8, అక్టోబర్ 2009, గురువారం

ఈ క్రికెట్ ని ఎవరు కనిపెట్టారో గాని ...




ఈ క్రికెట్ ని ఎవరు కనిపెట్టారో గాని వాళ్ళను చితక్కోట్టి ,చిత్రబాణాలు పెట్టేయాలన్నంత కోపం వచ్చేస్తుంది నాకు .ఆ ఆట వస్తే చాలు ఇంక పెళ్ళాం ,పిల్లలు ఎవరిని పట్టించుకోరు ఏంటో..నాకు తెలుసు మీలో చాలామంది క్రికెట్ ప్రియులకు ఆవేశం పొంగిపొర్లి వచ్చేస్తుందని..అయినా సరే నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదూ... లేదూ ..లేదూ.. నాకు ఈ ఆట తెలియడమే దాని మీద ద్వేషం తో చూస్తుండగా తెలిసింది.అందుకే అదంటే అస్సలు ఇష్టం లేకుండా పోయింది. మీరు మొహమాట పడినా ,ఇబ్బంది పడినా తప్పదు నాతో పాటు ఓ మారు ఫ్లాష్ బేక్ కి రావలసిందే ..

నాకో తమ్ముడున్నాడు (మా పెద్దమ్మ కొడుకు) వాడికీ, నాకు మధ్య పచ్చగడ్డి వేయకముందే భగ్గుమంటుంది.వాడు నాకంటే 25 రోజులు చిన్నోడు. అంటే నాకు తమ్ముడే కదా అవుతాడు ..మరి రూల్ ప్రకారం నేను అక్కే కదా అవుతాను ,కాని నన్ను అక్కా అని పిలవరా అని ఎంత మొత్తుకున్నా అక్కా లేదు ,అరటికాయ తొక్కాలేదు అని బుజ్జి అని పిలిచేవాడు ,అదీ నా ఫ్రెండ్స్ ముందు. వాళ్ళు ఊరుకుంటారా, ఏమే బుజ్జమ్మా మీ తమ్ముడు పిలుస్తున్నాడు ,ఓయ్ బుజ్జులూ మీ తమ్ముడు పిలుస్తుంటే పలుకవేంటి అని చిత్ర విచిత్రాలుగా నా పేరుని మార్చేసి ఏడిపించేసేవారు ..

పోని అక్కడితో ఊరుకునేవాడా ,మా స్కూల్ మొత్తానికీ చండశాసనురాలని పేరు తెచ్చుకున్న సత్యవేణి టీచర్.. హోం వర్క్ ఎందుకు తప్పుచేసావురా అని అడగగానే మా బుజ్జక్క చెప్పిందండి ఇలా చేయమని అని నా మీద తోసేసేవాడు..అంతే మా క్లాసుకి బుజ్జి ని తీసుకురమ్మన్నారు అని వర్తమానం అందేది ...ఇంక రాగానే ఏమే బుజ్జిదానా, నీ మొహానికి రాకపోతే రాదని చెప్పాలి గాని ఇలా తప్పుడు హోంవర్క్ చేయిస్తావా అని నేను కాదు మొర్రో అని అన్నావినకుండా 100 గుంజీలు తీయించి పంపేది . ఒరే ఎందుకురా అలా చెప్పావ్ అంటే మరి అలా చెప్పకపొతే నన్నుకొడుతుంది కదా అనేవాడు సింపుల్ గా ..

వీడికంటే మా చెల్లిని చూస్తే మరీ వళ్ళు మండేది..నేనే కదా దానికి అక్కను ,మరి లెక్క ప్రకారం నాకే కదా అది సపోర్ట్ చేయాలి..అబ్బే, దానికి అంత తెలివెక్కడ ఏడ్చింది .. అన్నయ్యా !మా నాన్న నిన్న కోవాలు తెచ్చారు తింటావా,అన్నయ్యా! నేను ఈ బొమ్మవేసాను బాగుందా అంటూ 24 గంటలు వాడి చుట్టూ రంగులరాట్నం తిరిగినట్లు తిరిగేది..మేమందరం పరికిణీ, వోణీ వేసుకుని తిరిగినా వాడికి తెలుగుదనం కనబడదట ,కాని మా చెల్లి నైటీలో తిరిగినా తెలుగుతల్లి ముద్దు బిడ్డలా ,సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలా కనబడుతుంది అంట, దాని ఫేస్ వేల్యూ అలాంటిందంట.. ఈ ముక్కవాడే చెప్పాడు .

సరే అలాంటి మా తమ్ముడితో ఒక రోజు ఫ్రెష్ గా గొడవేసుకుని ,మేడ మీద మిగతా పిల్లలను ముందు కూర్చో పెట్టుకుని టీచర్ ఆట సీరియస్సుగా ఆడుతుంటే.. వీడు,మా ఆఖరు చిన్నాన్న ఒక కర్రముక్కా, ఒక బంతి పట్టుకుని వచ్చారు .. ఎవరన్నా క్రికెట్ ఆడతారా మా చిన్నాన్న పిలిచాడు.అందరూ నా వైపు చూసారు .మరి నా చేతిలో ఉప్పు బద్దలున్నాయి .అవి ఆశ చూపించే వాళ్ళకు పాఠాలు చెపుతున్నా.. నేను తల అడ్డంగాఊపాను వెళ్ళద్దు అని.. మా తమ్ముడు మా చెల్లి వైపు చూసి నువ్వు రావే అన్నాడు .. నువ్వు నా చెల్లివి ,నా మాటే వినాలి అని ఎంత అరిచినా నేను అన్నయ్యతోనే ఆడతా అని గొప్ప అవమానం చేసి వెళ్ళిపోయింది అది వాడిదగ్గరకు..

ఇది బేట్ అన్నమాట, చిన్నాన్న బాల్ వేస్తే నేను బేట్ తో కొడతా, నువ్వు బాల్ ని కేచ్ పట్టడానికి ట్రై చేయాలన్న మాట ..అని కాసేపేదో చెప్పి ఆట మొదలు పెట్టారు.ఇంకేంటీ ఒక్కొక్కరూ నువ్వూ వద్దు.. నీ ఆట వద్దు అని అందరూ వాళ్ళ బేచ్ లో చేరిపోయారు..అలా క్రికెట్ అంటే తెలిసే లోపే అదంటే కోపం వచ్చేసింది ..అక్కడి నుండి ఈ క్రికెట్ వల్ల నేను పడిన బాధ అంతా ఇంతా కాదు ..

అవి కొత్తగా మా వూర్లో కేబుల్ టి.వి వచ్చిన రోజులు..నేను చక్కగా మాయా బజార్ సినిమా వస్తుంటే చూస్తున్నాను ..మా ఇంటి మొత్తానికి ఫస్ట్ టి.వి మా నాన్నే కొన్నారు ..ఇంతలో మా చిన్నాన్న,తమ్ముడు లోపలికి వచ్చి .. ఏయ్ లేవే,24 గంటలు సినిమాలు ,చదువు సంధ్యా లేకుండా అని బలవంతం గా నన్ను సోఫా నుండి లేపేసి ,దూరదర్శన్ పెట్టేసి క్రికెట్ పెట్టుకుని చూస్తున్నారు ... అమ్మా... ఇది మా ఇల్లు, మా టి.వి ,నా ఇష్టం నేను సినిమా చూసుకుంటా అని అరిచాను ..పోవే, మీ నాన్న నీ కంటే ముందు నాకు అన్నయ్య అని నన్ను తోసేసి తలుపేసేసుకున్నారు.. దొంగ మొహాల్లారా అని తిట్టుకుంటూ తలుపులు బాదుతుంటే మా నాన్న అనుకోకుండా ఇంటికొచ్చారు.. హమ్మయ్యా అనుకుని .. నాన్నా !చూడండి నాన్న ఎన్ టి రామారావు సినిమావస్తుంటే ఏదో క్రికెట్ అంట చెత్త ఆట ..అదిపెట్టారు అని కంప్లయింట్ ఇచ్చాను .మా నాన్నకు ఎన్ టి ఆర్ పేరు చెపితే చాలు.. అందుకే మాయా బజార్ ..నాన్న మాయా బజార్ వేస్తున్నాడు అని ఊరించి చెప్పాను..

ఏంటీ.. మాయాబజారే అని హడావుడిగా వచ్చి, ఏరా కేబుల్ టి.వీ లో మయాబజార్ వస్తుంటే ఏంటో పెడతారేంటి (మా నాన్నకు అప్పటికి క్రికెట్ అంటే ఏంటో తెలియదు) అని చానెల్ మార్చేసారు ..మా చిన్నాన్న ,తమ్ముడు చెరో ప్రక్కకు చేరి పోయి బ్రతిమాలడం మొదలెట్టేసారు.. అన్నయ్యా,అన్నయ్య ప్లీజ్ అన్నయ్యా క్రికెట్ చాలా బాగుంటుంది ..మన ఇండియా ఇంగ్లాండ్ తో ఆడుతుంది అన్నయ్యా..అన్నాడు మా
చిన్నాన్న. తర్వాత చూద్దువుగాని మాయ బజార్ సినిమా వస్తుంది అంటూ మా నాన్న ఒప్పుకోలేదు.. ఎన్ని సార్లు చూస్తావ్ నాన్న బాబు ఆ సినిమా, మొన్న కూడా వి.సి.ఆర్ తెచ్చి అందరికీ చూపించేసావ్ కదా ,అయినా ఆ రామారావు ఎలా నచ్చుతాడు నీకు ..ఓవరేక్షన్ గాడు.. మొన్న ఏదో సినిమాలో ఒక నిక్కరేసుకుని అమ్మా !నేను 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానమ్మా అని ఎగురుకుంటూ చెప్తున్నాడు..నిక్కరేసుకుంటే బాలాకుమారుడైపోతాడా..ఆ సావిత్రి ఒకరిది స్క్రీనంతా ఆవిడే కనబడుతుంది ..ఎప్పుడు చూసినా ఈ..ఈ అని ఏడ్చుకుంటూ ఎలా భరిస్తారునాన్నా బాబు మా తమ్ముడు విసుక్కున్నాడు..

మా నాన్నకు బీ.పీ పెరిగి పోయింది..అయినా నేను ప్రక్కనే ఉన్నాను కదా ఇంకొంచం పెంచడానికి.. ఒరే ఆ మహా నటులని అంటే కళ్ళు పోతాయ్.. ఇప్పటి అమ్మాయిలూ ఉన్నారు ఒక్కదానికి నటించడం చేత కాదు ..పైగా అందరూ సిగరెట్లూ,మందూ తాగుతారంట ఛీ ..ఛీ మా నాన్న ప్రపంచంలో అసహ్యమంతా మొహంలో నింపేసారు.. ఏం మీ సావిత్రి మాత్రం తాగలేదా పీపాలు పీపాలు ..వీడు తగ్గలేదు ...మా నాన్నకు టక్కున ఏమనాలో తెలియలేదు పాపం..అప్పటి మహాను భావులకి బోలెడు బాధలురా అన్నారు చివరికి ..ఇప్పటివాళ్ళకు అంతకన్నా ఎక్కువ బాధలు అందుకే వీళ్ళూ తాగుతున్నారు వీడు వాదించాడు.. మా చిన్నాన మధ్యలో వీడిని ఆపు చేసేసి అన్నయ్యా.. ఆ కేబుల్ వాడు నా ఫ్రెండే, నీకు వరుసగా వారం రోజులు ఎన్ టి ఆర్ సినిమాలే వేయించుతా అనే సరికి ఇంక మా నాన్న మెత్తబడి క్రికెట్ పెట్టేసారు నేను ఎంత అరిచి గోల చేసినా సరే ..


ఒరే అందరూ దెయ్యాల్లా తెల్ల బట్టలేసుకున్నారేంట్రా మా నాన్న అనుమానం ..ఇది టెస్ట్ మేచ్ అన్నయ్యా వన్ డేలు అయితే కలర్ బట్టలేసుకుంటారు ..మా చిన్నాన సమాధానం.. మా నాన్న మూడ్ మారిపోకుండా మా తమ్ముడు అందుకున్నాడు ..మనోళ్ళు బౌలింగ్ అన్నమాట ..ఇప్పుడు వీడు బాల్ వేస్తే నాన్నా ,ఆ తెల్లోడు కొడతాడు ..అది ఆ చివ్వర్న గీత దాటితే 4 అన్నమాట ..ఆ కొట్టిన బంతి మనోళ్ళు పట్టుకుంటే వాడు అవుటయి పోతాడు అన్నాడు .. అదిగో అవుటయి పోయాడు కదా మా నాన్న క్రింద వెళుతున్న బంతిని తీసుకువస్తున్న ఫీల్డర్ని చూస్తూ అన్నారు..అబ్బా అలా నేల మీద బాల్ కాదు నాన్న, గాల్లో పట్టుకోవాలి నేలను తాకకుండా పాపం ఓపికగా చెప్తున్నాడు..నేను తిట్టుకుంటునే చూస్తున్నాను ..

ఏంటిరా ఎంత సేపు ఇలా ఆడతారు మా నాన్నకు విసుగొచ్చింది ..ఇది టెస్ట్ అన్నయ్యా అందుకే ఇలా స్లో ఉంటుంది అయినా చూడగా చూడగా బాగుంటుంది.. ఇప్పుడు బాల్ వేస్తున్న అబ్బాయి చాలా బాగా వేస్తాడు బౌలింగ్ ..అన్నాడు చిన్నాన్న .. ఎవరా అబ్బాయి? మా నాన్న లేని ఆసక్తి తెచ్చుకుని అడిగారు..కూంబ్లే ..చెప్పాడు.. మరి మన ఆంద్రావాళ్ళు లేరా ?? అడిగారు.. ఎందుకులేరు అజారుద్దిన్ ఉన్నాడుకదా.. ఇంకా టేండూల్కర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అన్నాయ్యా భలే ఆడుతాడులే చెప్పాడు చిన్నాన్న..ఇవేం పేర్లురా వీళ్ళసలు ఇండియా వాళ్ళేనా ?మా నాన్న అనుమానం..అంటే అవి ఇంటి పేర్లు నాన్న, కూంబ్లే అసలు పేరు అనిల్ అన్నమాట ..మా వాడు వివరించాడు ..నేను టి.వి వైపు చూసాను హోం వర్క్ చేసుకుంటునే .అలా క్రికెట్ లో నాకు మొదటి సారి తెలిసిన అబ్బాయి అనిల్ కూంబ్లే.. నాకు చాలా బాగా నచ్చేసాడు.. బోలెడు అందంగా ఎంతో మంచాడిలా ఇంకెంతో అమాయకంగా ..హూం .. అసలు అనిల్ గురించి చెప్పాలంటే ప్రత్యేకం గా ఓ పోస్ట్ వేయాలి..

అలా అనిల్ ని చూసి మురిసిపోతుంటే టక్కున ఒకడిని అవుట్ చేసేసాడు ... మా వాళ్ళు 'అవుట్' అని ఎగిరేస్తుంటే మా నాన్న అయోమయంగా మొహం పెట్టి మరి బంతి గాల్లో ఎగరలేదు ..ఎవడూ పట్టుకోలేదు ఇదెలా అవుట్ అవుతుంది అన్నారు ..అంటే నాన్నా దీన్ని ఎల్.బి.డబల్యు అంటారు వికెట్ కి కాలు అడ్డం పెడితే, ఆ కాలుకి బాల్ తాకితే అప్పుడు అవుట్ అన్నమాట ...మా తమ్ముడు వివరించాడు..మా నాన్న కాసేపు బుర్ర గోక్కున్నారు.. కాసేపాగి మా నాన్న అదేంటిరా బాల్ కాల్ కి తగిలింది కదా అయినా అవుట్ ఇవ్వలేదు మళ్ళీ అడిగారు ..అంటే అన్నయ్యా కాలుకి తగిలిన ప్రతి బాల్ ని ఎల్.బి.డబల్యూ ఇవ్వరు సరిగా తగలాలి అన్నాడు ఎలా చెప్పాలో తెలియక చిన్నాన్న.. మా నాన్నకు చిరాకొచ్చేసింది ..యెహే తియ్ ..చక్కగా ఎంటివోడి సినిమా వస్తుంటే అని చానెల్ మార్చేసారు.. కూంబ్లే వరకూ బాగానే ఉన్నా నాకసలు క్రికెట్ ఇష్టం లేదు కాబట్టి నేను పండగ చేసేసుకున్నాను వాళ్ళను వెక్కిరిస్తూ ..


మరి అప్పటికి నాకు తెలియదుకదా క్రికెట్ అప్పటికే మా ఇంట్లో పునాదులను వేసేసి స్ట్రాంగ్ గా అయిపోయిందని..ఒకరోజు అమ్మతో బయటకు వెళ్ళి వచ్చేసరికి మా నాన్న,తమ్ముళ్ళు,చెల్లాయిలు అందరూ టి.వి కి అతుక్కుపోయి ఉన్నారు.. ఏంటా అని చూస్తే ఇండియా-పాకిస్తాన్ షార్జా కప్ మేచ్ వస్తుంది ..ఎవరికి క్రికెట్ తెలిసినా పరలేదు కాని మా నాన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా?? ..నాన్నా!! ఈ రోజు ఇంకో చానెల్ లో ఘంటశాల ప్రోగ్రాం ఉంది గుర్తు చేసాను ..అది రేపమ్మా అన్నారు నాన్న కళ్ళు తిప్పకుండా..ఓయ్ రేపు ఎక్జాం పెట్టుకుని ఇక్కడేం పనే మా ఆఖరు చిన్నాన్న నా నోరు మూయించేసాడు.. ఈ పాకిస్థాన్ వోళ్ళకి మనం మెతగ్గా ఉంటే అలుసురా.. ఏమన్నారూ ..ఈ కప్ గెలిస్తే కాశ్మీర్ మాకు ఇచ్చేస్తారా అని అడిగారా..దొంగవెదవలు మా నాన్న ఆవేశ పడిపోతూ అంటున్న మాటలు లీలగా వినబడుతున్నాయి సావిట్లో చదువుతుంటే ..అలా మా నాన్నకు పాకిస్థాన్ ని చూపించేసి క్రికెట్ని అలవాటు చేసి పడేసారు ...

ఆ తరువాత మా నాన్న క్రికెట్ కి ఎంత అలవాటు పడిపోయారంటే ..రాత్రి పడుకున్నపుడు కూడా ఆ ద్రావిడ్ ఇలా కొట్టకుండా అలాకొట్టాల్సింది .. వాడు ఫుల్ టాస్ వేయకుండా ఉంటే బాగుండేది ..వీడు ఫ్రంట్ ఫుట్ కొచ్చి ఆడకుండా ఉంటే బాగుండేది అని ఒకటే గొణుగుడు ..పోనీ అక్కడి తో ఆగేవారా.. ఆదివారం వస్తే చాలు మమ్మల్ని కూర్చో పెట్టుకుని రాత్రి భలే కల వచ్చిందిరా అంటూ లగాన్ సినిమా లో లాస్ట్ సీన్ చూపించేసేవారు ..కాకపోతే అక్కడ అమీర్ ఖాన్ ప్లేస్ లో మా నాన్న ఉంటారన్నమాట .. ఇలాంటి సమయం లో నాకు సపోర్ట్ మా అమ్మ మాత్రమే ..

దిక్కుమాలిన క్రికెట్టు..దిక్కుమాలిన క్రికెట్టు..ఇల్లంతా తొక్కిపడేస్తున్నారు అందరూ..ఇంకోసారి క్రికెట్ పెడితే టి.వి బయట పడేస్తా అని బెదిరించి నాకు కాస్త ఊరటనిచ్చేది .. మరి వంట చేస్తూ మధ్య మధ్యలో చూస్తూ ఎప్పుడు ఆ ఆటను అర్ధం చేసుకున్నాదో తెలియదు కాని తరువాతా తీరికగా తోటికోడళ్ళ సమావేశం లో నిన్న అసలు మనోళ్ళు గెలాల్సిన ఆట అంట, వెదవలు మేచ్ ఫిక్సింగ్ చేసేసి ఉంటారు..చెడ్డ బాధవేసేసిందనుకో.. అనేది .మా పెద్దమ్మ పిన్నులు కూడా ఆల్రెడీ నిష్ణాతులు అయిపోయారు ఈ క్రికెట్ విషయంలో.. అది కాదులే అక్కా గంగూలీ వాళ్ళ ఆవిడను వదిలేసి నగ్మా వెనకాత పడిన దగ్గర నుండి ఏది కలిసిరావడం లేదు ..మరి ఆడదాని ఉసురు ఊరికేపొతుందా అంటూ మా పిన్ని ..ఏదేమైనా కపిల్ దేవ్ చాలా మంచాడంట ..చాలానాళ్ళు పిల్లలు లేకపోయినా పెళ్ళాన్ని అసలేమి అనకుండా బాగా చూసుకునే వాడంట .ఆడపిల్ల పుట్టేసరికి ఎంత ఆనందం పడిపోయాడో అంట అని మా పెద్దమ్మ... ఇరుగమ్మల మీద పొరుగమ్మల మీద చెప్పుకోవడం మానేసి క్రికెట్ విషయాలు చర్చించేసుకోవడం మొదలెట్టేసారు మా ఇంట్లో..

ఇలా మా ఇంట్లో నా క్రికెట్ వ్యతిరేకోద్యమం మూలన పడిపోయింది.. ఆ సమయంలోనే అనుకున్నా దేవుడా మా ఆయనకు ఏ ఆట మీద ఇంట్రెస్ట్ ఉన్నా, క్రికెట్ మీద మాత్రం అసహ్యం ఉండేటట్లు చేయి స్వామి అని .. ఇప్పుడు మీరు నామీద బోలెడు జాలి పడతారని తెలుసు.చూసారా ఎంత అమాయకురాలిని కాకపోతే భారతదేశంలో క్రికెట్ అంటే చెవులు, ముక్కు కొసేసుకునే అబ్బాయిల సంగతి తెలిసికూడా అలా కోరుకున్నాను.. పెళ్లయ్యాకా మా ఇంట్లో (అత్తగారి ) ఎక్కడా క్రికెట్ కు సంభందించిన వస్తువులేమి కనబడా పోయేసరికి ..ఆహా, కల నిజమాయెగా అని పాడేసుకున్నా కూడా..

ఆ తరువాత ఇక్కడకు వచ్చాకా మరుసటి రోజు మా ఆయన తో అలా బీచ్ కి వెళ్ళి బోలెడు కబుర్లు చెపుతూ ,ఊరంతా తిరిగి రావాలని ఎన్నెన్నో ప్లాన్లను వేసేసుకుని నిద్ర లో జారుకున్నాను ..మరుసటి రోజు పక్షుల కల కల రావాలకు మెలుకువ వచ్చి, చిరనవ్వుపెదవులపై పూస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచాను..ఎదురుగా మా ఆయన హాస్పిటల్ లో కంపౌండర్ లా తెల్లటి డ్రెస్స్ వేసుకుని బేట్ ని అన్ని ఏంగిల్స్లో తిప్పేస్తూ పొజులిస్తున్నారు.. దెబ్బకు మత్తు వదిలిపోయి మీరూ ..క్రికెట్ ఆడతారా అన్నాను భయంగా ..మా ఆయన ఒక్క నిమిషం బోలెడు ఆక్చర్యపోయి వెంటనే తేరుకుని, ఏమిటా ప్రశ్న..నేను ఆల్రవుండర్ నే ... పైగా మా టీంకి నేనే కెప్టెన్ ని అని భీముడిలా ఆ బేట్ని భుజం మీద పెట్తుకుని ఒక నవ్వు నవ్వారు.. దేవుడా..నేను కళ్లు తిరిగి మంచం మీద పడిపోయాను.. తలుపేసుకో వచ్చేసరికి రాత్రి అవుతాది మా ఆయన మాటలు లీలగా వినబడ్డాయి..
ఇక్కడి తో కధ అయిపోలేదు మొదలైంది ఆ విషయాలు నెక్స్ట్ పోస్ట్ లో

76 కామెంట్‌లు:

విజయ క్రాంతి చెప్పారు...

10/10

చైతన్య.ఎస్ చెప్పారు...

క్రికెట్ మీద వ్యతిరేక ఉద్యమమా ..నేను ఒప్పుకోను...

క్రికెటో రక్షతి రక్షితహః

త్వరగా సెకండ్ పార్ట్ రాయండీ

అజ్ఞాత చెప్పారు...

హాయ్..భలేభలే, క్రికెట్ అంటే ఇష్టంలేని ప్రాణి ఇంకోటుందన్నమాట ఈ భూమ్మీద.
బ్లేక్ అండ్ వైట్ రోజుల్లో క్రికెట్ మేచ్ మధ్యలో వచ్చే ఏడ్స్ కోసం టీ.వీ ముందు కూర్చునేదాన్ని . అప్పుడు నన్నంతా జాలిగా చూసేవారనుకో. పదిమంది పనిలేనివాళ్ళు ఆడుతుంటే ,కోట్లమంది పనులుమానుకుని వెర్రిమొహాలేసుకు చూసే ఆట క్రికెట్ అని ఎవరో పెద్దాయన అన్నారట. ( ఖచ్చితంగా కాదుకానీ ఇంచుమించుగా ఇలానే...) ఆ పెద్దాయనకే నా ఓటు .

Hima bindu చెప్పారు...

మీరు నయం కనీసం క్రికెట్ వీరుల పేర్లు చెబుతున్నారు ...నాకు పరమ అసహ్యం అయిన ఆట క్రికెట్. మా హస్బెండ్ అపురూపంగా చూసుకునే ఆట ఇదే ,తరువాత టెన్నిస్ ఎంత రాత్రైనా కళ్ళప్పగించి చూస్తాడు నాకు జడిసి వాల్యూం పెట్టడం ఎప్పుడో మానేసారు సర్దుబాటు -:)

నీహారిక చెప్పారు...

క్రికెట్ వ్యతిరేక ఉద్యమంలో నేను కూడా ముందు ఉంటాను.పెళ్ళిచూపుల్లో నన్ను చూడకుండా క్రికెట్ చూస్తూ కూర్చుని తర్వాత తీరిగ్గా నిన్ను సరిగా చూడలేదు లేకపోతే చేసుకునేవాడిని కాదు అని అన్నారు.ఈ వెధవ క్రికెట్ వల్లనే కదా నేను ఆయనకి నచ్చేసాను.క్రికెట్ చూసిన కళ్ళతో ఏది చూసినా అందంగా కన్పిస్తుందట!!!!

Indian Minerva చెప్పారు...

మీరూ క్రికెట్ ద్వేషే నన్న మాట. భారత్, పాకిస్తానులు క్రికెట్ ఆడుతుంటే నేను మాత్రం Test your C skills చదువుకుంటూ ఆ సాయంత్రం గడిపేశాను. అదే world cup లో ఒక match చూడటానికి వెళ్ళి మనవాళ్ళు 5వ ఓవరు batting చేస్తుంటే "ఎవెరెవరు ఔటయ్యారు" అనడిగినందుకు నన్ను కొట్టినంత పనిచేశారు.

క్రికెట్ కంటే ఇంకా చిరాకెత్తించేదేంటంటే. match అయిపోయాక highlights కూడా చూసి మళ్ళీ తరువాతరోజు paperలో చదవడానికి ప్రయత్నించడం. ఆ తరువాత "సచిన్ తన 2675వ బంతిని ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ఆడెను అప్పుడేమి జరిగెను?" అనెవరైనా అడిగితే టక్కున చెప్పేలా అదేదో compitetive exam కి prepare అవుతున్న రీతిలో గుర్తుంచేసుకోవటం. ఇంకా చాలా వున్నాయ్...

అజ్ఞాత చెప్పారు...

హమ్మయ్య .. రాసేసారా...
ఎప్పటిలాగానె సూపర్ గా ఉందండి...
నెక్ష్త్ పార్ట్ కూడా త్వరగా రాయండి..

రాజ్ కుమార్

Jagadeesh Reddy చెప్పారు...

నేను కూడా మీ టైపే.... ఇప్పటికీ క్రికెట్ అంటే నాకు బ్రహ్మ పదార్ధమే... చాలా సార్లు అదేమిటో అర్ధం చేసుకోవాలని ప్రయత్నించాను కాని.. లాభం లేకపోయింది... అయినా గాని... ఒక బంతి కోసం అంతమంది ఎందుకు కొట్టుకు చస్తారో చచ్చినా అర్ధం కాదు. ఒక్కొక్కరికీ ఒకో బంతి కొనిచ్చేస్తే పోలా....

Unknown చెప్పారు...

mee chelli bommalanu valla annayya baga mechukuntadu anukunta..anduke annayyane antha istam... :)...cricket ante naku kopame...intlo em jarugutondo kuda pattinchukokundaaa..thega chusestuu untaru...ma nanna , tammudu aithe..eppateppato matches anni chusi...himsisthuu untaru...malli malli ela chustaru ante..???..malli malli meeru mahesh babu cinemalu chudatle ane sattire....mottaniki post adurs..

Malakpet Rowdy చెప్పారు...

LOL ... Good one!

అజ్ఞాత చెప్పారు...

క్రికెట్ సంగతి సరే. ముందు ఈ మాటలకి అర్థాలు చెప్పండి.
చిత్రబాణాలు, ఉప్పు బద్దలు

గీతాచార్య చెప్పారు...

I too don't like cricket. ;-)

sunita చెప్పారు...

నాకు పరమ అసహ్యం అయిన ఆట క్రికెట్. Same here.

Divya చెప్పారు...

ఎప్పటి లాగే బాగా రాసారు .మీకు అనిల్ కుంబ్లే అంటే ఇష్టమా నేను కూడా అనిల్ కుంబ్లే కి a.c అన్నమాట . నాకు క్రికెట్ ఇష్టమే కానీ లైవ్ లో చుస్తే బాగుంటుంది కానీ మా తమ్ముడు టెస్ట్ మ్యాచ్ కూడా 4-5 సార్లు రివిజన్ చేసుకుంటాడు .అది మాత్రం భలే బోర్ .

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ సూపర్...

చిత్రబాణాలా ఏమిటండీ అది చేతబడి బాణామతి కలిపి కనిపెట్టిన కొత్త విద్యా... ఏదేమైనా మీకేమైనా సాయం కావాలంటే నాకు చెప్పండి నేను నేర్చుకునైనా సరే మీకు సాయపడతాను. ఎందుకంటే నాకూ అస్సలు పడదు క్రికెట్ అంటే..

మ్యాచ్ ఫిక్సింగ్ లకి ముందు కాస్త స్కోర్స్ అన్నా తెలుసుకునే వాడ్ని కానీ ఆ తర్వాత పూర్తిగా మానేసా... నన్ను మ్యాచ్ చూడమని బలవంతపెట్టే స్నేహితులకోసం నే చూస్తే ఇండియా ఓడిపోతుంది అని సెంటిమెంట్ తో కొట్టా ఒకటి రెండు సార్లు నిజమవడం తో వాళ్ళే నాకు పుస్తకాలు కొనిచ్చి మరీ వేరే రూమ్ లో కూర్చోబెట్టడం మొదలు పెట్టారు అక్కడ నుండి కదలద్దు అని.

చెప్పడం మరిచా.. తెలుగు టీవీ సీరియల్స్ చూసే అమ్మాయైనా పర్లేదు కానీ, క్రికెట్ మ్యాచ్ లు చూసే అమ్మాయిని మాత్రం పెళ్ళి చేసుకోకూడదు అనేది నా జీవితాశయం :-)

నేస్తం చెప్పారు...

విజయ క్రాంతి గారు ఎంత హెపీగా ఉందంటె నాకే ఎక్జాంలో కూడా 10/10 రాలేదు మీరు ఇచ్చారు :)
చైతన్య నాకు తెలుసుకదా మీరు ఒప్పుకోరని .. మీరు ఒప్పుకోకపోయినా మీ వైఫ్ (పెళ్ళి అయినట్లయితే) తప్పని సరిగా ఒప్పుకుంటారు.
లలిత గారు మీకో దేవ రహాస్యం చెప్తాను,మేగ్జిమం క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న భర్త ఉన్న ఆడవాళ్ళకు క్రికెట్ అంటే అస్సలు పడదు .. కాబట్టి మీకు చాలా మంది ప్రాణులు తోడుగా ఉన్నారు ..
చిన్ని గారు కనీసం మీకా సర్దుబాటు కన్నా మీ వారు ఒప్పుకుంటున్నారు.. మా ఆయన దానికి కూడా ససేమిరా అంటారు..అసలు కామెంట్రీ వింటేనే మజా అంటా ..:(

నేస్తం చెప్పారు...

>>>>క్రికెట్ చూసిన కళ్ళతో ఏది చూసినా అందంగా కన్పిస్తుందట!!!!
నీహారిక గారు ఎంత మాట అన్నారు మీవారు.ఎలా తట్టుకుంటున్నారండీ బాబు ..మీకు నా ప్రగాడ సానుభూతి ..
>>>క్రికెట్ కంటే ఇంకా చిరాకెత్తించేదేంటంటే. మత్చ్ అయిపోయాక హిఘ్లిఘ్త్స్ కూడా చూసి మళ్ళీ తరువాతరోజు పపెర్లో చదవడానికి ప్రయత్నించడం
minerva గారు ఏం చెప్పారండి ..సరిగ్గా ఇదే ఇదే నేను అనుకుంటాను..
రాజ్ కుమార్ గారు థేంక్స్ అండి :) త్వరలో రాస్తాను
జగదీష్ గారు క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ ని చూసినా నాకు మీరన్నట్టే అనిపిస్తుంది

నేస్తం చెప్పారు...

కిరణ్ బొమ్మలవల్ల కాదు.. ఈ వంకతో ఒకరినొకరు పొగిడేసుకుంటారన్నమాట.. ఇంట్లో ఒకే టైంలో ఉన్నారంటే చాలు మాకు రక్తసంబందం సినిమా చూపించేసే వాళ్ళు..
మలక్ థేంక్స్ :)
బోనగిరిగారు ఉప్పు బద్దలంటే ఎండబెట్టిన మాగాయ ముక్కలు..అబ్బా అదేనండి మాగయ పచ్చడి కోసం మామిడిముక్కలపై ఉప్పు జల్లి ఎండబెడతారు కదా వాటిని అలా అనేవాళ్ళం ..ఇంక చితకొట్టి చిత్రబాణాలు పెడతా అనేది మా అమ్మ తిట్టు ..ఆవిడ ఓన్ తిట్టెమో ..నేను కూడా ఎక్కడా వినలేదు మా అమ్మదగ్గర తప్ప.. మా మీద కోపం వస్తే తప్పని సరిగా ఈ తిట్టు తిట్టేది ..
గీతాచార్యా నిజ్జంగా నిజమా ..నేను కూడా నమ్మేసాను :)

నేస్తం చెప్పారు...

సునీతా :)
దివ్యా మన అనిల్ ఎంత మంచాడు కాకపోతే తన పెళ్ళి విషయం లో అంత గొప్పగా నిర్ణయం తీసుకుంటాడు..ఒక బిడ్డ తల్లి అనగానే నేను ఆ అమ్మాయి అతిలోక సుందరిలా ఉండి ఉంటుంది అని అనుకున్నా..కాని ..ఎలాగయినా అనిల్ చాలా మంచాడు ..ఇంతకంటే ఎక్కువ పొగిడితే పాపం మా ఆయన ఫీల్ అవుతారు ..ప్లిచ్
వేణూ నిజమా..క్రికెట్ ఇష్టం లేని అబ్బాయిలు అరుదుగా ఉంటారు.. మేచ్ ఫిక్సింగ్ తర్వాతా ,నిజమే ఉన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది చాలా మందికి ..

Shiva Bandaru చెప్పారు...

క్రికెట్ ని కోకాకోలా & పెప్సి కోలా కంపెనీలు ఒక పద్దతి ప్రకారం ఇండియన్స్ కి ఎక్కించాయి. ఓవర్ ఓవర్ మద్యలో బోలెడు యడ్స్ వేసుకోవచ్చు అని టీవీ లు అలవాటు చేసాయి. నిజానికి క్రికెట్ ఇండియా, పాకిస్తాన్ తప్పితే పెద్దగా పట్తించుకోరు.

పుట్‌బాల్ /హాకీ లాంటి ఆటల్లో ఉన్న థ్రిల్ క్రికెట్ చూడ్డంలో ఉండదు. భారత్ కు సరయిన పుట్‌బాల్ టీం లేకపోవడం వల్లే క్రికెట్ నిలబడ్డాది. ఈమద్య క్రికెట్ పాపులారిటి వేగంగా పడిపోతుంది ఇండియాలో కూడా

Srilu చెప్పారు...

Cricket and Soccer are way better than American Football.
Srilu

Srilu చెప్పారు...

BTW Your post is too good as usual. I follow your blog from the begining.

మా ఊరు చెప్పారు...

క్రికెట్ మీద యుద్ధమా.టపా టైటిల్ చూడగానే బాధ అనిపించింది.
ఈ క్రికెట్ ని ఎవరు కనిపెట్టారో గాని ..
w.g.grace(క్రికెట్ పితామహుడు)
హహహహా

పేరు చెప్తే గుర్తుపట్టేంత గొప్పవాడిని కాను చెప్పారు...

Ayyo nestam garu....baaaga badha pettaru nannu, mammalni, andulo kondarni....ante cricket game nachevallandarni....aina blogs undi mana madilo maata cheppenduke kada...kabatti ee sariki meeke naa otu....

బ్లాగాగ్ని చెప్పారు...

క్రికెట్ వ్యతిరేకులంతా కలిసి ఒకచోట చేరినట్లున్నారు. ఇంకా ఊరుకుంటే లాభం లేదు. నేనీ ప్రయత్నాన్ని పిచ్చ పిచ్చగా అడ్డదిడ్డంగా ఖండిస్తున్నానంతే. అసలు ఈ ఆడవాళ్ళకి క్రికెట్ అంటే ఎందుకంత కచ్చో అర్థం కాదు. మా ఆవిడ కూడా ఓవరు మొదలెట్టటం ఆలస్యం ఇంకెన్ని బాల్సున్నాయి, ఎవరూ అవుటవట్లేదేమిటి, మరీ ఇంత నెమ్మదిగా ఆడుతున్నారేంటి అని ఒహటే నసుగుడు. దెబ్బ తట్టుకోలేక ప్రత్యక్ష ప్రసారం నించి క్రిక్ ఇంఫోకీ, దాన్నించి హైలైట్సుకీ, ఇప్పుడు పేపర్లో వార్తలకీ మాత్రమే పరిమితమయ్యా. మా ఉసురు మీకు తగలక మానదు అని యమా సీరియస్సుగా శపిస్తున్నా.

పోస్టు కేక. చాలా బాగా వ్రాశారు. ఇంచుమించు నాక్కూడా ఇవే భావాలు మా ఆవిడ తమిళ డబ్బింగు సీరియళ్ళు చూస్తున్నప్పుడు కలుగుతాయి(తను చాలా తక్కువగానే చూస్తుంది లేండి అయినా ఆమాత్రం డోసుకే తట్టుకోలేని బలహీనుడిని)

Shashank చెప్పారు...

అసలు మనిషి ప్రగతి సాధించిందే క్రికెట్ ఆడేదానికి.. ఆడినప్పుడు చూట్టానికి. టీ.వీ లు గట్ర కనుకున్నదే క్రికెట్ ని ఇంటింటింకి చేర్చేదానికి. అసలు క్రికెట్ రుచి తెలిసిన అతి కొద్ది దేశాళ్ళో ఒకటైన మన భారతావని పుట్టి పెరిగి క్రికెట్ ని ఇన్నేసి మాటలనడానికి ఎన్ని గుండెలు అని నేను ప్రశ్నిస్తున్నాను!!!!! how is the dare you all question the religion of cricket?? ఇది చట్టరిత్యా నేరం. ఘోరం. అవమానకరం. ప్రతిబంతి ఆహ్లాదకరంగా ఉండే అతి తక్కువ క్రీడల్లో "మా" క్రికెట్ ఒకటి. ఖబర్దార్ .. దానికి తోడు మళ్ళా ఇంకో టపా ఒకటి.. x-( మి వారికి ఈ టపా చూపించండి ముందు..

జయ చెప్పారు...

చిత్రబాణాలు, ఉప్పుబద్దలు.. నేను కూడా ఇప్పుడే వింటున్నాను. ఈ చిత్రబాణాలు అన్న మాట నేను కూడా ఎక్కడన్నా ప్రయోగించాలనిపిస్తుంది. వీలుచూసుకొని ప్రయోగిస్తా...నిజ్జంఘా అండి నా క్కూడా క్రికెట్ అస్సలిస్టముండదు. అమ్మయ్యా! నాకు ఇన్నాళ్ళకి ఒక తోడు దొరికారు.

SRRao చెప్పారు...

" 11 మంది ఫూల్స్ ఆడుతుంటే 11 ,000 మంది ఫూల్స్ చూసే ఆట క్రికెట్ " అని జార్జి బెర్నార్డ్ షా ఎప్పుడో చెప్పాడు. దొరల ఆటని దొరలే తమ ఆక్రమిత దేశాల్లో అంటించిన జాడ్యం. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా కనబడదు. యువతను నిర్వీర్యం చేస్తున్న వాటిలో ఇదొకటి. విలువైన కాలాన్ని, ప్రజాధనాన్ని హరిస్తున్న క్రికెట్ ని ప్రభుత్వం నిషేధిస్తే బాగుండును. కానీ అంత ధైర్యమా ?

మంచు చెప్పారు...

క్రికెట్ మీద ఇంతకు ముందు ఒక మోస్తరు ఇంటరెస్ట్ వుండేది. ఈ పొస్ట్ చదివాక ఇంకా ఇంటెరెస్ట్ పెరిగింది.

మీ సీక్వల్స్ లొ సెకండ్ పార్ట్ ఎప్పుడు మొదటి పార్ట్ ని మించి వుంటుంది.. అందుకే నెక్స్ట్ పార్ట్ కొసం ఎదురు చూపు. అదెదొ త్వరగా రాసెయండి.

ఉప్పు బద్దలు విన్నా కానీ చిత్రబాణాలు కొత్తపదం.

Padmarpita చెప్పారు...

Soooo......many followers to you:)

karthika చెప్పారు...

hehe.

cricket ante istam leni vallu chaala mande unnaru andi nestham garu andulo nenu kuda unna.

tv lo cricket vasthe chalu inka tv mundu kurcho buddi kaadu.oka vela edanna manchi cinema vasthe ads eppduu vastayaa ani wait cheyyali.anni overs antha opikaga ela chustaro emo.

nenu oka post rasa cricket meeda vilu unte chudandii.

http://nenu-nenuga.blogspot.com/2009/04/cricket-cricket.html

బృహఃస్పతి చెప్పారు...

హ్మ్... టైటిల్ చూసి యమా ఫోర్స్ గా వచ్చా ఖండించేద్దామని... (అంటే?)

అయితే పోస్ట్ మస్తుగా ఉంది. చాలా నవ్వించింది. టెస్టులొద్దు, కనీసం ట్వెంటీ20 అయినా చూసి క్రికెట్ అభిమాని అయిపోవచ్చు కదా...

భావన చెప్పారు...

నేస్తం తెగ నవ్వించేసేరు కదా క్రికెట్ బాల్ పెట్టి కిత కిత లు పెట్టి మరి. ఆశ్చర్యం ఇంతమంది మధ్య వుండి కూడా మీకూ అంటుకోలేదంటే ఆ జ్వరం... ఎంత క్రికెట్ ఐతే మాత్రం మాయా బజార్ సినిమా ను అంటారా మీ చిన్నాన్న గారు, మీ తమ్ముడు... హన్న హన్నన్నా..

Srini చెప్పారు...

చాలా చక్కని టపా, చదువుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ఇలాగే రాస్తూ ఉండండి. మీ తర్వాతి టపా కోసం ఎదురుచూస్తూ..

Bhãskar Rãmarãju చెప్పారు...

100/10

Anil Dasari చెప్పారు...

ఎంత ధైర్యం క్రికెట్‌ని ఆడిపోసుకోటానికి????? ఉత్తినే చూట్టం కాదు .. ఆడి చూడండి ఆ మజా ఏంటో తెలుస్తుంది (మన్లో మాట. నేను క్రికెట్ చూడను, ఆడతాను - 'హార్లిక్స్ తాగను, తింటాను' లాగా. ఇరవై రెండేళ్లుగా ఎత్తిన బ్యాటు దించకుండా ఆడతాండ. ఇప్పట్లో దించ. టెండూల్కర్ కన్నా లాంగ్ కెరీర్ అనుపించుకోవాలనో బుల్లి కోరికన్నమాట. ఆ సోది తర్వాత వివరంగా టపా రాస్తా)

ఈ విషయంలో బ్లాగాగ్ని తదితరులకి నా నిష్షరతు మద్దతు ప్రకటిస్తున్నాను. కులమతాలకతీతంగా దేశాన్ని ఏకం చేస్తున్న క్రికెట్‌పై అతివల నేతృత్వంలో జరుగుతున్న ముప్పేట దాడిని భీభత్సంగా ఖండిస్తున్నాను. క్రికెట్ ధాటికి తమ జీడిపాకం సీరియళ్ల వ్యూయర్‌షిప్పూ, రేటింగ్సూ పడిపోతున్న కారణంతో అమాయక మహిళలను రెచ్చగొట్టి టెలివిజన్ ఛానెళ్లు చేస్తున్న కుట్ర ఇది.

మరువం ఉష చెప్పారు...

సరి ఎన్నో గొడవలైపోయాక సంధి చేసుకుని వదిలేసీన సంత ఇది మా ఇంట్లోనూ... అదీకాక దేశ పరువు ప్రతిష్ఠ దీనికి అన్వయించేయటం నాకు నచ్చదు. కానీ చిన్నా పెద్దా తేడాలు, పల్లె పట్నం తేడాలు లేకుండా అభిమానుల్ని మూటకట్టుకున్న ఆటగా నన్నూ ఆకట్టుకుంది. ఇక ఆస్ట్రేలియా లో వున్నామిదివరలో అక్కడ మరీ దురభిమానం. చక్కగా మీదైన శైలి. నైస్.

జాహ్నవి చెప్పారు...

క్రికెట్ భాధితులు ఇంత మంది ఉన్నారా?? మా ఇంట్లో ఎవరూ క్రికెట్ చూడరుగా.... అదృష్టం. హైలెట్స్ మా అమ్మా, నాన్న చూస్తారు. నేను అది కూడా చూడను. పేపర్ లో చూసి చదివేసి జి.కె. పరీక్ష కి మాత్రం ప్రిపేర్ అయిపోతా. అన్నట్టు నేను మనవాళ్లు ఆడిన వరల్డ్ కప్ పేపర్ కట్టింగ్స్ తో ప్రాజెక్ట్ కూడా తయారు చేశా. ఇది చూసి నేను క్రికెట్ అభిమానిని అనుకుంటారు కానీ LBW ఎలా నిర్దారణ చేస్తారో ఇప్పటికీ అర్దం కాదు.

నేస్తం ... ఎప్పటిలా మీ పోస్ట్ అదుర్స్... :-)

Anil Dasari చెప్పారు...

@జాహ్నవి

LBW నిర్ధారించటం చాలా సింపుల్. కాలు అడ్డం లేకపోతే బంతి వికెట్లకి తగుల్తుందనుకుంటే అది ఔట్. అంతే.

ఐతే, కొన్ని సార్లు ఆ సంగతి కనుక్కోటం కష్టం. అందుకని, దాని కోసం కొన్ని కొండ గుర్తులు వాడతారు అంపైర్లు. సాధారణంగా, బ్యాట్స్‌మన్ crease బయటికొచ్చి ఆడేటప్పుడు outer legకి బంతి తగిలితే అది నాటౌట్. ఈ నిబంధన ఉపయోగించుకునే, జిడ్డాట ప్రవీణులు టెస్టుల్లో ముందుకొచ్చి మరీ deliberate padding చేసి బౌలర్లని విసిగిస్తుంటారు :-)

నేస్తం చెప్పారు...

శివ గారు నిజమే పెప్సి &కోక్ జనాల్లో క్రికెట్ క్రేజ్ బాగా పెంచాయి.
srilu గారు థేంక్స్ అండి ..మితం గా చూస్తే ఏదైనా బాగానే అనిపిస్తుంది :)
మా ఊరుగారు ఆ గ్రేస్ ఎవరో చచ్చి బ్రతికిపోయాడు.. :) టైటిల్ చూస్తేనే మీరింత బాధపడితే మరి లోపల మేటర్ మొత్తం అనుభవించినదాన్నీ నేనెంత పడాలండి
@ పేరు చెప్తే గుర్తుపట్టేంత గొప్పవాడిని కాను ..ఎంత మంచారండి నాకోసం పాపం మీ క్రికెట్ మీద ప్రేమ ప్రక్కకు తోసి నాకు ఓటు వేసేసారా .. :)
>>>అసలు ఈ ఆడవాళ్ళకి క్రికెట్ అంటే ఎందుకంత కచ్చో అర్థం కాదు
బ్లాగాగ్ని గారు ఎంత మాట ఎంత మాట..మీరు నా తరువాత పోస్ట్ చదివి ఈ మాట అనండి చూద్దాం ..

నేస్తం చెప్పారు...

అమ్మా దివ్యా ,ఇక్కడ శశాంక్ ఏంటో ఆవేశ పడిపోతూ ఏదో అంటున్నారు ఒకసారి ఇలా రామ్మా మంచి నీళ్ళు గ్లాస్ పట్టుకుని ..
జయ గారు ఆ తిట్టు మీకూ నచ్చిందా నాకూ భలే ఇష్టం ..
srrao గారు ఆ మాట గట్టిగా అనకండి ఇక్కడసలే క్రికెట్ ప్రియులు ఆవేశ పడిపోతున్నారు
మంచు పల్లకి గారు భలే కనిపెట్టారు ..అసలు కారణం ఏంటంటే రెండొపోస్ట్ రాద్దామని మొదలు పెట్టే సరికి ఆ సోది చేట భారతము అయిపోయి మొదటి పోస్ట్ అయిపోతుంది ..అది సంగతి :)
పద్మా అయితే ఓ hi5 నీకు

నేస్తం చెప్పారు...

హా కార్తీక చదివాను ..బాగారాసారు మీ కష్టాలు ..నిజమే ఎక్జాం టైంలోనే మొదలవుతుంది క్రికెట్ సీజన్ ...మా మావయ్య అయితే కరెంట్ పోతే వాళ్ల ఊరినుండి కూడా కాల్ చేసి అడిగేవాడు స్కోర్ :)
బృహఃస్పతి గారు ప్లిచ్ అసలేమాత్రం చాన్స్ లేదండి..మా ఆయన పుణ్యమా అని ఫుల్ విరక్తి వచ్చేసింది నాకు క్రికెట్ అంటే :(
శ్రీనివాస్ థేంక్స్ అండి :)
రామరాజు గారు ఇలా ఉన్నట్టుండి మునగ చెట్టు చిటారుకొమ్మన కూర్చో పెట్టెస్తే ఎలా క్రిందకు దిగాలండి బాబు ..
>>>>ఎంత ధైర్యం క్రికెట్‌ని ఆడిపోసుకోటానికి????? ఉత్తినే చూట్టం కాదు .. ఆడి చూడండి ఆ మజా ఏంటో తెలుస్తుంది
అబ్రక దబ్ర గారు ఈ డయిలాగేమన్నా క్రికెట్ ఆడే అబ్బాయిలందరూ దత్తత తీసుకున్నారా ..మా ఆయన కూడా ఇదే అంటారు నేను గొడవపెడితే ..

నేస్తం చెప్పారు...

ఉషా ..మా ఇంట్లో ఇంకా పోరాటాలు ,సత్యాగ్రహాలు జరుగుతునే ఉన్నాయి..ఇదిగో ఈ మద్య ఈ బ్లాగులు అలవాటు అయ్యాకా తగ్గింది లేండి నా పోరు ఆయనకు ..
జాహ్నవి మా ఆయన ఈ l.b.w గురించి నాకు ఈ పాటికి 100 సార్లు చెప్పి ఉంటారు .చివరకు ఆయనకు నాకు విసుగొచ్చి ఆ విషయం మాట్లాడుకోవడం మానేసాం..
అబ్రకదబ్ర గారు అదన్నమాట సంగతి ఇంట్రెస్ట్ లేకపోతే ఏదీ ఎన్ని సార్లు చెప్పినా అర్ధం కాదు :)

అజ్ఞాత చెప్పారు...

:) మన దేశంలో (ఆడవాళ్లలో సైతం) క్రికెట్ ను అభిమానించేవారు, ద్వేషించేవారు - ఈ రెండు జాతులవారే ఉన్నారు. కాగా కొంతకాలం కిందట దేశంలోని ఆడవాళ్ళలో క్రికెట్టుకు ప్రచారం కల్పిస్తానని బ్యాటు పుచ్చుకుని బయలుదేరింది ఒక తింగరి. అన్నట్లు ఎవరూ గుర్తించలేదుగానీ క్రికెట్టుకు సంబంధించినంతవరకూ ఆమే భారతదేశపు మొట్టమొదటి ఛీర్ లీడర్!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నేస్తం,
ఉప్పుబద్దలు పేరు చదవగానే నోట్లో నీళ్ళూరాయండీ..అసలు అక్కడ నేనే ఉంటే క్రికెట్ పక్షాన కాకుండా ఉప్పుబద్దలకోసం మీ టీం లోనే ఉండేవాడినండీ..:)
మీకో విషయం చెప్పనా!! నాకు క్రికెట్ అంటే వరల్డ్ కప్ మేచ్ లు అది కూడా ఇండియా అడినప్పుడే తప్పకుండా చూస్తాను. మిగిలిన మ్యాచ్ లు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. ఈ లెక్కన నాక్కాబోయే భార్య ఎంత అదృష్టవంతురాలో కదండీ??

మీ టపా కి A++++++++....+ అలా మీ ఊరు నుండి మా ఊరు దాకా వేసేసుకోండీ '+' లు.

నేస్తం చెప్పారు...

భావన గారు అదేకదా మరి..మాయాబజార్ ని ఏమనడు కాని రామారావు మిగిలిన సాంఘికాలన్నీ తెగ తిడతాడు..అదొక్కటేనా వాడికి ఘంటశాల పాటలు కూడా నచ్చవ్ ..రొమాంటిక్ సాంగ్ కూడా భక్తి పాట పాడినట్లు పాడతాడంట ..మా నాన్నకు వాడికి ఈ విషయంలో ఏమాత్రం పడదు ..
సాహిత్యం గారు ఎవరండి ఆ తింగరి :?
శేకర్ మీ ఆవిడ ఎలాగయినా బంగారు పూలతో పూజ చేసుకుని ఉంటుంది క్రితం జన్మలో :)

Sravya V చెప్పారు...

మీ పోస్టు కి 10/10. ఇంకేవరండి ఆ తింగిరి - మందిర బేడి :)

హరే కృష్ణ చెప్పారు...

ఎంత అన్యాయం కదా !
బాధ నిజంగానే ఉంటుంది మీకు కాదు...మీ తమ్ముడి కి . అప్పుడే చెప్పేశారు కదా ఓ.. ఓ..సీసాలు సీసాలు తాగేస్తున్నారు అని పూరి జగన్నాధ్ వాడేసాడు కాపీ రైట్ట్స్ తీసుకోకుండా :(
ఏం మీ సావిత్రి మాత్రం తాగలేదా పీపాలు పీపాలు ..ee dialogue tho నాతో ఆఫీసు లో విజిల్ వేయించేసారు మొత్తానికి


ఓవరాక్షన్ నిక్కర్లు 10th క్లాసు ..రచ్చ..నాకూ ఇలాంటి తమ్ముడు వుండాల్సింది :(

manohar చెప్పారు...

adhentonandi evaremanna..cricket vasthey emi gurthu raadhu...Tenth class to M.Tech exams....EAMCET to GATE... Ramyakrishna to Kajal agarval....chiranjeevi to mahesh babu.... family gurthuku raaney raavu... sachin batting chestunnantha sepu bayam....ekada out avuthaadonani...devudiki mokkutooo...exams ki kooda antha ga devudiki mokkanu....pak match antey...devudu photo dhaggara ettukoni maree choostha match...match odi pothey paapam devudni antam...gelisthey SACHIN ni pogudutham... Match gelichina prathi saari naa energy levels 200% peruguthaayi... marks anni ekkuva vachestayi....odi pothey pedha digulu....asala accept cheyyabudhi kaadhu... india world cup nundi vachesinapudu evariki teleekunda enthagaa edchaano....... :p

manohar చెప్పారు...

tirupathi lo chadhuvuthundagaa..road pina akkadakkadaa TV pedathaaru...apudu chaala mandhi vastaru...abba entha baavuntundho...antha nilchoney chooddam...kanapadee kanapadaka...yuvi six kodithey janala comments vintey abba..annam kooda tinabudhi avvadhu...Ee kerala ki vachaka room lo system lo match chooddam antha nachadhu..but cricket kaabatti books anni pakkana visiri kotti choosey vadini....appatikee apudapudu road piki velthaa choodham ani...TWIST entantey ee edhavalaki cricket nachadhu...ekkado okkaro idharo choostuntaru...vaallu kaasta vaalla style lo malayalam lo comments...artham kaakapoina baley aanandham... mana vaallani pogidaarani....ayyo cricket andi cricket... ala crichet tho entha mandhi road pina parichiyamayyaro... pedha pedha officers kooda vachi...arey babu score entha naanna konchem cheppava ani car aapi adigi gelisthey andharlo kanapadey aa utsahaammm...ayyo adhi anubavinchalandi...


manohar--- am back after lullllllll

manohar చెప్పారు...

ayyo ksaminchaali nestham akka gaaru.. post gurinchi marchipoya cricket aney sariki...ipudey trans nundi bayata padda.... as usual andi iragadheesaru.... cricket ki opposite ga maatladithey nachakapoinaa...sarey... nestam akka post kadhaa...interesting ga chadhivaa.... akka meeku epudu experience ledhu sariggaaa...untey cricket antey thega ista padathaaru.... baava gaari ni adagandi... aa cricket trans ela untundho cheptaru...gelisthey aa anandham...odipthey aa badha telsusu kondi..... :p

Rajendra Prasad(రాజు) చెప్పారు...

చాలా బాగుంది...office లో ఏదో పని ఉండి అ ఇష్టంగానే వచ్చాను.మీ టప చదివేసరికి ఎక్కడ లేని energy వచ్చేసి పని మొదలు పెట్టేసాను...:)

నేస్తం చెప్పారు...

ఒహ్ శ్రావ్యా,మందిరా బేడీయా..అసలు తను వచ్చాకే వరల్డ్ కప్ కుటుంభ సమేతంగా చూడాలంటే భయపడేవారు మా ఇంట్లో :)
హరే క్రిష్ణ గారు మా తమ్ముడు అంత బాగా నచ్చేసాడా :( ఈ లెక్కన నా పోస్ట్లో మార్పులు చేర్పులూ చేయాలి నేను ..
మనోహర్ మీ కామెంట్స్ ఉత్సాహం చూస్తే నే అర్ధం అయిపోతుంది మీకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ..నా తరువాత పోస్ట్ లో చెప్తాను కదా మా ఆయన క్రికెట్ అంటే ఎంత ఉత్సాహ పడిపోతారో :)
రాజేంద్ర ప్రసాద్ గారు :) థేంక్స్ అండి

అజ్ఞాత చెప్పారు...

who said cricket played by eleven persons

Cricket is played by 13 ppl not 11
2 from batting team and 11 frm fielding team

lets say abt fielding position
Fine leg, Short fine leg, Deep Square leg, Square leg, Short leg, Backward square leg, Deep Backward square Leg, Mid Wicket, Short Midwicket, Deep Mid wicket, Long on, Mid on, Short Mid on, Long off, Mid off, Short Mid off, Covers, Deep cover, Extra cover, Deep Extra Cover, Point, Deep Point, Silly Point, Short cover, Gully, Third Man, 1st slip, 2nd slip, 3rd slip, 4th slip, Leg Gully, Leg Slip, Silly Mid off, Silly Mid on, Cover point, Deep Cover Point, Forward Leg, Short Forward Leg, Deep Forward Leg, Deep Gully, Forward point region, Deep Forward pt region, Backward pt, Deep Backward pt, sweeper..

ramining in next part

Dhanaraj Manmadha చెప్పారు...

Vaadi peru Doug Lehmann. A Britisher. Hehehehehehehehehehehehehehehehehe

:-D

Post is Hehehehehe. Hilarious

ప్రియ చెప్పారు...

Nestha don't like cricket. Well. Let it be. Amen ;-)

Shashank చెప్పారు...

nEstam - http://aakasam.blogspot.com/2009/10/blog-post_10.html

feel aite cheppandi.. champions league O rendu mAtchulu chudani meeru feel ayyarani..

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు
బాబోయ్ ,బాబోయ్ ఎంత క్రికెట్ అంటే ఇష్టం లేదు అంటే మాత్రం క్రికెట్ గురించి ఇన్ని విషయాలు ఒక్క కామెంట్ లో చెప్పెస్తారా .. పైగా ramining in next part నా :(
ధన్ రాజ్ ఎవరు ఆ Doug Lehmann ..క్రికెట్ కనిపెట్టినవాడా ??మరి w.G గ్రేస్ ఎవరు ??
ప్రియ :)
శశాంక్ మీ పోస్ట్ చదివి అప్పుడు చెప్తా

Dhanaraj Manmadha చెప్పారు...

అదే మరి. క్రికెట్ అంటే ఇష్టం లేనట్టు రాసి, ఇప్పుడు డబ్ల్యు జి గ్రేస్ గురించడుగుతున్నారు. ఇదేదో అంతర్జాతీయ కుట్రలా ఉంది. ;-)

ఆయన తొలి సూపర్ స్టార్.

కృష్ణ కాదు. గ్రేస్

అజ్ఞాత చెప్పారు...

ఆ మాట గట్టిగా వినిపించింది.. అందుకే మిగతా comment నెక్ష్ట్ పార్ట్ లో రాయాలి :)

........................ చెప్పారు...

:)

నేస్తం చెప్పారు...

సార్ ధన్ రాజ్ గారు మావూరు బ్లాగరు చెప్పారు w.g గ్రేస్ అని ఓ మారు పై కామెంట్స్ చదవండి..హన్నా నన్ను తప్పు పట్టేద్దామనే ..
అఙ్ఞాత గారు ఏ మాట గట్టిగా వినబడింది ..అర్ధం కాలేదు :(
సౌజన్య కుమార్ :)

శ్రీలలిత చెప్పారు...

నేనూ మీ జట్టే.

అజ్ఞాత చెప్పారు...

"ఆ మాట గట్టిగా అనకండి ఇక్కడసలే క్రికెట్ ప్రియులు ఆవేశ పడిపోతున్నారు "...ఆ మాట

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

బుజ్జమ్మా.. బుజ్జమ్మా... (అరుంధతి- జేజెమ్మా.. లెవల్లో ఓ పాటేసుకో నేస్తం!)
బుజ్జమ్మా.. బుజ్జమ్మా...
క్రికెట్టు మీద పంతం పట్టి పోస్టు రాసేశావమ్మా...
ఎప్పట్లాగే మా దగ్గర ఫుల్లుమార్కులు కొట్టేశావమ్మా...
బుజ్జమ్మా.. బుజ్జమ్మా...

మీ పోస్టులకు కామెంట్లు సెంచరీలు కావాలని కోరుకుంటూ...

Dhanaraj Manmadha చెప్పారు...

chudandi wg grace ki munde cricket puttindi.

http://en.wikipedia.org/wiki/W_G_Grace

idi cricket gurinchi.

http://en.wikipedia.org/wiki/Cricket

ekkadaa wg grace kanipettaadani cheppaledu. entha mee oorainaa meeeku thappudu samaachaaram ivvatamenaa? Hannaa?

పరిమళం చెప్పారు...

"ఈ క్రికెట్ ని ఎవరు కనిపెట్టారో గాని వాళ్ళను చితక్కోట్టి చిత్రబాణాలు పెట్టేయాలన్నంత కోపం వచ్చేస్తుంది" ...నాక్కూడా....
చిత్ర బాణాలంటే తెలియక పోయినా అదేదో భయంకరమైనదే అని డిసైడ్ అయి మీతో చేరిపోతున్నానండీ :)

నేస్తం చెప్పారు...

లలిత గారు రండి మన అమ్మాయిలందరం ఒక జట్టే ఇక్కడ మేగ్జిమం :)
అఙ్ఞాత గారు :) అవునూ మీపేరు చెప్పచ్చుకదండి :)
నరేష్ సహజం గా నా బ్లాగ్ కి 100 కామెంట్స్ రావాలనుకోవడం అందరూ అనుకునే విషయం కాని ఎదుటివాళ్ళకు రావాలని అనుకోవడం ఉంది చూసారు.. ఎంత మంచివాళ్ళండి మీరు :)
ధన్ రాజ్ మొత్తానికి నా రివెంజ్ ఎవరిపై తీర్చుకోవాలో అని హెల్ప్ చేసినందుకు చాలా థేంక్స్ మరి
పరిమళం గారు నాక్కూడా తెలుయదు కాని నేనూ మీలాగే డిసైడ్ అయిపోయా

మంచు చెప్పారు...

సెంచురి అయ్యేవరకు సెకండ్ పార్ట్ రాయరా.... చెప్పండి రెపటికల్లా సెంచురి అయిపొతుంది...

kiranmayi చెప్పారు...

"ఓఓఒ బుజ్జి అమ్మా, బుజ్జి అమ్మా, బుజ్జి అమ్మా... క్రికెట్ ఫాన్స్ కళ్ళల్లో కారం పోసావమ్మా , ఓఒ ఒసే బుజ్జి అమ్మా.
క్రికెట్ ఫాన్స్ అందరితో తిట్టిపిచ్చుకున్నవమ్మా... ఓఒ ఒసే బుజ్జి అమ్మా"

పాట meaning less గా ఉందా? ఉంటుంది. ఎందుకుండదు? (ఎ మాటకామాట చెప్పుకోవాలి. రిధం కోసం చాల ట్రై చేశా. ఇలా అయితేనే కుదిరింది. ఏంటో ఈ మధ్యన మీ మీద జనాలు పాటలు వ్రాసేస్తున్నారు) మరి మీరు మాకు అంత ఇష్టమయిన గేమ్ ని అన్ని మాటలంటారా? ఎంత ధైర్యం? హన్నా? "cricket హమారే లియె సిర్ఫ్ ఖేల్ నహి, హమారా ధరం హై" ఈ డైలాగు మీరు వినలేదా? పైగా తరవాతి పోస్ట్ కోసం ఎదురుచూడాలా? మర్యాదగా నెక్స్ట్ పోస్ట్ వెంటనే వ్రాయండి.

ఎప్పటిలాగే పోస్ట్ అదుర్స్.

నేస్తం చెప్పారు...

@ మంచుపల్లకి ...రామ,రామా పాపం శమించుగాక ,అంటే నేను వాఖ్యలకోసం ఎదురు చూస్తున్నాననేగా అర్ధం.. ఈ అభాండాన్ని ఖండించడానికైనా సరే ఈ రోజే కొత్త పోస్ట్ వేసేయాలి :)
@ కిరణ్మయి ..అహో.. ఆంద్ర దేశం లో పుట్టి ,అందులోనూ ఆడపిల్ల అయి కూడా క్రికెట్ ని ప్రోత్సహిస్తున్నారంటే ఏమనుకోవాలి మిమ్మల్నీ ...దీన్నే విది వైపరిత్యం అంటారు..బ్రహ్మం గారు ఆనాడే చెప్పారు అనుకోని దుస్సంఘటనలు ఎన్నో ముందు ముందు జరుగుతాయని..అది ఇదేనేమో :/

amma odi చెప్పారు...

మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
10000000/10
ఇది మీ అన్ని పోస్ట్లకి వర్తిస్తుంది ! ఇంచుమించు మీ క్రికెట్ కష్టాలే నావి కూడా చిన్నప్పుడు !
- పద్మ.

నేస్తం చెప్పారు...

అమ్మవడి గారు,పద్మ థేంక్స్

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

ఏం చెప్పాలో అర్ధం కావటం లేదండి పోస్ట్ చాలా చాలా బాగా రాసారు కానీ నాకు క్రికెట్ అంటే ఇష్టం ఏం చేస్తాం కానీయండి ఏదో ఒకరోజు మీరు మా జాబితా లోకి చేరతరేమో

Sandeep P చెప్పారు...

మీ వ్యాసం చక్కగా ఉందండి. ఐతే నేను క్రికెట్టుకు వీరాభిమానిని. తెండుల్కర్ కనబడితే నాకు దిమ్మదిరిగి మైండ్ బ్లాకైపోతుంది. Cricket is my religion. Sachin is my God :-)

నేనూ త్వరలో గోళ్ళరంగులు, నూనెసీసాలు, బొట్టుబిళ్ళలు, టీ.వీ.సీరియళ్ళు, బ్యూటీ పార్లర్లూ మొ. విషయాల మీద ఒక వ్యాసం వ్రాస్తాను :-డ్