9, డిసెంబర్ 2008, మంగళవారం

అమ్మ ప్రేమ అర్ధం కాదు


ఏమో.... నాకైతే అమ్మ ప్రేమ లో తీయదనం అర్ధం కాలేదు అప్పట్లో .మా ఇంట్లో అందరం ఒకే సమయానికి భోజనం చేయడం అలవాటు.కాని ఆ రోజు అందరూ బయటకు వెళ్ళారు ఏదో పని మీద..ఒక్కదానినే ఉన్నా ఇంట్లో ..బాగా ఆకలి వేసింది...ఏమున్నాయా అని వెతికి చూస్తే టమోటా పప్పు ,పొట్లకాయ వేపుడు కనిపించాయి..

ఒక వారగా చిన్న గిన్నెలో రెండు కోడిగ్రుడ్లు టమోటా కూర కనబడింది ..ఇంకేం అన్నీ వేసుకుని చక్కగా ఒక పట్టు పట్టాను.కాసేపటికి అమ్మా వాళ్లు వచ్చారు..అయ్యో అనుకోకుండా లేట్ అయింది.. అన్నం తినకపోయావా అంది అమ్మ రాగానే..తినేసా అన్నాను..అమ్మ వంటగదిలో అన్నీ వెదికి ఇక్కడ గ్రుడ్ల కూర పెట్టా తినేసావా అంది కంగారుగా నావైపు చూస్తూ... ఎంచక్కా అన్నీ వేసుకుని తిన్నా అన్నాను తాపీగా..

ఒక్కటి ఇచ్చింది చెంప మీద..గూబ గుయ్యిమనేటట్లు... ఊహించలేదు కొడుతుందని.. కళ్ళ వెంట నీళ్లు గిర్రున తిరిగాయి..ఇంకేమి ఆలోచించావా .. నాన్న కోసం పెట్టా ఆ కూర.. అయినా అంత తొందరేమోచ్చింది ,వచ్చేవరకూ ఆగలేకపోయావ్ అని కోపం గా వెళ్లి పోయింది..నాకు ఏడుపు ఆగలేదు బాత్ రూమ్ లోకి పోయి ఎవరికీ చెప్పకుండా ఏడుస్తూ కూర్చున్నా ..

మనసులో ఏంటో బాధ ..ఏమి చేశా ఇప్పుడు ? కడుపునిండా తిన్నాఅంతే కదా .. ఏ తల్లి అయినా తింటే సంతోషిస్తారు గాని అమ్మలా తిడతారా ?ఛీ ..అమ్మకు నేను అంటే ఇష్టం లేదు .. ఇక నుండి అన్నం తినకూడదు ఇంట్లో.. బ్రతి మాలిన సరే.. ఒక వేళ తిన్నా ఎక్కువ తినకూడదు .. ఇలా చాలా అనుకుని బయటకు వచ్చా..పిన్ని గది నుండి అమ్మ మాటలు వినబడుతుంటే ఆగి పోయా..ఏమి కాదు కదా అమ్మ కళ్లు తుడుచుకుంటుంది ..నీదంతా ఒట్టి భయం లే అక్కా ఏమీ కాదు అని పిన్ని ఓదారుస్తుంది ..


ఏమో చిన్నప్పుడు అందరూ అనుకునేవారు.. పొట్లకాయ ,గ్రుడ్లు కలిపి తింటే విషం అయిపోతుంది అంటా.. పొట్లకాయ రాహు,కేతులంటా ,చందమామ గ్రుడ్డు అంటా ...రెండింటికీ పడవు కదా .. అసలే రాత్రి .. పిల్లకు నిద్రలో ఏదన్నా అయితే ..అమ్మ మళ్ళీ ఏడుస్తుంది ..ఊరుకో అక్కా నీదంతా చాదస్తం .. మహా అయితే ఆ రెండూ కలిపి తింటే అరగదు అనో ఏమిటో మన పెద్ద వాళ్లు అలా చెప్పి ఉంటారు .. నేను చాలా సార్లు తిన్నా అలాగ ..నాకేం కాలేదు .. కనీసం కడుపు నెప్పి కూడా రాలేదు అంటుంది పిన్ని..

అంతా మీ బావ గారివల్లె వచ్చింది ..ఆయనకు పొట్లకాయ ఇష్టం ఉండదు అందుకే అది వండా.. పోనీ వెళ్ళే టపుడన్నా దానికి చెప్పి వెళ్ళ లేదు .. పాపం భయం వల్ల కొట్టేసా కూడా ..ఏమీ కాదులే అక్కా మన పిల్లలు ఏదన్నా ఇట్టే మర్చిపోతారు .. నువ్వు భయపడి దాన్ని భయపెట్టకు పిన్ని అంటుంది.కొద్ది సేపటి క్రితం అమ్మను ఎన్ని మాటలు అనుకున్నాను ,అమ్మది చాదస్తం కావచ్చు ,భయం వల్ల కొట్టచ్చు..చదువుకున్న దాన్ని నా బుద్ధి ఏమైంది ? అంటే అప్పటికి నేను చిన్నపిల్లనే అనుకోండి .. ఇక ఆ రాత్రి అమ్మకు శివరాత్రే .. అస్తమాను వచ్చి చూసుకోవడమే .. ఏది ఏమైనా అమ్మ అమ్మే ..


ఒక సారి కష్ట పడి అమ్మ వచ్చే లోపల పిండి రుబ్బేసి అమ్మతో గొప్ప అనిపించు కోవాలనుకున్నా .. రుబ్బు రోలు బండ అమ్మా వాళ్లకు అలవాటు కాబట్టి అయిదు నిమిషాలలో రుబ్బేసేవారు .. నాకేమో చేతులు ఎర్రగా కందిపోయాయి .. అయినా విడవకుండా గంట కష్ట పడి రుబ్బేసా ..అమ్మ రాగానే గొప్పగా చూసావా ఎంత కష్టపడి రుబ్బానో అన్నాను .అసలు నిన్నెవడు రుబ్బమన్నారు, ఇడ్లీ కని వేస్తే గారెలు పిండి లా రుబ్బావ్.. పెద్ద అయ్యాక చేసే పనులు ఇప్పటి నుండి చేస్తే ఇలాగే ఉంటుంది .. ఇంకెప్పుడు రుబ్బకు అంది..


నాకు కోపం వచ్చేసింది ... ఛీ..ఛీ ఇంత కష్ట పడి రుబ్బితే కనీసం మెచ్చుకోలేదు సరి కదా తిడుతుంది అనుకుని.. మళ్ళీ అమ్మకు నేను అంటే ఇష్టం లేదు ఇలా చాలా అనేసుకుని పడుకున్నా ... కాసేపు అయ్యాకా పిన్ని వచ్చి అదేంటక్కా అలా అనేసావ్ పాపం నీ కోసం అంత ఇదిగా కష్ట పడితే అంది ..నీకు తెలియదు నువ్వు ఊరుకో ,దాన్ని కొంచెం పొగిడామన్టే అదే పట్టుకుంటుంది ..రోజు రుబ్బుతాను అంటుంది అంది . మరి ఇంకేం నీకు పని తప్పుతుంది కదా అంది పిన్ని.దాని చేతులు చూడు తోట కూర కాడల్లా ఎలా ఉన్నాయో .. పాపం మన కష్టాలు అదేందుకులే .. అంది .

మళ్ళి నేను షరా మామూలే అయ్యో అమ్మను అపార్ధం చేసుకున్నా అని. ఇలా చాల జరిగాయి ..నాకు ఒక విషయం అర్ధం అయింది.. అమ్మ ప్రేమ అర్ధం కాదు .. ఏదో ఆశించి చేయదు అమ్మ.. నిస్వార్దమైనది అమ్మ ప్రేమ

( ఫోటో http://www.bollywoodsargam.com/ వారి సోజన్యం తో )


21 కామెంట్‌లు:

Rani చెప్పారు...

sweet post :)

పరిమళం చెప్పారు...

అవును సుమా ! అమ్మ ప్రేమ ఆ వయసులో అర్థం కాదు .యశోద ,కృష్ణులు బొమ్మ అధ్బుతంగా వుంది .

నేస్తం చెప్పారు...

thanks andi rani parimalam :)

Bolloju Baba చెప్పారు...

GOOD NARRATION

Vani చెప్పారు...

అవునండీ నేను కూడా పొగడ్తలకి ఉబ్బితబ్బిబ్బైపోయి పిండి రుబ్బేసేదాన్నీ..మళ్ళీ గుర్తొచ్చాయి..ఆ రోజులు

నేస్తం చెప్పారు...

:) sri

Unknown చెప్పారు...

చాలా బాగా రాశారు.

నేస్తం చెప్పారు...

thanks andi pradeep gaaru :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మీ బొమ్మల సేకరణ అద్భుతం. మీరు ఇచ్చిన బాలీవుడ్ సర్ గం కి వెళ్ళి చూస్తే అన్నీ సినిమా ఫొటోలే ఉన్నాయి. మీరు అనుమతిస్తే మీ బొమ్మలు సేవ్ చేసుకోనా?

నేస్తం చెప్పారు...

http://www.bollywoodsargam.com/hollywood_celebrity_photo_gallery.php?photoalbum=1103395---latest-Lord_Krishna_Janmashtami_Greeting_Cards_hollywood_gallery_photo.html
(ఇది చూడండి లేదా మీ ఇష్టం save చేసుకొండి):)

Shashank చెప్పారు...

ఇది చదివితే ఆ రోజులు గుర్తొచ్చయి అండి. మీలాగే మాది ఉమ్మడి కుటుంబం..కాని మా అమ్మ నానలకి నేను ఒక్కడినే. అమ్మ కి వంటింట్లో సహాయం చేసేవాడ్ని. ఆ పిండి రుబ్బడం మాత్రం నరకమే.. ఒక 4-5 సార్లు వేళ్ళు almost పిండి లో కలిసిపోయాయి కూడా.. కాని అదో ఆనందం. అమ్మకి సహాయం చేయడం. అల 6 తరగతి నుండి నా సగం చదువు వంటింట్లోనే సాగేది. ఇంటర్ కి చేయితిరిగిన వంటవాడ్ని అయిపోయ.. ఇప్పుడు ఈ దేశం లో అవలీలగ వంట చేసేస్త. అంతా ఆ నాటి సహాయం వళ్ళే అనిపిస్తుంది. చాల బాగా రాసారు. :)

గీతాచార్య చెప్పారు...

చాలా బాగుంది. మీరు మామూలుగా ఏదో సరదా పోస్ట్ పెట్టారేమో అనుకున్నాను. చాలా ఆర్ద్రం గా ఉంది.

అవును. అమ్మ ప్రేమ అర్థం కాదు. నిజమే. అందుకే నేను అన్వేషించాను. మరి ఎంత తెలుసుకున్నానో చెప్పండి.

పొట్లకాయా, గుడ్డూ కలిపి ఎక్కువగా తింటే కాస్త మందం చేస్తుందంటారు. అంతే. కానీ అమ్మ మాత్రం అంతే.

http://dheerasameereyamunaateere.blogspot.com/2009/03/blog-post_30.html

నేస్తం చెప్పారు...

శశాంక్ గారు ,గీతాచార్య గారు అమ్మ గురించి ఎంత చెప్పిన్నా తక్కువే కదండి :) ప్రతి ఒక్కరికి అమ్మను తలుచుకోగానే ఎన్ని అందమైన ఙ్ఞాపకాలు గుర్తువస్తాయో

రాధిక చెప్పారు...

మీకు నిజాలు తెలిసేలా చేయడానికి ఆ దేవుడు పిన్ని ని ఇచ్చాడు.కానీ నాకలా ఎవరూ లేరు.మీరు చెప్పిన కారణాలను నా చిన్నతనంలో అమ్మ తిట్లకి అన్వయించుకుని నేనే అన్వేషించుకుంటా.
అమ్మ నన్ను మొన్న కూడా తిట్టిందే....దేని గురించబ్బా...గుర్తు రావట్లేదు.

నేస్తం చెప్పారు...

ha ha :) radhika గారు

lakshman చెప్పారు...

pelli ayina kothallo nenu & na sreemathi egg & potlakaya kalipi bojanam lo thinnamu.

thinna tharuvatha gurthuku vacchinadi aa roundu kalipiki thinagudadhani.

ventane intiki phone chesamu. Intlo vallu thittaru. AAroju rathri maki nidura pattala.

Kani thellare nidura lechi vijayanni sadhinchi nattu chala goppaga feel ayyamu.

We are also presently staying at singapore.

అజ్ఞాత చెప్పారు...

kallu chemmagillayandi....enthoo baaga undi...manam ammalamu ayye daaka manaku amma prema ante entoo artham kaadu...

lakshmi

Lakshmi చెప్పారు...

lakshmi cheppina danne repeat chesthunna..
manam amma ayye anthavaruku manaku amma prema poothiga artham avvadu...

Raj చెప్పారు...

Bagundhi andi...... nenu mamulga teliyani valani "andi" ani pilavanu..... mi story chadhivina tharuvatha pilavali anipinchindhi

. నల్ల కొండలో తెల్ల చుక్క చెప్పారు...

Akkaa.. Vooo Vuurike edupu Ochestundi... enta Baaga Cheppaaro Cheppalenu.. Amma Anthe Naanna Anthe.. vaalla premanuu manaku ardam kaanivvaru...
Mottam Mee Postlu Chadivesaaanu :D
Enta Baavunnaayooo...Okkosaari chaalaa gattigaa navvesukuntunte Maa amma emayinde ani navvutundi.. Okkoo postloo tega edipinchesaaru...
Meeru suuuperandey... Love Uuuu Akkaa...

నేస్తం చెప్పారు...

లక్ష్మన్ గారు సారీ అండి లేట్ రిప్లయ్ మీకు ..అవునునండి రెండూ కలిపి తినకూడదు అంటారు ..కాని ఇక్కడ నేను చెప్పినా మా ఇంట్లో వినరు పొట్లకాయా తినేసి ఆంలెట్ కావాలంటారు దానితో పొట్లకాయ వండటమే మానేసాను :)

లక్ష్మిగారు చాలా బాగా చెప్పారు ..నిజమే అమ్మలం అవుతేగాని అమ్మ ప్రేమ అర్ధంకాదు :)

రాజ్ గారు థేంక్స్ అండి ...నన్ను అండి అంటేనే నాకు చాలా ఇష్టం..బోలెడు గౌరవం పొందేసినట్లు కదా :)

ప్రేమ గారు ఎక్కడో ఉన్న పోస్ట్కి కామెంట్ పెట్టి మళ్ళీ పాత జ్ఞాప్కాలు వెలికితీసారు ..ధాంక్యూ