6, మే 2010, గురువారం

అదో మరపురాని రోజు...


'సిమే' .. సింగపూర్లో నేను విడిది చేసిన మొట్టమొదటి ప్రదేశం.. ఉన్నది కొద్ది నెలలే అయినా మరుపురాని అనేక అనుభూతులకు నిలయం ... చాలా రోజులతరువాత మా వారిని చూసానన్న ఆనందం వల్లో ఏమో 'కేబ్ 'ఎక్కగానే ఇంక ఊరు చూడటం మానేసి కబుర్లలో పడిపోయాను .. అదికాదు బుజ్జీ, మరేమో క్రొత్తగా జాయిన్ అయ్యాను కదా..పైగా జీతం కూడా ఎక్కువ కాదు.. ఇంకా చెల్లి పెళ్లికనీ కొంత డబ్బు ఇస్తా అన్నాను అందుకనీ ..అని ఆగారు మావారు ...అందుకనీ?? రెట్టించాను .. అందుకనీ ఇల్లు షేరింగ్ కి తీసుకోవలసి వచ్చింది అన్నారు నసుగుతూ .. షేరింగ్?? అంటే ?? అన్నాను అర్ధం కాక .. అంటే మనం ఓనర్ తో కలసి ఉంటాం ... మనకొక బెడ్ రూం ఇస్తారు ..కిచెన్ ఇద్దరం ఉపయోగించుకోవచ్చు ..వాషింగ్ మిషన్,ఫ్రిజ్ అన్నీ కూడా ... నాకు విసుగొచ్చింది.. ఎలా అండి!!! మీరేమో ఆఫీస్ కి వెళ్ళిపోతారు.. ఎవరో ,ఏమిటో తెలియని వాళ్ళతో ఎలా కలసి ఉండేది ?? పైగా వాళ్ళ బాష ,నా భాష ఒకరికొకరికి అర్ధం కావద్దూ అన్నాను దీనంగా.. ఆ విషయం లో బెంగ పెట్టుకోవద్దులే ..వాళ్ళు మన తెలుగు వాళ్ళే.. అందుకే కాసింత అద్దె ఎక్కువైనా'సరే 'అనేసా అన్నారు... నిజ్జంగానా !!!బోలెడు ఆనందం వేసేసింది ... ఇన్నాళ్ళు ఎలారా బాబు ఒక్కదాన్నే ఈ దేశం కాని దేశం లో అని తెగ ఫీల్ అయిపోయేదాన్ని..

మాటల మధ్యలోనే ఇంటికోచ్చేసాము.."అంకుల్ " 6 $ అన్నాడు టాక్సీ డ్రైవర్ .. నాకు' మహేష్ బాబు 'చాచి పెట్టి కొట్టినట్లు అనిపించింది.. ఆ టాక్సీ డ్రైవర్ కి దాదాపు అరవై పైనే ఉంటాయి .. ఇదేంటండి మరీ విడ్డూరం, మీరు అంకులేంటీ!!! అన్నాను.. అదా ,అలా అపార్ధం చేసేసుకోకు ..ఇక్కడ అపరిచిత వ్యక్తులని అంకుల్,ఆంటీ అని పిలుస్తారు అన్నారు ... హుమ్..గొప్ప పనిచేస్తారు అనుకుంటుంటే ..అమ్మా ,నాన్నా గుర్తువచ్చారు.. ఏమండీ! ఇంటికి వెళ్ళగానే పోన్ చేద్దాం అన్నారూ అన్నాను..అప్పటికి మావారి దగ్గర మొబైల్ లేదు ..(ఇది జరిగి మరి దాదాపు పదేళ్ళు అవుతుంది ) సరే పదా ,అని నన్ను ఆ బిల్డింగ్ క్రిందకు తీసుకు వెళ్ళారు..

ఒక చోట ఒక టెలిపోన్ బాక్స్ ఉంది .. ఇదేంటండి ఇక్కడ ఎవరూలేరూ , ఎవరిదీ ఈ పోన్ అన్నాను.. గవర్నమెంట్ ది.. ఇక్కడ అన్ని బిల్డింగ్ ల క్రింద టెలిపోన్ బాక్స్ లు ఉంటాయి అంటూ ఒక కార్డ్ తీసి ఏవేవో నెంబర్స్ నొక్కారు ... ఇదేంటి అన్నాను ఆక్చర్యం గా .. ఇవి పోన్ కార్డ్స్ లే అని.. అమ్మా,నాన్నకు ,అత్తయ్యమావయ్యకు కాల్ చేసి చెప్పారు నేను క్షేమం గా చేరాను అని .. అక్కడి నుండి నడుచుకుని వస్తుంటే మెట్లదగ్గర బోలెడు సిగరెట్టు ముక్కలు ,పేపర్లు ... ఇదేంటి ఇంత చెత్త ఉంది ఇక్కడ?? అసలు ఇక్కడ ఎంత శుభ్రంగా ఉంటుంది అంటే మన మొహం అద్దంలో చూసినట్లు ఉంటుంది అన్నారూ,పైగా ఇందాకా ఎక్కడపడితే అక్కడ చేత్తవేయకు పైన్ వేసేస్తారు అన్నారూ అని సాగదీసి అడిగాను ..అబ్బా,మాట వరసకు అంటే నిజంగా మొహం చూసేసుకున్టావా ..ఎవరో నీలాంటి వాళ్ళే తర్కంగా వేసి ఉంటారు.. అయినా ఏం పెట్టావే బాబు ,ఈ బేగ్ ఇంత బరువుంది అని విసుక్కున్టూ ఒక ఇంటి ముందు ఆగి తలుపు తీసారు ...

మెల్లిగా లోపలికి అడుగు పెట్టి చూసాను .. ఎంత బాగుందో.. చక్కగా ,నీట్ గా విశాలంగా,ఖరీదైన పర్నిచర్ తో నాకు చాలా నచ్చేసింది హాల్.. అబ్బా !!!భలే ఉందండి ఇల్లు అటు ,ఇటు తిరుగుతూ అన్నాను.. ఉష్ ..ష్ మెల్లిగా మెల్లిగా మాట్లాడు.. లోపల ఇంకా జనాలున్నారు అని చెప్పాను కదా అన్నారు కంగారుగా.. హుమ్..మళ్లీ అదొకటి ఉంది కదూ అనుకుంటుంటే మా రూం తలుపులు ఓపెన్ చేసారు .. ఇదేంటండీ ,ప్రతి రూం కి తాళాలు ఉంటాయా అన్నాను.. ఊ.. డోర్ పడగానే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతాయి జాగ్రత్త ..తాళం నీదగ్గరే పెట్టుకోయేం అన్నారు.. నాకన్నీ విచిత్రంగా విచిత్రం గా అనిపిస్తున్నాయి..

విశాలమైన బెడ్ రూం ..తెల్లని కప్ బోర్డ్స్ .. ఆ ప్రక్కనే అటాచ్డ్ బాత్ రూం .. అలా చూస్తూ మంచం చూడగానే తిక్క కోపం వచ్చింది.. దుప్పటి అనేది కనబడకుండా అడ్డం గా టవల్స్ ,వైర్లు,పుస్తకాలు,బట్టలు .. మీరున్నారు కదా ,హంస తూలికా తల్పం ఇచ్చినా అడ్డంగా తువ్వాలు ఆరబెడతారు తిట్టుకుంటూ వాటిని సర్దడం మొదలు పెట్టాను.. అంతేలేవే పాపం ఇన్నాళ్ళు ఎలా తిన్నాడో, ఏంటో.. అబ్బే ఏమీ లేదు..క్రొత్త జాబ్ ..ఎంత వర్కో తెలుసా అన్నారు.. కడుపు తరుక్కుపోయింది ..అసలు ఆయనకు కోడిగ్రుడ్లు ఉడకపెట్టడం కూడా రాదు.. పాపం ఏం తిన్నారో ఇన్నాళ్ళు?? .. దాదాపు ఎనిమిది కేజీలు తక్కువ కాకుండా తగ్గిపోయారు ...నేను పూర్తిగా బాధ పడకముందే అబ్బా!! అవన్నీ ఇప్పుడు సర్దేయాలా, రేపు నేను ఆఫీస్ కి వెళ్ళగానే ఖాళినే కదా .. పద ఆకలి వేస్తుంది భోజనం చేసేద్దాం అన్నారు.. అయ్యో ఇంకా తినలేదా ??వంట చేయనా అన్నాను.. అక్కరలేదు ,నేను వండేసా ఇద్దరికీ .. అంటే అన్నం ,పెరుగు,పచ్చడి అన్నారు.. అబ్బో అన్నం కూడా వండటం వచ్చేసిందా అన్నాను నవ్వుతూ.. అదేమన్న బ్రహ్మ విద్యేంటి.. ఒక కప్పు బియ్యం, రెండుకప్పుల నీళ్ళునూ అంటూ నన్ను కిచెన్ లోకి తీసుకు వెళ్ళారు ...

నేనెప్పుడు అంత ఆధునికమైన వంట గది చూడనే లేదు .. స్టవ్ అయితే నాలుగు బర్నర్లు ఉన్నాయి ... ఇదెలా వెలిగిస్తారండి అన్నాను లైటర్ కోసం చూస్తూ .. లైటర్ అక్కరలేదే ఈ బటన్స్ నొక్కగానే ఆటోమేటిక్ గా వెలుగుతాయి అని చూపించారు .. విమానం శబ్దం వినగానే కిటికీ దగ్గర కొచ్చి నించున్నా.. ఎయిర్ పోర్ట్ ఇక్కడ దగ్గర... ప్రతి పది నిమిషాలకొకటి వెళుతుంది అన్నారు ..ఓ ..అనుకుంటూ యాదాలాపంగా ముందుకు చూసాను ..ఎదురు అపార్ట్మెంట్ ముందు అన్నీ బోలెడు కర్రలు గ్రుచ్చి ఉన్నాయి... ఏమిటండి అవి అన్నాను.. ఇక్కడ అపార్ట్మెంట్ పైకి వెళ్ళనివ్వరు కదా బట్టలు ఆరబెట్టడానికి ..అందుకనీ కర్రల పై ఆరబెట్టి అలా పెడతారు ..వర్షం వస్తే ఇదిగో వంటగది పైన అలా తగిలిస్తారు అని చూపించారు ... హమ్మయ్యో !!!భలే తెలివండి వీళ్ళకు అన్నాను..

భోజనం ఇక్కడ వద్దులే మళ్లీ ఎవరన్నా వస్తే ఇబ్బందిగా ఉంటుంది..బెడ్ రూం లో తినేద్దాం అన్నారు ..సరే అని కంచాలు,గ్లాసులు అన్నీ మోసుకు వెళ్లాం..అన్నం ,ఆవకాయ పచ్చడి వేసుకుని పెరుగు కోసం గిన్నెపై మూత తీస్తే బ్రౌన్ గా ఉంది పెరుగు.. ఇదేంటండి ఈ కలర్ లో ఉంది అన్నాను అయోమయం గా చూస్తూ.. అలాగే ఉంటుందిలే నువ్వు తిను అన్నారు ... కొంచెం వేసుకుని అన్నంలో కలుపుకుని ఒక్క ముద్ద పెట్టుకున్నానో లేదో' యాక్ ' తీపి పానకం ... అబ్బా!! ఏంటండీ ,ఇదేం పెరుగండి బాబు అన్నాను.. మరి చాక్లెట్ పాలతో తోడుపెడితే తియ్యగా ఉండదేంటి అన్నారు తను మాములుగా తినేస్తూ.. బాబోయ్ చాక్లెట్ మిల్కా !!!దానితో పెరుగా అన్నాను అసహ్యం గా మొహం పెట్టి...మరేం చేయను, నాకేమో ఇక్కడ ఎక్కడ ఏముంటాయో తెలియదు..మా ఆఫీస్ లో అందరు చైనా వాళ్ళే ..వాళ్లకు మన ఫుడ్ గురించి అసలు తెలియదు.. అందుకే ఇలా ఏది పెడితే అది తినేస్తున్నా అన్నారు.. నాకు కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి ..మా ఇంట్లో ఆయనకు నచ్చని కూర చేస్తే చిన్నపాటి యుద్ధం జరిగిపోయేది.. పాపం అనిపించింది ..పోనీ ఇంటి ఓనర్ తెలుగువాళ్ళే అంటున్నారుగా వాళ్ళని అడగచ్చుగా ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో అన్నాను.. ఆ మాట ఆయనకు ఎందుకో నచ్చలేదు ..కాస్త మొహం చిరాగ్గా పెట్టి ..అది సరేగాని మన భాషే అని ఆమెతో ఒకటే సోది వేయకు ..నీ పని ఏదో నువ్వు చూసుకో.. సరేనా అన్నారు...ఎందుకనీ అన్నాను విసుగ్గా.. నాకసలే నోరు కట్టుకుని కుర్చోవాలంటే మహా చిరాకు.. ఎందుకని అంటే ఏం చెప్పను..ఇదేమన్నా మన ఊరు అనుకున్నావా .. ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి అన్నారు .. హుమ్.. అని నిట్టూర్చి పచ్చడి కలుపుకుని ఎలాగో భోజనం తినేసాను..

ఇండియా నుండి అంట్లు తోముకునే పీచు తో సహా తెచ్చా అని గొప్పలు పోతుంటే ...అదే మరి తెలివి తక్కువతనం అంటే ...ఇక్కడ ఎవరూ తినరా ,గిన్నెలు తోముకోరా భలే ఆలోచిస్తావ్ అని కాసేపు ఏడిపించారు.. నేను మాత్రం ఉరుకుంటానా .. చాక్లెట్ మిల్క్ తో పెరుగు చేసుకుంటారు కాబట్టే తెచ్చాను అని తిరగబడిపోయాను అనుకోండి అది వేరే విషయం ..ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా' ఢాం ' అంటూ సౌండ్ వచ్చేసరికి కంగారు పడిపోయాను ...ఓరి దేవుడోయ్ ..ఏంటండి అది అన్నాను కిటికీ లోనుండి బయటికి చూస్తూ ... ఎప్పుడు ముసిరిందో తెలియదు మబ్బు..నల్లగా కమ్మేసింది.. ఒకటే మెరుపులు ,ఉరుములు ,వర్షం... అవి కూడా మామూలు పిడుగులు కాదు..భయంకరం గా ప్రక్కనే పడుతున్నట్లు..చెవులు చిల్లులు పడుతూ ... నేను ఎప్పుడూ వినలేదు అంత సౌండ్ .. ఇదేంటండి ఇప్పటివరకు వెన్నెల పుచ్చ పువ్వులా విరగ కాసింది ..ఎప్పుడు మబ్బేసింది అన్నాను అయోమయంగా .. ఇక్కడ అంతే ,అప్పటి కప్పుడు ఎండ మండిపోతుందా ..రెండో నిమిషంలో వర్షం వచ్చేస్తుంది ...ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎండాకాలం,వర్షాకాలం అని సీజన్ ఉండదు మనకులా .. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.. వారం లో ఒకటి రెండు సార్లు వర్షం తప్పనిసరిగా పడుతుంది అన్నారు.. అవునా అన్నాను ఆక్చర్యం గా ...

నాకు అన్ని విషయాలు చాలా క్రొత్తగా ,అయోమయంగా అనిపించాయి.. అలా ఎప్పుడు నిద్రలో జారుకున్నానో తెలియదు .. తెల్లవారు జామున బుజ్జీ లే ..లే అని ఎవరో పిలుస్తున్నట్లు.. అంత ఘాడ నిద్ర లో లేపుతుంటే చాలా ఏడుపోచ్చేస్తుంది.. ఏంటండీ అన్నాను విసుగ్గా ... ఆరయ్యింది ...వంట చేస్తానన్నవుగా లేచి బాక్స్ పెట్టు అన్నారు.. నాకసలే తెల్లవారు జామున విపరీతంగా నిద్ర పడుతుంది ..అందులోను అంత చల్లని వాతావరణం లో లేవడమే? అమ్మో నావల్ల కాదు .. రేపటినుండి వండుతా .. ఈ రోజు బయట తినేయండి ..ముసుగు కప్పెసా..కాని అవతల ఉన్నది ఎవరూ..జాలి,దయ అనే పదాలకి అర్ధం తెలియని మా ఆయన ... ఓయ్ ..నిన్నేమో పెద్ద పతివ్రతా శిరోమణి లా ..ఇంకేముందండి ,నేను వచ్చేసానుకదా..వండి ఉద్దరించేస్తా అని కబుర్లు చెప్పావ్.. లే..లే అని ఒకటే గోల ...

ఏడుపు మొహం వేసుకుని లేచి కిటికీ లోంచి చూసాను..చిమ్మ చీకటి ..అబ్బా ..ఇంకా ఆరయ్యి ఉండదు అండీ.. చూసారా ఎంత చీకటిగా ఉందో అన్నాను మళ్లీ పడుకుంటూ.. నీ మొహం ఇక్కడ సెవెన్ అయితే గాని తెల్లారదు ... రాత్రి సెవెన్ దాటితే గాని చీకటి పడదు .. నిజానికి ఇక్కడి గవర్నమెంట్ షేర్ మార్కెట్ కోసం ఇలా టైం ముందుకు జరిపిందంట.. ఇంక లే, అని నసపెట్టి తను హాయిగా పడుకున్నారు .. ఛీ, వీళ్ళకు పనిపాట ఏం ఉండదు అనుకుంటా.. దిక్కుమాలిన దేశం తిట్టుకుంటూ లేచి బయటకు చూసాను ఆ సరికే చాలా అపార్ట్మెంట్లో లైట్లు దేదీప్యమానం గా వెలిగిపోతున్నాయి.. చాలా మంది హడావుడిగా ఆ పాటికే పరుగులు పెడుతున్నారు.. నిన్న సామాను సర్దుతా అంటే ఒప్పుకోలేదు ఇప్పుడు వంట ఎలా చేయను నా మొహం ..ఆ చీకట్లో కావలసిన సామాను తడుముకుని వంటగదిలోకి వెళ్లాను..

53 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

I am first

పవన్ కుమార్ చెప్పారు...

ఈ సారి మాత్రం మొదటి కామెంట్ నాదే

divya vani చెప్పారు...

బాగుందండి నేస్తం గారు మీ సింగపూర్ లో మొదటి రొజు ,మరపురాని రోజు .. .. నాకు' మహేష్ బాబు 'చాచి పెట్టి కొట్టినట్లు అనిపించింది " ఆ డైలాగ్ బాగుందండి . నిజంగా గాఢ నిద్రలో నుండి లేవడం కష్టమే నాకైతె ముందు లేపిన వాల్లని నలుగు తన్నాలని అనిపిస్తుంది ...... కాని ఆ బట్టలు ఆరబెట్టె సీను మత్రం సూపరండి .
నేను మి బ్లాగు కి వీరాభిమానిని అండి మీ పొస్టులు చాలా బాగుంటాయి ,కాని మీ ఫొటొ చుసే భాగ్యం నాకు లేదండి

Ram Krish Reddy Kotla చెప్పారు...

చాలా బాగా చెప్పారు ముచ్చట్లు...ఆ మరపురాని రోజు ఇంకా ఏమయ్యిందో త్వరలో రాయండి మరి...ఈ టపాలో మిమ్మల్ని తలచుకొంటే అదేదో సినిమాలో విలేజ్ లో పెరిగిన హీరోయిన్, పెళ్ళిచేసుకొని విదేశాలకి వస్తే ఎలా ఉంటాడో అలా ఉంది.. :)

అజ్ఞాత చెప్పారు...

ayyo..ayyo...ayyaayyooo..(bobbiliraja style)
Nenu choosesariki 1 comment undi.. appudey 4 ipoyayi....:(
Singapur choopinchestunnaru maaku..
meeru singapur velli 10 years ayyinda??
మహేష్ బాబు 'చాచి పెట్టి కొట్టినట్లు అనిపించింది . haha
punch lu veyyatam lo meeku mere sati..tapa routine ga super ga undi.....

Rajkumar

రాజ్ కుమార్ చెప్పారు...

Nestam garu.. antaku mundu post lo meeru 3 years matramey singapur lo untamani cheppinattu gurthu.. marippudemo 10years ayyindantunnaru??? meerippudu singapur loney kada untunnaru?? baaboi naaku chala doubts vachestunnai..twaraga cheppandi..

Rajkumar

పవన్ కుమార్ చెప్పారు...

మల్లీ మిస్స్ అయ్యాను మొదటి కామెంట్.
తరువాయి బాగం వచ్చె వారమా...
ఆ టపా పేరు వంట యుద్దమా
తయారు చెయ్యబొతున్న పదార్థం కిచ్చెన్ లొ కిచి కిచి కదా
నాకు తెలిసి పొయింది లే

Unknown చెప్పారు...

ఛాల బాగుందండి, ఈ షెరింగ్ అన్ని చొట్లా ఉన్నాదె లెదంటె చాలా ఎక్కువ పెయ్ చెయ్యలి, మీ ఒనర్స్ తొ గొడవలు ఎమి జరగలెదు కదా! నాకు తెలిసి రెండు తెలుగు ఫెమలిస్ ఒకె ఫ్లాట్ లొ షెరింగ్ లొ గొడవలు లెకుండ ఉండడం జరగదు

David చెప్పారు...

నేస్తం గారు మీ విదేశి ప్రయాణం,మీ అనుభవాలు చాల మంచిగా వివరించారు..మీకు విలైతే ఒక పుస్తకం రాయండి చాలమంది చదువుతారు

నేస్తం చెప్పారు...

మంచు పల్లకి గారు :D
దివ్యా ..మీకు నాలుగే తన్నాలి అనిపిస్తుంది నాకు నలబై తన్నాలనిపిస్తుంది :)బట్టలు విషయం లో నాకు కూడా భలే అనిపిస్తుంది.. ఇలాంటి విషయాల్లో ఇక్కడ ఉద్దండులు..:)
కిషన్ విలేజ్ లో పెరగకపోయినా..పక్కా మద్యతరగతి ఉమ్మడి కుటుంభం ఇంకా ఇల్లూవాకిలి తప్ప వేరే ప్రపంచం తెలియకుండా ఉన్నట్లు ఉండి అలాంటి ప్రదేశం లోకి వచ్చేసరికి కాస్త తికమక వచ్చేసింది :)

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

Excellent Narration!!

నేస్తం చెప్పారు...

రాజ్ కుమార్ విధి విచిత్రమైనది :P మూడేళ్ళు అని చెప్పి అలాంటి మూడులు మూడు చేసారు మావారు..ప్రస్తుతానికి సింగపూర్ లోనే ఉన్నాను .. అదీ సంగతి :)
పవన్ కుమార్ అబ్బో తమరు గ్రేట్,సూపర్ భలే కనిపెట్టేసారు .. :)
కోనసీమ కుర్రాడు గారు :) అలా నిజాలు చెప్పేస్తే ఎలా అండీబాబు
డేవిడ్ గారు ఇక్కడ వ్రాస్తున్నాను కదండి.. మావారికి ఎప్పుడూ చెప్తా.. కాస్త ప్రింట్ చేసి పుస్తకంలా చేయండీ ..దాచుకుంటా అని.. దానికే ఆయనకు కుదరదు :)

mahipal చెప్పారు...

mevi anni post lu .....nenu print chesi bind chesanu kavalante naku cheppandi mekoka copy istha!.....kani naku matram me abimanasangam lo adhyakshuni post ivvali mari.... ok na... monna evaro vishwanath garu abhimana sangam pedutha annaru... kani nenu meku mundhe cheppa nene peduthanani ... mere vinaledu........nenoppukonu oppukonu oppkunanthe!

నేస్తం చెప్పారు...

ఇదేంటబ్బా నా పోస్ట్ కూడలిలో అసలు కనబడలేదు..
గనేష్ గారు థెంక్యూ :)
మహిపాల్ అలాగే నెక్స్ట్ టైం మావారు ప్రింట్ చేయను అంటే మిమ్మల్నే అడుగుతా..
ఏంటి మీరందరూ మాట్లాడుకుని మరీ నన్ను బకరాని చేస్తున్నారా:) మీరేంటి నేనసలు ఒప్పుకోను ..నాకసలు అభిమాన సంఘం వద్దంటే వద్దు ..అస్సలు ఒప్పుకోను :)

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

చాలా బాగా రాస్తున్నారు. ఇంతకు పుస్తకం ఎప్పుడు పబ్లిష అవుతుంది? నిజంగా మీరుకనాక సీరియస్ గా ఓ పుస్తకం ప్రింట చెయ్యాలి అనుకుంటే మంచి అయిడియా. మ స్నేహితులందరికీ, ముఖ్యంగా మా చెల్లెలికి గిఫ్ట్గ్ గా ఇవ్వాలి. :)

శ్రీనివాస్ చెప్పారు...

షేరింగ్ రూమ్స్ లో ఉండడం బ్యాచిలర్స్ కి కూడా అలవాటు. మా ఊర్లో చాలామంది స్టూడెంట్స్ షేరింగ్ రూమ్స్ లో ఉంటారు. ఐనా సరే ప్రింట్ కి మూడు రూపాయలు తీసుకుంటాను

శ్రీనివాస్ చెప్పారు...

మర్చి పోయా పోస్ట్ బాగుంది ఆంటీ

Sai Praveen చెప్పారు...

"మీరున్నారు కదా హంస తూలికా తల్పం ఇచ్చినా అడ్డంగా తువ్వాలు ఆరబెడతారు" సూపర్.

అయినా మీరేవరండి అభిమాన సంఘం వద్దని చెప్పడానికి. ఆల్రెడీ నేను వేణురాం శిబిరాలకి ఏర్పాట్లు మొదలు పెట్టేశాం (శిబిరాల గురించి గుర్తుందా :) ).

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నేస్తం..భలే ఉన్నాయి కబుర్లు..మీ వారు ఆ తెలుగు ఫ్యామిలీతో దూరంగా ఎందుకుండమన్నారో నాకు కొంచెం లైట్ వెలిగింది...ఆవిడ వాళ్ళయనకు మందు కొడుతుండంగా కంపెనీ ఇస్తూ ఉండి ఉంటుంది..మీరు కూడా అలా కంపెనీ ఇస్తానని అంటారేమోనని మీవారి భయం కాబోలు..కదా...:-):-)..అదుగోండి అలా కోపంగా చూడకూడదు మరి..ఊరికే సరదాగా అన్నా..
అయినా మీరిలా ఎపిసోడ్స్ క్రింద రాయటాన్ని నేను ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాను...అజ్జెంటుగా తర్వాత పోస్ట్ రాయండి...

3g చెప్పారు...

అంటే.... ఇంకా పదేళ్ల జ్ఞాపకాలు పెండింగ్ లో ఉన్నయన్నమాట.
ఈ పోస్టు కూడలిలో రావట్లేదేంటండి.

చైతన్య చెప్పారు...

టైటిల్ సరిగా లేకపోతే (అస్సలు లేకపోతే) కూడలి లో పోస్ట్ కనిపించదు అనుకుంట. మీరు టైటిల్ ఇచ్చారు... కానీ ఎందుకో అది కనిపించటం లేదు... నా బ్లాగ్ లో నేను ఫాలో అయ్యే బ్లాగ్స్ లిస్టు లో కూడా మీ పోస్ట్ టైటిల్ కనిపించటం లేదు!

Post is good :)

sphurita mylavarapu చెప్పారు...

ఎప్పుడూ లాగే super గా రాసారండీ. అన్నట్టు నా Blog లో Comment కి చాలా చాలా థాంకులు. నా Blog లోనే Thanks చెప్పినా మీరు మళ్ళీ చూడరు కదా అందుకని ఇక్కడే చెప్పేస్తున్నా. అన్నట్టు ఇంకో విషయమండోయ్. నాకు నేను రాసిన కొత్త post ఏదైనా ముందు మా నాన్న గారికి, అమ్మకి వినిపించి అప్పుడు post చెయ్యటం అలవాటు. తెలుగు లో ఎమైనా తప్పులూ, తడకలూ ఉంటే మా నాన్నగారు సరిచేస్తారని. నిన్న నా post విని మా అమ్మ కళ్ళ నీళ్ళూ పెట్టేసుకుంటే మీ "అలా వచ్చాను అన్నమాట ఈ దేశానికి" post చదివి వినిపించాను. ఒక సారి చదివినదే ఐనా ఇక్కడ చదువుతూ నేను నవ్వు, వింటూ మా అమ్మ ఐతే నవ్వులే నవ్వులు. మా నాన్న గారైతే మీ "ఆహా ఏమి రుచి" విని మీ అభిమాన సంఘం లో చేరిపొయారనుకోండి

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు! పది సంవత్సరాలు ఐయ్యిందా.. ఇంత వివరంగా ఎలా గుర్తున్నాయండి..! ఈ పది సంవత్సరాల విషయాలు మీరు చెప్పేసరికి సింగపూర్ అంతా చూసేస్తామేమో అనిపిస్తుంది. అన్నీ త్వరగా చెప్పండి.

జాజిపూలు అభిమాన సంఘం చెప్పారు...

నేను అజ్ఞాత గా కామెంతుతూ వుండడం వాల్లన మాకు గుర్తింపు రాకపోయినా పరవాలేదు
మీ అభిమానులం అని చెప్పుకొని మేమంతా హాయిగా బ్రతికేస్తున్నాం
ఇంట్లో మమ్మల్ని తిడతారు నువ్వు ఒక్క మంచి పని కూడా చెయ్యవు అని నేను అప్పుడు మా అమ్మ కి చెబుతాను నేను జాజిపూలు బ్లాగు చదువుతున్న అని
ఇంట్లో మేమంతా మీ ఫాన్స్ అయిపోయాం ఇప్పుడు
మీ బ్లాగు చదివి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం
మీరు మీ బ్లాగు సంఘానికి ప్రేసేడేంట్ పదవులు ఎవరికి ఇవ్వాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలతో అసలు సంఘాలు వద్దు అని అసలు టెన్షన్ పడకండి
మీరు పోస్ట్ లు బాగా రాయండి అదొక్కటే మేము కోరుకొనేది ఈ సంఘాలు గట్రా మీకు అనవసరం
ఇవన్నీ మాకు వదిలేయండి

జాజిపూలు అభిమాన సంఘం చెప్పారు...

మంచు పల్లకీ,పవన్ కుమార్,సాయి ప్రవీణ్,విశ్వనాథ్ మహిపాల్,నేను ప్రస్తుతానికి మెంబెర్స్
అనగా మీ వీరాభిమానులం
ఇంకా ఎవరైనా చేరుతారా?

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాగున్నాయ్ మరపురాని రోజు విశేషాలు :-)

హరే కృష్ణ చెప్పారు...

చాలా చాలా బావుంది
మళ్ళీ సస్పెన్స్ :(
తొందరగా రాసేయండి కనీసం వచ్చేవారం అయినా
ఎప్పటి లానే మీ టపా సూపర్
కామెంట్లు ఈసారి డిలీట్ చెయ్యొద్దు
గతవారం టపాలో కామెంట్లు డిలీట్ అయ్యాయి

Anil Dasari చెప్పారు...

@నేస్తం:

>> "పక్కా మద్యతరగతి ఉమ్మడి కుటుంభం ఇంకా ఇల్లూవాకిలి తప్ప వేరే ప్రపంచం తెలియకుండా ఉన్నట్లు ఉండి అలాంటి ప్రదేశం లోకి వచ్చేసరికి కాస్త తికమక వచ్చేసింది"

అయ్యబాబోయ్ .. మరీ ప్రపంచాన్ని పట్టించుకోని రేంజిలో తాగేస్తారా!?!

నేస్తం చెప్పారు...

ప్రేమికుడుగారు మీ చెల్లెలికి గిఫ్ట్ గా ఇవ్వాలి అన్నారు చూడండి ... భలే సంతోషం అనిపించింది :)
శ్రీనివాస్ అంకుల్ మరేం పర్వాలేదు.. ప్రస్తుత ఇంటి ఓనర్ కి 89 యేళ్ళు ..ఆయన సింగపూర్ వచ్చినపుడల్లా ఆంటీ ,ఆంటీ అని ఒకటే పాట పాడుతూ ఉంటాడు కాబట్టి.. తమరు ఆంటీ అన్నా,అమ్మమ్మా అన్నా నాకేం అనిపించదుగా :)
సాయి ప్రవీణ్ ,జాజిపూల సంఘం ...బాబ్బాబు ,మీకు పుణ్యం ఉంటుంది ..ఆ సంఘాల గోల మనకేల ..ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయంటే చాలు ..మా ఆయన ఒక రేంజ్ లో ఏడిపించేస్తున్నారు .. వదిలేద్దురూ

నేస్తం చెప్పారు...

శేఖర్ మా ఆయనకు అసలేం భయంలేదు ఆ విషయం లో.. ఒక్క పోన్ మా నాన్న గారికి చేస్తే చాలు.. నా పని పెనం మీద పెసరట్టే.. నేను మా పుట్టింటికి వెళిపోతా అని పొరపాటున బెదిరించినా జడవరు సరికదా టికెట్ ,సూట్ కేస్ చేతిలో పెడతారు ..మళ్ళా నేనే బ్రతిమాలుకోవాలి ఉంటాను అని :(
3g ,చైతన్య ఏంటొ నిన్న చాలా సేపు రాలేదు..తరువాత కనబడింది..
స్పురిత నిన్న నీ వ్యాఖ్య వచ్చే సమయానికి నేను ఒక ఫ్రెండ్ కి మీ పోస్ట్ గురించి చదివి వినిపిస్తున్నా చూడూ ఎంత బాగా రాసారో తన బాధ అని ఇంకా మీ పైంట్ బ్రష్ బొమ్మలు కూడా చూపించా ..నాక్కూడా ఒక పోస్ట్ నచ్చిందంటే ఊరికే ఉండబుద్ది వేయదు.. ఎవరో ఒకరితో ఆ సంతోషాన్ని పంచుకుంటా ..అక్కడితో వదలకుండా బాగుంది కదా,బాగుంది కదా అని పది సార్లు వాళ్ళ చేత 'ఊ ' అనిపించుకుంటే గాని మనః శాంతి ఉండదు :)నా పోస్ట్లు ఇంట్లో వాళ్ళందరితో పంచుకున్నందుకు బోలెడు థేంక్యూలు ..

నేస్తం చెప్పారు...

సవ్వడి ఏంటో పనికొచ్చేవి ఒక్కటి కూడా గుర్తు ఉండవు .. ఇలాంటివి బాగానే గుర్తుంటాయి :)
అభిమాన సంఘం గారు ఇంట్లోవాళ్ళందరి తోనూ నా పోస్ట్ పంచుకోవడమే నాకు బోలెడు ఆనందం అది చాలు నాకు :)
వేణూ :) థేంక్యూ
హరే క్రిష్ణ మొన్న పోస్ట్ అనుకోకుండా డిలీట్ చేసేసాను ..దాంతో చాలా వ్యాఖ్యలు పోయాయి .. ఆ విషయం చెప్తూ మళ్ళీ పోస్ట్ ప్రచురించాను .. :)
అబ్రకదబ్ర గారు ..రామ రామ ఏంతమాట అనేసారు :) .. ఓ రెండు నిమిషాలు నాకు అర్ధం కాలేదు ఏంటబ్బా అని :)

పవన్ కుమార్ చెప్పారు...

జాజిపూలు అభిమాన సంఘం గారు

ఈ అభిమాన సంఘానికి మీరే ప్రెసిడెంట్. మేము అంతా మీ వెనెకే ఉన్నాం.
పిచ్చెక్కిద్దాం....

ఇట్లు
మెంబర్
J.F.A (జాజిపూలు ఫాన్స్ అస్సొసియేసన్)

సిరిసిరిమువ్వ చెప్పారు...

హమ్..మీ పెళ్లయి ప్పది సంవత్సరాలయిందా? మీ కబుర్లు చూస్తే నిన్న మొన్న పెళ్లయినట్లుంటుంది:))

harita చెప్పారు...

eppatidaka me posts evi miss avvakunda chadiva... kani okkasari kuda comment cheyyala... JFN vachesariki.... ela commentunna... heroins ki temple kattinattu... me kosam malli spl blog.. naku telisi entavaraku e blogger ki kuda fans malli blog create cheyyala... u rock... me kosam blog create chesaru... enka eppatiki kuda comment rayakapote bagodani edooo ela :D

నేస్తం చెప్పారు...

పవన్..hmm :)
సిరి సిరి మువ్వగారు ..చిన్నప్పటి విషయాల నుండి ఒక్కోక్కటి వ్రాస్తూ వచ్చానుకదా ..అందుకే అలా అనిపించి ఉంటుంది :)
హరిత ఏం పని అమ్మాయ్ ఇది .. మరి ఇలా కామెంట్ ఇవ్వకపోతే హరిత అనే అమ్మాయి నా బ్లాగ్ చదివింది అనే విషయం నాకు తెలియకపోయెది కదా :) థేంక్యూ పొస్ట్ లు నచ్చినందుకు

అజ్ఞాత చెప్పారు...

nestam garu as usual malli post adirindi:)chocolate perugu try cheyyali.

ప్రియ చెప్పారు...

వింటున్నా, వింటున్నా

జాజిపూలు అభిమాన సంఘం చెప్పారు...

ఇక మీద అభిమాన సంఘం తరుపున ఒకటే కామెంటు వుంటుంది మిగతావి అన్నే అజ్ఞాత కామెంట్లే
:)


http://www.orkut.co.in/Main#Community?cmm=101545791


http://www.facebook.com/group.php?gid=108518715858239&v=wall&ref=mf

పవన్, ఆర్కుట్ మరియు పేస్ బుక్ లో మన సంఘం రిజిస్టర్ అయ్యింది

పిచ్చేక్కిద్దాం
మన జాజిపూలుబ్లాగు మీద అభిమానాన్ని తెలియచేయండి

Unknown చెప్పారు...

nestham...singapore elaa untundo meeru naku cheppestunnaru.. :)
oka vela nenu vellina ee confusion undadu.. :D

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత చాక్లెట్ పెరుగు తినాలని ఉందా :O సరే కానివ్వండి..మీ ముచ్చట ఎందుకు కాదనాలి.
ప్రియ నేను కూడా చూస్తున్నా ..చూస్తున్నా :)
అభిమాన సంఘం గారు ..ఎందుకొచ్చిన పనులు చెప్పండి.. రేపు అందరూ నన్ను ఏడిపించడానికి కాకపోతేనూ ..లేనిపోని గొడవలు అవసరం అంటారా ..:)
కిరణ్ మరందుకే కదా అంత క్లియర్ గా చెప్పుతున్నా :)

Sasidhar Anne చెప్పారు...

Nenu Movie blogs raastanu.. chala sites chusthanu kani.. chudaganee manuku haathukonela vunna blog first time chusanu andi..
nijam mee naration style naaku baga nacchindhi.. naku aithey naa cousin sister phone lo thana exp cheppinattu ga vundi..
oka ammayi manusulo husband ante entha prema vuntundo mee blog chusaka nenu telusukunna..

mee archives motham tergesa.. "nenu prema lo padda" aa post meeru mee husband daggaraninchi vacchina saree ni hattukoni edichina scene nenu visualise chesukunna..

waiting for your next post..

akka nee post lo vunde innocence, straight forwardness super..

శివరంజని చెప్పారు...

అక్కా నీకు ఫాన్స్ ఎక్కువగా ఉన్నారు కదా! చిరంజీవిలా పార్టీ పెట్టు మా ఓట్లన్ని నీకే

రాజ్ కుమార్ చెప్పారు...

@ జాజిపూలు అభిమాన సంఘం
nenunna...

Rajkumar

Rajendra Prasad(రాజు) చెప్పారు...

నేస్తం గారు,మీ టప కేక. సింగపూర్ వెళ్ళినట్టుంది. పోయిన పోస్ట్లో మీ ఫోటో మిస్ అయ్యాను.దానికి ఇంక బాధ పడుతున్నాను.మా ఆఫీసులో అందరికి మీ బ్లాగ్స్ చూపించాను.అందరి తరపున నేనే కామెంటుతున్నాను... :)

Sasidhar Anne చెప్పారు...

Party gurthu.. emi pedhamu abba...

chincha chincha ga oka alochana..
mana party gurthu.. sannajaji(akka asalu pedhamu annukuna peru idhey kada)..

ela vundi akka..

Unknown చెప్పారు...

నేస్తం గారు,
నేను మీ బ్లాగు కి అజ్ఞాత పాఠకురాలిని. మీ పోస్ట్ ఒక్కతి మిస్ కాకుంద చదువుతు ఉంతాను.
అభిమన సంఘం అనే సరికి, చెరి పోదాం అని కామెంటుతున్నా.
మనసుకి హత్తుకునేలా రాస్తారు మీరు.

మంచు చెప్పారు...

@ జాజిపూలు అభిమాన సంఘం ప్రెసిడెంట్ ని నేనే కదా :-))

మంచు చెప్పారు...

@ నేస్తం గారు మీరు ఒప్పుకుంటే మీ పుట్టిన రోజున రక్తదానం చేద్దాం అనుకుంటున్నాం.. ఇనాగరేషన్ లొ స్పెషల్ గెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఈ సారికి మీరు ఇచ్చెస్తే..

తరువాతి పుట్టినరోజుల నుండి ... దానికి ఇంక సం|| టైం వుంది కదా .. తరువాత అలొచిద్దాం..

అజ్ఞాత చెప్పారు...

mi husband entandi mari vachina tellare lepi mari vanta cheyyi antara.. ani tanemo padukuntara.. too much ante too much.

-A.

నేస్తం చెప్పారు...

శసిధర్ నీ వ్యాఖ్య చాలా సంతోషం అనిపించింది :)థేంక్ యూ
శివరంజని అంటే చిరంజీవి పార్టీ లా తుస్ మనేస్తుంది అని అంతర్లీనంగా చెప్తున్నావా???
రాజేంద్ర ప్రసాద్ ఇంక ఫొటో గోల మర్చిపోండి సార్...మీ ఆఫీస్ లో అందరికీ కూడా నా ధన్యవాధాలు చెప్పండి :)
వేణు ,శశి hmmm
నెచ్చెలి గారు భలే బాగుంది మీ పేరు ... ధన్యవాధాలు
మంచు పల్లకి గారు అలగలాగే .. ఆ రోజు ఉదయం నేను రక్తం ఇవ్వడం పోయింట్ కాదు ..మళ్ళీ సాయంత్రం అదే రక్తాన్ని నాకు ఎక్కించేస్తా అని హామీ ఇస్తే తప్పకుండా ఇద్దాం..
అఙ్ఞాత గారు అదీ.. అలా అడగండి... కదా..అసలెవరికన్నా అలాంటి భయంకరమైన ఆలోచన మనసులో కొస్తుందా..మా వారికి మాత్రం నిద్ర చెడగొట్టడం లో ఎటువంటి మొహమాటాలు ఉండవు.. ఒక్కోసారి ఇండియాకి కాల్ చేద్దాం అన్నపుడు కూడా ఈ సమయంలో నాన్న పడుకుంటారేమో అండి అని అన్నా వినరు.. ఏం పర్లేదు ..నిన్ను నాకు అంటగట్టెసి మీ నాన్న హాయిగా పడుకుంటారా అని పాపం లేపేస్తారు :(

Sai Praveen చెప్పారు...

"నిన్ను నాకు అంటగట్టెసి మీ నాన్న హాయిగా పడుకుంటారా" భలే లాజిక్ కదా :)
అయినా ప్రెసిడెంట్ పదవి కోసం ఇంత కాంపిటీషనా... అందుకే నేను వైస్ ప్రెసిడెంట్ గా ఫిక్స్ అయిపోతున్నా :)
జాజిపూలు జిందాబాద్
నేస్తం అక్క జిందాబాద్

అజ్ఞాత చెప్పారు...

నాకు మాత్రం నేస్తం గారే లక్కీ అలాంటి భర్త దొరికినందుకు ఎందుకంటే నేస్తం గారు అడిగే అన్ని డౌట్ లని అంత తీరిగ్గా ఎవరు చెప్తారు :)
ఇంకా భార్య ని హాయ్ గ ఇంటి పట్టున ఎవరు కుర్చోబెడుతారు జాబు కూడా చేయనియకుండా, ఎంత ప్రేమ ఉంటె అల చేస్తారు.
ఈ కాలం లో జాబు చేసి సంపాదించే భార్య నే కావాలని అనుకుంటున్నారు. ఎవరో నూటికి ఒక్కళ్ళు నేస్తం గారి భర్త లాగ ఉంటారు.
ఒక్కల్లె కుటుంబం మొత్తం నేట్టుకరవాలంటే మాటలు కాదండోయ్ :(

..nagarjuna.. చెప్పారు...

చాక్లెట్ పాలతో పెరుగూ, తెలియని వాళ్లని అంకుల్ అని పిలుపా....వామ్మో!
నేస్తం గారు సింగపూర్ కబుర్లు ఇన్ని చెబుతున్నారుగా ఆ దేశం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఏం చేయొద్దో కూడా చెప్పరా ప్లీజ్...