14, ఏప్రిల్ 2010, బుధవారం

నా విదేశీ పయనం


అన్నీ తెలిసిన వాళ్ళకన్నా చెప్పచ్చు ...ఏమీ తెలియని వాళ్ళకైనా చెప్పచ్చు.. నాకులా తెలిసీ , తెలియని వాళ్లకు చెప్పడం చాలా కష్టం .. ఈ మాట నేననలేదు .. మా ఆయన తరుచూ నా గురించి చెప్పే మాటలు ఇవి .. విదేశాలకు వెళ్ళే చాన్స్ వచ్చింది అనే ఆనందం అర నిమిషం అయినా పడలేదు..ఏ మూలనో ఉన్న బెంగ మాత్రం చుట్టు ముట్టేసింది.. ప్రక్కింటికి వెళ్ళాలంటే పది మంది తోడు లేనిదే వెళ్ళని నేను ఒంటరిగా కొన్ని వేల కిలో మీటర్లు దూరంగా వెళ్ళిపోవాలా !!!!!పైగా ఎక్జాంస్ లో బట్టీ పట్టి రాసిన నాలుగు ఇంగ్లిష్ ముక్కలు తప్ప ,ఎవరితోనూ గట్టిగా నాలుగు మాటలు మాట్లాడెరుగనే ..దేవుడా ...నా వల్ల అయ్యే పనేనా!!! అని రోజూ దిగాలు పడిపోయేదాన్ని...

దానికి తోడు మా ఆయన చెప్పిన కబుర్లు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఒకటే టెన్షన్ తెప్పించేవి.. "బుజ్జీ,ఇక్కడ ఎయిర్ పోర్ట్ ఎంత పెద్దదో తెలుసా !!! నేను మొదటి సారి కన్ఫ్యూజ్ అయిపోయి అమెరికా కి వెళ్ళే మరొక ప్లైట్ వైపు వెళ్ళిపోయా.. బయటకు ఎలా రావాలో తెలియదు ... ఇక్కడి వాళ్ళ భాష మనకి ,మన భాష వాళ్లకు అర్ధం అయి చావదు.. డ కి 'ద' అని, ట కి 'త' అని మార్చి పలుకుతారు నత్తి వాళ్ళ లాగా ...ఇప్పుడూ ..."టూ డాలర్స్ తర్టి ఫైవ్ సెంట్స్" అనాలనుకో.. వాళ్ళేమో "తూ దాలర్స్ తర్తి ఫైవ్ సేన్త్స్" అని పలుకుతారు..అబ్బా ...బయటకు వచ్చేసరికి గంట పట్టింది" .....

ఇలాంటి కబుర్లు మొదట్లో నవ్వులాటగా అనిపించేది కాని ..తరువాత ,తరువాత అదే విషయం నాకన్వయించుకుని భయపడేదాన్ని ...నేను సింగ పూర్ లో విమానాశ్రయం లో తప్పడిపోయినట్లు.. అలా ఏదో అమెరికాయో ,ఆస్ట్రేలియాయో వెళ్ళే విమానం ఎక్కేసినట్లు ( ఎవరిని పడితే వాళ్ళను ఎక్కిన్చుకోవడానికి అది ఆర్టిసి బస్సు లెక్క కాదని అప్పటికి తెలియదన్నమాట ) ఇంకేదో దేశానికి వెళ్ళిపోయి ,భాష రాక ,తిండి లేక ఏంటో ఏంటో అయిపోయినట్లు ఒకటే ఆలోచన.. దానికి తోడు ఆ రాత్రి శ్రీదేవిది ఏదో హిందీ సినిమా చూసాను ...ఆమె ఇలాగే ఏదో దేశానికి వెళుతుంటే ఎవరోతన బేగ్ లో డ్రగ్స్ పెట్టేస్తారు... ఆ తరువాత నానా బాధలు పడి హీరో సహాయం తో బయట పడుతుంది ... ఇంకేంటి ఈ పాటికి మీకర్ధం అయిపోయి ఉండాలి సీన్ ...

ఆ మరుసటి రోజు నాన్న దగ్గరకు వెళ్లి నాన్నా!! ఉహు నేను వెళ్ళను అన్నాను దీనంగా... అసలు నేనుఈ మాట ఎప్పుడు అంటానా అని ఎదురు చూస్తున్న నాన్న .. అలాగే తల్లీ.. రేపు మీ ఆయనకు చెప్పేద్దాం అన్నారు నన్ను దగ్గరకు తీసుకుని ... ఎప్పటి నుండి మమ్మల్ని గమనిస్తుందో తెలియదు గాని అమ్మ 'కయ్ 'మంది... బాగుందండి మీ ఇద్దరి వరుసా ...అదంటే చిన్నపిల్ల ...దానికి ధైర్యం చెప్పడం మానేసి ...మీరూ అలాగే మాట్లాడుతారే... ఆ అబ్బాయి అక్కడ ఎన్నాళ్ళు ఉంటాడో ఏమో ... అంత ఇష్టం లేని వాళ్ళు ముందే చెప్పచ్చుగా వెళ్ళద్దని..ఇలా భార్యాభర్తలను ఎన్నాళ్లని విడదీస్తారు ...అని మొదలుపెట్టేసింది.. అసలు నువ్వు దాని కన్నతల్లి వేనా!!నా కూతురిని అంత దూరం పంపించేయమంటావా.. ఏం అక్కరలేదు..అప్పుడప్పుడు వచ్చి చూసి వెళతాడులే ... నాన్న ఊరుకోలేదు ....మా అమ్మ మాత్రం ఊరుకుందా.. ఇది మరీ బాగుంది ..మేము రాలేదా మావాళ్ళను వదిలి..పైగా ఎప్పుడన్నా పుట్టింటికి వెళితే, ఒక్క రోజు ఎక్కువ ఉంటే చాలు మీరు ,మీ అమ్మగారు అలిగేసేవారు ... ఇలా చేస్తారు కాబట్టే మగవాళ్ళకు కూతురి మీద అంత మమకారం పెడతాడు దేవుడు ... రేపు వాళ్ళాయన అడిగితే ఏం చెప్తారు అని తిరిగి వాదించింది అమ్మ..

కాసేపు వాద, ప్రతివాదనలు అయ్యాకా సరేలేమ్మా ..ఒక్కదానివే వెళ్ళద్దు ..మీ ఆయన్ను వచ్చి తీసుకు వెళ్ళమంటాను అన్నారు నాన్న ... ఆ మాట అన్నాకా కాసింత ధైర్యం అనిపించింది... అన్నట్లు గానే నాన్న మరుసటి రోజు మా వారి తో ఫోన్ లో విషయం మాట్లాడారు కూడా...అది కాదు బాబు ..అమ్మాయికి చిన్నప్పటి నుండి ఒక్కరితే ఎక్కడికీ వెళ్ళడం అలవాటు లేదు .. నువ్వొచ్చి తీసుకు వెళ్ళరాదు..టికెట్ నేను కొంటా అన్నారు ...అటు మా ఆయన ఏమన్నారో తెలియదు కాని నీతో మాట్లాడుతాడట అని ఫోన్ నాకిచ్చారు ...'హలో 'అనడం పాపం ..మొదలు పెట్టేసారు మా ఆయన దండకం ...నీకసలు బుద్దుందా ...నిన్న గాక మొన్న జాబ్ లో జాయిన్ అయ్యాను, వెంటనే లీవ్ అంటే ఇంటికి పొమ్మంటారు..నీకూ,మీ నాన్నకు బాగా ఆటలుగా ఉంది..అక్కడ ఫ్లైట్ లో ఎక్కితే ఇక్కడ నేను రిసీవ్ చేసుకుంటాను ..మద్యలో నిన్నెవడు ఎత్తుకుపోతాడు.. వేషాలు వెయ్యకుండా నోరుమూసుకుని రా అని తిట్టి పడేసారు ... అది కాదండి ..మరీ ..నాకేమో బొత్తిగా ఇంగ్లిష్ లో మాట్లాడటం రాదు అన్నాను గునుస్తూ .. అవును మరీ ..ఇక్కడ రాగానే నీకు ఎక్జాం పెడతారు కదా మొహం చూడు అని పెట్టేసారు ఫోన్ ..

బోలెడు కోపం వచ్చింది కాని ఏం చెయ్యను ...నాన్నకు చెప్పానంటే 'ఆయ్'.. నా కూతురిని అలా అంటాడా ..నేను పంపను అని మొండికేస్తారు ఎలారా బాబు అనుకుంటుండగా సాయంత్రం మళ్ళా ఫోన్ వచ్చింది ...నా ఫ్రెండ్ ఒక అబ్బాయి పెళ్లి కోసం ఇండియా కొచ్చాడు ...అతను వచ్చే నెల ఇక్కడికి వస్తున్నాడు ..అతనితో వచ్చేసేయ్ సరేనా అన్నారు.. 'హమ్మయా' అనిపించింది.అక్కడి నుండి మొదలైంది హడావుడి ..సూట్కేస్ కొనడం ..బట్టలు కొనుక్కోవడం వగైరాలు..ముఖ్యం గా తాళం కప్పలు..శ్రీదేవి సినిమా మహాత్యం ...

అమ్మా!! లగేజ్ ౩౦ కేజీల కంటే ఎక్కువ ఉండ కూడదట అన్నాను బట్టలు సర్దుతున్న అమ్మతో ...ఇది మరీ బాగుందే.. సూట్ కేసే 10 కేజీలు బరువుంది ..ఇంకేం పెట్టను ఇందులో అంది అమ్మ విసుక్కుంటూ .. ఏముంటాయిలే ... నావి అయిదు రకాల చీరలు ,ఒక అయిదు రకాల డ్రెస్సులు ,మరో అయిదు నైటీలు ఇంతేగా .. పైగా ఒక చిన్న బేగ్ హేండ్ లగేజ్ కూడా తెచ్చుకోవచ్చట అన్నాను.. మరీ.. వంట సామాను ఏమి వద్దా ..అక్కడ కప్పలు, పంది మాంసం తింటావా అంది అమ్మ.. యాక్ ..అవును కదా ..క్రొత్త కాపురం .. అందులోను ఒక సారి... మా ఆయన తిండికి చాలా ఇబ్బంది అయిపోతుంది , ఈ బ్రెడ్డు ,జాము తినలేకపోతున్నా అన్నారు...మద్యాహ్నం బయట ఏదో నూడిల్స్ గట్రా తినేసి కడుపు నింపుకుంటున్నారట.. నావల్ల కాదు బాబోయ్ ఆ తిండి అనిపించింది.. మరేం చేద్దాం అన్నాను అమ్మతో.. ఏముంది మీ ఇద్దరేగా ... నాలుగు నెలలకు సరిపడే వంట సామాగ్రి నేను సర్దుతాగా నువ్వు కంగారు పడకు అమ్మ హామీ ఇచ్చేసింది ... లగేజ్ మాత్రం ౩౦ కేజీలు మించకూడదు సుమా ... అమ్మకు మళ్లీ చెప్పాను..


వర్షాకాలమేమో అప్పుడే చక్కగా మబ్బులు పట్టి చినుకులు స్టార్ట్ అయ్యాయి ..నేను హైదరాబాద్ కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాను .. తమ్ముళ్ళు,పిన్నులు,చిన్నాన్నలు,పెద్దమ్మ,పెదనాన్న అందరు స్టేషన్ కి వచ్చారు ...మనస్సు భారం అయిపోతుంటే నిట్టూర్చి క్రింద బేగ్ (హేండ్ లగేజ్) తీసుకోబోయాను ... ఆక్చర్యం ..బేగ్ లేవలేదు నేను పైకి లేచా..ఇదేంటి ..ఇంత బరువుంది ..మళ్లీ ప్రయత్నించా ..ఉహు అస్సలు లేవలేదు ... ఏం పెట్టావమ్మా ఇందులో అన్నాను అయోమయం గా ... మరీ సూట్ కేస్ ౩౦ కేజీలు మించద్దు అన్నావు కదే.. అందుకే హేండ్ బేగ్ లో రెండు కేజీల మినపప్పు,రెండు కేజీల పెసరపప్పు, రెండు కేజీల ఇడ్లి రవ్వ ,పంచదార,చింత పండు,మషాలా పొడి,కారం,పసుపు,తాలింపు సామాను ...చివరాకరికి అంట్లు తోమే పీచు కూడా పెట్టేసా ఇందులో ... అమ్మ గర్వం గా చెప్పింది..

అయ్య బాబోయ్ అమ్మా !!నేనసలు మోయ్యగలనా అన్నాను కోపంగా... ఊరుకో, నువ్వు మొయ్యడం ఏమిటి లోపల కూలీలు ఉంటారుగా అంది.. 'ఒక వేళ లేకపోతే 'అరిచాను.. ప్రక్కన ఉన్న మా తమ్ముడి వైపు చూస్తూ ,ఇదేంట్రా ఇలా అంటుంది... బోడి ట్రైన్ ప్లాట్ ఫాం మీదే బోలెడు కూలీలు ఉంటారు .. ఎయిర్ పోర్ట్ లో ఉండరా అంది.. అవునక్కా ఒక వేళ లేరనుకో ప్రక్కనున్న వాళ్ళను ఎవరినన్నా హెల్ప్ చెయ్యమంటే ఆ మాత్రం చెయ్యరా ..అయినా మీ ఆడవాళ్ళకు బోలెడన్ని సదుపాయాలు.. మా మగవాళ్ళం 100 కేజీల బస్తా మోసినా ఎవడూ చూడడు కాని,అమ్మాయి నెమలి పించం పట్టుకున్నా మోయలేరేమో అని గిన్జుకుంటారు బోలెడు మంది ...నీకంత శ్రమ ఎవరూ ఇవ్వరులే ,అయినా బావ గారి ఫ్రెండ్ వస్తాడు గా ఆయన మోస్తాడులే ..ఆ మాత్రం హెల్ప్ చెయ్యడా అన్నాడు.. వీడొకడు , నిరంతర స్త్రీ ద్వేషి ..ప్రపంచం లో బాధలు,కష్టాలు అబ్బాయిలు మాత్రమే పడుతున్నారని 'ఘాట్టి' ఫీలింగ్ ... ఇంక తప్పక సరే అని బయలు దేరాను ...


హైదరాబాద్ చేరుకొని హోటల్ లో విడిది అయ్యాకా ఎయిర్ పోర్ట్ చేరుకున్నా ... రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు.. నాన్న అస్తమాను నా బెర్త్ దగ్గర కొచ్చి దుప్పటి కప్పడం,తల నిరమడమే సరిపోయింది ... కాసింత కదిలిస్తే చాలు ఏడ్చేయడానికి సిద్దంగా ఉన్నారు ..ఏంటో!!! అమ్మా ,నాన్నకళ్ళ నీళ్ళు పెడితే నేను తట్టుకోలేను..అదీ నాగురించి ..అందుకే పెళ్లి కాగానే అప్పగింతల సీన్ ఎక్కడ పెడతారో అని చూపు తిప్పకుండా మా ఆయనతో కబుర్లు చెప్తూనే ఉన్నా..కార్ లో కూడా గబుక్కున టాటా చెప్పేసి మొహం తిప్పేసాను.. ఇప్పటికీ మా ఆయన దెప్పుతారు నీకసలు మీవాళ్ళంటే ప్రేమ ఉందా అని .. మీకేం తెలుసు నా బాధ అని అనుకుంటాను ...ఇప్పుడు మళ్లీ అదే సీన్ ...రాత్రి నుండి ఏమి తెలియనట్లు ఈ చీర ఎందుకు కట్టుకున్నావ్.ఆ డ్రెస్ ఎందుకు పెట్టావ్ అని లోడ లోడా కబుర్లు చెప్పి నటించేస్తున్నా .... అమ్మ మాత్రం నా కోసం పైకి అస్సలు తేలదు..నా బేల తనం బాగా తెలుసు ...


నాన్నా,అమ్మా విజిటర్ పాస్ తీసుకున్నారు .. ఇంతకూ మావారు చెప్పిన ఫ్రెండ్ ఇంకా రాలేదు.. నాకసలే ఆ పరిసరాలు చూస్తుంటే టెన్షన్ టెన్షన్ గా ఉంది..కొంపదీసి ఈ రోజు జర్నీ కేన్సిల్ చేసుకోలేదు కదా ఆ అబ్బాయి అని అనిపించింది.. కంగారు పడుకులే వస్తాడు అని నాన్నచెప్తూ, నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉన్నాయా అమ్మా అన్నారు.. అప్పుడు గుర్తు వచ్చింది ..20 రూపాయలు తప్పా పైసా లేదు.. ఉహు అన్నాను.. నాన్న 5000 తీసి నా చేతిలో పెట్టాబోయారు ...ప్రక్క నున్న అతను' ఎందుకండీ అవి ..ఆ దేశం లో మన కరెన్సీ నాలుక గీసుకోవడానికి కూడా పని చెయ్యదు , ప్లైట్ లో ఎలాగు ఫుడ్ గట్రా వాళ్ళే పెడతారు ,అక్కడ చేరగానే మీ అల్లుడు రిసీవ్ చేసుకుంటారు ..అనవసరం అన్నాడు ' ...నాన్న, నేను మోహ మొహం చూసుకున్నాం ... పోనీ ఒక 1000 రూపాయిలయినా తీసుకో అన్నారు.. వద్దులే నాన్న ..నాకేం అవసరం తిరిగి ఇచ్చేశాను.. అదే నేను చేసిన పెద్ద తప్పని నాకు తెలియదు ...


ఈ లోపల మావారికి తెలిసిన ఫ్రెండ్ వచ్చాడు ... కొత్తగా పెళ్లి అయిన కళ కొట్టొచ్చినట్లు కనబడుతుంది ... ప్రక్కనున్న వాళ్ళావిడ చెయ్యి అర నిమిషం కూడా వదలకుండా ,ఆప్యాయం గా ఆమె కళ్ళ లో చూస్తూనే ఉన్నాడు..క్రొత్త గా పెళ్లి అయిన వాళ్ళను చూస్తే భలే నవ్వొస్తుంది నాకు.. అంగుళం దూరం కూడా విడిచి ఉండలేనట్లు ఉంటారు..అదే ఒక సంవత్సరం అయ్యిందో మినిమం రెండు అడుగులు దూరం కొలుచుకుని మరీ నడుస్తారు ..ఇంకా పిల్లలు గట్రా పుడితే ..హుమ్ ఎందుకు అడుగుతారు లెండి :).. మా అమ్మాయి బాబు అని పరిచయం చేసారు నాన్న ..అర సెకను నా వైపు చూసి చిన్నగా నవ్వి (?) మళ్లీ తన గొడవలో పడిపోయాడు ...పాపం మా నాన్న, నా గురించి చెప్పడానికి( అంటే మా అమ్మాయికి ఏమీ తెలియదు.. కాస్త జాగ్రత్త గా వాళ్ళాయన దగ్గరకు తీసుకు వెళ్ళు ..గట్రా గట్రా ) బాగా ప్రిపెరయ్యి వచ్చారేమో ఆ అబ్బాయి అవకాసం ఇవ్వక పోయేసరికి సతమతమైపోతున్నారు..అబ్బా పర్లేదులే నాన్నా అని వారించాను..

వచ్చి అరగంట అయినా వాళ్ళు అసలు తెమలరే ...అక్కడే కబుర్లు వాళ్ళ వాళ్ళ తోటి ..నాకేమో టైం అయ్యే కొద్ది టెన్షన్ ..ఈ లోపల ఉన్నట్లుండి సీన్ మారిపోయింది .. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని జాలిగా చూస్తున్నాడు.. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మను ,నాన్నను పట్టుకుని భోరున ఏడుస్తుంది..అప్పగింతలు ...అంటే బయలుదేరుతున్నాం అన్నమాట.. నాకు కంగారోచ్చేసింది నాన్నను తలుచుకుని ...ఇప్పటి వరకు ఎంత జాగ్రత్తగా విషయం ఏమార్చాను.. నాన్న వైపు చూసాను.. నాన్న ఆ అమ్మాయి తండ్రిని ఓదార్చడం లో బిజీ గా ఉన్నారు .... అంత టెన్షన్ లోను నవ్వొచ్చింది..

అమ్మ కళ్ళు తుడుచుకుంటుంది .. చూసావా ...ఆ అబ్బాయి నా లగేజ్ మోసేస్తాడు అన్నావ్ ...అతనే బోలెడు బేగ్ లు మోసుకొచ్చాడు.. నువ్వస్సలు తిన్నమైనదానివి కాదు... వెనక్కి తీసుకు పో అన్నాను ... నోరుముయ్యి.. ఆ ఫ్లైట్ వరకు మోయలేవేంటి ... కాసేపు కష్టపడితే నాలుగు నెలలు హాయిగా ఉంటావ్ అంది .. సరేలే దిగగానే ఫోన్ చేస్తా గాని నే వెళ్ళగానే ఇద్దరూ ఇక్కడ గాన కచేరి పెట్టకండి ...హోటల్ కి వెళ్ళండి .. నాన్న జాగ్రత్త ..అమ్మకి మాత్రం వినబడేలా అని గభ,గభా లోపలికి నడిచా.. కాని లోపలి వెళ్ళాకా ఆ కచేరి నేను ఇస్తా అని అనుకోలేదు .. :)

40 వ్యాఖ్యలు:

శ్రుతి చెప్పారు...

అమ్మయ్య ఎలాగైతేనేమం మళ్ళీ మీ కబుర్లు వినేశాను( అదేనండి చదివేశాను). నిజంగానే మొదటి సారి ఊరొదిలి అందులోనూ అమ్మానాన్నలను వదిలి వెళ్ళాలంటే ఏడుపొచ్చేస్తుంది. అది విమానమెక్కి వెళ్ళే ఊరైనా , రైలెక్కి వెళ్ళే ఊరైనా ఒకలాగే ఉంటుంది మరి.

కళ్ళు తుడిచేసుకో బుజ్జీ(నేను కూడా తుడిచేసుకున్నాను ఇప్పుడే మరి). మళ్ళీ ఎవరైనా చూస్తే నవ్వేస్తారు(మన బాధ వాళ్ళకు తెలియదు కదా అనుభవించేవరకు).

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

బాగుంది. తరువాతి టపా కోసం వెయిటింగ్.

శ్రీనివాస్ చెప్పారు...

మా మగవాళ్ళం 100 కేజీల బస్తా మోసినా ఎవడూ చూడడు కాని,అమ్మాయిలూ నెమలి పించం పట్టుకున్నా మోయలేరేమో అని గిన్జుకుంటారు బోలెడు మంది.

మీ తమ్ముడు మా బ్యాచ్ లాగ ఉన్నాడు

నిరంతర స్త్రీ ద్వేషి అంటారా .... చెప్తా చెప్తా

Sravya V చెప్పారు...

కచేరీ కి కారణం నాకు తెలిసిపోయింది :)

కౌటిల్య చెప్పారు...

హమ్మయ్యో...మా నేస్తం విదేశీ ప్రయాణం కష్టాలు చూస్తుంటే భలే దిగులనిపిస్తోంది...కాని వంటసరుకులన్నీ హ్యాండ్ బ్యాగ్ లో సర్దిన మీ అమ్మగారి తెలివితేటలకి నా మంగిడీలు..మా అక్కకి ఈ టిప్ చెప్తా...అది లగేజి ఎక్కువైనప్పుడు ఏం చెయ్యాలో తెలియక తెగ తికమక పడిపోతుంటుంది....

మీ తమ్ముడే కాదండీ...నేను కూడా నిరంతర స్త్రీద్వేషినేః-)...

కౌటిల్య చెప్పారు...

"క్రొత్త గా పెళ్లి అయిన వాళ్ళను చూస్తే భలే నవ్వొస్తుంది నాకు.. అంగుళం దూరం కూడా విడిచి ఉండలేనట్లు ఉంటారు..అదే ఒక సంవత్సరం అయ్యిందో మినిమం రెండు అడుగులు దూరం కోలుచుకుని మరీ నడుస్తారు" భలే చెప్తారు నేస్తం...మరి మీరు కూడ అంతేనా....మీ శ్రీవార్ని కూడా అడుగుతాం ఉండండి..

మీ పరిస్థితే ఇలా ఉంటే, మరి ఆ కొత్తగా పెళ్ళయిన అమ్మాయి ఎలా ఉందో కదా...పెళ్ళయ్యిన వెంటనే వాళ్ళమ్మాయి వదిలి అంత దూరం వెళ్ళిపోతుంటే ఆయన ఎంత బాధ పడుంటారో...మీ నాన్నగారు భలే RESPOND అయ్యారు...

durgeswara చెప్పారు...

ఆపకుండా చదివించే రచనాశైలమ్మా నీది. చాలాబాగావ్రాస్తున్నావు.

పవన్ కుమార్ చెప్పారు...

ఇంతకి మీరు విదేశం వెల్లగానె ఇంగిలిపీసు ఎగ్జాం రాసారా ఏర్పొర్ట్ లొ

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాగుంది నేస్తం కళ్ళకు కట్టినట్లు రాస్తున్నారు. నాకైతే మీ తండ్రీ కూతుళ్ళ ప్రేమను అంత దూరంలో గోడకు ఆనుకుని చూస్తున్న ఫీలింగ్ కలిగింది :-) మీ టపాలు చాలా వాటిలో నాకు ఇలాగే ఆ పరిసరాల్లో ఓ పక్కన నిలబడి చూస్తున్నట్లు అనిపిస్తుంది అనుకోండి. అంతగా ఇన్వాల్ అయి చదివేలా రాస్తారు.

మంచు చెప్పారు...

పైన ఫొటొలొ వున్నదేనా మీ హాండ్ లాగేజి బ్యాగ్ :-)
ఎంటొ.. మీ పొస్ట్లొ త్వరగా అయిపొతాయ్..అంటే చదువూంటే అప్పుడే అయిపొయిందా అనిపిస్తుంది.. కాస్త పెద్దది రాయొచ్చుకదా :-))

మంచు చెప్పారు...

పొస్ట్ పొస్ట్ కి కొత్త టెంప్లేట్ అవసరం అంటారా :-) .. ఇక ఇది వుంచేయండి.. మార్చొద్దు.. ఆ ఫొటొ తీసేసాకా బావుంది..సింపిల్‌గా

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
చాలా బాగా రాశారు. హ్యాండ్ బాగ్ లో అంత లగేజీ పెట్టిన సీన్ చదివితే నవ్వొచ్చేసింది. టపా చదువుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నా. ‘నా కష్టాలు చదివి నవ్వుకుంటావా...’ అని మీరు కోప్పడినా సరే.
- అరుణ

నేస్తం చెప్పారు...

నిజమే శ్రుతి అది ఎంత బాధో అనుభవిస్తేనే తెలుస్తుంది... ఇప్పటికీ ఇండియా వెళ్ళానంటే పుట్టింటి నుండి డైరెక్ట్ గా సింగ పూర్ వెళ్ళను ..అత్తవారి ఇంటికొచ్చి అక్కడ నుండి వెళతా.. ఎందుకో ఈ మద్య మరీ ఒంటరితనం ఫీలింగ్ వచ్చేస్తుంది..
గణేష్ గారు థేంక్యూ :)
శ్రీనివాస్ మా నాన్న మొదట్లో మీ బేచ్చే ..తరువాత తరువాత పార్టి మారాల్సొచ్చింది... ముందున్నాయిగా అయ్యగారికి పండగలు ...
శ్రావ్యా శ్రావ్యా కారణం ఏమిటో చెప్పవా చెప్పవా :)
కౌటిల్య గారు అబ్బా ..వాడు అప్పట్లో ఒప్పుకున్నాడు గాని ఇప్పుడు ఒక్క కేజి ఎక్స్ ట్రా తీసుకు వెళ్ళినా ఒప్పుకోవడం లేదు ..ఎందుకటా అంత స్త్రీ ద్వేషులు ..ఇంక దూరం గురించి అంటారా.. మేము చీప్ గా రెండు అడుగుల దూరం ఇవ్వము ..ఇంకో నాలుగడుగులు ఎక్కువే ఇస్తాం పోష్ గా .. :)

నేస్తం చెప్పారు...

దుర్గేశ్వర గారు ధన్యవాదాలు అండి
పవన్ ఆ..ఎయిర్ పోర్ట్ లో ఎవరూ ఏం అనలేదు గాని .. మా ఆయన నాకు చాలా సార్లు పెట్టారు ఆ ఎక్జాం ..
శ్రీకాంత్ నేనేం వ్రాసానోగాని ఇప్పుడు మీరు వ్రాసింది చదువుతుంటే ఎవరో ఒక అబ్బాయి గోడకానుకుని ఒక కాలు మడిచి గోడకు ఆంచి, చేతులు కట్టుకుని చూస్తున్నట్లు నా కళ్ళ ముందు కనబడి పోతుంది :)
మంచు పల్లకి గారు అంత పెద్ద బేగ్ కాదు గాని ..దాదాపు 16 కేజీలు పెట్టేసింది అమ్మ :)టెంప్లెట్ ఇంక మార్చను లేండి ..నా వల్ల కూడా కాదు
అరుణ గారు థేంక్యూ థేంక్యూ :) పర్లేదు లేద్దురూ ఎవరో ఒకరం నవ్వుతున్నాం కదా ..

Rajendra Prasad(రాజు) చెప్పారు...

బాగున్నాయి నేస్తం మీ కబుర్లు.....
మేము మా ఫ్రెండ్ వాళ్ళ అక్కని బావతో పంపటానికి వెళ్ళము. ఎయెర్ పోర్ట్లో చూడాలి మా ఆంటీ,అక్క కలిసి మంచి సీను క్రియేట్ చేసారు..మా వాడు ఏడ్చేవరకు వచ్చేసాడు.
మీ టప చదువుతుంటే మొన్నీ మధ్యే జరిగిన ఈ సీను గుర్తుకు వచ్చింది...
ఇంతకీ మీ ఆయన గారి ఫ్రెండ్ ని మీ ప్రశ్నలతో,అనుమానాలతో ఒక ఆట ఆడించి ఉంటారే....
తరువాతి టప కోసం ఎదురు చూస్తూ..... :)

Sai Praveen చెప్పారు...

"అదే నేను చేసిన పెద్ద తప్పని నాకు తెలియదు ... "
"కాని లోపలి వెళ్ళాకా ఆ కచేరి నేను ఇస్తా అని అనుకోలేదు .. "
ఇలాంటివి రాసేసి ఇంట్రెస్ట్ పెంచేసి ఇలా మధ్యలో వదిలెయ్యడం ఏమి బాలేదు. మీరు రేపే నెక్స్ట్ టపా రాసెయ్యాలి అంతే :)

3g చెప్పారు...

హయ్యో... బాదపడకండి...ఇలాంటప్పుడే గుండెని గుండ్రాయిలా గట్టిగా ఉంచుకోవాలి... ఫ్లయిట్ ఎక్కగానే చాయ్ సమోసా దొరుకుద్దేమో చూడాల్సింది.

ఇకనుంచి పోస్టుల్లో సింగపూర్ కస్టాలన్నమాట.

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
ఇలా సస్పెన్స్లో పెట్టేస్తే, నేను ఒప్పుకోను అంతే ! నాకు అసలే సస్పెన్స్ తట్టుకునే శక్తీ లేదు. :-(
ఎంత బాగా రాసారో,అప్పుడే అయిపోయిందా అనిపించేసింది.ఇంకొంచెం పెద్ద పోస్ట్స్ రాయరూ ? :-) వేణు శ్రీకాంత్ గారు సరిగ్గా చెప్పారు, మీ కళ్ళకి కట్టే శైలి గురించి.
ముఖ్యంగా, మీ నాన్న గారి ప్రేమ కదిలించింది.
- పద్మ.

సవ్వడి చెప్పారు...

మీ అమ్మగారు హేండ్ బేగ్ లో అన్ని పెట్టారా.. హైలెట్ అసలు.. నేనైతే బాగా నవాను.
అదేంటి మీ పెళ్లిలో అప్పగింతలే జరగలేదా... అమ్మాయి చేతుల్ని పాలల్లో ముంచి అబ్బాయికి, అబ్బాయి కుటుంబంలో ఉన్న వారందరి చేతుల్లో పేరు పేరునా రాయిస్తారు కదా!
మా పంతులుగారికి మా బంధువర్గం అంతా తెలుసు కాబట్టి... "ఈయన మీ మావయ్య.. రోజుకు నాలుగు సార్లు టీ ఇస్తే చాలు.", "ఈవిడ మీ అత్తగారు.. ఏం చెయ్యకపోయినా చాలు కాని పూజలు, వ్రతాలు అంటారు. అవి చేయు చాలు." అని ఇలా మా కుటుంబంలో అందరి మీద జోకులేసారు. అమ్మాయి, అమ్మాయి కుటుంబం ఏడుస్తున్నా.. మేమైతే నవ్వుకున్నాం. ఇది ఎప్పుడు సంగతి అంటారా... నాలుగు సంవత్సరాలు క్రింద జరిగిన మా మావయ్య పెళ్లిలోది. ఐతే ఈ తతంగం అంతా మిస్ ఐయ్యారనమాట.
ఐనా డబ్బులు లేకుండా వేరే దేశం ఎలా వెళ్లారండి.

నేస్తం చెప్పారు...

రాజు గారు ఆయన ఫ్రెండ్ ని నేను ఏడిపించడమా .. ప్లిచ్ నా మీద ఎంత నమ్మకం :)
ప్రవీణ్ గారు ఈ మద్య సస్పెన్స్ రచయిత్రిని అయిపోవాలని తెగ కలలు కనేస్తున్నా.. ఇలా తీర్చేసుకుంటున్నా అన్నమాటా :)
3g గారు మరి అంతే కదా ఇంక ఆ విషేషాలే మిగిలాయి :)
పద్మా అసలు విదేసీ కలలు ,ఇదీ, రాబోయే పోస్ట్ అన్నీ ఒక పోస్ట్లోనే చేసేద్దాం అనుకున్నా.. కాని అలా సా...గుతునే ఉంది .. ఏం చేయను చెప్పు.. నేరం నాది కాదు..నా ఫ్లాష్ బ్యాక్ ది
సవ్వడి అవునా ..ఉహు ..నేనెప్పుడూ చూడలేదండి..కొన్ని కులాల్లో కొన్ని రకాలుగా జరుగుతాయిగా.. అయినా మా పెళ్ళీ అవ్వగానే అన్నవరం వెళ్ళీ అటునుండి మా అత్తగారి ఇంటికి హడావుడిగా తీసుకు వెళ్ళారు..కాకపోతే ఏవేవో ఆటలు ఆడించారు గాని నాకు ఒక్కటీ అర్ధం కాక అన్నీ ఓడిపోయాను..పైగా నా పెళ్ళి అవ్వగానే ఎక్జాం టెన్షన్ ఒకటి.. అందువల్ల చాలా మిస్ అవ్వాల్సి వచ్చింది.. ఇక డబ్బులు లేకుండానా.... ఇప్పటికీ తలుచుకుంటే భయం వేస్తుంది అలా ఎలా చేసానా అని :)

sunita చెప్పారు...

baagundi naestam. mari naenaenToe elaanTi baadha laekunDaa flight ekkaesaanu. neksT year ammaa naannanu
tecchukoevacchulae anukunnaanu.

అజ్ఞాత చెప్పారు...

మీ నాన్నగారు నిజంగా మిమ్మల్ని అలా చూసుకుంటారా!!
నాకు పెళ్ళైయ్యాక నా ప్రయాణాలలో మా ఇంట్లో వాళ్ళు కనీసం రైల్వే స్టెషన్ కి కూడా రాలేదు :(

sobha చెప్పారు...

unnadi unnatlu raaste yenta bavuntundo chepparu.chalaa bavundi. naaku yentoo nachhindi.

నేస్తం చెప్పారు...

సునీతా మరి నా అంత ధైర్యం గా మీరు లేరు కాబట్టి అలా సింపుల్ గా వెళ్ళారు ..తీసుకు వెళ్ళండీ చాలా సంతొష పడతారు..
అఙ్ఞాత గారు ఒక్కొ ఇంట్లో ఒకలా.. కాని అమ్మా నాన్న ప్రేమ ఎక్కడైనా ఒకటే ..నిజం చెప్పాలంటే అతి ప్రేమ చాలా బాధలు తెచ్చిపెడుతుంది.. ఎదైనా మన మంచికే అనుకోవాలి :)
శోబా :)

సవ్వడి చెప్పారు...

ఇంతవరకూ అలా చూడనేలేదా! పెద్ద షాకే ఇచ్చారు.
వీళ్లు, వాళ్లు అని కాదు.. ఎవరైనా అలాగే చేసుకోవాలి. అది బేసిక్.
మరేం పర్వాలేదులే.. మా పంతులుగారిని సింగపూర్ పంపిస్తాను. మీ కుటుంబాలను తీసుకెళ్లండి. అక్కడ అప్పగింతలు చేసుకోవచ్చు. ఇంకా ఓపిక ఉంటే మీ భార్యభర్తలిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. కేవలం 11,111/- నాకు ఇస్తే చాలు. మరో ఒకటి పెరిగినా పర్వాలేదు కాని తగ్గకూడదు. పంతులుగారి ఖర్చులు కూడా మీవే!

రాజ్ కుమార్ చెప్పారు...

హేండ్ బేగ్ లో రెండు కేజీల మినపప్పు,రెండు కేజీల పెసరపప్పు, రెండు కేజీల ఇడ్లి రవ్వ ,పంచదార,చింత పండు,మషాలా పొడి,కారం,పసుపు,తాలింపు సామాను ...చివరాకరికి అంట్లు తోమే పీచు కూడా పెట్టేసా ఇందులో ... అమ్మ గర్వం గా చెప్పింది..
soooper........

cinema choopistaru kadaa....meeru... :) :)
తరువాతి టప కోసం ఎదురు చూస్తూ..... :)

Rajkumar...

నేస్తం చెప్పారు...

సవ్వడి అలాగేలేండి.. మీ మాట ఎందుకు కాదనాలి .. ఇంకొ నెంబర్ ఎక్కువే వేసి ఇస్తాను ..కాకపొటె చివర్లో పైసలు అని కలుపుకోండి :)
రాజ్ బోలేదు థేంకూలు :)

సవ్వడి చెప్పారు...

mee daya maa praaptam..

గీతాచార్య చెప్పారు...

నేస్తం! మీరు బారిస్టరు గానీ చదివారా ఏంటి? :D

priya చెప్పారు...

naaku nenu hostelki vellina roju gurtochindi.kallaku kattinattu rastunnaru.

priya చెప్పారు...

mee amma garu 4 nella sarukulu ela pedataro anukunna .idea bavundi:
)

Srujana Ramanujan చెప్పారు...

Same question...

అజ్ఞాత చెప్పారు...

ghita సాంగ్ ని ఎత్తేస్తారా హన్నా
http://www.youtube.com/watch?v=Vmyo3uXYTcI

priya చెప్పారు...

chala rojula taruvata teerika chesukuni mee blog almost sagam chadivanu.meeru chinnappudu dairy rasara?anni vishyalu ela gurtunnayandi baabu?naakithe potturi vijayalakshmi gari kathalu chadivinattundi...mee fan ayipoyanu.simply superb!!!

నేస్తం చెప్పారు...

సవ్వడి :)
గీతాచార్య & సృజన అనుకున్నాను ..కాని కుదరలేదు ..ఇంతకూ మీకెందుకొచ్చిందబ్బా ఆ డౌటు ..:)
ప్రియ థేంక్యూ :)
అఙ్ఞాత గారు భలే సాంగ్ కదా.. ఆ పాప చాలా బాగుంది.. కాని ఒక్క ముక్క అర్ధం కాలేదనుకోండి అది వేరే విషయం .. మొత్తం మీద ఆ అమ్మయిలో నన్ను నేను చూసుకున్నా :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

>>>మా మగవాళ్ళం 100 కేజీల బస్తా మోసినా ఎవడూ చూడడు కాని,అమ్మాయిలూ నెమలి పించం పట్టుకున్నా మోయలేరేమో అని గిన్జుకుంటారు బోలెడు మంది...
:-):-)
ఇంతకూ మీ తమ్ముడికి పెళ్ళయిదండీ..?

ప్లీజ్..ప్లీజ్..మీ కచేరి సంగతులు తొందరగా చెప్పేయ్యరూ!! ఇంతకూ మీరు కర్ణాటిక్ చేసారా లేక హిందుస్తానీతో కచేరి చేసారా? :-))

నేస్తం చెప్పారు...

మా తమ్ముడి పెళ్ళి గురించి ఏం అడుగుతావ్ లే శేఖర్ మా ఇంట్లో మొదటిసారి ప్రేమ వివాహం చేసుకుని మహా ప్రళయాన్ని సృష్టించిన ఘనుడు వాడే..
ఇంక కచేరి సంగతి అంటారా .. అసలు నా టాలెంట్ మీరు అంచనా వెయలేదు .. అన్ని రాగాలను మిక్సీ లో వేసి సృష్టించిన ఆందోళన రాగాన్ని పాడాను :)

గీతాచార్య చెప్పారు...

ఏమీ లేదు నేస్తం, బారిస్టరు పార్వతీశం సృష్టికర్త వారిలా అదరగొట్టేస్తేనూ... డౌటొచ్చి అడిగా. ఇంతకు ముందు కాక పోతే ఇప్పుడు చదివెయ్యండి :D

మీరు వ్రాసిన అన్నిటిలోనూ, ఇదే బెస్ట్ సీరీస్ అని నా నమ్మకం

అజ్ఞాత చెప్పారు...

మీ అర్ధ సెంచరీ పూర్తిచేసే బాధ్యత మాది
ఈరోజు మీరు చాలా కామెంట్లు రాసారు కదా :)
మా బుజ్జక్క ఫిఫ్టీ చేస్తాం మేమంతా కలిసి
ghita పాట మీకు నచ్చిందా థాంక్స్

జ్ఞానదేవ్ ఆకుల చెప్పారు...

జ్ఞానదేవ్ :
16 సంవత్సరాల క్రింద ఇవ్వాల్టి రోజు (2 సెప్టెంబర్ 1998)మా అమ్మాయిని అమెరికా పంపించేప్పుడు కలిగిన నా మానసిక స్థితి దాదాపు ఇలాగే ఉంది. విశేషం ఏమంటే తను భర్త తోనే వెళ్ళింది.కాని ఒక్క గానొక్క కుమార్తె, తనను వదిలి ఎలా వుండటం, తను మా కంటే ఉన్నతమైన జీవనం గడపాలని, అమెరికా లో ఉద్యోగస్తుడికి ఇచ్చి చెయ్యడం, అప్పటిదాకా airport ఇబ్బందులు తెలీకపోవడం, మీ కధ చదువుతున్నంత సేపూ నాకళ్ళవెంట నీళ్ళు ప్రవహిస్తూనే ఉన్నాయి.చిన్న ట్విస్ట్ ఏమిటంటే, నా కుమార్తె హైదరాబాద్ వచ్చేసింది, కాని నేను అమెరికా వచ్చాను కొన్నాళ్ళు మా అబ్బాయిదగ్గర ఉండేందుకు.అలా దూరం constant గా వుంది.ఏమైనా, మీ కదా చాలా నచ్చింది. అభినందనలు