27, సెప్టెంబర్ 2010, సోమవారం

యశోదా ఆంటీ

'యశోదా ఆంటీ' మన ఇంటి ఓనరు అని పరిచయం చేయగానే నేను హలో అని పలకరించడానికి బదులు 'ఆ 'అంటూ నోరు వెళ్ళబెట్టాను ...మా ఆయన మాటి మాటికి 'యశోదా ఆంటీ ','యశోదా ఆంటీ' అంటుంటే ఇంత లావున ఒక 45 -50 మధ్యవయసు మహిళను ఊహించుకున్నాను గాని ,ఇలా సన్నగా,తీగలా పాతికేళ్ళ అమ్మాయిలా ఉంటుంది అనుకోలేదు ....వచ్చిన కొత్తల్లో మా ఆయన ఆఫీస్ కి వెళ్ళేటపుడు బస్ స్టాప్ వరకు నేనూ తోడు వెళ్లి టాటా,టాటా బై బై లు చెప్పి వచ్చేదాన్ని..ఇప్పుడు ఆయన గుమ్మం దగ్గర నుండి వెళ్ళొస్తా అంటే నేనూ వంట గదిలో నుంచి 'ఆ ' అని అరుస్తా తప్ప అడుగుముందుకేయను అది వేరే విషయం అనుకోండి ...

సరే దారంతా ఒకటే తిట్లు తిట్టాను తనని.."అంత చక్కని అమ్మాయిని పట్టుకుని ఆంటీ అని పిలవడానికి మీకు నోరు ఎలావచ్చిందండి ?.. పాపం అనిపించలేదు? ఆవిడ కాబట్టి ఊరుకుంది ..అదే ఇంకొకరైతేనా !!!".. అని ఆవేశం గా తిట్టిపడేసాను..."'అమ్మాయా'?ఇంకా నయం పసి పాప అనలేదు ...ఆవిడకు 40 పైనే ఉంటాయి.. అయినా వాళ్ళాయనే ఇంటి రెంట్,వగైరాలు మాట్లాడినపుడు 'ఆంటీ 'ని అడుగు అంటాడు ...సరే అని కంటిన్యూ చేసేసా అన్నారు".. దీన్నే 'అసూయ' అంటారు...వాళ్ళ ఆయనకు కుళ్ళు ... నేను మాత్రం ఆంటీ అననుగాక అనను ....ఒక స్త్రీ హృదయం మరొక స్త్రీ కే తెలుస్తుంది అండీ అనిక్లాస్ పీకి ఇంటికొచ్చాను ...

సరా సరి వంట గదిలోకి వెళ్ళగానే మీ యజమాని వెళ్ళిపోయాడా? అంది ఆమె ... మా యజమానా? అంటే ఇంటి ఒనరా?ఆయనఎక్కడున్నారో నాకెలా తెలుస్తుందబ్బా? అనుకుంటుండగా ..."ప్రియా దోసె నెడుతుకో" అంది.. దోశ ని ఎత్తుకోవడం ఏంటా? అని అయోమయం గా చూస్తుంటే వాళ్ళ పెద్ద అమ్మాయి గభ, గభా ప్లేట్ లో దోశలు వేసుకుని వెళ్ళింది..అదొక్కటే కాదు" గోత్తిల్లె","జిల్లున" ఇలాంటి అనేక కొత్త కొత్త పదాలు వింటూ ఆక్చర్యం గా చూసాను ..నాకు అప్పటికి గోదావరి యాస తప్పా రెండో యాస తెలియదు ...

" మీరు ఆంధ్రాలో ఎక్కడ అండీ "?అన్నాను ఆరాగా... నా మనసు చదివేసినట్లు నా భాష చూసి తికమకపడుతున్నావా? మా నాన్న గారు తెలుగు వారు ,అమ్మ తమిళియన్ కాని నేను పెరిగింది బెంగళూర్ ...అందుకని ఆ మూడు భాషలూ వచ్చు ఇంకా హిందీ,మలయాళం కూడా అనర్గళం గా మాట్లాడుతా తెలుసా అంది... "అమ్మో ఎంత గ్రేటండి మీరు నాకుతెలుగే పూర్తిగా రాదు" ...అన్నాను మెచ్చుకోలు గా చూస్తూ ..."నీకో విషయం తెలుసా నేను ఏదైనా ఇట్టే పట్టేస్తా ... కాని పదవతరగతి తోనే నా చదువు ఆపేసి పెళ్లి చేసేసారు .. అయినాఊరుకోకుండా మిషన్ నేర్చుకుని ఇక్కడ బట్టలు కుడుతున్నా..ఒక్క జాకెట్ కే 50 $ తీసుకుంటా ..ఇంకా మలయ్,చైనావాళ్ళ సాంప్రదాయ దుస్తులు కూడా కుడతా అంది"... అమ్మో!!!" మీరు చాలా చురుకైన వారండీ "అన్నాను... అందుకే నా ఫ్రెండ్స్అందరికీ నేను అంటే కుళ్ళు ...నిన్న ఒకఆమే ఏమందో తెలుసా ...నీ ఇంట్లో ఎవరూ రెండు నెలలకు మించి ఉండరూ,తట్ట,బుట్టా సర్దుకుని పారిపోతారు అంది..నువ్వు చెప్పు నేను పొగరు దానిలా కనబడుతున్నానా? మా ఇల్లు వదిలి వెళ్ళిపోతారామీరు అంది ? ... ఛ ఛ అలా ఎందుకు చేస్తాం ? అయినా అదేం ఫ్రెండ్ అండి అంతలా మొహం మీద అలా ఎలా అంటారు ? అనిబోలెడు హాచ్చర్య పడిపోయి మాట ఇచ్చేసా ..

ఆ సాయంత్రం మా ఆయన రాగానే .. యశోద గారు ఎంత మంచోరో తెలుసా!! ...బోలెడు చురుకైన వారు ...పాపం ఒక అమ్మాయి ఇలా అందంట అని ఇంకో రెండేసి ఆ అమ్మాయి మీద కోపం వచ్చేలా చెప్పాను మా ఆయనకు.. ఏమోలే ,మన కెందుకు వాళ్ళ గొడవలు.. అయినా ఆవిడ కూడా అంత తక్కువదేమి కాదు..నువ్వు మధ్యలోకి వెళ్ళకు అన్నారు..ఛీ ఈయనకు ఇంత కూడా జాలి లేదు ,ఎప్పుడు మనకెందు,మనకెందుకు అని అనడం తప్ప అనేసుకుని పడుకున్నాను...

ప్రొద్దున్నే వంట చేసేసి మా వారికి బాక్స్ పెడుతుండగా ఆమె వచ్చింది ... నేను పలకరింపు గా నవ్వ గానే నీ నైటీ చాలా చెత్తగాఉంది లూజు లూజుగా ..నీకు సెలక్షన్ తెలియదనుకుంట అంది.. ఇదేంటబ్బా ఇంత మాట అనేసింది నిన్నేగా పరిచయంఅయ్యాను అనుకుని ఏమోలే మరీ బాలేదేమో అనుకుని ..ఇక్కడకొచ్చిన హడావుడి లో ఏదో కొనేసా అని వెళ్ళ బోతుంటే,నిన్న వంట చేసినపుడు ఆ ప్రక్కన ఉల్లిపాయ తొక్క వదిలేసావ్ ..ఇల్లు శుభ్రం గా పెట్టకపోతే నాకు చిరాకు ... ఇక మీదట ఏమీతేడా రాకూడదు తెలిసిందా అంది...నాకు కొద్దిగా బాధ కలిగింది అలా కొట్టినట్లు మొహం మీద చెప్పేసరికి.. 'ఊ' అనేసి నా గదిలోకి వచ్చేసాను ...

అక్కడి తో ఊరుకుందా !!! తోమిన పాత్రలు వంట గదిలో షెల్ఫ్ లో పెట్టద్దు నీ బెడ్ రూం లో పెట్టుకో అన్నాది...దణ్ణం పెట్టుకోవడానికి దేవుడిగదిలోకి వెళ్లబోతుంటే ఆ రూం లోకి వెళ్ళకు దాని నిండా వెండి సామాను ఉంది అనేసింది.. ఇక తప్పక దేవుడా తప్పు చేస్తే సారి అని దణ్ణం పెట్టుకుని ...బెడ్ రూం లోనే ఒక మూలాన జాగ్రత్త గా పెట్టుకున్నాను ... మా ఆయనకు చెప్పితే అయ్యోపాపం అలా అందా అని జాలిపడక పోగా ,వెనకేసుకుని వచ్చావుగా నీకలాగే అవ్వాలి అని అంటారేమో అని భయం వేసి నోరుమూసుకునిఉన్నాను..

ఇంక ఆ మరుసటి రోజునుండి ఆంటీ విశ్వ రూపం చూపడం మొదలు పెట్టింది.. ఆమ్లెట్ వేద్దాం అంటే ఈ రోజుసోమవారం నాన్ వెజ్ వండటానికి ఒప్పుకోను అనేది.. ఒక్క సోమవారం కాదు గురు ,శుక్ర ,శని వారాలు కేవలం వెజ్ మాత్రమేవండాలి..పోనీ మిగిలిన రోజుల్లో అయినా వండుకోనిస్తుందా అంటే నాకు సీఫుడ్ నచ్చదు అందుకే ఫిష్,ప్రాన్ వండకూడదు...మటన్ వాసన మా పిల్లలకు పడదు కాబట్టి చికెన్ మాత్రమే వండాలి లాంటి కండీషన్లు సవాలక్షా పెట్టేది ....పోనీ ఆవిడకు నిజంగా ఆ వాసన పడదా అంటే మా మమ్మీకి ప్రాన్ కర్రి చాల ఇష్టం ..హోటల్ కి వెళితే అదే ఆర్డర్ చేస్తుంది అని పిల్లలు ఎప్పుడన్నా కబుర్ల మధ్యలో చెప్పేవారు

బాబోయ్ షేరింగ్ ఇల్లు అంటే ఇన్ని కష్టాలు పడాలా అని ఏడుపోచ్చేసేది కాని ఈ విషయాలు మా ఆయనకు చెప్పగానేపదా,మనకు ఈ ఇల్లు వద్దు అని ఏ చైనా దాని ఇంటికో,మలయ్ వాళ్ళ ఇంటికో తీసుకు వెళ్ళిపోతే నా గతి ఏం కాను?? కనీసం ఈవిడ చెప్పేది అర్ధం అవుతుంది ...వాళ్ళు తిట్టినా అర్ధం కాదు అని గప్,చిప్ గా సర్దుకు పోయేదాన్ని ...

ఇవన్నీ కూడా పర్వాలేదు .. ఆవిడ ఫ్రెండ్స్ వస్తే మటుకు నాకు నరకమే .... మాంచి నిద్రలో ఉండగా దభ ,ధబా అని తలుపులుబాదేసి లేపేసేది..నేను నవ్వుతూ వాళ్ళను విష్ చేయగానే వాళ్ళందరికీ గాజర్ హల్వా నో,రస మలయ్ నో కప్పుల్లో వేసి ఇచ్చివాళ్ళ మధ్యలో నన్ను కూర్చో పెట్టి నాకు ఇచ్చేది కాదు ...వాళ్ళందరూ మీరూ తినండి అనేవారు మొహమాటం గా ..ఏంటితినేది నా మొహం ...నాకు అక్కడ కూర్చోవాలో తెలియదు..వెళ్లి పోవాలో అర్ధంకాదు .. మొహమాటం గా నవ్వి ఊరుకునేదాన్ని...పోనీ అక్కడి తో వదిలేదా!!! మొన్న ఒక ఆమె నీ ఇంట్లో ఎవరూ ఉండలేరు అన్నాది అంటే నువ్వు నాలుగు దులిపేసావ్ కదా ఆవిడే ఈవిడ అని పరిచయం చేసేది.. ఇక మా ఇద్దరి మొహాలు చూడాలి ... ఓర్నాయనో ఈవిడేంటిరా బాబు అనుకుని తేలు కుట్టిన దొంగల్లా ఇద్దరం కిమ్మన కుండా కూర్చునే వాళ్ళం ...
అన్నిటికన్నా కష్టమైన కండీషన్ ఏమిటంటే గట్టిగా మాట్లాడ కూడదు,నవ్వ కూడదు.. ఇది మాత్రం నా వల్ల అయ్యేది కాదు.. కాని ఏం చేస్తాం భరతనాట్య కళాకారిణిలా .. కళ్ళతోనో, సైగల తోనో అనేక హావ భావాలు చూపెట్టి ఆయన గారిని భోజనానికి పిలిచేదాన్ని.. ఆ దెబ్బతో మా ఆయనకు మహా విరక్తి వచ్చేసి మనమేమన్నా ఊరికే ఉంటున్నామా? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అని హుంకరించేసేవారు.. బాబ్బాబు ఎందుకులేద్దు గొడవ అని సర్ది చెప్పేదాన్ని..

అలా ఎన్నాళ్ళని ఊరుకోబెడతాం ..ఒక శుభ ముహుర్తానా తెల్లవారు జామున మా ఆయన మాంచి నిద్రలో ఉండగా చేతిలోఉన్న అన్నం గిన్నె 'డాం' అని ఎత్తేసాను... ఇంకేంటి గిన్నె తో పాటు నా తల కూడా బ్రద్దలై పోయింది మా ఆయన తిట్లతో ..వెళ్లి ఆవిడను ఇంకో అర అడుగుతావా లేక నన్ను అడగమంటావా అని...ఇక తప్పక భయ పడుతూనే వెళ్లాను.. ఇంకో అరకావాలి ..నాకు సామాను పెట్టుకోవడానికి సరిపోవడం లేదు అన్నాను... అలా అడిగేస్తే ఎలా ? నాకు కుదరదు ..అయినా ఇల్లునీకు ఇవ్వలేదు ,మీ ఆయన్ని వచ్చి అడగమను అంది సింపుల్ గా .. నాకు ఏడుపోచ్చేసి మా ఆయనదగ్గరకు వచ్చాను ... నీకసలు బుద్ధి ఉందా !! చిన్న మాట అంటే చాలు నామీద ఇంట ఎత్తున ఎగురుతావ్ ..అలా అంటే ఆవిడకు సమాధానం చెప్పడంచేతకాదా ..దేనికి పనికోస్తావే అని విసుగ్గా యశోద దగ్గరకు వెళ్లి మీకు ఇంకొక అర ఇవ్వడం కుదరనపుడు మాకు ఇక్కడ ఉండడం కుదరదు .. ఈ నెల ఆఖరున ఇల్లు ఖాళీ చేసేస్తాం అని చెప్పేసి ఆఫీస్ కీ వెళ్ళిపోయారు...

ఆ రోజు యశోద ఉండగా బయటకు వస్తే ఒట్టు.. తలుపులేసుకుని ఇంట్లోనే ఉన్నాను.. అసలే కొత్త దేశం అంటే మళ్లీ కొత్త ఇల్లు కొత్త పరిసరాలు..ఎలారా దేవుడా అని భయపడుతుంటే ఆ రాత్రి మావారు ధైర్యం చెప్పారు.. అందరూ ఈమెలానే ఉంటారా ? అసలు మొదటి నుండిఈవిడ పద్దతి నచ్చలేదు ..ముందు ఒక రెంట్ చెప్పింది..తీర ఇంటికొచ్చాకా లేదు లేదు అని ఇంకో యాభై ఎక్కువ ఇవ్వాలని గొడవ ...ముందు ఏ.సి తో కలిపి అంది ..మళ్లీ కాదు అంది ..తెలుగు అమ్మాయి కదా అని నీ కోసం ఊరుకున్నా ...ఏం పర్వాలేదులే.. నువ్వు ఏం ఆలోచించకు అన్నారు ..

రెండు రోజులు పోయాకా వంట చేయడానికి బయటకు వస్తే ఇంకొక అర ఖాళీ చేసి ఉంది ... ఆ అర వాడుకో ..సరిపోతుందాఅంది.. 'ఊ ' అన్నాను ఈవిడ ఏమిటిరా ఇలా ఒప్పేసుకుంది? అని తెగ హాచ్చర్య పడిపోతూ .. ఆ రోజు రాత్రి మావారికి చెప్పాను.. ఏమండీ అర ఇచ్చేసింది ఇక ఎక్కడికీ వెళ్లక్కరలేదు అన్నాను తేలిగ్గా ఊపిరి పీలుస్తూ.. నీ కసలు సిగ్గులేదే ..నాలుగు తన్ని కొబ్బరి నూనె రాస్తే చాలు అంతా మర్చి పోతావ్..వద్దని చెప్పానుగా ..ఖాళీ చేసేద్దాం అన్నారు ... ఇంకేమన్నా తిడతారనిమాట్లాడలేదు..

కాని ఆ తరువాత నుండి యశోద ఆంటీ లో చాలా మార్పు వచ్చింది ...నన్ను చాలా ప్రేమ గా చూసుకోవడం మొదలుపెట్టింది..నాకు ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది ...తరువాత వెంటనే పోతుంది అని తన కోపానికి కారణాలు చెప్పింది.. వాళ్ళ ఇంట్లోవిషయాలు,తన చెల్లెళ్ళ గురించి ...ఇన్నాళ్ళు తను పడ్డ కష్టాలు అన్నీ నాకు చెప్పేది.. నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడం ఇష్టంలేదు..మావారి జాబ్ పోయింది ..ఇక పిల్లల చదువు ,ఇంటి బాధ్యత అన్నీ నా పై పడ్డాయి అని చెప్తుంటే నాకు ఏమో చాలా బాధ అనిపించేది..ఇటు చూస్తే ఈయన ససేమిరా అనేవారు ...

ఒక రోజు ఇల్లు చూడటానికి నన్ను తీసుకు వెళ్ళారు కూడా ... ఆవిడ పేరు కిరణ్..ఆ ఇల్లు ఇద్దరు ఆడవాళ్ళు కలిపి తీసుకున్నారు ..అందులో ఒక ఆమె వెళ్ళిపోవడం తో మాకు రెంట్ కి ఇవ్వడానికి ఒప్పుకుంది ...ఇల్లు చాలా బాగుంది .. కానినాకెందుకో ఆవిడ నచ్చలేదు..తను చాలా ఫాస్ట్ కల్చర్ అమ్మాయి లా ఉంది ..నార్త్ ఇండియన్ అనుకుంటా..నా మనస్తత్వానికి పూర్తీ విరుద్ధమైన ఆవిడ .. పైగా భాష తనది నాకు అస్సలు అర్ధం కావడం లేదు.. మా ఆయన వీపు గోకుతూ ఉహుహు అని గునుస్తున్నా గాని నువ్వు ఆగు అని ఈయన గారు రెంటు వగైరాలు మాట్లాడేస్తున్నారు..

భయటకు వచ్చేసాకా ,ఇది మంచి ఇల్లుబుజ్జీ ..చక్కగా ఆఫీస్ కీ దగ్గర... మధ్యాహ్నం ఎంచక్కా ఇంటి కొచ్చి భోజనం చేసి వెళ్ళచ్చు.. బస్ చార్జీలు గట్రా ఉండవు .. అనిఒప్పించే ప్రయత్నం చేసారు .. కాని యశోదకి మనం గట్టిగా చెప్ప లేదు కదా ఖాళీ చేసేస్తాం అని ...అందులోను తను అర కూడా ఇచ్చేసింది ..పాపం అండి మాట దురుసు గాని మనిషి మంచిది అన్నాను... ఏమోనే నేను తనని నమ్మను .. ఈ రోజు ఊరుకుని మళ్లీ ఎప్పుడో మొదలు పెడుతుంది.. మనకెందుకు వాళ్ళ గోల ...ఆ రోజు చెప్పానుగా ఖాళీ చేసేస్తాం అని ఇక ఊరుకో అన్నారు...

ఆ మరుసటి రోజు వరలక్ష్మి పూజ ఘనం గా చేసింది తను.. నన్ను పిలిచి బొట్టు పెట్టి పళ్ళు,జాకెట్టు ముక్క పెట్టింది..నాకెందుకో తను అంత ఆప్యాయం గా చూస్తుంటే ..ఇంకో రెండు రోజుల్లో అలా వదిలేసి వెళ్ళిపోవడం నచ్చలేదు ...అసలు ఖాళీ చేసేస్తాం అంటే ఆంటీ ఎలా ఫీల్ అవుతుందో? తను కష్టాల్లో ఉండ బట్టే కదా పాపం ఇష్టం లేక పోయినా అర ఇచ్చింది..ఓనర్ అన్నాకా ఇల్లు శుభ్రం గా ఉంచమనే అంటారు.. నేను మరీ ఎక్కువ ఊహించుకున్నాను..అయినా ఆమె తో కోపం గా మీరు అర ఇవ్వక పొతే ఖాళీ చేసేస్తాం అని బెదిరించాం కాని నిజంగా అనేసాం ఏంటీ?తను ప్రిపేర్ కాకుండా ఇలా అన్యాయం గా వెళ్లి పోవచ్చా??మోసం చేస్తున్నామా ?తప్పు కదూ ?? నా అంతరాత్మ నన్ను శుబ్రంగా ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసేసింది ..

ఆ రోజు రాత్రి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాను మా ఆయన దగ్గర ..నేను రాను ..నాకిక్కడే బాగుంది..నాకు ఆ అమ్మాయి నచ్చలేదు..నేను అక్కడ ఉండలేను... ఆంటీతో కోపం లో అన్నాం గాని నిజంగా అనలేదు కదా ..ఎల్లుండి ఖాళీ చేసేస్తాం అంటే వాళ్ళు ఏమనుకుంటారు అని ముక్కు చీది మరీ బ్రతిమాలాను..సరేలే ఏడవకు కిరణ్ కి ఇంకా విషయం చెప్పలేదు కదా ... రేపు తనకు రానని చెప్పెస్తాలేఅని అన్నాక గాని స్థిమిత పడలేదు ....

ప్రొద్దున్నే మావారు ఆఫీస్ కి వెళ్ళడానికి భయటకు రాగానే సాయంత్రం లోగా ఇల్లు ఖాళీ చేసేయాలి అంది దారికి అడ్డం గానించుని.. నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను.. ఆ రోజు ఇల్లు ఖాళీ చేసేస్తాను అన్నారుగా ..మర్చిపోయారా .. ఈ రోజే లాస్ట్ డేట్ ..ఖాళీ చేయండి అంది కోపంగా ... నేను అయితే మాట లేక నించున్నా అంతే... మా ఆయన మాత్రం కూల్ గా మేము మీ ఇంట్లో జాయిన్ అయింది 28 ఈ రోజు 27 రేపు ఖాళీ చేస్తాం అన్నారు..కుదరదు ఇప్పుడే ఖాళీ చెయ్యాలి మొండి కేసింది ...వాళ్ళాయన అగ్రిమెంట్ కాగితాలు తీసుకుని ఆవేశం గా మా ముందు పడేసారు ..చెక్ చేస్తే 28 అని ఉంది ..హమ్మయ్యా అనిఊపిరి పీల్చుకున్నా ... ఆవిడ మాట్లాడకుండా లోపలి వెళ్ళిపోయింది ..

దారిలో మావారు ..నేను చెప్పానా !!! నమ్మకే ఎవరినిపడితే వాళ్ళను అని.. ఇంకా నయం 27 అని పొరపాటు పడింది కాబట్టి బ్రతికి పోయాం లేక పోతేనా!!ఎక్కడికని వెళ్ళే వాళ్ళం..ఈ రోజంతా ఇంపార్టెంట్ మీటింగ్లు కూడాను అని వెళ్ళిపోయారు ... నాకు లోకం తీరు మెల్లిగా అర్ధం అయింది ...ఎంత మోసం..నాకు అనుమానం రాకుండా మంచిగా మాట్లాడి మేము ఇల్లు గురించి మర్చి పొతే సమయానికి భయటకు పంపేద్దామనిపకడ్బందీ ప్లాన్..మొదటి నుండీ ఈయన నమ్మలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతె పరిస్థితి ఏమిటి ? అని రక రకాలుగాఆలోచిస్తూ బట్టలు పేక్ చేయడం మొదలు పెట్టాను ...

సరిగ్గా మధ్యాహ్నం ఫోన్ రింగయ్యింది.. మా ఓనర్ వాళ్ళ పాప ఆంటీ ఫోన్ అని పిలిచింది.. హలో చెప్పండి అన్నాను.. బుజ్జీ ...కిరణ్ ఇల్లు ఇవ్వనంటుందే అన్నారు.. నాకు గుండెల్లో రాయిపడినట్లుఅయ్యింది.. ఏంటి?? అన్నాను కంగారుగా..ఏమైందో తెలియదు..కుదరదు అంది ...ఒప్పుకోవడం లేదు అన్నారు ..మరేం చేద్దాం?అన్నాను నీరసం గా .. ఈ నెల ఉండటానికి వీలు ఉంటుందేమో అంకుల్ ని అడుగుతావా వేరే దారిలేదు అన్నారు.. ఫోన్ పెట్టేసిప్రక్క బెడ్ రూం వైపు నడిచాను ... అంకుల్ గుమ్మం దగ్గర నుండి పిలవ బోయాను కాని తన చేతిలో ఫోన్ రిసీవర్ ...ఆ ఫోన్ కిదీనికి లింక్ ఉన్నదన్న విషయం నాకు తెలియదు..అంటే మా మాటలు అన్నీ విన్నాడన్నమాట... అతని మొహం లో వెటకారం కనబడుతుంది..మేనర్స్ సంగతి దేవుడెరుగు ...ముందు పని ముఖ్యం కదా అని ...అంకుల్ మరి....అదీ ఇంకా ఒక్క నెలఉండచ్చా అన్నాను ...రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయాలి మీరు అని వెళ్ళిపోయాడు ...

చాలా అవమానం గా అనిపించింది ... క్రిందకు పరుగులు పెట్టి ఆయనకు ఫోన్ చేసా ..హుం.. చూసావా .. నీవల్ల ఏంజరిగిందో!!!! సరిగ్గా ఇల్లు కూడా వెదక నివ్వలేదు ... క్రొత్తగా వచ్చాం ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు..ఎక్కడికి వెళతాం అన్నారు..అన్నీ నన్నే అనండి ..ఆ యశోద,కిరణ్ అలా చేస్తే నేనేం చేయను మధ్యలో అని అరిచేసాను ....నాకు టెన్షన్ తో వణుకోచ్చేస్తుంది.. సరేలే భయపడకు .. ఏదో ఒక దారి దొరక్కపోదు ...రాత్రి లేట్ గా వచ్చినా కంగారు పడకేం అని చెప్పి ఫోన్ పెట్టేసారు ... నేను ఏమి జరగనట్టు గదిలోకి వచ్చి సామాను సర్దడం మొదలు పెట్టాను..

సాయంత్రం వంట చేస్తుంటే యశోద వచ్చింది గదిలోకి ... ఇల్లు ఎక్కడ దొరికిందో ? అంది ఏమీ తెలియనట్లుగా.. తన మొహం లో వెలుగే చెప్తుంది తనకు అంతా తెలిసిపోయిందని.. ఆ .. కండోమినియం అన్నాను కచ్చగా .. అబ్బా ..ఇంకేం మీకు జిమ్ము,స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి ..అదృష్టం కదా అంది.. నాకెందుకో కోపం రాలేదు.. ఎన్ని ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతాను..ఇక్కడ అలవాటు పడిపోయా అన్నాను మెల్లగా ... కాసేపు తను ఏమీ మాట్లాడలేదు ...నువ్వే అలవాటు పడిపోతావులే నాలుగు రోజులు అయితే అని వెళ్ళిపోయింది.. ఏం చేయాలో అర్ధం కాలేదు ...దేవుడి పటం దగ్గర వెళ్లి స్వామీ ఏం తప్పుచేసానో తెలియదు.. కాని దేశం కాని దేశం లో ఒంటరిగా నన్ను వదిలేయద్దు... నువ్వు తప్పకుండా కాపాడుతావు అని నమ్మకం ఉంది.. ఆ నమ్మకం నిలబెట్టు అని దణ్ణం పెట్టుకున్నా...

రాత్రి పది అవుతుండగా మా వారు వచ్చారు..ఏమైంది అన్నాను ...ఇప్పటికిప్పుడు అంటే కష్టం బుజ్జి ..కనీసం నాలుగు రోజులు అయినా పడుతుంది ఏజెంట్ కి చెప్తే అన్నారు.. పుట్ పాత్ మీద అయినా ఉందాం ఇంక వీళ్ళను అడగద్దు అన్నాను..ఇదేమన్నా మన దేశమా ఎక్కడ పడితే అక్కడ ఉంటా అనడానికీ అన్నారు ..నాకేం మాట్లాడాలో అర్ధం కావడం లేదు .. కాకపొతే మా ఆయనకు ధైర్యం చెప్పాలనిపించింది అంతే... ఏమీ కాదు నాకు నమ్మకం ఉంది రేపు ఏదన్నా పార్కులో ఉంటాను మీరు ఏజెంట్లకు ఫోన్ చేసి ఇల్లు వెదకండి ..సాయంత్రం లోగా ఇల్లు తప్పక దొరుకుంది అన్నాను ధైర్యంగా ... అప్పుడు నవ్వారు మాఆయన.. ఆహా ..పార్కులో ఉంటావా? అబ్బా ఏం ధైర్యం చెప్తున్నావే పిరికిదానా ... ఇల్లు దొరికింది ఇక భయపడకు అన్నారు..అప్పటివరకు అణుచుకున్న ఏడుపు ఒక్కసారిగా భయటకు వచ్చేసింది ...పదినిమిషాలు ఊరుకోబెడుతూనే ఉన్నా ఏడుస్తూనేఉన్నా.. యశోదను ఏడిపిద్దామా ఇంకా దొరకలేదని అన్నారు..వద్దులే బాబు మనకెందుకు అన్నాను.. ఆ ప్రొద్దున్నే ఇల్లు ఖాళీచేసేసాం

129 కామెంట్‌లు:

రాజ్ కుమార్ చెప్పారు...

super..duper..keka..racha...pichekkincharu...

రాజ్ కుమార్ చెప్పారు...

naa rank enta nestam garu??
post chadivochi malli commentuta... :)

కౌటిల్య చెప్పారు...

నాది ఎన్నో కామెంటబ్బా!..ఏదైతేనేం లే! నేను నేస్తం అభిమాన సంఘం సభ్యుణ్ణి కాదు గా!ః-)

ఓనర్లు కిందా, పైనా, పక్కనా ఉంటేనే భరించలేం...ఇంట్లో పెట్టుకుని భరించారా!...మా ఓనర్ మాత్రం చాలా మంచివాళ్ళు..ఎందుకంటే యుఎస్ లో ఉంటారు.. ః-)...ఎన్ని నెలలు అద్దె కట్టకపోయినా అడగరు...

నేస్తం చెప్పారు...

నువ్వు కేక అన్నపుడే తెలుసు చదవలేదని :)

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కా. టపా పెట్టేశారా..? చదివేసి మళ్లీ కామెంటుతా..:)

అజ్ఞాత చెప్పారు...

అబ్బా మళ్ళీ పెద్ద టపానా

శ్రీనివాస్ చెప్పారు...

హేహేహేహే

@ నీ కసలు సిగ్గులేదే ..నాలుగు తన్ని కొబ్బరి నూనె రాస్తే చాలు అంతా మర్చి పోతావ్ .వద్దని చెప్పానుగా ..ఖాళీ చేసేద్దాం అన్నారు

_____________________________________

ఎందుకలా ఆడలేడీస్ త్వరగా మర్చిపోతార్

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కయ్యా.. పాపం. మీకన్నీ ఇలాంటి కష్టాలే కదా.. అందులోనూ ఇలా దేశం కాని దేశం లో.. టపా చదువుతున్నంత సేపూ పాపం అనిపించింది. కానీ మొత్తం అయిపోయాక తలుచుకుంటే నవ్వు వచ్చేసింది..;)(నన్ను ఏమీ అనొద్దు.)
>>ఒక స్త్రీ హృదయం మరొక స్త్రీ కే తెలుస్తుంది..
:))
కానీ లాస్ట్ లో మీరు పాపం బావ గారికి ధైర్యం చెప్పారు చూశారూ.. ఆహా అద్భుతం..
మొత్తానికి మీరు పార్క్ లో కాకుండా కొత్త ఇంట్లో ఉండేలా ఆ భగవంతుడు కాపాడేశాడన్న మాట..:)
టపా చాలా బాగుందక్కా..:)

మనసు పలికే చెప్పారు...

అక్కా.. కానీ ఏ మాత్రం కానీ ఖర్చు లేకుండా మీ యశోద ఆంటీ భలే ఫేమస్ అయిపోయింది.. అసలు ఏమాత్రం ఊహించి ఉండదు కదా ఇలా మీరు ఆమె గురించి ఒక టపా రాసేసి తెలుగు బ్లాగర్లందరికీ పరిచయం చేసేస్తారని..:P తెలిస్తే ఎంత "ప్రేమ" కురిపించేదో..;)

హరే కృష్ణ చెప్పారు...

First comment naadi kakunda chesina venuram

రాజ్ కుమార్ చెప్పారు...

ఫస్ట్ హాఫ్ కమెడి గా రాసి సెకండ్ హాఫ్ సెంటిమెంట్ తో ఏడిపిస్తార..??
పొస్త్ నిజం గా అధ్భుతం గా రాసేరు.
మిమ్మల్ని ఇన్ని బాధలు పెట్టిందా ఆ రాకాసి??

పేరుల్లో నాకు నచ్చని ఒకె ఒక్కపేరు యశోధ.

రాజ్ కుమార్ చెప్పారు...

హెయ్..హే.హే..హే... డంద నక..డండ నక..డన్ డన్..
నాదే మొదటి కామెంట్.
ఈమొదటి కామెంట్ ని ప్రియ మిత్రుడు హరే క్రిష్న కి అంకిత మిస్తున్నా..పాపం మీరు పొస్ట్ వెసెరని ఫోన్ చెసి మరీ చెప్పేడు.
నెస్తం అక్క..టపా నిజం గ కేక.

నేస్తం చెప్పారు...

ఇంతకూ యశోధకు ద కి వత్తుంటుంది కదా... గూగుల్ ట్రాన్స్లేటర్లో వత్తు పడటం లేదని గూగుల్ లొ చూస్తే వత్తు లేదు.. ఇంతకూ నేను తప్పా? గూగులోడుతప్పా?

రాజ్ కుమార్ చెప్పారు...

నీ కసలు సిగ్గులేదే ..నాలుగు తన్ని కొబ్బరి నూనె రాస్తే చాలు అంతా మర్చి పోతావ్
నా అంతరాత్మ నన్ను శుబ్రంగా ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసేసింది
ఈ ఇల్లు వద్దు అని ఏ చైనా దాని ఇంటికో,మలయ్ వాళ్ళ ఇంటికో తీసుకు వెళ్ళిపోతే నా గతి ఏం కాను?? కనీసం ఈవిడ చెప్పేది అర్ధం అవుతుంది ...వాళ్ళు తిట్టినా అర్ధం కాదు అని గప్,చిప్ గా సర్దుకు పోయేదాన్ని ...
idigo induke memu mee blog ante padichastam....inka ilantivi chala unnai.. ee post lo..

రాజ్ కుమార్ చెప్పారు...

దేవుడి పటం దగ్గర వెళ్లి స్వామీ ఏం తప్పుచేసానో తెలియదు.. కాని దేశం కాని దేశం లో ఒంటరిగా నన్ను వదిలేయద్దు... నువ్వు తప్పకుండా కాపాడుతావు అని నమ్మకం ఉంది.. ఆ నమ్మకం నిలబెట్టు అని దణ్ణం పెట్టుకున్నా...

రాత్రి పది అవుతుండగా మా వారు వచ్చారు..ఏమైంది అన్నాను ...ఇప్పటికిప్పుడు అంటే కష్టం బుజ్జి ..కనీసం నాలుగు రోజులు అయినా పడుతుంది ఏజెంట్ కి చెప్తే అన్నారు.. పుట్ పాత్ మీద అయినా ఉందాం ఇంక వీళ్ళను అడగద్దు అన్నాను..ఇదేమన్నా మన దేశమా ఎక్కడ పడితే అక్కడ ఉంటా అనడానికీ అన్నారు ..నాకేం మాట్లాడాలో అర్ధం కావడం లేదు .. కాకపొతే మా ఆయనకు ధైర్యం చెప్పాలనిపించింది అంతే... ఏమీ కాదు నాకు నమ్మకం ఉంది రేపు ఏదన్నా పార్కులో ఉంటాను మీరు ఏజెంట్లకు ఫోన్ చేసి ఇల్లు వెదకండి ..సాయంత్రం లోగా ఇల్లు తప్పక దొరుకుంది అన్నాను ధైర్యంగా ... అప్పుడు నవ్వారు మాఆయన.. ఆహా ..పార్కులో ఉంటావా? అబ్బా ఏం ధైర్యం చెప్తున్నావే పిరికిదానా ... ఇల్లు దొరికింది ఇక భయపడకు అన్నారు..అప్పటివరకు అణుచుకున్న ఏడుపు ఒక్కసారిగా భయటకు వచ్చేసింది ...పదినిమిషాలు ఊరుకోబెడుతూనే ఉన్నా ఏడుస్తూనేఉన్నా.. యశోదను ఏడిపిద్దామా ఇంకా దొరకలేదని అన్నారు..వద్దులే బాబు మనకెందుకు అన్నాను.. ఆ ప్రొద్దున్నే ఇల్లు ఖాళీచేసేసాం

Cinema choopincheru kadandi... :) :)

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్కా.. ఆ య"సొద" కి కొడుకులున్నారా? ఉంటే మాత్రం వచ్చే కోడళ్ళు చచ్చారే.. హిహిహి..

శ్రీనివాస్ చెప్పారు...

పాపం బజ్ లొ పడిన కౌంటర్ నుండి ఇంకా తేరుకోలేదు అనుకుంటా

priya చెప్పారు...

baagundi :)yashoda ki vottu undadu.ppost addirindi

సావిరహే చెప్పారు...

నేస్తం గారు..! చాలా బాగుందండి...

పవన్ కుమార్ చెప్పారు...

చాలా బాగుంది ఈ టపా.
మీరు ఇంతకముందు ఒనర్ మీద చెప్తానన్న చాడీలు ఇవేనా :)
మరి ఇందులొ సందీప్ అని ఒకడు ఉండాలి కదా ఎమయిపొయాడు..

Sai Praveen చెప్పారు...

వామ్మో... ఇలాంటి వాళ్ళు కుడా ఉంటారా.
ఎప్పటి లాగే మీ నేరేషన్ మాత్రం సూపర్. :)

కొత్త పాళీ చెప్పారు...

అమ్మో చాలా కష్టాలు పడ్డారండి.
బేచిలర్ లైఫ్ లో షేరింగులు పర్లేదుగాని, కుటుంబాలతో లివింగ్ స్పేస్ షేరింగ్ అంటే చాలా కష్టమే.

Sai Praveen చెప్పారు...

బజ్ లో పడిన కౌంటరా ?
ఎవరిచే? ఎవరిపై?
ఏమా కథ?

సవ్వడి చెప్పారు...

cadivi mallee comment pedathaaa..

Sasidhar Anne చెప్పారు...

Akka.. Mee post chala bavundi..
Bharatha natya kalakarini,
Kotti koobiri noone.. assalu ee words meeku vasthayi.. bale timing lo rastharu words..

Naaku post motham meeda.. last para chala chala baga nacchindhi.Bava illu dorkindhi ani cheppagane .. edhcharu kada.. aa scene nenu oohinchesukuni.. chala senti ga feel ayya.. one of the best para i ever read.

Alanti bava dorkinanduku ur lucky.. :)
koncham senti mood lo vunna..kabbati comedy gurinchi takkuva rasa.. next vakya lo vati gurinchi matladukunda..

Mahender చెప్పారు...

Super dialogue

"నాలుగు తన్ని కొబ్బరి నూనె రాస్తే చాలు అంతా మర్చి పోతావ్"

..nagarjuna.. చెప్పారు...

హుమ్....మీ వ్యధలు చదివి నాకు ఇంకా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి...ఆల్రెడి లిటరు నిండాయి ఆ...

పన్లోపని మీకు ఇంతకుముందిస్తానన్న త్యాగశీలి, సాహసనారి అవార్డులతోపాటు ’ఉత్తమ అమాయక అద్దెదారు’ అవార్డు కూడా... ;)

ఐనా వేణురాం.......నీ కామెంటు సూపరు డూపరు కేక పొలికేక రచ్చ..అభిమానులందు వీరాభిమానులు వేరయా అనిపించావు...


ఇప్పుడు నవ్వు సంగతి దేవుడెరుగు...నాకైతే పోస్టు చదవుతున్నంతసేపు..సదరు యశోదా ఆంటి ఎక్కడినుండైనా ( ప్లేస్ అర్ధమయ్యేవుండాలే..) పారిపోయివచ్చిందా అనిపించింది...పాపం మీకెన్ని కష్టాలోకదా అక్కా..... (ఎవరన్నా ఖర్చిఫ్ ఇయ్యండయ్యా మొహం తుడుచుకోవాలి...ఆ...)

తృష్ణ చెప్పారు...

మాకు బొంబాయిలో ఇంటాయనతో ఇలాంటిదే ఒక చేదు అనుభవం ఉందండీ.. ఎప్పటిలా బాగా రాసారు.

శిరీష చెప్పారు...

same pinch neanu kooda anthe evarenni chesina twaraga marchipota..piriki vaallamaa manam?. nice narration as usual. great.

Raghuram చెప్పారు...

నేస్తం గారు!,

నాకు ఎందుకో ఈ టపా చప్పగా అనిపించింది, బహుశా కొంచెం ఎక్కువ ఆశించానేమో మరి. కాని మీ అద్దె ఇంటి కష్టాలు కొంచెం బాధ గా అనిపించాయి. "యశోద" లో "ద" వత్తు లేదండి.


రఘురాం

3g చెప్పారు...

ఈ పోస్ట్ లో మాత్రం సెంటిమెంట్ తో కొట్టారండి. దగ్గర్లో కొబ్బరినూనె కూడా లేదు రాసుకొని మర్చిపోదామంటే.

నేస్తం చెప్పారు...

ఏం చేయను కౌటిల్యా వచ్చిన కొత్తలో కొన్ని కారణాల వల్ల షేరింగ్ తప్పలేదు..అబ్బా ఎంత మంచి ఓనరో అద్దె కట్టకపోయినా ఏమనరా ?? మాకు కూడా ఇనతకు ముందు ఓనరు చాలా మంచి వారు ..తను సింగపూర్ వస్తే చాలు పార్టీకి పిలిచి నా కూతురు నా కూతురు అని అందరికీ పరిచయం చేసేవారు ...
ఏం చేయను తార గారు పోస్ట్ రాస్తున్నపుడే మీరు గుర్తు వచ్చి భయం తో అప్పటికే సగం కట్ చేసా.. అయినా పెద్దది అయిపోయింది..
శ్రీనివాస్ ఆడ లేడీస్ త్వరగా మర్చిపోతార్ కాబట్టే మగ జెంట్స్ బ్రతికిపోతున్నారు
@అపర్ణా మరే నేనైతే పార్కులో వర్షం వస్తే ఎలా? అని కూడా ఆలోచించహ్]అను...హ హ యశోదకు గాని ఇలా పోస్ట్ రాసా అని తెలిస్తే నేను ఇంకో పోస్ట్ వేసే పరిస్థితి కల్పిస్తుంది..

నేస్తం చెప్పారు...

హరే కృష్ణ :)
వేణు రాం పోస్ట్ నచ్చినందుకు థేంక్స్ ... యశోదకు అమ్మాయి లే .. కాకపోతే పూర్తిగా ఆవిడనూ అనలేములే.. ఇంటి బాధ్యత అంతా తన మీద పడటం.. పైగాభర్త ప్రతి విషయాని తనను బాగా తిట్టడం..ఇగోలు .. ఇవన్నీ కూడా తనలో అసం తృప్తికి కారణం..
మరే శ్రీనివాస్ ఇప్పుడే తేరుకున్నా :)
ప్రియా థేంక్యూ వేరి మచ్ .. హమ్మయ్యా మళ్ళీ మొత్తం ఎక్కడ సరి చేయాలా అని భయం వేసింది..
అంజలీ థేంక్యూ :)

నేస్తం చెప్పారు...

పవన్ అవును ఆమె గురించే ... సందీప్ ఏమైపోతాడు ..అక్కడే ఉండే వాడు.. వాడు నేను చూపులతో తిట్టుకోవడమే తప్పా ఎప్పుడూ మాట్లాడుకోలేదు..
సాయ్ ప్రవీణ్ ఏమోలే నా వైపు వెర్షన్ చెప్పాను తన వైపు వెర్షన్ వింటేనే కదా విషయం ఏమిటనేది తెలుస్తుంది :)
కొత్త పాళి గారు తప్పలేదండి ఒక సంవత్సరం ఈ కష్టాలు.. లేక పోతే నన్ను ఇండియాలో పెట్టాలి..దానికంటే ఇదే బెటర్ అని ఒప్పుకున్నా..
సవ్వడి గారు థేంక్యూ :)
శశి అబ్బ చా అలాంటి బావ దొరికినందుకు నేను లక్కీయా ? ఇంకా తనే లక్కీ అని నేను ఫీల్ అవుతుంటే ..:)

Kalpana Rentala చెప్పారు...

నేస్తం,

పాపం చాలా కష్టాలు పడ్డట్లున్నారు కదా...పోనీలెండి చివరకు సుఖాంతం అయింది కదా..

పైన అందరూ చెప్పిన కొబ్బరి నూనె డైలాగ్ నా ఫేవరెట్ ..

కల్పన

నేస్తం చెప్పారు...

మహేందర్ థేంక్యూ :)
నాగర్జునా హ హ ’ఉత్తమ అమాయక అద్దెదారు’ అవార్డా :) కొద్దిగ మార్పు చేయి ఉత్తమ పిరికి అద్దెదారు అని కరెక్ట్గా సరిపోతుంది..నేను గొడవ చేయలేను ..ఎవరి పైనైనా అరిచానో ( మా ఆయన తప్ప) దడ ధడ మని కొట్టుకుని ,వణుకొచ్చేస్తుంది ..ఎందుకొచ్చిన గోలలే అని మేక్జిమం సైలెంట్ అవుతా కోపం వస్తే ..పైగా నా అంతరాత్మ ఒకటి ఎవరన్నా తిట్టారంటే నిన్ను అలా తిట్టారు అని అనకుండా .. నీ తప్పు లేకుండా అంటారా అని బుద్దులు చెప్తుంది..") అదొక మైనస్ పోయింట్ ..
తృష్ణ మీరు పడ్డారా ఈ పీత కష్టాలు :)
శిరీషా మరి అంతే కదా ...మనం ఒప్పుకోవాలి అది ముమ్మాటికీ పిరికితనమే

నేస్తం చెప్పారు...

రఘు రాం నిజమే హాస్యం పాలు తగ్గించాను.. :)
3G :D :D :D
కల్పన గారు నా బ్లాగ్ కి విచ్చేసినందుకు థేంక్యూ థేంక్యూ మీ తన్హాయి చదివి మా ఆయనకు రోజూ పడుకున్నపుడు చెప్తా స్టోరీ ..కల్హార- కౌశిక్ గురించి చెప్పినపుడల్లా నువ్వు అలా తన్మయత్వం గా చెప్పకే బాబు భయం వేస్తుంది అని పాపం వేడుకుంటూ ఉంటారు :)

మాలా కుమార్ చెప్పారు...

ఇలా షేరింగ్ ఇళ్ళలో అద్దెకు వుంటారని నాకు తెలీదండి . మేము , పోస్టింగ్ అయ్యినప్పుడు ఇల్లు అలాట్ అయ్యేవరకు , ఒకే ఇంటిలో రెండు ఫామిలీస్ మి షేర్ చేసుకొని వుండేవాళ్ళము . బాగుంది .

హరే కృష్ణ చెప్పారు...

మీరు పోస్ట్ ఎప్పుడు వేస్తారో కాస్త అభిమానులకి చెప్పండి
మా టపాలు రిలీజ్ postpone చేసుకుంటాం :))

ఏ అగ్గ్రిగేటర్ చూసినా ఏమున్నది గర్వకారణం
యశోద ఆంటీ కి కామెంట్ల కుంభవర్షం
బాగా రాసారు నేస్తం

హరే కృష్ణ చెప్పారు...

నేస్తం అక్క ఫాన్స్ తరపున సారి నా కామెంట్ మూడోసారి :)
వ.బ్లా.స సభ్యులారా రంగం లోనికి దిగండి

divya vani చెప్పారు...

అమ్మో ఇంటి ఓనర్లు ఇలా కూడా ఉంటారా ? పాపాం అంతా సడెన్ గా ఖాళీ చేయమంటే కష్టం కదండి !

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ ఎప్పటిలాగే మీ కష్టాలు చెప్తూనే హాయిగా నవ్వించారు నేస్తం. మీ యశోదాంటీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళుతాగించే టెనెంట్ రావాలని మనసారా కోరుకుంటున్నాను(ఫ్యామిలీ సర్కస్ లో రాజేంద్రప్రసాద్ లాంటోళ్ళనమాట)

"కాకపొతే మా ఆయనకు ధైర్యం చెప్పాలనిపించింది అంతే... ఏమీ కాదు నాకు నమ్మకం ఉంది రేపు ఏదన్నా పార్కులో ఉంటాను మీరు ఏజెంట్లకు ఫోన్ చేసి ఇల్లు వెదకండి" హ హ ఈ సలహా సూపర్ "త్యాగమూర్తివమ్మా.. నేస్తం" అందుకే మరి సినిమాలు ఎక్కువ చూడకూడదు అనేది :-D

వేణూశ్రీకాంత్ చెప్పారు...

"నేను గొడవ చేయలేను..ఎవరి పైనైనా అరిచానో (మా ఆయన తప్ప) దడ ధడ మని కొట్టుకుని ,వణుకొచ్చేస్తుంది " హ హ పాపం మీవారు :-P అందుకే అన్నారేమో "ఊరంతా మా నాన్నకి లోకువ మానాన్నేమో మా అమ్మకి లోకువా" అని :-D నేను అవసరమైతే బయటివాళ్లమీద ధారాళంగా అరిచేస్తాను కానీ కావాల్సిన వాళ్ళదగ్గర మాత్రం వణుకు దడ అన్నీ వచ్చేస్తాయి.

Ram Krish Reddy Kotla చెప్పారు...

అయ్యో పాపం...మీరెంత అమాయక పుట్టండీ..హమ్ చాలా కష్టాలు పడ్డారనమాట..ఈ యశోద ఆంటీ లాంటి మెంటల్ జనాలను నేను చాలా మందినే చూశా..లాగిపెట్టి ఒక్కటి ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని చూస్తే..మీరు ఈ పోస్టు బాగా సెంటి దట్టించి రంగారించారుగా...పాపం అందరూ ఏడుస్తున్నారు...

ఇంతకీ బజ్ లో పడ్డ కౌంటర్ ఏంటి..అసలు ఏం జరిగింది అక్కడ..నాకు తెలియాలి ?;-)

sanjay చెప్పారు...

nestham garu mi tapa chala bagudni but intha pedda tapa chadivesariki chala time patindi

నేస్తం చెప్పారు...

మాల గారు నాక్కూడ ఇక్కడకు వచ్చేవరకూ తెలియదు.. కాకపోతే ఇక్కడ అది కామన్.. భరించలేని రెంట్లు క్రొత్తగా వచ్చిన వారికి కష్టం గానే ఉంటాయి..
హరే క్రిష్ణ ..వాన పడటానికి ఒక టైం ఉంటుంది ..వెన్నెల కురవడానికి కూడా ఒక టైముంటుంది ..పూలు పూయడానికి ఒక టైముంటుంది..నేను పోస్ట్ రాయడానికి ఒక టైము పాడు ,ఉండదు.. నాకే తెలియని విసయాన్ని నీకెలా చెప్తాను చెప్పు ..మళ్ళీ వ.బ్లా.స ఏమిటి ?
దివ్యవాణి ..అదే కదా మరి .... షేరింగ్ సింగిల్స్ కి ఓ.కె గాని ఫ్యామిలీకి చాలా కష్టం..

నేస్తం చెప్పారు...

>>>>హ హ ఈ సలహా సూపర్ "త్యాగమూర్తివమ్మా.. నేస్తం" అందుకే మరి సినిమాలు ఎక్కువ చూడకూడదు అనేది :-డ్
మరి అక్కడే కోపం వస్తుంది శ్రీకాంత్..ఒక్కో సారి చెప్పినా వినకుండా చేసే వెదవ పనులన్నీ చేసి అప్పుడప్పుడూ టెన్షన్ పడుతుంటారా ..నేనేమో పోనీలే అని ధైర్యం చెప్పడానికొస్తే..ఆఖరికి నువ్వు కూడా రెడీ అయిపోయావా చెప్పేయడానికి అని ఉప్మా లో కరివేపాకులా తీసి పడెస్తారు అంతే :)
>>ఊరంతా మా నాన్నకి లోకువ మానాన్నేమో మా అమ్మకి లోకువా" అని :Dనేను అవసరమైతే బయటివాళ్లమీద ధారాళంగా అరిచేస్తాను కానీ కావాల్సిన వాళ్ళదగ్గర మాత్రం వణుకు దడ అన్నీ వచ్చేస్తాయి.
ఇది సూపరు..నిన్న మావారికి చూపించి ఒకటే నవ్వాను


>>>పాపం అందరూ ఏడుస్తున్నారు
అంటే తమరికి ఏడుపు రావడం లేదా...ఎంత పని అయ్యింది కిషన్...ఈ సారి ఇంకా సెంటిమెంట్ దట్టించాలి అయితె.. అది శ్రీనివాస్ బజ్ కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది:)

సంజయ్ గారు రెందు భాగాలు రాయలి ఇది అసలు ..అబ్బా చాడీలకు కూడా భాగాలా అని కుదించా :)

Ravitheja చెప్పారు...

story chalaa baagundi

పవన్ కుమార్ చెప్పారు...

ఈ మధ్య 1st కామెంట్ కి హెవీ కాంపిటిషన్ అయిపొయింది..
ఈ సారి మాత్రం టపా వేసే ముందు ఎదైనా చిన్న క్లూ ఇవ్వు అక్కా కేచ్చ్ చేసి పిచ్చెక్కిస్తా....

సవ్వడి చెప్పారు...

నేస్తం గారు! టపా ఎప్పటిలాగే బాగుంది.
చాలా రోజుల తరువాత రెగ్యులర్ గా కాకుండా కొత్తగా రాసారు. సూపర్!
నాకు కూడా మీమీద జాలేసింది సుమా....

నాగప్రసాద్ చెప్పారు...

పాపం. మీ ఆయన మీ వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నారన్నమాట. :-))

నాగప్రసాద్ చెప్పారు...

50. :))

Rajendra Prasad(రాజు) చెప్పారు...

టప చాలా బాగుంది.....:)

Rajendra Prasad(రాజు) చెప్పారు...

నేను మాత్రం చదివే కామెంటుతున్నానండోయి..... మొత్తానికి యశోద గారి వల్ల మీకు తెలిసిన విషయం ఏమిటంటే, బావ గారన్నట్టు ఎవరిని పడితే వారిని నమ్మకూడదు అని, ఇంకా ఎప్పుడు బావ గారు చెప్పినట్టే వినాలి అని కాదంటారా...... !!!!!

రాజ్ కుమార్ చెప్పారు...

nagarjuna garu.. tnX andi baaga chepperu.. meeku va.bla.sa tarupuna oka raggu bahookaristunna.. kallu tuduchu kodaaniki...:)

రాజ్ కుమార్ చెప్పారు...

పవన్ కుమార్ garu... clues ivvaru kaani maname konni logics follow avvali.. hare krishna ni adigite lachcha kitukulu cheptaru. :)

నేస్తం చెప్పారు...

రవి తేజ గారు థేంక్యూ :)
పవన్ క్రింద వేణు ఏదో అంటున్నాడు చూడు
సవ్వడి గారు థేంక్యూ :)

>>>పాపం. మీ ఆయన మీ వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నారన్నమాట. :-))

ఒక్క అక్షరం ఎక్కువ అయితే అర్ధం మారిపోతుంది నాగ ప్రసాద్ ...పైన మీరు రాసిన వాక్యం లో సెకెండ్ 'మీ ' తీసేసి చదవండి..అదీ అసలు నిజం
>>> మొత్తానికి యశోద గారి వల్ల మీకు తెలిసిన విషయం ఏమిటంటే, బావ గారన్నట్టు ఎవరిని పడితే వారిని నమ్మకూడదు అని, ఇంకా ఎప్పుడు బావ గారు చెప్పినట్టే వినాలి అని కాదంటారా......
కాదనే అంటాను..అందరినీ అనుమానిస్తూ కూర్చున్నా మంచిది కాదుగా.. ఏదన్నా పని చేసేటపుడు ఆలోచించి చేయాలి..చివరివరకూ నాంచ కూడదు..కిరణ్ విషయం లో అదేగా అయ్యింది ..చివరి రోజు వరకూ ఊరుకోకుండా ముందే మా ఓనర్ వాళ్ళకు ఒక మాట చెప్పాలిగా.. :)
వేణు రాం అదేదో నాక్కూడా చెప్పవా.. నేనూ తెలుసుకుంటాను :)

అజ్ఞాత చెప్పారు...

రెండు భాగాలుగా వేయండి పొడవు కత్తిరించకుండా అప్పుడు మీ అభిమానులకి కూడా పండగే కదా..

అయ్యో, అయ్యో, నేను అసలు మీరు సామాను మొత్తం వేసుకొని పార్కులో కూర్చున్నా సీన్ ఊహించుకున్నానుగా, ఎంత దిజెప్పయింట్ చేశారండి...

చంద్రశేఖర్ కాటుబోయిన చెప్పారు...

నేస్తం,మీరు చాలా బాగా రాస్తారండి దేని గురించైనా సరే..చివరలో మీరు ఆపుకోలేక ఏడ్చేశారు అని చదివి నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయండి..సూపర్..

అజ్ఞాత చెప్పారు...

Yasoda aunty sagam kante ekkuva chadavalekapoyanu.. ivannee memu kooda paddaam.

శివరంజని చెప్పారు...

హ హ ఎప్పటిలాగే మీ కష్టాలు చెప్తూనే హాయిగా నవ్వించారు ...అక్కా నిన్ను ఆ ఆంటీ అన్ని కష్టాలు పెట్టిందా ? పాపం స్టీల్ డబ్బా నెత్తి మీద పడిపోయింది అన్నప్పుడు ..నిజం గా జాలేసింది

పరిమళం చెప్పారు...

హ్మ్...మొత్తానికి సుఖాంతమే కదా !

Viswanath చెప్పారు...

last para chadhuvu thunnappudu yendhukano kallu chemarchaayi,,,

mee mark hasyam ponivvaru...mee raathallo yedho attraction undhi andi,normal sadhaa seedha sangatanalanu kuda kallaki katte tattu chepthaaru interesting ga chepthaaru,,,

Hatsoff nestham garu...

..nagarjuna.. చెప్పారు...

అయ్యా వేణూరాం...ఆ పంపించేదేదో తొందరగా జరిపించండి. కృష్ణకు ఇస్తానన్న కెమెరా మాదిరి లేటు చెయ్యమాక..., అసలే చలికాలం మొదలవబోతుంది, ముక్కూ, కన్నీళ్లు తుడుచుకున్నాక దాన్ని కప్పుకొని ముసుగుతన్ని పడుకుంటా..


ఇదేటిది...నాగప్రసాదుకూడా వ.బ్లా.సలో చేరిపోయాడా, అలానే అనిపిస్తుంది వాలకం.. :))

నేస్తం చెప్పారు...

తారా.. మరీ బొత్తిగా చాడీలు రెండు భాగాలు ఏం రాయనూ అని ఈ సారికి అలా రాసేసానన్నమాట
దేవుడున్నాడు సార్ అందుకే నన్ను పార్క్లో కూర్చోపెట్ట లేదు :)
చంద్ర శేఖర్ మీకు అంతగా నచ్చినందుకు చాలా దేంక్స్:)
అఙ్ఞాత గారు థేంక్యూ :)
>>స్టీల్ డబ్బా నెత్తి మీద పడిపోయింది
ఎప్పుడు పడిందబ్బా??? శివరంజని :)
పరిమళం :)
విశ్వ నాథ్ గారు థేంక్యూ మీకు నచ్చినందుకు :)
నాగర్జున వ.బ్లా.స ఏంటీ ?

Sai Praveen చెప్పారు...

అయ్యో మీకు వ.బ్లా.స తెలియదా. అది పుట్టిందే మీ బ్లాగు నుంచి :)
వ.బ్లా.స అనగా వంద కామెంట్ల బ్లాగర్ల సంఘం. అంటే వందవ కామెంటు గురించి కొట్టుకు చచ్చేవారన్నమాట. సభ్యులు ఎవరో మీకు తెలుసు :)

అజ్ఞాత చెప్పారు...

వ బ్లా స అంటే
వంద బ్లాగర్ల సంఘం
శివరంజని అధ్యక్షురాలు
అందరూ జాజిపూలు అభిమానులే :-)

..nagarjuna.. చెప్పారు...

(ఎనకమాల అన్నమయ్య climax ఊహించుకోండి...)
ఆహా..ఎవరి కొరకున్, కై, వలనన్ ఐతే వ.బ్లా.స ఆవిర్భవించిందో వారే, ఆ మృదుమంజుల భాషిణియే, మా ఆ అభిమాన బ్లాగరే మమ్ముల వ.బ్లా.స అంటే ఏమిటని అడుగుటయా...ఇది కాదు కదా సెటైరు, ఇది కాదు కదా పరీక్ష....నాకు పట్టరాని ఆనందముగ నున్నది. సభ్యులారా నా ఈ ఆనందం చల్లారక ముందే నన్ను శాంతపరచండి. వేణూరాం ఈ ఆనందం తగ్గకముందే ఆ రగ్గును పంపించెయ్... :)

http://sivaranjaniy.blogspot.com/2010/08/blog-post.html?showComment=1282826897193#c4868123650335973160

Priya చెప్పారు...

టపా బాగుంది నేస్తం.కాని మీ స్టైల్ లో లేదు.కాస్త ఏదొ తగ్గింది.

kiran చెప్పారు...

hmn....nestham ki owner valla kastalu tappa ledannamata.. :(...
prathi okkariki mobile house lu undali..ee uuru vellina..ee desam vellina teeskellipoyela... :D

నేస్తం చెప్పారు...

హ హ హ అదా.. వ అంటే ఏంటా అని తెగ ఆలోచించాను :)
నాగార్జునా :D
ప్రియ :)
కిరణ్ ఐడియా బాగుందే :)

sri చెప్పారు...

chala bagundandi kallaku kattinattu cheppesaru meru na antharatma laga unnaru.matlade vidanam kuda same ne(madi kuda thu go jillane)memu march lo singapore trip vachamu darilo chala mandi mana dakshinadi varu kanapaddaru kada ani palakarimpuga navvithe okkallukuda navvaleeee nenu andari ki pogaru anukunna. mee lanti manchollu kuda untarani thelisindi

jai చెప్పారు...

chala bagundandi kallaku kattinattu cheppesaru meru na antharatma laga unnaru.matlade vidanam kuda same ne(madi kuda thu go jillane)memu march lo singapore trip vachamu darilo chala mandi mana dakshinadi varu kanapaddaru kada ani palakarimpuga navvithe okkallukuda navvaleeee nenu andari ki pogaru anukunna. mee lanti manchollu kuda untarani thelisindi.ede modatisari vakya rayadam

రాజ్ కుమార్ చెప్పారు...

నాగార్జున గారు.. రగ్గు పంపి రెండు రోజులవుతుంది..:)ఇంకా అందలేదా? హరేకృష్ణ కి చెప్పానే మీకిమ్మని..?? ముక్కూ, కన్నీళ్లు తుడుచుకున్నాక కప్పుకుంటార?? హా హా
అన్నమయ్య డిలాగ్ కేక..

అజ్ఞాత చెప్పారు...

very sad, hope you were happy in the next house, let us know.

vani చెప్పారు...

nestam garu eenadu paper lo mi blog gurinchi chusi first nunchi aani vyakyalu chadivesa.nako pedda dought vachesindi.adi mi perenta ani.please chepparu.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బ్లాగులో పరిచయమైన మా చిన్నమ్మాయి “బాబాయి గారూ జాజిపూలు చదివారా . చాలాబాగా వ్రాస్తారు. చూడకపోతే అర్జంటు గా వెళ్ళి చదవండి” అని ఈమెయిలు పంపితే ఇటు వచ్చాను. యశోదా ఆంటీ చదివిన తరవాత నాకున్న ఒకే ఒక్క అభిమాని పార్టీ మారిపోతుందేమోనని భయం వేస్తోంది.
జాజిపూలు = దరహాసం+ మందహాసం + చిరునవ్వు
అని తెలుసుకున్నాను. చాలా pleasing humour . Thank you for a very good post. మీ టపా లన్నీ తీరుబడి గా చదివేయాలని అనుకుంటున్నాను.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఇలా గయ్యాళిగా, మేనిప్లేటీవ్‌గా ఉండే మనుషులంటే నాకు పరమ అలర్జీ....వాళ్ళయనకు నా ప్రగాఢ సంతాపం...సాటి తెలుగువారని కూడా చూడకుండా ఎన్ని కష్టాలు పెట్టిందావిడ...అయినా అప్పుడెప్పుడో మీరు అమాయకంగా ఉండే రోజుల్లో ఆవిడ అలా చేయగలిగింది కానీ ఇప్పుడైతేనా...:-):-)

మంచు చెప్పారు...

పార్క్ లొ ఉంటానన్నారా??? ఒక ఎడ్లబండి అద్దెకుతీసుకుని దాంట్లొ సామానంతా ఎక్కిద్దాం అని అనుకొలేదా ???
చిత్రం భాళారే విచిత్రం గుర్తొచ్చింది :P


మీరు కామెడి - ఎమోషన్స్ కలిపి రాసిన ఏ టపా అయినా సూపర్ గా ఉంటుంది.... హేట్సాఫ్

నేస్తం చెప్పారు...

స్రీ గారు సింగపూర్ వచ్చారా :) దాదాపు 10 యేళ్ళ క్రితం అయితే తెలుగు వాళ్ళు అని కాదు ఇండియన్స్ కనబడితే కళ్ళు ఇంతలేసి చేసి చూసేవాళ్ళం.. ఇప్పుడు మన జనాభా పెరిగేసరికి ఆ..ఏముందిలే అని లైట్ తీసుకుంటున్నారు జనాలు :) బ్లాగ్ నచ్చినందుకు థెంక్స్ అండి.

ఈ జై కూడా మీరే అనుకుంటా :)
అఙ్ఞాత గారు ఇంక అలా ఇళ్ళు గురించి రాస్తే బోర్ వచ్చేస్తుందేమో అండి :)
వాణి పోస్ట్లు థేంక్యూ నచ్చినందుకు.. పేరు నేస్తమే :) అదే అనేసుకోండి ఈ సారికి :)
సుభ్రమణ్యం గారు మీరు నా బ్లాగ్ లో కామెంటినందుకే చాలా ఆనందం గా ఉంది ...మీ అభిమాని నా అభిమానిలా అయిపోవడమా ఎంత మాట.. మీ అమ్మాయి (సౌమ్య?) కి కూడా నా ధన్యవాదాలు తెలియజేయండి..
శేఖర్ ఇలా తిట్టీ తిట్టనట్లు ,పొగడ్తో తెగడ్తో అర్ధం కానట్లు కామెంటడం నీకు భలే వచ్చు ..ఇప్పుడు నేను నిన్ను తిట్టానా?పొగిడానా? చెప్పుకో చూద్దాం :)
మంచు గారు :O..ఎడ్ల బండా? మీకు భలే థాట్స్ వస్తాయి సార్..చిత్రం భళారే విచిత్రం ఎందుకు గుర్తువచ్చింది ???అద్దె ఇళ్ళకోసం పాట్లు పడ్డందుకా ? :)

sunita చెప్పారు...

sharaa maamoolu,baagundi anToo naenu peTTina kaamenTu eamaipoeyindi? naenu aligaa antae!

Sirisha చెప్పారు...

i hate yasodha aunty....naku edupu vachindi... :(

రాజ్ కుమార్ చెప్పారు...

పోస్ట్ కేక నేస్తం గారు.. ఆల్రెడీ చెప్పావ్ కదా అంటారా?? మళ్లీ చదివాను లెండి.. :) :)

Unknown చెప్పారు...

Tapaa eppaTilaagaanea chaala baagundi anDi..senTimenT toa pinDesaaru..

Unknown చెప్పారు...

టపా ఎప్పటిలాగానే చాల బాగుంది అండి..సెంటిమెంట్ తో పిండెసారు..

Anand Kumar చెప్పారు...

తెలుగు బ్లాగుల్లో మీ బ్లాగ్ టాప్ 3 లో ఉంటుంది నేస్తంజీ..చాల చక్కగా రాసారు.

అజ్ఞాత చెప్పారు...

ilantollu kooda untara lokam lo? enta badha anubhavinchaaro kada..!pch...

Ramu

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

@నేస్తం జీ, ఎంత మాట అనేసారు...ఇలాంటి అపవాదు వస్తుందని అస్సలు అనుకోలేదు. చవితి రోజు చంద్రున్ని అమ్మ వద్దంటున్నా చూసినందుకు నేనీ అభియోగాన్ని మోయాల్సిందే..తప్పదు..తప్పదు..తప్పదు...:-)
నా ఉద్దేశం మీరు ఇలాంటి అనుభవాలు కొత్తలో ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు గడుసుగానే తయారయ్యి ఉంటారు అని...అందుకే అలా అన్నా...మీరు మాత్రం నన్ను తిట్టారు..డౌటే లేదు..తిన్నగా కమెంట్ రాయటం నీకస్సలు రాదు అని దాని తాత్పర్యం, భావం, నానార్ధం etc....:):)..

నేస్తం చెప్పారు...

ఎమో సునీత చాలా మంది ఇలానే అంటున్నారు కామెంట్స్ రావడం లేదని :(
శిరీష నూవ్వు ఏడవకు నాకేడుపొస్తుంది..( నిజం గానేఆనందం తో అలానే అనిపించింది )
వేణు రాం ఒకటి చెప్పాలి.. నువ్వంటే నాకు చాలా ఇష్టం .. నా బంగారు తమ్ముడివి ...ఒకసారి మా అక్క పెళ్ళి పోస్ట్ వేస్తే నాకు అక్క చెల్లెళ్ళు లేరు ఏడుపొచ్చింది అన్నవ్ చూడు అప్పటి నుండి ... :)హరే క్రిష్ణ అలా చూడద్దు నువ్వు కూడా ...
అబ్బులు గారు థేంక్యూ థేంక్యూ..:)
మధు బాబు గారు :)చాలా థేంక్స్ అండి
రాము గారు :) థెంక్యూ
శేఖర్ అదేమరి అందుకే అలా చూడకూడదు... నువ్వు పప్పులో కాలేసావ్ కాని అది ఆక్కడ కాదు నేను తిట్టా అనుకున్నావ్ చూడు అక్కడ ...మా ఏటి గట్టు శేకర్ ని ఎవరన్నా ఏమన్నా అనగలరా అసలు : )

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్క... నాకు ఏమి చెప్పాలో తెలియటం లేదు.. ఈ కామెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని నా లాప్టాప్ లో వాల్ పేపర్ గా పెట్టుకుంటా.... :)
ఓ మనసు పలికే, ఓ శివరంజని విన్నారా...... నేను బంగారం... నేనే బంగారం.. 24 కారట్ బంగారం.. హా ఆహ ఆహ..ఓహో..ఓహో..

హరే కృష్ణ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
హరే కృష్ణ చెప్పారు...

>>i hate yasodha aunty....naku edupu vachindi... :(

శిరీష గారు
అలా ఏడవకూడదు సింగపూర్ వెళ్ళి మరీ కుమ్మేయాలి!
అభిమానులంతా విలన్ పేరు యశోద అని పెట్టుకోవాలి
కనీసం నేస్తం గారు నన్ను బంగారం అని పిలిచేవరకైనా :)

Sai Praveen చెప్పారు...

ఏంటి?? ఏమన్నారూ???
నాకు ఒక చెల్లి ఉన్నంత మాత్రాన నేను బంగారు తమ్ముడిని కాకుండా పోయానా? అపర్ణకి, వేణురాంకి , హరే కృష్ణ కి మాత్రమేనా బంగారం స్టేటస్?
అభిమాన తమ్ముళ్ళారా ఏకం కండి. ఈ వివక్షను ఎదిరించండి. :D

మనసు పలికే చెప్పారు...

నేస్తం అక్కయ్యా... మరి నేనో..:(
:)))

అజ్ఞాత చెప్పారు...

nestham garu, me peru nagamani kadandi...chusara ela kanipettesano

రాజ్ కుమార్ చెప్పారు...

ajnata garu..baga kani petteru..
meeku oka veera taadu ..:) :)

రాజ్ కుమార్ చెప్పారు...

అలా ఏడవకూడదు సింగపూర్ వెళ్ళి మరీ కుమ్మేయాలి!
అభిమానులంతా విలన్ పేరు యశోద అని పెట్టుకోవాలి
hare krishna.. sooper..

రాజ్ కుమార్ చెప్పారు...

అభిమానులు మొదట చేయవలసిన పని... ఇంట్లోను, ఆఫీసు లోను కాని పించిన గోడ మీదల్లా "యశోద " అని రాసి రెడ్ మార్కర్తో క్రాస్స్ చెయ్యాల..

రాజ్ కుమార్ చెప్పారు...

అప్పటికీ కోపం తగ్గకపొతే "సన్నగా,తీగలా పాతికేళ్ళ అమ్మాయిలా " కనిపించిన ప్రతి అంటి కి యశోద అని నామకరణం చేసి , "వంట చేసినపుడు వదిలేసిన ఉల్లిపాయ తొక్క"లతో పచ్చడి చేసి తినిపించేయ్యాల..

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. భలే ఉంది బంగారం బిరుదు కోసం కుమ్ములాట. అక్కయ్యా, మీకొక మంచి ఐడియా చెప్పనా..? ఎంచక్కా మీరే "బంగారు అక్కయ్య" అని ఒప్పేసుకోండి. అప్పుడు మీతో పోటీ ఏంటి అని మేమంతా ఇలా కొట్టుకోడం మానేస్తాం.. హహ్హహ్హా
ఎలా ఉంది బంగారం అక్కయ్యా నా ఐడియా..?:)

అజ్ఞాత చెప్పారు...

అయ్యో అనిపించేలా ఉంది. ఈపాటికి మీరు కూడా ఒక సొంత ఇల్లు కొనేసి టెనెంట్స్ ని టార్చర్ చేస్తున్నారా!!

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. మేలిమి బంగారానికే కదూ ఈసారి సెంచరీ అవకాశం దక్కింది...:) వేణురాం ఏమంటారు..! ;)

..nagarjuna.. చెప్పారు...

@ప్రవీణు: నువ్వు ఖంగారు పడమాక...మనం డైమండ్ కాటగిరి తమ్ముళ్లం... :)ఈ విషయం నేస్తం అక్కకు తెలుసు, బంగారం క్యాటగిరీవాళ్లు నొచ్చుకుంటారేమోనని మనగురించి చెప్పడంలేదుగాని మనకు సాటి ఎవరు...;)

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

యశోద అన్నపేరు ఇకపై కొన్నివందలమందికి డైలీసీరియల్ విలన్గా స్తిరపడిపోతుంది

అజ్ఞాత చెప్పారు...

నేస్తం గారూ.. నేను ఎప్పటి నుండో మీ బ్లాగుకి ఫ్యాన్‌ని అండీ.. ఎంత బాగుంటాయో మీ టపాలన్నీ. ఎన్నో సార్లు అనుకున్నాను వ్యాఖ్య పెట్టాలని, కానీ తెలుగులో టైపింగ్ తెలియకపోవడం వల్ల కుదరలేదు..:)
మీ అభిమానుల అల్లరి కూడా భలే ఉంటుంది ముచ్చటగా. అన్ని వ్యాఖ్యలూ చదువుతాను. ముఖ్యంగా వేణురాం, నాగార్జున, హరే ఇంకా అపర్ణ గార్ల వ్యాఖ్యలు. అల్లరిగా కొట్టుకుంటూ ఉంటే నాకు మా పిల్లలే గుర్తొస్తారు. ఇందరు అభిమానుల్ని సంపాదించదం అంటే మాటలు కాదు కదా. మీరు చాలా గ్రేట్ అండీ..
Mahita.

అజ్ఞాత చెప్పారు...

సుబ్రహ్మణ్య చైతన్య గారు, నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను.. ఇక నుండి యశోద అన్న పేరు జాజిపూలు ఫ్యాన్స్ అందరికీ డెయిలీ సీరియల్‌లో విలన్ పాత్రే..

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. మీరు చెప్పింది అక్షరాలా నిజం సుబ్రహ్మణ్య చైతన్య గారు, భలే పోల్చారు.. :)))

నేస్తం చెప్పారు...

హరే కృష్ణ,రాజ్ పాపం ఆవిడ ఏం చేసిందో ఏం మానిందో తెలియదు కాని నేను మాత్రం బాగా బేడ్ చేసేసానుతనను..సాయ్ ప్రవీణ్ ఆవేశం లో అది రాసి వంట చేసుకుంటుంటే నువ్వు,మరి నాగార్జున,ఇంకా శశిధర్ ఒక రోటిలో గుప్పెడు మిరియాలు ,ఎండు మిర్చి మెత్తగా నూరుతూ కనబడ్డారు ..అయ్యో దేవుడా ఇప్పుడెం చేయాలి అని ఇలా వ్యుహ్యాత్మక మౌనం పాటించేసాను మీరు మర్చిపోయేవరకు..
అజ్ఞాత గారు కాదండి :)
అపర్ణ :)
చైతన్య గారు పాపం ఈసారికి వదిలేద్దాం అండి..అంటే నేను మరీ బేడ్ చేసేసాను అనుకుంటా
మహిత గారు ఒక్కోసారి పడుకుంటానా నిద్ర పట్టదు.. అంటే నేనేదో గొప్ప గా రాసేస్తే ఇంత అభిమానం వస్తే పర్వాలేదు..కాని నేను రాసిందంతా సోది..నా సొంత సోది..మరి ఇంత ప్రేమ చూపిస్తే ఎలా ఉంటుంది..???ఈ బ్లాగుల్లో రాకపోతే నేను అంటూ ఒక మనిషిని మహా అయితే ఒక యాబై మందికి కూడా తెలియనేమో ..అది కూడా నీకు ఏది చేత కాదు అని బిరుదు తగిలించుకుని :)

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్కా.. మీరు రాసేదంతా మీ సోది కావచ్చు గాక.. కాని ఆ సోది మాకు చాలా ఇష్టం.. మీరు నేరేట్ చేసే విధానం ఇష్టం.. మా ఇంట్లో , మా పక్కనే కూర్చొని చెప్తున్నట్టు ఉంటుంది. గొప్పగా రాయడం అంటే ఏమిటో నాకు తెలీదు గాని, మేమంతా మీ పోస్ట్ కోసం ఎదురు చూసేలా మాత్రం రాస్తారు. చదువుతున్నంత సేపూ చెప్పలేని ఆనందం అనుభవించేలా రాస్తారు.. మిమ్మల్ని బాధ పెట్టిన యశోద అంటి కోసం కూడా ఫీల్ అవుతున్నారే..! అందుకే మీరు మా అందరికీ నేస్తం. :)

హరే కృష్ణ చెప్పారు...

>>తెలుగు బ్లాగుల్లో మీ బ్లాగ్ టాప్ 3 లో ఉంటుంది నేస్తంజీ..చాల చక్కగా రాసారు.

ఎవరక్కడ టాప్ 3 అని అన్నది
నేస్తం అక్కనే నెంబర్ వన్
ఇది మీరు నమ్మకపోయినా నిజం..హా!

అశోక్ పాపాయి చెప్పారు...

ammo baboye bale vrastarandi..asalu pagelaku pagelu ela vrastarandi.chaala bagundi mee blog ee roju modata choosanu chaala miss ayyanu:-(..nijamga super andi mee blog

మనసు పలికే చెప్పారు...

నేను వేణురాం, హరే కృష్ణ ల వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను..:)

Sasidhar Anne చెప్పారు...

Akka.. office lo pani chala ekkuva ga vundi.. hayiga navvukotaniki inko post veyyandi..
ippatike Yasoda Aunty post ni oka 10 sarlu chadivi vunta.. exam pedithey nene first vastha ee post lo..
btw.. naa blog lo kothha post rasanu chudagalaru..
sasi-anne.blogspot.com

jony చెప్పారు...

madhu babu garu me blog ni top 3 lo untundi ante chala happy ga undandi.... anthati vallu mecchukunte.... wowwwww....... nestam garu... meru ilage chelaregipovalani manaspurthiga korukuntu...............

నేస్తం చెప్పారు...

అశొక్ పాపయి గారు ధన్యవాదాలు :)
శశి ఈ మధ్య నా లాప్టాప్ కి జ్వరం వచ్చిందిలే అందుకే నీ లింక్ చూడలేదు..మొన్న వ్యాఖ్య రాసాను :)
jony మధు బాబు గారంటే కొంపదీసి మన షాడో నవలలు రాసే మధుబాబు గారా? ఇటువంటి జలక్ లు ఏమన్నా ఉంటే ముందే చెప్పేయండమ్మా ...నేను ఒక గ్లాస్ మంచి నీళ్ళు ప్రక్కనే పెట్టుకుంటాను :) అసలే ఎవరూ లేరు ఇంట్లో :)

రాజ్ కుమార్ చెప్పారు...

నేస్తంజీ, మీకు ఈరోజు వచ్చిందా ఈ డౌట్? కంగారు పడొద్దు. నేను మధు బాబు అభిమాని ని లెండి..కాని ఇప్పుడు మీకు అంతకంటే పెద్ద అభిమానిని.

నేస్తం చెప్పారు...

అయబాబొయ్ వేణు రాం అంటే ఆయన ఈయనా ఒకటేనా????కాదేమోలే ఆయన ఎక్కడ ???మనమెక్కడ ..???:)

Haritha చెప్పారు...

enka enni rojulu e yasoda aunty gola :(

Raghuram చెప్పారు...

నేస్తం గారు!,

ఇంకా యశోదా ఆంటీ పైనా కోపం పోలేదా ఏంటీ?.
ఆ కోపం మా పైన చూపిస్తే ఎలా అండీ, శాంతి వచనాలు వల్లెవేసి, కోపం తగ్గించుకొని ఒక టపా రాసి మా మొఖంపై పడవేయండి. చాతక,చకోరాల్లా మీ టపా కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్నాం.

రఘురామ్

అజ్ఞాత చెప్పారు...

next post kosam waiting ikkada .... pls ...

పవన్ కుమార్ చెప్పారు...

ఈ రొజు ఉదయం మీరు మీ బాబాయ్ ల మీద టపా వెసినట్టు అందులొ నెను 1st కామెంట్ చేసినట్టు కల వచ్చింది కామెడీగా..
ఈ టపా కి రిలేటెడ్ గా ఇంకా ఎదొ కల వచ్చింది కానీ సరిగా గుర్తురావటం లెదు.
నిజంగానే అలాంటి టపా ఎమైనా వెస్తున్నావా నేస్తం అక్కా.

నేస్తం చెప్పారు...

మరేంటో ఈ మధ్య బద్దకం గా ఉంటుంది ...అందుకే అన్నమాటా... పైగా రోజు సొంత సుత్తి ఏం రాస్తాం లే అని అదొక నిర్లక్ష్యం :) పవన్ బాబాయ్ ల గురించి రాయాలంటే ఆనందం కంటే విషాదమే ఉంది అందుకే రాయను

Lalitha చెప్పారు...

నేస్తం, మీ టపా బాగుందండి. మాది సంపుటి - వెబ్-సైట్ మరియు ఈ-పత్రిక. మీకు కధలు వ్రాసే ఉత్సాహం ఉంటే ప్రచురించాలన్న ఉత్సాహం మాకుందండి. తెలుపగలరు. ఈ మైల్-ఐడ్ కి లేఖ పెట్టగలరు:

portals@srisaa.com
www.samputi.com
http://samputi.com/launch.php?m=magazine&l=te

Ennela చెప్పారు...

అజ్జి బాబోయ్, ఇన్ని పోస్టులు ఎప్పుడు చదవాలి రొయ్ దేవుడొయ్.. నీ మీదొట్టు... రాయడం మానేసి...చదవడం మొదలెట్టేస్తా.....రెండు పోస్టులు చదివానా.....ఆఫీస్ కెళ్ళబుద్ది అవట్లే ..పోనీ లాస్ ఆఫ్ పే పెట్టాద్దామా అనిపిస్తోంది... కానీ అస్సలే 'పయిసల్లేక పానం మీదకొస్తాంది" ...అయినా చదివెయ్యలి...చదివెయ్యలి..

prabandhchowdary.pudota చెప్పారు...

Bagundhandi.

శ్రీధర్. దు చెప్పారు...

నన్ను ఇబ్బందిపెట్టిన మా ఇంటి ఓనర్లు అందరిని మీ యశోదా ఆంటీ టెనెంట్లుగా చెయ్యాలని ఈ టపా వార్షికోత్సవం సందర్భంగా మనవి చేసుకుంటున్నానహో...

అజ్ఞాత చెప్పారు...

mee blog ni andrajyothi lo chadivinappatnunchi veerabimaanipoyaa
meeku......

raaam చెప్పారు...

మొత్తానికి మీరు పార్క్ లో కాకుండా కొత్త ఇంట్లో ఉండేలా ఆ భగవంతుడు కాపాడేశాడన్న మాట

raaam చెప్పారు...

mee blog ni andrajyothi lo chadivinappatnunchi veerabimaanipoyaa
meeku......