23, ఆగస్టు 2010, సోమవారం

వరలక్ష్మి వ్రతం


ఇప్పుడుమనం వరలక్ష్మి వ్రత విధానం ...మరియు దానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందాం ...ఆగండాగండిఎప్పుడూ పాత విషయాలేనా అప్పుడప్పుడు వెరైటీగా ఇలా క్కూడా ప్రయత్నించాలి... ఏం వద్దా !! అయితే సరే ... కాని ఈసారి చెప్పబోయే విశేషాలు ఇవే...

చిన్నపుడు సినిమాల ప్రభావమో,సీరియళ్ళ పైత్యమో విదేశాల నుండి వచ్చిన వారైనా ,బాగాడబ్బుండే ఆడవాళ్ళ గురించి విన్నా మనసులో ఒక రూపం మెదిలేది. స్లీవ్లెస్ జాకిట్టు ఉన్న చీర కట్టి,భుజాలవరకు కత్తిరించినజుట్టుతో ,చేతిలో ఒక బొచ్చు కుక్కపిల్ల ,చుట్టూ పదిమంది మహిళా మండలి సభ్యులు ,బోలెడు ఇంగ్లీష్ కబుర్లు.... .. ఈరకంగా చిత్రం గీసేసి భారతీయ సంస్క్రతి ,సాంప్రదాయాలు మంట గలసి పోతున్నాయని తెగ ఫీలయి పోయేదాన్ని..

మొదటి సారి ఇక్కడకు వచ్చినపుడు మావారు తీసుకు వెళ్ళిన క్లబ్స్ లో ఎక్కువ ఫారినర్స్ ,నార్త్ ఇండియన్స్ ఉండటం వల్ల నేను వేసిన బొమ్మలో మార్పులు చేర్పులు ఉన్నపటికీ ఫీలింగ్ మాత్రం అదే....దానికి తోడూ అమ్మాయిలు పార్టికి రావడంరావడం అసలే మాత్రం మొహమాటం పడకుండా బీర్ ఎక్కడ ??బీరేక్కడ అని ఒకటే హడావుడి పడిపోయేవారు ....నాకిప్పటికీ గుర్తు ఒక అమ్మాయి అయితే వాళ్ళ నాలుగేళ్ల పాప, అమ్మ చేతిలో బీరు కావాలని ఏడుస్తుంటే ఒక స్పూన్పట్టేసింది ఆవిడ టక్కున ... నేను అయ్యో అదేంటండి అని నోరేల్లబెడితే ,ఇప్పుడు వద్దూ అన్నాం అనుకో అది వినదు ..అడగ్గానేపట్టేసామనుకో అది పట్టించుకోదు...పైగా ఇది కొంచెం చేదుగా ఉంటుంది దానికి నచ్చదులే అంది సింపుల్గా...

అలా పలుకారణాలవల్ల ఇక ఈ దేశం లో మన సంస్కృతీ సాంప్రదాయాలకు ఏకైక పట్టుకొమ్మను, బుట్ట బొమ్మను నేనే అని ఒక గాట్టినమ్మకానికి వచ్చేసాను...అక్కడి తో ఊరుకోకుండా ఒక చీర కట్టుకున్నా,తెలుగు మాట్లాడినా, పూజ చేసినా ,పుణ్యం చేసినా అన్నిటికీ నేను కాబట్టిఇలా చేస్తున్నా అదే ఇంకొకరైతేనా.... అని నాకు నేనే తెగ పోగిడేసుకునేదాన్ని.....ఇలా ఉండగా ఒక సంవత్సరం యదావిధిగా వరలక్ష్మి వ్రతం వచ్చింది... ఆ పళంగా అమ్మకు ఫోన్ చేసి అమ్మా ఎలా చేయాలమ్మా పూజ అని అడిగాను. దేశం కాని దేశంలో ఏం చేసుకుంటావే?ఇంత పరమాన్నం వండి ,నైవేద్యం పెట్టి దణ్ణం పెట్టేసుకో అంది . అసలేటి,ఏటనుకున్నావ్ నన్ను ఆయ్అని గదమాయించేసి వివరాలన్నీ చక చకా అడిగేసి ఫోన్ పెట్టేసాను...

తరువాత సరుకులు అన్నీ ఓ పెద్ద లిస్టు రాసుకున్నాను ... ముస్తఫా వెళ్లి వీధి వీధి తిరిగి ఆయన కసురుకున్నా ,విసుక్కున్నా'లక్ష్మి రూపు' తో సహా సామాను మొత్తం వెతికిసాధించాను.

ముందు రోజే ఇల్లంతా దులిపి శుభ్రం చేసేసాను..ఆ ప్రొద్దున్నే మా ఇంటి ఎదురుగా బోలెడు మామిడి చెట్లు ఉంటాయి కాబట్టి మామిడాకులు తెప్పించి తోరణాలు కట్టాను





అమ్మ వారికి బేసి సంఖ్యలో ఫలహారాలు చేయాలి అని అమ్మ చెప్పిందికాబట్టి ,మూడు అయితే గొప్ప గా ఉండదు తోమ్మిదయితే చేయలేను అని అయిదురకాలు పిండి వంటలు చేసాను. వాకిలి కడిగిముగ్గు వేసాను . చిన్న ముగ్గే లేండి .అసలే మాది మధ్య పోర్షన్ .అటు ఇటు తిరిగేవారికి ఇబ్బంది అని .లేపోతే మధ్యాహ్నం వరకు అదే పనిలో ఉండేదాన్ని.





ఆ తరువాత ఇంటర్నెట్ లో ప్రింట్ అవుట్ చేసిన పుస్తకం ప్రకారం గట్టి గట్టిగా మంత్రాలు చదువుతూ ( మరి మా ఆయన వినాలి కదా నోరు తిరగని మంత్రాలు అలోవకగా చదివేయడం... ఎందులో అయినా గొప్పగా ఉండాలి నేను ) పూజ తరువాత చారుమతి దేవి కధ మెల్లిగా మనసులో చదువుకుంటూ ముగించాను . ..ఇది మాత్రం మెల్లిగానే ఎందుకు అని ఈ పాటికి డౌట్ రావాలే మీకు..... మరి చారుమతి దేవి కధ అంతా ఆడవాళ్ళు కలలో కూడా పొరపాటున అనుకోవడానికి సాహసించని విషయాలే....అసలు కధ ప్రారంభమే ఆవిడ ప్రొద్దున్నే లేచి అత్తా,మామలను సేవించి భర్తను దైవ సమానం గా భావించి ,పాద పూజ చేసుకుని గయ్యాళి కాకా ,మితముగా భాషించి ... అసలు అసలు ఎక్కడన్నా కుదిరేపనులేనా ఇవి అని అడుగుతున్నాను...పైగా ఇన్ని చేస్తే గాని వరలక్ష్మి దేవి కరుణించదు అంట... చూడండి దేనికి దేనికి లింకో ... ఇప్పుడు ఇలాంటివి గట్టిగా చదివితే మా ఆయనకు లేని పోనీ డవుట్లు వచ్చెవూ.... అందుకే అన్నమాట...




అప్పుడు చివరాఖరున తోరాలు చేతికి కట్టుకుని అక్షింతలు ఆయనకు ఇచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టేసుకున్నా.. అలా పెట్టినపుడల్లా రోజూ వరలక్ష్మి వ్రతం వస్తే బాగుండును అని గొణుక్కుంటూ ఆయన, ఆ రోజు ఏదన్నా చిరాకు పెట్టినా చిరునవ్వుతో ఊరుకుని మరుసటి రోజు చక్ర వడ్డీ ,బారు వడ్డీ వేసి మరీ తీర్చేసుకోవడం నాకు ...అనాదిగా వస్తున్నా అలవాటు..



అలా పూజ అయ్యాకా ఇంట్లో ఏదో అవసరం అయితే కొనడానికి భయటకు వెళ్లాను..విదేశాలు అనుకుంటాం కాని పైకి మహారాణి పోజులు కొట్టినా పనిమనిషి కన్నా హీనం ...ఇంట్లో బాత్రుమ్లు కడగడం దగ్గరి నుండి,బట్టలు ఇస్త్రిలు,దర్జీ పని,చాకలి పని ,పిల్లల హోంవర్కులు, ఉప్పులు పప్పులు కొనడం ,బిల్లులు కట్టడం హూం ..ఏమిటో అంతా భ్రమ ....ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి... ఎంతవరకు చెప్పానూ?? ఆ .. అలా వెళుతుండగా ఎదురుగా ఎవరో అమ్మాయి నా వైపు చూస్తూ ... నా తిక-మక సంగతి తెలుసు కదా ...నవ్వాలా?వద్దా అనుకుని అయోమయం గా చూస్తుంటే దగ్గరి కొచ్చి ..ఎప్పుడి ఇరికిన్గే ? ఎంద బ్లాకు?ఉంగళ్ పేర్ ఎన్నా? అని అడిగేస్తుంటే ...అబ్బో మనకు తమిళ్ సూపర్ అర్ధం అయిపోతుందనుకుని సమాధానాలు చెప్పేస్తున్నా.. నేను తెలుగుదాన్ని అని తెలుసుకొని ' హమ్మయ్యా 'అని భారిగా నిట్టూర్చి ఏమండి మా బ్లాక్ అదే సాయంత్రం తాంబూలం తీసుకోవడానికి మా ఇంటికి రారూ అని ప్రేమగా అడిగేసరికి ....ఓ మనకులా మరొక శాల్తి ఉంది అన్నమాట తెలుగుదనం నిలబెట్టడానికి, నా రేంజ్ లో కాక పోయినా ఏదో ప్రయత్నించి ఉంటుంది అనుకుని 'ఓ ఎస్' అని మాట ఇచ్చేశాను ..

ఇంటికి రాగానే ఫోన్ ... 'హలో' అన్నాను ... మీరు పలానా ఫలానా అమ్మాయి ఫ్రెండ్ కదండీ అని అవతల ఎవరో.. అవునండి అన్నాను..నా పేరు కవిత ... నేను ఫలానా బ్లాక్ లో ఉంటాను ... ఈ రోజు సాయంత్రం తాంబూలం తీసుకోవడానికి మా ఇంటికి రారూ ప్లీజ్ అంటూ అభ్యర్ధన .... అబ్బో ...అనుకుని ...తప్పకుండా అన్నాను ..దేంక్ యూ కాని సాయంత్రం ఆరు దాటాక రండి ..నేను ఇప్పుడు ఆఫీస్ నుండి బయలు దేరుతున్నా ...సర్దుకోవాలిగా అంది.. నా తల్లే ..నువ్వు ఇప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు పూజ చేస్తావ్ అమ్మా అనుకుని సరే అనేసి పెట్టేసా పోన్ ...

సాయంత్రం ముందు తమిళ్ మాట్లాడిన అమ్మాయి ఇంటికి బయలుదేరా ప్రక్కనే కదా అని..ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి చూద్దును కదా గుమ్మం లో ఈ మూలా నుండి ఆ మూలా వరకు పెద్ద పెద్ద ముగ్గులు :( పైగా ఎదురుగా తులసి కోట ... దాని గూట్లో దీపం.. ఇంకా లోపలికి రానే లేదు ఆమె గభ గభా పసుపు గిన్నె తో వచ్చేసి కాళ్ళకు రాసి ,గంధం మెడకు పూసి, మల్లెమాల నా జడలో తురిమింది.. అయ్య బాబోయ్ ఇలా క్కూడా ఇక్కడ చేస్తారా అని చూస్తుంటే ...సాధారం గా పూజ గదిలో తీసుకు వెళ్ళింది ..ఆ అలంకరణ ను చూసే సరికి కళ్ళు తిరిగాయి ... తొమ్మిది రకాల పిండి వంటలు ...భారి ఎత్తున చేసింది ...

అవన్నీ ప్లేట్ లో పెట్టి ఇస్తే గదిలో కుర్చున్నానా ....అక్కడ ఉన్న అతిధులు అందరు అష్టలక్ష్ముల ఆడబడుచుల్లా ధగ ధగ లాడే చీరలు,నగలు మెడ కి గంధాలు ,చేతులకు తోరాలు ,కాళ్ళకు పసుపు ఏది మిస్ అవ్వకుండా అప్పుడే చారుమతి దేవి ఇంటి నుండి ఇళ్ళకు తిరిగి వెళుతున్నా ఇరుగుపోరుల్లా కళ కళ లాడుతున్నారు.. ఇక కబుర్లయితే మీరు మొన్న విష్ణు సహస్ర నామ పారాయణం పెట్టుకున్నపుడు పిలిస్తే రాలేదేం అని ఒకరంటే ,అదే రోజున లలితా సహస్ర నామ పారాయణం మా ఫ్రెండ్ ఇంట్లో అప్పుడు ... ఈ సారి వస్తానేం అని మరొకరు..ఇంకొకరు వాళ్ళ అమ్మాయిని పిలిచి గోవింద నామాలు మా పిల్ల ఎంత బాగా చెప్తుందో చూడండి అని అంటే వేరేఒకరు మా బాబు భవద్గీత లో సగం శ్లోకాలు తప్పులేకుండా వల్లెవేయిస్తాడు అని మరొకరు...వెంటనే కళ్ళ ముందు బావిలో కప్పు బెక,బెకా మని అరిచిన సీన్ కనబడింది.. అంటే మధ్య మధ్యలో ఆఫీస్ లో పెంచని హైక్ ల గురించి ,షేర్ మార్కెట్ కబుర్లు వినబడుతున్నాయనుకోండి ... అయినా సరే పూర్తీ ఇండియా వాతావరణం..


ఆ తరువాత కవిత ఇంటికి వెళ్లాను ... ఈ పిల్ల ఏం చేస్తుందిలే అని అంత తేలిగ్గా అనుకున్నానా ... తను అంతకన్నా భారిగా ఏకంగా కొబ్బరికాయకు జడ,కళ్ళు,ముక్కు అన్నీ ఓపిగ్గా అలంకరించి అమ్మవారిని చేసింది ...పన్నెండు రకాల వంటలు గట్రా చేసి మరీ నన్ను షాక్ చేసింది.. ఆ వచ్చిన వారందరూ మా ఇంటికి రండో,మా ఇంటికి రండో అని నన్ను,మిగిలిన వారిని బ్రతిమాలుతున్నారు.. ఒకరిద్దరి ఇంటికి వెళ్లి టైం చాలా అయ్యిందని వచ్చేసాను...ఇన్ని జాకెట్ ముక్కలు,కుంకుమ భరిణలు , పసుపు ,పూలు,పిండి వంటల పేకెట్లు వేసుకుని ఇంటి కొచ్చాను .... అవన్నీ చూసుకుని తెగ బాధ పడిపోయాను నాలుగు రోజులు.. వాళ్ళల్లా నేను చేయలేక పోయానే అని కాదు... అసలు ఎందుకు అలా చెయ్యాలి వాళ్ళు ...ఒక్క విషయం లో కూడా నన్ను గొప్పగా ఉంచరు కదా అని ... ప్లిచ్

204 కామెంట్‌లు:

«అన్నిటి కంటే పాతది   ‹పాతవి   204లో 201 – 204
..nagarjuna.. చెప్పారు...

ఇంకో డబుల్ శతక కామెంట్లు.... :)
అందుకోండి మా అభినందనలు

Sasidhar Anne చెప్పారు...

200 comments ki congrats akka.

raaam చెప్పారు...

pADAMANI NANNU ADAGAVALENA....
ENNI SARLU CHADIVANO.. ENNI SARLU NAVVV KUNNANO.............

raaam చెప్పారు...

pADAMANI NANNU ADAGAVALENA....
ENNI SARLU CHADIVANO.. ENNI SARLU NAVVV KUNNANO.............
pADAMANI NANNU ADAGAVALENA....
ENNI SARLU CHADIVANO.. ENNI SARLU NAVVV KUNNANO.............

«అన్నిటి కంటే పాతది ‹పాతవి   204లో 201 – 204   కొత్తది» సరి కొత్తది»