11, జూన్ 2010, శుక్రవారం

నేనూ-నా సాహసాలు

చేతులకి గోరింటాకు పెట్టేసుకో అన్నంత ఈజీగా మావారు బ్యాంక్ కు వెళ్లి లెటర్ తెచ్చేసేయి అని చెప్పేసి హాయిగా పడుకున్నారు గాని నాకు ఒకటే భయం,ఆలోచనలు.. అక్కడకు ఎలా వెళ్ళాలి?.. సరే, ఏదో రకంగా వెళ్ళినా ఎలా మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి?..నాతో ఒక్క మాట మాట్లాడని సందీప్ గాడిని చూస్తేనే భయం తో త..త్త...త్త, మ..మ్మ..మ్మా అంటున్నా కదా ..ఇంక ఆ జెట్ స్పీడ్ పిల్ల తో ఎలా మాట్లాడాలి??.. పైగా బ్యాంక్ అంటే బోలెడు మంది ఉంటారు..గ్రామర్ తప్పులు మాట్లాడితే అందరూ కోవై సరళను చూసినట్లు చూసి నవ్వుతారేమో ...ఇటు చూస్తే ఈ మనిషి దగ్గర సామ ,దాన ,బేధ ,దండో పాయాలు ఏవీ పని చేసేలా లేవు.. హే భగవాన్ ఏమిటినాకు ఈ పరీక్ష??అని పరి పరి విధంబుల బాధపడిన పిమ్మట ఇక వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను..

ఆ వెంటనే ఆయన్ని లేపేసి ..ఏమండీ ..ఇప్పుడూ.. బ్యాంక్ కు వెళ్ళామనుకోండి.. అక్కడ వాళ్ళను ఏమని అడగాలి అన్నాను ... ఆ.. కాఫీలు తాగారా ..ప్రొద్దున మీ ఇంట్లో ఏం టిఫిన్ వండారు అని అడుగు అని దుప్పటి ముసుగేసారు .. అబ్బా చెప్పండి ..లేక పొతే నేను వెళ్ళను అన్నాను బాసింపట్టు వేసుకు కూర్చుని ..అబ్బా..నాకెక్కడ దొరికావే..నిద్ర పోనివ్వవు ..ఇందాక చెప్పాను గా ... అదే ..మీ బ్యాంక్ నుండి నిన్న ఎవరో అమ్మాయి నాకు ఫోన్ చేసింది.. ఏదో లెటర్ పంపారట ...మా వారి మాటలకు అడ్డు తగులుతూ .. ఉహు ..హు .. ఇంగ్లీష్ లో చెప్పండి అన్నాను శ్రద్దగా వింటూ ... సరే ..వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ కాల్డ్ మీ ఎస్టర్ డే ....................మావారు చెప్తుంటే జాగ్రత్త గా వినడం మొదలు పెట్టాను.. అయిపోగానే అహ..హా ఇందాక సరిగ్గా వినలా ..ఇంకోసారి చెప్పండి అని ఓసారి..ముచ్చటగా మూడో సారి ..ఇదే ఇదే లాస్ట్ సారి అని బోలెడు తిట్ల మధ్య ఆయన చెప్పింది జాగ్రత్త గా విని ఆ రాత్రంతా నిద్రలో కూడా 'వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ '.. 'వన్ ఆఫ్ యువర్'.. అంటూనే నిద్ర పోయా..

ప్రొద్దున లేవగానే ఆఖరి ప్రయత్నంగా గార ,నయగారాలు చూపబోయాను కాని అక్కడున్నది ఎవరూ.. మా ఆయన .. నోరుమూసుకుని తీసుకురా అని ఆఫీస్కి వెళ్ళిపోయారు.. చేసేదేమీ లేకా దేవుడా నువ్వే దిక్కు అని తయారయ్యి పేపర్ మీద మా ఇంటి అడ్రెస్సు, బయట తప్పి పొతే కాల్ చేయడానికి చిల్లర నాణాలు గట్రా గట్రా సరంజామాతో బయటకు వచ్చాను.. పట్టపురాణికి మల్లే నా ఏకాంత మందిరాన్ని వదిలి బయటకు రాని నేను అలా వేళగాని వేళలో ఒక్కదాన్నే బయటకు వెళుతుంటే మా ఇంటి ఓనరు ,సందీప్ గాడు దెబ్బకి షాక్ ... ఎక్కడికి? అంది మా ఓనర్ ...నాకు కొంచెం ఆనందం వేసేసింది ...బ్యాంక్ కి వెళుతున్నా అన్నాను స్టైల్ గా ... ఒక్కదానివేనా? దారి తెలుసా అంది ఆక్చర్యంగా ... ఓ ..యా ... అది పెద్ద విషయం కాదు .. MRT లో టాన్జుంగ్ పాగార్ వెళ్లి ,కేపిటల్ టవర్ మీదుగా స్ట్రైట్ గా వెళ్ళడమే..సింపుల్ ... ఫోజుగా అంటూ క్రీగంట వాళ్ళను చూస్తూనే టకటక బయటకు వచ్చేసి లిఫ్ట్ అద్దం లో నా మొహం చూసుకుని ఛీ..ధూ నీకిది అవసరం అంటావా .... అని సత్కరించుకున్నా..

బయటకు వచ్చానే గాని ఎలా వెళ్ళాలి ? దేవుడా..దేవుడా.. అని అలా నడవడం మొదలు పెట్టాను.... తెలియదు తెలియదు అనుకుంటున్నా గాని రోజూ అటే వెళుతుండటం వల్ల బాగానే దారి తెలిసినట్లు అనిపించింది ...మెల్లిగా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసా ..బయట చిన్న చిన్న పిల్లలు చారిటీ ఇవ్వమని డిబ్బీలు చూపుతున్నారు.. డబ్బులు వేస్తే ఒక స్టిక్కర్ ఇస్తున్నారు ..అంటే ఇంకెవ్వరు చారిటి అడగరు అది అంటిన్చుకుంటే... ఇక్కడ స్కూల్ పిల్లలు ఇటువంటి కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటారు .. లోపలికి వెళ్ళగానే ఎదురుగా సిగరెట్టు కాల్చడం ,ఆహారం తినడం , డురియన్ అనే ఫ్రూట్ తీసుకువెళ్ళడం గాని చేస్తే జరిమానా అని బోర్డ్ ఉంది ... అవన్నీ నాదగ్గర ఉన్నాయేమో అని చెక్ చేసుకున్నా ..లేవు..

అన్నట్టు డురియన్ ఫ్రూట్ అనగానే చిన్న విషయం గుర్తొచ్చింది ..మన పనస పండులా ఉండే దీన్ని సింగ పురియన్స్ ఎంత ఇష్టపడతారో ,ఇండియన్స్ అంత దూరం పారి పోతారు ..ఎందుకంటే దీని స్మెల్ చూడగానే వికారం,తలనెప్పి వచ్చేస్తుంది అట ...నేనసలే ఎలాంటి దాన్ని అంటే బెంజి కారు ఎక్కించినా వేక్...వేక్ మని డోక్కుంటా... 'కేబ్ ' ఎక్కే విషయం లో నాకు ,మా ఆయనకు కాంతారావు కత్తి యుద్దమే.. ఇదంతా విని నేను ఆ పండు చూడగానే కెవ్వున అరిచి పారిపోతాననుకున్నారా ..హి హి హి అక్కడే డురియన్ పైన కాలు వేసారు ..నాకు ఆ పండు అంటే మహా ఇష్టం .. అదేంటో మావారు బాబోయ్ ,అమ్మోయ్ అని కర్చీఫ్ ముక్కు కు అడ్డం పెట్టుకుని తెగ కష్ట పడిపోతుంటారా ..నేనేమో ఎంచక్కా రెండు పేకేట్స్ కొనుక్కుని తింటూ మరీ ఇంటికొస్తా.. ఇదిగో అలా అసహ్యం గా చూస్తే నేను తరువాత కధ చెప్పనంతే ..


సరే స్టేషన్ కంట్రోల్ దగ్గర కార్డ్ పెట్టి తలుపులు తెరుచుకోగానే లోపలికి వెళ్ళాను... ట్రైన్ ఎక్కే ప్లేస్ దగ్గర అటు ,ఇటు మేప్ లు ఉన్నాయి ..'బూన్ లే' వైపు ఎక్కవలసిన ట్రైన్ ఎక్కాను గాని..కరెక్టేనా అనుకుని నెక్స్ట్ స్టాప్ 'తానామెరా' ఎనౌన్స్ చేసేవరకు భయం భయంగా విని హమ్మయా అనుకుని ఊపిరి పీల్చుకున్నా ...అప్పట్లో ఇండియన్స్ చాలా తక్కువ ఉండేవారు ..ఇప్పుడూ ఎటు చూసిన వారే అనుకోండి.. ఇక్కడి చైనా వాళ్ళు చిన్నపిల్లలగా ఉన్నపుడు ఎంత బాగుంటారో ...కాని అదేంటో పాపం పెద్ద అవ్వగానే చపాతికి కళ్ళు,ముక్కు అతికించినట్లు తప్పడిగా అయిపోతారు.. కాని తలవెంట్రుకల నుండి ,కాలి గోళ్ల వరకు ఎంత శ్రద్ద తీసుకుంటారో ...

అలా ట్రైన్ లో నుండి బయట కు త్రొంగి చూస్తుంటే భలే అనిపించింది.. ఈ దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఒక్కలాగే ఉంటుంది ... ఫలానా వూరు ఎక్కువ ,తక్కువ అని ఉండదు ... ఈ లోపల ఒక ముసలావిడ నా ఎదురుగా వచ్చి నించుంది.. ఇక్కడ రూల్ గుర్తు వచ్చి లేచి సీట్ ఇచ్చేసా.. నాకేంటో చాలా గొప్ప పని చేసేసా అన్న ఫీలింగ్ వచ్చేసింది ... ఈ లోపల బయట అంతా చీకటి పడిపోయింది ..అంటే అండర్ గ్రౌండ్ లో కోచ్చేసాం అన్నమాట ....మళ్లీ 'వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ ' అని పాఠం అప్పచేప్పుకున్నా కాసేపు ... నేను దిగవలసిన ప్లేస్ రాగానే దిగిపోయాను .. బయటకు రాగానే మావారు 'కేపిటల్ టవర్' ఎటో అడగమన్నారు కదా అని గుర్తు వచ్చింది ..మెల్లిగా అటు వెళుతున్న అబ్బాయిని 'కేపిటల్ టవర్ ' అన్నాను.. గో స్ట్రయిట్ అన్నాడు చిన్నగా నవ్వి ..

ఇక్కడ ఇంగ్లీష్ విషయం లో అనవసరంగా భయపడ్డాగాని నిజానికి సింగపూర్ లో వాడేది ఎక్కువగా సింగ్లీష్ ... ఇంగ్లీష్ భాషాభిమానులు ఎవరైనా ఉంటే ఈ పేరా వదిలేసి చదవండి..ఆనక తట్టుకోలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నాది పూచి కాదు ... సింగ్లీష్ అనేది పూర్తిగా నాలాంటి వాళ్ళకోసం ప్రత్యేక శ్రద్ద తో రాసినది.. ఇప్పుడు నువ్వు డిన్నర్ తిన్నావా ? అని అడగాలనుకోండి ..మన ఇంగ్లీష్ లో అసహ్యంగా 'డిడ్ యు హేవ్ యువర్ డిన్నర్' అని ఇంత గ్రామరేసుకుని అడుగుతామా.. అదే సింగ్లీష్ లో అయితే 'డిన్నర్ ఫినిషా ' అని సింపుల్గా అనేస్తాం అన్నమాటా.. అదొక్కటేనా' యు గో వేరా' ? 'ఈట్ ఎ రెడియా '? డూ వాట్ ఆ ? అబ్బో ఇలాంటివి చాలా ఉన్నాయి..గ్రామర్ గట్రాలు పీకి పడేసి చివర్లో 'ఆ'లు ... 'లా'లు పెట్టేస్తే సరిపోతుంది..మొత్తం సింగపూర్ అంతా 'కెన్'.'.కేనాట్ 'ల పై ఆధార పడి ఉంటుంది ..ఓ సారి మా తోడికోడలు ఏదో డ్రెస్ కొని 'ఈజ్ ఇట్ వాషబుల్' అంది .. పాపం పది సార్లు చెప్పినా వాడికి అర్ధం కావడం లేదు .. నన్ను పిలిచి విషయం చెప్పగానే 'వాషింగ్ కెన్నా' అన్నా అంతే కెన్ లా ,కెన్ లా అని ఆనందం గా చెప్పాడు.. పాపం ఇంత చక్కని భాషను వద్దు అని ఇక్కడి ప్రభుత్వం ఇంగ్లీషే మాట్లాడమని ప్రజలను వేపుకు తింటుంది ..హేమిటో


సరే అలా 'కేపిటల్ టవర్ ' మీదుగా వెళుతుంటే ఒక చోట బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ కనబడింది ...అప్పటివరకు మర్చిపోయిన భయం మళ్లీ కౌగలించుకుంది ... లోపలికి వెళ్ళగానే చాలా మంది అనేక కౌంటర్ ల దగ్గర నిలబడి ఉన్నారు.. అక్కడే నించుని కాసేపు ధైర్యం చెప్పుకుంటుంటే ఒక ఆమె పిలిచి ఎస్ ,వాట్ కెన్ ఐ డూ ఫర్ యు మేడం అంది ... అంతే మళ్లీ మర్చిపోతానేమో అని రాత్రి నేర్చుకున్న పాఠం టక టక టక అప్పచెప్పేసాను.. మరి ఏమనిపించిందో ఆమెకు అర నిమిషం నావైపు చూస్తూనే ఉంది.. ఇంకేం అడక్కే బాబు అని దీనం గా చూసాను .. ప్రక్కనే ఉన్న లెటర్ తీసి నా చేతిలో పెట్టింది మారు మాట్లాడకుండా..దేవుడా ! గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇంకో మాట మాట్లాడే అవకాశం ఆమెకు ఇవ్వకుండా బయటకు పరుగో పరుగు ...

తరువాత చేతిలో లెటర్ చూసుకుని ఒకటే ఆనందం...కళ్ళ లో నీళ్ళు వచ్చేసాయి ..చిన్నపుడు పెన్సిల్ ముక్క కొనాలన్నా నా ఫ్రెండ్ ని ముందు పెట్టి నువ్వు అడుగు, నువ్వు అడుగు అని వెనుక నిన్చునేదాన్ని ..అలాంటి నేనేంటి ?,ఇంత దూరం రావడం ఏమిటి,?ఇలా ఒక్కదాన్నే పని పూర్తి చేయడమేమిటి?? దారంతా నవ్వేసుకుంటూ ,ఎగురుకుంటూ స్టేషన్ కొచ్చేసాను.. అక్కడ ఫోన్ లు చూడగానే ..ప్రొద్దున నన్ను మావారు పెట్టిన నస గుర్తువచ్చి కోపం వచ్చేసింది ..అందుకే మా ఆయన్ని ఏడిపించాలనిపించింది .. ఏమండీ..నేను తప్పిపోయాను ..ఎక్కడున్నానో తెలియడం లేదు ... అని ఏడుస్తూ ఇంకో ముక్క మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేసి ఒక పది నిమిషాల తరువాత కాల్ చేసి చెప్దాం అని ఫోన్ దగ్గరకు వెళ్లాను.. కానీ!! హుమ్..అసలే ఆఫీస్లో చాలా బిజీగా ఉంటున్నా అంటున్నారు ..ఇప్పుడు ఇలా చెపితే టెన్షన్ పడిపోతారేమో ..పాపం లే అనిపించి నిజం చెప్పేసా ...


అదేమరి ... ఇంత సున్నిత మనస్కులు అయితే ఎలా అండి... వెళ్లి కళ్ళు కడుక్కుని రండి ..ఇలాంటి త్యాగాలు నేను చాలానే చేసాను ...మళ్లీ వీలున్నపుడు చెప్తానే :)

94 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

hey nestham could please change the background template, it very hard to read.

I am the first

హరే కృష్ణ చెప్పారు...

నాది ఎన్నో కామెంతో
తాప 5 లో ఉంటే పండగ చేసుకుంటాం

Haritha చెప్పారు...

post chadavala nade 1st commentna

హరే కృష్ణ చెప్పారు...

ఏకబిగిన చదివించేసారు నేస్తం
పోస్ట్ కేకో కేక

Sravya V చెప్పారు...

మీరు సహసవంతులే ఓఓఓఓ బ్యాంకు కెళ్ళి పని చక్క పెట్టినందుకని ఫీల్ కాకండి, కానే కాదు దురియన్ తింటారు గా అందుకు . ఓమ్మో నాకు దాని వాసన చూస్తూనే యాక్ ! మీ ఫీలింగ్స్ హర్ట్ చేస్తే సారీ :(

నాగేస్రావ్ చెప్పారు...

చివరికి బ్యాంకులో సీను తేల్చేశారనిపించింది. అలా అని మీకు కష్టాలు రావాలని కోరుకోవటం లేదులెండి.

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ చెప్పారు...

చాలా బాగుంది.

ఈ సారి first comment నాదే :-) .

Haritha చెప్పారు...

"అంతే మళ్లీ మర్చిపోతానేమో అని రాత్రి నేర్చుకున్న పాఠం టక టక టక అప్పచెప్పేసాను.. మరీ ఏమనిపించిందో ఆమెకు అర నిమిషం నావైపు చూస్తూనే ఉంది.." papam tamari english dimma tirigi mind block ai untudi... y bcoz.. u canna spek wel singlish.. ameki teliduga batti english ani... superrrrrrrrr. english matter naku todu unnaru tamaru... naku full happieeeeeeeeees

Haritha చెప్పారు...

adagatam marchipoya illu dorikinda??

నిషిగంధ చెప్పారు...

"వాషింగ్ కెన్నా?"

:))))

అమ్మో.. పొట్టనొప్పి వచ్చేసింది నేస్తం, నవ్వలేక..
అసలు ఈ టపా మొత్తం టూ టూ మచ్ గా నవ్వించేసిందండి :-)

పరదేశంలో ఉన్నప్పుడు ఇలా మొట్టమొదటిసారి చేసిన పనులన్నీ ఎప్పటికీ మర్చిపోలేము కదా.. నేను మొదటిసారి ఒక్కదాన్నే ఎయిర్ పోర్ట్ కి డ్రైవ్ చేసుకెళ్ళి గెస్ట్స్ ని తీసుకొస్తూ విజయవంతంగా దారి తప్పిన సంగతి ఇప్పటికీ మావారు కధలు కధలుగా చెప్తారు..

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం గారూ.. సూపర్ గా ఉంది ఈ పోస్ట్. గొప్ప పోస్ట్ లు రాయడం ఎలా అని మీరు బుక్ రాసెయ్యొచ్చు.

' ఎక్కే విషయం లో నాకు ,మా ఆయనకు కాంతారావు కత్తి యుద్దమే..
మళ్లీ 'వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ ' అని పాఠం అప్పచేప్పుకున్నా కాసేపు
అదొక్కటేనా' యు గో వేరా' ? 'ఈట్ ఎ రెడియా '? డూ వాట్ ఆ ? అబ్బో ఇలాంటివి చాలా ఉన్నాయి
ఇలా రాసుకుంటూ పోతే మీ పోస్ట్ మొత్తం కాపి పేస్ట్ చెయ్యాల్సి వస్తుంది..

క్షమించాలి.. మీ టెంప్లేట్ అంత బాగలేదు.. : ( :(

ఇట్లు మీ హార్డ్ కోర్ ఫాన్
రాజ్ కుమార్

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నేస్తం గారూ...టపా గుడ్ కెన్(అంటే బారాసారని..సింగ్లిష్)..ఐ రీడ్..లాఫింగే లాఫింగు..మీ ఆఫీస్..నో సీ అరౌండ్..పీపల్ థింక్ ఐ మేడ్...(అఫీస్లో చుట్టూ జనాలు ఉన్నారని కూడా చూడకుండా నవ్వేస్తే వాళ్ళు నాకు పిచ్చెక్కిందనుకున్నారని అర్ధం)

ఇప్పుడు చెప్పండి..ఉన్నపళాన నేను సింగపూర్ వచ్చేస్తే బతికేయగలను కదా!! :-)

అజ్ఞాత చెప్పారు...

మిమ్మల్ని చుస్తే జాలి వేస్తుంది. ఇంత సుకుమారంగా ఏ కష్టం తెలీకుండా పెంచారు మీ వాళ్ళు.
వామ్మో ఇపుడు ప్రపంచం లో ఇలా ఉంటె చాల కష్టం. ఎప్పుడు జీవితం తో పోటి పడితే తప్ప బతకలేని ప్రపంచం. అలంటి ప్రపంచం మీరు ఎలా ఉన్నారు ఇన్నాళ్ళు ;) చాల గ్రేట్ . miru అబ్బాయి అయి ఉంటె ఇక అంతే సంగతులు అమ్మాయి అయి undi bathikipoyaru :) అబ్బాయి ga pudithe మీరు inkemina unda okasari alochinchandi appudu మీరు em chesevaaru business aa leka job aa , baga kashtapadi chadive valla , business chesevalla మీ family kosam. apudu mire మీ wife ni bayatiki thippali , appudu మీ wife vidni enduku chesukunnara babu annitiki bayapaduthu untadu ani anukunedemo . andukenemo devudu మిమ్మల్ని ammayiga puttincharu ;)
మీ abhimaani
సురేఖ

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అన్నట్టు మీ టెంప్లేట్ బాలేదండీ..చదువుతున్నప్పుడు కంటికి పచ్చకామెర్లు వచ్చాయేమో అన్నట్టు ఉంది. :-):-)

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు! నవ్వించడంలో మీ తరువాతే ఎవరైనా!
ఈ సింగ్లిష్ ఐతే నాకు కొట్టిన పిండి అండి.. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి.
పాత టెంప్లేట్ బాగుందిగా! ఇది ఎందుకు మార్చారు.

మాలా కుమార్ చెప్పారు...

మీ సాహసాలు బాగున్నాయండి .

Ram Krish Reddy Kotla చెప్పారు...

:)...మొత్తానికి కార్యసాధకులు అనిపించుకున్నారు ఎలాగైనా...గుడ్.. ఏదీ మళ్ళీ చెప్పండి ఓ సారీ "వన్ ఆఫ్ యువర్ బ్యాంక్ పీపుల్ కాల్డ్ మీ ఎస్టర్ డే ............".... చెప్పండీ....ఆరే పర్లేదు చెప్పండీ...అయ్యూ ఏంటండీ మరీ ఇలాగా...అదీ...అలా చెప్పాలి...ఏది ఇంకోసారి చెప్పండి ...ఆ ... :-)

sunita చెప్పారు...

hahaha! english maatram super!!

పవన్ కుమార్ చెప్పారు...

డిన్నర్ ఫినిషా, డూ వాట్ ఆ కేకొ కేక
మీలాంటి త్యాగమయి వందకు ఒక్కరు ఉంటె చాలండి ఒక్కరు ఉంటె చాలు
ఇంతకీ ఇల్లు సర్చింగ్ డన్నా

Mahitha చెప్పారు...

hmm...

baaga raasaru :)

అజ్ఞాత చెప్పారు...

Actually I thought there is a twist to the story. The paper you brought home is a counter foil for withdrawing money and you found it ONLY after you came home. Did you really bring the actual paper required? :-)

నేస్తం చెప్పారు...

ప్రసన్న గారు అదే ...మరి ... నిన్న గాక మొన్న ఈ టెంప్లెట్లతో నానా బాధ పడ్డానా అయినా సరే బుద్దిలేదు నాకు క్రొత్త టెంప్లెట్ చూడగానే మనసాగక మళ్ళి ఇలా అన్నమాట..ఈ సారికి క్షమించేయండి..
హరే క్రిష్ణా థేంక్యూ
హరిత :)ఇల్లు ఈ నెల ఆఖరిలో మారాలి అండి ఇంక ఎక్క చెక్క పని నాకు ..పేక్ చేయడం.. సర్ధడం ..
శ్రావ్య అబ్బే లాభం లేదు.. నీకోసారి తినిపించాల్సిందే..ఎంత స్వీట్గా ఉంటుందో తెలుసా :)
నాగేస్రావ్ గారు అమ్మో ఎటువంటి ట్విస్ట్లు జరిగినా నా పని అంతె.. ఎదో దేవుడిదయవల్ల అలా కధ సుఖాంతం అయిపోయింది..
బ్రహ్మి గారు థేంక్యు

నేస్తం చెప్పారు...

రాజ్ కుమార్ .. థెంక్యూ ..ఇంక టెంప్లెట్ అంటారా.. పని మనగలి పిల్లి తల గొరికాడని .. కొద్దిగా సరిపెట్టెసుకోండి ఈ సారికి...త్వరలో మారుస్తా
నిషి చాలానాళ్ళ తరువాత చూసాను మిమ్మల్ని .. అంటే మీరు నాలాగా ఎంచక్క తప్పి పోతారన్నమాట :)
శేఖర్ కెన్ కెన్ .. యు కెన్ కం లా ..:) ఇంత సూపర్ మాట్లాడుతుంటే మళ్ళా డవుటెందుకు :)
సురేఖ నిజమే మరీ గుప్పెటలో పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నాను..అయితే మా ఇంట్లో మా తమ్ముళ్ళు ( పెద్దమ్మ ,పిన్ని పిల్లలు) కూడా నా మాదిరే పెరిగారు..కాకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా చక్కగా సెటిల్ అయ్యారు ..కాని మరీ రాముడు మంచి బాలుడు రేంజ్ లో ఉంటారన్నమాట :)
సవ్వడి.. సింగ్లీష్ లో డవుట్లు రావు.. అదేమన్నా ఇంగ్లీష్ ఏమిటీ .. మాట్లాడేయడమే అలా ..:)
మాలగారు థేంక్యూ

నేస్తం చెప్పారు...

కిషన్ అలా అని అని ఇప్పటి కొచ్చి ఆ ముక్కలు మర్చిపోలేదు..ఇంకానా :)
సునీతా థెంక్యూ
పవన్ మరి అంత ఎమొషనల్ గా ఫీల్ అవ్వద్దు ..నాకు డవుటొచ్చేస్తుంది నిజంగా నేను అంతటిదానినేమో అని ..ఇంక సెర్చింగ్ ఫినిషే రెడి.. దిస్ మంథ్ ఎండింగ్ కెన్ మూవ్

అజ్ఞాత చెప్పారు...

matter ki tagga bommanu petaledem

Shiva Bandaru చెప్పారు...

ఎప్పటిలానే చాలా బాగుంది

Padmarpita చెప్పారు...

బాగుందండి....మిగిలిన సింగపూర్ సాహాసాలు చదవడానికి వెయిటింగ్ నేస్తం:):)

Vasu చెప్పారు...

పోస్ట్ లైక్. టెంప్లేట్ - నో లైక్
మా చేత సింగపూర్ యాత్ర చేయిన్చేస్తున్నారు. ఇంకో నెల ఐతే నేను సింగపూర్ లో ఎక్కడ ఏమున్నాయో, ఎలా వెళ్ళాలో చెప్పేయ గలుగుతాను.

సాధారణ విషయాలు భలే అందంగా రాస్తున్నారు, హృద్యంగా చెప్తున్నారు. బావుంది. నేను రెగ్యులర్ ఐపోయాను మీ బ్లాగ్ కి.

mahipal చెప్పారు...

Hai nestam garu

Ellavunnaru! Koncham ma avidaki kuda mela trining ivvara,entha manchivaro meru,tyagarani.ma avida nanau appadapudu elane edipisthundhi....bayatiki vellamate ammo bayam antundhi... intlo okkadhanii ani bore fell avuthundhi! Koncham idea chepparu...
where get house? evrything goodaa...last month we change ready house to jurong east.. naku chebithe ma ille ichesevallam kada... ma avidithe mimulani puvvulo petti chusukundiii.......

ika final ga ee tapa kuda bagundhi....ante chinaga untunadhemo.....andhuke vera vera vera vera vera vera vera ------------------------------------------- bagundhi...

సవ్వడి చెప్పారు...

ee template caalaa baaguMdi. mari maarcakaMDi.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

baagundi

నేస్తం చెప్పారు...

మహి థేంక్యూ..
అఙ్ఞాత గారు అదే రాయడం మర్చిపోయా నిన్న ఏదో పరాకులో .. లెటెర్ తెచ్చేసా అని గెంతులేసా కాని అసలు అదేనా కాదా అని మాటవరసకు ఓపెన్ కూడా చేయలా.. ఇంటికొచ్చాకా మావారికి నేను ఎలా వెళ్ళి తెచ్చానో కధలు కధలుగా చెప్తుంటే ఇంతకి కరెక్ట్ దే తెచ్చావా అన్నారు మావారు.. అప్పుడు భయం వేసింది.. ఆ కోణంలో ఆలోచించనందుకు.. కాని కరెక్టే తెచ్చాలెండి.. అన్నట్లు ఇలా అఙ్ఞాతలుగా ఇచ్చేపదులు చివర్లో మీ పేరు రాయచ్చుకదండి .. ఎవరై ఉంటారబ్బా అని అనుకుంటూ ఉంటా అఙ్ఞాత కామెంట్స్ చూసి ..

మరో అఙ్ఞాత గారు ..ఏంటోనండి నిన్న అసలు మూడ్ లేదు..దానికి తోడు టెంప్లెట్ లు చూస్తూ కూర్చున్నానా..అంతే బొమ్మ పెట్టే ఓపిక లేదు ..సరే తరువాత చూద్దాం లే అని పెట్టలేదు ..:)

నేస్తం చెప్పారు...

శివ థెంక్యూ :)
పద్మ :) అలాగలాగే తప్పకుండా రాస్తాను
వాసు ఎందు చేతనో నాకు ఈ టెంప్లెట్స్ కీ ఈ మద్య అస్సలు పడటం లేదు .. కొన్నాళ్ళు ఓపిక పడితే మీరన్నా అలవాటు పడిపోతారు ..నేనన్నా క్రొత్త ప్రయోగం చేసి మార్చేస్తాను :)
మహిపాల్ ..ఏం చేస్తామండి.. కాలమే అన్నీ నేర్పుతుంది..మీ శ్రీమతిగారికి కూడా :)
ఓ జురాంగ్ ఈస్ట్ నా మీరు ఆవైపు ఉంటే మేము ఈ వైపు ఉన్నాం..ఏం ఇళ్ళోనండి బాబు విరక్తి వచ్చింది..చివరకు JTC తీసుకున్నాం :)
సవ్వడి :)
వినయ్ చక్రవర్తి థేంక్యూ :)

అజ్ఞాత చెప్పారు...

ఇంకేం అడక్కే బాబు అని దీనం గా చూసాను ..
SUPER..

టపా బాగుంది.
అయినా మీ సింగపూర్ టపాలకన్నా ఇండియా టపాలే బాగుంటాయి.

మంచు చెప్పారు...

)

అజ్ఞాత చెప్పారు...

nestam garu me tapalu chaduvutunapudala ankuntanu evida life lo kathalu ga chepukodaga situations eni unaye ani
apatnundi nalife lo chepukodagavemana unaya ani alochistu una
okati idea ravatledu
enthaina prati sanivesana oka tapa ga rayagala talent mike undi ankuna

Sirisha చెప్పారు...

hmm...mee post kosam choosi choosi alasipotunna....template bagundi andi...

అజ్ఞాత చెప్పారు...

ఇందాక సగమే కామెంటాను.

ఏమిటి "తూరుపు సంధ్యారాగం" సినిమా చూపిస్తున్నారా?

manasa చెప్పారు...

:))

Unknown చెప్పారు...

singlish concept super nestham.. :)
ayina enni sahasalu chesasarandi... :D
mimmalni bravery award ki nominate chestunna... ok..na??

నేస్తం చెప్పారు...

బోనగిరిగారు కదా.. నాకు అలానే అనిపిస్తుంది కాని ఇండియాలో గుర్తున్న విషయాలు మేక్జిమం రాసేసా :)తూర్పు సంద్యా రాగం అంటారా :) అలాంటిదే అనుకోండి :)
మంచు పల్లకి గారు ఏమిటా బ్రాకెట్ ఒక కళ్ళు లేవు,ముక్కు లేదు ..మీరు ఏమి అన్నారనుకోవాలి నేను :)
అఙ్ఞాత గారు అందరి లైఫ్ లో ఉంటాయి ఇలాంటి సంఘటనలు.. కాకపోతె సాగదీసి చెప్తా అంతే నేను :) ఇప్పుడూ నేను ఒక్కదాన్నే సింగపూర్లో బ్యాంక్ కి వెళ్ళి లెటెర్ తెచ్చాను అనే సింపుల్ విషయాన్ని చూసారా ఎంత సోది ఇర్కించానో ..అదన్నమాట:)
మానస :)
కిరన్ bravery award ఆ నాకు భయం బాబు :)

Rajendra Prasad(రాజు) చెప్పారు...

సింగ్లీష్ బాగుంది,
>>క్రీగంట వాళ్ళను చూస్తూనే టకటక బయటకు వచ్చేసి లిఫ్ట్ అద్దం లో నా మొహం చూసుకుని ఛీ..ధూ నీకిది అవసరం అంటావా .... అని సత్కరించుకున్నా...
ఈ సీను లో మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తలచుకొని తెగ నవ్వుకున్నాను....ఏమి అనుకోకండే.....!!!!

Rajendra Prasad(రాజు) చెప్పారు...

మీరు కర్రెక్ట్ పేపెర్స్ తెచ్చారో అన్న దానికి జవ్వబు నాకు మీ కామెంట్స్ లో దొరికింది....
ఈ రోజు ఆదివారం ఐనా ఏదో పని ఉంది రమ్మన్నాడు మా మేనేజరు..... విసుగ్గా వచ్చిన నాకు మీ టప స్వాగతం పలికింది. ఇప్పుడు ఇక పని చేసుకుంటాను అండి .... :)

నేను చెప్పారు...

నేను మీ టపా చదవలేదు
background/ template చాలా బావుంది
అలా చూస్తూ ఉండిపోయాను, లేత చిగురాకులంటే నాకు చాల ఇష్టం అవి text ని dominate చేయకుండా light shade లో చలా బాగున్నాయి.

నేస్తం చెప్పారు...

శిరీషా :) ఈ మద్య రొంబ రొంబ బిజీ అన్నమాట.. అందులోను ఒకసారి పెళ్ళి అయ్యింది అంటే బోలెడు బాధ్యతలు పుట్టుకొస్తాయిగా ...అందుకే వీలున్నపుడు రాస్తున్నా:)
రాజేంద్ర ప్రసాద్ ఆదివారం కూడా ఆఫీస్ కి వెళ్ళారా :) పోస్ట్ నచ్చినందుకు థెంక్స్ :)
నేను టెంప్లెట్ నచ్చినందుకు థేంక్స్ అండి :)

నేస్తం చెప్పారు...

శిరీషా :) ఈ మద్య రొంబ రొంబ బిజీ అన్నమాట.. అందులోను ఒకసారి పెళ్ళి అయ్యింది అంటే బోలెడు బాధ్యతలు పుట్టుకొస్తాయిగా ...అందుకే వీలున్నపుడు రాస్తున్నా:)
రాజేంద్ర ప్రసాద్ ఆదివారం కూడా ఆఫీస్ కి వెళ్ళారా :) పోస్ట్ నచ్చినందుకు థెంక్స్ :)
నేను టెంప్లెట్ నచ్చినందుకు థేంక్స్ అండి :)

Unknown చెప్పారు...

Template బాగావుంది అండీ, change చేసినందుకు థాంక్స్, text ని dominate చేయకుండా చాలా బాగుంది

ఐతే Templates తో మీ experience మీద కూడా ఒక్క పోస్ట్ expect చేయచ్చు ;)

శివరంజని చెప్పారు...

templet superb...బాంక్ లో కాఫీలు తాగారా ..ప్రొద్దున మీ ఇంట్లో ఏం టిఫిన్ వండారు అని అడిగావా అక్కా ? అడిగే వుంటావు కదా... మర్యాద ఇవ్వడం లో మా అక్కకి సాటి ఎవ్వరు లేరు

Sasidhar Anne చెప్పారు...

inthaki aaa bank ammayi.correct paper ee icchindha akkaa...
Post Super.. Chadavatam two days late ayyindhi..

నేస్తం చెప్పారు...

ప్రసన్న అంతే అంటారా :)
శివరంజని ...అలా ఉంది మరి నేను అంటే ఆయ్
శశిధర్ ఆ కరెక్టే ఇచ్చింది ..మంచి అమ్మాయి పాపం

శ్రీనివాస్ చెప్పారు...

ఓ టెంప్లేట్ చేంజా? యు కెన్ డు ఇట్టా ?

priya చెప్పారు...

dhairye saahase letter..........mottaniki sadinchaarandi ...inka singapore mottam dunneyadame taruvayi anukunta:)
postlu konchem tvaraga post chedduru pl...

అజ్ఞాత చెప్పారు...

Mee Posts Superr andi..

Sai Praveen చెప్పారు...

పోస్ట్ చదివి చాలా రోజులు అయింది కాని అప్పుడు కామెంటడం కుదరలేదు. తరవాత మర్చిపోయాను. :(
చాలా బావుందండి. అప్పుడు తెచ్చిన కవర్ సరి అయినదేనా అని అడగాలి అనుకున్న. దానికి సమాధానం ఆల్రెడీ దొరికేసింది :)

నేస్తం చెప్పారు...

శ్రీనివాస్ యాలా ...కెన్ ..కెన్ ....
ప్రియ సింగ పూర్ ఏముందిలెండి గుప్పెడు దేశం ... ఎలాగైనా వెళ్ళిపోవచ్చు.. ఇక్కడ సౌకర్యాలు అలాంటివి.. కాకపోతె బద్దకం గా ఉన్నపుడు నాకు తెలియదని మొండికేస్తాను.. :)
అజ్ఞాత గారు థేంక్స్ అండి
సాయి ప్రవీణ్ :)

శ్రీనివాస్ చెప్పారు...

యాలా ఏంటి అదేదో తిట్టులో మొదటి అక్షరం మిస్ అయినట్టు ?

నేస్తం చెప్పారు...

రామచంద్ర ప్రభో !ఎంత మాట..లా అనేది ఇక్కడ ఫ్రెండ్లీగా పెడతారు ..యా లా ..నో లా అని .. అంతే గాని మరొక అర్ధం పరమార్ధం లేదు బాబు :)

శ్రీనివాస్ చెప్పారు...

ఏంటో నా పేరు మీ తమ్ముడి పేరు ఒకటే అవడం వల్ల ఇలా మీ మాటలు వక్రీకరించ బడుతున్నాయి అదన్న మాట

నేస్తం చెప్పారు...

అనుకున్నలే శ్రీనివాస్ ..ఇంకా ఏమీ అనడం లేదేంటా అనుకున్నా... :)

హను చెప్పారు...

chala sahasaale chesaru meeru,,,

..nagarjuna.. చెప్పారు...

కంగ్రాట్స్ నేస్తంగారు..,పరాయి దేశంలో మీరు చేసిన సాహసాలకు, త్యాగాలకు మెచ్చి భారత ప్రభుత్వం మీకు సాహసనారి అవార్డు, ఉత్తమ త్యాగశీలి అవార్డు బహూకరించాయి. అవార్డులు కావాలంటే మీరు CRT నుండి straightగా వెళ్లి, బిజినెస్ టవర్స్ నుండి కిందకు దిగి క్యాబ్‌లో పది మైళ్లు తిరిగి రోడ్డు మీద ఎడం పక్కన డురియన్ పళ్ల దుకాణం పక్కనున్న బ్యాంక్‌కు రాగలరు. డూ అండర్‌స్టాండా..

శ్రీకర్ బాబు చెప్పారు...

మేడం, ఇంతకీ ఆ పాఠం ఇప్పుడు గుర్తుందా ? అదే One of your bank people.....

నేస్తం చెప్పారు...

hanu :)
హహా .. నా పోస్ట్ ఎమోగాని మీ వ్యాఖ్య మాత్రం భలే ఉంది చారిగారు ( మరి నన్ను అంటే ఊరుకుంటానా ..మీ పేరు ఇదే ఖాయం చేసేస్తా)
శ్రీకర్ గారు ఎంచక్కా గుర్తుంది ..నిద్రలో లేపి అడిగినా చెప్తా :)

Ashok చెప్పారు...

పదహారణాల అచ్చ తెలుగు టపా అంటే మీదేనండి..!!! ఏకబిగిన మొత్తం చదివించేసారు... మీ వ్యాఖ్యల రేట్ చూస్తే క్రికెటర్లు కూడా కుళ్ళుకుంటారేమో.. ప్రతీ టపాకి 50కి తక్కువ కాకుండా కొడుతున్నారు..

Sasidhar Anne చెప్పారు...

Akka.. two weeks ayyindhi.. next post wheru.....

prathi sari ila nenu gruthu cheyali ante.. kastam sumi..

sare kani. mee inspiration nenu first time oka telugu tapa rasa naa personal blog lo.. koncham chusi pettandi..

http://sasi-anne.blogspot.com/2010/06/nanna-i-love-you-fathers-day-special.html

అజ్ఞాత చెప్పారు...

Nenu ee madhyane mee blog chusanu. Chala nachindhi naku. Memu recent ga singapore vacham. Meeru cheppe prathi sannivesam lo nenu kanapaduthunnanu telusa.I mean starting from Airport to the experiences u faced in Singapore. Kakapothe nenu okkadanne vachanu meeru meevari friend tho vacharu.Nijam ga gunde ela vegam ga kottukuntundho aa time lo naaku telusu. Chi..jeevitham ee pani kuda cheyyalema anipinchindhi naaku. Any how meeru baga rasthunnaru. Meeru kane mee intlo vallu kanee telugu pandits aa :)

Catch u soon in another post.
Priya.

నేస్తం చెప్పారు...

అశోక్ సారీ అండి కొంచెం లేట్గా రిప్లయ్ ఇస్తున్నా.. థేంక్యూ వేరిమచ్
శశి కాస్తా బిజి కొన్ని రోజులు.. ఇల్లుమారుతున్నాం అని చెప్పానుకదా.. :) తప్పక చూస్తా నీ బ్లాగ్
ప్రియ తెలుగు పండిట్నా.. నా గురించి నేను చెప్పుకోకోడదు కాని నాకు యే బాషా సరిగ్గా రాదు :) అన్ని సగం సగమే :)

నేస్తం చెప్పారు...

శశిధర్ నీ కామెంట్ బాక్స్ పని చేయడం లేదు సరి చూడు :)

Sasidhar Anne చెప్పారు...

Akka.. Comment box sari chesanu..

Rajesh T చెప్పారు...

నా మానాన నేను సొంత పని ఒకటి పూర్తి చేద్దామని ఈ రోజు ఆఫీసు కి సెలవు పెట్టాను. కాని మీ బ్లాగ్ ఒకటి చదివాక, నేను ఆఫీసుకి సెలవు ఎందుకు పెట్టానో మర్చిపోయి, మీ బ్లాగులనే చదువుతూ కూర్చున్నాను. మీ దయ వల్ల, నా ఈ రోజు పూర్తిగా సర్వ నాశనం అయిపోయింది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, మీ ఈ బ్లాగులు సూపర్. ఎవరో అమ్మాయి రాసిన "బరువు - బాధ్యాత" బ్లాగ్ చదివి, పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాను. కాని మీ బ్లాగు చూసిన తరువాత అర్ధమయ్యింది, మీరు ఆమెకు జేజెమ్మ అని.

యు పోస్ట్ ఆల్ డేస్, ఐ రీడ్ అల్ డేస్ (మీరు రోజూ బ్లాగ్లు పోస్ట్ చేస్తే, నేను రోజూ చదువుతాను అని అర్ధం, నా సింగ్లీష్ బాగుందా?).

మంచు చెప్పారు...

ఆ ఇల్లేదొ మేం వెతికిపెడతాం కానీ మీరొ పొస్ట్ రాయండి త్వరగా ...

Sasidhar Anne చెప్పారు...

i agree with manchu pallaki garu..

@rajesh garu- nenu mee laage.. meeru anna koncham nayam.. nenu roju office ku ragane and vellitappudu oka sari akka blog teestha.. emaina posts vesaremo ani..

నేస్తం చెప్పారు...

రాజేష్ గారు థేంక్యూ థేంక్యూ ... త్వరలో అంటే ఒక వారం పది రోజుల్లో రాస్తాను :)
మంచుపల్లకి గారు.. అడ్డేడ్డే ఈ ముక్క ఇల్లు వెతకక ముందు చెప్పాలి .. ఒకటా రెండా దాదాపు ఆరేడు ఏళ్ళ నుండి పేరుకు పోయిన సామాను.. ... ఎప్పటికి సర్దేది..ఇంకా మొదలు పెట్టలేదనుకోండి సర్దడం.. రోజూ వాటిని చూసి బెంగతో బాధ పడిపోవడం తప్పించి :) మెల్లి మెల్లిగా ఒక్కో సామాను పేక్ చేయాలి :)
శశి ధర్ :)

మంచు చెప్పారు...

ఇలాంటి సమయాల్లొనే మనింటికి చుట్టాలని పిలవాలి.. :-)

అజ్ఞాత చెప్పారు...

nestham garu sunday eenadu lo me blog gurinchi rasaru chuskunara

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం, మీ బ్లాగ్ గురుంచి ఈనాడు పేపర్ లో రాశారు సుజాత గారు "అంతర్జాలంలో అభిరుచులు" అనే శీర్షిక మీద .. ఇందులో కొన్ని వంటల బ్లాగులు పరిచయం చేస్తూ మీది కూడా పరిచయం చేశారు...మీరు వండిన గుత్తొంకాయ కూర గురుంచి రాసారు :-)... ఈ మేటర్ చదవాలంటే ఈ క్రింది లింక్ చూడండి... అభినందనలు :-)

http://4.bp.blogspot.com/_mati0ngjSjY/TCaqAU-6KYI/AAAAAAAAFe0/Gl6qesTYLvw/s1600/food.JPG

Gayathri(Gulabi) చెప్పారు...

Congrats Nestam..me blog gurinchi eenadu paper lo vachindi kada..felt very very happy to see that...Keep up the good work :)

http://eenadu.net/vasundhara.asp?qry=ruchulu

సవ్వడి చెప్పారు...

Congrats... eenadu lo mee blog gurinci vaccindi

చందు చెప్పారు...

బాగుంది మీ భాషా కుస్తీ ,మీ భావాలు చాల సున్నితం గ సూటిగా వున్నాయి.
రాస్తూవుందండ్ని మాలాంటి ప్రేక్షకుల కోసం మరి.
.......మీ సావిరహే

నేస్తం చెప్పారు...

నిన్న చూసాను..సుజాతగారికి థేంక్స్ కూడా చెప్పాను..ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఈ రోజే ఇల్లు మారడం అందుకని లేట్ రిప్లయ్ ..ఏమనుకోవద్దు :)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నేస్తం జీ, మీరు చెప్పిన గుత్తొంకాయ కూర, మీ బ్లాగు అడ్రస్ ఈనాడులో వచ్చిందిగా!! అభినందనలండీ...

పవన్ కుమార్ చెప్పారు...

ఈ కామెంట్లు చూసి ఇప్పుడె ఈనాడు ఈ పేపర్ చదివా.
గుత్తొంకాయ కూర వాసన వస్తొంది.
ఇక్కడ చెన్నపట్నం లొ సాంబర్ తప్ప ఎమీ దొరకటం లేదు.
ఇంకా వారం ఆగాలి ఇంటికి వెల్లి గుత్తొంకాయ తినాలంటె. ప్చ్!!

రాధిక(నాని ) చెప్పారు...

నేస్తం గారు,
సింగ్లీషు సింపుల్ గా బాగుంది.మీరు రాసిన విదానము చాలా బాగుంది .ప్రతీలైనూ రెండుసార్లు చదివేను. చదువుతూ నవ్వుకుంటుంటే ఏమిటి నవ్వుతున్నావు అంటూ మా బాబుకూడా చదవటానికి వచ్చేసేడు చాలా ...చాలా...బాగా........రాసారు. హాయిగా కాసేపు అన్ని మర్చి పోయి నవ్వుకునేలా ఉంది.

priya.... చెప్పారు...

hello andi neestam gaaru...nen gurtunnana??? priya inka chaduvutunna ani cheppa....sare lendi mek gurtunte santosham gurtundakapote kuda nen eme anukon asale inni months gap echi eppudu gurtunnana ani adigite bill larden asaleme tappu cheyaledu annantha papam....sare lendi eka blog vishayam antara....meranna teginchi vellarandi babu desham kaani desham lo...nen ite na ma inti nundi school ki 12 yrs tiriga kaani vere rasta lo evaro vadileste intiki potaniki nana avasta padda...cheppukunte siggu potundi kaani edi nijam andi babu...e nijam ma intlo valaki kuda cheppaledu...telustene vachina variki kantha cheppi mare,,,aadukuntaru...eka me singlish vishayamite chadivinantha sepu navvutune unna....coz manam kuda intlo alanti prayogalu chesi navvistuntam annamata....bt me toodikodalu anukuntundi em develop ipoyaru ani kadu....anduke nemo ma amma eppudu cheptuntundi melanti chadivina vala kanna nalanti chadavani vaaru chala nayam ani....papam kaasi ki velli nappudu tanu tappi pote, e kisa...vo kisa...e ketha ani tana chinnapudu valintlo pani chese vadideghara nerchukunna urdhu ni tiraga toodi malli dorikinappudu yedustu evanni chepindata....papam...bt nijanga alanti vare andi dhiryanga ekadunna dorikedi...inko vishayam me dayaa hrudayam chuse kabolu me hus flat ipoi bank ki pampinatunnaru... heheh im just kidding andi...anyways tym doriki nappudantha me blog chaduvutanandi ...i promise it...me blogs kishen cheppinappudu chala asahaga aaturutaga chadiva starting lo anni blogs...appudu me peru kuda adiga bt meru "blog start chesinappude anukunnanu na details eme cheppakudadani annaru" so malli nen adagaledu....adi andi matter eka unta...

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

బాగుందండి......మీరు రాసే విధానం చాలా బాగుంటుంది

మంచు చెప్పారు...

ఇదన్యాయం నేస్తం గారు... ఇలా మాయం అయిపొవడం అన్యాయం అంతే ..

3g చెప్పారు...

ఆహా........చాలా థేంక్సండి .................జూన్ లో ఒక్కపోస్టే రాసినందుకు. చాలా మిస్ అయ్యానేమో అనుకున్నా ఈ వెకేషన్ లో. ఇప్పుడే చదివా... పోస్ట్ మాత్రం మళ్ళీ సూ.............పర్. ముఖ్యంగా వాషింగ్ కెన్నా............. గుడ్డో...గుడ్డు.

Sasidhar Anne చెప్పారు...

Akka , Illu Sardeyatam ayipoyindha...
Nenu Banglore ki shift ayya.. nenu kooda illu chukovali..
bachelors ki ante illu evvaru ivvatam ledu.. endukoo???

Unknown చెప్పారు...

ఛీ నా బతుకు...
రూం లో ఏదో ఒక కూర చెయ్యమని ఫ్రెండ్స్ చెబితే ఈనాడు పేపర్ లో మీ బ్లాగు చూసి ఓపెన్ చేశా
ఒక గంట నుండి అన్ని పోస్ట్ లు స్టవ్ మీద ఏమి పెట్టానో మరిచిపోయి చదువుతున్నా మా రూం మేట్స్ తో తిట్లు తన్నులు తిన్నా చివరికి
వంకాయ కూర పోస్ట్ ఇప్పటి వరకు కనబడలా
నన్ను మిస్ లీడ్ చేసినందుకు మిమ్మల్ని కాదు మీ బ్లాగు గురించి రాసిన వాళ్ళను అనాలి
ఆ రాసేదేదో పోస్ట్ లింక్ తో సహా రాస్తే నాకు ఈ తన్నులు తప్పేవి కదా వా ఆ :(

మీ కొత్త ఇంట్లో అంతా సుభప్రదమవ్వాలని ఆశిస్తూ
మీ ఫ్యాన్
ఇంద్రేష్

mahipal చెప్పారు...

ammaiyya.. mothani ki illu mararnamata!

eka meedagarundi tapa expaect cheyochuu..... illu sdarataniki help cheyamante memu vachavallam kada! maku recent chala expereince vachechindhi.....

నేస్తం చెప్పారు...

ముందు అందరికీ బోలెడు సారీలు.. ఇల్లు మారడం ఒకటి ,సరిగ్గా నెట్ ప్రొబ్లెం రావడం అన్ని కట్టగట్టుకుని వచ్చేసరికి ఇప్పుడు చూసా అన్నమాట మీ వ్యాఖ్యలు
మంచుపల్లకి గారు సరిగ్గా అదే సమయానికి మా ఇంటికి చుట్టాలు రావాలా !! అమ్మో అదే భయం వేసింది నిజంగా..రాలేదులేండి దేవుడిదయవల్ల.. లేకపోతే అంతే సంగతులు ..
అఙ్ఞాత ,కిషన్ సవ్వడి ,గాయత్రి అందరికి ధన్యవాదాలు ..
సావిరహే గారు ధన్య వాదాలు :)
శేఖర్ థేంక్యూ
పవన్ ఈపాటికి ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళా మీ ఊరు వచ్చేసేవుంటావ్ కదూ
రాధిక థేంక్స్ అండి :)
ప్రియ నిన్ను మర్చిపోలేదు.. అప్పుడప్పుడు అనుకుంటా ఈ అమ్మాయి ఏమైపోయింది ఉన్నట్లు ఉండి రావడం లేదు అని :) చాలా విషయాలు చెప్పావ్ .. థేంక్యూ
వంశీ థెంక్యూ

నేస్తం చెప్పారు...

మంచుపల్లకి గారు మరీ ఎక్కడ చూసినా నేనే కనబడితే ( కామెంట్స్ లోనూ,పోస్ట్ల లోనూ) బాగోదని ఇలా వెరైటీగా ప్లాన్ చేసా అన్నమాట
3g గారు మీ కోసమే అండి ..వెకేషన్ కదా మళ్ళా ఎక్కడ నా పోస్ట్లు చదవరో అని ఇలా గేప్ తీసుకున్నా..
శశిధర్ ఇంకా కాస్త సర్ధాలి ...ఎంటో అన్ని సర్దినట్లు గానే ఉంది ఏమి సర్ధనట్లుగానూ ఉంది ..మొత్తానికి కాళ్ళూ చేతులు నెప్పి పుట్టేస్తున్నాయి ..ఎక్కడిపని అక్కడే ఉంటుంది :) .. పెళ్ళి అయిపోయింది భార్యా పిల్లలును త్వరలో తీసుకోస్తాను అని చెప్పేసేయి అద్దెకు ఇచ్చేస్తారు :) ఇంతకూ ఇల్లు దొరికిందా ??
ఇంద్రేష్ గారు ఆహా పేపర్లో చదివి నా వంట చేద్దామని ట్రయ్ చేసారా ..హి హి హి నాకు బోలెడు ఆనందం వచ్చేస్తుంది.. ఇంతకూ యే పోస్ట్ లో వ్రాసానబ్బా.. ఉండండి చెక్ చేసి చెప్తా
http://jaajipoolu.blogspot.com/search?updated-min=2009-01-01T00%3A00%3A00%2B08%3A00updated-max=2010-01-01T00%3A00%3A00%2B08%3A00max-results=32

పోస్ట్ పేరు ఆహా ఏమి రుచి ..
మహిపాల్ గారు ఎంత తెలివండి ..అంత సర్దేసుకున్నాకా అయ్యో హెల్ప్ అడగకపోయారా అని అంటారా ..ఇల్లు దగ్గరలోనే దొరికేసరికి సామాను పేక్ చేసి నెనే మోసుకువెళ్ళాను..:/

Sasidhar Anne చెప్పారు...

Meeru cheppinattu chepthey pedda godavalu ayipothay akka..Pelli ayindhi twaralo pellam ni testha ani illu teesukunna anuko..

repu nijam pelli sambandam kudiri.. valla verification kosam maa intiki vasthe maa inti owner adenti aa abbayiki pelli ayipoyindhi kada ani chepthey naa bathuku ki inka pelle avvadhu..

Inka chusthunam.. present owner two months time icchadu, anduke illu chusthunnappude chepusthunna.. pilla chusthunna.. pelli avagane family ni pettali ani.. ayina dorakatam ledu..

అజ్ఞాత చెప్పారు...

chaala baavunnaaayandi...
mee characterization super. very nice

Sonia