28, సెప్టెంబర్ 2009, సోమవారం

విజయ దశమి శుభాకాంక్షలు


అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. ఇలా రాసి వదిలేద్దాం అనుకున్నాను ..కాని మా ఆయన చెప్పిన్నట్లు మిమ్మల్ని అంత ప్రశాంతం గా ఎలా వదిలెయ్యను చెప్పండి..కాబట్టి తప్పదు వినాల్సిందే ..అసలు నాకు దుర్గమ్మ తో ఉన్న అనుబంధం సామాన్యమైనది కాదు..మీకో విషయం తెలియదు దుర్గాదేవికి నేనంటే బోలెడు ప్రేమ.నమ్మడం లేదు కదు ..అయితే కాస్కోండి..

అవినేను ఇంటెర్ చదువుతున్న రోజులు ,నాకు ఎక్జాంస్ అంటే మహా భయం ,టెన్షన్ ,వణుకు ..పోనీ మావాళ్ళు సరిగ్గా రాయలేకపోతే తిట్టేస్తారు,కొట్టేస్తారు అని అనుకోడానికి అసలే లేదు వాళ్ళకు అసలు నేను ఏం చదువుతున్నానో కూడా తెలియదు ..నాకు పక్కా వ్యతిరేఖం మా అక్క.ఆ సమయంలో నేను 10 లంఖణాలు చేసినదానిలా తయరయితే,అదేమో ఏదో అందాల పోటీలకు తయారు అయినట్లు చక్కగా తయారయ్యి వెళ్ళేది.దాన్ని చూస్తేనే వళ్ళు మండిపోయేది నాకులాగా ఎంచక్కా టెన్షన్ పడట్లేదని. సరే మొత్తానికి రాత్రీ ,పగళ్ళు తెగ చదివేసి పరీక్షలన్నీ రాసేసాను ఆఖరి ఎక్జాంకి మాత్రం నిద్రలేక తల మొత్తం పట్టేసింది ..ఏం చదువుతున్నానో ఏంటో తెలియదు కాని మొత్తానికి తెల్లారిపోయింది. మెదడు అంతా శూన్యం అయిపోయినట్లు అనిపించింది ..మా అమ్మ దగ్గరకు వెళ్ళీ బోరుమని ఏడ్చాను ..అమ్మా నేను ఎక్జాం డుమ్మా కొట్టెస్తాను, అన్నీ బాగానే రాసాను ఇది మాత్రం ఖచ్చితం గా పోతుంది అని.. పోనీలేమ్మా ఇంకోసారి రాసుకుందువు అంది సింపుల్ గా ...చివరికి ఏడుపుమొహం తో బయలుదేరుతూ బయటకు వచ్చి ఎదురింటి గుమ్మం దగ్గర పెట్టిన దుర్గా దేవి ఫొటొ చూస్తూ మళ్ళీ బోరుమన్నాను నేను ఫెయి అయిపోతాను బాబోయ్ ఎలాగన్నా గండం గట్టెంకించు అని ..తీరా కాలేజ్ కి వెళ్ళగానే అవాక్కయ్యాను ..ఆ రోజు ప్రశ్నా పత్రం లీకవ్వడం వల్ల ఎక్జాంస్ పోస్ట్ పోన్ అయ్యాయహో అని ప్రకటించేసారు ఒకటి కాదు రెండుకాదు ఏకంగా నెల తరువాత జరిగింది ఆ పర్క్ష.ఇలా దుర్గా దేవి తనకు నా పై ఉన్న ప్రేమను ఇలా చూపించింది అన్నమాట..కొంచం కుళ్ళుకుంటున్నారు కదా .. అయితే ఇంకొకటి చెప్తా..

ఒక సారి పెళ్ళి అయ్యాక మా ఆయనతో విజయవాడ దుర్గాదేవి గుడికి వెళ్ళాను.. లోపల గర్బాలయంలో దగ్గరగా నిలబడి మరీ పూజ చేయించుకుంటుండగా ఎవరో ఒక పేద్ద మల్లెపూల చెండు అమ్మవారికి సమర్పించారు..వెంటనే మన కళ్ళు ఆ పూల మాల మీద పడిపోయాయి..అబ్బా ఎంత బాగుందో అది నాకు ఇస్తే బాగుండును అనుకుని వెనుకకు తిరిగాను వెళ్ళిపోడానికి..వెంటనే పూజారి అమ్మాయ్ ఈ మాల తీసుకో అని పిలిచి చేతిలో పెట్టాడు.. ఇప్పుడు చెప్పండి దుర్గాదేవికి నేనంటే ఇష్టమా కాదా.. అద్గది అలా ఒప్పేసుకోవాలి బుద్దిగా :)
హ..హ నాకు తెలుసు మీరు మనసులో ఏమనుకుంటున్నారో..పొవే అప్పలమ్మా ఇలాంటివి చాలామందికి జరుగుతాయి అనికదా.. హ..హ సరదాగా రాసినా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు అందరి పైనా ఉండాలని ఆశిస్తూ విజయ దశమి శుభాకాంక్షలు

25 వ్యాఖ్యలు:

amma odi చెప్పారు...

"విజయ దశమి శుభాకాంక్షలు"

మరువం ఉష చెప్పారు...

:) cool. I have two similar experiences with goddess Durga. One from Tuljapur Bhavanimaata temple and another small temple in our village.

విజయ దశమి శుభాకాంక్షలు

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

విజయదశమి శుభాకాంక్షలు

కోడీహళ్ళి మురళీ మోహన్ చెప్పారు...

మీకు కూడా విజయదశమి పర్వదినము సందర్భంగా నా హృదయపూర్వక శూభాకాంక్షలు!!!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ :-) మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు.

కొత్త పాళీ చెప్పారు...

మీరే అమ్మవారి ఫస్టెష్టు ఫేవరెట్, మాకు తెల్సుగా! :)

మంచు చెప్పారు...

"విజయ దశమి శుభాకాంక్షలు"

sunita చెప్పారు...

విజయ దశమి శుభాకాంక్షలు!!!

నేస్తం చెప్పారు...

అమ్మ ఒడిగారు,ఉష గారు,భాస్కర్ గారు,మురళి గారు ,వేణు గారు,కొత్తపాళి గారు ,మంచు పల్లకి గారు,సునీత గారు అందరికి పేరు పేరునా ధన్యవాధాలు

ప్రియ చెప్పారు...

విజయదశమి శుభాకాంక్షలు నేస్తం

మా ఊరు చెప్పారు...

విజయ దశమి శుభాకాంక్షలు

ప్రశాంత్ చెప్పారు...

మీకు కూడా విజయదశమి శూభాకాంక్షలు!!!

నేస్తం చెప్పారు...

మా ఊరు ,priya,prasanth ధన్యవాధాలు:)

Shiva చెప్పారు...

mee 10th batch 1987? endukante nenu ade batch mee lane save ayya

నేస్తం చెప్పారు...

1987 యా.. అమ్మొ అంత పెద్ద దాన్ని కాదండి .అప్పటికి నేను హై స్కూల్ కూడా కాదు .బాగా చిన్న పిల్లను

GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI చెప్పారు...

ప్రియనేస్తం! నా పేరు రాఖీ నేనొక తెలుగు కవి,పాటల రచయిత స్వరకర్తను మీకు సాహిత్యం/పాటలు/కవితలు /నానీలు పట్ల మక్కువ ఉన్నట్లైతే నా బ్లాగులు సందర్శించండి.. మీ నిస్పాక్షిక సమీక్షలు/అభిప్రాయాలు/విమర్శలు నాకు శిరోధార్యం.నా ఉన్నతికి అవి సోపానాలు ! దయచేసి బ్లాగుల లోని కామెంట్స్ లో గాని లేదా నా మెయిల్ ఐడి కి గాని పోష్ట్ చేయగలరు.
http://www.raki9-4u.blogspot.com
http://www.rakigita9-4u.blogspot.com
rakigita9@yahoo.com
rakigita9@gmail.com
mobile:9849693324

Ram Krish Reddy Kotla చెప్పారు...

Nestham...konchem late ga(3 days) meeku vijaya dasami subhaakankshalu....post bagundi...baga celebrate chesukunnara singapore lo :)

Unknown చెప్పారు...

nestham garu chala late ga cheptunna..vijaya dasami subhakankshalu.. :)..bagundi mee post...enthaina amma kadaa..challagaa chudatam ameku alavtu mari.. :)
naku annintikante navvu vachindi..comments lo 1987 batch aa ante..ammo antha pedda danini kadu ani bayapadare adi... :)....enthaina ammayi anipinchukunnaru.. :)

భావన చెప్పారు...

లేట్ గా మీకు కూడ విజయ దశమి శుభాకాంక్షలు.. అమ్మ కు మీరు ఫేవరైట్ కిడ్ అన్నమాట... గుడ్. ఎప్పుడైనా మాకు కూడా రికమండేషన్ ఇవ్వరా ప్లీజ్...

గీతాచార్య చెప్పారు...

మీరడగక పోయినా ఒప్పేసుకుంటాము కానీ,

కాస్తాలస్యంగా మా (మీకు తెలుసెవరో) శుభాకాంక్షలు స్వీకరించండి. బిజీగా ఉంటం వల్ల ఆలస్యంఐనా నేస్తం అర్థం చెసుకుంటారులే మేము మిమ్మల్ని ఒప్పుకున్నట్లుగానే :-)

గీతాచార్య చెప్పారు...

మిమ్మల్ని చూడగానే అలా చిన్నతనపు ఫ్లాష్బ్యాక్ లోకి వెళ్ళిపోయి ఆ మమ్చి మూడ్ లో కావాల్సినవన్నీ చేసిపెడుతున్నదేమో అమ్మ. భలే భలే... బాగుంది నేస్తం మీ టెక్నిక్. ;-)

నేస్తం చెప్పారు...

గారు తప్పకుండా చదువుతాను.ధన్యవాధాలు
కిషన్ అస్సలు సెలబ్రేట్ చెసుకోలేదు..వా :( ..అందుకే ఓ మారు బ్లాగ్లో అమ్మను తలుచుకున్నాను..
కిరణ్ నిజమే కదూ చూసావా ఎలా అమ్మాయిననిపించేసుకున్నానో .. ఎక్కడికి పోతాయి బుద్దులు :) అన్నట్లు మర్చిపోయా భలే గీస్తున్నావ్ బొమ్మలు ..మా చెల్లి నీలాగే వేస్తుంది అది గుర్తొచ్చింది ..
భావనగారు ఊరికే చెస్తామా కొంచం ఖర్చవుతుంది మరి :)
గీతాచార్య గారు :D

kaartheek చెప్పారు...

నేను మీ బ్లాగుకి కొత్త అండి
నాకు మీ బ్లాగు చాలా బాగా నచ్చింది.

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
>>అమ్మవారి ఫస్టెష్టు ఫేవరెట్

నన్ను కూడా ఆ జాబితా లో కలిపేసుకోండి ! అయితే మనిద్దరం ఒకే జట్టు అన్నమాట ! ఈ పోస్ట్ ఎందుకో మిగితా వాటి కంటే విభిన్నమైన శైలిలో ఉంది, ఎప్పటిలాగే శానా బాగుంది !
-పద్మ.

tnsatish చెప్పారు...

All your posts are very good.

Did you study intermediate during 1995-97?