చదువుకునేటప్పుడు అర్ధశాస్త్రం లో క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఒక పాఠం ఉంది ... దాని ప్రకారం ఏదైనా ఒక వస్తువు మనకు గరిష్ట స్థాయిలో లబించినట్లయితే దాని నుండి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది ...ఉదాహరణకు (మీరు దీనంగా చూసినా ,కోపంగా చూసినా నేను వదిలే ప్రసక్తి లేదు ... అసలే నాకు గుర్తున్న ఒకే ఒక పాఠం అది.. తప్పదు మర్యాదగా వినండి ).. మనకు ఆకలేసినపుడు తిన్న మొదటి యాపిల్ నుండి మనకు లభించు ప్రయోజన మొత్తం ను వరుసగా తిన్న 5 వ యాపిల్ పండుతో లభించు ప్రయోజన మొత్తం తో పోల్చి చూసిన యెడల అది క్రమముగా క్షీనించును ...
అయ్యబాబోయ్ అలా కంటి చూపుతో చంపేసే కార్యక్రమాలు ఏవీ పెట్టుకోకండి ... అసలే మా ఆయనకు నేను ఒక్కదాన్నే పెళ్ళాన్ని..మీరు ఆవేశ పడకండి ... నేను వేరే టాపిక్ మార్చేస్తున్నా కదా..... సరే ఎప్పుడూ నా విషయాలేగా చెప్పుతున్నా... ఈ రోజు మా పిల్లల గురించి చెప్పేద్దాం అని డిసైడ్ జేసినా..ప్రపంచం లో బిన్న ద్రువాలు రెండే రెండు ..ఒకటి నేను-మా ఆయన ...రెండు మా అబ్బాయి -మా అమ్మాయి ...ఒక్కటంటే ఒక్క అభిప్రాయం మాకు ఏ కోశానా కలవదు... ఏదో విజాతి ద్రువాలు ఆకర్షించుకుంటాయి అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇలా ఒక చూరు క్రింద బ్రతెకేస్తున్నాం గాని లేకపోతేనా ...ఎందుకులెండి..
మా పాప.. ఇప్పుడు నాలుగు చదువుతుంది (తప్పు .. మీరలా అలా నా వయసు లేక్కవేయకండి.. కళ్ళు డాం అని పేలిపోతాయి.. ) దానికి అన్నీ నా పోలికలే (ట) రూపం లో మాత్రమే... ఒక్క లక్షణం నాది రాలేదు.. ఎంచక్కా నేను అయితే నిమిషానికి ౬౦ పదాల స్పీడ్ తో మాట్లాడుతానా....అది మాత్రం మహా సైలెంట్... ఎప్పుడూ ఒక బుక్ ముందేసుకుని కూర్చుంటుంది..అలా చదువుతూనే ఉంటుంది ... చదువుతూనే ఉంటుంది ...ఏమి దొరకక పొతే టెలిఫోన్ డైరెక్టరి కూడా చదివేసే రకం..ఇంకా డ్రాయింగ్ బాగా వేస్తుంది.. రెండు సార్లు ఇక్కడ తెలుగు సమాజం నిర్వహించిన పోటీల్లో ప్రైజ్ తెచ్చేసుకుంది కూడా... అయితే మా మేడం మాట్లాడితే మాత్రం అన్ని పంచ్ డైలాగ్స్ నే ...
ఓ రోజు నేను సీరియస్ గా ఫ్రెండ్ తో బాతాఖాని కొడుతున్నా .. నా దగ్గర కొచ్చి ఏదో డౌట్ అడిగింది వెంటనే విషయం వినకుండా నాకు ఇంగ్లిష్ రాదు అమ్మా ...డాడీని అడుగు అన్నాను ... నీకు 60 % ఇంగ్లీష్ వచ్చమ్మా 40% రాదు... వచ్చిన 60 % గురించి ఆలోచించవు రాని 40% మాత్రం గుర్తు చేసుకుంటావ్ అంది .. అప్పటి నుండి ముందు ప్రశ్న విని నాకు రాకపోతే రాదు అని చెప్పడం అలవాటు చేసుకున్నా...
ఇంకోసారి ఒక ఫ్రెండ్ నువ్వు పెద్దయ్యాకా ఏమవుతావమ్మా అంది..మా మేడం టక్కున టీచర్ అంది ...ఆవిడ కాసింత వికారం గా మొహం పెట్టి టీచర్ యా ..అలా అనకూడదు ఎంచక్కా కలెక్టర్ యో, డాక్టరో అవుతాను అని చెప్పాలి అంది ....ఇది వెంటనే డాక్టర్ కి ,కలెక్టర్ కి టీచరే కదా ఆంటీ చదువు చెప్పాలి అంది...ఆ ఫ్రెండ్ పాపం మళ్లీ మాట్లాడలేదు..
ఒక్కో సారి మనకు బాగా తిక్క తిక్కగా ఉన్నపుడు చిన్న తప్పు చేసినా దభ దభా నాలుగు వేసేస్తూ ఉంటాను ... పోనీ తన్నిన దాన్ని తన్నినట్లు నోరుమూసుకుని ఉంటానా నైట్ అవ్వగానే అది పడుకుంది అనుకుని ..ఏంటో పాపిష్టిదాన్ని కొట్టేశాను అనవసరం గా ..అని తెగ బాధ పడిపోతూ మా ఆయనకు నా మీద నాలుగు అక్షింతలు వేసే మాహద్భాగ్యాన్ని కల్పిస్తానా !! అప్పుడు తీరిగ్గా కళ్ళు తెరిచి ప్రొద్దున్న నువ్వు కొట్టినపుడే తెలుసు రాత్రి ఈ ప్రోగ్రాం పెడతావని...అందుకే నిద్రపోలేదు ..ఇక పడుకో అని చెప్పి పడుకుంటుంది..
ఇక మా అబ్బాయి..వీడు అచ్చం గా అమ్మ కూచి ...అంటే అమ్మ చెప్పినట్లు వాడు వినడు ..అమ్మే వాడు చెప్పినట్లు వినాలి..వీడి గురించి ఒకటి రెండు వ్యాఖ్యాల లో చెప్పడానికి కుదరదు ఏకంగా గ్రంధాలు రాసేయాలి..ఏదో ఒక మేరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను..
ఏం ముహార్తనా మా అమ్మ వీడికి పవన్ అని పేరు పెట్టిందో అసలు కుర్రాడు సార్ధక నామదేయుడు అయిపోయాడు.. ఇప్పటికీ మా తోడికోడలు అంటూనే ఉంటుంది అక్కా వీడు గోడలు,కుర్చీలు,టేబుళ్ళ పై కాకుండా నేల మీద నడుస్తుండగా చూడాలని ఉంది అని.. ...
పేరెంట్స్ మీటింగ్ వచ్చిందంటే చాలు మా ఆయన నేను ఎంత బ్రతిమాలినా జాలి పడకుండా వాడిని నాకు అప్ప చెప్పేసి మా అమ్మాయిని తీసుకుని వాళ్ళ స్కూల్ కి వెళ్ళిపోతారు.. ఆ టీచర్ ఎంచక్కా దాన్ని పొగుడుతుంటే ఈయనగారు హప్పీగా వింటారు..ఇక మా వాడిని తీసుకుని వాళ్ళ టీచర్ దగ్గరకు వెళ్ళుతుంటేనే నాకు... విన్నావా యశోదమ్మా మీ చిన్ని కృష్ణుడు చేసిన అల్లరి చిల్లరి పనులు అని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దారంతా వినబడుతూనే ఉంటుంది.. గుమ్మం లో అడుగు పెట్టేసరికి ఒక అర బస్తా ఫ్రెష్ గడ్డి రెడీగా పెట్టుకుని వాళ్ళ టీచర్ నాకోసం చూస్తూ ఉంటుంది .. నేను వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా కొసరి కొసరి తినిపిస్తూ.. అసలు మీ అబ్బాయి ఏం చేసాడో తెలుసా ..నిన్న వాడి ఫ్రెండ్ తూజా గాడితో కలిసి గోడల నిండా పెయింట్ పూసాడు.. మొన్న జరీనా నోట్ బుక్ చిన్చేసాడు.. అంతకు ముందు షర్ట్ విప్పేసి నేల మీద పడుకున్నాడు.. క్లాస్ అయ్యేవరకూ నిన్చోపెడతా అంటే రైట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్ నిన్చోనా అన్నాడు.. అస్సలు భయం లేదు.. మొన్న బోర్డ్ మీద యాపిల్ అని అందంగా రాయమంటే అరగంట A చెరిపి రాస్తూనే ఉన్నాడు.. ఎందుకురా అలా చెరుపుతావు అంటే అది అందంగా రావడం లేదు ..వచ్చేవరకూ అలా చేరుపుతా అన్నాడు..ఇలా ఒకటా ..రెండా... ఇంటి కొచ్చి డబ్బాడు అమృతాంజన్.. సీసాడు నవరత్న కేశ తైలం తలకు రాస్తే గాని ఆ సంఘటన ఎఫ్ఫెక్ట్ తగ్గ లేదు నాకు..
ఇక మా అమ్మాయి చక్కగా ఇంగ్లిష్, తెలుగు మాట్లాడుతుందా.. వీడిది సంకర జాతి బాష ..అంటే సింగ్లీష్ అనుకునేరు..ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఇంగ్లిష్ లో మాట్లాడి మాట్లాడి ఇంట్లో కన్ప్యూజ్ అయిపోతూ ఉంటాడు.. మమ్మీ , ఇఫ్ నేను లంచ్ ఈట్ చేస్తే నువ్వు నాకు టూ బొమ్మలు బయ్ చేస్తావా? మమ్మీ నీ స్టమక్ నుండి నేను ఎప్పుడు బోర్న్ అయ్యాను..ఇలా అన్నమాట.. ఒరేయ్ నాయనా మనకసలే భాషా పరిజ్ఞానం మెండు.. నువ్వు పూర్తిగా మున్చేయకురా అని వేడుకున్తూనే ఉంటాను రోజు ..
అదేంటో మా అమ్మాయికి నేను చెప్పే కధలన్నా ,జోల పాటలన్నా ఎంత ఇష్టమో వీడికి అస్సలు నచ్చదు.. వీడికి మూడేళ్ళ వయసులో నిద్ర పోతాడని జోల పాట పాడుతుంటే .. అమ్మా ఆ పాట ఆపితే నేను నిద్రపోతాను అని విసుక్కున్న ఘనుడు వాడు.. అక్కడితో ఊరుకుంటాడా..ఒక్కోసారి వాడికి నిద్రపోయే ముందు కధ చెప్పే మూడ్ వస్తుంది..వెంటనే నేను కధ చెప్తా అంటాడు..ఆ దెబ్బతో మా అమ్మాయి ప్రక్క బెడ్ రూం లోకి ,మా ఆయన హాల్లోకి పారిపోతారు ... ఇక ఆ అంతం లేని కధ అలా సాగుతూనే ఉంటుంది... అది రాత్రి పన్నెండు అవ్వచ్చు ఒంటిగంట అవ్వచ్చ్చు మన అదృష్టం మరీ పండితే తెల్లవారు జాము ౩ అవ్వచ్చు ... అలా చెప్పుతూనే ఉంటాడు.. మధ్య మధ్యలో వాడికి డౌట్ వచ్చినప్పుడల్లా ప్రశ్నోత్తర కార్యక్రమాలు నిర్వహిస్తాడు ... నేను గాని సరిగ్గా సమాధానం చెప్పలేదో ఇక కొంప కీకీకారణ్యం మే ....
పైగా వీడికి తెలివి తేటలు అపారం.. ఓ మారు సీరియస్ గా వచ్చి అమ్మా డేనియల్ వాళ్ళ డాడీ డేనియల్ కి ఒక psp వాళ్ళ అక్క కి ఒక psp ,రియాన్ కి ఒక psp కొన్నారు తెలుసా అన్నాడు.. అది బోలెడు ఖరీదు ..మన దగ్గర అంత డబ్బు లేదు .. ..తప్పు నువ్వు అలాంటివి అడగకూడదు అన్నాను..అప్పటికి వాడు సైలెంట్ అయ్యేసరికి శభాష్ అని నన్ను నేను తెగ మేచ్చేసుకున్నానా.. సాయంత్రం మా ఆయన ౪౦౦$ పెట్టి కొన్న psp తో రెడీ..ఇదెందుకు కొన్నారు ఇప్పుడు అని కయ్ మనగానే ... మద్యాహ్నం ఫోన్ చేసి డాడీ డేనియల్ వాళ్ళ డాడీ రిచ్ కదా వాళ్ళ పిల్లలికి psp కొన్నారు ..నువ్వు బాగా పూర్ వి కదా నువ్వు మాకోసం ఏమి కొనలేవు కదా వద్దులే డాడీ అన్నాడంట .. ఇంకేంటి సీన్ కట్ చేస్తే మా ఆయన రాత్రి నాకు క్లాస్ ..నా చిట్టి తండ్రి గాడి మనసులో నన్ను తక్కువ చేసేస్తావా దుర్మార్గురాలా అని..
ఇక వెటకారం లో వాడిని మించినవాడు ఉండడు..ఒక్కో సారి నాకు ఉన్నట్లు ఉండి జ్ఞానోదయం అవుతూ ఉంటుంది లెండి ... అలా ఒక శుభ ముహుర్తానా మా అమ్మాయిని ,అబ్బాయిని పిలిచి... నాకు అమ్మా అని పిలిపించు కోవడం ఇష్టం చిన్నపుడు అలాగే పిలిచేదానివి.. ఎలా అలవాటు అయ్యిందో మమ్మీ అని అనడం .. ప్లీజ్ నన్ను మమ్మీ అని పిలవద్దు ..అమ్మా అనిపిలవారా అని అడిగాను..మా మేడం వెంటనే ఒక ఆవలింత తీసి .. అబ్బా ఏదైతే ఏమిటి మమ్మీ .. ప్రేమగా పిలుస్తున్నాం గా ..ఉన్నట్లు ఉండి ఎలా మారుస్తా అనేసింది..మా వాడు నా వైపు చూసి అమ్మా ,అమ్మా,అలాగే అమ్మా.. అమ్మా ఆకలి వేస్తుంది ఏమైనా పెడతావా అమ్మా... అమ్మా నీ నైటీ చాలా బాగుందమ్మా..అమ్మా క్రిందకు వెళ్లి ఫుట్ బాల ఆడుకోనా అమ్మా ? అమ్మా మంచి నీళ్ళు అమ్మా.. అని ఆ రోజంతా నా చుట్టూ తిరగడం నవ్వడం.. బాబు బుద్ధి తక్కువ అయి అన్నాను .. నీకు నచ్చినట్లే పిలవరా బాబు అనేవరకూ ఎడిపించడమే... కాని ఒక్కటి లెండి ఇద్దరూ నా పార్టీయే ... ముందు అమ్మే కావాలి..మా ఆయన కుళ్ళుతూ ఉంటారు అన్ని నేను కొని పెడుతూ ఉంటే పట్టించుకోరు కాని రోజు బాగా తిట్టే మమ్మీ యే కావాలి మీకు అని..
ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా రాసేయచ్చు.. కాకి పిల్ల కాకి కి ముద్దు కదా.. అదన్న మాటా..సరే మళ్లీ పైన చెప్పిన క్షీణోపాంత ప్రయోజన సూత్రం విషయానికి వద్దాం .. హి హి హి..... నువ్వు ఇక మరచిపోవా అని బెంగ పెట్టేసుకోకండి.. విషయమేమిటంటే నా బ్లాగ్ పుట్టి ఈ నెలకు రెండు సంవత్సరంలు అయ్యింది...( మీరు చప్పట్లు గట్రా పది నిమిషాల కంటే ఎక్కువ కొట్టొద్దు.. నాకు కూసింత మొహమాటం ఎక్కువ మరి..ఆట్టే ఇట్టాంటివి నచ్చవు )... ఈ రెండేళ్ళల్లో ఏమి రాసానో ఏమి మానానో తెలియదు గాని బోలెడంత అభిమానాన్ని మాత్రం సొంతం చేసుకున్నాను .. అందుకు చాలా గర్వం గాను ఇంకా బోలెడు ఆనందం గాను ఉంది.. నిజానికి ఈ బ్లాగ్ లో నా సొంత డబ్బా తప్పా ఇంకేం రాయలేదు ..దానికి కారణం .. నా విషయాలు అన్ని రాసి మా పిల్లలు పెద్దయ్యాకా మీ మమ్మీ ఆటోబయోగ్రపి అని ఈ బ్లాగ్ లింక్ ఇద్దాం అనుకున్నా..కాని నేను ఊహించనంత ఆదరణ లభించింది..ఇది చాలు నాకు.. ఇంకేం పెద్దగా ఆశలు లేవు..పైన చెప్పిన సూత్రాన్ని అనుసరించి ఈ మధ్య ఎందుకో అంత ఇష్టం గా పోస్ట్‌లు రాయాలి అనిపించడం లేదు.. అందుకే కొంత గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా :) (హమ్మయ్యా అని గుండెల పై చేయి వేసుకున్తున్నారా ..అలాంటి పనులు మనసులోనే చేయాలి ..పైకి చేయకూడదు ..అబ్బబ్బా అన్నీ నేనే చెప్పాలి..)నేను అతి మామోలు సగటు అమ్మాయిని..( ఆంటీ మత్ కహోనా) ఇక ఇక్కడ పరిచయ మైన స్నేహితులు, తమ్ముళ్ళు చెల్లెళ్ళ విషయాని కొస్తే ...అక్కా వచ్చే జన్మలో నాకు అమ్మలా పుట్టవా అని ఒకరు, అక్కా ఇంతకు ముందు జన్మలో నువ్వు నా అక్కవేమో, అప్పుడు నిన్ను బాగా చూసుకుని ఉండను ఈ జన్మలో అందుకే దూరం అయిపోయావ్ అని ఒకరు.. అలాగే ఇది పబ్లిష్ చేయద్దు అని తమ విషయాలు అన్ని ఒక స్నేహితురాలిగా భావించి చెప్పుకునే అనేక మంది నేస్తాలు ..ఇక చాలు ..ఒక్కోసారి ఎక్కువ అభిమానాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం తెలుసా ...
దేవుడి దయవల్ల మీరందరూ హాయిగా ,సంతోషం గా ఉండాలని కోరుకుంటూ
మీ నేస్తం
(కామెంట్స్ పబ్లిష్ చేయడం లేదు ..అవి అన్ని అచ్చం గా నాకే సొంతం )
57 కామెంట్లు:
1st comment ??
>>>"తప్పు .. మీరలా అలా నా వయసు లేక్కవేయకండి.. కళ్ళు డాం అని పేలిపోతాయి..:
ఎంత వేగంతో పగిలాయో కనుక్కుంటాలే నేస్తం :D
మొత్తానికీ పెద్ద షాకిచ్చారు
:) :)
పిల్లలు భలే ఉన్నారు
పోస్ట్ కూడా అంతే బావుంది..లేదు లేదు పిల్లలే బావున్నారు..
వ్యాఖ్యలు ప్రచురించడం లేదా...మీరు ఎక్కడున్నా సంతోషం గా ఉండాలి అదే మాకు బంగారం,ప్లాటినం
మీ బ్లాగు రెండో పుట్టినరోజు చేసుకుంటున్న సంధర్భంగా శుభాకాక్షలు.
నాకు ఎకనామిక్స్ పెద్దగా తెలియవు కానీ క్షీణోపాంత ప్రయోజన సూత్రం అమ్మ, ఆవకాయి, జాజిపూలు బ్లాగుకి వర్తించదు :-)
ఎన్నెన్నో ఙ్ఞాపకాల పరిమళాలు, తీపి తీపి కబుర్ల తోరణాలు, మిత్రుల కొరకు వేచి ఉన్న స్వాగతాలు, చిరుదివ్వెలు,విరి జల్లులు,హరి విల్లులు వెరసి నా జాజిపూలు...
We miss you అక్కా..
అభిమాన తమ్ముళ్ళు చెల్లెల్లందరి తరపున జాజిపూలకు జన్మదిన శుభాకాంక్షలు
http://www.awildride.net/Fotolia_4157653_XS.jpg
mee post lu chala chala baguntayi. naku mee blog chaduvutunte maa intlo akka do vadina do dairy chaduvina feeling vastundi. mee papa ,babu chala bagunnaru. especially mee papa bhale muddu vastondi. meeru tarachu rayandi maa kosam.
keka postt akkaa...
photos rachchaa....:) :)
identandi.. naku assalu nachaledu, nenu tarvata malli msg ista.
పిల్లలిద్దరూ చాలా బావున్నారక్కా. వాళ్ళ మాటలు ఇంకా ఇంకా బావున్నాయి. :)
ఇది టపా గురించి. ఇక ఆ చివరి పారా గురించి నాకు ఏమి రాయాలో తెలియట్లేదు.
ప్రస్తుతానికి ఇవి మాత్రం చెప్పాలి. మీ పోస్ట్‌లు చదివితే చాలు ఎవరైనా మీ మీద అభిమానం పెంచేసుకోవడానికి. దానికి తోడు ప్రతి ఒక్కరి వ్యాఖ్యకి మీరు స్పందించే తీరు ఒక దగ్గరి చుట్టం పక్కనే కుర్చుని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అందుకే ఇంత మంది ఆత్మీయత మీరు సొంతం చేసుకోగలిగారు. నేను మీ బ్లాగు గురించి ఎవరికీ చెప్పినా ముందు మీ చమత్కారం గురించి, వెంటనే మీరు వ్యాఖ్యలకి స్పందించే తీరు గురించి చెప్తాను. పోస్ట్‌లు మాత్రమే కాదు, ప్రతి కామెంటు చదువు అని చెప్తాను.
ఏంటో ఇంకొన్నాళ్ళ పాటు మీ కబుర్లు వినలేము అని తెలిస్తే ఏదోలా ఉంది. విరామం చిన్నదైనా పెద్దదైనా మీరు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాను.
ఇంకా ఏమైనా మాట్లాడాలనిపిస్తే మెయిల్ చేస్తాను. చెక్ చేస్తారు కదూ :)
akka.. nee blog puttina roju subhaakamkshalu...
Akka,
Miru jaldi malla manchi post rayala ani korukuntu....
Krishna
డియర్ నేస్తం, ముచ్చట గొలిపే పిల్లల ముద్దు ముచ్చట్ల తో ఆపేస్తే ఎలా. ఇంత మంచి కబురులు అలా ఆపేస్తే మా లాంటి నేస్తాలం కూడా బాధ పడ్తాం కదా. ఇంక మీ చెళ్ళెళ్ల, తమ్ముళ్ళ సంగతి ఏంటి. కొంచెం రెస్ట్ తీసుకొని వెంటనే వచ్చేయండి. ఓకేనా. మీ జాజిపూల జన్మదిన శుభాకాంక్షలు. రెండేళ్ళకే పిల్లను ఇంట్లో కూచో పెడితే ఎలా?
you touched our hearts..hats off!!
We await your comeback.. c u soon..
మీ ఆర్ధిక సూత్రం అర్ధం చేసుకుందామని వరసగా ఐదు ఆపిల్ పళ్ళు తినేశాను. సూత్రం అర్ధం కాలేదు కానీ మా ఆవిడ గుర్రుగా చూస్తోంది. ఏంచెయ్యమంటారు?
మీ పిల్లలు కూడా మీకు మల్లె హుషారుగా ఉంటారన్నమాట. చాలా బాగుంది. మీరు వ్రాసిన వాటిలో చాలాబాగా నచ్చిన వాటిలో ఇది ఒకటి. బహుశా మీపిల్లల అల్లరి కూడా ఇందుకు కారణం అయిఉండవచ్చు. ఉదయమే చాలా మంచి టపా చదివానని ఆనందంగా ఉంది.
ఇల్లాగే మరెన్నో బ్లాగ్ పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
మీ బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
2nd 1st
సు...సు...సు...సు...సూపర్ పోస్ట్. మీరింతకు ముందు రాసిన "తికమక మకతిక", "ప్రేమకథలు పలురకాలు" రేంజ్ కంటే హైలో ఉంది.
ఓహ్...మర్చిపోయాను మీ జాజిపూలకి రెండవవార్షికోత్సవ శుభాకాంక్షలు. మీబ్లాగు మొదటిసంవత్సరం అయ్యాకా మీరురాసిన పోస్టు తేదీని బట్టి ఈ డిసెంబర్ మూడుకంటే ముందే మీకు శుభాకాంక్షలు చెబుదామనుకున్నా. కాని ప్లిచ్...ఈ మధ్యకొన్ని ఖష్టాలెక్కువయ్యి బ్లాగులవైపు రాలేకపోయా.
మీ బ్లాగువల్ల మీకేందొరికిందో నాకుతెలీదు కాని మాకుమాత్రం ఓ మంచి నేస్తం దొరికింది. నాకు స్వతహాగా ఇంట్లో అమ్మతోటి చెల్లెళ్ళతోటి ఎఫెక్షన్ ఎక్కువ. మీరు రాసినవి చదివినప్పుడల్లా వాళ్ళమధ్యలో కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. మీరురాసిన పాతపోస్టులు చదివినప్పుడల్లా నాకెందుకో మీరునాకు ముందే తెలుసని, మీరు మాఇంట్లో ఒక భాగమని అనిపిస్తూఉంటుంది. బహుశా మీఅభిమానులందరికీ ఇలాగే అనిపిస్తుందేమో.
ఇక మీరు బ్లాగడం తగ్గిద్దామనే ఆలోచనలు తగ్గించుకుంటారని, తప్పనిసరి పరిస్థితుల్లో కొద్ది గేప్ తీసుకున్నా మామధ్యనే ఉంటారని, ఉండాలని కోరుకుంటున్నా. నేను దేవుడికి పూజలవీ చెయ్యటం చాలాతక్కువ కాని ఈసారి అలాంటి అవకాశం వస్తే నాకున్న చాలాకోరికలతో పాటు దేవుడితో మిమ్మల్ని సంతోషంగా ఉంచమని, మీరు సంతోషంగా ఉండగలిగే అన్ని అవకాశాల్ని మీకివ్వమని కోరుకుంటాను.
1
ayya baboy... last line chadavakundaanee.. comment petteesaanee....
mee blog postings baaguntaayani.... daadaapu mee lovestory nundi regualr gaa follow avuthunnaanu... kaani eppudoo comment post cheyyalee....(enduku ani adakkandi. uthhine..)
mee paapa 60%- 40% calculation baagundi..
I enjoyed all of your posts.In my opinion as you mentioned here you wrote about yourself without hypocrisy with lots of punches in between.Any way thanks for sharing all this with us. Take your own sweet time to comeback. enjoy the vacation. All the best.
మీ బ్లాగుని రెండు సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించి, బోలెడు అభిమానాన్ని సంపాదించుకున్న మీకు శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని సంవత్సరాలు పూర్తిచేసుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
విరామం తరువాత కొత్త ఉత్సాహంతో రండి, కుమ్మేయండి. మీరు చక్కని హస్యం రాయగలరు. కాబట్టి ఈ బ్లాగనే ప్రక్రియనీ ఆపేయకుండా త్వరలో తిరిగి రండి.
Wish you good luck and all the best!
keka
అక్కయ్యా... మీ బాబు, పాప ఎంత బాగున్నారో తెలుసా. ముద్దొచ్చారు. వాళ్ల ముచ్చట్లు ఇంకా బాగున్నాయి.:)
ఏంటో నాకు ఏం పెట్టాలో అర్దం కావడం లేదు అక్కా. నాకు తెలియదు మీరు మాత్రం మాతో మాట్లాడాలి అంతే. ఒక వైపు బాధగా మరో వైపు సంతోషంగా ఉంది. ఏంటో అన్నీ పిచ్చి ఫీలింగ్స్. కానీ మీరు చాలా హ్యాపీ గా ఉండాలి అక్కా. మీకు తెలుసా రాజ్ అన్నయ్య అయితే మన నలుగురి కోసం పూజలు చేపిస్తున్నాడు. చాలా మంచి అన్నయ్య కదూ..
HAPPY ANNIVERSARY
nestham garu..post lo 1st para naku emaina artham aithe...meeru dentho kottina...nenu ready.. :)..
mee abbayi basha sooper... :)...nenu mee abbayi frns ii vishayam lo.. :)
pillalu chala cute ga unnaru..
nenu ii blog prapanchaniki vachina kothallo..mee blog chusi thega inspire ayyanu.. :)...anduke..okka art blog ee kaka..inkoti modalu pettanu..
chala baguntayi mee kaburlu...
elagoo publish cheyaru annaru kada a..anduke pedda comment pedtunna.. :)
buzz lo meeru unnaru ani chuse nenu buzz lo enter ayyanandi.. :)
హ హ నేస్తం మీ అమ్మాయ్ పంచ్ లు మీ బాబు అల్లరి రెండూ అద్భుతంగా ఉన్నాయ్ అవి మీ స్టైల్ లో ప్రజంట్ చేయడం మరీ అద్భుతం :-)
రెండొవ పుట్టినరోజు సంథర్బంగా మీబ్లాగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీకు అభినందనలు.
కానీ ఇలా బ్రేక్ తీసుకోవడమే కొంచెం బాధగా ఉంది. అది కూడా నా పుట్టినరోజు పూట ఇలా బాధపెట్టడం మీకు భావ్యమా :( ఏదేమైనా అపుడపుడు మీ పాత టపాలు చదూకోడానికి బ్లాగ్ అందుబాటులోనే ఉంటుందనీ.. మీ విరామం అతిత్వరలో ముగించి రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ టపాలు రాస్తారనీ రాసేయాలని మనసారా కోరుకుంటున్నాను.
కంగ్రాట్స్ నేస్తం గారు!
పిల్లల పేర్లైనా చెప్పలేదు. ఇకనుండి నేను మీ పిల్లల పార్టీ!
meeru ila pedda pedda decisions teeskodam emi baledu.. naku telusu meru maha aite 1 month kanna ekkuva rayakunda undaleru.. pette cheyi maltade noru agalevu.. adante..
నేస్తం గారు....
మీ బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఓహో మీ ఇల్లు చిన్న పాటి కిష్కింద అన్న మాట (తప్పుగా అనుకోవద్దు). పిల్లలు ఎంత అల్లరి చేస్తే అంత ముద్దు. అసలు ఈకాలం(గత 9-10 సం|| నుండి) పిల్లలు పుట్టడమే తెలివిగా పుడుతున్నారు. వారి తెలివితేటలముందు మనం దండగ అనిపిస్తూ వుంటుంది ఒక్కోసారి. ఎప్పటిలానే బాగా కళ్ళకు కట్టినట్లు చూపించారు మీ ఇంటి పరిస్థితి.
రఘురామ్
..ఆ దెబ్బతో మా అమ్మాయి ప్రక్క బెడ్ రూం లోకి ,మా ఆయన హాల్లోకి పారిపోతారు...
అమ్మా ఆ పాట ఆపితే నేను నిద్రపోతాను అని విసుక్కున్న ఘనుడు వాడు.
వచ్చిన 60 % గురించి ఆలోచించవు రాని 40% మాత్రం గుర్తు చేసుకుంటావ్ అంది .
కెవ్వ్.....కేక...
క్షీణోపాంత ప్రయోజన సూత్రం కొన్నిసార్లు తప్పవుతుంది అక్కా.. :)
ఉదాహరణకి , మీ మొదటి పోస్ట్ నుండి , ఈ పోస్ట్ వరకు , ప్రతీ పోస్ట్ కి మీ పై అభిమానం పెరుగుతుంది పెరుగుతుంది... పెరుగుతూనే ఉంది.. :) :) :)
నేస్తం. (నేస్తం పక్కన గారో పెడితే బాగోదని పెట్టేలేదు)
పబ్లిష్ చేయనన్నారని హాయిగా బోలుడుపెద్ద కామెంట్ రాసేస్తున్నా... (కాస్త ఎక్కువ చనువుగా:)
మీ పిల్లా పిడుగు ఇద్దరూ సుపర్ కేకంతే! (కాస్త ఉప్పు తిప్పి పడేయండి ఎందుకైనా మంచిది)
ఇలా పిల్లలను చూసుకుంటుంటే ఆడవాళ్ళగా పుట్టినందుకు గర్వంగా ఉంటుంది కదూ.
వాళ్ళ మాటలు, ఎదుగుదలా చూస్తుంటే ఎంత బావుంటుందో!
నాకున్నది ఒకడే బుడుగు మీ పాప బాబూ ఇద్దరి లక్షణాలూ కలుపుకుని మా వాడు :) ఉంటాడు.
నన్నైతే మావాడు అమ్మా అనే పిలుస్తాడు :) ఏదన్నా చెప్పేప్పుడు ముందో అమ్మ చివరికో అమ్మ చేరుస్తాడు ప్రతిసారి:)
వాళ్ళ నాన్న ని మాత్రం డాడీ అంటాడు. చిన్నప్పుడు మొదటి సారి వాడు పలికిన మాట డాడీ. అందుకే దాన్ని మానిపించకుండా అలాగే ఉండనిచ్చాం. డాలీ అనే అమ్మాయి వీడిని తీసుకెళ్ళేది రోజూ వాళ్ళింట్లో ఆమెని పిలిచే పిలుపు రోజూ వినీ వినీ అదే మాట ముందు దాదీ అంటూ పలికాడు వాళ్ళ నాన్న ని చూస్తూ...:)
మీ పాప బాబు కబుర్లతో మళ్ళీ తిరిగి రండి.
Bagundhi akka....telugu lo rasthe... inko sari rayodhu antav...andhuke english lo rasthuna....
ఏమిటి అక్కా ???????????? ఏమిటి ఇది ... నాకయితే నచ్చలేదు ...అందరికి ఇదొకటి అలవాటయింది బ్లాగ్ లు క్లోజ్ చేయడం గాప్ లు ఇవ్వడం
బాగా రాసేవాళ్లందరూ బ్లాగ్ లు క్లోజ్ చేసేస్తే మేము మాత్రం ఎందుకు రాయడం ... నేను కూడా క్లోజ్ చేసేయనా చెప్పు ??????????? మమ్మల్ని ఇన్నాళ్ళు మురిపించి మెరుపు తీగ లా మాయమయిపోవడం ఏమి బాలేదు... ఇలా బ్రేక్ లు గాప్ లు తీసుకుని బాదపెట్టడం అంత అవసరమా... నువ్వు బ్లాగ్ క్లోజ్ చేయడం వల్ల భాదపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ..ఆ విషయం నీకు తెలిసి కూడా ఇలా ప్చ్
Hi,
My name is Archana.I am also staying in Sinagpore. Your posts were very good.
నేస్తంజి... పోస్ట్ చాలా బాగుందండి... మీ స్టైల్ లో..
please meeru rayadam aapoddu...ilanti blog chadivi memu santoshapadutunte choodaleka poyara...chaala anyayam..mee nirnayanni venakki teesukovali..
pl pl pl pl pl pl pl pl pleeeeeeeeeeeeeeeeeease......
http://www.chittialalu.blogspot.com/
నేస్తం ఏంటి ఒకేసారి ఇంత పెద్ద బాంబ్ పేల్చారు ... తట్టుకోవడం కష్టంగా ఉంది.. కొంత గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా అన్నారు.. ఆ గ్యాప్ ఎంత పెద్దది??.. మీ అభిమానులని ఇలా నిరాస పరచడం భావ్యమేనా?.. అయినా మీకేవో పర్సనల్ పనుల వల్ల గ్యాప్ తీసుకుంటున్నారేమో అనుకోండి.. అది కేవలం కామా కావాలి కానీ ఫుల్ స్టాప్ కాకూడదు అని కోరుకుంటున్నా... అయినా నన్ను మీరు మెయిల్ లో పలకరిస్తూనే ఉంటారు అని ఆశిస్తాను ... మీ మెయిల్ కి నేను రిప్లై ఇచ్చాను, కానీ మీ నుంచి ఇంకా మెయిల్ ఏమీ రాలేదు ... ప్లీజ్ మెయిల్స్ ఇవ్వడం మాత్రం మానకండి.. ఈ పోస్టులో మీ పిల్లల గురుంచి రాసారు ... అది చదివి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ... బాగున్నారు మీ పిల్లలు ... మీ అమ్మాయి అచ్చం మీ లాగే ఉంది ... మీరు చిన్నప్పుడు అలాగే ఉండి ఉంటారు .. ఇక మీ అబ్బాయిలో మీ ఆయన పోలికలు ఉన్నాయి, కానీ మీ లక్షణాలు ఉన్నాయి :-)... సరే మీ దేగ్గరి నుంచి మెయిల్ కోసం చూస్తుంటాను... takecare and have a nice time :-)
ఎప్పటిలాగానే బాగా రాసారు నేస్తం.. పిల్లల ఫొటోలు బాగున్నయి.. వారి సంగతులు ఇంకా బాగునాయి..
ఏమిటి నేస్తం, చాలా రోజుల తర్వాత blogs వైపు వస్తే ఇంత shock ఇచ్చారు...మళ్ళీ మీరు త్వరలోనే రాయటం మొదలు పెదతారని ఆశిస్తున్నాను...మీ పోస్టుల ద్వారానే చాలా దగ్గర ఐపోయారు...కానీ మీరు చెప్పిన సిధ్ధాంతం చాలా వరకు చాలా విషయాల్లో correct...
ఏం ముహార్తనా మా అమ్మ వీడికి పవన్ అని పేరు పెట్టిందో అసలు కుర్రాడు సార్ధక నామదేయుడు అయిపోయాడు..
------------------------
చాలా లేట్ గా పోస్ట్ చూసాను :(
పై వ్యాకంలో నాదో డౌటు పవన్ అని పేరు పేట్టుకుంటె సార్ధక నామదేయుడు అవుతాడు అన్నారు అంటె ఆ పేరు పెట్టుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళ అవుతారా ... ఆ పాయంట్ అర్ధం కాలేదు కాస్తా వివరంగా చెప్పండి
ఏమిటో....,ఏం మాట్లాడాలో కూడా తెలియడంలేదు. పోనీ రచ్చ, మెరుపు, ఉరుము, కేక లాంటివి అందామంటే ఓ గంటసేపు రాసుకుంటూ రాసుకుంటూ పేజీ మొత్తం నింపేస్తానేమోనని భయం, పైగా ఓ పది నిముషాలకంటే ఎక్కువ స్తుతించొద్దన్నారు. క్లుప్తంగా చెప్పాలనిన మా nephew/niece లు very కేక :)
..nagarjuna..
Hey...wait a second
'కొంతకాలం గ్యాప్' అనేసి చివర్లో 'ఇక చాలు' అన్నారేంటక్కా...!? సీరియస్‌గా రాసారా లేక అలా ఫ్లోలో వచ్చేసిందా..? విరామం తీసుకుంటే తీసుకోండి కాని రాయడం ఆపకండి ప్లీజ్..ప్లీజ్..ప్లీజ్
ఆపేస్తే మాత్రం మా మేనల్లుడితో 'మీ మమ్మీకి రాయడంరాదు అందుకే ఆపేస్తుంది' అని చెప్పేస్తా, తర్వాతి సంగతి he will చూసుకుంటాడు
nagarjuna
Break kaavalante teesko akka anthe kaaani inka raayanu ani cheppaku.
Baaga oka 2 months break teeskoni malli raayatam start cheyyi.
Nenu mathram oka 3 or 4 days ki okasaaari ayina vachi choosipothuntaa emaina raasavemo ani.
mee abbayi peru pavan aaa. Superu.. :)
Inko vishayam entante naaku 2 days back engagement ayindi. Feb lo pelli annamataa.. :)
బాగున్నయి నెస్తం గరు మీ బుడతల విశేషాలు .. కాస్త ఆలస్యం గా చూసాను ఈ పోస్టు.. ముందుగా కామెంట్లు 0 ఉందటం చూసి మొదటి కామెంట్ నాదే ఔతుందనుకున్నను.. చదివినాక అర్ధం అయ్యింది.. హా హా..
కామెంట్ పబ్లిష్ చేయకపోయినా పర్వాలేదు నేస్తం! ...మీరు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరి ఆదరాభిమానాలను పొందుతూనే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ....అలాగే మీ బుడుగు కి అభినందనలు ...నాకు పిల్లలు అలా ఉంటేనే ఇష్టం...ఎన్నేళ్లోచ్చినా నామీద ఇంకా కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి మరి :(
ఒక్కోసారి వాడికి నిద్రపోయే ముందు కధ చెప్పే మూడ్ వస్తుంది..వెంటనే నేను కధ చెప్తా అంటాడు..ఆ దెబ్బతో మా అమ్మాయి ప్రక్క బెడ్ రూం లోకి ,మా ఆయన హాల్లోకి పారిపోతారు ... ఇక ఆ అంతం లేని కధ అలా సాగుతూనే ఉంటుంది... అది రాత్రి పన్నెండు అవ్వచ్చు ఒంటిగంట అవ్వచ్చ్చు మన అదృష్టం మరీ పండితే తెల్లవారు జాము ౩ అవ్వచ్చు ... అలా చెప్పుతూనే ఉంటాడు.. మధ్య మధ్యలో వాడికి డౌట్ వచ్చినప్పుడల్లా ప్రశ్నోత్తర కార్యక్రమాలు నిర్వహిస్తాడు ... నేను గాని సరిగ్గా సమాధానం చెప్పలేదో ఇక కొంప కీకీకారణ్యం మే ....
office lo unna sangathi kuda marchipoya andi...babu chala cute ga unnadu
నేస్తం గారు మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఎమైపొయావ్ అక్కా.
ఎదొటి రాయొచ్చుగా.
పోనీ ఎప్పుడు రాస్తావొ అన్నా చెప్పు. ఒక టపా పెట్టు ఎప్పుడు రాస్తావొ.
నువ్వు రాయటం మానెసాక బ్లాగుల వైపుకు రావటం మానెసా నెను.
అపుడపుడు అలవాటుగా జాజిపూలు మాత్రం చూస్తాఉంటా. నువ్వెమొ రాయట్లేదు. :(
హ్మ్మ్... అసలేమయ్యింది అంటే ఉన్నట్లుండి వ్యాఖ్యలన్నీ మాయం అయిపోతున్నాయి ...80 పైగా ఉండెవి ఇలా 58 కి వచ్చేసాయి పాపం .ఏమైందో ఏమిటో ..అందుకే మిగతావి కాపాడుకోవాలని ఇలా ప్రచురించేసా అన్నమాట. అదీసంగతి :D
ఓ రాసి పదెయొచ్చు కదా సరదాగా.
ha... ha.... monna 58.., ninna 56.., ee roju 55.. nestam garu twaraga comments ni save cheyandi.. okkoti taggipotunnai.. atenandi... meru postlu late chese koddi ila comments taggipotunnai anna mata.. me క్షీణోపాంత ప్రయోజన సూత్రం ikkada baga pani chestundi..... :)
''ఒక్కోసారి ఎక్కువ అబిమానాన్ని కూడా తట్టుకోలేము తెలుసా''
అవునండి..నిజంగానే తట్టుకోలెం ఒక్కోసారి..ఒక్కోసారి బయమేస్తుంటుంది కూడా..
nice posting
ఇంతకి మీ పిల్లల పేర్లు చెప్పలేదు ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి