22, అక్టోబర్ 2010, శుక్రవారం

సింగపూర్

నేను ఒక పేద్ద పోస్ట్ రాసి ప్రచురిద్దాం అనుకుని..ఫొటోస్ సరి చేసుంటే ఏమొచ్చి ఏడ్చిందో మొత్తం పోస్ట్ ఎగిరిపోయింది...కనీసం ఆ రాసినదానిని సేవ్ కూడా చేయలేదు ..తార గారు బెండప్పరావుల దిష్ఠే దీనికి కారణమని నేను ప్రఘాడం గా నమ్ముతున్నాను..ఇంక నావల్ల కాదమ్మా ..ఏదో గుర్తున్నవరకూ అలా రాసేసి ప్రచురించేస్తున్నా.. పోస్ట్ నచ్చకపోతే మొత్తం తిట్లన్నీ వాళ్ళకే చెందుతాయి ...


చాలా రోజులు మరి సింగపూర్లో ఉన్నాను కదా..మరి మా ఊరి గురించి గొప్పలు చెప్పుకోవాలి కదా..ఇంకా ఎవరన్నా వస్తే వాళ్ళకు ఏమేమి ఉన్నాయో తెలియాలి కదా అందుకే అన్నమాట ఈ పోస్ట్..

నిజంగా నిజం చెప్పాలంటే మిగిలిన దేశాలతో పోలిస్తే సింగపూర్ లో చూడటానికంటూ ఏం ఉండవు.. అంటే నాలాంటి ఎర్ర బస్సులకు బాగానే ఉంటుంది గాని కొద్దిగా ప్రపంచం చూసిన వాళ్ళకు అంటే కాస్త సిటీల్లో ఉన్నవాళ్ళకు కొద్దిగా మాములుగానే ఉంటుంది..
కాకపోతే ఈ దేశం లో ఒకసారి బ్రతుకు తెరువుకి అడుగుపెట్టిన వాళ్ళకు ఇంకే దేశానికి వెళ్ళబుద్ది వేయదు..ఎందుకో ఇంకెప్పుడన్నా చెప్పు కుందాం..






















ఇక్కడ కు వచ్చిన వాళ్ళు వెళ్ళేవాటిలో ముఖ్య మైనది బర్డ్స్ పార్క్ ...కొన్ని వందల ఎకరాల్లొ నిర్మిత మైన ఈ పార్క్ కు వెళితే తప్పని సరిగా ఒక రోజు పట్టేస్తుంది ..ఎక్కడ పడితే అక్కడ మంచినీటి సదుపాయం..ఏసి షెల్టర్లు ,మేప్లు ,ట్రాంలు తో చూడటానికి బాగుంటుంది.. వీళ్ళకు వాటర్ ఫాల్స్ అంటే ఏమిటో తెలియదు కాబట్టి ఒక కృత్రిమమైన జలపాతం ఒకటి నిర్మించారు ఇక్కడ.. ప్రపంచం లో అతి చిన్న పక్షులైన హమ్మింగ్ బర్డ్స్ ని చూడటం నాకు చాలా ఇష్టం.. ఇంకా ఫ్లెమింగోస్ ,హంసలు అదేలెద్దురూ మొత్తం అన్ని రకాలు ఉంటాయి ..ఇంకా ఒక చోట అయితే మన చేతిలో ఏదో ప్లేట్ తో ద్రవం ఇస్తే(అదేంటో నాకు తెలియదు) బోలేడు చిలుకలు మీద వాలి తాగుతాయి..అది కూడా బాగుంటుంది మిస్ అవ్వకండి ..



















జూ : ఇది పర్వాలేదు బాగానే ఉంటుంది..కాని మా ఆయన ఏడ్చినట్లు ఉంది మన ఇండియాలో ఇంతకన్నా ఎక్కువ రకాలు ఉంటాయి అన్నారు..ఎంతవరకు నిజమో నాకు తెలియదు.. ఇది కూడా సౌకర్యాల విషయం లో చాలా చక్కగా ఉంటుంది..పోలార్ బేర్ ని మొదటి సారి ఇక్కడే చూసాను ..కాకపోతే నైట్ సఫారి అని దీనికి అనుసంధానం గా ఒకటి పెట్టాడు..సుత్తిగాడు ..ఏమి ఉండవు అందులో .. డబ్బులన్నీ వేస్ట్ ..పగలు మనం జూ లో చూసింది..రాత్రి ట్రాం లో తిప్పుతాడు ..కాకపోతే వెన్నెల్లో జంతువులు చూడటం అదో థ్రిల్ ..అంటే సగం జంతువులు ఎంచక్కా బజ్జుంటాయి అనుకోండి అది వేరే విషయం ..
























సైన్స్ సెంటర్: పిల్లలతో వెళ్ళడానికి ఇది బాగుంటుంది..చాలా చాలా సైన్స్ విషయాలు ఉంటాయి..మనకవేమి అర్ధం కావు కాబట్టి అక్కడే ఉన్న రోబోట్ దగ్గర తచ్చాడుతుంటాను అన్నమాట..అది ఎంచక్కా మనతో మాట్లాడుతుంది..పాడమంటే పాడుతుంది ..అబ్బో సూపరు ..నాకు నచ్చింది..దీని లో చిన్న వాటర్ వర్ల్డ్ ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ డ్రెస్స్ లు తీసుకు వెళితే ఇంకా ఎంజాయ్ చేయచ్చు ..దాని ప్రక్కనే స్నో సిటి ఉంటుంది.. పిల్లలతో బాగా ఎంజాయ్ చెయ్యచ్చు..నాకులాంటి వాళ్ళను తీసుకు వెళ్ళకపోవడం మంచిది.. నేను అయిదు నిమిషాలు ఉండి నాకు ఊపిరి ఆడట్లేదు బాబోయ్ అని బయటకు పారిపోయాను :)
























ఆర్చాడ్ గార్డెన్ : ఈ ఆర్చిడ్ పువ్వులు సింగపూర్ నేష్నల్ ఫ్లవర్స్ అన్నమాట..ఈ పూవులంటే నాకు భలే ఇష్టం ఎందుకంటే ఇవి దేవుడికి పెడతామా వారం రోజులవరకూ అసలు వాడవు అలాగే ఉంటాయి..వాజ్ లో పెడితే చాలానాళ్ళు తాజాగా ఉంటాయి ..ఈ గార్డెన్లో దాదాపు 10,000 రకాల ఆర్చిడ్ పూవులు ఉంటాయి అంట .. ఏమో మరి నేను కౌంట్ చేయలేదు గాని అన్ని ఉండవనుకుంటా... నాకు తెలియదమ్మా నేను లెక్కపెట్టలేదు..పాపం పుణ్యం దేవుడికే తెలియాలి.. కాని బాగుంటుంది చూడటానికి..







ఇంకా పాసిరిస్ దగ్గర డౌంటౌన్ ఈస్ట్ లో థీం పార్క్,వైల్డ్ వైల్డ్ వెట్ వాటెర్ పార్క్ సూపర్ ఉంటాయి ...అంటే థీం పార్క్లో బోలెడు రైడ్స్ ఉంటాయి అది మీకు తెలియనిదేముంది.. అయితే వాటెర్ వర్ల్డ్ లో సునామి వేవ్స్,ఫ్లోటింగ్ రివర్ గట్రాలు ఉంటాయి ..బాగుంటుంది..కాని బోలెడ్ డబ్బులు (16$)తీసుకుంటాడు దాని కంటే సేం అలాగే ఉంటుంది చైనీస్ గార్డెన్ దగ్గర స్విమ్మింగ్ పూల్ లో 2$ కే సూపరు.. నా మాటవిని అక్కడకి వెళ్ళండి ..బోలెడు ఆదా..






ఇవి కాకుండా చుట్టు ప్రక్కల దీవులు కొన్ని ఉన్నాయి కుసు ఐలాండ్ ,పులావన్ బీచ్ ,సంతోసా ... కుసు,పులావన్ బీచ్లు ఏదో సరదాకి తప్ప అక్కడ ఏమి ఉండవు..అంటే బోట్ లో వెళ్ళడానికి,సైకిలింగ్ కి ,చిన్న చిన్న పార్టీలకు బాగుంటుంది ...కాని సంతోసా ముఖ్యమైనది దాని గురించి ఇంకో పోస్ట్లో రాస్తాను ...























ఇక సిటీ చూడాలంటే రేఫిల్స్ ప్లేస్,టాంజుంగ్ పాగార్,సిటిహాల్ ఇవన్నమాట..అక్కడికి వెళితే సింగపూర్ అంటే ఏమిటో తెలుస్తుంది :)


150 కామెంట్‌లు:

నేను చెప్పారు...

first comment naadenaa ??

శ్రీనివాస్ చెప్పారు...

ఓహో

మనసు పలికే చెప్పారు...

Akkaa.. chadivi vachi mallee comment pedata..:)

మనసు పలికే చెప్పారు...

అక్కా.. చాలా చాలా నచ్చింది నాకు ఈ టపా..:) పిక్చర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇన్ని ఉన్నాయి అని చెప్పి, చూడటానికి ఏమీ ఉండవని చెప్పారేంటక్కయ్యా..!
>>తార గారు బెండప్పరావుల దిష్ఠే దీనికి కారణమని నేను ప్రఘాడం గా నమ్ముతున్నాను.
హహ్హహ్హా.. టపా బాగుంది కాబట్టి పాపం వాళ్లకి తిట్లు ఉండవన్నమాట.

Rishi చెప్పారు...

ఎప్పుడూ మీ టపా లు చదువుతా గానీ కామెంటను రెగ్యులర్ గా. కానీ ఈరోజు మన ఊరుని అలా అనేసరికి ఆగలేక పెడుతున్నా. ఎంత మాట,మన ఊరిలో ఏమీ ఉండవా...

అసలు ఇక్కడి సీ ఫుడ్ రకాలు,can,can notలు,సింగ్లీషు,ఇండియన్ అంటే అరవవాళ్ళు మాత్రమే అనే భ్రమలో ఉండే ప్రజలు ఎక్కడయినా దొరుకుతాయంటారా?:)

సీరియస్ గా చెప్పాలంటే నాకు ఈ దేశం చాలా సేఫ్టీ గా అనిపిస్తుంది,శాంతి భద్రతల విషయం లో.
Btw,ఆ లాస్ట్ ఫొటో(Sands పక్కది) ఎక్కడి ఫొటో?

Sravya V చెప్పారు...

మీ ఈ పోస్టు తో సింగపూరు కి చాలా అన్యాయం చేసారు :(, ఈ నెల ఫుల్ బిజీ , కొద్దిగా టైం దొరకనీయండి , లింకులనీ మీ పోస్టుకు కామెంట్లు గా పెడతా :)

నేస్తం చెప్పారు...

అయ్యో రిషి గారు మనం అలాగే చెప్పాలి...అన్నీ ఉన్నా సరే ఏమీ లేవు ఏమీలేవన్నట్లు..ఇంకా సంతోసా,యూనివర్సల్ స్టూడియో గురించి రాయనేలేదుగా.. ఈ అమెరికా వాళ్ళున్నారే కుళ్ళోళ్ళు.. మా వూర్లో ఇంకా ఉన్నాయి అని పోజు కొట్టేస్తారు..పైన అపర్ణ చూసారా ఎలా పొగిడెసిందో..హే ఆ షిప్ లా ఉంది దాన్ని చూడలేదా మీరు ..భలే ఉంటుంది..హ్మ్మ్ ఎక్కడ అంటే హార్బర్ ఫ్రంట్ ఉంటుంది కదా ఆ దారిలో అండి.. అది కేసినో అంటా..ఇంకా హొటెల్ కూడా..దూరం నుండే చూసా నేను కూడా..

నేస్తం చెప్పారు...

>>>సీరియస్ గా చెప్పాలంటే నాకు ఈ దేశం చాలా సేఫ్టీ గా అనిపిస్తుంది,శాంతి భద్రతల విషయం లో.
హూం అదొక్కటే కాదు పరిశుబ్రత విషయంలో ఎన్విరాన్మెంట్ వాళ్ళ శ్రద్ద గురించి ట్రాఫిక్ గురించి .. ఇంకా చాలా విషయాల పై పోస్ట్ వేయాలి అనుకుంటున్నా రిషి గారు..కాని నాకైతే శ్రావ్య ,మీరు అయితే బాగా రాయగలరు అనిపిస్తుంది.. ఒక పోస్ట్ వేయకూడదూ ??/

నేస్తం చెప్పారు...

శ్రావ్యా లింకులొద్దు గాని పోస్ట్ రాయవా ప్లీజ్..

Sravya V చెప్పారు...

నేస్తం గారు మీరు మరీను రిషి గారు అడుగుతుంది మెరీనా సాన్డ్స్ పక్క ఫోటో :) రిషి గారు ఇది కాండో అండి Orchad ఏరియా.

Sravya V చెప్పారు...

అమ్మ నేస్తం గారు మీ అంత అందం గా రాయలేనని కదూ కొట్టారు దెబ్బ :)

నేస్తం చెప్పారు...

అయ్యబాబోయ్ శ్రావ్యా... నిజ్జంగా నిజ్జం.. మీరైతే బాగా రాయగలరు ...అంటే నాకు వివరాలు పూర్తిగా తెలియదు.... మీరు మంచి ఇంఫర్ మేషన్ ఇవ్వగలరని ..:)

రాజ్ కుమార్ చెప్పారు...

అయ్యో ... నాది కనీసం టాప్ టెన్ లో కూడా లేదే..! వాఆఆఆఆఅ.వాఆఆఆఆఅ...
మొత్తానికి మాకు సింగ పూర్ మొత్తం చూపించేశారు నేస్తం... పిక్చర్స్ మీరు తీసినవేనా? సూపెర్ గా ఉన్నాయ్...
ఎప్పటి లాగానే పోస్ట్ కేక..:)

Rao S Lakkaraju చెప్పారు...

సింగపూర్ గురించి సింపుల్ వర్ణన బాగుంది. ఓపికగా వ్రాసారు. థాంక్స్. నేను దాదాపు నెల రోజుల క్రిందట అల్బుకర్క్ అనే ఊరుకి బెల్లూన్ ఫెస్టివల్ కోసం వెళ్లి బోలెడన్ని హాట్ ఎయిర్ బల్లోన్స్ ఎగరవేస్తోంటే చూశాను. ఇంకా దాని గురించి వ్రాయటం కుదరలేదు.

Kalpana Rentala చెప్పారు...

@ నేస్తం,

మీ సింగపూర్ గురించి మీ టపా బావుంది. ఓ పదేళ్ళ క్రితం నేను టోక్యో వెళుతూ మధ్యలో ట్రాన్సిట్ పాసెంజర్ గా సిటి కొలోనియల్ టూర్ లాంటిదేదో ఒక రెండుగంటలు తిరిగి చూసాను. సింగపూర్ అనగానే చాలామంది లాగా నాకు కూడా కళ్ళల్లో మెదిలేది ఆ Merlion .

సినిమాల్లో సింగపూర్ కనిపించగానే నేను చూశానోచ్చ్ అని మళ్ళీ మళ్ళీ చెపుతూ వుంటాను పక్క వాళ్ళకు విసుగొచ్చేలాగా.

మనసు పలికే చెప్పారు...

అక్కయ్యా..
>>అయ్యో రిషి గారు మనం అలాగే చెప్పాలి....పైన అపర్ణ చూసారా ఎలా పొగిడెసిందో
హహ్హహ్హా.. మీకు సూ..పర్ తెలివితేటలు ఉన్నాయక్కా.. :) మీరు కేకో కేక..:)

హరే కృష్ణ చెప్పారు...

అక్కా మీ పోస్ట్ aggrigator లో కనిపించింది ఈ పేజి దొరకలేదు అని వస్తోంది అని నిన్నంతా refresh చేస్తూనే ఉన్నా..

హమ్మయ్య ఈరోజు పోస్ట్ వేసేసారు హ్యాపీ..

హరే కృష్ణ చెప్పారు...

మొత్తం పోస్ట్ మళ్ళీ రాసారా
అయ్యో..

టపా తో పాటు ఫోటోలు కూడా చాలా బావున్నాయి :)

హరే కృష్ణ చెప్పారు...

నేస్తం అక్కా..
సింగపూర్ grandprix జరిగే ట్రాక్ దానిపైన పెద్ద ఎత్తులో ఉండే flyovers ఫొటోస్ కూడా పెట్టండి వీలయితే..సింగపూర్ని కాస్త దగ్గర నుండి చూడడం సంవత్సరానికి ఒక్కసారే racing ఫోల్లోవేర్స్ కి

ఆర్చిడ్ పువ్వులు భలే బావున్నాయి
so beautiful!

మహిత చెప్పారు...

సింగపూర్ దేశం గురించి బాగా రాసారు నేస్తం గారు
i like it

మహిత చెప్పారు...

చైనీస్ గార్డెన్ దగ్గర స్విమ్మింగ్ పూల్ లో 2$ కే సూపరు
హ హ హ..అందుకే చైనావాడు.. చైనావాడే

apporva చెప్పారు...

i love your blog Nestam garu
anni posts okkati kuda vadalkunda reading
chaala bavundi anninu

కౌటిల్య చెప్పారు...

హమ్మింగ్ బర్డ్...నాకు భలే ఇష్టం లెండి.........అవునూ...హంసలున్నాయా! నిజ్జంగా........హంసలు మానససరోవరంలో తప్ప ఎక్కడా ఉండవని విన్నానే! అందునా నాలాంటి పాపాత్ముల కళ్ళకి అస్సలు కనబడవంటగా! మీరు చూశారంటే, ఎంత గొప్పవారో మీరు నేస్తంజీ!!!:-))

విశ్వనాథ్ చెప్పారు...

సింగపూర్ కి onsite కి వెళ్తే మీ పేరు చెప్పుకొని అన్ని ప్రదేశాలు తిరిగేయవచ్చు చాలా థాంక్స్

chala good post
pics kuda

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారూ.. చాలా బాగుంది మీ టపా..

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారూ.. ఎప్పుడెప్పుడు ఇంకో పోస్ట్ వేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను..:) చాలా బాగున్నాయండీ మీ సింగపూర్ విశేషాలు. నేనైతే ఎప్పుడూ సింగపూర్ వెళ్లలేదు కానీ, మీ పోస్ట్ చూశాక ఒక్క సారైనా వెళ్లాలనిపిస్తుంది.

Mahita

Unknown చెప్పారు...

singapore viseshalu chakkaga chepparu nestam.. photos kooda chaala baagunnai.. mukyam gaa aa orchids.. superb...
:)

అజ్ఞాత చెప్పారు...

ఆహా నేస్తం గారూ.. వేసేశారా కొత్త పోస్ట్.. నేను ఇంత లేట్ గా చూశానా..:( ఏదేమైనా బాగున్నాయండీ సింగపూర్ కబుర్లు.. పోస్ట్‌లు వెయ్యడంలో మీకు మీరే సాటి

చక్రధర్ చెప్పారు...

పోస్ట్ కాస్త చిన్నగా ఉన్నా బాగానే ఉంది

మనసు పలికే చెప్పారు...

వచ్చేశాడు కృష్ణ.. ఇక కామెంట్ల కౌంటర్ ఎత్తుకుని పోతాడు..:( మాకు ఎవ్వరికీ అవకాశం దక్కనివ్వకుండా..:(

అజ్ఞాత చెప్పారు...

ఎంత గొప్పవారో మీరు నేస్తంజీ!!!:-))
i second కౌటిల్య

రామరాజు చెప్పారు...

నేస్తంగారు. మీ పోస్ట్లా వల్ల సింగపూర్ గురించి ఎంతో తెలుసుకున్నం.. ఫోటోల్ చాలా బాగున్నాయి..

Aswini చెప్పారు...

చాలా మంచి పోస్ట్ వేశారు నేస్తం గారూ.. అదే చేత్తో మాకు తికెట్లు కూడా పంపిద్దురూ..:) అలా వచ్చి చూసేసి మళ్లీ ఇండియా వచ్చేస్తాము

Vishwanth చెప్పారు...

aftr so many days visiting your blog

good on but chinnadiga undandi

అజ్ఞాత చెప్పారు...

koutilya garu sooper ga chepparu

Aswini చెప్పారు...

బుక్ చేశారా అండీ నేస్తం గారూ టిక్కెట్లు.. ;)

అజ్ఞాత చెప్పారు...

nestam gaaru..! good post with great pics..but it is too small post.. waiting 4 ur next post .:) :)

sweta

ప్రవల్లిక చెప్పారు...

i missed your previous posts nestamn garu

jai చెప్పారు...

nestam ji memu singapore vachamani cheppake meeru post vesaru(na valle ani pogadandi)eesari vellevallaki upayogapaduthundi.food vishayam lo ithe sankranthi baledu. thanduri mariyu andhra curry hotal bagunnai.singapore lo naku baga nachinavi ఆర్చాడ్ గార్డెన్ okkate.asalu nachanidi santosalo butterfly garden.ticket konukkokamundu aha oho seethakokachilukala madya lo vihariddamanukunnanu(lopalakellaka chachinavi chusi chala badanipinchindi)so vellevarunte deeniki vellakandi money waste

మనసు పలికే చెప్పారు...

అక్కయ్యా..ఏదీ నా కామెంటు ఎక్కడ??:((
ఇక నిద్రొచ్చేస్తుంది.. రేపు పెడతా కామెంట్లు.. :)

jai చెప్పారు...

santasa lo singapoooraaa song super ma abbailu eppati ki ragalu theestaru

Sai Praveen చెప్పారు...

ఇంత చిన్ని పోస్ట్ మీదేనా? ఇది జాజిపూలు బ్లాగేనా? :P
బాగుంది అక్కా. ఎవరైనా సింగపూర్ ఒకటి రెండు రోజులకు వెళ్తుంటే ఏమేమి కవర్ చెయ్యాలో సింపుల్ గా చెప్పేశారు :)

jai చెప్పారు...

nestam garu meeku oka pani cheputha chesipedathani aasistanu.memu singapore vachinapudu baba gudiki velladam veelu avaledu aaphoto pettandi.memu novetal hotal unnamu.andulonumchi Clarke Quay river view chala chala bagunnadi.enka last evarina chachipovalante bangee ekkithe saripothundi chustene chala bhayam vesindi enka mimmalni vadilesta

అజ్ఞాత చెప్పారు...

thanks inka santosa migilina vati gurinchi kuda raseyandi. nenu recent ga Singapore vachenu . inka ekkadiki vellaledu.

అజ్ఞాత చెప్పారు...

Super eppatilane

హరే కృష్ణ చెప్పారు...

Evaru nannu pilichindi..nenu palikey :-)

హరే కృష్ణ చెప్పారు...

3rd comment chance kottesindi kakunda counter ani cheppi counter istava..hanna

shatabdi చెప్పారు...

Hmm..simple and good

హరే కృష్ణ చెప్పారు...

tour ki leaving..repu kalusukundam :)

హరే కృష్ణ చెప్పారు...

Aswini garu free ga singapore choosindi kakunda tickets pampamani adugutaraa :-o meere tirigi chellinchandi money to and fro charges
Camera charges plus laptop and internet charges

మంచు చెప్పారు...

కొంతమందికి అంతే... ఇంట్లొ చూసి చూసి జూ కెళితే బొర్ కొట్టి ఎడ్చినట్టు ఉంది అనిపిస్తుంది

ఇంతకీ సింగపూర్ టూరిజం వాడు మీకెంత కమీషన్ ఇస్తున్నాడు.. ఈ పబ్లిసిటికి
------
పై రెండు పాయింట్లు తార , బెండ అప్పారావ్ చేసిన బ్లాగుబడి వల్ల నాకు తెలీకుండానే నాలొంచి వచ్చేసినవి... సొ నాకేం తెలీదు

మంచు చెప్పారు...

ఆర్కిడ్స్... మట్టిలొ పెరగవు అనుకుంటా కదండీ... రాళ్ళు, కొబ్బరి పెంకులు, చెట్టు బెరడు ఎవెవొ వేసి పెంచుతారు... అసలు మట్టి లేకుండా అవి ఎలా పెరుగుతాయో ఆశ్చర్యం ..

3g చెప్పారు...

ఓహో..... సింగపూరంటే దట్టా..... ఐ థింకు వాట్టో... వాట్టు.

శివరంజని చెప్పారు...

మొత్తానికి మాకు సింగ పూర్ మొత్తం చూపించేశారు నేస్తంఅక్కా.. చాలా చాలా నచ్చింది నాకు ఈ టపా..:) పిక్చర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి .

Sasidhar Anne చెప్పారు...

ayyo..ayyoo.. pedda post rasthe motham egiri poyinda :( ,
Save option vaddochu kada akka.. hmm.. eesari mee post travel log la useful ga vundi.. ayina singapore lo meeru vundaga maaku enduku ivvani..

akkadiki ragane phone kottestha.. elagu meeru bava gari number istharu ga.. :) appudu nenu kooda cricket stadium loni annaya laga... bava bava.. 15 mins ki okasari phone chesthu.. neeku akshintalu padela sayisakthala try chestha..

రాజ్ కుమార్ చెప్పారు...

రండి బాబు..రండి .. నేడే చూడండి మీ అభిమాన జాజిపూలు బ్లాగ్ లో కొత్త పోస్ట్... "సిన్గపూర్ ".. చదవ చక్కని వ్యాఖ్యానం తో... చూడ చక్కని ఫొటోలతో.., కాణీ ఖర్చు లేకుండా మిమ్మల్ని సింగపూర్ తిప్పి చూపించే..
సరి కొత్త పోస్ట్..... dONT miss it... :)

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్కా.. అందరూ నా ఫార్ముల ఫాలో అయిపోయి ఫస్ట్ కామెంట్ నాకు కాకుండా చేస్తున్నారు..ప్చ్... చాలా కాలం తర్వాత పోస్ట్ చదివి, కామెంట్ పెట్టాల్సి వచ్చింది.. :( :( ::(

రాజ్ కుమార్ చెప్పారు...

బద్రి గారు, మనసు పలికే, శ్రీనివాస్ గార్ల వైఖరిని ఖండిస్తున్నాం...

సవ్వడి చెప్పారు...

:):):)

రాధిక(నాని ) చెప్పారు...

నేస్తం గారు బాగున్నాయి మీ సింగపూర్ విశేషాలు .ఫోటో లైతే చాలా బాగున్నాయి.

సవ్వడి చెప్పారు...

ఇందాకల మా సార్ వస్తుండడంతో అలా క్లోజ్ చేసేసాను.
పోస్ట్ బాగుంది.
అదేంటి నేస్తం గారు! మేము సింగపూర్ గురించి ఎంతో ఊహించుకుంటుంటే... అంత సింపుల్ గా తేల్చేసారేంటి..:)
మా అమ్మనాన్నలకు సింగపూర్ అంటే చాలా ఇష్టం. ఎప్పటినుండో చూడాలనుకుంటున్నారు. గత మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారనుకోండి. అది వేరే విషయం.:):)
ఇంకేవో చెప్పాలన్నారు కదా! అవి కూడా చెప్పేయండి. ఈ పోస్ట్, ఆ పోస్ట్ కలిపి ప్రింట్ తీసి మా అమ్మ నాన్నలకు చూపిస్తాను.:)

tnsatish చెప్పారు...

I had read your post one day before you posted it. It seems, you posted and deleted it immediately. In that case, many other people (like me) would get that post. So, I got that copy. If you had asked me or the bloggers, somebody would have replied with the entire post. You would not have retyped it again.

అజ్ఞాత చెప్పారు...

taara gaaru enti daridramgaa.

nenu ee post 1 day munde mee fans ki pampanu, meeru ala post pettagane nenu adi save chesukunnanu..

mee fans naaku thx cheppara chudandi..

release ki munde spl show vesi chupiste..

Taara

నేస్తం చెప్పారు...

బద్రి అవును మీదే :)
శ్రీనివాస్ ఓహో :)
అపర్ణ నేను పావు వంతు బాగం ఫొటోలు పెట్టలేదు.. ఏంటో పొటోస్ పద్దతిగా ఎలా పెట్టాలో కూడా తెలియడం లేదు..అందుకే అన్నమాట
రాజ్ కుమార్ పొటోస్ నేను తీసినవి కావు :( కాని బోలెడు పొటోస్ ఉండాలి మొన్న తను సిస్టెం ఫార్మేట్ చేస్తూ అన్నీ తీసేసారు.. ఒక్కటి లేదు.. అవి లోడ్ చేయండి అంటే ఒక చూపు చూస్తున్నారు..ఇక నెట్ ని ఆశ్రయించా
లక్కరాజు గారు థేంక్స్ అండి... మరి రాసే యండి ..
కల్పన గారు నిజమే సింగపూర్ అనగానే గుర్తు వచ్చేది merlion ... మీరూ అంతేనా..అదేం సినిమా అబ్బా నాగార్జునాది ..సాహసమే చెయ్ రా డింబక అనే పాట చూసినపుడల్లా నేనూ మా చెల్లెళ్ళతో అలాగే చూపిస్తూ సంబరపడిపోతా.. కాని ఒక్కళ్ళూ పట్టించుకోరు దొంగమొహాలు ..
హరే క్రిష్ణా నిన్న పోస్ట్ రాసి పొరపాటున సేవ్ కొట్టా బోయి ప్రచురించా.. ఆ తరువాత మార్పులు చేర్పులు చేసి చూస్తుంటే మొత్తం ఎగిరిపోయింది.. దాంతో కొన్నే పొటోస్ పెట్టా ..హే flyover తెలుసా..పోటోస్ ఎక్కువ అయిపోతున్నాయి అని పెట్టలేదు.. అక్కడికి వెళదాం అని తను గొడవపెట్టినా వెళ్ళను..నాకు కళ్ళుతిరుగుతాయి నేను రాను అని.. దూరం నుండి చూడటమే ..:)

నేస్తం చెప్పారు...

విశ్వనాధ్ గారు థేంక్యూ
మహిత థేంక్యూ
అపూర్వ థేంక్యూ
కౌటిల్య గారు భలే ప్రశ్న అడిగారు.. నేనూ అదే విన్నాను హంసలు హిమాలయాల్లో మానస సరోవరం లో మాత్రమే ఉంటాయని ... ఆర్చాడ్ గార్డెన్ లో చూసాను వాటిని మొదటి సారిగా.. ఒహ్ సూపర్ ఉంటాయి..చాలా అందం గా ఉన్నాయి ..అయితే బోలెడు పుణ్యం చేసుకుని ఉంటానంటారా :)మీరు ఇక్కడకు వచ్చేసి చూడండి మీ పాపం అంతా పోతుంది..హమ్మింగ్ బర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం భలే బుజ్జి బుజ్జి గా ఉంటాయి కదా..
అఙ్ఞాత గార్లు థేంక్యూ
అబ్బులు గారు థేంక్యూ ...అవునండి ఆర్కిడ్స్ చాలా బాగుంటాయి ..ఇక్కడా ఆ గార్డేన్ లో వేలాది పూలు భలే అందం గా ఉంటాయి..చూసి తీరాల్సిందే..
చక్రధర్ థేంక్యూ

నేస్తం చెప్పారు...

ఇక్కడ సగం కామెంట్శ్ ఎవరు ఇచ్చారో నాకు తెలుసు ..వాళ్ళకు బాగా దెబ్బలు పడతాయి ఇంకోసారి ఇలా చేస్తే :)
jai అయితే బోలెడు పొగడ్తలు మీకు :)సంక్రాంతి మొదట్లో బాగానే ఉండేదండి ..తరువాత చెత్తలా తయారయింది..ఆంద్ర కర్రీ పర్వాలేదు.. కాని నేను ఆదివారం తప్ప నాన్ వెజ్ తినను కాబట్టి ఎక్కడకు వెళ్ళినా టిఫిన్సే...కోమాలాస్ లో బాగానే ఉంటుంది..నాన్వెజ్ అయితే లిటిల్ ఇండియాలొ అంజ్ పార్ బాగుంటుంది ..హహహ్ బటర్ ఫ్లై పార్క్ కి వెళ్ళారా నేను ప్రత్యేకంగా ఒక పోస్ట్ రాయాలి సంతోసా గురించి అందులో రాస్తా ఆ పార్క్ గురించి :)
సాయ్ ఇంకా పూర్తిగా చెప్పలేదు :)
jai ఓహ్ మీరింకా సింగపూర్ లోనే ఉన్నారా... బాబా టెంపుల్ బాగుంటుంది అండి...ముస్తఫా దగ్గరే గా ,పెరుమాళ్ టెంపుల్ కి తిన్నంగా వెళితే అమ్మన్ టెంపుల్కి ఆనుకుని 3 వ అంతస్తులో ఉంటుంది...ఎంచక్కా వెళ్ళి రావచ్చుగా... హ్మ్మ్ పోటోస్ ప్రస్తుతానికి అయితే లేవు ...తరచు వెళతాను కాబట్టి ఈ సారి తీస్తా...

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా. 3g గారు సింగ్లిష్ బాగా నేర్చేసుకున్నట్లున్నారు..!!

మనసు పలికే చెప్పారు...

వేణురాం.. బాధ పడకు.. మళ్లీ నీకు రోజులొస్తాయి..:)

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు థేంక్యూ
శతాబ్ది థేంక్యు
హరే ఏం టూర్
>>>>>కొంతమందికి అంతే... ఇంట్లొ చూసి చూసి జూ కెళితే బొర్ కొట్టి ఎడ్చినట్టు ఉంది అనిపిస్తుంది
హా :O మంచు గారు ఎంత మాట అన్నారు
అవునండి మీరన్నాకే గుర్తు వచ్చింది ...ఆర్కిడ్ పూలు రాళ్ళూ గట్రా లాంటి వాటిలో వేస్తారు...మరి గార్డెన్ లో ఎలా పెంచారబ్బా???ఇప్పుడు నాకు గుర్తు రావడం లేదు... గార్డెన్లో నేను మట్టిలో చూసినట్లు గుర్తు...గొప్ప చిక్కే వచ్చిందే...మళ్ళీ వెళ్ళాలి అయితే
>>>ఓహో..... సింగపూరంటే దట్టా..... ఐ థింకు వాట్టో... వాట్టు
3G హహహహ సూపరు నాకంటేబాగా మాట్లాడేస్తున్నారుగా
శివరంజని థేంక్యూ
ఏమోలే శశి ఏమిరాసానో ఏం పోస్టానో నిన్న నిద్ర మత్తులో ..ఏంటి బాబు ప్రతి 15 నిమిషాలకు కాల్ చేస్తావా...అప్పుడంటే తిట్టి వదిలేసారు..ఇప్పుడు అయితే చితక్కొట్టెస్తారు ( నన్ను కాదు ... )

నేస్తం చెప్పారు...

వేణు :)
రాధిక థేంక్యూ
సవ్వడి గారు అంటే ముందు పోస్ట్ అనుకోకుండా డిలీట్ అయ్యింది ఇక ఓపిక లేక ఇలా అన్నమాటా..
సతీష్ ఓహ్ అవునా...అయితే ఈ సారి ఏదన్నా ప్రోబ్లెం వస్తే మిమ్మల్నే అడుగుతా...కాకపోతే నిన్న సగం రాసి సేవ్ చేయ బోయి ప్రచురించాను పోస్ట్...ఆ తరువాత డ్రాఫ్ట్లో పెట్టి ఇంకా చాలా రాసి కష్ట పడి పొటోస్ ఏడ్ చేసి మార్చ బోతుంటే మాయం అయ్యిందన్నమాటా:)

నేస్తం చెప్పారు...

తార గారు అవునా :P
పోనీ ఇప్పుడు థేంక్స్ చెప్పనా.. :D

అజ్ఞాత చెప్పారు...

adigoo malli naaku gaaru add chesaaru..

Taara..

హరే కృష్ణ చెప్పారు...

టూర్ ఏం లేదు
కాన్ఫెరెన్స్ ఉంటే గుజరాత్ కి వెళ్ళి వచ్చా :)

హరే కృష్ణ చెప్పారు...

ఆ రెండు flyover intersection హెలిపాడ్ లో చూపిస్తాడు వాడు టెలికాస్ట్.అందుకే బావుంటుంది అనుకుంటా

పోస్ట్ లో హమ్మింగ్ బర్డ్ ఫోటో టైమింగ్ చాలా బావుంది.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

సింగపూర్ కబుర్లు బాగున్నాయండి :-)

మొన్న నాకు కూడా ఈ బ్లాగర్ ఎడిటర్ తో ఇలాగే అయింది, ఖలేజా గురించి మరింత వివరంగా దదాపు ఏడెనిమిది పేరాలు రాసినదంతా ఒక్క ctrl+z తో మొత్తం ఎగిరిపోయింది దానికి తోడు కొంపలంటుకుపొయినట్లు ఆటో సేవ్ అవడంతో మళ్ళీ దొరకలేదు. చచ్చినట్లు మొత్తం తిరిగి రాసుకున్నాను.

అన్నట్లు చివరి నుండి రెండో ఫోటో భలే ఉంది ఆ ఆర్కిటెక్ట్ ఎవరో కానీ మెచ్చుకోకుండా ఉండలేకున్నాను.

అజ్ఞాత చెప్పారు...

ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

ఇట్లు,
సదా మీ సేవలో, మీ
అప్పి-బొప్పి

jai చెప్పారు...

memu singapore lo lemu march lo vachamu anduke baba photo kavali

jai చెప్పారు...

nestam ji meekanna bayam yekkuva naku flyover ekkadaniki akkada yekkanani pavuganta yedipinchanu andarini enka labham ledani mavaru lakkuni(thosukuni)vellaru.velleka thelisindi anavasaram ga ekkuva bayapadinattu chheeeemalaga unndi emi bayam ledu meeru thappakunda yekkandi lepothe meere miss avutharu.(mimmalni nannu kalipi bangelo kurchopettali appudu bayam thopau anni pothai ha ha ha)

3g చెప్పారు...

@అపర్ణ, నేస్తం: ఆ సింగ్లీష్ నా పాండిత్యం కాదండీ. పూరీ జగన్నాద్ ది, బద్రి సినిమానుండి కొట్టుకురాబడింది.

మంచు చెప్పారు...

గుజరాత్ లొ ఎక్కడకి వెళ్ళావ్ హరే ??? నీ పని బెటర్... ఎప్పుడూ బాగా తిరుగుతూ ఉంటావ్...

మంచు చెప్పారు...

హలో నేస్తం గారు...నేనేం అనలేదు... జూ గురించి అన్నది అంతా తారా, బెండప్పారావ్ ల బ్లాగుబడి వల్ల... వాళ్ళని తిట్టండి
వాళ్ళ దిస్టి వల్లే నాకు ఫస్ట్ కామెంట్ దక్కడం లేదు... :(

Sasidhar Anne చెప్పారు...

koteestharaaaa:( mm.. office lo busy ga vundatam valla comments discussion lo participation kudaratam ledu kani.. chelaregi ponu..

Aparna , venu and krishna sandadi chusthunte mucchata vesthundhi.. :)

Akka, Singapore vantakalu eppudu tinaledu.. first time tinnappudu vunde experience variety ga vuntundhi kada.. koncham alanti post okati rayandi.. chadivi meeru padina patlu chusi ananda padatham.. :)

హరే కృష్ణ చెప్పారు...

3g గారు ఇక్కడ బద్రి సినిమా గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే మన బద్రి వచ్చేస్తాడు జాగ్రత్త
:)

అసలే ఫస్ట్ కామెంట్ కొట్టిన ఆనందం లో పండగ చేసుకుంటున్నాడు swiss లో ;-)

హరే కృష్ణ చెప్పారు...

శశిధర్ అక్క ఆల్రెడీ రాసేసారు వంటల గురించి
మళ్ళీ durain ఫ్రూట్ మాట ఎత్తితే మిగతా వాళ్ళు నన్ను తంతారు ;)
ఇక్కడితో ఆపేస్తున్నా ఈ వంటల మేటర్

మన వ.బ్లా.స మార్పు శిఖామణి ఇప్పటి వరకు రాలేదేమిటో

హరే కృష్ణ చెప్పారు...

మంచు గారు
సూరత్ లో సెమినార్
మధ్యాహ్నం session బంక్ కొట్టి పారాహుషార్
clothes బావున్నాయి సూరత్ లో..షాపింగ్ చేసుకోచ్చేసా

నేస్తం చెప్పారు...

నాగార్జునా:D :D :D
తార :/.. మా గోదావరి అమ్మాయిని పట్టుకుని అండీ అనద్దు అంటారా..ఎంత బాగుంటుంది అలా అంటే.. అర్ధం చేసుకోరూ..
అవునా హరే ... మా తమ్ముడు(పిన్ని కొడుకు) గుజరాత్ లో ఉంటున్నాడులే..గుర్తు తెచ్చేసావ్ :)
వేణూ హబ్బా నాక్కూడా అలాగే ఆటోసేవ్ అయిపోయింది ...ఈ పోటోస్ ఏమో ఒక కంప్యూటర్లో ఒకలాగా మరొక దానిలో మరొక వరుస క్రమంలో కనబడుతున్నాయి స్క్రీన్లు తేడా ఉండటం వల్ల. అందుకే నాకు ఏం పోటో గురించి అడిగారో అర్ధం కాలేదు.. :)
అప్పి గారు నాకు నా బ్లాగ్ లో కామెంట్స్ కే టైం ఉండటం లేదు ఇంక మీ బ్లాగ్లో ఏం గోడవ చేయను చెప్పండి :)
jai హూం వెళ్ళాలి ..పిల్లల హాలీ డేస్ వస్తున్నాయి..ఇక మొదలు పెడతారు మళ్ళీ ..అప్పుడు కవర్ చేస్తా :)
3g :)
మంచు గారు అబ్బా భలే కవర్ చేస్తారండి :)

శశి ఫుడ్ గురించా.. ఊ రాస్తానులే..అయినా నాకు పెద్దగా తెలియదు బాబు ..అదిగో మంచు గారిని అడుగు ఇలాంటివి ..నరమామసం తప్ప అన్ని తిన్నారంట..మహానుభావులు..

సతీష్ చెప్పారు...

http://2.bp.blogspot.com/_koPmM5lpFHE/TMGc69z343I/AAAAAAAAAZc/XKjLiOy2iy4/s1600/pic.jpg

వేణూ ఈ ఫోటో గురించేనా మీరు అనేది

చక్రధర్ చెప్పారు...

మీరు తీసిన ఆ హమ్మింగ్ బర్డ్ ఫోటో చాలా బావుందండి

PBVSN Raju చెప్పారు...

సింగపూర్ కబుర్లు బాగున్నాయి. ఫొటోస్ చాలా బాగున్నాయి.మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు.మిగిలిన వాటి గురించి తొందరగా వ్రాస్తారుగా.....

కృపాల్ చెప్పారు...

జూ లో సఫారి కి వెళ్ళారా
ఇక్కడ హైదరాబాద్లో అంత అదృష్టం లేదు మాకు

రాజ్ కుమార్ చెప్పారు...

ఎవరిక్కడ అజ్ఞాత కామెంట్లు పెట్టింది?? ఎంత ధైర్యం??.. మళ్లీ ఇది రిపీట్ అయ్యిందో..ఆల్రెడీ నేను యశోద అంటి కోసం నూరిపెట్టిన కత్తి రెడీ గా ఉంది .. జాగ్రత్త.. :) :)..
నేస్తం అక్కా .. నేను గట్టిగ వార్నింగ్ ఇచ్చాను.. ఇక పెట్టరు లెండి..

రాజ్ కుమార్ చెప్పారు...

శశిధర్ గారు.. :) త్వరగా మీరు కూడా వచేయ్యండి మరి.. ఇంకా ముచ్చట గా ఉంటుంది..:)

హరే కృష్ణ చెప్పారు...

హ్మ్మ్.ఇప్పుడు ముంబై లో కూడా మీకు మరో తమ్ముడు ఉన్నాడు :)

హరే కృష్ణ చెప్పారు...

బాబూ రాజ్ కుమార్ ఎక్కడికి వెల్లిపోయావ్..
మీ ఊరు చేరుకున్నవా

రాజ్ కుమార్ చెప్పారు...

100 వ కామెంట్ నాదే అవుగాక..

హరే కృష్ణ చెప్పారు...

నాకెందుకో లాస్ట్ నుండి రెండో ఫోటో ఇంకా రియాలిటీ లోనికి రాలేదు అని అనిపిస్తోంది

హరే కృష్ణ చెప్పారు...

ఆ ట్రైన్ జూ మొత్తం ఉంటుందా..ac ట్రైన్ లో కూర్చొని హాయిగా జూ అంతా చూసేయోచ్చు

హరే కృష్ణ చెప్పారు...

:)))
నాగార్జున ఆ smiley లకు అర్ధం ఏమిటో కాస్త వివరిస్తావా :)

హరే కృష్ణ చెప్పారు...

sare
repu matladukundam
bye

జై జాజిపూలు
జై జై జాజిపూలు

Unknown చెప్పారు...

గుడ్ పోస్ట్ నేస్తం గారు.. మీ బ్లాగ్ లో పిక్చర్స్ చాలా బాగుంటై.. ఎప్పటి లానే బావుంది.. :)

నేను చెప్పారు...

నేస్తం గారు, మీ సింగపూర్ విశేషాలు బావున్నాయి.
సింగపూర్ లో జూ కూడా అంతేనా. ఇక్కడ జ్యూరిక్ జూలో కూడా అంతే ఏమి లెవ్వు, హైదరాబాద్ జూనే బెటర్ అనిపించింది.

---------
వబ్లాస సభ్యులారా ఇంకా ఎంతసేపు వందో కామెంట్ పెడదామని వెయిటింగ్ ఇక్కడ.

@హరేకృష్ణ, 3జి చెప్పిన డయలాగ్ కర్రేక్టే. so no issues :P

ఈ పోస్ట్ కి మొదటి కామెంట్ పెట్టే అవకాశం నాకోసం వదిలేసినా జాజిపూలు అభిమానులకి వబ్లాస సభ్యులకి ధన్యవాదాలు. నా కామెంట్ ఫస్ట్ ఎక్సెప్ట్ చేసినందుకు నేస్తం గారికి కూడా.(ఈ అవకాశం కోసం 4, 5 నెలలనుండి వెయిట్ చేస్తున్నా మరి)

Venkat చెప్పారు...

Namaskaram andi nestam garu
nenu challa rojulanundi blogs chaduvutunnanu
kaani ivvala mee blog chusanu
mundu okka singapore post chadivanu kaani ippudu mee blog lo oka padi postlu chadivanu
vaaaammmmooooo meeru raase okkokka post okko cinema tiyachandi babu anta clear ga vundi nenu ippudu minimum 2 hours continue ga chadivanandi your great

nice posts

అజ్ఞాత చెప్పారు...

ఇండియన్ అంటే అరవవాళ్ళు మాత్రమే అనే భ్రమలో ఉండే ప్రజలు ఎక్కడయినా దొరుకుతాయంటారా?:)

this may not be true, many singaporeans are aware of hindi, many of them have been visiting kashmir and taj mahal.

My 2 cents, Ramu.

రాజ్ కుమార్ చెప్పారు...

Congratulations..hare krishna..
100 neede...:)

రాజ్ కుమార్ చెప్పారు...

ఒకటీ దక్క లేదు.. 100 దక్కలేదు.. లాభం లేదు.. 200 కి ట్రై చెసుకోవాలి..

రాజ్ కుమార్ చెప్పారు...

హరే క్రిష్నా... హా.. క్షేమం గా చేరుకున్నా..
"ఆ ట్రైన్ జూ మొత్తం ఉంటుందా..అచ్ ట్రైన్ లో కూర్చొని హాయిగా జూ అంతా చూసేయోచ్చు"

ఏ.సి ట్రైన్ లోనా ? ఏ.సి ట్రైన్ ఉండదనుకుంటా..
(అద్దాల లోనుండి చూసె బదులు టీవి లో నే చూదొచ్చు కదా..?)
నేస్తం గారు.. ఇంతకీ అదేమి ట్రైనో చెప్పండి.. :) :)

రాజ్ కుమార్ చెప్పారు...

100 వ కామెంటు నాకు కాకుందా చేసిన హరే క్రిష్న.

రాజ్ కుమార్ చెప్పారు...

badri gaaru.. 5 nelala lone first comment kottesaara?? u r so lucky..
anyway congratulations.. :)

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కయ్యా.. మళ్లీ సెంచరీ.. అందుకోండి నా అభినందనలు..:)
హరే.. అభినందనలు 100 వ కామెంట్ నీదే అయినందుకు..:) పోనీలే పాపం అని నేనే నీకు వదిలేశా.. అందుకే ఇటువైపు రాలేదు నిన్నటి నుండి.. :)

మనసు పలికే చెప్పారు...

వేణు.. అలాగా కత్తి నూరి పెట్టావా బాబూ.. మంచి వాడివి.. :) బంగారు కత్తా..? ప్లాటినం కత్తా..? ;)

మనసు పలికే చెప్పారు...

కృష్ణ.. నీ కామెంట్ల కౌంటర్ కి నా జోహార్లు.. నీ కౌంటర్ ఎంత గొప్పది కాకపోతే, కరెక్ట్‌గా 100 అవ్వగానే ఆపేస్తావు కామెంట్లు పెట్టడం..!!:)

మనసు పలికే చెప్పారు...

3g గారు,
>>ఆ సింగ్లీష్ నా పాండిత్యం కాదండీ. పూరీ జగన్నాద్ ది, బద్రి సినిమానుండి కొట్టుకురాబడింది.
హహ్హహ్హా. అవునా.. నాకిప్పుడే ఒకటి గుర్తొచ్చింది.. గౌతం S.S.C. చిత్రంలో నవదీప్ టింగ్లీష్.. అబ్బో కేక.
Take, Took, Taken..

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కయ్యా..
>>అదిగో మంచు గారిని అడుగు ఇలాంటివి.. నరమామసం తప్ప అన్ని తిన్నారంట..మహానుభావులు.
అవునా.. :(

మధురవాణి చెప్పారు...

నేస్తం,
బాగున్నాయి మీ ఊరి విశేషాలు. :) హమ్మింగ్ బర్డ్ ఫోటో చాలా చాలా బాగుంది. :)

jai చెప్పారు...

nestam garu eeroju atlataddi chesukunnara

..nagarjuna.. చెప్పారు...

పోస్టుకు పులకించవాడనై, ఆనందము పొంగి ఉప్పొంగగ నోటమాట కరవై నా ముఖారవిందముపై విరిసిన చిరుమందహాసమునకు ప్రతీకలు ఆ చిన్నారి నవ్వులు - హరే, అర్ధమయిందా మళ్ళి చెప్పమంటావా :)

అపర్ణ అన్నట్టు ఆ కామెంటు కౌంటరు సీక్రెట్టు నాకొద్దుగాని నేస్తం అక్క పోస్టు రాసినవెంటనే తెలిసేట్టు ఏదైనా process ఉంటే చెప్పవా...కామెంటట్టుకు వాలిపోతా...

హరే కృష్ణ చెప్పారు...

జజ్జినక..జజ్జి నక..ఒన్స్ మోర్ ప్లీజ్
వంద నాదే..:) :)
యాహూ..వేణూ రామ్ అపర్ణ ఇద్దరికీ బోలెడు థాంకులు

..nagarjuna.. చెప్పారు...

వేణూరాం...నువ్వట్టా 200పై కన్నేసుంచు...మిగతా స్కెచ్చు నే తయారుసేత్తా...

వేణూశ్రీకాంత్ చెప్పారు...

సతీష్ గారు చెప్పిన ఫోటోనే నేస్తం గారు. http://2.bp.blogspot.com/_koPmM5lpFHE/TMGc69z343I/AAAAAAAAAZc/XKjLiOy2iy4/s1600/pic.jpg
అలా బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ గాలిలో తేలుతున్నట్లుగా చిత్రంగా ఉండి నచ్చింది.

3g చెప్పారు...

@హరే:
శతక్కొట్టినందుకు అభినందనలు. సంప్రదాయబద్దంగా నూటపదహార్లువ కామెంట్ చేద్దామనుకుంటే అదికూడా మిస్సయ్యింది.ప్లిచ్....

Ram Krish Reddy Kotla చెప్పారు...

అబ్బో మా చెన్నై కంటే మీ సింగపూర్ లో చాలా ఉన్నాయిగా....అయినా మా చెన్నై లో ఉన్నది, మీ సింగపూర్ లో లేనిది ఒకటి ఉంది... చెత్తా చెదారం, ముక్కులకు మాంచి గుభాళింపు అందించే మురిక్కాల్వలు, మాడి మసిచేసే ఎండలు..నిత్యం ధారాళంగా కారే చెమటలు...కనుక మా ఇంత విలాసవంతమయిన జీవితం మరొక నగరంలో ఉండదు...ఉండబోదు...అని బల్ల పగిలేలా గుద్ది రక్తాభిషేకం చేస్తున్నా :-))

అజ్ఞాత చెప్పారు...

Chala anyayam andi.Hyderabad lo Zoo nenu chusanu....akkadikante ikkadi Zoo chala baaguntundhi andi. Mana zoo lo Komodos, Kangaroos, Orangutans, unnaya. I dont think so.naakithe ikkadi Zoo baga nachindhi. ENtandi Singapore ni chala chinnaga chupincharu...unna lekunna dabba kottali kadha baga. Bird park lo Dyno world gurinchi kuda raayalsindhi. Naakithe nachindhi.Boonlay Discovery centrebaaguntundhi. Water park vishayam lo nenu meetho angeekaristhunna. Sengkang lo ithe$1 ticket... antha fun untundhi ikkada kuda.

Priya.

అజ్ఞాత చెప్పారు...

@ Venu Ram,

Aa train A/C Train ee... chala baaguntundhi View.konchem height lo travel chestham. chala colorful ga untundhi antha chudataniki. Memu vellina prathisari Rain padindhi..so inka bagundhi appudu.

రాజ్ కుమార్ చెప్పారు...

నాగార్జునా.. అద్ది .. నువ్వల హింటియ్యి.. పిచ్చేక్కిద్దాం..:)

ajnata gaaru tnQ very much..:)

రాజ్ కుమార్ చెప్పారు...

@మనసుపలికే
యశోద అంటీ కి బంగారం , ప్లాటినం అవసరమా? తుప్పట్టిన ఇనప కత్తి కి నూనె రాసి పెట్టా.. :) :)

రాజ్ కుమార్ చెప్పారు...

Ramakrishna Reddy Kotla గారు. సూపరు..:)
నేస్తం అక్కా..! సింగపూర్ లో రోడ్ల మీద ఇండియా లో లాగా కుక్కలు తిరుగుతాయా (డౌట్ :) :))?? బెంగళూరు లో మనుషుల కన్నా కుక్కలెక్కువలెండి :) :)

మనసు పలికే చెప్పారు...

నాగార్జున.. వాహ్వా.. వాహ్వా..:)
>>వేణూరాం...నువ్వట్టా 200పై కన్నేసుంచు.
మరి నేనో.. నాకు కదా నువ్వు సపోర్ట్...:)

హరే కృష్ణ చెప్పారు...

3g గారు ధన్యవాదాలు :)

పోస్టుకు పులకించవాడనై, ఆనందము పొంగి ఉప్పొంగగ నోటమాట కరవై నా ముఖారవిందముపై విరిసిన చిరుమందహాసమునకు ప్రతీకలు ఆ చిన్నారి నవ్వులు...

భావుకత ఉట్టిపడుతోంది..ఖరగ్ పూర్ హాల్$ లో ఏం జరుగుతోంది నాకు తెలిసి తీరాలి

హరే కృష్ణ చెప్పారు...

Aa train A/C Train ee... chala baaguntundhi View.konchem height lo travel chestham. chala colorful ga untundhi antha chudataniki. Memu vellina prathisari Rain padindhi..so inka bagundhi appudu.

అవును AC ట్రైన్ లో సఫారి బావుంటుంది అని మీరు చెప్పడం ద్వారా మరొక్క సారి రుజువు చేసారు

నేస్తం చెప్పారు...

సతీష్ :)
చక్రధర్ ఫొటోస్ నేను తీయలేదు :D నెట్ లో వెతికా :)
pbvsnరాజు గారు థేంక్యూ
కృపాల్ :) అయితే కుళ్ళుకోండి ..
>>>నేస్తం అక్కా .. నేను గట్టిగ వార్నింగ్ ఇచ్చాను..
వేణు అంటే నేను మరీ అంత అమాయకురాలిని కానన్నమాట :)
హరే కృష్ణ ..జూ మొత్తం ఉంటుంది కాని దానిలో చూస్తే ఎక్కువ ధ్రిల్ ఉండదని నడుచుకుని దగ్గర నుండి చూస్తాం.. నైట్ సఫారి లో ట్రాం మీదే వెళతాం ..
బద్రి అంటే హైద్రాబాద్ జూ గురించి కాదు బెంగూళూరో మరెక్కడో చెప్పారు అక్కడ బోలెడు ఉంటాయంట.. :)
వెంకట్ గారు ధ్నయ్వాదాలు ...మరి సినిమా ఎప్పుడు తీస్తున్నారు :) నా కధే కాబట్టి నన్నే హీరొయింగా పెట్టాలి మరి :)
మధురా థేంక్యూ :)
jai లేదండి ఈ మధ్య కొద్ది కారణాలవల్ల కాస్త బిజిగా ఉండి అసలే పండుగ ఎప్పుడో కూడా పట్టించుకోవడం లేదు :)

నేస్తం చెప్పారు...

నాగర్జున నీ చిరు నవ్వుల కారణం తెలియగానే ఉద్వేగభరితమైన ఆనందం తో కనులెంబడి నీరు వరదలా ప్రవహించు చున్నది.. బోలెడు తేంక్యూలు ..
వేణూ నిజమే బాగుంది కదా.
రామ క్రిష్ణ ఇక్కడ little india అని ఒక ప్లేస్ ఉంది .. అక్కడకు వెళితే ఆ జనాలను ఆ మార్కెట్లను చూస్తే చెన్నయ్యే చెన్నై ..:)తమ్ళియన్స్ ఎక్కువ కాని వీరికి ఉన్న ప్రాంతీయ అభిమానం ఇంకెవరికీ ఉండదు.. ఒక తమిళియన్ మరొక తమిళియన్ ని ఎంత అపూరం గా చూసుకుంటారో..ఒక పోస్ట్ వేయవచ్చు :)
ప్రియ :) ఏదో సరదాకి రాసానులే.. నిజానికి ఇంకొన్ని ఫొటోస్ పెట్టాలి..హ్మ్మ్ ఈసారి మిస్ చేయను ..

నేస్తం చెప్పారు...

కొద్ది కారణాల వల్ల జవాబులు ఆలస్యం గా ఇస్తున్నాను క్షమించగలరు :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఫొటోలు బాగా ఉన్నాయి. కధనం కూడా బాగుంది.
కానీ,
>>నిజంగా నిజం చెప్పాలంటే మిగిలిన దేశాలతో పోలిస్తే సింగపూర్ లో చూడటానికంటూ ఏం ఉండవు.
జూ కూడా ఏం బాగుండదు

దీని భావమేమి తిరుమలేశా? మమ్మల్ని సింగపూర్ రావద్దంటారా? వస్తే యశోదా ఆంటి కి అప్పచేప్పేస్తారా? లేకపోతే పార్కు లో కూచోపెట్టేస్తారా?

రాజ్ కుమార్ చెప్పారు...

"వేణు అంటే నేను మరీ అంత అమాయకురాలిని కానన్నమాట :)"

అంటే మీ ఉద్దేశ్యం ఏమిటక్కా? కొంపదీసి నేనే రాసానని అనుకుంటున్నరా ఏమిటి? మీ బదులు నేను వార్నింగ్ ఇచ్చాను అంతే .. మీకు హెల్ప్ చేద్దామని..:) :) వినాయక చవితినాడు చంద్రున్ని చూడక పొయినా నాపై నీలాపనిందలా !.. హేమిటో..! :) :)

నేస్తం చెప్పారు...

అయ్యబాబో సుభ్రమణ్యం గారు మీకు అలా అర్ధం అయ్యిందా .. అంటే ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే అన్నారని ఆ రకం గా ట్రై చేసా..:) మీరు నిరభ్యంతరం గా రావచ్చు నెక్స్ ట్ ఎపిసోడ్ రాసాకా మీకే తెలుస్తుంది :)ఎక్కడో పార్కులో కూర్చోవడం ఎందుకు ఎంచక్కా మా ఇంటికొచ్చేసేయండి.. :)
వేణు రాం ఇప్పటి వరకూ ఏం అనుకోలేదు ఇప్పుడిప్పుడే కంఫర్మ్ చేసుకుంటున్నా :)

అజ్ఞాత చెప్పారు...

మీ ఫ్యాన్స్‌కు చెప్పి నన్ను తిట్టించాలని ఇన్ని కుట్రలు పన్నుతారా????.... హన్నా....మా బ్లాగులో "చెత్తా చెదారం నిండిన సింగపూర్" అని దీనికి ఒక కౌంటర్ పోస్టేసి రివేంజ్ తీర్చుకుంటా...ఉహ్హుహ్హహ్హుహ్హుహ్హహాహా...

నాగప్రసాద్ చెప్పారు...

బాగుందండి మీ సింగపూర్...ఇప్పుడప్పుడే సముద్రాల్ని దాటకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి...మీ ఊరు చూసే ఛాన్స్ నాకు లేనట్టే... :-(

రాజ్ కుమార్ చెప్పారు...

కుట్ర అని పదానికి మాకు అర్ధాలు తెలీవు డాక్టర్ గోరు.. :):)
"చెత్తా చెదారం నిండిన సింగపూర్".. మీరు క్లినిక్ గాని ఓపెన్ చేస్తున్నారా సింగపూర్ లొ? ఇక్కడ లాగా వాడేసిన సిరెంజులు, దూదులు ఎక్కడ పడితే అక్కడ
పారెయ్యకూడదంటా .!:) :) :)

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్క గారికి, జాజిపూలు అభిమానులకు, వ.బ్లా.స మెంబర్లకు , అందరికీ దీపావళి శుభాకాంక్షలు..:)

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కయ్యా.. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..:

అజ్ఞాత చెప్పారు...

hai i am radhika from bangalore.
mee blog regular ga chushunnanu,chalaa bagundi.meeru rasina paddati,saradaga andaram kalasi kaburlu cheppukontunatluga anipinchindi.meeru rasindi chadivite chalaa hayee gaa anipinchindi.
thank you
nice meeting you
radhika

Sasidhar Anne చెప్పారు...

akka. naa blog lo kotha post rasanu chudagalaru..

sasi-anne.blogspot.com

Rakesh చెప్పారు...

Hammaiah.. 3 days nunchi knchm knchm chadivite ippudaipoindi mee blog mottam chadaavtam.. inni rojulu enduku miss ayyano ekkada miss ayyano ardam kavatledu.. ipatnunchi regular ga chustunta :)

నేస్తం చెప్పారు...

అప్పారావు గారు ..ఇది మరీ బాగుంది మధ్యలో మా ఊరేం చేసింది మిమ్మల్ని:)
ఏం పాపం నాగా అంత కఠోరమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావ్ :)
రాజ్,అప్పు :)
రాధికా,రాకేశ్ లేట్ గా ఇస్తున్న రిప్లయ్ కి క్షమాపణలు..మీ అభిమానానికి బోలెడు ధన్యవాదాలు
శశి రిప్లయ్ ఇచ్చాను :)

నేను చెప్పారు...

nestam gaaru,
Replies okay
kotha post eppudaaa ani fans waiting ikkada

గీతాచార్య చెప్పారు...

ఏమిటి నేస్తం, ఈ మధ్య కనా బడా ఠమ్ లేదు?

నేస్తం చెప్పారు...

బద్రి నిజ్జంగా ??ఒట్టుగా ??
గీతాచార్య గారు ఊరికే నాగురించి తలుచుకుంటారో లేదో అని :)

నేను చెప్పారు...

నేస్తం గారు, అభిమానుల కళ్ళు కాయలు కాచి పళ్ళయిపోయి రాలిపోయి వాటి విత్తనాలు మొలకెత్తి మళ్ళీ కాయలు కాయడానికి రెడీ అయిపోతున్నాయి :(

రాజ్ కుమార్ చెప్పారు...

అభిమానులకు శుభవార్త.... జాజిపూలు లో కొత్త పోస్ట్ పడింది అని మధ్యాహ్నం ఆఫీసు లో నిద్రపోయినప్పుడు కలొచ్చింది ...:) :) మిట్ట మధ్యాహ్నం వచ్చిన కలలు నిజమవుతాయని హరేకృష్ణ చెప్పాడు ..
కాబట్టీ వ.బ్లా.స మెంబర్లకు విజ్ఞప్తి.... కామెంట్ల వర్షం కురిపించడానికి సిద్దం గా ఉండండి... :)

రాజ్ కుమార్ చెప్పారు...

బద్రి అన్నారు...
nestam gaaru,
Replies okay
kotha post eppudaaa ani fans waiting ఇక్కడ

అబ్బా మళ్లీ మొదటి కామెంట్ పెట్టేద్దామనే.???