12, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఆడవాళ్ళకు మాత్రమే

అమ్మాయిలూ ఒక్క నిమిషం ఆగండి అమ్మాbabai !!!!! ... ఓయ్ ,ముందే చెప్పానా అమ్మాయిలకు మాత్రమే అని మీరెందుకు చదువుతున్నారు...ఆయ్ ..వెళ్ళిపొండి మర్యాదగా ..marah. ఆ అమ్మాయిలూ మనం విషయంలోకి వచ్చేద్దాం ..encem నాకొక తమ్ముడు ఉన్నాడు (పెద్దమ్మ క్కొడుకు )... వాడి గురించి మరిన్ని వివరాలకు ఈ క్రికెట్ ఎవరు కనిపెట్టారో గాని అనే పోస్ట్ చదవండి.. వాడికి అమ్మాయిలంటే అస్సలు పడదు..ngantuk వాడికి నచ్చని అమ్మాయిలను క్యూ లో నిన్చోపెడితే అందులో ప్రధమ వరుసలో మొదటి ప్లేసులో నేనే ఉంటాను...అంత ప్రేమ నేనంటే వాడికి.sengihnampakgigi.వాడెంత స్త్రీ ద్వేషి అంటే నీరసం తో కాలు చెయ్యి కదపలేని ఆడవాళ్ళు సైతం వాడి మాటలు వింటే శివాలెత్తి శివతాండవం చేసేస్తారు..మచ్చుక్కి కొన్ని ఆణిముత్యాలు ...

బ్రహ్మ్మదేవుడు అంటా అమ్మాయిని, అబ్బాయిని సృష్టించి ...అబ్బాయిలకు మాత్రమే వినిపించేలా ...ఒరేయ్ ..ఈ ఆడవాళ్లున్నారే ...మహా పొగరుబోతులు .. మీరు సమానత్వం ,సొరకాయ కూర అని ప్రక్కనే ప్లేస్ ఇచ్చారనుకో మీ బ్రతుకు ఇత్తడి పెనంలో వేపిన మెత్తని పకోడియే... కాబట్టి వీళ్ళను కాలి క్రింద మాత్రమే పెట్టండి ... అని ఉపదేశించాడంట... సరే అని చాలానాళ్ళు వంటగది లోపలే పిల్లుల్లా కట్టి పడేసి ప్రశాంతం గా ఉన్నారంట మగవాళ్ళు..కొద్ది రోజులకి మగవాళ్ళకు జాలి కలిగిందంట ..పోనీలే పాపం అని ,దీనంగా చూస్తున్న ఆడవాళ్ళకు ప్రక్కనే ప్లేస్ ఇచ్చారంట కూర్చోమని... అయితే ఆడవాళ్ళు ప్రక్కన తిన్నంగా కూర్చోలేక నెత్తి మీదకు ఎక్కడానికి ట్రై చేయడం మొదలు పెట్టారంట...మాకు గాని మండిదిఅనుకో ఒక్క సారి తల విదిలిస్తాం ...సరిగ్గా సరా సరి నేల మీద పడతారు...ఒక్క అడుగేసాం అనుకో ఏకంగా పాతాళం లోనికే అనేవాడు.. ఎందుకైనా మంచిది ఒక సారి బి.పి చెక్ చేసుకోండమ్మా .... nerd

అదొక్కటేనా... అసలు కట్నం తీసుకుంటే తప్పేంటి ..తేరగా మేము తెచ్చింది తినడం లేదా.. వరకట్నం నిషేదించాలి అని ఎవరన్నా అన్నారనుకో ఫేడెల్,ఫెడేల్ అని నాలుగు పీకాలి మళ్లీ నోరెత్తరు....నాకు గాని పెళ్లి అయ్యిందనుకో దాని బ్రతుకు నా కాలి దగ్గరే .... ప్రొద్దున్న నా షూ తుడుస్తూ మొదలయ్యే దాని జీవితం,రాత్రి నా కాళ్ళు పడుతూ ముగియాలి.. లక్ష్మణుడు వదిన కాళ్ళు తప్ప మొహం చూడనట్లు అది నా కాళ్ళు,వాటి గోళ్ళు తప్ప ఇంకేం చూడకూడదు ....
అబ్బో ఇలాంటివి ఒకటా ,రెండా ...ఇంతకు మించి మీ ఆరోగ్యం పాడు చెయ్యడం నాకిష్టం లేదు అనుకోండి ...takbole

అలా వాడితో రోజుకొక గొడవేసుకుని ,వాధించి,చాలా సార్లు కుళ్ళుకుని ఏడ్చి ...ఒరేయ్ నేనూ చూస్తానురా ..నీకు పెళ్ళయ్యాకా నీ బ్రతుకు వంటగదే .... నిన్ను బాగా చితక్కొట్టే పెళ్ళాం రావాలి ....నీలా కబుర్లు చెప్పి పెళ్ళాం వెనుక తిరిగేవాళ్ళను ఎంతమందిని చూడలేదు దొంగ వెధవ అని బోలెడు తిట్లు తిట్టేసేదాన్ని... nangih

అయితే పైకి అలా తిట్టేదాన్ని కాని నాకు బోలెడు అంత భయం ఉండేది.. ఈ దొంగ మొహం గాడు ఇలాంటి ఎక్కువ, తక్కువ పనులు చేసి ఏం మీదకు తెచ్చుకుంటాడో అని ketukmeje ... దేవుడా దేవుడా వీడి బుద్ది మారేలా చూడవా అని తెగ దణ్ణం పెట్టేసుకునేదాన్ని doa ఈ లోపల నాకు పెళ్లి అయిపోవడం నేను మా ఆయనతో మా వూరికి చెక్కేయడం జరిగి పోయాయి ...

వాడికి నాకు 25 రోజులే తేడా ... అందుకని అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా అమ్మని వాడి పెళ్లి గురించి అడిగేదాన్ని... adacall చూస్తున్నారమ్మా పెద్దమ్మా వాళ్ళు ...వాడికే పిల్లేవరూ నచ్చడం లేదు అనేది... ఆ తరువాత మా ఆఖరు చెల్లి పెళ్ళప్పుడు ఇండియా వెళ్ళినపుడు అడిగాను.. ఒరే మనిద్దరికీ ఒకటే వయసురా..tanduk నాకప్పుడే ఇద్దరు పిల్లలు పుట్టేసారు ...అక్కడికి నేను ఆంటీని ,నువ్వు బాలాకుమారుడివి అవ్వడం నాకు నచ్చలేదు ...ముప్పై దాటాయో ఇక నీకు పిల్లనివ్వడు ఎవ్వరూ అని బెదిరించి వచ్చేసా...banyakckp

ఆ తరువాత ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తే అక్క మాట్లాడింది.. ఏంటే అంత కంగారుగా మాట్లాడుతున్నావ్ అంటే ...బుజ్జి ,మనోడు ఇలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేసాడు అంది మెల్లగా.. దెబ్బకి నాకు నోట మాట రాలేదు..hah మా ఇంట్లో సంగతి నాకు బాగా తెలుసు.. నేను మా ఆయనతో తాంబూలాలు అయ్యాక ఫోన్ లో మాట్లాడితేనే అదేదో నేరం, ఘోరం జరిగిపోయినట్లు చూసేవారు garupaleఅలాంటిది ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేయడమే అనుకుని ...పెద్దమ్మ పెదనాన్న ఎలా ఉన్నారు అన్నాను కంగారుగా ... పర్వాలేదు వారం రోజులు మంచం ఎక్కేసింది పెద్దమ్మ.. ఆ అమ్మాయికి వెనుక ముందు ఎవరూ సరిగ్గాలేరు..కట్టు బట్టలతో తీసుకోచ్చేసాడు..మన కులం కూడా కాదు ... దానితో బెంగ పెట్టేసుకుంది... కాస్త నేమ్మదిన్చాక మాట్లాడుతాలే అంది..

అక్కడి పరిస్తితి కాస్త ఆందోళనగా అనిపించినా మా ఆయన దగ్గర మాత్రం డభాయించేసా ఎక్కడా ఒక్కమాట అననివ్వకుండా ... చూసారా ...మా తమ్ముడు ఎంత మంచిపని చేసాడో.. ఇంట్లో వాళ్ళను బాధ పెట్టినా ఒక అమ్మాయిని మోసం చేయకుండా ,కట్నం ఆశించకుండా ,కులగోత్రాలు పట్టించుకోకుండా ఎంత ధైర్యంగా పెళ్లి చేసుకున్నాడో.. మగాడంటే వాడండి అని,అదని ,ఇదని ..అబ్బో.. మా ఆయనుకు వారం రోజులు పండగే....menari

ఆ తరువాత కాస్త వీలు చూసుకుని వాడికి ఫోన్ చేసాను ...

ఏంట్రా ఏదో ఘన కార్యం చేసావంటా..kenyit

హీరో అన్నాకా ఇలాంటి ఘనకార్యాలు,సాహసాలు మామూలే కదా ...

ఆహా..ఇంతకీ ఎవరు ఎవరిని ప్రేమించారంటా rindu

ముందు తను ప్రేమించింది తరువాత నేను ప్రేమించ వలసి వచ్చింది (బ్రహ్మానందం లా అనుకరిస్తూ)

అబ్బ ఛా.... ఎన్నాళ్ళ నుండి ప్రేమించాబడ్డావేంటి ?jelir

ఒక పదేళ్ళ నుండి.. (నేను కూడికలు,తీసివేతలు,బాగాహారాలు గుర్తు తెచ్చుకుని లెక్కించి )అంటే మనం డిగ్రీ చదువుతున్నప్పటినుండి .hah.. హార్నీ... నాకు చెప్పనే లేదురా merajuk

అసలు ప్రేమించాకా ముందు వేసుకున్న ఒట్టే నీకు ఎంత మాత్రం తెలియకూడదని...

ఏడ్చావులే గాని ...ఇంతకూ ఇన్నాళ్ళు ఎందుకు ఆగవలసి వచ్చిందిరా?ఎంచక్కా జాబ్ లో చేరగానే పెళ్లి చేసుకొంటే సరిపోయేదిగా ... అటు ఆ ఆమ్మాయికి అడ్డుచెప్పేవారు లేరు అంటున్నావుగా ...ఆ చేసే ఘనకార్యం ఏదో అప్పుడే చేస్తే ఈ పాటికి ఎంచక్కా పిల్లలు కూడా పుట్టేసేవారు కదరా (నా బాధ నాది)..kenyit

ఏంటి అప్పుడే చేసుకునేది కొత్తిమీర కట్ట.. చిన్నాన్న మీ ఇద్దరికీ 18 నిండగానే పెళ్లి చేసేసారు..వాళ్ళిద్దరికీ కూడా అలాగే చేసేస్తారు అనుకున్నాను(మా చెల్లెళ్లకి) ...మిగితా చిన్నాన్న పిల్లలకు పెళ్లి చేసేసారు గాని వీళ్ళకు మాత్రం చేయలేదు..మా పెళ్ళిళ్ళతో నీకేంటిరా సంబంధం అని అనచ్చు నువ్వు..ఒకే ఇంట్లో పుట్టాం.. రేపు వాళ్ళ పెళ్లి మాటలప్పుడు వీళ్ళింట్లో అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు వీళ్ళు ఎలాంటి వాళ్ళో అని అంటే నాకే కదా బాధ ...పోనీలే మిగితా చిన్నాన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి.. వీళ్ళ పెళ్లిళ్ళు ఎప్పుడవుతాయా ...జంప్ అందామనుకున్నా ... మొన్నటితో కుదిరింది...

(నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. ఈ రోజుల్లో సొంత వాళ్ళ గురించే ఆలోచించడం లేదు మరి..) అరే.. మరి పెళ్లి చేసుకున్నపుడు పెద్దమ్మ ,పెదనాన్న గుర్తు రాలేదా ?

అదేం అడుగుతావ్..నువ్వు నమ్మవు బుజ్జి ..నరకం అనుభవించాను.. వీళ్ళా ఎట్టి పరిస్తితుల్లో పెళ్ళికి ఒప్పుకోరు ...బెదిరించో,బ్రతిమాలో నన్ను కట్టేస్తారు.. చెప్పకుండా చేసుకుంటే బెంగ పెట్టేసుకుంటారు.. అందులోను ఎక్కడ ఎవరు లేచిపోయి పెళ్లి చేసుకున్నా.....ఇంట్లో ముందు ముచ్చట్లు పెట్టేసి, తెగ తిట్టి పడేసేది అమ్మ ...రేపు నేను ఇదే పని చేస్తే వీళ్ళ అందరిదగ్గర చులకన అయిపోతుంది అని మా గొప్ప భయం గా ఉండేది.. నెమ్మదిగా మా ఆవిడకే చెప్పాను ..మనవల్ల వాళ్ళు బాధ పడతారు కాబట్టి పెళ్ళయ్యాకా మా అమ్మ తిట్టినా ,కొట్టినా వాళ్ళ చుట్టే తిరిగి ఎలాగో మంచి చేసుకుందాం.. అని

సరేలే గాని ఫోన్ మీ ఆవిడకు ఇవ్వు మాట్లాడుతా callme...

ఎందుకు ? ఆ అమ్మాయిది ఏం తప్పులేదు బుజ్జి..చాలా మంచిది తెలుసా.. అంత మంచి అమ్మాయి దొరకడం నా అదృష్టం ...

అవునా.. సరేలే ఆ విషయం ఆమెనే అడిగి తెలుసుకుంటా ..నువ్వు ఇవ్వు..

ఇదిగో ఇప్పుడే చెప్తున్నా..తన తప్పేం లేదు.. నేనే తనను ప్రపోజ్ చేశా..బోడి కట్నం ఎవడికి కావాలి బుజ్జి.. అర్ధం చేసుకునే అమ్మాయి దొరకడం ముఖ్యం గాని ..

ఒరేయ్ నాయనా ..నేనేం ఆ పిల్లను అనను గాని కాసేపు మాట్లాడుతాను అంతే.. (పాపం వాడికి నా మీద నమ్మకం ఎక్కువ) అలా బోలెడంత అపనమ్మకంతో అయిదే అయిదు నిమిషాలు మాట్లాడించి పెట్టేసాడు..

ఈ సంఘటన అలా ప్రక్కన పెట్టి మరొకటి చూద్దాం.. నా పెళ్ళయిన క్రొత్తలో మా మరిదిగారు ఇంత కంటే ఎక్కువ అన్నమాట.. పెళ్లి అనే పదం వినగానే సల సలా కాగే సీసం రెండు చెవుల్లో పోసేసినట్లు రెండు చెవులు మూసేసుకుని తెగ బాధతో మెలికలు తిరిగిపోయే వారుbising ... మా అత్త గారు ఎప్పుడన్నా అరేయ్ ..ఫలానా పెళ్ళిళ్ళ పేరయ్య ఫలానా సంబంధం ఉంది అన్నారురా అనగానే ... సాగర సంగమం లో కమలహాసన్ లా వివిధ నృత్య రీతుల్లో వివిధ భంగిమలు పెడుతూ తకధిమి తై..తకధిమి తై ...తళాంగు తకధిమి తై అని ఎగిరి గెంతేసేవాడు...

అక్కడితో ఊరుకోకుండా మా ఇద్దరికీ రోజుకో క్లాసు ... అసలు పెళ్లి అంటే ఏంటి.. ఒక కమిట్మెంట్ ... పెళ్ళాం,పిల్లలు ,బాద్యతలు తొక్కా తోలు అన్నీని...నాకిష్టం ఉండదు వదిన ... అసలు మన దేశం ఇలా వెనకబడిపోవడానికి కారణం ఈ పెళ్ళే.fikir. సంసారాల చట్రాల్లో ఇరుక్కుపోయి లంచాలు తీసుకుని.. తర తరాలకు సరిపడేంత డబ్బును మంచాల క్రింద ,బీరువాల లోపల దాచేసి మన కోసం మనం కాక మనకు తెలియని ముందుతరాల కోసం బ్రతికేలా చేస్తుంది ఈ పెళ్లి.. లేక పోతే పిడికెడంత లేని పాకిస్తాన్ ని కాశ్మీర్ విషయం లో ఎదురించలేని అసహాయత మన భారతదేశం ఎందుకు ఎదురుకుంటుంది..మన ఆర్ధిక వెనుకబాటు తనం కాదా blur ఇలా పెళ్లి పేరు చెప్పి పేపర్ లో న్యూస్ అంతా వినిపించేసి తెగ బాధ పడిపోయేవాడు..

అలా మా మరిది మాటలు వినేసి,నమ్మేసి ఆ ఫళం గా తనని ఒక అబ్దుల్ కలాం ,ఒక అతుల్ బిహారీ వాజ్ పాయ్,మరి ఒక మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళ సరసన నించో పెట్టేసా తను మాత్రం మా తోడి కోడలు సరసన నించున్నాడు ఎంచక్కా hah... పైగా ఎప్పుడు మాట్లాడినా ..చెప్తే వినదు వదినా ...ఎప్పుడు చూడు పని,పని కాసేపు రెస్ట్ తీసుకోదు అని నాకే కంప్లైంట్ చేస్తాడు వాళ్ళావిడ మీద ...అప్పుడు ఒక క్లోజప్ నవ్వు నవ్వేస్తాను..కాని దాని వెనుకాతల గత చరిత్ర తవ్వకాలు అమోఘం గా జరుగుతున్నాయన్న విషయం పాపం తనకి తెలియదు ...jelir కాబట్టి కామ్రేడ్స్ అంటే అమ్మాయిల్లారా... మీరు బ్లాగుల్లోనో ,మరొక చోటో కొంతమంది సోది సుబ్బయ్యలు ఆడవాళ్ళ మీద అనేకానేక పైన చెప్పినటువంటి సోది కబుర్లు చెప్తుంటే ఊరికే ఆవేశం తెచ్చేసుకుని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి ..నాకులా హి హి హి gelakgulingఅని నవ్వుకుని వెళ్ళిపొండి ...అది సంగతి senyum

86 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఐతే వంద రెండోందలా దీనికి కామెంట్లు?

అజ్ఞాత చెప్పారు...

మీ ఫ్యాన్స్లో అసలు టపా చదివి కామెంట్ చేసేవాళ్ళు ఎందరో తేలిపోద్ది దీనితో(ఈ టపాతో)..

ప్చ్, పాపం హరేకి పరిచయం చేస్తే. బ్ర.బ్ల.సలో చేర్చుకునేవాడు మీ తమ్ముడికి..

ఐనా ఏంచేస్తాం ఇప్పుడు పెళ్ళి ఐపోయిందిగా..

అజ్ఞాత చెప్పారు...

ఇది కేవలం మా బ్ల.బ.స మీద మీరు జరిపిన దాడిగా నేను భావిస్తున్నాను..

అసలు అందరూ బౌద్ధం తీసుకోని సన్యాసుల్లో కలిసిపోవాలని పెద్ద ఉద్యమం లెదదీయక తప్పదు...

అవును ఇప్పుడు మీ పెద్దమ్మగారితో బాగా కలిసిపోయారా మరి?

3g చెప్పారు...

అంటే....... మగాళ్ళు ఎంత ఘాట్టిగా పెళ్ళొద్దనుకున్నా ఎప్పటికైనా ఆడాళ్ళ వల్లో పడాల్సిందే అన్నమాట!!!!

తార గారు మీరన్నది నిజమే ఇది ఇప్పుడే పుట్టిన బ్ర.బ్లా.స పైన వేసిన అణుబాంబు.

శ్రీనివాస్ చెప్పారు...

బ్రహ్మచారి బ్లాగర్ల సంఘం వారి ఫ్యూచర్ నేస్తం గారు బాగా చూపించారు.

కుటుంబరావుల సంఘం వర్ధిల్లాలి

హరే కృష్ణ చెప్పారు...

బ్ర బ్లా స వర్ధిల్లాలి

3g చెప్పారు...

బ్ర.బ్లా.స సభ్యులకు విఙ్ఞప్తి:
"ఆడవాళ్ళకు మాత్రమే" ఈ టైటిల్ మేనర్స్ ఉన్న మగాళ్ళకు మాత్రమే!!! మనక్కాదు!! కాబట్టి సిగ్గు లేకుండా పోస్టు చదివి మీ మీ స్పందన తెలియచేయొచ్చు.
ఎప్పుడూ లేనిది నేస్తంగారు వీకెండ్ లో పోస్టు చేయడం కూడా ఈ దాడి లో భాగంగానే భావించడమైనది.

హరే కృష్ణ చెప్పారు...

హమ్మ నాయనో నేస్తం గారి తమ్ముడి మీద ఉన్న కోపం అంతా బావ గారి మీద తీర్చుకుంటున్నారు
కుటుంబరావు లు అంతా కలిసి సాటి సోదరడుకి మద్దతు ని తెలిపి ఈ అరాచకాన్ని ఆపాల్సిందే


బ్ర బ్లా స మద్దతు తెలియ పరుస్తున్నాం

వెంకట్ చెప్పారు...

హి హి ఎంత వారలైనా కాంత దాసులే :)

నీహారిక చెప్పారు...

దాని వెనుకాతల గత చరిత్ర తవ్వకాలు అమోఘం గా జరుగుతున్నాయన్న విషయం పాపం తనకి తెలియదు ... :-D

దానివెనుకున్న అదృశ్య హస్తం మీదేనా?

హరే కృష్ణ చెప్పారు...

ఇది అగ్ర వర్గ అభిజాత్యపు కుట్ర
దీన్ని ఖండ ఖండాలుగా ఖండిస్తూనే ఉంటాము టైం దొరికినప్పుదలా

బ్ర బ్లా స వర్ధిల్లాలి
సోది సుబ్బమ్మలు డౌన్ డౌన్

హరే కృష్ణ చెప్పారు...

3g గారు లక్ష్మీ బాంబులకే భయపడిపోతే ఎలా మీరు మరీను..

అమెరికా లాంటి బ్ర బ్లా స ని వదిలేసి

సవ్వడి చెప్పారు...

సో అదన్నమాట సంగతి.

అందుకే అమ్మాయిల గురించి, పెళ్లిళ్ల గురించి ఎటువంటి స్టేట్ మెంట్ ఇవ్వట్లేదు. తరువాత మళ్లీ నవ్వుతారని!

ఇంతకీ మీ తమ్ముడు తన ప్రేమ కథను మీకు చెప్పారా....

నేస్తం చెప్పారు...

తార అదేకదా అందుకే ముందు వ్యాఖ్య ప్రచురించేస్తున్నా :)లేకపోతే సగం వ్యాఖ్యలు ఇవే ఉంటున్నాయి ఇక నేను బ.బ్లా.స గురించి చూడలేదు.. ఒకవేళ ఇది వారికి వ్యతిరేఖం గా ఉన్నట్లయితే మరీ మంచిది..ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట :) ఆ మా తమ్ముడు ఇప్పుడు పర్వాలేదు..మొదట్లో పెద్దవారి నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కున్నాడు.. కాకపోతే మా పిల్లలం అందరం (అంటే మా తరం పిల్లలం.. మేము పిల్లలమని కాదు) వాడిని ప్రేమగానే చూసాం అర్ధం చేసుకుని..
3g ఈ కధలో నీతి సింపుల్ ... మగవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే అని :)
అన్నట్లు మర్చిపోయా తమరూ కుటుంభరావే కదా శ్రీనివాస్
హరే క్రిష్ణ సోది సుబ్బమ్మలా.. ఆయ్.. అస్సలు నిన్ను ఈ పోస్ట్ ఎవరు చదవమన్నారు చెప్పు ముందు..:O
వెంకట్ అంతే కదా మరి :)
నీహారిక నాకే పాపం తెలియదు :D

Sasidhar Anne చెప్పారు...

chala pedda comment rayali mee post meeda..

ini nunchi bangalore ki velle hadavidi lo vunna.. bangalore vellagane chese modati pani.. comment ettetame..

నేస్తం చెప్పారు...

అబ్బో శశి నిజమే ..ఏంటో అంత పెద్ద కామెంట్ ..చూస్తా :)
@సవ్వడి.. లేదు ..అడగలేదు ..నాకు వాడు ఒంటరిగా దొరకడమే లేదు..ఉదయం ఆఫీస్ ..సాయంత్రం ఇంటిదగ్గర ఉంటాడు.. ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని :)

అజ్ఞాత చెప్పారు...

3g భలే చెప్పారు

అజ్ఞాత చెప్పారు...

కుటుంబరావులతో మరీ ఎక్కువగా కలిసి తిరుగుతున్నాడని వికవటకవిని బ్ర.బ్ల.స.లోనుంని తీసేస్తే, ఆ కుటుంబరావులతో ఫుల్ టైమ్ కలిసిపోయాడు..

కానీ ఎదో రాయుడు వీరాభిమానులం కాబట్టి, ప్రస్తుతానికి శిక్ష ఏమీ అమలు చేయలేదు..

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. నేస్తం అక్కా బాగుంది మీ టపా. అవునక్కా నాకో డవుట్.. మీరు ముందుగానే అమ్మాయిలకు మాత్రమే అంటే ఇలా అందరూ ఎందుకు చదివేసినట్లు.?
3g గారిని నేను తీవ్రాతి తీవ్రంగా ఖండించేస్తున్నా.. హిహ్హిహ్హీ..

ramya చెప్పారు...

మా మామ బాబాయ్ వాళ్ళూ సరిగ్గా ఇలాగే అనేవాళ్ళు :) పెళ్ళాయ్యాక వాళ్ళంతా పెళ్ళాం చెపితే వినాలి అంటూ పాడుకుంటూ కాలక్షేపం చేస్కుంటున్నాru.మాటకు ముందు మా (వాళ్ళావిడి పేరు) ఏమందంతే అంటూ మొదలెడతారు ఇన్నాళ్ళైనా :)

మా కజిన్ తమ్ముళ్ళది మాత్రం రూటు మారిందందోయ్. అక్కా మీ వూళ్ళో చాలా అందమైన శానా శానా డబ్బున్న శానా శానా శానా చదుకున్న అమ్మాయింటే చూడు అంటూ అడుగుతున్నారు ఆ అమ్మాయికే సర్వహక్కులూ ఇచ్చేస్తారుట :) బీటెక్ మొదటి లో వుండగానే మొదలెట్టారు ఇలా అడ్గటం.
ఇప్పుడిప్పుదే చదువులు పూర్తి చేసుకుని ఒక్కళ్ళరూ కొలువుల్లో చేరుతున్నారు చుడాలి వాళ్ళ కోరికల చిట్టా ప్రకారం అమ్మాయిలు దొరకుతారో లేదో

Sai Praveen చెప్పారు...

హ్మం... అదన్నమాట సంగతి. ఏమో లెండి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలుసు? "Are you married?" అని అడిగితే "No, I am still happy." అని చెప్పే బ్రహ్మచారినే నేను కూడా.. కాని future ఎలా రాసి పెట్టి ఉందొ మరి. :)
" పైగా ఎప్పుడు మాట్లాడినా ..చెప్తే వినదు వదినా ...ఎప్పుడు చూడు పని,పని కాసేపు రెస్ట్ తీసుకోదు అని నాకే కంప్లైంట్ చేస్తాడు వాళ్ళావిడ మీద" ఇది పెళ్ళైన కొత్తలోనేనా, తరవాత కూడానా? ఆ ఏమి లేదు ఒకప్పుడు అంగుళం రెండు అడుగులు అని మీరే ఏవో లెక్కలు చెప్పారు కదా. అందుకని అనుమానం వచ్చింది :)
అయినా టపాకు ఆడవాళ్లకు మాత్రమే అని టైటిల్ పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఆ చివరి పారాకు (కాబట్టి కామ్రేడ్స్) మాత్రం అలా పెడితే సరిపోయేది. నేస్తం గారు రాసింది మేము ఎలాగో చదవకుండా ఉండలేము కాబట్టి మమ్మల్ని తరవాత ఏడిపించేద్దాం అని ప్లానా.. ఆయ్???

3g చెప్పారు...

@హరే
>>3g గారు లక్ష్మీ బాంబులకే భయపడిపోతే ఎలా మీరు మరీను..

అలా అయితే ఓకే... ఇలాంటి ఖష్ట సమయాల్లోనే ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవాలి.

3g చెప్పారు...

>>అసలు ప్రేమించాకా ముందు వేసుకున్న ఒట్టే నీకు ఎంత మాత్రం తెలియకూడదని...

అంటే నేస్తం గారూ.... మీరు ఫ్లాష్ బేక్ లో ప్రేమికుల్ని విడగొట్టడం, ప్రేమకథల్ని చెడగొట్టడం లాంటివి చేసేవారా!!లేకపోతే మీతమ్ముడికి మీమీద అంత ప్రగాఢవిశ్వాసం ఎలావచ్చింది.

అజ్ఞాత చెప్పారు...

>> నేను కూడికలు,తీసివేతలు,బాగాహారాలు గుర్తు తెచ్చుకుని లెక్కించి....... super..... :)

అజ్ఞాత చెప్పారు...

అది గద్గది, అట్టా అడుగు, లేకపొతే మన మీదే దాడా?
ఐనా చెట్టంత మనిషిని నేను ఉండగా మీకు భయమేల, అణుబంబులే కాదు, ఆ సూర్యుడే వచ్చి పడినా నేను అడ్డం ఉంటాను..

హరే కృష్ణ చెప్పారు...

అక్క పోస్ట్ రాస్తే తమ్ముడు తో చదవమని బొట్టు పెట్టి మరీ వేరే చెప్తారా :O
ఇక టైటిల్ విషయం వస్తే బ్ర.బ్లా.స బాధ్యతతో ఉన్న ప్రతి ఒక్కరు చదవక మానరు
ఒక్కసారి పోస్ట్ చదవడం స్టార్ట్ చేస్తే టైటిల్ లో ఏముందో నాకే తెలీదు అందుకే చదివేసా :)

..nagarjuna.. చెప్పారు...

నేనైతే సిగ్గులేకుండా = సిగ్గుపడకుండా సదివేస్నాను గందా.. పైగా ఇది బ్రబాస పై ఆభిజాత్యపు పోకడ కలిగిన నియో పోస్టమోడర్న్ సామ్రాజ్యవాదపు సంసారీకుల మాహాకుట్రగా అనిపిస్తుంది :-/

ఆర్నీ...ఇన్ని రోజులు వికటకవిగారు కుటుంబరావులను వో ఎత్తేస్తుంటే ఏంటో అనుకున్నా, ఆయనకూడా భార్యావిధేయ కుటుంబరావేననమాట :P

ఇయన్నీ కాదుగాని నేను ప్రేమ బ్లాగర్ల సంఘం పెడుతున్నా ( ఎవరు ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నారు అనవసరం ). యెదవది బ్రహ్మచారులది, బ్రహ్మచారిణులది, సంసారికులది గొడవొదిలిపోద్ది దెబ్బకి....ఒక్కదెబ్బకు మూడు పిట్టలు.. :)

..nagarjuna.. చెప్పారు...

ఇందాక ఓ విషయం చెప్పడం మరిచా అక్కా....మీ తమ్ముడి ఆలోచన శైలి అభినందనీయం...kudos to him

అజ్ఞాత చెప్పారు...

ఇది ఆడవాల్లకోసం రాసిందా నిజంగా నమ్మమంటారా ?ఈ కుట్ర ని మేము ఖండించుచున్నాము.

గని చెప్పారు...

బాగుంది

రాజ్ కుమార్ చెప్పారు...

ఈ టప ఎలా ఉందొ ఏమో ... (సదవద్దన్నారు కదా...)నేను చదవలేదు మరి.. బాగానే ఉండి ఉంటుంది లెండి.. :) :)
అసలు ఈ కామెంట్లు చూస్తుంటే ఇది జాజిపూలు బ్లాగేనా అనిపిస్తుంది.. :( :(
"పెళ్లి అనే పదం వినగానే సల సలా కాగే సీసం రెండు చెవుల్లో పోసేసినట్లు రెండు చెవులు మూసేసుకుని తెగ బాధతో మెలికలు తిరిగిపోయే వారు ." ఇది ఇమాజినేషన్ లో కేకో కేక..

నేస్తం చెప్పారు...

అపర్ణ అదేమరి బోలెడు సీక్రెట్స్ నీకు తెలియదు.. ఫలానా పని మీరు చేయకండోయ్ అని అంటే అదే పని చేస్తారు :) ఇప్పుడు వాళ్ళే ఎక్కువ చదువుతారు ...అందుకే అలా పెట్టా టైటిలు.. ఎవ్వరికీ చెప్పకేం...
రమ్య మీ ఇంట్లోనూ అంతేనా ...నూటికి 90 మంది అంతే అంతే'

>>>ఒకప్పుడు అంగుళం రెండు అడుగులు అని మీరే ఏవో లెక్కలు చెప్పారు కదా
అది ఇప్పుడూ చెప్తాను ప్రవీణ్ ... అయితే పిల్లలు పుట్టిన తరువాతా అన్నమాట ఆ లెక్కలేసి కొలుచుకుని నడిచేది.. :)

నేస్తం చెప్పారు...

3g అదే నాకు అర్ధం కాదు ... నేను చిన్నప్పటి నుండి ర్యాగింగుకి,టీజింగుకి బద్ద విరోధిని.. మా రెండో తమ్ముడు తన జూనియర్ ని మా ఇంటి అడ్రెస్స్ కనుక్కుని ఇంటి కొచ్చి రాత్రి లోపల గుడ్ నైట్ చెప్పాలని ఆదేశించాడంట..పాపం వాడు ఫలానా ఇంజనీరింగ్ స్టూడెంట్ శ్రీనివాస్ ఇల్లు ఇదేనా అండి అని అడుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు ...విషయం వినగానే ఇంత కష్టపెట్టాడా నిన్ను అని పెదనాన్నకు చెప్పేసి ఆ అబ్బాయి ఎదురుగానే మా వాడికి నాలుగు చీవాట్లు వేయించేసాను ... బహుశా అలాంటి అభిమానాలు నా మీద చాలా ఉండటం వల్ల నేను వస్తే చాలు మా చెల్లిళ్ళతో మాట్లాడుతూ నన్ను చూసి టక్కున విషయం మార్చేసి మాట్లాడేవారు :)

>>> చెట్టంత మనిషిని నేను ఉండగా మీకు భయమేల, అణుబంబులే కాదు, ఆ సూర్యుడే వచ్చి పడినా నేను అడ్డం ఉంటాను..
అఙ్ఞాత గారు థేంక్యూ :)
తారా చెట్టు సూర్యిడి కంటే,అణుబాంబు కంటే పవర్ ఫుల్లా అండి... తెలియక అడిగాను.. :)

నేస్తం చెప్పారు...

>>>ఒక్కసారి పోస్ట్ చదవడం స్టార్ట్ చేస్తే టైటిల్ లో ఏముందో నాకే తెలీదు అందుకే చదివేసా :)
హరే కృష్ణ ...డైలాగ్ భలే ఉంది :))

యెదవది బ్రహ్మచారులది, బ్రహ్మచారిణులది, సంసారికులది గొడవొదిలిపోద్ది దెబ్బకి....ఒక్కదెబ్బకు మూడు పిట్టలు.. :)
నాగార్జున ఇది మరీ బాగుంది... :)
అఙ్ఞాత గారు మీకు అలాంటి డవుట్స్ రానే కూడదు..కావాలంటే ఖండించుకోండి :)

గని గారు థేంక్యూ
వేణు రాం ..అయితే చదవలేదా... ఇంకా చదివేసావేమో తిట్టేద్దాం అనుకున్నాను.. :) అలాగే తెగ గొడవ చేసేసే వాడు తను మరి :)

3g చెప్పారు...

అపర్ణ గారూ.... మీరు ఏం ఖండిస్తున్నారో, ఎందుఖ్ఖండిస్తున్నారో చెప్పకుండా ఇలా ఖస ఖసా ఖండించేస్తుంటే ఎలాగండి.

3g చెప్పారు...

>>చెట్టు సూర్యిడి కంటే,అణుబాంబు కంటే పవర్ ఫుల్లా అండి... తెలియక అడిగాను.. :)

నేస్తంగారూ.. మీకిలాంటి డౌట్లు ఎలావస్తాయండి. లేకలేక మాఉధ్యమనాయకత్వానికై ఉదయించిన ఒక తారకి మీ బెదిరింపులేమిటి?

>> చెట్టంత మనిషిని నేను ఉండగా మీకు భయమేల, అణుబంబులే కాదు, ఆ సూర్యుడే వచ్చి పడినా నేను అడ్డం ఉంటాను..

మిత్రులారా బ్ర.బా.స కి నాయకుడిగా తన ప్రాణాలకు తెగించి సవాల్ చేసిన తార గారిని ప్రతిపాదిస్తున్నాం. జై బ్రబాస.

sunita చెప్పారు...

Hahaha!baagundi.

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కా అంతే అంటారా..?? నేనే ఇంకా అందరూ మాట మీద నిలబడేస్తారేమో అనేసుకున్నాను కదా పుసుక్కున..:(( అందరి గురించి మీరు బాగా తెలిసేసుకుని భలే ఐడియా పాటించేశారు..:))

హహ్హహ్హా.. కృష్ణ ఇంకా నాగార్జున భలే భలే కామెంట్లు రాసేస్తారు. నాకైతే అస్సలు నవ్వాగదు.:) మీరు కేకో కేక..

3g గారు, మరద్దే.. ఒక సారి ఖండించేద్దాం అని డిసైడ్ అయిపోయాక ఎవరైనా ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచించేస్తారా..? ఖండించాలంటే ఖండించేయ్యాలి అంతే. అది ఖసా ఖసా నా లేక ఇంకెలాగైనా అన్నది తరువాత విషయం..:)))

తార గారూ..
>>చెట్టంత మనిషిని నేను ఉండగా మీకు భయమేల, అణుబంబులే కాదు, ఆ సూర్యుడే వచ్చి పడినా నేను అడ్డం ఉంటాను..
హిహ్హిహ్హీ..

నేస్తం అక్కా అంతే కదా మరి..
>>తారా చెట్టు సూర్యిడి కంటే,అణుబాంబు కంటే పవర్ ఫుల్లా అండి... తెలియక అడిగాను.. :)

Raja చెప్పారు...

బుజ్జక్కా, టైటిల్ చూసి కూడా, అస్సలు సిగ్గులేకుండా, ఏ మాత్రం మొహమాటం పడకుండా టపా పూర్తిగా చదివేసాను అక్కా, అదేంటో అక్కా వద్దన్న పని తప్పకుండా చెయ్యాలికదా,కానీ మీ తమ్ముడు మంచి పని చేసాడు కదా అక్కా , తమ్ముళ్లు ఎప్పుడూ అంతే అక్కా మంచి పనులే చెస్తారు

శివరంజని చెప్పారు...

హహ్హహ్హా.. నేస్తం అక్కా బాగుంది మీ టపా. అవునక్కా నాకో డవుట్.. మీరు ముందుగానే అమ్మాయిలకు మాత్రమే అంటే ఇలా అందరూ ఎందుకు చదివేసినట్లు.?
నాగార్జున గారు మీరు కూడా ఒక కొత్త సంఘం పెడుతున్నారా ??? నేస్తం అక్కా నువ్వు కూడా ఒక కొత్త సంఘం పెట్టు ...

కవిత చెప్పారు...

నేను కూడికలు,తీసివేతలు,బాగాహారాలు గుర్తు తెచ్చుకుని లెక్కించి....... super.....

నిజం గా అమ్మాయిలు అంటే నచ్చని వాళ్ళే తొందరగా ప్రేమలో పడతారు ...మీ తమ్ముడి లా ...ఏదయితేనేం ఒక మంచి పని చేసాడు...

Sasidhar Anne చెప్పారు...

"Muthyam mantha " song paduthu vunde ammayi naa life partner la ravali ani.. oo full ga btech nunchi dreams vesukuntunna.. kani ippudu reality angel lo chusthe.. evvaru kanapadatam ledu.. inka maa amma emo.. nuvvu emiti ra babu.. ila antunnav.. alanti ammayilu ippudu leru.. ani class peeki. " era job chesthunnav nuvve evarni chusukoleda antunnaru.. emi chestham cheppandi.. abbayila paristhidi ila tayaru ayyindhi.." chivariki ippudu nenu naa parameters marchukontunna..

chudandi nestam akka.. memu entha manchi vallamo... maa life partner kosam memu mundu ga anukunnavi ani marchi sardhuku pothunnam.. danni meeru postive angel lo chudali kani.. ila chusthe ela cheppandi..

ps:- nenu inka naa okkadi paristidhi ee ila vundi anukunna.. kani naa sati vari andharu idhey situations face chesthunnaru ani telisi.. badha padalo navvalo ardham kavatam ledu..

నేస్తం చెప్పారు...

3g ఇది మరీ బాగుంది డవుట్ అడగడం కూడా తప్పేనా..
సునీత థేంక్యూ
అపర్ణ :)
రాజ మరి అక్కలకు తమ్ముళ్ళెప్పుడూ మంచిగానే అనిపిస్తారు :)
శివరంజని సంఘమే గా పెట్టేద్దాం.. మీరందరూ పెళ్ళి చేసేసుకోండి తొందరగా.. నేను గృహణిల సంఘం స్థాపిస్తా నువ్వే సెగట్రీవి :)
కవిత థేంక్యూ :)
శశిధర్ నువ్వు సినిమా లోకం నుండి ఇహలోకం లోకి రావాలి సారు ... ఇప్పుడు డబ్బులేని చదువులేని పేద అమ్మాయిలు చాలా మంది నువ్వు చెప్పినట్లు ఉంటారు ...చేసుకోగలవా :) ...అవ్వ కావాలి బువ్వా కావాలి అంటే ఎలా? ఒక వేళ చేసుకున్నా ఈ స్పీడ్ ప్రపంచం లో ప్రతీ విషయానికి బిక్కమొహం వేసి నాకు తెలియదు అని అనే భార్య మొదట్లో బాగానే అనిపిస్తుంది ..తరువాత తరువాత చిరాకనిపిస్తుంది... నన్నే చూడు ...మొదట్లో నేను మా ఆయన్ని పెట్టిన ముప్పుతిప్పలు అన్నీ ఇన్నీ కావు... కాకపోతే వెంటనే ఈ వాతావరణానికి అలవాటు పడ్డాను ... అందరికీ అంత సులువుగా అన్నీ రావుగా ... :) మనం వాస్తవం లో ఉండాలి ఎప్పుడూ :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఆడవాళ్ళకు మాత్రమే అన్నారు...ఏం రాసుంటారబ్బా??

Sasidhar Anne చెప్పారు...

//కాకపోతే వెంటనే ఈ వాతావరణానికి అలవాటు పడ్డాను ... అందరికీ అంత సులువుగా అన్నీ రావుగా ... :) //

meeru mimmulani baga pogudukunnaru :)
yeah..what u said is true. amma kooda same class peekaru..

నేస్తం చెప్పారు...

అబ్బెబ్బే శేఖర్ ఏమి రాయలేదు .. మగవాళ్ళ గొప్పతనం, వారి సమయ స్పూర్తి, మంచితనం లాంటి విషయాలను అమ్మాయిలకు వివరించానంతే :)
శశి హమ్మయ్యా అర్ధం అవుతుందో లేదో అని అతి జాగ్రత్తగా ఆ లైన్ ఇరికించాను ... :D

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం జీ, మీరు చెప్పిన సోది సుబ్బయ్యలు చాలామందే ఉంటారు...అప్పటిదాకా అంత సోదీ చెప్పి, చివరికి పెళ్ళయాక పెళ్ళాం కొంగు వదలరు...ఇది రొటీనే..ఇకపోతే, చెప్పిన సోదికి పెళ్ళయ్యాక కూడా కట్టుబడి ఉండే స్టీల్ అబ్బాయిలు(కరిగే ఛాన్స్ లేని...) కొంత మందే ఉంటారు...నా లాగా...ఏ నూటికో ..కోటికో..

Mahitha చెప్పారు...

ha ha ha

chaala baaga rasaru

Sasidhar Anne చెప్పారు...

ha ha.. nestam akka..enthaina mee thammudu kada.. sookshma ardhalani kooda itte pattesthunna..

పరిమళం చెప్పారు...

బావుంది తమ్ముడి ఘనకార్యం ...అక్క సపోర్టింగు...అదిసరే టైటిల్ వివాదాస్పదమవుతుందేమో చూడండి అసలేఈమధ్య టైటిల్స్ వివాదాస్పదం అవున్నాయి :) :)

divya vani చెప్పారు...

హా హా ఎప్పటిలాగానే టపా బాగుంది నేస్తం గారు ...
.మీ తమ్ముడు ఎంత మంచోడో తనకోసమే కాకుండా మీ కోసం కూడా ఆలోచించి పెళ్ళి పొస్టుపోన్ చేసాడంటే .,....

రాధిక(నాని ) చెప్పారు...

హహ్హహ్హ.......హహ్హహ్హ.చాలా బాగుందండి.

నాగప్రసాద్ చెప్పారు...

హ హ అబ్బాయిలు ఎప్పుడూ మంచోళ్ళే. అమ్మాయిలకే అర్థం చేసుకోవడం చేతకాదు. అమ్మాయిల బుర్రలు ఎప్పుడూ ఆర్నెళ్ళు/సంవత్సరాలు లేట్‌గా వెలుగుతుంటాయి. అందుకే, ప్రపంచంలో ఇన్ని గొడవలూ, మారణహోమాలూనూ. :))

అజ్ఞాత చెప్పారు...

Baagundhi Nesthamgaru. Offooo..... asalu chaduvuthunte chusinattu undhi antha. Eerojulla ila intlo valla daggara overacting chesesi bayata chesevanni chesesthunnaru...finally meere maa venakala paddaru antaru ee ababyilu. Kanee nijamga aa third paragraph chaduvuthunte naakithe full kopam vachindhi. Nenu aa paragraph ni Kandisthunnanu Adhyaksha....

Priya.

అజ్ఞాత చెప్పారు...

Nesthamgaru,

Indhaka post lo cheppatam marchipoyanu. Ee Saturday-18th sengkang CC lo Indiabazar undhandi.Totally 100 stalls peduthunnaru. U can find all indian tastes in the food especially i heard there is chat, Jewelry,Books,interior decoration items, Indian clothings...so so unnayi ata. Kudirithe Visit cheyandi. This is just for one day. I think we can find Fun. I recvd one event Flyer. so ala naaku thelisindhi.

Priya.

నేస్తం చెప్పారు...

మరేం పర్లేదు రామ క్రిష్ణ ..కరిగే చాన్స్ లేని స్టీల్ అబ్బాయిలను వంచే ఐరన్ లాంటి అమ్మాయిలు మా ఊర్లో కోకొల్లలు ... (మరి నేను ఆ కోవకు చెందినదాన్నే కదా) :)
మహి థేంక్యూ
శశి :)
పరిమళం గారు అవునా ...టైటిల్స్ కూడా వివాదాస్పదం గా ఉంటున్నాయా :) ఈ మద్య బ్లాగ్స్ సరిగ్గా చూడటం లేదు.
దివ్య వాణి.. చిన్నప్పుడు మా పెద్దమ్మ ఎప్పుడు చూసినా వీడెంటే ఇలా తయారవుతున్నాడు రోజు రోజుకి చిన్న పిల్లాడిలా.. వీడికి బుద్ది ఎప్పుడు ఇస్తాడొ కదా దేవుడు అనేది ... ఈ రోజున వాడితో అరగంట మాట్లాడితే చాలు ఎంత ఎదిగిపోయావురా అని అరనిమిషానికోమారు అనుకుంటున్నా..పొడవు గురించి కాదు సుమా (మనిషి కూడా అలాగే తాడి చెట్టులా 6'2 పొడవు :)

నేస్తం చెప్పారు...

రాధిక థేంక్యూ :)
నాగప్రసాద్ అవునా ...నిజమా.. అలాగే :) అసలు పోస్ట్ రాసిందే నీలాంటి అబ్బాయిలను చూసి :)
హ హ ప్రియా నాకు వాడికి ఈ విషయం లో క్షణం పడేది కాదు.. నేనైతే మరీ దారుణం గా తిట్టేదాన్ని లే ..అవన్నీ రాసాంటే అబ్బాయిలందరూ నాపై దండ యాత్ర కొచ్చేస్తారు :)
ఓ సెంగ్ కాంగ్ లోనా ...అయితే చూడాలి.. మరి మావారికి ఆ రోజు మేచ్ లేకపోతే.. ఇక్కడ ఉంటానే గాని ఏ విషయం తెలియదు 4 గోడల మధ్యే అలా తిరుగుతా..బద్దకం తో బయటకు కూడా వెళ్ళను :)

అజ్ఞాత చెప్పారు...

Nestam garu.. chala bavundi mee blog.. nizamee mee brother lanti vallu chala mandi vuntaru.. valle twaraga love lo padipotaru.. reason telsa?? Abbayilu chala manchi vallu andi.. enni chepina manasu manchu lantidu..voorakee karigi potaru.. but meeru vizag steel.. easy ga karagaru.. :P

Sasidhar Anne చెప్పారు...

Indaka comment vesthunnapudu edo error vacchindhi anduke second time same link vesthunna..


http://sasi-anne.blogspot.com/2010/09/blog-post.html

Raghuram చెప్పారు...

నేస్తం గారు,
టపా అదిరింది. మీ ఘనకార్యాలను ఒక్కోక్కటి గా బయట పెడుతున్నారు. వాటిని వింటుంటే భలే నవ్వు వస్తోంది. పాపం మీ తమ్ముళ్ళు, అన్నయ్యలు. వారికి మీపై ఎంత కోపం గా వుండే దో కదా అప్పట్లో!!

రఘురాం!

priya చెప్పారు...

నేస్తం గారు టపా బాగుంది. మీ తమ్ముడి లాంటి వాడే నాకో ఫ్రెండ్ ఉన్నాడు. పెళ్లెందుకు అని చక్కగా పెళ్లి చేసుకున్నాడు. సో ,అందరు చేసే పని అదే.

ప్రభు చెప్పారు...

మీరనుకున్నట్లే నేను మర్యాదలేకుండా చదివేసి నవ్వేసుకుంటూ ఉన్నానండీ !

hamsa చెప్పారు...

నేస్తం గారూ.., as usual Excellent...

పవన్ కుమార్ చెప్పారు...

బాగుంది అక్కా టపా.
అయితే పెల్లి అయ్యాక అందరూ కొంగు పట్టుకొని తిరుగాల్సిందే అంటావ్.
అదెగా ఈ టపా లొ నీతి..!

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు అవునా అండి.. అబ్బాయిలు చాలా మంచివాళ్ళా అండి.. మరే ... అదే చెప్పుకుంటున్నారు అమ్మాయిలందరూ కలిసి ...
రఘురాం :) ... కోపం కాదుగాని కొంచెం భయపడేవాళ్ళు ఎందుకో.. ఎవరైనా అమ్మాయి గురించి మాట్లాడాలంటే ...మా చెల్లెళ్ళు చెప్పేవారు ఆ విషయం నాకు ..వాడికి నువ్వువంటే భయమక్కా బాబు అంటూ :)
ప్రియా చూసావా నేను చెప్పిన విషయం కరెక్టే కదా
ప్రభు పోనీ లెద్దూ విషయం ఒప్పేసుకున్నారుగా.. ఈ సారికి క్షమించేస్తున్నా :)
హంసా :)
పవన్ నీకు అలా అర్ధం అయ్యిందా :) పోనీ లెద్దూ ఎదో ఒకటి మొత్తానికి నేర్చుకున్నావుగా :)

అజ్ఞాత చెప్పారు...

ఇది కేవలం కుటుంబరావులు మరియు కుటుంబమ్మలు కలిసి మా బ్రహ్మీల మీద పన్నిన కుట్రగా మేము భావిస్తున్నాము. బ్రహ్మీలకు బ్లాగ్లోకములో జరుగుతున్న అవమానాలని చూసి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిని ఓదార్చడానికి నేను రేపటినుండి "ఓదార్పు యాత్రను" మా వీధినుండి ప్రారంభిస్తున్నాను. బ్ర.బ్లా.స వర్దిల్లాలి. :) :D

సృజన చెప్పారు...

అద్గది లేడీస్ అంటే....లేకపోతే బొత్తిగా మనమంటే ఏమిటో తెలియకుండా పోయింది నేస్తం:):)

అజ్ఞాత చెప్పారు...

singapooru lo meerekkaduntaaru? mee intikoccho fonu cheso ibbamdi pettamamdee baaboo

Sasidhar Anne చెప్పారు...

Varsham meeda nenu rasina post..
http://sasi-anne.blogspot.com/2010/09/blog-post_17.html

Priya చెప్పారు...

hammayya mi anni post lanu chadivesa.appudeppudo eenadu lo mi gurchi chusi oksari chadiva.hey bavunde anukunna.tharvatha samsara sagaram valla gap.ninna modaletti rathri nidra ratalledu ani naku nene hypnotise cheskuni 2 daka chadivi poddunne ayana office kellagane motham anni posts chadivesa.na childhood days ala kallamundu kadilayi.miru na age ye anukuntanna.

నేస్తం చెప్పారు...

ఆకాశ రామన్న గారు యాత్ర ఎప్పుడు మొదలుపెడుతున్నారో సరి అయిన టైము చెప్తే బ్యూటి పార్లర్లో ఫెషియల్ గట్రా చేయించుకుని, పట్టు చీర కట్టేసుకుని రేడి అయి వచ్చి పచ్చ జండా ఊపుతాను ...పిలవడం మర్చిపోకండే..
మరంతే కదా సృజన బొత్తిగా అంటే బొత్తిగా తెలియడం లేదు..
అఙ్ఞాత గారు అమ్మా..ఆశ దోశ అప్పడం వడ ....మీరేమో పేరుకూడా చెప్పకుండా కామెంటుతారు..నేను మాత్రం చెప్పాలా..ఇదెక్కడి న్యాయం ..
ప్రియ అంచెలంచెలుగా మొత్తానికి నా బ్లాగ్ ని పూర్తి చేసేసారు...బోలెడు థేంక్యూలు

అజ్ఞాత చెప్పారు...

Nestam garu, mee blog regular ga follow avutanu. chala baga rastaru. na pani vathidilo mee tapalu chadivi hayiga navvukunta. Chala Thanks meeku.

Ma amma chelli ki kuda introduce chesa. vallu chadutunnaru ippudu.

mukyamga mee chinnanati gnyapakalu chadivi na anubhavalu kuda gurtutechukunta. oka vidhamga nannu nenu artham chesukotaniki kuda paniki vachayani cheppochu. Veelaite mimmalni osari kalavalani vundi. :)

Manjula

ఆ.సౌమ్య చెప్పారు...

భలే చెప్పారండీ...ఈ బ్ర.బ్లా.స అని ఏమిటో ఒకటే గోల వీళ్ళు. కామెంట్లు రావడం లేదని ఏడుపు. ఇంతా చేస్తే ఇంకో 1-2 యేళ్ళలో భార్యల పక్కన నిలుచుంటారు "జీవితం అంటే ఇంతే నాయనా" అంటూ తత్వం చెబుతారు అప్పుడు. ఈ యేదాది,రెండేళ్ళకే ఓ ఎగురుతున్నారు. ఈ పోస్ట్ తో తిక్క కుదిరింది అందరికీ ;)

Sasidhar Anne చెప్పారు...

@Somya garu - memu " Jeevitham ante inthey nayana" anatanaki karanam evaro cheppandi.. :)

కత పవన్ చెప్పారు...

ఇదేదో నా గురించి నేను చదువుకున్నట్టు ఉంది ..... ........ కంట్రోల్ పవన్ ....
లేదు ..నో ... నహీ ..... ప్రేమ పేళ్ళి అని ఏటువంటి తొక్కలో కమిట్ మెంట్స్ నాకు లేవు ... శభాష్ ..... శాబాష్

నేస్తం చెప్పారు...

మంజుల గారు చాలా చాలా థేంక్స్ .. మీదీ సింగపూరేనా?
సౌమ్యా :D
కత పవన్ గారు అలాగలాగే ,అదీ చూద్దాం :)

పరిమళం చెప్పారు...

నేస్తంగారు ,నేనన్నది టైటిల్స్ వివాదాస్పదం అవుతుంట బ్లాగుల్లో కాదండీ సినిమాల్లో .... :)

చంద్రశేఖర్ కాటుబోయిన చెప్పారు...

naa comment publish kaaledemandi nestham gaaru...edainaa problemaa..?

చంద్రశేఖర్ కాటుబోయిన చెప్పారు...

chaalaa baraa rasaarani telugu lone raasha...entooooo kastapadi..pth..ento..

నేస్తం చెప్పారు...

ఉహు రాలేదండి మీ కామెంట్ .. :(

అజ్ఞాత చెప్పారు...

ledandi vere desam lo vunna. Singapore lo vunte veelundedemo :). mee kotha post kuda bagundandi. ilage rastu vundadni.
Manjula

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారు, మీ బ్లాగ్ చాల బాగుంది , మీరు చెప్పే విధానం చూసి, మీ బ్లాగ్ లో ఉన్న అన్ని పోస్ట్స్ చదివేసాను. ఇది నా ఫేవరెట్ బ్లాగ్. ఆల్ ది బెస్ట్ ..

చందు చెప్పారు...

మీరు బాణం వొదిలాక మళ్ళీ తీసుకున్నా పరవాలేదు కానీ, టపా గుద్ది వెనక్కి తీసుకున్నట్లున్నారు. నేను మీ కొత్త టపా కోసం చేపల చెరువులో కొంగలా చూసి, మీరు టపా వోదిలారని మార్జాలం లా పసిగట్టి, మీ జాజి పూల తోట లో మీ టపా కోసం వెతుకుతూ ఉన్నా. ఇది చాలా అన్యాయం.

David చెప్పారు...

చాలా బాగుంది....మీ తమ్ముడు మంచి పని చేశాడు.నా ఫుల్ సపొర్ట్ మీ తమ్ముడికే

David చెప్పారు...

చాలా బాగుంది....మీ తమ్ముడు మంచి పని చేశాడు.నా ఫుల్ సపొర్ట్ మీ తమ్ముడికే

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

chaala baagundi.............