25, డిసెంబర్ 2008, గురువారం

ఎంకి పెళ్లి సుబ్బికి జీవితాన్ని ఇచ్చింది



చదువుకునే రోజుల్లో నాకు ఎక్జాంస్ అంటే చాలా భయం ,ఎంత భయం అంటే అవి అయ్యేలోపుల భయం తో నేను 10కెజీలు ,నన్ను చూసి అమ్మ నాన్న 5కెజిలు బరువు తగ్గిపోయేవాళ్ళం..ఒక్కోసారి విసుగొచ్చి నాన్న ..అలా భయపడితే ఇంక చదివించను జాగర్త అని బెదిరించిన రోజులు కూడా లేకపోలేదు ..

అవన్నీ పక్కన పెడితే ఆ టైం లో నేను చేసే మరొకపని ఏంటయ్యా అంటే .. తర తమ,పరమత బేధం లేకుండా మొక్కులు మొక్కేయడం..ఆ క్రమం లోనే ఆ సంవత్సరం కూడా విపరీతం గా మొక్కేసా .. మొక్కులంటే మొక్కడం ఈజి యే గాని వాటిని తీర్చేసరికి నాకు తీరిపోయేది.అలాంటి మొక్కుల్లోనే ఒక మొక్కు..చర్చ్ కి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగిస్తా (ప్రసాదం కూడా పెట్టా అనుకుంటా)అనేది.

సరే మొక్కేసా..కాని నా జీవితం లో చర్చికి ఎప్పుడూ వెళ్ళలేదు ..ఎలా వెళ్ళాలో తెలియదు..లోపలికి వెళితే ఎమంటారో తెలియదు.. వెళ్ళినా వెలిగించనిస్తారో లేదొ తెలియదు..కాని తప్పదు కదా,కాబట్టి ఎలాగో నా ఫ్రెండ్ ని బ్రతిమాలి మొదటి సారి మా కాలేజ్ దగ్గరలో గల చర్చి కి వెళ్ళా, అదేంటో ఆ వీధిలో మనుషులు కర్ఫ్యూ పెట్టినట్లు ..తలుపులేసుకుని నిశ్శబ్దం గా ఉన్నారు.. ఎలాగో చర్చ్ కి వెళ్ళి కేండిల్స్ వెలిగించి వచ్చేసా ..

అదిగో సరిగ్గా ఆ తరువాత నుండి గొడవ స్టార్ట్ చేసింది .ఒక రోజంటే వస్తుంది.. మరి నేనేమో వారం రోజులని మొక్కుకున్నా నాయే ..నీ యెంకమ్మా ఇవేం మొక్కులే హిందూ దేవుళ్ళకు మొక్కినట్లు..కొబ్బరికాయలు కొడతా, ప్రసాదం పెడతా,దీపాలు వెలిగిస్తా అని..పైగా వారం రోజులా !నేను రాను.. మా నాన్న చూసారంటే మతం మార్చేసుకున్నానేమో అనుకుని నన్ను చంపేసి సంతర్పణ చేసేస్తారు ..నన్ను వదిలేయి అని నమస్కారం పెట్టేసింది రెండోరోజున .

ఎలారా బాబు అనుకుంటున్న టైంలోలో నా బుర్రకి ఒక ఐడియా వచ్చేసింది.నేను చాలా మాములుగా ,అవునే ..ఆ ఆబ్బాయి నీకు తెలుసా రోజు నిన్ను చూసి ఏదో తెలిసిన వాడిలా నవ్వుతున్నాడు అన్నాను..ఏ అబ్బాయీ అంది అయోమయం గా..అదే ఆ గ్రీన్ మేడ ఉంది చూడు ..అబ్బా.. అదేనే ఆ వీధి మలుపు తిరగగానే వస్తుంది అక్కడ ..రోజు నిన్ను చూసి నవ్వుతుంటే నీకు తెలిసిన వాడేమో అనుకున్నా అన్నాను..అవునా!ఏమోనే నేను గమనించలేదుఅంది..


ఈ సారి వెళ్ళినపుడు చూపిస్తా అని మెల్లిగా మాటల్లో పడేసి ఆ రోజు కూడా తీసుకు వెళ్ళిపోయా ...దారిలో ఎన్ని మాటలు చెప్పినా సరిగ్గా ఆ ప్లేస్కి రాగానే ఎక్కడే, నాకెవరు కనిపించడం లేదు అంది చుట్టూ చూస్తూ ..ఓర్నాయనో ఇది మర్చిపోలేదు ..లేనివాడిని ఎక్కడినుండి తీసుకురాను అని అనుకుని ఎవరో ఒకరు దొరకక పోతారా అని వెదుకుతున్నా.. అసలే ఆ వీధిలో మనుషులే కనబడరు పైగా యూత్ కావాలంటే ఎలా?

ఏమోనే ఈ రోజు రాలేదనుకుంటా అని ఒక అబధ్ధాన్ని రెడీ చేసుకునేంతలో ... ఆ అబ్బాయా!! అంది దూరంగా బైక్ మీద ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడో లేక ఆ అబ్బాయి ఇల్లు అదేనో తెలియదుకాని అతనిని చూపుతూ..హమ్మయ్యా కాగల కార్యం గంధర్వులే తీర్చడం అంటే ఇదేనేమో అనుకుని అతనే అతనే అనేసా.

మరి గ్రీన్ మేడ అన్నావ్ అంది అనుమానంగా..అబ్బా అంత గుర్తులేదులేవే గ్రీన్ అనుకున్నా అని కవర్ చేసే అంతలో మేము అతని బైక్ దగ్గరకు వచ్చేసాం నడుస్తూ మా అలికిడికి అనుకుంటా తల తిప్పి చూసాడు.. మేము మాటలు ఆపి అతనిని దాటుకుని వెళ్ళి పోయాం..అవునే నాకు ఎక్కడో చూసినట్లు ఉంది అంది .. నీ బొంద ..అని మనసులో అనుకుని ఏమోలే నీకే తెలియాలి అన్నాను..మేము మళ్ళీ వస్తుంటే కూడా అక్కడే ఉన్నాడు .. ఇక అప్పటి నుండి రాను అనే మాటే అనలేదు.నా మొక్కు తీర్చడానికే పాపం పుట్టినట్లున్నాడు అనుకుని నవ్వుకునేదాన్ని.


ఆ తరువాత మా చదువుల పర్వం ముగిసిపోయాకా ఒక రోజు షాప్ లో ఏదో కొందామని వెళితే కనబడింది ..ప్రెగ్నెంట్ అనుకుంటా బొద్దుగా ముద్దుగా ఉంది .. ఎలా ఉన్నావ్ అన్నాను.. ఏదో నీదయ వల్ల బాగున్నా అంది..అబ్బో పెద్దరికం వచ్చేసింది అనుకుని.. పెళ్ళి అయిందా అన్నాను .. ఏదో నీ దయ వల్ల అంది..ఇదెవరురా బాబు అన్నిటికి నా దయ అంటుంది అనుకుంటుంటుండగా మా ఇల్లు ఈ పక్కనే నువ్వు రావాలి అని పట్టుపట్టి లాక్కుపోయింది..


ఇల్లు చూస్తేనే తెలుస్తుంది వేరు కాపురం అని .. పెళ్ళి ఫొటోస్ చూస్తూ అనుమానంగా ఏంటీ లవ్ మేరేజా అన్నాను ..ప్రెండ్స్ తప్పా మరి ఇంకెవరూ లేరు అందులో.. మరే .. తమరి దయే అంది నవ్వుతూ ...నా దయేంటి అన్నాను అయోమయం గా .. మా ఆయన్ని గుర్తుపట్టలేదా అంది.. ఉహు .. అన్నాను ..

అప్పుడు చెప్పింది.. ఆ రోజు చర్చి దగ్గర నేను చూపిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంది అంటా..ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడా లేదా అని ఇది ..ఈ అమ్మాయి నన్ను ఎందుకు చూస్తుంది అని అతను కొన్నాళ్ళు చూసుకున్నాకా.. ఏదన్నా చిన్న ;చితక పనులుంటే తిను అటువైపే వెళ్ళేదట .. ఆ అబ్బాయి వీళ్ళ ఇంటి ముందర చక్కెర్లు కొట్టే వాడట .. అలా ఒక సంవత్సరం పాటు చూసుకుని ,చూసుకుని చివరకు ప్రేమించుకుని ఇంట్లో తెలిసాకా పెళ్ళి చేసుకున్నారంట.మొదట్లో ఒప్పుకోకపోయినా అబ్బాయి తరుపువాళ్ళు ముందుగా మాట్లాడినా, ఇంకా తిన నాన్న గారు మంకుపట్టు వదల లేదంటా .. ఎంత కాలం లే మనవడో ,మనవరాలో పుట్టేవరకునూ అంది ...

అంతా విన్నాకా నాకు సౌండ్ లేదు.. మాట వరసకు ..లేదా ఆపద్దర్మానికి ఏదో చెబితే ...దానికి కధ,స్క్రీన్ ప్లే ,పాటలు మాటలు అన్నీ కలిపి ఇలా సినిమా తీసేస్తుంది అనుకోలేదు ... ప్రతీ ప్రేమ కధ వెనుకా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఇదేనేమో.. నాకు అదికాదు భయం వేసింది.. కధ సుఖాంతం అయింది కాబట్టి నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నా కాని.. గొడవలు అయి ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే ఈ విషపు భీజం నాటినందుకు ఎంత కుమిలిపోయేదాన్ని.. హమ్మో పెళ్ళి చేసుకుని నన్ను బ్రతికించింది.. ఇంకెపుడు నా స్వార్దానికి అభద్దాలు చెప్పకూడదు బాబోయ్ అనుకున్నాను..

ఉండవే కాఫీ పెడతా అని వెళుతుంటే ఆపి .. ఇక్కడే ఉండి ,నేనేదో మాట వరసకు అని.. తను తూచా తప్పకుండా పాటించి ..చివరకు అంతా నీదయ వల్లే అన్నాదంటే అయిపోతా అనుకుని మళ్ళి వస్తా ఈ సారి అని చెప్పి నేను ఇంటికి పరుగో పరుగు

18 కామెంట్‌లు:

సుజ్జి చెప్పారు...

hahaha..!! mee daya valla oka ammai ki pelli aiindi..!!!

నాగప్రసాద్ చెప్పారు...

హ్హ.. హ్హ.. హ్హ...మొత్తానికి కథ సుఖాంతం అన్న మాట. :)

Kottapali చెప్పారు...

బహు బాగు :)

అజ్ఞాత చెప్పారు...

Naughty girl.
Chaala allari panulu chesaru meru.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ భలే ప్రేమ :-)

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

హ్హ హ్హ హ్హ... మీ దగ్గర భలే సంగతులు ఉన్నాయి కదా... మొత్తానికి ఒక పెళ్ళికి కారణం అయ్యారన్నమాట...

నేస్తం చెప్పారు...

sujji gaaru prasaad gaaru kotta paali gaaru prapulla chandra gaaru arunaank gaaru sreekath gaaru :) dhanya vaadhaalu

అజ్ఞాత చెప్పారు...

enti nijame? :)
Chaala baaga rastunnavu.

~C

నేస్తం చెప్పారు...

nijjamgaaa nijjaam @c

Padmarpita చెప్పారు...

మీ దయవల్ల మీ ఫ్రెండ్ కి పెళ్ళి అయింది.
మేము మనసారా నవ్వుకునే భాగ్యం మాకు దక్కింది.
బాగుంది నేస్తం మీ కధ........

లక్ష్మి చెప్పారు...

అసలే బుద్ధిమంతురాలు కదా.... మీరు బుద్ధిమంతురాలు అని పేరు తెచ్చుకోవటం ఏమో కానీ అనదరినీ మాత్రం భలే ఇరికించేసారు కదా :) భలే ఉంది మీ కథ

నేస్తం చెప్పారు...

lakshmi gaaru padmarpita gaaru thanks andi :)

అజ్ఞాత చెప్పారు...

బాగా చెప్పారు.
కానీ, మీతో జాగ్రత్తగా ఉండాలి సుమా.

పరిమళం చెప్పారు...

హ్హ హ్హ హ్హ..మొత్తానికి మీ దయవల్ల మీ ఫ్రెండ్ కి పెళ్ళి అయింది.భలే బాగుంది.

Rani చెప్పారు...

funny!
mee abaddam ippatikayina thelisinda mee friend ki? :P

నేస్తం చెప్పారు...

భలేవారే అలాంటివి చెబుతాం ఏంటి.. ఎప్పుడన్న కొట్టుకుంటే నీ వల్లే అంటుంది :)రాణి గారు

అశోక్ వర్మ చెప్పారు...

ఈ టపా బ్యాక్‌డ్రాప్, కథనం భలే వెరైటీగా వున్నాయండి. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చెయ్యమన్నారు. మీరు ఒక్క అబద్ధంతోనే వెయ్యి పెళ్ళిళ్లు చేసే రేంజ్ అని అర్థమయ్యింది. Excellent Post !!!

నేస్తం చెప్పారు...

hahaha..ashok :)