క్రికెట్‌కి వెళ్ళివచ్చిన తరువాత రోజున ఎప్పటిలాగే ఇద్దరం సరదాగా కాయగూరలు కొనడానికి మార్కెట్‌కి వెళుతుంటే మా ఆయన హఠాత్తుగా బుజ్జీ! నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా ..అసలు తాంబూళాల్లో అయితే సూపరు..ఆ రోజు నువ్వు కట్టుకున్న గ్రీన్ చీరలో అదిరిపోయావు ..రోజూ ఆ ఫొటోసే ముందేసుకుని కూర్చునేవాడిని ..దిష్ఠి తగులుతుందని మా అమ్మ తిట్టేది.. అనేసరికి నా కాళ్ళు అలా నేలకు రెండు ఇంచుల పైకి తేలడం మొదలు పెట్టాయి.. పెళ్ళయి అన్ని నెలల తరువాత భార్య అందాన్ని భర్త సమయమూ, సంధర్భం లేకుండా పొగుడుతున్నాడంటే దానివెనుక అనేకానేక కుట్రలు,కుతంత్రాలు ఉంటాయన్న కఠోర సత్యం అప్పటికి నాకింకా తెలియదన్నమాట..
ఆ పళం గా ముద్దొచ్చినపుడే అన్నీ అడిగేయాలని మొదలు పెట్టేసాను..మరి ఆ రోజు కట్టుకున్న ఎర్రంచు పట్టు చీరలో ఎలా ఉన్నాను?? ఆ తరువాత కట్టుకున్న వంగపండు కలర్ చీర నాకు నప్పిందా??... పెళ్ళికి ముందు నేను మీ కాలేజ్ లోనే చదివుంటే మీరు నన్ను ప్రేమించేవారా? ఒకవేళ ప్రేమిస్తే నేను ఒప్పుకోక పోతే ఏమి చేసేవాళ్ళు ??లాంటి ప్రశ్నలన్నీ చక చక అడిగి ,టక టకా నాకు కావలసిన సమాధానాలను రాబట్టేసుకుని తెగ మురిసిపోయాను ..( మరి మామూలు రోజుల్లో గనుక అలాంటి ప్రశ్నలు అడిగితే మరి ఇంతమంచి నిజాలు బయటకు చెప్తారేంటి :D )
అప్పుడు మాశ్రీవారు మెల్లిగా వల విసిరారు..బుజ్జీ ,మొన్న వెళ్ళిన క్రికెట్ మేచ్ భలే ఉందికదా!.. భలే ఎంజాయ్ చేసామే !అంటూ.. సరిగ్గా ఆయన ఊహించినట్లుగానే ..పాపం ఇంత పొగిడారు కదా మనం కూడా నాలుగు పొగిడేస్తే ఓ పని అయిపోతుంది అని .. అవునండీ చా..లా ఎంజాయ్ చేసాం.. అసలు ఎంతమందికి వస్తుంది చెప్పండి అటువంటి అవకాశం ..పైకి వద్దు ,వద్దు అన్నా గాని ఎంత మంది అతిరధమాహరధులను చూడగలిగాను.. మీరెంత మంచివారండి అంటూ దొరికిపోయాను ..అందుకే బుజ్జీ మళ్ళీ ఎంజాయ్ చేద్దామని' ఫైనల్ మేచ్ 'కి కూడా టికెట్స్ తీసుకున్నాను ..రేపు రెడీ అయిపో అన్నారు సింపుల్ గా .. ఆ..అంటూ నిలువు గ్రుడ్లేసుకుని అమ్మా!!,నేను రాను ..నా వల్ల కాదు అని మొదలు పెట్టాను..కానీ అప్పటికే నోరుజారడంవల్ల ఇక తప్పలేదు..
ఆ మరుసటి రోజు మళ్ళీ ప్రొద్దున్నే లేచి తిండీ,నీళ్ళు గట్రా మూట గట్టుకుని గ్రౌండ్ కి బయలుదేరాం...దారిలో ఎప్పటిలాగే పెద్ద క్యూ..చాలామంది సార్ ప్లీజ్ ఎక్స్ ట్రా టిక్కెట్స్ ఉంటే ఇవ్వండి అని బ్రతిమాలుతున్నారు.. నేను ఎప్పటిలాగే ఫోజు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాను..మళ్లీ ఒక చోట ప్లేస్ చూసుకుని ఇలా కూర్చున్నామో లేదో ఆట మొదలైంది ...వెస్ట్ ఇండీస్ బౌలింగ్ అనుకుంటా.. ఒక్కొక్కరూ తాడిచెట్లలా ఇంత పొడవున్నారు..వాడు ఆడమ్స్ ,వీడు వాల్ష్ ఏవేవో పేర్లు చెబుతున్నారు మా ఆయన.. అందరికీ ఇంచుమించుగా గుండే ..ఒక్కళ్ళకూ పెద్ద జుట్టులేదు.. ఒకవేళ ఉన్నా దువ్వెన ఎలా దిగుతుంది ఆ రింగుల జుట్టులో అనుకుంటూ చూస్తున్నా..
ఈలోపల ఆకాశం మేఘావృతం అయిపోవడం మొదలైంది.. ఏమండీ గొడుగు కూడా తెచ్చుకోలేదు అన్నాను భయం గా ఆకాశం చూస్తూ.. నేను ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తానో మా ఆయన అంత పాజిటివ్ గా ఆలోచిస్తారు..అబ్బే ఏమీ కాదు అవి దొంగ మబ్బులు.. గాలి ఎలా వీస్తుందో చూసావ్ కదా ..తేలిపోతాయి.. అలా అన్నారో లేదో 'టప్' మని ఒక చినుకు నాపై పడింది ..నేను మా ఆయన వైపు చూసాను ..అది 'చిరుజల్లు ' అన్నారు .. అంతే దభ,ధభా మని వర్షం మొదలైపోయింది.. అందరూ పరుగులు పెడుతున్నారు ... అప్పటికప్పుడు ఆట కోసం వేసిన షల్టర్లు ఏ మాత్రం రక్షణ ఇవ్వడంలేదు..అయినా జనాలు వాటి క్రిందే నించుంటున్నారు దారిలేక.. అక్కడ ప్లేస్ లేక నా చున్నీయే గొడుగులా కప్పుకుని అక్కినేని,బి.సరోజల్లా చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెట్టాం ..
ఎంత గుబురు చెట్టయితే ఏం లాభం ..వర్షం వర్షమేగా.. ఫుల్ గా.. ముద్ద ముద్దగా తడిచిపోయాం.. నా క్రొత్త డ్రెస్ బురద బురద అయిపోయింది ... అదొక్కటేనా ప్రొద్దున్నే పావుకేజీ 'కొబ్బరి నూని 'తలకు పట్టించి మరీ వచ్చానేమో నాకు పండగే పండగ ...చిరాకొచ్చేస్తుంది..ఇదంతా అవసరమా!!..వద్దు ,వద్దన్నా వినిపించుకోరుకదా కోపంగా అరిచాను ... నీకసలు టేస్ట్ తెలియదు బుజ్జి ..ఎంచక్కా పైన వర్షం ,ప్రక్కన నేను ఉన్నా..ఎంత రొమాంటిక్ గా ఆలోచించచ్చు .. మా ఆయన ఏడిపిస్తుంటే తిట్టుకుంటూ నించున్నా కాసేపటికి వర్షం ఆగింది ..ఇంక నావల్ల కాదు ఇంటికి వెళిపోదాం అన్నాను.. నోరుముయ్యి ఓవర్లు కుదిస్తారు.. చూసి వెళదాం అన్నారు ..
ఆయన అన్నట్లే ఓవర్లు తగ్గించారు..అందరూ తడిచిన బట్టలు పిండుకుని,బెంచ్ లు తుడుచుకుని కూర్చుంటున్నారు..ఆ తరువాత వాళ్ళేం ఆడుతున్నారో నేనేం చూస్తున్నానో నాకేం అర్ధం కాలేదు ...ఆ చల్లగాలికి వణుకొచ్చేస్తుంది జ్వరం వచ్చినట్లు.. కాసేపు జరగలేదు ఆట.. మళ్ళీ భోరున వర్షం..ఛీ ఆ వచ్చే వానేదో ఫుల్ గా ఒకేసారి వచ్చి ఏడచ్చుగా ఇలా సగం, సగం వచ్చి ఎటు కాకుండా చేస్తుంది ..శుబ్బరంగా మేచ్ డ్రా అయిపోయేది..పీడా పోయేది అని వందసార్లు తిట్టుకుని ఉంటాను..చివరకు మేచ్ రేపటికి 'పోస్ట్ పోన్' అయింది "అందరూ ఇంటికి వెళ్ళిపోయి రేప్పొద్దిన్నే వచ్చేయండహో" అని ఎనౌన్స్ చేసేసరికి మా ఆయన,నేను ఇద్దరం గతుక్కుమన్నాం..
ఆ రాత్రి పడుకుంటున్నపుడు మొదలయ్యాయి తిట్లు నాకు.. అంతా "నీవల్లే" ..వచ్చినప్పటి నుండి మేచ్ ఆగిపోవాలి ,ఆగిపోవాలి అని గొడవ గొడవ చేసావ్ కదా ..అలాగే జరిగింది ..ఇప్పుడు సంతోషమే కదా అని ఉడికిపోతూ 'గయ్' మన్నారు.. ఇది మరీ బాగుంది ..నేను ఆగిపోవాలి అంటే ఆగిపోతుందా అన్నాను ఆవలిస్తూ.. ఎందకు ఆగదు ..కొంతమంది నోటి పవరు అంతే.. మళ్ళీ రేపు అంటే ఎలా వెళతాను అక్కడికి..మా బాస్ ని ఈ సారి లీవ్ అడిగితే డైరెక్ట్ గా ఇంటికి పంపేస్తాడు..తిరిగే లేదు ..డబ్బులన్నీ వేస్టు అన్నారు దిగాలుగా ... పాపం జాలేసింది నాకు ..
పోని మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా అమ్మేయండి ..ఒక ఉచిత సలహా పడేసాను.. ఉహు నాకు మన ఇండియన్స్ అంత క్లోజ్ గా తెలియదు.. మా ఆఫీస్ లో అందరూ చైనీస్ యే..వాళ్ళూ చూడరు ..అదీ వీక్ డేస్ లో అస్సలు వెళ్ళరు అన్నారు నిట్టూరుస్తూ.. పోనీ మీకు ఎవరు టిక్కెట్టు అమ్మారో వాళ్ళకే తిరిగి ఇచ్చేయండి 'వద్దు' అని అన్నాను ..చెత్త సలహాలు ఇచ్చావంటే తంతాను అన్నారు విసుగ్గా.. అయితే ఏం చేద్దామంటారు ??అన్నాను కళ్ళుమూసుకుని.. పోని ఒక పనిచేస్తే?? అన్నారు ఉత్సాహంగా .. నేను నిద్రలోకి జారుకుంటూ' ఊ ' అన్నాను.. రేపు ప్రొద్దున్న మన ఇద్దరం అక్కడికి వెళదాం ..నువ్వు మేచ్ చూస్తూ ఉండూ.. మా ఆఫీస్ ప్రక్కనే కాబట్టి నేను ఆఫీస్ కి వెళ్ళీ, మళ్ళీ కరెక్ట్ గా మధ్యాహ్నం లంచ్ టైముకు నీదగ్గర కి వచ్చేస్తా..అన్నం తినేసాక మళ్ళీ వెళ్ళీ ,మళ్ళా సాయంత్రం ఒక గంట ముందే పర్మిషన్ తీసుకుని వచ్చేస్తా ..అప్పుడు ఇద్దరం కాసేపు మేచ్ చూసి ఇంటికి వెళ్ళిపోదాం సరేనా అన్నారు..
అంతే నా నిద్రమత్తు టక్కున మంత్రం వేసినట్లు మాయమై పోయి ఉలిక్కిపడి.. ఏంటీ !!మళ్ళీ రావాలా ?..అదీ ఒక్కదాన్నే చూడాలా?.. నావల్ల కాదు ..టిక్కట్స్ మిగిలితే చింపి చెత్త బుట్ట లో వేసుకోండి ..నాకు కుదరదు అన్నాను.. అది కాదు బుజ్జీ ..పోనీ ఒక పనిచేద్దాం, అక్కడకు వెళ్ళాక ఎవరన్నా కొనుక్కుంటే వాళ్ళకు అమ్మేసి ఇంటికి పంపించేస్తాను నిన్ను అన్నారు బ్రతిమాలుతూ.."పైకి నా నోరు కనబడుతుంది కాని చివరకు అన్నీ మావారు చెప్పినట్లే జరుగుతాయి ..అయినా సరే ఎందుకు వాదిస్తానో నాకు ఇప్పటికీ అర్ధం అయ్యి ఏడవదు. ."
ఆ ప్రొద్దున్న నాకు అస్సలుబాలేదు..బాగా చిరాగ్గా,విసుగ్గా ఉండటం వల్ల ఏమండీ ఈ టైంలో నావల్ల కాదు మీరు వెళ్ళండి అని బ్రతిమాలినా లాక్కువెళ్ళిపోయారు ..చేసేదిలేక మళ్ళీ సరంజామాతో బయలుదేరాను కనీసం ఎవరన్నా టిక్కెట్టు కొనకపోతారా అన్న ఆశతో ..మేము వెళ్ళే సరికి బయట బోలెడుమంది ఉన్నారు ..హమ్మయ్యా అనుకుని దగ్గరకు వెళ్ళాం..మేము ఇంకా ఏమీ అనకముందే "సార్ టిక్కెట్స్ కావాలా?" అన్నాడు ఆ అబ్బాయి.. మేము మొహమొహాలు చూసుకున్నాం.. సగం రేట్ కి ఇచ్చేస్తా తీసుకోండి అన్నాడు అతను.. ప్రక్కన చూస్తే అందరూ సార్ సార్ టిక్కెట్స్ కావాలా ??అని బ్రతిమాలుతూ అడుగుతున్నారు .. అందరూ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారు.. నేను బిక్క మొహం వేసుకుని మా ఆయన వైపు చూసాను.. నువ్వెళ్ళి కూర్చో నేను లంచ్ కొచ్చేస్తానే అని మాహా ఆనందంగా వెళ్ళారు మా ఆయన..
మళ్ళీ ఆట మొదలైంది ..నాకేం తోచడం లేదు..కాసేపు ఆట చూసాను ఉహు ఏమి ఆడుతున్నారో ఏమి అర్ధం కావట్లేదు ..సరే అని ఇంకాసేపు ఫొటోస్ తీశాను.. చూపమని అడక్కండీ ..మనమసలే ఫొటోస్ తీయడంలో క్వీనులం కదా ..అంచేత సాగరసంగమం సినిమాలో కమలహాసన్ కు 'భంగిమా' అంటూ ఫొటోస్ తీసే కుర్రాడిలా మా గొప్పగా తీశాను.. మరి కాసేపు ఫోర్ లైన్ దగ్గర తచ్చాడాను.. ఆ తరువాత పెన్ తీసుకుని నా అర చేతి లో ముగ్గులు పెట్టుకున్నాను.. ఇంక ఆ తరువాత ఏం చేయాలో అర్ధం కాలేదు ..గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాను..ఎండమండిపోతుంది ..ఎలాగో ఒకలా లంచ్ టైం వరకూ గడిపేసాను ..సరిగ్గా లంచ్ టైముకు మావారు వచ్చారు ..హమ్మయ్యా ప్రాణం లేచోచ్చినట్లు అనిపించింది.. ఆ తరువాత గంట టైము ఎలా గడించిందో తెలియదు.. మళ్లీ వస్తానే అని మావారు బేగ్ పట్టుకుని వెళ్ళిపోయారు .. మళ్లీ ఒంటరిగా కూర్చున్నా ..
అప్పుడు మొదలైంది 'పడమటికి' దిగుతున్న సూర్యుని ఎండ మొహానికి కొడుతూ ..అసలే చిరాకు,విసుగు దానిమీద చిర చిర లాడుతూ వేడి.. అన్నటికంటే ఎక్కువగా దాహం వేసి బాగా వాటర్ తాగానేమో నాకు నరకం కనబడిపోతుంది..ఎక్కడన్నా 'రెస్ట్ రూములు' ఉన్నాయేమో అని చూసాను.. ఉహు కనబడలేదు .. ఎండ వేడికి కళ్ళు తిరుగుతుంటే కాస్త నీడ పట్టుకువెళ్లి కూర్చున్నా .. జింబాబ్వే మేచ్ కంటే ఫైనల్ మేచ్ కే జనాలు తక్కువగా ఉన్నారు..నిన్నటి వర్షం దెబ్బ అనుకుంటా..వెస్ట్ ఇండీస్ వాళ్ళు వీర ఉతుకుడు ఉతుకుతున్నారు మన ప్లేయర్లను ..అందరూ "అయ్యో"," ఓ" ..అంటూ మూలుగుతూ తెగ బాధ పడిపోతున్నారు..నా గోల నాది ..
చాలా విసుగ్గా అనిపించింది..దేవుడా ఏమిటి నాకీ పరీక్షా అనుకుంటుంటే ...." ఒరే రాత్రి తాగింది దిగలేదా ఏంట్రా ..అలా ఆడుతున్నారు" అంటూ మన తెలుగు మాటలు వినిపించాయి ... హమ్మయ్యా అనిపించింది..కాస్త మాటల్లో పడితే టైము తెలియదు కదా అని ఆనందం గా ప్రక్కకు చూసాను .. పాతికేళ్ళ లోపు అబ్బాయిలు ఒక అయిదుగురు నా ప్రక్కన కూర్చున్నారు..ఇందాక నేను గమనించలేదు కాని నా ప్రక్కన ఉన్న అబ్బాయి చేతిలో ఈనాడు పేపర్ ఉంది ..హుం నీరసం వచ్చింది ..అందరూ అబ్బాయిలే ..ఏం మాట్లాడుతాం అని నిట్టూర్చి వాళ్ళ మాటలు వింటున్నా.. అబ్బాయిల సంగతి తెలియనిదేముంది..ఎంచక్కా బోలెడు తిట్లు చెవుల త్రుప్పువదిలేటట్లు తిడుతున్నారు మన ఆటగాళ్లను.. ఒక్కోసారి నవ్వొస్తుంది..ఒక్కోసారి అబ్బా ఏంట్రా బాబు వీళ్ళు అనిపిస్తుంది..
నా ప్రక్కనున్న అబ్బాయికి ఎందుకు అనుమానం వచ్చిందో ..అరే..ఆగండిరా ..అమ్మాయుంది అన్నాడు.. అంతే అప్పటివరకు ఆటలో లీనం అయి వాళ్ళను తిడుతున్నవాళ్ళు కాస్తా నా వైపు తిరిగారు.. దాని మొహం అది తెలుగుది కాదురా తమిళ్ పొన్ను ..మొహానికి ఆ విభూధి కనిపించడంల్లా వాళ్ళు అలాగే పెడతారు అని ఒకడు ..అబ్బెబ్బే అది మలయాళీ పెణ్ కుట్టి అని మరొకడు ...కాదేహే ఖచ్చితంగా కన్నడ భామ ..నేను రాసిస్తా కావాలంటే ..వాళ్ళే ఇంత డేరింగ్ గా ఒక్కళ్ళే ఊరి మీదకు తిరుగుతారు ... మహా ఖతర్నాక్ లు అని మరొకడు.. ఏంట్రా ఆకాశంలోకి చూస్తుంది గుడ్డిదానిలాగా ..కళ్ళు లేవా అని మరొకడు..ఒక్కటి కాదు వాళ్ళిష్టం ...
మాములుగా అయితే సైలెంట్ గా విని ఉరుకునేదాన్ని..మనకసలే బోలెడు ధైర్యం ఎక్కువకదా..కాని ఆ రోజు నాకున్న చిరాకు కి, విసుగుకి ఎవరోకరిని బాగా తిట్టాలన్నంత కసి గా ఉందేమో ఇంక వాళ్ళ పని అయిపొయింది..' ఠాట్' నేను విభూది పెడితే నీకేంటి ,ఒంటరిగా వస్తే నీకేంటి ఇంకోసారి ఏమన్నా అన్నారో పోలీసులకు కాల్ చేస్తాను ఖబడ్దార్ అని ఒక పది నిమిషాలు ఆపకుండా తిట్టిపడేసాను .. తిట్టేసాక గాని భయంవేయలేదు..అయినా చుట్టూ జనాలు ఉన్నారు కాబట్టి కాసింత ధైర్యం గా అక్కడే కుర్చుని చూస్తున్నా.. దెబ్బకి వాళ్ళు సైలెంట్ ..
నా ప్రక్కన ఉన్న అబ్బాయి కొంచెం సేపయ్యాకా మీరు "తెలుగా" అండీ అన్నాడు.. నేను ఏం మాట్లాడకుండా నా భయాన్ని కనబడనివ్వకుండా సైలెంట్‌గా ఎక్కడకో చూసుకుంటున్నా.. నేనేమి అనలేదు కదండీ ..అప్పటికీ వాళ్ళను వద్దని వారిస్తున్నాను కదా అన్నాడు మెల్లిగా.. నేనేం మాట్లాడకపోయేసరికి నేను మిమ్మల్ని 'సిస్టర్' అని పిలవచ్చా అన్నాడు ... నాకెందుకో నవ్వు వచ్చింది.. అయినా సీరియస్ గా మొహం పెట్టి అంటే అక్కా?చెల్లా? అన్నాను ... మీ వయసు ఎంత ?అన్నాడు వెంటనే. మొన్నే ఇరవై వచ్చింది అన్నాను ..అయితే నాకు ఇరవై మూడు చెల్లెమ్మా అన్నాడు.. నాకు ఎవరూ అన్నయ్యలు లేరేమో ఎవరైనా చెల్లెమ్మా అంటే చాలు పట్టుకోలేరు నన్ను ..ఇంక మొదలు పెట్టేసాను కబుర్లు ...
అలా కాసేపు అతని ఫ్రెండ్స్ కి రక్త సంబంధం,చెల్లెలి కాపురం ,పుట్టింటి పట్టు చీర లాంటి సెంటిమెంట్ సినిమాలను ఫ్రీగా చూపెట్టాకా మాటలో మధ్యలో చెప్పాడు తను ..అతని పేరు నాయుడు అంటా ..వైజాగ్ వాళ్ళ ఊరు.. ఇక్కడ పని చేస్తే బోలెడు డబ్బులు ఇస్తారని మభ్య పెట్టి ,ఒక ఏజెంట్ లక్షన్నర రూపాయలు తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు అంటా.. పాపం పాస్‌పోర్ట్ గట్రా అతనే తీసుకుని వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. .అసలే ఎండకన్నెరగకుండా పెరిగాడేమో రాత్రి పగలు పని చేయాలంటే నరకం గా ఉంది ..వెనకకు వెళ్ళే దారిలేదు ..సంపాదించినదంతా ఏజెంట్ లాగేసుకున్టున్నాడు..జ్వరమోచ్చినా, నెప్పోచ్చినా చూసే నాధుడు లేడు అని చాలా బాధపడ్డాడు..
షిప్ లో పని ..పాపం పని అలవాటు కాక ఏక్సిడెంట్ లో చిటికెనవేలు'కట్' అయ్యి తీసేశారు అంట..మా అమ్మకి చెప్పలేదు ..ఏడుస్తుంది ..కాకపొతే ఇన్సురెన్స్ ,మూడు నెలలు లీవు ఇచ్చారనుకో..ఒక్కడినే ఇంట్లో ఉంటే అసలేం తోచడం లేదు అన్నాడు..నాకు జాలేసింది .. వెంటనే మా ఆయన "ఆఫీస్ ఫోన్ నెంబర్ "ఇచ్చేశాను తోచక పొతే ఆయనకు కాల్ చేయి అన్నయ్యా అని.. ఆ తరువాత మా ఆయన ఒకటే తిట్లు.. ఎవడే వాడు?? , నిమిషానికి ఒక సారి కాల్ చేస్తాడు ..బావా ఏం చేస్తున్నావు?,బావా ఎలా ఉన్నావు?,బావా చెల్లి ఏం కూర వండింది ?అనుకుంటూ ...అరె బాబు, నాకు పని ఉంది పది నిమిషాలు ఆగరా అంటే .. కరెక్ట్ గా పదినిమిషాలు సెకన్లతో సహా లెక్కగట్టి మళ్లీ ఫోన్ చేసి బావా పని అయిపోయిందా ఏదన్నా మాట్లాడు అంటాడు ...ఇంకోసారి ఎవరికన్నా ఫోన్ నెంబర్లు,ఇంటి అడ్రేస్లు ఇచ్చావో కాళ్ళు విరక్కోడతా అని వార్నింగ్ ఇచ్చారనుకోండి అది వేరే విషయం అన్నమాట ...
అలా కాసేపు కబుర్లలో పడ్డాగాని నా బాధలకు తోడూ ఎండవల్ల తల తిరిగిపోవడం ,వికారం మొదలయిపోయి కాసేపు మౌనంగా ఉండిపోయాను ..ఈ లోపల వెస్ట్ ఇండీస్ ఓవర్లు అవ్వక ముందే గెలిచేసింది.. అప్పటికే చాలామంది మూటాముల్లె సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయారు .. మేన్ ఆఫ్ ది మేచ్ నో ఏదో ఇస్తున్నారు.. అన్నయ్యా వాళ్ళు వెళ్ళారు గ్రౌండ్ లోకి .. నేను మా ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా.. ఇంతకీ రారు అంతకి రారు ...గ్రౌండ్ టక టక ఖాళి అయిపోతుంది ... నాకు కోపం ,ఏడుపు రెండు వచ్చేస్తున్నాయి ..
ఏమ్మా! ఇంకా బావ రాలేదా ?అన్నాడు నాయుడన్నయ్య.. ఉహు అన్నాను అప్పటికే కళ్ళల్లో నీళ్ళు ఊరుతున్నాయి.. మరి ఇంటికి వెళ్ళిపోతావా అన్నాడు.. లేదన్నయ్యా వచ్చేస్తారు అన్నాను.. అసలు నాకు దారి తెలిస్తే కదా వెళ్ళడానికి ..అదెక్కడో ఊరికి మూలగా ఉంది గ్రౌండ్ ... సరే ,ఇంక పదరా అనవసరం గా డబ్బులు తగలేట్టుకుని వచ్చాం ప్రక్కన అబ్బాయి అన్నాడు.. సరే నేను వెళ్ళనా అన్నాడు అన్నయ్య.. ఉహు వద్దు మా ఆయన వచ్చేవరకు ఉండవా అని గొంతువరకూ వచ్చింది ..కాని ఎవరో తెలియదు ,ఏం పనో ఏమో అనుకుని.. పర్లేదు ,మీరు వెళ్ళండి అన్నాను చిన్నగా నవ్వుతూ... తను వెళ్ళబోతూ నా వెనుక ఉన్న తమిళియన్స్ ని చూసి ..ఇక్కడ ఎందుకు చెప్పు ..బయట ఎంట్రెన్స్ దగ్గర వెయిట్ చేయకూడదూ అన్నాడు.. ఏమోలే, మళ్లీ ఆయన వెదుక్కుంటారు.. పర్వాలేదు ఇక్కడే ఉంటా.. వచ్చేస్తారు అన్నాను..నాకసలు నడిచే ఓపిక కూడలేదు నిజానికి.. సరే ,జాగ్రత్త ..ఎక్కువ సేపు ఇక్కడ ఉండకు ..అవసరం అయితే బయట వెయిట్ చేయి అని వెళ్ళిపోయాడు..
తను వెళ్లిపోయాకా చాలా దిగాలుగా అనిపించింది.. అక్కడే కూర్చుని వెళ్ళిపోతున్న జనాలను,దాదాపుగా ఖాళి అయిన గ్రౌండ్‌ను చూస్తూ ఉంటే గట్టిగా నవ్వులు వినబడ్డాయి ..ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ..ఎప్పుడోచ్చారో తెలియదు మచ్చా, మాపుళే అంటూ దాదాపు పదిమంది వరకు అబ్బాయిలు.. బీరు సీసాలు గట్రా లు తెచ్చుకుని నవ్వులు నా వైపు చూస్తూ ..భయం వేసింది .. అప్పట్లో తమిళ్ కొద్దిగా కూడా అర్ధం అయ్యేదికాదు ..అసలేం అంటున్నారో తెలియదు ..మన తెలుగబ్బాయిలను చూసి తెగ పోజుగా తిట్టేసాను కాని వాళ్ళను చూస్తేనే భయం వేసింది..నాయుడన్నయ్య ఎందుకు చెప్పాడో అప్పుడర్ధం అయి పరుగు పరుగున బయటకు వచ్చేసాను ..
బయట కూడా పెద్దగా జనాలు లేరు ..అందరూ వెళ్ళిపోతున్నారు ...ఇంక నా వల్ల కాక నేను ఇంటికి వెళ్ళిపోదామని ఒకరిద్దరిని 'సిమే' కి వెళ్ళే బస్ ఎక్కడ ఎక్కాలి అని అడిగాను .. తెలియదంటే తెలియదన్నారు ... దూరంగా ఏదో బస్ స్టాప్ కనబడితే అక్కడికి పరుగుపెట్టి అడిగాను .. వాళ్ళూ తెలియదు అన్నారు .. ఈ లోపల ఈయన గ్రౌండ్‌కి వచ్చేసారేమో ..వెతుక్కున్టున్నారేమో అని అటు పరుగులు తీసా మళ్లీ .. అక్కడా ఎవరు లేరూ.. ఎటు బ్లూ షర్ట్ కనబడితే అటు వెళ్లి చూసేదాన్ని ... దాదాపు గా జనాలు పలచబడ్డారు.. అప్పుడు మొదలైంది ఏడుపు వరదలా... ఎవరన్నా చూస్తున్నారేమో,నవ్వుతారేమో ఇంకేం లేదు ..ఏడుస్తూనే ఉన్నా,కళ్ళు తుడుచుకుంటునే ఉన్నా....
అలా అక్కడే ఒక చోట ఆగి నించుని చూస్తుంటే ప్రక్కన ఎవరో షూ లేస్ కట్టుకుంటున్నారు మెట్లపై కూర్చుని..యాదాలాపం గా అతని వైపు చూసాను.. అతను అతనేనా ?? అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే తను ఒక నిమిషం నా వైపు చూసాడు ఆక్చర్యంగా ..నిజానికి వేలాదిమంది అభిమానులు అతనిని చూడగానే పరుగులు పెట్టి చుట్టుముడతారు ...బహుసా నేనేనేమో అతని కెరీర్లో ఏడుపుమొహం వేసుకుని ,మొహమంతా కాటుక పులుముకొని ,కనీసం చిరునవ్వు కూడా నవ్వకుండా నించుంది .."అతనే సచిన్ టెండూల్కర్ "... అప్పటికి అతని వయసు పాతికలో ఉంటుందేమో ...అప్పుడే ఫ్రిజ్ లో తీసిన ఫ్రెష్ యాపిల్ లా ఎంత బాగున్నాడో. అంత ఎండలో రోజంతా ఆడినా అసలు అలసట లేకుండా అంత తెల్లగా ఎలా ఉన్నాడో నాకు ఇప్పటికీ అర్ధం కాదు ...
కాస్త దూరంలో క్రికెటర్లు హోటల్ కు వెళ్ళే బస్ ఉంది ... విచిత్రం ఏంటంటే అసలు సేక్యూరిటినే లేదు..ఎవరో ఒకరిద్దరు పోలీసులున్నారంతే ..ఇంకా పెద్ద విచిత్రం ఎగబడి చూసే జనాలు అసలు లేరు ..బహుసా ఆ రోజుల్లో మన ఇండియన్స్ తక్కువ అవ్వడం వల్ల అనుకుంటా ..ఇప్పుడయితే భారీ బందోబస్తు చేయాలి ... ఒక్కొక్కరు నా ప్రక్క నుండే కిట్లు పట్టుకుని బస్ ఎక్కారు.. గంగూలి ,ద్రావిడ్ ,వెంకటేష్ ప్రసాద్ ...(అలా చూస్తారేంటి కాస్త కుళ్ళుకోండీ ..అన్నీ నేనే చెప్పాలి )ఎవరెవరో గుర్తు లేదు ఇంకా...కానీ చాలా మంది బస్ ఎక్కుతూ మన అవతారాన్ని ఒకమారు దర్శించి ఎవర్తిరా ఇది అన్నట్లు అయోమయం మొహం పెట్టి ఎక్కారు..
అంటే మా అనిల్ నన్ను చూడలేదు లెండి ..లేకపోతే తప్పకుండా నా కోసం ఆగి పోయేవాడు :) ..ఆ టైములో వాళ్ళను ఆటోగ్రాఫ్ అడుగుదాం అనిగాని ఫొటోస్ తీద్దాం అనిగాని నాకేం అనిపించలేదు..నా ఏడుపు నాది ..మా ఆయన తెగ తిడతారు ఆ విషయం మీద ఇప్పటికీ.. అలా క్రికెటర్లు అందరూ వెళ్లిపోయాకా పూర్తిగా నిర్మానుష్యం అయిపొయింది ఆ ప్లేసు ..ఇంక ఏడ్చే ఓపిక లేకా మెల్లిగా టెండూల్కర్ కూర్చున్న మెట్ల మీదే కూలబడి గడ్డి పీకుతూ ఉన్నా.. పది నిమిషాలు పోయాకా వచ్చారు మా శ్రీవారు తాపీగా .. అరేయ్ ,ఇక్కడ ఉన్నావా .. నేను గ్రౌండ్ లో వెదుకుతున్నా ..అసలేమైంది అంటే ఆఫీస్‌లో చా..లా ..పని ఉంది ..దానికి తోడూ ట్రాఫిక్ జామ్ అయ్యింది అంటూ ... ఆ తరువాత ఏం జరిగింది అనేది మీ ఉహా శక్తికి వదిలేస్తున్నా ...అన్నీ ఇక్కడ చెప్ప కూడదంట లలితగారు చెప్పారు... అందుకే ఉష్.. గప్చిప్ అని ..
78 కామెంట్లు:
sooper ...keka...
adbhutam...
Rajkumar
నేస్తం గారు. టపా సూపర్.. ఇందాక పోస్ట్ చదవ కుందానే కామెంట్ పెట్టేసా కనీసం టాప్ 5 లోనన్న రావాలని...:) :)
సచిన్ కనిపిస్తే ఆటోగ్రాఫ్ తీసుకో లేదా? చేతిలో కెమెరా ఉండి కూడ ఫోటొ తియ్యలేదా? హతవిధీ..! (నిజం గా మీ అద్రుస్టానికి కుళ్ళు కుంటున్ననండీ.. )
బహుశా: అందరికంటే క్రికెట్ మీరే ఎక్కువ ఎంజాయ్ చేశారనుకుంటా. బాగున్నాయండి మీ ముచ్చట్లు. పక్కనే ’సిస్టర్’ కూర్చొని చెప్పినట్లుగానే ఉంది. చెల్లా? అక్కా? అని అడగకండేం:)
:))))))))) :))))))))) :)))))))))))))
Iam first...
eesaari maatram nene!
హెన్ని కామెడీ ఖష్టాలండి.......................... అన్ని సినిమాలు చూపించినా నాయుడన్నయ్య కూడా వదిలేసి వెళ్ళిపోయాడా........... ప్లిచ్
అయితే అయింది కాని ఇండియన్ టీం మొత్తాన్ని మద్యలో ఉండి చూసారనమాట మేనేజర్ లాగ, మేం మాత్రం చాలా కుళ్ళేసికున్నామండి.
నెనే 1st :)
oho.... yehe yehe..
danda naka danda naka....dan.dan.
అహ..ఓహొ.. మొదటి కామెంట్ నాదే.. July/19/2010 నా జీవితం లొ సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ రోజు. :)
చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినఫ్ఫుడు కూడా ఇంత సంతోషపడలేదండి.
"ఒక్క లైన్ కోడ్ చేంజ్ చేసి 100 బుగ్ లు ఫిక్స్" చేసినంత ఆనందం గ ఉంది నాకు.
అయ్యొ 1st కాదు.
ఈ టపా అదిరింది.
నాయుడన్నాయ్ గురించి చెప్పినప్పుడు నవ్వాగలెదండి.
అనిల్ కుంబ్లే ఇష్టం అంటారు క్రికెట్ అంటే ఇష్టం లేదు అంటారు
ఇప్పుడు మీరు క్రికెట్ ని పోగిదారా తెగిదారా
పోస్ట్ కెవ్వు కేక
చాలా రోజుల తర్వాత మీరు మంచి ఫాం లోకి వచ్చేసారు
రాజ్ కుమార్
మీ కలనేరవేరింది
నేస్తం గారి బ్లాగులో మొదటి కామెంట్ మీదే కంగ్రాట్స్ :)
ఇంకా మీ ఏడుపు మొహాన్ని చూసి సచిన్ తనే పలకరించేసాడేమో అని కంగారు పడ్డాను. :D అప్పుడు ఇంకెంత కుళ్ళేసుకుని వుండేవాళ్ళమో...
పైకి నా నోరు కనబడుతుంది కాని చివరకు అన్నీ మావారు చెప్పినట్లే జరుగుతాయి ..అయినా సరే ఎందుకు వాదిస్తానో నాకు ఇప్పటికీ అర్ధం అయ్యి ఏడవదు. .నాదీ same to same feeling మా విషయం లో
బావగారిని అడిగానని చెప్పు చెల్లెమ్మా
hahaha! enni paaTlu paDDaaranDee! picchi krikeT koesam. naa praghaaDha saanubhooti meeku.
hare krishna garu .. ThanQ thanQ.
Mothaanikee mee cricket premani ilaa cheppesthunnaarannamaata. Aaduvaari maatalaku ardhaale verule kadaa :D
Faustin Donnegal
రాజ్ కుమార్ ఫస్ట్ కామెంట్ కోసం అని సూపర్,అద్భుతం అనేసారా నేనింకా నిజం గా బారాసేసానేమో అనేసుకున్నా :) అదే కదా నాక్కూడా అవిడియా రాలేదు ..ఫొటో తీద్దామని..అంటే అప్పుడు నేనున్న పరిస్థితి కూడా అలాంటిది మరి
జయా మీరు ఏమనిపిలిచినా నాకు సంతోషమే ..నిజమే అసలు ఈ క్రికెట్ మీద ఇంకో నాలుగు పోస్ట్‌లు వేయవచ్చు నేను అంత ఎంజాయ్ చేసాను :)
పద్మ గారు నిజ్జంగా అంత నవ్వేసారా ..థేంక్యూ,థెంక్యూ
సవ్వడి :)
3g గారు మీకు నా కష్టాలన్నీ అంత కామెడీ గా కనిపిస్తున్నాయా ఆయ్ ..అదే కదా నేనూ అదే అనుకుంటా..ఎంత మొహమాట పడి వెళ్ళిపొమ్మని అంటే మటుకు సర్లేమ్మా నేను ఉంటాను అనలేదేంటి చెప్మా మా అన్నయ్యా అని ..
పవన్ :)
హరే క్రిష్ణ పేకాట పేకాటే అన్నయ్య అన్నయ్యే అన్నట్లు క్రికెట్ క్రికెట్టే ,అభిమానం అభిమానమే..కాబట్టి క్రికెట్‌ని తెగిడాను అనిల్ ని పొగిడాను.. ఎనీ డౌట్స్ :)
స్ప్రురిత మరీ డబ్బా కొట్టినట్లు ఉంటుందని చెప్పలేదు కాని నిజానికి టెండుల్కర్ 3,4 సార్లు నా వైపు చూసాడు బహుసా తప్పిపోయాను అనుకున్నాడో ఏమో..నాకేమో భయం వేసింది గబుక్కున అడుగుతాడేమో అని ..అందుకే చూసినప్పుడల్లా మొహం తిప్పేసుకున్నా :)
సునీత ఇంకేం చేస్తాం చెప్పు ..హూం :)
నాయుడన్నయ్యా!!!ఎలా ఉన్నావ్? ఆ రోజు ఎందుకన్నయ్యా అలా వదిలేసి వెళ్ళిపోయావ్ :)ఇంతకూ ఏమి అడిగావని చెప్పాలి బావ గారికి :)
Sorry but your standards have really come down. In the 1st half, I was actually feeling bored and waiting for a suitable ending.
Please do take time and come back with lively posts.
You are loosing your charm by posting not-so-worthy posts these days. Am sure you realise it.
నేస్తం గారు.. కామెంట్ ఎప్పుడు పెట్టిన ఒకటేనండీ .. మళ్లీ చెప్తున్నా.. ఐతే . టపా సూపర్.. కేక. అద్భుతం.. ముఖ్యం గా ఆ నాయుడు అన్నయ్య పేరా ఇప్పటికి ౩ సార్లు చదివా..
బావా ఏం చేస్తున్నావు?,
బావా ఎలా ఉన్నావు?,
బావా చెల్లి ఏం కూర వండింది ?
బావా పని అయిపోయిందా ఏదన్నా మాట్లాడు
హా హా.. రచ్చ..రచ్చ..
మిర్చి గారు మీరు అనేసారా ..ఇంకా అనట్లేదేమిటా అనుకుంటున్నా..
అఙ్ఞాత గారు ఇవి నా జ్ఙ్ఞాపకాలు ..ఊహించి రాసినవి కావు..ఎంత నిజం అంటే మొదటి లైన్లో మావారు నన్ను పొగిడినప్పటి నుండి ..ఆయన నన్ను పొగిడినప్పుడల్లా నేను నిజంగా అందంగా ఉంటానా ..మీ కాలేజ్‌లో చదివితే నన్ను ప్రేమిస్తారా అని అడిగిన విషయం దగ్గరనుండీ.. నాయుడన్నయ్య పోన్ విషయంలో మావారు తిట్టిన తిట్లు..ప్రతీదీ 100% నిజం .. అందువల్ల తప్పదు భరించాల్సిందే :) కాకపోతే ఒక్కటి చెప్పగలను అన్ని జ్ఙ్ఞాపకాలు అందంగా ఉండవు ..ఎందుకంటే జరిగింది రాయాలి కాబట్టి :)
రాజ్ కుమార్ థేంక్యూ :)
>>అయినా సీరియస్ గా మొహం పెట్టి అంటే అక్కా?చెల్లా? అన్నాను ... మీ వయసు ఎంత ?అన్నాడు వెంటనే. మొన్నే ఇరవై వచ్చింది అన్నాను ..అయితే నాకు ఇరవై మూడు చెల్లెమ్మా అన్నాడు.. నాకు ఎవరూ అన్నయ్యలు లేరేమో ఎవరైనా చెల్లెమ్మా అంటే చాలు పట్టుకోలేరు నన్ను ..ఇంక మొదలు పెట్టేసాను కబుర్లు ...
కొంచం నమ్మ శక్యం గా లేదండీ.సింగపూర్ లో లేబర్ తొ అలా మాట్లాడి నెంబర్ అదీ ఇచ్చేసారంటే...మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి
మీ టపా లలో మీ అమాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడమే ఎక్కువవుతోంది ఈ మధ్య.
yenta bavundoo chalaa happy ga anipinchindi. yekkadikooooo vellipoyaaa.
"పైకి నా నోరు కనబడుతుంది కాని చివరకు అన్నీ మావారు చెప్పినట్లే జరుగుతాయి ..అయినా సరే ఎందుకు వాదిస్తానో నాకు ఇప్పటికీ అర్ధం అయ్యి ఏడవదు"
మేము పడగొట్టడం అందం మీరు పడిపొవడం ఆనవాయితి
మీ పొస్ట్ చాలా బాగుంది
అఙ్ఞాత గారు నేను కాస్త సరదాగా తిప్పిరాసాను గాని నిజానికి అతను ముందు మాట్లాడినపుడు నేను కొంచెం భయ పడ్డాను ..అందుకే మాట్లాడలేదు.. ఎప్పుడైయితే చెల్లేమ్మా అన్నాడో నాకు ధైర్యం వచ్చింది అక్కనో,చెల్లినో ఎలా తెలుసు నీకు అన్నాను.. అప్పుడు వయసు అడుక్కున్నాం :) అలా నెంబర్ ఇచ్చాననే మావారు చాలా గట్టిగా తిట్టారు నన్ను.. అందరినీ అలా నమ్మేయకూడదు అని.. అప్పటికి నాకు ఇరవై ..అంత మెచ్యూరిటి లేదు.. అవే కాదు చాలా విషయాల్లో ఇలాంటి పనులు చేసాను ... ఇక అమాయకత్వం అంటారా ..అప్పటి విషయాలు నాకు తలుచుకుంటే ఇప్పుడు నాకు నిజంగానే నవ్వువస్తుంది.. అప్పటికీ,ఇప్పటికి చాలా తేడా ఉంది నాలో :)
శోభా థేంక్యూ
కోనసీమ కుర్రోడు గారు ఏం చెప్పారండీ.. :)
అంటే అనిల్ కుంబ్లే మీ అన్నయ్య నా ?
మీరు , మీవారి గురించి చెపినట్లే , అదేమిటో , ఎప్పుడూ నేను గొణగటమే కాని , మావారు మటుకు ఆయన ఇష్టమైనట్లే చేస్తారు . ఐనా నేనెందుకు గొణుకుంటూ వుంటానో తెలీదు .
బావగాడి విషయం అదిరిందండి . అక్కడ మటుకు మీవారి మీద తెగ జాలేసిందంటే నమ్మండి .
hare krishna రామ రామ అనుకున్నానండీ వ్యాఖ్య ప్రచురించేముందే సామెత అతకలేదేమో అని ..ఆ.. అంత ఎవరు ఆలోచిస్తారులే అని ప్రచురించేసా :)
మాలగారు మామూలుగా జాలిపడకూడదు పాపం..ఆ అబ్బాయి దాదాపు 2 నెలలు వదల లేదు మా ఆయన్ని.. ఈయన ఎక్కడ తిట్టి పడేస్తారో అని నేను ఇంట్లో ఒట్లమీద ఒట్లు ..ఏమి అనొద్దు నేనే నెంబర్ ఇచ్చాను అతని తప్పులేదని.. పైగా ఆఫీస్ పోన్ నెంబర్ కదా ఈయన పాపం నిజంగానే చాలా విసిగిపోయేవారు
ఇంతకీ నాయుడన్నయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు
బాగుందండీ మీ పోస్ట్
టెండూల్కర్ ని ప్రత్యక్షంగా చూసారా
super
ఇంద్రేష్
ఐతే ఇప్పుడు తమిళం బాగా నేర్చుకున్నారా?
టప బాగుంది..... నాయుడు అన్నయ్య పేరా అదుర్స్.... :)
మీ ఆయన వచ్చిన తరువాత మీరు ఆడిన వీరంగం ఊహించుకుంటూ తెగ నవ్వేససుకున్నాను........పాపం బావ....:)
ఇంతకీ ఇప్పుడు నాయుడన్నయ్య టచ్ లో ఉన్నాడా?
బాగున్నాను చెల్లెమ్మా
బావ గారి దయవల్ల airtel కన్జ్యూమార్ కేర్ యూనిట్ లో పనిచేస్తున్నా
బావ గారి ఆరోగ్యం జాగ్రత్త తిండి కలుషితం చేస్తున్నారని అప్పుడే కంప్లైంట్ చేస్తుండేవారు ఫోన్ లో
ఇప్పుడు అంతా ఓకే నా
ఈ కామెంట్ చదివి బావ నన్ను తరుముకుంటూ వస్తారేమో
సెలవు
శ్రీనివాస్ ,రాజు.. నాయుడు అన్నయ్య మొదట్లో మావారికి తరుచు పోన్ చేసి రెండు నెలలకు ఇంక మానేసాడు చెయ్యడం.. మరి పనిలోకి వెళ్ళిపోయేవాడో లేక మావారు ఏమన్నా విసుక్కున్నారో తెలియదు ,,మరి ఎక్కడున్నాడో.. కాకపోతే ఇక్కడ వర్క్ పర్మిట్ మీద వచ్చిన బంగ్లాదేశ్ ,తమిళియన్స్ చాలామంది కాస్త మంచిగా ఉండరు( నా అభిప్రాయం) .. కాని మన తెలుగువాళ్ళు చాలా మంది మాత్రం పాపం దూరపు కొండలు చూసి మోసపోయి ఇక్కడ ఇమడలేక కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నవాళ్ళే... (ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసాను)
ఇంద్రేష్ ఆ చాలా దగ్గరనుండి చూసాను :)
తారా పర్వాలేదు బాగానే అర్ధం అవుతుంది ఇప్పుడు ..మాట్లాడే సాహసం మాత్రం చేయను
మరి క్యామిడీనే కదండీ మీవారికి ఇంట్రెస్ట్ అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి కుర్చోబెట్టేసారా స్టేడియంలో....హ హ హ మనం పరీక్ష పాసైతే పక్కోడికి గుండు కొట్టిస్తామని మొక్కుకున్నట్టు లేదూ? లౌక్యం లేకుండా ఎలా ఒప్పేసుకున్నారండీ ఎంత పొగిడితే మాత్రం. అయినా అప్పుడు పెళ్ళైన కొత్తలో కాబట్టి ఒప్పుకొని ఉంటారు కాని ఈపాటికి సీన్ రివర్స్ అయిపోయి ఉంటుంది.
aa incidenttho meeku bhaga dairyamu vachindanukunta.gajula
తరవాత ఏమి జరిగిందో ఆ మాత్రం ఊహించలేమా ఏంటి?
మీరు బావగారికి (మీ వారు) ఫుల్ గా కోటింగ్ ఇచ్చేసుంటారు,బావగారు పాపం జాలిపడిపోయి అయ్యో బుజ్జీ అలా జరిగిందా అనగానే వెంటనే కరిగిపోయి ఉంటారు. అంతే కదా? :)
అయినా మీరు ఎవరో చెప్పిన మాటలు మనసులో పెట్టుకోకుండా ఆ ఆషాఢం కబుర్లేవో చెప్పేస్తే వినేయాలని(చదివేయాలని)భలే కుతూహలంగా ఉంది. :)
Kotha ga cheppedhi emundhi.. Post superu....
Cricketers tho antha golden chance ela miss chesukunnaru abba..
Akka, mee posts valla maaku oka labam.. repu pelli ayyaka.. maa wife ela think chesthundho... maaku telispothondhi :) :)
Naakuda bava gari number isthava.. oo sari malla pani padatha :) :)
Post lo vacchina first two paras chadivi entha navvukunnano.. assalu aa doubts meeku ela vacchayi.. "Mee college lo nenu vunte love chese vara? oppukokaopothey?"..
Final ga oka question.. meeru ekkadidaka chaduvukunnaru..?? endukante.. mee posts lo intermediate daka mee college experiences rasaru kada.. andukani aduguthunna..
ఓహో..అయితే అమ్మాయిలను నువ్వు కత్తి,కొడవలి, నీ అందమే అందం..ఇలా పోగిడేసి దారిలోకి తెచ్చుకోవచ్చు అనమాట...బాబోయ్ మీ పోస్టుల వల్ల నాకెన్ని తెలిసిపోతున్నాయో..మొత్తానికి క్రికెట్ చూడ్డానికి వెళ్ళలేక వెళ్లి ఎన్ని పాట్లు పడ్డారో నాకైతే మీమీద బోలెడు జాలి కలిగింది..అక్కడ అబ్బాయిలు మీ గురుంచి అలా మాట్లాడుతుంటే మీకు రక్తం మరిగి ఉండాలే..కదా..నేను అప్పుడు ఉంటే కొట్టేద్దును..(కొట్టాలాని ఖచ్చితంగా అనుకునే వాడికి:) )..ఇకపోతే టెండూల్కర్ అని అలా పాపం ఆర్ట్ సినిమా హీరోయిన్ లా చూస్తూ ఉండిపోయారా, ఆటోగ్రాఫ్ అడక్కుండా..టెండూల్కర్ అనుకొని ఉంటారు "ఈవిడెంటి, కనీసం ఆతోగ్రాఫ్ కూడా అడగడు...మన పాపులారిటీ ఏమైనా తగ్గుతుందా" అని ...:))..టపా కేక :)
:) + :( + మీరు చెప్పకుండానే కొంచెం కుళ్ళు...
హీ...హీ..హీ...ఇది కుళ్ళుతో కూడిన నవ్వు, మరి అంతమందిని చూసారుగా:)
నాయుడు గారు మీ వ్యాఖ్య నాకు కొంచెం గజిబిజిగా అనిపించింది :(
3g గారు అప్పట్లో ఎవరూ తెలియకా నేనే దిక్కు మావారికి ఓ నాలుగు నెలల వరకూ.. ఇప్పుడైతే అసలు చెప్పను కూడా చెప్పరు ఫలానా చోటికి వెళుతున్నా అని..అంతమంది ఫ్రెండ్స్ :)
గాజులగారు ధైర్యం అంటే అమ్మాయిని కాబట్టి పూర్తిగా చెప్పలేకపోయగాని ఎవరికి రాకూడని పరిస్థితి..పైగా అప్పట్లో ఒంటరిగా ఎక్కడన్నా ఒక గంట ఉండాల్సి వచ్చినా విసుగ్గా ఉండేది.. ఇప్పుడు కాసింత అలవాటు చేసుకున్నా..
సాయి ప్రవీణ్ చివరికి అదే అనుకో జరిగేది.. ఇంటికొచ్చేవరకూ ఇండియా వెళ్ళిపోతా టికెట్ తీయమని ఏడుస్తూ కూర్చున్నా.. పైగా ఆ రోజు బస్ కూడా అరగంట లేట్ వచ్చింది :) `
శశిధర్ పెళ్ళైన ఒక మూడేళ్ళవరకూ ఇలాంటి సుత్తి ప్రశ్నలు తరుచూ అడిగేదాన్ని..మా నాన్న మనపెళ్ళికి ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అనగానే లేదు లేదు మీ నాన్నను బ్రతిమాలుకుంటా మీ అమ్మయి లేకపోతే బ్రతకలేనని అని అంటారని తెగ ఆశించేదాన్ని. ఆయనేమో సింపుల్‌గా చీ చీపో నీ కూతురిని ఎవడు చేసుకుంటాడు నేను హాయిగా ఇంకెవరినన్నా చేసుకుంటా అంటాను అని ఏడిపించేవారు :)ఆయన అవసరం అయితే మాత్రం పొగిడేవారు..
నేను డిగ్రీ వెలగబెట్టాను గాని అప్పుడు చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ లేవు :)
కిషన్ ఏమో మరి ఏమనుకున్నాడో ... నాకైతే డవుటే ఇది ఏ పనిమనిషో శుభ్రం చేయడానికి వచ్చిందేమో అనుకున్నాడో ఏంటో అని ...మన అవతారం అంత బాగుంది మరి అప్పటీకి
చారిగారు,పద్మ బోలెడు సంతోషం గా ఉంది కుళ్ళుపడిననదుకు
నేస్తం గారు! నిన్న చూసినా ఇప్పుడే నాకు చదవడం ఐంది. అప్పుడే చదివేద్దామంటే... మీవి చిన్న టపాలు కాదుగా! ఏమీ అనుకోవద్దు.
టపా నాకు నచ్చింది. నవ్వించారు.
మీవారిని ఆరోజు ఇంటికెళ్ళాక తినేసుంటారనుకుంటాను .
ద్రావిడ్ ని, సచిన్ ని అందరినీ అంత దగ్గర నుండి చూసారా! ఎంత అదృష్టమండి బాబు! నేను వీళ్లిద్దరిని చూడాలనుకుంటున్నాను. అనుతుందో అవదో......
నేస్తం గారు! నిన్ననే స్వాతి లో చదివాను. కంపెనీ వాళ్లు తయారుచేసిన కాటుక పెట్టుకోవద్దు. కళ్లకు మంచిది కాదంట. చక్కగా మీరే చేసుకుని పెట్టుకోండి. పెట్టుకోవద్దని చెప్తాననుకున్నారా... సమస్యే లేదు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి.
కొందరు చెప్తున్నట్లు... పోస్టులు అప్పటిలా లేకపోయినా మీ అమాయకత్వం బాగానే కనిపిస్తుంది నాకు.
మీరు ఇలాగే రాస్తూ ఉండండి.
అన్నట్లు చెప్పడం మరచిపోయాను.
సంవత్సరం ముందుగానే చెప్పేస్తున్నా!
స్వదేశాగమన శుభాకాంక్షలు......
నేస్తం గారు, చాలాబాగుంది మీ టపా. ?టెండూల్కర్ వాళ్ళందరినీ దగ్గరనుండి చూసి ఫోటోలు తీసుకోలేదని ,ఆటోగ్రాఫ్ తీసుకోలేదని అంటున్నారా ?తీసుకుంటే మేమంతా చుద్దుమా?
నేస్తం గారు,టపా రొంబ నల్ల ఇరుక్కు...నాయుడు అన్న గురించి చెప్పినప్పుడు ..నేను చాల బాగా నవ్వుకున్నాను....నేను కూడా మీలాగే అలా అన్నయ్యలని,తంబిలని మా వారికి పరిచయం చేసి...అచ్చు మీలాగే అక్షింతలు తీసుకునేదాన్ని.మొతానికి ఒంటరిగా క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేసారు అనుకుంట...మే దిర్యానికి మేచుకోవాలి సుమండీ...
సవ్వడి గారు నిజమే కంపెనీ కాటుక వాడుతుంటే పడటం లేదు..పోస్ట్ నచ్చినందుకు థేంక్స్.. ఇప్పుడు ఎటు చూసినా ipl 20-ట్వంటీ అంటూ ఏవేవో జరుగుతునే ఉన్నాయిగా ఎప్పుడో ఒకప్పుడు చూస్తారు వాళ్ళను...
రాధికా నిజం చెప్పాలంటే అప్పటికి నాకు కెమేరాలో జూం అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు..ఆయనేదో చెప్పారు ఓ 4 పొటోస్ తీసా అంతే ..అదికూడా డిజిటల్ కెమెరా కాదు.. ఎందుకో అంత గొప్పగా ఫీల్ అవ్వలేదు ఆ టైములో ..ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో అయ్యో తమ్ముళ్ళకు చూపేదాన్నే అని..
కవితా పోస్ట్ పుడిచిరికా..రొంబ నండ్రి ..మీకూ అన్నయ్యల పిచ్చేనా.. మొన్న అయితే మావారి ఫ్రెండ్ పూజ ఏదో చేస్తే నేను హారతి ఇచ్చా ఇంకో ముగ్గురితో కలిపి ...ఆయన ఒక 10 $ నోట్ ఇచ్చారు ..అది ఎన్నాళ్ళు దాచానో ...నాకు అన్నయ్య ఉంటే ఇలాగే ఇచ్చేవాడు కదండీ అనుకుని తెగమురిసిపోయా.. అదో సరదా :)
నేస్తం అక్క పోస్ట్ soooooooooper ...లేట్ గా చూసాను మీ పోస్ట్ ....అప్పుడే మూడు సార్లు చదివాను అంత ముచ్చట గా ఉంది మీ పోస్ట్.. నేనేమో మిమ్మల్ని శ్రీదేవి అని ఊహించుకుంటుంటే మరల వేరే హీరొయిన్ ఎవరినో తీసుకొచ్చి పెడితే ఎలా ?
పూర్తి స్థాయి టపా చాలా రోజుల తర్వాత రాశారు .సూ.......పర్. మీ అమాయకత్వామే మీ బ్లాగ్ కి ఆయువుపట్టు. మళ్లీ ఎప్పుడైనా మ్యాచ్ కి వెళ్లారా?
ఆపండ్రోయ్... (ఒక సారి నువ్వు నాకు నచ్చావ్ చిత్రం లో బ్రహ్మానందాన్ని గుర్తు తెచ్చుకోండి.). నేస్తం గారూ.. ఈ మధ్య కాలం లో ఈ విధం గా ఎప్పుడూ నవ్వి ఉండనేమో..:D:D. అంతా కన్నులకి కట్టినట్లుగా రాశారు. నిజానికి నేనే అక్కడ ఉన్న భావన కలిగింది. :) నవ్వలేక కడుపు నొప్పి వచ్చేసిందండీ..
సూ.....పర్.
నేస్తం నాకు పది డైలీ సీరియల్స్ ఒక్కసారే చూసినంత ఏడుపొచ్చింది ఈ పోస్టు చదువుతుంటే . మీ ఆయనమీద నాకే ఇంత కోపం వచ్చిందంటే .... ఈ ఎపిసోడ్ ఫైనల్లో ఏం జరిగుంటుందో ఈజీగా ఊహించెయ్యొచ్చు. అది చెప్పకుండా దాచేసి మంచి పని చేసావు . మనం తిన్నవి చెప్పినా తప్పులేదుకానీ మనం పెట్టిన వి అస్సలు చెప్పకోకూడదమ్మా !
ఇక ఆడవాళ్ళ అమాయకత్వానికీ వయసుతో సంబంధం లేదేమో ......
మొన్న రైల్వే స్టేషన్ లో ఎవరో వాళ్ళవాళ్ళకోసం ఎదురుచూస్తూ చాలా కంగారు పడుతూ వుంటే పోనీ ఓ సారి ఫోన్ చేస్తారా అని నా ఫోన్ ఇచ్చి మా వారితో తలవాచేటట్లు చివాట్లు తిన్నాను . హు.....ఏం చేస్తా . ఆడ్జన్మకు ఎన్ని శాపాలో ........
harithi icchinanduku 10$ aa aha.. subram ee part time edo bavundhi ga ammayilaki..
comments lo halfcentury finish chesaru.. century kooda finish cheyali ani korukuntunam..
శివరంజని ఇంకేం హీరోయిన్ తో పోల్చానబ్బా??... ఇదిగో ఏది ఏమైనా పోస్ట్ కోసం వంద రాస్తుంటాం..అవన్నీ నువ్వు పట్టించుకోకేం..నేను శ్రీదేవినే ఎప్పటికీ.. నువ్వలాగే ఉహించుకో :)
ప్రియా మళ్ళీ వెళ్ళడమా .. అలా అడిగే ధైర్యం మా ఆయనకు ఉందంటావా ఇంకా :) (అసలు విషయం ఏంటంటే తరువాత ఒకసారి మావారు ఫ్రెండ్స్ తో చెక్కేసారు..నాకసలు చెప్పనే లేదు.. ఆ తరువాతా ఇక్కడ మేచ్ లు ఎందుకో పెట్టడం మానేసారన్నమాట)
మనసుపలికే గారు థేంక్యూ థేంక్యూ మీరలా నవ్వేస్తునే ఉండండి :)
>>>మనం తిన్నవి చెప్పినా తప్పులేదుకానీ మనం పెట్టిన వి అస్సలు చెప్పకోకూడదమ్మా
అయ్యబాబోయ్ లలిత నేను ఈ రోజు నుండీ మీ శిష్యురాలిని ఎంత మంచి మంచి మాటలు చెబుతున్నారు ..ఇక మీరు నాలాగే బోలెడు అమాయకులన్నమాట.. అసలు మన గోదారి నీళ్ళలోనే ఉందిలేద్దూ అమాయకత్వం,మొహమాటం.... గట్టిగా కాదూ అనలేం ,చివరకు చీవాట్లు తినేస్తాం :)
శశిధర్ ..ఏటి ..హారతి విషయం లో కూడా కుళ్ళు పడిపోవాలా అమ్మయిల పైన :) ..
nenu kullu padatam ledu.. devudu maa kooda aa option isthey subarranga.. foreign lo chaduvu kutunna telugu thammulaki.. oka part time job la vundedhi..
@lalithakka- meeru phone icchina vallu.. aa phone tho chekkesthe appudu telisedhi bava garu enduku tittaro....
meeru enathayina cheppandi maga jnamaki enni badhyathalo.. offcourse inka naaku eveve telivanukondi ;)
హ్మ్..నేస్తం గారి శ్రీవారు మరీ ఇంత కఠినాత్ములా!తర్వాత మీరు బానే వడ్డించారనుకుంటా!.....నాయుడన్నయ్య సీను సూపరో సూపరు...కాని వాళ్ళు అలా ముందు మీగురించి అనుకుంటున్నప్పుడు ఎంత ఇబ్బంది పడుంటారో కదా! ప్చ్...ఏం చేద్దాం..."బావగారి" నిరంకుశత్వం....ఇప్పుడు ఇక్కడున్న బ్లాగు తమ్ముళ్ళకందరికీ నంబర్ ఇచ్చెయ్యండీ..ఓ పట్టుపడతారు"బావగార్ని"..
ఇక్కడో నాయుడన్నయ్య కనపడుతున్నాడు,ఎవరో కొంచెం అజ కనుక్కోండి..మరి...
నేనో పే..ద్ద కామెంటు రాసానే! అయ్యో నా కామెంటు రాలేదా అయితే? :(
ఓహ్.. కామెంటు ఇంకో పోస్ట్ దగ్గర రాసాను. సారీ! అయ్యో.. నా పొగడ్తలు మీదాకా చేరలేదేమోనని కంగారు పడి అలా కామెంటు రాసేసాను ఇందాక ;-)
నేస్తం గారు, చాల రోజులైంది బ్లాగ్ లు చదివి. మళ్లీ మీ బ్లాగ్ తోనే మొదలెట్టాను చదవటం...
క్రికెట్ దేవుడు కాళ్ళ ముందు నుంచి వెళ్తుంటే ....బహుశా ఏడుస్తూ వున్నవాళ్ళు మీరు తప్ప ఇంకా ఎవరు వుండి వుండరండి...
శశిధర్ అవునుకదా పాపం..పోనీ మగపిల్లలు ఈ విషయం పై సమాన హక్కుల కోసం పోరాటం చేస్తే ఎలా ఉంటుంది :)
కౌటిల్య మరి తిట్టక ఏం చేయాలి ఆయన చేసిన పనికి :)ఆయన నెంబర్ ఎవరికి ఇవ్వలేదు చెప్పండి.. ఇప్పుడు కూడా చాలా మంది.. పలానా పోన్ కార్డ్ ఎక్కువ సేపు వస్తుంది కొనండి అనో..ఫలానా ప్రొడక్ట్ వాడితే స్లిం గా అందంగా అయిపోతారనో తెగ కాల్స్ చేస్తారు ఇండియా నుండి.. వాళ్ళకు మా ఇంటి నెంబర్లు ఎలా తెలుస్తాయోమరి??అమ్మా వద్దు తల్లీ అని అన్నా ప్లీజ్ ప్లీజ్ అని తెగ మొహమాట పెట్టెస్తారా ,గట్టిగా కాదు అనలేక వెంటనే మావారి సెల్ నెంబర్ వాళ్ళకు ఇచ్చేస్తా ..ఆయనతో మాట్లాడుకోండీ అని.. అప్పుడు కూడా చీవాట్లే నాకు ..కాకపోతే ఏ మాత్రం జాలి ఉండదు మా ఆయనకు మొహం మీద తెగ తిట్టి పడేస్తారు పాపం వాళ్ళను :)
మధురా చూస్తున్నా చూస్తున్నా ఏటా కంగారేటి.. ఆ పోస్ట్ లేమిటి ?? ఆయ్ ..
నరేంధ్ర గారు చాలా రోజులకు.. ఏమైపోయారు ఇన్నాళ్ళూ.. :)
పైకి నా నోరు కనబడుతుంది కాని చివరకు అన్నీ మావారు చెప్పినట్లే జరుగుతాయి ..అయినా సరే ఎందుకు
వాదిస్తానో నాకు ఇప్పటికీ అర్ధం అయ్యి ఏడవ :)
chaala baga rasaru nestham..
నేస్తం !ఆలస్యంగా చదివానీ టపా ...అంత నవ్వుకుంటూ కూడా ....చివరగా మీవారిని తలుచుకుంటే పాపం అనిపించిందండీ .( మనలోమనమాట! అక్కడ మీవారు కాబట్టి పాపం అన్నా :) అదే మావారైతేనా.....)
:):)
మీటపాకు రొటీన్ పదాలు వాడకుండా కమెంట్ రాయటం కష్టమైపోతుంది నేస్తం జీ నాకు..
ఆఫీసు లో work pressure కొంచం ఎక్కువగా వుంటొందండి .....అందుకే కొత్త బ్లాగ్లు చదవటానికి కాని రాయటానికి గాని టైం కుదరటం లేదు....
లక్ష్మి గారు అంతే కదండీ నూటికి 90 మంది అమ్మాయిలకు అర్ధం కాని విషయమే ఇది ..
పరిమళం గారు హి హి నేనూ మీ పొజిషన్లో ఉంటే సేం డవిలాగు కొట్టేదాన్ని..:)
అయ్య బాబోయ్ శేఖర్ అలా అని పొగడకపోతే ఇంకేమన్నా ఉందా..కొంపలు మునిగిపోవూ ..అసలే ఈ మధ్య మా ఆయన వ్యాఖ్యలు చాల ఇంట్రెస్ట్ గా చదువుతున్నారు :)
అవునా నరేంద్రా ..నిజమే లేండి ముందు వర్క్ కదా ముఖ్యం తర్వాతే బ్లాగులు :)
sehwag 99 out
అంతా మీరే చేసారు
:O ఇది మరీ బాగుంది ..విన్నవాళ్ళు నిజమనుకునేరు ..నాకు ఇప్పుడే తెలిసింది మనవాళ్ళు ఆడుతున్నారని..
30 more to go.. to make century in comments..
ప్రస్తుతానికి ఈ ముచ్చట్లు టపా ఇంకా చదవలేదు... కానీ, మన గోదావరి అమ్మాయిల వ్యంగ్యం గురించి ఒక టపా రాసేస్తారని ఆశ పెట్టుకుని ఇక్కడకొచ్చా... తొందరగా రాసెయ్యండి...
iam the 100th follower akka.. naaku peeda party ivvali ;)
మీ బ్లాగ్ చాల బాగుందండి.. ఈరోజు కూర్చొని సగం పోస్ట్‌లు చదివేసాను.. అన్నీ సూపర్ గ ఉన్నాయ్.. మీ బ్లాగ్ పరిచయం చేసిన నా ఫ్రండ్ కి థాంక్స్.
Nestham gaaru...aithe mee age ippudu 33 annamaata...correct ye naa :D
ha ha ha .....!
chchandi babu ....navvaleka....mee post ki
:)))
baapu bomma matladinatlunnai mee posts. accidentally i came to this blog and now you can put me in your fans list. andamaina telugu.
గత వారం రోజులుగా ఆఫీసు లో వీలు చిక్కినప్పుడల్లా మీ బ్లాగ్ చదివేస్తున్నా.. ఇదిగో ఇప్పుడు ఇక్కడున్నా. మీ శైలి చాలా బాగుంది. మిమ్మల్ని నిరుత్సాహపరిచే కామెంట్లు ప్రచురించండి కాని పట్టించుకోకండి. మాకు సొంత చెల్లెళ్ళు లేరు కాని, బాబయ్యల పిల్లలు, పిన్నుల పిల్లలు బోలెడంత మంది. మీ మాటలు వింటే వాళ్ళందరూ గుర్తు వస్తున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి