8, జూన్ 2011, బుధవారం

ఇరుగు-పొరుగు


ఏంటలా చూస్తారు!!!.......బొమ్మల కొలువులా పర్సులు,హ్యాండ్ బ్యాగుల కొలువు పెట్టిందేమిటిరా బాబు అనే కదా ...అవి అన్నీ నా హ్యాండ్ బ్యాగులే .... ఇంకా కొన్ని ఉన్నాయి లోపల ...ఆగండాగండాగండి .... ఇప్పుడేమనుకుంటున్నారో కూడా నాకు తెలుసు ... ఆడవాళ్ళయితే.." ఎంచక్కా నేస్తం వాళ్ళాయన ఏంకావాలంటే అవి కొనిపెట్టేస్తారు కాబోలు" అని, మగవాళ్లయితే.." ఈ ఆడవాళ్ళు అందరూ ఇంతే వీరు ఈ జన్మకు మారరు" .... అని కదా :) ....అలా అయితే మీరు హ్యాండ్ బ్యాగులో చెయ్యి పెట్టినట్లే.... నేనసలే బద్దకానికి కేరాఫ్ అడ్రెస్ ని...అలాంటి నేను హ్యాండ్ బ్యాగ్ మోయడం కూడానా ...నా బస్ కార్డ్ కూడా మా ఆయన జేబులో పడేసి హాయిగా చేతులు ఊపుకుంటూ బయటకు వెళతాను.... మరి అవన్నీ ఎలా వచ్చాయంటే ... బోలెడు సోది వింటే తెలుస్తుంది ....



అవి మేము "యిషున్ "అనే ఊర్లో ఉన్న రోజులు... అయిదు నెలల మా బాబుని తీసుకుని ఇండియా నుండి తిరిగి సింగపూర్ వస్తుంటే దారిలో మాఆయన ..."బుజ్జీ!! మరే..ఇల్లు కొద్దిగా డర్టీగా ఉంది క్లీన్ చేసుకోవాలి ,ఏమనుకోకేం" అన్నారు...అసలే సంవత్సరం ఎడబాటేమో ప్రేమ పొంగిపోర్లిపోతుంది నాకు ...అందుకే " మురికి కాలువ ప్రక్కన మడతమంచం వేసుకున్నా ప్రశాంతంగా నిద్రపోగలిగే మా ఆయన" ఆ మాట అన్నప్పుడు ఏ మాత్రం అనుమానం రాలేదు...... "ఏం పర్వాలేదు నేను వచ్చేస్తున్నానుగా అదంతా నేను చూసుకుంటాను "అని అభయం ఇచ్చేసాను...అదెంత తప్పో ఇంటికి వచ్చాకాగాని తెలిసిరాలేదు నాకు .... ఇలా తలుపు తీయడం పాపం ఒక బ్రెడ్ ప్యాకెట్టు ,ఒక వాటర్ బాటిల్ చేతిలో పెట్టేసి ఆఫీస్కు పారిపోయారు ...ఇల్లు చూడగానే కళ్ళమ్మట నీళ్ళు రావడం ఒక్కటే తక్కువ నాకు..నేల పైన అరంగుళం మందాన పేరుకుపోయిన మురికి ,గోడల నిండా బూజులు ...సోఫాలు ,మంచాల క్రింద తిని పారేసిన చెత్త.. కడగని ప్లేట్లు ..సింకులో నెలల తరబడి పేరుకుపోయిన అంట్లు ...హాలు నిండా దుప్పట్లు ఇలా ఒక్కటి కాదు ...అప్పటి నుండి మా ఆయన కొంచెం మురికిగా అన్నారంటే చాలు కళ్ళుతిరిగి పడిపోతూ ఉంటాను ...



ఏం చేస్తాం... నా పరిధిలో నాకొచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ ఇల్లంతా కడిగిన ముత్యంలా చేసి సాయంత్రం తనోచ్చేసరికి ప్రొద్దున్న వల్లేవేసిన తిట్లు అప్పగించాబోతుంటే "ఎవరు నిన్ను సర్ధమన్నారు...సర్దిన సామానంత ప్యాక్ చేయి మనం ఇల్లు మారుతున్నాం ఈ నెలాఖరుకి" అన్నారు ...." ఇల్లు చూసారా? నాకు చెప్పకుండానే? అయినా నేను రాను..... నాకిక్కడ అలవాటయింది ఇక్కడ బోలెడు ఫ్రెండ్స్ ఉన్నారు.. ఉహుహు" అన్నాను భయంగా ..." ఫ్రెండ్స్ అనేవారు ఎక్కడైనా ఉంటారు మనం నడుచుకునే పద్దతిబట్టి ఉంటుంది ...రోజూ "యిషున్" నుండి "టేంపనీస్" కి వెళ్ళిరావాలంటే నాకు తీరిపోతుంది.. అందుకే ఆఫీస్కి దగ్గరగా ఇల్లు తీసుకున్నాను ...అడ్వాన్స్ కూడా ఇచ్చేసా "అన్నారు .... మళ్ళీ ఈసురోమంటూ సామాను అంతా సర్ది ఇల్లుమారాం ...



క్రొత్త ఇల్లు ఆఫీసుకు,ఆయనగారి ఫ్రెండ్స్ కి దగ్గర గా ఉందికాబట్టి తనకి బాగానే ఉందికాని ఎటొచ్చి నా పరిస్థితే మండే ఎడారిలో ఒంటరి ఒంటెలా ఎటూ తోచకుండా అయిపొయింది... అటుఇటు ఇరుగుపొరుగు ఉన్నారుగాని ఎవరు ఎవరో ఏం తెలియదు.. తలుపులన్నీ వేసేసి నిశ్శబ్దం గా ఉండేవారు...ప్రొద్దున 8 కి తను ఆఫీస్ కి వెళ్తే మళ్లీ రాత్రి పది కే రావడం ...ఇక ఎవరితోనూ ఒక మాటలేదు మంతి లేదు ....అప్పట్లో ఇంట్లో నెట్ కనెక్షన్ అసలు లేదు.. దానికి తోడు ఇద్దరూ చిన్నపిల్లలేమో(మాటలు కూడా రావు ) ప్రతిచిన్న విషయానికీ గట్టిగా ఏడుస్తూ ఉండేవారు ...నాకూ వయసు చిన్నది అవ్వడం వల్ల ఎందుకేడుస్తున్నారో అర్ధం కాక ఎలా సంభాళించాలో తెలిసేదికాదు ...ఒక్కోసారి భయంతో నేనూ కూడా వాళ్ళతోపాటు ఏడ్చేసేదాన్ని .... :)



ఇలా ఉండంగా ఒక రోజునాకు తెల్లవారుజామున బ్రహ్మాండమైన కల వచ్చింది ...నన్ను పక్కింటి ఆంటీ వీరలెవల్లో తిట్టేస్తున్నట్లు ....అప్పటికి పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియదునాకు.. లేచి లేవగానే భయంగా... "ఏమండీ నాకు ఇలా కలొచ్చింది ప్రొద్దున వచ్చిన కలలు నిజమవుతాయా "అని అడిగాను.. "అవుతాయి ...అసలే ఆఫీస్కి టైమయిపోతుందే అంటే ఇలా చెత్త ప్రశ్నలు వేస్తే మనిద్దరికీ గొడవ అవుతుంది ముందు" అని నా మాటలు కొట్టిపడేశారు ....మా వాడు ఎప్పటిలాగే స్నానం చేయిస్తున్నపుడు బోరున ఏడుస్తుంటే,మా అమ్మాయి సోఫా పై నుండి క్రిందపడి శృతి తగ్గకుండా వాడితో జత కలుపుతుంటే.. ఓరి దేవుడోయ్ అని హాల్లోకి వచ్చాను ఇంతలో తలుపు దభ దభ అని ఎవరో బాదేస్తున్నారు...



తీయగానే ఒక మలయ్ ఆవిడ కయ్ కయ్ మంది..."మీరు వచ్చిన దగ్గరనుండి చూస్తున్నాను..ఏంటి ..ఈ గోలేంటి ..ఈ ఏడుపులేమిటి ..... ఈ అపార్ట్మెంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు ఎప్పుడన్నా ఒక్క అరుపు వినిపించిందా... నా పిల్లలు ఇక చదువుకోవద్దా....కష్టంగా ఉంటే ఒక మెయిడ్ ని పెట్టుకో..లేదా మీవాళ్లను పిలిపించుకో....పెంచడం చేతకానపుడు పిల్లల్ని ఎందుకు తీసుకోచ్చావ్ ఇక్కడికి...మీమీద కంప్లైంట్ ఇవ్వవలసి వస్తుంది" ....ఇలా ఒక్కటికాదు ...దాదాపు ఓ గంట సేపు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపడేసింది.... నా కల నిజమైపోతున్నందుకు ఆశ్చర్యం ...అన్ని తిట్లు పడుతున్నందుకు ఏడుపు కలగలిపి వచ్చేసాయి .. సాయంత్రం నాకున్న ఒకేఒక శ్రోతైన మా ఆయనకి కక్ష తీరేలా ఇంకోనాలుగు వేసి బోలెడు చెప్పేసాను.. ఆ ఆవేశంలో ఒక అతిముఖ్యమైన విషయం మర్చిపోయాను ... మా ఆయన మామూలుగా ఉన్నపుడు శాంతి స్వరూప్ని మరిపిస్తారు.... కోపం వచ్చినపుడు దుర్వాస మహామునిని తలపిస్తారు...



"ఆయ్..నిన్ను,పిల్లల్ని ఇన్నిమాటలు అందా? పిల్లలన్నాకా ఏడవరా? శుక్రవారం, ఆదివారం వాళ్ళ ఆయన చెవులు చిల్లులు పడేటట్లు ఖురాన్ చదువుతారు ..అప్పుడేం పరవాలేదా....మన ఇండియన్స్ అంటేనే ఏడుపు వీళ్ళకు ... మనదగ్గరే అన్ని రూల్స్ గుర్తొస్తాయి ...ఊరికే ఉంటున్నామా??? బోలెడు రెంట్ కట్టి ఉంటున్నాం ..రేపు విషయం తెల్చేస్తా" అని గై గై మన్నారు .....ఇదెక్కడి గోలరా బాబు అసలే ఫ్రెండ్స్ లేరో అని బెంగ పడుతుంటే శత్రువులు తయారయ్యేలా ఉన్నారు.. ఈయనకేమి ఆఫీస్కి వెళ్ళిపోతారు తరువాత నేను పడాలి అని భయపడి మెల్లిగా ..." ఎందుకులేద్దూ చిన్నవిషయం ... వాళ్ళ తరుపున కూడా ఆలోచించాలి కదా ..ఇక్కడ అందరికీ సైలెంట్గా ఉండటం అలవాటుకదా ...పైగా ఆవిడ పిల్లల ఎక్జామ్సో... ఏమో పాపం ... అయినా దేశంకాని దేశంలో మనకెందుకొచ్చిన గొడవలూ !!" అని చల్లారబెట్టేయబోయాను ...." ఏంటి దేశంకాని దేశం ..ఇక్కడ అందరూ వలస వచ్చిన వాళ్ళే ...మనల్నేమన్నా ఊరికే పోషిస్తున్నారా? ఈ దేశం సగానికి పైగా మన ఇండియన్స్ పైన ఆధారపడే ఉంది ...అందుకే అంతంత జీతాలు ఇచ్చి రప్పించుకుంటున్నారు" ...అని సింగపూర్ ఆర్ధిక వ్యవస్థా దానిలో ఇండియన్స్ పాత్ర అనే విషయం మీద అర్ధరాత్రి పన్నెండుగంటలకు క్లాస్ పీకుతుండగా మళ్ళీ దభ దభా అని తలుపు చప్పుడు ... తీస్తే.. ప్రక్కింటి అంకుల్... "మీరింత సౌండ్ పెట్టి టీవి చూస్తుంటే మేము పడుకోవాలా వద్దా" అనుకుంటూ ... ఆ రోజు ఆయుద్ద వాతావరణాన్ని చల్లారబెట్టడానికి నాకు తాతలు దిగోచ్చినంత పనైంది .....



ఇక అక్కడినుండి మా ఆయనా, పక్కింటివాళ్ళు ఒకరికొకరు ఎదురైతే చాలు చూపుల చురకత్తులు దూసేసేవారు..ఏ క్షణం యుద్ధ భేరి మోగుతుందో అని గొప్ప టెన్షన్గా ఉండేది .. అలాంటి సమయంలో ఒక రోజు బయట వర్షం వస్తున్నట్లు అనిపించి తరుగుతున్న టమోటాలు అక్కడే పడేసి ఆరబెట్టిన దుప్పట్లు తేవడానికి బయటకు పరుగులు పెట్టాను...అంతే ...గాలికి దబ్బున తలుపు పడిపోయింది ... మావి ఆటోమేటిక్ గా లాక్ అయిపోయే డోర్లు... ఇంకేంటి ..బయట నేను, లోపల పిల్లలు... పైగా కిటికీ తలుపులతో సహా అన్ని క్లోజ్ చేసిపడేసాను...పిల్లలకు నేను కనబడే అవకాశమే లేదు.. బాబుగాడికి నడక కూడా రాదు ...వాడు నిద్ర లేచి క్రింద పడిపోతే ?అసలే బేబీ కాట్ చాలా ఎత్తుగా ఉంటుంది .... కూరగాయలు తరుగుతూ ఆ కత్తి అక్కడే పడేసి వచ్చాను.. పాప అది తీసి ఆడితే ? నా పై ప్రాణాలు పైనే పోయాయి ... ఇప్పుడేం చేయాలి ?



మా పాప నేను దొంగాట ఆడుతున్నానేమో అనుకుని తలుపు కొట్టి నవ్వుతుంది తీయమని ...పాపం దానికి మాట్లాడటం కూడారాదు అప్పటికి ...తలుపు కీస్ పైన కొక్కానికి తగిలించాను అందే చాన్స్ లేదు ...ఏం చెయ్యాలి ఇప్పుడు ...ఇటు మలయ్ ఆంటీ దగ్గరకు వెళ్ళాలంటే భయం... అటు పోర్షన్లో చైనా అమ్మాయి ఉండేది కాని తను ప్రొద్దున్నే జాబ్ కి వెళ్ళిపోతుంది ...పాప కాసేపు నవ్వాక ఇక మొదలుపెట్టింది ఆరునోక్క రాగం..... దాని ఏడుపుకి వీడు ఎక్కడ లేస్తాడో అని సగం భయం .... ఇక తప్పక ఆంటీ ఇంటివైపు అడుగులు వేసాను ..."ఎగైన్ స్టార్టెడ్" ..లోపల ఆంటీ అరుపు... దబ్బున తలుపువేసిన సౌండ్ వినిపించాయి..చేసేది లేక పాపని సంభాళిస్తూనే కాలుకాలిన పిల్లిలా తిరుగుతుంటే ..సరిగ్గా దిగివచ్చిన చైనా దేవతలా ప్రక్కింటి చైనా అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ తన పోర్షన్ తలుపులు తీసుకుంటూ లోపలికి వెళ్ళింది... పరుగు పరుగున తన గుమ్మంలోకి వెళ్లి "మా తలుపు లాక్ అయిపొయింది ..పిల్లలు ఇంట్లో ఉండిపోయారు ..ఒక సారి సెల్ ఇస్తే మా ఆయనకు కాల్ చేస్తాను "అని వచ్చీరాని భాషలో వివరించాను ...దానికి ఒక్క ముక్క అర్ధమవ్వలేదనుకుంటా 'వాట్'? అంది.. నాకు నీరసం వచ్చేసింది ...ఆ అమ్మాయి చేయి పట్టుకుని మా పోర్షన్ కి తీసుకువెళ్ళి అభినయం చేస్తూ వివరించాను .... ఆ అమ్మాయికి విషయం అర్ధం అయి వెంటనే సెల్ నా చేతికి ఇచ్చేసి ... పాపం కిటికీ తలుపులు ఓపెన్ చేయడానికి ట్రై చేసి..రాకపోయేసరికి .. చాక్లెట్స్ తీసి తలుపు క్రింద నుండి లోపలకు విసిరి "హాయ్ బేబీ "అంటూ దాన్ని సముదాయించడం మొదలుపెట్టింది ..



గభ గభా మా ఆయన నెంబర్ కి కాల్ చేయడానికి నెంబర్ నోక్కాబోయాను ... అప్పుడు అర్ధం అయ్యింది నేను ఎంత టెన్షన్లో ఉన్నానో .. తన నెంబర్ మర్చిపోయాను ....9848 ..... తర్వాత ? తర్వాతా ఎంత తల బ్రద్దలు కొట్టుకున్నా గుర్తురావడం లేదు ... అప్పుడొచ్చింది ఏడుపు వరదలా ....పాపం ఆ అమ్మాయి బెదిరిపోయింది .... "నాకు నెంబర్ గుర్తురావడం లేదు" అన్నాను వెక్కేస్తూ ....అసలే ఒక ప్రక్క నా కూతురుని సముదాయిస్తూ ఉంది..దానికి తోడుగా ఇప్పుడు నేను తయారయ్యాను ... నా భుజం చుట్టూ చేయి వేసి.... "ఒకే..ఒకే రిలాక్స్ ... ఏం కాదు టెన్షన్ పడకు ...ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా "అని అడిగింది .."ఉహు "అన్నాను అడ్డంగా తల ఊపి ...."కొంచెం రిలాక్స్ అవ్వు గుర్తొస్తుంది" అంది...ఒక అయిదు నిమిషాలకు ఆయన సెల్ నెంబర్ గుర్తురాలేదుగాని ఎప్పుడో చెప్పిన ఆఫీస్ నెంబర్ గుర్తొచ్చింది విచిత్రంగా ...



వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేసాను.. లక్కీగా మా ఆయన" హలో" అన్నారు... "అర్జెంట్గా ఇంటికి రండి... తలుపు లాక్ అయిపొయింది ...పిల్లలు ఇంట్లో ఉన్నారు" అన్నాను అరుస్తూ ... "ఇప్పుడా !!!చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది బుజ్జీ... ఒక వన్ అవర్ మేనేజ్ చేయగలవా "అన్నారు.. ఎంత కోపం వచ్చిందంటే సెల్ ఆ అమ్మాయిది అయ్యింది కాబట్టి సరిపోయింది.. ..."సరే.. అలాగే.. వచ్చేటప్పుడు నాకు, పిల్లలకు టిక్కెట్స్ తీసుకురండి నేను మా ఊరు వెళ్ళిపోతాను ... తొక్కలో మీటింగ్ ...పది నిమిషాల్లో ఇంటికి రాకపోతే చూడండి "అని మొబైల్ ఆ అమ్మాయికిచ్చేసి మా గుమ్మం దగ్గరే ఏడుస్తూ కూర్చున్నాను.. కాసేపటికి లోపల మా అమ్మాయి ఏడుపు ఆపేసింది ... ఎంత పిలిచినా పలకదు..ఏమైందో తెలియదు ...బిక్కు బిక్కుమని కూర్చున్నా ...పావుగంటలో మా ఆయన ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చి కీస్ నా చేతిలో పెట్టేసి ..సారీ బుజ్జీ చాలా అర్జెంట్ పని అని వచ్చిన కేబ్ లోనే వెనక్కు వెళ్ళిపోయారు ...ఆ చైనా అమ్మాయికి థాంక్స్ చెప్పి గభ గభా తలుపు తీసి చూసాను ...



ఇల్లంతా పావనం చేసేసి, దానిపై నాలుగు దుప్పట్లు తెచ్చి పడేసి, వాటిపై నోట్లో వేలు పెట్టుకుని పడుకుని హాయిగా నిద్రపోతుంది...బాబుగాడు అప్పుడే నిద్ర లేచి ఏడుస్తూ మంచం దిగడానికి ట్రై చేస్తున్నాడు .... అమ్మో కాసేపు లేటు అయితే ఏమయ్యేది అనిపించేది ...ఇరుగుపొరుగు ఉండాలని ఇందుకే అనుకుంటా అంటారు ...సమయానికి చైనా అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది ... లేకపోతే పరిస్థితి ఏంటి అని దిగాలుగా అనిపించింది .... "లేకపోతే ఏమవుతుంది బుజ్జి ...లాక్ స్మిత్ ని పిలిచి తాళం తీయిస్తావు ...ప్రతీది ఎదుటివాళ్ళ పై ఆధారపడకూడదు ... ధైర్యంగా ఉండాలి " మా ఆయన రాత్రి క్లాస్ పీకారు .."ఆ తాళాలు తీసే అబ్బాయికి అయినా కాల్ చేయాల్సిందే కదా ...అప్పుడన్నా ఇంకో వ్యక్తి అవసరం వస్తుందిగా" అన్నాను కోపంగా ..."సరేలే ,అలా లేనిపోని విషయాలు ఆలోచించడం దేనికిలే ...ఇక్కడ అందరూ ఇంతే ...మన జాగ్రత్తలో మనం ఉండాలి .. నువ్వు నీ సెల్ ఎప్పుడు దగ్గర పెట్టుకో .. ఇక మన ప్రక్కింటి వైపు అస్సలు చూడకు "అని పనిలోపనిగా వార్నింగ్ ఇచ్చేసారు..



మరి కొన్ని రోజులకు లెటర్ బాక్స్లో బిల్ల్స్ ఏమయినా వచ్చాయేమో చెక్ చేయడానికి ఓపెన్ చేసి చూస్తుంటే దానిలో ఎవరిదో పేరుమీద లెటర్ ...చూస్తే ప్రక్కవాళ్ళ ఇంటి అడ్రెస్స్ ...పొరపాటున మా బాక్స్లో వేసేసాడన్నమాట .. వాళ్ళ లెటర్ బాక్స్లో వేసేద్దామని చూస్తే వాళ్ళ బాక్స్ క్లోజ్ చేసేసి ఉంది ... ఇప్పుడేం చేయాలి ఇవ్వాలా ?వద్దా ? ఆవిడను తలుచుకుంటేనే భయంగా,కోపంగా ఉంది... పోనీలే ఏం ఇంపార్టెంట్ లెటర్నో అనుకుని మెల్లిగా వాళ్ళింటికి వెళ్లి తలుపు కొట్టాను ...వాళ్ళ అమ్మాయి తలుపుతీసింది .."వాట్ " అంది కొద్దిగా చిరాకుగా ..."మీ లెటర్ మా బాక్స్ లో పడింది" అని చెప్తుంటే వాళ్ళ అమ్మ వచ్చేసింది లోపలి నుండి" వాట్ హేప్పెండ్ ? "అనుకుంటూ ... ఆ లెటర్ వాళ్ళ చేతులో పెట్టేసి మా ఇంటికి పరిగెత్తుకు వచ్చేసాను ...."వద్దంటే వినవుకదా.. నీకు సిగ్గులేదంతే "మా ఆయన ఆ రాత్రి కన్ఫర్మ్ చేసేసారు ...



మరుసటి రోజు బాబుకి స్నానం చేయించి ,షెల్ఫ్ లో బట్టలు తీసి వెనుకకు చూస్తే వాడులేడు ...అవి ఇవి పుచ్చుకుని నడక నేర్చేసుకున్నాడేమో ఒక్క చోట కుదురుగా ఉండేవాడు కాదు ..తలుపు తీసి ఉండేసరికి పరుగున బయటకు వెళ్లాను ...ప్రక్కింటి మెట్లపై నిల్చుని, వాళ్ళను చూసి నవ్వుతూ దాగుడు మూతలు ఆడుతున్నాడు ... వాళ్ళందరూ నవ్వుతున్నారు... మళ్ళీ ఏం గొడవలే అనుకుని గభ గభా ఎత్తుకోచ్చేసాను .... ఇక అక్కడి నుండి వాళ్ళు కాలేజ్ కి వెళ్ళినప్పుడల్లా మా ఇంటి వైపు తొంగి చూడటం.. వీడు కేరింతలు కొట్టడం ... వాళ్ళు నవ్వడం.. వీడు బయటకు విసిరేసిన వస్తువులన్నీ తిరిగి మా గుమ్మమ్మ దగ్గర పెట్టడం చేసేవారు ....పాపం మా ఆయనకు ఈ విషయాలన్నీ తెలియక తన ప్రచ్చన్న యుద్ధం తను ఒంటరిగా కొనసాగించేవారు..



ఒకరోజు దీపావళి ... నేను ముగ్గువేసి దీపాలు అవి వెలిగించి లోపలికి వచ్చాను .. మా ఆయన వస్తుంటే తనని పిలిచి" హేపీ దీపావళి "అని చెప్పిందట ఆంటీ ... పాపం అంత సడన్ షాక్ తట్టుకోలేక పరిగెత్తుకుని నాదగ్గరకొచ్చి" ఇదేంటే నాకు హేపీ దీపావళి చెప్తుంది" అన్నారు ..." ఏమో నాకేం తెలుసు" అన్నాను నేనూ ఆశ్చర్యపడుతూ ......"నాకు డవుటే ..ఆవిడ హిహిహి అందిఅని నువ్వు హహహాహ అని వెళ్ళకు..మళ్ళీ తేడా వస్తే నువ్వే ఏడుస్తావ్ ...ఎందుకొచ్చిన గోలా చెప్పు "అన్నారు..సరే అన్నాను గాని మనం వింటామా? ... మరేం చేయను ??? నేను బయటకు రావడం తోనే నవ్వడం.. వాళ్ళింట్లో ఏం పండగ జరిగినా నాకు ఆ వంటకాలన్నీ పంపడం చేసేది ....ఎక్కడ ఆవు మాంసమో ,గేదే మాంసమో పెట్టేస్తుందో అని నీట్గా ధేంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్ళగానే ఒంపేసేదాన్ని...మరి ఎందుకు అనుమానం వచ్చిందో "నాకు తెలుసు మీ హిందువులు కౌ మాంసం తినరని అది గోట్ మీట్ "అని చెప్పిందోసారి.. మెల్లిగా మా కబుర్లు మొదలయ్యాయి.. ..ఇక్కడ మలయ్ వాళ్ళు హిందీ సినిమాలంటే పడి చస్తారు..హృతిక్ రోషన్ ,షారుక్ అంటే చెప్పనే అక్కరలేదు.. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో హిందీ సినిమాల సిడిలు వందలు వందలు ఉంటాయి ..కాని ఆంటీ మాత్రం తమిళ్ సినిమాలంటే ప్రాణం పెట్టేసేది ....ఆఖరికి విజయకాంత్ ,శరత్ కుమార్లకు కూడా అన్యాయం చేసేది కాదు పాపం.. ప్రతి శనివారం వచ్చే తమిళ్ సినిమా ఎక్కడన్నా అర్ధం కాకపొతే మరుసటి రోజు నాతో చర్చ .... తన కోసం నేను తమిళ్ సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నాను :)



మన ఇండియన్ కల్చర్ ,మన అలవాట్లు అన్నీ అడిగి తెలుసుకునేది....." చిన్నమ్మాయి పర్వాలేదు ఒక బాయ్ ఫ్రెండ్ ని వెదికేసుకుంది ..పెద్దదే ఇంకా ఎవరినీ చూసుకోలేదు బెంగగా ఉంది" లాంటి కబుర్లు మొదట్లో చాలా విచిత్రంగా అనిపించేవికాని ,ఆ తర్వాత అక్కడి వారి పద్దతులు వగైరా నాకు అర్ధం అయ్యేవి.... ఆ తరువాత ఆంటీ నాకెంత క్లోజ్ అయిపోయిందంటే పైన ఫోటో చూసారుగా అవన్నీ తను కొన్నవే ...అవనే కాదు బెడ్ షీట్లు,టవల్స్ ,డిన్నర్ సెట్లతో సహా ఇవని అవని లేవు ..... అన్నీ నాకు ఒక సెట్ తెచ్చి ఇస్తుంది...ప్లీజ్ నీకు ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కాదనకు అంటుంది...



ఇక బాబుగాడి సంగతి చెప్పనే అక్కరలేదు .... మావాడు రోజులో సగం పైగా వాళ్ళింట్లోనే ఉండేవాడు.... వాడి చదువు నేను పట్టించుకునేదాన్నే కాదు ...వాళ్ళే చెప్పేవారు ....ఒక్కోసారి మావారు ఇంటికి రావడం లేటయినపుడు బాబుగాడు నిద్రలో అక్కడ నెప్పని ,ఇక్కడ నెప్పని ఏడుస్తుంటే తను వచ్చి నిద్రపుచ్చేది ... ఒక్కోసారి మార్నింగ్ అలారం పెట్టుకోవడం మర్చిపోయి నిద్ర పోతే ,తనే ఫోన్ చేసి నిద్ర లేపేది స్కూల్ బస్ వస్తుంది మీ ఇంట్లో అలికిడి లేదు అని చెప్పి....ఆఖరికి ఇండియా వెళుతుంటే "అమ్మో రెండు నెలలు ఉంటావా ...బాబు లేకపోతే పిల్లలు బెంగపెట్టుకుంటారు ..వాడి షర్ట్ నాకు ఇవ్వవా ...మా మలయ్స్ బెంగతగ్గాలంటే వాళ్ళ బట్టలు దగ్గర పెట్టుకుంటాం" అని తీసుకునేది ... ఇలా ఒక్కటికాదు మా అమ్మ తర్వాత అమ్మలా చెప్పుకోవచ్చు....తనకోసమే ఇల్లు మారేటప్పుడు ప్రక్క అపార్ట్మెంట్లోనే ఇల్లు వెతుక్కున్నా రెంట్ ఎక్కువ అయినా సరే..... ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మో అంత భీష్మించుకుని కూర్చుంటే ఆంటీ ప్రేమను మిస్ అయ్యేదాన్నేమో అని ..


కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే భర్తమాట వినకపోతే మనకు బోలెడు లాభాలన్నమాట :)

56 కామెంట్‌లు:

prasanna చెప్పారు...

ఫస్ట్ కామెంట్ ......... !!!

శ్రీనివాస్ చెప్పారు...

..................

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

అద్బుతంగా ఆవిష్కరించారు, అనుభవాల్ని, అనుభూతుల్నీ.

కృష్ణప్రియ చెప్పారు...

:))

ఆ.సౌమ్య చెప్పారు...

బావుంది మీ ఆంటీ ప్రేమ, బహుమతులు అన్నీ. కానీ పిల్లలు ఇంట్లో ఉండి లాక్ అయిపోయి మీరు ఇంట్లో ఉన్నప్పటి పేరాలన్నీ ఏదో హారర్ సినిమా చూస్తున్నట్టు ఉత్కంఠతో చదివాను. ఆ సీన్లన్నీ ఊహించుకుని మరీ చదివాను. తరువత ఏం జరిగుతుందో అని నాకు టెన్షన్ వచ్చేసింది అనుకోండి. బలే భయమేసింది. అమ్మో అలాంటి పరిస్థితే వస్తే....బాబోయ్, కష్టమే సుమండీ!

అజ్ఞాత చెప్పారు...

Hello Jajipoolu garu,

The post is very good. I am a silent reader of telugu blogs and I used to like your old blogs very much (which portrayed your innocence and a telugu-girl-next-door feel). Something has changed in your style after a while and I stopped enjoying them, even though I tried (as I used to be a big fan of your blogs). I am soooo happy to see this blog again as it fell into your old blogging style. Sorry, if I hurt U with my comments. But, fans are your first critics (good/bad) – aren’t they? Thanks for sharing your experiences with us.

best wishes,
M

ramya చెప్పారు...

నేస్తం గారు,
మీ ఆంటీ ఫ్యామిలీ ని కిడ్నాప్ చేసి తెచ్చేసుకునే మార్గం ఏదైనా ఉందానని ఆలోచిస్తున్నానిక్కడ :)

మాకు ఇక్కడి ఇరుగు పొరుగుల స్నేహాలు వేరు. అసలు ఎవరికీ కబుర్లు చెప్పుకునే తీరికలు లేవు గనకనేమో అంత చనువుగా ఉండరు కానీ, ఒకళ్ళంటే ఒకరికి గౌరవాలు బాగానే ఉంటాయ్. వాళ్ళ పొజిషన్ లో బయట చెయగలిగిన సాహాయాలు కాదనకుండా చేస్తారు. పెళ్ళిళ్ళూ వాటికి పిలుచుకుంటారు మన కాలనీ వాళ్ళు అనే ఫీలింగ్ మట్టుకు ఉంటుంది.

Venkat చెప్పారు...

Chaala bagundi

మధురవాణి చెప్పారు...

అబ్బబ్బా.. టెన్షన్ తో చచ్చిపోయాను ఆ చదివే కాసేపట్లోనే.. ఏడుపొచ్చినంత పనయ్యింది.. :(
హమ్మయ్యా.. చివరికి అంతా మంచిగా జరిగింది.. :)
ఇలాంటి పరిచయాలు, స్నేహాలు ఇప్పుడు ఆలోచించుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి కదా!

అన్నీటికంటే కొసమెరుపు అదుర్స్! :D
ఇంతకీ బావగారి రియాక్షన్ ఏంటి వాళ్ళతో స్నేహం క్రమంగా పెరుగుతున్నప్పుడు అన్నది ఎక్కువ వివరించలేదు.. నేను దీన్ని ఖండిస్తున్నా అధ్యక్షా!! :P

మధురవాణి చెప్పారు...

అన్నట్టు, హ్యాండ్ బ్యాగుల విషయంలో మీకు సేమ్ పించ్.. :)
చుట్టూ తెలిసిన వాళ్ళు ఎవరూ లేకుండా చిన్న పిల్లలతో ఉండటం నిజంగా ఎంత కష్టమో కదా! హుమ్మ్.. ఇవ్వాళంతా ఈ టాపిక్కే ఆలోచిస్తూ ఉంటానింక.. :P

Vani చెప్పారు...

మండే ఎడారిలో ఒంటరి ఒంటెలా .... comparison bagundi... me old style ki vachesaru....

అజ్ఞాత చెప్పారు...

:))

సుజాత వేల్పూరి చెప్పారు...

భర్తమాట వినకపోతే మనకు బోలెడు లాభాలన్నమాట :)_________ఇదేదో బాగుంది.

మీ పోస్టులు చదివేటపుడు విజువలైజ్ చేసుకోకుండా చదవడం అసలు ఎవరికీ సాధ్యం కాదు నేస్తం వదిన గారూ(ఏదో బ్లాగుల్లో ఇరుగు పొరుగూ కదాని)

siri చెప్పారు...

నేస్తం గారు,

నేను మీ జాజిపూలు బ్లాగ్స్ చాలా ఇష్టం గా చదువుతాను. వ్యాఖ్య మాత్రం మొదటిసారిగా పెడుతున్నాను. అత్తగారి కధల్లా మంచి హాస్యంగా రాస్తారు.

ఇంతకీ పడ్డవారు చెడ్డవారు కాదంటే ఇదేనేమో, ఇగో ఫీలవకుండా వోర్చుకున్నందుకు మంచి స్నేహాభిమానాలు పొందగలిగారు మీరు.

శ్రీరాగ

Sirisha చెప్పారు...

cool..kasepu tension pettaru kani ...last lo gift lu ichi cool chesaru...okkosari antey manaki godava ayina vallathone baga relation form avutundi..

SHANKAR.S చెప్పారు...

"భర్తమాట వినకపోతే మనకు బోలెడు లాభాలన్నమాట :)"
ఇదిగో మీరు ఇలాంటి సంచలన స్టేట్మెంట్లు ఇస్తే కుదరదంతే. ఇంకా నయం ఈ పోస్ట్ మా ఆవిడ చూడలేదు. అదృష్టవంతుడిని.

ఇందు చెప్పారు...

అయ్యబాబోయ్ అంత టెన్షన్ ఎలా భరించారండీ బాబూ!! వామ్మో! నాకు చాలా భయమేసింది :( మావి అలాంటి లాక్సే! కాని ఇక్కడ మా పక్కింట్లోనే తెలుగువాళ్ళున్నా.....ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉంటారు! ఏదో మూగవాళ్ళులాగా కనపడితే చిరునవ్వులతో సరిపెట్తేయడం అంతే! ఇంకో రెండువారాల్లో ఇల్లుమారుతున్నాం! అక్కడన్నా కొంచెం బాగా మాట్లాడేవాళ్ళుంటే బాగుండు! మీ మలయ్ ఆంటీలాగా ;)

చెప్పడం మర్చిపోయా....టపా కేకో కేక! సస్పెన్స్....సెంటిమెంట్...కామెడీ సమపాళ్ళల్లో ఉన్నాయ్ ;) లాస్ట్ లైన్ అదుర్స్! :)))))))))

నేస్తం చెప్పారు...

ప్రసన్న గారు :)

శ్రీనివాస్ ????????

జాస్ హైడ్ కనుమూరి గారు ధన్యవాదాలండి
కృష్ణ ప్రియ :))) (నేనే ఒక చిరునవ్వు ఎక్కువ)

సౌమ్యా భలే భయమేసింది అప్పుడు ... మా పిల్లలకు కాస్త ఎదిగేవరకూ చాలా ఇబ్బంది అయ్యేది ...

నేస్తం చెప్పారు...

అజ్ఞాతగారు నిజమే ...ఇంతకు ముందులా పోస్ట్ లు రాయలేదు మధ్యలో.. ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నాకూనూ అందుకే గ్యాప్ తీసుకున్నా.. మొన్న మా ఆంటీ మళ్ళీ చాలా వస్తువులు కొని ఇంటికి పంపేసరికి ఇలా రాసా అన్నమాట..:)

రమ్యా మా ఆంటిని కిడ్నాప్ చేస్తారా హహహ ... నిజమేనండి చాలా కష్టం ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండటం..మామూలుగా ఉన్నపుడు ఏమీ తెలియదుకాని కష్టం వచ్చినపుడు ఆ లోటు బాగా తెలుస్తుంది..మీ కాలనీ వాళ్ళు ఆ మాత్రమైనా సహాయాలు చేసుకుంటున్నారు ... కొన్ని చోట్లా అలా కూడా దొరకరు ..:)

వెంకట్ గారు :) థాంక్యూ

నేస్తం చెప్పారు...

మధు నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించకు :) మీ బావ గారా... ఏం చేస్తారు పాపం ఆయనగారి గారాల పట్టి ప్రోద్దున్న లేస్తే వాళ్ళ ఇంటి చుట్టూ ప్రదిక్షణాలు చేస్తుంటే వాళ్ళను ఇష్టపడక... కాకపోతే ఒకటిలే తన కోపం తాటాకు మంట వెంటనే తగ్గిపోతుంది..అప్పుడు రెట్టింపు ప్రేమ చూపించేస్తారు..ఇప్పుడు నాకంటే ఎక్కువ తనే అభిమానిస్తారు వాళ్ళను ...హ్యాండ్ బ్యాగుల విషయంలో నా పద్దతేనా... గుడ్ గుడ్ :)

వాణి గారు నచ్చిందా ...:P ..ఆ టైముకి అలా తోచేసిందన్నమాట :)

అను :)))

నేస్తం చెప్పారు...

అంతేకదా సుజాత గారు...వాళ్ళు ఏం చెప్తే అది వద్దనే అంటారు ...మనం అలాగలాగే మీ ఇష్టం అనేసి మన పని మనం చేసేసుకోవాలి ..... వదిన గారా? నాకేదో గుర్తొస్తుంది :P లలితక్కయ్యా లలితక్కయ్యా ఈ మాట విన్నారా :)

సిరి గారు అత్తగారి కధలతో పోల్చేసారా...భలే బాగుందండి మా వాక్య సూపర్ నచ్చేసింది..ధన్యవాదాలు :)

శిరీషగారు అవును ఒక్కోసారి అంతే ..ద్వేషంలో నుండి ప్రేమ పుటేస్తుంది :)

నేస్తం చెప్పారు...

శంకర్ గారు ఎంత అమాయకులండి..భార్య పోస్ట్ ని ఎంత తక్కువ అంచనా వేసారు...వాళ్ళకో సుగుణం ఉంది..ఒకటి ఎదుటివాళ్ళ స్టేట్మెంట్ చదివి ఫాలో అవుతారు ..లేదా తనే సొంతంగా స్టేట్మెంట్లు తయారు చేస్తారు ... మొదటిదే బెస్ట్ ఎందుకు చెప్పానో అర్ధం చేసుకోండి మరి :)

హూం ఇందూ ..ఇప్పుడు ఇండియాలో కూడా అలాగే ఉంటున్నారట ... కనబడితే చిరునవ్వు రువ్వడం ... పోనీలే క్రొత్త ఇంటిలో మంచి ఫ్రెండ్స్ దొరికేస్తారని ఆశిద్దాం.. మనిషి ఆశాజీవి కదా :)

prabandhchowdary.pudota చెప్పారు...

మీరు రాసింది చదివితే అనిపిస్తుంది...ఇక్కడ మా అన్నయ్య, వదిన వున్నారు(అంటే నేను నరసరావు పేట నుండి, వాళ్ళు ఒంగోలు నుండి. అలా అన్నయ్య వదిన అయ్యారు). వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు(అబ్బాయ్ లు).తను వాళ్ళతో ఎంత కష్టపడుతుందో అని. ఇక్కడ ఇరుగు పొరుగు అనే ప్రశ్నే ఉండదు. తలుపులు ముసుక్కుర్చుంటారు అందరు. భారతీయులు చాలా తక్కువ మంది. సో, తను ఒక్కర్తే.. కాకపోతే అన్నయ్య బాగా హెల్ప్ చేస్తాడు వదినకి.

మొత్తానికి మీ పోస్ట్ బాగుందండి.

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్కా.. మీరేం రాసినా మాకు నచ్చుతుందీ.. కాదు కాదు..మీరేం రాసినా మాకు నచ్చేట్టుగా రాస్తారు. కానీ ఈ పోస్ట్ మాత్రం మామూలు గా నచ్చలేదు. పిచ్చి పిచ్చి రచ్చ రచ్చ గా నచ్చేసిందీ నాకు. జాజిపూలు బ్లాగ్ లో పాత పోస్ట్లు అన్నీ గుర్తొచ్చాయ్..

ఎలా అంటే సరదాగా మొదలయ్యీ.. మాంచి మాంచి పంచ్ లతో నవ్వించీ, ప్రేమా, ఆప్యాయత లతో రంగరించీ, కొంచేం సేపు టెన్షన్ పెట్టీ, చివర్లో సెంటిమేంట్ తో మెలిపెట్టీ, ఎవ్వరూ ఊహించని గొప్ప ముగింపు ఇచ్చీ, వెంటనే మళ్ళీ చదివెయ్యాలని అనిపించేలా చేస్తారూ చూశారా? అలా ఉందీ పోస్ట్..

మేము మీ బ్లాగ్ అంటే ఎందుకు పడిచస్తామో మరోసారి ప్రూవ్ చేశారు ఈ పోస్ట్ తో..

అద్భుతమైన పోస్ట్.. ఈ రోజు భోజనం చెయ్యక్కర్లేదనిపిస్తుందీ..

రాజ్ కుమార్ చెప్పారు...

మండే ఎడారిలో ఒంటరి ఒంటెలా ఎటూ తోచకుండా>>

సింగపూర్ ఆర్ధిక వ్యవస్థా దానిలో ఇండియన్స్ పాత్ర అనే విషయం మీద అర్ధరాత్రి పన్నెండుగంటలకు క్లాస్ పీకుతుండగా

తరుగుతున్న టమోటాలు అక్కడే పడేసి ఆరబెట్టిన దుప్పట్లు తేవడానికి

>>>>

మీ బ్లాగ్ చదివితే చాలక్కా.. ఓ భ్లాగ్ ఓపెన్ చేసెయ్యోచ్చు.. అంత నాలెడ్జ్ వచ్చేస్తుందీ.. హహహహ్..

నాకు తెలిసిందేమిటంటే.. సింగపూర్ లో రాకాసి లాంటి యశోధా ఆంటీలే కాదూ... మంచి మనసున్న మలై ఆంటీలు కూడా ఉంటారు అని.

Tejaswi చెప్పారు...

చాలా బాగుందండి. మొదట చేదుగా ఉన్న రిలేషన్ షిప్ తర్వాత తీపిగా మారడం బాగుంది.

హరే కృష్ణ చెప్పారు...

ఊహ తెలిసినంత వరకు
వేటూరి గారి పాటలను
బాపు గారి బొమ్మలను
బాలు గారి గొంతును
జాజి పూలు కబుర్లను మిస్ కాలేదు.. అధ్బుతం... నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈ పోస్ట్
చెయ్యెత్తి..వంద సూపర్ లైకులు కొట్టింగ్స్

గిరీష్ చెప్పారు...

Excellent Post!
చాలా చాల బాగుందండీ..
పంన్చులు + ప్రేమ.

మనసు పలికే చెప్పారు...

అక్కా.. చదివేసాను, పూర్తిగా చదివేసాను టపా.. మళ్లీ మళ్లీ చదివాను. కానీ వ్యాఖ్య ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. అంటే, టపా కి తగ్గట్టుగా వ్యాఖ్య ఉండాలి కదా;) మీ టపా అంత ఎత్తుకి నా వ్యాఖ్య చేరుకోలేకపోతుంది, ఎన్ని సార్లు రాసినా.. మళ్లీ ఒకసారి కాదు కాదు వీలైనన్ని సార్లు మీ పాత టపాలు నెమరేసుకోవాలని ఉంది, ఎన్ని సార్లు చదివినవైనా.. ఇంకేం చెప్పలేనక్కా.. ఇంతే...

కొసమెరుపుని కొత్త భాష ఏదైనా సృష్టించి పొగడాలక్కా... (ప్లీజ్ బావ గారికి చూపించకండి ఈ లైన్..;))

అజ్ఞాత చెప్పారు...

super

అజ్ఞాత చెప్పారు...

Just a correction madam, మీ పోస్టులన్నింటిలో గమనించాను, మలయ్ అని అనకూడదండీ, "మలే" అనేది కరెక్ట్ . ఏమీ అనుకోరు కదా.
http://www.howjsay.com/index.php?word=malay&submit=Submit

అనుదీప్ చెప్పారు...

ఆ విధంగా కథను సుఖాంతం చెసారు అనమాట.. మరి లాస్ట్ లైన్ ఎంటండి అలా అనేసారు... బర్త మాట వినకూడదా? ఇధి అన్యాయం అధ్యక్షా..... దీన్ని నేను తీవ్రంగా ఖండిస్థున్నాం...దీన్ని జీరో హౌర్స్ లో సవరించాలి. :) :) :)

నేస్తం చెప్పారు...

ప్రబంధ్ గారు మా చిన్నప్పుడు సాయంత్రం అయ్యిందంటే చాలు పిల్లలు పెద్దలతో ఇళ్ళ అరుగులన్నీ చాలా హడావుడిగా ఉండేవి ..ఇప్పుడు విదేశాలనేకాదు ఎక్కడైనా ఒంటరితనానికి అలవాటుపడిపోతున్నాం :)


రాజ్ అంతాబాగుంది కాని
>>>>>తరుగుతున్న టమోటాలు అక్కడే పడేసి ఆరబెట్టిన దుప్పట్లు తేవడానికి
మీ బ్లాగ్ చదివితే చాలక్కా.. ఓ భ్లాగ్ ఓపెన్ చేసెయ్యోచ్చు.. అంత నాలెడ్జ్ వచ్చేస్తుందీ

ఇదెందుకు రాసావ్..ఇది చదివిన దగ్గరనుండి నేను టమోటాలు తరిగినా బట్టలు ఆరబెట్టడం చూసినా నాకు నాలెడ్జ్ వచ్చేసింది నేను బ్లాగ్ రాసేయాలి అని ఏడిపిస్తున్నారు మీ బావ :)

తేజస్వినిగారు థాంక్యూ :)

నేస్తం చెప్పారు...

హరే కృష్ణ ,అప్పు :))) థేంక్యూ థేంక్యూ :)

గిరీషగారు థేంక్స్ అండి

అజ్ఞాతగారు థేంక్స్ అండి :)

రెండవ అజ్ఞాతగారు అనుకోవడానికి ఏముంది నాకు తెలియకేగా అలా అంటుంది ఈ సారి మలే అనే అంటాను ..:) ధన్యవాదాలు
అనుదీప్ గారు ఆ లైన్ కోసమే ఈ పోస్ట్ రాయాల్సివచ్చింది ఎలా సవరిస్తాను చెప్పండి :)

నేస్తం చెప్పారు...

వాత్సల్య గారు నేను టెంపనీస్లో లేనండి దగ్గరలో ఉన్నాను...ఓ మీరు st 21 లో ఉన్నరా.. నేను 22 తరచూ వచ్చేదాన్ని ... నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు ... నిజం చెప్పండి మీరు నన్ను ఏడిపిస్తున్న నా ఫ్రెండ్ కాదుకదా :) తప్పకుండా కాల్ చేస్తాను.. కాని సర్ప్రైజ్ ఇవ్వాలిగా.. నేను త్వరలో ఇండియా వెళుతున్నాను .. ఈ లోపల తప్పక కాల్ చేస్తాను ..ఎప్పుడనేది సస్పెన్స్ అంతే :)

prasanna చెప్పారు...

హే.. హే.. నేనే ఫస్ట్..... మీ posts కి వచ్చే 1st కామెంట్ competition అలాంటిది........

ఇండియా క్రికెట్ మ్యాచ్ నైట్ అంతా చూసినా.. . మళ్ళి మార్నింగ్ పేపర్ లో దాని మీద న్యూస్ అండ్ ఆర్టికల్స్ చద్దివితెగని గాని full fill అవదు..........
అలాగే మీ blog చదివినా తరువాత next day కామెంట్స్ కూడా చదివితే గాని completeness రాదు .....

అనుదీప్ చెప్పారు...

ఆలాగైతే బలరాందెవ్ బాబా తొ నిరాహరా దీక్ష చెపిస్తాను... ఆ లైన్ మార్చేవరకు... :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>>> కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే భర్తమాట వినకపోతే మనకు బోలెడు లాభాలన్నమాట :)

హేంత మాట అన్నారు. మీ కొత్త ఇంటి చుట్టూ యశోదా ఆంటీలు ఉండాలని....

మీ పోస్ట్స్ లో one of the best ఇది.

చైతన్య.ఎస్ చెప్పారు...

ఇరుగు-పొరుగు
---------------------
పైన అందరు అన్ని చెప్పేసారు :)

రాజ్ కుమార్ చెప్పారు...

అంటే అక్కా.. నాకు బాగా నచ్చిన కొన్ని లైన్లు రాసేను అన్నమాట. ;)

ఒక సాధారణ విష్యాన్ని పిచ్చెక్కించే పంచ్ లు గా ఎలా రాయాలో ఆ లైన్ చూస్తే తెలీటం లేదా? అది వంటబట్టీంచు కుంటే ఆ నాలెడ్జ్ చాలుగా బ్లాగ్ మొదలెట్టి ఇరగెయ్యడానికీ?? ;) ;) ;) అని నా ఉద్దేశ్యం.

బావగారికి నేను చెప్పానని చెప్పండీ.. బ్లాగ్ మొదలెట్టగానే పండగ కాదూ.. హిట్ పోస్ట్ లు ఎలా రాయాలో జాజిపూలు బ్లాగ్ చూసి నేర్చుకోవాలీ అని ;) హిహిహిహిహిహి


prasanna గారూ.. మీ కామెంట్ సూపరు..నిజ్జంగా నిజమ్ ;)

నేస్తం చెప్పారు...

>>>>>అలాగే మీ బ్లొగ్ చదివినా తరువాత నెక్ష్త్ దయ్ కామెంట్స్ కూడా చదివితే గాని చొంప్లెతెనెస్స్ రాదు .....

ప్రసన్నగారు ధాంక్యూ థాంక్యూ

అనుదీప్ గారు అలాగే ఆ దీక్ష కూడా మొదలెట్టడానికి ముందే ఆగిపోతుంది :)

>>>>మీ పోస్ట్స్ లో one of the best ఇది
బులుసు గారు మీరు పోగిడారంటే బాగా రాసాను అన్నమాట :)

నేస్తం చెప్పారు...

చైతన్య చాలా రోజుల తరువాత ..... థాంక్యూ నచ్చినందుకు :)

>>>>>బావగారికి నేను చెప్పానని చెప్పండీ.. బ్లాగ్ మొదలెట్టగానే పండగ కాదూ.. హిట్ పోస్ట్ లు ఎలా రాయాలో జాజిపూలు బ్లాగ్ చూసి నేర్చుకోవాలీ అని ;)

అలాగే :) ఈ కామెంట్ చూపిస్తాను కదా

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ్మ్ నేనిటు రావడం బోలెడంత ఆలస్యం ఐంది ఈసారి.. పైన అందరూ అన్నీ చెప్పేశారు నేస్తం :( ఐనా సరే అన్నీ మళ్ళీ ఒక సారి చెప్పేస్తాను...

ఈమధ్య వచ్చిన మీ టపాలలో అత్యుత్తమమైన టపా. మొదటి నుండి ఎక్కడా ఆగకుండా మీ ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతూ.. మైండ్లో 70mm సినిమా వేసుకుంటూ చదివేశాను.. ఎంతగా అంటే.. మీరలా ఇంటిబయట తాళం లేక హడావిడి పడుతుంటే ఆత్మ రూపంలో ఆ మెట్లమీద అటూ ఇటూ తిరుగుతూ ఆత్మగా ఉన్నాను కనుక మీకు ఏం సాయం చేయలేక... కానీ మీకేదోవిధంగా సాయం చేయాలి ఎలాగా అని ఆలోచిస్తూ.. గాబరా పడుతూ అక్కడే ఉన్నట్లుగా ఫీల్ అయ్యాను..

ఇక చివరిలైన్ విషయానికి వస్తే నవ్వేసుకున్నాను.. ఇలా సరిచేసుకున్నాను.. “కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే *అప్పుడప్పుడూ* భర్తమాట వినకపోతే మనకు బోలెడు లాభాలన్నమాట :) నిజమే ఎందుకంటే అప్పుడప్పుడూ భార్యమాట వినకపోతే భర్తారావులకు కూడా అన్నే లాభాలు కాబట్టి :)

kiran చెప్పారు...

నేస్తం గారు ...:(((...ఈ సరి కుదరలేదు....టపా వేయంగానే చదివేయడానికి...
అందుకే మనిద్దరం ఓ ఒప్పందానికి వద్దాం...నా కోసం మొదటి ప్లేస్ లో కర్చిఎఫ్ వేసి పెట్టండి..వచ్చి కామెంట్ పెట్టేస్తా ఈ సరి నుండి..
ఇక టపా కి వస్తే.....సూపరు....కాస్త touching గా..నవ్విస్తూ,...భలే ఉంది..
మీ బ్లాగ్ ఎప్పుడు చదివినా...ఎవరిదో ఉన్నట్లు ఉండదు..మా ఇంట్లో వాళ్ళు మాకు ఏదో చెప్తున్నట్లు ఉంటుంది..:)
>>కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే భర్తమాట వినకపోతే మనకు బోలెడు లాభాలన్నమాట :) - :D :D

నేస్తం చెప్పారు...

వేణూ భలేరాస్తారు మీరు కామెంట్స్
>>>>>>>>>>భర్తమాట వినకపోతే మనకు బోలెడు లాభాలన్నమాట :) నిజమే ఎందుకంటే అప్పుడప్పుడూ భార్యమాట వినకపోతే భర్తారావులకు కూడా అన్నే లాభాలు కాబట్టి :)
మేము ఖండించాం
కిరణ్ అలాగే ఈ సారి నువ్వు కామెంట్ పెట్టాకా ప్రచురిస్తాను :))

శివరంజని చెప్పారు...

అక్కా ఈ రోజు ఫుల్ వర్క్............... నీ పోస్ట్ లో మొదటి రెండు పేరాలు చదివేసరికి హెడేక్ కాస్త ఉఫ్ అని ఎగిరిపోయింది ... మిగత పోస్ట్ రేపు చదివి మళ్ళీ కామెంట్ కొడతా

Sasidhar Anne చెప్పారు...

//నాకూ వయసు చిన్నది అవ్వడం వల్ల ఎందుకేడుస్తున్నారో అర్ధం కాక ఎలా సంభాళించాలో తెలిసేదికాదు ..

Ladies chance dorikitey valla vayasu takkava ani cheppataniki try chesatharu kada akka.. :) :)

Post as usual ga kummesindhi.. last 30 days ga busy ga vundatam valla blog chudaledu.. inko rendu posts pending vunnayi.. vatini kooda chadivesi vastha..

నేస్తం చెప్పారు...

శివరంజని మరి మాకా అవకాశం ఎప్పుడిస్తావ్ ..ఎప్పుడు మొదలు పెడుతున్నావ్ పోస్ట్లు :)

హా హా శశి పోయింట్ పట్టేసావ్గా

చిన్నవయసు అని ఎందుకు రాసాను అంటే ఒక్కోసారి పిల్లలు ఊరికే పేచిపెడతారు..పళ్ళు వస్తున్నపుడు ,కడుపులో విండ్ ఉన్నపుడు,,వేక్సిన్ వేయించినపుడు ఇలా మనకు కారణం తెలియదు ..ఒక్కోసారి ఊరికే ఎలర్జీ వస్తుంది, జ్వరం వచ్చేస్తుంది...వీటన్నిటికీ ఏం చేయాలో అర్ధం కాదు..ఇంతకు ముందు దగ్గర పెద్దవాళ్ళు ఉండేవారు కాబట్టి సరిపోయేది..కాని ఇరవైరెండేళ్ళ వయసులో నాకు అవన్ని అర్ధం కాలేదు..నేనూ ఏడ్చేసేదాన్ని వాళ్ళతో పాటు ..తర్వాత తర్వాత వయసుపెరిగే కొద్ది పదిమంది పిల్లల తల్లులతో మాట్లాడుతూ+ అనుభవం అన్నీ కలగలిపి ఇప్పుడు నేనే పదిమందికి సలహాలు ఇచ్చేస్తున్నాను అన్నమాట..:)
అదీ సంగతి

Sasidhar Anne చెప్పారు...

//ఇప్పుడు నేనే పదిమందికి సలహాలు ఇచ్చేస్తున్నాను అన్నమాట..:)

mee salahalu maaku chala vupayogapadathayi akka.. :)

pillalaki 4 years vacchina daka ilanti tippalu tappavu anduke , repu neeku pillalu pudithey memu penchutham ani amma chepthundhi.

శివరంజని చెప్పారు...

ఒక్కోసారి భయంతో నేనూ కూడా వాళ్ళతోపాటు ఏడ్చేసేదాన్ని .... :) >>>>>>>>>. అక్కా పోస్ట్ సూపర్ నాకు ఈ పోస్ట్ చదువుతుంటే ఓ విషయం గుర్తొచ్చింది ..

మొన్నా మద్యన నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళితే పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు ఏడవడం మొదలు పెట్టింది .వాళ్ళ అమ్మ గారు కూడా ఏడవడం మొదలు పెట్టారు .......... నేను కూడా రేపొద్దున్న ఇంతే కదా అని నేను ఏడవడం మొదలు పెట్టాను వాళ్ళ దగ్గర నిలబడి ....మా ఇంకో ఫ్రెండ్ నువ్వు ఎందుకే ఏడుస్తావు బుద్దిలేకుండా అని నన్ను తిట్టిపోసింది

priya చెప్పారు...

meeru gap teesukunnarani chdavadam maanesanu...malli modalettinappudu cheppali kadandi
anyways malli raastunnanduku thanx
very happy
as ususal post sooper
pl do continue

sphurita mylavarapu చెప్పారు...

అమ్మో నేను ఈ మధ్య బ్లాగు విహారం కుదరక మీవి మూడు టపాలు miss ఐపోయాను. ఇన్నాళ్ళకి office లో కాస్త ఖాళీ దొరికేసరికి ముందు మీ blog వైపే కళ్ళు పరిగెత్తాయి. మీ టపా ఎప్పట్లాగే super. ఆ చివరి వాక్యం ఐతే కేక :)

నేస్తం చెప్పారు...

శసిధర్ :)
శివరంజని హ హ హ ..నేనూ నీలాగే.. ఎదుటివాళ్ళు ఏడుస్తుంటే నేను అటు తిరిగి ఏడుస్తూ ఉంటాను అక్కడితో ఆగను మళ్ళీ తల్చుకుని తల్చుకుని ఏడుస్తాను
:)
ప్రియా ధ్యాంక్స్ అండి :)మీరు సింగపూర్లో ఉంటారు ఆ ప్రియనేనా?
స్పురితా ధాంక్యూ ధాంక్యూ నేనూకూడా లేట్ రిప్లయ్

మాలా కుమార్ చెప్పారు...

అమ్మో పిల్లలు ఇంట్లో వుండిపోయి తలుపు లాకైపోయిందా ? బయటకు వెళుతూ ఇంట్లో కొస్తూ టెన్షన్ గా ఆ పేరా చదివేందుకు నాకు ఎంటైం పట్టిందో ! మొత్తానికి ఏ ఆపదా రాకుండా బయటకు వచ్చేసారు కదా అమ్మయ్య .

అజ్ఞాత చెప్పారు...

Mi Paadamani Nannadagavalena story baagundi. Miku movie ki dialogues raayatam intrest vunte contact me.
Name: Raghu
Mobile: 9948020133

Unknown చెప్పారు...

Super