6, ఫిబ్రవరి 2010, శనివారం

ప్రేమకధలు పలురకాలు - రెండవ భాగంఅప్పటి వరకు లెటెర్ నాకిస్తాడేమో అంటే నాకిస్తాడేమో అని మేము టెన్షన్ పడిపోతున్నాం కాని పాపం ఇచ్చేవాడు ఇంకెంత టెన్షన్ పడతాడో ఆలోచించనేలేదు. కరెక్ట్ గా వాడి దగ్గరకు రాగానే ,పాపం మాకు ఇచ్చే దైర్యం లేక,మాకు అడ్డం గా నించుని ఒరే 'హేపీ వేలంటైన్స్ డే' రా అంటూ ఎదురుగా ఉన్న ఫ్రెండ్ కి గబుక్కున ఆ లెటెర్, గులాబీ ఇచ్చేసాడు తలవంచుకుని .. అప్పటివరకు ఏంటేంటో ఊహించుకుంటూ భయపడిపోతున్న నాకు, అతను చేసిన పనికి పక్కున నవ్వు వచ్చేసి నవ్వాబోయి ,అతని చేతి పై చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను.. మణికట్టు పై చక్కగా ' స్వాతి ' అని పచ్చగా ఫ్రెష్ గా పచ్చబొట్టు..

గబుక్కున తేరుకుని మా స్వాతి చూసిందో ,లేదో అని దానివైపు చూసాను ..పాపం అది ఇంకా తేరుకోలేదు. బిగుసుకు పోయి పదినిమిషాలు మాట్లాడలేదు..సస్పెన్స్ వీడీ పోయింది,మబ్బులు తొలగిపోయాయి...హమ్మయ్యా నేను బ్రతికిపోయాను పైకి అనుకున్నాను గాని మనసులో కొంచెం కుళ్ళు ..ఈ లెక్కన ఇది నాకన్నా అందంగా ఉందన్నమాట..

అయ్యబాబోయ్ దేవుడోయ్.. ఎంత దేవాంతకుడే పైకి అమాయకం గా కనబడతాడు కాని ఎంత తెలివిగా ,సేఫ్ గా ప్రపోజ్ చేసేసాడు అంది కాసేపాగి ఈ లోకం లోకి వచ్చాకా.. అలవాటుగా ధైర్యం చెప్పాబోయేను కాని అది ఇన్నాళ్ళు నన్ను పెట్టిన టార్చర్ గుర్తుకొచ్చింది..అయిపోయింది ఇంక దీని పని అనుకుని ..'పచ్చ బొట్టు చెరిగీ పోదులే' అని పాడటం మొదలు పెట్టాను..ఉండవే బాబు నీకు పుణ్యం ఉంటుంది వాడు ఇచ్చిన షాక్ నుండి ఇంకా బయటకు రాలేదు హింస పెట్టకు అని దణ్ణం పెట్టేసింది..కానీ నేను వదులుతానా..అంతకంత తీర్చుకోవద్దూ ....కానీ ఎంత ఏడిపించినా ,ఎవరూ లేనప్పుడు మాత్రమే అనేదాన్ని..వాళ్ళ దగ్గర మాత్రం మాకేం తెలియనట్లు మామూలు విషయాలుమాట్లాడుకునేవాళ్ళం..


అయితే ఆ అబ్బాయి రవితేజా టైపులో ' ఏం ..కమీష్నర్ కూతుళ్ళకు పెళ్ళి అక్కరలేదా ' అని గదమాయించే టైపు కాదు ,సుస్వాగతం సినిమాలో పవన్ లాగా ఎంత కాలం అన్నా మూగగా ఆరాధించే టైపు అని తెలుసుకున్నాకా కొంచెం ధైర్యం వచ్చింది.. పాపం ఆ అబ్బాయి తనకు స్వాతంటే చాలా ఇష్టం అని చెప్పడానికి చాలా ట్రై చేసేవాడు..ఎలా అంటే మేము వస్తుంటే ,ఒక వేళ ఆ రోజు ఉగాదో మరొకటో అనుకోండి ...పైన ఆకాశమో, క్రింద నేలనో లేక పక్కింటి మేడనో చూస్తూ' హేపీ ఉగాదీ 'అని అరిచేవాడు ..లేకపోతే ఒక్కో సారి సరిగా క్లాసెస్ లేకా కాలేజ్ డుమ్మా కొట్టాం అనుకోండి..' ఏంటిరా హెల్త్ బాలేదా నిన్న రాలేదు' అని తన ఫ్రెండ్ తో అన్నట్లు అంటూ తెగ కలవరపడిపోయేవాడు.. బాబూ, నువ్వలా ఎదురింటి మేడలను ,పక్కింటి గోడలను చూసి మాట్లాడుతుంటే ఆ ఇంట్లో అమ్మాయిలకు లైన్ వేస్తున్నావ్ అనుకుని అనుమానపడే టైపు మీ స్వాతి కొంచెం జాగ్రత్త అని మెల్లిగా అంటూ ఏడిపించేదాన్ని స్వాతిని ... పైకి తేలేది కాదు కాని దీనికో ప్రక్కనుండీ మహా గర్వం గా ఉండేది ..ఇలాంటివి సినిమాల్లో చూడటం తప్ప ,నిజ జీవితం లో చూసేసరికి భలే సర్దాగా ఉండేది నాకు.. నాది కాదు కదా ప్రోబ్లెం ..పైగా దాన్ని తనివి తీరా ఏడిపించచ్చు అదన్నమాట సంగతి.. కొన్ని సంఘటనలు భలే ఉండేవి మచ్చుక్కి కొన్ని..

ఒక రోజు స్వాతి ,నేను మాట్లాడుకుంటూ వస్తున్నాం ..దాని డ్రెస్స్ చూస్తూ అబ్బా నాకీ కలర్ అంటే ఎంత ఇష్టమో నీకు భలే దొరుకుతాయే అన్నాను ...నిన్ను అలా కుళ్ళబెట్టడానికేనే వేసుకున్నాను ..మొన్న షబ్నం లో షోకేస్ లో పెట్టాడు ..వెంటనే మా డాడీకి చెప్పి రాత్రే కొనేసుకున్నాను అంది పోజుకొడుతూ ..షబ్నం లో కొన్నావా తల్లీ, హమ్మయ్యా నేను హేపీ ..వాడు ఎలాగూ 100 రూపాయల వస్తువు 1000 రూపాయలకు అమ్ముతాడు..బాగా బేండ్ అయ్యి ఉంటుంది భలే భలే అన్నాను.. అంత లేదు, రేట్ తక్కువ చెప్పడానికి ఇవేమన్నా ప్లాట్ ఫాం డ్రెస్స్ అనుకున్నావా క్వాలిటీ ఉంటుందమ్మా ..అయినా నాకేదన్నా నచ్చితే కొనేస్తాను ,నీలాగా లెక్కలేసుకోను అంటూ నాతో గొడవపడుతుండగానే ఎదురుగా గీతాంజలి గాడు అదే కలర్ టీ షర్ట్ లో వస్తూ చిన్నగా నవ్వుతున్నాడు.. ఇది తెల్లబోతూ ఇప్పుడే కదే వేరే డ్రెస్స్ లో మనముందు వెళ్ళాడూ అంది..ఏమో తల్లీ మీ ఇద్దరూ ఇలా కోడ్ భాషలో ఏం సందేశాలు పంపుకుంటున్నారో నాకేం తెలుస్తుంది చెప్పు అని కాసేపు ఆడుకున్నాను ..మరీ, నాతో గొడవ పెట్టుకుంటుందా ..


మరో రోజు ఇద్దరం వస్తుండగా ' ఈ ఎండలో కాలేజ్ కి ఇన్నిసార్లు తిరిగి చదవడం కంటే నీడ పట్టున కోళ్ళ ఫాం పెట్టుకుని బ్రతికేయడం బెటరు ' విసుగ్గా అన్నాను..ఇంక మా మేడం మాట్లాడటం మొదలు పెట్టింది .ఛీ నీలాంటి వాళ్ళ వల్లేనే దేశం ఇలా అయిపోతుంది .కష్ట పడకుండా కాసులు వచ్చేయాలి అంటారు అంటూ చదువు, దాని ఆవశ్యకత మీద ఒక అరగంట సోది చెప్పి నేను మాత్రం డాక్టర్ని అవుతాను..పేదలకుసహాయం చేస్తాను .. చదువురాని వాడికి ఎంత ఆస్తిపాస్తులున్నా గౌరవం ఇవ్వరు ..చులకనగా చూస్తారు ,అదే చదువుకున్నవాడికి బోలెడు గౌరవం విలువనిస్తారు..చదువుకోనివాడు వింత పశువు నా దృష్టిలో అని ఆవేశపడిపోతుంటే ..అబ్బా!! దీనిదగ్గర బుద్దితక్కువ అయి అన్నానురా బాబు అనుకుని ప్రక్కకు చూసాను. మా వెనుకనే గీతాంజలి గాడు వాడి ఫ్రెండ్స్ ...మరి ఎప్పటినుండి ఫాలో అవుతున్నారో..నేను దాన్ని ఇంక ఆపు అన్నట్లూ గా మోచేతిని గిల్లాను ..అబ్బా ఏంటీ అని కోపంగా అంటూ వాడిని చూసి నాలుక కరుచుకుంది..

వాళ్ళు వెళ్ళగానే ,వినేసాడంటావా అంది గుసగుసగా.. ఆ.. శుబ్బరంగా అన్నాను..నేను కావాలని అనలేదే బాబు ,ఏదో మాటవరసకి అన్నాను ..తను చదవడం లేదుగా ,తనని అన్నానేమో అనుకున్నాడంటావా?? అంది నొచ్చుకుంటూ ..పోనీ ఓ పని చేయి రేపు వాడు వస్తున్నపుడు ,'చదువురాని వాడవని దిగులు చెందకు' అని పాడేసేయి గొడవుండదు అన్నాను..అప్పటికి గాని నాకు బుద్ది రాదు.. మా వాళ్ళు గాని విన్నారనుకో ఆ పాట ..వద్దులేమ్మా అంత కష్టపడటం అని ఇంట్లో కూర్చో పెట్టెస్తారు ఇంక రోజూ అదే పాడుకోవాలి అంది..మేమేదో సరదాగా తీసుకున్నాం కాని ఆ విషయం తను సీరియస్సుగా తీసుకుంటాడు అనుకోలేదు..మరుసటి రోజు ఇద్దరం వస్తుంటే ఒరేయ్ మామ ఏంటిరా ఎం బి ఎ చేద్దాం అనుకుంటున్నావా!! మాకినబడేటట్లుగా ప్రక్కనోడు అరిచాడు..అవునురా ముందు డిగ్రీ కంప్లీట్ చేసేసి అది చేద్దాం అనుకుంటున్నాఅన్నాడు ఆ అబ్బాయి మొహం జాలిగా పెట్టి.. నాకు నవ్వు ఆగలేదు అక్కడ మొహం సీరియస్సుగానే పెట్టి ఇద్దరం వాళ్ళను దాటుకొచ్చేసాము..అంటే నిన్న అన్నది విన్నాడన్నమాట అంది అది .. అమ్మో, స్వాతి నువ్వు తక్కువదానివి కాదేవ్ ..మెల్లిగా అన్నీ క్లియర్ చేసుకుంటున్నావ్ అన్నమాట అన్నాను నవ్వుతూ ..నాకింకెవరూ శత్రువులు అక్కర లేదే నువ్వు చాలు అంది నవ్వుతూ.. ఎలాగూ తెల్లగా ,పొడుగ్గా బాగానే ఉన్నాడు ,ఇంక డబ్బులు గట్రా బాన్నే ఉన్నాయి వాళ్ళకు..ఒక్క చదువే లోపం.. అది కూడా ఒక్క మాటతో కవర్ చేసేసావ్ ..నేను అంటునే ఉన్నాను అది నన్ను కొడుతునే ఉంది..


ఆ అబ్బాయి ఎలాగూ అంతకు మించి ధైర్యం చేయడనుకుందో ఏమో అది కూడా ఒక్కోసారి జోకులు వేసేది ఎవరూ లేనపుడు.. ఏంటీ ఈ రోజు మా హీరో ఇంకా రాలేదూ మేచింగ్ డ్రెస్స్ దొరకలేదా అనో,వాడు నిజంగా పచ్చ బొట్టు వేయించుకున్నాడా లేక రుధ్రవీణలో శోభన లా అడగ్గానే చేతికి తీసి ఇచ్చేస్తాడా అని ఇలా అన్నమాట.. కాని ఆ అబ్బాయి కనబడితే చాలు భయం తో నన్ను అటు తోసేసి ఇది ఇటు వచ్చేసేది ..

ఇది ఇలా ఉండగా ఒక సారి దీపావళి వచ్చింది..ఆ ముందు రోజు ఇద్దరం మాట్లాడుకుంటూ వస్తున్నాం..ఈ సారి దీపావళికి ఏం కొంటున్నారేంటి మీ నాన్నగారు అంది..ఏంటీ కొనేది ,ఇంకా చిన్నపిల్లలం అనుకుంటున్నావా..అయినా నాకు టపాసులంటే చిన్నప్పటినుండి భయం బాబు ..చిచ్చు బుడ్లు,భూచక్రాలు కొన్నా భయమే కాల్చడానికి,మన లెవల్ కి సాదాకాకర పువ్వొత్తులు,పాం బిళ్ళలు ,అగ్గి పెట్టెలు ,మతాబాలు వంటి వాటితో సరిపెట్టేసుకుంటాం అన్నాను..ఛీ,ఛీ ఎవర్తివే బాబు నువ్వు,నాతో రాకు రేపటి నుండి ..అస్సలా అర్హతే లేదు నీకు అంది..ఏడ్చేవ్లే.. నాకు టపాసులు కాల్చడం కంటే ఆ మరుసటి రోజు అందరి ఇళ్ళముందూ పోగైన చెత్త చూడటం అంటే మహా ఇష్టం ..చిన్నపుడు నేనూ, మా తమ్ముడూ అన్ని ఇళ్ళముందూ ఉన్న తుక్కుని చూస్తూ ,ఎవరు ఎక్కువ కాల్చి ఉంటారో లెక్కలు వేసి వచ్చేవాళ్ళం ..అదో ఆట అన్నమాట ..భలే సరదాగా ఉండేది అన్నాను ఓమారు వెనక్కి వెళ్ళిపోతూ.. కోటా శ్రీనివాస్ లా కోడిని ముందుపెట్టి అన్నం తిన్నట్లా ..మొహం చూడూ అంది.. సరేలే నా సంగతి ఎందుకు గాని నీ సంగతి చెప్పుఅన్నాను..

నేను నీకులా కాదు చిన్నపుడే 1000 సిరీస్ కాల్చేను తెలుసా అంది..ఏంటి నిజమే అన్నాను నోరెళ్ళ బెడుతూ ...మరేమనుకున్నావ్ అసలు దీపావళి సాహస గాధలు బోలెడు నాకు ...ఒక సారి తారాజువ్వ వేస్తే ప్రక్కన గుడిసెల్లో వెళ్ళిపోయి నానా హంగామా చేసారు ..సిసింద్రీలు,తాటాకు టపాలు ,జింకాలు అబ్బో ఒకటేమిటీ నేను కాల్చని టపాసులేదంతే అంది ...ఇది నిజం చెప్తుందా లేక వెనుక ఫాలో అవుతున్న వాడి ఫ్రెండ్ దగ్గర కోతలా అనుకుంటూ వింటున్నా ..మరి ఈ సారి ఎంత డబ్బు,ఎన్ని ఇళ్ళు తగలబెట్టబోతున్నావేంటీ అన్నాను..హూం ఏంటీ తగలెట్టేది ..మా నాన్న గారు ఊర్లో లేరు రేపు రాత్రికి వస్తారు ..ఆయన ఎన్నింటికి వస్తారో ,అసలు కొంటారోలేదో.. మా అమ్మను అడిగితే ఎప్పుడో చిన్నపుడు కాల్చుకున్న గాయాలన్నీ గుర్తుతెచ్చుకుని తెచ్చుకుని తిట్టిపోస్తుంది తప్ప పట్టించుకోవడంలేదు..ఈ దీపావళి కి ఇంక ఇంతే అంది..

ఈ లోపల ఆ అబ్బాయి ఫ్రెండ్ వెళ్ళిపోయాడు..ఇంకేం కాకితో సందేశం పంపేసావ్ కదా రేపు ప్రొద్దున్న మీ ఇంటికి లక్ష్మీ బాంబులతో సహా పార్సిల్ పంపేస్తాడు.. బాగానే ఉందే నీపని ఎంచక్కా అన్నాను.. బాబోయ్ ,నిజంగా పంపుతాడు అంటావా అంది భయం గా..అంత ఫీల్ అయి చెప్పావ్ కదా నాకైతే అస్సలు డవుట్ లేదు అన్నాను.. అలా భయపెట్టకే బాబు ..మా నాన్నకు తెలిస్తే నన్ను కైమా చేసేసి, కిలో రెండు రూపాయలకు అమ్మేస్తారు అంది.. నేను మాత్రం పట్టించుకోకుండా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా సాంగ్ పాడుతూ నవ్వుతున్నా..కానీ నాకేం తెలుసు ఆ తరువాత రోజు ఇద్దరికీ గొప్ప షాక్ ఎదురవుతుందని..

తర్వాత రాస్తానే :)

34 వ్యాఖ్యలు:

మంచు చెప్పారు...

షబ్నం.. ప.గొ... మీది మావూరేనా ????????????????????

sunnygadu చెప్పారు...

waiting for next one, this one being quite disappointing, sorry, nevertheless u can delete this comment,

నిజంగా ఇది చాలా dull గా ఉంది, క్షమించండి, ఈ కామెంట్ ని డిలీట్ చేసెయ్యండి

అజ్ఞాత చెప్పారు...

as usual suspense ending...but the beginning was hilarious this time....waiting for part 3....Krishna

(excuse my commenting in English)

కౌటిల్య చెప్పారు...

చాలా బాగా రాస్తున్నారండీ...మా పక్కన జరిగిన ప్రేమకథలా ఉంది...మా అక్కవాళ్ళు వాళ్ళ కాలేజి రోజుల్లో వాళ్ళని ఫాలో అయ్యే అబ్బాయిల గురించీ,ఆ సరదా ప్రేమకథల గురించీ సరదాగా ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ,మాకు చెప్పి మమ్మల్నీ నవ్విస్తుంటారు..మీ కథ చదుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయ్...ఆ అబ్బాయెవరో మంచివాళ్ళా ఉన్నాడే...

భావన చెప్పారు...

మొత్తానికి మూగ ఆరాధకుడి ప్రేమ పాపం మీకు అంత నవ్వు అయ్యిందా... ;-) పాపం ఆ అమ్మాయి ని తలుచుకుంటే జాలేస్తోంది రేపేమవ్వుతుందో ఏమో..

నేస్తం చెప్పారు...

షబ్నం ప గో లోనే కాదు తూ గో లో కూడా ఉంది మంచు పల్లకి గారు :)
సన్నీ నాకు తెలుసుగా ఇలా అంటారని పార్ట్ 3 రాసాకా పార్ట్ 2 రెండుసార్లు చదువుతారు నాది గ్యారెంటీ ...అప్పుడు తప్పక చెప్పాలి మీ అభిప్రాయం :)
క్రిష్ణగారు థేంక్స్ అండి
కౌటిల్య గారు థేంక్యూ
భావన అందరూ అందరినీ చూసి జాలి పడేవాళ్ళే.. నా మీద మాత్రం ఎవ్వరికి జాలి లేదు :(

రఘు చెప్పారు...

చదువుతున్నంతా సేపు నవ్వు ఆగడంలేదండి. మా ప్రేండ్స్ కి కూడా చెప్పి చదివించాను. చిన్నప్పుడు దీపవళి పండగ కోసం ఎదురు చూసినంతగా మీ post కోసం చూస్తున్నామండి.

జాహ్నవి చెప్పారు...

నేస్తమా,
గీతాంజలి గాడు పేరు అదుర్స్.
ఉదయాన్నే భలే నవ్వు తెప్పించారు.

ఐనా మీరు జెమిని టి.వి. చూస్తున్నారా ఏంటి??
మరీ ఇన్ని పార్ట్స్ ఆ??

ఈ మూడవ పార్ట్ లోనే అన్నీ చెప్పేయండి.

లేదంటే మీరు మా టి.వి. , జీ తెలుగు లలో వచ్చే డాన్స్ ప్రోగ్రాంలు వరుసగా చూడాలి.

ఇదే నా తీర్పు... తీర్పు... తీర్పు...

చివరి రెండు తీర్పులు రీసౌండ్ ఎఫెక్ట్స్..

పరిమళం చెప్పారు...

షబ్నం ! తూ|| గో ...అంటే మన కాకినాడ కాదుగదా నేస్తం గారు ?100 రూపాయలది 1000 అంటే ఖచ్చితంగా అది మమ్మీడాడీ ..ఎదురుగా ఉండేది ఆ షబ్నం అయ్యే ఉంటుంది :) అవునూ .....మళ్ళీ సస్పెన్సా :)

మంచు చెప్పారు...

నేనొప్పుకోను.. ఆ షబ్నం మా ఊరిదే...
ఆ బౌలింగ్ చేస్తున్న ఫొటొలొ మీరెనా ???

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఇంటరెస్టింగ్...
నేస్తం గారు మీరిలా భాగాలుగా రాసేరంటే అ.భా.స.భ.స (అఖిల భారత సస్పెన్స్ భరించలేని సంఘానికి)మీ మీద ఫిర్యాదు చేసి కేసు వేస్తాను...:-)..ఇది ముమ్మాటికి మా సహనం హక్కులను కాలరాయటమే..:-)

Ram Krish Reddy Kotla చెప్పారు...

mottam enni partlu unnai ee prema kathalo...oka mata anesukunte better kada, endukante inkenni parts kosam wait cheyyalo munde telustundi :)....ok waiting for 3rd part....

నేస్తం చెప్పారు...

రఘు గారు నిజ్జంగానా..అయ్యబాబొయ్ నాకు సస్పెన్స్ గా రాయడం వచేస్తుంది అయితే:ఫ్
జాహ్నవి ఒక్కోసారి తప్పులు అలా వచ్చేస్తుంటాయన్నమాట ..సరి చేసాను..ఏమో అర్ధరాత్రి నిద్ర లో తూగుతూ మరీ రాసేసాను ..ఏం రాసానో ఏంటో తెల్లారి నిద్ర లేచి చదవడమే..:)
పరిమళం గారు,మంచుపల్లకి గారు ఇంతకీ అది ఎక్కడి షబ్నమో ఇద్దరూ తెల్చుకోండీ...నేను చెప్పనుగా..మంచు పల్లకి గారు నెనే ఎప్పుడో తీసేసానుగా మళ్ళి ఎక్కడ చూసారండి బాబు..
శేఖర్ వద్దులే త్వరలో రాసేస్తాను :)
కిషన్ అసలు ఒక పోస్ట్లోనే వ్రాద్దాం అనుకున్నా కాని అబ్బే నాకు టైపింగ్ అంటే పిచ్చ బద్దకం అని ఈ మద్య స్ట్రాంగ్ గా అర్ధం అయ్యింది:)

శ్రీలలిత చెప్పారు...

మేం కాలేజీ లో చదివే రోజుల్లో మా ఫ్రెండ్ ని ఇలాగే యేడిపించేవాళ్ళం. ఆ అమ్మాయి జడలో రోజూ ఒక మందారపువ్వు పెట్టుకొచ్చేది.. ఆమెని ఫాలో అయ్యే అబ్బాయి బ్రతిమాలుకునేవాడు.. "ఏవండీ, దయచేసి రేపు ఆ పువ్వు పెట్టుకు రావొద్దండీ. వచ్చారంటే నేను గోదాట్లో ఏడో స్తంభం దగ్గర ( మాది రాజమండ్రీ లెండి) లోతుగా ఉంటుందిట.. అక్కడ్నించి దూకి చచ్చిపోతా" ననేవాడు. ఈ అమ్మాయిని రోజూ వద్దని చెప్పేవాళ్ళం. వినకుండా రోజూ పెట్టుకొచ్చేది.. ఆ అబ్బాయి ఎక్కడ బ్రిడ్జ్ మీద ఏడో స్తంభం దగ్గర్నుంచి దూకేస్తాడోనని మేం భయపడి చచ్చేవాళ్ళం. కాని మా కాలేజ్ చదువయిపోయేదాకా ఏ అఘాయిత్యమూ జరగలేదనుకోండి..

మంచు చెప్పారు...

ఇప్పుడే గమనించా .. నాదే మొదటి కామేంట్ .. యా.....హూ.....
కాకినాడ అయినా మాఊరి లెక్కే..చదివింది అక్కడే కాబట్టి :-)) కానీ ఆ షబ్నం తూ. గొ. నో పా. గొ. నొ తేల్చాల్సిందే..
ఆ ఫొటొ ఎక్కడో చూసాలేండి.. మీరింత చిన్నొళ్ళని ఊహించలేదే..:-))

కౌటిల్య చెప్పారు...

హమ్మయ్య, మీ టపాలన్నీ చదివేశా..ప్రతిదానికీ కామెంటు రాద్దామనిపించింది....ఇప్పటికే చాలా టైమయ్యింది..కానీ ఆపుకోలేక గుత్తొంకాయ దగ్గర రాశేశా..
ప్రతికథా స్వగతం,సుమధురం,ఆనందం..మిస మిస నవ్వులూ,గలగల మాటలూ...తీపి తీపి అరిశెలూ,కర కర చేగోడీలూ...అప్పుడప్పుడూ చెమ్మగిల్లిన కళ్ళూ,బరువెక్కిన మనసూ..కొత్త ఆవకాయన్నం,గడ్డ పెరుగూ...అంతా కలిపిన కమ్మటి పదహారణాల తెలుగమ్మాయి జీవితం...
మీ కాలేజీ రోజులు చదుతూంటే వాలుజడల్తో,నిండుఓణీల్తో వెళ్ళొచ్చే మా అక్కలే గుర్తొచ్చారు..ఉమ్మడికుటుంబాల్లో ఆనందాన్ని హృద్యంగా అందించారు...ఒకమాటు మనసుని గిలిగింతలు పెట్టి,ఓసారి పొట్టచెక్కలయ్యేలా నవ్వించి,మరోమారు కళ్ళకొలుకుల్నించి తడిరప్పించిన మీ కథనానికి నేను వీర మహావీర,ఇంకా ఇంకా పే...ధ్ధ్హ..విసనకఱ్రనైపోయానోచ్..
ఓహ్! ఇంకా ఏదేదో రాయాలనుంది....రాస్తా..రాస్తా..ఇక మీ ప్రతి టపాకీ మీరు వద్దనేవరకూ రాస్తూనే ఉంటా.....

ప్రియ చెప్పారు...

నన్నేనా పిలిచింది...

హరే కృష్ణ చెప్పారు...

పచ్చ బొట్టా
అంత serious ప్రేమకధ ని కూడా మీదైనా శైలి లో
చించేశారు
ట్విస్ట్ లు చేజ్ లు వుంటాయా ఈ సారి..
3rd పార్ట్ కోసం వెయిటింగ్!!!!

Unknown చెప్పారు...

... పైకి తేలేది కాదు కాని దీనికో ప్రక్కనుండీ మహా గర్వం గా ఉండేది .. :) :)
ఈ ఎండలో కాలేజ్ కి ఇన్నిసార్లు తిరిగి చదవడం కంటే నీడ పట్టున కోళ్ళ ఫాం పెట్టుకుని బ్రతికేయడం బెటరు :) :)
.. అమ్మో, స్వాతి నువ్వు తక్కువదానివి కాదేవ్ ..మెల్లిగా అన్ని క్లియర్ చేసుకుంటున్నావ్ అన్నమాట అన్నాను నవ్వుతూ .. :) :)..
..ఛీ,ఛీ ఎవర్తివే బాబు నువ్వు,నాతో రాకు రేపటి నుండి ..అస్సలా అర్హతే లేదు నీకు :) :)..
మీరు కేకో కేకండి .... బాబూ.... టపా ..... అదుర్స్.... :) :) :)

Srujana Ramanujan చెప్పారు...

తర్వాత రాస్తానే :)
***

Same 2 U :-D

నేస్తం చెప్పారు...

శ్రీ లలిత గారు హహహ భలే చెప్పారు..
మంచు పల్లకి గారు అంటే గోదావరి కి ఇటు అటు పెనవేసుకున్న బంధం అన్నమాట మీది
కౌటిల్య గారు నా పోస్ట్ల్ ల మాటకేం గాని మీ వ్యాఖ్య మాత్రం భలే చక్కగా ఉంది .. చాలా ఆనందం వేసింది.
ప్రియ నిన్నె నిన్నే వస్తావా రావా అని టెస్టింగ్ :)
హరే కృష్ణ గారు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఏముంటాయో :)
రాజ :D
సృజన :/

రాజ్ కుమార్ చెప్పారు...

కైమా చేసేసి, కిలో రెండు రూపాయలకు అమ్మేస్తారు... ha ha...:) :)

3rd part twaraga raayandi mari...

Rajkumar

సవ్వడి చెప్పారు...

స్వాతిలందరూ అందంగానే ఉంటారా! నేను ఇప్పటివరకు ఐదుగురు స్వాతిలను చూసాను. అందరూ అందంగా ఉన్నవారే! మీ స్వాతి ఆరో స్వాతి.. మీరు చెప్పినదాని ప్రకారం ఈవిడ కూడా బాగుంటారని తెలిసింది. నేను చూసినవాళ్లలో "కలర్స్ స్వాతి" ఒకరు. " సింగర్ స్వాతి " రెండోవారు. వీళ్లు బాగుంటారు.

మా ఫ్రెండ్ పేరు వివేక్.. వీడి మరదలు పేరు కూడా "స్వాతి"యే! వీడికేమో తనంటే చాలా ఇష్టం. చిత్రమైన విషయమేంటంటే ఈ స్వాతి పుట్టిన రోజు నా పుట్టిన రోజు ఒక రోజే... నా బర్త్ డేకి వీడిని మరో ప్రెండ్ ని సినిమాకి తీసుకెళ్లాను. అదేనండి పార్టీ ఇచ్చాను. సినిమా మధ్యలో వీడు తన మరదలు గురించి చెప్పాడు. చాలా బాగుంటుందని చెప్పాడు. ఇంతవరకూ విష్ చేయలేదని కూడా చెప్పాడు. సినిమా ఐయ్యాక 9 గంటలకు STD నుండి ఆ అమ్మాయికి ఫోన్ చేసాడు. నేను పక్కనే ఉన్నాను. వాడు విష్ చేసాక నేను చేస్తాను అన్నాను. ఒకే రోజు అన్నాక ఆ మాత్రం ఉత్సాహం ఉంటుందిలెండి. కాని అవలేదులెండి. నాబదులు కూడా వాడే చెప్పాడు. నేను బాధపడటం కూడా జరిగింది. ఇది ఒక కథ.

మా బావ ఇంటర్ లో ఒక అమ్మాయిని లవ్ చేసాడు. ఆ అమ్మాయి పేరు కూడా స్వాతియే.. వీడు లవ్ చేసాడు. తనేమో ఒక సంవత్సరం తరువాత "అన్నయ్య" అన్నాదట... అప్పటినుండి " స్వాతి " అంటే చాలు "గయ్....."మంటూ ఒంటికాలు మీద లేస్తున్నాడు.

ఇక ఐదవ అమ్మాయి... నేను 9వ తరగతిలో ఇష్టపడిన అమ్మాయి. మీరు స్వాతి రించి చెప్పగానే నాకు ఇంతమంది గుర్తొచ్చారు. ఆశ్చర్యంగా ఉందా.. ఈ కథ వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. వినండి మరి...

ఈ స్వాతి కూడా బాగుంటుంది. ఆ హెయిర్ స్టైల్ పేరు తెలీదు కానీ నుదురుమీదకి కొంచం జుట్టు వస్తుంది. అసలు ఈ ప్రేమకథ ఎలా ప్రారంభం ఐయ్యిందంటే... నేను నా స్నేహితులు ఈశ్వర్, షణ్ముఖ మధ్య మొదలైన చర్చ ఒక అమ్మాయిని ఇష్టపడేటట్లు చేసింది. ఆ చర్చ నాకు గుర్తులేదు కానీ వాళ్లవల్లే నేను ఇష్టపడటం చేసాను. అమ్మాయిని కూడా సెలక్ట్ చేసింది వాళ్లే అనుకుంటా.. వాళ్లు చెప్తే నేను లవ్ చేయడమేంటో.. తలుచుకుంటుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు.

మరి పరేమించాక ఏవో కొన్ని చేయాలి కదా.. నేను చేసాను. అవేంటంటే.. తనతో మాట్లాడటం.. ఇంకా ఒకరోజు వాళ్ల ఇల్లు తెలుసుకుందామని ఆ అమ్మాయి వెనుక బయలుదేరాం.. ఇల్లు తెలిసిందిలెండి. దానితో పాటు క్లాసు మొత్తం ఈ విషయం కూడా తెలిసింది. నా పాట్లు చూడండి.. క్లాసులో కొందరు వెదవలుంటారు కదా.. గొడవ గొడవ చేసేసారు.

అదే టైమ్ లో మా నానమ్మగారు చనిపోవడంతో నేను కొన్నిరోజులు స్కూల్ కి వెళ్లలేదు. ఏదో పని మీద నేను మార్కెట్ కి వెళ్తే.. అక్కడ నా ఫ్రెండ్ కలిసి.. " నీ పేరు, స్వాతి పేరు గోడ మీద రాసారురా..! " అన్నాడు. సరి నా కాళ్లు చేతులు వణికిపోయాయి. ఎంత టెంక్షన్ పడ్డానంటే మరి చెప్పలేను. దెబ్బకి మరో నాలుగు రోజులు స్కూల్ కి వెళ్లలేదు. తీరా స్కూల్ కి వెళ్లి చూస్తే అది నిజమే! ఆవిధంగా ఆ సంవత్సరంలోనే ఆ కథ ముగిసింది.

ఇప్పుడు మాత్రం నేను బాగా నవ్వుకుంతున్నాను. ఇదండి స్వాతిల కథ.

ఇంతకీ మీకొచ్చిన ప్రేమకథలు గురించి ప్రతిపాదనలు గురించి ఎప్పుడు చెప్తారు.

శ్రీకర్ బాబు చెప్పారు...

భలే సస్పెన్స్ లో పెడతారే............. సరే కానివ్వండి మీ తరవాతి టపా కోసం ఎదురుచూస్తాం ఏం చేస్తాం............

ప్రణీత స్వాతి చెప్పారు...

అన్యాయమండీ...మళ్ళీ సస్పెన్సా..నేను కూడా శేఖర్ గారి పార్టీనే ఈ విషయంలో. త్వరగా రాసేద్దురూ..

నేస్తం చెప్పారు...

raj kumar గారు బ్లాగ్ మొదలు పెట్టారా మరి ఏం వ్రాయలేదే :)
ఆహా సవ్వడి గారు స్వాతి అన్న ఒక్క పేరు మీద మరీ ఇన్ని ఙ్ఞాపకాలా :) బాగున్నాయి మొత్తానికి
శ్రీకర్ ,స్వాతి రాస్తున్నా రాస్తున్నా :)

Srujana Ramanujan చెప్పారు...

నేస్తం బుంగ మూతి పెడితే ఎలా?

Shashank చెప్పారు...

మా వాడి మూగ ప్రేమ మళ్ళా చూస్తున్నట్టు ఉంది. కొంచం తేడా అంతే.. వాడు పచ్చ బొట్టు గట్ర చేయలేదు.. చదువు కూడా బానే చదివేవాడు. అంతే తేడా..

ఐనా ఏంటండి.. అంధ్రభూమి లో వచ్చే వారం వారం శీర్షిక లా మేము కాచుక్కూచోవాలా? I object. త్వరగా రాయండి మాడం. ఓ ఖరీదైన గ్రీటింగ్ కార్డు కొనిబెడతా.... డీల్ ఓకే నా?

Shashank చెప్పారు...

@సవ్వడి - ఈ మాట తో నేను ఏకీభవించలేకపోతున్నా అండి.. నాకు తెలిసిన ముగ్గురు స్వాతి లు (కలర్స్ సింగర్ కాకుండ) అందం సంగతి అటు ఉంచండి.. పిచ్చ వరైటీ క్యారెక్టర్లు. ఒక అమ్మయి అందరిని ముందు గా కొట్టి మాట్లాడేది.. ఇంకొక్కమ్మాయి బాగున్నావా అక్కా అన్న ఐ లవ్ యౌ హారికా అన్నంత ఎక్స్ ప్రెషన్ పెట్టేది.. మూడో అమ్మయి సరే సరి.

సవ్వడి చెప్పారు...

శశాంక్ గారు! నిజమా... మీకు తెలిసిన స్వాతిలందరూ అలాంటివారా.. సో అందరు స్వాతిలు ఒకటి కాదన్నమాట. సరేనండి మీతో ఏకీభవిస్తున్నాను.

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు ముందు మిగతా కథని చెప్పండి. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను... చాలా కామెడీగా రాసారు. నేను ఎక్కువ నవ్వినవాటిలో ఇది కూడా ఒకటి.

Viswanath చెప్పారు...

3va baagam eppudandi...chaala mandhi waiting ikkada

బృహఃస్పతి చెప్పారు...

హ్మ్... కామెడీ కధకి రొమాంటిక్ టచ్ ఇచ్చి డెప్త్ పెంచారే?? ఎదురింటి అమ్మాయి పోస్ట్ లోలా క్లైమాక్స్ గుండెలు పిండేయటానికి రడీ అయిపోయారా ఏమిటి?

నేస్తం చెప్పారు...

సృజన మరి నువ్వలా అంటే అలాగే అంటా :/
ఏంటి శశాంక్ గారు పాపం అతనెదో స్వాతి పేరుని తలుచుకుని హెపీగా ఫీల్ అవుతుంటే మీరు అలా భయపెట్టెస్తారు.. :)
విస్వనాధ్ గారు రాసెసా చూడండి..
బృహఃస్పతి గారు హ హ చుద్దాం చూద్దాం ఎమవుతుందొ :)