23, మార్చి 2010, మంగళవారం
పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లు -2
మొత్తానికి ఇండియా వెళ్ళే రోజు రానే వచ్చింది ...15 రోజులు ట్రిప్.... ఎప్పటిలాగే ఇండియా వెళ్ళుతున్నా అనే ఆనందం కంటే 15 రోజుల్లో తిరిగి వెనక్కి వచ్చేయాలి అని బెంగతో నేనూ, నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము అని అరిగిపోయిన రికార్డులా అరనిమిషానికి ఒక మారు పాడేస్తూ ఆనంద పడిపోతూ మా ఆయన మొత్తానికి సొంత గూటికి చేరుకున్నాం.నేను ముందు గానే ఎందుకైనా మంచిదని టైటిల్ తో సహా జరిగిన సీన్లన్ని నాన్నకు పోన్లో వాయిన్చేయడం వల్ల, మా నాన్న ఊరంతా గాలించి పేరు ప్రక్కన ధర్మామీటర్ లోని డిగ్రీల మల్లే బోలెడు డిగ్రీలున్నా ఒక డాక్టర్ గారి దగ్గరకు తీసుకు వెళ్ళారు.
ఎలా అయినా రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్ట బుద్ది వేస్తుంది అని హాస్పిటల్ కాస్త బాగానే ఉన్నా అంతగా నచ్చలేదు. 'ఒసే' దీన్నే ఎక్స్ ట్రాలు అందురు అని ఒక ప్రక్కనుండి నా మనసు క్లాస్ పీకుతూ ఉండగానే .. డాక్టర్ గారి ఎదురుగా కూర్చున్నాం నేనూ ,నాన్న .ఏమిటి మీ ప్రోబ్లెం అని డాక్టర్ అనగానే నా పంటి బాధలన్నీ తన బాధలు గా నాన్న చెప్పుతుంటుంటే ,నేను దీనం గా మొహం పెట్టుకుని కూర్చున్నా ..సరే పదమ్మా చెక్ చేస్తాను అనడం పాపం ముందు జాగ్రత్తగా ఆల్రెడీ రెండు సార్లు పళ్ళు క్లీనింగ్ చేయిన్చుకున్నానండి అయినా తగ్గలేదు అని చెప్పేసాను గభ గభా .ఆయన నా వైపు చూసి ఎక్కడా? అన్నారు .నేను సింగ పూర్ లో అనగానే ..."విచిత్రం".. డాక్టర్ గారి కళ్ళల్లో రెండు మతాబులు ,నాలుగు చిచ్చు బుడ్డులు భలే వెలిగాయి.
అంతే ఆ క్షణం నుండి డాక్టర్ గారు నన్ను ఎంత ప్రేమ గా ,ఆప్యాయం గా చుసుకున్నారంటే సడన్ గా నాకు ఆరేళ్ళు ఏమో ,నేను ఆయన ముద్దుల కూతురినేమో అని నాకే డవుట్ వచ్చేసింది ....అన్నం తిన్నావా అమ్మా అని అడిగినా " అచ్చి కుచ్చులూ,బుజ్జి కన్నలూ 'ఆమ్' తిన్నావా తల్లీ" అని అడిగినట్లు అనిపించింది..నాకు మరొక అలవాటు కూడా ఉంది టెన్షన్ గా ఉన్నపుడు ఎవరన్నా కాసింత ప్రేమ గా మాట్లాడితే చాలు నిద్ర ముంచు కోచ్చేస్తుంది..అలా ఆవలింతలు తీస్తుంటే ,అసలే మాత్రం విసుక్కోకుండా పళ్ళు చెక్ చేస్తూ మొహం ఆవుదం తాగినట్లు ( సినిమాల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషంట్లను చూసి డాక్టర్లు పెట్టే ఎక్స్ ప్రెషన్ వంటిది ) పెట్టేసరికి దెబ్బకు నిద్ర ఎగిరిపోయి ఏమైంది డాక్టర్ ?అన్నాను భయం గా..
ఇంతటి సహన శీలతా ,ఓర్పు ఉన్నాయి కాబట్టే భుమాతను స్త్రీ తో పోలుస్తారమ్మా అన్నాడు (నిజంగానే )....ఆ మాటకు ఆనంద పడాలో ,భయపడాలో తేల్చుకోలేక అయోమయం గా చూస్తుంటే ...నీకు తెలియకుండానే ఎంత బాధ అనుభావిస్తున్నావో తెలుసా అమ్మా ! నీ రెండు జ్ఞానదంతాలు పుచ్చిపోయాయి.. వాటిని పీకేయాలి , నాలుగు పళ్ళు రంధ్రాలు పడిపోయాయి... వాటికి ఫిల్లింగ్ చేయాలి , కొన్ని పళ్ళు అరిగిపోయాయి ,కొన్ని పళ్ళ మద్య గ్యాప్ లు వస్తున్నాయి, కొన్నిపళ్ళు గార పట్టడానికి రెడీగా ఉన్నాయి..వీటికి అన్నిటికీ ట్రీట్ మెంట్ చేయాలి ... అనగానే నాకో సారి భూమి గుండ్రముగా ఉండును అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం గుర్తు వచ్చింది ...కాని పైకి గంభీరంగా (మరి ఇప్పుడే కదా పొగిడాడు ..మళ్ళా పిరికిది అనుకుంటాడు)డాక్టర్ గారు !!!మరి ఇప్పుడేం చెయ్యాలి??,నేను 15 రోజులే ఉంటాను ఇక్కడ ... కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంటే ఆపుకుంటూ అడిగాను...
మరేం పర్లేదమ్మా,కంగారు పడకు ..నువ్వు వెళ్ళేలోపు చక్కగా నిన్ను క్లోజప్ టూత్ పేస్ట్ మాడల్ లా పంపిస్తాను కదా ..నో ప్రోబ్లెం ..
ముందు ఈ రోజు సగం క్లీనింగ్ చేసేసి ( సగమే ఎందుకో నాకర్ధం కాలేదు )రేపు ఫిల్లింగ్స్ చేసేసి ,ఎల్లుండి ,అవతలెల్లుండి దంతాలు పీకేస్తాను .. మిగిలిన ట్రీట్ మెంట్ టైమును బట్టి చూద్దాం ...సరేనా తల్లీ అనగానే కాస్త ధైర్యం వచ్చి సరే అన్నాను.. క్లీనింగ్ చేసినపుడు నాలుక అటుఇటు అలా కదపకు అమ్మా నా చెయ్యి తెగిపోతుంది అని అంత ఓపిగ్గా చెబుతుంటే .. ఇండియాలో డాక్టర్లకు సహనం తక్కువ ,కోపం ఎక్కువ అనే వాళ్ళను చితక్కోట్టేయాలి అనిపించింది ...
మొత్తానికి బయటకు వచ్చాకా ..నాన్న కౌంటర్ దగ్గర , బాబూ బిల్లెంత ?అని వెయ్యిరుపాయల నోటు బయటకు తీసి అడుగుతుంటే 2800 అన్నాడు ఆ అబ్బాయి ...ఏంటీ రూపాయిలే?? అని నాన్న నోరు వెళ్లబెడితే ,బండెడు టాబ్లెట్స్ చేతిలో పెట్టి ఏమోనండి డాక్టర్ గారు చెప్పారు అన్నాడు ....మొత్తం ట్రీట్ మెంట్ అంతటికీ కలిపా ఈ బిల్లు ???నాన్న కోపంగా అడిగారు ....అవునండి అటునుండి అంతే స్పీడ్ గా వచ్చింది సమాధానం ... ఈ సారి నాన్న కొంచెం తగ్గి ట్రీట్ మెంట్ మొత్తానికా???(అనుమానంగా )ఇంకాస్త తగ్గరా???(ఆశగా ) మళ్లీ అడిగారు..ఇంక నేను ఆగలేకపోయాను ..నాన్నా!!! నన్నేమయినా అనండిగాని దేవుడిలాంటి డాక్టర్ గారిని ఏమన్నా అంటే నేను సహించనూ ,భరించను. డొక్కులో క్లీనింగ్ కే అక్కడ 6000 తీసుకుంటారు ..ఇన్ని ప్రొబ్లెంస్ కి ఇక్కడ కనీసం ౩౦౦౦ కూడా కాలేదు ...ముందు బిల్లు కట్టేయండి అని చెప్పి బలవంతంగా బయటకు లాక్కోచ్చేసాను ...
ఆ తరువాత రోజు కూడా డాక్టర్ గారు అంతే ఆప్యాయంగా కబుర్లు చెబుతూ నాలుగు దంతాలకు ఫిల్లింగ్స్ పెట్టారు .. చివరకు ఒక కార్బన్ పేపర్ లాంటిది ఇచ్చి గట్టిగా కొరుకమ్మా అన్నారు.. అది ఫిల్లింగ్స్ సరిగ్గా చేసారో లేదో సరి చూడటానికన్న మాట... కొంచెం కొరకగానే విపరీతమైన నెప్పి ... ఆయన మళ్లీ పదునైన పరికరం తో సరిచేసి ఇప్పుడు ఎలా ఉంది ?అన్నారు.. మళ్లీ నెప్పి ..మూడు సార్లు సరి చేసినా నెప్పి మాత్రం తగ్గలేదు .. పరవాలేదులే రేపు వస్తావ్ గా అప్పుడు సరి చేస్తా అన్నారు.. ఆసరికే బోలెడు మొహమాటం వచ్చేస్తుంది నాకు ..పాపం డాక్టర్ గారిని ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నా ..అయినా సరే విసుక్కోకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనుకుని బయటకు వచ్చేసా ..
ఇన్నేసి మందులు వ్రాస్తున్నాడేంటే బాబు ఈ డాక్టర్ అంటూ నాన్న మందులు తీసుకోవడానికి కౌంటర్ దగ్గరకు వెళ్ళగానే ఈ సారి బిల్లు 8000రూపాయలు చేతిలో పెట్టాడు .. ఏంటిదీ!! అన్నారు నాన్న అయోమయంగా ... 'ఈ రోజు బిల్లు సార్' ఆ అబ్బాయి జంకుగానే అన్నాడు.. ఏమయ్యా ,ఈ మాత్రం మందులకు 8000 రూపాయలా !!...ఎవరన్నా వింటే నవ్విపోతారు ..అక్కరలేదు నేను బయట కొనుక్కుంటా అన్నారు బిల్లు కాగితం లాక్కుని ... ఈ బిల్లు మందులకు కాదండి, ట్రీట్ మెంట్ కి అన్నాడు ఆ అబ్బాయి.. మరి నిన్న మొత్తం ట్రీట్ మెంట్ కని 2800 తీసుకున్నావ్ అన్నారు నాన్న..అవునండి అది నిన్న మొత్తానికి ..ఇది ఈ రోజు మొత్తం ట్రీట్ మెంట్ కి అన్నాడు.. ఆ తరువాతా వాడికీ , నాన్నకు చిన్నపాటి యుద్ధం జరిగాకా.. రేపు చెప్తా మీ డాక్టర్ సంగతి అని బిల్లు కట్టేసి బయటకువచ్చేసారు ...
అది కాదునాన్న ,పాపం డాక్టర్ గారు చాలా మంచోరు ఎక్కడో తేడా జరిగి ఉంటుంది అన్నాను ..నీ మొహం ..అసలు ఇదంతా నీవల్లే ..నిన్ననే తేల్చేవాడిని..నువ్వే లాక్కోచ్చేసావు అని నాలుగు తిట్టి పడేసారు..ఆ మరుసటి రోజు అపాయ్ ట్మెంట్ కోసం కాల్ చేస్తే డాక్టర్ గారు ఊరు వెళ్ళారని ఒక సారి ,వొంట్లో బాలేదని మరోసారి ,చెయ్యి తెగిందని ఇంకోసారి ఇలా కధలు చెప్పాడు కాని అపాయంట్ మెంట్ మాత్రం ఇవ్వలేదు వాడు.. అది కాదు నా బాధ ..ఆ డాక్టర్ ఫిల్లింగ్స్ సరిగ్గా చేయకపోయే సరికి పన్నుకి ,పన్ను తగిలితే చాలు ముక్కోటి దేవుళ్ళు కనిపించేవారు..విపరీతమైన బాధ ..అన్నం కాదు కదా కనీసం ఇడ్లీ కూడా తినలేని పరిస్థితి .. సూపులో ,జావలో త్రాగి కడుపు నింపు కోవడమే గతి అయ్యింది.. ఈ లోపల నాకు మా అత్తగారి ఇంటి నుండి ఒకటే పిలుపులు.. ఎప్పుడోస్తావ్?? ఎప్పుడోస్తావ్?? అంటూ ..చేసేది లేక సరే నాన్నా!మిగిలిన ట్రీట్ మెంట్ మా అత్తగారి ఇంటి దగ్గర చేయించుకుంటా అని మూటా,ముల్లే సర్దుకుని బయలు దేరా..
విషయం విన్నాకా ..బాగా అయ్యింది ..నేను ఇక్కడ చూపిస్తా రావే అంటే ,అహా ..మా నాన్న సూపరు,మా నాన్న డూపరు అని వెళ్ళావ్ కదా బాగా తిక్క కుదిరిందా అని కాసేపు మా ఆయన ఉడికిన్చాకా, సరే సాయంత్రం డాక్టర్ గారి దగ్గరకు తీసుకు వెళతా అని బయటకు వెళ్ళారు ..అలా వెళ్ళిన మనిషి రాత్రి అయినా ఇంటికి రారే ...సరిపోయింది వాడితో పెట్టుకుంటే అంతే...ఎంచక్కా మన ఇంటి ప్రక్కన చక్కని డెంటిస్ట్ ఉంది. బాగా చూస్తుంది ,మావయ్య గారిని తోడు తీసుకు వెళ్ళు అన్నారు అత్తయ్య.. సరే అని ఆవిడ దగ్గర వెళ్లాం ఇద్దరమూ ...వెళ్ళిన గంట అయినా రాదే ఆ డాక్టరమ్మ .. ఆ నర్సుని అమ్మా తల్లీ!! డాక్టర్ ఎప్పుడొస్తారు అని పొరపాటున అడిగామో ..ఏంటండీ..మీకన్నా ముందు వచ్చిన వాళ్ళే కిమ్మనడం లేదు మీరు అలా కంగారు పడితే ఎలాగా !!! కాసేపు వెయిట్ చేయండీ అని కసిరి పడేస్తుంది ...అలా ఇంకో గంట గడిచాకా ఇలియానాలా సూపర్ గా ఉన్న ఒక ఆమె టక టకా లోపలి వెళ్ళింది... ఆహా .. ఈ అమ్మాయి కనుక డాక్టర్ అయితే ఎంచక్కా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెప్పేది కదా అని ఆలోచనల్లో ఉంటే నన్ను పిలిచారు ...
ఆవిడ అంతా విని ముందు ఆ దంతాలు పీకేద్దాం .. ఫలానా చోట ఎక్సరే చేయించుకు రా అంది.. అంతకు ముందు డాక్టర్ నీ పలువరుస క్రమం గా ఉంది ఎక్సరే అక్కరలేదు అన్నాడే??? అని మనసులో అనుకొని.. సరే అని మళ్ళా ఎందు కొచ్చిన గొడవలే అని బుద్దిగా ఎక్సరే తీయించుకుని వచ్చా.. ఈలోపల డాక్టర్ గారికి బోలెడు అవిడియాలు వచ్చేసాయి ..అవునూ!! ఇప్పుడు పై పన్ను పీకాం అనుకో క్రిందపన్ను ..పైన ఖాళీ గా ఉన్న ప్లేస్ లో గుచ్చుకుని నొప్పి వస్తే ???ఇంకా ప్రాబ్లం అవుతుంది ..కాబట్టి రూట్ కెనాల్ చేయిన్చేద్దాం ఏమంటావ్ అంది.. మళ్లీ నాకు ఇంతకు ముందు డాక్టర్ నీ జ్ఞానదంతాలు క్రింద దంతాలు రాలేదు ..వాటికి రూట్ కెనాల్ అవసరం లేదు అని అన్నట్లు గుర్తు ..అయినా సరే .. రూట్ కెనాల్ అంటే ఏమిటి??? డాక్టర్ గారు అన్నాను ...అంటే ..నీ పంటి కి చిగుళ్ళకు మద్య ఉన్న నరాన్ని కట్ చేసేసి వాటి నిండా సిమ్మేంట్ నింపేసి పైన కేప్ పెట్టేస్తాం..దాంతో పన్ను స్పర్శ లేకుండా అయిపోయి బాధించదు అంది సింపుల్ గా.. ఒసినీ.. నీ తాపీ తనం దొంగలు తోలా.. ఇంత భయంకరం గా చెప్తావేంటే బాబు అని అనుకుని రేపు చెప్తా ఏ విషయము అనేసి ఇంటి కొచ్చేసా..
మరేం పర్లేదమ్మా చేయిన్చేసుకో అని మావయ్యగారు అంటున్నా నాకు భయం గానే అనిపించి మీ అబ్బాయి రానివ్వండి అప్పుడు చూద్దాం అనేసి, ఆయన రాగానే ..ఏమండీ ఇలా అంది ఆవిడ ఏం చెయ్యను అన్నాను..ఆవిడ దగ్గరకు వెళ్ళావా !!!ఆవిడకు ఏమి రాదంట నీలాంటి వాళ్ళ పై ప్రయోగాలు చేసి నేర్చుకుంటుంది అంట ..మొన్న మా ఫ్రెండ్ కి పన్ను పీకితే బుగ్గ వాచి పోయి నాలుగు నెలలు బాధ పడ్డాడు అన్నారు ....దెబ్బకు దిగోచ్చేసి మా ఆయన గడ్డం పుచ్చుకిని బ్రతిమాలుతూ మీరే సూపరు ,మీరే డూపరు ఈ బాధ నేను భరించలేను అవతల వారం రోజులు కూడా లేదు తిరిగి వెళ్ళడానికి ..అన్నం తినక నీరసం వచ్చేస్తుంది మీరెలా చెప్తే అలా వింటా అని చెంపలు వాయిన్చేసుకుంటే ..సరే అని మరుసటి రోజు మరో డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళారు..
నాకస్సలు ఆ హాస్పిటల్ నచ్చలేదు ..ఏం బాలేదంతే..ఆ మాట అంటే తంతారని నోరుమూసుకు కూర్చున్నా ... అక్కడ నాకో క్రొత్త నిజం తెలిసింది.. ఎప్పుడూ కూడా హాస్పిటల్లో మనం లాస్ట్ పేషంట్ అవ్వకూడదు ...ఇంటికి వెళ్ళిపోదాం అనే హడావుడిలో మనల్ని అస్సలు చూడరు ..నా ఖర్మ కాలి అతని దగ్గరకు మా ఆయన ఆ రెండురోజులు ఊరి మీద పెత్తనాలన్నీ అయ్యాకా ఆఖరునే తీసుకు వెళ్ళేవారు ...ఆ డాక్టర్ నన్ను చూడగానే ..అబ్బా!! ఇంకా ఒక పేషంట్ ఉందా అని ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ,విషయం తెలుసుకుని అబ్బే పన్ను పీకేయాలి రెండు వైపులా ..ఈ చిగుళ్ళు ఉన్నాయి చూసారా ఇవన్నీ 'బేడ్ బ్లెడ్' తో వాపు వచ్చాయి ..క్లీనింగ్ చేయాలి అన్నాడు..
@!#$%^&*&** దొంగామోహాల్లారా ఎన్ని సార్లు క్లీనింగ్ అంటారురా బాబు అని మనసులో తిట్టుకుని ..మొన్న చేయించుకున్నానండి అన్నాను ... నాకే ఎదురు చెప్తావా అని నా వైపు ఒక సారి చూసి ఒక సూది లాంటి పదునైన పరికరం తో చూసావా ఇదంతా అని కస్స్ మని గుచ్చి ఒక్క లాగు లాగాడు.. ఒకటే రక్తం ..ఏడుపొచ్చేసింది బాధకు ... ఓ పని చేద్దాం రేపు రెండు పళ్ళు పీకేసి ఎల్లుండి క్లీనింగ్ చేసేద్దాం అన్నాడు ..మరి క్రింద పన్ను పైన గ్రుచ్చుకుని నెప్పి రాదా ??అన్నారు మా ఆయన ...అసలు క్రింద జ్ఞాన దంతాలు లేవు చిన్నప్పుడు పీకిన్చేసుకుని ఉంటుంది మీ ఆవిడ అన్నాడు ..ఉహు ..నేను చిన్నపుడు అసలు డెంటిస్ట్ దగ్గరకే వెళ్ళలేదు అన్నాను.. అలా ఎలా కుదురుతుంది, నీకు గుర్తుండి ఉండదు అన్నాడు .. మళ్లీ ఏమంటే ఏం తంటాయో అని ఇంటి కొచ్చేసాం..
ఇంటికి రాగానే 'ఛీ ' చెత్త డాక్టర్ ..నా కొద్దు... నాకు భయం వేస్తుంది అన్నాను ... నీకందరూ మీ నాన్నలా జోల పాడతారే.... ఇతను మంచి డాక్టర్.. ఇప్పుడు మారాం చేస్తే ఇంక నీ బ్రతుకు సూపులకే అంకితం చూసుకో అన్నారు.. మరుసటి రోజు ..ఏమండీ!! నాకు భయం వేస్తుంది నా ప్రక్కనే ఉండండి అని బ్రతిమాలుకున్నా గాని మా ఆయనకు కరెక్ట్ గా ఏదో పోన్ వచ్చి బయటే ఉండిపోయారు.. నేను ఎప్పుడూ అలా భయపడలేదు ...కాళ్ళు చేతులు ఒణికి పోయాయి..నొప్పి కంటే ముందు భయం ..పన్ను పీకినప్పుడైతే ఏడ్చేసా .... ఏడ్చుకుంటూ బయటకు వస్తుంటే ముందు కంగారు పడిపోయి తరువాతా ఒకటే నవ్వు మా ఆయన ...పిరికిదానా అని.. ఆ తరువాత క్లీనింగ్ సంగతి ఏం అడుగుతారు లెండి ..మద్యలో పారిపోదామా అనిపించింది ..
మా ఆయన డాక్టర్ కి బిల్ కడుతుంటే అప్పుడు గుర్తు వచ్చింది ఫిల్లింగ్స్ సరిగా చేయలేదని.. బాబ్బాబు నాకసలు బాధ ఇది ..దీన్ని సరి చేయి అంటే.... అబ్బే ఏమి లేదు అంతా బాగానే ఉంది ..కొద్ది రోజుల్లో సరి అయిపోతుంది అంటాడు.. ఒర్నాయనా నీకో దణ్ణం పెడతా ... ఏమి లేక పోయినా కాస్త సరి చేయి తండ్రి నా తృప్తికి అని బ్రతిమాలితే ..ఇంక తప్పదని కాసింత అలా అలా లెవెల్ చేసాడు ..కాసింత పర్వాలేదు అనిపించింది .... కాని అతను చేసిన క్లీనింగ్ కి నరాలు అన్నీ నెప్పి ...ఆ ముక్క పొరపాటున మా ఆయనతో అనగానే .. అయితే పదా మా ఊర్లో ఒక డెంటల్ కాలేజ్ ఉంది అక్కడికి వెళదాం అన్నారు ...బాబూ చాలు ఇంక మద్యాహ్నం ట్రైన్ ఉంది ...నేనెక్కడికి రాను అన్నా బలవంతంగా లాక్కెళ్ళారు...అందులో అబ్బాయి ..మీ ఆవిడ కు పళ్ళు సరిగ్గా పీకలేదనుకుంటా అండీ.. ఇన్ ఫెక్షన్ ఉంది ..బహుసా పన్ను ముక్క లోపల ఉండి పోయిందేమో అన్నాడు...దెబ్బకు నీరసం వచ్చింది ...
మళ్ళాస్కానింగులు ,గట్రాలు అయ్యాకా ఈ రోజు ఆంధ్రా బంద్ కాలేజ్ మూసేస్తున్నాం అనేసరికి ఏమని చెప్పను నా బాధ ... మొత్తానికి ఎలా అయితేనో ఒక ప్రొఫెసర్ తో బ్రతిమాలి చెక్ చేయించుకుంటే ..పన్ను ఎప్పుడు పీకాడు..ఎంత టైము పట్టింది లాంటి ఇన్వెస్టిగేషన్ చేసాకా అబ్బే ఏం లేదమ్మా సెన్సిటివ్ టూత్ పేస్ట్ వాడు చాలు అని వెళ్ళిపోయాడు ..బ్రతుకు జీవుడా అని మరొక్క ప్రాబ్లం మా ఆయనకు చెప్పకుండా ఇక్కడికొచ్చి పడ్డాను.. ఇంతకు ముందు తీపే తినలేని పరస్థితి ...ఇప్పుడు ..హుం ఎందుకులేండి అదంతా ..కాబట్టి సామెతలు వినాలి అంతే గాని ఎందుకు? ఏమిటి? ఎలా? అని ఆరాలు తియ్యకూడదు ..అదన్నమాట సంగతి ... :)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
78 కామెంట్లు:
నెనే నెంబర్ 1
పాపం మీ కష్టం పగవాడిక్కూడా రాకూడదు నేస్తం గారు. మొత్తం మీద దంత వైద్యము పలు రకాలు అన్న పుస్తకం రాసేసేంత అనుభవం సంపాదించేశారనమాట. మీ కష్టాలన్నీ త్వరలో కరిగిపోయి రెండు చేతుల్తో ఐస్‌క్రీం లు, స్వీట్లు తినే రోజు అతి త్వరలో రావాలని కోరుకుంటున్నాను :-)
పళ్ళ కోసం పదిహేడు పేరాలు
నా పళ్ళు మొత్తం ఊడిపొయినా పర్లేదు.. జీవితం లొ డెంటిస్ట్ దగ్గరకు వెళ్లను
:(
జాజిపూలు పోస్టులు కెలికి ఒక పేరడీ రాయాలని నాకెందుకో అనిపిస్తుంది.
అందుకే శ్రీనివాస్.. సగం ఆస్తి లిస్ట్‌లొ నువ్వు లేవు.. ;-))
అయ్యో నేస్తం! ఎన్ని కష్టాలు!! టపా చదువుతున్నప్పుడు అక్కడక్కడా నవ్వొచ్చినా అంతలోనే మీ బాధ గుర్తొచ్చి పళ్ళ బిగువునా ఆపేసుకున్నా :((
alage jaruguthadi mari. natho matladamante pedda fose kottav po.
ika epudu adaganu ani decide ayya.
Enthina chala baada paddav akka.
unnadi kaastha ekkuva chesesaaru doctors, anduke manaku telisina doctor dagariki vellali.
mari ippuDu elaa maanaej chaestunnaaru?
ఈసారి భారతదేశం వస్తే, మా తాడిపత్రికి రండి. మా ఊళ్ళో మంచి డాక్టరున్నాడు. ఫీజులు కూడా చాలా చాలా తక్కువ. నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏరోజూ కూడా వంద, రెండు వందలకు మించి బిల్లు చెల్లించలేదు.
పైగా ఫిల్లింగ్ చేసి క్యాప్ వేసినప్పుడు కూడా బిల్లు అంత ఒకేసారి కాకుండా ఫిల్లింగ్ చేసిన రోజు వందరూపాయలు, మళ్ళీ క్యాప్ పెట్టిన రోజు వందరూపాయలు installments లో తీసుకున్నాడు. ఇంకా రూట్‌కెనాల్ ఆపరేషన్ చేసినందుకు 1200 రూపాయలు బిల్లు అవుతుందని చెప్పాడు. సరే, అని నేను ఇస్తాను అంటే, అంతా ఒకేసారి వద్దు, నువ్వు రూట్‌కెనాల్ ట్రీట్మెంటు కోసం నాలుగుసార్లు నా దగ్గరకు రావాల్సి ఉంటుంది, ఒక్కోసారి వచ్చినప్పుడు 300 రూపాయలు ఇవ్వు చాలు అన్నాడు. ఎంత మంచి డాక్టరో. ఆ తర్వాత నాకు పంటికి సంబంధించిన ఎటువంటి సమస్యా రాలేదు. ఇది నేనెప్పుడో 5 సంవత్సరాల క్రితం చేయించుకున్నాను.
చాలా సంవత్సరాలైంది కదా అని సంవత్సరం క్రితం క్లీనింగ్ కోసం ఇక్కడ మా కాలేజీలోని డెంటిస్ట్ దగ్గరికి వెళితే ఈ మధ్యనే పళ్ళు క్లీనింగ్ చేయించుకున్నావా అన్నాడు. :) :). ఆయనన్న ఆ మాటతో నాకు ఇప్పట్లో డెంటిస్ట్ అవసరం లేదనిపించింది. :)).
అయ్యో నేస్తం గారు !!! నిజంగానే మీ పని పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లు వుందండి.... :(:(:(:(, మరి ఇంకా పొయ్యి లోనే వున్నారా :(:(.. బయటకు వచ్చేసారా :):)???
అయ్యో పాపం..ఎంత కష్ట పడ్డారండీ..పగవాడికి కూడా రాకూడదీ పంటి నొప్పి. ఇంతకీ ఎన్ని పళ్ళు ఫిల్లింగ్ చేయించుకున్నారు..? ఎన్ని పళ్ళు పీకించుకున్నారు ..? ఇప్పుడు కూడా సూపులేనా..లేక ఏమైనా తినగలుగుతున్నారా...?
ఎలా భరించారండీ బాబు ఆ నొప్పిని..తలచుకుంటేనే భయం,భాద కలుగుతుంది..త్వరలోనే మీ పళ్ళు రికవర్ అయ్యి బోల్డన్ని స్వీట్లు, ఐస్ క్రీమ్‌లు గట్రా తినేయ్యాలని కోరుకుంటున్నాను..
మీ పన్ను కష్టాలు,ఆ పరీక్షలు చదువుతుంటే నా పళ్ళు జివ్వున లాగుతున్నాయి. నేనూ ఇండియాలో ట్రీట్మెంటు చేయించుకుందామని ఆగా.భయపెట్టేసారుగా ఇప్పుడెలా?
ఇవ్వాలే మీ blog spot చూసానండి...
మొదట మీ "పెళ్ళి చూపులు" blog చదివా... ఆ తరువాత, ఇదిగో ఇలా "పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లు" లోకి వచ్చి పడ్డా... :-)
ఇంకా చాలా చాలా ఉన్నట్లున్నాయి... ఇవ్వాళ్టికి ఈ రెంటితో సరిపెట్టుకుని, మిగతావి తీరికగా చదువుతా... చాలా interesting గా ఉన్నాయి మీ blogs...
మృత్యుంజయ రెడ్డి.
ఇవ్వాలే మీ blog spot చూసానండి...
మొదట మీ "పెళ్ళి చూపులు" blog చదివా... ఆ తరువాత, ఇదిగో ఇలా "పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లు" లోకి వచ్చి పడ్డా... :-)
ఇంకా చాలా చాలా ఉన్నట్లున్నాయి... ఇవ్వాళ్టికి ఈ రెంటితో సరిపెట్టుకుని, మిగతావి తీరికగా చదువుతా... చాలా interesting గా ఉన్నాయి మీ blogs...
మృత్యుంజయ రెడ్డి.
welcome to the world of medicine, can't complain though, will start racking in the moolah soon.
I guess you did not come to hyd, rt, than you could have added one more zero to the bill.
నెంబర్ వన్ యా పవన్ నువ్వు ..అయితే సుపర్ స్టార్ పవన్ కుమార్ ఈ రోజు నుండి..
వేణు హి హి హి మళ్ళా ఇంకోసారి చెప్పండీ... కనీసం అలా అయినా సంతోషపడతా..
శ్రీనివాస్ మరి అంతకు ముందు పోస్ట్‌లో 8 పేరాలు వెరసి 25 ..మరి ఙ్ఞాపకాలు అంటే అలాగే ఉంటాయి :)..ఇంక పేరడీ సంగతి అంటావా..అనిపిస్తుంది అనిపిస్తుంది .. అలా రాయాలనే అనిపిస్తుంది ...రాజేష్ తో చట్టా పట్టాలు వేసుకుని తిరిగిన శ్రీనివాస్ ఇప్పుడు కుర్రాళ్ళందరికీ ప్రతినిధి అయిన శ్రీనివాస్ గారు అయిపోయారు కదా ..అలాగే అనిపిస్తుంది :)
మంచు పల్లకి గారు భలే వారే నేను హడావుడిగా ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆ డాక్టర్స్ కూడా తగ్గట్టూ గానే దొరకడం అలా అయిపోయింది గానీ పళ్ళు ప్రోబ్లెం వస్తే తప్పక వెళ్ళాల్సిందే ...అలా మొడివేయకూడదు..
గణేష్ :(((
నిషి ఎందుకలా నవ్వు ఆపేసుకున్నావ్ ..మళ్ళా చదివి నవ్వాల్సిందే నేను ఒప్పుకోనంతే..
స్వప్న నువ్వు ఇలా ప్రతిదానికి అలిగేస్తే ఎలా అమ్మాయ్ చెప్పు :) ..అసలే మాత్రం కాళీ ఉండటం లేదు..ఇదిగో ఇప్పుడు కూడా రాములవారికి వడపప్పు,పానకం చేసి పూజ చేయాలా..అది ఆపు చేసి మరీ కామెంట్స్ పెడుతున్నా..
సునీతా ఇప్పుడు గట్టిగా ఉన్న పదార్ధాలు తీనలేను..చపాతీ కూడా తినలేను ..అన్నం తినగలను.. ఫ్రూట్స్ అంటే పుచ్చకాయ ,అరటి పండూ లాంటివి తినగలను.. పర్లేదులే ..ఆ మద్య అయితే కూరలో ఆవగింజ తగిలినా ఏడుపొచ్చేది :)
నాగ ప్రసాద్ ఉంటారు అలాంటి మంచి డాక్టర్స్ అక్కడక్కడా..మీరు చెప్పింది వింటే నిజం గా తాడి పత్రి లో ట్రీట్ మెంట్ చేయించుకోవాలని ఉంది ..థేంక్స్ ఓపిగ్గా అన్ని వివరాలు రాసినందుకు
రాజ :) పర్వాలేదు ఇప్పుడు కాసింత బయటకు వచ్చాను
ప్రణితా నీ పేరు భలేఉంది ..పర్వాలేదు ఇప్పుడు..అతనైతే 6 పళ్ళు అన్నాడు మరి నాలుగో అయిదో చేసాడు మొత్తానికి :)
శేఖర్ అసలు నెప్పి కంటే భయం వేసింది..డాక్టర్స్ కాస్త మంచి గా మాట్లాడితే చాలు మనకి సగం దైర్యం వస్తుంది..కాక్పోతే వాళ్ళు రోజుకి ఇలాంటి ప్రోబ్లెంస్ తో వందమందిని చూస్తారు ...వాళ్ళకేమి అవసరం చెప్పు ప్రేమగా మాట్లాడడానికి ..
రాధికా ఏం భయ పడద్దు అందరూ అలా ఉండరుగా ..నాగ ప్రసాద్ చెప్పలేదూ వాళ్ళ డాక్టర్ గురించి.. ఎవరో కొందరు అలా ఉంటారు అంతే..
jay గారు మరి చదివేసి ఎలా ఉన్నాయో చెప్పేయండి :)
కిరణ్ :O నిజమా ...అంత బిల్ వేస్తారా హైదరాబాద్ లో ..హూం ..
హన్న.... మా నేస్తాన్ని ఇన్ని బాధలు పెడతారా...ఆ పళ్ళ డాక్టర్లు...! వాళ్ళ పళ్ళన్ని పిప్పి పళ్ళు అయిపోను.. :)
ఈ పోస్ట్ చదివి నవ్వాలో ఏడాలో తెలియలేదండి... చాలా బాగుంది..
Rajkumar
సేం టు సేం ప్రోబ్లమండి నాక్కూడా డెంటిస్టులతోటి. ఇక మీ పోస్టులయితే సూ........పర్. ఈమధ్యన "రెండు రెళ్ల ఆరు" బ్లాగ్ నుంచి పోస్టులేమీ రావట్లేదని చాలా బాదపడుతుంటే నిన్నే మీ బ్లాగ్ చూసాను. సాయంత్రం ఆరు దాటినా మీ పోస్ట్ లు చూస్తూ కంప్యూటర్ ముందే కూర్చుంటే మా మేనేజర్ ఆనందంతో అపార్దం చేసుకొని ఇంక ఇంటికెల్లిపో బోనస్ లిస్ట్ లో నీ పేరు చేరుస్తానని నమ్మకంగా చెప్పాడండి విషయం తెలీక.
మీ పోస్ట్ లు నిన్న వంకాయ్ కూర దాకా చదివేసానండి అన్నిట్లోకి "తికమక మకతిక" ఎక్కువ సూపర్.
మీ ఫేన్స్ లిస్ట్ కి ఇంకో నంబర్ కలిపేసుకోండి.
టపా భలే ఉంది నేస్తంగారు టప టపా చదివేసేలా రాసారు...సో మీరు ఎప్పుడన్నా పగలబడి నవ్వితే ఇరవై ఎనిమినిదన్నర పళ్ళు కనిపిస్తాయన్నమాట !!!
మూడవ భాగంలో పళ్ళ కోసం మంచి మంచి చిట్కాలు మీ స్టైల్ లో చెబుతారనుకున్నానే . అప్పుడే ముగించేసారేమిటి నేస్తం గారు .
హు నేను చెప్పానా ఐస్ క్రీంస్ తినొద్దు పళ్ళు పుచ్చిపోతాయని
nenu kuda blogs raasaka, koodali lo naa blog kanipinchalante em cheyyalandi? koncham chepparoo ???please
రాజ్ కుమార్ నేను ఎలాగో ఏడుస్తున్నా కదా మరేం పర్లేదు మీరు నవ్వేయండీ :)
3g గారు ఆఫీస్ లొ బ్లాగ్స్ చదవడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయన్న మాట
అశోక్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ..నిజమేకదూ ఇప్పుడు నాకు 28 పళ్ళే .. :( అవూనూ ఆ ఇరవై ఎన్మిది 'న్నర ' హేమీటి?? :O
శివరంజని హి హి హి అది పుచ్చక ముందు చెప్పాలా :)
అఙ్ఞాత గారు ఇంత ఇది గా అడిగాకా కొంచెం ఏమిటి పూర్తిగా చెబుతా...
koodali.org అని సైట్ ఓపెన్ చేసి అందులో పైన కుడి వైపున క్రొత్త బ్లాగును చేర్చండి అని ఉంటుంది ..అది క్లిక్కండి ..అక్కడ వివరాలు ఉంటాయి ..ఫాలో అయిపోండి.. :)
అయ్యో నేస్తం గారు! ఎన్ని కష్టాలు పడ్డారు. నా పరిస్థితి అంతే.. ఇప్పటికే రెండు పళ్లకి రూట్ కెనాల్ చేయించుకున్నాను. మరో రెండు ఎదురుచూస్తున్నాయి. ఆ డాక్టర్లంటేనే భయమేస్తోంది. ఎలాగో ఏంతో మరి..
టెంప్లేట్ బావుంది
నిన్న చెప్పడం మరిచిపోయాను. మీరు హెర్బల్ టూత్ పేస్ట్ వాడండి. బాగుంటుంది. డాబర్ వారి మిశ్వాక్ బాగుంది. నేను అదే వాడుతున్నాను.
ఈనాడు చదవడం అలవాటు అయినవాళ్ళకి ఆ ఫాంట్ బాగా అలవాటు ఆయ్యి మిగతా పేపర్లు ఎలా నచ్చవు.. అలాగే జాజిపూలు అనగానే మైండ్ పింక్ కలర్ కి ట్యూన్ అయిపొయింది.. ఈ కొత్త కలర్ అలవాటు అవ్వాలంటే కొద్ది టైం పడుతుంది.. :-))
సవ్వడి హమ్మయ్యా ఏంటో ఏంటో పేస్ట్‌లు వాడేస్తున్నా నేను ..ఈ పేస్ట్ అవ్వగానే మిశ్వాక్ మొదలు పెడతా ..దొరికితే
హరే కృష్ణ :)
మంచుపల్లకి గారు ఏంటండి ఇది ..ఇలా అయితే ఎలా??? మొన్నేమో ఒకరు మొన్న అంటే మొన్న కాదు ఓ నాలుగైదు నెలల క్రితం ఒకరు అబ్బెబ్బె ఆ ప్లాస్టిక్ పూలేం బాలేదు ఎంచక్కా మాములు సన్నజాజులు పెట్టుకోండి అని సలహా ఇచ్చారు .మనమసలే బద్దకానికి మహరాణులం కదా ఇన్నాళ్ళకు కాసింత తీరిక చేసుకుని ఇలా డిజైన్ చేసా ...మళ్ళీ ఇలా అంటే ఎలా ??? లాభం లేదు పోల్ పెట్టాల్సిందే :)
టెంప్లెట్ బ్యాక్ గ్రౌండ్ కలర్ అస్సలు బాగాలేదు.
నాగ ప్రసాద్ ఇప్పుడూ ..ఇప్పుడూ ????
ఇప్పుడు కొంచెం ఫర్వాలేదు.
కొంచమే పర్వాలేదా :( ఎలా ఉంటే బాగుంటుందో చెప్పు...తెలుపు మీద కళ్ళు లాగుతాయేమో కదా !!! పోనీ పాత టెంప్లెట్టే ఉంచేయనా???
అవును. పాత టెంప్లెట్టే బాగుంది. :).
హి హి హి నాకు తెలుసు ఇలానే అంటారని ..సరెలే త్వరలో మార్చేస్తా.. మళ్ళా సెట్టింగ్స్ మార్పు చేయాలి..నా వల్ల కాదమ్మా ఇప్పుడు :)
chalaa thanks andi
kanai koodali lo naa blog inkaa kanpadam ledu andi. nenu emi cheyyali ippudu ? :(:(:(
naku chala dukham ga undi. 2 days ayipoyaayi.
meeru elaa chessaaro cheppandi please. meedi baane vachindi gaa..naade enduku raavadam ledu :((((((((
please, aa steps ento naaku meere cheppara?
నాకీ టెంప్లేటే బావుంది.. చూడగానే చటుక్కున కోసి మాల కట్టేసుకోవాలన్నంత సహజంగా, అందంగా ఉన్నాయి పూలు :-)
బాగుందండి
నేస్తం,
పళ్ళు,
ఓ డెంటిస్ట్... సినిమా సూపర్ హిట్
అవును చెప్పటం మరిచాను,
నేను వేణూ శ్రీకాంత్ గారిని పర్సనల్ గా కలిసాను.భలే ఎగ్సైటింగా అనిపించింది.మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానో .... :)
అఙ్ఞాత గారు ఎంత పని అయ్యింది ..మీరు support@koodali.org కి మైల్ కొట్టారా .స్పెల్లింగ్ కరెక్టేనా??? వస్తుంది లేండి ఒక్కో సారి టైము పడుతుంది ..రేపో పోస్ట్ వేసి గమనించి చూడండి
నిషీ,ప్రసాద్ .....ఇప్పుడు కిం కర్తవ్యం ???
రాజేంద్ర ప్రసాద్ గారు మీరేనా వేణు గారిని గాలి లో తేల్చేసారు.. నాకు ఆ అవకాశం లేదులేండి ..ఎవరి దగ్గిరకన్నా వెళ్ళీ నేను నేస్తాన్ని అని పరిచయం చేసుకునేదాకా ఎవ్వరూ నన్ను గుర్తు పట్టలేరు :)
వా.....తల్చుకుంటే గుండె తరుక్కుపోతుంది . ఎలా భరించావే తల్లీ అన్నన్ని కష్టాలు . సహనానికి మారుపేరుగా భూమాతకి బదులు ఇకముందు నీ పేరే తల్చుకుంటారు జనం. చ్మీ....( ఏదీ ఆ చీర చెంగిలా పడెయ్ )
పాత లుక్ బాగుంది కదండీ ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ కలర్ మళ్లీ మార్చేసారు హూ0
అంతే అండి మా పోస్ట్లులకి కామెంటుతారో మళ్ళి మరచిపోతారు.... సరదాకి అన్నాను లెండి
నా బ్లాగు చూడాలనుకుంటే
http://rajendraprasadambekar.blogspot.com/
అజ్ఞాత గారు,జల్లెడ కూడలి లో కాదు గాని హారం లో పెట్టండి మీ బ్లాగ్ ని చటుక్కున పడకపోతే నన్ను అడగండి
పోస్ట్ పడితే నేస్తానికి క్రెడిట్ ఇవ్వండి
ఓ అమ్మాయి
లలితా కదా ... ఈ మద్య నాక్కూడా ,నేను భూమాతకు మరో రూపమేమో బోలెడన్ని అనుమానాలు వచ్చేస్తున్నాయి ... మీరు బాధ పడుతుంటే చూడలేక ఇప్పుడే నా కొంగుకు పని కల్పించా .. ఇమ్మంటే ఇస్తాను
అఙ్ఞాత గారు మీకు టెంప్లెట్ అలా నచ్చిందా :/ ఏంటండి అందరూ ఇలా ఏడిపించేస్తున్నారూ
అమ్మాయి గారు మీరలా హారం అని సింపుల్ గా అనేస్తే ఎలా తెలుస్తుంది link ఇవ్వండి ఆమెకు :)
రాజేంద్ర గారు ..మరదే అప్పుడెప్పుడొ ఓ కధ రాసారు.. నేను కామెంటాను మీరు చూడలేదు ..ఇంకో పోస్ట్ వేయలేదు ..మళ్ళా నాదే తప్పు అంటారు మీకిది తగునా
లేదు నేస్తం గారు మిమ్మల్ని తప్పు పట్టేంత ధైర్యమా!!!
మీరు అన్నది కరెక్టే,కథ ని మద్యలోనే ఆపేసాను.మళ్ళీ మొదలు పెడతాను.
మీ కామెంటు చుసానండోయి ఆ రోజే...మీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి కామెంటు రావటము నేను చూడకపొవటమూనా
సమస్యే లేదు..!!
అజ్ఞాత గారు
Open www.haaram.com
Click on హారంలో చేరండి
మీ నామధేయం? (అంటే) Enter your name
మీ వేగు (E-mail) చిరునామా:(అంటే) enter your email adress
మీ బ్లాగు (రచనా తంత్రి) చిరునామా? enter your blogname (Ex: www.nuvvunenu.blogspot.com)
మీబ్లాగుపేరు-(ex:నువ్వునేను)
then enter your password
then again re enter your password
last step click on
సభ్యత్వం ఇవ్వు
హి హి హి ఈ అజ్ఞాత వాళ్ళ తొందరగా 50 కంమెంట్లు వచేసాయ్
హారం లో మీ బ్లాగు వస్తే, నేస్తం గారు వాడబోయే మిస్వాక్ టూత్ పేస్టు ని కొనివ్వాలి
ఓ అమ్మాయి
అజ్ఞాత,
దుఃఖించి ఏమి ప్రయోజనం?
నేనుండగా నీకేల భయము
హారమే నీకు అభయము
http://www.haaram.com/Join.aspx
వీక్షక అతిధిలారా...ఈ పుట ద్వారా మీ బ్లాగు (రచనా తంత్రి) ను హారంకు సులభంగా జతచేయవచ్చు. మీరు చేయవలసిందల్లా, ఈ క్రిందన వున్న సంక్షిప్త ఫారం ను పూరించి "సభ్యత్వం ఇవ్వు" అనే బటన్ ను నొక్కడమే. లేఖాహార సభ్యత్వము తీసుకొన్నచో మీకు ప్రతినెల మొదటివారంలో మీ రచనా తంత్రుల ఉత్తర ప్రత్యుత్తరాలను పి.డి.యఫ్ రూపంలో మీ మైలు కు పంపడము జరుగుతుంది.
అనగా
My Dear guest viewers,
you can easily add your blog to haaram from this page, for that you have to fill the below form
to click on "సభ్యత్వం ఇవ్వు" button
if you want to take membership of food of letters,You will get the pdf documents every month to your mail
హమ్మయ్య చెప్పేసా మీకు నాకు కచ్చి
నేస్తం,
నందివర్ధనంపూలు జాజి పూలు ఒకటేనా
మీ బ్లాగ్ లో చెరువులో మొదటి ఫోటో అదే వున్నాయి పెద్ద ఫోటోలో నిలువుగా?
అడ్డగా వున్నా పూలు పేరు ఏమిటి ?
అఙ్ఞాతలు :D
ఆఖరు అఙ్ఞాత గారు అవి సన్న జాజులు అండీ బాబు ..నందివర్ధనం రేకులు దళసరి గా ఉంటాయి .(పూల మహరాణి సునీతగారు ఎక్కడున్న వచ్చీ కాస్త ఈ పూల పేరు చెప్పవలసింది గా విఙ్ఞప్తి ..)ఇంకా ఆ పైవి అడ్డం గా ఉన్నవి మల్లెలు(పందిరి మల్లెలు ..) ..అంటే మరి జాజు లంటే ఒక్కటి కాదుగా విర జాజులు,సన్న జాజులు, జాజి మల్లెలు ఇలా బోలెడు ఉన్నాయని అలా అన్ని జాజులు పెట్టేసాను..
చివరాకరికి యెన్నిపళ్ళు మిగిలాయండి మీ నోట్లో ?:)
వేణు శ్రీకాంత్ గారి బ్లాగులో మీ కల చదివా మీ ఫోటో ఒకటి గాని పెట్టారంటే మిమ్మలిని ఏ shopping mall / taxi stand / MRT లోనే పట్టేసి మీ కల నేరవేరటానికి నా వంతు సాయం నేను చేస్తా ఏమంటారు;)
ఏంటీ మీరూ నాలా గ్రీను బాట పట్టారా? :-)
So, నేస్తం గోస్ ఎన్విరాన్మెంటల్ అన్నమాట
*** *** ***
ఏడిపించేశారండి
mI kaShTAlu cadivi kaMTa nIrolikiMdi nEstaM...
నేస్తం,
బాగున్నారా ఇప్పుడు? పంటి నొప్పి తగ్గిపోయినట్టేనా ? నన్ను గుర్తు పెట్టుకుని ధన్యవాదాల పోస్ట్‌లో రాసినందుకు బోల్డు థాంకులు.నేను ఇంకా గుర్తు ఉండే ఉంటాను అనుకుంటున్నా.ఏంటో చాలా రోజులయ్యిపోయింది కదా, ఈ మధ్య అసలు బ్లాగ్స్ చూడటం కుదరలేదు.వరసపెట్టి మీ పాత పోస్ట్‌లు అన్ని చదివేసా ! మీ పెనం,పొయ్యి బాధలు చదివి నాకూ చాలా దిగులేసింది.
పళ్ళు పాడు కాకుండా ఉండటానికి ఒక చిట్కా.మనం భోజనం చేసిన వెంటనే లేదా, ఏ చిరు తిండి తిన్నా సరే, వెంటనే చూపుడు వేలితో, నీళ్ళతో పళ్ళు, చిగుళ్ళు కడిగెసి పుక్కిలించాలి .ముఖ్యం గా షుగర్,పులుపు ఇంకా ఇతర రుచుల వల్ల పళ్ళు పాడు కావొచ్చు.అందుకని అన్నమాట.పళ్ళు 70 లో కూడా ఎంచక్కా ఉన్న మా ఊరి తాతయ్య గారు
చెప్పారు ఈ చిట్కా. ఇంకా రోజు కిస్మిస్ ఒక 20 బాగా కడిగి రాత్రి నీళ్ళల్లో నానేసి, పొద్దున్నే తింటే పళ్ళు బలంగా ఉంటాయట. నేను పాటిస్తున్నా, మరి మా నేస్తందే ఆలస్యం.
- పద్మ.
నేస్తం,
అన్నట్టు నాకు పాత టెంప్లేట్ కొంచెం ఎక్కువ నచ్చింది. పువ్వుల్లో పాపాయి బొమ్మ భలే ఉండేది.
ఇది కూడా బాగుంది. అయినా అబ్బాయిలకి పూలు నచ్చావు కదా మనకి నచ్చినట్టు, కామట్టి మీరు మళ్ళీ శ్రమ తీస్కోకుండా ఇదే ఉన్చేయ్యండి.( టెంప్లేట్ మార్చే టైం ఒక కొత్త పోస్ట్‌కి ఇస్తారు కదా అనే స్వార్థం). ముందు మీ బ్లాగ్ చూసి అడ్రస్ కరెక్ట్ ఏనా అని చెక్ చేసుకోవాల్సి వచ్చింది.పక్కన ఉన్న సన్నజాజులు చాల బాగున్నాయి.ఇందాకే నేను సన్నజాజుల మాల కట్టాను( నిజం గానే). :-)
- పద్మ.
శ్రవ్యా నీకంత కష్టం ఏలా.. నేనే నీ పేరుబట్టి కనుక్కుని హయ్ శ్రావ్యా అనేస్తా ఏదో ఓ రోజు
గీతాచార్య అలా అంత చిన్న కస్టాలకే ఏడ్చేస్తే ఎలా అండి బాబు..అసలు అయినవి చెప్పితే ఏమైపోతారు ..ఇలా కాదు గాని హాయిగా నవ్వేయండి నా మాట విని
పద్మా ఎన్నాళ్ళాకు ఎన్నాళ్ళకు ..ఏమన్నా ఎక్జాంస్ యా?? లేకా జాబ్ లో బిజీ నా?? లేక పెళ్ళిగట్రా నా ?? అని ఒకటే తింకింగ్ .. హమ్మయ్యా మంచి చిట్కా చెప్పావ్ అలాగే నువ్వు చెప్పడం నేను పాటించక పోవడమునా
మామూలుగా నేస్తాన్ని గుర్తుపట్టడం కస్టమే కానీ నవ్వితే తెలుసుకొవడం ఈజీ :-)
నేస్తం
బ్లాగులు జాజిపూలు అని మీ బ్లాగు గురించి వేరే బ్లాగులో పొగుడుతూ రాసినట్టు
అది రాసిన రెండువారాలకే ఈతరం లో మీ బ్లాగు వచ్చినట్టు, సుజాత గారికి థాంక్స్ చెబుతున్నట్టు మీరొక టపా రాసినట్టు, ఆ తర్వాత మీ వారు ఎక్కడికి వెళ్ళినా మీరు నేస్తం వాళ్ళ హస్బెండ్ కదా అని అడుగుతున్నట్టు మీరు చాల సిగ్గుతో కూడిన గర్వపడుతున్నట్టు
హేమిటో ఒక పిచ్చి కల వచ్చిందండీ, అలారం మోగేసింది ఇంతలో
నేస్తం,
>>నువ్వు చెప్పడం నేను పాటించక పోవడమునా...
ఎంత మంచి అమ్మాయి మా నేస్తం ! :-) మా అమ్మ పోరితే, ఒక సంవత్సరం తర్వాతా అలవాటు చేసుకున్నా.ఇప్పుడు కూల్ డ్రింక్స్,ఐస్‌క్రీం తిన్నా పళ్ళు కడుక్కుంటా( అమ్మో పళ్ళు అంటే బంగారం కంటే ఎక్కువగా చూసుకోవాలి మరి, రెండు పళ్ళు కొద్దిగా అరిగిపోయాక బుద్ధొచ్చింది)
అన్నట్టు కిస్మిస్ బాగా కడగాలి,నానబెట్టె ముందు. ద్రాక్ష మీద పురుగు మందులు జల్లుతారు కదా, అవి అలాగే కదక్కుండా ఎంద బెట్టేస్తారు.వాటితో పాటు ఎండిన(తినలేకపోతే పండువి తినొచ్చు నానబెత్తకున్డ్డా) ఖర్జూరం,బాదం పప్పు లేదా వేరుసెనగపప్పు రాత్రి నానబెట్టి తింటాను, బలం కోసం.(ఐరన్ కొంచెం తక్కువుంది నాకు, ఖర్జూరంలో బోల్డెంత ఐరన్). మిగితావి ప్రోటీన్ కోసం, శరీరం బలంగా ఉంటె పళ్ళు ఉంటాయట.మీరు చపాతీ లాంటివి తినలేకపోతున్నందుకు ఇంత చిన్న వయసులోనే, నాకే చాల బాధ వేసింది. ఇప్పుడు నొప్పి తగ్గినట్టేనా అంటే చెప్పలేదు మీరు. :-(
మిమ్మల్ని నేనూ తల్చుకుంటూనే ఉంటాను బ్లాగ్స్ చూడటం కుదరకపొఇనా ఇన్నాళ్ళు.ఇంత మంచి నేస్తాన్ని ఎలా మరచిపోగలరు ఎవరైనా? :-) ఎంత ఆనందం గా ఉందో మళ్ళీ మీ రిప్లై చూసి.నాకు పెళ్లి కుదిరితే, మీకు పిలుపందక పోవడమా ? ఇప్పట్లో అలాంటి ఊసేమీ లేదు నేస్తం,ముందు ఉద్యోగం చూసుకున్నాకే అని గట్టిగా చెప్పేసా ఇంట్లో, ఇంకా చదువుకోవాల్సింది చాల ఉంది.ఎప్పుడు తెములుతుందో.అన్నట్టు నేస్తం,మీరు కామెంట్స్‌లో సరదాగా అందరికీ రిప్లై ఇవ్వడం చూసి ( అన్ని రకాల కామెంట్స్ కి ) మీ మీద అభిమానం మరింత పెరిగింది. :-)
మీ నేస్తం,
- పద్మ.
మంచు పల్లకి గారు అంటే 28 పళ్ళను లెక్కగట్టి గుర్తుపట్టేస్తారనే గా ..నాకు అర్ధం అయిపోయిందండి :/
పద్మా ఎంత ఓపిక అమ్మాయి అన్ని పోస్ట్‌లకూ కామెంట్ పెట్టావా??ఇంక నీకూ ఐరన్ తక్కువా?? నాకూనూ ..బ్లెడ్‌లో hb % ఎప్పుడూ తక్కువే.. దానికి తోడూ తిండీ అస్సలు సహించదేమో ఇంక ఒకటే బలం నాకు ..నువ్వు చేసే పనే నేను చెయ్యాలి ఇంక
అఙ్ఞాత గారు మీ కల రాక ముందే మీ కల నెలవేరిపోయింది సగం ... ఇంతకు ముందు చాలా బ్లాగుల్లో జాజి పూల బ్లాగ్ గురించి పొగిడేస్తూ రాసేసారు .. :) అంతా బాగానే ఉంది గాని చివర్లో ఏమిటో ఒక పిచ్చి కల అంటారా ...ఆయ్ .. అది మంచి కలండి మంచి కల ..రోజుకో మారు అలాంటీ కల కంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. నా మాటా విని అలా కానిచ్చేయండి ఏమంటారు :)
నేస్తం.....'ఎవరో'అనట్టు నా ఆత్మ మీ ఇంటి చుట్టే ఉందండోయి.జాగ్రత్త!!!
మిమ్మల్ని చూసీన తరువాత ఆ 'ఎవరో' పని పదతాను...హన్నా!!!
అది సరే గాని రాజేంద్ర గారు నేను ప్రచురించని వ్యాఖ్య మీకెలా కనబడిందంటారు ???
ఎంతైనా నా ఆత్మ మీ ఇంటి దగ్గరే ఉంది కదా.......:)
ఏదన్నా కామెంటేటప్పుడు "అనుసరణ వ్యాఖ్యలు xxxx@gmail.comకు పంపించబడతాయి."
అన్న దానిని టిక్ చేస్తే ఇలా మీరు ప్రచురించని వ్యాఖ్యలు కూడా చూడచ్చేమో అనుకుంటున్నాను,but not sure
అవునా.. :) ఏమోలేండీ నాకు అస్సలు ఏమీ అర్ధం కాదు ఈ బ్లాగ్ లో పోస్ట్ వేయడం తప్ప :)
నేస్తం గారు,
మీ పాత template బాగుంది,కానీ పూలు కొత్త template లోనివి బాగున్నాయి.మల్లెలు,జాజులు ఎంత బాగున్నాయో!
పాత template ఉంచేసి పూలు మాత్రం మార్చండి.
జాజి పూల photo మీరే తీసారా? చాలా బాగుంది.
template లో ఎలా మార్పులు చేయాలో శేఖర్ పెదగోపు గారి నడగండి,ఆయన సొంతంగా template design చేసుకున్నారు.
నేస్తం గారు,
పైన మల్లెలు ఉన్నాయి చూడండి,last లో green color gap వచ్చింది చూసారా దాన్ని కూడా సరిచేసి full screen వచ్చేటట్లు చేయవచ్చు అది కూడా అడగండి. మల్లెలు మాత్రం తీసారో నేను పెట్టేసుకుంటాను జాగ్రత్త!!!!
నేస్తం జీ..
టపా చదవడం కాస్త ఆలిశమైంది...పరీక్షల్తొ బిజీ బిజీ....నాకు అప్పుడప్పుడూ WISDOM TEETH INFECT అవుతూ ఉంటాయ్...dentist దగ్గరికెళ్తే పన్ను పీకేస్తానంటారు...నాకేమో పళ్ళు పీకటమంటే, కాలో చెయ్యో తీసేసినట్టనిపిస్తుంది....అందుకే ఏ DENTIST దగ్గ్రరికెళ్ళినా నేను చెప్పినట్టు tretment చెయ్యాల్సిందే...లేకపోతే వచ్చేస్తా...నాకు తెలిసీ ఇండియాలో కంటే ఫారిన్ డెంటిస్ట్ లే బెట్టర్..
ఇంకో విషయం...డాబర్ రెడ్ పేస్ట్ వాడండి...నాకు అది వాడటం మొదలెట్టాక no dental problems...మరో విషయం...మీది పాత template ఏ బాగుంది....
రెండు దేశాల డాక్టర్లైపోయారు, మలేషియా డాక్టర్ ఎవరికైనా చూపించుకుంటారా?పొయ్యిలోంచి బయట పడ్డారని ఆశిస్తున్నాను.
నీహారిక అవును పువ్వులు బాగున్నాయి కదా, నాకు సన్నజాజులన్నా,విర జాజులన్నా మహా ఇష్టం ..నాకు టెంప్లెట్ విశాలం గా ఉండాలని ఇష్టం ..పెద్ద పోస్ట్ లు కదా... అందుకే హెడ్డేర్ మార్చా .. ..శే..ఖ్ఖ...ర్ ఎక్కడున్నా హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం :) ..
కౌటిల్య గారు అదే డాక్టర్ గారు ఏంటబ్బా ఇంకా రాలేదు అనుకుంటున్నా..ఎక్జాం ఎలా రాసారండీ?? :)
బాటసారి గారు అదేం మలేషియా అండీ బాబు .. ఒక్క కౌలాలం పూర్ తప్ప మిగిలిన ప్లేస్‌లు అడవే .. మరి అక్కడి డాక్టర్స్ సంగతి తెలియదు.. :)
మీరు header width ఎంత ఉందో చూడండి,అది ఎంత ఉందో అంతే width image కూడా ఉండేటట్లు set చేయండి.పైన ఉన్న మల్లెలు అన్నీ gap లేకుండా మీ పాత template లో ఉన్నట్లు వస్తాయి.
ఇంకో పద్దతి ఏమిటంటే మీ పాత template ఉంచేసి,
పాత image code delete చేసి కొత్త image code పెడితే,template పాతది ఉంటుంది image కొత్తది ఉంటుంది.
ఏదో "అమ్మ"దయ వల్ల పరీక్ష బానే రాశా...రేపే రిజల్టు...నాకు మాంఛి specilisation లొ సీట్ వచ్చి నేనో పేద్ద surgeon ఐపోవాలని మీరు రోజూ ప్రార్థనలు చెయ్యాలి మరి...
అమ్మో నేస్తం, నాది Same Problem. నెను US లో వుంటా. ఇక్కడ అవసరం లేని అడ్డమైన treatmentలు చెసేసి పిల్లలకి బలవంతంగా పళ్ళు పీకేసిన కౄర Doctor కథ TV లో చూసి భయపడి India వెళ్ళినప్పుడే Dentist దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నా. ఇప్పుడు మీ అనుభవం చూసాక అది కూదా భయమెస్తోంది. పళ్ళు అన్నీ వూడిపొయినా ఫర్వాలేదు కానీ Dentist దగ్గరకి మాత్రం వెళ్ళకూడదనిపిస్తోంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి