అదేంటో నాకు తెలియదు కాని నా ఫ్రెండ్స్ అందరి ఇంట్లో నేను చాల మంచి ,బుద్ది మంతురాలైన అమ్మాయి అని పేరు , మా స్వాతి ఇంట్లో అయితే చెప్పక్కర్లేదు ..నేను కొంచెం దగ్గినా,తుమ్మినా ..చూసావా, ఆపిల్ల ఎంత చూడ ముచ్చటగా తుమ్ముతుందో నువ్వు ఉన్నావూ అని తిట్టి పడేసేవారు ,ఇలా నాకు మంచి పేరు రావడానికి ఒక పేద్ద కారణం ఉంది.
స్వాతి వాళ్ళింట్లో ఒక్కగానొక్క అమ్మాయి.ఆ ఇంట్లో తను,వాళ్ళ అమ్మగారు,అమ్మమ్మ గారు, కేంపుల పని మీద వెళ్ళి వారనికో,పదిరోజులకో వచ్చే వాళ్ళ నాన్న గారు. ఈ కారణాల చేత మాహ బోరు ఫీల్ అయి ఇంట్లో చెప్పకుండా (చెబితే ఎలాగు వద్దు అంటారు ) సినిమాలు ,షాపింగులు అని కష్టపడుతూ ఉండేది.నాదేమో ఉమ్మడి కుటుంబం .ఇంట్లో 20 తక్కువ కాకుండా పిల్లలమే ఉండేవాళ్ళం, పైగా మా నాన్న కు అందరం ఆడపిల్లలమే..కాబట్టి ఎక్కడకు వెళ్ళకుండా మహా సరదాగ గడిపేసేదాన్ని ఇంట్లో .. సరిగ్గా ఈ విషయం లో పడిపోయారు స్వాతి అమ్మమ్మ గారు. పాపం నాకంటే 2 మార్కులు ఎక్కువ తనకే వచ్చినా సరే నా కారణం గా చీవాట్లు తప్పేవి కావు తనకు. అలా సహజం గానే నా మీద కోపం పెంచేసుకుంది స్వాతి.
ఒక రోజు మా ఇంటికి కొత్తగా ఫొన్ పెట్టించారు ..ముందు ఎవరికి ఫొన్ చేద్దామా అనుకుంటూండగా,దాని ఖర్మకాలి నాకు స్వాతి ఫొన్ నంబర్ గుర్తు వచ్చింది. చక, చకా కాల్ చేసాను ..వాళ్ళ అమ్మమ్మ గారు తీసారు .బాగున్నారా అండి మాకు ఫొనె పెట్టించారు అని స్వాతి ఉందా అని అడిగాను . ఆవిడ అదేంటమ్మా ఈ రోజు స్కూల్‌కి కి వెళ్ళలేదా అన్నారు ఆక్చర్య పోతూ .(అప్పుడు 10థ్ చదువుతున్నా ).నేను అంత కంటేఆక్చర్యపోతూ... అదేంటండి ,ఈ రోజు స్చూల్ లేదుగా అన్నాను.అదేంటమ్మా ప్రేవేటు క్లాసు ఏదో ఉంది అంటగా లేటు అవుతుంది అన్నాది అన్నారు .అప్పటికే ఆమేకు అనుమానం వచ్చేస్తుంది .కనీసం ప్రేవేటు క్లాసు అన్నపుడన్న నా మట్టి బుర్రకు అర్దం కాలేదు.అబ్బే అలాంటిది ఏమి లేదండి అన్నాను ఒక వేళ నేను క్లాసు లో మెడం చెప్తున్నప్పుడు సరిగా వినలేదా అన్నట్ట్లుగా ఆలోచిస్తూ. ఆ తరువాత పడుకుంటున్నపుడు వెలిగింది లైటు ..అమ్మో, అయిపోయాను దేవుడో రేపు,అందులోను స్వాతికి విపరీతమైన కోపం ఎక్కువ.
నేను అనుకున్నట్లుగానే మరుసటి రోజు నన్ను లేఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది.. అంతటి తో ఊరుకోకుండా 2 రోజులు నాతో మాట్లాడటం మానేసింది. పోని మానేసి ఊరుకుందా ..రోజు ఇద్దరం కలసేవెళ్ళి, కలిసే వస్తాం ఇంటికి .. మా ఇల్లు దాటాక తన ఇల్లు వస్తుంది,ఇక చూడాలి రోడ్ కి అటు సైడు తను ఇటు నేను ..ఒక మాట మాట్లాడకుండా శోక దేవతలా ఏడుస్తూ వచ్చేది ఇంటి వరకూ .. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో అని నాకు భయం ..
మూడవ రోజు మా స్కూల్ అయిపోయే టైం కి హిప్నాటిజం చేసే ఒక అబ్బాయి వచ్చాడు . మా 10th క్లాస్ అమ్మాయిలకు ప్రత్యేకం .. ముందుగా ఎవరినన్నా రమ్మన్నాడు .. అందరికీ భయమే .. అందుకే ఎవరూ రాలేదు .. ముందు గా హిప్నటిజం గొప్పదనం చెప్పాడు ,ఆ తరువాత వచ్చిన వాళ్ళ మెమరీ పవర్ పెంచి ఎక్షంస్ లో బాగ రాసేటట్లు చేస్తా అన్నాడు.. కొందరు మెల్లిగా లేచారు .. మా మేడం నా వైపు చూసింది .. నేను మహా పిరికిదాన్ని ఇలాంటి విషయాల్లో గబుక్కున చూపు తిప్పేసుకున్నా .. అప్పుడు లేచింది మా హీరోయిన్ .. వద్దులేవే మనకి తెలియదుగా అన్నాను.. నువ్వు మాట్లాడకు, ఈ సారి నీ కంటే బాగ ఎక్కువ మార్కులు తెచ్చుకుని నేను అంటే ఏమిటో చెబుతా అని శపధం చేసి వెళ్ళింది.
ఆ అబ్బాయి ఇప్పుడు మీరు నామాటలే వింటున్నారు వింటున్నారు, వింటున్నారు అని 20 సార్లు అంటూ మొత్తానికి అందరినీ నిద్రలో పంపేసాడు.. అందరికంటే మా స్వాతికి బాగా ఎక్కేసింది.మీ ముందు పేద్ద తోట ఉంది పువ్వులు కోసుకురండి అన్నాడు ,అందరూ ఎగిరెగిరి కోసేసారు గాలిలో,శత్రువులు వస్తున్నారు మీ చేతిలో గన్నులతో పేల్చేయండి అన్నాడు ,ధడ ధడ లాడించేసారు..వాళ్ళకు ఇష్టం అయినవాళ్ళ హీరో లు ,పాటలు ఒకటేమిటి అన్నీ చెప్పించాడు ,చివర్లో స్వాతి ని ఒక్కదాన్నే పడుకోబెట్టి ఈ అమ్మాయిని ఇనుప ముక్క అంత ధ్రుడం గా చేసేస్తా చూడండి అన్నాడు .. అలాగే నువ్వు చాలా భలంగా అయిపోతున్నావూ ,పోతున్నవూ అని మొత్తానికి కడ్డీలా చేసేసి, అంతటి తో ఊరుకున్నాడా దాని కాళ్ళు ఒక కుర్చీకి అంచుల దగ్గర ,తల ఇంకో కుర్చీ అంచు దగ్గర పెట్టి ఒక లావు పాటి అమ్మాయిని పిలిచి అటు ,ఇటు నడిపించాడు .. ఆ పిల్ల దొరికిందే చాన్సు అన్నట్లు కసా బిసా తొక్కి పడేసింది.. అంతా అయ్యాకా తిరిగి అందరినీ మామూలు గా చేస్తూ ,మీ అందరూ బాగా చదువుతారు, అన్నీ గుర్తుంటాయి అని అనేసి చక్కగా వెళ్ళిపోయాడు .
ఇంక ఇంటి కొస్తున్నప్పుడు ఎప్పటిలాగే రోడ్ కి అటూ ,ఇటు నడుస్తున్నాం .. మధ్యలో మెల్లిగా నా దగ్గరకు వచ్చి ఒళ్ళు అంతా నెప్పిగా ఉంది అంటూ మెల్లిగా మొదలెట్టి ఇంక అమ్మో ,బాబోయ్ అని ఏడుపు .. ఇంటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళి అప్పజెప్పి వచ్చాను ..ఆ రోజు వాళ్ళింట్ట్లో రాత్రి ఎవరినీ పడుకోనివ్వలేదంటా ..పాపం హాస్పిటళ్ళ చుట్టూ తిరగడమే సరిపోయిందంటా .. రెండు రోజులయ్యాక ఎలా ఉందో చూద్దామని వెళ్ళా వాళ్ళింటికి .. వాళ్ళ అమ్మమ్మ గారు మా హెడ్మష్టారుని, ఆ హిప్నాటిజం అబ్బాయిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ,చివర్లో ఏమ్మా నువ్వన్నా చెప్పలేక పోయావా అన్నారు .. స్వాతి అప్పటికే కళ్ళతో సైగ చేస్తుంది వద్దు చెప్పకు అన్నట్లు అది అర్దం అయ్యేలోపలే చెప్పేసాను.. చెప్పాను అండి అయినా వెళ్ళింది అని ..నాకు లైటు వెలిగేలోపల వాళ్ళ అమ్మమ్మ గారు మొదలెట్టేసారు .. తోటి పిల్ల ని చూసి నేర్చుకో ,బుద్ది ఉందా .. తెలియక వెళితే అదొక పద్దతి.. ఆ పిల్ల వద్దు అని చెప్పినా వెళ్ళవంటే ఏం చేయాలి నిన్ను అని .. నేను మెల్లిగా జారుకున్నా
(పై ఫోటో http://www.acclaimimages.com/_gallery/_pages/0449-0609-2506-1352.html వారి సౌజన్యం తో )
25 కామెంట్లు:
అవును చాలా మంచిది..
మొత్తానికి అలా బుక్ చేసేసారన్నమాట...
బాగుంటున్నాయి మీ టపాలు.... keep it up....
భలే మంచి అమ్మాయేనే మీరు:))
ha!ha! Buddhimanturalu :P
ప్రతాప్ గారు ,ప్రపుల్ల చంద్ర గారు, లక్ష్మి గారు ,సిరిసిరి మువ్వగారు ధెంక్స్ అండి
good girl!!
thanks sujji :)
హమ్మో.. అయితే మిమ్మల్ని మాత్రం మా ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేయను :)
ఇంకా ఎన్ని సార్లు ఎలా ఇరికించారో మీ ఫ్రెండ్ ని.. అప్పుడప్పుడూ మాకు చెప్తూ ఉండండి.
ఆద్యంతం కట్టి పడేసిందండి.చాలా బాగా వ్రాస్తున్నారు
చిన్నప్పుడూ చాలామందికి అయ్యేదే (వేరేవాళ్ళను చూసి బుద్ది తెచ్చుకో అని పెద్దవాళ్ళు అనటం సర్వసాధారణం,నేనూ ఒక భాదితుడినే )
మదుర వాణి గారు ....అమ్మో ఇరికించినా నాకే కష్టం అండి బాబు.. అలకల రాణి .. మళ్ళీ నేను బ్రతిమాలేసరికి నా పని అవుతుంది .. బాట సారి గారు నన్ను మా అమ్మ అలానే అనేది.. :) thanks
Lol :D
హన్న కాదు అన్నది ఎవరు?
నువ్వు మంచి పిల్లవి మహ అల్లరి పిల్లవి కూడా..
btw..how r u ?
గాదావరి నీళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. జాజిపూల పరిమళం బాగా గుభాళిస్తోంది.
దార్ల
thanks andi :) darla gaaru
neenaa allari pillanaa :O @anveshi
నేస్తం పేరు నప్పలేదేమో నారద పేరైతే ఎలాఉంటుంది.
సరదాగా
నేరేషన్ చాలా బాగుంది.
బొల్లోజు బాబా
బాబా గారు నారద అంటే మీకే గొడవలు పెట్టెస్తా మరి :P ..సరదాగా .. థెంక్స్ అండి
హలో నేస్తం! ఈ రోజే మీ పోస్టులన్నీ చదివాను .బాగున్నాయి .అవును ఆంధ్రుల అల్లరి ఆడపడుచు (అమ్మాయి) చాలా మంచిది.
వేద గారు :)
Nice post.
you are selecting very good paintings .Infact I am down loading from your blog.
అరుణాంక్ గారు రవి వర్మ చిత్రాలు కొన్ని :) thanks
మీరు బొమ్మలు బాగా వేస్తారండీ.
బాగుందండీ మీ మంచమ్మాయి రూపం. పాపం ఆ పిల్ల ఎలా భరించేదో కానీ, నేను మాత్రం రివర్స్ డ్రామా ఆడేదాన్ని. :-)
భలే ఉంది మీ నేరేషన్.
ఐతే మీతో దోస్తీ కటీఫ్.
హ హ సృజన రామానుజన్ గారు చాలా పాత పోస్ట్ ను చదివి వాక్య రాసినందుకు ధన్యవాధాలు .. మళ్ళీ ఆ రోజులు గుర్తుచేసారు..
కొత్త పాళి గారు అన్యాయం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను .. :(
నేస్తం ఇప్పటికైన నిజం చెప్పండి... మీరు కావాలనే బుక్ చేసారు కద స్వాతి ని? ఒప్పేసుకోండి...
అస్సలు ఒప్పుకోను నాకేపాపం తెలియదు :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి