14, నవంబర్ 2009, శనివారం

తికమక-మకతిక



ఒక సారి నేనూ ,మా అక్క ఏదో షాప్ కి వెళుతున్నాం..ఉన్నట్లు ఉండి మా అక్క మాట్లాడటం మానేసి..ష్..ష్ అంటూ నన్ను దాటుకుని ముందుకు వెళ్ళి ,ఒక బడ్డీ షాప్ దగ్గర అటు తిరిగి ఏదో కొంటున్న అమ్మాయిని వెనుకనుండి వీపు మీద ఒక్క దరువేసింది..పాపం ఆ పిల్ల ఊహించని ఆ పరిణామానికి జడుసుకుని కాసేపు బిత్తర చూపులు చూసింది .. ఆ వెంటనే మా అక్క ..ఏమే సత్యవేణీ !!నేనూ..గుర్తు పట్టలేదా అని పళ్ళన్నీ బయట పెట్టి ఇకిలించింది గాని, సదరు బాధితురాలు సత్యవేణికి మాత్రం ఇదెవరో గుర్తు రాలేదు సరి కదా ,ఇది చేసిన పనికి కాసింత కోపం గా ఎవరండి మీరూ అంది .. నాకు సీన్ అర్ధం అయిపోయి, అక్కా ఇంక చాలు పద నువ్వు..ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నట్లున్నావ్ అన్నాను చెయ్యి పట్టుకుని లాగుతూ..అది నా చేయి విదిలించి నీ మొహం.. అదీ, నేనూ అయిదో క్లాస్లో ఫ్రెండ్స్ మి,కాసింత పెద్ద వాళ్ళం అయిపోయాం కదా అందుకే గుర్తు పట్టలేదు కదా సత్యవేణీ అంది ..

ఆ అమ్మాయి కొరకొరా చూస్తూ నేను సత్యవేణీకాదు ,నాగమణీ కాదు మీరసలు ఎవరో నాకు తెలియదు అంది.. బట్టీ కొట్టువాడు వెటకారం గా కిసుక్కున నవ్వాడు.. నాకు గొప్ప అవమానంగా అనిపించింది.. కాని, మా అవతారం కదలదే ..అది కాదు సత్యవేణి! నువ్వూ,నేనూ చిన్నప్పుడు ఫలానా ,ఫలాన స్కూల్ లో చదివాం కదా అని ఫ్లాష్ బ్యాక్ తవ్వకాలు మొదలెట్టింది కాని నేను బలవంతంగా లాక్కొ చ్చేసా..నిజంగా అది నా ఫ్రెండేనే అంది అక్క వెనక్కి వెనక్కి చూస్తూ ..ఇంక నోరు మూస్తావా ..అయినా ఆ పిల్ల నా పేరు అదికాదు మొర్రో అన్నా వినవేంటి.. అంత మనుషులని గుర్తు పట్టలేవా ..ఇలా అయితే ఫ్యూచర్ లో చాల కష్టం అక్క నీకు అని తిడుతూ ఇంటికి లాక్కొచ్చేసాను.. కాని అప్పటికి నాకు తెలియదు విధి నా వైపు చూసి విచిత్రం గా నవ్విందని..

అలా ఎందుకు నవ్విందో పెళ్ళయిన కొత్తలోనే తెలిసింది నాకు.. ఒక రోజు నేనూ,మా ఆయన గుడికి వెళ్ళాం ..పూజారి ఇస్తున్న తీర్ధం తాగుతూ ఎదురుగా చూసా.. నాకు కాసింత దూరంలో ఒక ఆవిడ నా వైపు చూస్తున్నట్లు అనిపించింది..ఈవిడ నా వైపు చూస్తుంది ఏమిటీ ?..ఈ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళెవరబ్బా?నిజంగా నావైపేనా చూస్తుంది ??మళ్ళీ చూసాను ఆమె వైపు ..ఈ సారి ఆవిడ ఇంకెవరితోనోమాట్లాడుతుంది . నన్ను కాదేమోలే అనుకునేంతలో ఆమె మళ్లీ నా వైపు చూసి సన్నగా నవ్వినట్ట్లు అనిపించింది ..ఏంటో ..మనకెందుకులే అనుకుని నేను ఇంటికొచ్చేసాను ..

ఆ మరుసటి రోజు మా అత్తగారు బయట నుండి రావడం ,రావడం నన్ను పిలిచి..నిన్న గుడిలో' పెద్ద అత్తగారు' వచ్చారంట కదా అన్నారు.పెద్ద అత్తగారా?? ఆవిడ ఎవరు అన్నట్లు గా చూస్తున్నా .. నిన్ను చూసి పలకరింపుగా నవ్వినా నువ్వు నవ్వలేదంటా.. కనీసం పలకరించలేదంటా అన్నారు .. అప్పుడు లీల గా గుర్తు వచ్చింది నిన్నటి విషయం.. ఓ ఆవిడా !! ఆవిడ ఎవరో నాకు తెలియదు అత్తయ్యగారు ..నన్ను కాదనుకున్నాను అన్నాను మెల్లగా..మా అత్తగారు బోలెడు ఆక్చర్య పోతూ అలా ఎలా గుర్తు పట్టలేదమ్మాయ్ పోయిన వారం ఆవిడని, వాళ్ళ అమ్మాయిని అందరినీ పరిచయం చేసాను కదా ..పాపం అవతల పెద్దావిడ ఎంత బాధ పడ్డారనుకున్నావూ,తప్పు కదా అని కాసేపు ట్యూషన్ చెప్పి వెళ్ళారు నాకు.. అయ్యో పాపం పెద్దావిడ మనసు ఎంత నొచ్చుకుందో .. ఆవిడ నవ్వినప్పుడైనా ఒక నవ్వు నవ్వాల్సింది .. అయినా పెళ్ళయిన దగ్గర నుండి ఎవరో ఒకరు రావడం..పలకరించడం ..ఎంతమందిని అని గుర్తు పెట్టుకుంటా అని స్వగతంలో అనుకుని అప్పటికి ఆ విషయం మర్చిపోయా..


సరే ఆ తరువాత ఇక్కడకు వచ్చాకా ఒక సారి మార్కెట్కి వెళ్ళాను మా ఆయనతో..నువ్వు కూరలు కొంటూ ఉండూ నేను ఫ్రూట్స్ కొంటాను అని ఆయన అటు ప్రక్కకు వెళ్ళారు.. నేను మా ఆయనకు నచ్చని కాకర కాయ,వంకాయ,క్యాబేజీ సీరియస్సుగా బాస్కెట్లో వేస్తూ ఎదురుగా చూసాను.. ఎవరో అబ్బాయి (తమిళియన్)నన్ను చూస్తున్నట్లు అనిపించింది .. నన్నా?? అబ్బే ,నన్ను అయి ఉండదు అనుకుంటూ ఒక సారి అటుఇటూ చూసా.. కాసింత దూరంలో మా ఆయన యాపిల్స్ కొంటూ కనిపించారు.. వెనుక ఒక ఇద్దరు చైనీస్ అటు తిరిగి ఏవో మాట్లాడుకుంటూన్నారు..ఇంకెవరు లేరు .. అంటే నన్నే కదా ??? మళ్ళీ ఎదురుగా చూసాను ..ఈ సారి చిన్నగా నవ్వాడు..

నాకు విషయం అర్ధం అయిపోయింది.." ఓరి దుర్మార్గుడా "పెళ్ళి అయిన అమ్మాయికి సైట్ కొడతావా..కళ్ళు పోతాయ్ అని ఆవేశ పడబోయాను కాని , నాకు పెళ్ళి అయిందన్న విషయం నాకు తెలుసు, పాపం ఆ అబ్బాయి కి ఎలా తెలుస్తుంది?? ఇలా మెట్టెలు ,మంగళ సూత్రాలు కనబడకుండా, చుడిదార్లలో తిరుగుతూ ఉంటే ??అనుకుని ఆగిపోయాను.. ఒక ప్రక్క నా మనసు, నిన్ను పెళ్ళయినా ఒక అబ్బాయి చూస్తున్నాడంటే ఈ లెక్కన నువ్వు గొప్ప అందగత్తెవే బాబు అని డండనక డండనకా అని డాన్స్ వేస్తుంది అది వేరే విషయం అనుకోండి ..


సరే నాకు పెళ్ళి అయిన విషయం ఆ అబ్బాయికి తెలియ చెప్పి పశ్చాత్తాపం పడేలా చేయాలని కంకణం కట్టుకున్నా కాని ఎలాగో తెలియలేదు ..తెలుగు సినిమా హీరోయిన్ లా ఒక సారి మంగళ సూత్రాలను కళ్ళకు అద్దుకుంటే ?? అనిపించింది కాని మరీ అంత బాగోదేమో అనిపించింది ..ఆ వెంటనే మహత్తరమైన అయిడియా వచ్చి గభ గభా మా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన చేతిని నా చేతులతో చుట్టి నుంచున్నా..నా వైపు ఒక సారి చూసి కూరలు కొనేసావా అన్నారు ..'ఊ' అని అటు చూసాను ..ఈ సారి ఆ అబ్బాయి' హాయ్' అని చేయి ఊపాడు.. అయ్యబాబోయ్ ..ఎంత ధైర్యం..ప్రక్కన మా ఆయన ఉండగా కూడా హాయ్ చెప్తాడా !!వీడి చేతులు పడిపోనూ అని వాడి జీవితం మీద వాడికే విరక్తి వచ్చేటటువంటి అసహ్యకరమైన చూపు ఒకటి అతని మీద విసిరి మొహం తిప్పేసుకున్నాను..


మరి ఎప్పుడు వచ్చాడో తెలియదు 'హలో 'అన్నాడు వెనుక నుండీ ..అంతే.. నేను భయం తో దేవుడా,దేవుడా ఇదేంటి ఈ అబ్బాయి ఇలా వచ్చేసాడు..ఏం గొడవ జరుగుతుందో ఏమో అనుకుని మా ఆయన వెనుకకి పారిపోయి ,ఆయన టీ షర్ట్ పట్టుకుని, ఏవండి అటు వెళదాం అక్కడ బ్రెడ్ కొనాలి అని వెనక్కి లాగేయడం మొదలు పెట్టాను ..ఏంటా కంగారు !!అని నన్ను వారిస్తూ ఆ అబ్బాయి వైపు చూస్తూ.. ఓ ..హాయ్ ఏంటి ఇలా వచ్చారు అన్నారు అతనికి చేయి కలుపుతూ ..అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా ??అని అవాక్కయి చూస్తుండగా..వీకెండ్ కదా సామాను కొనడానికి వచ్చాను...మీరు అటు ఉన్నారు కదా కనబడలేదు ..మీ వైఫ్ ని పలకరించాను .. ఇంకేంటి విశేషాలు అని కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు అతను..

అతను అలా వెళ్ళగానే మా ఆయన చీవాట్లు ..అవతల ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే అలా లాగేస్తావే?? ఏమనుకుంటాడు..కనీసం పలకరించాలిగా అలా గుడ్లప్పగించి చూసే బదులు అన్నారు.. అంటే మీ ఫ్రెండ్ అనుకోలేదు అండి అన్నాను..అనుకోక పోవడం ఏమిటీ ..మొన్న వారం ఫలానా పార్టీలో అతన్ని, ఆయన వైప్ ని పరిచయం చేసాకదా..వాళ్ళవిడతో మాట్లాడావ్ కదా అన్నారు..మా ఆయన కూడా వాళ్ళ అమ్మగారిలాగే ..ఒక 10 నిమిషాల్లో 10మందిని పరిచయం చేసి గుర్తు పెట్టెసుకో అంటే ఎలాగా??..ఓ ...వాళ్ళా ..అప్పుడు అతనికి మీసం లేదేమో కదా ?అన్నాను గుర్తు వచ్చీ, రానట్లుగా ఉంటే..నీ మొహం ఇంక పద అన్నారు.. ఇంకా నయం అతనివైపు చండాలంగా చూసా అని తెలిస్తే ఇంకేమనేవారో ..


ఆ తరువాత ఒక సారి ఇండియా వెళ్ళినపుడు మా ఆడపడుచు పాప బారసాల జరుగుతూ ఉంటే నేను మాంచి బిజీగా అటు ,ఇటూ తిరుగుతూ పనులు చక్కపెట్టుకుంటుంటే మళ్ళీ షరా మామూలే..ఒకావిడ నా వైపు చూస్తూ కనబడింది.. హే భగవాన్!! ఏమిటి నాకీ పరీక్షా ..అన్నీ బాగానే గుర్తుంటాయి కాని ,ఇలా అప్పుడప్పుడూ ఏదో పార్టీలలోనో, ఫంక్షన్లలోనో పరిచయం అయిన వాళ్ళు చాలా తక్కువగా గుర్తుంటారు..అదేంటోగాని వాళ్ళకు మాత్రం నేను బాగా గుర్తుంటాను..మీరు ఫలానా పార్టీకి ఫలానా డ్రెస్ వేసుకున్నారు కదా ,ఫలానా నగలు పెట్టుకున్నారు కదా అని చెప్తుంటే వాళ్ళ ఙ్ఞాపక శక్తికి నేను నోరెళ్ళబెడతుంటా..మరినాకేం వచ్చి ఏడ్చిందో తెలియదు గాని ఈ తికమకతో మా చెడ్డ బాధ అయిపోతుంది నాకు..

సరే ఏది ఏమయినా ఈసారి మా అత్తగారితో ట్యూషన్ తప్పించుకోవాలంటే నేనే ఆవిడను ముందు పలకరించేస్తే ఒక పని అయిపోతుంది అనుకుని ఆవిడ దగ్గరకు వెళ్ళాను..ఇప్పుడు ఏమని పలకరిచాలి?..సదరు మహిళ నాకు అక్క అవుతుందా?? పిన్నా?? వదినా?? ఏమని పిలవాలి అని కాసేపు తర్జన బర్జనలు పడ్డాకా ,సరే వరసలేకుండా మేనేజ్ చేసేద్దాం అనుకుని హి హి బాగున్నారా అండి అన్నాను .. ఆవిడ నవ్వుతూ ఆ బాగున్నాను అన్నారు.. హమ్మయ్యా ఒక పలకరింపు అయ్యింది నెక్స్ట్ ఏమనాలి??? అదేంటి ఇప్పుడు వచ్చారు ప్రొద్దున్నే రావాల్సింది అన్నాను.. ఎక్కడా ..పిల్లలతో కుదరలేదు ఆవిడ జవాబు..హమ్మయ్యా పిల్లలున్నారన్నమాట ఈమెకు ..వెంటనే ఆవిడ వయసును బట్టి పిల్లల వయసు అంచనా వేస్తూ ..మరే ,పిల్లలని కూడా తీసుకురావలసిందండి ఆడుకునేవాళ్ళు అన్నాను నా తెలివికి మురిసిపోతూ.. అమ్మో వాళ్ళతో వస్తే ఇంక నన్ను కుదురుగా కూర్చోనిచ్చినట్లే ..మా అత్తగారి దగ్గర వదిలివచ్చా అంది.. హమ్మయ్య దిగ్విజయం గా 'పలకరింపు' అయిపోయింది ..ఇంక ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అనుకుని అటుతిరిగానో లేదో ఆమె నా చేయి పట్టుకుని వెనక్కి లాగుతూ ఇంతకూ నేను నీకు ఎలా తెలుసూ?? అంది..నాకు పచ్చివెల్క్కాయ గొంతుక్కి అడ్డుపడినట్లు అనిపించింది..

ఇదేంటబ్బా ఇలా అంటుంది ??అంటే నేనే తొందరపడి ముందే కూసేసానా?? అనుకుంటుండగా..అదే నేనూ చూస్తున్నా ఇందాక నుండి ..ఈ అమ్మాయికి నువ్వెలా తెలుసా ??..అన్నీ తెలిసినట్లే మాట్లాడుతుంది అనుకుంటున్నా అంది ప్రక్కన ఉన్న మరొక ముసలావిడ..నాకేం చెప్పాలో అర్ధం కాలేదు ..నా బుర్ర యమఫాస్ట్ గా పనిచేయడం మొదలు పెట్టింది..వెంటనే అయిడియా తళుక్కున మెరిసింది.. మనమసలే షార్ప్ కదా.. జెనరల్ గా బంధువులందరూ పెళ్ళికి వస్తారు కాబట్టి, అయ్యో మీరు తెలియకపోవడం ఏమిటండి ..మా పెళ్ళికి వచ్చారు కదా అన్నాను తెలివిగా.. మీ పెళ్ళికి నేను రాలేదే ??అంది ఆవిడ మళ్ళీ క్వచ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ..ఓర్నాయనో అనుకుని, అంటే మా పెళ్ళంటే మా పెళ్ళికాదు భారతి పెళ్ళికి అన్నాను ఈసారన్నా కరెక్ట్ కాకపోతుందా అని ఆశగా చూస్తూ ..భారతి పెళ్ళి కి కూడా నేను రాలేదూ అంది దీర్ఘం తీస్తూ ఆవిడ ..నువ్వెక్కడ దొరికేవే బాబు లాయర్లాగా ఈ ప్రశ్నలు అనుకుంటూ ..అంటే అదీ.. మొత్తానికి ఈ మధ్య ఎప్పుడో కలిసాం అనుకుంటలేండి ..లేకపోతే ఎలా గుర్తుపడతాను అన్నాను ఒక వెర్రి నవ్వు విసిరి.. అబ్బే ,గత 3 యేళ్ళుగా నేను ఆంధ్రాలోనే లేను ..మరి ఎక్కడ కలిసి ఉంటాం ??అంది నావైపు చూస్తూ ...ఏట్లో. అని కసిగా అందామనుకుని సంభాళించుకుని ,పొయ్యి మీద పాలు పెట్టాను పొంగుతున్నట్లున్నాయి ఇప్పుడే వస్తానండి అని అక్కడనుండి బయటకు వచ్చేసా... అలా ఆ గండం అప్పటికి గడిచింది..కాని విధి నన్ను పరిక్షిస్తునే ఉంది ..


ఒక రోజు మా ఆయన,నేను బస్ ఎక్కబోతూ జనాలు ఎక్కువ గా ఉండటం వల్ల ఆయన వెనుక డోర్ దగ్గర, నేను ఫ్రంట్ డోర్ దగ్గర ఎక్కేసాం ..ఒకటే జనాలు ..ఆయనకు నాకు మధ్య ఓ 10 మంది నించున్నారు..ఎదురుగా చూస్తే ఒక అతను ఎవరో ఫ్రెండ్స్ తో మాట్లాడున్నాడు.. ఇతను మొన్న మా ఆయన తో బీచ్ వెళ్ళినపుడు పరిచయం అయిన వ్యక్తే కదా?..అచ్చం అలాగే ఉన్నాడు ..డవుటేలేదు అతనే ,అతనే ...అయినా ఎందుకైనా మంచిది ఓ సారి మా ఆయన వైపు చూస్తే విషయం తెలుస్తుంది అనుకుంటూ మా ఆయన వైపు చూసాను.. మా ఆయన్ సెల్ లో బిజీగా ఏదో మాట్లాడేస్తున్నారు..అంబికా దర్బార్బత్తిలా ఆ సెల్ ఆయన చెవుకి ,చేతికి మధ్య అనుసంధానం అయి ఉంటుంది ఎప్పుడూ..

ఈ లోపల అతను నా వైపు చూసాడు.. పలకరించాలా?? వద్దా??..నిజంగా అతనేనా?కాదా? అనుకుంటుండగా అతను నన్ను చూసి సన్నగా నవ్వినట్లు అనిపించింది ...అతనే అయి ఉంటాడు ..అదిగో ఆ చెవికి పోగు కూడా పెట్టుకున్నాడు ..ఇప్పుడు పలకరించక పోతే బాగోదు అనుకుని హి హి బాగున్నారా అన్నాను నవ్వుతూ ..క్యా ? అన్నాడు నా వైపు చూస్తూ ..అదే మొన్న బీచ్ ..మీరు ,మీ వైఫ్ వచ్చారు అన్నాను ముక్కలు మింగుతూ ..సారీ అయ్ డొంట్ నో తమిళ్ అన్నాడు..ఇదేంటబ్బా తమిళ్ అంటాడేంటి ??మొన్న శుబ్బరంగా తెలుగులో మాట్లాడాడు కదా ???..అంటే...అంటే అతను ఇతను కాదా ??...

నాకు ఏంచేయాలో అర్ధం కాలేదు..పోనీ అక్కడనుండి తప్పుకుందామన్నా అటుఇటు కాలు కదపలేనంత జనాలు ...ఏమండీ !!వెనక్కి తిరిగి పిలిచాను..ఆయన అటు తిరిగి ఇంకా మాట్లాడుతునే ఉన్నారు..జీ బోలియే అంటూ అతనేదో హిందీలో మాట్లాడుతున్నాడు.. నాకు ఏడుపొకటి తక్కువ ..అందులోనూ నాకసలు హిందీలో 'ఇదరాయియే 'తప్ప ఇంకేం తెలియదు.. అతనేం అంటూన్నాడో అర్ధం కావడం లేదు.. అతని ఫ్రెండ్స్ ఏదో అడుగుతున్నారు అతనిని ..ఇతనేదో చెప్తూ నవ్వుతున్నాడు...నాకేంటో చాలా అవమానంగా అనిపించింది ..కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ,ఎప్పుడొచ్చారో మా ఆయన నా వెనుకనొచ్చి నెక్స్ట్ స్టాపే దిగాలి పదా అన్నారు ..బస్ ఆగగానే ఏమండీ !ఆ రెడ్ షర్ట్ అబ్బాయి మీ ఫ్రెండే కదా అన్నాను.. ఎవరూ అన్నారు వెనుకకు తిరిగి చూస్తూ .. అదేనండి ఒకసారి బీచ్లో పరిచయం అయ్యారు కదా అన్నాను ..ఎవర్తివే నువ్వు ..అసలేమన్నా పోలిక ఉందా అతనికీ ఇతనికీ.. మొహం చూడు అన్నారు.. అయ్యో అతనేనండి చెవికి పోగు కూడా ఉంది అన్నాను.. ఏదో సామెత ఉందిలే ..అలాగా.. చెవిపోగులున్న వాళ్ళందరూ నా ఫ్రెండే నా అన్నారు ..ఇలా తికమక -మక తికలో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నా :(


అసలు కొసమెరుపేమిటంటే ,ఒక సారి మా ఆయన ,ఫ్రెండ్ మేరేజ్ డే పార్టీకీ తీసుకు వెళ్ళారు ..ఆ ఫ్రెండ్ వైఫ్ ని పలుకరించి ఇంటికొచ్చేసా ..ఆ తరువాతా 3 నెలలకు ఆమె నాతో ఏదో అవసరం వచ్చి నాకు కాల్ చేసింది..కాసేపు మాట్లాడి పెట్టేసాకా, ఆమె ప్రతి రోజూ సర్దాగా కాల్ చేసి 2 గంటలు మాట్లాడటం మొదలు పెట్టింది..అలా 3 మంత్స్ లో ఆమె ,నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మి అయిపోయాం..ఒక రోజు మార్కెట్కి వెళితే ఒక ఆమె నా ప్రక్కనే నిలబడి ఏవో కొంటూ 'హాయ్' అంది.. హాయ్ అని పలకరించి ,ఒక్క నిమిషం చిన్న పని ఉంది ఇప్పుడే వస్తా అని మా ఆయన దగ్గరకు పరిగెట్టీ ,ఏమండీ !ఆవిడెవరో మీ ఫ్రెండ్ అనుకుంటా నాకు' హాయ్' చెప్తుంది ఇంతకు ముందు నాకేమన్నా పరిచయం చేసారా ?అన్నాను గుసగుసగా ..ఎవరూ.. అని వెనుకకు తిరిగి చూసి, ఒసే గాడిదా ఆమె ఎవరో తెలుసా ..రోజూ నేను వచ్చేసరికి ఫోన్లో గంటల తరబడి ఉప్పర సోది చెప్తూ కనబడతావ్ ..మీ సునీత .. నువ్వు గుర్తుపట్టలేదని తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతుంది వెళ్ళి పలకరించు అన్నారు.. :(

64 కామెంట్‌లు:

asha చెప్పారు...

ఎప్పటిలానే టపా బావుందండి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హా..హ్హ.హ..భలే వారే మీరు....మీ తికమక తో మమ్మల్ని నవ్వించారు కదా!...మీరు కూడా గజినిలో లా కొత్త పరిచయస్తుల ఫోటోలు తీసి,వివరాలు రాసి ఓ ఆల్బంలో పెట్టి మీతో పాటు కేరీ చేయండి..గుర్తు రానప్పుడు ఆ ఆల్బం చూడొచ్చు...:))

Surabhi చెప్పారు...

నేస్తం గారు,
Nice post as usual.
నేను సేం మీ టైపే.
నన్ను గుర్తు పట్టే వాళ్ళను నేను గుర్తు పట్టను.
నేను గుర్తు పట్టే వాళ్ళు నన్ను ఏప్పుడు కలిసుండరు.

మంచు చెప్పారు...

నేస్తం.. ఇంతకీ నన్నయినా గుర్తుపట్టారా ?

sravya చెప్పారు...

ఇదేంటబ్బా ఇలా అంటుంది అంటే నేనే తొందరపడి ముందే కూసేసానా అనుకుంటుండగా :):):)

ఎవరూ అని వెనుకకు తిరిగి చూసి ఒసే గాడిదా ఆమె ఎవరో తెలుసా ..రోజూ నేను వచ్చేసరికి ఫోన్లో గంటల తరబడి ఉప్పర సోది చెప్తూ కనబడతావ్ ..మీ సునీత .. నువ్వు గుర్తుపట్టలేదని తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతుంది వెళ్ళి పలకరించు అన్నారు :):):)

నాకు నిద్ర రాక బ్లాగ్స్ చూస్తుంటే మీ పోస్ట్ కనిపించింది.చదివాక నవ్వు ఆపుకోవడం నా వల్ల కావడం లేదండి బాబు.
వండర్ ఫుల్
పోని మీరు ఒక పని చేయండి.గజిని సినిమాలో సూర్య లాగా అందరివి ఫొటోస్ తీసుకొని పేర్లు రాసి పెట్టుకొండి

just kidding.But your post is really really wonderfull

జాహ్నవి చెప్పారు...

ha ha ha.........
meeru manushulne marchipotaaru (gurtu pattalekunnaru). nenu valla perlato sahaa marchipotaanu. :-)

నిషిగంధ చెప్పారు...

"అందులోనూ నాకసలు హిందీలో ఇదరాయియే తప్ప ఇంకేం తెలియదు.."
ఇదే వాడేయాల్సింది :)))

అసలు మీకు నిండా నూరేళ్ళు.. మీనించి టపా వచ్చి చాలా రోజులైందే అనుకుంటూ కూడాలి ఓపెన్ చేశాను.. నిజ్జం.. మొన్న ఇండియన్ స్టోర్ లో గుత్తొంకాయలు కొంటూ మిమ్మల్ని పలకరించిన ఆంటీమీదొట్టు :-)

అసలు ఇలాంటి కష్టాలు కానీ కష్టాలన్నీ మీకే వస్తాయి పాపం..
కొసమెరుపు మాత్రం సూపర్ :))))

సిరిసిరిమువ్వ చెప్పారు...

:) పొద్దున పొద్దున్నే ఏం నవ్వించారండి.

Padmarpita చెప్పారు...

అందరితో పాటు నన్ను నవ్వించారు మీ తికమకతో....:)

బృహఃస్పతి చెప్పారు...

మరీ బొత్తిగా నెలకు ఒకటి రెండు టపాలంటే, మేం నెలలో అంతకన్నా ఎక్కువ నవ్వకూడదనా మీ ఉద్దేశ్యం??

పోస్ట్ ఎప్పటిలానే అదుర్స్

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీ తికమకతో భలే నవ్వించారు, హ హ కొసమెరుపు మాత్రం కేక.. రెండు నిముషాలపాటు నవ్వుతూనే ఉన్నాను :-)

నాదీ ఇంచుమించు ఇదే పరిస్థితి. పేర్లు, మొహాలు మ్యాపింగ్ విషయంలో కూడా ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటుంటాను. ఆఫీసులో కొలీగ్స్ తోకూడా ఒక చావు కాదు, నాలుగైదేళ్ళక్రితం ఎపుడో ఏదో ఒకే ప్రాజెక్ట్ లో కలిసిపనిచేశాం గుర్తులేనా అని అడిగి ఇబ్బంది పెడుతుంటారు.

Subhashini చెప్పారు...

ఇంత అన్యాయమా? నేనెప్పుకోను. నా మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. ఫోన్లో మీరు నాకు చెప్పిందంతా ఉప్పరసోదా?: D.(సరదాకి మరి నా పేరు కూడా సునీత కదా! అందుకు). ఇలాంటి బాధలు ఓ 70% నాక్కూడా ఉన్నాయి. ఎప్పటిలాగే పోస్ట్ బాగుంది. పనిలోపనిగా మీ ఫోటో ఒకటి పరిచయం చెయ్యండి ఎక్కడన్నా కలిస్తే కనీసం మేము గుర్తుపడతాము.

శ్రీనివాస్ చెప్పారు...

హాయ్ .. బాగున్నారా

నేస్తం చెప్పారు...

భవాని గారు థెంక్స్ అండి
ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది శేకర్ .. ఈ అయోమయంతో ఎన్ని సార్లు బాధ పడ్డానో ..
సురభి గారు హమ్మయ్యా నాకో తోడు దొరికారు
మంచు పల్లకి గారు పేర్లు గుర్తుంటాయి మనుషులే అన్నమాట గుర్తుండనిది

నేస్తం చెప్పారు...

t థేంక్స్ అండి.. అబ్బో భలే బాధ అయిపోతుంది అనుకోండి ఒక్కోసారి ..పోస్ట్ నచ్చినందులు ధన్యవాధాలు
జాహ్నవి అయితే మీరింకా సూపర్ అన్నమాట :)
నిషి ఇంకేమైనా ఉందా ఇదరాయియే అని అంటే కొంప కొల్లేరే :) నేనూ అనుకుంటూన్నా ఈ మద్య కనబడటం మానేసారు ఇండియా వెళ్ళారేమో అని :)
మువ్వగారు థేంక్స్ :D

నేస్తం చెప్పారు...

పద్మ మరి మీ నవ్వులే కదా నా పోస్ట్లకు భలమైన టానిక్కులు
బృహఃస్పతి గారు ఏదో మీ అభిమానం కొద్ది అలా అంటారు కాని రోజూ నా సొంత డబ్బా రాస్తే చదవగలరేంటండి :)
వేణూ గారు ..కదా నాది అదే పరిస్థితి ..
సుభాషిని గారు సునీత ఇప్పుడు యు .ఎస్ లో ఉంది.. తనకు నా బ్లాగ్ గురించి తెలియదు కాబట్టి నేను భయపడనుగా మీరు బెదిరించినా ..
శ్రినివాస్ ఎవరు మీరు ??? :)

అజ్ఞాత చెప్పారు...

ఒక ప్రక్క నా మనసు నిన్ను పెళ్ళయినా ఒక అబ్బాయి చూస్తున్నాడంటే ఈ లెక్కన నువ్వు గొప్ప అందగత్తెవే బాబు అని డండనక డండనకా అని డాన్స్ వేస్తుంది అది వేరే విషయం అనుకోండి ..
అయ్యబాబోయ్ ....నేస్తం , నిప్పులాంటి నిజాలు ఇలా బయటకి చెప్పకూడదమ్మాయ్ ....తప్పు.

manohar చెప్పారు...

pellayinaa choosaarani!!!
dandanaka dandanaka dance!!

thega navvichesaru nestam akka!!!!

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ చెప్పారు...

హ హ హ. నాదీ మీ సమస్యేనండీ. చాలా సార్లు వాళ్ళు పలకరించినా నేను గుర్తుపట్టలేదు. ఒకటి రెండు సార్లు తెలియని వాళ్ళని పలకరించా.
బాగా నవ్వించారు.

కొత్త పాళీ చెప్పారు...

మీరు చెప్పిన ప్రతీ సంఘటనా నేనూ అనుభవించాను. మొహాలు గుర్తుండడం పర్లేదు కానీ, నాకు మనుషుల పేర్లు అస్సలు గుర్తుండి చావ్వు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన సూపరేక్టివ్ ఇమేజినేషనొకటి. రేల్వేస్టేషన్లలోనూ బస్టాండుల్లోనూ ఎవర్నో చూసి ఎవరో అనేసుకుని పలక్రించేసిన సందర్భాలూ కోకొల్లలు.
మీ శైలి మాత్రం అనితర సాధ్యం

నేస్తం చెప్పారు...

లలితా .. నిద్రమత్తులో రాసానేమో నిజాలు బయటకు వచ్చేసాయి ..కిం కర్తవ్యం ?
@ మనోహర్ మరి అలా నవ్వేస్తే నేను కూడా నవ్వేస్తా తమ్ముడూ :)
వైద్యభూషన్ గారు ఇంచుమించుగా చాలామందికి ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయనుకుంటా :)
కొత్తపాళిగారు ధన్యవాధాలు మీ ప్రోత్సాహానికి

మా ఊరు చెప్పారు...

మీరు కెమరా వాడాలి అనుకుంటానండి .లేడీ గజినీ లాగ
హహహః

Raghav చెప్పారు...

hayy..నేను గుర్తున్నానా, మనం మూడో క్లాస్ కలసి చదువుకున్నాం, మీ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉండేవి హి హి హి...

హరే కృష్ణ చెప్పారు...

నేస్తం
గావు కేక పెట్టించారు పోస్ట్
ఢిల్లీ లోడండనక డండనకా అనడానికి చాన్స్ వుండదు పెళ్ళైన వారికి కష్టం కలిగించకుండా ట్రేడ్ మార్క్ మేకప్ వుంటుంది బ్యాచిలర్స్ పండగ చేసుకోవచ్చు

ప్రభాకర్ చెప్పారు...

నేస్తం గారు.. మీ పోస్ట్ కోసం ఎదురుచూసే వారిలో నేనూ ఒకన్ని ..కడుపుబ్బ నవ్విచారు , దన్యవాదములు !!!

అజ్ఞాత చెప్పారు...

నేను మీకు తెలుసా??

జయ చెప్పారు...

నేస్తం గారు, చాలా రోజుల తరువాత చూసిన మీ పోస్ట్ చాలా బాగుంది. మీకు ఇలాగే మీకు తెలిసిన వాళ్ళు తరచుగా కలుస్తూ ఉండుగాక.

హరే కృష్ణ చెప్పారు...

రాఘవ్ గారు కేకో కేక
:)
పొస్ట్ లో లాస్ట్ పేరా లా Excellent

శ్రీలలిత చెప్పారు...

ఇది చాలా అన్యాయం. నిన్న కాక మొన్నే కదా పరిచయ మయ్యారు. అంతలోనే అంత మరుపా.. సరే గుర్తు చేస్తాను.. మొన్న చింతకాయ పచ్చడి పంపిస్తే చిన్న సీసాతోనే పంపేరు, ఒక్క పూటకే ఖాళీ అయిపోయింది. కాస్త పెద్ద సీసా చూడండీ.. అనలేదూ..
నిన్న నాలుగు మూరల జాజిమాల పంపిస్తే నా ఒక్కదానికే సరిపోయింది.. మిగిలిన వాళ్ళకో అనలేదూ...
ఖంగారు పడకండి ఇల్లాంటివి చెప్పి మిమ్మల్ని బలే పడగొట్టచ్చన్న మాట.. హహహహ్..
మనలో మనమాట.. నేనూ అంతేనండోయ్...

మాలా కుమార్ చెప్పారు...

ఏమిటీ ? అన్నీ నా అనుభవాలను కాపీ చేసి రాస్తారు ? పోనీలెండి నాకంటే చాలా చాలా బాగా నా అనుభవాలని రాసి , తెగ నవ్వించేస్తున్నారు కాబట్టి క్షమించేస్తాను ! కాని ఇంత ఇంత ఆలస్యంగా రాస్తే మటుకు క్షమించనుగాక క్షమించను . ఓ మొట్టికాయ మీరనుకొని ఇంకెవరినో వేసే ప్రమాదానికి మీదే బాద్యత హా .

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం తెగ నవ్వించారుగా నన్ను ప్రొద్దున్నే....ఈ విషయంలో నేను కూడా అంతే...ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడు మా నన్ను నన్ను పిలిచి "ఎరా...అంకుల్ గుర్తున్నాడా??" అని అడిగినప్పుడు...ఆ సదరు అంకుల్ నేనేమి చెప్తానో అని ఆశగా చూసినప్పుడు...తేలేదు అని ముఖానే చెప్పలేక..తెలుసని చెప్తే ఇంకేమి అడుగుతారో తెలియక ముఖాన్ని నిలువుగా రెండు సార్లు..అడ్డంగా రెండు సార్లు..తిప్పి అతన్ని అయోమయంలో పడేస్తా...అదన్నమాట...మొత్తానికి టపాతో పొలికేక పెట్టించారు.... :)

నేస్తం చెప్పారు...

మా వూరుగారు :) అలాగే ఉంది నా పరిస్థితి
రాఘవ్ అంతా బానే ఉంది కానీ నేను 3 వ క్లాస్లో అమ్మాయిల స్కూల్ లో చదివాను :) అందుకే గుర్తుపట్టే చాన్సే లేదు ..
హరే క్రిష్ణ గారు ..పాపం డిల్లీ అమ్మాయిలకు ఎంత కష్టం వచ్చింది :)
ప్రభాకర్ గారు థేంక్స్ అండీ

నేస్తం చెప్పారు...

హరీష్ ఓ తెలుసు ..అపూర్వం బ్లాగ్ ఓనర్ ఇప్పుడే చూసా :)
జయ గారు పోస్ట్ నచ్చినందుకు థేంక్స్.. ఇంతకు మీరిచ్చింది శాపమా వరమా :)
హరే క్రిష్ణ :)

నేస్తం చెప్పారు...

శ్రీ లలిత గారు నిజమే ..అలా పక్కాగా అతికినట్లు చెప్తే నిజమే గావల్సు అని అనుకున్నా అనుకుంటా :)
మాలా కుమార్ గారు అయితే మీరు నా పార్టీ యే అనుకుంటా ఈ విషయంలో.. అమ్మో మొట్టికాయాలు వద్దు.. ఏంటో ఒక్కోసారి ఏమీ రాయాలనిపించదు ,ఒక్కో సారి ఎదో పని హడావుడి అంతే :)
కిషన్ థేంక్స్..మీరూ అంతే నా :)

లక్ష్మి చెప్పారు...

హమ్మో ఈ మకతిక కష్టాలు పగవాడికి కూడా వద్దండీ బాబూ. నేను ఇంకో రెండాకులు ఎక్కువే చదివేసా ఈ విషయంలో. నాకు ముఖాలు చూసి ఎక్కడో చూసినట్టే ఉంటుంది కానీ పేరు మాత్రం ఉహు సమస్యే లేదు, అవతలి వాళ్ళేమో మాటకి ముందొకసారి వెనకొకసారి లక్ష్మీ అంటూ పిలిచి నన్ను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు, ఏమి చేద్దామ్ము దీన్నే ఉత్పత్తిలో తేడా (manufacturing defect)అంటారు అని సరిపెట్టేసుకోవాలి తప్పదు

చంద్రశేఖర్ కాటుబోయిన చెప్పారు...

చాలా బాగా రాస్తారండి మీరు..మీ టపా కూదా ఇంతవరకు మిస్ కాలెదు...అద్భుతంగా రాస్తరు మీ టాలంట్ కి నా అభినందనలు..

అజ్ఞాత చెప్పారు...

yyah..intha baga rasaaru nannu gurthu pattaleda nenu chinnapudu kobbari tota jampallu gurthu ra..annayya ki anni velakolame nenu Raghav valla chelli ni meeru maaku school lo senior kada oho ippudu singapore lo vunnara santhosham challaga undandi

పద్మ చెప్పారు...

హహహ. నా ప్రాబ్లెం నిండా వ్యతిరేకం. కనిపించిన ప్రతి మొహం ఎక్కడో చూసినట్టే ఉంటుంది. ఎక్కడ చూసానో మటుకు గుర్తుండదు. :( పలకరించవచ్చో, కూడదో కూడా అర్థం కాదు. ఈ దేశంలో ఒక మంచి క్వాలిటీ, ఎదురుగా ఎవరు కనిపించినా ఒక చిరునవ్వు పడేస్తారు కాబట్టి నేనూ అలా చిరునవ్వులు చిందించి చాలాసార్లు తప్పించుకున్నాను కానీ వాళ్ళెవరయి ఉంటారబ్బా అన్న అరగంట టైం వేస్ట్ నించి మటుకు తప్పించుకోలేను. :O

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

ఏమ్మా..
నైట్ షిఫ్టులు మమ్మల్ని పనిచేసుకోనివ్వవా?
పడీ పడీ నవ్వుతుంటే చూసే వాళ్లేమనుకోవాలి?
కొంచెం కూడా ఆలోచించవా?
ఇకనుంచి ప్రింట్ తీసుకుని రూంలో చదువుకోవాలి కానీ ఆఫీసులో చదివితే చేతులిరగకొడతాము.. మళ్లీ "జాజిపూలు" జోలికెళ్లకుండా!
- నా ఆఫీసు మితృలు.

ఇదీ నేస్తం..
నీ బ్లాగు దెబ్బ. నాకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి నేను.

కానీ... కొసమెరుపు మెరిసింది!
పాపం సునీత!!

భావన చెప్పారు...

ప్రత్యేకం గా కొత్త గా మెచ్చుకుందామనుకున్నా అబ్బా 4 రోజుల కితం, ఏదో మర్చి పోయాను.. గుర్తొచ్చినప్పుడు రాస్తాలే అప్పటికి మీకింకా పోస్ట్ రాసేనని గుర్తుంటే... ;-)

పరిమళం చెప్పారు...

హ ...హ్హ ...హ్హా ....అప్పుడప్పుడూ నాకు తెలీని బంధువువులు ..అమ్మ తరపువారు గాని నాన్న తరుపువారు గాని నన్ను పలకరిస్తే ..నా పరిస్థితి ఇలాగే ఉంటుంది .మీరెవరు అనడిగితే ఏమనుకుంటారో అని ఓ వెర్రినవ్వు నవ్వి వీలైనంతవరకు ఏ వరసా కలపకుండా మాట్లాడి బైట పడుతుంటా :) :)

mahipal చెప్పారు...

Labham ledandi,,
Bukit botak lo me abhimana sangam pettalsinde.....
opening ki eepudostharu?

నేస్తం చెప్పారు...

లక్ష్మి గారు అంతే అంటారా ..సరే కానివ్వండి సరిపెట్టేసుంటాను ..
చంద్ర శేఖర్ గారు మీ అభిమానానికి థేంక్స్ అండీ
అఙ్ఞాత గారు కొబ్బరి తోటా,జాంపళ్ళూ నా..వాటి కోసమన్నా మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవలసిందే :)
పద్మ గారు నిజమే నేనూ చాలా సార్లు అలా నవ్వేసి తప్పించుకున్నా ..

నేస్తం చెప్పారు...

హ హ నరేష్ గారు మీరిలా మరీ పొగిడేయకండి..నేను మరీ గొప్పగా ఫీల్ అయిపోతా :)
భావనగారు ఇది భావ్యమా అంటూన్నా అహా భావ్యమా అంటూన్నా...మర్చిపోయింది కాక మళ్ళీ మీకు గుర్తుంటే అప్పుడు చూద్దాం అంటారా :)
పరిమళం గారు మీరూ అచ్చం నాకు లాగే అన్నమాట..
మహిపాల్ గారు అప్పుడు ఆ సంఘం లో మీరు ఒక్కరే ఉంటారన్నమాట :)

Ruth చెప్పారు...

హ హ.... లేదండి, నేను కూడా చేరుతున్నా మహీపాల్ గారి సంఘంలో. ఆద్దరగొట్టేసారు కద.... అస్సలు కొన్ని రోజులుగా నాన్-బ్లాగింగ్/కామెంటింగ్ మోడ్లో ఉన్న నన్ను మళ్ళి లేఖిని కి లాక్కొచ్చారు :)
బై ద వే, నాకు కూడా మీలానే ముఖాలు గుర్తుండవు. కాని నన్ను నా రెండో క్లాస్ మేట్స్ కూడా గుర్తు పడతారు అదేంటో! మళ్ళీ భలే గుర్తుపట్టారే అంటె అబ్బే, నువ్వస్సలు అప్పట్నుంచీ ఏమీ మారనే లేదు అంటారు.(అంటె నెను రెండో క్లాస్ లో ఎలా ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నానా అని తెగ హాచరపడిపొయేస్తుంటాను) :) :) :)

అడ్డ గాడిద (The Ass) చెప్పారు...

Twistadirindi

Srini చెప్పారు...

అబ్బబ్బ భలేగా నవ్విన్చారండి, ఆఫీసులో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా నవ్వుతూనే ఉన్నాను. అసలు మీ టపాలన్ని ప్రింట్స్ తీసుకుంటే బోర్ కొట్టినప్పుడల్లా చదువు కోవచ్చు కదా అని అనిపిస్తుంది.

Gulabi చెప్పారు...

నేస్తం మీరు కూడా నాలాగే :) మీరు భలే రాస్తారు ..మా పక్కనే ఉండి చెప్పినట్టు ..మీకు మంచి ఫ్యూచర్ ఉంది :))

anveshi చెప్పారు...

"మావారిని 'బ్రతిమాలుకుని' నా పొస్టు లన్నీ ప్రింట్ ఔట్ తీయించి అమ్మావాళ్ళకు ఇప్పించాను"

ఇప్పుడు అర్ధం అయినది !ప్రింట్ ఔట్ ఎందుకు ఇన్ని రోజులు తియ్యలేదో :D

kidding..

ఎవ్వరిని వదలలేదు గా.. as usual బాగా రాసావు :) మంచి సాహిత్యం చదువు ఇంకా పరిణితి చెందిన రచయిత్రివి అవుతావు :)

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

మహిపాల్ గారి "నేస్తం అభిమాన సంఘం"లో నేను కూడా చేరుతున్నానోచ్!
మరి ఎప్పుడు ప్రారంభిస్తారు నేస్తం?

నేస్తం చెప్పారు...

గాడిద గారు థేంక్స్ అండి
శ్రీనివాస్ గారు థెంక్స్ :)
ruth నా ఫ్రెండ్స్ కూడా కొంత మంది చిన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు..నేను మాత్రం దశావతారాలే ..:)
గులాభి థేంక్స్
నరేష్ గారు మహిపాల్ గారు ఆమాట అన్నాక మళ్ళీ కనబడలేదు.. మరి ఆలోచించుకోండి :)
@అన్వేషీ అన్నా :D ఏంటో ఈ మద్య అసలు కనిపించడంలేదు ,పొస్ట్లు కూడా లేవూ :)

cartheek చెప్పారు...

అక్క మీ పేరు నాగమణి కాదు నవ్వులగని అని పెడితే సరిపోయేదేమో :) :)

అజ్ఞాత చెప్పారు...

hi

can anyone help me
i have tried for over a week now to get a loan,i have very bad credit history mainly due to a failed marrage ,i have had all the usual ,wh loans,advantage loans ,yes loans ,get in touch and promise a [url=http://www.usainstantpayday.com]bad credit loans[/url] on paying the brokerage fee,i am reluctant due to reviews on the net and i have been stung before by a company called wentorth finance ,and never got the loan of the 50 pound fee back,
i have had an offer from flm but need a gaurantor which isnt really an option either .
i wondered if anyone had any loan companys that considered bad credit ,but loaned direct without these numerous sites with different alias but mainly did same thing pay us and we will get u loan (maybe)senario
has anyone also heard of a company called fresh loans they have they sent me details out but the may be a charge but not always ,i suspect she didnt want to tell me there was a charge

thanks
Enjoyncbobhib

Unknown చెప్పారు...

mee postlu office lo vundaga chadavakoodadu ani ottu pettukunnau.
ivala asale pani cheyyakunda kotha pichidaanila ee telugu blogs chaduvutunna. daaniki todu nenu okkadaanne ila navvutunte , pichi ekkindanukuntaru.

Vamsi చెప్పారు...

ha ha haa...
Naaku acchham ilaanti sandarbhaale edurayyaayi chaalaa saarlu.. :-)

అజ్ఞాత చెప్పారు...

Hello there people, I just signed up on this terrific community and wanted to say hello! Have a amazing day!

అశోక్ వర్మ చెప్పారు...

వావ్ అద్భుతంగా రాసారు. జోహార్స్ !!!

అజ్ఞాత చెప్పారు...

hey all

I just wanted to introduce myself to everyone!

Can't wait to get to know you all better!

-Marshall

Thanks again!

అజ్ఞాత చెప్పారు...

hello


Just saying hello while I read through the posts


hopefully this is just what im looking for looks like i have a lot to read.

అజ్ఞాత చెప్పారు...

hey


Just saying hello while I read through the posts


hopefully this is just what im looking for looks like i have a lot to read.

అజ్ఞాత చెప్పారు...

thanks for this nice post 111213

అజ్ఞాత చెప్పారు...

hi

HarshaBharatiya చెప్పారు...

బావుంది పోస్టింగ్
నేను అంతే.....చాలా సార్లు confuse అవుతుంటాను

no చెప్పారు...

నేస్తం గారు, ఆదివారం ఆంధ్రజ్యోతి మేగజైన్‌కి ఈ పోస్టు తీసుకున్నాం. "బ్లాగోతం" పేర వారం వారం వచ్చే శీర్షికలో ఈ వారం (జూన్ 14, 2015) న మీ ఈ 'తిక మక - మక తిక' పోస్టును "మీరెవరో తెలుసో లేదో చెప్పలేను" పేరిట ప్రచురించాం. ధన్యవాదాలతో...

ఆదివారం ఆంధ్రజ్యోతి మేగజైన్