మా ఇంట్లో మా అక్కకు ,చెల్లెళ్ళకు చిత్రలేఖనం లోను పాటలు పాడటం లోను మంచి నైపుణ్యం ఉంది .చాలా సార్లు స్కూల్ లో చక్కని బహుమతులు గెలుచుకుని వచ్చారు. ఎటూ ఏమీ రాని దాన్ని నేను ఒక్కదాన్నే .. వాళ్ళు అలా బహుమతులు తెచ్చినపుడు నాన్న కళ్ళల్లో కనబడే మెరుపు.. అమ్మ అందరికి గొప్పగా చెప్పుకుని పడే ఉత్సాహం.. ఇంట్లో మిగిలిన వాళ్ళ పొగడ్తలు చూసిన నాకు ఒకింత బాధ కలిగేది .. అయ్యో నాకేం రాదు కదా అని ...నేను ఇలా చిన్నబుచ్చు కోవడం ఎప్పటినుండి గమనిస్తుందో మా అక్క... అందరి చేతా నన్నూ ఎలాగన్నా శబాష్ అనిపించాలని తెగ ఆరాట పడేది..
ఒక రోజు నా చేతికి పెన్ను, పేపర్ ఇచ్చి ...చెల్లీ !! నువ్వూ చాలా బాగా బొమ్మలేయగలవ్ ..కానీ నీ మీద నీకు నమ్మకం ఉండదు అంతే ,కాబట్టి ఏకాగ్రతగా ఒక సారి ఈ పులి బొమ్మ వేసి చూడు అని ఎంతో ఇదిగా చెప్పింది..సరే ఇంక నాకు చాలా ఉత్సాహాం వచ్చేసి ఒక గంట ఎవరితోను మాట్లాడకుండా చాలా ఏకాగ్రతతో వేసేసాను .. వేసాక చూస్తే అది ఏనుగో ,జిరాఫీ యో మరి ఎలుగుబంటొ తెలియక నేనే తికమక పడిపోయా ఇంక దాని సంగతి వేరే ఏమి చెప్పను ..ఇంక దానితో నా ఉత్సాహం కి ఆనకట్ట పడిపోయింది .
కొన్ని రోజులు పోయాకా ఒకసారి నాకు ఎందుకో ఏదన్నా కవిత రాయాలనిపించింది.. అప్పట్లో కవితలంటే చివరిలో తప్పని సరిగా ప్రాస రావలనుకునేదాన్ని..అలా ఊహించి ,ఊహించి రాధాక్రిష్ణుల బొమ్మ చూస్తూ ఒక కవిత రాసేసా..
ఓ వెన్న దొంగా
అమ్మ లేదని బెంగా
రాధమ్మ చెంతనే ఉందిగా
అంటూ ఏంటో ..ఏంటో ఒక తవిక రాసేసి మా అక్కకు చూపించాను.. అది చూడ గానే మా అక్క కళ్ళనిండా ఆనంద భాష్పాలు.. ఎంత బాగా రాసావే ..ఆగు ఇప్పుడే అందరికి చూపిస్తా అని మా నాన్న గారి దగ్గరకు పరుగులు పెట్టింది ..అప్పుడే ఊరి నుండి మా అత్త వచ్చి అమ్మా నాన్నలతో మాట్లాడుతుంది .. మా అక్క ..చూడండి నాన్న ఎంత బాగా రాసిందో కవిత అని అనే లోపల ఏది నన్ను చూడనీ అని మా అత్త లాక్కుంది ..నేనేమో సిగ్గుగా గోడమీద పెచ్చులు లాగుతున్నా ..మా అత్త అది చదివి ..చూసారా వదిన గారు చిన్నపిల్లలు ఎంత తెలివి మీరిపోతున్నారో,అమ్మ అక్కరలేదూ బొమ్మ అక్కరలేదూ.. పెళ్ళాం ఉంటే చాలని ఎలా రాసిందో.. వీళ్ళకి ఇంత చిన్న వయసులోనే చాలా ముదురు ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంది ..ఓరి దేవుడో నేనేదో ఊసుపోకా రాస్తే నా వీపూ చిట్లేలా ఉంది అని ఆ పేపర్ పట్టుకుని అక్కడినుండి పరుగులు పెట్టా..ఆ తరువాత నేను ,అక్కా కలిసి మా అత్తని తిట్టుకున్నాం అనుకోండి .. కాని ఆ దెబ్బతో నేను ఏమన్నా అలాంటి తవికలు రాస్తే మా అక్కకు చూపుకుని చింపేసేదాన్ని.. అలా నా కవితా హృదయం బ్రద్దలైపోయింది..
కొన్నాళ్ళు పోయాకా ఒక పత్రికలో చదివిన దాన్ని స్పూర్తిగా చేసుకుని మళ్ళీ ఒకటి రాసాను ..అ.. ఆ..ఇ.. ల మీద.(ఇలాంటివి మీరూ చదివే ఉంటారు)
అ రే అరుణ్
ఆ గరా
ఇ లా చూడూ
ఈ రోజేమైందో తెలుసా ...
ఈ టైపులో 'క్ష 'వరకు ఏదో ..ఏదో మళ్ళీ రాసేసా..అది చూడగానే మా అక్క ఎగిరి గెంతేసి .. ఈ సారి నువ్వంటే ఏంటో చూపిస్తా అని పరుగు పరుగున పోయి వరండాలో తులసీ రామాయణం చదువుకుంటున్న మా తాతయ్యను పిలిచి తాతయ్యా ! చెల్లి చూడూ అ.. ఆ లతో ఒకటి రాసింది అంది. మా తాతయ్య దానివైపు చూస్తూ అ.. ఆ..లతోనే కదా అందరూ రాస్తారు ..అన్నాడు.. అదికాదు తాతయ్య ఇది చదువు అని తాతయ్యకు ఇచ్చింది .. మా తాతయ్య అది చదివి ఏంటమ్మా నాకేం అర్దం కావడం లేదు అన్నాడు.. నాకు గాలి తీసేసినట్లు అయింది..అది కాదే తాతయ్య ముసలోడు కదా అందుకే అర్దం కాలేదు ..పాపం అక్క ఓదారుస్తుంటే నాకు ఎందుకో ఏడుపురావడానికి బదులు దాని తపన చూసి జాలేసింది..
ఒక సారి మా ఇంట్లో పిల్లకాయలందరూ గోల చేస్తుంటే మా పిన్నులు ,కాస్తా వీళ్ళు అల్లరి చేయకుండా చూడవే అని నాకు అప్ప గించారు ..సరే అని నేను ,అక్కా వాళ్ళను ఆడిస్తున్నాం ..మా అక్క ఎన్ని కధలు చెప్పినా ఈ కధా నాకు తెలుసు కొత్తది చెప్పు అని ఒకటే గొడవ వాళ్ళు..సరే అని నేను ఊహించి అప్పటికప్పుడు ఒక కధ చెప్పేసా.. అదివిని మా అక్క .. చెల్లీ! నువ్వు సామన్యురాలివి కాదు నీలో ఒక రచయిత్రి దాగుంది..మట్టి లో మాణిక్యం లా నీకు అవకాశం రావడం లేదు అంది.. పోనీ అని ఊరుకుందా .. మా ఇంట్లో మా నాన్న గారు ప్రతి నెలా బాలజ్యోతి తెచ్చేవారు (మాకు 18 ఏళ్ళు వచ్చేవరకు స్వాతి,ఆంద్రభూమి వంటి పత్రికలు నిషిద్దం ..18 ఏళ్ళు వచ్చాకా అసలు కొనడమే మానేసారనుకోండి అది వేరే విషయం) ఆ బాల జ్యోతిలో ఆ నెల కధల పోటీ లు వేసాడు .. పేజీ కి ఒక వైపే రాయాలి, నాలుగు పేజీలకంటే ఎక్కువ రాయకూడదు ఇలాంటి నిబందనలతో ఒక ప్రకటన ఉంది.అది చూపిస్తూ ..చెల్లీ, నీ టాలెంటు అంతా ఉపయోగించి ఒక కధ రాసేయి మిగిలింది నేను చూసుకుంటా అంది,నాకూ మనసులో ఎక్కడో కాస్త ఆశ ఉన్నా అంతకుముందు జరిగిన సంఘటలను బట్టి ఎందుకులేవే అన్నాను ..ఆయ్..ఇంత మంచి అవకాసం వస్తే ఎందుకూ అంటావా ,నీ గురించి నీకు తెలియదు అని రెండుపొగిడేసి కధరాయడానికి కూర్చోపెట్టింది..
సరే అనుకుని ఇంక నేను విజృబించేసి ఒక కధ రాసి దాని చేతికి ఇచ్చేసా .. అది చదవగానే తెగ సంతోష పడిపోయి చెల్లి, నీకేనే మొదటి ప్రైజు .. ఇంక దీనిని ఎవరూ అడ్డుకోలేరు అని మా తమ్ముడిని పిలిచి మొత్తానికి పోస్ట్ చేయించేసింది .. చేయించింది ఊరుకోవచ్చుగా .... అబ్బే.. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఇంట్లోని వాళ్ళందరితోనూ దీని కధ పత్రికలో పడాబోతుంది .. అంత బాగా రాసింది అని ఠాం ఠాం చేసేసింది.. ఇంక మా తమ్ముళ్ళు ఊరుకుంటారా ... అక్కా నీకు డబ్బులొస్తాయి కదా ఆ డబ్బులు ఏంచేస్తావ్ ..మాకు కేకులు కొనిపెట్టవా అని అప్పుడే రిక్వెస్ట్ లు మొదలెట్టారు.. నేనూ కూడా మనసులో నేనేదో గొప్పగా రాసేసా అని ఫీల్ అయిపోయా ..
మరుసటి నెల అయింది ఆ తరువాత 2 నెలలు అయ్యాయి కాని నా కధ పడలేదు ..ఇంక మా తమ్ముళ్ళు ఏడిపించడం మొదలు పెట్టారు...కధ వెనకకు కూడా తిప్పి పంపలేదంటే చెత్త బుట్టలో వేసేసి ఉంటాడు అని ..సరే ఇంకేం చేస్తాం ఉడుక్కుని ఊరుకున్నా..
కొన్ని రోజులయ్యాకా మా పుస్తకాలన్నీ సర్దుకుంటుంటే అందులో ఒక పేపర్ కనబడింది ఏంటా అని చూస్తే అది నేను రాసిన కధలో 3 వ పేజీ ...ఇదేంటి ఇక్కడుంది ఇది అని అక్కా..అని ఒక్క అరుపు అరిచా .. ఏంటే అని వచ్చీ నా చేతిలో పేపర్ చూసి ఇదేంటే ఇది ఇక్కడ ఉంది అని ..మెల్లిగా నవ్వుతూ ఈ పేపర్ పెట్టడం మర్చిపోయినట్లున్న కంగారులో అంది ...గాడిదా.. శుబ్బరంగా ఉన్నదాన్ని నీ అతి ప్రేమతో నానా తిట్లు తినిపించావ్ కదా అని వెనుకబడ్డా..
ఇప్పుడు మా అక్క సాదరణ గృహిణి..ఖాళిగా ఉండకుండా వాళ్ళ ఇంటి ముందు గది అంతా షాప్ చేసేసి 24 గంటలు మహా బిజీగా ఉంటుంది ..మొన్న ఎందుకో అక్క నాకోసం పడ్డ తపన గుర్తువచ్చీ .. నా బ్లాగ్ లో మీ అందరి అభిమానం గురించి చెప్పి తను సంతోష పడితే చూసి నేను సంతొష పడదామని ఫోన్ చేసా...
మా సంభాషణ ఇలా సాగింది ....
నేను : అక్కా..
అక్క: నువ్వా చెల్లీ!!బాగున్నావా అమ్మా..
నేను: అక్కా నేనేమో జాజిపూలు అని..
షాప్ కొచ్చిన అమ్మాయి: ఏమండీ ఇదెంతా ??
అక్క:అదా అండి 100 రూపాయలు..ఏంటమ్మా జాజి పూలు కొనుక్కున్నావా అక్కడ మన పువ్వులు దొరుకుతాయా..
నేను:అది కాదక్కా ..నేను బ్లాగ్ ఒకటి..
మా అక్క పెద్ద కూతురు : అమ్మా స్కూల్ కి టైము అవుతుంది జడ వేయి ...
అక్క : ఆగు పిన్ని మాట్లాడుతుంది..ఏంటమ్మా బావగారా బయటికి వెళ్ళారు ..అది 80 కి రాదండి .. కావలంటే 90 చేసుకోండి..
నేను:అది కాదక్కా నేను కధలు రాస్తున్నాను ..
అక్క రెండో అమ్మాయి: అమ్మా ఆకలి..
అక్క: నా బంగారం కదా అక్కడ ప్లేట్ లో పెట్టెసా తినేసేయమ్మా..ఏంటీ తినవా.....నేనే పెట్టాలంటే ఎలాగా !!తంతా జాగర్తా .. ఇంకో మాట లేదండి 90 కి వస్తుంది లేదంటే లేదు.. చెప్పమ్మా కదలు రాసావా ఇండియా కొచ్చినపుడు చదువుతాలే..
ఇలా అష్టావదానం చేస్తున్న అక్కతో ఆ హడావుడిలో చెప్పినా ఇంతకు ముందు లా తను సంతోష పడగలదా?ఈలోపల పిల్లలు కొట్టుకోవడం వాళ్ళ ఏడుపులు మద్య తరువాత చేస్తా అని పెట్టేసా..
తనకి తీరిక ఉన్నపుడు నాకు కాళీ ఉండదు..లేదా వాళ్ళకు తీరికైన సమయం మాకు అర్దరాత్రి అవుతుంది .. లేదా ఈ హడావుడి లైఫ్ లో అలసట వల్ల ఫొన్ చేయడమే కుదరదు..ఎంత తాపత్రయ పడేది నా కోసం.. ఏంత ప్రేమ చూపేది..అచ్చం అమ్మలా..ఆ చిన్న వయసులో అదంతా తెలిసేది కాదు నాకు ..ఇప్పుడు ఈ హడవుడి జీవితంలో కనీసం పాత ఙ్ఞాపకాలు తలుచుకునే తీరిక కూడా ఉండటం లేదు నాకు ..
ఒక్కోసారి అనిపిస్తుంది ....ఏందుకీ హడావుడి బ్రతుకులు ...ఏమైపోయాయి ఆ రోజులూ...

41 కామెంట్‌లు:
మీ శైలి చాలా బాగుందండి... చాలా బాగా రాస్తున్నారు... ఎన్ని చిరునవ్వులు పూసాయో నా పెదాలపై... మాకు ఇంకొ మంచి బ్లాగరు దొరికారు...
మీకు చాలా విషయాలు గుర్తున్నాయి చిన్నప్పటివి, అదే నాకైతే సంవత్సరానికో సన్నివేశం చొప్పున అంతే! :-)
చాలా బాగా రాసారు. నిజంగానే చాలాసార్లు చిరునవ్వులు పూయించారు.
దిలీప్ గారు .. నేను పెరిగింది ఉమ్మడి కుటుంభం లో ..ఇలా ఒక్క సారిగా విడి గా కాపురం పెట్టాకా ఆ ఆలోచనలన్నీ వదలడం లేదు.. ఒంటరిగా ఉన్నా .. పని చేసుకున్నా.. ఆ నాటి ఙ్ఞాపకాలను నెమరువేసుకునే చేస్తాను.. బ్లాగడం మొదలెట్టాకా మరీ ఆలోచిస్తున్నా.. మీ వాక్య్లకు ధన్య వాధాలు :
చాలా చక్కనిశైలిలో వ్రాస్తున్నవమ్మా.నువ్వు బాగారాయగలవని మీ అక్కగారు ముందుగానే గుర్తించారు.
మంచిది.కొనసాగించు
దుర్గేస్వర గారు ,విస్వనాధ్ గారు ధన్యవాధలు అండి తప్పకుండా ఈ కధలు వాక్యలు గురించి నేను మా అక్కకు చూపిస్తాను :)
chaalaa bagundandi nestam garu...good one :)
భలే రాశారు.
చాలా బాగా వ్రాసారు నేస్తం.. :)
నేస్తం.....నాకూ నా పాతరోజులు గుర్తుకువచ్చాయి....
చాలా చాల నచ్చింది.
laxmi గారు ,phani pradeep గారు,raji గారు,padmarpita గారు ధన్య వాధాలు :)
Chaaaaaaaala baaga raastunnav.
Mee akka ki chupinchi..dishti kuda teeyinchuko
~C
@C హా ..హా హా నా కధలు నచ్చినందుకు thanks :D
చిన్నప్పటి విషయాలు చాలా బాగా రాస్తున్నారు నేస్తం!:)
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
మీ బ్లాగులో ఫోటొలు చాలా బాగున్నాయండి.
parimalam గారు vihaari గారు ధన్య వాధాలు :)
చాలా బాగా వ్రాసారు. ముఖ్యముగా 'కథకు బహుమతి వస్తే ' అన్నది చదువుతుంటే కొన్ని తీయని స్మృతులు గుర్తొచ్చాయి.
Nestam ,
Super.your sister is great Inventor.
బావున్నాయ్ మీ టపాలు :)
expecting more..
చాలా బాగా రాసారు.మీ బ్లాగు చూస్తే మీ అక్క తప్పక సంతోషిస్తారు.మీరు రాసారని చెప్పకుండా మీ అక్కకి ఇవి పంపించండి.చదివాకా అభిప్రాయం అడగండి.నిజాలు బయటకి వస్తాయి :)
నిజమే నేస్తం, నాకు కూడా మీ టపా చదివాక మా నానమ్మ గుర్తుకొచ్చి బాగా ఏడుపు వచ్చింది. నా గంతులే నటరాజతాండవమంత గొప్పగా చూసేది, నా పలుకే తేనంత తీపిగా వున్నట్లు వినేది. నా పాలకోవా రంగే పాల కంటే తెలుపనీ, నా ముగ్గులు రత్నాలవల్లులని, ఇలా నావన్నీ అపురూపంగానే చూసేది. చదువుకుంటుంటే కొబ్బరినూనెరాస్తూ అలాగే ప్రక్కనే కూర్చునేది. చివర్లో కంటి చూపు పోయాక కూడా, 21/2సం. తిరిగి వచ్చిన నన్ను కేవలం స్పర్శతొ గుర్తు పట్టేసింది, అంతే ప్రాణం పోయింది, అంతా దీనిమీదే ధ్యానవారిపోయింది ప్రాణం, 6 నెలలు ఆపుకుంది ఆయువు అన్నారు. ఈ 01/11 తను పోయి పుష్కరమైంది. చిన్నప్పుడు "ఇది చిన్న సీతమ్మ" అంటే వుడుక్కునే నేను ఇపుడెవరైనా అలా పిలిస్తే బాగుండుననుకుంటాను. తనకి ఇష్తమైన పటికబెల్లం పలుకులు, హార్లిక్స్ అపుడపుడు రుచి చూస్తూ తను నా దగ్గర కూర్చున్నట్లు అనుకుంటాను. తన గుర్తుగా తన నీళ్ళ చెంబు, తన వంటి మీద 70సం. వున్న దుద్దులు ఇలా మరి కొన్ని నా దగ్గర పదిలంగా వున్నాయింకా. ఏంటొ ఈ గతజలసేతుబధనాలు. ప్చ్..
జీడిపప్పు గారు ,అరుణాంక్ గారు ,రిషి గారు ధన్యవాదాలు :)
రాధిక గారు తప్పకుండా అలానే చేస్తాను.. thanks అండి..
ఉష గారు మా నాన్నమ్మ ,తాతయ్య బ్రతికున్నంత కాలం నాకు అంత తెలిసేది కాదు..వారు పోయాక తలుచుకోని క్షణం లేదు..
వారి మాటలు అలా గుర్తు వస్తునే ఉంటున్నాయి :(
చాలా బావున్నాయి నేస్తం..!! మీ చిన్ననాటి కబుర్లు.
చాలా రోజుల్నించీ ఎలానో మీ బ్లాగ్ మిస్ అయ్యాను.
తీరిగ్గా చదివి కామెంటుతుంటానులే ఇప్పట్నుంచీ :)
మీ శైలి చాలా బావుంది నేస్తం..!! :)
madura vaani గారు ధన్య వాధాలు :)
పని ఒత్తిడి లో చూడటం కాస్త ఆలశ్యమైంది నేస్తం. మీరు చివరలో అన్న ఎందుకీ హడావిడి బతుకులు!! అనే అనుకుంటున్నాను ప్రస్తుతం.
టపా అసాంతం చాలా బాగుంది. నాకూ అలాంటి ఓ అక్క ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. సో మీ బ్లాగుకు బాల్యం లోనే పునాదులు పడ్డాయనమాట :-)
అంత పని వత్తిడి లో కూడా మీరు నా బ్లాగుని పలకరించినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్ గారు ఒక రకం గా మీ వాక్యలకు అలావాటు పడిపోయాను నేను కూడా:)
హై నెస్థం. ఎల వున్నారు? మీరు na smoking habbit ఎప్పుడయిన చెక్ చెయ్యొచ్చు. ఈంకొ విషయం ఎంటంటేయ్ అప్పటికి నాకు బహుశా నాకు పెళ్ళి అయుండచ్చు. కావున, నేను మళ్ళి స్మోక్ చేసె ఛాన్స్ ఏమాత్రం లేదు. మీ బ్లాగ్స్ చధివాను. చాలా బాగుంది. గుడ్ లక్ 4 ద ఫ్యూచర్. మళ్ళి కలుద్దాం. :)
ముందుగా మీకు శుభాకాంక్షలు.. ధన్య వాధాలు
నా బ్లాగ్ నచ్చినందుకు :)
నా బ్లాగు చదివినందుకు కృతజ్ఞతలు! మీ బ్లాగుకి నా బ్లాగు నుంచి లంకె వేసాను!
మీ గోపాళం!
మీరు నిజంగా సామాన్యులు గారు !! నేను ఇంత వరకు పూర్తిగా చదివిన అతి కొద్ది టపాల్లో ఇది ఒకటి.
అ...ఆ ల తో కవిత భలే వుంది. దానికి మీ తాతయ్య గారి పంచ్ కూడా అదిరింది. ఎప్పటికైనా మీరు మంచి రచయిత్రి అవుతారండి తప్పక అవుతారు (' నువ్వు నాకు నచ్చావ్ ' సినిమాలో సునీల్ డైలాగ్). మొత్తానికి డల్‌గా వున్న నా మూడ్ మూడింతలు మెరుగయ్యింది. థ్యాంక్యూ.
thanks ashok thanks nee korika teeraalani aa devudini manasaaraa korukuntunnaanu :P
chimply Chuperb,
Me shili super
inka edo cheppalanukunna marchipoya, sare pote poni .... naku telugulo teluguni ela type cheyalo chepte na responce nenu ikapi telugulone pamputa ......
మీరు తెలుగులో రాయాలంటే lekhini.org అని టైపు చేసి అక్కడ రాసి ఇక్కడ paste చేయవచ్చు.. మీ అభినందనలకు ధన్యవాదాలు
నేస్తం, మనసుకు హత్తుకునేలా చెప్పారు. ఎన్ని జ్ఞాపకాల జాజులు పూయిస్తున్నారో కదా!
శృతి గారు ధన్య వాధాలు
ఏమండి , ఈ సారి మాకు చెప్పటానికి ఇంకా ఏమీ లేవా? కొత్త పోస్ట్ కోసం మేం వెయిటింగ్ ......
కుమార్ గారు ధన్యవాదాలు మాకు holidays రావడం వల్ల కొంచెం బిజీ ..ఈ లోపల మీరు నా పాత పోస్ట్లులు 2008 వి చదవ గలరు :)
హ హ హ.
బాగుంది.
మీ అక్క బదులు మేమంతా ఉన్నాం మీ బ్లాగుని ఆస్వాదిస్తూ, ఆనందబాష్పాలు స్రవిస్తూ :)
ఒక్క మాట .. సాధారణ గృహిణి అని ఎప్పుడూ అనొద్దు. గృహిణులు ఎవ్వరూ సాధారుణులు కారు.
కొత్త పాళి గారు నిజమే సాదారణ గృహిణి అని అందరిలానే అనేసా ... మీరెంతటి ఉన్నతమైన వ్యక్తో ఈ విషయమే చెబుతుంది .. ధన్యవాధాలు
chala bagunnai mee posts nestam...simply superb...nenu ma friend okatanu me blog gurunchi chepte saradaga start chesanu, meeru nammaru kani...me posts ani chadivesa telsa.....me fan ayipoyanandi babu...haha....keep up the good work...
కిషెన్ గారు మీ అభిమానానికి ధన్యవాధాలు.. మీ ఫ్రెండ్ గారికి కూడా :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి