుంటూరు అమ్మాయిల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉండటంతో, సింగపూర్ ప్రెసిడెంట్ మీ తరఫున క్షమాపణ చెప్పేదాకా గుంటూరు జిన్నటవర్ సెంటర్ నుంచి రాజమండ్రి దేవిచౌక్ దాక మా నిరసన జ్వాలలు ఎగసిపడతాయి... ఇకపోతే గుంటూరు అమ్మాయిలు పాపం మీ అంతః తెలివైన వాళ్ళు కాదు అందుకే నేను గోదావరి అమ్మాయిలను పొగిడినా, కత్తులు నూరకుండా ఎంచక్కా కృష్ణా అబ్బాయిలకో, హైదరాబాద్ అబ్బాయిలకో లైన్ వేసుకుంటారు...

సో...ఆదనమాట...అంచేత కామ్రేడ్స్ , "నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు......" కాదు ఛి ఛి ..." చూడండి, ఒక వైపే చూడండి...రెండో వైపు....." హబ్బా చ ..చ ...హ్మం ...ఆదనమాట :-)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారు, చలాకి పెళ్ళాం ఎవరు? మీరేనా?
నేను ఘరానా మొగుడు అన్నది మీ ఆయన గురించి కాదండి,
మెగా స్టార్ గురించి. ఆయనదీ, మా బేచే.

మంచు గారు, ఈ గొడవ ఇక్కడతో ఆపేయడం బెటరనుకుంటాను.
ఎంతైనా, ఒకే తల్లి (అదే.. గోదావరి తల్లి) నీళ్ళు తాగి పెరిగినవాళ్ళం కదా.
ఇకనుంచి మనం మనం ఒకటే.

3g చెప్పారు...

ఇదెక్కడి గొడవండి ఏదో సాయంచేస్తారని జె.ఎ.సి లోకి పిలిస్తే మొదటికే మోసం వచ్చేలాఉంది. జె.ఎ.సి కే..........న్సిల్.
ఇక ఒంటరి పోరాటం.......... తూ.గో వెర్సస్ ప.గో. ఏఒక్క సీటు బయటికెళ్లటానికి లేదు గెలిచినవన్నీ మావే.

నేస్తం చెప్పారు...

గొడవ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు ఉంది .. తెల్ల జండా ఊపేద్దాం ..ఓం శాంతిః, శాంతిః, శాంతిః :)

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు! చాలా రోజుల తరువాత బాగా నవ్వించారు.
మీరు పగలంతా పడుకునే ఉంటే.. మళ్లీ రాత్రి నిద్ర పడుతుందా..
అదే నాకైతే పగలు అరగంట పడుకున్నా రాత్రి రెండు, మూడు గంటలు జాగారం చెయ్యాల్సిందే!

మంచు చెప్పారు...

అవును బొనగిరి గారు మనం మనం ఒకటి ..:-))

అసలు ఈ నాగా వున్నడే.. మద్యలొ వచ్చి కెలికాడు.. ఇక లాభం లేదు.. నాగ గర్ల్ ఫ్రెండ్ గురించి అందరికి చెప్పేస్తా.. ఒక పెద్ద పొస్టెస్తా ..

పవన్ కుమార్ చెప్పారు...

@Raghav
మా విద్యానికెతన్ లో బ్యూటీలా...
ఎక్కడొ పొరపడ్దారు.

అజ్ఞాత చెప్పారు...

>>పీస్ పీస్ పావలా కాస్ టైపులో
భలే పోలిక.

నేస్తం చెప్పారు...

సవ్వడి అందుకే చెప్పానుగా విధి మళ్ళీ ఆ మాట అనకుండా జాగ్రత్తలు తీసుకుంది అని.. ఇప్పూడు రాత్రుళ్ళే నిద్ర సరిగా పట్టదు..ఇక పగలు కూడానా ,,:(
అభిఙ్ఞా థేంక్యూ
వినయ్ చక్రవర్తి గోగినేని మీరు ఇంజనీరీంగ్ MANCHERIAL NICE COLLEGE లో చేసారు కదా .. ECE బ్రాంచేనా.. మీ క్లాస్మెట్ మీ పొటో చూసి గుర్తు పట్టి చెప్పింది :)

అజ్ఞాత చెప్పారు...

Enti Naaga ikkada evo maa raayalaseema ani kosestunnavu.
Entha "Sandeham" moosesthe maathram "Telambhaama" ni marchipotaaranukunnavaa ?

-- Badri

అజ్ఞాత చెప్పారు...

మన ప. గోదావరి జిల్లా వాసులారా మేల్కోండి, తు. గోదావరి జిల్లా వాసులారా డౌన్ డౌన్ ప. గోదావరి జిల్ల వాసులార జై జై :)

Venugopal చెప్పారు...

Hello Nestam and Nestam Nestams...


Naa peru Venugopal, first time ee blog ki vachi "Konchem istam.. konchem kastam' chadiva.. EE post superb andi Nestam garu...

Danto vadilesana... comments open chesa... Nestam Nestams andaru last olympics china vallala poti padi mari tega comments rasesesi tegatega navvinchesaru... andariki mana telugu dhanyavadalu..

ippudu meerandaru vuhinchinatle nenu kuda ee blog ni naa favorites lo add chesukuni chetulaku skatings shoes vesukuni mari poti padi comments rastanani teliyajesukuntunnanu... jai janma.. Jai Telugu.. sorry naaku political sense konchem ekkuva.. daanni light teskondi...

Anyhow... thanks for nice post again..

మాలా కుమార్ చెప్పారు...

అబ్బ ఏం నవ్వించారండీ బాబు .
ఇదో మా పిల్లల తో కాంపిటిషన్ లో ఈ మధ్య నాకు లాప్ టాప్ సరిగా దొరకక , దొరికినప్పుడు హడావిడిగా నా పని చూసుకోవటము తో మీ పోస్ట్ మిస్ అయ్యాను . అనుకోకుండా ఈ రోజు నాకంటపడ్డది . అమ్మయ్యో ఎంత లేట్ అయ్యానో .

Unknown చెప్పారు...

కాస్త busy గా వుండి, మీ టపా తీరిక గా చదువుదాం అని వాయిదా వేస్తూ వచ్చి, ఇవాళ్టికి అయ్యింది. ఎప్పట్లాగే super...మీరూ ఆ సందీప్ ముందు phone లో తెలుగులో బడబడా మాట్లాడేసి కిచ కిచా నవ్వెయ్యాల్సింది, దెబ్బకి ఏడుపు మొహమేస్కుని రూము లోకి పరిగెట్టేవాడు. :)

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు :)
వేణు గోపాల్ గారు చాలా దేంక్సండి ..కాస్త బిజి గా ఉండటం వల్ల రిప్లయ్ లేట్ అయింది :)
మాలా కుమార్ గారు :) నేనూ ఈ మధ్య సూపర్ బిజీ..ఇల్లు మారాలి అందుకే ఇళ్ళ వేట లోపడ్డాం..
స్పురితా కదా :) ఈ సారి ఎవరన్నా అలా చేస్తే అదేపని చేస్తా :)

సుజ్జి చెప్పారు...

దేశం కాని దేశం లో కూడా మంచి పేరు సంపాదిస్తున్నారు..
ఐ లైక్ దట్టు.

Vasu చెప్పారు...

అదరగొట్టేశారు. అద్భుతంగా ఉంది మీ పోస్ట్. ఎలా మిస్ ఐపోయానో ఇన్నాళ్ళు.

రాధిక(నాని ) చెప్పారు...

బాబోయ్ నేస్తం గారూ ,ఏమిటండీ ఇలా నవ్వించేస్తున్నారు.చాలా.......చాలా.........బాగున్నాయిమీ పొస్టులన్నీ......
ఇన్నిరోజులూ చాలా మిస్సయ్యాను మీపోస్ట్లు చదవక .
ఇక ఫాలోఐపోతున్నాను మిమ్మలిని వదలక.
మీ హాస్య రస ప్రవాహంలో కొట్టుకుపోవడానికి నేనూ ప్రవేసిస్తునాను.