2, ఫిబ్రవరి 2009, సోమవారం

సినిమా కెళదాం రా .......అసలు నాకు సినిమా హాల్ కి వెళ్ళి సినిమా చూడాలంటే చిరాకు వచ్చేయడానికి కారణం మా అమ్మా,నాన్నలే..బాగా చిన్నపుడు నాన్న నన్ను,అక్కను స్కూటర్ మీద ఎక్కించుకుని సినిమాకు తీసుకు వెళ్ళేవారు ..అయితే నాన్న N.T.R గారి వీరాభీమాని .అందువల్ల ఆయన సినిమాలు తప్పా మరొక దానికి ససేమిరా తీసుకు వెళ్ళేవారు కాదు ..ఇంట్లో కూడా ఎప్పుడన్నా V.C.R అద్దెకు తీసుకొచ్చినా మళ్ళీ రామారావు గారి పాత సినిమాలే తెచ్చేవారు ..ఈ కారణం చేత మాయాబజార్ 20 సార్లు మిస్సమ్మ 18 సార్లు,జగదేక వీరుని కద 25 సార్లు ఇలా చూసిన సినామాయే చూసేవాళ్ళం ..నాన్న !!కొత్త సినిమా కి ఎలాగూ తీసుకువెళ్ళరు , కనీసం అక్కినేని నాగేశ్వర రావు సినిమా అయినా చూపించండి నాన్నా అంటే.. ఆయ్ ... మా రోజుల్లో మా రామారావు అభిమానులం ఎవరం నాగేశ్వర రావు సినిమాలు చూసే వాళ్ళం కాము ..అయినా వాడి సినిమాలేం బాగుంటాయమ్మా ..రామా రావు నటించినన్ని వెరైటీలు ఇంకెవరన్నా నటించారా అంటూ మళ్ళీ N.T.R గురించి ఒక గంట వాయించేవారు..నాకు N.T.R ఇష్టమే గాని స్వర్ణ కమలం లో భాను ప్రియలా ఒక్కోసారి రంగుల కలల్లోకి తేలిపోయేదాన్ని....అందుకే నాగర్జున ,వెంకటెష్,చిరంజీవి సినిమాలు కూడా చూడాలని ఉండేది..
ఆ తరువాతా కొంచెం పెద్దవాళ్ళం అయ్యాక అమ్మా వాళ్ళతో వెళ్ళేవాళ్ళం .. 2 నెలల కోసారి ఇంట్లో తోడి కోడళ్ళు, అత్తగారు ,పిల్లా పీచూ అందరూ బయలుదేరే వాళ్ళం .. ఏ మాటకామాట చెప్పుకోవాలి ,అమ్మా వాళ్ళతో సినిమాకి వెళ్ళడం కంటే నాన్నతో ఒకే రోజున N.T.R సినిమా 4 సార్లు చూడటం మంచిది ..వీళ్ళకి పర్సులోంచి డబ్బులు తీయాలంటే మహా భాధ ..చక్కగా ఏ ఆటోలోనో రిక్షాలోనో తీసుకెళ్ళచ్చుగా..అబ్బే... ఎండలో నించోబెట్టి ,సిటి బస్సుల్లో తోసేసి దియేటర్లలోకి లాక్కువెళ్ళెవారు ..పోని అక్కడన్నా యే బాల్కనీ కో టిక్కట్లు తియచ్చుగా ..అహా ..డబ్బులైపోతాయి..నాన్న అయితే చక్కగా విశ్రాంతి సమయం లో కూల్ డ్రింకులని, సమోసాలని కొనేవారు వీళ్ళూ అసలు బయటకి తీసుకు వెళ్ళేవాళ్ళే కాదు .. ఇంతా చేసి ఏదన్నా కొత్త సినిమా తీసుకు వెళతారా అంటే అదీ లేదు..ఒక్కొక్కరి టేస్ట్ లు ఎంత బాగుండెవంటే ఒకరు శొభన్ బాబు అభిమాని ఒకరు మొరళి మోహన్,ఇంకొకరు చంద్ర మోహన్ ..మళ్ళీ కొట్టుకోకుండా ఎవరి అభిమాని సినిమా వస్తే ఆ సినిమా తీసుకు వెళ్ళిపోయేవారు.. ఈ భాధ పడలేక ఇంట్లో పిల్లలందరం ..అమ్మా బంగారు తల్లుల్లారా మీరే చూసుకోండి ఆ సినిమాలు మా కొద్దు అని ఇంట్లో ఉండిపోయేవాళ్ళం వాళ్ళను పంపేసి ...

సరే ఇలా ఉండగా ఒక సారి ఎప్పటి లాగే స్వాతి(స్వాతి గురించి సొగసు చూడతరమా, ఈ అమ్మయి చాలా మంచిది పోస్ట్ లో రాసాను :)) మా ఇంటి కొచ్చింది ప్రొద్దున్న ..ఇద్దరం కాలెజ్ కి కలసి వెళతాం కాబట్టి .. వచ్చిన దగ్గర నుండి ఏం మాట్లాడినా ఉలకదు పలకదు ..అంటే అలిగింది అన్నమాట .. అసలు దానికి అలగడం లో ఎంత టాలెంట్ ఉంది అంటే తప్పు మనదైనా,దాని దైనా కన్ ఫ్యూజ్ చేసేసి అదే అలిగేస్తుంది ఫస్ట్ ..దీన్ని ఎవడు చేసుకుంటాడొగానీ అని 1000 సారి అనుకుని దానిటో పాటే కాలేజ్ కి వెళ్ళాను ..తీరా వెళ్ళాక మా మిగిలిన బేచ్ అంతా నన్ను కోపం గా ఒక చూపు చూసారు ..ఇదేంటా అనుకునేంతలో నీ కసలు బుద్ది ఉందా ,నిన్న ఎక్కడికి వెళ్ళిపోయావ్..మీ ఇంటికి కాల్ చేస్తే నువ్వు లేవన్నారు ..నిన్న మన స్వాతి బర్త్ డే అని అసలు గుర్తుందా నీకు అని యుద్దం మొదలు పెట్టారు..అరె..రె అని నాలుక కరుచుకున్నా.. మా స్వాతి ఒక్కగానొక్క అమ్మాయి అవడం వల్ల ఒంటరితనం ఫీల్ అవ్వకూడదని తన బర్త్ డే ఫ్రెండ్స్ మద్య ఘనం గా చేసేవారు వాళ్ళ అమ్మా నాన్న గారు ...మేమూ కూడా ప్రతి year తప్పని సరిగా వెళ్ళేవాళ్ళం.. మాకు నచ్చిన రకరకాల వంటలతో,ఆటలు ,పాటలు,టీ లూ టిఫిన్లూ, కబుర్లూ తో భలే జరిగేది ..ఒక నాలుగు రోజుల ముందే అనుకున్నాం అందరం వెళ్ళాలని కాని ముందు రోజు రాత్రి అనుకోకుండా మా అత్తా వాళ్ళూ రావడం వాళ్ళతో కలిసి ఆ రోజు మా చిన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను .. సరే తప్పు నాదే కాబట్టి బ్రతిమాలుకోవడం మొదలెట్టాను.. కాని అప్పటికే స్వాతి కళ్ళలో నుండి బొట బొటా నీళ్ళు వచ్చేస్తున్నాయి..సరే తప్పైంది కాబట్టి నువ్వేం చెబితే అదివింటా అని మొత్తానికి ఒప్పించా.. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న దానిలా టక్కున ఏడుపు ఆపి నీ తిక్క తీరుస్తా అన్నట్లుగా అయితే రేపు నువ్వు మాతో కలిసి సినిమాకి రా అంది..

నేను గతుక్కుమన్నా.. దానికి తెలుసు మా ఇంట్లో ఎట్టి పరిస్తితుల్లో పంపరు అని ..అసలు సినిమాకి వెళతాను అని అడగాలంటేనే భయపడెవాళ్ళం..అడిగి వాళ్ల చేత క్లాస్ పీకించుకోవాలంటే అసలు ఇష్టం ఉండేదికాదు..నేను ఏం మాట్లడక పోయే సరికి మిగిలిన వాళ్ళు గయ్యిమని లేచారు.. ఏంటి సినిమాకే కదా రమ్మన్నాం ..అక్కడికి నువ్వేదో పెద్దలను ఎదిరించనిదానివీ ,మేమేమో చదువు సంద్యాలేకుండా ఊరిమీద తిరిగే వాళ్ళలాగానూ చూస్తావేంటి..ఇంకా చిన్నపిల్లవా.. కాలేజ్ కి వచ్చావ్ ..మీవాళ్ళకు నీ మీద నమ్మకం ఉండదా అని రెచ్చగొట్టి ఒప్పించడానికి శతవిదాలుగా ప్ర్యత్నించారు.. ఆఖరికి సరే మీ అమ్మగారిని మేము ఒప్పిస్తాం సాయంత్రం వచ్చి అని నన్ను ఒప్పించారు..అందరం నాగర్జున సినిమాకి వెళ్ళడానికి ప్లాన్ వేసాం .
సరే అనుకున్నట్లుగానే సాయంత్రం వచ్చి ఆంటీ ,ఆంటీ ప్లీజ్ ఆంటీ అంటూ మా అమ్మ వెనుక పడ్డారు.. అమ్మో వాళ్ళ నాన్న గారికి తెలిస్తే తిడతారమ్మా..పైగా ఈ కాలపు కుర్రాళ్ళు కూడా తిన్నమైన వాళ్ళు కాదు అంటూ వాళ్ళకు చెబుతూనే ఇలా వాళ్ళతో అడిగిస్తున్నందుకు నా వైపు కోపం గా ఒక చూపు చూసింది..లేదాంటి ఎవరికీ తెలియదు రేపు మార్నింగ్ షో కి కదా వెళుతున్నాం..పైగా శని,ఆదివారాలు కాదు కాబట్టి ఎవరూ ఉండరు ..పైగా కొత్త సినిమాకి వెళ్ళమాంటి అని వీళ్ళు వదలడం లేదు ..ఈ లోపల మా ఆకరు చిన్నాన్న గారి భార్య మా చిన్న పిన్ని వచ్చింది ఎంటక్కా అనుకుంటూ ..విషయం అంతా వినీ పోనీలేక్కా పంపించూ ఇప్పుడే కదా సరదా అంటూ అసలు నాకు హాల్ లో సినిమా చూడటం అంటే ఎంత ఇష్టమో అంది స్వగతం గా అన్నట్లుగా .. అంతే మా అమ్మ ఆ ముక్క పట్టుకుంది .. పోనీ నువ్వూ వీళ్ళతో వెళ్ళరాదూ అని ....మా వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ..నేనా !!..అక్కా ...పిల్లలతో నేనేందుకు..వాళ్ళేదో సరదా పడుతుంటే అంది చిన్న పిన్ని .ఆ మాటకొస్తే నువ్వేదో పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావ్ నిన్న గాక మొన్న పెళ్ళి అయింది .. అప్పుడే పెద్ద దానివైపోతావా అంది మా అమ్మ వదలకుండా..
నిజమే .. మా పిన్ని మా కంటే ఒక 3,4 యేళ్ళు పెద్దది ఉంటుంది ..తనలో గొప్పతనం ఏంటంటే అసలు తెలియని వాళ్ళతో కూడా ఎన్నో యేళ్ళు పరిచయం ఉన్నదానిలా గలగలా మాట్లాడెస్తూ కలిసిపోతుంది .. ఆ కారణం చేత మా ఫ్రెండ్స్ కి కూడా తను అంటే చాల ఇష్టం ..అందుకో మరి మొహమాటానికో తెలియదు కాని అవును పిన్నీ మీరూ రండి అని తనని బ్రతిమలాడటం మొదలెట్టారు..

ఈ లోపల మా నాలుగోపిన్ని వచ్చింది ఏంటి విషయం అనుకుంటూ ..మళ్ళీ మొత్తం స్టొరీ విన్నాకా.. మరే వెళ్ళచ్చుగా నేనైతేనా ఎగిరి గంతులేసి వెళ్ళేదాన్ని ఎన్నాళ్ళు అయిందో హాల్ కి వెళ్ళి చూసి.. మీ బావగారు మాట వరసకు అన్నా వెళదాం అని అనరు అంది..మా చిన్నపిన్ని ,తనూ ఒక ఊరివాళ్ళే కాబట్టి కసింత క్లోజు గా ఉండేవాళ్ళు .. మరే అక్కా నువ్వూ రావచ్చుగా ..పిల్లలూ పిల్లలూ ఒక చోట కుర్చుంటారు వాళ్ళ మద్యలో నేనేందుకూ నువ్వుంటే మనం ఒక పక్క కూర్చూందాం ..అంది చిన్న పిన్ని సంబరంగా .నేనా!!!... మరి వంటో అంది ...తను మా అమ్మ వైపు చూస్తూ ...ఆ మాత్రం వంట నేను చేయనా నీకూ నీ పిల్లలకూ నువ్వు వెళ్ళు అంది అమ్మ.. మా అమ్మ బాధ మా అమ్మది మళ్ళా ఎక్కడ వెళ్ళనూ అంటుందో అని..మా వాళ్ళ మొహాలు చూడాలి.. నాకు నవ్వు వస్తుంది కాని బలవంతం గా ఆపుకున్నా..ఒకరిని రమ్మని ఇంకొకరిని వద్దు అంటే బాగోదు కాబట్టి అవునాంటి రండి అని ఏడుపు మొహాలెసుకుని పిలిచారు..

ఇదంతా అక్కడే కూర్చుని మా నాన్నమ్మ వింటుంది.. తనకి సినిమాలంటే చాలా ఇష్టం చూడటం ...అసలు అందరం ఎన్నాళ్ళు అయిందర్రా సినిమాకి వెళ్ళి .. ఈ దిక్కుమాలిన కేబుల్ టి.వి లొచ్చీ పిల్లలు ఒక్క సినిమా చక్కంగా చూడనివ్వరు రిమోట్లు టిక్కు టిక్కుమని నొక్కడమే సరిపోతుంది .. అంది విసుక్కుంటూ..ఆ పక్కనే వంట చేస్తున్న మా పెద్దమ్మ నిజమే అసలు మనం అందరం వీళ్ళ తో పాటూ సినిమాకెళితే ఎలా ఉంటుంది అంటారు వాళ్ళు వేరుగా కుర్చుంటారు మనం వేరుగా కుర్చుందాం అంది ..ఇంకేంటి అందరూ క్షణాలలో సినిమా కి ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎన్ని గంటలకు లేవాలి ..ఎంత సేపటిలో వంట పూర్తి చేయాలి లాంటివి మమ్మలని పక్కకు తోసేసి మాట్లాడేసుకున్నారు...చివరకు ప్రొద్దున్న ఫలానా టైముకి వచ్చేయండమ్మ అని వాళ్ళ్కు చెప్పి పంపించేసారు..

మరి దారిలో నన్ను ఎన్ని తిట్టుకున్నారో తెలియదుకాని ప్రొద్దున్న మాత్రం పాపం అనుకున్న టైముకి వచ్చేసారు..నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి అమ్మా వాళ్ళతో వెళ్ళీన యే సినిమా అయినా టైటిల్ నుండి చూడలేదంటే చూడలేదు ...ప్రతీ సినిమా అరగంట లేటే ..అలా అరగంట లేటుగా అందరం బయలు దేరి వెళ్ళాక యేం సినిమాకి వెళ్ళాలి ...అనేది సమస్య అయి కూర్చుంది.. మా ఊర్లో నాలుగు దియేటర్లు ఒక దాని పక్కన ఒకటి ఉంటాయి కాబట్టి అక్కడ నించుని లెక్కలు వేయడం మొదలెట్టారు..మా ఫ్రెండ్స్ మెల్లిగా ఆంటీ నాగార్జునా సినిమాకి వెళదాం అన్నారు అమ్మతో .. అమ్మ మిగిలిన వాళ్ళతో అంది కానీ వాళ్ళందరూ ఏకగ్రీవంగా వద్దు అన్నారు .. చీ ...ఆ సినిమా బాగాలేదంటక్కా.. మొన్న మా తమ్ముడు చెప్పాడు అని ఒకరంటే ..మిగిలిన వాళ్ళు కూడా వంత పాడారు.. ఆఖరికి అందరూ కలిసి అక్కడ ఏదో నాగుపాముల తమిళ్ డబ్బింగ్ సినిమా చూసి దానికి ఓటేసేసి.. ఈ సినిమాలో అంటమ్మా పాములు భలే ఫైట్ చేసుకుంటాయంటా పైగా టిక్కేట్లు కూడా అందరికి హాయిగా దొరుకుతాయి అని చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పి మా వాళ్ళను మొహమాట పెట్టేసి దానికి తీసుకు వెళ్ళిపోయారు..

ఆ తరువాతా మా ఫ్రెండ్స్ పొరపాటున కూడా నన్ను సినిమా కి రమ్మని పిలవలేదు.. కాని మా ఇంట్లో అందరం కలిసి వెళ్ళిన ఆకరు సినిమా అదే .. ఈ T.Vల దెబ్బకు అందరూ సీరియళ్ళకు అలవాటు పడిపోయారు .. కాబట్టి నాకు మాత్రం చాల ఆనందం అనిపించింది

36 వ్యాఖ్యలు:

లక్ష్మి చెప్పారు...

అమ్మో భలే భలే రాసేస్తున్నారండీ నేస్తంగారూ మీరు. మీకు ఎన్నెన్ని జ్ఞాపకాలో కదా...అవన్నీ ఎంచక్క మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. Keep writing!!!

Vedasree చెప్పారు...

బాగు,బాగు ఇప్పుడే౦ సినిమాలు చూస్తున్నారు నేస్త౦? మా పనే బాగు౦ది హాయిగా అమ్మని,ఆ౦టీలనీ సినిమాలకి ప౦పి౦చి మాకు ఇష్టమైన ఆటలు ఆడుకునే వాళ్ళ౦.

సిరిసిరిమువ్వ చెప్పారు...

సూపర్. పిచ్చగా నవ్వేసానండి.

నాగప్రసాద్ చెప్పారు...

హ హ హ. :)))

మేధ చెప్పారు...

hahaha... very nice :)

సుభద్ర చెప్పారు...

ha ha ha h hhhh hhhh..,,..h h hh..
adirindi.

నేస్తం చెప్పారు...

లక్ష్మి గారూ నాకు అదే భలే నవ్వు వస్తుంది తవ్వేకొద్ది ఙ్ఞాపకాలు బయటకు వచ్చేస్తున్నాయి...
@వేద గారు పెళ్ళయాకా అదీ సాప్ట్ వేర్ వ్యక్తిని చేసుకుంటే సినిమాలు కూడా వెళతామా :( ఎప్పుడన్నా నెట్ లోనే చూస్తా :)
@సిరి సిరి మువ్వగారు ,నాగ ప్రసాద్ గారు, సుభద్ర గారు,మేద గారు ధన్య వాదాలు అండి

అజ్ఞాత చెప్పారు...

బాగా రాశారు. మీ స్టోరీలు చదివినప్పుడంతా మా ఇంటి కథలూ గుర్తొస్తాయి.. ఎందుకంటే మాదీ ఉమ్మడికుటుంబంగానే ఉండేది. మా చిన్నన్నలూ, పిన్నమ్మలూ అంతా కలిసి ఉండేవాళ్ళం.కానీ మీ అంత బాగా రాయలేననుకోండి.

telugu.blogspot.com చెప్పారు...

this is a fantastic blog. I would like to print this in our telugu pages in the monthly magazine "BEYOND INDIA". we will acknowledge your name; blog address.Previously we have printed articles from Mrs. Jyothi valaboju and kalhaara. Since this is a 3 page magazine printed for telugu people in Australia. Since the magazine is free, we cant pay you.I can send a copy of magazine if you provide me the address. All your articles are simply fantastic.
visit
beyondindia-telugu.blogspot.com
Thanks very much

కొత్త పాళీ చెప్పారు...

హ హ హ.
బాగుంది.

Unknown చెప్పారు...

క్లైమాక్సులో ఏదో ఒక ట్విష్టు లేకుండా రాయలేరేమో మీరు.. కానీ మీ ట్విష్టు బాగుంది.

నేస్తం చెప్పారు...

babu

thanks for your recognisation. you can print in your telugu magazine for the telugu people. However please send me your mail id so that i can send my address for you sending the copy

నేస్తం చెప్పారు...

కొత్త పాళి గారు ,పణి ప్రసాద్ గారు ధన్య వాదాలు అండి

పరిమళం చెప్పారు...

very nice :)

నేస్తం చెప్పారు...

పరిమళం గారు ధన్య వాదాలు అండి

మధురవాణి చెప్పారు...

నేస్తం గారూ..
బహు చక్కటి మీ పోస్టులతో.. అందరికీ ప్రియ నేస్తం అయిపోతున్నారండీ మీరు.
ఎంత బాగా రాసారూ.. భలేగా నవ్విస్తున్నాయి మీ టపాలు. మేము కూడా అక్కడే ఉండి జరిగేదంతా చూస్తున్నట్టు ఉంటుంది.
మీ నుంచి మరిన్ని టపాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం :)

sahiti చెప్పారు...

బహుచక్కటి చిత్రాలతో, ఆసక్తికరమైన కథనాలతో మీ బ్లాగు చూడముచ్చటగా ఉంది.. అభినందనలు.
http://saahitee.blogspot.com/
- డాక్టర్ సి. జయ శంకర బాబు

నేస్తం చెప్పారు...

మందాకిని గారు జయశంకర్ గారు ధన్య వాదాలు :)

నేస్తం చెప్పారు...

మధుర వాణి గారు మీ అభిమానానికి ధన్య వాదాలు :)

Unknown చెప్పారు...

నా పేరు ఫణి ప్రసాద్ కాదు "ఫణి ప్రదీపు" అని తెలియజేసుకుంటున్నాను. (ఇప్పటికే ఉన్న పేర్లు చాలు నాకు. మళ్ళీ కొత్తగా ప్రసాదు కూడా తగిలించకండి)

నేస్తం చెప్పారు...

ఫణి ప్రదీపు గారు క్షమించండి ..పొరపాటున చూసుకోలేదు.

చైతన్య చెప్పారు...

మీరు హాల్లో సినిమా చూసి ఎంత కాలం అయిందండీ?
బాగా రాసారు... :)

నేస్తం చెప్పారు...

ha ha ha చెబితే నమ్ముతారా నేను హాల్ లో సినిమా చూసి నాలుగేళ్ళు అయింది :) .. సాదారణం గా 2 యెళ్ళకోసారి చూస్తా ఈ సారి ఆలశ్యం అయింది :)

Padmarpita చెప్పారు...

Nestamaa...... its nice.

ఉమాశంకర్ చెప్పారు...

బాగా రాసారు..

చివరిపేరా చదువుతుంటే నాకు నే చిన్నప్పుడు చూసిన "పొట్టేలు పున్నమ్మ" సినిమా గుర్తుకొచ్చింది.. :)

రాధిక చెప్పారు...

నాగుపాముల సినిమా నా హా హా హా...

అరుణాంక్ చెప్పారు...

టూరింగ్ టాకీస్ సినిమాలు చాలా బాగుంటయి.మీ పాముల సినిమా ప్రసహనం బాగుంది.

నేస్తం చెప్పారు...

పద్మార్పిత గారు,అరుణాంక్ గారు,రాధిక గారు,ఉమాశంకర్ గారు ధన్య వాదాలు

Vani చెప్పారు...

nestham....bavundandi :-)))
maa nannagaaru krishna abhimani..nenu konni cinemaalaki appudappudu baleyyedaanni

నేస్తం చెప్పారు...

sri gaaru thanks andi:)

అజ్ఞాత చెప్పారు...

చిన్నప్పుడోసారి అమ్మ వాళ్ళతో ఓ పాము సినిమాకి వెళ్తే సినిమా అవుతుండగా థియేటర్లో కి పాము వచ్చిందని రూమర్ వచ్చింది..అప్పుడు చూడాలీ...బాగుందండి మీ సినిమా కథ..నాక్కూడా చాలా చాలా 'గుర్తుకొస్తున్నాయి.'

నేస్తం చెప్పారు...

హ..హ మురళిగారు బాగుంది మీ ఙ్ఞాపకం

మరువం ఉష చెప్పారు...

పెద్ద గీత చిన్న గీత విన్నారా - ఇపుడు నేనొక పేద్ద a.k.a. కష్టాల గీత గీస్తున్నా. మా నాన్నగారు సినిమా అంటే పెద్ద తీర్థయాత్రకి వెళ్ళినంత హడావుడి చేసేవారు. ఉదయం నుంచి వంటలు - బజ్జీలు, రవ్వ లడ్లూ ఇలా చిరు తిళ్ళూ, ఫ్లాస్కు నిండా పాలు, సగం సమయం మాకు ఒకరికొకరం అందిచ్చుకోవటం, తినటం, తాగటం సరిపోయేది. పోనీ అమ్మమ్మ వూరినుండైనా చక్కగా వెళ్ళివద్దామంటే ఆవిడ గూడెడ్లబండి మీద పంపేవారు - అచ్చంగా స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ మాదిరి మా పని. అపుడే ఆడపిల్లలం అంతా కలిసి విప్లవం లేవదీసి రిచ్షాలోనో, బస్సెక్కో వెళ్ళటంలో గెలుపు సాధించాం. ఇపుడు అంతా vcd/dvd తెచ్చుకుని చూడటమే పని - పల్లె అయినా, నగరమైనా, స్వదేశమైనా, విదేశమైనానూ. ఈ విరక్తి తాళలేక ఒకసారి నేనొక్క దాన్నే సినిమా theatre కి పోయి pop corn, coke enjoy చేస్తూ చూసాను, కొసమెరుపు ఏమంటే మా అబ్బాయి what's the story? అంటే అపుడు కానీ నాకు గుర్తుకి రాలేదు - నేను అక్కడ కూర్చున్న ౨ గంటలూ ఇలా చిన్నతనపు స్మృతుల్లోనే గడిపేసానని. ఇక ఇంతే అవి మనని వదలవు, మనం వాటిని వదలం.

నేస్తం చెప్పారు...

ఇక ఇంతే అవి మనని వదలవు, మనం వాటిని వదలం.
ఉషాగారు బాగా చెప్పారు

babu చెప్పారు...

With your permission, we printed your article. you were supposed to send me the address to mail you the printed magazine. I kept copy and still waiting.Your writings are fantastic that brings nostalgia of Andhra life. I pity the currentt generation who lost this

నేస్తం చెప్పారు...

బాబు గారు నిన్న చదివాను మీ మేగజైన్ లోని నా కధ .. ధన్యవాదాలు.. మీకు రేపు మైల్ ఇస్తాను..