6, ఏప్రిల్ 2009, సోమవారం

కాలేజి ప్రేమలుచిన్నపుడు ఒక కోరిక ఉండేది ...సినిమాల్లో హీరోయిన్ లాగా క్లాస్ రూంలో లెక్చరర్ పాఠాలు చెబుతుంటే, నేను డెస్క్ మీద సీరియస్సుగా బుక్ పెట్టి అవన్నీ వినేసి రాసేస్తుంటే ,మా అమ్మ కిటికీలోంచి చూస్తూ మా అమ్మాయి ఎంత బాగా చదివేస్తున్నాదో అని తెగ ఆనందభాష్పాలు కార్చేస్తుంటే చూడాలని(ఇక్కడ వెంకీ గుర్తొస్తే నా తప్పు కాదు ) .. అమ్మ కాలేజ్ కి వచ్చి మనల్ని చూసే అంత సీన్ ఉండదని తెలుసు కాని అదోసరదా...


తను చిన్నపుడు చదువుకోవాలని తెగ సరదా పడేది కాని మా తాతయ్య ఎంత చాదస్తం అంటే ఆయనకు 3 కూతుర్లు ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియనే తెలియదట,నా చిన్నపుడు శెలవలకి వాళ్ళింటికి వెళ్ళేటప్పుడు చూసేదాన్ని ...మా ఆఖరి పిన్ని కి ఇంట్లోనే ఒక 80 యేళ్ళ ముసలి పంతులుగారిని ఇంటికి పిలిపించి చదువు చెప్పించేవారు .. ఆయన చెప్పేది తనకి అర్దం అయ్యేది కాదు తను చెప్పేది ఆయనకు వినబడేది కాదు ...కనీసం సంవత్సరానికి 2 మాస్టార్లు మారేవారు.. వయసు అయిపోవడం వల్ల టపా కట్టి.. అలాంటి ఇంట్లో నుండి రావడం వల్లో ఏమో ,అమ్మ మేము బాగా చదువుకోవాలని అనుకునేది ..


ఆ కారణం చేత కాలేజ్ మా ఇంటికి కాస్త దూరం అయినా సరే (అంటే 40 నిమిషాలు నడక ) పట్టుబట్టి జాయిన్ చేసింది.. అది కూడా అమ్మాయిల కాలేజే అనుకోండి.. మా కాలేజ్ ఎంత బాగుండేదంటే ఏదో పార్క్ లో ఉన్నట్లే ..ఎటు చూసినా పచ్చని చెట్ట్లు ,ఎర్రని పూలు ,నేరేడు,బొప్పాయి జామా ,సెంటుమల్లి ,మెత్తని పచ్చిక అబ్బా అందులోనూ కాలేజ్ ఓపెన్ చేయగానే వర్షాలు ఒకటి స్టార్ట్ అవుతాయేమో వర్షంలో తడిచి ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చిన ప్రకృతికాంతలా భలేగుండేది .. అప్పటి వరకు బుల్లి బుల్లి స్కూల్స్ లో చదివిన నాకు అదో అందమైన లోకం లో ఉన్నట్లు అనిపించేది.. యూనీఫాం లు ,రెండు జడలు ,స్కూల్ బేగ్ లు గట్రా పోయి స్టైల్ గా రెండు పుస్తకాలు, రంగు రంగుల డ్రెస్లు ,వదులుగా అల్లిన జడ ,నుదిటి మీద రింగులు తిరిగిన ముంగురులు ( అంటే నేను అలా పీక్కునేదాన్ని లెండి) అలా హీరోయిన్లా ఫీల్ అయిపోయేదాన్ని ..


ఇంక జాయిన్ అయ్యాకా నా కల తీరే రోజు వచ్చేసింది కాబట్టి అవసరం ఉన్నా లేక పోయినా సార్ ఏం చెప్పినా చెప్పకపోయినా తెగ రాసేసేదాన్ని బుక్ లో ..ఇక్కడ నాకు విపరీతం గా నచ్చేసిన విషయం లెక్చరర్లు మమ్మల్ని 'ఏమండీ,' మీరూ అని సంబోధించడం.. అప్పటి వరకూ ఏయ్, అమ్మాయ్ దీనికి సమాధానం చెప్పు అని అనే టీచర్లు పోయి ,మీరు చెప్పగలరా దీనికి సమాధానం అని ఎంతో వినయంగా అడిగే సార్ లను చూస్తుంటే తెగ ముచ్చట వేసేది...ఇంకా నచ్చిన విషయం ఏంటంటే ఎలెక్షన్లు ... మా కాలేజ్ ఇంటెర్ ,డిగ్రీ కలిపి ఉండేది, కాబట్టి డిగ్రీ అమ్మాయిలు ప్రెసిడెంట్ గా ,సెక్రట్రీ గా ఇలా పోటి చేసే అమ్మాయిలందరూ మంచి మంచి చీరలు కట్టుకుని బొమ్మల్లా తయారయి నాకు ఓటెయ్యండమ్మా ప్లీజ్,ప్లీజ్ మా మంచి చెల్లాయిలు కదూ అని అభ్యర్దిస్తుంటే మనిషికి ఒక్క ఓటు హక్కు ఎందుకుంది ఒక 5,6 ఉండచ్చుకదా అనిపించేసేది..


ఆ తరువాత మెల్లి మెల్లిగా నాకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం మొదలైంది.. ముఖ్యం గా హాస్టల్ అమ్మాయిలు .. పక్కన ఉన్న పల్లెటూర్లనుండి వచ్చి కాలేజ్ హాస్టల్ లో చదివేవారు.. వాళ్ళకు నేను వేసుకున్న డ్రెస్లంటే మహా ఇష్టం .. మా అక్క చెల్లెళ్ళు అందరం ఇంచుమించుగా ఒకటే పొడవు అవ్వడం వల్ల ఒకరి డ్రెస్స్ లు ఒకరం వేసేసుకునేవాళ్ళం... ఇది నీది ఇది నాది అని ఉండేది కాదు అందుకే రోజుకో డ్రెస్స్ తో తెగ పోజులు కొట్టేసేదాన్ని .. అప్పుడప్పుడూ హాస్టల్ అమ్మాయిలకు నా డ్రెస్లు ఇచ్చేదాన్ని..ఇంట్లో అనుమానం వస్తే మా అక్క ఉందిగా నాకు అమాయకం గా ..దాని మీద తోసేసేదాన్ని ..మొన్న వేసుకుంది ఎక్కడ పెట్టేసిందో అని ...


కాలేజ్ దూరం అవ్వడం వల్ల అమ్మ బాక్స్ పెట్టేది ... నాలా బాక్స్ తెచ్చుకున్న వాళ్ళందరితో కలిసి తినేవాళ్ళం ..వండుకున్నమ్మకు ఒకటే కూర అన్న చందాన భలే ఎంజోయ్ చేస్తూ తినే వాళ్ళం.. అదిగో సరిగ్గా అప్పుడు పరిచయం అయింది సువర్ణ ..సువర్ణ మొదటి నుండి నాకు ప్రత్యేకం గా అనిపించేది , తను పైకి చాలా మొండిలా కనిపిస్తుంది గాని మహా సున్నితం ... పొగరుగా మాట్లాడినట్లు అనిపిస్తుంది కాని ఎవరికైన కొంచెం బాధ కలిగినా తట్టుకోలేదు .. ఒక సారి ఎవరో అమ్మాయి మనీ పోగొట్టుకుని ఏడుస్తుంటే తను ఫీజ్ కోసం తెచ్చిన డబ్బు ఇచ్చేసింది .. నిజానికి తనది కలిగిన కుటుంభం కాదు .. మరీ అంత ఎక్కువ చేయకూడదు ముందు నీ సంగతి చూసుకో అని మందలించేదాన్ని నేను ...

అయితే ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు తనతో కలిసి వెళ్ళాలంటే కాస్త భయం గా ఉండేది ..సువర్ణది ఒక విలక్షణమైన మనస్థత్వం ..ఎంత సున్నితమైనది అయినప్పటికీ అబ్బాయిల విషయం వచ్చేసరికి అపర కాళి అయిపోయేది .. మేము కాలేజ్ కి వచ్చేదారిలో చాలా మంది అబ్బాయిలు కాచుకుని ఉండేవారు వచ్చేపోయే అమ్మాయిలను ఏదో ఒకటి అంటూ .. కొంతమంది గులాభీలు ,చేమంతులు అని పొగిడితే ఇంకొందరు కాస్త తిండి తగ్గించుతల్లీ నీ కట్నం కూడపెట్టే చాన్స్ మీ నాన్నకు ఇవ్వు అని వెటకారం చెసేవారు.. వీరి మాటలకు ముసి ముసి నవ్వులు నవ్వుకుని కొందరు వెళ్ళిపోయేవారు ఇంకొంతమంది విన్నా విననట్లుగా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు ఇంకొందరు .. ( నేను ఈ కోవలోకొస్తా అన్నమాట) , అయితే సువర్ణ అందరిలా ఊరుకునేది కాదు ... అసలు తననే కాదు ఇంకొకరిని అన్నా సహించేది కాదు .. మాటవరసకు నువ్వు మందారం లా ఉన్నావు అని ఎవరన్నా అన్నారనుకోండి .. నువ్వు మాత్రం ముళ్ళపందిలా ఉన్నావ్ .. నీకెందుకురా నేను ఎలా ఉంటే అని గొడవకు దిగేది ..ఒక వేళ పక్క వాళ్ళను అంటే ,అదెలా ఉంటే నీకెందుకురా ముందు నీ మొహం అద్దం లో చూసుకో అని తగవు పెట్టుకునేది ..


పోని ఇంతా చేసి పురుష ద్వేషిణి యా అంటే అదీ కాదు... ప్రేమికులు ఎవరన్నా విడిపోతే వాళ్ళకు బుద్దులు చెప్పి మరీ కలిపేది ... నీకెందుకే ఇవన్నీ అంటే కయ్యిమనేది .. నీలాంటి వాళ్ళవల్లే దేశం పాడైపోతుంది అన్నీ మనకెందుకు అనుకుంటావ్ అని తిట్టి పడేసేది ...
అయితే ఈ రకమైన మనస్థత్వానికి కారణం కొంత వరకూ వాళ్ళ నాన్నగారే అనుకునేదాన్ని నేను .. వారి కుటుంభంలో మరే కారణమో తెలియదుకాని తన తల్లి తండ్రులు విడిగా ఉండేవారు .. తన అమ్మగారే జాబ్ చేస్తూ కుటుంభాన్ని పోషించేవారు.. మరి అందువల్లో ఎందువల్లో తెలియదుకాని ఇలా అయినదానికి ,కానిదానికి అబ్బాయిలతో గొడవ పెట్టుకుని వారి వల్ల చాలా చెడ్డ పేరు తెచ్చేసుకుంది .... చివరకు మా ఇంట్లో తమ్ముళ్ళు ,అక్కలు కూడా ఫలనా అమ్మాయి నీ ఫ్రెండా !! ఆ అమ్మాయి మంచిది కాదంట ఇంక స్నేహం మానేసేయి అని నా మీద ఒత్తిడి తెచ్చేవారు ... నేను అటు వాళ్ళతో వాదించలేక ఇటు తనను అకారణం గా దూరం చేయలేక సతమతమయ్యేదాన్ని...ఇదిలా ఉండగా ఒక సారి తనతో కలిసి వాళ్ళింటికి వెళ్ళాను పని ఉండి .. కొంత దూరం వెళ్ళాక ఒక అబ్బాయి సువ్వి ప్లీజ్ రా ప్లీజ్ రా అని వెనకాతల పడటం మొదలెట్టాడు.. వాడి వెనకాతల ఒక గ్రూపు . యెహె పో.. ఒక్కసారి చెబితే అర్దం కాదా.. ఎక్కువ చేస్తే పోలీసులకు చెబుతా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది ఇది ..... పోలీసులే కదా ఎవరి నెంబర్ కావాలో చెప్పు నేను ఇస్తా .. ప్రొద్దున్న లేస్తే మా బాబు చుట్టు తిరుగుతారు ..కాని నువ్వు మాత్రం కాదనకే బాబు నేనేమైపోతాను అని గారాలు కురుస్తున్నాడు వాడు.. ఈ శాల్తీని ఎక్కడో చూసానబ్బా??? నాకు గుర్తు రావడం లేదు .. ఈ లోపల జేబులో నుండి ఒక లెటెర్ తీసాడు.. అది చూడగానే ఇది మొహం అసహ్యం గా పెట్టింది .. . మళ్ళీ రాసావా దిక్కుమాలిన రక్తం తోటి ...ఏం తమాషాగా ఉందా ఊరుకుంటుంటే ..ఇలాంటివి మళ్ళీ ఇస్తే చెప్పు తీసికొడతా ఇది రెచ్చిపోయి తిడుతుంది.. నాకు తెలుసే బంగారం.. నామీద ఎంత ప్రేమ లేకపోతే నా రక్తాన్ని అలా తీయద్దు అంటావ్ ..సరేలే నెక్స్ట్ టైం ఇంకుతోనే రాస్తాను గాని ఈ సారికి అడ్జస్ట్ అయిపో అన్నాడు.. దీనికి కోపం వల్లో భయం వల్లో మాట తడబడిపోయి సరిగా మాట్లాడలేకపోతుంది ... సిగ్గులేదు ఈ వయసులో ప్రేమేంటీ ..నాకిష్టం లేదంటే ఇలా చంపుకు తింటావేంటి నా సంగతి నీకు తెలియదు బెదిరించింది.. నా సంగతీ నీకు తెలియదు.. నీకు ఆ విషయం బాగా తెలుసు .. ఎంటమ్మా ఈ వయసులో ప్రేమేంటీ అనేదానివి మొన్న లలితని వాసుగాడినీ ఎలా కలిపావే ఎదవ స్టోరీలు చెప్పకు ..వాడు ఏక వచనంలో మాట్లాడుతున్నాడు..
నా బుర్ర అంతా వీడిని ఎక్కడ చూసానా అని ఆలోచన ఒక పక్క ,భయం ఇంకోపక్కా.. ఈ లోపల నా వైపు తిరిగి మీరైనా చెప్పండీ మీ ఫ్రెండుకి అన్నాడు.. దెబ్బకు 102 నాకు ...
(చాలా పెద్ద పెద్ద పోస్ట్లు రాసేస్తున్నా, చదివేవారికి ఇబ్బందిగా ఉంటుందేమో.. ఎంత చిన్నగా రాద్దామన్న నా వల్ల కావడం లేదు అందుకే తరువాత భాగం తరువాత రాస్తాను )

61 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ చెప్పారు...

ఆ అబ్బాయి నేను కాదు ,,,,, నేను వెంట పడింది జి . సువర్ణ వెంట .. నువ్వేడకేల్తే ఆడి కోస్త సువర్ణా అంటూ.

పిచ్చోడు చెప్పారు...

:) సరిగ్గా వెంకీ యే గుర్తొచ్చాడండీ.

మరీ అన్యాయమండీ... ప్రేమ కథను అలా అర్థాంతరంగా ఆపేస్తే ఎలా???
చివరలో స్క్రీన్ ప్లే బావుంది :)

నేస్తం చెప్పారు...

ఆ అమ్మాయి పేరు సువర్ణ కాదులే శ్రీనూ కాబట్టి భయపడకు పేరు మార్చాను .. ఇంకా ఎంత మంది ఉన్నారు లిస్ట్ లో చెప్పండి ..
పిచ్చోడు గారు మొత్తం రాసానంటే అంత చదవడానికి విసుగొస్తుందేమో అని ఇలా మద్యలో ఆపానన్న మాట ..అయినా నేను అంత కష్టపడి ఆ బొమ్మ వేస్తే ఎవరూ పొగడలేదు :( మర్యాదగా పొగిడేయండి :P

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీరు పైన చూపిస్తున్న చిత్రం గీసారా??? అయితే చాలా బావుంది.

విషయం ఆసక్తి కరంగా చెబుతున్నప్పుడు టపా పెద్దదైన చదవాలనిపిస్తుంది. మీ టపాలు ఎటూ ఆసక్తి కరంగా ఉంటాయి కాబట్టి ఇలా భాగాలుగా విభాజించనవసరం లేదేమో. ఇలా చేయటం వాళ్ళ ఫీల్ పోతుందేమో కదా???
నాకు సాదారణంగా పెద్ద పెద్ద టపాలు చదవాలంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది. కాని మీ టపాలు చదువుతున్నప్పుడు ఎప్పుడూ అలా అనిపించలేదు. అప్పుడే నాకు పైన రాసిన కిటుకు ( ఆసక్తి కరంగా రాయటం ) అర్దమైంది.

ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే.

నేస్తం చెప్పారు...

శేఖర్ గారు ఏమో అండి అలా అనేసుకున్నాను .. మరీ పెద్ద పెద్ద పోస్ట్లు వేస్తే విసుగొస్తుందేమో అని మీ ప్రోత్సాహానికి థేంక్స్ అండి

శ్రీనివాస్ చెప్పారు...

బొమ్మ బాగుంది
హమ్మయ ఆ అబ్బాయి నేను కాదనమాట మంచిది .. హిహి మిగతా లిస్టు విషయం మర్చిపోదాం

బొమ్మ బాగుంది ( రెండో సారి)

అవును మీరు బాగా రాస్తారు కదా( నాలాగే ) మళ్ళా చదివే వారికీ విసుగెందుకు

బొమ్మ బాగుంది (కౌంట్ చెప్పాలా)

ఆయినా వరల్డు కప్పు క్రికెట్టు మద్య లో తొందర పడి సినిమా రిలీసు చేసుకున్న చిన్న నిర్మతలాగా ఆ రెండు బ్లాగుల భీకర పోరు మద్య లో మీ పోస్టు కి ఆదరణ తగ్గ కూడదని సాటి చిన్న బ్లాగరుగా మీకు నా మద్దతు ప్రకటిస్తా అని ఈ సందర్భంగా తెలియ చేస్కుంటూ .. బొమ్మ బాగుంది

మిగత భాగం త్వరగా రాసేయండి

చైతన్య చెప్పారు...

ఒక్క దెబ్బకి నాక్కూడా మా కాలేజి రోజులు గుర్తోచ్చాయండి :)
పెద్ద పోస్ట్లు అయినా బాగుంటాయి కదా మీరు రాసేవి... పెద్దగా ఉన్నాయన్న ఫీలింగే రాదు...
ఇప్పుడైతే ఏంటి అప్పుడే అయిపొయింది అనిపించింది నాకు!

మీరు పోస్టుల్లో పెట్టె బొమ్మల్ని నేను గమనిస్తూనే ఉన్నానండి... అప్పుడు ముగ్గుల పోస్టులో కూడా మీరు వేసిన బొమ్మే కదా పెట్టింది...
paint లో వేస్తున్నారా? బాగున్నాయి :)

కన్నగాడు చెప్పారు...

టపా బాగుంది, ఆ బొమ్మ మీరే వేసారు కదా! బహుషా మైక్రోసాఫ్ట్ పెయింట్ లో అనుకుంటా.
మీ బొమ్మ బాగుంది, మొదట చూడగానే నచ్చింది(ఎందుకంటే నాకు వేయడం రాదు కాబట్టి) కాని పెద్దదిగా చేసినప్పుడు. తలకోసం ఒకటి జడ కోసం నాలుగు దీర్ఘవృత్తాలు వాడడం నవ్వుతెప్పించాయి. ఇది మిమ్మల్ని కించపరచడానికి కాదు. బాటమ్ లైన్: బొమ్మ బాగా వేసారు. వ్యాఖ్య నచ్చకపోతే ప్రచురించకండి.

Shashank చెప్పారు...

ఏంటో..అందరికి వాళ్ళ వాళ్ళ కాలేజీ రోజులు గుర్తొచ్చాయి.. నాకు మాత్రం అల ఏమి గుర్తురావడం లేదు. అంటే నేను రాముడు మంచి బాలుడు లా కాదులేండి. గులాబీలు, జాజులు పట్టుకు తిరగలేదు.. అమ్మయిలని మరీ ఇంతలా వెంటపడలేదు. కమ్మెంట్లు కూడా వేసేవాడ్ని కాదు. కాని మీ టప చదువుతూంటే నా స్నేహితుడు గుర్తొస్తున్నాడు. వాడీ కోసం ప్రొద్దున్నే (అంటే ఉదయం 9 కి కల్ల) మెహదిపట్నం బస్సు స్టాప్ కి వెళ్ళల్సొచేది. :)

ఇంతకి ఆ బొమ్మ మీరు వేసారా అని చెప్పలేదు. కాని బొమ్మ బాగుంది.. లంగా వోణి వేసుకొని కాలేజి వెళ్ళే అమ్మయిని చూసి అబ్బో...గుర్తు కూడా లేదండి.

పిచ్చోడు చెప్పారు...

ఏంటీ ఆ బొమ్మ మీరు వేశారా? నమ్మాలా? నేను నమ్మను గాక నమ్మనండీ అంతే. అమ్మాయి బొమ్మ అంత చక్కగా ఉంది, దూరంగా ఆడుకొంటున్న అమ్మాయిల బొమ్మలు అంత చిన్నవి అంత క్లియర్ గా ఉన్నాయి, చెట్టు చుట్టూ ఉన్న పొదలు..........
అయ్య బాబోయ్ మీరు ఏం చెప్పినా నమ్మేస్తామా ఏంటి!!!!! పెయింట్ లో చిన్న చిన్న షేపులు గీయాలని ట్రై చేస్తేనే వల్ల కాలేదు నాకు, మీరు ఇంత బొమ్మ అలా గీసేశానంటే నమ్మేస్తామా??
నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు

babu చెప్పారు...

Fantastic.

నేస్తం చెప్పారు...

శ్రీనివాసు గారు మళ్ళీ బొమ్మ ఎలావేసాను అని అడగకుండా ఎంత మెత్తగా చెప్పారండి .. :)
చైతన్య గారు అవునండి పైంట్ బ్రెష్లోనే వేసాను ...
కన్న గారు నా బొమ్మల పాండిత్యం తెలియదుగా మీకు ..నా చెప్పాలని ఉంది పోస్ట్ లో రాసాను చూడండి.. ఎవరికి ఏది రాదో దాని గురించే ఇంట్రెస్ట్ గా అడుగుతాం అన్నమాట అర్దం చేసుకోరు
శశాంక్ గారు అమ్మో మీరు రాముడు మంచి బాలుడన్నమాట అయితే :)

నేస్తం చెప్పారు...

పిచ్చోడు గారు నేను మునగ చెట్టు మీద ఉన్నాను :)
బాబు గారు మీకు మైల్ పంపానండి

jayachandra చెప్పారు...

చాలాబాగా వ్రాశారు.శుభా కాంక్షలు.

karthika చెప్పారు...

Bagundi :)
Twaragaa rayyandi next part

Surabhi చెప్పారు...

మీ బొమ్మ బాగుంది, మొదట చూడగానే నచ్చింది.పైంట్ బ్రెష్లో - I guess.

నాక్కూడా మా కాలేజి రోజులు గుర్తోచ్చాయండి .
Specially blue shirt guy. I will try to post about him when I get sometime.

Narendra Chennupati చెప్పారు...

ఏమండి నేస్తం గారు, ఈ రోజే మొదలెట్టాను తెలుగు బ్లాగులు చదవటం..మీ పోస్టులు అన్నీ చదివేసాను...సూపర్ గా వున్నాయండి...ఎవరో ముందు కూర్చొని చెప్పినట్లే వుంది..మీ శైలి అద్బుతంగా వుంది....

అజ్ఞాత చెప్పారు...

You've amazing writing skills.Even if you write 50 pages, readers can read without stopping.

the only problem before which made a little inconvenience to read, is that you never divided them into paragraphs.

Since you're doing that now, please dont create suspense divinding into parts.this is just a request.

అజ్ఞాత చెప్పారు...

btw, no one can guess thats a drawn picture. the picture you drew is very beautiful with brilliant choice of colors !

కొత్త పాళీ చెప్పారు...

మీది అమ్మాయిల కాలేజీ అనుకున్నానే .. ఈ ప్రేమలూ రోమియోలూ ఎలా సాధ్యం?

Anil Dasari చెప్పారు...

>> "సువర్ణది ఒక విలక్షణమైన మనస్థత్వం ..ఎంత సున్నితమైనది అయినప్పటికీ అబ్బాయిల విషయం వచ్చేసరికి అపర కాళి అయిపోయేది"

సవర్ణకెందుకంత పురుష ద్వేషం? ఆమెగ్గానీ సమరసింహారెడ్డి లెవెల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లేమైనా ఉన్నాయా? వచ్చే భాగంలో చెప్పెయ్యండి.

>> ".. అందుకే తరువాత భాగం తరువాత రాస్తాను"

'తరవాతి భాగం తరవాత రాయటం' అందరూ చేసే పనే. నాకు తెలిసి ప్రపంచంలో ఒకే ఒకాయనున్నాడు - 'తరవాతి భాగం ముందు రాసే/తీసే' వాడు. ఆయనెవరో కనుక్కోండి.

Shashank చెప్పారు...

నేస్తం.. మరే. కౌశల్య రామునికి చెప్పేది అట.. "శశాంక్ మంచి బాలుడు" అని..

అజ్ఞాత చెప్పారు...

మధ్యలో కధ ఆపేస్తే ఎలా?
బొమ్మ చాలా పొందికగా చక్కగా ఉంది పొస్టులలాగే :)
~C

జీడిపప్పు చెప్పారు...

Next part pls!

Shashank చెప్పారు...

నేస్తం.. మీకు కవితలు ఇష్టం కద.. సరె నా బ్లాగులో ఒకటి ఎక్కించా.. చూసి చెప్పండి.

నేస్తం చెప్పారు...

జయ చంద్ర గారు ధన్యవాధాలు :)
కార్తిక గారు థేంక్స్ అండి తప్పకుండా త్వరలో రాస్తాను
మరింకేం రాసేయండి సురభిగారు ఎదురుచూస్తుంటాం :)
నరేంద్ర గారు ధేంక్స్ అండి :)

నేస్తం చెప్పారు...

అఙ్ఞాతగారు చాలా థేంక్స్ అండి .. మీ పేరు రాస్తే బాగుండేది .. ఇంక అలా సస్పెన్స్ లో వదలను లెండి, మరీ పెద్ద పెద్ద పోస్ట్లు అయిపోతున్నాయికదా విసుగ్గా ఉందేమో అనే ఫీలింగ్ తో మద్యలో ఆపేసా అన్నమాట
కొత్త పాళి గారు ప్రేమ కు అమ్మాయిల కాలేజ్ అబ్బాయిల కాలేజ్ అని ఉండదండి,పైగా అమ్మాయిల కాలేజ్ దగ్గరే అబ్బాయిలు తచ్చాడుతుంటారు ,కాబట్టి అక్కడే ఎక్కువ ఉంటాయి
అబ్రక దబ్రగారు చెప్పాను కదా వాళ్ళ అమ్మా,నాన్న గారు విడిపోయారని.. బహుసా ఆ ప్రభావం పడి ఉంటుంది .. ఎవరండి ఆయన తరువాత భాగం ముందు రాసేవారు ??

నేస్తం చెప్పారు...

హ హ ~c చాలా థేంక్స్ ఈ మద్య కనిపించడం లేదు :)
జీడిపప్పు గారు త్వరలో రాస్తాను
శశాంక్ గారు చూసాను బాగా రాసారు

పిచ్చోడు చెప్పారు...

అబ్రకదబ్ర గారూ, తరువాత భాగం ముందు తీసే ఆయన కళాతపస్వి కె.విశ్వనాథ్ గారే కదూ... ఆయన సినిమాలన్నీ ఫ్లాష్‌బాక్ అదేనండీ తరువాతభాగం తోనే మొదలవుతాయి.

పరిమళం చెప్పారు...

నేస్తం గారూ ! ముందుగా బొమ్మ బావుందండీ :)
ఆ తర్వాత మీ టపా బావుంది ...సస్పెన్స్ లో ఆపేయడం అన్యాయం కదూ ...ఎంతమందిమి ఫీలయ్యామో చూడండి .మీరు త్వరగా తర్వాతి కధ చెప్పకపోతే మాకంటే శ్రీనివాస్ గారు ఎక్కువ గొడవ చేసేట్టున్నారు అసలే ఆయన రెండు బ్లాగుల భీకరపోరు మద్య లో కూడా మీకు మద్దత్తిచ్చారు ( note this point) మరి .. :) :)

శ్రీనివాస్ చెప్పారు...

పరిమళం గారు పోగిడారా తెగిడారా ?

నాకు అర్జంటు గా తెలియాలి ( టి.ఆర్ .ఎస్ . మద్దతు మాకే )

నేస్తం చెప్పారు...

పరిమళం గారు త్వరలో రాసేస్తానండి.. శ్రీనివాస్ గారు ప్రస్తుతం బిజీ లెండి ఎవరు ఎవరో తెలుసుకోవడం లో :)

Kathi Mahesh Kumar చెప్పారు...

బాగుందు బాగుంది. మళ్ళీ నా కాలేజికథ మళ్ళీ మొదలెట్టాలనిపించింది.
http://parnashaala.blogspot.com/search/label/%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%82

నేస్తం చెప్పారు...

ప్రతి ఒక్కరికీ తమ కాలేజ్ రోజులు తలుచుకుంటే చాలా విషయాలు గుర్తువచ్చేస్తుంటాయి అవో మరపురాని రోజులు ..మీ పోస్ట్ లు చాలానే చదివాను మహేష్ గారు కాని మీరు లింక్ ఇచ్చిన ఈ ఔనన్నా! కాదన్నా!! పోస్ట్ ఇప్పుడే చదివాను చాలా బాగా రాసారు :)

Bolloju Baba చెప్పారు...

టపా బాగుంది
బొమ్మా బాగుంది. :-)

Kishen Reddy చెప్పారు...

Nestam , me next post kosam chakora pakshi la eudru chusa...hammaya mottaniki kotta post vachindi anukoni chadavatam start cheste, 'taruvai bhagam vache varam' levello muginchesaru...malli aa taruvai bhagam kosam wait cheyyalsinde...me posts tho ee blog ni 'irresistible' chesesaru naku....haha...me spurthi tho tvaralo nenu kuda ilanti blog okati start chesi, na anubhavalu alochanaku me andaritho panchukovalane asakthi kaligindi....

మురళి చెప్పారు...

పై అందరి అభిప్రాయాలే నావీను.. ఓ చిన్న సూచన 3 కూతుళ్ళు, 2 మాస్టార్లు.. ఇలా కన్నా ముగ్గురు కూతుళ్ళు, ఇద్దరు మాస్టార్లు అని రాస్తే......

సమిధ ఆన౦ద్ చెప్పారు...

దబ్బకి 102 లో పడ్డ మీకు, నాది 36వ పువ్వు మీ పోస్ట్ మీద విసరబడిన వాటిలో. భలే నవ్విస్తార౦డీ మీరు. ఆడవాళ్ళల్లో ఇ౦త sense of humor చాలా అరుదు నాకు తెలిసిన౦త వరకూ. నేనెప్పుడూ మీరు వర్ణి౦చిన గ్యా౦గుల్లో లేకపోవడ౦, అలా నిజమైన entertainment ఉ౦డే మాస్ కుర్రాళ్ళ లాగా కానీ తోగానీ నేను లేకపోవడ౦ వల్ల, నాకు పెద్దగా గుర్తొచ్చినవ౦టూ ఏమీ లేవు. అలా అని దద్దోజన౦గాణ్ణి కాన౦డోయ్. కాకపోతే నా వేషాలు చాలా క్లాస్ గా ఉ౦డేవి. పైగా కాలేజీలో కన్నా ఇ౦టి దగ్గర వెధవ్వేషాలెక్కువగా వేసేవాణ్ణి. ఎ౦దుక౦టే siblings లేని ఒక్కగానొక్కడిని, మన౦ ఏ౦ చేసినా చెల్లేది. పైన వార౦దరూ చెప్పినట్టూ, మీ ఈ పోస్ట్ మాత్ర౦ ఖచ్చిత౦గా చాలా చిన్నది అనిపిస్తు౦ది చదవడ౦ పూర్తయ్యక. అరె సరైన చోట ఆపి భలే సస్పెన్స్ ఇచ్చారే అనుకునే అవకాశ౦ లేకపోగా, అయ్యో ఇది ఇ౦తే ఉ౦దేవిటీ అని అనిపిస్తు౦ది. పైనున్న వారూ, కి౦ద రాబోయేవారితో పాటూ, నేనూ మీ మిగతా భాగ౦ కోస౦ చూస్తు౦టాను. మీ ఈ పోస్ట్ కి కూడా దబ్బకి కనీస౦ 102 రావాలాని ఆశిస్తున్నాను. వ్యాఖ్యల౦డీ.

మరిచాను, మర్యాదగా మెచ్చుకోమన్నారు. మీ చిత్రలేఖన౦ కూడా చాలా అ౦ద౦గా ఉ౦ది. అ౦దమైన సమ్మర్ లో ఊటీలో కాలేజ్ లాగా!

సమిధ ఆన౦ద్ చెప్పారు...

నా న౦బరు మారిపోయినట్టు౦ద౦డీ, అన్యాయ౦ ఇ౦త పోటీనా. వ్యాఖ్య రాసేలోపు ఓడి౦చేసార౦డీ. ఏ౦చేస్తా౦, అ౦తా మీ బ్లాగుసమ్మోహనాస్త్ర౦ మహిమ.

నేస్తం చెప్పారు...

బాబా గారు థేంక్స్ అండి.. చాలా రోజులకు విచ్చేసారు నా బ్లాగుకు బిజిగా ఉన్నట్లున్నారు ఎన్నికల సమయంలో :)
కిషెన్ గారు తప్పకుండా రాయండి.. మీ పోస్టు ల గురించి ఎదురు చూస్తాం.. అన్నట్లు మీ బ్లాగ్ నేములు బాగున్నాయి హరివిల్లు,చిరు జల్లు :)
మురళి గారు సరిగ్గా రాసేటప్పుడు ఇదేమాట అనుకున్నా కాని బద్దకం అన్నమాట ఈ సారి అలాగే చేస్తాను

సమిధ ఆన౦ద్ చెప్పారు...

ఇప్పుడే మీ పిరికి ప్రేమల పోస్ట్ చదివాను. కానీ ఈ పోస్ట్ కి నూటరె౦డైనా వ్యాఖ్యలు రావాలని ఆశి౦చాను కాబట్టీ ఇక్కడే మళ్ళీ వ్యాఖ్యను౦చుతున్నాను. మీ చిలిపి రాతలు చూస్తు౦టే నాకు మూడు ఆలోచనలు వరుసగా వచ్చేసాయి. తప్పు నాది కాదు, మీఉ రాసినవాటివి.
1. మీ ప్రతి పోస్ట్ కీ సగటున 45 వ్యాఖ్యలొస్తున్నాయ్. అ౦టే మీరు ఒక పోస్ట్ రాసి వాటి వ్యాఖ్యలకు సమాధానమిస్తున్న౦త సేపు హాయిగా నవ్వుతు౦టారు. ఆరోగ్యానికి ఎ౦త మ౦చిద౦డీ. So, మీ రాతలు ఇతరులకు మాత్రమే కాదు, మీకు కూడా చాలా మ౦చి చేస్తాయన్నమాట. అలా వ్యాఖ్యలకు సమాధానమిస్తు౦డగా మిమ్మల్ని చూడాలి. భలే సరదగా ఉ౦టు౦ది.
2. ఓ చిన్న ఆలోచన. మీలా౦టివారు మీ ఇ౦ట్లో వాళ్ళకి ఏ అవసరమోచ్చో ఓ రె౦డ్రోజులు దూర౦గా ఉ౦డాల్సొస్తే ఎన్ని అవస్థలు పడతారో అని. పాప౦ మీరు లేని లోటు మీ కబుర్లూ, నవ్వులూ లేని లోటు మహా కష్ట౦గా ఉ౦టు౦దేమో వారికి.
౩. మొదటి పాయి౦ట్లో చెప్పినట్టూ, మీ బ్లాగు చదివితేనే అ౦త ఆరోగ్యమైతే, ఇక మీతో ఒక్క అరగ౦టైనా రోజుకొకసారి మాట్లాడేవారికి ఇ౦కె౦త మ౦చిదో అని.

నేస్తం చెప్పారు...

ఆనంద్ గారు ఆడవాళ్ళు హ్యూమరస్ గా చాలా బాగా రాయగలరు.. ఎందుకంటే మన బ్లాగ్ లోకం లోనే చూడండి మీనాక్షి బ్లాగ్ మీనాక్షిగారు ఇంకా బ్లాగ్ వనం శ్రీవిద్య గారు, నేను-లక్ష్మి బ్లాగు లక్ష్మి గారు సుజాత గారు ఇలా చాలా మంది చాలా బాగా రాయగలరు,నిజానికి నేను హాస్యాన్ని బాగా ఇష్ట పడతాను అందుకే ఇక్కడ హాస్య రచనలు ఏమున్నా వదలకుండా చదువుతాను,( తోట రాముడు గారి రెండు రెళ్ళు ఆరు ,అశ్విన్ గారి ఆడపిల్ల ,అగ్గిపుల్ల,సబ్బు బిళ్ళ ,రిషి గారి చెగోడీలు ఇలా చాలా మంది ) కాకపోతే వారి శైలి నా రచనల మీద పడకుండా నిజ జీవితం లో నేను మాట్లాడె శైలితోనే రాయడానికి ప్రయత్నిస్తా.. అన్నిటికన్నా మీ అభిమానానికి థేంక్స్ అండి :)

నేస్తం చెప్పారు...

హ హ ఆనంద్ గారు ఒకరకం గా నాన్నకు అందుకే నా మీద సగం బెంగ, కాకపోతే మా ఆఖరి చెల్లెలు నాకంటే బాగా అల్లరి, తను మాట్లాడే మాటలకు గంటల తరబడి నవ్వుతునే ఉంటాం , నిజమే వాక్యలు చదివినంత సేపు నవ్వుతునే ఉంటా .. పైగా మా ఆయనను ఏడిపించాలి కదా... నీ తిక్క పోస్ట్ లు ఎలా మెచ్చుకుంటున్నారే అని రోజుకోసారి ఏడిపిస్తారు

సమిధ ఆన౦ద్ చెప్పారు...

వ్యాఖ్యలో కూడా మళ్ళీ నవ్వి౦చారు. బహుశా మీకు దిష్టి తగలకు౦డా కాపాడుతున్నారేమో మీవారు. మా నాన్న అమ్మ మీద వెటకారాలాడితే నేను చేసే స౦ధిలో ఈ మాటే చెప్తాను. అమ్మ మూతి తిప్పుకు౦టూ, ఊ( బానే ఉన్నారు, త౦డ్రీకొడుకులు దొ౦దూదొ౦దే అ౦టేగానీ మా సరదా తీరదు. Anyways, it was very nice sharing my opinions with you. Count me in for one of those fans of your blog. Honestly, your writing skill is lovely. Good night! (Oops sorry, good evening for you probably)

నేస్తం చెప్పారు...

:)

Shiva Bandaru చెప్పారు...

బొమ్మ బాగా గీచారు. పోస్టూ బాగుంది . తరువాతి బాగం కోసం చూస్తున్నా..

అజ్ఞాత చెప్పారు...

నేస్తం మీరు చదివింది K.R.C. for women కాదు కదా ! మీ కాలేజ్ వర్ణన, బయట బీటేసే అబ్బాయిలు , హాస్టల్ అమ్మయిలు ఇదంతా చూస్తుంటే మా కాలేజి అని అనుమానంగా వుంది.

నేస్తం చెప్పారు...

శివ గారు ధన్యవాధాలండి...లలిత గారు కాదండి,నిజానికి ఎక్కడ చదువుతున్నానో చెప్పేదాన్నే కాని నేను నా విషయాలు చాలా రాస్తున్నాను అందుకే చెప్పడం లేదు అంతే .. అమ్మాయిల కాలేజులన్నీ ఇంచుమించు అలాగే ఉంటాయిలెండి :)

Anil Dasari చెప్పారు...

@నేస్తం,పిచ్చోడు:

రివర్స్‌లో సినిమాలు తీసిన మొనగాడు - హాలీవుడ్ మాయలమరాఠీ జార్జ్ లూకాస్. ముందు స్టార్‌వార్స్-4, 5, 6 భాగాలు .. ఆ తర్వాత ఇరవయ్యేళ్లకి 1, 2, 3 భాగాలు. నాలుగో భాగానికీ, మూడో భాగానికీ మధ్య కనెక్షన్ ఏంటో కనుక్కోటానికి జనాలు ఇరవయ్యెనిమిదేళ్లాగాల్సొచ్చింది :-)

krishna rao jallipalli చెప్పారు...

అవును మీ పోస్టు పెద్దదేమీ కాదు. మిగతాది కూడా రాయాల్సింది. మీరు గీసిన బొమ్మ బాగుంది. ఇకనుండి మీ ప్రతి పోస్టుకి బొమ్మలు గీయండి.

నుదిటి మీద రింగులు తిరిగిన ముంగురులు ( అంటే నేను అలా పీక్కునేదాన్ని లెండి) అలా హీరోయిన్లా ఫీల్ అయిపోయేదాన్ని .... baagundi.
నిజాన్ని భలే ఒప్పుకున్నారు. నిజం కొన్నిటికి, ధైర్యం కావాలి మరి.

పరిమళం చెప్పారు...

@ శ్రీనివాస్ గారూ ! ఎంత మాట పొగడ్తేనండీ బాబూ !

Unknown చెప్పారు...

ఇలా మధ్యలో ఆపేసేట్టయితే నేను నెల రోజుల క్రితం మీ గురించి రాసిన వాక్యాలు వెనక్కి తీసుకోవాలేమో???
ఆపకుండా చదివించడం మీ ప్రత్యేకత, దానిని బలహీనతగా ఎందుకనుకుంటున్నారు?

కధ బాగా నడుస్తోంది, ముఖ్యంగా డ్రెస్సులు, కాలేజికి నడక వగైరా....

arunank చెప్పారు...

సువర్ణ నిజంగా బంగారమే.మీ కాలేజి చాలా అందంగా కనిపిస్తుంది.
తదుపరి బాగం కోసం నిరీక్షిస్తుంటాను

నేస్తం చెప్పారు...

అబ్రకదబ్ర గారు నిజమా, భలే విషయం చెప్పారు...
క్రిష్ణారావుగారు చాలా మంది అమ్మాయిలు కాలేజ్ లో చేరిన తొలినాళ్ళల్లో ఒక రకమైన ప్రత్యేకతను కోరుకుంటారు,ఆ క్రమంలో నే అన్నమాట అటువంటి చేస్టలన్నీ ..
ప్రదీప్ గారు ఈ సారి అలా చేయను :)కాని అలా చేయడం వల్ల ఎంతమంది అభిమానిస్తున్నారో తెలుసుకోగలిగాను
అరుణాంక్ గారు ధన్యవాదాలు

నేస్తం చెప్పారు...

హ హ ... ముఖ్యం గా నా బొమ్మను మెచ్చుకున్న అందరికీ మరో సారి చాలా చాలా థేంక్స్ :)

asha చెప్పారు...

మీ మీద చాలా కోపంగా ఉన్నానండి.
ఇలా సస్పెన్సులు ఎందుకు. అంతా ఒకసారే చెప్పొచ్చుగా.
పైగా ఇన్ని రోజుల తరువాత టపా రాశారు.
అన్నట్టు, మీరు గీసిన బొమ్మ బాగుందండి.

Kishen Reddy చెప్పారు...

Chala thanks nestam na blogs perlu meeku nachinanduku..asalu nenu create cheyyaboye blog ki naku saraina peru dorakadam ledu...harivillu,chirujallu ane perlatho just create chesananthe...they are just empty templates...ee perlu bagane unna..inka manchi peru kosam chustunna nestam, meeru edanna peru suchinchagalara?....

నేస్తం చెప్పారు...

భవాని గారు అలా కోప్పడితే ఎలా రాసేసాను చూడండి..
కిషెన్ గారు ఆ నేంస్ బాగున్నాయి కదండి కాకపోతే అలాంటి పేరుతో ఇంకా ఏమన్నా బ్లాగ్స్ ఉన్నాయేమో కూడలి లో చెక్ చెసి చూసుకోండి :)

గీతాచార్య చెప్పారు...

మీరు మీలాగానే రాస్తే originality అదే వస్తుంది. చాలా బాగా వ్రాశారు. మంచి బ్లాగ్. చాలా కాలం నుండీ చూశాను కానీ ఎందుకో కామెంటలేదు.

You may like it...

http://wimbledonweekly.blogspot.com/2008/08/blog-post_29.html

బోలెడు జోకులు కూరి మీరు అందిస్తున్న జాజిపూలు తీయ తీయని పూతరేకులు.

నేస్తం చెప్పారు...

గీతాచార్య గారు నేను చాలా సార్లూ బ్లాగ్లోకం లో మీ పేరు చూసాను ,మీరు తెలియకపోవడం అంటూ లేదు కాని మీ బ్లాగు చూడటం ఇదే ప్రధమం ,నేను మావారితో హాలీడే ట్రిప్ వెళుతున్నాను సోమవారం తప్పక మీ బ్లాగు చూస్తాను ధన్యవాధాలు

హరే కృష్ణ చెప్పారు...

అరవై ఒకటవ కామెంట్ నాదే :)