14, అక్టోబర్ 2009, బుధవారం

నేను- మా ఆయన - క్రికెట్టు



లాస్ట్ పోస్ట్లో క్రికెట్ అంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పాను కదా...మా పెద్ద అక్క అంటూ ఉండేది ..అమ్మాయిలు పుట్టింట్లో ఏది ఇష్ట పడరో అత్తింట్లో అదే మనకు ఎదురవుతుంది అని ..అంత పవర్ ఫుల్ మాటలను ఆ రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదు:( మా ఆయన తనకి క్రికెట్ ఇష్టమంటే కాసింత భయపడినా పోనీలే యే 4 ,5 నెలలకోమారు ఆడేదానికి గొడవచేయడం ఎందుకులే అని మొదట్లో ఊరుకున్నాను.. కానీ నాకేం తెలుసు మా ఆయన వారానికి 2 సార్లు గ్రౌండ్ కి పారిపోతారని..శనివారం లీగ్ మేచ్ లని,ఆదివారం ఫ్రెండ్లీలని ఏంటో, ఏంటో అని పారిపోతారు..ఒక వేళ యే వారమన్నా మేచ్ లేదంటే, ప్రాక్టిస్ అనో ,ఆఖరికి ఎంపైరింగ్ చాన్స్ కూడా వదలరు.. భర్త క్రికెట్ కి వెళుతుంటే దేవుడా, దేవుడా ఈ రోజు వర్షం వచ్చేలా చేయవా అని కోరుకునే భార్యామణిని నేనే అనుకుంటా ..మా ఆయనకు క్రికెట్ అంటే ఇష్టం కాదు బాబోయ్ ప్రాణం..

నా కష్టాలన్నీ ఎలా మొదలు పెట్టి, ఏమని రాయాలో కూడా తెలియడం లేదు.. వచ్చిన క్రొత్తలో మా ఆయన ఎంతో ప్రేమగా, నా క్రికెట్ బట్టలన్నీ మురికిగా అయిపోయాయి కాస్త ఉతకవా , నాకు సరిగా ఉతకడం రాదుకదా అని జాలిగా అనేసరికి ,హృదయం ద్రవించిపోయి ..మై హూన్ నా డియర్, నేను మీ భార్యను,ఇది నా భాద్యత అని ఎక్స్ ట్రా లు చేసి ఆ బట్టలను బ్లీచ్ నీళ్ళలో ముంచి, సర్ఫ్ లో నాన బెట్టి చేతులు పడిపోయేలా బ్రష్ కొట్టి తెల్లగా మల్లెపూవులా ఉతికి ఇస్తే, రాత్రికి నూనెలో ఊరబేట్టిన ఊరగాయలా బురదలో ముంచి తెచ్చి ఇచ్చేవారు ..ఇదేంటండీ అని గట్టిగా అడిగితే మరి క్రికెట్ అంటే కేరం బోర్డ్ అనుకున్నావా షర్ట్ నలగకుండా వచ్చేయడానికి అని తిరిగి నన్నే అనేవారు..దెబ్బకు నాలో ఉన్న సతీ సావిత్రీ ని ప్రక్కన కూర్చోపెట్టి, నావల్ల కాదు నాయనా అని వాషింగ్ మిషన్ లో వేసేసేయడం మొదలు పెట్టాను..

అసలు క్రికెట్ మేచ్ ఉంది అంటే ఎంత హడావుడి పడతారంటే ,నాలుగు రోజులముందు నుండే వెదర్ రిపోర్ట్ చూడటం మొదలు పెడతారు..ఒక వేళ వాడు వర్షం వచ్చే సూచనలున్నాయి అంటే చూడాలి అయ్యగారి టెన్షన్ ..అదొక్కటేనా ,రేపు మేచ్ అనగానే ఈ రోజు రాత్రే క్రికెట్ కిట్ సర్దేసుకున్నా ,తెల్లారు జామున 5 గంటలకు లేచి మళ్లీ మొదలు పెడతారు సర్దుడు.. ఆ ముందు రోజు రాత్రి నుండే 'టీం 'లో ఎవరినీ ప్రశాంతం గా ఉండనివ్వరు.. సార్.. రేపు ఇన్నిగంటలకు మీరు బయలు దేరాలి గుర్తుందా అని వాళ్ళకి ఒకటే ఫోన్లు..తెల్లారిందంటే అందరికీ అలారం పీస్లా కాల్ చేసి నిద్రలేచారా ,రెడీ అయ్యారా అంటూ మేలుకొలుపులు ...అబ్బబ్బబ్బా ఒక్క గోలకాదు..మీరాడే తొక్కలో క్రికెట్కి ఇంత బిల్డప్పులు అవసరమా అంటే అనవే అను నెక్స్ట్ మంత్ జయసూర్యా వస్తున్నాడు అతనికి నేనే బౌలింగ్ వేస్తా అప్పుడు నువ్వే తెలుసుకుంటావ్ అని ఉడికిపోయేవారు .. గాడిదగ్రుడ్డు వాడెవడో వస్తే నాకేంటి అని తిరిగి తిట్టేదాన్ని..

ఒకసారి మేచ్ లేదు ఇంట్లోనే ఉన్నారు ..మద్యాహ్నం అవ్వగానే బుజ్జీ, ఏంటో ఈ రొజు కాస్త నీరసం గా ఉన్నట్లు కనబడతున్నావ్.. పోని ముస్తఫా వెళ్ళి నేను కూరలు తీసుకురానా ??నువ్వు రెస్ట్ తీసుకో అని అనేసరికి కరిగి కన్నీరయిపోయాను..పాపిష్టిదాన్ని ,ఏదో కాస్త సర్దాపడి క్రికెట్ కి వెళితే ఎన్నేన్ని మాటలనేదాన్ని అని నన్ను తిట్టేసుకుని, మరీ ఎక్కువ తీసుకురాకండి మోయలేరు ,ఏం తెచ్చినా తేవకపోయినా ఉల్లిపాయలు,టమోటాలు 1 కిలో తేవడం మరువకండే అని ప్రేమగా పంపించాను ..వెళ్ళిన మనిషి సాయంత్ర 6 అయినా రారే??..పోని ఫోన్ చేస్తే అది మెసేజ్ కి వెళ్ళిపోతుంది..ఈ లోపల ఆయన ఫ్రెండ్ భార్య నుండి ఫోన్ ..ఏమండీ ,మావారు ఫోన్ చేస్తె లిఫ్ట్ చేయడం లేదు ..మీవారికి మీరు 'కాల్' చేసి ఆయనకు 'కాల్' చేయమని చెప్పరా అని... ఈ రోజు మావారి కి మేచ్ లేదండి అన్నాను గర్వంగా ..తెలుసు అండి కాని మావారు ఆడుతున్న మేచ్ చూడడానికి వెళ్ళారుగా మా ఆయనతో కలిసి అంది ఆమె ..హార్నీ, ఎంత మోసం అనుకుని నేను కారాలు ,మిరియాలు ఒక గంట మెత్తగా నూరాకా ..అబ్బబ్బా ఎంత ట్రాఫిక్ అనుకున్నావే బాబు ...మధ్యలో నేను ఎక్కిన బస్ 2 గంటలు ఆగిపోయింది తెలుసా అన్నారు..ఎక్కడా ??మీ ఫ్రెండ్ ఆడుతున్న స్పోర్ట్స్ క్లబ్ దగ్గరేనా అన్నాను కోపంగా.. హి..హి దార్లోనే కదా అని అటువెళ్ళాను.. ఆ రెండు టీంలు మంచి టీంలు అందుకని ..,కానీ బుజ్జీ నీకు రెండు వారాలు సరిపడా కూరలు తెచ్చేసా అన్నారు.. నిజంగానే ఆయన చేతిలో పెద్ద పెద్ద బేగ్లు ..

సరే అని చూద్దును కదా 3 పెద్ద పెద్ద కట్టల తోటకూరా,3 కట్టల మునగాకు ,3 కట్టల పుదీనా..3 కట్టల పొన్నగంటి ఆకు,3 కట్టల గోంగూరా, 3 కట్టల కొత్తిమీర ,3 కట్టల పాల కూర.. ఏంటండీ ఇది ,నేనేమన్నా మేకను అనుకున్నారా ఇన్ని ఆకులు తెచ్చారు అన్నాను తెల్లబోతూ ...అంటే ఈ మద్య నీరసం అంటున్నావ్ కదే ,నీకు ఐరన్ బాగా పడుతుందనీ అని నసిగారు.. నేను సీరియస్ గా చూసేసరికి చిన్నగా నవ్వి మేచ్ టైము అయిపోతుంటే చేతికందింది కొనేసా ,నిజం చెప్పేసా కదా ఇంకలా చూడకు అన్నారు..భగవంతుడా అనుకుని పోనీ ఉల్లిపాయలు,టమాటాలు తెచ్చారా?? అన్నాను..ఉల్లిపాయలు మర్చిపోయా కాని టమోటాలు తెచ్చాను అన్నారు.సంతోషం, ఏవి ఇలా ఇవ్వండి అన్నాను ..2 బుల్లి టమాటాలు చేతిలో పెట్టారు ..ఇదేంటీ?? కిలో తెమ్మాన్నా కదా అన్నాను అయోమయంగా.. అవి కిలో ఉండవా బుజ్జి అన్నారు అమాయకంగా చూస్తూ ...మహానుభావా.. ఒక్కసారి మీ అమ్మగారిని తీసుకొస్తే పాదాభివందనం చేసుకుంటాను అన్నాను .. అన్నిటికి మద్యలో మా అమ్మను లాగుతావే అనుకుంటూ వెళ్ళిపోయారు.. క్రికెట్ పేరు చెపితే చాలు మా ఆయనకు అసలేం గుర్తుండదన్నమాట.

పోనీ ఆయనగారు ఆడే మేచ్ లు ప్రక్కన పెడితే ఇంట్లో అన్నా ప్రశాంతంగా ఉండనిస్తారా అంటే అదీ లేదు..ఈ.ఎస్.పి.ఎన్ ,స్టార్ స్ఫోర్ట్స్ చానెల్స్ ని ముందేసుకుని కూర్చుంటారు..ఆ చానెల్ వాళ్ళకు అంతకన్నా పనీ పాటా ఉండదు,ఎప్పుడో 25 యేళ్ళనాటి మేచ్ లను మళ్ళీ పది సార్లు త్రిప్పి, త్రిప్పి వేస్తుంటారు.. పోని చూసి వదిలేస్తారా ..ఈ బాల్ తర్వాత బాల్ చూడు బుజ్జీ భలే క్రాస్ అయ్యి వికెట్ కి తగులుతుంది.. నెక్స్ట్ ఓవెర్ లో వీడు సిక్స్ కొడతాడు అని అంటుంటే మీరు చెప్పండి తిక్క నషాళానికి అంటుందా లేదా..

ఒక రోజు ఎంతో విచారంగా అంతా బ్రాంతియేనా ,జీవితానా వెలుగింతేనా అని పాడుకుందామని మొదలు పెట్టాబోయేంతలో, నా అంతరాత్మ డింగుమని వచ్చి ఎంత సేపూ మీ ఆయన్ని తిట్టేబదులు, అచ్చిక బుచ్చికలాడి నీ వైపు మార్చుకోవచ్చు కదా,అసలు తప్పంతా నీదే, నీదే, నీదే అని నాలుగు వైపులా రౌండులు తిరిగి మరి వాయించేసింది ..ఛీ,ఛీ చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మరీ ఎక్కువగా చూడటం తప్పైపోయింది అని తిట్టుకున్నా ..ఇదీ పోయింటే కదా ఓ సారి ట్రై చేద్దాం అనుకున్నా..

ఓ రోజు మా ఆయన ఇంటికి రాగానే ,హడావుడిగా టి.వి పెట్టి, నిన్న రాత్రి తెల్లార్లూ జాగారం చేసి చూసిన..మనోళ్ళు ఓడిపోయిన మేచ్ ను ప్రొద్దున్న రెండుసార్లు హైలెట్స్ చూసి, ఆఫిస్ కి వెళ్ళాకా అడ్డమైన పేపర్లలో మళ్ళీ చదివీ ,ముచ్చటగా మూడో సారి చూస్తుండగా...నేను ఎంతో ఆహ్లాదంగా నవ్వుతూ ప్రక్కన కూర్చుని.. ఏమండీ !ప్రొద్దు గూకింది..పక్షులు ఇళ్ళకు చేరే వేళయ్యింది..మనం ఎంచక్కా ఆ ఎదురుగా ఉన్న పార్కులో బెంచ్ మీద కూర్చుని , ప్రక్కనే ఉన్న సెంటుమల్లి చెట్టు నుండి వచ్చే పరిమళాలను పీలుస్తూ ,పైన చందమామను చూస్తూ ,పక్షుల కిల ,కిల రావాలను వింటూ కబుర్లు చెప్పుకుందామా అన్నాను గొముగా.. ఏమనీ,చిన్నపుడు మీ ఎదురింటమ్మాయి 20 చుక్కల ముగ్గువేస్తే నువ్వు ఆవిడకు దీటుగా 30 చుక్కల ముగ్గు ఎలా వేసావో ,మీ అక్క పెళ్ళి అయి వెళుతుంటే మీ నాన్న ,నువ్వు గోలు గోలు మని ఎలా ఏడ్చారో 108 సారి చెప్తావ్ అంతే కదా.. ఆ సుత్తి కోసం అన్ని సెటప్పులవసరం అంటావా ??.. కావాలంటే ఫ్రిజ్ పైన ఉన్న జాస్మిన్ రూం ఫ్రెష్ నర్ స్ప్రే చేసి ,ఆ సీలింగ్ లైట్ నే చందమామ అనుకుని ఇక్కడే చెప్పు అన్నారు టి.వీ పైనించి కళ్ళు త్రిప్పకుండా ..అప్పుడే నాకొక డవుటొచ్చింది.. తెలిసినవారు చెప్పండి..పెళ్ళాం,బిడ్డలని పట్టించుకోకుండా ఇంట్లో వదిలేసి ఇలా క్రికెట్కి,టీ.విలకు అతుక్కునిపోయి హింసించేవాళ్ల పై గృహహింస చట్టం క్రింద కేసు వేసే వీలుందా..???

ఇలా మా కాపురం కొంచెం ఇష్టం,కొంచెం కష్టం గా జరిగిపోతున్న సమయంలో ఒక రోజు నేను తీవ్రంగా అలిగి కూర్చున్న వేళ, మా ఆయన రాజీ కొచ్చారు..తప్పు ,తప్పు నన్ను రాజీ పడేలా చేసారు.. అసలు మగవాళ్ళలో ఉన్న గొప్పతనం అదే, తగ్గుతున్నట్లు నటిస్తూ తొక్కేస్తారు.. సరే కధలో కొచ్చేస్తే ..అదికాదు బుజ్జీ నీతో ఇదే చిక్కు ,ఎంత సేపూ నీకన్యాయం జరిగిపోతుంది అని ఆలోచిస్తావ్ కానీ ,ఎలా ఆనందం గా ఉండాలని ఆలోచించవు..ఇప్పుడు నన్ను క్రికెట్ కి వెళ్ళ కుండా ఆపలేవు,పోనీ నువ్వు రావచ్చుకదా నాతో .. అప్పుడు యేం గొడవా రాదు ఎప్పుడూ నా దగ్గరే ఉంటావ్ ,మా ఫ్రెండ్స్ భార్యలు లందరూ వస్తారు ..పైగా ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తారో తెలుసా ..తొక్కలోది ఒక్క రన్ తీస్తేనే చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ హజ్బెండ్ని,కానీ నువ్వేమో రావు అన్నారు.. పైకి నేను రాను,నా కిష్టం ఉండదు అని కాసేపు తగవులాడినా,మనసులో .. పోని ఇంట్లో ఇలా తిట్టుకుంటు కూర్చుని చేసేదేముంది కనీసం కళ్ళముందు అయినా ఉంటారని సరే అన్నాను ..

ఇంట్లో సోఫా ప్రక్కన టేబుల్ పై మంచి నీళ్ళ బాటిల్ ఉంటే ,దాన్ని తీసుకోవడానికి బద్దకం వేసి నన్ను పిలిచి మరీ మంచినీళ్ళు తెప్పించుకునే మా ఆయన ,రెండు బస్తాల్లాంటి క్రికెట్ కిట్లను రెండు చేతులకు తగిలించుకుని మరీ కేబ్ కోసం పరిగెడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు నాకు.. సరే ,వస్తా అని మాటిచ్చాను కాబట్టి ఆయనతో బయలు దేరాను..కేబ్ దిగి రోడ్ కి అవతల వైపు ఉన్న క్రికెట్ గ్రౌండ్ చూస్తూ బ్రిడ్జ్ ఎక్కుతుంటే .. నాకు ఈ బ్రిడ్జ్ ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా ..అక్కడ గ్రౌండ్ చూస్తే నా మనసాగదు, ఇప్పుడు ఇదంతా దాటాలా అనిపిస్తుంది ..ఇలా మాయమై అలా అక్కడకు చేరిపోవాలని ఉంటుంది అన్నారు.. ఒక్క రోజన్నా నా గురించి ఇలా అన్నారా ??..పైగా ఏమన్నా అంటే నీ మీద ప్రేమ మనసులో ఉంటుంది.. సినిమా డయిలాగులు చెప్తేనే ప్రేమనుకుంటావ్ నువ్వు అని తిరిగి నన్నే తిడతారు ..ఏంటో ఈ మగవాళ్ళు ..ఈ జన్మకు అర్ధం కారు తిట్టుకుంటూ క్రికెట్ క్లబ్ కి చేరుకున్నాం..అలా క్లబ్ లో అడుగుపెట్టామో లేదో ,మా ఆయన నన్ను ఒక టేబుల్ దగ్గర కూర్చో పెట్టి ..ఇదిగో ఇక్కడి నుండి చూస్తే బాగా కనబడుతుంది.. అందరినీ పరిచయం చేసుకో ..మొద్దులా కూర్చోకు.. ఏం కావాలంటే అది తెప్పించుకో అని నా మాట కూడా వినకుండా ఫ్రెండ్స్ మద్యలోకి పారిపోయారు ...

ఓ మారు చుట్టూరా చూసాను.. అక్కడక్కడా ఫారినర్స్ ,చాలా మంది నార్త్ ఇండియన్స్ .. స్లీవ్లెస్ డ్రేస్లతో ,రీ బౌండింగ్ హెయిర్లతో ..చక్కగా ఒక బీరో ,వైనో త్రాగుతూ కిల ,కిలా కబుర్లు చెప్పేసుకుంటున్నారు..మన అవతారం చూసుకున్నాం.. చక్కగా బిగించిన జడ తో, తిలకం బొట్టు తో( ఇది మా నాన్న ఆర్డర్ ..పెళ్ళయిన అమ్మాయిలు స్టిక్కర్లు పెట్టకూడదంట ) ఆ క్రింద కొంచెం కుంకుమ బొట్టుతో ( ఇది మా అత్తగారి ఆర్డర్) పట్టీలు కూడా మిస్ అవ్వకుండా అప్పుడే ఎర్ర ప్లయిట్ దిగి వచ్చిన అచ్చమైన అప్పలమ్మలా ఉన్న నేను సహజంగానే నచ్చలేదు వాళ్ళకు.దాంతో పలకరిస్తే ఒక నవ్వు పడేసి (కొందరు అది కూడాలేదు) మొహాలు తిప్పేసుకున్నారు ..మనకసలే పావుగంట కంటే మౌనంగా ఉండటం అలవాటులేదాయే.. అలా తిరునాళ్ళలో తప్పి పోయిన పిల్లలా దిక్కులు చూస్తుంటే ,ఎవరో తెలుగులో మాట్లాడుతున్న ముక్కలు విని ప్రాణం లేచొచ్చినట్లు అనిపించి ఆమె ప్రక్కన చేరిపోయాను..

సరే, పలకరింపులయ్యాకా ,మీరు కెప్టన్ గారి వైఫా మరి చెప్పరే నేను ఫలానా అతని వైపుని ..మీ వారు చాలా బాగా ఆడతారు అన్నాది..ఆహా అన్నాను.. పాపం వాళ్ళయనను నేనూ పొగుడుతా అనుకుని కాసేపు చూసింది కాని మనకసలు ఎవరి పేరూ తెలియదు కాబట్టి ఊరుకున్నా..కాసేపు ఆగి మావారు ఆల్రౌండరే ,మొన్న 3 వికెట్లు తీసి 20 రన్లు చేసారు..'మేన్ ఆఫ్ ది మేచ్ 'ఆయనకే వచ్చింది మీవారు చెప్పలేదా అంది.. నాకు క్రికెట్ అంత గా ఇష్టం ఉండదు లెండి.. ఇంట్లో అంతగా మాట్లాడుకోము దాని గురించి అన్నాను..తను అలా క్రికెట్ విషయాలు తప్ప ఇంకొకటి మాట్లాడక పోవడం నాకు నచ్చలేదు.. నాకైతే క్రికెట్ పిచ్చి ,అయ్ లవ్ క్రికెట్ అంది తన్మయత్వంగా కళ్ళు మూసుకుని..నాకెక్కడ దొరికావే బాబు నువ్వు తిట్టుకున్నాను విసుగ్గా..ఆమె మద్య మద్యలో 'ఫోర్'..' సిక్స్' అని గట్టిగా అరిచి చప్పట్లు కొడుతూ మీకు తెలుసా ప్రతి వీక్ మేచ్ ఆడమని మావారిని అడుగుతా కాని ,ఆయన ఆడరు.. మహా లేజీ మా వారు అంది ముద్దు,ముద్దు గా విసుక్కుంటూ.. ఇదేంటబ్బా ఈ అమ్మాయికి లేస మాత్రం బాధలేదు ఒక వేళ తప్పు నాదేనా?? నేనే ఎక్కువగా ఆలోచించి బంగారం లాంటి మా ఆయన్ని బాధ పెట్టేస్తున్నానా??? లాంటి ఆలోచనలు వచ్చేసాయి అరనిమిషంలో ..

మీరేంటీ అసలు చప్పట్లు కొట్టడంలేదు ..కమాన్ మనం ఎంకరేజ్ చెస్తేనే వాళ్ళు బాగా ఆడతారు అంది .. మరీ,మరీ మీకు బాధ అనిపించదా మీవారితో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతారని అన్నాను ఆరాగా ...బాధ ఎందుకు మేచ్ అయిపోయిన వెంటనే మా ఆయన నన్ను షాపింగుకి తీసుకు వెళతారుగా ..అది మా ఇద్దరిమద్యా ఒప్పందం అంది 'కమాన్.. సిక్స్ మారో 'అంటూ అరుస్తూ .. ఓసినీ !!ఇదా సంగతి ..నాకా దిక్కుమాలిన షాపింగ్ అలవాటు లేదే.. పైగా ఆయనగారు కొన్నా, వద్దులేద్దురు ఇప్పుడేం అవసరం అంటూ వెనక్కులాగుతా.. పుట్టుకతో వచ్చిన బుద్ది .. మనసులో తిట్టుకుంటూ చప్పట్లు కొట్టాను.. అదేంటీ ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు అంది నావైపు విచిత్రంగా చూస్తూ..ఎంకరేజ్ చేద్దామని అన్నాను..అవుటయ్యింది మీ ఆయనే అంది నెమ్మదిగా... గొడవ వదిలిపోయింది మనసులో తిట్టుకుని హి..హి అని ఒక నవ్వు విసిరాను ..

కానీ ఆ రోజు మేచ్ అయిపోయినా ఎంతకీ రారు..అంతకీ రారు నా దగ్గరకు.. ఫ్రెష్ అవ్వాలని డ్రెస్సింగ్ రూం లో ఒక గంట ,ఎందుకు ఓడిపోయారో సుత్తికొట్టుకుంటూ 2 గంటలు..నీది తప్పని కాదు నీవల్లే ఓడిపోయాం అని ఒకరినొకరు తిట్టుకుంటూ ఒక 2 గంటలు... విసుగొచ్చి బాబూ , మళ్ళీ ఇంకోసారి వస్తే పాత చెప్పు తీసుకుని కొట్టండి అని తిట్టి ఇంటికివచ్చేసాము ..అబ్బే, ఆ రోజు మేచ్ ఫలానా వాడివల్ల ఓడిపోయాం అందుకే లేట్ అయింది అని ఎంత చెప్పినా తరువాత నేను వెళ్ళలేదు..ఆ తరువాతా వాళ్ళ 'టీం' లో చాలా మంది తెలుగువాళ్ళు పరిచయం అయ్యారు..

ఒకరోజు ఒక ఫ్రెండ్ వైఫ్ తో ఫోన్ లోమాట్లాడుతుంటుంటే, మాటల మధ్యలో క్రికెట్ గురించి వచ్చి.. అబ్బా ఏం క్రికెట్టోనండి బాబు ప్రొద్దున వెళ్ళిన మనుషులు రాత్రివరకూ రారు.. పైగా ఇంటర్ నేష్నల్ మేచ్లా ఫ్లెడ్ లైట్స్ వెలుగులో కూడా ఆడతారంట అన్నాను .. ఏంటీ, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసారా అన్ని అబద్దాలే నమ్మకండి అంది..కాదులెద్దూ చాలా సార్లు మా ఆయన ఫీల్డింగ్లో ఉండగా ఫోన్ చేసాను ..మేచ్ నైట్ 7 వరకూ జరుగుతుంది అన్నాను .. ప్లిచ్ ,మీరింకా ఎదగాలండీ బాబు...అసలు వీళ్ళు ఫీల్డింగ్ చేసినపుడు ఫోన్ లిఫ్ట్ చేయడం ఒకటి ..మీలాగే మొదట్లో మేమూ అమాయకం గా నమ్మేసాం.. ఒకసారి సర్ ప్రైజ్ చేద్దామని నేను, ఇంకో ఫ్రెండ్ గ్రౌండ్ కి వెళ్ళి చూస్తే అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు ..ఇంట్లో మేచ్ ఇంకా అవ్వలేదని చెప్పి ఇదా మీరుచేసే పని అని చెట్టు చాటున నించుని మా ఆయనకు ఫోన్ చేసాం.. వెంటనే మా ఆయన అరే ..ఫీల్డింగ్ లో ఉన్నాను అని ఒకటే జీవించేస్తున్నారు... మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనైతే బాత్రూం లో ఉండగానే అరే మేచ్ మాంచి సస్పెన్స్లో ఉంది డిస్టర్బ్ చేయకూ అని తలుపు తీసి మమ్మల్ని చూసి కంగారు పడిపోయారు అంది.. నాకు డవుటొచ్చి ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తా అని ..మా ఆయనకు ఫోన్ చేసాను.. అబ్బా ,ఫోన్ పెట్టేసేయ్ బంతి గాల్లో ఉంది కేచ్ చేయాలి మా ఆయన అటు ఫోన్ ఆఫ్ చేసేసారు ...

56 కామెంట్‌లు:

చైతన్య.ఎస్ చెప్పారు...

హ హ్హ

నిజంగా నిజం ఎంటంటే అబ్బ చెప్తే తెలీదండి మీరు క్రికెట్ ఫాలో అయిపోండి అంతే :)

అజ్ఞాత చెప్పారు...

"అబ్బా ,ఫోన్ పెట్టేసేయ్ బంతి గాల్లో ఉంది కేచ్ చేయాలి "
Idi sooper andi...
Eppatilagaane chaala baagundi...(hey hey first comment naade.)


rajkumar

manohar చెప్పారు...

ha ha baley raasarandi!!! as ususal
manager lu tidathaamanna chadhivesa :p!!!

nestam akka, meeru movies ki script raayandi...keka!!! bommarillu range lo hit ayipotundhanthey!!!

సృజన చెప్పారు...

నవ్వాపుకునేలోపు ముగ్గురు కామెంట్స్ పెట్టేసారు.....భలే భలే:):)

Sundeep Borra చెప్పారు...

చాలా బాగుందండి, మొదటి బ్లాగ్ నుంచి ఈ బ్లాగ్ వరకు, అన్నీ కేకలే. ఎర్ర ఫ్లైట్, తిరణాలలో తప్పిపోయిన పిల్లలా, అన్నీ చాలా బాగున్నై, తెలుగు పుస్తకాలూ దగ్గర లేవే, ఆంధ్ర లో లేనే అన్న బాధే లేదు.

Unknown చెప్పారు...

బాగున్నాయి మీ వారి క్రికెట్ కబుర్లు. Final కౌంటర్ అదిరి పొయింది

బ్లాగాగ్ని చెప్పారు...

భలే రాసారండీ. క్రితం టపాని మించి నవ్వించింది, కొసమెరుపు హైలైట్. క్రికెట్ పై మీ ఆక్రోశం సబబేనని ఒప్పేసుకున్నాం, టపాకి టోపీలు తీసేసాం :)

శ్రీనివాస్ చెప్పారు...

:)

Shashank చెప్పారు...

భలే భలే.. అయినా ఒక్కోసారు బయటకి వెళ్తే ఎప్పుడు వస్తమో మాకే తెలీదు.. దానికి పెతీ పది నిమిషాలకి ఎప్పుడొస్తావ్ ఎప్పుడొస్తావ్ అంటే? ఇలానే ఉంటది.. బంతి గాల్లో ఎగిరినట్టు.. అనుకోకుండా ఉన్నచోట కుంబవృష్టి పడినట్టు... వేలువిడిచిన ఫ్రెండ్ తగిలినట్టు... అర్థం చేసుకోవాలమ్మ.

ఔనూ నాకో డౌట్.. - ఈ పోస్ట్ లో క్రికెట్ ని ఏమీ అనలేదు కద! "ఎవరు" ఎలా రియాక్ట్ ఔతారో అని కొంచం జంకారా ? :p లేక క్రికెట్ యొక్క మహత్యం గురించి మీకు జ్ఞాయోదయం అయ్యిందా? ఏదీ ఏమైనా మీ వారికి మా తరఫున మ్యాచుల్లో గుడ్ లక్ అని చెప్పండి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

భలే రాసారు నేస్తం...:)
కొన్ని కొన్ని వాక్యాలు కేక పెట్టించే విధంగా ఉన్నాయండీ..
టపాల్లో డైలాగ్స్ ని డబల్ కొటేషన్లలో పెడితే టపా ఇంకా బాగా ప్రెజెంట్ అవుతుందేమో ఆలోచించండి!!...

Srividya చెప్పారు...

Really beautiful :)
అదిరి పొయింది

Ruth చెప్పారు...

నేస్తం గారు, సూపర్ అండి !!!
లాస్ట్ లైన్ సూపర్ డూపర్ !!!

బృహఃస్పతి చెప్పారు...

అదుర్స్... తోటరాముడు లేని లోటు తీర్చారు. ఫస్ట్ పార్ట్ ని మించి ఉంది... :)

జయ చెప్పారు...

Wow! wonderful conclusion. really, fantastic.

నేస్తం చెప్పారు...

చైతన్య గారు పైన చెప్పిన గోడు అంతా విని కూడా ఆ మాట ఎలా అనగలిగారు..లాభం లేదు మళ్ళీ ఫస్ట్ నుండి చదవాల్సిందే మీరు :)
రాజ్ కుమార్ గారు కాదు కదా ఆల్రెడీ చైతన్య గారు కామెంటేసారు ..థేంక్స్ పోస్ట్ నచ్చినందుకు :)
మనోహర్ సినిమాలకు రాయడమే ..నాకంత సీన్ ఉందంటారా :)
సృజన మరి మీరు కాసేపు నవ్వేరు నాక్కూడా హేపీ :)

నేస్తం చెప్పారు...

సందీప్ మీ అభిమానానికి చాలా దేంక్స్ :)
క్రిష్ణ గారు మీక్కూడా ధన్యవాధాలు
బ్లాగాగ్ని గారు మరి మొన్నే చెప్పాను కదా ఒప్పుకుని తీరుతారని :)
శ్రీనివాస్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు :)

నేస్తం చెప్పారు...

>>> అయినా ఒక్కోసారు బయటకి వెళ్తే ఎప్పుడు వస్తమో మాకే తెలీదు.. దానికి పెతీ పది నిమిషాలకి ఎప్పుడొస్తావ్ ఎప్పుడొస్తావ్ అంటే? ఇలానే ఉంటది.. బంతి గాల్లో ఎగిరినట్టు.. అనుకోకుండా ఉన్నచోట కుంబవృష్టి పడినట్టు... వేలువిడిచిన ఫ్రెండ్ తగిలినట్టు... అర్థం చేసుకోవాలమ్మ.
బాబోయ్ బాబోయ్ ఈ క్రికెట్ పిచ్చోళ్ళకు అస్సలు చెప్పలేం ..మా ఆయన కూడా నిలదీస్తే ఇలాగే అంటారు.. ఇంక నేను ఈ పోస్ట్ లో మా ఆయన్ని తిట్టినవన్నీ , దానికి కారణమైన క్రికెట్ని ఉద్దేసించే ..
శేఖర్ బాగానే ఉంటుంది గాని ఎక్కడ కొటేషన్లు పెట్టాలో తెలియక వదిలేసా అన్నమాట.. అంత తెలివుంటే ఇంకేం ..
శ్రీవిద్య గారు మరి మీరెప్పుడు రాస్తారు మీ అభిమానులం ఎదురుచూస్తున్నాం ఇక్కడ :)

నేస్తం చెప్పారు...

ruth థేంక్స్ ..మా ఆయన అలాగే అంటారండీ బాబు నిజం ..
బృహఃస్పతి గారు అమ్మో తోట రాముడిగారితో పోలికే ..చాలా థేంక్స్ :)
జయ థేంక్స్

మంచు చెప్పారు...

అయ్యబాబొయ్ ఆ పొస్ట్ ... కేక అంటే తక్కువ. పొలికేక అనాలి ..
నేను చెప్పినట్టు.. సెకండ్ హాఫ్ ఫర్స్ట్ హాఫ్ ని మించి వుంది.

asha చెప్పారు...

మా ల్యాబ్‌లో ఉన్నాననే జ్ఞానం లేకుండా గట్టిగా నవ్వేసానండి మీ పోస్ట్ చదివి. ఇంకెప్పుడూ ఇలాంటి ప్లేసుల్లో మీ బ్లాగు తెరవకూడదనే నిర్ణయానికి వచ్చాను. చాలా బాగా వ్రాశారు.

sunita చెప్పారు...

చాలా చాలా బాగుంది. ఆఖరి పేరా సూపర్. మొన్న వసుంధర లో మీ బ్లాగు పేరు లేక పోవటం ఎంత మాత్రం ఒప్పుకునే విషయం కాదు. ఇంచు మించు ప్రతి టపా "హిట్టే" దాదాపు అందరూ చదివే కొద్ది బ్లాగుల్లో మీది ఒకటో ప్లేసులోనో, రెండో ప్లేసులోనో ఉంటుంది అని నా అంచనా!

Anil Dasari చెప్పారు...

@నేస్తము:

నిఝానికి మీకు క్రిహెట్టంటే య్హమా ఇష్ఠం అని నాకిప్పుడిప్పుడే నమ్మకం మొదలవుతుంది.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఫోటో కేక నేస్తం గారు. టపా పొలికేక :-) నిన్న ఆఫీసు లో చదువుదాం అనుకుని మళ్ళీ ఎందుకొచ్చింది లే పెద్దగా నవ్వేస్తే జనాలు అనుమానిస్తారు అని కంట్రోల్ చేసుకుని, ఇంట్లో చదివాను.

ముగింపు మాత్రం అదిరింది :-) ఎంత నవ్వుకున్నా మీకు మాత్రం నా సానుభూతి, బేషరతు మద్దతు ప్రకటిస్తున్నాను :-) అన్నట్లు గృహహింస చట్టాల సవరణ కోసం ఉద్యమం చేపట్టే ఆలోచనేమన్నా ఉందా :-)

నేస్తం చెప్పారు...

మంచు పల్లకి గారు "పొలి కేక" వర్డ్ బాగుందండొయ్ :)
భవాని గారు హ హ :) థేంక్స్ .
సునీత గారు వసుందరలో పేరు పడినా ఎంతమంది పట్టించుకుంటారో తెలియదు మీలాంటివారు ఇలా నా పోస్ట్ లో మెచ్చుకుంటేనే ఎక్కువ సంతోషం నాకు .
అబ్రకదబ్ర గారు ఎందుకలాగా?? :/
వేణు గారు ఆలోచనైతే ఉంది స్టార్ట్ చేసినపుడు తప్పకుండా మీ మద్దతు తీసుకుంటాను :)

manohar చెప్పారు...

Meeku vachey comments...blog hits chaalakka...meeru raasey style entha baavundho cheppadaaniki....
:) chance vasthey iragateeseyandi...emi aalochinchakundaa raaseyandi!!!!!!!
anthey!!!

మా ఊరు చెప్పారు...

మీరు క్రికెట్ మీద బాగా పగ పెంచుకున్నట్టున్నారండి.
మీ వారి క్రికెట్ పిచ్చి ని ఇలా బ్లాగుకీడుస్తున్నారు.
సాటి క్రికెట్ అభిమాని గా మీ అయన తరపున ధర్నా చేస్తా.
మీ దౌర్జన్యం నశించాలి.
మీరు డౌన్ డౌన్.
మీవారు జిందాబాద్.

మంచు చెప్పారు...

నిజమేనండి.. ఫొటొ భలే వుంది.. ఆ పక్కది టి వి నా ? ..అది మీరు యాడ్ చెసినట్టు వున్నారు.. :-)

Unknown చెప్పారు...

Nestaham garu,, chala bagundhandi mee post.
Depavali subhakankshalu meku me family ki.esari little india ki velthunara? memu matram bukit botak lone jarupukuntunam samuhikanga.... vasthara mari?

నేస్తం చెప్పారు...

మనోహర్ అలాగలాగే :)
మా ఊరుగారు అంతేలేండి..సహజమే..తప్పు మీదే కాదు .. ఈ క్రికెట్ జ్వరం లక్షణాలు మీ చేత అలా అనిపించేలా చేస్తున్నాయి..నేను అర్ధం చేసుకోగలను..
మంచు పల్లకిగారు ఎలా అయినా మీరు షార్పూ :)
మహిపాల్ ..లేదండి మాములుగా వీక్ ఎండ్ వెళితేనే అక్కడికి..విరక్తి వస్తుంది నాకు..ఇంక పండగ టైం లోనా :) .. ఈ సారికి ఇంట్లోనే జరుపుకోవడం :) హేపీ దీపావళి..

కొత్త పాళీ చెప్పారు...

you're just too good.
ఐనా దీనికి ఒకటే విరుగుడు. మీరు కూడా ఒక లేడీస్ లీగ్ ఒకటి మొదలట్టేసి, మొగుళ్ళ టీం ని ఛాలెంజ్ మేచ్ కి పిలవాల్సిందే!!!

Rajendra Prasad(రాజు) చెప్పారు...

నేను - మా ఆయన -- క్రికెట్టు ==
అమ్మ -- నాన్న -- తమిళ అమ్మాయి
చాలా బాగా రాసారు...మీ ఆయనకి నా తరపున "ALL THE BEST" చెప్పండి...
ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉండాలి...నేను క్రికెట్టు అభిమానినే అని....:)

హరే కృష్ణ చెప్పారు...

Nestam post bhale raasaru..
dipaavali subhaakankshalu

అజ్ఞాత చెప్పారు...

post keka..
meeku eenadu paper lo jarigina anyayaniki oka post dwaara teliyacheyalanukuntunnam meeru permission isthe :)

భావన చెప్పారు...

నేస్తం.. అబ్బ.. టూ మచ్ కదా. ప్రతి వాక్యం సూపర్.. అబ్బ నిజం గా తోట రాముడూ గారు లేని లోటు తీరుస్తున్నారు. నవ్వీ నవ్వీ ఇంక నవ్వలేక ఆపేసేను. జంధ్యాల గారి మార్క్ కామెడి గుర్తు చేసేరు... నిజం గా అలా ఆడతారా క్రికెట్? అంటే అంత ఇష్టం గా? ఆకు కూరల లిస్ట్ మాత్రం సూపర్.. ఎన్ని రోజులు తిన్నారు వాటిని?

భావన చెప్పారు...

జంధ్యాల గారు అన్నట్లు నిజం గా నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేక పోవటం ఒక రోగం. మీకు మాత్రం నవ్వించగల యోగ కౌశల్యం బాగా వుందండి.. :-)

పరిమళం చెప్పారు...

:) :) టపా ఇలా ఉంటే కేక అంటారనుకుంటా .....( మనలో మనమాట మరీమాస్ గా ఉందంటారా నేస్తం ?)

Ramesh Gannamani చెప్పారు...

కెవ్వు కేక......
"అసలు మగవాళ్ళలో ఉన్న గొప్పతనం అదే తగ్గుతున్నట్లు నటిస్తూ తొక్కేస్తారు....."
టెక్నిక్ బాగుంధి నెర్చు కొవాలి....

దీపావలి శుభాకాంక్షలు

నేస్తం చెప్పారు...

కొత్త పాళిగారు..ఆ ముచ్చట కూడా అయిపోయింది..మరి పిల్లలని ఎక్కడ పెడతారు అని మా ఫ్రెండ్స్ అంటే పిల్లలని చూసుకుంటూ ఆడలంట.. అయినా ఇష్టం లేని ఆటను అంత కష్టం గా ఎంతసేపని ఆడతాం లేద్దురు :)
రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పోస్ట్ రాసినప్పుడే అనుకున్నా 90% అమ్మాయిలు నా వైపు 90% అబ్బాయిలు మా ఆయన తరుపు ఉంటారని :)
హరే క్రిష్ణ గారు మీఖూ కూడా దీపావళి శుభాకాంక్షలు .. పోస్ట్ నచ్చినందుకు థేంకులు
అఙ్ఞాత గారు అయ్యయ్యో భలే వారే ,వద్దు అండీ ..సుజాత గారు చెప్పారు కదా బ్లాగ్ లోకం లో ఎంతోమంది బ్లాగర్ల గురించి రాయడానికి స్థలం కుదరలేదని ..పేపర్ లో ప్లేస్ సరిపోదుకదండి అందరిగురించి రాయడానికి.. అయినా మీ అందరి అభిమానం చాలు :)

నేస్తం చెప్పారు...

భావనగారు ఆ ఆకు కూరలగురించి ఏమడుగుతారు లేండి ..మళ్ళ అదోక పోస్ట్ అవుతుంది.. మా ఆయనకు ఆకు కూరలు నచ్చవు ..అయినా ఎంత కాలం నిలవ ఉంటాయి.. ఫ్రెండ్స్ కి,పక్క వాళ్ళకు ఇచ్చేసాను..మీ అభిమానానికి థేంక్స్ :)
పరిమళం గారు హ హ ..నిజమే నేనూ ఆ మాట అనాలంటే ఆలోచిస్తాను ..ఒక్కో పోస్ట్ భలే నచ్చేస్తుంది ..కేక అనే వర్డ్ ఆ టపా చాల బాగుందని ఒక్క మాటలో చెప్పేస్తుంది :) మనలో మనం అనేసుకోవచ్చు ఏం పర్లేదు :)
గన్నమణి గారు ఇంకా నేర్చుకోలేదా ఎంత అమాయుకులండి మీరు ..మీకూ మీ కుటుంభానికి దీపావళీ శుభాకాంక్షలు

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
చాలా విరామం తర్వాత, మీ పోస్ట్లన్ని చదివాను.ఎప్పటిలా నవ్వొచ్చినా, పాపం పసిపాప, అయ్యో పాపం పసిపాప అని పాడాలనిపించింది ఈ పోస్ట్ చదివితే ! మీకు నా బేషరతు మద్దతు ప్రకటిస్తున్నా ! నాకు క్రికెట్ అంటే చిరాకే !
కామెంట్లో,పిల్లల్ని చూసుకుంటూ ఆడటం? మీ పిల్లల గురించేనా?వాళ్ళ గురించి కూడా రాయండి వీలయితే ! ఎంత మంచి మనసు నేస్తం మీది, అన్ని ఆకుకూరలు తెస్తే, నేనైతే రోజు అవే చేసి పెట్టేదాన్ని, ఇంకోసారి అలా తేకుండా ,పైగా మంచివి కూడా కదా ;-) ( పుదినా పచ్చడి, పాలక పన్నీర్,ఆకుకూర ఇగురు, పప్పు వగైరా ! ). అన్నట్టు మీకు రాయటం కాకుండా ఇంకేం ఇష్టం ( హాబీలు అని నా ఉద్దేశం ).ఎప్పటిలానే పోస్ట్ అమోఘం !
- పద్మ.

నేస్తం చెప్పారు...

హూం పద్మ వచ్చేసావా..ఏమైపోయావు ఇన్నాళ్ళూ.. ఆకు కూరల విషయమా... అన్నీ ఒక్కో కట్ట అయితే అలాగే చేసేదాన్ని..3 కట్టలు తక్కువ కాకుండా తెచ్చారు..పైగా ఇక్కడి ఆకు కూరలు గడ్డిలా ఉంటాయి..రుచి పచి ఉండదు..మా ఫ్రిజ్ లో నాలుగు రోజులు పెట్టామా నీరు,నీరు పట్టేసి పాడై పోతాయి..అందుకే పంచి పెట్టా ..ఇంక హాబీస్ ఏముంటాయి పద్మ బుక్స్ చదువుతా.. అంటే పెద్ద పెద్ద నవల్స్ చదవను ..మనకి ఎవరు తెచ్చి పెడతారు ..ఇది గో ఈ నెట్ పుణ్యమా అని కొన్ని చదివా.. మేగ్జిమం బాగా నవ్వు వచ్చే కధలు చదువుతా..నాకసలు కొట్టేసుకుని,చంపేసుకునే రక్త పాత కధలు ,సినిమాలు బోరున ఏడ్చి హృదయాలాను పిండి చేసే సెంటిమెంట్ కధలు,సీరియల్స్ అస్సలు పడవు.. అవి చూస్తేనె నీరసం వచ్చేసి ఆ రోజంతా డల్ అయిపోతా..పెళ్ళికి ముందు కొన్ని కధలు రాసేసా.. పెళ్ళయ్యాకా మా ఆయన్ని చదివి ఎలా ఉన్నాయి అంటే సరిగా ఏదీ చెప్పేవారు కాదు ..అలా మూలన పడెసా ..ఇంకా అప్పుడప్పుడూ కాసిని పాటలు వింటాను ..పాతవి ,క్రొత్తవి రెండూ..మరీ ఉత్సాహం ఎక్కువైపోతే అవేవో నేనే పాడేసుకుంటా ఎవరికి వినబడకుండా :)

హరే కృష్ణ చెప్పారు...

నేస్తం గారు..ఏం చెప్పమంటారు.. ప్రస్థుతం మా బ్లాగుల్లొ మీతో కామెంటించుకొలేని దొర్భాగ్యపు స్థితిలో వున్నాం ఈరొజున..అంతా మాయ.. వీరబ్రహ్మ గారు చెప్పిందే నిజం ఏం చెప్పారో నే చెప్పను

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

నేస్తం..
మీదగ్గర స్క్రీన్‌ప్లే నేర్చుకుందామనుకుంటున్నాను.
ఏమంటారు?

ఆ క్రికెట్టుగ్రౌండు, బ్రిడ్జీ, ఆకుకూరలు... అన్నీ కళ్లముందు సినిమా రీళ్లలాగా పరిగెత్తాయి.
కేకోకేక!

"అబ్బా ,ఫోన్ పెట్టేసేయ్ బంతి గాల్లో ఉంది కేచ్ చేయాలి"
ఇది కెవ్వుకేక!

శివరంజని చెప్పారు...

"అబ్బా ,ఫోన్ పెట్టేసేయ్ బంతి గాల్లో ఉంది కేచ్ చేయాలి " ఎర్ర ఫ్లైట్ కెవ్వు కేక

నేస్తం చెప్పారు...

హరే క్రిష్ణ గారు భలేవారే,ఎంత మాట .. కామెంటాను చూడండి..:)
నరేష్ స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలియదు నాకు .. మళ్ళీ మీకు నేర్పడమా :)
శివరంజని థేంక్స్

రిషి చెప్పారు...

Beautifully narrated.

బాగా రాస్తున్నారండీ...keep going !!

నేస్తం చెప్పారు...

రిషి గారు మీ క్రొత్త పోస్ట్ల గురించి చకోర పక్షిలా ఎదురుచూపులు ఇక్కడ..ఎన్ని సార్లు మీ పాత పోస్ట్లను మళ్ళీ మళ్ళి చదవను..కాస్త మీ కీ బోర్డ్కి పని కల్పించండి :)

dj చెప్పారు...

Superb... chalaaa baagundi :)

cartheek చెప్పారు...

meeku meere sati andi...
mee saili adbutham
nigamgaa jaruguthunatte kallamundu kaduluthunnatte undi....

navvu danigurinchi cheppanavasaram ledu navvinchadam meeku vennatho pettina vidya......

రమణ చెప్పారు...

అదిరిపోయింది అండీ. అద్భుతంగా వ్రాశారు.

నేస్తం చెప్పారు...

Djగారు,వెంకట రమణ గారు,కార్తీక్ గారు ఆలస్యానికి మన్నించాలి.మీ అభిమానానికి ధన్యవాదాలు

swapna@kalalaprapancham చెప్పారు...

last paragraph sarigga artham kaledu, mi ayana kuda alage abbaddalu cheptada ala ani artamayindi mari:).

roju mothham coding chesi night lo kalalu vastunayi. ivala midi chadivaka cricket kalaloki vastundemo anni sarlu "cricket"
ani chadivanu.
ipude oka idea tattindi, na coding kalala gurinchi oka post raddam ani.;)

Narendra Chennupati చెప్పారు...

+++ఓ మారు చుట్టూరా చూసాను.. అక్కడక్కడా ఫారినర్స్ ,చాలా మంది నార్త్ ఇండియన్స్ .. స్లీవ్లెస్ డ్రేస్లతో ,రీ బౌండింగ్ హెయిర్లతో ..చక్కగా ఒక బీరో ,వైనో త్రాగుతూ కిల కిలా కబుర్లు చెప్పేసుకుంటున్నారు..మన అవతారం చూసుకున్నాం.. చక్కగా బిగించిన జడ తో, తిలకం బొట్టు తో........+++

ఒక్కసారి ఆ సీన్ ని బొమ్మేసుకొంటే.....సూపర్అండి........ఎదావిది గా మీ ఈ టపా కూడా సూపర్:-).......

గీతాచార్య చెప్పారు...

మీవారి ఫీల్డింగ్ కి నవ్వొచ్చింది. ఎలగెలగా? భలే టోకరా ఇచ్చారే ;-)

ముగింపు మాత్రం అదిరింది :-) ఎంత నవ్వుకున్నా మీకు మాత్రం నా సానుభూతి, బేషరతు మద్దతు ప్రకటిస్తున్నాను :-) అని వేణూ శ్రీకాంత్ అన్నారు. Me too

Mauli చెప్పారు...

గృహహింస చట్టం క్రింద కేసు వేసే వీలుందా..???



veelunte ikkada update cheyyandi pls pls :-)

నేస్తం చెప్పారు...

స్వప్న నాకులాగే ఎంత అమాయకురాలివి ..నీకు అర్ధం కాలేదంటే మీ ఆయన నిన్ను కూడా వీజీ గా మోసం చేసేయచ్చు :)
నరేంద్ర గారు :)
గీతాచార్య గారు థేంక్యూ థేంక్యూ
మౌళిగారు ఏమి up date చేయాలి అర్ధం కాలేదు .. :(