28, నవంబర్ 2010, ఆదివారం

సెంతోసా


సంతోసా అనేది సింగపూర్ ప్రక్కనే ఉన్న చిన్న దీవి.. ఇక్కడకు వెళ్ళాలంటే హార్బర్ ఫ్రంట్ దగ్గర నుండి ట్రైన్,కేబుల్ కార్,బస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.. అంటే ఒక పదినిమిషాలు జర్నీ అంతే... అయితే ఈ దీవిలో విశేషాలు చూడాలంటే ఒక రోజు మొత్తం సరిపోదు కాబట్టి ప్రొద్దున్నే వెళ్ళిపోవడం మంచిది.. భోజనం,చిరుతిళ్ళు వగైరాలు తీసుకు వెళితే మరీ మంచిది .. లేకపోతే లోపల రేట్లకు పట్ట పగలే సుక్కల్ సుక్కల్ కనబడతాయి మల్లా... ఆ తరువాత మీ ఇష్టం..దీవి లోపలకు వెళ్ళాకా అక్కడి నుండి ఎక్కడకు వెళ్ళాలన్నా బస్,ట్రైన్,ట్రాం ల ఉచిత సౌకర్యాలు అడుగడుగునా ఉంటాయి.. అంటే ఎంట్రన్సు ఫీజ్ రూపం లో 4 $ ముందే వసూలు చేసేస్తాడనుకోండి ...అయినా సరే తక్కువే ..


అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం..



మెరి లైన్ (merlion ) : Mother of singapore అంటారు దీన్ని..సగం సింహం , సగం చేప ఆకారం లో రాజసం ఉట్టిపడుతున్న దీన్ని సింగపూర్ సింబల్ గా భావిస్తారు..దీని గురించి ఏదో కధ మా అమ్మాయి వెంటపడి చాలా సార్లు చెప్తుంటే నేను వినిపించుకునేదాన్ని కాదు ..ఇప్పుడు చెప్పమని నేను దాని వెనుకాతల పడుతున్న అది వినిపించుకోవడం లేదు .. అయితే ఈ మెరి లైన్ తల పైకి ఎక్కి చూస్తే సింగ పూర్ మొత్తం కనబడుతుంది.. అన్నట్లు మర్చిపోయా దీనిలో ఒక షో ఉండేది ... ఒక చేపల ఎక్వేరియం లాంటి దానిలో ఉన్నట్లుండి ఒక అబ్బాయి వస్తాడు (చిన్న సైజ్ ఆత్మలా ) సింగపూర్ హిస్టరీ మొత్తం చెప్తాడు ..కాని భలే ఉంటుంది చూడటానికి..ఈ మధ్య కాలం లో నేను వెళ్ళలేదు ..మరి ఇప్పుడుందో లేదో ...



under water world : మనం క్రింద ఉండీ మన పైన సముద్రం ఉండీ వాటిలో రంగు రంగుల రకరకాల చేపలు ,షార్కులు ,తాబేళ్లు వెళ్ళుతున్నాయనుకోండి ఎలా ఉంటుంది??? బాగుంటుంది కదా..అదే అన్న మాట ఈ అండర్ వాటర్ వరల్డ్ ..ఇంకా సీ హార్సులు,జెల్లి ఫిష్లు, ఇలా చాలా చూడచ్చు అస్సలు మిస్ కాకండి..మనకి కాసింత డబ్బు ,ఇంటరెస్ట్ మెండుగా ఉంటే మనం కూడా లోపలకి దిగచ్చు..దీనికి అనుసంధానం గా డాల్ఫిన్ షో ఒకటి పెట్టాడు..డాల్ఫిన్ విన్యాసాలు అన్నమాట..అది కూడా చూడచ్చు..



imeges of singapore : ఇదేంటంటే ఇక్కడ అన్ని మనుషుల్లా ఉండే బొమ్మలు ఉంటాయి..సింగపూర్ కి జపనీస్ కి వచ్చిన గొడవలు,ఇక్కడకు వలసలు ఎలా వచ్చారు,ఇక్కడి వాళ్ళ బిన్న జీవన విధానాలు ఇవన్ని అచ్చం గా మనుషుల్లా ఉండే బొమ్మలు తో చూపిస్తారు..వాటి మధ్యలో నడుస్తూ మంద్రం గా వినిపిస్తున్న సంగీతం, డిం లైట్ ల మధ్యలో భలే ఉంటుందిలే..అంటే నా కళ్ళ తో చూడాలన్న మాట ..మా ఆయన కళ్ళతో చూస్తే నచ్చదు..




butterfly park : ఇది శుద్ద వేస్ట్..వాటికి కూడా నాకులా బద్ధకం అనుకుంటా..ఎక్కడికి వెళ్ళినా బజ్జున్నాయి.. ఒక్కటీ బయటకు రాదు.. వీటి కంటే మా కాలేజ్ లో వందలు సీతాకోక చిలకలు ఉండేవి.....



బీచ్ : ఇక్కడ ఇంచు మించుగా మూడు నాలుగు బీచ్ లు ఉన్నాయి..palawan బీచ్,సిలోసా బీచ్ ఇలా ..అబ్బాయిల కళ్ళకు ,చిన్నపిల్లల ఆటలకు ఒకటే పండగ... పాల్వాన్ బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటుంది..మధ్యలో కి వెళ్లి గెంతితే భలే బాగుంటుంది..




డ్రాగన్ ఫౌంటైన్ : ఈ బొమ్మ ఎక్కడ చూసారో చెప్పుకోండి..చంద్రలేఖ సినిమాలో నాగార్జున సాహసమే చేయరా డింబకా అనే సాంగ్లో అనుకుంటా చూపించాడు..









మెరిలైన్ వాక్ : ఇందాకా చెప్పాను గా మెరి లైన్ అక్కడ నుండి నడిచుకుంటూ వెళ్లేదారి ఉంటుంది ..ఆ దారి అంతా పార్క్ లా రక రకాల ఫౌంటైన్ లతో బాగుంటుంది.. ఒక్కప్పుడు ఇవన్నీ ఫ్రీ ..ఇప్పుడు అన్నిటికి బేండ్ వాయిస్తున్నాడు ...




ఫోర్ట్ సిలోసా : దీనికైతే నేను వెళ్ళలేదు ..నాకు ఇంటరెస్ట్ అనిపించలేదు..బహుసా యుద్ధం లో వాడే ఫిరంగులు అవి చూపుతాడనుకుంటా??




స్కయ్ టవర్ : దీని పైకి ఎక్కితే సింగపూర్,అటు మలేసియా ,ఇండోనేసియ బోర్డర్లతో సహా చూసేసేయచ్చంటా..కాని నేను వెళ్లలేదు.. అంటే నాకేం భయం కాదు ..కాని అలా చిన్న పిల్లల్లా టవర్లు గట్రాలు ఎక్కి తొంగి చూడటం నాకు పెద్దగా నచ్చదు ..మీరు నమ్మాలి ..




అదనపు ఎట్రాక్షన్స్: రైడ్స్ బాగుంటాయి కాని కొద్దిగా ఎక్కువ రేటే ..దాని కంటే ప్రక్కన యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళితే చాలా సేపు ఎంజాయ్ చేయవచ్చు ..(దీని గురించి ఇంకోసారి చెప్తా..)చిన్న చిన్న చేపలతో ఫుట్ దేరఫీ బాగుంటుంది..పిల్లలకు వాటర్ వరల్డ్ ..ఏవో గార్డెన్స్ అవీ ఉన్నాయి..కాకపొతే అవి చూసే టైం మనకు దక్కదు ..




song of the sea : ఇది ఒక మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో.. దీని గురించి చెప్పకూడదు చూడాలంతే..చాలా బాగుంటుంది..ఇది రెండే షోలు ఉంటుంది రాత్రి ...అది అయిపోయాకా ఇక పదండి పదండి అని అన్ని క్లోజ్ చేసేస్తారు :)
ఇదన్న మాట సంతోసా ..ఇంకొన్నిటి గురించి రాయలేదు ..కాని ఫుల్ ఎంజాయ్ చేయచ్చు..

49 కామెంట్‌లు:

శ్రీనివాస్ చెప్పారు...

ic

హరే కృష్ణ చెప్పారు...

బాలయ్య బాబు సినిమాకి వెళ్లి తోడకోట్టుకునే సీన్ చూడకుండా వచ్చేసినంత మహా పాపం :D :D

Kiran చెప్పారు...

సింగపూర్ విశేషాలు చాలా బావున్నాయి underwater world superb

Sasidhar Anne చెప్పారు...

Comment position kosam vesthunna Comment idhi.. Post chadivi malli Commentu thanu

Sasidhar Anne చెప్పారు...

NBK ki kincha parichina Nestam akka :(
Sukkal Sukkal kanapadhtaya. enti akka Sudden ga telangana Slang loki maripoyav.. maa Kostha ammayi ila yasa marchatanni.. Kostha Ammayila fans group kandisthundhi :)

//
Bava gari kallatho vaddu naa kallatho :) , then Ammayi venta meeru padatam :), inka height ki meeru bayapadaru ani memu nammatam..
nee type sattires asusual ga super..


Assalu kalla kattinattu ga bale cheppav le.. hammaya.. naaku sagam karchu taggisthunnav..

భాను చెప్పారు...

బాగున్నాయి మీ సింగపూర్ అనుభవాలు.
బాలయ్య బాబు సినిమాకి వెళ్లి తోడకోట్టుకునే సీన్ చూడకుండా వచ్చేసినంత మహా పాపం తగులుతుంది.. భలే జోకేశారు :))

రాజ్ కుమార్ చెప్పారు...

అః..ఓహో.. సూపర్ గా ఉన్న్నై అక్కా ఈ పోస్ట్ లో సింగపూర్ విశేషాలు...
"సింగపూర్ వచ్చి సంతోసా చూడకుండా వచ్చేసారంటే బాలయ్య బాబు సినిమాకి వెళ్లి తోడకోట్టుకునే సీన్ చూడకుండా వచ్చేసినంత మహా పాపం తగులుతుంది.." పోస్టు బిగిన్నింగ్ నే పంచ్ తో మొదలెట్టారా? కేకా...

".చంద్రలేఖ సినిమాలో నాగార్జున సాహసమే చేయరా డింబకా అనే సాంగ్లో అనుకుంటా చూపించాడు.. " హిహిహి ఈ విషయం ఆల్రెడీ చెప్పినట్టున్నారు కదా..! :) ha ha..:) :) keka post..akkaa...

రాజ్ కుమార్ చెప్పారు...

అహో.. ఏమి ఈ విధి వైపరీత్యం? జాజిపూలు బ్లాగు లో పోస్ట్ చదివి కామెంట్ పెట్టే రోజులు మళ్లీ వస్తాయని అనుకోలేదు.. వాఆఆఆఆఆఆఆ....వాఆఆఆఆఆఆఆఆఆఅ..
శ్రీనివాస్ గారు అభినందనలు... :) :)

రాజ్ కుమార్ చెప్పారు...

ఈ ఆరెంజ్ సినిమా నా కొంప ముంచింది రా దేవుడో.. ఇంకెప్పుడు నేను మళ్లీ మొదటి కామెంట్ పెట్టి రికార్డ్ బద్దలు కొట్టాలి?
i hate this love stories... :) :) :P

శశిధర్ గారు.. బాడ్ లక్ అండి.. :) :)

రాజ్ కుమార్ చెప్పారు...

"నా కళ్ళ తో చూడాలన్న మాట ..మా ఆయన కళ్ళతో చూస్తే నచ్చదు... "

హిహిహి.. బావ గారిని ఎక్కడా వదలరు కదా మీరు? :) :) :)

arpita చెప్పారు...

photos super ga unnayandi nestam gaaru. inka mee narration kooda..
balayya dialogue chala funny ga undi.. :P

Sasidhar Anne చెప్పారు...

orange cinema naa.. vammo.. ninna aa movie chusi mind block ayyindhi aa movie review naa blog lo rasa chudandi.. :(

మనసు పలికే చెప్పారు...

:(((( నేనొప్పుకోను.. అప్పుడే పది వ్యాఖ్యలు అయిపోయా.. వా...వా.. ఏదేమైనా పోస్ట్ మాత్రం సూ.....పర్ అక్కా.. (ఇంకా నేను చదవలేదోచ్.. చదివేసి పొగడ్డం కంటిన్యూ చేస్తా..;))

రాజ్ కుమార్ చెప్పారు...

శశిధర్ గారు.. మన్నించాల... నేను ఈరోజు రెండో సారి చూసాలెండి... :) :) అదిగో అలా చూడొద్దు... "పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి" అన్నారు కదండీ... :) :)
నా కోపం అది కాదండి.. పొద్దున్న పదిన్నర కి ఇంకా పోస్ట్ వెయ్యలేదు నేస్తం అక్క. తిరిగొచ్చేసరికి 5 కామెంట్లు.. ఫస్ట్ కామెంట్ పెట్టే చాన్స్ మిస్ అయ్యానని..:( waaaaaaaaaa....waaaaaaaaa

హరే కృష్ణ చెప్పారు...

>>ఏదేమైనా పోస్ట్ మాత్రం సూ.....పర్ అక్కా.. (ఇంకా నేను చదవలేదోచ్.. చదివేసి పొగడ్డం కంటిన్యూ చేస్తా..;))


చదవకుండానే పోస్ట్ సూపర్ అని అన్నావంటే నీ కామెంట్లు అన్నీ చదవకుండానే పెడతావా..వా వా

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్కా.. ఆ దీవి పేరు సంతోస నా? సెంతోసా నా ? స్పెల్లింగ్.. sentosa అని ఉంది కదా మొదటి పిక్చర్ లో?? అః..డవుటు :) :)

రాజ్ కుమార్ చెప్పారు...

మిగిలినవి అన్ని చూసాను కానీ (సింగపూర్ లో కాదు లెండి.)..""song of the sea"" మాత్రం చూడాలని ఉంది నాకు.. :) :)

నేస్తం చెప్పారు...

శ్రీను మాటలు ఎంత పొదుపుగా వాడుతున్నావ్ :)
హరే :D:D
కిరణ్ థేంక్యూ..
శశి బాల క్రిష్ణ ఫేన్ వా కొంపదీసి మనోభావాలేమీ గాయపరచలేదు కదా నేను :)
భాను గారు థేంక్యూ :)
వేణురాం నీ మాట నమ్ముకుని ఇండియా కాల్ చేసి మరీ తనని ఆ సినిమా చూడమని చెప్పాను.. ఏమంటారో ఎమిటో ..నాకు తెలిసీ సెంతోసా నే ..కాని మా ఇంటి ప్రక్కన మలయ్ ఆంటీ సంతోసా అంటుంది..సరే సంతోషాన్ని ఇచ్చే అర్ధం ఉందికదా అని అలా ఫిక్స్ అయ్యాను..మరి ఎవరిది కరెక్టో..కాసేపాగి మార్చేద్దాం లే ..
అర్పిత థేంక్యూ
అమ్మా అపర్ణా ఊ అనమ్మా ఊ అను.. పోస్ట్ చదివి పిల్ల ఏమైపోయిందో పాపం..
హరే మరదే మరి.. సగం కామెంట్స్ చదవకుండానే పెట్టే'స్తుందని ప్రఘాడ నమ్మకం నాకు..

3g చెప్పారు...

>>సింగపూర్ వచ్చి సంతోసా చూడకుండా వచ్చేసారంటే బాలయ్య బాబు సినిమాకి వెళ్లి తోడకోట్టుకునే సీన్ చూడకుండా వచ్చేసినంత మహా పాపం
kevvvvvvvvvvvvvvvvv.................

>>అబ్బాయిల కళ్ళకు ,చిన్నపిల్లల ఆటలకు ఒకటే పండగ
???

Sai Praveen చెప్పారు...

సింగపూర్ విశేషాలు బావున్నాయి. మీ స్టైల్ పంచులు ఇంకా బావున్నాయి.
>>అమ్మా అపర్ణా ఊ అనమ్మా ఊ అను.
ఇది కూడా సూపర్.
పాపం బావగారిని మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి అనకుండా ఉండరుగా :)
@3g
మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? :)

Srinivas K చెప్పారు...

e roju eenadu sunday special lo kuda malaysia and singapore gurinch vaysam vachhdi. Meeantha baaga ryaledulendi

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ ఫస్ట్ లైన్ అదిరింది నేస్తం :-) ఫోటోలు, పంచ్ లూ బాగున్నాయ్ :)

3g చెప్పారు...

అంటే డైలాగ్ లో ఫస్టాఫ్ క్లియర్ గా ఉందిగాని సెకండాఫ్ కంఫ్యూజింగ్ గా ఉంది ప్రవీణ్ అందుకే మనకు తెలియని నిగూఢార్దాలేమైనా ఉన్నాయేమోఅని చిన్న టెస్టింగ్ పెట్టా:)

రాజ్ కుమార్ చెప్పారు...

"వేణురాం నీ మాట నమ్ముకుని ఇండియా కాల్ చేసి మరీ తనని ఆ సినిమా చూడమని చెప్పాను.. ఏమంటారో ఎమిటో ."

అయ్యో..అక్కా...ఎంత పని చేసారు? బావగారు తిట్టే తిట్లు తినడానికి రెడీ అవ్వండి మరి.. :) :)

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్కా.. నేను చెప్పానని పోస్ట్ పేరు మార్చేసారా ? అహో..! అయినా నేములోనేముంది లెండి..! పోస్ట్ మాత్రం బావుంది.. చదివాక సంతోషం గానే ఉంది.. :)

నేస్తం చెప్పారు...

3g :))))) ఎందుకు నవ్వానంటే ఒక్కోసారి సమాధానం ఏమి ఇవ్వాలో తెలియనపుడు అలా నవ్వేస్తాం అన్నమాట..
శ్రీనివాస్ గారు మీరు చెప్పాకా చదివాను.. నెక్స్ట్ మలేసియా ,ఇండోనేషియా ట్రిప్పులు రాసేద్దాం అనుకున్నాగాని జనాలు తట్టుకోగలారా అని తింకింగ్
శ్రీకాంత్ థేంక్యూ :)
రాజ్ అసలేంటంటే వివిద రకాలు గా పిలుస్తారు సెంటోసా అని సెంతోసా అని సంతోసా అని.. అసలేది కరెక్టో నాకూ తెలియదు.. సరే అందుకని టైటిల్ మార్చా :)

అజ్ఞాత చెప్పారు...

సింగపూర్ సింబల్ కధ తెలుసుకొని, నెక్స్ట్ పొస్ట్ లో రాస్తారా నేస్తం గారు?? nice post... :)

Siva

నేస్తం చెప్పారు...

sai ప్రవీణ్ నాకు మాత్రం ఊరికే తిట్టాలని ఉంటుందా చెప్పు.. అంటే ఎంతో ట్రయ్ చేస్తా అప్పటికీ కానీ కుదరడం లేదు..
శివ గారు నిన్న అడిగితే సింగపూర్ హిస్టరీ మొత్తం ఉన్న బుక్ చేతికి ఇచ్చి చదువుకో అంది..నాకంత ఓపిక లేదు :) అందు వల్ల మీరందరూ బ్రతికిపోయారు..

అజ్ఞాత చెప్పారు...

అమీబాలు కూడా చూడొచ్చా!! really?!!

నేస్తం చెప్పారు...

హ హ అమీబా అని రాసానా ... మా అమ్మాయి సరిగ్గా అమీబా గురించి ఏదోచెప్తుంటే స్టార్ ఫిష్ అని రాయాబోయి అమీబా అని రాసినట్లు ఉన్నా .. పోస్ట్ రాసాకా ఇక చూసుకోలేదు ...:))) అబ్బా భలే నవ్వానండీ బాబు .. కాసేపు ఆగి మారుస్తా

మనసు పలికే చెప్పారు...

హతవిధీ.. హెంత మాట హెంత మాట.. నేస్తం అక్క బ్లాగులో నేను పోస్ట్ చదవకుండానే కామెంటుతానా.. ఎవరది అన్నది.. కృష్ణే కదూ.. అయ్.. ఏదో నిన్నంటే నేను బోల్డంత బిజీ ఉండి చదవలేకపోయాను కానీ.. హన్నా.. ఈ బంగారు చెల్లిని అంతలేసి మాటలనెయ్యడమే..

మనసు పలికే చెప్పారు...

అక్కయ్యా.. నిజంగా పోస్ట్ మాత్రం సూ....పర్..:)
>>సింగపూర్ వచ్చి సంతోసా చూడకుండా వచ్చేసారంటే బాలయ్య బాబు సినిమాకి వెళ్లి తోడకోట్టుకునే సీన్ చూడకుండా వచ్చేసినంత మహా పాపం తగులుతుంది...
>>అంటే నా కళ్ళ తో చూడాలన్న మాట ..మా ఆయన కళ్ళతో చూస్తే నచ్చదు..
>>కాని అలా చిన్న పిల్లల్లా టవర్లు గట్రాలు ఎక్కి తొంగి చూడటం నాకు పెద్దగా నచ్చదు ..మీరు నమ్మాలి ..
హహ్హహ్హా.. భలే రాసారు.:)

Ram Krish Reddy Kotla చెప్పారు...

బాగుంది సెంతోస ... మీరు ఇలా సింగపూర్ గురుంచి అన్నీ చెప్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్లి చూసేద్దామా అన్నట్లు ఉంది ... ప్లాన్ చెయ్యాలి ...ఓ సంవత్సరం లో అటువంటి అకేషన్ వస్తుంది అనుకుంటున్నాను (ఏ అకేషన్ అని అడగకండే ;-) )

Raghuram చెప్పారు...

ణేస్తం గారు,

బాగున్నాయండి మీ సింగపూర్ విశేషాలు, కళ్ళకు కట్టినట్లు చూపించారు సింగపూర్ ని మాకు.ధన్యవాదములు.

రఘురామ్

అజ్ఞాత చెప్పారు...

సింహపురం, సంతోషా, (వి)భిషాన్, పేర్లు మనవిలానే వున్నాయి. సింగపూర్ తిండ్లు కూడా మనవే దొరుకుతాయాండి? అందులో స్పెషలిటీ తిండ్లు ఏవి బాగుంటాయండి?

నేస్తం చెప్పారు...

కృష్ణే అన్నాడు అప్పు కృష్ణే..అదీ అలా గట్టిగా అడుగు :)

>>>>ఓ సంవత్సరం లో అటువంటి అకేషన్ వస్తుంది అనుకుంటున్నాను (ఏ అకేషన్ అని అడగకండే ;-) )
రామ కృష్ణ... పై ముక్క తమరు అననంత వరకూ నాకు అడగాలన్న విషయం గుర్తు రాలేదు.. నాకేం తెలియదు నాకేం తెలియదు ఆ అకేషన్ ఏదో చెప్పాల్సిందే :)

రఘురాం గారు థేంక్యూ వేరీ మచ్ అండి :)

అఙ్ఞాత గారు చాలా పేర్లు ఉన్నాయండి మన హింది భాషలో కూడా ధోభీ ఘాట్ అన్న ఊరుకూడా ఉంది.. లిటిల్ ఇండియాలో చాలా వరకూ అన్నీ మన పేర్లే.. ఇక్కడ మన భారత దేశం లో ముఖ్య రాష్ట్రాలలో లభించే తిండి మొత్తం లభిస్తుంది.. తమిళ్ వంటకాలు చిన్న ఫుడ్ కోర్ట్లలో సైతం దొరుకుతాయి..
దోశలు,పూరిలు,ఇడ్లీలు ,అప్పాలు, కేరళ వాళ్ళ పుట్టు,పానీ పూరి,బేల్ పూరి ఇలా ఒకటేమిటీ అన్నీను ..
హ హ భిషాన్ ని విభిషన్ చెసేసారా.. ఏమో నిజమే అయి ఉండచ్చు నాకూ తెలియదు :)

రాధిక(నాని ) చెప్పారు...

బాలయ్య బాబు సినిమాకి వెళ్లి తోడకోట్టుకునే సీన్ చూడకుండా వచ్చేసినంత మహా పాపం :D :D
బాగుందండి సింగపూర్ అంతా మీ మాట ల్లోనే చూపించేశారు.

jai చెప్పారు...

bane undi kotha post. enthakee meeku ammai unda unte melage chilaka palukulu paluthada?me matalu antha bagunnai enthena ma side kadaaaa

శివరంజని చెప్పారు...

ఫస్ట్ లైన్ కేక అక్కా ..... పక్క ఊర్లు కూడా సరిగా చూడని నాకు సింగపూర్ ఫ్రీగా చూపించేసావు ....

నేస్తం చెప్పారు...

శివ రంజని :)థేంక్యూ ..ఏంటి ఈ మధ్య బొత్తిగా ఎర్రపూస వైపోయావు..( నీ ఎర్ర బస్సు ఎఫ్ఫెక్ట్)
జై గారు మా అమ్మయి గురించా.. నెక్స్ట్ పోస్ట్లో రాస్తాను :)

రాజ్ కుమార్ చెప్పారు...

ఏంటి ఈ మధ్య బొత్తిగా ఎర్రపూస వైపోయావు.?
kevvvvvvvvvv....:)

శివరంజని చెప్పారు...

అక్కా మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

Ajay :) చెప్పారు...

sarigga blog rayadam ante, eduti vallani kinchaparustoo rayadam kaadu ...

balayya babu gurinchi avasaramaa meeku? :) ...

Unknown చెప్పారు...

మధ్యలో మా బాలయ్య ఏమి చేసాడండి, ఫాన్స్ హర్ట్ అవుతారండి.

నేస్తం చెప్పారు...

అజయ్,మధు నేను బాలయ్యను కించపరచి రాయలేదండి.. బాలక్రిష్ణ సినిమాలో కామన్ గా ఉండే సీన్ కదా అది.. ఆ సీన్ లేకుండా సినిమా ఉండదనే ఉద్దేశం తో అలా పోల్చాను.. అయినా సరే మీ ఫీలింగ్స్ దృష్టిలో పెట్టుకుని తీసేసాను ..సారీ అండి ఫీల్ అయితే :)

అరుణాంక్ చెప్పారు...

నెక్స్ట్ ఇయర్ సింగాపుర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నానండి.santosa ను చూడాలని పిస్తుంది .ఇది గెంటింగ్ (genting malysia ) వారిదే కదండి .

నేస్తం చెప్పారు...

అరుణాంక్ క్షమించాలి పూర్తిగా నా బ్లాగ్ చూడటం మానేసాను అందువల్ల మీ వాఖ్య మిస్ అయిపోయాను .జెంటింగ్ మలేషియాలో ఉంది అండి.ఓ సింగపూర్ వస్తున్నారా .వచ్చేముందు నాకు చెప్పండి తప్పక వివరాలు చెప్తాను

కథాసాగర్ చెప్పారు...

సింగపూర్ వెళ్తే ఈ సెంతోసా ని తప్పక చూడాలి....
ఆ ప్రదేశం ఎలా ఉంటుందో నాకు తెలియదు..
కాని మీ వర్ణన భాగుంది..
మీ వర్ణనకి ఓ తొంబై మార్కులు..
:)

నేస్తం చెప్పారు...

కధాసాగర్ గారు తొంబయ్యేనా ఏం ఇంకో పది ఎక్కువేస్తే ఏమయ్యిందండి.చెప్పండి :(
ధేంక్యూ పోస్ట్ నచ్హ్చినందుకు. తప్పకుండా సింగపూర్ రండి మీకు నచ్చుతుంది