9, సెప్టెంబర్ 2009, బుధవారం

శునకానుబంధం



చిన్నప్పటి నుండి నాకు కుక్కలంటే బెదురు,హడలు, భయం,కోపం ,,చిరాకు ,విసుగు లాంటి ఇత్యాది రకాల ఫీలింగ్స్ అన్నమాట. దానికో పే..ద్ద కారణం ఉంది ..చిన్నపుడు నా క్లాస్మేట్ హర్ష గాడికి నాకు మద్య పచ్చ గడ్డివేయకుండానే బగ్గుమనేది ప్రతి విషయం లో .. ఒక రోజు ఇద్దరం టీచరుగారికి మాకు తోచినన్ని చాడీలు ఒకరి మీద ఒకరం చెప్పేసుకుని ,ఆవిడ చేత తిట్లు, దెబ్బలు తినేసి నీట్ గా ఇంటికి వచ్చేస్తున్నాం ..కాని హర్ష గాడికి నా మీద పగ చల్లారలేదు .. దారిలో వాళ్ళ ఇంటిముందు రాగానే ఒక రాయి తీసుకుని ,హాయిగా ప్రశాంతం గా పడుకున్న కుక్క మీద కు విసిరేసి ,బౌ ..బౌ అని అరిచి పారిపోయాడు .. వాడు అలా పారిపోయాడో లేదో వీధి లోకి మూల, మూలన ఉన్న కుక్కలన్నీ పరిగేట్టుకోచ్చేసాయి సాటి కుక్కకి న్యాయం చేసేయడానికి ...ఇంకేంటి, నా చుట్టూ తిరుగుతూ అప్పటి కప్పుడు రౌన్డ్ టేబుల్ సమావేశం జరిపేసి ,కదిలితే కరిచివేత చట్టం అమలు పరిచేసి నన్ను కాలు కదపనివ్వకుండా అక్షరాలా అరగంట కట్టి పడేసాయంతే ..ఆ అరగంట ఎంత మానసిక వేదన అనుభవించానంటే దెబ్బకి అదిగో కుక్కలమీద పైన పేర్కున్న ఫీలింగ్స్ కి ఫిక్స్ అయిపోయాను .


అయితే ఆ ఫీలింగ్స్ ని పెంచిపోషించేలా చేసింది మాత్రం ముమ్మాటికీ మా అమ్మే..అదెలా అంటే మా చిన్నపుడు మా వీధి లో ఆడవాళ్ళందరూ పండగలు వచ్చాయంటే చాలు 'మా ఇంటి వంట 'కార్యక్రమాన్ని నిర్వహించేవారు.. అర్ధం కాలేదా ! అంటే వీళ్ళు వండిన పిండివంటలు వాళ్ళకు ,వాళ్ళు వండిన పిండి వంటలు వీళ్ళకు పంపుకుని ఒకళ్ళనొకళ్ళు తెగ పోగిడేసుకునేవారన్నమాట ..అలాగే ఒకానొక పండగకు మా ప్రక్క వీధి ఆవిడ పంపిన గిన్నెలను తిరిగి ఆవిడకు ఇచ్చేయమని మా అమ్మ హుకుం జారి చేసింది ..నేను వెళ్లను గాక వెళ్ళను అని మొండితనం చేసాను ..దానికి కారణం వాళ్ళింట్లో కుక్క ఉండటమే .. కాని పంతం విషయం లో సేం బ్లడ్ అవ్వడం వల్ల నా వేషాలు కుదరలేదు... తప్పని సరిగా వెళ్లి వాళ్ళ ఇంటి మెట్ల మీద నించుని ఏమండి మీ గిన్నెలు అని అరిచాను .. ఆ ఇంటావిడ కంటే ముందుగా దున్నపోతు సైజులో ఒక కుక్క బౌ బౌ అంటూ వచ్చేసింది ..


ఆవిడ తీరికగా వంట గదిలో నుండి బయటకు తొంగి చూస్తూ ..నువ్వా అమ్మా ,పనిలో ఉన్నాను కాస్త లోపలి కొచ్చి ఇచ్చేసి వెళ్ళమ్మా అంది ..కు..కు..కుక్క అండి అన్నాను భయంగా చూస్తూ .. ఆవిడ తేలిగ్గా నవ్వేస్తూ . .. అది అలాగే అరుస్తుంది కాని కరవదు..నీకు తెలియదాఅరిచేకుక్కలు కరవవు ..నువ్వు రా అంది.. .నీకేం తల్లీ కుక్క నీది కాబట్టి ఎన్నయినా చెప్తావు అనుకుని ,నాకు భయం అండీ నేను రాను అన్నాను .. అయ్యో రామా,, నీ భయం సంతకేల్లా ..అది కరవదు అంటుంటే వినవేంటి అని ఒరే టామీ నువ్వు లోపలి పో అంది.. అది మాత్రం అంగుళం కదలకుండా ,నువ్వు వచ్చ్చావో అయిపొయావే ..ఈ రోజు నీ పెతాపమో నా పెతాపమో చూసుకుందాం అన్నట్టుగా బాలయ్యలా ఓ లుక్కుచ్చింది ..అటు నుండి ఆవిడ గోల రమ్మని ..

ఈవిడ ఎవరురా బాబు నా ప్రాణానికి ఇలా తగులుకుంది అని తిట్టుకుని మెల్లిగా గేటు తీసుకుని లోపలి కి వచ్చాను ... అది నేను అనుకున్నట్లుగా అరవలేదు సైలెంట్ గా చూస్తుంది.. హమ్మయ్యా అనుకుని గబుక్కున గిన్నెలు ఆవిడ చేతిలో పెట్టేసి వెళ్లబోయాను ..అరె, ఆగు పిల్లా ఎంటా తొందర అని ఆవిడ వేస్తున్న గారెలు మళ్లీ ఇంకో గిన్నెలో వేసి మీ నాన్నమ్మకు నేను ఇచ్చానని చెప్పి ఇవ్వు అని ఇచ్చింది.. ఇంక ఈవిడకు పని ,పాట ఏమి ఉండదు కాబోలు అని తిట్టుకుని గభ,గభా బయటకు నడవబోయాను.. మరి ఆవిడ ఇంట్లో దొంగతనం చేసాననుకుందో లేకా నా ముక్కు ,మొహం దానికి నచ్చలేదో తెలియదు కాని అప్పటివరకు సైలెంటుగా ఉన్నది కాస్త ఒక్క సారిగా నా మీద పడింది ... బాబోయ్ అని అరిచి పారిపోయేంత లోనే దొరికిపోయాను.. అంతే, నా కాలు పట్టేసుకుంది గట్టిగా ..

ఒక ప్రక్క అమ్మోయ్ ,బాబోయ్ అని అరుస్తుంటే ఆవిడ రావాలా? అబ్బే ,తాపిగా వంట గదిలో నుండి ఒరే టామీ అలా అల్లరి చేయకూడదమ్మా,పాప భయపడుతుంది అని గారాలు చూపుతుంది..ఒళ్ళు మండి రాగం తారాస్థాయి కి పెంచేసరికి అప్పుడు స్టవ్ ముందు నుండి కదిలి వచ్చి నా కాలు మీద లోతుగా దిగబడిన పంటి గాట్లు చూసి కంగారు తమాయించుకుని..అబ్బే కరవలేదమ్మా,గోరుతో గిచ్చింది అంతే , అయినా కుక్క కాటుకి చెప్పుదెబ్బ అన్నారు ..చెప్పుతో కొడితే సరిపోతుంది అని నేను వద్దు మొర్రో అంటున్నా పాత చెప్పు ఒకటి తీసుకుని ఫేడిల్ ,ఫేడిల్ మని బాదేసింది ..మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు అయ్యింది నా పరిస్థితి ..

ఇంక ఏడుస్తూ ఇంటికొచ్చి.. అంతా నీ వల్లే అని మా అమ్మదగ్గర కధకళి ,కూచిపూడి చేసేసి నాన్న రాగానే బోరున ఏడుస్తూ అమ్మ మీద మొత్తం చెప్పేసాను.. ఆ తరువాత మా నాన్న ఆమెను ,మా అమ్మను బాగా తిట్టి డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళారనుకోండి .. కాని ఆ దెబ్బకు నాకు కుక్కంటే భయం నర, నరాన జీర్ణించుకుపోయింది .. అయితే విధి సామాన్యమైనది కాదు కుక్కను తరిమినట్లు తరుముతూనే ఉంటుంది ..

నేను కాలేజ్ లో క్రొత్తగా చేరినపుడు ఒకసారి లంచ్ టైములో అందరం బాతాకాని కొట్టుకుంటుంటే నేనూ తింటూ వింటున్నాను.. ఇంతలొ ఒక అమ్మాయి నేను ఒక్క నిమిషం లేటుగా వస్తే మా బాబి ఉండలేడే బాబు ..రాగానే ఒకటే ముద్దులు పెట్టేస్తాడు తెలుసా అంది.. దెబ్బకు నాకు మైండ్ దిమ్మదిరిగి బ్లాంక్ అయిపోయింది అంతే ..ఇదేంట్రా బాబు ఈ పిల్ల ఇలా చెప్పేస్తుంది అని చుట్టూ చూస్తున్నాను ఎవరన్నా వింటున్నారేమో అని ..హుం ..మా సన్నీ అయితేనా, నేను వచ్చేవరకు ఏది తినడు తెలుసా ,కాసేపు నా వడిలో పడుకుని లేస్తే గాని వాడికి బెంగ తీరదు ఇంకో అమ్మాయి వాపోయింది.. లాభం లేదు రోజులు మారిపోయాయి అని అనేసుకోబోయే అంతలో అర్ధం అయింది వాళ్ళు కుక్క పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారని..

నేనప్పటి వరకు కుక్కలను టామీ ,జిమ్మీ లాంటి ప్రత్యెకమయిన పేర్లతోనే పిలుస్తారు అనుకునేదాన్ని,కానీ ఇలా మనుషుల పేర్లతో పిలుస్తారని తెలుయదు ..వీళ్ళు ఏమో కుక్క పిల్లలు పెంచుకోని వాళ్ళను అదేదో ఘోరంలా ,నేరంలా చూస్తున్నారు.. ఇదెక్కడ శునకానదంరా బాబు అనుకునేంతలో ఒక అమ్మాయి ..ఏమోనే బాబు నేను మాత్రం మా స్విటీని నాతొ తీసుకు రావడానికి ఒప్పుకుంటేనే మా అత్తగారి ఇంటికి వెళతా లేకపోతే రాను అని ఖచ్చితంగా చెప్పేస్తా అంది.. ఆ పని చేయి ఇద్దరినీ బయటకు తోసేస్తారు కసిగా తిట్టుకునేంతలో మరి నువ్వేమి చెప్పవేంటి ..మీ కుక్కపిల్ల పేరేంటి అంది ఒక అమ్మాయి..

మా ఇంట్లో కుక్క లేదు అన్నాను చిరాగ్గా ఫేసు పెట్టి ..అంతే ..లేదా !! అని నా వైపుకు విచిత్రం గా చూసి కాస్త దూరం జరిగారు ..ఓర్నాయనో .. ఇదేం గోల అనుకుని వెంటనే .. ఆహా ..అసలేం జరిగిందంటే నా చిన్నపుడు మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉండేదంట ..అది అంటే నాకు ప్రాణం అంట ..అయితే అది పొతే నేను జ్వరం తెచ్చేసుకుని చాలా రోజులు బెంగ పెట్టేసుకున్నా అంట .. అప్పటి నుండి మా నాన్నకు భయం వేసి మా ఇంట్లో కుక్కపిల్లలు పెంచడం మానేశారు.. కాని నాకు ఎంత ఇష్టమో తెలుసా కుక్కలంటే .. అందుకే నేను మాత్రం పెళ్లి చేసుకుంటే కుక్క పిల్లను పెంచుకునే అబ్బాయినే చేసుకుంటా .. లేకపోతే చేసుకోను అన్నాను అబద్దాన్ని నాగార్జున సిమెంట్ తో గోడ కట్టేసి నేరోలాక్ పైంట్ వేసినంత అందంగా చెప్పేసి ... ఒక అయిడియా జీవితాన్ని మార్చేస్తుంది లాగా ఆ అయిడియాతో నేను మా గ్రూప్ కు నాయికనైపోయాను దెబ్బకు..


కాని అప్పటికి నాకు తెలియదు కదా తదాస్థు దేవతలనే వారు ఒకరు ఉంటారని ,ఆ తధాస్తు దేవతలు అప్పుడే మా పై నుండి ట్రావెల్ చేస్తూ తధాస్తు అని చక్కగా అనేసి వెళ్లిపోయారని ... ఇన్ ఫ్రంట్ డాగ్స్ పెస్టివల్ ఉంది అని ...ఆ విశేషాలు తరువాత :)

34 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

:))
కుక్క మిమ్మల్ని కరిచే సీన్ Imax తెరపై ఊపించుకున్నా..ఫలితం నేను నవ్విన నవ్వుకు ఉన్నపళాన నాకు మెంటలెక్కిందని మా టీంలో వాళ్ళు డిసైడ్ చేసుకుని ఎర్రగడ్డకి కాల్ చేసినంతపని చేశారు.
భలే వారే మీరు...

లక్ష్మి చెప్పారు...

హ హ్హ హ్హ, నాకు కూడా కుక్కలంటే సేం టు సేం ఫీలింగ్ అలా అని అవెప్పుడూ నా మీద ఏదో దాడి చేసాయని కాదు కానీ పెంపుడు జంతువులంటే కుంచం ఎలర్జీ అన్నమాట. అన్నట్టు ఈ రోజే నా కొలీగ్ తన కుక్క పురిటి గది గురించీ, పురిటి నొప్పుల గురించీ, పిల్లలను ప్రసవించటం గురించీ తెగ వర్ణించి వర్ణించి చెప్తుంటే నిజం చెప్పొద్దూ ఆ కుక్క మీద భలే అసూయగా అనిపించింది ఎంత మహర్జాతకమో అని

సుభద్ర చెప్పారు...

భలే ఉ౦ది,మీ శునాకాన౦ధ౦ నాకు చాలా ఆన౦ద౦ కల్గి౦చి౦ది.
నాకు కుక్కల౦టె భయ౦,అవి కరుస్తాయనికాదు.
కరిచాక ఇ౦జక్షన్ చెయి౦చుకోవాలని ఎవరికి చెప్పక౦డే మీరు నా నేస్త౦ అని చెప్పా.
తరువాయి భాగ౦ కొ౦త ఉహి౦చా,మీ నాగర్జునా గోడని బట్టి చుస్తా మెచ్ చెస్తారో లెదొ

raviteja చెప్పారు...

చాలా చాల బాగుంది.. ఎలా చెప్పారంటే మొత్తం scenes అన్ని ఊహించుకునేంత.. comedy sequences కూడా(అదే.. మీకు మత్రం tragedic అనుకుంటా.. :P ) బాగా రాసారు..
అంటే తథాస్తు దేవతల ప్రకారం మీరొక శునకాన్ని పెంచుతున్నరా..?! :)

అజ్ఞాత చెప్పారు...

ఒకటి గమనించారా? కుక్కలు మంచివే. వాటి యజమానులున్నారే? వాళ్ళే పరమ దరిద్రులు. మా కుక్క మంచిదో అంటూ చంపుకు తింటూ జనాల్ని ఏడిపిస్తూ కుక్కలచేత కరిపిస్తూ ఉంటారు. నన్ను కూడా ఒక కుక్క కరిచింది ఇండియాలో. ఎక్కడో చెప్పుకోండి చూద్దాం? నడుమ్మీద ఎగిరి మరీ కరిచింది వెనకనుంచి. ;-)

ఇక్కడ అమెరికాలో అయితే ఇంకా దారుణం. ఎప్పుడూ ఒక పిస్టల్ చేతిలో ఉంచుకుని అరిచే/కరిచే కుక్కల్ని కాల్చిపారేయాలి అనిపిస్తూ ఉంటుంది. మరో దరిద్రం ఆ కుక్క పెంట అంతా ప్లాస్టిక్ సంచీలో ఎత్తుతూ ఊరంతా తిరుగుతూ ఉంటారు జనం. వీళ్ళ పిండం పిల్లులకి బెట్టా, కాస్త యార్డ్ లాంటిది కనపడగానే నా కుక్క ఉచ్చ పోసుకోడానికి బాగానే ఉందే అనుకుంటారు గామోలు.

Ram Krish Reddy Kotla చెప్పారు...

హ హ నేస్తం...మే పోస్ట్ మొత్తం చదువుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను...మీలాగే నాకు కూడా కుక్కలంటే మహా భయం అండి బాబు...ఓ సరి నన్ను రెండు కిలోమీటేర్స్ తరిమి తరిమి నాకు డాలు ఎక్కించాయి...అదొక పెద్ద చసింగ్ సేక్వేన్స్ లెండి...హ మళ్ళి ఏంటి చివరిలో సస్పెన్స్ పెట్టారు..అది కూడా త్వరగా రాయండి మరి ..

భావన చెప్పారు...

టూ మచ్ కదా మీ భయం. మీ భయం తో నిండిన మొహం తలుచుకుని చాలా సేపు నవ్వుకున్నా. అంతే నండి మీ భయం మాకేమి కష్టం.. ఐతే ప్రస్తుతం రోజు మీ విరోధి తోనేనా సహవాసం ఇప్పుడు... ఇంకా విరోధి ఏమిటి మిత్రుడై పోయి వుంటుంది కదా...

సృజన చెప్పారు...

మీకు శునకుములన్న భయము వలదు నేస్తం...
నాకు శునకుములన్న బహు ఇష్టం....

Anil Dasari చెప్పారు...

రెండు వారాల ముందే ఈ పోస్టేసుంటే మీరూ భౌభౌ అనేసుండేవారు :-)

Btw, 'బందం' కాదు, 'బంధం'

Ramesh Gannamani చెప్పారు...

చాలా బాగుందీ అండీ.
మీ భ్లోగ్ ఛదువు తుంటె ఒక సారి నా కష్టాలను కూడా పునచర్నణ చెసుకున్నా. ముఖ్కముగా రెండొ అట సినీమా చూసి గాని లెక వీధి లొ సినీమ చూసీ వెనకీ వచ్చెటప్పుడు.....
కుకా ల తొ పాటు నాకు చిన్నప్డూ నాకు పండు కొతులు అన్నా భయంగా ఉండెధి..
మా పొలలొ పండు కొతులు ఎక్క్వుగా వుండెవి...

అజ్ఞాత చెప్పారు...

నేస్తం, హమ్మయ్య, మీరు తోడున్నారు నాకు ఈ కుక్కల భయంలో !

ఎంత సరదాగా రాసారో ఎప్పటిలాగే, మొత్తం నవ్వుకుంటూ చదివాను.ఈ చెణుకులైతే మరీ నవ్వించాయి.
>>మూలన ఉన్న కుక్కలన్నీ పరిగేట్టుకోచ్చేసాయి సాటి కుక్కకి న్యాయం చేసేయడానికి

>>కదిలితే కరిచివేత చట్టం అమలు పరిచేసి

>>పంతం విషయం లో సేం బ్లడ్ అవ్వడం వల్ల నా వేషాలు కుదరలేదు

అమ్మో ఇలా రాసుకుంటూ పొతే, మొత్తం పోస్ట్ రాసినట్టు అవుతుందేమో. నాకు తెగ నచ్చేసింది మీ శునకానుబంధం పోస్ట్ ! ఎప్పుడు ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి మీరు.
- మీ నేస్తం, పద్మ.

పరిమళం చెప్పారు...

ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాగ్స్ పెస్టివల్ :) :)ఎప్పుడు మరి ?

నేస్తం చెప్పారు...

హహ నిజంగా శేఖర్ అది కరవడం కాదు ట్రాజెడి ఆమె సామెతను వైద్యం లా ఫీల్ అయి చెప్పుతో కొట్టింది చూడండి అదన్నమాట అసలు బాధ నాకు :)
నిజమే లక్ష్మి గారు చాలా మంది పెంచేవాళ్ళు కుక్కలను కంటికి రెప్పలా చూస్తారు
నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం ..సరే ఈ విషయం మనమద్యలోనే ఉంటుంది ఎవరికీ చెప్పకండేం :D
రవి తేజగారు ఆ తధాస్థు దేవతల వరం వల్ల ఏం జరిగిందనేది నెక్స్ట్ ఇంకోసార్ చెప్తాను :)
అఙ్ఞాత గారు :) కాని అందరు పెంచేవాళ్ళు అలా ఉండరు లేండి నా విషయం లో మీ విషయంలో అలాంటివాళ్ళు తగిలారన్నమాట ..

నేస్తం చెప్పారు...

కిషన్ త్వరలో రాస్తాను :)
భావన గారు నెక్స్ట్ పోస్ట్ ఆ విషయం మీదే :)
సృజన గారు ఏదీ ఒక్కసారి మీ చుట్టు 5 వీదికుక్కలు కోపంగా చూస్తూ ఎటూ కదలనివ్వకుండా చూస్తున్నట్లు ఊహించుకుని ఈ మాటానండి చూద్దాం :P
ఆ పోస్ట్ చదివాను ఎప్పుడో అబ్రకదబ్రగారు :) మీ పోస్ట్లు మిస్ అవ్వడమా :) హూం రాను రాను కాకరకాయ కీకర కాయ అవుతుందని ..కనీసం పోస్ట్లలో తప్పులు కాదు టైటిల్ కూడ తప్పు లతో రాస్తున్నాను :( థేంక్స్ అండి

నేస్తం చెప్పారు...

గన్నమణి గారు అమ్మో కోతులన్నా నాకు భయం అండి
పద్మ థేంక్స్ :) అసలు ఈ పోస్ట్ సగం నిద్ర వస్తుండగా మా ఆయన కోసం వెయిట్ చేస్తూ రాసి పోస్టి పడుకున్నా ... హమ్మయ్యా అర్ధం అయ్యింది అన్నమాట :)

అజ్ఞాత చెప్పారు...

కుక్కలంటే నాకూ భయమే. కానీ మీ అన్నగారికి మహా ఇష్టం.
నీ పోస్టు చదువుతూ నీ బాధ అర్థం చేస్కుంటూ ఒ పక్క అయ్యో అనుకుంటూనే నవ్వేసాను కూడా.
చాలా బాగా రాస్తున్నావు.

~C

పేరు చెప్తే గుర్తుపట్టేంత గొప్పవాడిని కాను చెప్పారు...

Hi Nestam garu,

Nice post...

Naku kuda mee lanti feelinge undi kukkala paina....kani adi india lo undaga raledu...UK vachaka vachindi...karavatalu, karipinchukotalu levu kani...vati size choosi ala oohinchukuntene chalu...naku "Bow"ngu fever vachestundi...

Meeku infront Dog festival aithe naaku everyday dog festival laga undhi....naa office ki velle time lo vache time lo andaru aa dogs ni drag chesukuntu tirige time...

Sorry office lo unnaduku english lo type chestunna....

kiranmayi చెప్పారు...

నేస్తం
సునకానందం అన్న మాట ఇంతకముందు చాలా సార్లు విన్నా. ఇప్పుడు అర్ధం తెలిసింది. పోస్ట్ అదుర్స్.

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
మీరు సగం నిద్రలో కూడా ఇంత బాగా రాసారంటే, చాలా చాలా గ్రేట్ అసలు.మొత్తం పోస్టు మొదటి నుంచి చివరివరకు నవ్వుతూనే ఉన్నాను.కుక్క కాటుకి చెప్పు దెబ్బలు సామెత ఆవిడ పాటించిన తీరు, మరీ మరీ నవ్వించింది.ఉత్తుత్తినే హాస్యానికి అనుకుంటున్నా అది మాత్రం. :-) కాదని చెప్పకండేం ?

ఒక్కో సారి నేను పాటలు సరిగ్గా చూడను, వింటాను అన్నమాట. అందువల్ల వచ్చిన తిప్పలు ఎలా ఉంటాయో అర్థం అయ్యింది బాగా ! :-) థాంక్స్ నేస్తం !
- పద్మ.

నేస్తం చెప్పారు...

పరిమళం గారు రాస్తాను త్వరలో :)
~c అయితే తనకు చెప్పద్దు ఈ పోస్ట్ గురించి, :P థేంక్స్ మెచ్చుకున్నందుకు :)
స్వరూప్ ఆఫిస్ లో నుండి కామెంట్ రాయడమే ఎక్కువ మళ్ళీ అందులో సారీ ఎందుకు :)అయితే రోజూ పండగే అన్నమాట మీకు ఆఫీస్కి వెళ్ళి-వచ్చేటప్పుడు :)
కిరణ్మయి :D
పద్మ కొన్ని నిజాలు అలాగే చేదుగా ఉంటాయి .. ఉత్తుత్తినే అనుకున్నావా నిజంగానే కొట్టింది చెప్పు తీసుకుని..వా :( నా బ్లాగ్ లో రాసేది 90 % కరెక్ట్ గా జరిగినదే నమ్మేయచ్చు నువ్వు :)

మాలా కుమార్ చెప్పారు...

నా యస్ .యస్ . సి ఎగ్జాం అయిన రోజు రాత్రి, బయట పడుకున్నప్పుడు ,ఓ కుక్క నా కాలి చిటికిన వేలిని కొద్దిగా గీరిన అనుమానము తో ,బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ లు ,నేను పి. యు సి లో చేరే వరకూ , అంటే వేసవి కాలము కదా చాలా మంది పిల్లలని కుక్కలు కరిచాయన్న మాట, అందువలన ,ఓ రెండు కాగానే మందు అయిపోవటము, ఓ నాలుగు రోజులు మందు వచ్చిందా అని తిరగటము , వచ్చాక మళ్ళీ మొదటినుండి తీసుకొని ,ఓ నాలుగు అయ్యాక మళ్ళీ మందు అయిపోవటమూ అలా అలా నా 14 ఇంజెక్షన్స్ అయ్యేసరికి కాలేజీ లో అడిమిషన్స్ అయిపోయి ,చివరికి దొరికిన దానిలో చేరటము జరిగిందన్నమాట. అప్పుడు జీవితం లో కుక్క మొహం చూడకూడదని ఒట్టు పెట్టుకున్నాను, కాని ,విధి ఆడిన వింత నాటకములో పావునై ,మా అబ్బాయి బలవంతముతో ఓ కుక్కను చుటికి అని పేరు పెట్టి ఓ 14 సంవత్సరాలు పెంచి ,అది చనిపోయి 3 సంవత్సరాలు అయినా ఇంకా మరిచి పోలేకున్నాను దాన్ని ,ఇంజెక్షన్స్ ని కాదు. అవీ మరచి పోలేదు లెండి ! మీ డాగ్స్ ఫెస్టివల్ కూడా ఇదే అయివుంటుంది లెండి

kiranmayi చెప్పారు...

ఆ... నిజంగానే కొట్టిందా? నేను కూడా ఉత్తుత్తినే అనుకున్నా.

అజ్ఞాత చెప్పారు...

అయ్యో నేస్తం, మరీ అంత పరమానంద శిష్యురాళ్ళు కూడా ఉన్నారా ? పోస్ట్ మొత్తం నిజమైనా,ఆ సామెతని కామెడీ చేయటానికి, అదొక్కటే కామెడీ ఎఫ్ఫెక్ట్ కోసం రాసారేమో, బాగుందే అని నవ్వుకున్నాను. :-( ఇప్పుడు నిజమేనంటే, తలచుకుంటేనే బాధగా ఉంది.నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ చేస్తూ,
- పద్మ.

మరువం ఉష చెప్పారు...

Nice post. good flow... ఏమాటకామాటే, అవంటే ఎంతో భూతదయవున్న నాకు, నా పరుగు/నడక సమయాల్లో మీద మీదకి వచ్చే ఏ కుక్కని చూసిన హడలే..

నేస్తం చెప్పారు...

మాలా కుమార్ గారు అమ్మో అన్ని ఇంజెక్షన్లు చేయించుకుని కూడా మీరు కుక్కను పెంచుకోవడం గ్రేటే అండి ..
కిరణ్మయి :D
పద్మ :) .. అన్నట్టు పంపిన లింక్ చూసాను బాగుంది ఆమె బాలరామాయణం లో నటించిన అమ్మాయా చాలా బాగుంది కదా :)
ఉష గారు :)

sreenika చెప్పారు...

అవునవును..కుక్కలంటే నాకూ భయమే.. మా నైబర్స్ కి ఒక కుక్క ఉంది.విచిత్రమేమంటే దానికేసి చూస్తేనే అది వెంటపడుతుంది. లేకుంటే మనల్ని ఏమీ చేయదు.దీన్నే కుక్క బుద్ధి అంటారేమో.

అజ్ఞాత చెప్పారు...

మేము చాలా కుక్కలని పెంచాము. కానీ ఒక్కటి కూడా ఎవ్వరినీ కరిచిన దాఖలాలు లేవు.

మాస్నేహితుడీకి మాత్రం కుక్క లంటే చచ్చేంత భయం.మాయింటికీ వాళ్లింటికి ఓ సందు అడ్డమంతే.... కానీ రోజూ రాత్రిపూట అతను మాఇంటి నుండి వెళ్లేటప్పుడు నేనే తోడు వెళ్లి దింపాలి. :)

ఇక లాభంలేదు మీకు లాంటి వారికి కుక్కల సైకాలజీ నేర్పించడాని కైనా నేనో పోష్టు రాయాలి..... :)

విశ్వప్రేమికుడు

swapna@kalalaprapancham చెప్పారు...

అమ్మో నాకు కూడా కుక్కలు అంటే చాల బయం ఎక్కడ కరుస్తుందో అని. ఒక technique మాత్రం తెలిసింది అది ఏమిటంటే మనం కుక్కలని just ignore చేసి మన పని మనం చేసుకుంటూ పోతే ఏమి problem ఉండదు ,దాన్ని అల ఎకాడ కరుస్తాదో అని దాని వంకే చూసాము అనుకో అవుట్. నేను రోడ్ మిద ఎపుడిన కుక్క కనిపిస్తే ఇలాగె అనుకోని అస్సలు దాని వంక చూడను. కానీ నడుస్తున్నత సేపు plz swami plz swami rakshinchi swami అని మనసులో అనుకుంట :) .
నేను banglore లో హాస్టల్ లో ఉన్నపుడు మా హాస్టల్ లో suddenga కుక్క ని తెచ్చుకున్నారు సచ్చాను బాబు అనుకున్న కానీ అది ఎం అంతగా అరవదు బుజ్జి ముండ . సో ఏమి ప్రాబ్లం రాదు కానీ ఒక సారి మాత్రం ఎదురుంగ ఐరన్ షాప్ ఉంటె బట్టలు తీసుకోడానికి వెళ్లి మల్లి మా హాస్టల్ కి వెళ్తుంటే ఎవరో హాస్టల్ కి వస్తున్నా అని అది న వంకే చూస్తుంది నావెనకే తిరిగింది కొంచెం అరిసింది అనుకుంట చిట్టి నేను చిట్టి అని దాన్ని బతిలాడను ఏమి చేయల్దులే పాపం.

గీతాచార్య చెప్పారు...

In front dogs festival!!!!! LOL and a half. A very nice laughter b4 goin' to sleep. Thanks nestham. Will comment 2maro again.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

పాపం మీట్రాజడీ చూసి నవ్వుకోటం తప్పనిపించినా నవ్వకుండా ఉండ లేకపోతున్నాను :-) కుక్కలకీ నాకు ఇంచుమించూ ఇదే వైరం.

అదేంటో తెలియదు అప్పటివరకు బుద్దిగా ఉన్న కుక్కకూడా నన్ను చూడగానే వాటి ఆజన్మ శతృవు ఎదురైనట్లు కయ్ మంటూ తోక జాడిస్తుంది. నేనంటే వాటికి ఎందుకో అంత లోకువ ఎంత ఆలోచించినా అర్ధం కాదు. కాకపోతే ఇంతవరకూ దేన్నీ కరిచే వరకూ రానివ్వలేదు లెండి.

నేస్తం చెప్పారు...

అయితే కుక్కలు పలు రకాలు అన్నమాట శ్రీనిక :)
ప్రేమికుడు గారు మరి ఇంకేం పోస్టండి నేర్చేసుకుంటాను :)
ఒహో స్వప్న మంచి విషయం తెలిసింది నాకు కుక్కల వైపు చూడకూండా ఉంటే అవి మనల్ని ఏమీ చేయవన్నమాట :)
గీతాచార్య గుడ్ నైట్ :)
వేణు శ్రీకాంత్ గారు మొత్తానికి మీరూ నాలానే అన్నమాట

కొత్త పాళీ చెప్పారు...

brilliant

తెలుగోడు చెప్పారు...

టామి, జిమ్మీ లు కుక్కల పేర్లనెలా అనుకుంటారండి. ఆ మాటకొస్తే, బాబీ పేరు కూడా తెలుగు పేరు కాదే. Tom, Jim, Bob లాంటి పేరున్న వాళ్ళను టామీ, జిమ్మీ అని పిలవడం సాధారణం కదా...

మా మేనేజర్ ఒకాయన, ఇండియ ట్రిప్ కు వెళ్ళినప్పుడు, ఆగ్రా లో, ఓ guide కుర్రాడు నచ్చి, అమెరికా తీసుకెళ్తా వస్తావా అని అడిగాడట. దాని సంగతి తర్వాత, మీ పేరేంటో చెప్పండి అన్నాట్ట ఆ కుర్రాడు. ఈయన "జిమ్మీ" అని చెప్పాడు (ఆయనపేరు Jean). ఆ పిల్లాడు, పడీ పడీ నవ్వి, కుక్కల పేర్లెవరైనా పెట్టుకుంటారా. పేరడిగితేనే ఇంత కామెడీలు చేస్తున్నారు, అమెరికా రమ్మనటం కూడా అంతా ఉట్టిదే అనేసి, కుంచెం disappoint అయిపోయి, వెళ్ళిపోయాట్ట. నేను నిజంగా చెబుతున్నా, కామెడీ కాదు అన్నా, వినిపించుకోలేదట ....మళ్ళీ US కు ఈయన వచ్చాక, నన్నడిగాడు.... ఇదేంటి, ఇండియా లో కుక్కలకు మా పేర్లు పెట్టుకుంటారా అని...

HarshaBharatiya చెప్పారు...

నన్ను తిట్టుకోకండే ఎన్దుకంతేయ్ నా పేరు కూడా హర్ష నే
చాలా బావుంటాయ్ మీ పోస్టింగ్స్..