21, నవంబర్ 2010, ఆదివారం

కార్తికమాసపు భోజనాల్లో నా వంతు వంట

వచ్చేసారా.. రండి రండి రండి ...కూర్చోండి ..ఆ ..ఇప్పుడు చేయి తల పై పెట్టుకుని ప్రమాణం చేయండి.. నేను నేస్తం బ్లాగ్ పూర్తిగా చదివిన పిమ్మటే బ్లాగ్ క్లోజ్ చేస్తాను ..సగం మధ్యలో పారిపోను అనండి.. అదిగో అదేమరి ...మీతో వచ్చిన చిక్కు ...అలా మొహమాట పడకూడదు ...మర్యాదగా కూర్చోండి ...అద్గది వేరీ గుడ్..

ఈ రోజున నేను చెప్పబోయే వంటకం పేరు" ఉలవచారు".. ఏంటి అలా లేస్తున్నారు..తప్పు కదా ...మీ ప్రాణానికి నేనూ గ్యారంటీ..సరేనా ...అసలు ఉలవచారే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కారణాలు ఉన్నాయి ......
అందులో ఒకటి : వేరే వంటలు సమయానికి గుర్తురాక...
రెండు: పేరు కూసింత గ్రాండ్ గా ఉంది అని ,
మూడు : పాత కక్షలు కొన్ని సెటిల్ చేసుకోవాలి....
మిమ్మల్ని ఆట్టే టెన్షన్ పెట్టకుండా డైరెక్ట్ గా మూడో పాయింట్ కోచ్చేస్తాను ...

మరి ఒకసారేమో గూగుల్ బజ్ లో క్రొత్తగా వచ్చినపుడు ఏం రాయాలో తోచకా ,ఈ రోజు ఉలవ చారు చేసానోచ్ అని ఒక పోస్ట్ వేసాను..వేయగానే అందరూ అమ్మో అమ్మో ఉలవచారే !!!!రెసిపి నాకూ చెప్పరా, నాకూ చెప్పరా ..ప్లీజ్ అని అనేస్తారని తెగ ఆశ పడ్డానా!!!.. మంచు గారు వచ్చి" ఓస్ ఉలవచారా" ....మా ఊర్లో ప్రియావాడి ప్రోడక్ట్ సూపరుంటుంది.. మీ అంత టైం వేస్ట్ చేయక్కరలేదు ...5 నిమిషాలు చాలు అని తీసిపడేసారు :( ....పైగా మీరు ఉలవచారు కూడా చేయగలరా ???అని నేను కుళ్ళుకునే నవ్వు ఒకటి పడేసారు ... మరి రివేంజ్ తీర్చుకోవద్దూ ... ఆయన బ్లాగులో తిరామిసు వంటకం చూసారా?? ...ఏమండీ అన్నానంటే అన్నాను అంటారుగాని ఆ పంచదార,గుడ్డు తప్పించి ఒక్కటంటే ఒక్కటి మన వంటగదిలో ఉంటుందా ???? పైగా లేడీ ఫింగెర్స్ అంటే మన బెండకాయలనుకున్నా ..ఫోటోలో చూస్తే అవేవో బ్రెడ్ ముక్కల్లా ఉన్నాయి ... కాబట్టి వండే పదార్దాలే తెలియని ఆయన మాటలు మీరు పట్టించుకోనక్కర లేదని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను..

ఇక రెండవ బాణం నలభీమ పాకం భాస్కర రామ రాజుగారి పై ఎక్కుపెట్టడం అయినది ...ఎందుకంటే..మరి అంత కష్టపడి పోస్ట్ వేస్తే ..అయ్యో కొత్తగా వచ్చింది ఏదో ముచ్చట పడుతుంది..నువ్వు అంత గొప్ప వంటకం చేసావా ..బాగుంది అని ప్రోత్సహించకపోతే పోనీ సైలెంట్ గా ఉండచ్చుగా ...అబ్బే నాకసలు ఉలవచారు అంటే ఇష్టమే ఉండదు అని చప్పగా తేల్చేసారు ..పోనీ అక్కడితో ఊరుకున్నారా?? మీ ఇంటి మైసూర్ పాక్ ఒక ముక్క పంపితే మా ఇంట్లో కుంకుడు కాయలు కొట్టుకుంటా అన్నారు కూడా..వా..ఆ..ఆ...... మరి రాజుగారు ఒక సారి కీర దోసకాయల పచ్చడి ఎలా చేయాలి అని రాస్తే నేను ముక్కలన్నీ తరిగి పచ్చడి చేసే లోపు ముక్కలన్నీ చేదేక్కి పోయాయా !!అప్పుడు ఒక్కమాట అయినా అన్నానా రాజుగారిని ????..పైగా రాజుగారూ!!రాజు గారూ !! కీర దోసకాయ చేదు రాకూడదంటే ఏం చేయాలి ?అని కామెంట్ పెడితే రిప్లయ్ కూడా ఇవ్వలేదు .. ( స్వగతం: లేకపోతే నిన్న సోనాలి బింద్రే లాంటి నన్ను పట్టుకుని అక్కా అని పిలుస్తారా..ఆయ్) కాబట్టి మీరు అస్సలు వాళ్ళ మాటలు నమ్మ కూడదు .. నా మాట మాత్రమే నమ్మాలి ...ఎందుకంటే ఇది నా బ్లాగు ,నా పోస్ట్ అందుకే అన్నమాట..

ఆ ఇంతకూ ఎంత వరకూ చెప్పానూ?? ..మర్చిపోయాను ఇంకా మొదలు పెట్టలేదు కదా ..."ఉలవచారు" కృష్ణా జిల్లా వాళ్ళ ప్రియమైన వంటకం ...ఇంకా ఉలవల్లో బోలెడు పోషకాలు ఉన్నాయంట అవి అసైన్స్ కబుర్లు తారగారిని అడిగి చెప్తాను ...(ఇప్పుడు తారగారు అదేదో సినిమాలో ఆంటీ మత్ కహోనా టైపులో "గారు" మత్ కహోనా అంటారు :))

ఇక తయారి విధానం ...

ముందుగా ఉలవలు నానబెట్టాలి ...ఎన్ని అంటే ..ఊ ..ఒక దోసెడు నిండా తీసుకోండి ...వాటిని బాగా కడిగి నీరుపోసి ఒక రాత్రి అంతా నానబెట్టాలి..
తరువాత ప్రొద్దున్న అవ్వగానే వాటిని కుక్కర్లో వేసి ఒక మూడు పెద్ద గ్లాసుల నీరు పోసి రెండు.మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉంచి తరువాతా నీరు ని వడబోసి గింజలు వేరుగా పెట్టుకోవాలి (అసలైతే గిన్నెలో పోసి మరగనివ్వాలి ..మరి నాకంత ఓపికలేదు..మీరు కుక్కర్ వద్దు అనుకుంటే అలా చేయవచ్చు )...



ఆ నీటిలో కొద్దిగా చింతపండు పులుసు ,ఉల్లి పాయ ముక్కలు,టమాట ముక్కలు ఇంకా కరివేపాకు,కొత్తిమీర ,పసుపు,ఉప్పు,కారం వేసి మరగనివ్వాలి..అలా మరగనివ్వాలి మరగనివ్వాలి మరగనివ్వాలి అలా మరగనిస్తూనే ఉండాలి..



అప్పుడు ఉడకబెట్టి ప్రక్కకు తీసిన ఉలవ గింజలలో ఒక గుప్పెడు మిక్సిలో మెత్తగా రుబ్బి దాన్ని ఈ చార్లో కలిపేయాలి ... ఉలవచారు మరిగినకొద్దీ రుచి అన్నమాట ...అంటే గిన్నెలో పావు వంతు పైనే మరిగిపోవాలి.. అప్పుడు టేస్ట్ చూసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తో తాలింపు వేసుకోవాలి.. ఆఖరున వెన్నపూస పైన వేయాలి అంట.. మనకి అంత ఓపిక లేక ఆ పని చేయలేదు..:)




అంతే ఉలవచారు రెడీ ....





ఇప్పుడు కొన్ని నిబంధనలు అన్నమాట ..

1 .క్రొత్తగా ఉలవచారు తినేవారు ..చేయ బోయేముందు ఆహా సూపరు ఉంటుంది అని అనేసుకుని ఎక్కువ ఊహించుకుని చేయకూడదు ..ఎప్పుడూ ఎక్కువ అంచనాలు వేసి చేస్తే అస్సలు బాగోదు ..స్వానుభవం మీద చెప్తున్నా ..ఆ ఏం బాగుంటుంది లే ..మనకసలు వంట వచ్చా పాడా ...ఒక మాదిరిగా ఉంటుంది అనుకుని మొదలు పెట్టాలన్నమాట..

2 .అలాగే పెళ్లానికో ,భర్తకో పెట్టేటప్పుడు భలే ఉంటుంది భలే ఉంటుంది అని ముందుగానే అంచనాలు పెంచకూడదు ... తింటున్నపుడు మధ్యలో అడగాలి ఎలా ఉంది అని..తినేసిన తరువాత అడగకండెం ... నేను మొదటి సారి తను తింటున్నపుడు అడగడం మర్చిపోయి ఆ సాయంత్రం అడిగితే.. మధ్యాహ్నం నువ్వు చారు వండేవా ?? అన్నారు :( అందుకే అన్నమాట..

౩.అలాగే చారు సరిగ్గా కుదరలేదనుకోండి .. ఇది నా తప్పే ..నాకే వంట రాలేదు పాపం మధ్యలో నేస్తం ఏం చేస్తుంది అనుకోవాలి ..ఇది అసలైన నిబంధన అన్నమాట ..నిన్న ఇంకా చాలా చాలా చెప్దామనుకున్నాగాని గుర్తురావడం లేదు అదీ సంగతి ...

ఏంటలా చూస్తారు.. మనిషన్నాకా కాసింత ధైర్యం ,కూసింత నమ్మకం ఉండాలి... ఏం మా ఆయన తినలేదా? నేను తినలేదా ? మేమిద్దరం బాగానే ఉన్నాంగా ...ఏం పర్లేదు దేవుడి మీద భారం మీద వేసి చేసేయండి.. అయిపోగానే సూపరుంది సూపరుంది అని నాకు వ్యాఖ్య ఇవ్వండి ( వేరే పదం వాడటానికి మీకు చాయిస్ లేదు ..ఎందుకంటే కామెంట్ మోడరేషన్ నా చేతుల్లో ఉంది..ఉహహ్హహ (వికటాట్టాహాసం))
(మంచుగారిని భాస్కర్ గారిని నొప్పిస్తే క్షమించగలరు ..సరదాకు రాసాను :))

75 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

1 st ???

Sravya V చెప్పారు...

ఆ ఉలవ చారు సంగతేమో మీ పోస్టు మాత్రం సూపర్ !

మొన్న మధ్య ఆ షాపింగ్ సెంటరులో ఆ అబ్బాయి నెవరోనే రేటు విషయం లో కేన్నా , కేన్నటా అని దుమ్ము దులుపుతున్నపుడు కొంచెం పొట్టి గా ఉన్నారు అప్పుడే సోనాలీ బింద్రే అంత ఎత్తు ఎదిగి పోయారా ????(j/k)

జేబి - JB చెప్పారు...

నిబంధనలు బాగున్నాయండీ - ఉలవచారు మాత్రం అమ్మచేత భారత్ వెళ్ళాక చేయించుకుంటా.

మంచు చెప్పారు...

తెలుగు బాష లొ నాకు నచ్చని ఒకేఒక పదం "క్షమించడం" . ఇంతకింతా తీర్చుకుంటాండి

జయ చెప్పారు...

మొదటి నిబంధన ప్రకారం ఉలవ చారు చాలా బాగుంది. మరి ఇప్పటి వరకు నేను రుచి చూడలేదుగా. కాని ఇప్పుడు తప్పక చేస్తాను. మరి ఈ ఉలవలు ఎక్కడ దొరుకుతాయో చెప్పక పోతే ఎలా!!!

kiran చెప్పారు...

hahahah...nestam....superundi..superundi....ulava charu kadu..post.. :P...

కృష్ణప్రియ చెప్పారు...

శ్రావ్య అభిప్రాయమే నాదీ.. చారు సంగతి తర్వాత, టపా చదవటం బాగుంది :)
నేనెప్పుడూ తినలేదు వినటమే తప్ప.. ఈ సారి ట్రై చేయాలి.

3g చెప్పారు...

ఉలవచారా.........నా హిస్టరీలో ఒకే ఒక్కసారి చూసినట్టుగా గుర్తు.

మంచు గారు: మీరు అయ్యారు బాబుగారూ, మీరు అయ్యారు. వెల్కం టు ఫస్ట్ కామెంటర్స్ క్లబ్ ఆఫ్ జాజిపూలు

Mahitha చెప్పారు...

బాగుంది.

మా విజయవాడ లో పెళ్ళి భోజనాల్లో ఉలవచారు లేకపోతే జనాలు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు.
:)

అజ్ఞాత చెప్పారు...

వంటలపై పోస్ట్ కుడా ఇట్టా రాయొచ్చా?
మా మీ వ్యతిరేక సంఘం ఏమైపోవాలి? మీ ఫ్యాన్స్ ని ఎక్కడ ఆపగలం చెప్పండి.
మీరు ఇలా మా సంఘం పై సమ్మెటపోటు వేస్తారనుకోలేదు...
ప్చ్ ఐ హర్ట్..

నాక్కుడా ఉలవచారు తినాలి అని ఉన్నది కానీ మనం చేసుకునే రకం కాదు, యాస్ యూజువల్ డవిలాగ్,
నేను ఇదే వంటకాన్ని ఉలవలకి బదులు శనగలు పెట్టి చేయించుకొని చనా మసాలా అని చేప్పుకుంటున్నానే,..

Sasidhar Anne చెప్పారు...

Telugu vantakalalo naaku rani oke okkka vanta Olava charu.. Next weekend ki idhey ani fix ayipoya..(Nestam akka meeda nammakam tho :))

inthaki nenu monna cheppina pastha vanta try chesava leda akka.. :)


eee ninnati sonali bindre photo okati sampadincha.. nestam akka fans, ki banner kattaniki edaina photo kavali ante nannu sampradinchandi..

మంచు చెప్పారు...

ఎంటి ఇప్పుడు వెల్కం. ఇది మూడొసారి నాది ఫస్ట్ కామెంట్ అవడం. ఎక్కువసార్లు మొదటి కామెంట్ పెట్టిన వాళ్ళలొ ఇప్పటివరకూ నాదే రికార్డ్ :D

Padmarpita చెప్పారు...

సూపరుంది...హీ! హీ!
సూపరో సూపర్:):)

priya చెప్పారు...

ఉలవచారు చేయటం చాలా సులువే.....కానీ కుదరటం కష్టం అనుకుంటా . మీ కండిషన్లు బావున్నాయి.
నేను మొదటి సారి తను తింటున్నపుడు అడగడం మర్చిపోయి ఆ సాయంత్రం అడిగితే.. మధ్యాహ్నం నువ్వు చారు వండేవా ?? అన్నారు :( అందుకే అన్నమా
ఇది సూపర్. నేస్తం జీ మీ టపా ల వేగం తగ్గింది. త్వర త్వరగా రాయండి ప్లీజ్

sunita చెప్పారు...

hahaha!very nice.As usual with your own style and narration.

నేస్తం చెప్పారు...

మంచు గారు :)
శ్రావ్యా ఆ అమ్మాయిని నేను కాదుగాక కాదు.. ఎందుకంటే ఈ మధ్య హై హీలు కూడా వేసుకుంటున్నా ..( ఆ అమ్మాయి కూడా హీలు వేసుకుంది అని అంటే మాత్రం మీకు కార్తీక మాసంలో కల్లుతాగినంత మహా పాపం అంటుకుంటుంది మరి.. ఆ )

>>>ఉలవచారు మాత్రం అమ్మచేత భారత్ వెళ్ళాక చేయించుకుంటా.
jb గారు అంటే అంటే నీ వంట మీద నాకు నమ్మకం లేదూ అని అనేకదా మీ ఉద్దేశ్యం :)
మంచు గారు తప్పండి గోదావరి వాళ్ళు చాలా మంచోళ్ళు.. అలా కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్ళకూడదు ..:)
జయ .. ఇండియాలో ఉండే మీకే ఉలవలు ఎక్కడ ఉంటాయో తెలియకపోతే నేనెలా చెప్పను..ఈ ఉలవలు కూడా నా ఫ్రెండ్ ఇచ్చింది అన్నమాట :) లేకపోతే నాకు మాత్రం తెలుసేంటి :)

నేస్తం చెప్పారు...

కిరణ్ :O పోనీలే ఏదో ఒకటి బాగుంది కదా ఈ సారికి క్షమించేస్తున్నా :)
>>శ్రావ్య అభిప్రాయమే నాదీ
క్రిష్ణ గారు సోనాలి విషయం లో అని భయపడ్డాను :) పోస్ట్ విషయం లోనా ..అయితే ఓకే

3g ఒక సామెత తెలుసా.. ఒక కన్నూ కాదు ఒక సారి తింటే తిన్నట్టూ కాదు (బాగా చెప్పానా)
అందుకే ఇంకోసారి చేయాల్సిందే
మహీ అవునంట మొన్నే ఒక విజయ వాడ ఫ్రెండ్ చెప్పింది.. :)

జేబి - JB చెప్పారు...

మరేం చేస్తాం చెప్పండి, మీరన్ని నిబంధనలు పెడితే. పైగా మీరు చేసింది సింగపూరునుండి బోస్టనుకి ఎగిరిరాదు కదండి. అయినా అమ్మయితే ఇలా అడగ్గానే అలా చేసిపెడుతుంది.

నేస్తం చెప్పారు...

>>>నేను ఇదే వంటకాన్ని ఉలవలకి బదులు శనగలు పెట్టి చేయించుకొని చనా మసాలా అని చేప్పుకుంటున్నానే
అయ్యబాబో తార గా రు ఇలా క్కూడా చేయచ్చా ..అయితే ట్రై మీ అధ్యక్షుల మీద ప్రయోగించాలి :)
శశీ పాస్తా అప్పుడప్పుడూ నీకులాగే వండుతునే ఉంటా పిల్లలకు.. అవును ఈ సారి నా ఫ్రొఫైల్ లో సోనాలి పొటో పెట్టేద్దాం అనుకుంటున్నా..ఏమంటావ్..:)
పద్మా :O మధ్యలో హీ హీ ఎందుకమ్మా ..:)
ప్రియా నిజమే ఉలవచారు సులువే గాని టైం ఎక్కువ పడుతుంది.. ఇక పోస్ట్లు అంటావా ఈ మధ్య చదవడానికి ఉన్న ఇంట్రెస్ట్ రాయడానికి ఉండటం లేదు :)
సునీతా థేంక్యూ :)
jb గారు ఇది మరీ బాగుందండి..నిబంధనలకు లోబడి వండుకోవాలి గాని అలా భయపడిపోతారా.. :)నిజానికి ఇది చాలా టైం పట్టే వంటే ..అమ్మ చేతే వండిచుకోండి హాయిగా :)

Sree చెప్పారు...

Post chaala bagundi...

naaku ulavachaaru chaala ishtam nestam :)).. mukhayamgaa venapoosa vesukunte untundi asalaa... yama yama yummy annamaata... oorlo ulavalu kaachi mariginchi ammammalu pampiste memu taalimpu maatram pettukunevaallam... photolo maamoolu chaaru laaga undi kaani memu chesukunedi chaala thick consistencylo untundi.. ee rojullo evaru ulavalu kaayatledu.. mari gurraalu, godlu ekkuva undatledu kada oorlo :((((... so prastutaaniki Sweet Magic Zindaabad.

by the way, maadi krishnaa zillane.

Rakesh చెప్పారు...

baundi.. konchm frequent ga rayandi :)

మనసు పలికే చెప్పారు...

అక్కోయ్ అక్కా.. మీరు వంటకాల్లో కూడా నవ్విస్తారా.? హహ్హహ్హా.. భలే భలే ఉంది మీ టపా.. ఇప్పుడు నేను మీరు చెప్పిన ఉలవ చారుని ఖచ్చితంగా ట్రై చెయ్యాలంటారా..? తప్పదా..అంటే నేను ఇంతవరకూ తినలేదు ఉలవచారు.. పోనీ ఈ బంగారు చెల్లెలి కోసం కొంచెం కన్సెషన్ ఇవ్వొచ్చుగా... ;)
>>మధ్యాహ్నం నువ్వు చారు వండేవా ??
బావ గారు సూ.....పర్ :)))))))))))
మొదటి కామెంటు కొట్టేసిన మంచు గారూ...

మనసు పలికే చెప్పారు...

>>అలాగే చారు సరిగ్గా కుదరలేదనుకోండి .. ఇది నా తప్పే
హహ్హహ్హా...

రాజ్ కుమార్ చెప్పారు...

ఇప్పుడు నాకు కూడా ఉలవచారు చెయ్యటం వచ్చేసిందోచ్... ఫోటోలు చూస్తే తెలియటం లేదూ.. ఉలవచారు హిట్ అని..? పోస్ట్ కేకో keka ...

రాజ్ కుమార్ చెప్పారు...

మంచు గారు..congratulations (కుళ్ళుకుంటూ..)

రాజ్ కుమార్ చెప్పారు...

అయ్యో..అయ్యో ... కుయ్యో..మొర్రో... ఇలా ఆదివారం పూట పోస్టేసి నన్ను కనీసం టాప్ 20 కూడా లేకుండా చేస్తారా...? వా...వా...

రాజ్ కుమార్ చెప్పారు...

హరే కృష్ణా..నువ్వు చెప్పింది నిజమే.. మిట్ట మధ్యాహ్నం వచ్చిన కలలు నిజమవుతాయి

రాజ్ కుమార్ చెప్పారు...

"ఎక్కువసార్లు మొదటి కామెంట్ పెట్టిన వాళ్ళలొ ఇప్పటివరకూ నాదే రికార్డ్ "
మంచు గారు.. త్వరలో మీ రికార్డ్ బద్దలు కొడతా చూస్తూ ఉండండి... :) :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

నేస్తం గారు నిభందనలు సూపరు. అబ్బో ఉలవ చారు ఇంకా సూపరు అసలు చూస్తుంటేనే నోరూరిపోతుందంటే నమ్మండి (ఈ మాత్రం చెప్తే చాలా:)
ప్రియావాడి ఉలవచారు ఆహా ఓహో అనుకుని చాలా గొప్పగా ఊహించుకుని తెచ్చి ట్రై చేశా కానీ నాకు అస్సలు నచ్చలేదు :-(

మధురవాణి చెప్పారు...

అబ్బా.. పొద్దుపొద్దున్నే తెగ నవ్వించేశారండీ బాబూ! మీరు కండీషన్ పెట్టకపోయినా సూపర్ అనే అనేవాళ్ళం! ;) మా అత్తగారింటి వైపు పెళ్లి విందులో ఉలవచారు పెట్టారు. చాలాసార్లు విన్నా గానీ నేనెప్పుడూ తినలేదంటే, మా ఆడపడుచు ఒక ముద్ద కలిపి పెట్టింది. మీగడ కలుపుకునే తినాలటగా! నాకైతే మాత్రం మరీ అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. కానీ, ఉలవచారు చాలా ఫేమస్ వంటకం కదా! :)

Unknown చెప్పారు...

ఏమిటండీ.. అన్ని బ్లాగులలోనూ ఈ వంటల గోలా? మీరు కూడా ట్రెండ్ ఫాలో అయిపోతున్నార నేస్తంగారు ? హ హ హ. నైస్ పోస్స్ట్

Unknown చెప్పారు...

హమ్మో... ఉలవ చారు చెయ్యటానికి ఇంత టైం పడుతుందా? కుదిరినప్పుడు ట్రై చెయ్యాల్సిందే..
మీ పోస్ట్లు కొన్ని చదివాను..మిగిలినవి కూడా చదవాలనిపించేలా ఉన్నాయ్ అవి.

--
శ్రీని

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

మేనత్త మొగుడూ ఓ మొగుడేనా,ఉలవచారూ ఓ రెసిపీయేనా అనీ(క్షమించాలి అన్ని జిల్లలవారూ కూడా,రుచి గురించి,దాని ప్రత్యేకతగురించి కాదని గమనించాలి).
మా బాగా రాసారు కానీ మా మంచు గార్ని,తమ్ముడు బాచి మీద కక్ష గట్టి రాసారు కాబట్టి మీ ఉలవచారు మేం తినం పోండి,కృష్ణా జిల్లా లో ఎవరిదన్నా పెళ్ళికెళ్ళి మరీ తింటాం అంతే.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

క్షమించాలి, మేనత్త కొడుకూ ఓ మొగుడేనా అని పడాలి ప్చ్,ఏం సేత్తాం మీ ఉలవచారు రుచికి అలా దిమ్మతిరిగిపోయి అప్పుతచ్చయిపోయింది.

రాజ్ కుమార్ చెప్పారు...

పప్పు గారు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవండి... :)

రాజ్ కుమార్ చెప్పారు...

ముందు రెండు నిబంధనలూ తెలుసు కానీ నేస్తంగారు ".అలాగే చారు సరిగ్గా కుదరలేదనుకోండి .. ఇది నా తప్పే ..నాకే వంట రాలేదు పాపం మధ్యలో నేస్తం ఏం చేస్తుంది అనుకోవాలి ..ఇది అసలైన నిబంధన అన్నమాట " ఈ మూడో నిబంధన చాలా కొత్త గా ఉంది...బావుంది హ హహ...

సూపరుంది సూపరుంది ..:) :)

Sravya V చెప్పారు...

అంటే మాత్రం మీకు కార్తీక మాసంలో కల్లుతాగినంత మహా పాపం అంటుకుంటుంది మరి..
--------------------------------------------------------
చా చా మీరింత మాట అన్నాక , ఒప్పుకోక పొతే బాగుండదు , నిజమేనండీ ఆ అమ్మాయి మీ కన్నా కొంచెం ఎత్తు ఎక్కువగా ఉన్నట్లుంది :P

నేస్తం చెప్పారు...

స్రీ అవునండి ఉలవచారు తిక్ గానే ఉంటుంది కాని నేను వడపోయా.. పోటోకోసం వడగట్టాను....అయినా నాకసలు ఉలవచారు ఎలా ఉంటుందో తెలియదు ఎక్కడో నెట్లో చూసి నేర్చుకోవడమే.. అయితే క్రిష్ణ జిల్లా ఆడపడుచన్నమాట మీరు :)
రాకేష్ థేంక్యూ :)
అప్పూ తినలేదా ..(హమ్మయ్యా అయితే ఉలవచారు అంటే ఇలాగే వండాలి అని దభాయించేయచ్చు ) ...అయితే నేర్చుకో అప్పూ ..చాలా సింపులూ ..
మరి ఏం చేయను జ్యోతిగారు ఈ రోజే రాయమన్నారు వేణు రాం
నీకో విషయం తెలుసా మధురా పేరు విని నేనూ అతిగా ఊహించేసుకున్నా.. వండాకా పెద్ద గొప్పగా అనిపించలేదు..కాని తినగ తినగా నచ్చేస్తుంది..

నేస్తం చెప్పారు...

అబ్బులు గారు ఈ రోజు క్రొత్తగా ఫాలో అవ్వడం ఏముంది అండి లాస్ట్ ఇయర్ కూడా ఫాలో అయ్యానుగా గుత్తివంకాయ కూరతో
శ్రీని చదివేయండి చదివేయండి ..అలా ఆలస్యం చేయకూడదు
వేణు శ్రీకాంత్ పొగిడేసాకా అలా బ్రాకెట్స్ లో ఏమీ రాయకూడదు..జనాలు సరదాగా పొగేడారేమో అని పొరపాటు పడిపోతారన్నమాట..అదే అదే అందుకే చెప్తున్నా ఇంటిలో వండుకోండి బాబు అని :)
శ్రీనివాస్ గారు అదే కదా సామెత ఏంటబ్బా అలా ఉంది అనుకుంటున్నా.. మీరు పొరపాటు పడింది కాక మళ్ళీ ఉలవచారు వల్ల అంటారా..
>>మా మంచు గార్ని,తమ్ముడు బాచి మీద కక్ష గట్టి రాసారు కాబట్టి
ఏం మరి మీ తమ్ముళ్ళు నన్ను అనగా లేంది నేను అంటే తప్పా..ఇదెక్కడ అన్యాయం అక్రమం అని ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా

నేస్తం చెప్పారు...

అమ్మో రాజ్ అలాంటి విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ..మళ్ళీ నా మీద ఎవరూ యుద్దానికి రాకుండా.. అందుకే పెట్టాను ఆ నిబంధన
శ్రావ్యా :) మొత్తానికి ఒప్పుకోరుకదా ..అన్నట్లు మర్చిపోయా ప్రొద్దున్న పాయా లేబర్ శివుని గుడికి కి వెళ్ళాను .. మీరు గాని వచ్చారేంటి ..ఏం లేదు ఒక అమ్మాయిని చూడగానే మీరు అనిపించారు

Sravya V చెప్పారు...

ఏమండీ ఇది చాలా అన్యాయం సుమండీ మీరు కొద్ది గా పొట్టి అన్నందుకు గుళ్ళో ఎవరో అమ్మాయిని చూసి నేనకున్న అంటారా ? ఇప్పుడు ... వద్దులేండి నా పరిస్తితి ఏమిటీ , ఎలాంటి అమ్మాయిని చూసి నన్నకున్నారో ఏంటో (ఒక్కసారి database మొత్తాన్ని సెర్చ్ చేస్తున్నా :) )

Jokes apart పాయా లేబర్ మాకు దూరమండి, సో నేను రెగ్యులర్ గా వెళ్ళేది రివెర్ వాలీ ట్యాంక్ రోడ్ తెలుసేమో కదా మీకు అక్కడ టెంపుల్ కి .

నేను చెప్పారు...

already half century దగ్గరకోచ్చేసారు :(

ఈసారి శ్రీలంకన్ స్టోర్ కి పోయినపుడు ఉలవలు దొరుకుతాయేమో చూడాలి. నేను చాలాసార్లు తిన్నా, బావుంటుంది (Engg కృష్ణా జిల్లాలోనే, ఎవరు పెళ్లికి పిలిచిన వెళ్ళిపోవడమే తినడానికి).

Btw, మీ ఉలవచారు సూపరు కెవ్వెస్ట్ కేకెస్ట్ ..

Unknown చెప్పారు...

నేస్తంజి.. మీరు కూడా వంటలమీదే వేసారా పోస్టు..! :( నిన్నటి నుండి ఈ వంటల పోస్ట్లు చూడలేక బోర్ కొడుతుంది అనుకోండి.. టపా మీ స్టైల్ లోనే ఉన్నా.... మీ గత పోస్ట్ల రేంజ్ లో లేదు..
ఇలా ట్రెండ్ ని బట్టి కాకుండా , ట్రెండ్ సెట్టింగ్ పోస్ట్ వెయ్యండి చెప్తాను..
(నొప్పించినట్లయితే మన్నించాలి..)
ఉలవచారు మాత్రం ఘుమ ఘుమ లాడిపోతుందండి..

waiting for a great post from U.. :P

కొత్త పాళీ చెప్పారు...

"లేకపోతే నిన్న సోనాలి బింద్రే లాంటి నన్ను పట్టుకుని అక్కా అని పిలుస్తారా."
ఏవండీ నేస్తం అక్కాయ్ గారూ, సోనాలి బింద్రే మరీ ఇంద్రా టైము గదండే .. ఇప్పుడెమో మరి ఆరెంజి టైమొచ్చేసింది గదండే ..

మాలా కుమార్ చెప్పారు...

ఈ వులవ చారు రాయలసీమ ఫాక్సనిస్ట్లు చేస్తారని విన్నాను . నిజమేనాండీ ?

Sai Praveen చెప్పారు...

టాపిక్ ఏదైనా మీ స్టైల్ మీదే అక్కా... ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ వరకు అదుర్స్ అంతే :)
మనకి వంటలంటే చాలా బోర్. మధ్యలో సీరియస్ గా రెసిపీ చెప్పేస్తోంటే ఆ రెండు మూడు పారాలు వదిలేసి కిందకి వెళ్లిపోబోతూ ఈ వాక్యాలు చూసాను.
>>పసుపు,ఉప్పు,కారం వేసి మరగనివ్వాలి..అలా మరగనివ్వాలి మరగనివ్వాలి మరగనివ్వాలి అలా మరగనిస్తూనే ఉండాలి..
వెంటనే లెంపలేసుకున్నా అక్కనెప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదు అని :)

శ్రీలలిత చెప్పారు...

నేస్తంగారూ,
"ఉలవచారు పేరు అంత బాగుండదు కాని రుచి మాత్రం బ్రహ్మాండం" అని మా స్నేహితులు చెపితే అవునేమో అనుకున్నాను. కాని మీ ఉలవచారు రెసిపీ చూసాక పేరు కూడా బ్రహ్మాండం గానే అనిపించింది. అభినందనలండీ..

రాధిక(నాని ) చెప్పారు...

ఉలవచారూ,మీ పోస్టు సూపర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్:)

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా బాగా రాశారు.. ఉలవ చారు చాలా బాగుంది.

jai చెప్పారు...

enni rojulu eduruchuste eda post edo rayali annattu rasaru.kartheekamasam ayyaka pulasachepa gurinchi rayandi enthalesi kallupetti chustamu

నేస్తం చెప్పారు...

హమ్మయ్యా మీరు కాదా...ఆ అమ్మాయి సూపరు ఉంది ..ఎక్కడ పొగిడేయాలా అని ఫీల్ అవుతున్నా :))
రివెర్ వ్యాలి టేంక్ రోడ్ దగ్గరా.. నేను తక్కువే లేండి అటు వెళ్ళడం అయితే లిటిల్ ఇండియా గుళ్ళు లేదా ఇటు పాయలెబర్ ఇటు సైడ్ ..
బద్రి :) అవునా .. నిజం ఉలవచారు తినడానికి ఎలా ఉంటుందో నాకు తెలియదు.. మా వైపు అంటే గోదావరి సైడ్ తక్కువే ఈ చారు..ఇక్కడ లక్ష్మి చారు చేస్తారు.. ఫేమస్ అని చెప్పలేను గాని బాగానే తింటారు
భాను గారు అంటే నలుగురితో పాటు నారయణ కదండీ అలా రాసేసాను అన్నమాటా..
>>>waiting for a great post from U హహహ్ అస్సలు వైట్ చేయకండి.. నేను ఒకటి రెండు పోస్ట్ ల తరువాతా టాటా బై బై అనేద్దాం అని డిసైడ్ చేసినా :)

నేస్తం చెప్పారు...

కొత్త పాళి గారు అలా పాయింట్స్ లాక్కూడదు మీరు.. అంటే ముప్పై పైనే వయసు వచ్చినా మురారిలో చూడండి ఎంత యంగ్ గా కనబడిందో..ఆ ఉద్దేశ్యం అన్నమాట .. అదన్నమాట సంగతి ..అర్ధం చేసుకోరూ..

మాలగారు నిజమా అవునా.. నాగాని అడగాలి అయితే..
సాయ్ అదే నీలో నచ్చేది ..పోస్ట్ ఎలా ఉన్నా మెచ్చేసుకుంటావు అని
శ్రీలలిత గారు థేంక్యూ థేంక్యూ :)
రాధిక :) థేంక్యూ
చెప్పాలంటే థేంక్యూ
జై.. పులస చేప పులుసా..తప్పు తప్పు తప్పు చెంపలేసుకోండి.. కార్తీక సోమవారం అలాంటివి గుర్తుచేయవచ్చా ..

నేస్తం చెప్పారు...

muraLi gaaru thEnk u

కౌటిల్య చెప్పారు...

పోస్ట్ సూపర్గా ఉంది కానీ......అవసలు ఉలవలేనా..అలా నల్లనల్లగా ఉండవుగా..చక్కగా బ్రౌన్ కలర్లో ఉంటాయ్...మిమ్మల్ని ఆ సింగపూర్ వెధవలు మోసం చేసేసినట్టున్నారు...భలే భలే....

అవునూ..అసలది ఉలవచారా,మిరియాల చారా...అలా పల్చ్గగా ఉందేంటీ...చూసి నేను ఏ చింతచారో,మరుగు చారో అనుకున్నా...హిహిహ్హి...అయినా అక్కడెక్కడో ఉన్నారుకదా,ఆ మాత్రం ప్రయత్నించారు గొప్పే..ఈ మాటు చేసేప్పుడు నన్నడగండి..చక్కగా డైరెక్షన్సిస్తా...ఓకే..

కవిత చెప్పారు...

Nestham garu,mee olava charu bagundi .kani meeko vishayam cheppalna??Meekante nenu inka baga chesthanu.Ee madya ma friend valla amma garu chesi icharu naaku..adi ayithe amrutham kante bagundi andi.Mana iddari charu valla charu mundu baladhre avuthadi.

ee sari meeru cheppinatlu chesi result ento ma vaarini adigi meeku cheputhalendi.

నిషిగంధ చెప్పారు...

మీరు ఏ రకంగా తిరగ గాసినా.. ఐ మీన్, మరగ గాసినా మీ ఉలవచారుకే నా ఓటు :))
మొదట్లో ట్రై చేసినప్పుడు 'అబ్బే, ఇదా ఉలవచారు!' అనిపిస్తే అలవాటయ్యాక 'అబ్బో ఉలవచారు!!' అనిపిస్తుంది..

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేను చక్రద్వారబంధంలో ఆ ఊరి ప్రెసిడెంటు గారి ఇంట్లో తిన్న ఉలవచారు గుర్తొచ్చింది :-))... నేను కూడా వంట నేర్చుకున్నాకా ఇది ట్రై చేస్తా ... అప్పటిదాకా ఎవరైనా భోజనాల్లో పెడితే తిని పెడతా ;-)

ఇందు చెప్పారు...

నేస్తం గారు..మీ ఉలవచారు..అద్భుతం...ఆ ఫొటోలు చూస్తుంటే తినేయాలనిపిస్తొంది. ఇక నాకు ఇంకా బాగ నచ్చింది మీరు చెప్పె విధానం. చాల బాగుంది మీ బ్లాగ్ భోజనం :)

హరే కృష్ణ చెప్పారు...

ఇంట్లో వనభోజనాలు కి వెళ్ళే అదృష్టం లేదనుకున్నాం ఇలా మీ పోస్ట్ తో తీరింది అక్కా..

Keerthi చెప్పారు...

Nestam gaaru,
eppudu me gurinchi,mee vari gurinchena...me pillala gurinchi kuda oo post veyochuga..oka sari alochinchandi mari:P

Unknown చెప్పారు...

" మరగనివ్వాలి..అలా మరగనివ్వాలి మరగనివ్వాలి మరగనివ్వాలి అలా మరగనిస్తూనే ఉండాలి.."
మీకెలా వస్తాయి ఇలాంటి అయిడియాలు ? ఉలవ చారు సంగతి నాకు తెలవదు గాని.. టాపిక్ ఏదైనా ఆపకుండా చదివించడం మీకే చెల్లింది లెండి.. ఎప్పటి లాగా నే బాగా రాసారు..

నేస్తం చెప్పారు...

కౌటిల్యా అసలే నేను కాసింది ఉలవచారా కాదా అని గొప్ప డౌట్ ఉంది ఇప్పటికే ప్రజానికానికి... అసలు అవి ఉలవలా కాదా అని అంటే అయిపోతాను నేను.. :) అవి ఉలవలనే ఇచ్చింది మా ఫ్రెండ్..అయ్యబాబోయ్ సమయానికి గుర్తొచ్చింది మొన్న మా అత్తగారుకూడ అవి ఉలవలే అని అన్నారు ..హమ్మయ్యా అవి ఉలవలే ...
కవితా మరి మీవారు ఎమన్నా సరే చాలాబాగుంది అన్నారు నేస్తం అని చెప్పాలన్నమాట. సరేనా
>>>మొదట్లో ట్రై చేసినప్పుడు 'అబ్బే, ఇదా ఉలవచారు!' అనిపిస్తే అలవాటయ్యాక 'అబ్బో ఉలవచారు!!' అనిపిస్తుంది..

నిషీ ఇనంత పెద్ద పోస్ట్ రాసి నేనేం చెప్పాలనుకున్నానో ఒక్క ముక్కలో చెప్పేసారు.. సూపరూ ..
రామ క్రిష్ణా మర్చిపోయా ఆ పోస్ట్ ఒక ఫ్రెండ్ ఇంట్లో చదివాను.. భలే రాసారు...ఏంటి సార్ వంటనేర్చుకుని అప్పుడు ట్రై చేస్తారా.. :))) ఎందుకు నవ్వానో చెప్పుకోండి ..

నేస్తం చెప్పారు...

అయ్య బాబో య్ ఇందూ ప్రతీ వాక్యం నచ్చేసింది నాకు మీ కామెంట్లో ..
హరే మీ వూరు వెళ్ళావా కార్తీక మాసం లో గుడ్ గుడ్
కీర్తీ మావారి గురించి నా గురించి రాస్తేనే బోర్ కొట్టేస్తుంది ఇక పిల్లల గురించి కూడా రాస్తే జనాలు ఫీల్ అవుతారు :)
జేంస్ థేంక్యూ థేంక్యు :)

భాను చెప్పారు...

సోనాలి బింద్రే అక్కయ్య :)) ఈ ఉలవ చారు ఎప్పట్నుంచో ట్రై చెయ్యాలనుకుంటే ఇంతవరకు కుదరలేదు. అప్పుడప్పుడు అల సూపర్ మార్కెట్లో కనపడితే తీసుకుందామని ఎందుకో ఎప్పుడూ వాయిదానే.. మీ పోస్ట్ చూశాక ఇప్పడు దైర్యం వచ్చింది. బాగుంది మీ ఉలవచారు ఘుమ ఘుమలు నా బ్లాగ్ దాక వస్తే వెతుక్కుంటూ వచ్చానండి. బాగుంది

Anand Kumar చెప్పారు...

నైస్ పోస్ట్ నేస్తంగారు..!

"వచ్చేసారా.. రండి రండి రండి ...కూర్చోండి ..ఆ ..ఇప్పుడు చేయి తల పై పెట్టుకుని ప్రమాణం చేయండి.. నేను నేస్తం బ్లాగ్ పూర్తిగా చదివిన పిమ్మటే బ్లాగ్ క్లోజ్ చేస్తాను ..సగం మధ్యలో పారిపోను అనండి.. అదిగో అదేమరి ...మీతో వచ్చిన చిక్కు ...అలా మొహమాట పడకూడదు ...మర్యాదగా కూర్చోండి ...అద్గది వేరీ గుడ్.." ..

హా హా..హా... ఇలాంటి థాట్స్ మీకే వస్తాయి నేస్తం గారు..!
చాలా కాలం తర్వాత రాసినట్టున్నారు...! బావుంది.. :D

Unknown చెప్పారు...

అస్సలు వైట్ చేయకండి.. నేను ఒకటి రెండు పోస్ట్ ల తరువాతా టాటా బై బై అనేద్దాం అని డిసైడ్ చేసినా :)

nijam gane antunnaraa? too sad...
:( :(

sreekar చెప్పారు...

bagundandi..mee post...:)

రాజ్ కుమార్ చెప్పారు...

"ఇంట్లో వనభోజనాలు కి వెళ్ళే అదృష్టం లేదనుకున్నాం ఇలా మీ పోస్ట్ తో తీరింది అక్కా."

ఆహా.....ఇప్పుడు వచ్చావా...? 50 కామెంట్స్ తరువాత..?? ప్చ్.... ఉలవచారు చేసి రెండు రోజులయ్యింది నాయనా...! :) :) :)

మంచు చెప్పారు...

లక్ష్మి చారు కాదు... అచ్చ తెలుగు లొ లచ్చిం చారు అనాలి ... దాంట్లొకి ఉప్పు చేప ఉండాలి :D

శివరంజని చెప్పారు...

నేస్తం అక్కా నువ్వు చెప్పావని పోస్ట్ పూర్తిగా చదివి నీకోసం ..కేవలం నీకోసం మాత్రమే ....ఉలవచారు టేస్ట్ చేసాను ...నువ్వు చేసిన 5 డేస్ తరువాత రుచి చూడడం వల్లనో లేక స్టార్టింగ్ ఇలా ఉందో తెలియదు కాని .......ఇప్పుడు నా ప్రాణానికి ఎవరు హామీ ???????

Srinivas K చెప్పారు...

ఉలవచారు అలా పలచగా ఉందేటండి బాబు.మా ఇంట్లొ ఎద్దుల కొసం రొజు ఉలవలు ఉడకపెడతారు. 2,3 నెలలకొకసారి ఉలవచారు చెస్తాము. మా అమ్మగారు చాలబాగ కాస్తారు.

Raghuram చెప్పారు...

నేస్తం గారు...,

మీ ఉలవచారు మహాద్భుతమండి. మా అమ్మ కూడ నిన్న అదే చేసింది మరి కాని నాకు అందులో ఒక్కటంటే ఒక్క ఉల్లిపాయ కూడా కనిపించలేదు మరి. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు అడగాలి ఉల్లి వేసిందో లేదో?. ఎప్పటిలానే మీ వంటతో కడుపు నింపేసారు.

రఘురామ్

raaam చెప్పారు...

మీ ఉలవచారు మహాద్భుతమండి

raaam చెప్పారు...

మీ ఉలవచారు మహాద్భుతమండి

raaam చెప్పారు...

మీ ఉలవచారు మహాద్భుతమండి