19, జనవరి 2009, సోమవారం

నేను భారతీయురాలిగా తప్ప పుట్టానేమో !!!



నాకు చిన్నప్పుడు ఉన్న అపోహలలో ఒకటి ..విదేశాలలో కాగడా పెట్టి వెదికినా అడుక్కునే వాళ్ళు కనబడరని.. అయితే నేను విదేశానికి(సింగపూర్) వచ్చాక తెలిసింది అది తప్పని..అయితే ఇక్కడ కాస్త తక్కువ మంది ఉంటారు అంతే ...ఇక్కడ బెగ్గర్స్ లో కొంచెం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఊరికే అడుక్కోరు .. కళ్ళు లేక పోయినా, కాళ్ళు, చేతులు లేక పోయినా ఎదో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ, పాడుతూనో లేక కొంచెం తక్కువ ఖరీదు ఉన్న వస్తువును ఎక్కువ రేటు కి అమ్ముతూనో అడుక్కుంటారు .. అది కూడా బాగ వయసు అయిపోయిన ముసలి వారు అమ్ముతారు.జనరల్ గా వీరు రైల్వే స్టేషన్ బయట అప్పుడప్పుడు కన బడతారు ..


అయితే మిగిలిన ప్రాంతాలకు చాలా తక్కువ గాని మేమున్న అపార్టుమెంట్ దగ్గర మాత్రం నెలకు నాలుగు,ఐదు సార్లు తప్పని సరిగా వస్తారు ఇలా డబ్బులు అడిగేవారు...మరి మాది పస్ట్ ఫ్లోర్ అనో లేక మేముండే ప్లేస్ లో చాలా వరకు ముస్లిం లు ఉండటం మూలానో తెలియదు..ముస్లింలుంటే ఎక్కువగా బెగ్గర్స్ రావడం ఏంటబ్బా అనుకుంటున్నారు కదా .. ఇళ్ళకు వచ్చే బెగ్గర్స్ లో 70 యేళ్ళు పైబడిన ముస్లిం ఆడవాళ్ళు (మలేషియా ముస్లింస్) .. వస్తారు..వీళ్ళు తలుపుతట్టి సలామాలేకుం అని అంటారు.. అయితే వీళ్ళు చాలా వరకు ముస్లింలనే అడుగుతారు డబ్బులు .. తలుపు తెరవగానే మన వేషదారణ చూడగానే చిన్నగా నవ్వుతూ 'సారీ' చెప్పి వెళ్ళిపోతారు..


మొదట్లో నాకు తెలిసేదికాదు .. అసలు ఎందుకు తలుపు కొడుతున్నారో ..నన్ను చూడగానే ఎందుకు వెళ్ళిపోతున్నారో.. తరువాత తెలుసుకున్నాక నేనే వాళ్ళను ఆపి డబ్బులిచ్చేదాన్ని..ఎందుకంటే పగటి పూట చాలా వరకూ తలుపులు తీయరు ..ఎవరి ఉద్యోగాలు వారివి..తాళాలు వేసుకు వెళ్ళి పోతారు..యే దేశస్తులన్నా పిడికెడు మెతుకులు తినకపోతే ఆకలి అందరికీ ఒకలాగే వేస్తుంది కదా..అలా ఇచ్చినపుడు వాళ్ళ కళ్ళలో ఆత్మీయత చూస్తేనే అబ్బో నేను చాలా మంచి పని చేసేసా అని తెగ ఫీలింగ్ వచ్చేసేది..ఇలా వీళ్ళే కాకుండా అప్పుడప్పుడూ తల్లికి బాలేదనో, తండ్రికి బాలేదనో ( అచ్చం మనదేశం లాగే )చెబుతూ కొంచం పెద్ద వాళ్ళను తోడు తీసుకు వచ్చీ డాక్టర్ సర్టిఫికెట్లు చూపిస్తూ చేతి తో తయారు చేసిన ఫ్లవర్ వాజ్ లనో, హాండ్ బేగ్ లనో కొనుక్కోమని దీనం గా అడుగుతారు కొంతమంది చిన్నపిల్లలు .. మరి ఇక్కడ నిజమో ,అభద్దమో తెలియదుకాని(ఇక్కడ డాక్టర్స్ దొంగ సర్టిఫికెట్లు ఎట్టి పరిస్తితుల్లోను ఇవ్వరు ) నాకు ఇంత చిన్నపిల్లలను చూస్తేనే కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగిపోతాయి .. అంత అమాయకపు పిల్లలకి అలాంటి కష్టాలు ఎందుకు ఇచ్చావ్ దేవుడా అని చాలా బాధ పడతా ..తప్పో ,ఒప్పో ఇంక వాళ్ళను నిజమా ,అభద్దమా అని ఆరాలు తీసి డబ్బులు ఇవ్వబుద్ది వేయదు .. నాకు తోచింది ఇస్తాను..


ఇలా చాలా మంది ఏదో ఒక రోగమనో మరి ఇంకొకటో చెప్పి అప్పుడప్పుడూ ఏవో ఒకటి కొనమని అడుగుతారు..నేను కొన్ని కొనడమో లేక ఎంతోకొంత ఇచ్చి పంపడమో చేసేదాన్ని..ఈ సోదంతా ఏమిట్రా బాబు అనుకుంటున్నారా.. మరి చేసిన చెత్త పని సమర్దించుకోవాలంటే ఆ మాత్రం చెప్పుకోవాలిగా..ఒక సారి సాయంత్రం చీకట్లు ముసురుతుండగా ..పనులయ్యాక తీరికగా సొఫాలో పడుకుని T.V చూస్తున్నా ..ఇంతలో ఎవరో తలుపులు కొట్టి సలామాలేకుం అన్నారు..నేను మాములుగానే పాపం ఎవరో వచ్చి ఉంటారు .. ఎక్కువగా ఆడవాళ్ళు వస్తారుగా మగవాళ్ళు తక్కువ కదా అనుకుంటూ ,నెలాఖరు రోజులు కాబట్టి ఏమీ కొనే ఉద్దేశం లేకపోవడం తో ఒక 2$ నోట్ తీసుకుని బయటకు వచ్చాను.. ఎదురుగా ఒక 30 యేళ్ళ లోపు యువకుడు బలిష్టం గా , పొడవుగా ఉన్నాడు..చేతిలో డబ్బులు వేయడానికి తెచ్చుకున్న డబ్బా ఉంది..ఇదేంటబ్బా ఈ అబ్బాయికి ఏమైంది??? .. చూడటానికి గ్రుడ్డి , అంగ వైకల్యం లాంటివి ఏమీ కూడా లేనట్లు ఉంది..ఏదన్నా చారిటీ కోసం వచ్చాడేమో అనుకున్నాను .. ఆ అబ్బాయి నా రాకను గమనించినట్లున్నాడు అటు ఎటో చూస్తున్నవాడు గభ గభ తన చేతిలొ ఏదో కవర్ తెరవడం మొదలు పెట్టాడు.. ఎక్కువగా ఏదో ఒక జబ్బు ఉన్నవాళ్ళే అలా డాక్టర్ సర్టిఫికెట్లు తీస్తారు.. నాకు గుండే అంతా పిండేసినట్లు అయిపోయింది..పాపం యే తల్లి కన్న బిడ్డో చూడటానికి చక్కగా రాకుమారుడిలా ఉన్నాడు ..ఇప్పుడు తను ఏదో రోగం చెబుతాడు ఇంక మనసంతా పీకేస్తుంది ..ఇంక వేదాంతం వచ్చేస్తుంది,ఎన్ని తిన్నా, ఏం చెసినా ఎన్నాళ్ళు బ్రతుకుతాం అనుకుంటూ ..ఎందుకులే అసలే దేశం కాని దేశం లో ఉన్నాను అనుకుని.. Its OK అని వారించి 2$ నోట్ అతనికి ఇచ్చాను ..ఈ లోపలే అతను ఏదో వాళ్ళ బాషలో (మలయ్ బాష)గట్టిగా చదువుతూ ఒక ఫొటో చూపిస్తూ ఏదో చెబుతున్నాడు.. కొద్దిగా చీకటి చీకటిగా ఉండటం వల్ల నాకు స్పష్టంగా కనబడటం లేదు ..సరిగా విందును కదా అతను చూపిస్తుంది మన కాశ్మీర్ ఫొటో ..నాకు అతను ఏం చెబుతున్నాడో తెలియదుకాని మన కాశ్మీర్ గురించే .. అతని మొహం లో ఏదో కోపం నేను బిత్తరపోయి ఆ కంఠానికి బెదిరిపొయా .. ఈ లోపల మా వాకిలి బయట లైట్లు వెలిగాయి ఆ వెలుతురులో నా మొహం చూసాడతను ... నా మొహానికి ఉన్న సిందూరం చూస్తుండగానే నా మెదడు మరి నాకేం చెప్పిందో గాని గబుక్కున తలుపులు వేసేసా ..


అసలే ముంబాయి మారణహోమాన్ని..అనేక బాంబ్ దాడులను చూసి చూసి ఉన్నానేమో ఆ పిరికితనం నన్ను ఆవహించింది.. తలుపేసాక గాని నేను చేసిన సిగ్గుమాలిన పని నాకు గుర్తు రాలేదు.. నా కన్న తల్లిని,నా మాతృ భూమిని తిడుతూ ఉంటే నేను వాడికి డబ్బులిచ్చానా!!!..నాలాంటి దేశ ద్రోహులు ఎక్కడన్నా ఉంటారా ..కనీసం వాడితో మా ఇండియాను తిడతావా అని ఎందుకు అడగలేకపోయాను.. ఎందుకు భయ పడ్డాను అసలు ..చంపేస్తాడనా ?? మరి హేమంత్ కర్కరే ..ఉన్ని క్రిష్నన్ ఇంకా అహర్నిశలు సరిహద్దులో మనకోసం చలిలో కుటుంబాలను సైతం వదిలేసి మరీ ప్రాణలకు తెగించి పోరాడుతున్నారుగా ..వీళ్ళందరూ భయపడితే???? నాకు చాలా ఏడుపొచ్చింది .. బాగా ఏడ్చాను.. నా పరిస్తితుల్లో ఇంకెవరన్నా ఉంటే ఏంచేసేవారో తెలియదు కానీ నేను తప్పు చేసాను..ఇంత జరిగినా కూడా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన లాంటిది జరిగితే దైర్యం గా ఎదుర్కుంటానో లేదో కూడా తెలియదు.. చాలా రోజులు అన్నం కూడా తినాలనిపించేది కాదు..కాని ఓకటి చాలా బాధగా భయం గా అనిపించింది .. మనకూ... పాకిస్తానికి గొడవ .. అతను పాకిస్తాని కాదు.. మలయ్ వాడు.. అసలతనికి సంబందం లేదు..అయినా తన పొట్ట కూటి కోసమో మరి యే కారణానికో ప్రశాంతం గా ఉన్న మిగిలిన ముస్లిం ల మనసు పాడు చేస్తూ .. ఇలా కక్ష లు పెంచుకుంటే మానవ జాతి మనుగడ ఎలా ???

36 కామెంట్‌లు:

Venkat reddy చెప్పారు...

bomma bagunnadii...[:D]

లక్ష్మి చెప్పారు...

హ్మ్...ఇంకొన్నాళ్ళు పోతే అసలు మనం మనుషులగా ఎందుకు పుట్టామా అని బాధ పడాల్సి వస్తుందేమో లోకం పోకడ చూస్తుంటే

అజ్ఞాత చెప్పారు...

నేస్తం, నేనింకో కోణం చూపనా? నేను ఆస్ట్రేలియాలో కొంతకాలముండి ఇపుడు అమెరికాలో నివసిస్తున్నా. మేము ఆస్ట్రేలియా వెళ్ళిన క్రొత్తలో, మీరన్నట్లు ఇంకా బెరుకు పోని, కట్టుబొట్టూ పూర్తిగా మారని రోజుల్లో, ఒకసారి train కొరకు చూస్తుంటే, ఒక మధ్య వయస్కుడు నా దగ్గరకొచ్చి "నమస్కారం" అన్నాడు. నా బొట్టు చూసి వెక్కిరిస్తున్నాడేమోనని తలవంచుకొని వచ్చేయబోతుంటే, నాకు మీ భాష రాదు కనుక అని english లో మొదలుపెట్టిన ఆ సంభాషణలో, అతని అమ్మమ్మ వివేకానందుని సమీప శిష్యురాలనీ, ఆయనతో కలిసి కొంతకాలం బృంద గానాలు, ప్రయాణాలు చేసిందనీ, అతని కుటుంబం మొత్తం మన సనాతన ధర్మన్ని [మతం అని పేరు పెట్టటం నాకు ఇష్టం లేదు] గౌరవిస్తామని, నేను ఆ వారసురాలిగా తల ఎత్తుకుని బ్రతకాలని చెప్పాడు. ఆ సంఘటన నాలో ఎంతో నమ్మకాన్ని, స్ఫూర్తిని నింపింది. same with those Australians followed my sahajmarg meditation principles ఇక ఇక్కడ కూడా ఎంత శాతం అని కాక ఎంత enlightenment ఆపై ఎంత అవగాహన వుంది అన్న దాన్ని బట్టి మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించేవారున్నారు. many of my colleagues love to know and wear our traditional dresses, eat our food and learn about our classical music, dance, yoga etc. కనుక మంచీ చెడూ లేదా పడుగు పేకా అన్నీటా వుంటాయి. మనం మనంగా ముందుకు సాగగల శక్తి, ప్రేరణ ఇచ్చే విషయాలనే గుర్తుంచుకొని, మనలో నమ్మకాన్ని నింపగల అనుభవాలనే స్మరించుకొంటూ మన ప్రక్క వారి నుండి మంచి గ్రహిస్తూ, మనది వారికి పంచిస్తూ, తల్లి భారతికి జేజేలు పలుకుతూ రేపులోకి నడుద్దాం. ఏమంటారు?

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలిసే లోపే ఆ పని చేసేస్తాము... అయినా మీరు డబ్బులు ఇచ్చాక కదా విషయం తెలిసింది.. కాబట్టి మీరు అంతగా భాదపడనవసరం లేదు. భాషకాని భాషలో మీరు అతనితో వాదించినా అతనికి అర్థం కాకపోవచ్చు.

Sravya V చెప్పారు...

Surprising to listen you rexperiences ! I too live in Singapore .

నేస్తం చెప్పారు...

@వెంకట రెడ్డి గారు ధన్యవాధాలు
@లక్ష్మి గారు ఇప్పటికే అనిపిస్తుంది అలా :(
@ఉష గారు :) మీరు అన్నది కూడా నిజమే..ధన్యవాధాలు మీరు చెబుతుంటే మరొక విషయం గుర్తు వచ్చింది ..ఒక సారి ఇక్కడ ఒక దక్షిణ ఆఫ్రికా అతను కనబడి అచ్చ తెలుగులో మాట్లాడాడు .. నేను ఆక్చర్యపోయి చూస్తుండగా అక్కడ తెలుగువారిని చూసి..వారి పద్దతులను చూసి ఎంతో నచ్చి నేర్చుకున్నాడట మన భాష ..
@ప్రపుల్ల చంద్ర గారు నేనూ అలాగే అనుకుని కొంచం నా తప్పును కప్పిపుచ్చుకుంటున్నా ..:(
@శ్రావ్య గారు నిజమా :)

అజ్ఞాత చెప్పారు...

ఆ ఘటననీ మీ మనసు పడే బాధనీ అర్థం చేసుకున్నాను. గతం గత: అది వదిలేయండి.
కానీ మన దేశం కూడా ఈ భూమి మీదే కదండీ ఉంది. మానవుడు, వాని మనస్తత్వం ఇంచుమించు ఒకేలా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రమే అడుక్కునే లక్షణం ఉంటుందనుకోవడం
పొరపాటు కదండీ!
ఇంకో కోణంలో చూస్తే ఇక్కడ ధర్మ గుణం, ఇతరులతో పంచుకోవాలనే గుణానికి గౌరవం ఉంది కాబట్టి, దానికి నెగెటివ్ పక్షంగా అడుక్కునేవాళ్ళ సంఖ్య పెరిగింది. కాశ్మీరు పేరిట మారణహోమం చేస్తున్న పాక్ గుణం కంటే ఇది మేలు కద!

అజ్ఞాత చెప్పారు...

ఇందాక రాయటం మరిచాను. బొమ్మ భలే బావుంది

అజ్ఞాత చెప్పారు...

meeru cHEsindi tappu ani cheppalEm alAgani mana dESaanni evarupaDitE vALLu edO okaTi anTuu vunTae kuDaa chustuu vurukOlEmu kadaa!! ayitE meeru vunna paristhitulu vEru kaavaccHu.bahuSaa aa samayamalO meeru onTarigaa vunDavaccHu mariedinaa itara kaaraNaalu vunDavaccHu.

నేస్తం చెప్పారు...

మాలతి గారు నేను విదేశాలలో బెగ్గర్స్ ఉండరు అని ఎందుకనుకున్నాను అంటే వీరు ఆర్ధికం గా ప్రగతి సాదించారు కదా... పైగా సింగపూర్ వంటి చిన్న దేశాల్లో ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది .. కాబట్టి ఉండకపోవచ్చు అనుకున్నాను .. పైగా నా సినిమా నాలెడ్జ్ చిన్నపుడు నాకు అలాగే నూరిపోసేసింది .. :) నాకు ఆ బొమ్మ నచ్చింది అండి ఎప్పుడో ఎక్కడో చూసి సేవ్ చేసుకున్నా .. ఇప్పుడు ఇలా పెట్టేసా .. నిజంగా ఎవరు వేసారోగాని మన తెలుగుదనం ఉట్టిపడుతుంది :)

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు నిజమే అప్పుడు మావారు ఇంట్లో లేరు ఆఫీసుకెళ్ళారు .. భయంవేసింది ..ఏమన్నా చేస్తాడేమో అని :( పైగా ఈ బాంబ్ దాడులు,ఉగ్రవాదులు ఇవన్నీ నాలో పిరికితనం వచ్చేలా చేసేసాయి.. తప్పని తెలిసినా ఎదిరించి మాట్లాడలేకపోయాను

కన్నగాడు చెప్పారు...

నేస్తం గారు, నిజానికి మీరంతగా బాధపడాల్సిన పనిలేదు. అటువంటి సంధర్బాలలో మన మెదడు స్థానే అసంకల్పిత ప్రతీకార చర్యకు సంబందించిన నాడీమండల వ్యవస్త నిర్ణయాలు తీసుకుంటుంది. అప్పుడు భావాలు, అనుబంధాలు, అత్మీయతలు వంటి ప్రస్త్తావన రాదు భయం తప్ప.
ఇక మీరన్నట్టు జవాన్లు, రక్షకభటులంటారా వారికిచ్చే కఠోర శిక్షణలో ఇలాంటి సంధర్భాలలో కూడా ఆలోచితంగా పనిచేసేట్టు తర్ఫీదునిస్తారు.

నేస్తం చెప్పారు...

కన్న గారు thanks అండి.. ఒక రకమైన బాధను అనుభవించాను.. ఏదో కాస్త ఊరట మీ మాటలు

సుభద్ర చెప్పారు...

bagaa heart touching gaa rasaru........

యార్లగడ్డ కిరణ్ కుమార్ చెప్పారు...

మీరు సింగపుర్ దాకా వెళ్ళారు.. నిన్న లక్నో లొ, కొంత మంది ముస్లిం మహిళలు ధర్న చేశారు. ఎందుకో తెలుసా? గాజా మీద ఇస్రయల్ దాడిని నిరసిస్తు... కాని విళ్ళేవ్వరు ,ముంబై పై దాడి జరిగినప్పుడు నిరసన తెలపడానికి పెదవి విప్పలేదు.. వీరితో పోల్చు కుంటే తెలియక మీరు చెసిన దాంట్లో అసలు తప్పె లేదు..

Narsingrao చెప్పారు...

Bomma chala bagundi andi... mere vesera

........................ చెప్పారు...

kanna is correct, meru antala feel avalsina paniledu, evaru devunni adigi puttaru.........

meru india lo puttarukanuka India ani feel avtunnaru, ade akkade ai unte ..... It is all How u deal with the things ... but the story is very interesting, Photo kuda bagundi, kasta kullu kunna adi nadaggara lenanduku ..... prledu ipudu copy chesukovadam kuda aipoindi . chalo janeka hain , so janeka hain GooD NighT

నేస్తం చెప్పారు...

@సుభద్ర గారు ధన్యవాదాలు..
@కిరణ్ కుమార్ గారు అవునా...??? అందుకే అండి మన దేశం ఇలా ఉంది..
@ నరసింగ రవు గారు నేను వేయలేదండి.. ఎవరు వేసారో జీవ కళ ఉట్టిపడినట్లు వేసారు ...ఈ అభినందనలు వారికే చెందుతాయి
@ సౌజన్యకుమార్ గారు ఇంత మంచి బొమ్మ అందరూ చూడాలనే పెట్టాను .. మీదగ్గరా ఉందిగా ఇప్పుడు ..happy

మధురవాణి చెప్పారు...

నేస్తం..
నాకూ బాధనిపించింది మీరు చెప్పింది చూసాకా :(
కానీ.. అంతే.. చాలాసార్లు అప్పటికప్పుడు అలాగే స్పందిస్తాం. తరవాతా అరెరే.. అనిపిస్తుంది.
కానీ.. మీరు చెప్పిన ఈ పరిస్థితిలో మాత్రం మీ తప్పు వీసమెత్తు కూడా లేదు. మీరొక్కరే ఇంట్లో ఉంది, దేశం కాని దేశం లో.. అడుక్కోడానికోచ్చిన అతనితో.. వాదన వేసుకోవడం కూడా సరైనది కాదని నాకనిపిస్తుంది. ఏది ఏమైనా.. బాధ కలగడం మాత్రం తప్పదనుకోండి.. ఇలాంటివి ఎదురైనపుడు..
ఇలాంటి అనుభవాలే మనకి చాలా విషయాలు నేర్పిస్తాయి.. అనుకుని ముందుకి సాగిపోవడమే..
జై హింద్ :)
బొమ్మ చాలా బాగుంది :))

నేస్తం చెప్పారు...

మదురవాణి గారు దన్యవదాలు అండి.. అసలు ఇక్కడ రాయడనికి కూడా కారణం.. తప్పు చేసావు అని నా మనసు పెట్టే వేదన కాసింత మీతో పంచుకుందామని..జై హింద్

Disp Name చెప్పారు...

Mee Blaagu Colour Combination assalu chadavaaniki veelukaakundaa kashta padi chadivalsi vastondi. Light background pettandi.

నేస్తం చెప్పారు...

zilebi gaaru maarchesaanu :)

........................ చెప్పారు...

ME blog link ni na blog lo unchukovacha?

నేస్తం చెప్పారు...

తప్పకుండా ...లింక్ వేయండి..అపుడు నేను post రాసినపుడు చూసే వీలుంటుంది.. మీరు తెలుగులో రాయాలంటే lekhini.org అని టైపు చేసి అక్కడ రాసి ఇక్కడ paste చేయవచ్చు.. మీ అభినందనలకు ధన్యవాదాలు

వేణూశ్రీకాంత్ చెప్పారు...

నేస్తం, బొమ్మ చాలా బాగుందండీ చాలా మంచి బొమ్మలు వెతికి పెడుతున్నారు. మీ అభిరుచి అభినందనీయం.
నా దృష్టి లో మీరు చేసింది సబబే, పైన అందరూ చెప్పినట్లు మీరున్న పరిస్తితుల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదీ కాక మనీ ఇచ్చేసిన తర్వాత తెలిసింది కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా వదిలేయండి.

నేస్తం చెప్పారు...

శ్రీకాంత్ గారు ధన్యవాధాలు
అండి :)

అజ్ఞాత చెప్పారు...

Nestam,
Take care of yourself and your family.My friend is working in singapore.I will find out and give his residence address.It may be useful.

నేస్తం చెప్పారు...

మీ అభిమానానికి ధన్య వాదాలు అరుణాంక్ గారు.. ఇక్కడ తెలుగువారు చాలా మంది ఉన్నారు.. తరుచు కలుస్తునే ఉంటాం..మీకు తెలిసిన ఫేమిలీ నాకు తెలిసి ఉండొచ్చు :)

అజ్ఞాత చెప్పారు...

bomma bagunnadii

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు ధన్య వాదాలు.

అజ్ఞాత చెప్పారు...

The picture is very nice.It so happens sometimes that we dont actually know what we are doing at that moment! This happens for everyone..so forget it ( because you can not change anything about it) and be happy .Next time first listen to/ see what they are talking about before giving alms ;-)

నేస్తం చెప్పారు...

ధన్యవాదాలు..coffeemugandsnacks గారు

అజ్ఞాత చెప్పారు...

"నేను భారతీయురాలిగా తప్పు పుట్టానేమో !!!"
ఆ మలై ముస్లిం మీదేమో కానీ మీ మిద చానా కోపంగా వుంది ఇలాంటి టైటిల్ పెట్టి నందుకు.
సమస్యలు ఎక్కడైనా వుంటై. ప్రపంచం లో ఎ దేశానికైన ఏదో ఒక సమస్య వుంది (మనకు పాక్ లాగా ) అలా గని ఇలా టైటిల్ పెట్టడం ఏఁ బాగాలేదు.
ఈ టైటిల్ చూసి కోపంగా తిట్టు కుంటూ చదవడం మొదలెట్టాను మిగిలిన టపా చానా బాగుంది.
మీ లాంటి సున్ని త మనస్కులని బాధ పెట్టి వుంటే క్షమించంటి.

నేస్తం చెప్పారు...

దేవా గారు మీరు చెప్పాక చూసుకుంటే నాకూ అలాగే అనిపించింది.. కాని నిజంగా నేను చాలా భాధ పడ్డాను నన్ను భరత మాత క్షమించదేమో అనిపించింది ..ఆ ఆవేశంలో అలా పెట్టెసాను .. ఈ సారి ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయను

కొత్త పాళీ చెప్పారు...

రకరకాల భావాలు కలిగాయి ఈ టపా చదువుతుంటే.
1. ఇందాక ఇంకో టపా వ్యాఖ్యలో చెప్పినట్టుగా మీకు కథని నాతకీయంగా చెప్పే శక్తి ఉంది.
2. టైటిల్లో మీర్రాసినట్టు "తప్పు పుట్టడం" కాదు. సరైన వాడుక "తప్ప పుట్టడం."
3. పిరికి మందు కాదు గానీ ఇంట్లో వొంటరిగా ఉన్నప్పుడు , అవతలి వ్యక్తి ముక్కూ మొహం తెలియని ఆగంతకుడైనప్పుడు తలుపు తియ్యకుండ ఉండటం, ఒకేళ తీసినా గబుకున వేసెయ్యడం పిరికితనం కాదు, సమయోచితమైన వివేకమే.
4. ఆ అబ్బాయి ముస్లిము అని ఎలా అనుకున్నారు? వస్త్రధారణ వల్లనా? ఇంకేదన్నా సూచన వల్లనా? అతను చెప్పే భాష మీకు అర్ధం కానప్పుడు అతను కాశ్మీరు గురించి హిందూ/భారత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని మీకెందుకు అనిపించిందో నాకు అర్ధం కాలేదు.
5. అతను ఏదో దీనగాధ చెప్పి ముష్టి అడిగేందుకు వచ్చాడని అనుకుని మీరు రెండు డాలర్లిచ్చారు. అంత మాత్రానికి ఏదో దేశద్రోహం చేసినట్టు ఫీలవాల్సింది కూడా ఏం కనబట్టల్లేదు. ఆ క్షణంలో మీకు కలిగిన భావతీవ్రతని నేను ప్రశ్నించడం లేదు. నిదానించిన తరువాత అయినా ఈ విషయం మీకు అర్ధమై ఉండాలే అంటున్నాను.

నేస్తం చెప్పారు...

కొత్త పాళి గారు తప్పు సరిదిద్దినందుకు ధన్యవాదాలు..నేను ఆ అబ్బాయి ముస్లిం అని ఎందుకు అనుకున్ననంటే అతను మలేషియా వాడు చూస్తేనే తెలిసిపోతుంది.. పైగా మలయ్ భాష మాట్లాడుతున్నాడు ..మలయ్ భాష మాట్లాడటం రాదుగాని గుర్తు పట్టగలను..రాగానే సలామాలేకుం అన్నాడు. అది కాకుండా అతని చేతిలో కాశ్మిర్ బొమ్మ చూపి కాశ్మీర్,ఇండియా అని ఏదో అంటున్నాడు.. మలేషియ వాళ్ళందరూ ముస్లింలే .. కాబట్టి అలా ఉహించాను .. నిజమే ఒంటరిగా ఉన్నాను పైగా దేశం కాని దేశం అని ఎంత సర్ది చెప్పుకున్నా అంత పౌరుషం లేదా కనీసం ఎందుకూ ?ఏమీటీ అని అడగలేక పోయాను అని భాధవేసింది ..మరొక భయం ఏం వేసిందంటే ఈ రోజుకి ఊరుకుని అదను చూసి ఏమన్నా చేస్తాడేమో అని కూడా అనిపించింది,అవి నా అతి ఆలోచనలో మరి ఇంకెంటో :(