6, డిసెంబర్ 2008, శనివారం

ప్రియమైన మీతో


చాలా సంతోషం గా ఉందండి ఇలా మీ ముందుకు రావడం. తొలిసారి కదండి కొంచెం తికమక గా ఉన్నాను.. పొరపాట్లు ఏమన్నా ఉంటే క్షమించాలి మరి..ఇక నా గురించి నేను..పదహారు అణాల ఆంధ్రా ఆడపడుచుని, గోదావరి తల్లి ముద్దు బిడ్డని.. ఉండేది మాత్రం సింగపూర్..

తెలుగన్నా,తెలుగుదనమన్నా ,చెవులు ముక్కు కోసుకునేంత (శూర్ఫణఖ అనుకునేరు సుమా)ఇష్టం ఉన్నదాన్ని. తెల తెల వారుతుండగా అమ్మా పాలు అని పిలిచే పాల వాడి అరుపులన్నా, రాముల వారి గుడినుండి వచ్చే కమ్మని భక్తి పాటలు విన్నా,సందెపొద్ద్దు దాటాకా అమ్మ వాకిలి చిమ్మి ముగ్గు పెడుతుంటే చూస్తూ కూర్చొవడం అన్నా చాలా చాలా ఇష్టం. ప్లిచ్...ఇక్కడ అన్నీ కోల్పోతున్నానేమో అనిపిస్తుంది ఒక్కో సారి..ఎన్ని ఉన్నా ఏదో తెలియని వెలితి.. అలా అని ఇక్కడి జీవితం ఏదో ధుర్బలం అని కాదు ...అమ్మ ఇంటి నుండి అత్తగారి ఇంటికి వచ్చి నట్లు ఉంది.

అమ్మ దగ్గర ఆప్యాయత,ప్రేమా ఎలా అందుకుంటామో.. అత్తవారి ఇంటి దగ్గర వాటిని అలాగే పంచడం నేర్చుకుంటాం.. నేనూ అంతే.. చాలా విషయాలు ఇక్కడ నేర్చుకున్నా..ఇంకా నేర్చుకుంటూ ఉన్నా..

మొత్తానికి జీవితం ఆవకాయ బిర్యానిలా గడిచిపోతుంది అనుకోండి.మీ అందరి స్నేహం తో మరింత రుచిగా ఉంటుందని ఆశిస్తూ మీ..

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

welcome

అరుణాంక్ చెప్పారు...

WELCOME TO TELUGU BLOGGERS WORLD
Arunank

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

స్వాగతం !!!

అజ్ఞాత చెప్పారు...

ధన్య వాదములండి అరుణాంక్ , ప్రపుల్ల చంద్ర గారు :)

Rani చెప్పారు...

the image in this post is so good :)
did you draw?

నేస్తం చెప్పారు...

నాకు అసలు బొమ్మలు గీయడం రాదు రాణి గారు.. కాని పై పొస్ట్ లో ముసలావిడ బొమ్మ పైంట్ బ్రష్ లో నేనే గీసా సరి అయిన బొమ్మలు దొరక్క :)

రాధిక చెప్పారు...

స్వాగతం.పై పోస్ట్లో ముసలావిడ ఎక్కడ వుందండి?నాకు కనిపించట్లేదు.
plz remove word verification

జ్యోతి చెప్పారు...

Welcome ..

నేస్తం చెప్పారు...

రాధిక గారు ముసలావిడ బొమ్మ ...ఔను నేను తప్పు చేసా పోస్ట్ లోని బొమ్మ.. :)జ్యొతి గారు ధేంక్స్ అండి

నేస్తం చెప్పారు...

రాధిక గారు కొత్త కదా ఇంకా తికమక గానే ఉన్నా.. word verification తీసేసానండి .. :)thanks

Sky చెప్పారు...

Good that you have started blogging and that too in telugu. Welcome to the blogger's world. Wish you all the best and hope to see the best posts from you. Keep Rocking.

Sateesh Yanamandra

శరత్ కాలమ్ చెప్పారు...

చిత్రం బావుందండీ.