29, జనవరి 2010, శుక్రవారం

ప్రేమ కధలు పలు రకాలు
ఈ మద్య ఇలా సిస్టం ఆన్ చేసి కూడలి చూస్తుంటే చాలు కొట్టేసుకుందాం,నరికేసుకుందాం,నువ్వెంత అంటే నువ్వెంత ...అబ్బబబ్బా దెబ్బకు సిస్టం కూడా ఆవేశం తో రగిలిపోయి 'ఢాం' అనేస్తుందేమో అని భయమేసి పరిగెత్తుకుని ఇలా వచ్చేసానన్నమాట.(అసలు కారణం అది కాదనీ, మీకు తెలుసన్న విషయం నాకు మాత్రం తెలియదు )..కాబట్టి ఏతా వాతా నేను చెప్పొచ్చేదేంటంటే ఈ కక్షలు ,కార్పణ్యాలు,ఆవేశాలు,ఆక్రోశాల
మద్యలో ప్రేమ అనే దాన్నికూడా దేవుడు మనకు ఇచ్చాడన్న గొప్ప విషయం నిన్న రాత్రి నాకు హఠాత్తుగా గుర్తు వచ్చేసిందన్నమాట.ఆ వెంటనే చిన్నప్పటి ప్రేమ కధలు హలో అంటూ పలకరించేసాయి.. మచ్చుక్కి అందులో ఒక కధ ...కధ అంటే కధ కాదండోయ్ నిజమే..


నా హైస్కూల్ నుండి కాలేజ్ వరకు నేను , స్వాతి జిగరీ దోస్తులం ... ఆగండాగండి ,మీరు స్నేహమేరా జీవితం లెవల్ లో ఉహించేసుకోకండి.. వేరే దారిలేక ,ఇంకెవరు ఇంటి వరకు వచ్చే తోడు లేక మరి ఆ రకం గా ముందుకు సాగిపోయానన్నమాట ...అది ఆర్యా 2లో అల్లు అర్జున్ కి ఏ మాత్రం తీసిపోదు .. అరగంట కోమారు నరకం అంచున అరంగుళం దూరంలో నించో పెట్టేది నన్ను . ఆ విషయం ప్రక్కన పెడితే , మేము కాలేజ్ కి వెళ్ళేదారిలో ఒక అబ్బాయి ఉండే వాడు..తెలిసిన వాళ్ళఅబ్బాయే ..పేరు తెలియదు కాని బాగా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులున్నాయి..మరి అందువలనో లేక చదువు అబ్బలేదో గాని ,మద్యలో చదువు మానేసి వాళ్ళ వ్యాపారాలు గట్రా చూసుకునేవాడు ..వాడికున్న ప్రత్యేకత ఏంటంటే అమృతం తాగిన అమీర్ ఖాన్ లా చిన్నప్పటి నుండి పెద్దయ్యేవరకు ఒకటే మొహం..మరి ఉన్నట్లుండి ఏమోచ్చిందో తెలియదు గాని మా వెనుక పడటం మొదలు పెట్టాడు.. అలా ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఏకం గా ఒక సంవత్సరం పడ్డాడు..ఇంత జరుగుతున్నా మా మట్టి బుర్రలకు అసలేమాత్రం అర్ధం కాలేదు...దానికిబోలెడు కారణాలు ఉన్నాయి ...అతనిని చిన్నప్పటి నుండి అదే వీధిలో చూసి ,చూసి ఏదో పని మీద తిరుగుతున్నాడేమోలే అనుకోవడం ఒకటైతే ,మేమిద్దరం కబుర్ల పోగులు అవ్వడం వల్ల మూడో వ్యక్తిని పట్టించుకోకపోవడం మరొక కారణం.. ఈ రెండు కాకుండా అమోఘమైన విషయం మరొకటుంది ...అది చెప్పాలంటే ఇంకో బుల్లి ప్లాష్ బ్యాక్ కి వెళ్ళాలి..


మా ఇంట్లో వాళ్ళు పొరపాటున హిందువుల్లో పుట్టేసారుగాని లేక పొతే ఆడపిల్లలందరికి బురఖాలేసేసి ఇంట్లో కూర్చో పెట్టేసేవారు ,రోడ్డు మీద వెళ్ళినపుడు నవ్వకూడదు,దిక్కులు చూడకూడదు ,పక్కింటికి వెళ్ళాలన్నా పదిమంది తోడుండాలి ...నో ..షాపింగులు ,నో సినిమాలు నత్తింగ్ ...అబ్బో సవాలక్షా కండిషన్లు ..పోనీ లోకజ్ఞానానికి చక్కగా యండమూరి నవలలో, సులోచన రాణివో కనీసం ఆంద్ర జ్యోతి,ఆంద్ర ప్రభ వార పత్రికలో కొనచ్చుగా ..హూం..అసలేమాత్రం కనికరం చూపించే వాళ్ళు కాదు గాని ,వంతులేసుకుని మరీ భాలమిత్ర ,భాలజ్యోతి, చందమామ ,జాబిల్లి మాత్రం తెగ తెచ్చేసేవాళ్ళు ....అలా అవి తెగ చదివి ,చదివి మా అమ్మ భాషలో గాడిద లా ఎదిగినా సరే చక్కం గా మహేష్ బాబునో,అనిల్ కుంబ్లే గురించో కలలు కనడం మానేసి ,విక్రమార్కుడు బేతాళుడు ని మోసుకుంటూ కధలు చెపుతున్నట్లో ,రాజు గారుసింహాలను,పులులను చంపేసి ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలిస్తున్నట్లో, కుందేలు,తాబేలు పందాలు వేసుకున్టున్నట్లో ఉహించుకుంటూ నిద్రలో జారుకునేదాన్ని..


అలాంటి రోజుల్లో నేను ఎనిమిదో , తొమ్మిదో (?)తరగతి చదువుతుండగా , మా ట్యూషన్లో ఒక అబ్బాయికి ఖర్మ కాలి నన్ను ఇష్టపడ్డాడు.. పడి ఊరుకోకుండా పాపం న్యూ ఇయర్ రాగానే నేను ,స్వాతి వస్తుంటే నన్ను పక్కకు పిలిచి, నాచేతిలో ఒక తెల్ల కవరు ఒకటి పెట్టేసి ,ఇక్కడ కాదు ఇంటికి వెళ్లి చూడవా అని అనేసి పారిపోయాడు.. మనమంత సేపు ఆగలేము కదా, ఏంటే ఇది అని మా స్వాతిది ప్రక్కన ఉండగానే ఓపెన్ చేసి చూసాను..అదో ఖరీదైన గ్రీటింగ్ కార్డ్ ...చక్కగా రెండు ఆటిన్ సింబల్స్ , వాటిని తెరవగానే ఒక్కో దానిలో ఒక్కో తెల్ల పావురం ,ఆ పావురం రెక్కలు తీయగానే ఒకటి నువ్వు, ఒకటినేను అని చిన్న పదాలు ...లోపల మేటరు జోలికి పోలేదు మనకసలే ఇంగ్లిష్ లో అరివీర భయంకరం గా మార్కులు వచ్చేవి అప్పట్లో ...ముందు జాగ్రత్తగా లోపల పేరు వ్రాయలేదు ఆ అబ్బాయి ...అప్పటి వరకు అర్ధ రూపాయి గ్రీటింగులు తప్ప ఖరీదయినవి చూడలేదేమో ,నాకా గ్రీటింగ్ పిచ్చ ,పిచ్చగా నచ్చేసి మురిసిపోతుంటే ,మా స్వాతి తట్టుకోలేక బొరున ఏడ్చేయడం మొదలెట్టింది ..

చూసావా, నా మొహానికి రూపాయి గ్రీటింగ్ పడేసి నీకెంత మంచిది ఇచ్చాడో ,నాకే అందరూ ఇలా చేస్తారు ,నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు అని దారంతా ఒకటే ఏడుపు ( కంగారు పడకండి ...పాపం వాళ్ళింట్లో కనీసం బాల మిత్ర ,చందమామలు కూడా కొనరు.. అదన్నమాట సంగతి) ..ఒక ప్రక్క నుండి అంత మంచి గ్రీటింగ్ దానికి ఇవ్వడానికి మనసొప్పడం లేదు..ఇవ్వక పొతే వారం రోజులు ఏడ్చి ,ఏడ్చి చంపేస్తుంది ...వాడు చెప్పినట్లు ఇంటికి వెళ్లి చూసినా బాగుండేది అని తిట్టుకుని ,తిట్టుకుని దానికి ఇచ్చేశాను ...


కాని ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు ,ఒక ప్రక్క స్వాతిదాన్ని తిట్టుకుంటూనే రేపెలా అయినా వాడిని బ్రతిమాలి అలాంటి గ్రీటింగ్ ఇంకొకటి తెప్పించుకోవాలి అనేసుకున్నా..కాని ఎలాగో తెలియడం లేదు. అంత ఖరీదయిన గ్రీటింగ్ ఒక్క సారి ఇవ్వడమే గొప్పా ,ఇంకోసారి అడిగితే ఇస్తాడా?? అని డవుటు ..మొత్తానికి బోలెడన్ని ప్లాన్ లు వేసుకుని మరుసటి రోజు ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లాను... పాపం నన్ను చూడగానే టెన్షన్ టెన్షన్ గా ,భయం భయం గా ,సిగ్గు ,సిగ్గుగా అనేక రకాల ఫీలింగ్స్ పెట్టాడు...నేను కూడా అవే ఫీలింగ్స్ తో ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి, శ్రీనూ! మరేమో నిన్న నువ్విచ్చిన గ్రీటింగ్ ఎంత బాగుందో ,కాని మా చెల్లి తీసేసుకుంది.అది చూసి ఇంకో చెల్లి కూడా అలాంటిదే కావాలని ఏడుస్తుంది ...మా అమ్మగారేమో ఆ అబ్బాయిని ఇంకొకటి కొనమను డబ్బులిచ్చేద్దాం అన్నారు ( పెద్దవాళ్ళ పేరు చెపితే తప్పక కొంటాడని, పైగా డబ్బులడగడానికి మొహమాట పడతాడని మాస్టరు ప్లాన్ అన్నమాట )అంటూ ,నాకు వచ్చిన గ్రీటింగ్ లలో ఓ నాలుగు మంచివి వాడి చేతిలో పెట్టి ,వీటిని తీసుకుని బదులు గా అలాంటి గ్రీటింగ్ ఇంకొకటి కొనివ్వవా..డబ్బులిమ్మన్నా ఇచ్చేస్తాను అని ఎంతో ఇదిగా అడిగాను .... దాంతో ఆ అబ్బాయి కి' తారే జమీన్ పర్ 'అన్నమాట ...ఆ తరువాత నేను కనీ ,కనిపించగానే పారిపోయేవాడు..


అంతటి ఘన చరిత్ర ఉంది మా ఇద్దరికీ ...ఆ కారణం గా ఆ అబ్బాయి మాకు గీతలు గీస్తున్నాడని తెలుసుకోవడానికి ఆ మాత్రం టైం పట్టింది ... ఈ లోపల వాడికో బేచ్ తయారైంది,వాళ్ళ పనేంటయ్యా అంటే మమ్మల్ని జాగ్రత్తగా కాలేజ్ కి దింపి ,అంతే జాగ్రత్త గా ఇంటి వరకు తోడు రావడం ..అడపా ,దడపా మేము ఏమ్ మాట్లాడుకున్నా విని ,మేమొచ్చేసరికి ఆ టాపిక్ మీద చర్చలు జరపడం వగైరాలన్నమాట ..పనులన్నీ ఫ్రెండ్స్ చేసి కష్ట పడుతుంటే మన హీరో గారు తన బండికి ఆనుకుని, మెడలోమఫ్లర్ చుట్టుకుని చేతులు కట్టుకుని మావైపు ఆరాధనగా చూస్తూనిలబడేవాడు ...దాంతో మా స్వాతి వాడికి గీతాంజలి గాడు అని నామకరణం చేసేసింది ..అంతా బాగానే ఉంది గాని ఇంతకీ వాడు ఎవరికీ లైన్ వేస్తున్నట్లు అనేది మా ఇద్దరికీ మిలియన్ డాలర్ల ప్రశ్న ... అందువల్ల ముందుగానే అబ్బెబ్బే నాగురించి కాదంటే నా గురించి కాదనీ కంగారు పడిపోయేవాళ్ళం...

మా నల్ల పిల్లల వెనుక ఎవరు పడతారు ఖచ్చితం గా వాడు నీ వెనుకే పడుతున్నాడు అనేది అది.. కలరు కాదమ్మా ముఖ్యం మొహం ఎవరిది కళగా ఉన్నదనేది పాయింట్, పైగా మా కుటుంభం గురించి వాడికి బాగా తెలుసు తోలు తీసేస్తారు కాబట్టి ఖచ్చితం గా నీ వెనుకే అనేదాన్ని నేను ..అంత లేదు ఎంత సేపు మా పెదనాన్నలు ,చిన్నాన్నలు అని నువ్వే డప్పు కొట్టుకుని భయపడిపోవాలి తప్ప బయట అంత సీన్ మీవాళ్లకు నిజంగా లేదు అని అది ,ఇలా తగవు లేసుకునే వాళ్ళం...అయితే ఎంత వాదించుకున్నా దాని దగ్గర నేను సరిపోయేదాన్ని కాదు. వీడు పగలూ ,రాత్రుళ్ళు తేడా లేకుండా ఆ కూలింగ్ గ్లాసెస్ పెట్టి పెట్టి నిజంగా గుడ్డోడు అయిపోయి ఉంటాడే.. లేకపోతే మీ ఇంట్లో నీకంటే బాగుండే మీ అక్కని వదిలేసి ,కాస్త కళగా ఏడ్చే ఎదురింటి అమ్మాయిని వదిలేసి నిన్నెలా ఇష్టపడుతున్నాడే బాబు తింగరోడు అనో ,లేకపోతే మరొకటో అని నన్ను తెగ ఏడిపించేసేది... ఒక్కోసారి ఎంత ఉక్రోషం వచ్చేసేదంటే ఒక గంటో, రెండు గంటలో మౌనం గా ఉండిపోయేదాన్ని మాట్లాడకుండా...అయితే అలా పైకి అనేది గాని దానికీ మనసులో మహా భయంగా ఉండేది ఎక్కడ వాడు దాన్ని ఇష్టపడుతున్నాడేమో అని...

నిన్న జ్యోతిర్మయి గారి క్లాసులో అయిపోయేదాన్నే ,ఒకటే నిద్ర వచ్చేసిందనుకో.. మొన్నే ఆవలించారని ఇద్దరిని బయటకు పంపేసారు.. ఆవిడ క్లాసులన్నీ మద్యాహ్నమే తగలడతాయి ...అప్పుడే శుబ్బరం గా మేసి ఉంటామేమో,పైగా ఆవిడ పాఠం జోల పాటలా సా..గుతూ ఉంటుంటే ..ఆహా ..ఏం నిద్ర తన్నుకొస్తుందే బాబు ...నేను చెప్పుకుంటూనే వెళుతున్నా ఇది మాత్రం ఊ అనడం లేదు ,ఆ అనడంలేదు .. ఏంటా అని దాని వైపు చూసేసరికి ఈ రోజు డేటెంతే అంది కనురెప్ప వాల్చకుండా ఎదురుగా చూస్తూ..ఫిబ్రవరి 14 ఎందుకూ ? అని అడుగుతూ ఎదురుగా చూసి హడలిపోయాను..గీతాంజలి గాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు.. అది రోజూ చూసే సీనే కాని ,ఈ రోజు హీరోగారు పెళ్ళి కొడుకులా తెల్ల షరాయి ,లాల్చీ వేసుకుని చేతిలో ఒక కవరు,ఎర్ర గులాబీ పట్టుకుని నించున్నాడు ...వెనుక ఫ్రెండ్సేమో మరేం పర్లేదు మేమున్నామని భుజం తడుతున్నారు..

వీడెవడే బాబు మన ప్రాణానికి ఇలా తయారయ్యాడు ఏం చేద్దాం అంది భయం గా..మొహం సీరియస్సుగా పెట్టి మనల్ని కాదన్నట్టు వెళ్ళిపోదాం అన్నాను..గోడవేం జరిగినా నీకింకా పర్వాలేదే కనీసం నువ్వు చెప్పేది వింటారు మీ ఇంట్లో.. మా కొంపలో అలాక్కాదు వాడి వెనుక నేనే పడినట్లు చెప్పేస్తారు మా నాన్నకు ...ఆ ముక్క చాలు పుస్తకాలు అటకెక్కించేసి నన్ను ఇంట్లో కూర్చోపెట్టేయడానికి అంది ...ఒక ప్రక్క నా భయం నాది ఒక వేళ వాడు నాకే ఇస్తే ఏం చేయాలి? ముక్కలు ముక్కలుగా చింపేసి నాకిలాంటివి నచ్చవు అంటే ???కక్ష పెట్టుకుంటాడా??..అసలే మెడికల్ షాప్ అమ్మాయి మీద యాసిడ్ పోసారంట మొన్నెవరో ..పోనీ, చూడండి మా ఇంట్లో ఇలాంటివి తెలిస్తే చంపేస్తారు,చదువు మానిపించేస్తారు దయ చేసి నా వెనుక పడకండి అని కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంటే ..ఛీ ఛీ..వాడెవడో ముందు ఏడవడం ఏంటి చాండాలంగా ..నా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి స్వాతి భయం తో చమటలు తుడుచుకుంటునే ఉంది ..మేము వాడికి దగ్గరలోకి వచ్చేసాము ...
మిగిలింది తరువాత వ్రాస్తానే :)

54 వ్యాఖ్యలు:

పరిమళం చెప్పారు...

హ్మ్మ్.....సస్పెన్స్ లో పెట్టారా ...తర్వాతి టపాకోసం ఎదురుచూస్తాం స్పందించకపోతే గడువు విధించాల్సి వస్తుంది మరి :):)

Hema చెప్పారు...

Hai Nestam garu,

Nenu mee posts eppudu chadivina, reply cheyyadam ide modati sari. telugu font ela use cheyyalo telika English lo type chestunna (So dont mind). Morning mee blog open chesinppadu e kottha post lekapothe mimmalni baga tittukunnanu. Malli ipudu bore kodutunte open chesanu. Pleasant surprise!! Plus nade first comment!! (Intakamundu kuda chala sarlu mee posts hatatthu ga nenu open cheyyadam, nene modati reader kavadam jarigindi, kani eppudu comments rayaledu anukondi). Mee rachana shaili chala baguntadi. Chala takkuva mandi rayagalugutaru inta simple padalu to inta baga. Post vishayaniki vaste eppatilane chala bagundi. Good luck!!! Bye.

చైతన్య.ఎస్ చెప్పారు...

మధ్యలో అలా సస్పెన్స్ పెట్టేస్తే ఎలాగండి :( ...

సుజాత చెప్పారు...

సో, రీ ఎంట్రీ కత్తి లాంటి లే లేత ప్రేమ కథతో ఇచ్చేశారన్నమాట. తారే జమీ పర్ ఇక్కడ! :-)

అజ్ఞాత చెప్పారు...

ఏమయిపోయారండీ 56 రోజులు?
నిరాహారదీక్ష ఏమయినా చేసారా?
మీరు లేక బ్లాగులోకం వెలవెలబోయింది.

చైతన్య చెప్పారు...

మీకు మా మీద ఇంత కసేంటండి బాబు... చివరి దాకా తీసుకొచ్చి... అలా వదిలేస్తే మేమేమయిపోవాలి?

గ్రీటింగ్ కార్డు ఇస్తే... అందులో విషయం వదిలేసి... ఇంకోటి తెమ్మన్నారా... మీరు సూపరండి బాబు :D

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీ పెదనాన్నలు, చిన్నానలు అందరూ మీ ఊళ్ళో ఉండేవారు కాబట్టి వాడు ఖచ్చితంగా మీ ఫ్రెండ్ కే లెటర్ ఇచ్చుంటాడు. :-)
మీరేంటడీ బాబు...తెలుగు చానల్స్ లో వచ్చే సీరియల్లాగ కరెక్టగా తర్వాత ఏం జరుగుతుంది అనుకునే చోట ఆపేసి తర్వాత చెప్తాన్లే అంటున్నారు. ఇదేం బాలేదండీ నేస్తంగారు...కంటిన్యూ..కంటిన్యూ...:-)

Srujana Ramanujan చెప్పారు...

మేమూ తరువాత కామెటెడతామే :D)))))

Phani Yalamanchili చెప్పారు...

బాబోయ్.....!!!!! ఇదేంటండి పిచ్చి పలు రకాలు అన్నట్టు .. వుంది మీ టైటిల్ :)

"మా అమ్మగారేమో ఆ అబ్బాయిని ఇంకొకటి కొనమను డబ్బులిచ్చేద్దాం అన్నారు ...."
భలే నవ్వు వచ్చింది ఇది చదవ గానే..
ఇంతకి ఎం జరిగిందో తర్వాత ....

మధురవాణి చెప్పారు...

నేస్తం,
మీకిదేమన్నా బాగుందా..కథలో లీనమై చదువుతున్నాం కదా అని అర్ధాంతరంగా ఆపేస్తారా? పైగా నవ్వులు కూడానూ.. :( :(
తరవాత ఏమయిందో తొందరగా చెప్పేద్దురూ..

నాగప్రసాద్ చెప్పారు...

హ్మ్...సస్పెన్సా.. గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.

పాపం. నెక్ట్స్ సీన్‌లో ఆ అబ్బాయిని తలచుకుంటుంటే జాలేస్తోంది. :-)

భావన చెప్పారు...

ఇది టూ మచ్.. సగం రాసి మేం కూడా చెమటలు తుడుచుకుంటూ వుండగా ఆపేయ్యటం..
ఇప్పుడు నవ్వ్వు గానే వుంటూంది కాని అప్పట్లో ఠారు కదా... ఎలా రా భగవంతుడా అని. సరి సరి తొందర గా రెండవ భాగం, మళ్ళీ నెల తరువాత కాదు.

రవిచంద్ర చెప్పారు...

భలే సరదాగా ఉందండీ...

శ్రీలలిత చెప్పారు...

తొలిప్రేమకథ అన్నమాట... ఎప్పుడెప్పుడు చదువుదామా అన్నట్టుంది...

sunnygadu చెప్పారు...

అసలు ..... (మిగత కామెంట్ మీరు రెండో టపా రాశాక ఇస్తాలెండి)

సృజన చెప్పారు...

సస్పెన్స్ తెలుగు సీరియల్ తో చాలా గాప్ తరువాత...నేను అలిగాను కమెంటిడనుగా:(:(

మాలా కుమార్ చెప్పారు...

అమ్మయ్య నేస్తం గారు బ్లాగ్లోకి వచ్చేసారన్నమాట . ఇప్పటికే , చుక్కలారా , వెన్నెలమ్మా , గూగులమ్మా ఎక్కడమ్మా , మా నేస్తం అని అడిగీ అడిగీ . . . ఏంచెప్పను లేండి .
ఇప్పుడే మో ఆ తరువాత ? అబ్బ ఏం టెన్షన్ పెడుతున్నారండీ బాబు .

sunita చెప్పారు...

Hammayya! vacchaesaaru.

నేస్తం చెప్పారు...

మరేం చేయను పరిమళం గారు తరువాతి పార్ట్ ఇంకొక అంత ఉంది చేతులు ఇప్పటికే నెప్పులు అదన్నమాటసంగతి
విషయం ఏమిటంటే హేమా మీరు తలుచుకున్నపుడల్లా నాకు తెలిసిపోతుంది అన్నమాట ఆ వెంటనే ఒక పోస్ట్ రాసేస్తున్నా మీరే మొదటి రీడరు అయిపోతున్నారు :)
క్రైం కధలె కాదు ప్రేమ కధలు కూడా సస్పెన్స్ గా రాయచ్చు అని నిరూపించాలని కంకణం కట్టుకున్నాను చైతన్య గారు
కెవ్వ్ సుజాత గారు సుత్తిలా ఉందంటారేమో అని అనుమాన పడుతూ రాసాను థెంక్యూ థేంక్యూ
బోనగిరిగారు ఎన్ని రోజులో భలే లెక్కపెట్టేసారు ..నేను నిరాహారదీక్ష చేయలేదు గాని ,మూడు పూట్లా తింటూ అలా చేసే వాళ్ళను చూస్తూ ఉన్నాను :)

నేస్తం చెప్పారు...

@చైతన్య మరి తెలుగు మీడియం అమ్మాయి కి పోజుగా ఇంగ్లీష్ మేటర్ ఉన్నది ఇస్తే ఇలాగే అవుతుంది అనేది కధలో నీతి
శేకర్ మరి గీతాంజలి ఆ లెటర్ ఎవరికి ఇచ్చాడు అ) స్వాతి ఆ) నేస్తం ఇ) ఇద్దరికీ డి) ఎవరికీ ఇవ్వలేదు అని ఎస్ ఎం ఎస్ కాంటెస్ట్ పెట్టేద్దామా :)
సృజనా అబ్బా...అలా వచ్చావా అయితే కామెంట్లన్నీ కలెక్ట్ అయ్యాకే నెక్స్ట్ పార్ట్ రాస్తా
ఫణి గారు వాడికి అసలు బొత్తిగా పెద్దవాళ్ళంటె భయం, భక్తి లేవు మా అమ్మ పేరు చెప్పినా కొనలేదు ఇంక
మధురా తరువాతి పార్ట్ మళ్ళీ ఇంకొక అంత ఉంది ..అది ఇది కలిపి రాస్తే ఇక్కడ నా చేతులు అక్కడ మీ కళ్ళు రెండూ ఢాం అని పడిపోతాయి :)

నేస్తం చెప్పారు...

నాగ ప్రసాద్ ఎందుకని ఎందుకని జాలి పడుతున్నారు హన్నా ...
అన్నట్లు గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ అంటే నిద్రొస్తుందనా అండి
భావన గారు ఠారెత్తి పోవడం అని మెల్లగా అంటారేమిటి ...అబ్బో గొప్ప భయం వేసేసేది
రవిచంద్ర గారు :)
శ్రీ లలిత గారు నిజ్జంగా :)
సన్నీ సరే కానివ్వండి మీరు కామెంటాకే రెండో పోస్ట్ వేస్తా :)

నేస్తం చెప్పారు...

సృజన అంతేనా ..ఈ సారికి క్షమించే వీలుందేమో చూద్దురూ..
మాల గారు థేంక్యూ థెంక్యూ త్వరలో రాయడానికి ట్రై చేసేస్తానుగా :)
మరి సునీత గారు పిలవడం నేను రాకపోవడమా ఎంత మాట :)

asha చెప్పారు...

ఇది మీకు తగదు :(

రమణ చెప్పారు...

రాసిన విధానం బాగుంది.
// ఈ లోపల వాడికో బేచ్ తయారైంది,వాళ్ళ పనేంటయ్యా అంటే మమ్మల్ని జాగ్రత్తగా కాలేజ్ కి దింపి ,అంతే జాగ్రత్త గా ఇంటి వరకు తోడు రావడం //
:) :).

రాధిక చెప్పారు...

అదరగొట్టేసారు నేస్తం.ఇంకో గ్రీటింగ్ ఇమ్మనడం కేక.ఎవరన్నా ఈ సీన్ ని సినిమాలో పెడితే బావుండును.తులసి,నేను ఇలాగే జంట పక్షుల్లా తిరిగేవాళ్ళం.సేం టూ సేం మీ అనుభవాలే మావీను.కొన్నాళ్ళు టెంక్షన్ భరించాకా ఇంక తట్టుకోలేక వాడినే అడిగేద్దామనుకున్నాం నువ్వెవరికి లైనేస్తున్నావని.కానీ బుద్ది మంతులం కదా అడగలేదు.అయినా రోడ్సైడ్ రోమియోలందరూ కూలింగ్ కళ్ళద్దాలు పెట్టుకుంటారెందుకో?కొన్నాళ్ళకి వాడికి బోరు కొట్టినట్టుంది వదిలేసాడు.

ప్రణీత స్వాతి చెప్పారు...

ఇలా సస్పెన్స్ లో పెట్టడం ఏమి బాగోలేదండీ..శేఖర్ గారన్నట్టు సేరియల్స్ లో లాగా సరిగా ఇప్పుడేంజరుగుతుందో అనుకుంటూండగా కట్ చేసేశారు. త్వరగా రాసేయండి మరీ..

బృహఃస్పతి చెప్పారు...

ఎప్పటిలానే ఎక్కడికో తీసుకుపోయారుగా... ఎన్ని పనులున్నా, ఎన్ని రోజుల తరువాత జల్లెడ ఓపెన్ చేసినా, అదేంటో మీ పోస్ట్ మాత్రం మిస్ కాను. దీన్నే అదేంటది యాద్...యాద్... యాదృచ్చికం అంటారనుకుంటా :) లేక అదృష్టమో! ఇహ చచ్చినట్లు మీరు సస్పెన్స్ విప్పేదాకా రోజుకో రెండు సార్లయినా ఇక్కడ పచార్లు చెయ్యాలి.

swapna@kalalaprapancham చెప్పారు...

akka no more suspence. cheppeyochhu kada akka. naku mail ivadaniki matram time undadu blog rayadaniki matram time untund aaa:(
ika ni dosth kachhi.

అశోక్ చౌదరి చెప్పారు...

Oh back vachesara?

you are so lucky.. nenu india velli vachi 2 yrs avutondi..

sorry my machine infected by virus.. cant post in telugu

అజ్ఞాత చెప్పారు...

తరువాతి భాగం ఎప్పుడు????
~C!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ Welcome Back నేస్తం. కథ అదిరింది కానీ ఇలా సస్పెన్స్ లో పెట్టడం మాత్రం ఏమీ బాగోలేదండీ..

మీరు అలాంటి కార్డే ఇంకోటి ఇమ్మన్నపుడు అతని ఫేస్ తలుచుకుంటే నవ్వు ఆగడంలేదండీ

Unknown చెప్పారు...

malli start chesesi nadnuku thanks nestham garu..inko greeting card..ha..ha..ha...bagundi...

నేస్తం చెప్పారు...

భవాని గారు :)
రమణ గారు మరంతే కదండి..అసలు వాళ్ళకంటే వీళ్ళు ఎంత కేర్ తీసు కుంటారనుకున్నారు
రాధిక అబ్బా మీరు మాకులాగే అన్నమాట..ప్రేమకూ ,కూలింగ్ గ్లాసెస్ కి ఏదో అవినాభావ సంబంధం ఉంది మొత్తానికి ..:)
ప్రణితా అయితే మనకి సీరియల్స్ రాసే లక్షణాలు అప్పుడే మొదలిపోయాయన్నమాట ఈ లెక్కన
బృహఃస్పతి గారు నేనూ యాదృచ్చికాన్ని,సృజనాత్మకతను గబుక్కున అనలేను... :)ఈ సారి వైట్ చేయండి మరి..బొత్తిగా సస్పెన్స్ లెక పోతే మజా ఉండదు కదా :)

నేస్తం చెప్పారు...

స్వప్నా నేను ముందే చెప్పాను నన్ను మెయిల్ అయిడి అడక్కమ్మాయ్ నాకు మెయిల్స్ చూడటం గొప్ప బద్దకం అని...విన్నావా :)
అశోక్ గారు ఏం లక్కీ అండీ వెళ్ళిన ఆనందం కంటే వచ్చిన దిగులు ఎక్కువ ఉంటుంది :(
తర్వాతి బాగం చెప్తా గాని ఒక సారి తనని మెయిల్ అయిడి ఇవ్వమని చెప్పవా @C
వేణు గారు నాకు కూడా ఇప్పుడు తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది
కిరణ్ :)

Unknown చెప్పారు...

చాలా బావుంది అండీ, నేను మొదటి సారి మీ బ్లాగ్ చూడటం, చూసిన దగ్గర నుండి ఒక్కటే నవ్వటం, మీ శైలి ఇంచుమించు జంధ్యాల గారి రచనా శైలికి దగ్గరగా ఉందండి, మీ బ్లాగ్ కి ఎంతగా ఫ్యాన్ ఐపోయాను అంటే, నా జీవితం లో ఈ రోజు మొత్తం జాజిపూలు బ్లాగ్ కి అంకితం చేశాను అండీ, ఈ రోజు మధ్యహ్నం ఎందుకో, ఎలా చూసానో మరి గుర్తు లేదు కానీ, మీ బ్లాగ్ చూసాను, అప్పటి నుండి ఇప్పుడు ఈ కామెంట్ రాసే దాక, మీ పాత టపాలు అన్ని (41 ) చదువుతానే కూర్చొన్నాను, మధ్యలో ఒక సారి టీ కి, ఇందాక మెస్ కి మాత్రమే లేచాను, మధ్యలో మా అమ్మతో ఒకసారి మాట్లాడను అంతే, ఒక్క కామెంట్ కూడా మిస్ అవ్వలేదు, మీ చెల్లి వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు , ఎంత శ్రద్దగా చదివారో, అంతకంటే ఎక్కువ శ్రద్దగా చదివాను అండీ, ...., నా లైఫ్ లో , చదివి భీబత్సంగా నవ్వుకున్నది మీ టపాలతోనే, ఇంతకముందు ఏ కార్టూన్ చూసో, పుస్తకం చదివో, ఓ గంట నవ్వుకొని వుంటాను, ఇలా ఒక 12 గంటలు ఏకధాటిగా నవ్వుకోవటం, నిజంగా నా లైఫ్ లో మర్చిపోలేని రోజు అండీ, నాకు తెలిసి నేను జంధ్యాల గారి సినిమాల తరువాత ఇంతగా నవ్వుకున్నది మీ టపాలు తోనే , మీరు ఎప్పుడు ఇలానే రాయాలి అని కోరుకొంటూ -- ఒక భీబత్సమైన అభిమాని.

నీహారిక చెప్పారు...

meeku naaku ee bandham emitandi baabu!!!meeru nenu okesari reentry ichaamu!!

Gulabi చెప్పారు...

abbabba ennallaki reentry icharu nestam....meru rayatledani benga tho nenu kuda na blog lo emi updates pettaledu telusa..e suspense entandi babu..na valla kavatledu..e sari malli parts ga kakunda mottam petteyali :)

నిషిగంధ చెప్పారు...

హమ్మయ్యా వచ్చేశారా! లేకపోతే చూసీ చూసీ ఇంక ఆగలేక నాన్ స్టాప్ బండెక్కి వచ్చేసి మిమ్మల్ని తెల్లారేసరికల్లా తీసుకొచ్చేద్దామనుకున్నాను.. welcome back :-)

టపా అంతా నవ్వుల పువ్వులు చిందులేస్తున్నాయి.. "అమృతం తాగిన అమీర్ ఖాన్ లా" ఇది సూపర్ర్ర్ :)))
చేతుల నొప్పులకి Fair and Lovely లేకపోతే Dove Conditioner రాసేసుకుని తరువాతి భాగం మొదలుపెట్టేయండి :-)

అజ్ఞాత చెప్పారు...

Dhoni is about to lose his first test just because of lack of inexperience ha ha ha this is first martianda style comment in the blog

అజ్ఞాత చెప్పారు...

హమ్మయ్య ! వచ్చేసారా!... మీ గురించి యెదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసి,పళ్ళయ్యి రాలి పోయాయి... త్వరగా 2 వ పార్ట్ కూడ రాసేయండి...

మీ పోస్ట్ గురించి చెప్పేదేముంది?? లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ఉంది.. Adursss...

Rajkumar

Sirisha చెప్పారు...

baboyi ee suspense enti andi...nela rojulu ga okka post kuda rayaledu ani roju tittukunta vasta mee blog ki...ivvala suspense lo pettaru....baboyi naku tension vachestundhi....pls mari late cheyyakandey...pls pls

నేస్తం చెప్పారు...

రాజా గారు నేను కూడా బీభత్సంగా ఆనంద పడిపోయా మీ కామేంటుకి థేంక్యూ :)
నీహారిక గారు కదా .. ఈనాటీ ఈ బంధ మేనాటిదో :)
గులాబి నాకోసం బ్లాగ్ రాయడం మానేసారా ..నా కోసం మానేసారా.. ఈ అభిమానం నేను తట్టుకోలేక పోతున్నా బాబోయ్ :)
నిషి ..Fair and Lovely లేకపోతే Dove Conditioner ఆ :) ఇదన్న మాట మీ కవితలు అంత అందం గా ఉండటానికి రహస్యం ..:)

నేస్తం చెప్పారు...

మొదటి అఙ్ఞాత గారు నాకర్ధం కాలేదు :( ఈ పోస్ట్ కి మీ వ్యాక్యకి కాస్త అర్ధం అయ్యేలా వివరించండి..
రాజ్ కుమార్ త్వరలో రాస్తాను :)
శిరిషా ఏంటి నిజంగా అంత సస్పెన్సులో పెట్టెసానా ..ఒట్టు ??

Unknown చెప్పారు...

enni manchi telugu blogs vunnayo. nenu innellu ajnaatam lo ela batikesaano.
mee blog ee roke choosanu. chaala baaga rastunanru.abhinandanalu.
ikakda telugulo raayadam elago telusukovaali.

ee kadha chaduvutunte naavu aagatledu. office lo kada ani kashtapadi control chesukunna.

pelase tondarga continue cheyyandi.

అజ్ఞాత చెప్పారు...

your friend only got the love letter from geetanjali guy

పవన్ చెప్పారు...

ఈ సారి నాది మొదటి కామెంట్ కాదు :(
అయినా పరువాలేదు.
అక్క మల్లీ రాయటం మొదలుపెట్టింది :)
కానీ ఈ నిజం కథ మధ్యలొ ఆపేసి ఇలా :) ఉన్న మొహన్ని ఇలా !!! చెసేసింది.

మొత్తం మీద కొంచం కామెడి కొంచం సస్పెన్సె తొ భలెఉంది.
మిగతాది కూడా తొందరగా రాయవలసినదిగా మనవి చెసుకుంటున్నాము

అజ్ఞాత చెప్పారు...

500 comments post padindi choosara

కన్నగాడు చెప్పారు...

ఫోటో ఎక్కడిదండి, మీరే వేసారా.
నాకు సస్పెన్స్ అంటే పడిచచ్చేటంత ఇష్టం కానీ ఎప్పుడు విడిపోతుందో తెలిస్తేనే, తొందర్లోనే రాస్తారని......

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు ఎల్లాళ్ళకి కనిపించారు. బాగున్నారా!

మీ అమ్మ నాన్నలను ఏమైనా అంటే.. ముందు నేనే ఒప్పుకోను. వారు అన్ని ఆంక్షలు పెట్టేవారైతే మీరు కాలేజ్ లో అడుగు పెట్టేవారు కాదు. ఆ ఆంక్షలే ఇప్పటి మీ ఆనందానికి కారణం. ఎవరు ఏమన్నా ఇది మాత్రం నిజం.

అప్పట్లో కూడా ఎనిమిది.. తొమ్మొదిల్లోనే ప్రేమకథలు ఉండేవన్నమాట. అఫ్-కోర్స్ మీరు నాకన్నా ఎంత పెద్దో తెలీదనుకోండి. నాకు కూడా తొమ్మిదిలో ఒక కథ ఉందిలెండి. అవన్నీ నా బ్లాగులోనే చెప్తాను.

మీ మిగతా కథ కోసం వెయిటింగ్ ఇక్కడ.

ఇంతకీ మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలు ఐంది. మీ పిల్లల సంగతి ఎప్పుడూ చెప్పరేం..?

చాలా ప్రశ్నలు అడిగాసాను కదా! చాలా రోజుల తరువాత చూసేసరికి ఒకదాని తరువాత ఒకటి... అలా వచ్చేసాయిలెండి.

Ram Krish Reddy Kotla చెప్పారు...

Nice...Waiting for the next part...

నేస్తం చెప్పారు...

పద్మ లేఖిని వాడండి..తెలుగులో వ్రాయచ్చు.
అఙ్ఞాత గారు అంతే అంటారా..చూద్దాం చూద్దాం ఎం జరుగుతుందో
పవన్ అలాగలాగే :)
అఙ్ఞాత గారు 500 కామెంట్స్స్ నాకుతెలియదండి ఆ పోస్ట్ ఏంటో :)
కన్నగాడు గారు నా మీద ఇంత నమ్మకముందా బొమ్మల విషయం లో మీకు :) నాది కాదు ఎవరో పేపర్ తో చేసారంట ..
సవ్వడిగారు అన్ని ప్రశ్నల సమాధానాలు మెల్లి మెల్లిగా ముందు ముందు పోస్టులలో వస్తాయిగా :)
కిషన్ థేంక్యూ

మంచు చెప్పారు...

నాగమణి గారు (మీ పేరు ఇది కాదని తెలుసులెండి.. కానీ చాలమంది ఇదే ఫిక్స్ అయిపొయారుకదా )

అందరికీ " సస్పెన్స్ అంటే పడిచచ్చేటంత ఇష్టం " వుండకపొవచ్చు..:-)) కొంతమందికి పడిచంపెంత ఆత్రుత కూడ వుండొచ్చు.. మర్యాదగా త్వరగా రాయండి... సస్పెన్స్ తట్టుకొలేక నేను నా గొళ్ళు, పక్కసీటోడి గొళ్ళు , కొత్తగా వచ్చిన హె చ్ ఆర్ అమ్మయి గొళ్ళు కూడా తినేసా... ఇంక వెయిట్ చెయ్యలంటే కస్టం ..

Sirisha చెప్పారు...

ottu vesi oka mata ottu veyyakunda oka mata cheppanu nestham garu....pls nakosam regular ga randi

హరే కృష్ణ చెప్పారు...

హమ్మయ్య నేస్తం వచ్చేసారా !
మీకు తారే జమీన్ పర్ సినిమా చూపిస్తే
మాకు అబ్ తక్ చప్పన్ (56 days) చూపిస్తారా హన్నా!!
ఎప్పటిలాగే చాలా బాగా రాసారు నేస్తం