3, జులై 2009, శుక్రవారం

కలహాలు కూడా కమ్మగానే ఉంటాయి మరి



కలహాలు కమ్మగా ఉండటం ఏంటనుకుంటున్నారా,మరదే..పెళ్ళి అయిన కొత్తలో మొదటి కలహం ఒకసారి గుర్తు తెచ్చుకోండి..పెదవులపై చిరుధరహాసం వచ్చేస్తుంది చూసుకోండి.. ఆ తరువాత తరువాత జీవితమే కలహాలమయం అయిపోతుంది అది వేరే విషయం అనుకోండి...కాని మొదటి కలహం చాలా అపురూపంగా ఉంటుంది మనసు పొరల్లో గుర్తు ఉండిపోయి ,నా విషయం లో అయితే పెళ్ళి అయిన కొద్ది రోజులకే మొదలు పెట్టేసాం పోట్లాట ..

పెళ్ళి అయిన తరువాత నేను ఇక్కడకు రాకముందు కొద్దిరోజులు మా అత్తగారి ఇంట్లో ఉన్నాను .నాకిప్పటికీ బాగా గుర్తు కొత్తగా అత్తవారి ఇంట్లో అడుగుపెట్టగానే ఎంత టేన్షన్ గా,భయం గా ,మొహమాటం గా అనిపించిందో..ఆ రోజు రాత్రి నిద్రలో మెలుకువ వచ్చి చుట్టూ చూసి అసలు ఎక్కడ ఉన్నానో తెలియక దిగ్గున లేచి ఒక నిమిషం కంగారుపడిపోయి తరువాత పెళ్ళి అయిందన్న వాస్తవం గుర్తు వచ్చి గంట సేపు ఏడుస్తూ పడుకున్నాను..మావారితో అంతకు ముందు ఫోన్ లో మాట్లాడినా ఇంకా కొత్తదనం పూర్తిగా పోలేదు కాసింత గారం,కాసింత ప్రేమ ,కాసింత భయం ,కాసింత మొహమాటం అన్నీ కలగలపి ఉండేవి ..

మా వారి ఇంటి నిండా చుట్టాలు,బంధువులు,పిల్లలు ఎవరెవరో ,ఒక్కరు కూడా తెలియదు ..పైగా పది నిమిషాల కోమారు నన్ను చూడటానికి ఎవరెవరో వచ్చేవారు .. మా అత్తగారు నన్ను పిలిచి ఈమే నీకు అత్తయ్య వరస అవుతారు, ఆమె పిన్ని వరుస అవుతారు,తను ఇందాక వచ్చిన ఆవిడ ఆడపడుచు కూతురు అని పరిచయం చేసేవారు ..ఎవరు ఎవరో ,ఏమవుతారో ఏంటో కాస్త గజిబిజి గా ఉండేది , అదీ కాకుండా ఇంట్లో పెళ్ళికాని పిల్లలు ఉండటం వల్ల ,ఆ ఇల్లు కూడా మాట్లాడటానికి అనువుగా ఉండకపోవడం వల్ల మావారి తో కాసేపు సరదాగా మాటలాడాలన్నా కొంచెం భయం గా ఉండేది ..నాకు మినిమం మూడు వీదులకు వినబడేలా మాట్లాడానిదే మాట్లాడిన ఫీలీంగ్ రాదు..చిరునవ్వు నవ్వాల్సిన ప్లేస్ లో కూడా 36 పళ్ళు కనబడేలా పకాలున నవ్వుతాను .. అలాంటిది మెల్లిగా మాట్లాడాలంటే భలే కష్టం గా ఉండేది..తనదీ ఇదే పరిస్థితి ..ఇంట్లో ఉండగా ఏం మాట్లాడాలన్నా కాస్త మొహమాటం గా ఫీల్ అయ్యేవారు ..

ఇలా కాదనుకుని మరుసటి రోజు మా అత్తగారి దగ్గరకు వచ్చి అమ్మా దాన్ని హస్పిటల్ కు తీసుకు వెళతాను ..ఫ్రెండ్ కు బాబు పుట్టాడు ..పలకరించక పోతే బాగుండదు అన్నారు..నేను బెడ్ రూం లో బట్టలు మడత పెడుతూ ఒక చెవి వేసి వింటున్నాను ...అసలు ఏం మాట్లాడుతున్నావురా ,పచ్చని పారాణి ఉన్న పిల్లను హాస్పిటల్ చుట్టూతిప్పుతావా,ఇంకేమన్నా ఉందా నాలుగు రోజులు ఆగి వెళుదువులే అన్నారు మా అత్తగారు.. ఊరుకోమ్మా నీ చాదస్తం అని మా ఆయన గొడవ చేస్తున్నారు గాని మా అత్తగారు ససేమిరా అన్నారు .. నాకు భలే నవ్వు వచ్చింది.. పెళ్ళికి ముందు నాదీ ఇదే పరిస్థితి ,అయినా చెప్పినా వినిపించుకునే వారు కాదు ..బాగా అయ్యింది అనుకున్నాను ..


మరుసటి రోజు మా ఆయన మరొక మాస్టరు ప్లాన్ వేసుకుని వచ్చారు ..కాకపోతే ఏది చేసినా ముందు నాకు చెప్పరు ,ఇప్పటికీ అంతే .. సాయంత్రం ఇంటికి వస్తూనే అమ్మా ఫ్రెండ్ ఇంటికి పిలిచాడు భోజనానికి అన్నారు.. మొన్ననే కదరా పిల్ల ఇంటికొచ్చింది అప్పుడే బోజనాలేంటి ..నాలుగు రోజులాగి వస్తాను అని చెప్పు అన్నారు అత్తయ్య ..ఏంటమ్మా నువ్వు ఏం చెప్పినా అలాగే అంటావ్.. బాగోదు వెళ్ళకపోతే అన్నారు విసుగ్గా .. అది కాదురా పసుపుతాడు మెళ్ళో వెసుకుని బయటకు తీసుకు వెళితే గాలీ ,దూళి పడుతుంది..చీకట్లో అలా తీసుకు వెళ్ళకూడదు కొత్త పెళ్ళి కూతురిని అన్నారు ... దెబ్బకి నాకు భయం వేసింది,నాకసలే చిన్నపటి నుండి దెయ్యాలంటే మహా భయం ..పొరపాటున దెయ్యాల సినిమా చుసానో రెండు వారాలు పడుకునేదాన్ని కాదు ...ఊరుకోమ్మా చీకట్లో ఎవరు తీసుకు వెళతారు ,వాడేమన్నా అడవిలో ఉంటున్నాడా..దగ్గరే వాళ్ళ ఇల్లు తొందరగానే తీసుకొచ్చేస్తాను అని నాకేసి చూసి నువ్వేంటి బొమ్మలా నుంచున్నావ్ తయారవ్వు అని వెళ్ళిపోయారు .. ఏమో బాబు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినరు కదా ..మీ మంచికేగా చెప్పేది మా అత్తగారు అనుకుంటూ వెళ్ళిపోయారు .. ఇంక తప్పేది లేక తయారయ్యాను..


మావారితో మొదటిసారిగా బైక్ మీద ఎక్కి బయటకు వెళుతుంటే భలే సరదా అనిపించింది ...ప్రపంచం అంతా నాదే అన్నంత ఆనందం .. సరిగా కూర్చో,జారిపోతావ్ అని జాగ్రత్తలు చెబుతుంటే నాకు మా నాన్నే గుర్తు వచ్చారు..బండి ఒక చోట ఆపి ఇక్కడే ఉండు బైక్ పార్క్ చేసి వస్తా అనేంతలో ఒక అతను వచ్చి హలో బాగున్నారా ,సారీ అండి మీ పెళ్ళికి రాలేక పోయాను అని మావారితో అంటూ నావైపు చూసి
బాగున్నారా ..సినిమాకి వచ్చారా అన్నారు పలకరింపుగా..కాదండి భోజనానికి పిలిస్తే వచ్చాం అన్నాను ... అతను షాక్ తిన్నట్టు ఒక సారి నావైపు చూసి ఇబ్బందిగా నవ్వాడు ..ఈ లోపల మా ఆయన నా కాలు తొక్కారు ..అబ్బా నా కాలు తొక్కారు అని అంటూ పక్కకు జరిగాను ...మా ఆయన నావైపు కౄరంగా చూసారు... నాకర్దం కాలేదు ఎందుకలా మొహం పెట్టారో ... కాసేపు మాట్లాడి అతను వెళ్ళిపోగానే కయ్యిమన్నారు నాపైన.. బుద్ది ఉందా పెద్దవాళ్ళకు అలాగేనా సమాధానం చెప్పేది అన్నారు..నేనే మన్నాను అన్నాను అయోమయం గా ..సినిమా కొచ్చారా అంటే కాదు బోజనానికి వచ్చాం అని వెటకారిస్తావేంటి ..సినిమా హాల్ ఎదురుగా నించుని అన్నారు.. అప్పుడు చూసాను ఆ పక్కన కటవ్ట్లు ..ఊరు కొత్తది అవ్వడం వల్ల ,మొదటి సారి మా ఆయనతో బయటకు వస్తున్నా అన్న సంబరం వల్ల ఏమీ సరిగా గమనించలేదు ..నాకేం తెలుసు ఇంట్లో ఫ్రెండ్ ఇంటికి భోజనానికి అంటే అక్కడికే అన్న ఆలోచనలో ఉన్నాను అన్నాను.. అప్పటికీ కాలు తొక్కితే మళ్ళీ నాకాలు తొక్కుతారేంటి అని పైకి అన్నావు చూడు ..నాకు భలే కోపం వచ్చింది ఏమీ అర్దం చేసుకోవు తిక్క మొహమా అన్నారు ప్రేమ గా నవ్వుతూ ...


హాల్లో కూర్చున్నాక అన్నారు అది కాదురా ఇంట్లో అసలు మాట్లాడటానికి అవ్వడం లేదని ఇక్కడికి తీసుకువచ్చాను ఇప్పుడు చెప్పుఅన్నారు ... మా ఆయన పెద్ద హీరోలా అనిపించేసాడు ఎందుకో ఆ క్షణం లో .. ఈ లోపల సినిమా స్టార్ట్ .కొత్త సినిమా ..అందులోనూ కామెడీ సినిమా ..జనాలు ఇసుకవేస్తె రాలనట్లు పొలోమని ఉన్నారు.. సీను సీను కీ చప్పట్లూ ,నవ్వులూ ...ఆ గోలలో ఏం మాట్లాడుకుందాం అన్నా వినబడటం లేదు..మహా బోరు అనిపించింది .. అయిదు నిమిషాలు అయిపోగానే బయటకు వెళ్ళిపోదామా అన్నారు ..సరే సరే అన్నాను ఉత్సాహంగా..బయటకు రాగానే ఎక్కడికి వెళదాం అన్నారు.. బీచ్ కి అన్నాను ఉత్సాహం గా.. దా తవ్విద్దాం మొహం చూడు అన్నారు.. హూం ..మీ ఊర్లో బీచ్ లేదుగా ..పోనీ ఏదన్నా పార్క్ కీ అన్నాను ..ఉహు సరి అయినవి లేవు అన్నారు బైక్ స్టార్ట్ చేస్తూ..ఇంకెక్కడికెళతాం నా బొంద మనసులో అనుకున్నాను ..

బండి ఎక్కి మరి ఇప్పుడు ఎక్కడికెళదాం అన్నాను నిరుత్సాహం గా ..ఊరికే కాసేపు అలా తిరుగుదాం మా ఊరు నువ్వు చూడలేదుగా అన్నారు ..సరే అన్నాను...తను చిన్నపుడు చదివిన స్కూల్ ..ఈత కొట్టిన పిల్ల కాలువలు ఏవేవో చూపించారు .క్రమం,క్రమం గా ఇళ్ళూ ,కాలువలు దాటుకుని ఎక్కడికో తీసుకువెళ్ళారు ..చుట్టూ చీకటి ...చెట్ట్లు ,తప్ప ఇంకేం లేవు ... బండి ఆపి .. ఇప్పుడు
చెప్పు ..ఊరి చివరకు వచ్చేసాం ..హాయిగా ,ప్రశాంతం గా మాట్లాడుకోవచ్చు అన్నారు ...ముందు ఉత్సాహం గా అనిపించినా తరువాతా భయమేసింది ...మా అత్తగారి మాటలు గుర్తు వచ్చాయి.. కొత్త పెళ్ళి కూతురూ ,గాలీ,దూళీ అని ...


దూరంగా భోగి మంటలు వేసినట్లు మంటలు కనబడుతున్నాయి.... కొంపదీసి శ్మశానమా??..ఊరి చివరన అదేగా ఉంటుంది .. భయపడినట్లు తెలిస్తే అలుసైపోనూ ...ఆహా చల్ల గాలీ వీస్తుంది కదా అన్నారు...పైకి చూసాను..చెట్ట్లు ఊగుతున్నాయి ..రక రకాలా ఆలోచనలు మొదలయ్యాయి ,అవునూ .. దెయ్యాలు మర్రి చెట్టు మీద ఉంటాయా లేక చింత చెట్టు పైనా ???ఎదురుగా చందమామ గుండ్రంగా కనబడుతున్నాడు.. దెయ్యాలు పౌర్ణమి రోజున వస్తాయా బయటకు ???లేక అమావాస్యా? కొంపదీసి ఈ రోజు పౌర్ణమి కాదుకదా ..అందుకేనా చందమామ గుండ్రం గా ఉన్నాడు...మెల్లిగా బయలు దేరిన భయం బీకరంగా పెద్దదయింది ...మా పెద్ద అత్త అంతకు ముందు తన చిన్నపుడు తెల్ల బట్టలు వేసుకు వెళితే దెయ్యం ఎలా మీద పడిందో చెప్పింది ...నాకలాంటివి వినడమే భయం .. నా చీర చూసుకున్నాను ..క్రీం కలర్ చీర ...కొంపదీసి చీకట్లో దెయ్యాలకు కనబడక ఇది తెల్లచీర అనుకుంటాయో ఏమో ఖర్మా ...

మా ఆయనకు చిరాకేసినట్లు ఉంది ...ఉట్టపుడు అందరితో తెగ సోది వేస్తావ్ కదా తీరా ఇక్కడకొచ్చాక ఆకాశం,భూమి చూస్తావేంటి ..ఏదన్నా మాట్లాడు అన్నారు ...ఏమండీ అక్కడ మంటలెందుకున్నాయి అన్నాను ...శీతాకాలం కదా చలివేస్తుంది కదా అందుకే ఎవరో మంటలేసుకున్నారనుకుంటా అన్నారు....ఈ రోజు తిది ఏంటి పౌర్ణమా అన్నాను ...ఏమో ..ఏ ఎందుకని అన్నారు ..ఏమీ లేదు ఊరికే అడిగా ఇది చింత చెట్టా ,రావి చెట్టా అన్నాను పైకి చూస్తూ ... రెండూ కాదు కొబ్బరి చెట్టు ..ఇప్పుడు అది అవసరమా.. ఏదన్నా మాట్లాడవే అంటే ఈ రోజు తిది ఏంటీ ,వారం ఏంటీ ,ఇది ఏం చెట్టు ,కాయలు కాస్తాయా, పువ్వులు పూస్తాయా అనుకుంటూ ఉప్పర సోది వేస్తావ్ విసుక్కున్నారు మా ఆయన ...మరి ఇంకేం మాట్లాడను ఏదో ఒకటి మాట్లాడుతున్నాను గా నేనూ అరిచాను..

పక్కన ఏదో కదలిన సౌండ్ ..ఏమండి ఇక్కడ పాములుంటాయా కొద్దిగా భయం గా చూస్తూ అన్నాను ..ఇదిగో పిచ్చి భయాలతో లేనిపోని అనుమానాలు నాకు తెప్పించకు నీ ప్రాణానికి నాప్రాణం అడ్డు సరేనా ..హూం చెప్పు ఇంకా... మొన్న రాత్రి ఏదో చెపుతూ మద్యలో ఆపేసావ్ కదా ఇప్పుడు చెప్పుఅన్నారు .. నా దృష్టి అంతా అటు వైపు వెళుతున్న లారీల మీద పడింది ..ఈ సమయం లో ఒంటరిగా ఒక్కళ్ళమే ఉండటం మంచిది కాదేమో అనిపించింది ..అప్పటి వరకూ ఉన్న దెయ్యం భయం పోయి కొత్త భయం పట్టుకుంది .. మా ఆయన ఏదో చెబుతున్నారు గాని నాకు వినిపించడం లేదు.. ఏమండీ ఈ టైంలో ఇక్కడ ఒక్కళ్ళమే ఉండటం మంచిది కాదేమో అన్నాను మెల్లగా .. మా ఆయన నవ్వుతూ నా సంగతి తెలియదు నీకు ..జిం కి వెళ్ళే బోడీ యే ఇది ఎవరన్నా వస్తే అయిపోయాడేవాడు అన్నారు .. ప్రతీ మగాడు పెళ్ళాం దగ్గర చెప్పే కామన్ డయిలాగ్ ఇది గొణుకున్నాను .. ఏంటీ అంటున్నావ్ అన్నారు.. మా నాన్న కూడా ఇలాగే అంటారు నా అంత గొప్ప భలవంతుడు లేడని అన్నాను.మీ నాన్నకూ నాకూ పోలికా.. అంటూ నాన్న మీద జోకులెయ్యడం మొదలు పెట్టారు.. మామూలుగా అయితే ఉడుక్కుంటూ ఏదో ఒకటి అనేదాన్ని ..నాకెందుకో ఆ వాతావరణం ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది .....


ఇలా లాభం లేదని వెళ్ళిపోదాం అన్నాను ..ఎందుకు అన్నారు నావైపు చూస్తూ ..ఏం చెప్పాలో అర్ధం కాలేదు ..ఆకలేస్తుంది వెళ్ళిపోదాం ఇంటికి అన్నాను. ఇంకా ఎనిమిది కూడా కాలేదు ఇందాకా ఏమన్నా తింటవా అనంటే వద్దు అన్నావ్ అన్నారు .అప్పుడు ఆకలి వేయలేదు, ఇప్పుడు వేస్తుంది అన్నాను ..అంతే , చటుక్కున లేచి బండి స్టార్ట్ చేసి ఎక్కు అన్నారు సీరియస్సు గా.. తన మొహం చూడగానే గుండేల్లో దడ దడ మంది అయినా నేను చెప్పింది నిజమని ఒప్పించడానికి నాకు నిజంగానే ఆకలి వేస్తుంది అన్నాను .నేనేం నాకోసం ఇక్కడికి నిన్ను తీసుకురాలేదు నువ్వే నిన్నమీతో మాట్లాడడానికి కుదరడం లేదని అన్నావని తీసుకొచ్చాను, నువ్వేం పోజులు కొట్టేయక్కరలేదు అన్నారు ఆయన కోపం చూడాగానే భయం వేసింది ..అప్పటి వరకు ఎప్పుడు సరదాగా మాట్లాడే ఆయన ఒక్కసారి గా అలా మొహం పెట్టేసరికి ఏడుపొచ్చేసింది ..


దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ...హొటెల్ లో భోజనం తినబుద్ది కాలేదు అలా కలుపుతూ కూర్చున్నాను ..ఏమనుకున్నారో మరి, ఇందాక ఆకలో అని గొడవ చేసావ్ కదా ఇప్పుడేమయింది అన్నారు ..అంతే నాకు కళ్ళలో నుండి నీళ్ళు దారల్లా వచ్చేయడం మొదలు పెట్టాయి ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా ..ఇప్పుడేమన్నానే బాబు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు ..తల్లీ ఆపు చేయి కంగారుగా అని కర్చీఫ్ ఇచ్చారు ..నాకు అక్కడ భయమేసింది అన్నాను కళ్ళూ,ముక్కు తుడుచుకుంటూ ..సరేలే నువ్వన్నది కూడా నిజమే రాత్రి పూట ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు అందుకే తీసుకొచ్చెసా అన్నారు... హమ్మయ్యా ,దేవుడా నా మనసంతా తేలికైపోయింది తను నార్మల్ గా ఉండటం చూసి .. మా మొదటి కలహం అలా తప్పి పోయింది అని అనుకున్నాను కాని నాకేం తెలుసు ఆ తరువాత రెండు రోజులకే గొడవ అవుతుందని :)

71 కామెంట్‌లు:

లక్ష్మి చెప్పారు...

Too Good :) and I'm the first one to comment...hurraa

Srujana Ramanujan చెప్పారు...

:-)

I'l write after some time.

జ్యోతి చెప్పారు...

hmmmm. మీరు చెప్పినదంతా మా కళ్లుముందు కదిలింది సినిమాసీన్ లా.. కానివ్వండి..

నేస్తం చెప్పారు...

హ హ లక్ష్మి గారు నేనూ ఫస్ట్ మీ కామెంటే చదివాను హుర్రే హుర్రే
సృజన ఇక్కడ వెయిటింగ్ మరి నేను
జ్యోతిగారు :)

జ్యోతి చెప్పారు...

నేస్తంగారు,

మీమీద ఒక దారుణమైన ఆరోపణ ఉంది. అదేంటోగాని మీ టపాలకు మా పాత జ్ఞాపకాలు తిరగతోడి వాటికి సీక్వెల్ రాయాలనిపించేలా చేస్తున్నారు. ఎందుకంటే మనసు పొరల్లో దాచుకున్న మా కబుర్లు ఇంచుమించు అలాగే ఉంటాయి మరి. మీలా రాయలేకున్నా, ఒక్కసారి రివైండ్ మాత్రం చేసుకుంటున్నానులెండి. ధాంక్స్...

సుజ్జి చెప్పారు...

ఎక్కడికి వెళదాం అన్నారు.. బీచ్ కి అన్నాను ఉత్సాహం గా.. దా తవ్విద్దాం మొహం చూడు అన్నారు.. hahahahaaaaaaa...

kosamerupu adhurus..!!

అజ్ఞాత చెప్పారు...

కాళ్ళు తోక్కినందుకు ఎంత పెద్ద శిక్ష..

నేస్తం చెప్పారు...

జ్యోతిగారు నిజం చెప్పాలంటే ఈ బిజీ పనుల్లో రొటీన్ లైఫ్ నుండి రిలాక్స్ అవ్వడానికి ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను..మీరు కూడా కాసేపు పాత ఙ్ఞాపకాలలో తిరిగి వస్తే అంతకన్నా కావలసింది ఏముంది :)
సుజ్జి హ హ :)
అఙ్ఞాత గారు నేనా !!!శిక్షా !!! మళ్ళీ ఒకసారి చదివి చెప్పండీ నా తప్పేమన్నా ఉందా :)

మురళి చెప్పారు...

మీకెన్ని భయాలండి.. బాగుంది టపా..

Shiva Bandaru చెప్పారు...

:)

పరిమళం చెప్పారు...

అన్ని ఆటంకాలూ ,భయాలూ , కన్నీళ్ళూ దాటుకొని వచ్చేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంటే చివర ఈ ట్విస్టేమిటండీ బాబూ ....తర్వాతి టపా త్వరగా రిలీజ్ చెయ్యాలని 'బ్లా చ స 'తరుఫున డిమాండ్ చేస్తున్నా :)

నేస్తం చెప్పారు...

మురళిగారు భయం ముందు పుట్టి నేను తర్వాత పుట్టానేమో అని పిస్తుంది అప్పుడపుడు..:)
siva గారు :)
హ హ పరిమళం గారు త్వరలో రాస్తాను :)

శ్రీనివాస్ చెప్పారు...

ఈ కధ సరే రెండు రోజుల తర్వాత ఏమైంది ????

Srujana Ramanujan చెప్పారు...

ఏమండీ నేస్తం గారూ,

మీరు నాకు కాస్త పోట్లాట ఎలా పెట్టుకోవాలో నేర్పుతారా?

మీకంత భయం అంటే నమ్మలేకపోతున్నాను. మీ ఊరి చివరి సీన్లు నిజంగానే అక్కడ ఉన్న అనుభూతిని కలిగించాయి. మీరేమన్న పత్రికలకి కథలు పంపకపోయారా? మీ అక్కయ్య కోరిక నిజం చేసేలా? :-)

ఏమంటారు?

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

నా తలనొప్పి సగం తగ్గిపోయింది.. థాంక్స్...

Padmarpita చెప్పారు...

నేస్తం..... త్వరగా ఆ రెండు రోజుల తరువాత అయిన గొడవ చెప్పరా!...ఊరించి ఊరించి...మరలా సస్పెన్సా!

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం గారు, భలే ఉన్నాయ్ అండి మీ కలహాలు...ఇలాంటి తియ్యటి కలహాల కోసం అయినా తొందర పెళ్లి చేసుకుంటే బావుండనిపిస్తుంది...హ హ .. మీరు చెప్తుంటే అక్కడ ఏమి జరిగి ఉంటుందో ఒక రీల్ వేసుకున్నాలెండి... మరో పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా... మరో విషయం..హరివిల్లు, చిరుజల్లు బ్లాగ్లు క్రియేట్ చేసింది నేనే... ఆకాశవీధిలో చేసింది కూడా నేనే...తీరిందా మీ సందేహం!! :)

నేస్తం చెప్పారు...

శ్రీనివాస్ రెండురోజుల తరువాత పేద్ద గొడవ అయ్యింది :P
సృజన ఒక సారి పెళ్ళి అంటూ చేసుకుంటే గొడవలు ఆటోమెటిక్ గా వచ్చేస్తాయి ప్రత్యేకం గా నేర్చుకో అక్కరలేదు :) చాలా కధలు రాసుకునేదాన్ని ,ఎందుకో పత్రికలకు పంపలేదు ...
దిలీప్ గారు :)

నేస్తం చెప్పారు...

పద్మ గారు చెబుతా త్వరలోనే :)
హ హ కిషన్ మీకో సీక్రెట్ చెప్పనా పెళ్ళీ అయిన తొలి రోజుల్లో అయితే ఒకరు అలిగితే ఇంకొకరు బ్రతిమాలుకుంటాం ..ఆ తరువాత,తరువాత ఇద్దరం అలుగుతాం కానీ బ్రతిమాలడానికి ఇద్దరికి ఇష్టం ఉండదు అప్పుడు చీ వెదవ జీవితం ఎప్పుడూ గొడవలే అని తిట్టుకుంటాం అదన్న మాట ..అదే డవుటోచ్చింది మీరు హరివిల్లు చిరు జల్లు అని చెప్పి హఠాత్ గా ఆకాశవీదిలో అని మొదలు పెట్టేసరికి మీరేనా కాదా అని అనిపించింది

జీడిపప్పు చెప్పారు...

చాలా చక్కగా రాసారు, చదువుతుంటే సీన్లు కళ్ళముందు కనపడ్డాయి ;)

అజ్ఞాత చెప్పారు...

కాళ్ళు తోక్కినందుకు ఎంత పెద్ద శిక్ష..:)

నేస్తం చెప్పారు...

జీడిపప్పు గారు :)
అఙ్ఞాత గారు అర్ధం అయింది :)..నేను అలిగేసానండి

అజ్ఞాత చెప్పారు...

"ఏదన్నా మాట్లాడవే అంటే ఈ రోజు తిది ఏంటీ ,వారం ఏంటీ ,ఇది ఏం చెట్టు ,కాయలు కాస్తాయా, పువ్వులు పూస్తాయా అనుకుంటూ ఉప్పర సోది వేస్తావ్ విసుక్కున్నారు మా ఆయన ...మరి ఇంకేం మాట్లాడను ఏదో ఒకటి మాట్లాడుతున్నాను గా నేనూ అరిచాను.. "

Hahaha...tanu kuda ilaane okkosaari antaaaru . nenu kuda same reply ista.

~C

అజ్ఞాత చెప్పారు...

*****Request*** oops ..agnyata gaa post chesaano ledo indaaka...
~C ani post chesa oka comment...na gmail account vaste daya chesi adi publish cheyyavaddu ani praarthana.!

కొత్త పాళీ చెప్పారు...

శబాష్!

నేస్తం చెప్పారు...

~c లేదులే ఇవ్వలేదు ..నిన్న ఎందుకో మీరే గుర్తు వచ్చారు .. ఎలా ఉన్నారు.. అన్నయ్య ఎలా ఉన్నారు :)
కొత్త పాళి గారు :)

arunank చెప్పారు...

మీ పొస్ట్ చదివినప్పుడల్లా నా జీవితం లో జరిగిన సంగటనలు
గుర్తుకొస్తాయి .అందరి జీవితాల్లో ఇలాంటి విషయాలే ఉంటాయనుకొండి,కాని మీరు రాసే విధానం చాల బాగుంటుంది.screen play and dialogues బాగారాస్తారు.చినప్పటి సంగతులనుంచి పెల్లయ్యె వరకు రాసుకొచ్చారు.త్వరలో ముగించేస్తరా ఎమిటి ?.

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

నేస్తం..
మీ బ్లాగు చూసాక వెళ్లి అద్దం ముందు నిలుచున్నా..
పళ్లన్నీ ఇకిలిస్తూ..
లెక్కపెట్టటం మొదలుపెట్టా..
అహా.. లెఖ్ఖ తేలటం లేదు.
మా రూంమేట్‌ని పిలిచి లెఖ్ఖపెట్టమన్నా..
"అరే.. ఏమైంది వీడికి.. నిద్ర లేచి వచ్చాడా ఏంటి?
కలలో ఎవరో అమ్మాయిని ఏదో అని ఉంటాడు.. పళ్లు ఊడగొట్టి ఉంటుంది, చూసుకుంటున్నాడు" అన్నాడు వాడు.
ముందు పని చూడమంటే.. 31 అని తేల్చాడు.
సరే.. ఇంకా ఙానం పుర్తిగా రాలేదు కదా అని సరిపెట్టుకున్నా..
అప్పుడే అర్ధమయింది.
మీకింత ఙాపకశక్తి, చెప్పే విషయాన్ని కళ్లముందే చూపించే వ్రాతకారితనం(కొత్త పదమనుకుంటా?) రావటానికి 36పళ్ళు కారణమని.
చాలా బాగుందండీ మీ టపా..

నాదో సలహా..
మీరు స్క్రీన్‌ప్లే వ్రాయటానికి ప్రయత్నిస్తే.. సినిమా సూపర్‌హిట్టవుతందండీ!

మరో విషయం.. మీ బ్లాగు చూస్తే నాకు అసూయగా ఉందండీ..
కనీసం ఒక్క టపాలో అయినా.. మీకంటే ఎక్కువ వ్యాఖ్యలనూ.. సందర్శకులనీ పొందాలని అనుకుంటాను అప్పుడప్పుడూ..

అజ్ఞాత చెప్పారు...

"..సినిమా కొచ్చారా అంటే కాదు బోజనానికి వచ్చాం అని వెటకారిస్తావేంటి ..సినిమా హాల్ ఎదురుగా నించుని అన్నారు.. అప్పటికీ కాలు తొక్కితే మళ్ళీ నాకాలు తొక్కుతారేంటి అని పైకి అన్నావు చూడు .."

"ఈ రోజు తిది ఏంటీ ,వారం ఏంటీ ,ఇది ఏం చెట్టు ,కాయలు కాస్తాయా, పువ్వులు పూస్తాయా అనుకుంటూ ఉప్పర సోది వేస్తావ్ విసుక్కున్నారు మా ఆయన ...మరి ఇంకేం మాట్లాడను ఏదో ఒకటి మాట్లాడుతున్నాను గా నేనూ అరిచాను.. "

నవ్వలేక చచ్చిపోయానంటే నమ్మండి !
జీడిపప్పు గారు అన్నట్టు సీన్లు కాళ్ళ ముందు రీళ్లలా తిరిగాయి !

మీరు నిజంగా మీ కథలు ఈనాడుకో, ఇంకో పత్రికకో పంపించొచ్చు ! మీలో ఒక గొప్ప రచయిత్రికి ఉండాల్సిన టాలెంట్ ఉంది ! :-)

ఇలాగే రాస్తూ ఉండండి. మీ తరువాయి టపా కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తుంటాను ! :-)
- పద్మ

వేణూశ్రీకాంత్ చెప్పారు...

నేస్తం చాలా బాగా రాశారు.. మనసంతా మధురమైన అనుభూతి తో నిండి పోయింది...

ఇలాంటి అందమైన టపాలు రాసేసి బ్రహ్మచారుల గుండెల్లో గుబులు రెట్టింపు చేస్తే ఎలాగండి ? అంటే తీయని భాధ అన్నట్లు ఇది కూడా బాగానే ఉందనుకోండి :-) ఏదేమైనా రెండవ టపా కూడా త్వరగా పోస్ట్ చేయండి మరి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

>>.. ఆ తరువాత తరువాత జీవితమే కలహాలమయం అయిపోతుంది అది వేరే విషయం అనుకోండి...
ఏంటండీ..మీరు నాలాంటి వారిని భయపెట్టేస్తున్నారు?
>>..నాకు మినిమం మూడు వీదులకు వినబడేలా మాట్లాడానిదే మాట్లాడిన ఫీలీంగ్ రాదు..
సేం టు సేం ఇక్కడ..:))
>>..జిం కి వెళ్ళే బోడీ యే ఇది ఎవరన్నా వస్తే అయిపోయాడేవాడు అన్నారు .. ప్రతీ మగాడు పెళ్ళాం దగ్గర చెప్పే కామన్ డయిలాగ్ ఇది గొణుకున్నాను ..
నేస్తం గారు,మీరిలా అబ్బాయిల గాలి తీసేయటం ఏమీ బాలేదండీ..:))
మీరు రాసే విదానం నిజంగా స్క్రీన్ ప్లే రాసినట్టే ఉంటుంది. మీ అనుభవాలతో మంచి కధ రాసి దేనికైనా పంపించండి. రోటీన్ లైఫ్ నుండి కాస్తా దూరంగా ఉండటానికి మీరు ఎంచుకున్న ఈ వ్యాపకం అభినందనీయం.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

chaala baaga vundi..........
tondaraga marriage chesukovalani maaku anipistunnadi..........

jyoti gaaru meeru ilantivi share chesukovachhukada

నేస్తం చెప్పారు...

అరుణాంక్ గారు థేంక్స్ అండి.. నిజమే మీరన్నట్లు నాపెళ్ళి వరకూ కబుర్లు చెప్పెసాను కదా,ఇంక నిజం గా ఎక్కువగా ఏమీ గుర్తు రావడం లేదు త్వరలో ముగించేస్తానేమో :)
నరేష్ గారు మీరేమో గాని నేను మీ వాక్య చదవగానే నా నోట్లో పళ్ళన్ని ఒక మారు లెక్కపెట్టుకున్నా 32 ఉన్నాయి ..36 అనేసుకున్నాను అన్నమాట.. మీ బ్లాగ్ చూసాను చక్కని చిత్రాలతో చాలా బాగుంది ..తప్పకుండా మీకు మంచి కామెంట్స్ వస్తాయి ...
పద్మ గారు మీ అభిమానానికి థేంక్స్ అండి ,ఎమో పత్రికల వరకూ ఆలోచించలేదు ఇప్పటివరకు ..మీ ప్రొత్సాహానికి ధన్యవాదాలు

నేస్తం చెప్పారు...

వేణు గారు ,శేఖర్ గారు హ హ .. నిజానికి ఈ రోజుల్లో ఆడ,మగ లేదా భార్య భర్తల మద్య ప్రేమ,అభిమానాలకంటే ఇగోల గొడవ ఎక్కువగా ఉండటం గమనించాను.. అందువల్ల వివాహం అంటే పెళ్ళీకాని వారిలో మధురమైన అనుభూతి కంటే భయం,సందేహాలే ఎక్కువ ఉంటున్నాయి..( నా పెళ్ళి కుదరక ముందు నేనూ ఇలాగే భయపడ్డాను.. ) అందుకే ఇలాంటివన్నీ తరుచూ గుర్తుచేసుకుంటుంటే కోపం వచ్చినపుడు కంట్రోల్ అవ్వచ్చు ..మీ అభిమానానికి చాలా థేంక్స్ అండి
వినయ్ గారు హ..హ :)

Shashank చెప్పారు...

@ వినయ్ చక్రవర్తి - హ హ హ. ఇలాంటివి చదివి ఊబిలో దిగేవు. తర్వత వచ్చి నేస్తం ని అంటే లాభం ఉండదు బ్రదర్.

"సృజన ఒక సారి పెళ్ళి అంటూ చేసుకుంటే గొడవలు ఆటోమెటిక్ గా వచ్చేస్తాయి ప్రత్యేకం గా నేర్చుకో అక్కరలేదు :) " - సత్యమైన వాక్కు.

్ఏస్తం - భలే భలే. మా నిశ్చితార్థం తర్వత మేము ఓ సినిమాకి వెళ్ళాం. ఇలానే ఇల్లంతా చుట్టాలుంటే సర్లే థియేటర్ లో అయినా మాట్లాడచ్చు లే అని. A/C థియేటర్ అందునా బయట హైదరాబాదు మే ఎండలు.. లోన హాయిగా ఉంది. దివ్య ని అడిగ సినిమా చూస్తావ మాట్లాడతావా అని. నేను సినిమా చూస్తా అని చెప్పింది. సరే అయ్యక లేపు అని నేను ఓ 2 గంటలు హాయిగ పడుకున్నా. తనేమో శంకరాభరణం చూసుతున్నట్టుగా శ్రద్ధగా "ఔనన్నా కాదన్న" చూసింది. తర్వత బయట భోంచేస్తూ పొరబాటున స్టోరీ ఏంటి అంటే శ్రీలక్ష్మి లా కథా సంగీతం దర్శకత్వం నిర్మాతా స్పాత్ బాయి లైట్ బాయి అంటూ చెప్పింది. ఇంత వరకు మళ్ళ తనని యే సినిమా స్టోరి అడగలేదు. :)

నేస్తం చెప్పారు...

శశాంక్ గారు ఇది మీకే అన్యాయం అనిపించడం లేదు ..తను కష్టపడి స్టోరి చెపితే ఇలా వెక్క్రించడం బాలేదు..నేను తీవ్రం గా ఖండిస్తున్నాను ఎందుకంటే నేను అలాగే చెప్తాను కాబట్టి :)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం, అప్పుడే రెండు రోజులయిపోయింది ! సస్పెన్స్ స్టోరీస్ వింటే నిద్రపోని రకాన్ని నేను !

మీ కొత్త పోస్ట్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తుంటాను !
త్వరగా రాసి పుణ్యం కట్టుకోండి. మీ పోస్ట్ ఎప్పుడు చూసినా నాకు పండగే ! :-)

శ్రుతి చెప్పారు...

నేస్తం,

నిజమే సుమా, మొదట్లో బ్రతిమాలటం ఒక చక్కని అనుభూతి. ఆతరువాత తరువాతాదో అవమానంలా ఫేలయిపోతుంటారు.
మీ అనుభూతులను ఇలా పంచుతున్నందుకు చాలా సంతోషం.
సార్దకనామధేయులండి మీరు.

రాఘవ చెప్పారు...

ఇలా నెలకు ఒకటి రాస్తే మాకు కుదరదు వారానికి ఒకటి రాయాలని డిమాండ్ సేత్తన్నా :)

Sirisha చెప్పారు...

meeru inta late ga postlu vestey nenu oppukonu madam...mee postlu kosam eduru choodalekapotunna...pls atleast week 2 post lu veyyadaniki try cheyyandi...

Shashank చెప్పారు...

హి హి హి ...ఎస్పెక్ట్ చేసా.. అందుకే చెప్పా. అయినా తను నేను అడిగిన అడగకపోయిన చెప్తది. :)

నేస్తం - అప్పుడప్పుడు కథలు రాసా అన్నరు కద.. అదే ఇక్కడ పెట్టండి. మీ స్వగతాల నడుమ కొంచం entertainment మాకు.

నేస్తం చెప్పారు...

రఘవ,శిరీష ,అఙ్ఞాత గారు( బహుసా మీరు పద్మ గారనుకుంటాను) మీ అభిమానం చూసుంటేమనసు హాయిగా అనిపిస్తుంది.. కాని ఈ మద్య అసలు తీరిక ఉండటం లేదు అందుకే కాస్త లేట్ గా రాస్తున్నాను ..ఎప్పుడన్న కొంచెం తీరిక ఉంటే కాసేపు వాక్యలు చదువుతూ , కాసేపు ఇతరుల బ్లాగ్స్ చదువుతూ ఉంటాను ..త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను :)

నేస్తం చెప్పారు...

శశాంక్ గారు హ హ మామూలు కధలా,ఎందుకులెండి మళ్ళా జడుసుకుంటారు ...శ్రుతిగారు మీ అందరి అభిమానం సంపాదించుకున్నందుకు నిజం గా అదృష్టవంతురాలినే :)

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

antenantara shashank boss late ayyindi 25 vachhindeo ledo appud teesukochharu oka match ok cheppesanu mari elaga............

mata venakki teesukomantaara.......cheppandi boss

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

ఏమండీ నేస్తం గారూ..
మీ టపా తర్వాత టపా కోసం చకోర పక్షుల్లా ఎదురుచూసే ఎంతో మంది ఉన్నామండీ.. మా మీద కొంచెం దయ చూపి త్వరగా మరో టపా పంపితే సంతోషిస్తాం కదా..
అభిమానులను లెఖ్ఖ చేయకుండా.. టపాలు వేయకుండా ఎన్నాళ్లిలా వేధిస్తారండీ..
అసలే బ్రహ్మచారులం.. ఏదో మీబోటి పెద్దవారి దగ్గర కొన్ని తెలుసుకుని, ఆ వచ్చే ఆమెను అర్ధం చేసుకుందామనుకుంటే.. మీరిలా చేయటం ఏమీ బాగోలేదండీ..
అందుకే.. నేను మీబ్లాగునుంచి వాకౌట్ చేస్తున్నా..



ఈ పూటకి మాత్రమే..

Shashank చెప్పారు...

ఓ. కే చెప్పాకా చేసేది ఏమీ లేదు బ్రదర్.. తర్వత తర్వత పక్కనోళ్ళకి చెప్పడం తప్ప "భద్రం బి కేర్ఫుల్ బ్రదరు.." అని.. congrats. 25 కే పెళ్ళా.. హ హ .. నా లాగే.. in front.... :p

నేస్తం చెప్పారు...

హ హ నరేష్ నందం గారు అలా అలిగేస్తేఎలాగండి వచ్చేవారం తప్పకుండా రాస్తాను ...
శాశాంక్ గారు చూస్తున్నా..చూస్తున్నా .. తెగ భయపెట్టేస్తున్నారు జనాలను

Shashank చెప్పారు...

ఏదోనమ్మ.. మగజాతిని పరిరక్షించేదానికి నా వంత కృషి అంతే. అయినా మాకే అంత తెలివి ఉంటే శాస్త్రి గారి మాటలు ఎప్పుడో పాటిస్తుండేవాళ్ళం.. :p

శివ చెరువు చెప్పారు...

నే కామెంట్ చేయడానికి.. ఏమి మిగలలేదు.. ఎందుకంటె.. అన్దరూ ఆల్రడీ పైన రాసేసారు.. ఓ కాపి పేస్టు .. :వేస్కోండి.. హ హ హ ..:)

MIRCHY VARMA OKA MANCHI PILLODU చెప్పారు...

ayyababooo enni comentlu andi inka memu emi chebuthamu chala bagundi andii mee maroka tapa kosmau eduru chusthu untanu andii..
alage na blog ki kuda vichhesi mee amulyamina coments ivvagalarani ashisthu
http://mirchyvarma.blogspot.com

veena చెప్పారు...

"emma cinema ki vachhara..ledu bhojanaaniki"..chalabaagundandi ee line..navvu aagadam ledu gurthochhinappudalla.

నేస్తం చెప్పారు...

మిర్చి వర్మ గారు చూసానండి మీ బ్లాగ్ చాలా బాగుంది :) వీణ గారు మీ బ్లాగ్ కూడా చూసాను కానీ మీకు వాక్యను పోస్ట్ చేయడానికి కష్టం అయ్యింది సెట్టింగ్స్ చేంజ్ చేయాలేమో ఒకసారి చూడండి
శశాంక్ గారు లాభం లేదు దివ్య గారి తో ఒక మారు నేను మాట్లాడాల్సిందే :)
శివ గారు థేంక్స్ అండి

రాధిక చెప్పారు...

మీ పోస్ట్ ఎప్పుడు చూసినా నాకు పండగే ! రీళ్ళు వెనక్కి తిప్పేస్తూ వుంటాను.

Malakpet Rowdy చెప్పారు...

LOL .. Too Good ..

Sreenivas, I know why you have asked the question hehehehehe!!!

గీతాచార్య చెప్పారు...

అంతా బాగుంది కానీ ఈ రెండు రోజుల ట్విస్టు ఏంటి నేస్తం? :-( కొంపతీసి స్పెల్లింగ్ మిస్టేకా? అలా ఐతే బావుణ్ణు.

బాగుంది. మొత్తానికీ భయం భయం అని బెదరగొట్టేశారన్నమాట. :-D

BTW, there is a spelling mistake I have noticed in the description. Sorry, but I want to bring it to your notice.

"జాజిపూలు, ఎన్నెన్నో జాపకాల..." అని ఉంది. అది ఙ్ఞాపకాల... కదా?

నేస్తం చెప్పారు...

హహ ఇంతకుముందు ఙ్ఞ రాయలంటే తెలియదు లేఖినీ లో ఎలా రాయాలో ,అందుకని ~m అని కొట్టివదిలేసే దాన్ని అండి ఆ తరువాత ఎలా రాయాలో తెలిసిన బద్దకం అన్నమాట మార్చడానికి ఇప్పుడు మార్చెసాను గీతాచార్య గారు :)
రాధిక గారు ఈ సారి కూడా అలా తిప్పించే పోస్టే రాస్తాను రెడిగా ఉండండి మరి :)
మలక్ పేట్ రౌడీ గారు థేంక్స్ అండీ

గీతాచార్య చెప్పారు...

ఇంత తెల్లనైన జాజిపూలలో చిన్న మచ్చ కూడా ఉండకూడదని చెప్పాను నేస్తం. మార్చేశారుగా ఇక హాయి. :-)

నేస్తం చెప్పారు...

గీతాచార్య గారు థేంక్స్ అండీ

ప్రియ చెప్పారు...

గొడవైనా గొడవ జరగలేదని రాయండంతే!!! :-)

అజ్ఞాత చెప్పారు...

Excellent....:)

నేస్తం చెప్పారు...

హ హ priya గారు :)
అఙ్ఞాత గారు thenks అండి

Mayi చెప్పారు...

Hello
చాల రొజుల్నుండి మీ పొస్ట్స్ చూస్తున్నాను. చాలా బాగ వ్రాస్తారు. నెను కూడ కొత్త బ్లొగ్ మొదలుపెట్టాను.I will start having posts on it regularly. I will appreciate your and your audience input. I am new to lekhini and telugu blogging. So you will probably find a lot of funny mistakes in the initial stages

అజ్ఞాత చెప్పారు...

నేస్తం, లేఖినిలో కష్టపడేకంటే, గూగుల్ లో ఇంకా ఈజీ !

http://www.google.com/transliterate/indic/Telugu

వాడి చూడండి !

- పద్మ

అజ్ఞాత చెప్పారు...

Nestham,
first time andi naa life lo kallallo neellu vachedaaka navvutoone unnaa... Bhojananiki vacham ani chepindi chadivi...
Nice blog...

నేస్తం చెప్పారు...

mayi గారు మీ బ్లాగ్ చూసాను ..బాగా రాస్తున్నారు,రాయగా రాయగా మీకె అలవాటు అవుతుంది తప్పులు రాకుండా రాయడం
పద్మ గారు గూగుల్ గురించి ఈ మద్యనే తెలిసింది ..ట్రై చేసాను కూడా..బాగుంది..మీ అభిమానానికి థేంక్స్ :)
అఙ్ఞాత గారు మీ నవ్వు నాకు వినబడుతుంది థేంక్స్ అండి :) `పేరు రాయాల్సింది మీది

అజ్ఞాత చెప్పారు...

nestham garu mee vaari edupu maaku vinabaduthondi:(


nice post..
last sentense photo scene highlight

తృష్ణ చెప్పారు...

"మావారితో మొదటిసారిగా బైక్ మీద ఎక్కి బయటకు వెళుతుంటే భలే సరదా అనిపించింది ...ప్రపంచం అంతా నాదే అన్నంత ఆనందం .. సరిగా కూర్చో,జారిపోతావ్ అని జాగ్రత్తలు చెబుతుంటే నాకు మా నాన్నే గుర్తు వచ్చారు..."
same feelings...good post.

నేస్తం చెప్పారు...

తృష్ణ థేంక్స్ అండి

సుధీర్ వూణ్ణ చెప్పారు...

కొంపదీసి చీకట్లో దెయ్యాలకు కనబడక ఇది తెల్లచీర అనుకుంటాయో ఏమో ఖర్మా ...

keko keka..

శ్రీ చెప్పారు...

brahmandagaa rasaaru ...

tulasi చెప్పారు...

its really superb.. mi style of writing chala bagundandi.. nenu e madhyane mi blog chusanandi.. idi chaduvuthu unte nakite oka cinema la kanipinchindi kalla mundu... naku asale konchem ooha shakthi ekkuvalendi.. anyhow chala bagundi...