వెనుకటికెవరో నాలాంటి వాడిని "దేవుడిని ఇక నమ్మనని ప్రొద్దున్నే అని సాయంత్రం గుడికొచ్చావేం"? అని అడిగితే..మరీ శివరాత్రి పూటే నమ్మటం మానేస్తే దేవుడికి కోపం వస్తుందేమో రేపటినుండి మానేస్తా అన్నాడంట"..అలాగా.. 'ఛీ.ఛీ' నాకు క్రికెట్ అనే పదం అంటేనే పరమ చిరాకు అని దాని మీదే పోస్ట్ లు వేస్తున్నా వరుసగా.. :)
సరే కధలోకి వచ్చేస్తే నేను సింగ పూర్ వెళ్ళిన నెలరోజుల లోపే ఒక రోజు సాయంత్రం పని అయిపోయాకా మావారి గురించి ఎదురు చూస్తూ ,ఇండియానుండి తెచ్చిన ఆంధ్ర భూమి పత్రికను క్రింద తారీఖు ,వారం,పేజ్ నెంబర్లతో సహా వదల కుండా ముప్పయ్ మూడోసారి సీరియస్ గా చదువుతుంటే తలుపు తీసుకుని లోపలికి వచ్చారు మావారు..ఎప్పటిలా బేగ్ ఆ మూలన, షూస్ ఇంకో మూలనా పడేసి మంచానికి అడ్డంగా పడిపోయి.."అసలు భార్యంటే ఎలా ఉండాలి ..భర్త ఇంటికి రాగానే ..అయ్యో ఎంత అలసిపోయారో ,మంచి నీళ్ళు కావాలా?(వాటర్ బాటిల్ ప్రక్కనే ఉంటుంది ..అయినా సరే) కాళ్ళు పట్టామంటారా "అంటూ ఎంత ఇదై అదై పోవాలి..మనకసలు అలాంటివేమీ లేవు..సత్య భామ పోజులివ్వడం తప్ప అని రొటీన్ గా శివాలెత్తి పోకుండా ..ఎంతో సౌమ్యంగా నా ప్రక్కనే చేరిపోయి బుజ్జీ!! అని గారంగా పిలిచారు ...నాకు కుడికన్ను అదురుతుండగా 'ఆ.. ఏంటీ' అన్నాను ...నీకో విషయం తెలుసారా ..సింగపూర్‌లో ఇంటర్నేష్నల్ క్రికెట్ మేచ్ జరుగుతుంది ఫలానా రోజున ..ట్రయాంగిల్ సిరీస్ అన్నారు ఉత్సాహంగా ..'అయితే' ?? అన్నాను భృకుటి ముడిచి ..అయితే అని సింపుల్‌గా అంటావేంటీ.. మళ్ళా ,మళ్ళా ఈ అవకాశం వస్తుందో లేదోఅని .. అని ఆగారు..'లేదోఅని ' రెట్టించాను.. నీకు ,నాకు టికెట్స్ తీసుకున్నాను అన్నారు మెల్లగా..
అంతే ఒక్క సారిగా 'గయ్' మన్నాను..మొన్నే కదా పొదుపు -వాటి లాభాలు-పాటించవలసిన పద్దతులు అనే విషయం మీద అరగంట క్లాస్ పీకాను ..పైగా ఒకప్రక్కన చెల్లెలి పెళ్ళికి కొంచెం డబ్బు ఇవ్వాలన్నారు.. ఇంకోప్రక్క అప్పు చేసి వచ్చాను అన్నారు ..మరో ప్రక్క ఇల్లూ,వాకిలీ లేదు .. ఇప్పుడిలా అంటే ఏమిటర్ధం?..అని తిట్టిపడేసాను.. అబ్బా !అవన్నీ నేను చూసుకుంటాను.. నీకు తెలుసుగా నాకు క్రికెట్ ఎంత ఇష్టమో ..ఈ టికెట్స్ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా..పైగా బోలెడు మంది క్రికెటర్స్ వస్తున్నారు..పైగా నీకిష్టం అయిన కూంబ్లె కూడా వస్తున్నాడు అన్నారు..ఉహు..వద్దు వాడికీ పెళ్ళి అయిపోయింది ..నాకు అయిపోయింది నేను చూడను అన్నాను మొండికేస్తూ..
ఎవర్తివే నువ్వు ..ఇలా వేపుకుతింటున్నావ్ అని కాసేపు గొణుక్కున్నా నా వీక్నెస్ బాగ తెలుసు కాబట్టి ప్లేట్ మార్చేసారు .. అది కాదు బుజ్జి..ఇప్పుడూ ..నువ్వు మేచ్ కి వచ్చావు అనుకో .. టి.వి లో నువ్వు కనబడతావు కదా ..అప్పుడు మీ అమ్మా,నాన్నలు ఎంత సంబరపడిపోతారు ..పైగా మీ బంధువులందరూ మీ నాన్నకు ఫోన్ చేసి మన బుజ్జి టివిలో కనబడింది అంటే మీ నాన్న ఎంత గొప్పగా ఫీల్ అవుతారో తెలుసా ..ఇంకా నువ్వెలా ఉన్నావో కూడా మీ నాన్నకు ఫ్రీగా కనబడుతుంది ..వాళ్ళెంత ఆనంద పడిపోతారో ఊహించూ అని ఒక సెంటిమెంటు సినిమా కళ్ళముందు చూపించేసరికి' సరే' అని ఒప్పేసుకున్నాను.. ఆ వెంటనే మా వాళ్ళకు ఫోన్ చేసి ఆ రోజున ఏం డ్రెస్ వేసుకుంటున్నానో ,ఏ రంగు గాజులో,ఎటువంటి జూకాలో ,ఏ రంగు రబ్బర్ బేండ్ తలకు పెట్టుకుంటున్నానో ప్రతీదీ వదలకుండా చెప్పేసాను..
మొత్తానికి అనుకున్న రోజు వచ్చింది..కల్లాంగ్ స్టేడియం లో మేచ్.. ఆ రోజు మావారు లీవ్ పెట్టేసుకున్నారు.. మంచినీళ్ళు,తిండి గట్రా పేక్ చేసుకుని ఇద్దరం బయలుదేరాం .. మేము వెళ్ళేసరికి చాంతాండంత 'క్యూ' ఉంది.. బోలెడు మంది బయట సార్,సార్ ఎక్స్ ట్రా టికెట్ ఉంటే ఇవ్వండి అని బ్రతిమాలుతున్నారు .. చూసావారా ..నేను చెబితే నమ్మేవా..మనకు భలే లక్కీగా దొరికాయి టిక్కేట్స్ అన్నారు.. నేను అలా ఫోజులు కొట్టే సందర్భాలను అస్సలు మిస్ చేసుకోను.. స్టైల్ గా వాళ్ళను చూస్తూ మాకు టికెట్స్ ఉన్నాయి తెలుసా అని లుక్కులిస్తూ లోపలికి వచ్చేసా..ఒక బెంచ్ పైన చోటు చూసుకుని ఇద్దరం సర్ధుకు కూర్చున్నాం .. కూర్చున్నదగ్గరనుండీ నా చూపులు ఎన్ని కెమారాలున్నాయి?? ఎక్కడెక్కడ ఉన్నాయి?? వెదుక్కోవడమే సరిపోయింది..
ఏమండీ!! మరేమో టి.వి లో మన మీద కొచ్చి షూట్ చేసినట్లు కనబడుతుంది కదా ..మరేమో ఇక్కడ ఎక్కడో ఫోర్ లైన్ లో కెమేరాలు కనబడుతున్నాయేంటీ? అన్నాను ఆరాగా.. అంటే అందులో 'జూం' ఉంటుంది కదా ..అక్కడి నుండి తీసినా కనబడతాం అన్నమాటా అన్నారు...ఓ..మరి అక్కడి నుండి తీస్తే .. వాళ్ళు మనల్నే తీస్తున్నట్లు మనకెలా తెలుస్తుంది??.. పైగా చాలా మంది ప్రేక్షకులు వాళ్ళు టి.వీలో కనబడగానే టాటాలు చెప్పేసి ..నవ్వేస్తుంటారు..వాళ్ళకెలా తెలిసిపోతుంది ??అన్నాను అనుమానంగా.. అంటే అక్కడ ఎదురుగా ఒక పెద్ద టీ.వి ఉంటుంది అందులో మేచ్ కనబడుతుంది ..దానిలో చూసి.. వాళ్ళను చూసుకుని కనిపెట్టేస్తారు అన్నమాట అన్నారు..మరి ఇక్కడ టీ.వి ఎక్కడ ఉంది?? అన్నాను అటు,ఇటు చూస్తూ.. 'యెహె పో' ..ముందు మేచ్ చూడు అన్నారు చిరాగ్గా..
మేచ్ మొదలైపోయిందా అప్పుడే అన్నాను బోలెడు ఆక్చర్యపోతూ ..అప్పుడే రెండు ఓవర్లు కూడా అయిపోయాయి..ఏం చూస్తున్నావ్ అన్నారు.. గ్రౌండ్ వైపు చూసాను.. ఎక్కడో అర అంగుళం అంతమనుషులు కనబడుతున్నారు.. ఎవరు బేటింగో ?ఎవరు బౌలరో ?ఏంటో? ఏమీ అర్ధం కావడంలేదు ..గ్రౌండ్ లో మేచ్ అంటే ఇంత భయంకరం గా కనబడుతుందా?? ఆ మాత్రందానికి ఇన్ని డబ్బులు పెట్టుకుని చూడాలా మేచ్ అన్నాను..ఇంతలో ఎవరో 'ఫోర్' అన్నారు.. అబ్బా మధ్యలో మాట్లాడకు.. 'ఫోర్' అంటా మిస్ అయిపోయా అన్నారు మా ఆయన.. తిక్క కోపం వచ్చింది.. ఇదే టివీ లో అయితే అన్ని ఏంగిల్స్ లోనూ పది సార్లు చూపుతాడు విసుక్కుంటూ అన్నాను..
ఈ లోపల జనాలందరూ 'ఓ'అని మూలిగారు.. ఏమైంది? అన్నాను ..అవుటయ్యారు అన్నారు మా ఆయన .. ఎవరూ? అన్నాను .. గంగూలీ అనుకుంటా? అన్నారు..ఎలా? అన్నాను ..ఏమో బౌల్డేమో?.. కాదు..కాదు'కేచ్' అనుకుంటా అన్నారు ..ఈసారి మా ఆయనను చూసి జాలేసింది.. ఇక్కడ పెద్ద టి.వి ఉంటుంది ..అందులో మనం కనబడతాం అన్నారూ అన్నాను ... అంటే చిన్న గ్రౌండ్ కదా అలాంటి ఎక్విప్మెంట్స్ లేవనుకుంటా అన్నారు..మరి నాకు నేను ఎలా కనబడతాను ?..పైగా చెత్తలా ఉంది ఈ గ్రౌండ్ ..నాకేం నచ్చలేదు..ఇండియాలోనే మంచి,మంచి గ్రౌండ్లు ఉంటాయి ..ఇక్కడ టాయిలెట్స్ కూడా సరిగాలేవు అన్నాను విసుక్కుంటూ.. అంటే సింగపూర్‌లో క్రికెట్ ఎవరూ చూడరు కదా ..పుట్ బాల్ కు ఉన్న క్రేజ్ క్రికెట్‌కు ఇక్కడ ఉండదు..అందుకే ఆపధర్మంగా ఈ గ్రౌండ్ ఏర్పాటు చేసి ఉంటారు అన్నారు... అలాంటప్పుడు మరి ఇక్కడ ఎందుకు మేచ్ లు పెట్టారు చెత్తలాగా విసుగ్గా అన్నాను..
ఇంక దీనితో లాభం లేదనుకున్నారేమో ..బుజ్జీ ఒక పని చేయి .. ఆ ఫోర్ లైన్ ఉంది కదా అక్కడ నించో ..ఎవరన్నా నీ వైపుకు బాల్ ఫోర్ కొట్టారనుకో ..అప్పుడు అన్ని కెమెరాలు నిన్ను కూడా బాల్ తో పాటు కవర్ చేస్తాయి అని నా నస వదిలించుకునే ఒక సలహా పడేసారు..నాక్కూడా నిజమే అనిపించేసి అమాయకంగా ఆ లైన్ లో నించుని కెమెరాల వైపే చూస్తూ నించున్నా.. కానీ ఇటు మనవాళ్ళు గాని అటు జింబాంబ్వే వాళ్ళు గాని ఒక్కడన్నా ఫోర్ కొట్టిన పాపాన పోలేదు .. ఎంత ఆశగా చూసానంటే ..అబ్బే..రెండు టీముల్లో ఒక్కడికి కూడా జాలి లేదు.. ఎవరూ నేను ఉన్న వైపు ఫోర్ కాదు కదా కనీసం డబల్స్ కూడా కొట్టలేదు ఆట మొత్తానికి..
కాసేపయ్యాకా ,మా ఆయన బయటకువెళ్ళారు ఇప్పుడే వస్తానని.. డ్రింక్స్ ఏవో తాగుతున్నారు ఆటగాళ్ళు.. నాకు చాలా బోర్ గా అనిపించింది.. అలా చూస్తుంటే గంగూలి ,ద్రవిడ్ అనుకుంటా అటు వెళుతూ కనబడ్డారు..నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది.. వాళ్ళదగ్గర ఆటోగ్రాఫ్ అడిగితే మా వారికి చూపిస్తే ..భలే సంతోషపడిపోతారు కదా అనుకుని అటు పరిగెత్తాను.. ఈ లోపలే నన్ను తోసుకుంటూ ఒక యాబై మంది ..సార్ ఆటో గ్రాఫ్ ప్లీజ్ అంటూ వాళ్ళ మీద పడ్డారు..వాళ్ళు కొంతమందికి ఇస్తున్నారు,మరి కొంతమందికి సారీ చెబుతున్నారు.. ఇంకేం వెళతాం..హూం అని భారీ గా నిట్టూర్చీ వెనక్కి తిరిగాను..
' హెల్లో' ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాను.. ఫోర్ లైన్లోనుండి జింబాంబ్వే ప్లేయర్ ఎవరో నావైపే చూస్తున్నాడు.. నేను అటు,ఇటు చూసాను ..నన్నా? కాదా అని.. మళ్ళీ పిలిచాడు దగ్గరకు రమ్మని సైగ చేస్తూ..నా ఇంగ్లీష్ పాండిత్యం మీకు తెలిసిందే కదా ...'ఆ అంటే ఈ 'రాదు నన్ను ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో??అని భయం భయం గా దగ్గరకు వెళ్ళాను.. ఆటో గ్రాఫ్ కావాలా అన్నాడు సైగ చేస్తూ..ఊ..ఉహుహు అన్నాను ఏమనాలో తెలియక ..బుక్ ఇవ్వు అన్నాడు ... నా దగ్గర ఉన్న బుక్ గబుక్కున అతనికి ఇచ్చాను.. 'పెన్ ' అన్నాడు సైగ చేస్తూ..హేండ్ బేగ్ గభ గభ చూసాను .. అక్కడ అవతల మళ్ళా మేచ్ మొదలై పోతుంది..అతను కంగారు పడుతున్నాడు..నా దగ్గర పెన్ లేదు.. జాలేసి పెన్ లేదు ...వద్దులే ..పర్వాలేదు అని సైగ చేసాను..అతను నవ్వి మరెవరినో పెన్ అడిగి సైన్ చేసాడు.. అతనికి ధేంక్స్ చెప్పి వచ్చి పేరు చూసాను ..ఆ పేరు గుడ్విన్ ..నాకు జింబాంబ్వే క్రికెటర్స్ లో తెలిసిన ఒకే పేరు అది..
అలా మొత్తానికి మేచ్ మొత్తం బోరు,బోరుగా చిరాకు చిరాకుగా జరిగింది..ఆ మేచ్ లో మనవాళ్ళు గెలిచారు(ట) ..అయిపోయాకా అందరూ పొలోమని ఇళ్ళకు పారిపోయారు ..మా ఆయన మాత్రం గ్రౌండ్ లోకి తీసుకువెళ్ళారు.. ' రవి శాస్త్రి ' కోసం.. నాకేంటో రవి శాస్త్రి అంత ఇష్టం ఉండడు..జిడ్డుగాడు.. చెత్తలా ఆడతాడు అని మ ఇంట్లో పెద్ద పేరు.. అలా అంటే మా ఆయన ఒప్పుకోరు ..సిక్స్ సిక్స్ లు కొట్టిన ఘనత శాస్త్రిదేనే మనవాళ్ళలో అని వాదిస్తారు..సర్లే పోని ముచ్చట పడుతున్నారు కదా అని వెళ్ళాను..అప్పటికే ఎవరి మీదో ధుమ ధుమలాడుతున్నాడు అయ్యగారు.. మొహం పింక్ కలర్ లో కందిపోయి ఉంది ..కాని చాలా బాగున్నాడు..మొన్న టి.వీ లో చూస్తే జుట్టు పీకేసిన కోడిలా చాలా భయంకరం గా ఉన్నాడు పాపం.. ఈ లోపల కెమేరా ఆన్..స్టార్ట్ అని అరిచారు ఎవరో ..అంతే కోల్గేట్ మాడల్ లా తీయగా నవ్వుతూ ఏంటో చెబుతున్నాడు ..అప్పుడు చాలా ఆక్చర్యం వేసింది ..వెంట వెంటనే మూడ్ మార్చుకోవాలంటే కష్టం కదా అనుకున్నా..
అతని మాటలు అయిపోగానే మేము ఎదురుగా నించున్నాం..మావారి దగ్గర పెన్ తీసుకుని ఆటోగ్రాఫ్ అడిగాను.. అసలే మావారి ఫేవరెట్ ప్లేయర్ కదా..అప్పటికి సింగపూర్‌లో క్రికెట్ అంత గా పట్టించుకునేవారు కాదు కాబట్టి మాకు చాలా ఫ్రీగా ఉంది..జనాలు లేకుండా.. రవి ఒక సారి నవ్వి సంతకం పెట్టి పెన్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు.. దానితో మావారు గోల గోల..అది ఈయనగారి సెంటిమెంట్ పెన్ అంట ..కాసేపు అయ్యాకా పోనిలే రవి నా పెన్ తీసుకున్నాడు అని తెగ ఆనందపడ్డారు.. అయ్యో ఎంత అమాయకం అండి కాసేపటిలో యే చెత్త బుట్టలోనో పడేస్తాడు అనుకున్నా మనసులో.. అలా క్రికెటర్లను అందరిని చూసుకుని ఇంటికొచ్చేసాము..ఇంటికి వచ్చాకా నేను కనబడ్డానా అని తెగ ఆత్రుతగా అడిగాను..అంటే కనబడ్డావనుకుంటా..నువ్వే అనుకుంటా..చూసామనుకుంటా అని నన్ను తృప్తిపరిచే మాటలు మావాళ్ళు మొదలు పెట్టారు..కొద్దిగా నిరాశగా అనిపించినా పోనిలే బాబు ఒక పని అయిపోయింది మా ఆయన కల తీరిందికదా అనేసుకున్నా అమాయకంగా
కాని కధ అక్కడితో అయిపోలేదు మొదలయ్యింది :)
58 కామెంట్లు:
తమరికి కుంబ్లే అంటే ఇష్టమా? ఇంకా నయం అభయి కురువిల్లా అంటే ఇష్టం అన్నారు కాదు.
meeru post rasaru ani anandapadalo malli eppatiki rastaro ani nirasapadalo ardam kavadam ledu....
eppatila bagundi...
అధ్యక్ష్యా.., ఈ బ్లాగును ఎక్కువగా చదివేది క్రికేట్టును అభిమానించే దేశంలో ఉండేవాళ్లు, గసొంటిది గౌరవ నేస్తం గారు ఊకూకె క్రికెట్టుని ఛీఛీ అనడం మా మనోభావాలను దెబ్బతిసేవిగా ఉన్నాయధ్యక్ష్యా....
ఇందుకు నిరసనగా మేం వాకౌట్ చేస్తున్నాం, రేపు అఖిలాంధ్ర క్రికెట్ సంబరాలు చేస్తాం...దానికి జగన్‌ను రానిచ్చేడ్ది లేధ్యక్ష్య...
ఉద్యమం తీవ్రత వచ్చే పోస్టును బట్టి మారుస్తామని కూడా చెపున్నా అధ్యక్ష్య....
ఆటో గ్రాఫ్ ఇచ్చింది darrel గుడ్విన్ ఆ లేక ముర్రే gudwin ఆ
ఇప్పుడు ఇంగ్లాండ్ లో కౌంటీ లు ఆడుతున్నాడు ముర్రే గుడ్విన్
మా టెండూల్కర్ 85 పరుగులు కూడా చేసాడు అలాంటి మ్యాచ్ మీకు బోర్ కొట్టిందా?
సెప్టెంబర్ నాలుగు 1999 లో జరిగిన సంఘటన ఇంకా గుర్తు పెట్టుకొని మరీ ఇలా క్రికెట్ ని ఆడిపోసుకుంటారా
మీరు ఇలా క్రికెట్ అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా రాస్తున్నందుకు వచ్చేసంవత్సరం సింగపూర్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ ప్రాప్తిరస్తు
రవి శాస్త్రి మాత్రం జిడ్డు గాడే :)
నాగార్జునా చారి గారు చేపట్టే ఉద్యమం లో మేము కూడా జాయిన్ అవుతున్నాం
నేస్తం గారు! హైలట్.....
మీరు కూంబ్లే అభిమానా! నేను కూడా తన అభిమానినే బౌలర్లలో! నాకు రాహుల్ ద్రావిడ్ బాగా ఇష్టం. ఇద్దరూ కర్ణాటక వాళ్లే!
మొత్తానికి రెండు ఆటోగ్రాఫ్ లు సంపాదించారుగా! ఆ ఫొటొస్ పెట్టాల్సింది.
"వద్దు వాడికీ పెళ్ళి అయిపోయింది ..నాకు అయిపోయింది నేను చూడను అన్నాను మొండికేస్తూ"
ఇది చదివి గట్టిగ నవ్వేస్తే వాళ్ళ ఆవిడతో ఫోన్ లో మాట్లాడుతున్న మా రూమ్మేట్ ఉలిక్కి పడ్డాడు. :)
కెమెరా లో కనపడతారు అని చెప్తే ఒప్పేసుకున్నారా. భలే భలే :)
నేస్తం గారూబాగారాసారు. రవి శాస్త్రి ఆట నాకూ నచ్చేది కాదు మేము జిడ్డు అనేవాళ్ళం.మొత్తానికి క్రికెట్ మాచ్ ని ప్రత్యక్షం గా చూడడం కన్నా టివిలొచూడడమే బెటర్ అనమాట .
నేస్తం...బాగారాసారు.
ఇది అన్యాయమండి అభిమానంగా ఆటోగ్రాఫ్ ఇచ్చినాకూడా రవిశాస్త్రిని పట్టుకొని జిడ్డు అంటారా.
ఈ మేచ్ దేంట్లోనైనా రిప్లే వస్తే చూడాలి.
ఇదేకదా ఆ రొజు మీ మేకప్
" చక్కగా బిగించిన జడ తో, తిలకం బొట్టు తో( ఇది మీ నాన్న ఆర్డర్ ప్రకారం) ఆ క్రింద కొంచెం కుంకుమ బొట్టుతో ( ఇదిమీ అత్తగారి ఆర్డర్) పట్టీలు కూడా మిస్ అవ్వకుండా అప్పుడే ఎర్ర ప్లయిట్ దిగి వచ్చిన అచ్చమైన అప్పలమ్మ "
ఆ రొజు మాచ్ లొ, టి వి లొ మిమ్మల్ని చూసా అయితే :-))
meeru nijjanga amaayakulandi baabu!TVlo kanapistavu anagaane live match chooddanikellipoyara:(
as usual post sooper
murali garu correctga chepparu
postlu tvaraga postandi
ఏంటండీ నేస్తం గారు మీరు శనివారం ఆదివారం పోస్ట్ లు రాయను అని చెప్పి ఈరోజు రాసారు లేకపోతే ముందు కామెంట్ నాదే ఉండేది
ఆఫీస్ అందరికీ ఉండదు కదా ఈరోజు ఇప్పుడు నా కామెంట్ కూడా 25 లోపే ఉంటుంది చూడండి
దయచేసి మా కోసం సోమవారం నుండి శుక్రవారం వరకు రాయగలరా ప్లీజ్
వద్దు వాడికీ పెళ్ళి అయిపోయింది ..నాకు అయిపోయింది నేను చూడను అన్నాను
హ హ.. ఇది సూపరు....
ప్రతి రోజు కనీసం 4 సార్లు విజిట్ చేస్తున్న సరే మీ బ్లాగ్ లొ మొదటి కామెంట్ పెట్ట లేక పొతున్నా నేస్తం గారు.. దేనికైన అద్రుష్టం ఉండాలి..
మరీ ఇంత చిన్న పోస్ట్ రాసరేమిటండీ? :( ఎప్పటి లాగానే బాగుంది...
Rajkumar
chaala baavundandi ... :):):)
హ హ హ అసలు మీకెందుకు అంత చిరాకు క్రికెట్ అంటే... పాపం ఆట బాగానే వుంటుంది కదా.. ఇప్పటికీ మీకు క్రికెట్ అంటే అదే చిరాకా కాల క్రమేణా మారేరా?
అసలు అనిల్ కుంబ్లె కి ఆ కురువిల్లాకి ఏమన్నా సంబంధం ఉందా శ్రీనివాస్.. అలా ఎలా పోల్చేసారు.. ఏదేమైనా నాకు చాలా ఇస్తం :)
మురళి గారు రోజు రాయాలన్నా ఏం రాసామండి.. చాలా విషయాలు వ్రాసేసా అప్పటికీ :)
చారి గారు క్రికెట్‌ని అభిమానించే అబ్బాయిలందరి భార్యాల్లో కనీసం 85% క్రికెట్‌ని ద్వేషిసారు ..కావాలంటే కమిటీ వేసుకుని చెక్ చేసుకోండి.. వాళ్ళ బాధను చల్లార్చడం కోసమే నా తపన అంతా..:)
హరే క్రిష్ణ ఇలా చెప్పానో లేదో అలా రోజులు నెలలు వారాలు వర్జ్యాలు రాహుకాలాలు అమృత గడియలతో సహా వివరాలు చెప్పేసారు చూసారా.. ఈ పిచ్చి తట్టుకోలేకే నా ద్వేషం అంతా ఆ ఆటపై ..ఇక అతను ముర్రే గుడ్విన్ నే :)
సవ్వడి మీరు కూడానా.. నాకెందుకో కర్నాటక ప్లేయర్స్ చాలామంది చాలా ఇష్టం ముఖ్యం గా ద్రవిడ్,శ్రీనాధ్,అనిల్ ...ఇంకెవరున్నారో తెలియదు..వాళ్ళ ఫేస్ చూడగానే ఎంత మంచోళ్ళో అనిపించేస్తూ ఉంటుంది :)
సాయ్ ఎంటో అప్పట్లో అలా అనేసుకున్నా అన్నమాట :)\
రాధికా నాకు తెలిసి ఒక ప్లేయర్ క్రీజ్ లోకి రాగానే తొందరగా అవుట్ అయిపోతే బాగుండునని వాళ్ళ దేశస్తులే కోరుకునే ఏకైక ఆటగాడు ఆయన :) మరి అతని గొప్పతనం ఎదన్నా అంతకు ముందు ఉందేమో తెలియదు..
పద్మ థేంక్యూ :)
3g గారు మరి ఆటోగ్రాఫ్ ఇస్తే జిడ్డు శుభ్రం అయిపోతుందంటారా... :)
మంచుపల్లకి గారు అదేమరి బ్లాగుల్లో నిజాలు రాస్తే ఇలాగే ఉంటుంది.. ఎవరు చూసొచ్చారు నేను కూడా అల్ట్రామోడ్రన్ అమ్మాయిలా ఉంటా అని కోతలు రాసేయాల్సింది :)హి హి హి కాకపోతే నేను అలాగే వెళ్ళా ఆ రోజు.. ఈ రోజుకి అలాగే ఉంటా.. కాస్త మోడ్రన్ గా తయారవ్వడానికి ట్రై చేస్తే అదేదో సినిమాలో రాధిక ఫేంట్ షర్ట్ మీద జడగంటలు కట్టుకుని తయారయిన వైనం నాకే గుర్తువస్తుంది ..నాకు నప్పదులేండీ ... :)
ప్రియ ఏం చేస్తాం చెప్పు అప్పటిలో కాసింత అమాయకంగానే ఉండేదాన్ని.. ఇప్పుడు బోలెడు తెలివితేటలు పెరిగిపోయాయి అనుకో :)
అఙ్ఞాత గారు నిజానికి శని ఆదివారాలు అసలు కంప్యూఅర్ జోలికి రాను.. కాకపోతే ఈ రెండు రోజులు మావారు ఆఫీస్ లో ఏదో ట్రైనింగ్ ఉందనే సరేలే రాసేద్దాం అని ఈ రోజురాసా .. అయినా మీ కామెంట్స్ ఎప్పుడొస్తే ఏముందండి..ప్రతి కామెంట్ నాకు అపురూపమే :)
వేణురాం చిన్న పోస్టా.. హహహ ...ఇంకా ఎక్కువ రాసే నిజంగానే బోర్ కొట్టేది మీకు :)
ఫణి గారు థేంక్స్
సృజన నీ ఫోన్ నెంబర్ తెలియదు ..లేకపోతే ఈ రోజు నీకు కాల్ చేసేదాన్ని..మీ ఇద్దరి వివాహ బంధం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను :)
భావనా అసలు వ్యకులపై కోపం క్రికెట్ మీదకు మళ్ళింది.. పెళ్ళికి ముందు కాసింతైనా చూసేదాన్ని.. నాన్నా,తమ్ముళ్ళు,చిన్నాన్నలు అందరూ ఉంటారుగా..నాకూ బాగానే ఉండేది.. ఇక్కడకు వచ్చాకా మీరు నమ్మరు పొరపాటున కూడా అది ఎంత పాకిస్తాన్ -ఇండియా లాంటి మేచ్ లైనా మాటవరసకు కూడాచూడను..అసలు ఇంట్రెస్ట్ అనేది ఎంత ప్రయత్నించినా కలగడంలేదు :)
నేనూ కామెంట్ పెడుతున్నానోచ్ః-)...నాకూ చిన్నప్పట్నుంచీ క్రికెట్టంటే అంత పడదండీ!స్కూల్లో ఆరో తరగతి వరకూ బానే(అంతలేదులెండి, అంపైరింగే ఎక్కువశాతం) ఆడేవాణ్ణి...కానీ చదువుకి పెద్ద ప్రతిబంధకంగా అనిపించి వదిలేశా..ఇప్పటికీ అంత ఇష్టం ఉండదు,కానీ అప్పుడప్పుడూ చూద్దామని కూర్చుంటే మనవాళ్ళు దారుణంగా ఓడిపోతారు,అందుకే మావాళ్ళు నేను ఏదన్నా మ్యాచ్ కి పొరపాటున కూర్చున్నానంటే,తన్ని తరిమేస్తారు..
ఇంకా అలానే జడ బిగించి వేసుకుని,పట్టీలు పెట్టుకుని వెళ్తున్నారన్నమాట!మంచి తెలుగమ్మాయి మీరు....మా అక్క మాత్రం అక్కడికి వెళ్ళగానే జీన్సులు తగిలించడం మొదలెట్టింది,నాకేమో నచ్చేది కాదు.ఏమన్నా అంటే మా ఆయనకి ఇష్టం అంటుంది...ఇంకో ఇంగ్లీషు సామెతకూడా విసిరేది...be roman in rome అని...నా ఓటు మాత్రం మీకే, మన తెలుగు సామెతకే.....ఏ దేశమేగినా ఎందు కాలిడినా.....
అవును గుర్తువుంది నేస్తం మీ కధ, మీ నాన్న గారిని కూడా ఎలా తిప్పేసేరు అందరు కుట్ర కట్టి క్రికెట్ వైపు మళ్ళించిన కధ కమామీషు.
జాజిపూలు బ్లాగు బోర్ కొట్టె ప్రసక్తే లేదండీ.. ఎంత పెద్ద పోస్ట్ అన్న ఇట్టే అయి పోతుంది.. :) ఈ సారి వీలు చూసుకొని కాస్త పెద్ద పోస్ట్ రాయండి నేస్తం..
ನೆಸ್ತಂ/నేస్తం గారూ పోస్ట్ బావుందండీ
కర్నాటక ప్లేయర్స్ అంటే మీకు ఇష్టమా ఒకప్పుడు అయినా
మీకు శ్రమ లేకుండా ఇదుగోండి వాళ్ళ లిస్టు ఇక్కడ ఇస్తున్నా మీకు గుర్తొచ్చినప్పుడల్లా వీరి గురించి కూడా రాసేయండి :)
రోజేర్ బిన్నీ
సదానంద్ విశ్వనాథ్
భగవత్ చంద్రశేఖర్
గుండప్ప విశ్వనాథ్
సయెద్ కిర్మాణి
బ్రిజేష్ పటేల్
ఏర్రాపల్లి ప్రసన్న
జవగళ్ శ్రీనాథ్
వెంకటేష్ ప్రసాద్
అనిల్ కుంబ్లే
సునీల్ జోషి
రాహుల్ ద్రావిడ్
సుజిత్ సోమసుందర్
దొడ్డ గణేష్
డేవిడ్ జాన్సన్
రాబిన్ ఊతప్ప
ఆర్. వినయ్ కుమార్
అభిమన్యు మిథున్
-ಅಜ್ಞಾತ ಇಂದ್ರೇಶ್
మీరు కొన్ని పొస్ట్లయినా పసిఫిక్ టైమింగ్లొ పెట్టండి... నా కామెంట్ ఎప్పుడూ "మొదటి ఐదు" లొ వుండటం లేదు.. ఇలా అమెరికా జనాల్ని అన్యాయం చేస్తే ఎలా...
BETTER LATE THAN NOT.
అయినా ఇంత లేటుగానా?
టపా బాగుంది.
మంచు.పల్లకి గారి కామెంట్ కూడా సూపర్.
మీరు ఏమీ అనుకోనంటే ఒక సలహా.మీ పోస్టు లు పాతవి చాలా బాగుండేవి సహజంగా. ఈ మధ్య ఆ సహజత్వం లోపిస్తోందండీ. మేమందరమూ నేస్తం గారి అమాయకత్వం వాటి పర్యావసానాల పోస్టులకి అలవాటు పడ్డాము కరక్టే.
కానీ ఈ మధ్య మీరు రాసే పోస్టులలో ఆ లక్షణాలు అంతర్లీనంగా ఉండాలని శ్రద్ధ తీసుకుని రాస్తున్నట్లుందే తప్ప సహజం గా లేవండీ.
మీరు ఈ కామెంటు ప్రచురించకపోయినా నేను చెప్పదలచుకున్నది మీకు అర్ధం అయితే చాలు.
పెద్ద బ్లాగర్లకి కామెంట్స్ ఎక్కువ నేను మళ్ళీ పెట్టటం ఎందుకు అనుకున్నాను కానీ, మీరు ప్రతి కామెంట్ అపురూపం అన్నారు కాబట్టి, నిన్న 3గ. నా సమయం మీ బ్లాగ్‌కి ధారపోసాను కాబట్టి, ఈ కామెంటు పెడుతున్నాను.
your blog is really great. may be you can think about publishing a book.
can somebody please tell me how to write in telugu.
nenu kooda monna IPL matches ki velli, andhariki cheppesa.. chudandi ra.. TV lo vastha ani..
Kani okkate trupthi.. sachin ni real ga daggara ga chusa..
mee post bavundhi akka.. ee sari koncham lenght taggindhi..Inti panullo chethi neppulu ani chepparu kabbati ee sariki vadilesthunnam..
వద్దు వాడికీ పెళ్ళి అయిపోయింది ..నాకు అయిపోయింది నేను చూడను అన్నాను మొండికేస్తూ" ...హ హ హ అంతేనంటావా అక్కా??? అయితే ధోని కి పెళ్ళి అయిపోయింది కదా అయితే రేపటి నుండి నేను కూడా ధోని ని చూడచూడడం మానేస్తా
బాగుందండి .
కౌటిల్యగారు ఏంటి సార్ మీ ఇంట్లో తిట్టడం మానేసారా :)ఇక మీ అక్కగారిని అలా తిట్టేయకండి..మావారు ఆఫీస్ పని మీద వేరే దేశాలు వెళ్ళిన ప్రతిసారి బోలెడు జీన్లు,టీ షర్ట్లు,లాంగ్ మిడీలు గట్ర మోసుకొస్తారు..నేను వేసుకుని అద్దం లో చూసుకున్న ప్రతిసారి నా ఫేస్‌కి ఆ డ్రెస్ కి అసలేమాత్రం నప్పక ఎరువు డ్రెస్ వేసుకున్నట్లు ఫీలయి ఎదో ఒక మూల పడేసి ఇలా ఎప్పుడూ చుడిదార్లలోనూ..అప్పుడప్పుడు చీరల లతోను అడ్జెస్ట్ అయిపోతున్నానన్నమాట..:)
భావన :)
వేణు గారు ప్రయత్నిస్తాను
అఙ్ఞాత గారు అయ్యబాబోయ్ ఎంత ఓపికగా రాసారండి.. మీ పేరు ఇంద్రేషా :)నాకు అందులో సగం మంది మాత్రమే తెలుసు... థేంక్యూ
మంచుపల్లకి గారు మీరు మరీనూ.. ఇప్పుడు నాకో డవుటొచ్చేస్తుంది అందరూ నన్ను పొగుడుతున్నారా ఏడిపిస్తున్నారా.. ఈ కామెంట్స్ విషయం లో అని :)
బోన గిరిగారు థెంక్యూ :)
అఙ్ఞాత గారు అలా అచ్చ తెలుగులో రాస్తే ఎలా అర్ధం అవుతుందండి.. మొత్తానికి నాకు అర్ధం అయినదానికి వివరణ ఏమిటంటే .. నా శైలి విషయం లో చదివే కొద్ది కాకరకాయ కీకర కాయ అయ్యిందని రాసే కొద్ది సహజత్వం పాళ్ళు లోపించేస్తున్నాయి అనుకుంటా.. ఇదే కాకుండా పెరుగుతున్న బాధ్యతలు,సమస్యలు,టెన్షన్లు మొత్తానికి కారణాలు ఎవైనా కానివ్వండి పోస్ట్‌లు రాసే విషయం లో ఇంట్రెస్ట్‌ను తగ్గిస్తున్నాయి అన్నది వాస్తవం ..అందుకే సరిగా రాయలేకపోతున్నా అని నాకే అనిపిస్తుంది..
ఇక ఇంతకు ముందు పోస్ట్‌ల్లో అమాయకత్వం అంటే అప్పటికి పెళ్ళికానపుడు నిజంగానే ఏమీ తెలిసేది కాదు పెద్దల చాటున అలా ఆడుతూ,పాడుతూ గడిపేసా..ఎప్పుడైతె పెళ్ళి అయ్యిందో,ముఖ్యం గా ఇక్కడకు వచ్చాకా ఫలానా విషయం రాదు,తెలియదు అంటే చాలమంది చులకనగా చూసేవారు..దాంతో అమాయకత్వాన్ని ప్రక్కన పెట్టి గడుసుతనం నేర్చుకోవలసి వచ్చింది ..కాబట్టి ఆ లక్షణాలు తక్కువే కనబడతాయి :)
తారగారు భలేవారే పెద్ద బ్లాగరు అని అనుకోవాలంటే మీ వంటివారి వ్యాఖ్యలే కదా దానికి కారణం ...అలాంటపుడు ప్రతి వ్యాఖ్య నాకు అపురూపమే ..:)
శైలజగారు నాకు ఒక బుక్ లా తయారు చేసుకోవాలి అని ఉంది.. కానీ మా బద్దకపు సారు ఎప్పటికి కరుణిస్తారో.. ఏమైనా అంటే నీలా ఖాళీగా ఉన్నాననుకుంటున్నావా అని గయ్ మంటున్నారు.. మీరు lekhini.org
లో ట్రై చేయచ్చు తెలుగుకి..
శశిధర్ నిజంగా ఈ నాలుగు రోజులు నాపని ఇత్తడి పెనం పై అల్లం పెసరట్టే ... ఎంత సర్ధినా మాయదారి పని నేను ఇక్కడే ఉన్నానహో అంటుంది ..:)
శివరంజని ధోనీకి పెళ్ళి అయిపోయిందా ..ఏంటో న్యూస్ పేపర్ అనేదాన్ని చదివి నాలుగు నెలలు అయిపోయింది..అలా అయితే ఇంక చూడకు ...తప్పు తప్పు ( పైకి అలా అంటాం గాని అలా మర్చిపోగలమేంటీ :p) :)
మాల గారు థేంక్యూ
chala rojula tarvatha rasaru.. :(...
bagundi.. :)....
మేమింత సీరియస్ గా చెబుతుంటే మీకు కామెడీగా వుందా ...ఆయ్ ...
>>ఈ లోపలే నన్ను తోసుకుంటూ ఒక యాబై మంది ..సార్ ఆటో గ్రాఫ్ ప్లీజ్ అంటూ వాళ్ళ మీద పడ్డారు..
ఈ సీను లో మీరు కిందపడబోయి , తేరుకొని వాళ్ళని తిట్టుకొని భలే నవ్వుకున్నానండోయి...
ఆ రాధిక సినిమా "పట్నం వచ్చిన పతీవ్రతలు"' అనుకుంటాను......కేక
చాలా రోజూల తరువాత బ్లాగు రాసారు....నచ్చింది
మాటల సందర్భం లో గుర్తుకు వచ్చింది,నా చిన్ననాటి ఫ్రెండ్ ముద్దు పేరు కూడా బుజ్జి యే ఎప్పుడూ తనని బుజ్జీ బజ్జీ; బుజ్జీబజ్జీ; అని ఏడిపిస్తూ ఉంటాను, అయినా ఎక్కువ మంది అమ్మాయిలకు బుజ్జి అనె ముద్దు పేరు ఉంటుందనుకుంటాను ...........:)
నేస్తం గారూ,
ఈ మధ్యనే మీ బ్లాగు పరిచయం జరిగింది.నేను చదవిన మీ మొదటి పోస్ట్ "నేను -నా సాహసాలు"
కానీ రెండు రోజుల్లోనే మొత్తం మీ పోస్ట్ లు అన్నీ చదివేసాను,అంత బాగున్నాయి నిజంగా.
మీ చిన్నప్పటి విశేషాలు అన్నీ మా చిన్న నాటి రోజుల్ని గుర్తు చేసాయి.
మాది కూడా తూ.గో.జీ నే.ఇంతకూ మీది ఏ వూరండి?(అన్ని బ్లాగులు చదివాగానీ మీ వూరు పేరు తెలియలేదు)
"ఇంకొన్ని ముచట్లు " కూడా మీ శైళి లో చాలా బాగుంది.
దయచేసి ఇంకా ఎక్కువ పోస్ట్ లు పెట్టండి.ప్లీజ్ ఏదోలా వీలు చేస్కోండి.మా లాంటి అభిమానుల కోసం.
అభినందనలు మరియు కృతజ్ఞతలు,
టి.రామ చంద్ర మూర్తి
మాల్దీవులు.
శివరాత్రి సామెత ,
పొదుపు -వాటి లాభాలు-పాటించవలసిన పద్దతులు
'యెహె పో'
super
కిరణ్ థేంక్యూ
మంచుపల్లకి గారు అయ్యబాబోయ్ తవరు సెప్పాకా కాదంటావేటండి :)
రాజు గారు చూస్తున్నా చూస్తున్నా . తెగ నవ్వుతున్నారుగా నా పాట్లు చూసి ..అవును నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలకు ఉండే ముద్దు పేరు అది.. మీలాగే మా తమ్ముడు కూడా బజ్జి బజ్జి అనెవాడు..ఒక్కోసారి గజ్జి అని కూడా అనేవాడనుకోండి.. అప్పుడు మాత్రం మా అమ్మతో కయ్యం పెట్టుకునేదాన్ని ..ఎందుకలా పిలిచారు నన్ను అని ..
మూర్తిగారు చాలా ధేంక్స్ అండి నచ్చినందుకు.. మాల్దీవులా మీరు ఉండేది.. అక్కడ చాలా బాగుంటుంది అని విన్నాను.. నిజమేనా..ఇక ఊరు, పేరు విషయం లో ఉష్ గప్ చిప్ అన్నమట నేను ..మీరలా గెస్ చేసుకోవడమే :)
మహేందర్ :)
అయ్య బాబోి.. యాండీ మీ బ్లాగ్ సూపర్ ఆండీ.. ఆయ్. గుడ్ అబ్సర్వేషన్ అండ్ గ్రేట్ ప్రెసెంటేషన్. నేను హచ్ కుక్కలా మీ బ్లాగ్ ఫాలొ ఐపోతాను. ఇంక క్రమం తప్పకుండా బ్లాగాల్సిన బాధ్యత మీదే..
Nestham garu,
Modhtata ee tapa chadivina taruvatha edi meru rayaledemo anukuna....okavela mee ayanagaru raseremo anukunna,,me sili lo ledu ani chebudamanukunna, kani me abimanulandharini chusi byam vesindhi.....kani evaro agyatha garu chepparu...aa taruvatha me vivaraana chusi trupti chendhanu... kani ennirojulu wait cheyinchi elanti tapa ichindhuku me pi kopamga undhi...
చందుగారు కాసేపు నవ్వుతునే ఉన్నానండి మీ వ్యాఖ్య చూసి :)
మహిపాల్ ఎంతపని అయిపోయింది అలా అనేసుకున్నారా... నేను ఎప్పుడు ఇలా రాద్దాం అనుకుని రాయను ..అప్పటికప్పుడు గుర్తొచ్చింది రాసేస్తాను అంతే.. కాకపోతే ఒకటి ఈ మధ్య అస్సలు ఖాళి ఉండటం లేదు.. ఆ విసుగు ,చిరాకు,నీరసం తో రాయడం వల్ల ఇలా రాసేసానేమో.. అయిన మనం మనం సింగపూర్ వాళ్ళం బాగోపోయినా సూపర్ సూపర్ అనుకోవాలి ,,అలా ఫీలయిపోవచ్చేంటీ..లోకువైపోమూ :)
చిటికెలు చిటికెలు టపా వెసినందుకు.
తలనొప్పి, చిరాకు కి అమ్రుతాంజన్ రాస్కొని, నీరసానికి నిమ్మరసం తాగి టపాలు టప టప వెసయ్యాలి అంతె.
నేస్తం ఏంటండీ ఇన్ని రోజులు ఇల్లు సర్దుకోవడంలో బిజీనా... బాగున్నాయి మీ ముచ్చట్లు..నేను మొదట్లో టెస్టు మ్యాచులు సైతం వదలకుండా చూసేవాడిని, కాని ఇప్పుడు కేవలం టీ-20 తప్ప వేరే ఏమీ చూడటం లేదు.. శాస్త్రి గారి బాటింగ్ గురుంచి నాకు తెలీదు..మాకు తెలిసిన జిడ్డు రాహుల్ ధ్రవిడే..
>>అసలు భార్యంటే ఎలా ఉండాలి ..భర్త ఇంటికి రాగానే ..అయ్యో ఎంత అలసిపోయారో ,మంచి నీళ్ళు కావాలా?(వాటర్ బాటిల్ ప్రక్కనే ఉంటుంది ..అయినా సరే) కాళ్ళు పట్టామంటారా "అంటూ ఎంత ఇదై అదై పోవాలి..
నిజం..ఇలాగే ఉండాలి భార్య అంటే.. మీ వారికి బాగా తెలిసినట్లుంది.. నా తరపున ఆయనకు నెనర్లు.. :-)
పవన్ అంతే అంటావా..సరే అయితే
కిషన్ అవునా అలాగే ఉండాలా..అలాగే ..మీ పెళ్ళాయ్యాకా ఓ సారి ఆ అమ్మాయిని కి కూడా ఈ విషయం చెప్పేసే మరి..మళ్ళి పాపం తనకి తెలుసునో లేదో
యాభై కామేట్లు అయ్యిపోయాయోచ్
కంగ్రాట్స్ నేస్తం గారు
అఙ్ఞాత కాదుగా నాదే 50 వ కామెంట్..మీ మొదటి కామెంట్ ప్రచురించడం లేదు :) మీరేదో తప్పురాసారని కాదు ..ఇప్పుడు మనం ఆ టాపిక్ మాట్లాడటం అవసరమా అని :) అర్ధం చేసుకోండి ప్లీజ్ జ్ జ్
సరేనండీ! మీరు చెప్పాక మీ వీరాభిమానులుగా మీ ఆజ్నని శిరసావహిస్తాము
అప్పుడు యాభైవ కామెంట్ నాదే అని అని గొడవకూడా చెయ్యలేదు
ఎంత మంచి అభిమానులో కదా
ఇది కూడా పబ్లిష్ చెయ్యొద్దు ప్లీజ్జ్జ్ జజ్జ్ నేస్తం అక్కా
మొత్తానికి అలా ఆటలుగా ఉంది నేనంటే మీకు :) సరే ఇంతకూ క్రింద మీకు నచ్చిన పేరు ఏదో ఒకటి రాయచ్చుగా..కనీసం అమ్మాయో అబ్బాయో అర్ధం అవుతుంది .. లేకపోతె ఎవరు ఎవరో కంఫ్యూజ్ అవుతున్నా :)
As usual nice post!
సరే ఇంతకూ క్రింద మీకు నచ్చిన పేరు ఏదో ఒకటి రాయచ్చుగా
అంటే మీ ఉద్దేశ్యం లో మా ఇష్టమొచ్చిన పేర్లతో రాయమంటున్నారా
నా యాభైవ కామెంట్ రాసే చాన్సు లేకుండా చేసి మళ్ళీ నా పేరు రాయమంటున్నారా ఆయ్!
మీరు మూడు సార్లు ఆయ్ ఆయ్ ఆయ్ అని అనండి వచ్చే పోస్ట్ లో నా పేరు రాస్తాను
సునితా ధేంక్యూ
అఙ్ఞాత... అయ్య బాబోయ్ నేను ఏమన్నా తప్పుగా తీసుకుంటే ఎలా???పోని నా కామెంట్ డిలీట్ చేసేయనా అప్పుడు మీదే 50 అవుతుంది :) 3 సార్లేం 6 సార్లు ఆయ్ అంటాను ఈ పోస్ట్‌లోనే చెప్పచ్చుగా మళ్ళీ అదో సస్పెన్సా.. :)
ఇక నేను నవ్వలేనండీ నేస్తం గారూ.. :) అనుకోకుండా వచ్చా మీ బ్లాగు లోకి. మీకు అయిపోయా.. చాలా బాగున్నాయండీ మీ టపాలు.
నేస్తం..
మీ క్రికెట్టు ముచ్చట్లు రెండు భాగాలు చదివాను. అసలెంత నవ్వానో తెలుసా!
"అబ్బో తెగ నవ్విన్చేసారూ..బాబోయ్ పొట్ట పగిలిపోతోంది...ఇలాంటి కామెంట్లన్నీ చెప్పి చెప్పి రొటీన్ గా అయిపోతోంది నేస్తం.. మీకోసం కొత్త పొగడ్తలు ఏమన్నా కనిపెట్టాలి. అసలు ఆ అనిల్ కుంబ్లే డైలాగ్ కి ఇదే గానీ థియేటర్ అయితే, ఈల సౌండ్స్ కి చెవులు చిల్లులు పడిపోయేవి. అంతగా నవ్వొచ్చింది. మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంది నాకైతే అది. ;-)
మీరు సచిన్ ని చూసాను అని రాయగానే...ఏదో నేనే చూసేసినట్టు తెగ ఆనందపడిపోయాను. :-) పోన్లెండి..ఫోటోలు, ఆటోగ్రాఫులు తీస్కోకపోయినా... కళ్ళారా సచిన్ ని చూసారు. ఇంకేం కావాలి చెప్పండి. :-)
.ఉహు..వద్దు వాడికీ పెళ్ళి అయిపోయింది ..నాకు అయిపోయింది నేను చూడను అన్నాను మొండికేస్తూ..
haha..meeru amayakanga kanabadatharu(rastharu) kaani bhale dhairyavanthulu andi..
glad that I stumbled upon this beautiful blog..
chadivithe ekkada anni postlu ayipothayo ani rojukokkati chaduvuthunna..
కామెంట్‌ను పోస్ట్ చేయండి