19, ఫిబ్రవరి 2010, శుక్రవారం
ప్రేమ కధలు పలురకాలు - 5
అలా స్వాతిని తీసుకుని బయటకు వచ్చేసాక ,ఏమైందే అన్నాను ఆత్రుతగా.. ఇందాకేమో నేను వస్తున్నానా!, అప్పుడు గీతాంజలి గాడి ఫ్రెండ్స్ లేరూ,అదేనే ఆ నల్లోడును, పొట్టి గా ఉంటాడు వాడూను వాళ్ళిద్దరూ నా దగ్గరకొచ్చి మీ ఫ్రెండ్ పేరు ఏంటండి? అని అడిగారు అంది.. అవునా చెప్పేసావా అన్నాను కంగారుగా ... నిన్నటివరకు పేరు తెలియకుండా ప్రేమేన్టిరా దొంగ మొహం గాడా అని తిట్టుకున్నా నాకే మళ్లీ భయం ..అదేంటో?? ... ఉహు ,మీకెందుకు అని గభ గభా వచ్చేసా అంది.. ఉఫ్.. హమ్మయ్యా అనిపించింది..
కాసేపాగి నాకో డవుటు వస్తుందే అంది ఏదో ఆలోచిస్తూ ..ఇదేవర్తిరా బాబు నిమిషం ,నిమిషానికి టెన్షన్ పెడుతూ అనుకుని ఏంటి ?అన్నాను నీరసం గా .. ఆ గీతాంజలి గాడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ,వాళ్ళలో ఒకళ్ళు నీకు లైన్ వేస్తున్నారు అంది ఏదో కనుగున్నట్లు పోజు పెడుతూ.. నాకు అంత టెన్షన్ లోనూ నవ్వువచ్చింది..డవుటు కాదు కన్ఫర్మేనే ,మొన్న దీపావళికి మీ ఇంటిదగ్గర పటాసులు కాల్చేరు కదా ,ఆ ముందు రోజు మన వెనుక వాళ్ళే వచ్చారు, నీ మాటలువిని మీ ఇంటి ముందు ఆ హడావుడి చేసారు..ఎంతైనా ఫ్రెండ్ కదా అందుకే గీతాంజలి గాడు వాడికి హెల్ప్ చేసి ఉంటాడు ...మనమేమో మా అమ్మమ్మకు భయపడిపోయారేమో అనేసుకున్నాం ..అది కాకుండా నేను ఎప్పుడు గమనించినా వాడు నీ వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది ..నాకు ఆ నల్లోడి మీదే పెద్ద డవుట్ ..మనం ఎలాగైనా కనిపెట్టాలి అంది సీరియస్ గా ..
ఓరి దేవుడోయ్ దీన్ని ఇలా వదిలేస్తే లేనిపోని సమస్యలు తెచ్చేలా ఉంది అనిపించింది.. మనకేందుకే ఇవన్నీ!! ...మనమేమన్నా వస్తువులమా ! ఈ అమ్మాయిని నువ్వు ఇష్టపడు, ఈ అమ్మాయిని నేను ఇష్టపడతా అని పంచేసుకోడానికి..వాళ్ళ పద్దతి ఏమి నాకు నచ్చ లేదు.. చాలు ఇన్నాళ్ళు వాళ్లకు ఇచ్చిన అలుసు ..ఇంక మన జాగ్రత్తలో మనం ఉందాం అన్నాను.. అంటే ఏం చేద్దాం అయోమయం గా అడిగింది ...
ముందు రోజు నేను వేసుకున్న ప్లాన్ లన్ని వరుసగా చెప్పేసాను ..ముందు మనం రూట్ మార్చేద్దాం ..వాళ్లకు కనబడితేనే కదా సమస్యలన్నీ అన్నాను ..అయ్యబాబోయ్!! ఇప్పటికే చాలా దూరం ..ఇంకా అంత తిప్పి నడుస్తే అయిపోతాం అంది.. ఏం పర్లేదు ఒక అరగంట ముందు రా అన్నాను.. మరి మద్యాహ్నమో ??..తిని వెంటనే బయలుదేరుతేనే టైం సరిపోదు అంది.. అందుకే బాక్స్ తెచ్చేసుకుందాం అన్నాను ..బాక్సా !!నీకేం తల్లి నువ్వు నాన్‌వెజ్ తింటావ్ ..మీ అమ్మగారు ఆమ్లెట్ అనో కోడి గ్రుడ్డు పులుసనో ఏదో ఒకటి వండుతారు .. నాకు ప్రొద్దున్నే కుదరదని పప్పు ,పచ్చడి-పప్పు పచ్చడి .. అదే వండుతారు ..పోనీ నువ్వన్నా నీబాక్స్ షేర్ చేస్తావా అంటే ససేమిరా అంటావ్ నేను తినలేను బాబు అంది..
స్వాతి వాళ్ళు శాకాహారులు ..వాళ్ళింట్లో ఏం ఫంక్షన్ వచ్చినా నన్ను తప్పక పిలుస్తారు .. ఇంక అక్కడ చూడాలి తతంగం.. అరటి ఆకును భోజనం చేసేటపుడు తాక కూడాదంట.. 'అంటు'.. నేనేమో పదిసార్లు ఆ ఆకును నా ముందుకు లాక్కునేదాన్ని.. అందరూ నా వైపు చూడటమే.. అదేకాదు ముందు పప్పే వేసుకుతినాలి..తరువాత ఫలానా తినాలి .. ఇలా చాలా రూల్స్ ఉండేవి.. పైగా వాళ్ళ అమ్మమ్మగారికి నేను అంటే బోలెడంత అభిమానం.. నన్ను వాళ్ళ ఇంటి అమ్మాయిలా ఫీల్ అయ్యి ఆ పద్దతులు అన్నీ నా చేత కూడా చేయించేవారు .. ఇప్పుడు స్వాతికి నేను ఇలాంటివి అన్నీ అలవాటు చేస్తే ఇంకేమన్నా ఉందా..ముఖ్యం గా నాతో పోలుస్తూ స్వాతిదాన్ని తిట్టరు కదా.. అదీ సంగతి ..
అందుకే నీకు అంతగా తినాలంటే ఇంకేవరినన్నా అడుక్కో..నేను పెట్టను అని ఖరాఖండిగా చెప్పేసేదాన్ని ..అది ఇలా సందర్భం వచ్చినపుడల్లా దెప్పేస్తూ ఉంటుంది ..ఇదిగో నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నాతో రా..లేదూ ,నువ్వు వేరుగా వెళ్ళు, నేను వేరుగా వెళ్తా ..అసలే ఎక్జాంస్ వచ్చేస్తున్నాయి ..వాడు నా వెనుకాతల పడుతున్నాడా?..వీడు ఎవరిని చూస్తున్నాడు?? లాంటి వాటి తో టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ,తర్వాత నీ ఇష్టం అని ఖచ్చితం గా చెప్పేసాను.. దానికి ఎక్జాం పేరు చెప్తే చాలు సెట్ అయిపోతుందని తెలుసు.. ఇంక తప్పక సరే అనేసింది..
అక్కడినుండి మా పని దాగుడు మూతల దండాకోర్ ..పిల్లి వచ్చే ఎలకా బద్రం అన్నట్లు అయిపొయింది.. మేము కనిపించక పోయేసరికి వాళ్ళు ఊరంతా తిరిగి వెతకడం మొదలు పెట్టారు.. మద్య మద్యలో కనిపించినా ఎందుకు వచ్చిన గొడవ అని హడావుడిగా వెళ్ళిపోయేవాళ్ళం ఒక్క ముక్క కూడా మాట్లాడుకోకుండా ..ఆ తరువాత ఎక్జాంస్ గోల లో పడిపోయి,వేసవి సెలవలు వచ్చేసరికి ఆ విషయం దాదాపుగా మర్చిపోయాము..
ఒక రోజు హుషారుగా ఒక పేపర్ మీద కవితలు (??) రాసేసుకుంటుంటే అమ్మ నన్ను పక్క రూం లోకి పిలిచింది .. ఏంటమ్మా అని గదిలోకి వెళ్ళగానే తలుపులు వేసి నీతో మాట్లాడాలి అంది.. ఎప్పుడూ లేంది ఎందుకలా అంటుందో తెలియక ఏమైంది ?? అన్నాను అయోమయం గా.. ఏంటీ , నీ వెనక ఎవరో పడుతున్నారు అంట ??నిజమేనా అంది.. ఉరుములేని పిడుగులా అలా హఠాత్తుగా అనేసరికి నోరు ఎండిపోయింది దెబ్బకు..మా అమ్మ కోపంగా అంటుందో,అనుమానంగా అంటుందో నాకు తెలియడం లేదు .. అమ్మ మొహం లోకి సూటిగా చూడాలంటే భయమేస్తుంది ... మనసులో దేవుడా ..దేవుడా.. దేవుడా అనుకుంటూ ..నా వెనుకనా !! అబ్బే లేదే ..ఎవరు చెప్పారు అన్నాను.. ఎవరు చెప్తే ఏంటి ? అంత కోళ్ల ఫారం పెట్టుకోవాలని ఇష్టమున్నదానికి చదువెందుకే.. నాన్నకు చెప్పక పోయావా అంది.. కోళ్ల ఫారం ???నేను కాలేజ్ కి ఎండలో వెళుతున్నపుడు విసుగొచ్చినపుడు తరచూ స్వాతి తో అనేమాట ... 'కోళ్ల ఫారమా '!!కోళ్ల ఫారం ఏంటి??.. నాకు భయం తో అరిచేతులు నిండా,వళ్ళంతా చెమట పట్టేసి నీళ్ళు కారిపోతున్నాయి..
మరి నువ్వు చెప్పేవని వాడు కోళ్ల ఫారం పెడుతున్నాడంట ..అనేసరికి తల గిర్రున తిరిగింది ..ఓరి వీడి నోరు పడిపోను ..బయట అందరికీ ఇలా చెప్పుతున్నాడు కాబోలు ..అయిపోయింది ...అంతా తెలుసు అమ్మకి ..అయినా ఎలా తెలిసింది ?? ఇంక జరిగింది చెప్పేయడం మంచిది అనుకుని, అమ్మా!! అసలు ఆ అబ్బాయి తో నేనసలు మాట్లాడలేదమ్మా ..వాడెవడో పేరు కూడా తెలియదు నాకు అన్నాను ..మరి ఇందాకా నా వెనుక అసలు ఎవరు పడలేదన్నావ్ అంది ..అమ్మా తల్లీ, లేడి డిటెక్టివ్ .. అసలు వాడెవడో ,ఏమిటో తెలియదు..నా వెనకపడుతున్నాడో ,స్వాతిదాని వెనుక పడుతున్నాడో అస్సలు తెలియదు.. మాతో అస్సలు ఒక్క మాట కూడా అనలేదు ఆ అబ్బాయి .. మేము మాట్లాడే మాటలన్నీ విని అలా లేని ,పోనివి ప్రచారం చేస్తున్నట్లున్నాడు..నమ్ముఅమ్మా అన్నాను దీనంగా..మరి మాకు ముందే ఎందుకు చెప్పలేదు అంది..ఏమని చెప్పమంటావ్ ?? మా వెనుక నడుస్తారు అంతే..ఎందుకని ??అడిగామనుకో ..రోడ్ మీ తాత గారిదా అంటారు అప్పుడేం చేస్తావ్ అన్నాను..
అమ్మ కాస్త మెత్తబడినట్లుగానే అనిపించింది ..హమ్మయ్యా అనుకున్నానో లేదో ..తన కళ్ళ లోనుండి నీళ్ళు జల, జలా వచ్చేస్తున్నాయి..నాకు భయం వేసింది ..అమ్మా నిజమమ్మా ..కావాలంటే స్వాతిదాన్ని అడుగు ..కాలేజ్ కి వెళుతుంటే ఇవన్ని మామూలే ..మరీ పెద్ద గొడవ అయితే చెప్దాంలే అనుకున్నా, అంతే తప్పా దాచేయాలని కాదు అన్నాను బ్రతిమాలుకుంటూ..మీకన్నీ చిన్న విషయాలలాగే ఉంటాయే.. బయటికి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు మాకు గుండెలు ఎలా ఉంటాయో తెలుసా.. గట్టిగా అంటే మా మీద నమ్మకాలు లేవా అంటారు..బయటేమో రోజులు బాగుండటం లేదు.. మీ అంత చదువుకోకపోయినా మీకంటే జీవితాన్ని ఎక్కువ వడబోసిన వాళ్ళం .. ఇప్పుడుకాదు మీరు పెద్దయ్యాక ఒక ఆడపిల్ల తల్లి అవుతారు చూడు అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంది కళ్ళు తుడుచుకుంటూ..
నాకేం మాట్లాడాలనిపించలేదు..కాసేపు మౌనంగా ఉండిపోయా .. ఇదిగో మనం ఉమ్మడి కుటుంభం లో ఉన్నాం.. చిన్న మాట వచ్చిన ఫలానా వాళ్ళ కుటుంభం లో అమ్మాయి అని ఇంటి పేరు మొత్తం చెప్పి మాటలు అంటారు..మిగిలిన వాళ్ళ పిల్లలు కూడా నీకు చేల్లెళ్ళే కదా ..ఆ మాట వాళ్ళు కూడా పడాలి కదా.. అదెంత తలవంపులు చెప్పు ..తోడికోడళ్ళ దగ్గర నేను తలెత్తుకోగాలనా.. నామాట సరే ,నాన్న సంగతి తెలుసుగా ..ఒక ట్రైన్ ఎక్కినా ముప్పై మూడు భోగీలు మారుస్తారు ..మీకిదంతా చాదస్తం క్రింద అనిపిస్తుంది.. అందమంది ఆడపిల్లల తండ్రి కి ఎంత భయమో ఆలోచించరు.. మేమేం చెప్పినా విసుగ్గా అనిపిస్తుంది అంది ..
కాసేపు అలా క్లాస్ తిసుకున్నాకా సరేలే ..ఇంక వెళ్ళు అంది.. వెళ్ళబోతూ అమ్మా ,ఎలా తెలిసింది నీకు అన్నాను కొంచం భయపడుతూనే ..మళ్లీ ఏం అంటుందో అని భయం.. వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి అమ్మ కి మనం తెలుసులే..మొన్న అందరూ వాళ్ళింట్లో నీ గురించి మాట్లాడుకున్టున్నారట..ఈవిడ చాటుగా విని, ఎవరని గట్టిగా అడిగితే నీ గురించి చెప్పారంట..వాళ్ళింటి పిల్లను అల్లరి పెడతారా అని వాళ్ళను తిట్టి నాకొచ్చి చెప్పింది.. ఏమండీ 'ఇదీ సంగతి' ..రోజులు బాగుండటం లేదు ..ఫలానా వాళ్ళబ్బాయి ఇలా వెంటపడుతున్నాడంట ..జాగ్రత్త అని అంది ..ఓ ..అని బయటకు వచ్చేసాను ..
అక్కడి నుండి ఒకటే భయం ..నాన్నకు చెప్తే అందరూ కలసి వాడిని తంతారేమో అని..అసలే బక్క ప్రాణి .. నిజం చెప్పాలంటే పాపం కాస్త మంచివాడే. ఎప్పుడూ వేధించలేదు.. ఆ దిక్కుమాలిన ఫ్రెండ్స్ వెనక నుండి అలా చెయ్యి ,ఇలా చెయ్యి అని ముందుకు తోసారు తప్ప.. తనకంత ధైర్యం కూడా లేదు .. అనవసరం గా చిక్కుకు పోయాడు ..అమ్మకు చెప్పాలనిపించింది ..ఎందుకు లేమ్మా ..మరీ ఎక్కువ చేస్తే అప్పుడు చూద్దాం లే అని ..ఇంకేమన్నా ఉందా అసలు అనుకుని ఊరుకున్నా ..
ఆ తరువాత నేను ఎప్పుడు కనబడినా ఒక సారి చూసి తల వంచుకు వెళ్ళిపోయేవాడు .. ఆ గేంగ్ కుడా లేదు ..పాపం కొట్టారేమో ?? అనిపించేది.. అమ్మని అడగాలంటే భయమేసింది ...అసలు నాన్న ఈ విషయం మీద నాకు ఎక్కడ క్లాస్ తీస్తారో అని సగం భయం వేసేది కాని ,అసలు నన్ను అడగనే లేదు.. అమ్మ ఏం చెప్పిందో?.. ఆ తరువాత ఈ విషయం స్వాతికి తెలిసాక ..ఏమే .పడక పడక ఒక్కడు నా వెనుక పడితే వాడిని కొట్టిన్చేస్తావా? అంత కుళ్ళు ఏంటే బాబు నీకు అంటూ ఏడిపించేది ..
చాలానాళ్ళ తరువాత ఒక సారి అమ్మని అడిగాను ఏమైందమ్మా కొట్టారా?? అని.. లేదమ్మా ,నాన్న వెళ్లి వాళ్ళ పెద్ద వాళ్లకి విషయం చెప్పారంట ..వాళ్ళు ,నాన్న ఎదురుగానే ఆ అబ్బాయిని పిలిచి తిట్టి ,ఇంకెప్పుడు ఇలా జరగదండి అని చెప్పారంట అంది..హమ్మయ్యా అని ఉపిరి పీల్చుకున్నా ..గొడవలేకుండా సమస్య తీరిపోయినందుకు దేవుడా అని దణ్ణం పెట్టేసుకున్నా..
మొన్న ఇండియా వెళితే ఆ అబ్బాయి కనబడ్డాడు..వాళ్ళ ఆవిడతో ..ఒక చిన్న బాబు తో .. చాలా ఆప్యాయంగా వాళ్ళ ఆవిడకు ఏదో చెప్పేస్తూ నన్ను చూసి ..నేనా ,కాదా అన్నట్లు ఒక్క క్షణం చూసి గబుక్కున తల తిప్పేసుకున్నాడు.. చిన్నప్పటి విషయాలు గుర్తు వచ్చి నవ్వు వచ్చింది :)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
63 కామెంట్లు:
Bavundi nestam me story....nenu inka meru edo adventures chesesi untaru anukunna...aasha petti ila chestara :).mottaniki kadha sukhantham chesesaru ga
bagundii mitramaa.......
neenu mii posts anni chadivanu....
ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాని ఫిమేల్ కారెక్టర్ ని లీడ్ రోల్లో పెట్టి చూసినట్టుంది మీ అయిదు టపాలు చదివాక...:-)
అయిదు భాగాలు ఊరించి... ఇలాంటి సాఫ్ట్ ఎన్డింగ్ ఇస్తారా! నేను ఖండిస్తున్నాను!
ప్చ్ నాది రెండొ కామెంట్. :(
ఇప్పుడు చదివి అసలు కామెంట్ ఇస్తా
గులాబి మరియు చైతన్యా.. అమ్మా బంగారాలు ఇది జీవితం అమ్మా.. అడ్వెంచర్ అనే పదం నా హిస్టరీలోనే లేదు ..మహా పిరికిదాన్ని :)
సత్య గారు థెంక్యూ:)
శేఖర్ :)
పవన్ కాదుగా 2 వ కామెంట్ కూడా కాదు :)
అబ్బే! క్లైమాక్స్ ఏమీ బాలేదు. ఒక్క ఫైటింగ్ కూడా లేకపోతే మాలాంటి మాస్ జనాలకు అస్సలు నచ్చదు. :)))
హ హ మరే మీరిచ్చిన బిల్డప్ చూసి నేను కూడా చాలా ఊహించేసుకుని ఓ పేద్ద సినిమా చూసేశాను :-) మొత్తానికి సుఖాంతం చేశారు శుభం :-)
mmm... baagundi.. keka.. sooper.... ani cheppi cheppi naaku bore kodutondandi.
kaani tappatledu... Eppati lagaaney baagundi..
Rajkumar
vammo entandi maree chinna daniki kuda intalana marenu. inka adi chinnapudu. school lo chadvutunnapudu. miru kangaru padatam sare, mi amma inka mi kanna ekkuva kangaru padatam :)
miku mi personal vishyalu vere vallatho share chesukovalante chala bayame. emina korikestara enti ;) annitlone bayame.ila unte chala kastam andi.
Na friend mee blog gurinchi cheppindi. Bagundi - naku Telugu baga vachu kani lengthy pieces chadavalante endukogani aayaasam vastundi, aina pattubatti mee anniversary post, ee post chadivanu.
Mee anniv. post baga navvinchindi -correct ga rasaru, mana nature ki, manamu nerchukunna culture ki conflict baga chepparu. Nenu strivadine, aina naku vanta anna, food anna chala interest - strivadi ainanta matrana mana interests tappu ani analemu kada. Aite na ishtam vachinapude vandutanu, lekapote ledu - adee strivadame kada :)
Bommalu bagunnayi, meere vesara?
నేస్తం గారు అలా ముగిసిందనమాట. పాత విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా మనసు ఎక్కడికో పోతుందే... మీ టపాలతో నా జీవితంలో జరిగినవన్నీ గుర్తు తెచ్చారుగా! మీకు థాంక్స్ చెప్పుకుంటున్నాను.
తెలిసీ తెలియని వయసులో... మన జీవితంలో జరిగిన ఇటువంటి కథలు ఎప్పటికీ మరిచిపోలేం కదా!
naaku na tholiprema gurthu ku vachindhandi...chaala rojula tharuvatha aa ooru velthey aa ammayi idharu pillalu n valla husband tho bike meedha velthu aagi palakarinchindhi....
baagundi. Nice post.
హమ్మయ్య అయిపోయిందా ! ( నేనింకా ఆ అబ్బయితోనే నీ పెళ్ళయిపోయిందేమో అని కంగారు పడ్డానులే )
నీ ప్రేమ కధ అయిపొతే నా ప్రేమ కధ ( చ...నాది అంటే నాకు తెలిసిన అని ) మొదలెడదామని వెయిటింగమ్మా ఇక్కడ . మరి మరో ప్రెమ కధ మొదలు పెట్టెయ్యనా
ivala enduko ala miremana kothaga rasara chudam ani chusanu
2 posts unai
koncham bore kotiyi e sari
ayina me rachana style baundi
next em rastaru e pandaga gurinchi?
chala bagumdi.koodali ni chudatam kudaratam ledu .kaani eppudu open chesina mi post emaina undemonani vetukutaanu.
గట్టిగా అంటే మా మీద నమ్మకాలు లేవా అంటారు..బయటేమో రోజులు బాగుండటం లేదు.. మీ అంత చదువుకోకపోయినా మీకంటే జీవితాన్ని ఎక్కువ వడబోసిన వాళ్ళం .. ఇప్పుడుకాదు మీరు పెద్దయ్యాక ఒక ఆడపిల్ల తల్లి అవుతారు చూడు అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంది కళ్ళు తుడుచుకుంటూ..
..........
enta baaga chepparandi mee ammagaaru.........ardhm chesukovaalsina maata...........
రాఘవ్ గారు :)
ప్రసాద్ పోని నెక్స్ట్ టైం ఒక కధ వ్రాసి ,అందులో హీరో పేరు నాగ ప్రసాద్ అని పెట్టి, ప్రతి ఎపిసోడ్ కి అమ్మాయి తండ్రికీ ,మీకు 3 చేజింగ్‌లు 6 ఫైట్లు పెట్టి.. పోస్ట్ చేయనా :)
మరి నిజంగా జరిగిందే ..శుభం కార్డ్ పడింది.. అది చాలు వేణు గారు :)
వేణు రాం పాపం బోర్ కొట్టినా ఓపిగ్గా పొగిడేది మీరేనండి..
స్వప్నా మరి అందరూ నీ అంత ధైర్యంగా ఉంటే ఎలా ?? కొంత మంది నాలాంటి పిరికివాళ్ళను కూడా పుట్టించేస్తాడు దేవుడు ఒక్కోసారి :)
హ హ అఙ్ఞాత గారు..మరి మీలా విశ్లేషించుకుంటే ..ఎదురుగా టెబుల్ పై ఉన్న మంచి నీళ్ళ గ్లాసును తీసుకోడానికి బద్దకం వేసి నన్ను పిలిచి తెప్పించుకునే మా వారు పురుషవాది ,ఆయన పై నిమిషానికోమారు విరుచుకు పడి మౌన పోరాటాలను చేసే నేను స్త్రీవాదిని అయిపోతాం ... ఆ బొమ్మలు నేను కాదండి వేసింది :)
సవ్వడి గారు నిజమే :)
విశ్వనాధ్ గారు :) హ హ అవునా
సునిత గారు :)
>>>నేనింకా ఆ అబ్బయితోనే నీ పెళ్ళయిపోయిందేమో అని కంగారు పడ్డానులే
లలిత గారు ఈ పోస్ట్ కొచ్చిన స్పందన చూసి .. ట్విస్ట్ కోసం అలా రాసేద్దాం అన్నా మా ఆయనా,జనాలు తంతారని బుద్దిగా జరిగింది వ్రాసేసాను..మీరు వెయిట్ చేయడమేంటండి ..ఇక్కడ చకోర పక్షులు ( అంటే నాలాంటి వారు) మేమున్నాం.. మీరు వ్రాసే పోస్ట్‌లను అపురూపం గా చదవడానికి :)
@ అమ్మ ..నెక్స్ట్ నా బ్లాగుకి వేశవి సెలవలన్నమాట.. ఇంకా ఏం అనుకోలేదండి :)
అయ్యబాబోయ్ అరుణాంక్ గారు ఎన్నాళ్ళకెన్నాళ్ళకి :)
vinay :)
నేస్తం గారూ,
ఏంటండీ, ముగింపు ఇలా ఇచ్చారు..లలిత గారిలా నేను కూడా అనుకున్నా...పాపం...మా గీతాంజలిగాడికే మా ఓటు....ఎంత సిన్సియర్ గా ప్రేమించాడండీ...అందర్లా పోకిరీ వేషాలేం వెయ్యలేదు కదా!...మీది మరీ రాతిగుండె సుమండీ.....అందుకే నిరంతర క్రికెట్టు ప్రియుడైన పురుషాహంకారి మీకు భర్తగా దొరికారు...మా గీతాంజలిగాడి ఉసురు ఊరికే పోతుందా మరి...మొన్న కనపడ్డప్పుడన్నా మీరు కనీసం పలకరించాల్సింది...ఏం చేద్దాం, రాతిగుండె....
బాగా నవ్వించారండీ...మీ తదుపరి టపాకోసం ఎదురు చూస్తుంటా...
హమ్మయ్య.. మొత్తానికి పూర్తి చేశారండి బాబు. బాగుంది "మీది కాని" ప్రేమకథ (అవును మరి.. మీవెంపు నించి ప్రేమ లేదు కదా.) మొత్తానికి శుభం కార్డు వేసే ముందు మిమ్మల్ని ప్రేమించిన ఆ సదరు గీతాంజలి గారు (మేము కూడా 'గాడు' అంటే బాగుండదు కదండీ!) అస్తమిస్తున్న సూర్యుడివైపు భారంగా నడిచి వెళ్తున్నట్టు కాకుండా, సినిమా చివర ఫ్యామిలీ ఫోటో తీయించుకోవడానికన్నట్టు ఒక చోట చేరే actors లాగ ఫ్యామిలీ తో కనిపించారన్నమాట. బాగుంది.
నేనెవరని చూస్తున్నారా? నేను మీ బ్లాగ్ లో కామెంటు రాయడం ఇదే మొదటిసారి. మా ఆయన ఒక పుణ్యదినాన మీ బ్లాగ్ అడ్రస్ ఇచ్చారు. ఇంక చూసుకోండి ఆ రోజు నించి ఇరగదీసుకున్నా మీ బ్లాగ్ ని. ఎక్కడికక్కడ కామెంట్ రాసేద్దాం అని చేతులు తెగ దురదపుట్టాయి. కీబోర్డు టకటకమని ఘోషించింది. కానీ, ఆ పోస్ట్ లు రాసి చాలా ఆ ఆ ఆ.. కాలం అయిపోవడం వలన రాయలేదు. అసలు కారణం, మీరు ఈ ప్రేమకథని ఎంతో దీక్ష, ఏకాగ్రతలతో రాసేస్తున్నారు కదా.. మిమ్మల్ని మళ్ళీ ఆ పోస్ట్ ల వైపు మళ్ళించి డిస్టర్బ్ చెయ్యడం ఎందుకని రాయలేదన్నమాట. పైగా, ఎంతో మంది చదువరులు మీ ఈ పోస్ట్ తరువాతి భాగం కోసం బాగా ఎదురుచూస్తున్నారని కామెంట్స్ ద్వారా తెలుసుకున్నదానినై, మీ దృష్టి మరల్చడం ద్వారా నేను ఎటువంటి ఆలస్యానికి కారణమైనా వారు ఊరుకోరు అని గ్రహించి రాయలేదన్నమాట. మీరు ఈ పోస్ట్ చివరి భాగం ఎప్పుడు రాస్తారా? ఎప్పుడు వ్యాఖ్యేద్దమా అని తెగ చూస్తున్నా.
బలే బాగుందండి. చాలా చాలా బాగా రాస్తున్నారు. తీరిక దొరకకపోయినా, ఒకడు కాళ్ళు పట్టుకుని లాగుతున్నా, ఇంకోడు ఎత్తుకోమని ఏడుస్తున్నా కూడా తెరచి ఉన్న మీ బ్లాగ్ అడ్రస్ ని Refresh చేసేలాగా చేస్తున్నారు.
(ఈ వ్యాఖ్య రాయడం మొదలు పెట్టినప్పుడు 6 కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అది 24 అయింది. అంతా టైం పట్టిందన్నమాట రాయడానికి.)
@ కౌటిల్య : మరే....మన నేస్తం జాతకంలో కోళ్ళఫారాలు రాసిలేవు ఏం చేస్తాం .
మ్మ్.. అదేంటి నాకు క్లైమక్స్ నచ్చింది.. చాలా బావుంది.. ఒవర్ గా లేకుండా రియలిస్టిక్ గా వుంది.. ఈసారి ఇలా ఎక్కువ బాగాలు రాసేటపుడు ఒక్కొ బాగం ఒకే రొజు పొస్ట్ చేసేలా చూడండి.. మేము చిన్నప్పుడు చందమామ కొసం అలాగే చూసే వాళ్ళం.. రేపు వస్తుంది అనగా ఆ ముందు రొజు రాత్రి నిద్రపట్టేది కాదు.. ఎప్పుడు తెల్లరుతుందా అని.. సొ మీరు వారం లొ ఒక రోజు ఫిక్స్ చెస్తే మేమూ ముందురొజు రాత్రి నుండి ప్రతి పది నిముషాలకి రిఫ్రెష్ చేస్తూ వుంటాము.. మొదటి కామెంట్ చేసే అవకాసం దొరుకుతుంది.. :-))
బాగుందండి మీ కథ. మా (మన) రోజుల్లో 90 శాతం కథలు ఇలానే అయ్యేవి కాబోలు. వెంటబడ్డం.. పెద్దవాళ్ళకి తెలిసాక దెబ్బలు.. సీన్ కట్ చేస్తే ఇదిగో గీతాంజలి గాడి లాగా.. ప్రేమ పేరుతో ఇప్పుడు చలామని ఔతున్న పైసాచికత్వం లా ఉండేది కాదు... అందుకే యేళ్ళ తర్వాత తలుచుకున్న చిలిపిగా ఉంటుంది తప్ప భయం వేయదు.
అరిటాకులో భోజనమా... నాకు పరమ ఇష్టం. అంటే ప్రాణం... ముందు పప్పు, తర్వాత సాంబార్ తర్వాత పెరుగు. కూర నంచుకునేదానికి. :-) మరిచా.. అరిటాకుని ముట్టుకుంటే "అంట్లే" మరి. హ హ హ .. బాగుందండి. పెళ్ళి భోజనం చేయాలని ఉంది.. ఇక్కడ పెళ్ళైన అదే వంటకాలు అదే రుచి.. ఈ సారి దేశం వెళ్ళినప్పుడు ఎదో ఓ పెళ్ళి లో దూరిపోయి తినాలి.
>>>నిరంతర క్రికెట్టు ప్రియుడైన పురుషాహంకారి మీకు భర్తగా దొరికారు
కౌటిల్య గారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా.. పెళ్ళిలో వేదమంత్రాల మద్య ఆయన్ని తిట్టుకునే హక్కు పంతులగారు కేవలం నాకు మాత్రమే ఇచ్చారు ..మీరెవరూ అనకూడదన్నమాట :P
శాంతి గారు బ్లాగ్మిత్రుల కోసం ఇన్నాళ్ళు కామెంట్ వ్రాయకుండా త్యాగం చేసారన్నమాట..ఈ కొత్తరకం త్యాగం ఇదే మొదటిసారి వినడం ..దీన్ని బట్టి ఆడవాళ్ళు ఎన్నోరకాలా త్యాగాలను ఇట్టే చేస్తారని సాక్ష్యాదారాలతో సహా రుజువు చేసారు.. :D
తీరిక దొరకకపోయినా, ఒకడు కాళ్ళు పట్టుకుని లాగుతున్నా, ఇంకోడు ఎత్తుకోమని ఏడుస్తున్నా కూడా మీరు నా బ్లాగ్ చదివినందుకు,మెచ్చుకున్నందుకు చాలా చాలా థేంకులండి :)
లలిత గారు మీరలా అనకండీ బాబు అసలే మా ఆయన ఈ మద్య వ్యాపారం ఏదన్నా చేద్దాం అని ప్లాన్స్ మీద ఉన్నారు..నాకిష్టమేమో అనుకుని ఇలాంటిది పెట్టినా పెట్టగలరు ..
మంచు పల్లకి గారు మొత్తానికి మెచ్చుకున్నారు హమ్మయ్యా :)
శశాంక్ గారు పెళ్ళి లో అరటి ఆకు బోజనం గుర్తు చేయకండి..నాకు మహా ఇష్టం.. నాకు ఇలా కేటరింగ్ కి ఆర్డర్ చేసింది కాకుండా ఇంట్లో స్వయం గా చేసిన వంటలు ఉన్న భోజనాలు అంటే చాలా ఇష్టం .. ఈ మద్య ఎటు చూసినా ఆర్డర్ ఇస్తున్నారు కదా ..ఎప్పుడు అలా తింటానో :)
monna okasari manchiga banthi lo pelli bhojanam kurchoni thinnau. ennallu ayindi ala thini. aa anadame veru.
@లలిత గారు,
అంతే మరి,అందరికీ ఆ అదృష్టం ఉండొద్దూ...అయినా నేస్తం గారి శ్రీవారు ఏదో వ్యాపారం ఆలోచనలో ఉన్నార్ట..మనమూ వెళ్ళి కొంచెం ఆజ్యం పోద్దామా...
@నేస్తంగారు,
మాకు హక్కులేదనడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం..మా గీతాంజలిగాడి అభిమానులుగా మిమ్మల్ని అనే హక్కు మాకుంది...కానీ మీ శ్రీవార్ని అనే హక్కు మాత్రం మీదే....
@శశాంక్ గారు,@నేస్తంగారు
ఎవరో పెళ్ళి ఎందుకండీ..వచ్చే వైశాఖంలోనో,శ్రావణంలోనో మా అన్నయ్య పెళ్ళి ఉంది...మా ఇంట్లో క్యాటరింగులు నాట్ ఎలోడ్...పైగా నాకసలు ఇష్టం ఉండదు...చక్కటి తెలుగు భోజనం ఘుమఘుమలతో స్వయంగా నేనే కొసరి కొసరి వడ్డిస్తా...అందరూ వచ్చెయ్యండి...మీకు ఏదన్నా వెరైటీ కావాలంటే చెప్పండి..ఇప్పటి దాకా నేననుకున్న లిస్టుకి కలుపుతా...
నేను మళ్లీ కండిస్తున్నాను........ఐతే ఆ బక్కప్రాణిని కొట్టించేశారన్నమాట...
నేస్తం - కరెష్ట్ గా చెప్పారు. అసలు పెళ్ళి భోజనం - పద్ధతి గా ఉండే పెళ్ళి భోజనం - చేసి ఎన్ని యేళ్ళైందో.. మా పెళ్ళి లో ఉండింది.. కాని తినలేదు. తర్వాత ఎవ్వరి పెళ్ళికి నేను వెళ్ళలేకపోయా. :( అప్పుడప్పుడు మధ్య రాత్రి పెళ్ళి భోజనం పెళ్ళి భోజనం అని కలవరిస్తూంటాను అని మా ఆవిడ చెప్తుంది... నిజమో కాదో మరి..
శుభం .
పాపం ఆజీవిని ఓసారి పలకరిస్తే మీ సొమ్మేం పోయింది . పెళ్ళాం , బిడ్డల తోనే వున్నాడుకదా .
హయ్యో..శశాంక్ గారూ....అంత కలవరిస్తున్నారా..ఐతే మీరు తప్పకుండా మా అన్నయ్య పెళ్ళికి రావల్సిందే...మీకు ఎంత పద్ధ్హతిగా అంటే అంత పద్ధ్హతిగా ఉంటుంది,మా ఇళ్ళ పెళ్ళి భోజనం...చిట్టిఅరిశెల్,నేతి గారెల్ మరి పసందైన నెయ్యి నింపిన పూర్ణం బూరెల్...ఇంగువ దట్టించిన పులిహోర...నోరూరించే చక్కెర పొంగలి...ఇక కూరల్లోకొస్తే మంచి మెంతికూర పప్పు,చింతకాయ పచ్చడి,కందిపొడి,నవనవలాడే గుత్తొంకాయ మెంతికారం కూరి,ఆవపెట్టిన పనసపొట్టు కూర,కాకరకాయ కారం,మాంఛి గోగాకు పచ్చడి వెన్నపూసతో,....ఉలవచారు మంచి మీగడతో...రసం,సాంబారు ఎటూ ఉంటాయనుకోండి...తర్వాత గడ్డపెరుగు కొత్త ఆవకాయతో....చివర్లో నాన్నగారు స్వయంగా అందించే చిలకలు చుట్టి,జాజికాయతో కర్పూర తాంబూలం.....
ఇందులో మీక్కావాల్సినవి లేకపోతే చెప్పండి..వెంటనే చేర్చేస్తా...
స్వప్నా ఇండియాలో ఉన్నావుగా నీకేం చెప్పు ఎంచక్కా తినేసావు
మాలాకుమార్ గారు ,కౌటిల్య గారు అబ్బే లాభం లేదండి మీరు తెలుగు సినిమా లను, సీరియల్సును, ఎక్కువ చూసేసి అలా ఆ అబ్బాయిమీద జాలి చూపించేస్తున్నారు.. అతనితో మాట్లాడటమా?? .. ఏమనీ??మా నాన్నా నిన్ను బాగా తిట్టించారా..బాగా తిక్క కుదిరిందా అనా?? :)
నరేంద్ర గారు నేను కొట్టించడమేంటండి బాబు..ఈ లెక్కన మీరు పోస్ట్ పూర్తిగా చదవకుండా కామెంటేసారన్నమాటా..
కౌటిల్య గారు దేశం కాని దేశం లో ఉంటే ఇలా ఊరిస్తారేంటండి :(
శశాంక్ కౌటిల్య గారేదో అంటున్నారు చూడండీ :)
మా నాగ ప్రసాద్ చెప్పినట్టు క్లైమాక్స్ మార్చి సినిమాని మళ్లి రిలీజ్ చెయ్యండి
200 రొజులు 400 సెంటర్లు అడుతుంది.
ఫిచెక్కిద్దాం అంతె.
చివరాఖరికి ఫైనల్ గా ధారావాహిక అయ్యింది. ఇప్పుడు బాగుంది. ఎటువంటి రక్త పాతం లేకుండా ఇలా సమస్యల్ని శాంతియుతం గా పరిష్కరించుకుంటే బాగుంటుంది. మధ్యలో మీ పేరుకి సంబధించిన ట్విస్ట్ బాగుంది. గీతాంజలి ఉన్న వాడే కాదు మనసున్న వాడు కూడా. శ్రుతి మించకుండా చక్కగా ఉంది. మీ అమ్మగారి భయం లో అర్ధం ఉంది, ఉమ్మడి కుటుంబం లో ఎం జరిగిన ఇంటి పేరు పెట్టి మాట్లాడటం నిజం, సీరియల్ నచ్చిందండోయ్! నచ్చింది. మరి imposition వేసవి సెలవల్లో రాస్తారా?
చాలా రియలిస్టిక్‌గా ఉంది క్లైమాక్స్...
గీతాంజలి గారు ఇప్పుడు ఎం చెస్తున్నారో చెప్పనేలేదు..:)
మీ పుణ్యమా అని ఎన్నెన్నో రుచులు కూడా చూసేసాము(బ్లాగ్మిత్రుల కామెంట్లలో)...
ఈ టప చూసి నా తొలిప్రేమ ఇప్పుడు ఎక్కడుందో, ఏమి చెస్తొందో కనుక్కోవాలన్న కుతూహలం ఎక్కువయ్యింది...
అలానే నేను ఒక టప రాసాను...చూసి మీ సలహాలు,సూచనలు అందివ్వగలరు
మీ తరువాత టప కోసం ఎదురు చుస్తూ...
ending lo twistlu untayi anukunna..chappaga ga undi andi....ee madhya facebook lo busy ga undi blog vaipu raledu...so late ga chadivanu mee post...
హ్మ్మ్ .....ప్చ్ .....ఎంతపనిజరిగింది....అన్నేల్లకు కనిపిస్తే కనీసం నోరారా పలకరించలేకపోయారా నేస్తం ఆ బక్క ప్రాణిని :) :)
ఇంతకూ సదరు గీతాంజలిగాడుగారి అసలు పేరేవిటో చెప్పనేలేదు :) :)
పవన్ అదే నాగప్రసాద్ హీరోగా పెట్టి ట్విస్ట్ ల పై ట్విస్ట్ లు వ్రాసేసి ,హీరోయిన్ ఫాదర్ తో బాగా చితొక్కొటించుకున్నట్లు( హీరోని కొడితే నే మరి ట్విస్ట్) ఒక కధ రాసేస్తా.. :)
సన్ని గారు థేంక్యూ థేంక్యూ ..ఇంపోజిషన్ గీతాచార్య గారు వ్రాస్తానన్నారుగా నా తరుపున :) ఒప్పందం అయిపొయింది ..
రాజేంద్ర ప్రసాద్ గారు..ఏం చేస్తాడు .. పెళ్ళాం పిల్లలతో హాయిగా ఉండిఉంటాడు ..
శిరీష గారు కధల్లో.సినిమాల్లో ట్విస్ట్‌లు ఉన్నా పర్లేదు గాని జీవితం లో ఉంటే కష్టమే..నాకైతే ముగింపు ఇలా ఉండటమే హాయిగా అనిపించింది ..:)
పరిమళం గారు నాకూ నిజం పేరు సరిగా తెలియదు :)
మీరు చెప్పినట్టు నాగప్రసాద్ తన్నులు తిన్నట్టుగా సీరీయల్ రాస్తే 100% మహిళా ప్రెక్షకులతో (బ్లాగర్లతొ) మీ సీరియల్ సూపర్ హిట్టూ... 100 డేస్ పక్కా :-)) నాది గ్యారెంటీ..
మొత్తానికి అప్పుడు చేయ్యకపొయినా ఇప్పుడు 'గీతాంజలిగాడు' గారిని హీరొ చేసేసారుకదా.. అన్ని కారక్టర్స్ లొనీ అతనికే ఎక్కువ పాపులారిటి/సింపతి వచ్చినట్టుంది.. నాకూ పాపం అనిపించింది.. :-))
ఒవరాల్ గా చూస్తే ఈ కథ లొ మీరే విలన్ అనిపిస్తుంది నాకు :-)))))))))))))))))))))
బాబోయ్ కౌటిల్య గారూ! మీరలా మరీ ఊరించేస్తే ఎలాగండీ బాబూ! ఏదో ఇక్కడ దొరికే కూరగాయలతోనే ఆవకూరలు, కారంపెట్టి కూరలు చేసుకుని, తిని తేన్చేస్తున్నాము. ఎప్పుడో ఒకప్పుడు మనూరు వెళ్ళకపోతామా, ఇవన్నీ లాగించెయ్యకపోతామా అని సరిపెట్టుకుంటున్నాము. ఇలా మాకిష్టమైన పదార్ధాల పేర్లు చెప్పి ఊరించడం ఏమంత బాగోలేదు. నేను నాలికతో పెదాలు తడుపుకుంటుంటే మావాడు నాకేసి వింతగా చూస్తున్నాడు.
అవునూ! పనసపొట్టు ఆవకూర అంటూ గోదారిని తలపించేశారు. మళ్ళీ ఉలవచారంటారేమిటి? అదేదో విజయవాడ స్పెషల్ అని నాకు అనుమానం??!!
నిజమే.. నాక్కూడా ఇప్పుడు ఆ గీతాంజలిగారిమీద జాలేస్తోంది.
అసలూ!! మీరు ఆ గీతాంజలి అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు మీకేసి చూసే చూపులు, నవ్వులు మున్నగు వివిధరకాల హావభావాలను బట్టి మీకు అనిపించినది రాశారు. ఇప్పుడు ఆ గీతాంజలి గారు నిజంగా ఏమి అనుకున్నారు, ఎలా ఫీల్ అయ్యారు అని ఆయన వెర్షన్ రాస్తే చదవాలనుంది. :-) :-) :-)
ఈ మధ్య కాలంలో కొంచెం (పని లేని పని అన్న మాట) బిజీ.
నేను మావాళ్ళందరికీ చెప్పేశాను మీ గురించి. ఎప్పుడైనా మాట్లాడకుండా కూర్చుంటే మా రఘు "ఏం తల్లీ మీ నేస్తం ఏమి కొత్త విషయాలు చెప్పలేదా? మమ్మల్ని ఇలాప్రశాంతంగా వదిలేశావ్" అంటున్నాడు.
అసలు విషయం చెప్పనా వాడికి నెట్ లేదు మీ బ్లాగ్ చూడటానికి. అమ్దుకని నన్ను చెప్పమని ఇండైరెక్ట్ గా అడగడమన్నమాట.
ఈ సీరియల్ చెప్పేస్తాను. సేమ్ మీలాగే సస్పెన్స్ లో పెట్టి.
ఎవరికీ కపీ రైట్స్ ఇవ్వకండి, నేనే కొనేసుకుంటాను. సరేనా?
మంచు పల్లకి గారు, శాంతి గారు మొత్తానికి నేను చేసిన పొరపాటు , గీతాంజలిగాడికి అనవసరపు మంచి తనాన్ని అంటగట్టేసి నేను విలన్ ని అయిపోయాను.. కూసింత ఆలోచించి వాడికి తాగుడు తిరుగుడు చెత్తా చెదారం లాంటి హాబీలు రాసిపడేయాల్సింది ..
శృతి అలగలాగే సినిమానా? సీరియల్ నా ?ఎప్పుడు మొదలుపెడుతున్నారు ఇంతకు.. :P
గీతాంజలిగాడు ఈ పొస్ట్ చదివి మీకు రెస్పాన్స్ ఇస్తె భలె ఉంటుంది కదా.
@ శాంతి గారు,
ఊరించి,మా అన్నయ్య పెళ్ళికి మిమ్మల్నందర్నీ రప్పిద్దామనే రాశానండీ....మాది గోదావరీ కాదు, విజయవాడా కాదు...పక్కా ప్రకాశం...కానీ వెజిటేరియన్ ప్రాణాలు కదండీ,అందుకే కమ్మగా ఉండే రకరకాల తెలుగువంటలన్నీ తెలుసుకుని అమ్మని వేధిస్తుంటా....నాన్నగారు కూడా అంతే, వెరైటీ ప్రియులు...ఉద్యోగ రీత్యా కోస్తా అంతా తిరగడంతో అమ్మకూడా చాలా రకాలు నేర్చుకుంది,అన్నీ సంప్రదాయ వంటలే.....వాటిల్లో నాకు బాగా ఇష్టమైంది నెల్లూరు వాళ్ళ పిండి మిరియం....కానీ అది పెద్దమొత్తంలో పెళ్ళి భోజనాల్లో చెయ్యటం కష్టం..అందుకే పై లిస్టులో చేర్చలేదు...
హారం లో పవన్ అని ఉంటే ఇక్కడ నేను ఎప్పుడు రాసానబ్బ అనుకోని చుసాను...
పవన్ గారు మీ పేరుకి ముందు వేనక ఏదన్న తగిలించి కాని లేదంటే మీ బ్లాగు లింక్ తో కాని రాయండి అసలే బ్లాగుల్లో నా చాలా మాంచి పేరు ఉంది :).మీరు రాసింది నేను అనుకోని నేను రాసింది మీరనుకోని పోరపాటు పడతారు.
నేస్తం గారు
మీ కామేంట్ ప్లేస్ ని యుజ్ చేసుకున్నందుకు క్షమీంచండి
అలాగె పవన్ బ్రెదర్
నాకు బ్లాగ్ రాయలన్నా ఎమి రాయాలొ తెలియట్లెదు అందుకనె బాగున్న బ్లాగ్ లొ కామెంట్లు రాసుకొంటున్నా.
ఇకనుంచి నెను పవన్ కుమర్ అని రాసుకుంటాలె బ్రెదర్
పవన్ ..వాడు చదివి, నేను తిట్టిన తిట్ట్లన్నీ చదివి బాధ పడి,నన్ను తిట్టుకోవడం ..ఎందుకొచ్చిన గొడవ.. మనం ఇలా సీత మంచి బాలిక టైపులో మిగిలిపోవడం బెటర్ :)
కౌటిల్య గారు ప్రొద్దున్నే మావారికి మీ వంటల లిస్ట్ చూపించి మరీ గుటకలు వేసాను.. ఇండియాలో ఉంటే తప్పక వచ్చేసేదాన్ని :)
Love story 19__ fill in the blank please. :)
Faustin
కౌటిల్య గారు.. బాగా ఊరించారండి. నేను కూడా మీ అన్నయ్య పెళ్లికి వచ్చేస్తున్నాను. మీరు చెప్పినవన్నీ ఉండాలి మరి.
eriggaa chadivi annitikee comments pedathaa. Mallaa oke saari anni commentsaa anakoodadu
నేస్తం గారూ,మా అన్నయ్య పెళ్ళి బహుశా శ్రావణంలోకానీ,లేకపోతే పై వచ్చే మాఘంలోగానీ ఉంటుందండీ...అప్పటికి ప్లాన్ చేసుకుని, మీవార్ని కూడా తీసుకుని వచ్చెయ్యండి...
@సవ్వడి గారు,
తప్పకుండా రావాలి..పైనున్న వాటికి మీకిష్టమైనవి చెప్తే అవి కూడా కలుపుతా...
కౌటిల్య గారూ! బాగుందండి. అయితే మీరు చాలా అదృష్టవంతులు. అన్నిరకాలూ రుచి చూడచ్చు. మన తెలుగు టీవీ వాళ్ళు వంటల ప్రోగ్రాంకి మీ ఇంటికి వస్తే ఒక నెల్లాళ్ళు మీ ఇంటిదగ్గరే విడిది తీసుకుని ఉండి మరీ రికార్డు చేసుకోవచ్చు వంటలు.
హ్మ్.. నా కీబోర్డు మీద F5 కీ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే, refresh కొట్టీ కొట్టీ ఆ అక్షరాలు చెరిగిపోయాయి. తరువాతి టపా ఎప్పుడో??!! ^_^
Ending is quite nice. Am 4 comments short. Now read everything, and will comment :-)
నేస్తం,
నేను మీ అంత పిరికి దాన్నే,ఇలాంటి విషయాల్లో.
గీతాంజలి గారు(;-)) కూడా చివరికి మీకు ఇష్టం లేదని తెల్సి, (పెద్దల ద్వారా అయినా సరే )ఇబ్బంది పెట్టకపోడం నాకెంతో నచ్చింది.చివర్లో మాల్గుడి డేస్ కథ ముగిమ్పులా అనిపించింది, ఎంతో క్యూట్ గా ఉంది ముగింపు.
నిజమే, ఈ మధ్య ఆర్య లాంటి సినిమాల వల్లో ఏమో, అంత బుద్ధిగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా మాత్రమె కనిపిస్తున్నారు.మా చిన్నప్పుడే మా ఫ్రెండ్ అక్క ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది, ఇంకా చూడాలి మా ఫ్రెండ్ కస్టాలు, బురఖా వేసినంత పని చేసారు.అప్పుడు మా వయసు పది. :-) ఇంకా వాళ్ళు ఉమ్మడిలో లేరు, ఉంటె ఎంత మందికి శిక్ష పదేదో.
- పద్మ.
I am new to your blog, all your posts are good especially old stories
Nice story....
కామెంట్‌ను పోస్ట్ చేయండి