30, ఏప్రిల్ 2010, శుక్రవారం

అలా వచ్చాను అన్నమాట ఈ దేశానికి ...


దూరపు కొండలు నునుపనీ ..చిన్నప్పుడు విమానం చూసి ఎంత ముచ్చట పడిపోయానో, తీరా అచ్చంగా లోపలికి వెళ్లి చూస్తే ఓస్!! ఇంతేనా అనిపించేసింది .. అచ్చంగా మన ఆర్టీసీ బస్ లాగే ఉంది ..ఇంకా అదే బెటరేమో ..ఇది మరీ ఇరుగ్గా ఉంది.. ఒకేసారి ఎదురు ,బొదురుగా మనుషులు నడిస్తే కష్టమే .. పైగా సినిమాల్లోనూ ,కధల్లోనూ చెప్పిన ప్రకారం ఎయిర్ హోస్టెస్ అంటే సన్నంగా ,తీగల్లా దేవకన్యల్లా ఉంటారని అనేసుకునేదాన్ని ... ఇక్కడ చూస్తే అందరూ నలబయ్ పైబడిన వాళ్ళే ..పైగా ఒక మోస్తరు లావుగా ,నీలం రంగు చీర కట్టుకుని అతి మాములుగా ఉన్నారు..


ఇంతలో అందులో ఒక ఆవిడ నా టికెట్ చూసి ,ఫలానా నెంబర్ సీట్ లో కూర్చో మని చెప్పేసరికి అదెక్కడో తెలియక వెదకడం మొదలు పెట్టాను ..నాతో పాటు వచ్చిన ఆయన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు.. అక్కడక్కడే తచ్చాడుతుంటే ఇంక దీనికి చెప్పినా లాభం లేదనుకుందేమో ..నవ్వుతూ నన్ను తీసుకెళ్ళి ఒక సీట్ చూపించి వెళ్ళిపోయింది ఒక ఎయిర్ హోస్టెస్ .. ఇదేం విమానం రా బాబు అనుకుని నా బేగ్ పెట్టడానికి ఏదైనా ప్లేస్ ఉందేమో చూసా ..ఉహు అన్ని కేబిన్లు నిండిపోయాయి..ఆ ఇరుకులోనే కాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రక్కకు చూసాను ...ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి తెల్లగా ,పొడవుగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నాడు ... నాకు నీరసం వచ్చేసింది ...ఎవరన్నా తెలుగువాళ్ళు ఉంటే ఏదో ఒక మాటల్లో పడి కాస్త భయం తగ్గించుకునేదాన్ని.. ఆ అవకాసం లేదు ఇప్పుడు .. నీడ పట్టున కూలింగ్ గ్లాసెస్ ఏమిటిరా తింగరి మొహం అని కసిగా తిట్టుకుని ఆ ప్రక్కన చూసాను.. ఎవరో ఒక అతను కిటికీ ప్రక్కనే కూర్చుని ప్లైట్ ఎక్కిందే నిద్రపోవడానికి అన్నట్లు కళ్ళు మూసుకుని గాఢ నిద్రలో జారుకుంటున్నాడు..

నాకు మా ఆయన మాటలు గుర్తుకువచ్చాయి..బుజ్జీ, ప్లైట్ లో నుండి చూస్తే భలే ఉంటుంది తెలుసా!!! క్రింద సముద్రం ,అలలు అన్నీ మాంచి కలర్ ఫుల్ గా కనబడతాయి.. ఏదో వింత లోకం లో ఉన్నట్లు ఉంటుంది ... అని .. అవన్నీ చూడాలని ఎంతో ఆశ పడితే ఇంకెవరో అక్కడ కూర్చోవడమే కాకుండా ,హాయిగా పడుకుని ఆ సీట్ ఉపయోగం లేకుండా చేసేస్తాడా.. అసలు విమానం లో కిటికీ ప్రక్కన సీట్ లలో 80 % అమ్మాయిలకు రిజర్వేషన్ కలిపిస్తూ ఒక చట్టం చేసి పడేయాలి అనుకుని తెగ బాధపడిపోతుంటే ..మేడం ప్లైట్ స్టార్ట్ హోరాహా హై ...ఆప్ అపినీ సీట్ బెల్ట్ బాంద్ కీజియే అంది మళ్లీ నీలం రంగు చీర అమ్మాయి..

బెల్టా!! ఏం బెల్టు ??అనుకుని అటు ఇటు చూసుకుంటే కనబడింది ...హమ్మయ్య అనుకుని బెల్ట్ పట్టుకుని లాగుతుంటే రాదే??? ..అది ఎలా పెట్టాలో తెలియకా అటు ,ఇటు త్రిప్పి చూస్తుంటే ..ఎక్స్ క్యూజ్ మీ ..ఆ బెల్ట్ నాది అన్నాడు ప్రక్కనున్న వాడు నాతో హిందీలో ...సారి ,అని ఒక కొస అతనికి ఇచ్చేసి నా బెల్ట్ కోసం వెదుకుతుంటే ...ఇక్కడుంది అంటూ చూపించాడు.. చిన్న చిరునవ్వు నవ్వేసి కాస్త విశ్రాంతిగా సర్దుకు కూర్చున్నా ... వెంటనే నా ముందు ఉన్న చిన్న టివి లో ఒక అమ్మాయి వచ్చింది .. ప్లైట్ లో గాలి ఆడకపోతే ఏం చేయాలి ... ప్రమాదం వస్తే ఎలా దూకాలి అంటూ .. అప్పుడప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న నాకు భయం తో మళ్లీ చమటలు పట్టేసాయి ...

మెల్లిగా ప్లైట్ బయలుదేరడం మొదలైంది.. వేగం గా.. వేగంగా ...ఇంకా వేగంగా ... పైకి వెళుతుంటే చెవి లో హోరు,గొంతు అంతా మంట ,తల కాస్త బరువుగా ..అనిపించడం మొదలైంది.. ఎందుకో చాలా భయం వేసింది.. కళ్ళు గట్టిగా మూసేసుకుని చెవులు చేత్తో మూసుకుని ..దేవుడా దేవుడా .. కాపాడవా.. ప్లీజ్ ..ప్లీజ్ ...ఏదో తెలిసీ, తెలియని వయసులో ఏదో అనుకుంటే దాన్ని ఇలా నిజం చేసి ఇంత భయం పెట్టేస్తావా .. ప్లీజ్ ప్లీజ్ కాపాడు అని ఒక అయిదు నిమిషాలు జపం చేసి మెల్లిగా కళ్ళు తెరిచాను.. చెవిలో హోరు గొంతు మంట తగ్గింది.. అసలు ఎక్కడికీ వెళుతున్న ఫీలింగే లేదు.. మెల్లిగా ఊపిరి పీల్చుకున్నాను..

పస్ట్ టైమా అన్నాడు నా ప్రక్కవాడు..కొద్దిగా సిగ్గుగా అనిపించింది.. ఇంకొంచెం కోపం గా కూడా అనిపించింది అలా అడిగేసరికి .. 'ఊ' అన్నాను సీరియస్ గా మొహం పెట్టి ... ప్లైట్ ఆకాశం లోకి వెళ్ళడం పాపం అప్పటివరకు బుద్దిగా కూర్చున్న ప్రయాణికులు అటు ,ఇటు తెగ తిరుగుతున్నారు.. వారిలో మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు కనబడతారేమో అని ఆశగా చూస్తున్నా.. ఈ ఫ్లైటేనా వాళ్ళు ఎక్కింది ???..కొంప దీసి నేను హడావుడిలో వేరే ఫ్లైట్ ఎక్కేయలేదు కదా అని కూడా భయం వేసింది...

ఎదురుగా నీలం చీర అమ్మాయి ఒక ట్రాలీ లో రక రకాల జ్యూస్ లు,స్నేక్స్ పొట్లాలు పట్టుకుని వస్తుంది.. అవి చూడగానే బాగా దాహం వేసింది.. ఏదో సినిమాలో హీరోయిన్ చాక్లెట్స్ ఇస్తే హేపీ బర్త్ డే చెప్తుంది ..అప్పుడు అందరూ నవ్వుతారు.. నేనేమన్నా అలాంటి ఎర్ర బస్సునేంటి??అలా లేకిగా తీసుకోవడానికి .. ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి .. అసలే నా ప్రక్క నోడు నన్ను తిమ్మాపురం తింగరబుచ్చిలా చూస్తున్నాడు అని గాట్టిగా అనేసుకునేంతలో ఆ అమ్మాయి నా దగ్గర కొచ్చింది .. ఆరెంజ్ ,కోక్ ,ఫ్రూటి ఏం కావాలి మేడం అనగానే ..నో థేంక్స్ అన్నాను కొంచెం స్టైల్ గా .. ఆ అమ్మాయ్ నా ప్రక్కన వాడిని అడిగింది.. వాడు ఒక కోక్ ,రెండు ఫ్రూటి లు ,రెండు వేరుశనగ పేకెట్లు తీసుకున్నాడు..ఆక్చర్యం!!! ఎవరూ పట్టించుకోలేదు.. లెక్క ప్రకారం వాడిని చూసి నవ్వాలి కదా ???? అలా ఎలా వదిలేసారు అందరూ అని కాసేపు బాధ పడిపోయి నోరుమూసుకుని కూర్చున్నా.. వాడిని ఎవరూ ఏమి అనలేదు అనో ,లేక నేను అనవసరం గా లేని గొప్పలకు పోయి జ్యూస్ త్రాగాలేదనో.. ఏంటో ఒక రకమైన కోపంగా ఉంది..


కాసేపు అయ్యాకా వాడు మెల్లిగా మాట్లాడటం మొదలు పెట్టాడు..హిందీ సినిమాల ప్రభావం వల్లో ,లేక సింపుల్ ఇంగ్లిష్ వాడటం వల్లో మొత్తానికి బాగానే అర్ధం అవుతుంది నాకు భాష .. పేర్లు,ఊర్లూ చెప్పు కోవడం అయ్యాకా .. ఎక్కడికి వెళుతున్నారు? అన్నాడు ... సింగపూర్ వెళ్ళే ప్లైట్ ఎక్కి ఎక్కడికీ అంటాడేమిటి వీడి బొంద అనుకుని ..సింగపూర్ అని చెప్పి.. మళ్లీ అదే ప్రశ్న వాడిని వెయ్యకపోతే బాగోదని మరి నువ్వో అన్నాను.. నేను అమెరికా అన్నాడు గర్వం గా .. ( ఏమిటో ఈ అమెరికా వెళ్ళే వాళ్ళు తెగ పోజులు కొట్టేస్తూ ఉంటారు ..అక్కడికి మావి వేరే దేశాలు కానట్టు :)) అంతే నాకు ఒక్క సారిగా వణుకొచ్చేసింది.. ఇది ..ఇది సింగపూర్ వెళ్ళే ప్లైట్ కదా అన్నాను గొంతు తడారిపోతుంటే... వాడొక క్షణం నా వైపు అయోమయం గా చూసి .. అవును సింగపూర్ ఫ్లైట్ నే.. కాని నేను అక్కడి నుండి వేరే ఫ్లైట్ లో అమెరికా వెళ్తా అన్నాడు నా పరిస్థితి అర్ధం చేసుకుంటూ.. హమ్మయ్యా!!! అని అనుకుని అయినా మళ్లీ అడిగా .. నిజమేనా ..సింగపూర్ ఫ్లైటేనా అని..


కాసేపు అయ్యాకా మళ్లీ వస్తుంది నీలం రంగు అమ్మాయి ట్రాలీ తోసుకుంటూ.. హమ్మయ్యా ..ఈ సారి మిస్ కాకూడదు.. రాగానే గభ గభా .. ఒక గ్లాస్ చూపించా.. నా ప్రక్కన అబ్బాయి ఒకటి తీసుకున్నాడు.. అబ్బా, వీడిది కడుపా ,కంబాల చెరువా ఏది పడితే అది తోసేస్తున్నాడు పొట్టలోకి అనుకుంటుంటే.. వాడు అనుమానం గా నా వైపు చూస్తూ 'హాట్ డ్రింక్ 'అన్నాడు .. ఇంత చల్లగా ఉంటే హాట్ అంటాడేమిటి అని వాడి వైపు చూసి ,లేదే ..నాకు చల్లగా ,కూల్ గా ఉంది అన్నాను.. ఈ సారి వాడు నాన్చ లేదు ..అది 'విస్కీ' అన్నాడు ... దెబ్బకి టక్కున ఎదురుగా ఉన్న ట్రేలో పెట్టేసా.. అప్పటి వరకు కోక్,పెప్సి లాంటివి 'సాఫ్ట్' అని వీటిని 'హాట్' అంటారని తెలియదు ..పైగా ప్లైట్ లో మందు కూడా ఇస్తారా ??? అని చూస్తుంటే .. కావాలంటే నీకు కోక్ తెప్పిస్తా ..అది నాకిచ్చేస్తావా అన్నాడు ... ఓరి నీ కక్కుర్తి తగలబడ అనుకుని.. ఓకే ..ఓకే తీసేసుకో నాకే డ్రింకులు వద్దు అన్నాను..

నాన్న గుర్తు వచ్చి నవ్వు వచ్చింది.. మమ్మలిని ఏ ట్రైన్ లోనే ఎక్కిస్తే ప్రతి బోగి కి వంక పెట్టేవారు.. ఇందులో ఎవడో సిగరెట్ కాలుస్తున్నాడు.. అందులో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అని నాలుగైదు బోగీలు మార్చేవారు.. ఇలా అయితే మనం గూడ్స్ బండిలో వెళ్ళాలి అని అమ్మ విసుక్కునేది.. అలాంటింది ఒక తెలియని అబ్బాయి ప్రక్కన కూర్చుని మందు కూడా తాగుతున్నాడు అని తెలిస్తే ???...హుమ్ నిట్టూర్చి మళ్లీ కిటికీ వైపు చూసాను యాదాలాపం గా ... దూరం నుంచి సరిగా కనబడటం లేదు .. మబ్బుల మద్య లో నుండి వెళుతుంది అంటే ఏవో దూది పింజలు ఎగురుతున్నట్లు కనబడుతుంది అనుకున్నా..ఉహు ఆ జాడే లేదు.. కాస్త దూరం గా ఇంకేదో కనబడుతుంది.. కొంచెం అనుమానం గా తల పైకి ఎత్తి చూసా ... అనుమానం లేదు ప్రక్కనే వేరే ప్లైట్ వెళుతుంది..

అదేంటి ప్రక్క ,ప్రక్కనే రెండు ప్లైట్లు వెళతాయా ? అమ్మో ఎంత డేంజర్.. ఎంత సేపు చూసినా ఆ ప్లైట్, ఈ ప్లైట్ ప్రక్క ప్రక్కనే వెళుతున్నాయి.. ఏదో ఒకటి ముందుకి వెళ్ళడం లేదు..కొంచెం సిగ్గుగానే అనిపించినా భయం దాన్ని అధిగమించేసింది.. మెల్లిగా ప్రక్కనున్న అతనితో .. మరి మన ఫ్లైట్ ప్రక్కనే ఇంకొక ప్లైట్ వెళుతుంది డేంజర్ కదా అన్నాను .. వాడు వెంటనే ఫైలెట్ కి చెప్తాడని.. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే చెప్పినందుకు అందరూ అభినందిస్తారని మరొక వైపు సంతోషం కూడా అనుకోండి ... అతను అయోమయంగా నా వైపు చూసి కిటికీ వైపు చూసాడు.. నేను చూపించాను.. అతను హి..హి అని నవ్వుతూ అది ప్లైట్ కాదు ..ప్లైట్ వింగ్ ..అంటే రెక్క ..దాని ప్రక్కనే కూర్చున్నాం కదా అందుకే అలా అనిపించింది అన్నాడు..


ఛీ....ఛీ ఎంత అవమానం .. ఇంకో సారి వీడితో మాట్లాడకూడదు అని మూతి బిగించుకుని కూర్చున్నా ... కాసేపటి లో భోజనాలు.. అమ్మో ఫ్లైట్ లో ఎక్కితే ఎన్ని పెడతారో అనుకుంటూ వెజ్ కావాలని చెప్పాను.. ఎందుకొచ్చిన గొడవ మళ్లీ వాడెం పెడతాడో..నేనేం కంగారు పడతానో కదా అని వెజ్ నే అడిగా ... రసగుల్లా.. పప్పు అన్నం..ఏదో కూర..ఒక బన్..వెన్న ..పళ్ళ ముక్కలు..ఇంకా ఏంటో పెట్టింది.. సగం, సగం తినేసి వదిలేసా.. కాసేపటికి లైట్స్ ఆఫ్ చేసేసారు అందరూ కిటికీ లు మూసేసి పడుకుంటున్నారు.. నేను అలా టైం చూస్తూ కూర్చున్నా ... కొంచెం సేపయ్యాకా కిటికిలోనుండి బయటకు చూస్తావా అని అడిగాడు ఆ అబ్బాయి.. ఎలా?? అన్నాను..ఒక ప్రక్క నుండి భయం వీడితో వెళితే సేఫేనా ?? ఎక్కడికి తీసుకు వెళతాడు ఫ్లైట్ లోనే కదా ..ఏం కాదు అని ధైర్యం చెప్పేసుకున్నా..

కమ్.. అని వెనుక వైపు ఖాళి గా ఉన్న సీట్ల వైపు తీసుకు వెళ్లి చూడు అన్నాడు.. క్రింద అంతా మబ్బులు ..పైకి చూసా ..పైన కూడా మబ్బులే.. రెండు ఆకాశాల మద్యలో ఉన్నట్లు.. ఎలాంటి ఆధారం లేకుండా.. మనిషి ఎంత గొప్పవాడు అయిపోయాడు.. మన పూర్వికులు పుష్పక విమానం,ప్రియదర్శిని అనే లాంటి వాటినే ఇప్పుడు విమానాలు,కంప్యూటర్లు లాగా తయారు చేసారు.. అంటే వాళ్ళు గొప్పా? వీళ్లు గొప్పా? అంటే పురాణాలన్నీ భవిష్యత్తుని ఊహించే రాసినవా?? ఏంటో కాసేపు వరకు వేదాంతమో ,వైరాగ్యామో ఏంటో ఏంటో.. నాక్కూడా మొదటి సారి చూసినపుడు భలే అనిపించింది ఆ అబ్బాయి ఏంటో కబుర్లు చెప్తున్నాడు..

కాసేపయ్యాకా నీలం రంగు బెల్ట్ వేసుకోమని హెచ్చరించింది.. అబ్బ స్కూల్లో టీక్చర్ల లా వీళ్లు ఎవరురా బాబు అనుకుని మా సీట్లలోకి వచ్చిపడ్డాం.. అందరూ బ్లాంకెట్లు కప్పుకుని పడుకున్నారు.. నాక్కూడా నిద్ర వచ్చింది.. పడుకుందాం అనుకునేంతలో మళ్లీ ప్లైట్ క్రిందకు దిగుతుంది ..కాసేపట్లో వచ్చేస్తాం అన్నాడు ఆ అబ్బాయి ... ఒక్క సారిగా లైట్లు వెలిగాయి అందరూ సర్దుకుని కూర్చున్నారు..చీకటి పడిపోయింది.. టైం ఎంతో చెప్తున్నారు ఎనౌన్సుమెంట్ లో ... ఆగాకా బయటకు వస్తూ ఆ అబ్బాయి టాటా చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోయాడు.. ఈ లోపల ఏ మూలన కుర్చున్నారో మా ఆయన ఫ్రెండ్ బయటకు వచ్చాడు .. ఇంక అక్కడి నుండి అతని వెనుక బయలుదేరా...


"చాంగి ఇంటెర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ "అనే అక్షరాలు చూస్తేనే ..ఆ గాలి తాకితేనే నాకు ఎంతో పరిచయం ఉన్న ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది.. ఎటు చూసినా పూల మొక్కలు,అందమైన తటాకాలు ఏదో ఉద్యానవనం లో ఉన్నట్లు.. మొదటి సారిగా escalator ఎక్కినపుడు పడబోయాను ... కొంచెం భయం వేసినా తరువాతా అది ఎక్క కుండా ప్రక్కనుండి నడిచేదాన్ని.. దారిలో అనేక దేశాల ఎయిర్ హోస్టెస్ అచ్చం గా దేవకన్యల మాదిరి.. ముట్టుకుంటే మాసిపోతారేమో అన్నట్లు ... అన్ని వింతలు చూడాలని అనిపించినా.. మళ్ళీ దారి మిస్ అయిపోటానేమో అనే టెన్షన్ లో అస్సలు చూడలేదు..


మళ్ళీ పాస్ పోర్ట్, వీసా గట్రాలు చెక్ చేసాక ..ఆ అమ్మాయి మీవారు ఏం చేస్తుంటారు? అని అడిగింది.. అప్పటి వరకు బాగానే ఉన్నా ఆ భాష మళ్ళీ క్రొత్తగా అనిపించి తడబడుతూ సమాధానం చెప్పి బయటకు వచ్చాకా హమ్మయ్యా వచ్చేసానురా భగవంతుడా అనుకుని నా బేగ్ మోసుకుంటూ లగేజ్ కలెక్ట్ చేయడానికి వెళుతుంటుంటే ఎదురుగా చేతులు ఊపుతూ గాజు తలుపుల వెనుక నించుని ఎవరో.. ఎక్కడో చూసినట్లుగా అనిపించింది .. ఇంకెవరు!! మా ఆయనే ..ఇదేంటి ?కుంపట్లో కాల్చిన కుమ్మొంకాయలా ఇలా నల్లబడి పోయారేమిటబ్బా ???పైగా సన్నబడి పోయారు కూడా ..మెట్లు దిగుతూ అనుకునేంతలో ..ఢాం, ఢాం అంటూ పెద్ద శబ్ధం ..కాసేపు ఏమైందో తెలియదు .. ఇహ లోకం లోకి వచ్చాకా ఆఖరి మెట్టు పైన కూర్చుని నేను.. ఆర్యూ ఓకే ?ఒక ఆమె అడుగుతుంది .. పడ్డాను.. కాని ఎలా? హౌ ? అని అనుకునేంతలో నా క్రొత్త చెప్పులు ఇప్పటివరకూ భరించాను ..ఈ జారుడు నేల పైన ఇంక నా వల్ల కాదు అని వెక్కిరించాయి..

ఎదురుగా అప్పటివరకూ చేతులు ఊపుతూ ప్రక్కన ఫ్రెండ్స్ అందరికీ నన్ను పరిచయం చేస్తున్న మా ఆయన ..గొప్ప పని చేసావులే ఇంక రా అన్నట్లు మొహం పెట్టారు.. బిక్క మొహం వేసుకుని బయటకు వచ్చాను .. :)

44 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

ఇప్పుడు నాది మొదటి కామేంట్ అయ్యే అవకాసం వుంది

mahipal చెప్పారు...

hamma ......
mothannni ki mimullani gurthupattam aa photo lo.....
telisipoyindhoc nestham evarooooooooooooooooo..........................................................

అజ్ఞాత చెప్పారు...

intaki meeru ippudu SG lone vunanra?

3g చెప్పారు...

ఐతే ఈసారి నేనే ఫస్ట్.

పవన్ కుమార్ చెప్పారు...

నిన్న ఫస్ట్ కామెంట్ మిస్స్ అయ్యాను అని అనుకున్నా.
కానీ మల్లీ నెనే నెంబర్ వన్

మంచు చెప్పారు...

ఎంత చాలా రోజుల తరువాత చూస్తే మాత్రం అంత ఫాస్ట్ గా మెట్లు దిగాలా :-))

ఇంతకుముందు క్రికెట్ పొస్ట్ లొ " ఎర్ర ఫ్లైట్ ఎక్కివచ్చినట్టు కనిపిస్తున్నాను" అంటే ఎంటో అనుకున్నా.. ఇప్పుడు అర్ధం అయ్యింది.. :-))

శ్రీనివాస్ చెప్పారు...

ఆలా జరిగిందా

నేస్తం చెప్పారు...

నాకు బోలెడు బాధొచ్చెస్తుంది.. ముందు కామెంట్స్ పోయాయి :(
మంచుపల్లకి గారు అవునండి మీ కామెంటే ఫస్ట్
>>ఎర్ర ఫ్లైట్ ఎక్కివచ్చినట్టు కనిపిస్తున్నాను" అంటే ఎంటో అనుకున్నా
ఇలా మరీ మొహం మీద చెప్పడం ఏంబాలేదండీ.. :)
మహిపాల్.. అయ్యబాబోయ్ గుర్తుపట్టేసారా .. ఎవరండీ అయితే నేను.. :).. ఈ ఫొటొ వాటర్ కలర్స్ లో మార్చినపుడు ,,నా మొహం ,మా ఆయన మొహం అలికినట్లు వచ్చి అసలేమాత్రం పోలిక లేకపోయేసరికి ఓ ప్రక్కన పడేసా.. ఇందాక పోస్ట్ డిలీట్ అయిన బాధలో ఉండేసరికి ..పొస్ట్ కి తగ్గ పొటొ వెదిక ఓపిక లేక .. ఎవరికి తెలుస్తుందిలే అనే ధైర్యం తో పెట్టెసా :)
అఙ్ఞాత గారు అవునండీ అక్కడే ఉన్నా :)
పవన్,3g గారు ఉహు కాదు :)

మంచు చెప్పారు...

>> యా...............................హూ...................... నాదే ఫస్ట్ కామెంట్.. జజ్జనక ..అహ జజ్జనక... ముందు కామెంట్స్ పోవడం మంచిదయింది (నాకు )

>> మిమ్మల్ని అనలేదండి .. మీరెక్కిన ఎయిర్ బస్సు ని అంటున్నా .. :-))

>> అలికినట్టు వచ్చినా కొన్ని పోలికలు తెలుస్తున్నాయ్ .. ఈసారి సింగపూర్ ఎయిర్ పొర్ట్ లొ మిమ్మలి చూస్తే గుర్తుపట్టేయగలను..( అదే టైం లొ ఇంకెవరన్నా జారి పడితే కంఫ్యుజ్ అవుతానెమో తప్ప :-)) )

శివరంజని చెప్పారు...

అక్కా వైట్ చుడిదార్ లో వున్నది నువ్వేనా చెప్పవా చెప్పవా ప్లీజ్ .
టపా చదువుతుంటే అందరికి బాధేసిందంటున్నారు కాని నాకు మాత్రం నవ్వొచ్చింది.నేను కూడా ఇంతే ప్రక్కింటికి వెళ్ళాలంటే పది మంది తోడు లేనిదే వెళ్ళను. మా ఫ్రెండ్స్ అయితే ప్రతి చిన్న దానికి కూడా రమ్మని తినేస్తున్నావే బాబు అని అప్పుడప్పుడు విసుక్కుంటారు. ఒక్కక్కసారి నా టెన్సన్ నాకే చిరాకు గా అనిపిస్తుంది. పోని ధైర్యం చేసి వెళ్ళిన అక్కడకి వెళ్ళేసరికి చమటలు పట్టేసి టెన్సన్ తో గోళ్ళు కొరికేసుకుని మొహం లో నానా ఎక్ష్ప్రెషన్స్ పెట్టేసి కష్టాలన్ని అప్పుడే ఎదురైనట్టు ఫీల్ అయిపోతుంటాను . హేవిటో! .నువ్వు నాలాగే టెన్సన్ పార్టీ కదూ.

గీతాచార్య చెప్పారు...

:D)(O)D:

రాజ్ కుమార్ చెప్పారు...

Alaa jarindanna mata..
Ponlendi..kshemam ga cherukunnaru...santosham..:) :)

ఎంత చాలా రోజుల తరువాత చూస్తే మాత్రం అంత ఫాస్ట్ గా మెట్లు దిగాలా :-))
ha ha...ha.. Punch...

naaku photo kanipinchatledandi.. Mee photo pettara nestam?? ayyo..ayyo..ayyayyo.. :( :(

latha చెప్పారు...

hi...post chala bagundi. naku oka doubt: profile lo top-right side unna pencil sketch mee husband da? meeru sketch chesara adi?

one request: mee pair di oka manchi foto pettandi blog lo...

విశ్వనాథ్ చెప్పారు...

నేను బ్లాగులకు కొత్తే కానీ ,వచ్చీ రావటం తోనే మీ అభిమానిని అయిపోయానండీ.

మీ అభిమాన సంఘానికి నేనే ప్రెసిడెంటు,మీరు ఒప్పుకోవాలి అంతే!

Ram Krish Reddy Kotla చెప్పారు...

పోస్ట్ డిలీట్ అయితే అయింది కాని..మీ ఇద్దరి ఫోటో చూసే భాగ్యం కలిగింది కదా... :-)
ఇక పోస్ట్ విషయానికి వస్తే...మొత్తానికి సింగపూర్ చేరిపోయారు..నాకు సగం టెన్షన్ వదిలింది..మా నేస్తం లో చేరింది అని ఒకటే టెన్షన్ తో నిద్ర కూడా పట్టలేదు...
"అది కడుపా కంబాల చేరువా.." ఈ డైలాగ్ నేను ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటా...మీకు అదే తాట్ రావడం యాధృచ్చికమే కావచ్చు..మనం ఒకేలా థింక్ చేస్తున్నామేమో :)

అజ్ఞాత చెప్పారు...

photo ki "me" ane name petukunave. aa matram gurtu pattalema enti photo pedithe ,maree antha pichhollu anukunava enti janalu :)
bommani giste nila undi ane title ki photo petinapude artam ayindi mi ayana ani. mi ayana bagunaduemo anukunna kani.

nenu enduko miru andamga mi ayana bagundakapovachu ani expect chesanu kani iddaru bagunaru, inka cheppalante mi ayane inka bagunadu.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ కుంపట్లో కాలిన కుమ్మొంకాయ తో సహా హాయిగా నవ్వించేశారు అనుకుంటే చివర్లో ట్విస్ట్ ఇచ్చేశారు కదా :-) పాపం నేస్తం..

నేస్తం చెప్పారు...

శ్రినివాస్ ఈ కుట్ర వెనుక నీ హస్తం ఉందని విశ్వసనీయాల బోగట్టా... చెప్పు పోస్ట్ ఎలా మాయం అయ్యిందో లేకపోతే tv9 తో చెప్తా :)
మంచుపల్లకి గారు నేనొప్పుకోను.. నా పోలికలు కనబడటం లేదంతే :)
శివరంజని నేనే నేనే :) ..అది వైట్ కాదు లైట్ బ్లూ ..హమ్మయ్యా నా డ్రెస్సే గుర్తుపట్టేలా లేదు.. :P మొత్తానికి నాకు తోడుగా నువ్వు ఉన్నావన్నమాట :)

నేస్తం చెప్పారు...

గీతా చార్యా ???? ఏంటండి దాని మీనింగ్
రాజ్ కుమార్ అదృష్టవంతులు మీరు అందుకే కనబడలేదు :)
లత ఆ స్కెచ్ నేను వేసింది కాదు..కొన్ని సైట్స్ లో మన పొటొ అలా మార్చుకునే వీలు ఉంటుంది .. ఆల్రెడీ మావారిది నాది పొటో పెట్టేగా నిన్నా మొన్నా :)
విశ్వనాద్ గారు ఇంతకూ సంఘం లో సభ్యులు ఉన్నారా :)

నేస్తం చెప్పారు...

కిషన్ కుమార్..రాజమండ్రి చుట్టు ప్రక్కల పరిసరాలలో ఈ మాట తరుచూ అంటారు లేండి.. నేను సింగపూర్ చేరానని టెన్షన్ లో నిద్ర పట్టలేదా :O
అఙ్ఞాత..లేదండి అసలు ఈ పోస్ట్ కని ఆ పొటొ అనుకోలేదు.. ఎప్పుడో సేవ్ చేసినది.. అనుకోకుండా నిన్న పెట్టాను .. నేనే బాగా ఉంటా అనుకున్నారా .. హహ .. :)
వేణూ :)

అజ్ఞాత చెప్పారు...

విశ్వనాథ్ గారు
నమస్కారం
ఏంటి ప్రెసిడెంట్ఆ ఈ మాట సాయి ప్రవీణ్ గారు విన్నారంటే బాగోదు :)
మొన్ననే బ్లడ్ డొనేషన్ అవీ చేద్దామంటే నేస్తం గారే వద్దు అని చెప్పారు
ముందు మెంబెర్ గా చేరండి (ఫాలో అవ్వండి)తర్వాతా మా పదవులకు ఎసరు పెట్టండి :)

ఇట్లు
జాజిపూలు అభిమానుల మెంబెర్

Ram Krish Reddy Kotla చెప్పారు...

కిషెన్ కుమార్ ??...ఏంటి నేస్తం పేరే మర్చేసావ్...నేను కిషెన్ రెడ్డి కదా..ఏదైతే ఏముంది అంటారా తొక్కలోది...నిజమేలెండి..అవునండి మీరు సింగపూర్ చేరారో లేదో అని ఒకటే టెన్షన్ తో నిద్ర పట్టలేదు...హమ్మయా చేరిపోయారు..ఇంకేంటండి విశేషాలు???..అంతా క్షేమమేనా..?

Srujana Ramanujan చెప్పారు...

Congrats Nestam. Mothaanikee vachheshaaru

Srujana Ramanujan చెప్పారు...

Hammayya. Nenu Inthakumundu comment raayaledoch. Naadi poledoch. :D

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
మీ మొదటి ఫ్లైట్ అనుభవాలు చాలా సరదాగా ఉన్నాయి.మీరు అన్నిటిని భలే గుర్తు పెట్టుకుని, చాలా బాగా రాస్తారు, నేస్తం.హమ్మయ్య మొత్తానికి క్షేమం గా చేరుకున్నారు. :-)

>>సింగపూర్ వెళ్ళే ప్లైట్ ఎక్కి ఎక్కడికీ అంటాడేమిటి వీడి బొంద అనుకుని ..సింగపూర్ అని చెప్పి..

హహహః, ఇక్కడ భలే పంచ్ ఇచ్చారుగా.మీ మార్క్ అమాయకత్వం మళ్ళీ కనిపించేసింది ఈ పోస్ట్లో కూడా.

నాకు కూడా విండో దగ్గర ఎవరైనా కూర్చుని,ఉపయోగించకపోతే ఒళ్ళు మండిపోతుంది.:-)) నేను మొదటి సారి ఫ్లైట్ ఎక్కినప్పుడు పాపం ఒక ఆవిడ ఒడిలో ఒక బాబు ఉన్నాడు.ఒక 1.5 yrs ఉంటాయేమో. వాడు అసలు విండో వైపు చూడట్లేదు.ఈవిడ కూడా. నేనేమో తొంగి తొంగి చూసేస్తున్న కూర్చున్న సీట్ నుంచే అవతల మబ్బులు కనిపిస్తుంటే. .ఆవిడ కూడా, మొదటి సారా అని అడిగి, అవునంటే, ఒక చిన్న నవ్వు నవ్వి , ఇక్కడ కూర్చుంటావా మరి అని అడిగారు. ఛీ, అసలు ఎర్ర ఫ్లైట్ ఎక్కినట్టు అంతలా ఎందుకు తొంగి చూస్తున్నా, ఆవిడ ఏమనుకున్నారో అనేసుకుని ( పైగా ఆ ఫ్లైట్ లో ఖాళి సీట్లు కూడా లేవు), చిన్న బాబు ఉన్న సీట్ ని ఆక్రమించుకోటం బాగోదేమో, కిటికీ కోసం అనిపించినా ... ఆ విషయం తనతో అంటే, మరేం పర్లా, వీడు చూడదు అసలు అన్నారు.మొహమాట పడకుండా ఒప్పేసుకున్నా. :-)) ఆ రోజు ఎంత ఆనందం వేసిందో, అలా కిటికీ పక్కన కూర్చోగలిగి నందుకు. ఆవిడ చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను ! :-)

మీ తరువాతి పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అసలు నన్ను అడిగితె, మీరు ఒక పుస్తకం రాయొచ్చు.నాతొ సహా, బోల్డు మంది కొనేస్తారు. :-)

- పద్మ.

అజ్ఞాత చెప్పారు...

అక్కా వైట్ చుడిదార్ లో వున్నది నువ్వేనా చెప్పవా చెప్పవా ప్లీజ్ .

ఇది అన్యాయంన్ నాకు చాల dukkhamga ఉంది

ఫోటో ఎప్పుడు పెట్టారు మళ్ళీ తీసేసారా :(
ముందు నేను రాసిన కామెంటు కూడా కనిపించడం లేదు
నన్ను ఏడిపించేసారు ఒక్కసారి కాదు రెండు సార్లు :( :(

priya చెప్పారు...

ayyio meephoto miss ayyane:((
kani post bagundi chala!!

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు భలెవారండీ మీరు :D
కిషన్ ప్రొద్దున్న వంట తోనూ ఇటు కామెంట్ల తోనూ అష్టావధానం చేస్తున్నా.. అలా రెడ్డి కాస్తా కుమార్ అయిపోయింది ...ఇంక.. అదా సంగతి..ఒక వేళ నేను సింగపూర్ చేరానని నిద్రపట్టలేదేమో ఇదేంటబ్బా అనుకున్నా :)
సృజన మళ్ళి గుర్తు చేయాకు ఆ కామెంట్స్ అన్నీ ..వా ...:(
పద్మ ఎంత ఓపిక నీకు బోలెడు కబుర్లు చెప్తావ్ నాకన్నా బాగా :) నువ్వే వ్రాయి నేనే కొంటా :)
అఙ్ఞాత గారు ముందు పోస్ట్ డిలీట్ చేసేసా పొరపాటున.. అందులో మీ కామెంట్ ఉందేమో:(.. ఫొటో చూడనందుకు దుఃఖం ఎందుకండి ఎంచక్కా పండగ చేసుకోక ...
ప్రియ దేంక్స్ :)

గీతాచార్య చెప్పారు...

:D)(O)D:

1. D ముందు కాస్త ఎక్కిరింత. (పడ్డారు కదా! :D)

2. పడ్డవారెప్పుడూ చెడ్డవారు కాదు కనుక :) ఒక నవ్వు. ఎందుకంటే నేస్తం మంచి మనిషి కనుక

3. మీ బాధకు సమ్ఘీభావంగా నా విచారం :(

4. పోస్టు పోయిందా? ఆశ్చర్యం :O

5. ఓ ఫర్లేదు సేవ్ చేశారు కదా ఒక ఆనందం :D

మీరు నాలుగు క్వశ్చన్ మార్కులు పెడితే నేను నాలుగు పాయింట్లలో ఆన్సర్ చేశా. ఏదో ఈసారికిలా క్షమించేయండి. :D

మంచు చెప్పారు...

హ్మ్మ్.. పైన కొంతమంది ఫొటొ మిస్స్ అయానని అనుకుంటున్నారు ..నేను కాపీ చేసి పెట్టాగా . :-))

3g చెప్పారు...

మంచు పల్లకీ గారు మీరు కూడా సేవ్ చేసారా............... నేస్తం ఇలాంటిదేదో చేస్తారనే నేను కూడా సేవ్ చేసి పెట్టేసా.............. హ హా హ.......... ఇప్పుడు చాలా డిమాండ్ వచ్చేలా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

ఇలా అయితే మనం గూడ్స్ బండిలో వెళ్ళాలి అని అమ్మ విసుక్కునేది..

SUPER

జయ చెప్పారు...

బాగుందండి. చివ్వరి వరకు చదివేసాక నాకు మాత్రం బారిస్టర్ పార్వతీశం గుర్తొచ్చాడండి. మళ్ళీ అటువంటి మంచి నవల చదువుతున్న ఫీలింగ్ కలిగింది. నా కష్టాలు నీకు బాగున్నాయా అనకండేం:)

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా వ్రాసారు

నెను కుడా మొదటి సారి ఎవొ అఫర్ చెసినప్పుడు ఫ్లయిట్ లొ ఎందుకొచ్చిన రిస్క్ అని నొ థాంక్స్ అన్నా

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

కొంతమంది అమ్మాయిలకు గలగలా మాట్లాడే అలవాటుంటుంది. ఆమాటలను చకచకా రాసే అలవాటుకూడా మీకు అలవడింది. అసలు మనసులో అనుకున్నది పేపరుమీద పెట్టే టప్పటికే దాని రంగు రుచి వాసనా కూడా మారిపోతాయి. అలాంటిది మీరు అన్నీ పూసగుచ్చినట్లు చాలా సరదాగా రాస్తారు. హాట్సాఫ్ టు యు.

నేను అంతర్జాలానికి రాక చాలా రోజులైంది. అప్పుడు మిస్సైన అన్ని టపాలు ఇప్పుడు దాదాపు చదివాను. చాలా బాగున్నాయి అని ఒక్కమాటలో చెప్పలేక ఇలా... :)

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు! మీరు ఫొటో పెట్టారా.. నేను మిస్ అయ్యానే! మళ్లీ పెట్టరా ప్లీజ్.
విమానం పరువు తీసేసారుగా.. దానికన్నా మన ఎర్ర బస్సే బెటర్ అంటారా.. బాగుంది. విమానం వెంటనే ఎక్కాల్సిన అవసరం లేదు.
ఇంతకీ ఆ అబ్బాయితో ఇంగ్లీష్ లో మాట్లాడారా హిందీలో మాట్లాడారా చెప్పండి. నాకు మన తెలుగు తప్ప మరొక్క భాష రాదు. you are great.
సింగపూర్ ని చూడాలని లేదు గాని చాంగి ఎయిర్ పోర్ట్ ని చూడాలని ఉంది. తటాకాల మధ్య ఉందన్నారుగా.. అందుకే!
మీరు సింగపూర్ చేరుకోవటం కాదు గాని మా కష్టాలన్నీ తీరిపోయినట్లున్నాయి.
అదీ విషయం.. ఎప్పటిలా బాగా నివ్వించారు.

నేస్తం చెప్పారు...

అయ్యబాబోయ్ గీతాచార్య గారు తవరు ఊరికే ప్రొఫెసర్ అయిపోయారేటండి .. ఆయ్.. మా బాగా ఇవరించారాండి.. సూపరూ ..
మంచుపల్లకి గారు,3g గారు అసలు ఇదేమన్నా న్యాయం గా ఉందా.. అహా ఉందా అని అడుగుతున్నా ..
బోనగిరి గారు థెంక్యూ
జయ గారు బారిష్టర్ పార్వతీశం 11 యేళ్ళ వయసులో చదివాను..సరిగ్గా గుర్తులేదు కాని చదివినంత సేపూ బాగా నవ్వినట్లు గుర్తు ..అంత చక్కని నవల తో పోల్చడం ఆనందము ,బాధ రెండూ వేస్తున్నాయి.. :)
కోన సీమ కుర్రాడు గారు ..కోన సీమ కదండీ అలాగే మొహమాట పడిపోతాం.. మొహమాటం మన జన్మ హక్కు :)

నేస్తం చెప్పారు...

విశ్వ ప్రేమికుడు గారు మీరు చెప్పాలనుకున్నది ఒక్క మాటలో మీరు చెప్పకలిగారు కాని ఒక్కోసారి నాకు సంతోషం తో కామెంట్స్కి ఎలా సమాధానం ఇవ్వాలో తెలియదు.. :) థెంక్యూ
సవ్వడి గారు చూడలేదా.. :) నిజం చెప్పాలంటే నా పొటొ పెట్టడం నాకే మాత్రం ఇష్టం లేదు.. నేస్తం అంటే ఎవరి ఊహల్లో వారికి ఒక రూపు ఉంటుంది.. ఉన్నట్లుండి.. ఓస్ ఇంతే కదా నేస్తం అంటే ..అన్న ఫీలింగ్ రావడం అసలే మాత్రం నాకు ఇష్టం ఉండదు..:D మొన్నేంటో తికమక మక తికలో పెట్టాను .... పైగా అందులో నేనేం కనిపించడం లేదులెండీ.. :)

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు! మిమ్మల్ని కాదు.. మీవారిని చూడాలని ఉంది.

sphurita mylavarapu చెప్పారు...

అయ్యో నేస్తం, నేను మీ పొస్టు లేటు గా చూసి మీ photo miss ఐపొయానా.........:(...:(...చాలా బాధ అన్నమాట. మీరు భలేగా రాస్తారండి. మీ అమాయకమైన మొహం అలా ఊహించెస్కుంటాను మీ పొస్టు చదువుతూ..నేను బారిస్టరు పార్వతీశం చదవలేదు గాని మా నాన్నగారు తెగ చెప్పేవారు. నిజం గా అదే గుర్తు వచ్చింది మీ పోస్టు చదువుతుంటే...మొత్తానికి సాయం చేస్తాడనుకున్నాయన చెయ్యిస్తే ఎవరో ముక్కూ మొహం తెలియని అతను సాయం చేసాడన్నమాత. అదే మీకు కిటికీ లొంచి చూపించాడు కదా పాపం. ఒక్కో సారి అంతే...

mahipal చెప్పారు...

mikoka visham telusa meru pettina terminal 3 loni aaa palms nene pettichanu convier belt madhyalo.avvi... petanu gani malli atuvipu chedaldu(Project maripoyi),, me photo tho chusi murisipoyandi............................ mimalni gurthupattanu kabati meru naku party isthunaru ... ledante anderiki cheppestha!

mahipal చెప్పారు...

mikoka visham telusa meru pettina terminal 3 loni aaa palms nene pettichanu convier belt madhyalo.avvi... petanu gani malli atuvipu chedaldu(Project maripoyi),, me photo tho chusi murisipoyandi............................ mimalni gurthupattanu kabati meru naku party isthunaru ... ledante anderiki cheppestha!

శాంతి చెప్పారు...

ఏమిటో.. ఈమధ్య కంప్యూటర్ ముట్టుకోవదానికే వీలు అవకపోవడం వలన చాలా పోస్ట్ లు చదవలేదు. ఇవాళ తీరిక దొరికి కూచున్నా. భలే రాశారండి. చాలా నవ్వుకున్నాను.
AFV (America's Funniest Videos) చూసినప్పుడు నవ్వుకుంటాను ఇలా అసలు ఆపకుండా. భలే నవ్వించేశారు.

"కుంపట్లో వేసిన కుమ్మొంకాయ" :-D

డాం, డాం... చివరిమెట్టుపై కూచుని ఎవరైనా చూసేశారా అన్నట్టు పెట్టిన బిక్కమొహం కనిపించిందండీ.. అదుర్స్!!

..nagarjuna.. చెప్పారు...

Flightలో సంగతి ఏమోకాని మేము తిరిగే, ఉండే అన్నిచోట్ల ఆడవాళ్లకు రిజర్వేషన్లు ఉండాలని యమ ఘా..ట్టిఘా డిమాండు చేస్తున్నాము.. :)
మా ఈ కొత్త సంఘం తరఫున మీరే ప్రచారం చేయాలని కూడా కోరుకుంటున్నా....ఇంతకి ఆ సంఘం ఏంటని అడక్కండి నాక్కుడా తెలీదు :)

>>నీడ పట్టున కూలింగ్ గ్లాసెస్ ఏమిటిరా తింగరి మొహం<< :) :)
‘హాట్’ డ్రింకు పార్టు సూపరు