15, ఆగస్టు 2009, శనివారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలా???



అందరికీ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు అని చెప్పాలని ఉంది కాని చెప్పలేను..అసలు ఎందుకు చెప్పుకోవాలి..మన దేశానికి మనం ఏం చేసి ఉద్దరించామని చెప్పాలి?ఇలా రొటీన్ ప్రశ్నలు వేయాలని ఉంటుంది ...ఏంటో ప్రతి ఆగస్ట్ 15 కి నా మనసెందుకో అలజడిగా ఉంటుంది .. అసలు ఈ పోస్ట్ ఇప్పటికిప్పుడు మొదలు పెడుతుండటం వల్ల ప్రారంభం ,ముగింపు సరిగా అర్దం అయ్యేలా రాయలేనేమో..

నాకసలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారని తెలిసింది చాలా చిన్నపుడు ..వయసు తెలియదు,కాని చాలా చిన్నదాన్ని ..tv లో కహా గయే ఓ లోగ్ అని హిందిలో ఒక సీరియల్ వచ్చేది మన స్వాతంత్ర్య సమరయోధుల గురించి ..అంటే పేరు మోసిన త్యాగ వీరులు గురించి కాదు.. ఎవరికీ తెలియని మామూలు యోధులు..ఎందుకో అది చూసినప్పుడు ఏడుపొచ్చేది ..ఆ భాష కూడా తెలియదు నాకు అప్పుడు..అంత చిన్న వయసులో నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు..

తరువాత మరొక సారి దూరదర్శన్ లో అల్లూరి సీతా రామరాజుగారి గురించి చూపించారు..ఆయన గురించి చెప్తూ ఆనాడు చూసిన ప్రత్యక్ష సాక్షులు చనిపోయే ముందు అల్లూరిగారి దైర్య సాహసాలు వర్ణించారు ..అదిగో ఆ చెట్టుకే ఆ మహానుభావుని కట్టేసి తుపాకులు గురి పెట్టారు..ఆయన బెదరలేదు ..బాగా కొట్టడం వల్ల దాహంతో మంచి నీరు అన్నాడు ..ఆ ధుర్మార్గులు వేడి,వేడి పాలు ఇచ్చారు ..ఆయన వారి వైపు ఒక చిరునవ్వు విసిరి ఆ పాలను గడ గడా తాగేసాడు అని చనిపోయేముందు విషయాన్ని వర్ణిస్తుంటే నా మనసులో ఆవేశమో,ఆవేదనో మరేమో వర్ణించలేను.. ఆయన కాకినాడ లో p.r కళాశాలలో చదివారంట ..ఆ విషయం తెలిసాక ఒక్క సారైనా ఆ కాలేజ్ కి వెళ్ళాలని ఎంత తాపత్రయ పడ్డానో ఇప్పటికీ కుదరలేదు ..ఆ మహాను భావుని చూడక పోయినా ఆ పరిసర ప్రాంతాలన్నీ ఆయనను ప్రత్యక్షం గా చూసిన మూగ సాక్షులు..ఒక్క సారి ఆ ప్రాంతం చూసినా జన్మ ధన్యమే అనిపించింది ..

నేను మరచిపోలేని రోజులు నా హై స్కూల్ రోజులే ..ఎందుకంటే నేనే ప్రతిఙ్ఞా ,వందేమాతరం చెప్పేదాన్ని రోజూ .. ఇంకా ఆగస్ట్ 15 వచ్చిందంటే చాలు ఆ రోజు దేశభక్తి గీతాలన్నీ నావే ... అవి పాడినపుడు నేనేదో దేశానికి చేసేయాలన్న పట్టుదల వచ్చేసేది..అప్పటికి నాకు తెలియదు కదా అది కేవలం ఆవేశం వరకే పరిమితం చేస్తామని ..మా తాతయ్యకు గాంధి గారంటే అసలు ఇష్టం ఉండేది కాదు..ఆయన వల్లే మనకు స్వాతంత్ర్యం రావడం ఆలశ్యం అయ్యింది అని తిట్టేవాడు..నాకు చాలా కోపం వచ్చేది.. అసలే చిన్నప్పటినుండి..కాకమ్మా ,చిలకమ్మా కధలే మాకొద్దు మా గాంధి చెప్పింది మాకెంతో ముద్దు అని పాడుకున్నదాన్ని.. అందులోనూ గాంధి జీవిత చరిత్రలో ఆయన అభద్దం చెప్పకూడదని ,నిరాడంబర జీవితాన్ని గడపాలని ఆయన ఆచరించి చూపిన విధానం ఇంకా చాలా నచ్చాయి...అలాంటిది మొదటిసారి గాంధి గారి మౌనం వల్ల భగత్ సింగ్ మరణం తీరని బాధను కలిగించింది ..భగత్ సింగ్ నా హీరో ..అలాంటిది అతని పట్ల గాంధి గారి తీరు నాకు చాల కోపం తెప్పించింది..

క్లాస్ లో హిస్టరీ అంటే విపరీతమైన ఆశక్తి గా వినేదాన్ని..అతివాదులు,మితవాదులు గురించి చదివినపుడు ఎవరికి ఓటు వేయాలో తెలిసేది కాదు..మిత వాదులైన బాల గంగాధర్ తిలక్,బిపిన్ చంద్ర పాల్,లాలా లజపతిరాయ్ లు (లాల్,బాల్, పాల్) అంటే ఎంతో గౌరవం నాకు.. జలియన్ వాలా బాగ్ దురంతం విన్నపుడు మితవాదుల సహనం నాకు చాలా కోపం వచ్చింది..అలాగే సహాయ నిరాకరణోద్యమం మంచి ఊపులో ఉండగా ఎక్కడొ పోలీసులను తగలపెట్టేసారు కోపం వల్ల ఆందోళనకారులు ...అని దాన్ని మద్యలో ఆపేసిన గాంది గారి మీద చాలా కోపం వచ్చేది ...

ఇంకా టంగుటూరి ప్రకాశం పంతులు,మాగంటి అన్నపూర్ణాదేవి,సుభాష్ చంద్ర బోస్, ఇలా ఒక్కరేమిటి ఎంతమంది గురించి చదివి ఉంటాము మనమందరం..అవి చదివినపుడు రక్తం ఉడికిపోతుంది కదూ ...కాని తరువాత ఏం చేస్తాం పుస్తకం మూసేసి Tv లో మగధీర సినిమానో ... లేకపోతే dance baby dance ,లేదా మరొకటొచూసేయడం ,మన ఆవేశం అంత ఉష్ కాకి చేసేసి బజ్జోవడం ఇంతేగా...ఇంత రాసాను నేను కూడా ఇదే చేస్తాను ... గట్టిగా అడిగితే ఇంతకంటే ఏం చేయగలం ..అని ఒక నిట్టూర్పు విడుస్తాం..

ఒక్కోసారి అనిపిస్తుంది మన స్వాతంత్ర్య సమరయోదులందరూ బ్రతికి ఉంటే మన దేశ దుర్మార్గపు దౌర్భాగ్యాన్ని చూసి లక్ష సార్లు ఉరేసుకుని ఉంటారు తమ మనసులను ...నేను చెప్పబోయేది ఇప్పుడు జండా పట్టుకుని జండా ఊంచా రహే హమారా అని పాడమని కాదు,జాతీయ గీతం రాగానే లేచినిలబడమని కాదు.... ఆకలి తో ఉన్నవారికి మనకు చేతనైనంతలో కాస్త సహాయం చేయండి.. బలవంతం గా కాదు..చేయగలిగినంత.. రోడ్ మీద ఒక ముసలావిడ సరి అయిన బట్టలు లేక ఉంటే పాత బట్టలేమన్నా తనకు ఇవ్వండి..( మళ్ళి కొత్త బట్టలు ఇస్తే వాళ్ళు అమ్మేసుకునో మరొకరికో ఇచ్చేస్తారు అనుకుంటే ).. నెల రోజులకో రెండు నెలలకో ఇంట్లో యే పులిహారో చేసి బయట తిండికి అలమటించే నలుగురికి పొట్లాలక్రింద కట్టి ఇవ్వండి..ఇవన్ని చేయగలిగినవే... ఆలోచిస్తే బోలెడు చేయగలం ..అందరం అందరికీ సహాయం చేయలేము కదా..మనకు తోచినంతలో మన వీరుల సాక్షిగా ఎంతోకొంత చేద్దాం ..ముఖ్యం గా వీరమరణం పొందిన మన జవాన్ల కుటుంభాలు కనబడితే మన కుటుంభం కంటే ఎక్కువ గా గౌరవిద్దాం... సంవత్సరానికి ఒక 4 ,5 మంచి పనులు ఏదో రూపం లో చేస్తే మనకు తృప్తిగా ఉంటుంది ఆ మహానుభావులకు నిజమైన నివాళి ఇచ్చినట్లు అవుతుంది ....ఇప్పుడు రండి చెప్పుకుందాం అందరికీ స్వాతంత్రయ శుభాకాంక్షలు ...

34 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

wow .. double wow.

అజ్ఞాత చెప్పారు...

అల్లూరి సీతారామరాజు చదివిన నరసాపురం లోని టేలర్ హై స్కూల్ లో చదివానండి నేను.

Padmarpita చెప్పారు...

జాతీయగీతం విని లేచి నిలబడుతున్నారో లేదో తెలియదుకాని నేస్తం!
మునుపటిలాగ అయితే లేరు ప్రస్తుతము జనం....
అందరిలోను ఉంది కొద్దో గొప్పో దయాగుణం...
అందుకే చేసుకుంటున్నారు ఒకరికొకరు సహాయం...
చింతవలదు శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు మనం...
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!!

priya... చెప్పారు...

hi andi nestam garu...ela unnaru?meku svatantryadinostava shubhakankshalu...meru nijanga chala great andi,meru inta chakaga perlu anni social text vishayalu anni cheparu...kani naku gandhi garu, subhash chandra bose gari patla pravartinchina vishayam telisi ayanameda kopam vachindi..chala mandi mana deshani kosam tama pranalu arpincharu. valalo kondari perlu matrame bitiki vachayi migavaru chesina tyaganiki asalu manam enta varaku vala gurinchi telusukuntunam?entavaraku talachukuntunnam anna vishayam taluchu kunte..bharateyuli undi nameda nake siggestundi...anduke manam meru chepinattu elanti sevalu chesina vala runalu teruddam..intakante manam emi cheyalem..kani naku oka korika andi moga pillavadiga pudite army lo join kavalani, adi maro janmalo terutundemo chudali mari...unta nandi

Shashank చెప్పారు...

మన దేశానికి ఇప్పుడు ఉన్నది ఆలోచనా దారిద్ర్యం కాదండి ఆచరనా దారిద్ర్యం. మీలాగే నాకు ఆవేశం ఎక్కువ .. గాంధి నెహ్రూ అంటే ఇంకా కోపమే.. అది వేరే విషయం. మా తాత గారు 42 లో జైలు కి వెళ్ళారు. మళ్ళా రజాకర్ల టైం లో కూడా వెళ్ళారు. గొప్ప అని చెప్పడం లేదు కాని వారు దేశం కోసం దేశం గురించి ఆలోచించారు. మన ఆలోచన గొప్పగా ఉన్న ఆచరన మాత్రం ఇంటి గడప దాటదు.

మీరు చెప్పినట్టూ బీదవాళ్ళకి కావాల్సింది ఆ పూట భోజనమో రెండు రోజులు కప్పుకునే గుడ్డో కాదండి.. వాళ్ళాని ఆ దరిద్రం నుండి బయటకి లాగాలి. అల చేయడం కొంచం సులభమే కాని చేసే వీలు ఓపికా స్వంత జీవితాంతో కుస్తిపడుతున్న చాలా మందికి కుదరదు. దానికి తోడు పేదవాళ్ళని అలనే ఉంచేయాలని చూసే రాజకీయం తప్పు కూడా. ఇవ్వన్ని పట్టించుకోకుండా నిరంతరం కృషి చేస్తున్న NGO లని ఒక్కసారి గుర్తిస్తె మంచిదేమో.

"అర్థ శతాప్ధపు అరాచకాన్ని స్వతంత్రమందామా .. స్వర్ణోత్శవాలు చేద్దామా...."

visalakshi చెప్పారు...

నాకు కూడా ఇవాళ అలాగే అలజడిగా ఉ౦ది నా మనసు నేస్త౦.ఎవరికి స్వాత౦త్ర్య౦ వచ్చి౦ది,ఎ౦దుకు శుభాకా౦క్షలు చెప్పుకోవాలి ఏ౦ సాధి౦చామని? ఈ ఒక్క రోజు భరత మాతకి వ౦దన౦ తెలుపుతూ టీ.వీ లో హోరెత్తేస్తారు. మన౦ కూడా ఆ సినిమాలు చూసి మన దేశభక్తిని మన హావ భావాలతో చాటేసుకు౦టున్నా౦.స్వాత౦త్ర్యసమరయోధుల్నిపట్టి౦చుకోవట్లేదు ప్రభుత్వ౦ అ౦టో౦ది ఒక చానల్.నిమిష నిమిషానికి బ్రేకి౦గ్ న్యూస్ చూస్తున్న మన౦ ఏమైనా ఆలోచి౦చ గలుగుతున్నామా అన్నది నా ప్రశ్న.చాలా ఆవేదనని ప౦చుకోవాలని ఉ౦ది,కానీ మరో పోస్ట్ ఐపోతు౦ది.

కొత్త పాళీ చెప్పారు...

మళ్ళీ చదివా మీ ఆక్రోశం. ఒక ఆలోచన తోస్తోంది. రేండంగా సహాయం చెయ్యడం కూడా బహుశా మంచిదే. కానీ ఏదైనా ఒక సంస్థ ద్వారా చేస్తే ఫలితం ఇంకొంచెం స్పష్టంగా ఉంటుందేమోనని. మీ చుట్టుపక్కలే ఎన్నో మంచి, నిజాయితో పని చేస్తున్న స్వఛ్ఛంద సంస్థలు ఉండొచ్చు. మన బ్లాగర్లలోనే కొందరు ఇటువంటి సంస్థలు నడుపుతున్నారు, లేదా ఆయా సంస్థల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అబ్బ ఇవేమీ నేణు రీసెర్చి చెయ్యలేను అనుకుంటే, నా మాట నమ్మి నెలకో యాభయ్యో వందో భాగవతుల ఛారిటబుల్ ట్రస్టుకి ఇవ్వండి. మీ దానం సద్వినియోగం అవుతుందని నా హామీ.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

హ్మ్...నిజమే.
నాకు ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం లానే అనిపించలే. చిన్నప్పుడే బెటర్..అమరవీరుల గురించి కనీసం తెలుసుకునే వాళ్ళం. ఒకసారి స్మరించుకునేవాళ్ళం. ఇప్పుడేది? ఏ చానల్ చూసిన దేశభక్తి అక్కడక్కడా స్పృశించిన సినిమాలే గానీ ఆ మహనీయుల గురించి ఆశక్తికరంగా మలిచిన ఒక్క ప్రోగ్రాం లేదు.

kiranmayi చెప్పారు...

చాలా సింపుల్ గా, మంచి మాట చెప్పారు

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

ఇదిగో.. ఇలా ఆలోచించే నేను కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదు ఎవరికీ!
మన బాధ ఎప్పుడు తీరుతుందో మరి?

swathi చెప్పారు...

mi post chala bavundandi.nijame manam cheyagaligina enno panulu vunnayi miranttlu.pryatnisthanu .
happy independenceday

నేస్తం చెప్పారు...

కొత్తపాళి గారు నేను మా తమ్ముడు ద్వార అనేక స్వచ్చంద సంస్థలకు సహాయం చేస్తున్నాను ..అయితే నా బాధ అది కాదు శీతాకాలం వచ్చిందంటే రోడ్ వారగా అనేకమంది చలికి వణుకుతూ ముడుచుకుపడుకుని ఉంటారు..వారికి ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అని చూడకుండా మనదగ్గర ఉన్న పాత దుప్పట్లో లేక బట్టలో ఇస్తే బాగుండును అనిపిస్తుంది
బోనగిరిగారు అవునా నేను అదే స్కూల్ లో చదివి ఉంటే ప్రతి చెట్టు పుట్టను తాకి చాలా ఆనందపడి ఉండేదాన్ని ..ఇదేం చాదస్తం మరీనూ అనిపిస్తుందేమో మీకు .. అదో ఆనందం ..
అందుకే ఇలా అయినా ఉంది మన దేశం @ పద్మార్పిత గారు :)
ప్రియ నిజానికి ఈ పోస్ట్ రాయాలనుకోలేదు ఎందుకో ఉన్నట్లు ఉండి రాసేసాను.. అందువల్ల అనేక మంది మన స్వాతంత్ర్య వీరుల గురించి రాయలేకపోయాను.:)
శశాంక్ నిజమే ఒక వ్యక్తి కి పేదరికం లో ఒక పూట సహాయం చేసే కంటే వారిని ఆ దారిద్ర్యం నుండి బయటకు రావడానికి సహాయం చేయడం చాల మంచిది.. అదే చెప్తున్నాను ఎవరికి తోచిన విధం గా వారు ఇతరులకు సహాయం చేస్తే బాగుంటుంది అని ..అందుకే స్వచ్చంద సంస్తలకు సహాయం చెస్తే వారు వారికి దారి చూపుతారు ...అది చేయలేనివారు కనీసం రోడ్ మీద ఆకలికి మాడిపోయే వృద్దులు,పిల్లలకు తోచిన సహాయం చేయమంటున్నాను ..
వేద గారు :)
శేకర్ గారు దూరదర్శన్ మీద ఇన్ని జోకులు వేసుకుంటాం కాని అది బెటర్ అండి ..మరి ఇప్పుడు అందులో కార్యక్రమాలు ఎలా వస్తున్నాయో తెలియదు కాని అప్పట్లో చక్కని విశేషాలు అందించేవారు..
కిరణ్మయి :)
నరేష్ మనిషి ఆశాజీవి..ఆ ఆశ తోనే ఎదురు చుద్దాం మనవంతు ప్రయత్నిస్తూ
స్వాతి happy independenceday

Hima bindu చెప్పారు...

"మిత వాదులైన భాలగంగాధర్ తిలక్ ,బిపిన్ చంద్ర పాల్,లాల లజపతి రాయ్ (లల,బల,పాల్ )అంటే నాకెంతో గౌరవం "అన్నారు .కాని వారు అతివాదులు .(ఎక్ష్త్రేమిస్త్స్ )..ఎందరో మహానుభావుల త్యాగం ఈ సందర్భంగ ఒక్క క్షణం ఆలోచించిన స్ఫూర్తిదాయకమే.నిజానికి ప్రజలలో స్వాత్యంత్ర కాంక్ష రగిల్చి కదం తొక్కడానికి దోహదపడినవి నాటి పత్రికలూ,అతివాద సంస్థలు ,స్వార్ధమేరగని అతివాద నాయకులు .ఐ లవ్ భగత్ సింగ్ ,యశ్పాల్ ,రాజ గురు ,సుఖదేవ్......ఇంకా తెరవెనుక ,తెరముందు ఆవేశాన్ని రగిల్చి,వుద్భోధించిన మహానీయులంతనా మనస్సులో చిరంజీవులే నిత్య స్ఫూర్తి దాతలు .ఎవరికి వారు తమవంతు చేస్తే, ఎంతోకంత మనం ఆశిస్తున్న ప్రగతి సాధిస్తామని నమ్ముతాను . మీ టపా మంచి ఆలోచన రగిల్చినది .

గీతాచార్య చెప్పారు...

ఉడికిపోవటానికి రక్తాన్నేమన్నా cooker లో పెట్టామా నేస్తం? ;-)

" పుస్తకం మూసేసి Tv లో మగధీర సినిమానో ... లేకపోతే dance baby dance ,లేదా మరొకటొచూసేయడం ,మన ఆవేశం అంత ఉష్ కాకి చేసేసి బజ్జోవడం ఇంతేగా..."

This is what is called ఆవేశం. అదెప్పుడూ మంచిది కాదు. అసలు ఎమోషన్ మన ఆలోచనని డామినేట్ చేయకుండా జాగ్రత్త పడితే, మనం ఆ సందర్భం ముగియగానే ఇతర మాయల్లో పడం. ఆ ఆలోచన అలాగే కొనసాగించి, చేయాల్సిన కార్యాచరణ చేయగలం.

అందుకే నేను అంటాను, మెదడుతో ఆలోచించి మనసుతో చేయాలని. మెదడుకి ఏ ఆవేశాలూ ఉండవు. ఆ ఎమోషన్స్ అన్నీ మనసువే. దాన్ని పనిచేయటం వరకే పరిమితం చేస్తే చాలు.

"నోనోనో అలా చెప్పకు...
మనసుంటే మార్గముంటది..."

ఎంత బిజీగా ఉన్నా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పటం, అమ్మా, నాన్నల్ని రోజుకొకసారైనా పలకరించటం, పిల్లలతో రోజూ కాసేపు గడపటం, ఇవన్నీ అసాధ్యం కాదు. కాస్త మనసెట్టి ఆలోచించాలంతే. అలాగే ఇదేనూ. నెలకో రెండు నెలలకో కాదు. రోజూ మన మాటలతోనో, చేతలతోనో ఇతరులకి కాస్తంత విలువైన సమాచరాన్నిచ్చి, వారినీ మంచి పనులు చేసేలా చేయటం అస్సలు అసాధ్యం కాదు.

చెయ్యగలిగే సత్తా ఉండాలే కానీ, ఒక చిరునవ్వ వేన వేల సహాయాలు చేస్తుంది. చేయిస్తుంది. కాస్త ఆశ ఉండాలంతే.

ఐబాబోయ్ నేనివన్నీ చెప్పేశానేంటి బాబోయ్! :-D నేస్తం ఇవన్నీ తూచ్. పట్టించుకోకేం? ;-)

priya... చెప్పారు...

meru kanesam ela blogs rupamlonina meru varandarini gurtuchestunnaru kani chala mandi bharateyulu adi kuda taluchu kovatam ledau udaharanaku nalanti varu annamata...anduke ala annanu ok na...

నేస్తం చెప్పారు...

గీతాచార్య గారు తూచ్ లు గట్రాలు లేవు..పట్టించుకుని చాల సేపు అయింది ..నిజమే ఆవేశం అంతా మనసుదే..ఊరికే అన్నారా మనసుగతి ఇంతే మనిషి బ్రతుకంతే అని..
ప్రియ :)
చిన్ని గారు కరెక్టే చెప్పారు గంగాధర్ తిలక్ మొదట్లో కాంగ్రేస్ లో మితవాదిగానే ఉండి వారి దోరణి నచ్చక కాంగ్రేస్ని బిక్షగాళ్ళ సంఘం అని విమర్శించి స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటి బ్రిటిష్ వాళ్ళను బెంబేలెత్తించాడు..పొరపాటు తెలిపినందుకు చాలా దేంక్స్ అండి

అజిత్ కుమార్ చెప్పారు...

మీ తాతగారిలాగే మీరు కూడా చాలా ఆవేశపరులండీ. బాగా చెప్పారు.

అజ్ఞాత చెప్పారు...

పాతికేళ్ళకితం స్వాతంత్రదినోత్సవం అంటే ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు.
చాలా డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడదొక సెలవురోజు మాత్రమే.
పద్మార్పిత గారు చెప్పినట్లు ఆశ ఏమిటంటే ఇప్పటి నవతరంలో, మంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళళ్ళో ఇతరులకు సాయపడాలనే ఆలోచన ఉంది.
నాకు తెలిసిన బంధుమితృలలో చాలామంది చేస్తున్నారు కూడా.
కొన్నేళ్ళుగా నేను కూడా నాకు తెలిసిన ఒక పేద కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలు పంపిస్తున్నాను.
జీతం రాగానే మొదటగా చేసేది ఆన్ లైన్ లో వాళ్ళ అకౌంట్ కి బదిలీ చేయడం.
విరాళాలకోసం ఎంతోమంది అడుగుతుంటారు. అందులో పేదలకి ఎంత చేరుతుందో మనకి తెలియదు.
మనకు తెలిసిన పేదలకు, వృధ్ధులకు సహాయం చేస్తే కొంత సంతృప్తి.
నేనేమి నా గొప్పకోసం ఇక్కడ వ్రాయడం లేదు. కొంతమందైనా ఫాలో అవుతారని ఆశ.

గీతాచార్య చెప్పారు...

kompadeesi kopaginchaaraa enti?

Unknown చెప్పారు...

avnandi..ededo cheseyalani..nenu appudappuduu anukuntuu untanu..kani emi cheyalenu..anduke..eppudaina office lo orphanages ki , old age homes ki money ante ventane ichestanu...endukante..elago velli help cheyanu kada...vollu baddakam..any ways..svatantryadinostava shubhakankshalu

మాలా కుమార్ చెప్పారు...

స్వాతంత్రదినోత్సవ శుబ్కాకాంక్షలు.
ప్రియ గారూ, ఇప్పుడు అమ్మాయిలను కూడా ఆర్మీ లోకి తీసుకుంటున్నారు. మీరు నెక్ష్ట్ జన్మదాకా ఆగక్కరలేదు.

నేస్తం చెప్పారు...

అజిత్ గారు :)
ప్రొఫెసర్ గారు అక్కడే పప్పులో ,ఉప్పులో కాలేసారు ..నేస్తం అని ఊరికే పేరు పెట్టుకున్నానా :) కాబట్టి కొంపదీయ కుండా కోప్పడలేదు ..
బోనగిరి గారు మీరన్నది కూడా కరెక్టే చాలా మంది ఇలా సహాయం చేస్తున్నారు ..ముఖ్యం గా పేదకుటుంభం లో చదువుకోలేని వారి చదువుకు సహాయం చేస్తున్నారు,,దీనివల్ల రేపు ఆ కుటుంభం మొత్తం పస్తులు లేకుండా హాయిగా ఉండగలదు ..
కిరణ్ నేనూ మీలాంటిదాన్నే,అయితే ఒక్కోసారి ఎంత అనుకున్నా సహాయం చేయాలనుకున్నవారికి ఏదో ఒక అడ్డంకులు వచ్చి నేను ఇండియా లో లేకపోవడం వల్ల చేయలేక పోతుంటాను ...దీని వల్ల ఎక్కువగా ఇలా స్వచ్చంద సంస్థలకు డబ్బులిచ్చి సరిపెట్టెసుకుంటుంటాను.. :)
మాలా కుమార్ గారు :D

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
చాలా inspiring గా రాసారండీ ! నేను నా వంతు చిన్న చిన్న సహాయాలు ( నా చిట్టి చేతులతో ) చేస్తుంటాను !

ప్రత్యక్షంగా చేయకపోతేనేమండీ ? మీ వంతు సహాయం, స్వచ్చంద సంస్థలకి చేస్తున్నారు కదా ! అది నిజంగా అభినందనీయం !
ఇంత చక్కగా యువతని inspire చేసేలా రాసిన మీకు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !
- పద్మ.

పరిమళం చెప్పారు...

నేస్తంగారూ ! మాటల్లేవు ...కేవలం చప్పట్లు ...మీకు వినిపించవు కాబట్టి చెబుతున్నా ...నా ఫీలింగ్ !

Varunudu చెప్పారు...

సమస్య అనేది ప్రతీ చోట ఉంది. మన దేశం లో మరీ ఎక్కువగా ఎందుకు అనిపిస్తోంది అంటే, జనాభా ఎక్కువ, వనరులు తక్కువ కావడం వల్ల. అవకాశాలు కొన్నే, కానీ పోటీ విపరీతం. ప్రతీ వాడూ పోటీలో మొదటి స్థానం లో ఉండాలి అనుకొనే వాడే. ప్రతీ ఒకరికీ డబ్బు వల్ల సమకూరే సుఖాలు కావాలి. మరి అలాంటి పరిస్థితుల్లో అవినీతి వేయి పడగలు చాచి విస్తరించడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎక్కడైతే అవినీతి ఉందో అక్కడ ప్రగతి కుంటుబడుతుంది. ఇదంతా ఒక విష వలయం. శ్రీ శ్రీ గారు వ్రాసినట్టు,

పదవీ వ్యామోహాలూ, కులమత భేదాలూ, భాషా ద్వేషాలూ చెలరేగే నేడు, ప్రతి మనిషీ మరియొకని దోచుకొనే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే.. !

కాలదోషం పట్టని అమృత గుళికలు ఇవి. దీనికి పరిష్కారం ఒకటే, జనాలు మేలుకొనాలి. అందరమూ కలిస్తేనే జాతి అనే విషయాన్ని మనసా వాచా కర్మణా పాటించాలి. ఆకలి గా ఉన్నవాడికి ఒక చేపను ఇవ్వడం కన్నా, చేపలు పట్టడం నేర్పితే అతడు జీవితాంతం భోజనానికి ఇబ్బంది పడడు అనేది ఒక చైనీస్ సామెత. మన ప్రభుత్వాలు కూడా ఎంత సేపూ, ఆల్ ఫ్రీ అనడం మానేసి ఆ దిశగా చర్యలు తీసుకొనడం మొదలెడితే బాగుంటుంది. సూడో కమ్యూనిజం కన్నా, కడుపు నింపే పెట్టుబడి దారీ విధానమే మిన్న యేమో అనిపించేంతగా ఉన్నాయి ప్రస్తుత భారత పరిస్థితులు. వీటిని మార్చడం ఒక్క ప్రజల చేతుల్లోనే ఉంది.

కానీ తమ సుఖాన్ని కాదని, పక్క వాడి కష్టాన్ని తీర్చగలిగే ఔదార్యం ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో, అప్పుడే భారతావనికి నిజమైన స్వాతంత్ర్యం !

సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడు పడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ !

ఇంత కంటే ఏమీ చెప్పలేను !

వేణూశ్రీకాంత్ చెప్పారు...

వావ్ నేస్తంగారూ మాటల్లేవు..

నేస్తం చెప్పారు...

థేంక్స్ పద్మ :)
పరిమళం గారు మీరు మరీనూ :)
వరుణుడుగారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్టే..ఒక మనిషికి డబులిచ్చి చేసే సహాయం కంటే ఆ మనిషి డబ్బును సంపాదించుకునే జీవనోపాది కల్పించడం అన్నిటికంటే గొప్ప సహాయం..అయితే ప్రభుత్వం ని నమ్ముకోవడం అంత శుద్ద దండగ పని ఇంకేంలేదు.. ఇంక ప్రజలంటారా ఎదో కొద్దిమంది తప్ప శ్రీశ్రీ గారన్నట్లు ప్రతి మనిషీ మరియొకని దోచుకొనే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే.. చాలామంది పట్టించుకోరు ... కొంత మందికి చేయాలని ఉన్నా ఉద్యోగరిత్యానో ,బద్దకం వల్లో, నీరసమో,నిర్లక్ష్యమో మరేదో కారణమో చేయరు.. అలాంటివారు డబ్బు రూపంలో స్వచ్చంద సంస్థలకు సహాయం చేయడం మంచిదే..అయితే అవి ఎటువంటి సహాయాలు చేస్తున్నాయి అని చూసుకోవడం మంచిది ..ఉదాహరణకు మా తమ్ముడు ద్వారా నేను సహాయం చేస్తున్న సంస్థ వాళ్ళు పేదవాళ్ళు,రైతు కూలీల పిల్లలకు ఉచితంగా విద్య నేర్పుతారు,పేదరికం వల్ల కను చూపు పోయినా పట్టించుకోని వాళ్ళకు ముసలివారికి పల్లె పల్లెలు తిరిగి ఉచితం గా ఆపరేషన్లు చేయిస్తారు,అనాధ శరణాలయలకు వెళ్ళి పిల్లలకు కనీస సౌకర్యాలు అంటే కప్పుకోవడానికి దుప్పటి బ్రష్ పేస్ట్ లాంటి వాటిని అందచేస్తారు.. ఇంకా చాల సంస్థలు అభాగినులైన మహిళలను ఆదుకోవడానికి ఉన్నాయి.. వాటికి సహాయం చేయచ్చు..అంతవరకు ఎందుకు పేదవాళ్లంటే ఎక్కడొ ఉండరు మన బంధువుల్లోనో ,ఇంటిపక్కనో వీది చివరనో చాలా మంది ఉంటారు... వారి పిల్లల చదువుకో ,లేక రోగం తో బాధపడుతున్న వారి పెద్దలకో డబ్బురూపంలో సహాయం చేయచ్చు ..మీకు తెలిసిన చితికిపోయి అప్పుల బాధతో సతమత మవుతున్న రైతులే ఉండచ్చు ..ఇలా సహాయం అనేది ఏ రూపం లో అయినా చేయచ్చు అనేది నా అభిప్రాయం కాకపోతే అపాత్రా దానం కూడా మంచిది కాదు అది చూసుకుని చేయాలి అంతే ..
వేణు గారు మీరు మాట్లాడకపోతే ఎలా సార్ :)

మరువం ఉష చెప్పారు...

ముందుగా కృతజ్ఞతలు. టపా, వ్యాఖ్యలు చదివాకా ఏదో భరోసా, మనం సాగుతాం, సాధిస్తాం అని. మా స్వఛ్ఛంద సేవా సంస్థ గురించి త్వరలో వెళ్ళడిస్తాను. మీ మాదిరే ఆలోచన, ఆచరణ కలిపిన సాధన కొంత వున్నదాన్ని.

Srujana Ramanujan చెప్పారు...

Very nice post.

@గీతాచార్య,

RighttO!

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
లక్ష్మి చెప్పారు...

నాకు కూడా ఈ మధ్య బోల్డంత ఆవేశం వచ్చేస్తోంది కాని అది ఇంకా మీలాగ వెళ్లగక్కలేకపోతున్నా. మీ టపాలన్నీ చదువుతున్నా, చాలా బాగుంటున్నాయి, కానీ నేను కామెంట్ రాసేయ్యాలి అనుకుంటుండగానే పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది

అజ్ఞాత చెప్పారు...

mee vyakyalu chala bavunnaye yelage continue cheyandi

Unknown చెప్పారు...

me randaru chepindi chala right but..........epudu una rajakiyam motham swartham.......naku emvasthadi oka pani chesthe ani alochisthunaru thapa nenu chese pani entha mandiki paniki vasthadi ani evaru alochinchadam ledhu....."this is the main drawback of our country in my view"

HarshaBharatiya చెప్పారు...

Jai Hindh...