11, డిసెంబర్ 2008, గురువారం

ఔను నేను తప్పు చేసాను




ష్.. ఎవరికీ చెప్పనంటే నీకు ఒకటి చూపిస్తా అంది లల్లి . చెప్పను ..చెప్పను అన్నాను తల ఊపుతూ.. మెల్లిగా దాని బేగ్ నుండి బయటకు తీసి చూపింది .. బొట్టు బిళ్ళల పేకెట్లు ..అమ్మో ఎంత బాగున్నాయో పైకి అనకుండా ఉండలేక పోయా . రంగు రంగులవి, పొళ్లు అతికించినవి , ఇంకా మువ్వలు పొదిగినవి ఒక్కటి కాదు రకరకాలు ఉన్నాయి.నాకు ఒకటి ఇవ్వా అని అడగాలనిపించింది .. కాని ఇవ్వదు అని తెలిసి ..ఎక్కడ కొన్నావ్ అన్నాను.కొనలేదు కొట్టుకోచ్చాను అంది .అమ్మో షాపు వాడు చూడలేదా అన్నాను కళ్లు పెద్దవి చేసి .చూస్తే ఎలా కొట్టు కోస్తా అంది. దొంగతనం తప్పు కదా అన్నాను (మనసులో దానికి ఊరికే వచ్చేసాయనే బాధ ఉంది )ఏడిసాడు.. రెండు రూపాయల వస్తువు మనకి పది రూపాయలకు అమ్ముతాడు దొంగ వెధవ ... వాడిని మోసం చేయడం తప్పుకాదులే అంది..

ఈ లాజిక్ నచ్చింది నాకు.. నిజమే మోసం చేసిన వాళ్ళను మోసం చేస్తే తప్పేలా అవుతుంది ? ఇదే నీతి తో ఉన్నచాలా సినిమాలు గుర్తువచ్చాయి ..ఒక రోజు సావిట్లో కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నా .. తోట కూర తరుగుతూ అమ్మా, కొబ్బరి తురుముతూ పిన్ని మాట్లాడు కుంటున్నారు .. అవునూ కరివేపాకు మామ్మ ఇటు గాని వెళ్ళిందా అంది అమ్మ..వచ్చే వేళ అయింది అక్కా ,ఇంకా రాలేనట్టుంది.. ఏం మామ్మోలే అక్కా ఈ మధ్య అన్నీ చచ్చులు ,పుచ్చులు ఉన్నవి తెస్తుంది ,ముసలోళ్ళు అని జాలి పడతామా చివరకు మనకే ఎసరు పెడతారు అంది పిన్ని.మరే కలికాలం అమ్మ వంత పాడే అంతలో మామ్మ అరుపు వినబడింది..


చిట్టితల్లి కొంచం మామ్మను పిలిచి కరివే పాకు అడుగమ్మా అంది అమ్మ నా వైపు చూస్తూ ..ఎప్పుడూ నాకే చెబుతావ్ అనుకుంటూ బయటకు వెళ్ళా ..కరివేపాకు మామ్మ ఒక్క కరివేపాకే కాదు కొద్దిపాటి ఆకు కూరలు ,కూరగాయలు ,రేగు, నేరేడు పళ్ళు లాంటివి కూడా అమ్ముతుంది . మరి అందరూ ఆమెను కరివేపాకు మామ్మ అని ఎందుకంటారో నాకు అర్ధం కాదు. వయసు యాబై , యాబై అయిదు మధ్యలో ఉంటుంది అంతే.. కాని తల అంతా ముగ్గుబుట్టలా తెల్లగా ఉంటుంది ,అందుకే ఆమె కంటే పెద్దవాళ్ళు కూడా మామ్మా అనే పిలుస్తారు. మొహం మాత్రం చాలా కళగా ఉంటుంది.

బుట్ట నెత్తిపైన పెట్టుకుని ఎవరన్నా పిలవక పోతారా అని చెవులు రిక్కించి అరుచుకుంటూ వెళుతున్న మామ్మ నా పిలుపు వినగానే వస్తున్నా అమ్మా అని వడివడి గా మా ఇంటికొచ్చింది.. కరివేపాకు ఇచ్చి వెళ్ళే అంతలో మా పక్క ఇంటి ఆవిడ పిట్టగోడ నుండి తొంగి చూస్తూ మామ్మా నాకు ఒక కట్ట ఇవ్వు అంది . మామ్మ బుట్ట అక్కడే పెట్టి ఆమె దగ్గరకి వెళ్ళేసరికి వచ్చింది నాకు ఆ ఆలోచన..మామ్మ అందరినీ మోసం చేస్తుంది కదా నేను చేస్తే తప్పేముంది.. అసలు దొంగతనం చేయగలనా ? ఒకసారి చేసి చూస్తే ?.. ఒక సారి చుట్టూరా చూసి మెల్లిగా ఒక కట్ట కొత్తిమీర ,ఇంకేదో చేతికి దొరికింది తీసుకుని పక్కన దాచేసి దానిపై ఆ పక్కగా పడి ఉన్న తువ్వాలును కప్పెసా.. గుండెల్లో ధడ ధడ మంది .. మామ్మ మామూలుగా వచ్చి తన బుట్ట తీసుకుపోయింది .. మెల్లిగా వాటిని ప్రిజ్ తెరిచి అందులో వెజిటబుల్స్ ఉన్న ప్లేస్ లో పెట్టేసి చాలా ఆనంద పడిపోయా..అమ్మకు తెలిస్తే చంపేస్తుంది కాబట్టి చెప్పలేదు .

రెండు రోజులయినాక లల్లి క్లాస్ లో ఏడుస్తూ కనబడింది .. ఏమైంది అన్నాను..నిన్న మా మావయ్య కొనిచ్చిన గోల్డ్ పెన్ను కనబడటం లేదు అంది.. ఇద్దరం చాలా సేపు వెదికాం .. అదిగో ఆ సుందరే తీసి ఉంటుంది మేడం కి చెబుతా అంది..దాని దగ్గర లేకపోతే నిన్నే తిడతారు .. ముందు పోయింది అని చెప్పు అన్నాను.మేడం కి చెప్పాకా, ఆమె ఒక సారి అందరిని చూస్తూ ఇదిగో మన లలిత పెన్ను ఎవరో దొంగిలించారట .. స్కూల్ అయ్యే లోపల ఎక్కడినుండి తీసారో అక్కడ పెట్టకపోయారో నేను అందరిని చెక్ చేసి కనుక్కుంటా ..ఒక్క సారి దొంగా అని పేరు వచ్చిందో ఇక ఏం పోయినా మిమ్మల్నే అనుకుంటారు.. మీ అమ్మ, నాన్న చదువుకోండీ అని పంపితే మీరు నేర్చుకుంటుంది ఇదా.. వాళ్లకు తెలిస్తే ఎంత బాధ పడతారు?..

మేడం అంటున్న మాటలన్నీ నన్నే అంటున్నట్లుగా అనిపించింది.. లల్లి దొంగతనం చేసేటప్పుడు ఎంత ఆనంద పడినా.. తన వస్తువైయ్యేసరికి ఏడ్చేస్తున్నది .. తప్పు చేశా కదా నేను ..బాధ గా అనిపించింది..
మొత్తానికి లల్లి పెన్ను మాత్రం దొరకలేదు.. దారంతా సుందరిని తిడుతూనే ఉంది లల్లి. మరి నువ్వు కూడా మొన్న దొంగతనం చేసావ్ కదా అందాం అనుకున్నా.అంటే మాట్లాడటం మానేస్తుందని భయం .. భారంగా స్కూల్ బేగ్ మోసుకుంటూ ఇంటికోస్తున్న నాకు వీధి మలుపు తిరుగుతూ మామ్మ కనబడింది .

ఇంట్లో చూస్తే పిన్ని నవనవలాడే పాలకూర కట్టలు పట్టుకుని .. విన్నావా అక్కా ఎంత అన్యాయమో ,పాపం కరేపాకు మామ్మ కొడుకులిద్దరూ మామ్మను వాళ్ల ఆయన్ని బయటకు తరిమేసారంట , అతనికి ఒంట్లో బాగోకపోతే మామ్మే ఇలా ఎండనక, వాన అనక కష్ట పడి ఇల్లు గడుపుతుంది అంట .. ఇల్లు కూడా చాలా దూరంఅంట అక్కా .. పైకి అలా కనబడుతుంది కాని పాపం ఎన్ని రోగాలు చెప్పిందో.. పాపం ఏం కష్ట పడతావులే రోజు ఇంత అన్నం ఎక్కువ వండుతా తీసుకుపో అన్నాను, వద్దమ్మా నా రెక్కల బలం ఉన్నంత కాలం కష్ట పడతా ఆ తరువాత ఎలాగూ మీలాంటి తల్లులు చూడక పోతారా అని వెళ్ళిపోయింది ఈ రోజుల్లో అలాంటి నిక్కచ్చిమనిషిని ఎక్కడా చూడలేదనుకో అంది పిన్ని . మరే కలికాలం అంది అమ్మ .నాకో విషయం అర్దం అయింది ఎవరు ఏది అంటే అది వినేయకుండా సొంతంగా ఏది మంచి ఏది చెడో ఆలోచించాలి అని. విచిత్రంగా ఆ తరువాతా కరేపాకు మామ్మ మా వీధిలో రాలేదు ..ఇప్పటికీ కరివేపాకు చూస్తే మామ్మే గుర్తువస్తుంది

12 కామెంట్‌లు:

Vani చెప్పారు...

నా ఫ్రెండ్ కూడా ఒకసారి కొట్టేసింది బొట్టుబిళ్ళల పాకెట్,అది తప్పని తెలుసుకున్నాకా ఆ షాపుకి వెళ్ళలేక,షాపు వాడికి చెప్పలేక ఇబ్బంది పడింది..6 నెలలు ఆ షాపు మొహం చూడలేదు సరికదా..ఆ దారిలొ స్కూలుకి కూడా వెళ్ళేది కాదు..

మీ టపాలు బావున్నాయి

నేస్తం చెప్పారు...

చిన్నప్పుడు చాలా మంది తెలియక ఇలాంటి తప్పులు చేస్తారు శ్రీ కాని అది తప్పు అని తెలుసుకున్నపుడు పడే బాధ మాటల్లో చెప్పలేము

లక్ష్మి చెప్పారు...

Wow!!!Amazing...bhale rastunnarandi meeru

నేస్తం చెప్పారు...

laxmi gaaru thanks andi :)

bapatla చెప్పారు...

tappu cheyani vallu undaru. kani telusukuni diddukovatam manasunna manishi pani. baaga rasaru,

నేస్తం చెప్పారు...

baaptlagaaru thanks

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

alanti maammalaga nenu okarini chosanu na b.tech time lo.......tanaki 60 vundochhu..cheyi wrist daggara nundi cut annamata ayina aa age lo kooragayala bandi toostu..inka intini oshistunnadante.........great anipinchedi.........ekkada vunna aa taatagaru maamagaru baagundaalani..............

నేస్తం చెప్పారు...

vinay gaaru ధన్యవాధాలు

అజ్ఞాత చెప్పారు...

baagunnai....manaspoorthi gaa raasinatlunnaru.....chaalaa pedhavi pedhavi vunnai..mellagaa okkakkoti chaduvuthaa....

శ్రీనివాస్ చెప్పారు...

కొత్తిమీర దొంగలు కూడా ఉంటారని ఇప్పుడే తెల్సింది .....
కొత్తిమీర కట్టలు దొంగిలించి సమాజానికి మీరు చేసిన ద్రోహం గుర్తించి పశ్చాతాప్తపడినందుకు సంతోషం. కానీ ఆ కొత్తిమీరకట్ట తో సహా సమీప పోలీస్స్టేషన్ లో లొంగిపోయిఉంటే ఇంకా హుందాగా ఉండేది .

రేయ్ చిట్టోడా .... మీ అత్త పెద్దదొంగట ఒకప్పుడు :p

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అమ్మో అమ్మో మీ బ్లాగ్ కి వచ్చినప్పుడు, వెళ్ళేటప్పుడు చొక్కాజేబులో పెన్ను, లాగు జేబులో పర్సు , చేతి వాచీ, కళ్ళజోడు కూడా సరి చూసుకోవాలన్నమాట...........దహా.

నేస్తం చెప్పారు...

హరీష్ గారు ధాంక్యూ :)

శ్రీను అలాగే..అలాగే చెప్పు.. పెద్దయ్యాకా మా అత్తని అంటావా అని నిన్నే తిడుతుంది..అసలు ఆడపిల్లలు మొదట నేర్చుకునే మాటే అత్త..అత్తలకు మేనకోడళ్ళకు పెట్టాలన్నా గొడవలు పెట్టలేరు ...

బులుసుగారు :( మంచికి రోజులుకావండి.. పశ్చాత్తాప పడినా నమ్మరా..ఇక నేను "నమ్మరే నేను మారానంటే నమ్మరే "అని పాడుకోవాలి